Praja Darbar
-
పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో జనం సమస్యలు విన్న వైఎస్ జగన్
-
ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. జగనన్న ఎప్పుడూ ప్రజా నాయకుడే
-
పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో కొనసాగుతోన్న ప్రజాదర్బార్ కార్యక్రమం
-
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్
-
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్
-
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్‌కు హాజరైన ప్రజలు, కార్యకర్తలు (ఫొటోలు)
-
పులివెందులలో YS జగన్ ప్రజా దర్బార్
-
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. వినతులు స్వీకరణ
సాక్షి, వైఎస్సార్: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శ్రీ వైయస్ జగన్ సూచించారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఆయన అన్నారు. -
పులివెందుల ప్రజాదర్బార్‌లో వైఎస్ జగన్‌తో ప్రజలు, అభిమానులు (ఫొటోలు)
-
ఉద్యోగాలు.. ఇళ్లు.. భూ వివాదాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాదర్బార్ (ప్రజావాణి)లో ప్రధానంగా చాలామంది తమకు ఉద్యోగాలు ఇవ్వాలని, భూ సమస్యలు పరిష్కరించాలని, ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని భరోసానిచ్చారు. దరఖాస్తుదారులు తమ విజ్ఞాపనపత్రంలో సమస్యతోపాటు అడ్రస్, ఫోన్ నంబర్‌ను రాయాలని సూచించారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. జెన్కో పరీక్ష వాయిదాపై సీఎంతో మాట్లాడతాః మంత్రి శ్రీధర్‌బాబు ఈ నెల 17న నిర్వహించనున్న జెన్కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అదే రోజు రెండు, మూడు పరీక్షలు ఉన్నట్లు అభ్యర్థులు వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి పరీక్ష వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్ గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కారి్మకులు విజ్ఞాపన పత్రం అందజేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, ఆయుష్ విభాగం డైరెక్టర్ హరిచందన, సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రి పాల్గొన్నారు. ఇప్పటివరకు 4,471 వినతులు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజా భవన్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి సోమవారం వరకు మొత్తం 4,471 వినతి పత్రాలు అందాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన వినతి పత్రాలే ఎక్కువగా ఉన్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందినట్లు ప్రజా భవన్ అధికార వర్గాలు తెలిపాయి. -
నేటి నుంచే రైతుబంధు నిధుల విడుదల..
సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకుఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్ర మాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడిసాయం అందించాలన్నారు. రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేసే విధానం గతంలో ఉన్న మాదిరిగానే కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. 68.99 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. వారానికి రెండ్రోజులు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజాదర్బార్‌ప్రజావాణిగా మార్పు ప్రజాదర్బార్‌ను ఇకనుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం ఆదేశించారు. దీనిని ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణికి ఉదయం 10లోగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. తొలి ప్రజాదర్బార్ శుక్ర వారం నిర్వహించగా, ఆ తర్వాత రెండు రోజులు శని ఆదివారాలు సెలవు కావడంతో ప్రజా దర్బార్ నిర్వహించలేదు, సోమ వారం ప్రజా దర్బార్ ఉన్నా, సీఎం రేవంత్‌రెడ్డి కాకుండా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించారు, ఇకపై దీనికి ఎవరెవరు హాజరవుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీఎం ప్రజావాణికి హాజరై విజ్ఞప్తులు స్వీకరిస్తే అవి త్వరితగతిన పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్
-
మోదీ పాలనలో ప్రజలకు కష్టాలు తప్ప ఒరిగిందేమీ లేదు
ఎనిమిదిన్నర ఏండ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలకు మేలు చేసిన పని ఒకటి కూడా లేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రజలపై మోయలేని భారాలు వేసి కడ గండ్లపాలు చేశారు. బీజేపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, దివాలాకోరు ఆర్థిక విధానాలు దేశాన్ని అధోగతిలోకి నెట్టాయి. ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. 2016లో పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఏటా రెండు కోట్ల మంది నిరుద్యోగులకు కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది. ఎనిమిదిన్నర ఏండ్లలో ఇవ్వాల్సిన 16.05 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్ప మని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీల బండ్లు పెట్టుకొని అమ్ము కోండని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షలకు పైగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కాలం గడుపుతూ దగా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ హోల్ సేల్‌గా బడా కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో 35 సంస్థలను 3 లక్షల 72 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేశారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన కార్పొరేట్ పెద్దలపై మోదీ సర్కార్ జాలి పడి ఏకంగా 12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంది. కానీ ఓట్లేసి గెలి పించిన సామాన్య ప్రజలకు ఆసరాని ఇచ్చే అనేక సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేస్తూ వాటిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నది. చివరకు నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, పప్పు, ఉప్పు తదితర వస్తు వులపైన కూడా జీఎస్టీని పెంచి సామాన్యుల బ్రతుకులను దుర్భరంగా మార్చారు. 2014 లో రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు రూ. 1100 దాటింది. అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సులు వడ్డించి పెట్రోల్, డీజిల్ ధరలను హద్దు పద్దు లేకుండా పెంచి ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్ కు ముంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసింది మోదీ సర్కార్. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్ట గొట్టడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను దేశ ద్రోహు లుగా చిత్రించింది. 750 మంది రైతుల మరణాలకు కారణ మైన నల్ల చట్టాలను చివరికి మోదీ సర్కార్ ఉపసంహ రించుకుంది. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా మన దేశ రూపాయి విలువ గింగిరాలు తిరిగి 83 రూపాయలకు పడిపోయింది. దీనితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ‘మేకిన్ ఇండియా’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దేశం అప్పుల కుప్పగా తయారయ్యింది. స్వతంత్ర భారత దేశంలో 67 ఏండ్ల కాలంలో పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు రూ. 55.87 లక్షల కోట్లు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎని మిదిన్నర ఏండ్లలో చేసిన అప్పు అక్షరాల 80 లక్షల కోట్లు. ఇప్పుడు మొత్తం దేశం అప్పు రూ. 135.87 లక్షల కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ ఆకలి సూచిలో భారతదేశ ర్యాంక్ దారుణంగా దిగజారి 107వ స్థానానికి చేరుకుంది. మన చుట్టూ ఉన్న దేశాల కంటే మన దేశంలోనే ఆకలితో అలమటించే వారు ఎక్కువని ఈ ర్యాంక్ స్పష్టం చేస్తోంది. రైతుల వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నెల నెలా రైతులు కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడల మీద కత్తి పెట్టి బెదిరి స్తుంది మోదీ సర్కార్. ఉచిత విద్యుత్తును రైతులకు ఇవ్వొ ద్దని ఆదేశిస్తున్నది. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువు పెంచుతోంది. దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం వివక్షకు సంకేతం. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెబుతున్నా తెలంగాణ లోని కొత్త జిల్లాల్లో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఎనిమిదిన్నరేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పిన కేంద్రం తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. విభజన చట్టం ప్రకారం ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ, జాప్యం చేస్తూ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మోసానికి పాల్పడింది మోదీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించి రాష్ట్రంలోని ప్రజల దశాబ్దాల కలల్ని కాల్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అబద్ధాలు చెబుతూ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదని చెప్పి తెలంగాణ రైతాంగంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు కేంద్ర పెద్దలు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఎగ్గొడుతూ బకాయిల్ని విడుదల చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది మోదీ ప్రభుత్వం. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలను విభజించకుండా నాన్చుతూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నది. ఈ విధంగా మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్నది. ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. తమను వ్యతిరేకించిన వారిని ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసులు పెట్టి వేధించి లొంగదీసు కుంటున్నారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ ఉండాలనే లక్ష్యంతో ఫాసిస్టు పోకడలతో మోదీ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు పాలన సాగిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం అందిం చకపోగా ఈ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో పడగొట్టడానికి ఢిల్లీ బ్రోకర్ల ద్వారా వందల కోట్ల రూపాయలతో ఎమ్మె ల్యేలకు ఎరజూపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న క్రమంలో ఆ దొంగలు బయటపడ్డారు. తమ పప్పులు ఉడకకపోవడంతో గవర్నర్‌ని ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. దీన్ని తిప్పి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది. అధికార టీఆర్ఎస్ ఒక్కటే కాకుండా రాష్ట్రంలోని వామపక్షాలు, అభ్యదయ, లౌకిక శక్తులు అందరినీ కలుపుకొని కేంద్రం మీద యుద్ధభేరి మోగించాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో తాను ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలుకు పూనుకోవాలి. ప్రగతిభవన్‌లో ప్రజా దర్బార్ ప్రారంభించాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ బాధ్యతను భుజానికెత్తు కోవాలి. ఇవన్నీ చేసినప్పుడే బీజేపీ ఆటలు సాగకుండా నివారించగలుగుతాము. అదే మనందరి కర్తవ్యం. - జూలకంటి రంగారెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే -
ప్రజా దర్బార్ కాదది.. పొలిటికల్ దర్బార్: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-
తమిళిసై సౌందర్‌రాజన్ ప్రజాదర్బార్
-
అందుకోసం ఓ వ్యవస్థ: తమిళిసై
సాక్షి, హైదరాబాద్ : రాజ్‌భవన్ వేదికగా ప్రజా సమస్యలకు సబంధించిన వినతిపత్రాలు స్వీకరించి... పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలుగులో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు మంచి మనస్సు ఉన్నవాళ్లని... పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని కొనియాడారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా అభివృద్ధి, సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అదే విధంగా గవర్నర్‌గా వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనపై రాష్ట్రపతికి నివేదిక ఇచ్చానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్, వ్యవసాయ విద్యారంగాల్లో అభివృద్ధి దిశగా పనిచేస్తోందని నివేదికలో తెలిపినట్లు పేర్కొన్నారు. 2019లో బతుకమ్మ ఆటలు, గిరిజనులతో మమేకం కావడం సంతృప్తినిచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల సందర్శించిన గిరిజనులను రాజ్ భవన్‌కు ఆహ్వానించానని తెలిపారు. రక్తదానం కోసం యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రెడ్‌క్రాస్‌తో కలిసి దీనిని సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.15 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉండడం సంతోషమన్నారు. -
ప్రజా దర్బార్‌కు తమిళిసై..
సాక్షి, హైదరాబాద్: సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణలో ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారానికోసారి సామాన్య ప్రజల కోసం ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లాఖాన్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి వెంటనే స్పందించిన తమిళిసై.. ‘మీ ప్రతిపాదనకు నా ధన్యవాదాలు. ఈ విషయం నా దృష్టిలో కూడా ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంది’ అంటూ రిప్లే ఇచ్చారు. దీంతో త్వరలోనే ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది. -
అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజా దర్బార్
సాక్షి, అమరావతి: త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతోపాటు ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు వచ్చే ప్రజల కోసం ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉండడంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్‌ను నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. శాసనసభ సమావేశాల తర్వాత ప్రజా దర్బార్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. జూలై 1వ తేదీ నుంచి ప్రజాదర్బార్ జరుగుతుందని మీడియాలో ప్రచారం సాగుతోందని, అది సరికాదని మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైతే ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుందని, ఈలోగా ప్రజలను కలుసుకుని, విజ్ఞప్తులు స్వీకరించడం కష్టం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి వచ్చే ప్రజల కోసం మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, అవన్నీ పూర్తయ్యాక ప్రజా దర్బార్ ప్రారంభిస్తారని తెలిపారు. -
రాజోలి నిర్మిస్తాం
కడప కార్పొరేషన్: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి సోమవారం కడపలో బిజీ బిజీగా గడిపారు. సోమవారం ఉదయం 7 గంటలకే కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత జర్నలిస్టులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ప్రజా దర్భార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన రాజోలి ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసేందుకు నివేదికలు సిద్ధం చేయాలని,అలాగే కుందూ–సర్వరాయసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పూర్తికి ప్రణాళికలు తయారు చేయాలని తెలుగుగంగ ఎస్ఈ శారదను ఆదేశించారు. విజయవాడలో ఈనెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్న స్వరూపానందస్వామి బాల సన్యాస దీక్ష కార్యక్రమానికి హాజరు కావాలని ఏíపీ బీఎస్‌ఎస్‌ఎస్ నాయకులు ఎంఎల్ఎన్ సురేష్‌బాబు, సత్యనారాయణ శర్మ ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సురేష్‌బాబు పాల్గొన్నారు. తొలుత ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కడపలోని జర్నలిస్టులతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కడపలోని ప్రధాన సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు, మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన ఆర్కే వ్యాలీ మెంటార్స్ పదేళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీకి చెందిన మెంటార్స్ కోరారు. సోమవారం వారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2008లో తాము అపాయింట్అయ్యామని, తమకంటే వెనుక 2011, 2017లో నియమితులైన వారికి ఎక్కువ జీతభత్యాలు ఇస్తున్నారని, పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమకు మాత్రం రూ.33వేలే ఇస్తున్నారని వాపోయారు. తమ సర్వీసును రెగ్యులర్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సర్వీసును బ్రేక్ చేయడానికే కొత్తగా ఇంటర్వ్యూకు రమ్మని పిలుస్తున్నారని తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ వైస్ చాన్స్‌లర్‌తో ఫోన్లో మాట్లాడారు. మెంటార్స్ సర్వీసులో ఒక్క రోజు కూడా నష్టం కలగకుండా న్యాయం జరిగేలా చూస్తామని, అవసరమైతే స్పెషల్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఖాజీపేట మండలం సన్నపల్లెకు చెందిన టీ. రవీంద్రారెడ్డి కోరారు. సోమవారం ఆయన తాము పండించిన పసుపు పంటను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి చూపి గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్వింటాకు రూ.16,500 ఉండేదని, ప్రస్తుతం మూడు వేలు కూడా లేదని తెలిపారు. కనీసం క్వింటాకు రూ.8వేలు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అభినందనల వెల్లువ కడప పార్లమెంటు సభ్యుడిగా మూడు లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించి మొదటిసారి కడపకు వచ్చిన వైఎస్ అవినాష్‌రెడ్డికి పలువురు అధికారులు, అనధికారులు అభినందనలు తెలిపారు. పోలీసు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, జిల్లా కార్యదర్శి యోగా రాయల్, పంచాయితీరాజ్ ఎస్ఈ సుబ్బారెడ్డి, మెప్మా పీడీ ఎన్. రాధ, ఏíపీట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసులు, డీటీ శోభా వాలంటీనా, డీఈ జగన్మోహన్రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్రనాథ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, ఎస్టీ సెల్ జిల్లా అ«ధ్యక్షుడు వేణుగోపాల్‌నాయక్, మహిళా నేతలు బోలా పద్మావతి, టీపీ వెంకటసుబ్బ మ్మ, రత్నకుమారి, 21వ డివిజన్ ఇన్చార్జి ఐస్‌క్రీం రవి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, బీసీసెల్ జిల్లా అ«ధ్యక్షుడు బంగారు నాగయ్య, వల్లూరు జెడ్పీటీసీ వీరారెడ్డి, కార్పొరేటర్లు సానపురెడ్డి శివకోటిరెడ్డి, చల్లా రాజశేఖర్, రామలక్ష్మణ్‌రెడ్డి, బండిప్రసాద్, మదన్, ఆలూరు ఖాజా, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు ఎంపీని కలిసి పుష్ఫగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. జమ్మలమడుగు కన్నెలూరుకు చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు డి. శ్రీనివాసులు యాదవ్ ఎంపీని కలిశారు. -
సమస్యల పరిష్కారంలో సూపర్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి హత్యాచారాలు వెలుగులోకి రావడంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ చేపట్టిన ప్రజాదర్బార్ పాత్ర కీలకం. శ్రావణి అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదును బొమ్మల రామారం పోలీసులు తేలిగ్గా తీసుకోవడంతో మొదలైన హాజీపూ ర్ గ్రామస్తుల ఆందోళన ‘ప్రజాదర్బార్’కు ఫిర్యాదుగా చేరింది. దీంతో వెంటనే అక్కడి ఎస్సై వెంకటేశ్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. అదనపు బృందాలతో కేసు విచారణ జరిపి నిందితుడు శ్రీనివాసరెడ్డిని స్వల్ప వ్యవధిలోనే అరెస్టు చేశారు. రిటైర్డ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు కుంట్లూరు గ్రామంలో ఉన్న భూమిని కొంతమంది కబ్జా చేయడంతో ప్రజా దర్బార్‌లో సీపీ మహేష్ భగవత్‌ను కలిసి వివరించారు. వెంటనే సీపీ మహేష్ భగవత్ సంబంధిత పోలీసు అధికారులను కేసు విచారణకు ఆదేశించారు. ఆ ప్లాట్ నాగేశ్వరరావు భార్య జ్యోతి పేరుపై ఉండటంతో ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి ఎస్ఆర్వో కార్యాలయం నుంచి సేల్‌డీడ్ సర్టిఫైడ్ కాపీలు పొందారు. దీని ద్వారా ఆ ప్లాట్‌ను ఇతరులకు విక్రయించారని విచారణలో తేలడంతో నిందితులను అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనర్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’బాధితులకు న్యాయం చేయడంతో పాటు సంచలన కేసుల పరిష్కారానికి వేదికగా మారింది. భూకబ్జాలు, హత్యలతో పాటు వివిధ కేసుల్లో ఠాణాలో న్యాయం జరగని పక్షంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ తలుపు తడితే విచారణలో వేగం పెరిగి బాధితులకు న్యాయం జరుగుతోంది. ఇలా రాచకొండ కమిషనరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ బాధితులకు ఆపన్నహస్తం అందిస్తోంది. సైబరాబాద్ విభజన అనంతరం ఏర్పాటైన ఈ కమిషనరేట్‌లో ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది. విభజన అనంతరం విస్తీర్ణపరంగా దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్‌గా అవతరించిన నేపథ్యంలో కమిషనర్ మహేష్ భగవత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమిషనరేట్‌లో 3జోన్ల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారంలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా డీసీపీ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను స్వీకరించారు. ఆ ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయం కొన్ని నెలల క్రితం నేరేడ్మెట్కు మారినా సీపీ మహేష్ భగవత్ మాత్రం ప్రతి మంగళవారం ఎల్బీనగర్లో ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తున్నారు. మూడేళ్లలో ‘4సీ’కి వచ్చిన ఫిర్యాదులు 591 పోలీసు స్టేషన్లలో బాధితులకు న్యాయం జరగని పక్షంలో కమిషనర్‌ను కలిసేందుకు ఉమ్మడి సైబరాబాద్ కమిషనరేట్‌లో అప్పటి సీపీ సీవీ ఆనంద్ ‘4సీ’సెల్‌ను ఏర్పాటుచేశారు. అప్పట్లో కమిషనర్‌ను నేరుగా కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. ఠాణాలో ఎస్‌హెచ్‌వో స్పందించుకుంటే ఆ తర్వాత ఏసీపీ, డీసీపీని కలవాల్సి వచ్చేది. అక్కడా చర్యలు లేకుంటేనే కమిషనరేట్‌లోని ‘4సీ’విభాగంలో ఫిర్యాదు స్వీకరించేవారు. అప్పుడే కమిషనర్‌ను కలిసి పరిస్థితి వివరించే అవకాశం ఉండేది. అయితే ఏసీపీ, డీసీపీలను కలవకున్నా నేరుగా ప్రజాదర్బార్‌లో పోలీసు కమిషనర్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కమిషనరేట్‌లోని ‘4సీ’విభాగానికి కొంతమేర ఫిర్యాదులు తగ్గుతున్నాయి. మూడేళ్లలో ‘4సీ’కి 591 ఫిర్యాదులు వస్తే 415 పరిష్కారమయ్యాయి. మిగతావి వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. దర్యాప్తు వేగిరంగా.. నిష్పక్షపాతంగా తన దృష్టికి వచ్చే ఫిర్యాదులపై కమిషనర్ తక్షణమే స్పందిస్తున్నారు. చట్టపరిధిలో అందుకు తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత ఠాణాల ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనంతరం దర్యాప్తు పురోగతి క్రమాన్ని సంబంధిత పోలీసు ఇన్స్పెక్టర్కు కమిషనర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఠాణాల్లో ఫిర్యాదు చేసినా స్పందన లేని కేసుల్లో తీవ్రతను బట్టి అవసరమైతే దర్యాప్తు బాధ్యతను ఆ ఠాణాకు సంబంధం లేని అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ కేసుల్నీ కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న దృష్ట్యా దర్యాప్తు వేగిరంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అస్కారం ఏర్పడుతోంది. ఈ విధంగా ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూకబ్జా కేసులే ఎక్కువగా ఉండటంతో ఎస్వోపీ నిబంధనల ప్రకారం బాధితులకు న్యాయం చేసేందుకు కమిషనర్ చొరవ చూపుతున్నారు. -
కర్నూలు జిల్లాలో ప్రజాదర్బార్‌లో రసాభాస
-
రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించిన నరసింహన్
-
రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించిన నరసింహన్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖలతో పాటు, పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహులు, హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావులతో పాటు పలువురు ప్రముఖులు గవర్నర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గవర్నర్‌తో ఫొటోలు దిగారు. సామాన్యులు, యువతి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి గవర్నర్ దంపతులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది అందరి రాష్ట్రం అని.. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన మిగిలే ఉందని.. దానిపై వర్కవుట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అందరికి మంచి జరగాలని అకాంక్షించారు. -
కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు
కర్నూలు : అదనపు కట్నం కోసం అల్లుడు గర్భిణిగా ఉన్న తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని డోన్ పాత పేటకు చెందిన లక్ష్మీదేవి అడ్మిన్ ఎస్పీ షేక్షావలికి ఫిర్యాదు చేశారు. తనకు రెండు కళ్లు కనపడవని, తన కుమార్తె హత్య సంఘటనపై విచారణ జరిపించి తగు న్యాయం చేయాలని ఆమె కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడ్మిన్ ఎస్పీ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 52 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్ని... ♦ ఎస్వీఆర్ చిట్‌ఫండ్స్ వారు చిట్టీలు కట్టించుకుని మెచ్యూర్ అయినప్పటికీ డబ్బు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కర్నూలు ప్రజలు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా బాధితులు విజ్ఞప్తి చేశారు. ♦ ఏపీ సీడ్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆళ్లగడ్డకు చెందిన రమణ నాయక్ రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని నంద్యాలకు చెందిన రాకేష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ♦ తన కుమారులు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుని వెళ్లిపోయారని, ప్రస్తుతం జీవనాధారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కర్నూలు బండిమెట్టకు చెందిన మహబూబ్ బీ ఫిర్యాదు చేశారు. భర్త అనారోగ్యంతో చనిపోయినందున తనను పోషించాల్సిన బాధ్యత కుమారులు మరచి తన వద్ద ఉన్న డబ్బును కూడా లాక్కుని వెళ్లాపోయారని ఆమె వాపోయారు. ♦ తమ పొలానికి సంబంధించి వేరే వ్యక్తి నకిలీ పాసు పుస్తకం సృష్టించి నంద్యాల ఆంధ్రాబ్యాంకులో రుణం తీసుకుని ఆ మొత్తాన్ని చెల్లించడం లేదని, అతనికి సహకరించి తనను మోసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని రుద్రవరం మండలం మందలూరుకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి విన్నవించారు. ♦ తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని, అయితే వారసత్వంగా రావాల్సిన ఆస్తిలో భాగం ఇవ్వకుండా భర్త సోదరులు లింగన్న, నానెపాటి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆలూరు మండలం మొలగవేలినికి చెందిన సంధ్య ఫిర్యాదు చేశారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, భర్త చనిపోయిన తర్వాత హైదరాబాదులో కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ♦ ప్రజాదర్బార్, డయల్ యువర్ ఎస్పీకి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అడ్మిన్ ఎస్పీ హామీ ఇచ్చారు. లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు బాబుప్రసాద్, హుసేన్ పీరా, వెంకటాద్రి ల్గొన్నారు. -
‘ప్రజా దర్బార్’లో రైతు ఆత్మహత్యాయత్నం
– నాలుగు సంవత్సరాలుగా భూమి ఆన్లైన్ చేయలేదని కన్నీరుమున్నీరు – రూ.30వేల లంచం అడిగిన తహసీల్దార్ – పొలంలోకి వెళితే చంపేస్తామని బెదిరింపులు – కర్నూలు మీ కోసం ప్రజాదర్బార్‌లో కలకలం కల్లూరు(రూరల్): అయ్యా.. నాకు న్యాయం చేస్తే బతుకుతా, లేదంటే పురుగుల మందు తాగి చస్తానంటూ ఓ రైతు పురుగుల మందు డబ్బాతో కలెక్టర్ ఎదుట కన్నీరుమున్నీరయిన ఘటన ప్రజాదర్బార్‌లో కలకలం రేపింది. సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్లో మీకోసం ప్రజాదర్బార్ నిర్వహించారు. కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రజల విజ్ఞప్తులను పరిశీలిస్తుండగా బండిఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన రైతు బారికి శ్రీనివాసులు ఒక్కసారిగా ఆ ప్రాంతానికి దూసుకొచ్చాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేందుకు ప్రయత్నించగా కలెక్టర్ గన్‌మన్, కానిస్టేబుళ్లు, అటెండర్ అప్రమత్తమై డబ్బాను లాగిపడేశారు. అనుకోని ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఆ వెంటనే కోలుకున్న కలెక్టర్ రైతు శ్రీనివాసులు, కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను వివరించాలని కోరారు. ఈర్నపాడులోని సర్వే నెంబర్ 380, 422/ఏలో తనకు 3.97 ఎకరాల పొలం ఉందని, 2002లో ఈ పొలాన్ని మల్లె రామన్న అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశానన్నారు. సర్వే కోసం 2015లో దరఖాస్తు చేసుకోగా.. 380 సర్వే నెంబర్లోని పొలాన్ని మాత్రమే సర్వే చేసి 422 సర్వే నెంబర్‌ను అలాగే వదిలేశారన్నారు. అయితే ఇదే సర్వే నెంబర్ భూమిని బద్రి లింగమయ్య, బద్రి గాంధయ్య, బద్రి మాణ్యాల పేరిట ఆన్లైన్ చేశారన్నారు. ప్రస్తుతం వీరు ఆ పొలంలోకి వెళితే.. చంపుతామని గొడ్డళ్లతో వెంటబడుతున్నారని.. తనకు, కుటుంబ సభ్యులకు వీరి నుంచి ప్రాణహాని ఉందని శ్రీనివాసులు కలెక్టర్ ఎదుట బోరుమన్నాడు. ఆన్లైన్ చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని.. తహసీల్దార్ శేషఫణి రూ.30వేలు లంచం తీసుకుని కూడా పని పూర్తి చేయలేదన్నారు. కలెక్టర్ స్పందిస్తూ బండిఆత్మకూరు తహసీల్దార్ శేషఫణితో పోన్లో మాట్లాడారు. ‘ఏంటయ్యా ఈ సమస్య. పొలం ఆన్లైన్ చేయడానికి డబ్బులు అడిగావా. అది నిజమైతే నీ ఉద్యోగం పోతుంది.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆ తర్వాత నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడుతూ సమస్యను వివరించారు. ఓపెన్ ఎంక్వయిరీ చేసి డాక్యుమెంట్, ఎంజాయ్మెంట్ ప్రకారం న్యాయం చేయండని ఆదేశించారు. తహసీల్దార్ వ్యవహారంపై మూడు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు. భయపడకు, న్యాయం చేస్తామని రైతుకు భరోసానిచ్చి పంపించారు.