Rakesh Tikait
-
Rakesh Tikait: చీలికకు కేంద్రమే కారణం
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరే కంగా నెలల తరబడి పోరాడి మోదీ మెడలు వంచిన రైతు ఉద్యమంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రధానభూమిక పోషించించింది. అలాంటి ఎస్కేఎంలో తాజా చీలిక కుట్ర వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బీజేపీ కుట్రలు ఫలించడం వల్లే సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర)పేరిట మరో రైతు సంఘం పురుడుపోసుకుందని ఆయన వెల్లడించారు. ఎస్‌కేఎంకు ఎస్కేఎం(రాజకీయేతర)కు సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో తికాయత్ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్ఎస్ఎస్ నేతలే రైతులుగా.. ‘‘ ఒక్కటిగా ఉంటే మమ్మల్ని ఎదుర్కోలేమని గ్రహించే 41 రైతుల సంఘాల కూటమి అయిన ఎస్కేఎంలో సర్కార్ చీలిక తెచ్చింది. కొత్త సంఘం ఎస్కేఎం(రాజకీయేతర) ఢిల్లీ ఛలో అని పంజాబ్ నుంచి రైతులను తీసుకొచ్చి హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తోంది. అసలు ఈ కార్యక్రమంపై మాతో వాళ్లు మాటవరసకైనా చెప్పలేదు. రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ నేతలే రైతులుగా నటిస్తూ పంజాబ్ నుంచి వచ్చిన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ జిల్లాకు 40 దొంగ సంఘాలు ‘‘ఒక్క నోయిడాలోనే భారతీయ కిసాన్ యూనియన్ పేరిట 37 రైతు సంఘాలను తెరిపించారు. వీటికి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారు. పంటలు, ఆ పంటల్ని పండించే కులాలవారీగా సంఘాలు తెరిచారు. జిల్లాకు 30–40 దొంగ సంఘాలు తెరచి రైతులందరినీ గందరగోళపరిచి, విభజించడమే మోదీ సర్కార్ లక్ష్యం’’ ఎర్రకోట ఘటన పోలీసు కుట్ర ‘‘ 2021 జనవరి 26 సంబంధ ఘటనల్లో పోలీసుల పాత్ర ఉంది. ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో నిలిపిఉంచిన ట్రాక్టర్లను పోలీసులే ఎర్రకోట వైపు నడిపేలా ఉసిగొల్పారు. నాడు ఉద్యమకారులను పోలీసులే తప్పుదోవ పట్టించారు. సిఫార్సులపై మరోమారు నమ్మం స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని బీజేపీ 2014 మేనిఫెస్టోలో చెప్పింది. పదేళ్లయినా అమలుచేయలేదు. అందుకే 2024 బీజేపీ అజెండాను రైతులు నమ్మట్లేరు. విత్తనాలు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, లీజు ఒప్పందం, ఇంథనం, సాగు ఖర్చులకు రైతు కుటుంబం ఉమ్మడి శ్రమ(ఏ2+ఎఫ్ఎల్)కు వెలకట్టి స్వామినాథన్ సిఫార్సుల్నే అమలుచేశామని కేంద్రం అబద్ధం చెబుతోంది. మేం సాగు ఖర్చుకు 50 శాతం విలువ జోడింపు అంటే సీ2+ 50 శాతం ఫార్ములా(స్వామినాథన్ సిఫార్సు) అమలుచేయాలని డిమాండ్‌చేస్తున్నాం’’ -
Farmers movement: ఉద్యమం మరింత ఉధృతం
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో గురువారం జరిగిన ‘ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’ వేదికైంది. ఈ మహాపంచాయత్‌కు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల వెంట నెలల తరబడి ఉద్యమం, కేంద్రం తలొగ్గి వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాక ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రైతు సభ ఇదే కావడం విశేషం. సాగు, ఆహారభద్రత, సాగుభూమి, రైతు జీవనం పరిరక్షణే పరమావధిగా, మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలంటూ చేసిన తీర్మానాన్ని రైతు సంఘాలు ఆమోదించాయి. రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) అధ్వర్యంలో ఈ భారీసభ జరిగింది. ట్రాక్టర్లు తీసుకురావద్దని, శాంతియుత సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యేదాకా తమ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు తీర్మానంలో స్పష్టంచేశారు. ‘ ఈ ఉద్యమం ఆగదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరిస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. -
Delhi Chalo: రైతు ఉద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు. పోలీసుల భాష్పవాయు గోళాలు, జలఫిరంగుల దాడితో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం మొదలై మూడురోజులవుతున్నా అటు రైతులు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టువిడవడం లేదు. పంజాబ్, హరియాణాల మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద వేలాదిగా రైతులు సంఘటితమయ్యారు. టిక్రి, సింఘు, కనౌరీ బోర్డర్ పాయింట్ల వద్దా అదే పరిస్థితి కనిపించింది. వారిని నిలువరించేందుకు మరింతగా బాష్పవాయుగోళాలు అవసరమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 30,000 టియర్‌గ్యాస్ షెల్స్‌కు ఆర్డర్ పెట్టారు. గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ టియర్‌స్మోక్ యూనిట్ వీటిని సరఫరా చేయనుంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద సైతం పోలీసులు మొహరించారు. చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాణ్ సింగ్ పాంథెర్, ప్రభుత్వ ప్రతినిధులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్య గురువారం రాత్రి మూడో దఫా చర్చలు మొదలయ్యాయి. చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం పాల్గొన్నారు. వాటిలో తేలిందనేది ఇంకా వెల్లడి కాలేదు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రైతులు నేడు గ్రామీణ భారత్ బంద్‌ను పాటించనున్నారు. ‘‘రైతులెవ్వరూ శుక్రవారం నుంచి పొలం పనులకు వెళ్లొద్దు. కారి్మకులు సైతం ఈ బంద్‌ను భాగస్వాములవుతున్నారు. ఈ రైతు ఉద్యమంలో ఎంతగా భారీ సంఖ్యలో జనం పాల్గొంటున్నారో ప్రభుత్వానికి అర్థమవుతుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. భారత్‌బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హరియాణాలోని నోయిడాలో కర్ఫ్యూ విధించారు. పలు జిల్లాల్లో 17వ తేదీ దాకా టెలికాం సేవలను నిలిపేస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు సైన్యంలా ఢిల్లీ ఆక్రమణకు వస్తున్నారంటూ బీజేపీ పాలిత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంజాబ్‌లోనూ శుక్రవారం దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పట్టాలపై బైఠాయింపు నిరసనల్లో భాగంగా గురువారం రైతులు రైల్ రోకో కూడా నిర్వహించారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అతి పెద్దదైన రాజాపురా రైల్వే జంక్షన్ వద్ద వందలాది మంది రైతులు పట్టాలపై బైఠాయించారు. మధ్యా హ్నం నుంచి సాయంత్రం దాకా రైళ్ల రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా రైళ్లను దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. -
ఢిల్లీ ఛలో’ యాత్ర: కేంద్రానికి రాకేశ్ టికాయత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: రైతుల ‘ఢిల్లీ ఛలో’ యాత్రతో ఢిల్లీ నగర సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. సింగు బోర్డర్ వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో నిరనసన కారులు చెల్లాచెదురయ్యారు. శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. దీంతో రైతులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల వేళ రైతుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం సమస్యగా సృష్టిస్తే ఊరుకోమని అన్నారు. పలు రైతుల సంఘాలు భిన్నమైన సమస్యలపై పోరాటం చేస్తాయని తెలిపారు. కానీ, నేడు(మంగళవారం) చేపట్టిన రైతుల ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌ను సమస్యగా చిత్రీకరిస్తే ఊరుకోమని మండిపడ్డారు. తాము రైతులకు దూరంగా లేమని.. నిరసన తెలిపే రైతులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని గుర్తుచేశారు. #WATCH | On farmers' 'Delhi Chalo' march, farmer leader Naresh Tikait says "Protests are underway in the entire country...The government should sit with us and hold discussions and give respect to the farmers. Government should think about this issue and try to solve this..." pic.twitter.com/2itfTQ6AlR — ANI (@ANI) February 13, 2024 అదేవిధంగా రాకేశ్ టికాయత్ సోదరుడు నరేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లపై చర్చ జరపాలని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపి అంతేవిధంగా రైతులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆలోచించి రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇక.. రైతుల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ‘భారత్ బంద్’ నిర్వహించాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత్ కిసాన్ యూనియన్(బీకేయూ) దేశంలోని అతిపెద్ద రైతు సమాఖ్యలలో ఒకటి. నేడు ప్రారంభమైన ‘ఢిల్లీ ఛలో’ రైతుల ఆందోళనలో అది చేరితే.. కేంద్రం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రైతు నిరసనకారుల్లో చర్చజరుగుతోంది. చదవండి: Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్ -
Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్‌లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు. -
Wrestlers Protest: రైతు నేతల విజ్ఞప్తి.. పతకాలు గంగానదిలో వేయడం వాయిదా..
న్యూఢిల్లీ: హరిద్వార్ వద్ద గంగానదిలో పతకాలను విసిరేస్తామన్న రెజ్లర్లు.. తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. రైతు నేతల విజ్ఞప్తితో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి అయిదు రోజుల గడువిస్తూ అల్టీమేటం జారీ చేశారు. అయిదు రోజుల్లో బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మళ్లీ తిరిగి వస్తామని తెలిపారు. రెజ్లర్ల పతకాలను రైతు నేత నరేష్ తన వెంట తీసుకెళ్లారు. కాగా బీజేపీ ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరు నెలల నుంచి ఢిల్లీలో నిరసన చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తాము కష్టపడి గెలుచుకున్న మెడల్స్‌ను పవిత్ర గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు విసిరేస్తామని ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేస్తామని తెలిపారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు.కాబట్టి ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో నిరసనగా తమ పతకాలను నదిలో వేయడానికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని గంగా నది తీరానికి చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెజ్లర్లు అక్కడే ధర్నాకు దిగారు. అయితే రెజ్లర్లు పతకాలను గంగా నదిలోకి విసిరేందుకు సిద్ధమవుతున్న వేళ రైతు నాయకుడు నరేష్ టికాయత్ హరిద్వార్ హర్ కి పౌరీకి చేరుకున్నారు. ఆయన జోక్యం చేసుకొని పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయొద్దని నిరసన తెలుపుతున్న మల్లయోధులను కోరారు. దీంతో తమ నిర్ణయాన్ని రెజ్లర్లు వాయిదా వేసుకున్నారు. హరిద్వార్‌లోని హర్ కీ పౌరి నుంచి వెనక్కి బయల్దేరారు. కాగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. చదవండి: మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం -
బీకేయూ నేత తికాయత్‌కు బెదిరింపులు
ముజఫర్‌నగర్(యూపీ): భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. రైతు సంఘాల ఆందోళనల నుంచి దూరంగా ఉండకుంటే రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబాన్ని బాంబు వేసి చంపుతామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా హెచ్చరించాడు. ఈ మేరకు రాకేశ్ తికాయత్ సోదరుడు గౌరవ్ తికాయత్, బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిని గుర్తించి, పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని భవురా కలాన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అక్షయ్ శర్మ చెప్పారు. రద్దయిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రైతు నేతల్లో రాకేశ్ తికాయత్ ఒకరు. చట్టాలు రద్దయిన తర్వాత కూడా ఆయన దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై రైతు సంఘాలు చేపట్టే నిరసనల్లో పాల్గొంటున్నారు. -
‘లఖీంపూర్ ఖేరి’ని మర్చిపోం.. కేంద్రాన్ని మర్చిపోనివ్వం
లఖీంపూర్ ఖేరి: ‘లఖీంపూర్ ఖేరి ఘటనను మేం మర్చిపోం. కేంద్ర ప్రభుత్వాన్ని మర్చిపోనివ్వం. మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించడం మినహా దేనికీ మేం ఒప్పుకోం’అని భారతీయ కిసాన్ సంఘ్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. యూపీలోని లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం లఖీంపూర్ ఖేరిలోని కౌడియాలా ఘాట్ వద్ద సమావేశమైన రైతులనుద్దేశించి తికాయత్ మాట్లాడారు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతృత్వంలో నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా జరప తలపెట్టిన ఆందోళనల్లో మంత్రిని తొలగింపు డిమాండ్ ఉంచుతామని చెప్పారు. అక్రమ కేసులు మోపి జైళ్లలో ఉంచిన నలుగురు రైతులను విడుదల చేయాలన్నారు. ఈ నలుగురు రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయంగా అందజేస్తామని చెప్పారు. పంజాబ్ రాష్ట్రం ఫగ్వారాలో జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలిపారు. అప్పటి హింసాత్మక ఘటనల్లో అమరులైన, గాయపడిన రైతుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. లఖీంపూర్ ఖేరి ఘటనలో బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలాగానే నేరస్తుల కొమ్ము కాస్తోంది. న్యాయం జరిగేదాకా రైతుల పోరు ఆగదు. ఆందోళనలు చేస్తున్నప్పటికీ రైతుల పంటలకు కనీస మద్దతు ధర అందడం లేదు, అమరులైన రైతుల కుటుంబాలకు న్యాయం జరగలేదు’అని ట్వీట్లు చేశారు. 3 సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన లఖీంపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపైకి అజయ్ కుమారుడు ఆశిష్ కారు నడపడం, తర్వాత జరిగిన హింసలో మొత్తంగా 8 మంది చనిపోయారు. -
తికాయత్.. ఓ చౌకబారు వ్యక్తి: కేంద్ర మంత్రి
లఖీమ్‌పూర్ ఖేరి(యూపీ): వివాదాస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై కారు దూసుకెళ్లిన కేసులో అరెస్టయిన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా.. రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్‌పై నోరు పారేసుకున్నారు. ఎనిమిది మంది మరణానికి కారకుడైన ఆశిష్‌కు తండ్రి అయిన అజయ్.. మంత్రిగా రాజీనామా చేయాలంటూ డిమాండ్చేస్తున్న తికాయత్‌ను ‘చౌక బారు వ్యక్తి’ అంటూ తక్కువచేసి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి ఎంపీ నియోజకవర్గ బీజేపీ మద్దతుదారులనుద్దేశిస్తూ అజయ్ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ‘ఒకవేళ నేను మంచి వేగంతో కారులో వెళ్తున్నాను అనుకుందాం. అప్పుడు ఊర కుక్కలు వెంటబడతాయి. మొరుగుతాయి. వాటి తీరే అంత. అంతకుమించి నేను చెప్పేదేం లేదు. తికాయత్ గురించి నాకు బాగా తెలుసు. పొట్టకూటి కోసం రాజకీయాలు, ఉద్యమాలు చేస్తుంటాడు’ అంటూ ఆ వీడియోలో అజయ్ వ్యాఖ్యానించారు. అజయ్ వ్యాఖ్యానాల వీడియోపై తికాయత్ స్పందించారు. ‘ఏడాదికాలంగా కుమారుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అందుకే అజయ్ మిశ్రాకు నాపై కోపం’ అని అన్నారు. Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ - the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH — Alok Pandey (@alok_pandey) August 23, 2022 ఇదీ చదవండి: రాజకీయ పార్టీలన్నీ ఉచితాలవైపే -
రైతుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
లక్నో: లఖింపూర్ ఘటనలో రైతుల పై దాడి విషయమై కేంద్ర మంత్రి కొడుకు ఆశిష మిశ్రా జైలు పాలైన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలంటూ రైతు నేత రాకేశ్ టికాయత్ రైతులతో కలిసి సుమారు 72 గంటల పాటు నిరసనలు చేపట్టారు. ఐతే అధికారుల హామీతో ఆ నిరసనలు విమించుకున్న సంగతి కూడా విధితమే. ఈ నేపధ్యంలో మంత్రి అజయ్ మిశ్రా లఖింపూర్ ఖేరీలో తన మద్దతుదారులను ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసంగంలో రైతులను ఉద్దేశిస్తూ....సంచలన వ్యాఖ్యలు చేశాడు. కుక్కులు మొరగడం, కారుని వెంబడిచడం గురించి ప్రస్తావిస్తూ...వాటి స్వభావం అలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే మాజీ మంత్రి రైతు నేత గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. రైతులుగా పిలవబడుతున్నవారు పాకిస్తాన్ లేదా కెనడాలో కూర్చొన్న జాతీయేతర రాజకీయ పార్టీలు లేదా ఉగగ్రవాదులు అంటూ విరుచుకుపడ్డారు. ఆఖరికి మీడియా కూడా వారితో కలిసి తనపై ఇలా దుష్ప్రచారం చేస్తుందని కలలో కూడా ఊహించుకోలేదని అన్నారు. బహుశా మీడియాకి కూడా ఇదే బలమనకుంటా, అయినా మీడియా కారణంగా ప్రజలు ఎప్పటికీ తనను ఎలా ఓడించాలో తెలుసుకోలేరంటూ ఎగతాళి చేశారు. ఏనుగు ఎప్పుడూ తన దారిన తను వెళ్తుంటుంది, కుక్కలే ఎప్పుడూ మొరుగుతాయని వ్యగ్యంగా అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.."తాను లక్నోకి కారులో ప్రయాణిస్తున్నాను, అప్పుడు కారు మంచి వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో కుక్కలు మొరుగుతాయి లేదా వెంబడిస్తాయి. అది వాటి సహజ స్వాభావం. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ నిరాశపరచలేరు. ఎంతమంది రాకేష్ తికాయత్‌లు వచ్చినా మనల్ని ఏం చేయలేరు. అతను రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి , పైగా అతని రాజకీయ జీవితం ఎక్కువ కాలం సాగదు. తానే ఏ తప్పు చేయలేదంటూ ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తనను తాను ప్రపంచంతో పోరాడుతున్న గొప్ప వ్యక్తిగా అభివర్ణించుకున్నాడు. Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ - the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH — Alok Pandey (@alok_pandey) August 23, 2022 (చదవండి: 6న ఎస్కేఎం తదుపరి భేటీ) -
Mahapanchayat: ఢిల్లీలో తికాయత్ నిర్బంధం.. భారీ భద్రత
న్యూఢిల్లీ: రైతు సంఘాల సమాఖ్య ఎస్కేఎం సోమవారం(ఇవాళ) జంతర్‌మంతర్‌లో మహాపంచాయత్ తలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్‌ను ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మధు విహార్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కోరినట్లు ఆయన్ను కోరినట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(శాంతి భద్రతలు) దేపేంద్ర పాఠక్ చెప్పారు. ఆయన అంగీకరించడంతో పోలీసు భద్రతతో వెనక్కి పంపినట్లు వివరించారు. దేశ రాజధానిలో అనవసరంగా గుమిగూడటాన్ని నివారించడానికే తికాయత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. రైతు గళం వినిపించకుండా చేసేందుకు కేంద్రం ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు తనను నిర్బంధంలోకి తీసుకున్నారని తికాయత్ ఆరోపించారు. ఇది మరో విప్లవానికి నాంది కానుందని, తమ పోరాటం ఆపేది లేదని ఆయన ట్వీట్ చేశారు. తికాయత్‌ను నిర్బంధించడాన్ని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఖండించారు. ఇదీ చదవండి: చెప్పుతో కొట్టి.. పరారయ్యాడు! -
6న ఎస్కేఎం తదుపరి భేటీ
లఖీంపూర్‌ఖేరి: కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను పదవి నుంచి తొలగింపు, పంటలకు కనీస మద్దతు ధర కల్పన తదితర డిమాండ్లతో యూపీలోని లఖీంపూర్‌ఖేరిలో రైతులు చేపట్టిన ఆందోళన అధికారుల హామీతో శనివారం ముగిసింది. తదుపరి కార్యాచరణపై సెప్టెంబర్ 6వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఢిల్లీలో భేటీ అవుతుందని రైతు నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం లఖీంపూర్‌ఖేరిలో రాజాపూర్ మండి సమితి వద్ద రైతు ధర్నా ప్రాంతానికి చేరుకున్న జిల్లా మేజిస్ట్రేట్ మహేంద్ర బహదూర్ సింగ్‌కు రైతులు డిమాండ్లను వివరించారు. ఈ డిమాండ్లపై చర్చించేందుకు సెప్టెంబర్ 6వ తేదీన ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని మేజిస్ట్రేట్ వారికి హామీ ఇచ్చారు. దీంతో, 75 గంటలుగా కొనసాగుతున్నఅంతకుముందు రైతులు తలపెట్టిన ర్యాలీని కూడా అధికారుల హామీతో విరమించుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి లఖీంపూర్‌ఖేరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా 8 మంది మృతికి మంత్రి కుమారుడు ఆశిష్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
కేంద్రంపై పోరుకు కదిలిన 10వేల మంది రైతులు!
లక్నో: కేంద్రానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. మూడు రోజుల పాటు చేపట్టే ఈ నిరసనల్లో పాల్గొనేందుకు సుమారు 10,000 మంది రైతులు పంజాబ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు బయలుదేరారు. లఖింపుర్‌ఖేరీ హింసాత్మక ఘటనలకు న్యాయం చేయాలంటూ గురువారం నుంచి 72 గంటల పాటు(ఆగస్టు 18 నుంచి 20వ తేదీ) ఈ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. సీనియర్ రైతు నేతలు రాకేశ్ టికాయిత్, దర్శన్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రాహన్ వంటి వారు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. ఆందోళనల్లో సుమారు 10వేల మంది రైతులు పాల్గొంటారని భారతి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ రాయ్ తెలిపారు. కొందరు రైళ్లలో, మరికొందరు తమ సొంత వాహనాల్లో లఖింపుర్‌ఖేరీకి చేరుకుంటున్నారని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులను ఎత్తివేయాలని కోరుతున్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో లఖింపుర్‌ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా అరెస్టయ్యారు. రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఆశిశ్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది అలహాబాద్ హైకోర్టు. ఇదీ చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. -
కేసీఆర్ ఎజెండా ఖరారు.. దేశవ్యాప్తంగా రైతు సభలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పథకాలను అమలు చేయాలనే డిమాండ్‌తో రైతు సంఘాలు నిర్వహించే సభలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవుతారు. అయితే దేశవ్యాప్త పర్యటనకు ముందు నిజామాబాద్, వరంగల్‌లో రైతులతో భారీ సభలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రాథమికంగా నిర్ణయించారు. రెండు రోజులుగా రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్‌తో ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా సమావేశమైన కేసీఆర్.. దేశ వ్యాప్తంగా రైతు సదస్సుల నిర్వహణకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న టికాయత్‌తో పాటు మరో ఇద్దరు రైతు సంఘాల నేతలు ప్రగతిభవన్లోనే విడిది చేసినట్లు సమాచారం. తికాయత్ బృందంతో జరిగిన భేటీలో రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. సభల షెడ్యూల్, ఎజెండా ఖరారు! రైతు సదస్సులను తొలుత వచ్చే నెల మొదటి వారంలో నిజామాబాద్‌లో, ఆ తర్వాత వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సదస్సులు నిర్వహించేందుకు అనువైన ప్రాంతాలు, షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. రైతు బంధు, రైతు బీమాతో పాటు కులవృత్తుల కోసం చేపట్టిన గొర్రెలు, చేప పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలను సభల్లో వివరిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టేలా కేసీఆర్ ఎజెండా ఖరారు చేసినట్లు తెలిసింది. -
‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా 24న దేశ్యవ్యాప్త నిరసన
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం అమలుపై కేంద్రం దూకుడు ప్రదర్శిస్తుండగా... అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా సోమవారం భారత బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. రైతు సంఘాలు కూడా అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ సైనిక నియామక పథకానికి వ్యతిరేకంగా జూన్ 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం ప్రకటించింది. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఎస్‌కెఎం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు రైతు నాయకుడు రాకేష్ తికాయిత్ తెలిపారు. జిల్లా, తహసీల్ ప్రధాన కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువతను సమీకరించాలని పౌర సంఘాలు, రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) కూడా నిరసనల్లో పాల్గొంటుందని వెల్లడించారు. కాగా, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జూన్ 30న నిరసనలకు బీకేయూ పిలుపునిచ్చింది. (క్లిక్: ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల) -
రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్‌పై ఇంక్ దాడి
-
Rakesh Tikait: రాకేష్ టికాయత్‌పై ఇంకు దాడి
బెంగళూరు: రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్‌పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. రసాభాసా నెలకొంది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు. టికాయత్‌తోపాటు యుద్విర్ సింగ్ ముఖంపై నల్లసిరా చల్లింది ఆయన వ్యతిరేక వర్గమని తెలుస్తోంది. అంతేకాదు ఆయనపై కుర్చీలు విసిరారు నిరసనకారులు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్, సింగ్‌లు వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. ఆ ఘటనలో తమ ప్రమేయం లేదంటూ వాళ్లు వివరణ ఇవ్వబోతుండగా.. కొందరు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. దాడికి పాల్పడింది చంద్రశేఖర్ మద్ధతుదారులేనని టికాయత్ చెప్తున్నారు. -
మద్దతు ధరపై తగ్గేదేలే!
సాక్షి, న్యూఢిల్లీ: రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించేవరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ తమ పోరాటం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచేందుకు కలిసివచ్చే అన్ని పార్టీలు, సంఘాలతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై తమ పార్టీ ఎంపీలు గట్టిగా కొట్లాడతారని చెప్పినట్టు సమాచారం. ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాల్సిన ఆవశ్యకతను మరోమారు నొక్కిచెప్పిన సీఎం.. దేశ వ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయాన్ని, రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ నూతన విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన కేసీఆర్‌తో గురువారం రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయస్థాయి కూటమి ఏర్పాటు, వ్యవసాయ సమస్యలు, పంటలకు చట్టబద్ధతపై పోరాటం వంటి అంశాలపై చర్చించా రు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవితలు భేటీలో ఉన్నారు. అంతా కలిసి సీఎం నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. బీజేపీతో దేశ సమగ్రతకు ముప్పు పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. సుబ్రహ్మణ్య స్వామితో భేటీలో ప్రధానంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు అంశంపై కేసీఆర్ చర్చించారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో తాను జరిపిన భేటీలు, జేడీయూ, ఆర్జేడీ సహా ఇతర పార్టీల నేతలతో చర్చల వివరాలను ఆయనకు తెలియజేశారు. మతతత్వాన్ని బీజేపీ పెంచి పోషిస్తోందని, దీనివల్ల మున్ముందు దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయన్న అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనేందుకు భావసారూప్యత కలిగినపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అవసరం ఉందని, ఇందుకోసం తన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. రైతు పోరాటాలకు సంపూర్ణ మద్దతు రైతు సంఘం నేత టికాయత్‌తో జరిగిన భేటీలో ప్రధానంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలు, చట్టాల రద్దు అనంతరం కేంద్రం తీరు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిపై ప్రధానంగా చర్చించారు. గత సీజన్లో రాష్ట్రంలో పండించిన ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును వివరించారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ జాతీయ విధానంపై రైతు సంఘాలు చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రైతు ఉద్యమంలో చనిపోయిన 750 కుటుంబాలకు సంబంధించి తెలంగాణ ప్రకటించిన రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అంశం ప్రస్తావనకు రాగా.. మార్చి 10 తర్వాత ఆయా రైతుల జాబితాను అందజేస్తామని టికాయత్ చెప్పారు. తెలంగాణ విధానాలు దేశమంతా అమలవ్వాలి బీకేయూ నేత రాకేశ్ టికాయత్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు ప్రోత్సాహక పథకాలు దేశమంతటా అమలు కావాలని బీకేయూ నాయకుడు రాకేశ్ టికాయత్ అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అనుకూల విధానాలు అమలవుతున్నాయని, రైతు సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం టికాయత్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నూతన వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పన కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా. అందులో భాగంగానే తెలంగాణ సీఎంను కలిశా. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలుస్తా. వ్యవసాయ రంగం, రైతాంగ సమస్యలపై హైదరాబాద్‌లో లేదా మరోచోట అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తాం’అని టికాయత్ తెలిపారు. కేసీఆర్‌తో వ్యవసాయ అంశాల గురించి మాత్రమే చర్చ జరిగిందని, రాజకీయాలపై మాట్లాడలేదని ఆయన తెలిపారు. అయితే రాజకీయాల్లోనూ పోటీ ఉండాలని, పీపుల్స్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉందని, అలాంటప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. నేడు జార్ఖండ్‌కు కేసీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ కానున్నారు. రాంచీకి వెళ్లనున్న కేసీఆర్.. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను కూడా అందజేయనున్నారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబంతో పాటు 19 మంది అమర జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని గతంలో సీఎం ప్రకటించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చర్యలు చేపట్టనున్నారు. -
కేసీఆర్‌ను కలిసిన రైతు ఉద్యమకారుడు రాకేష్ టికాయత్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేసీఆర్‌ను రైతు ఉద్యమకారుడు రాకేష్ టికాయత్ గురువారం కలిశారు. మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. భేటీ అనంతరం రాకేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ, రైతు సమస్యలపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో కిసాన్ ఎజెండా రూపొందించాల్సి ఉందని టికాయత్ పేర్కొన్నారు. చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి రియాక్షన్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు బంధు పథకం చాలా బాగుంది. జాతీయ స్థాయిలో ఈ రైతు పథకాలు అమలు చేయాలి. రాజకీయ అంశాలు సమావేశంలో మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో రాజకీయ మార్పు ఇప్పుడు ఏమి చెప్పలేనని రాకేష్ టికాయత్ అన్నారు. -
సీఎం కావాలా.. రెండవ కిమ్ కావాలా?
లఖింపూర్: ముఖ్యమంత్రి కావాలో, రెండవ కిమ్ జాంగ్ ఉన్ కావాలో తేల్చుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ సూచించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ వ్యతిరేకంగా ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు. ‘యూపీ ప్రజలు తమ ఓట్లను తెలివిగా వినియోగించుకోవాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి ప్రజాప్రతినిధులు కావాలో.. రెండవ కిమ్ జాంగ్ ఉన్(ఉత్తర కొరియా అధినేత) కావాలో తేల్చుకోవాలని కోరుతున్నాం. ఏ రాష్ట్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వం మనకు వద్ద’ని టికాయిత్ అన్నారు. తన స్వస్థలమైన ముజఫర్‌నగర్‌లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని గత వారం ఆయన మండిపడ్డారు. అయితే విద్వేష రాజకీయాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. ‘అభివృద్ధి గురించి మాట్లాడాలని పశ్చిమ యూపీ ప్రజలు కోరుకుంటున్నారు. హిందూ, ముస్లిం, జిన్నా, మతం పేరుతో రెచ్చగొట్టేవారికి ఓట్లు పడవు. ముజఫర్‌నగర్ హిందూ-ముస్లిం మ్యాచ్‌లకు స్టేడియం కాద’ని టికాయిత్ ట్వీట్ చేశారు. రైతులకు మేలు చేసే వారికే యూపీ ప్రజలు పట్టం కడతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, జిన్నా గురించి మాత్రమే కాకుండా తమ సమస్యల గురించి మాట్లాడేవారికి ప్రజలు అనుకూలంగా ఉంటారని ‘పీటీఐ’తో అన్నారు. మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ వివాదాస్పద చట్టాలను వెనక్కు తీసుకునేలా ఉద్యమించడంలో టికాయిత్ ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే. (క్లిక్: పంజాబ్ లో చేదు అనుభవం.. మరోసారి గుర్తు చేసుకున్న మోదీ) -
టీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్
కవాడిగూడ/పంజగుట్ట: ‘టీఆర్ఎస్ను రాష్ట్రంలోనే ఉంచండి. బీజేపీకి కొమ్ముకాసే పార్టీ. బీజేపీకి బీ టీమ్’అని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ విమర్శించారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని.. ప్రతి పంటకూ మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దుత ధర హామీ చట్టం, విత్తన చట్టం, క్రిమి సంహారక చట్టం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణతో పాటు రైతుల ఇతర న్యాయమైన డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీ తమతో చర్చించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో రైతు ఉద్యమం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జరిగిన మహా ధర్నాలో తికాయత్ పాల్గొని మాట్లాడారు. భాష వేరైనా మన భావం ఒక్కటే పార్లమెంట్లో ఓటేసే అవకాశం ఇవ్వకుండా, రాజ్యసభలో మంద బలంతో 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని తికాయత్ విమర్శించారు. రైతులకు నష్టం కల్గిస్తున్న ఈ చట్టాల రద్దు కోసం చేసిన ఉద్యమానికి విదేశాలల్లోనూ మద్దతు వచ్చిందని, అందుకే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్, కంపెనీలు నడుపుతున్నాయని ఆరోపించారు. భాష వేరైనా మన భావం ఒక్కటేనని రైతులను ఉద్దేశించి తికాయత్ అన్నారు. ఏఐకేఎస్‌సీసీ 27న సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు. గోల్కొండ రైతుల సమస్యపై కేసీఆర్‌కు లేఖ రాస్తా: తికాయత్ ఎంఎస్పీ హామీ చట్టం.. అమరులైన 750 మంది రైతులకు పరిహారమని తికాయత్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గోల్కొండ కోట లోపల సాగు చేసుకుంటున్న రైతుల నుంచి ప్రభుత్వం భూమిని గోల్ఫ్ కోర్స్ కోసం తీసుకుందని, కానీ పరిహారం ఇవ్వలేదని చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని అన్నారు. -
Rakesh Tikait: ‘తెలంగాణలో రైతుల సమస్యలు చాలా ఉన్నాయి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలు, మద్దతు ధర తదితర అంశాలపై ఆందోళ చేస్తామని కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తమ నాలుగు డిమాండ్లలో రెండు డిమాండ్లులపై మాత్రమే కేంద్రం స్పందించిందని తెలిపారు. ఎంఎస్పీ ధర విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. ఎంఎస్పీపై చట్టం తేవాలని కేంద్రాన్ని కొరామని తెలిపారు. చదవండి: సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’ తెలంగాణలో రైతుల సమస్యలు చాలా ఉన్నాయని రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండలో రైతుల భూమి ఉందని తెలిసిందని, అది గోల్ఫ్ కోర్టుకు ఇచ్చారని తేలిందని అన్నారు. రైతుల సమస్యలపై పూర్తి సమాచారం తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. -
27న భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి
ఘజియాబాద్: వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడే ఆగవని, భవిష్యత్తు కార్యాచరణను ఈనెల 27న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ బుధవారం తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చేసిన వాగ్దానాలపై కూడా మోదీ సర్కారును నిలదీస్తామన్నారు. ‘శనివారం మేము సమావేశం కానున్నాం. అక్కడ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాం. జనవరి 1 నుంచి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అదెలా చేస్తారో చెప్పాలని మేము ఆయన్ని అడుగుతాం’ అని తికాయత్ ట్వీట్ చేశారు. కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదికాలంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించడంతో ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఈనెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదు
లక్నో: దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, రైతులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ కోరారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే కాదు, ఇంకెన్నో అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం చర్చలకు వచ్చేదాకా అన్నదాతల పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందని, తమతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని విమర్శించారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత, విత్తనాలు, పాడి పరిశ్రమ, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌కు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మద్దతు పలికారని తికాయత్ గుర్తుచేశారు. ఇదే డిమాండ్‌ను తాము లేవనెత్తుతున్నామని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాకేశ్ తికాయత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఉగ్రవాదితో సరిపోల్చారు. లఖీమ్‌పూర్ ఖేరిలో రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు హాని చేస్తాయన్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని ప్రకటించిందని, సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాల గురించి కొందరికి అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామంటూ రైతుల నడుమ చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ కొందరు తామేనని అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ దేశాన్ని అమ్మేస్తుంటారు సంఘర్‡్ష విశ్రామ్(కాల్పుల విరమణ)ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రకటించిందని, రైతులు కాదని రాకేశ్ తికాయత్ ఉద్ఘాటించారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, అప్పటిదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. దేశమంతటా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ వ్యవహార ధోరణిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. రైతుల పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘వారు (ప్రభుత్వం) ఒకవైపు మిమ్మల్ని హిందూ–ముస్లిం, హిందూ–సిక్కు, జిన్నా అంటూ మభ్య పెడుతుంటారు. మరోవైపు దేశాన్ని అమ్మేస్తుంటారు’’ అని తికాయత్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పినంత మాత్రాన పంటలకు కనీస మద్దతు ధర దక్కదని అన్నారు. చట్టబద్ధత కల్పిస్తేనే దక్కుతుందని చెప్పారు. ఈ అంశంపై ఒప్పటికే కమిటీని ఏర్పాటు చేశారని, నివేదిక ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరిందని, నిర్ణయం తీసుకోవడానికి కొత్త కమిటీ అవసరం లేదని సూచించారు. నివేదిక ఇచ్చిన కమిటీలో నరేంద్ర మోదీ కూడా సభ్యుడేనని గుర్తుచేశారు. కమిటీ సిఫార్సులను ఆయన ఆమోదిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం? ప్రసార మాధ్యమాల తీరుపై రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా మీడియా కేవలం రైతులను మాత్ర మే ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారని తెలిపారు. కిసాన్ మహా పంచాయత్‌లో పలువరు రైతు సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
మద్దతు ధరకు చట్టబద్ధత
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసిన రైతన్నలు ఇక కనీస మద్దతు ధర కోసం పోరుబాట పట్టనున్నారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించేంతవరరు ఉద్యమాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమావేశమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శన చేయాలని నిర్ణయానికొచ్చింది. సోమవారం లక్నోలో మహాపంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించి, కేంద్రానికి రైతుల బలమేంటో మరోసారి చూపిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా రైతన్నల కష్టాలు తీరవు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడమే అతి పెద్ద సంస్కరణ’’ అని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో పాటు తాము చేస్తున్న డిమాండ్లన్నీ కేంద్రం నెరవేర్చేవరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందుకోసం మరోసారి ఈ నెల 27న సమావేశం కావాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆరు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిపై తమతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించేదాకా ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి. 29న పార్లమెంట్ వరకూ ర్యాలీ తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను రైతులు ముమ్మరం చేయనున్నారు. సోమవారం లక్నోలో కిసాన్ పంచాయత్‌తో పాటు ఈ నెల 26న ఢిల్లీలో అన్ని సరిహద్దుల్లో మోహరిస్తామని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు అంటే ఈ నెల 29న పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాలే వెల్లడించారు. 24న కేంద్ర కేబినెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అవసరమైన అధికార ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నెల 24న (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల కంటే ముందుగానే కేబినెట్ సమావేశమై చట్టాల రద్దుపై చర్చించి దానికి అవసరమైన తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఆపై ఉపసంహరణ బిల్లుకు తుదిరూపమిస్తారు. ప్రధాని మోదీకి బహిరంగ లేఖ సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. ఎంఎస్పీకి చట్టబద్ధతతోపాటు మొత్తం ఆరు డిమాండ్లపై రైతులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘11 రౌండ్ల చర్చల తర్వాత ద్వైపాక్షిక పరిష్కార మార్గం కనుగొనడం కంటే మీరు(ప్రధాని మోదీ) ఏకపక్ష తీర్మానానికే మొగ్గుచూపారు’’ అని లేఖలో ప్రస్తావించింది. రైతు సంఘాల ఆరు డిమాండ్లు ► పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలి. ► గత ఏడాది కాలంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మందికి పైగా రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ► రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. ► పోరాటంలో రైతుల ప్రాణత్యాగాలకు గుర్తుగా ఒక స్మారక స్తూపం నిర్మించాలి. ► పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు–2020/21 ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి. ‘‘దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం–2021’ లో రైతులపై జరిమాన విధించే అంశాలను తొలగించాలి. హా లఖీమీపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలి.