Ram temple
-
రామాలయంలో రథానికి నిప్పు
-
అయోధ్యలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
యూపీలోని అయోధ్యలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సకల ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాదే ప్రారంభమైన ఈ ఆలయంలో తొలిసారిగా రామనవమి జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరుగుతోంది.ట్రస్టు సభ్యులు డా అనిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈరోజున బాలరామునికి ఒకటిన్నర క్వింటాళ్ల నైవేద్యాన్ని సమర్పించనున్నామని తెలిపారు. నేడు రోజుంతా భజన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించామన్నారు. సాయంత్రం భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. -
'స్కై డైవింగ్ స్టంట్'తో రామభక్తి చాటుకున్న 22 ఏళ్ల మహిళ!
అయోధ్యలో నూతన రామాలయం జనవరి 22న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అదికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు కూడా. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌కు చెందిన 22 ఏళ్ల అనామిక శర్మ అనే మహిళ అద్భుతమైన స్టంట్‌ని ప్రదర్శించింది. అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలోనే అనామిక బ్యాకాంక్‌లో ఈ స్కై డైవింగ్ స్టంట్తో తన రామభక్తిని ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు అనామిక శర్మ బ్యాంకాక్‌లో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో 'జైశ్రీరామ్' అనే జెండాతో ఈ స్కై డైవింగ్ స్టంట్ చేసింది. తాను తన భక్తిని ఈ స్కై డైవింగ్‌తో ముందు తీసుకువెళ్లాలనుకుంటున్నా అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా,జనవరి 22న జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సుమారు 4 వేలకు పైగా సాధువులు, పలువురు ఇతర ప్రముఖులు హాజరకానున్నారు. కాగా, అయోధ్యలో ఈ రామ మందిర ప్రతిష్టాపన వేడుకను సందర్శకులు అపూర్వమైన మరుపురాని అనుభవంగా ఉండేలా అభివృద్ధిక కార్యక్రమాలతో అందంగా తీర్చిదిత్తున్నారు సీఎం యోగి. ఈ నూతన రామాలయం రాష్ట్ర దేశవాలయంగా భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామజికి చిహ్నంగా అలారారుతుందని ఆదిత్యనాధ్లో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అయోధ్యలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేశాలే అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు యోగి. VIDEO | 22-year-old Anamika Sharma of Prayagraj showed her devotion for Ram Temple in Ayodhya by skydiving with a ‘Jai Shri Ram’ flag from 13,000 feet in Bangkok. pic.twitter.com/Y6S8qOS9yf — Press Trust of India (@PTI_News) January 3, 2024 (చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!) -
యోగి ఆదిత్యనాథ్‌కు బాంబు బెదిరింపులు .. ఇద్దరి అరెస్టు
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అయోధ్య రామాలయంలపై బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాంబులు వేసి యోగి ఆదిత్యనాథ్, అయోధ్యలోని రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో నిందితులు పోస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితులను తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాలుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) బృందం గుర్తించింది. నిందితులు లక్నోలో విభూతి ఖండ్ ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్, అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చేస్తామని బెదిరించారని పోలీసులు గుర్తించారు. బెదిరింపు పోస్టుల్లో నిందితులకు సంబంధించిన ఈమెయిల్ ఐడీలు ఉన్నట్లు తేలింది. ఈమెయిల్ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహర్ సింగ్ ఈమెయిల్ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్ మిశ్రా బెదిరింపు సందేశాలు పంపారని తేలింది. నిందితులు ఇద్దరూ గోండా నివాసితులు. పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసును ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారిస్తోంది. నిందితులే ఈ చర్యకు పాల్పడ్డారా? లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్ నేతలు అలర్ట్! -
పునర్వైభవ తార్కాణం: అమిత్ షా
అహ్మదాబాద్: దేశ అమృత కాలపు ఆరంభంలోనే అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన జరగనుండటం యాదృచ్చికమేమీ కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అభిప్రాయపడ్డారు. రానున్న పాతికేళ్లలో ప్రపంచంలో భారత్ అగ్ర స్థానానికి చేరి పునర్వైభవం సాధించనుందనేందుకు ఇది తార్కాణమన్నారు. వందల ఏళ్ల ఎదురు చూపులు ఫలించాయి. దేశవాసుల ప్రార్థనలు, సాధు సంతుల తపస్సులు, అసంఖ్యాత భక్తుల ప్రయత్నాలు ఫలించాయి. అడ్డంకులన్నీ తొలగాయి. శ్రీరాముడు తన జన్మస్థానంలో ఎట్టకేలకు వైభవంగా కొలువు దీరనున్నాడు’’ అని అన్నారు. అయోధ్య మాత్రమే గాక కాశీలో నాడు ఔరంగజేబ్ ధ్వంసం చేసిన విశ్వనాథ్ కారిడార్‌ను కూడా మోదీ ప్రభుత్వం బ్రహా్మండంగా పునర్నిర్మించిందని గుర్తు చేశారు. -
‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’
జమ్మూకశ్మీర్: ఆయోధ్యలో రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనుంది. రామమందిర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా రామమందిర ఏర్పాట్లపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాత్రిపగలు కష్టపడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్దేశంలో సోదరభావంగా తగ్గిపోతోందని దానిని పునరుద్దరించాలని అన్నారు. రాముడు కేవలం హిందువలకు మాత్రమే సంబంధించి దేవుడు కాదని.. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంబంధించిన దేవుడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నానని చెప్పారు. భగవన్ రాముడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ దేవుడని అన్నారు. ఈ విషయం ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాల్లో సైతం రాయబడి ఉందని తెలియజేశారు. అయితే రాముడు సోదరభావం, ప్రేమ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఐకమత్యంతో ఉండాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. మతాలకు సంబంధం లేకుండా అందరిని సమభావంతో చూడాలని రాముడి సందేశాల్లో ఉందని తెలిపారు. ఆయన విశ్వమానవులకు ఈ సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రాముడు చెప్పిన సోదరభావం కొరవడిందని.. ప్రజలంతా కూడా సోదరభావాన్ని పాటించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాజకీయ ప్రముఖులు హాజరుకాన్నారు. కాగా.. కొంతమంది ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం అందగా.. మరికొంత మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవటం గమనార్హం. ఇక బీజేపీ రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా మలుచుకుంటోందని ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Varanasi: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
రామ మందిర ప్రతిష్టాపన: విపక్ష నేతలకు ఆహ్వానం
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కీలక విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) అధినేత దేవేగౌడలకు ఆహ్వానాలు పంపినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు అందే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు గౌర్హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకకు హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరందుకున్నాయి. జనవరి 15 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయి. ప్రాణ ప్రతిష్ట పూజ జనవరి 16న ప్రారంభమై జనవరి 22కు ముగియనుంది. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలో భాగంగా జనవరి 17న 100 దేవతా విగ్రహాలతో శ్రీరాముడి జీవితంలోని దృశ్యాలను ప్రదర్శిస్తూ ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి వనవాసం వరకు సాగిన జీవితం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి చిత్రాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు. ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు -
అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకి జనవరి 22 ముహూర్తం..?
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 20–24 మధ్య ఉంటుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. మూడంతస్తుల్లో నిర్మాణం జరుపుకుంటున్న రామాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి నాటికి సిద్ధమైపోతుందని వెల్లడించారు. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట జరిపే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని చెప్పారు. జనవరి 20–24 మధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు దివ్యంగా ఉన్నాయని ప్రధాని రావడానికి ఏ రోజు వీలవుతుందో అదే రోజు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆ తేదీని పీఎంఒ కార్యాలయం ఖరారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మంగళవారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చారు. అందులో ఆయన పలు విషయాలు వెల్లడించారు. చదవండి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు -
ఆయోధ్య రాముడికి మర్చిపోలేని కానుక..ఏకంగా 108 అడుగుల..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా ఆ అయోధ్య రాముడి కోసం గుజరాత్‌ని వడోదరాలో తర్సాలీ గ్రామం తమ వంతుగా మర్చిపోలేని ఓ గొప్ప కానుక ఇవ్వాలనుకుంది. అందులో భాగంగా భారీ అగరబత్తి తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అంతేగాదు ఈ భారీ అగర్బత్తి కారణంగా ప్రతిరోజు రాముడికి ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందట. తొలుత ఈ భారీ అగరబత్తిని తయారు చేయాలని సంకల్పించింది విహాభాయ్ అనే రైతు. అయనకు రాముడంటే అమితమై భక్తి. ఈ నేపథ్యంలోనే ఆయన 108 అడుగులు పోడవు ధూపం తయారు చేయాలని సంకల్పించారు. అందుకోసం 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్ మెటీరియల్, 1475 కిలోల ఆవు పేడ పొడి తదితరాలను వినియోగించినట్లు విహాభాయ్ తెలిపారు. ఇలా మొత్తంగా సుమారు 3,400 కిలోల బరువు ఉన్న అగరుబత్తిని సిద్ధం కానుంది. ఆయనకు ఈ అగరుబత్తిన తయారు చేయడంలో గ్రామస్తులు కూడా తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు కావాల్సిన ముడి సరుకును, ఉపయోగించే పదార్థాలను సమకూర్చి ఆయనకు తగినంత సాయం అందించారు. ఈ విధంగా అక్కడున్న వారంతా రాముడిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అంతేగాదు ఈ భారీ అగరుబత్తి తయారయ్యిన తదనంతరం డిసెంబర్ 2023 కల్లా భారీ ఊరేగింపుగా రామజన్మ భూమి అయోధ్యకు తరలిస్తామని ఆనందంగా చెబుతున్నారు విహాభాయ్. ఈ భారీ పంచద్రవ్య ధూపదీపం(అగర్బత్తి) తయారీ పనులు కూడా తుదిదశకు చేరుకున్నట్లు వెల్లడించారు విహాభాయ్. (చదవండి: ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో? దశరథుని మాటల్లో..) -
అయోధ్యలో 18 లక్షల ప్రమిదలతో దీపోత్సవం
అయోధ్య: అయోధ్యలో ఆదివారం జరిగే దీపోత్సవ్‌లో 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. దీపావళి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. సరయు నది ఒడ్డున రామ్ కి పైడి వద్ద 22 వేల మంది వలంటీర్లు 15 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగిస్తారని అయోధ్య డివిజనల్ కమిషనర్ నవ్‌దీప్ రిన్వా చెప్పారు. మిగతా ప్రమిదలను ప్రముఖ కూడళ్లు, ప్రాంతాల్లో వెలిగిస్తారన్నారు. లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఉంటాయన్నారు. బాణాసంచా కాలుస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన కళాకారులు రామ్‌లీలా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఆదివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని మోదీ రామాలయంలో పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేస్తారని పేర్కొంది. సరయు తీరంలో హారతిలో పాల్గొంటారని, దీపోత్సవ్ను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది. చదవండి: గుంతల రోడ్డు.. బురద నీటిలో స్నానం చేసి గ్రామస్థుల నిరసన -
తీరని శోకం.. రాములవారి భజనలో అపశ్రుతి..
కొణిజర్ల: పండుగపూట విషాదం నెలకొంది. ఆలయంలోకి బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లి పాడులో ఆదివారం రాత్రి చోటు చేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు అభయాంజనేయ స్వా మి దేవాలయంలో ఏర్పాటు చేసిన భజనకు తుమ్మలపల్లికి చెందిన 25 మంది వచ్చారు. కొందరు పిల్లలను వెంటబెట్టుకొచ్చారు. పెద్ద లు భజన చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటున్నా రు. రాత్రి 9 దాటాక ఖమ్మం నుంచి దిద్దుపూడికి వేగంగా వెళ్తున్న బొలేరో ఆలయ సమీపానికి రాగానే అదుపు తప్పింది. పక్కన ఉన్న వి ద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, అదేవేగంతో దేవాలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆలయం గో డ విరిగి పక్కనే ఆడుకుంటున్న పగడాల దేదీప్య(9), పగడాల సహస్ర(7)తో పాటు ఇజ్జగాని అలేఖ్యపై పడింది. తీవ్రగాయాలైన చిన్నారులను ఖమ్మం తరలిస్తుండగా దేదీప్య, సహస్ర మృతి చెందారు. అలేఖ్య గాయాలతో బయట పడింది. వాహనం డ్రైవర్ మద్దెల పోతురాజు, వాహనంలో ఉన్న నాగటి వెంకన్న సైతం తీ వ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం తరలించారు. తీరని శోకం.. తుమ్మలపల్లికి చెందిన పగడాల ఆదినారాయణ, శిరీష దంపతులకు ఇద్ద రూ ఆడపిల్లలే. ఆదినారాయణ పెయింటర్‌గా పనిచేస్తూనే ఆలయాల్లో భజనలకు తబలా వాయిద్యకారుడిగా వెళ్తుం టాడు. పల్లిపాడులో భజనకు భార్యాభర్తలు వెళ్తూ, కుమార్తెలు దేదీప్య, సహస్రను కూడా వెంట తీసుకెళ్లారు. ఊహించని విధంగా జరి గిన ప్రమాదంలో చిన్నారులిద్దరూ మరణించడంతో ఆ దంప తుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. -
మోదీ స్వీయ నిర్బంధంలోకి వెళ్తారా?
సాక్షి, ముంబై : అయోధ్య భూమిపూజ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ హోం క్వారంటైన్లోకి వెళ్తారా అని శివసేన పార్టీ సూటిగా ప్రశ్నించింది. ప్రధాని మోదీ కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించడం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ నిలదీశారు. ఈ మేరకు ఆదివారం తమ పార్టీ పత్రిక సామ్నాలో రోక్‌తోక్ అనే తన కాలమ్‌లో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఆగస్ట్ 5 న జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజలో మహంత నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. ఆయన మాస్కు పెట్టుకోలేదు. ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. మోదీ భక్తితో గోపాల్ దాస్ చేతిని కూడా పట్టుకున్నారు. అందుకే మోదీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి’అని రౌత్ డిమాండ్ చేశారు. (చదవండి : కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్ ) అలాగే కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్‌పై కూడా సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న మేఘవాల్ వ్యాఖ్యలపై రౌత్ మండిపడ్డారు. భారత్ భాబీజీ పాపడ్ దగ్గరే ఆగిపోయిందని, రష్యా మాత్రం కోవిడ్ -19 కు వ్యాక్సిన్ కనిపెట్టి ఆత్మ నిర్భరతను చూపిందన్నారు. మనం మాత్రం ఆత్మ నిర్భర భారత్‌పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటామని కేంద్రంపై రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి : వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ) కాగా, అయోధ్య భూమి పూజలో పాల్గొన్న మహంత్ నృత్య గోపాల్ దాస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, ఆగస్ట్ 13న కోవిడ్-19 నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా క్వారంటైన్లోకి వెళ్లాలని శివసేన డిమాండ్ చేస్తోంది. -
కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్
మధుర: రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, గురువారం కోవిడ్-19 నిర్ధారణ అయింది. కృష్ణ జన్మాష్టమి వేడుకల నిమిత్తం మధుర వెళ్లిన ప్రస్తుతం ఆయనకు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని బృందం మెరుగైన చికిత్స అందిస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహంత్ ను మెరుగైన చికిత్స కోసం గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించనున్నామని మధుర జిల్లా మేజిస్ట్రేట్ రామ్ మిశ్రా వెల్లడించారు. గతవారం (ఆగస్టు 5న) ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో నిర్వహించిన రామమందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వేదికను పంచుకున్న ఈయన తాజాగా కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన రేపింది. ఇదే వేదికపై యూపీముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఉండటం గమనార్హం. కాగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు కొన్ని రోజుల ముందు, పూజారి ప్రదీప్ దాస్ సహా మరో 14 మంది పోలీసులకుకూడా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. -
కలియుగ ఊర్మిళ : 28 ఏళ్ల ఉపవాసం ముగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఓ మహిళ 28 సంవత్సరాలుగా చేస్తున్న నిరాహార దీక్షకు ముగింపు లభించనుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే 81 సంవత్సరాల మహిళ అయోధ్యలో డిసెంబర్ 6, 1992లో వివాదాస్పద కట్టడం నేలమట్టమైనప్పటి నుంచి ఉపవాస దీక్షకు పూనుకున్నారు. అయోధ్యలో రాముడికి మళ్లీ గుడి కట్టిన అనంతరం మాత్రమే ఆహారం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు.వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజు ఆమె ఎంతో ఆనందించారు. అమె కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఎంతగా వేడుకున్నా ఆమె తన ఉపవాస దీక్షను మాత్రం విరమించలేదు. తాను అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని మందిరాన్ని దర్శించడం తనకు పునర్జన్మ వంటిదని ఆమె అన్నారు. భూమిపూజ అనంతరం అయోధ్యకు వెళ్లి, సరయూ నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపవాస దీక్ష విరమిస్తానని ఊర్మిళ స్పష్టంచేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ‘‘శ్రీరాముడు తన భక్తులను ఎప్పటికీ నిరాశ పరచడు. త్రేతాయుగం నాటి శబరి అయినా ఈ యుగం నాటి ఊర్మిళమ్మ (ఊర్మిళ చతుర్వేది) అయినా! అమ్మా, మీ భక్తికి ప్రణమిల్లుతున్నాను. పూర్తి భారతదేశం మీకు వందనాలు అర్పిస్తోంది! జై శ్రీరాం!’’ అని ట్వీట్ చేశారు. -
రామాలయ పూజకు రాజకీయ రంగు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల ఆకాంక్ష అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓవైపు చకచకా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు భూమి పూజపై రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. ఆగస్ట్ 5 జరగబోయే రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, పూర్వ సంఘ్ నేతలను సైతం కీలక ఘట్టానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయ ప్రారంభ కార్యక్రమంపై భిన్న స్వరాలతో పాటు రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లౌకిక రాజ్యమైన భారతదేశంలో ఓ వర్గానికి చెందిన దేవాలయ పూజా కార్యక్రమానికి ప్రధానమంత్రి ఎలా హాజరవుతారంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలతో రాజకీయ వేడిని లేపారు. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక) మరోవైపు ఆలయ శంకుస్థాపక కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడ్డ ఉద్ధవ్ ఠాక్రే పేరు లేదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలో కరోనా ఉధృతి దృష్ట్యా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆల్‌లైన్ వేదికగా జరపాలన్న ఠాక్రే వ్యాఖ్యలపై మోహన్ భగవత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం పట్ల శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ముంబై వర్గాల సమాచారం. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శివసేన ఎంతో పాటుపడిందని, ఎన్నో కార్యక్రమాలకు ఠాక్రే పిలుపునిచ్చారని గుర్తుచేస్తున్నారు. ఇదిలావుండగా.. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆలయ నిర్మాణం చేపట్టడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం పలు వ్యాఖ్యలు చేశారు. (ప్రధాని మోదీపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు) రామాలయ నిర్మాణంతో కరోనా అంతమయిపోతుందన్న భ్రమను కొంతమంది నేతలు కల్పిస్తున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభంలో లేనిపోని హడావిడిని ప్రదర్మిస్తున్నారని బీజేపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాగా ఆగస్ట్ 5 జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటినే ఆహ్వానాలను పంపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతీ, కళ్యాస్ సింగ్, యోగి ఆదిత్యానాథ్, మోహన్ భగవత్‌లకు ఆహ్వానం పంపింది. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు సైతం హాజరవుతారని సమాచారం. -
నేను ముస్లింనే, కానీ శ్రీరామ భక్తుడిని
అయోధ్య: మహ్మద్ ఫైజ్ ఖాన్.. పేరు రీత్యా ముస్లిం, కానీ అతను శ్రీరామచంద్రుడి భక్తుడు.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం భూమి పూజను కళ్లారా వీక్షించేందుకు వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఇతను రాముడి తల్లి కౌసల్యాదేవి జన్మస్థానంగా చెప్పుకుంటున్న చత్తీస్‌గఢ్‌లోని చంద్ఖురి గ్రామవాసి. ఆయనకు హిందూ దేవుళ్లంటే అమితమైన భక్తిగౌరవాలు. ఎంతోమంది దేవుళ్లను స్మరించుకుంటూ పరవశించిపోతాడు. ఎన్నో ఏళ్ల నుంచి కల గంటున్న అయోధ్య రామమందిరానికి పునాదులు పడుతుండటంతో భూమి పూజకు వెళ్లేందుకు కాలినడకన బయలు దేరాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌కు చేరుకున్నాడు. (ఆగస్టులో రామాలయం పనులు) ఈ సందర్భంగా ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. "ఇలా ఆలయాలను సందర్శించడం నాకు తొలిసారేం కాదు. 1500 కి.మీ నడిచి ఎన్నో గుళ్లు, ఆశ్రమాల్లో బస చేశాను. వీటితో పోలిస్తే ఈ ప్రయాణం కేవలం 800 కిలోమీటర్లు మాత్రమే. ఇప్పటివరకు ఏ ఒక్కరూ నాకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. నేను ముస్లింనే.. కానీ, మా పూర్వీకులు హిందువులు. పాకిస్తాన్ జాతీయ కవి అల్లామా ఇక్బాల్.. రాముడిని భారత దేశానికే దేవునిగా పేర్కొన్నారు. అందుకే నా భక్తి కొద్దీ కౌశల్యా జన్మస్థలమైన చంద్ఖురి నుంచి అయోధ్యకు మట్టి తీసుకెళ్తున్నాను" అని తెలిపారు. కాగా అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రామమందిర నిర్మాణానికి వచ్చే నెల 5న భూమి పూజ చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరు కానున్నారు. (రామాలయం పునాది, కరోనా అంతానికి నాంది) -
‘రామయ్య తిరిగొచ్చిన ఆ రోజే దీపావళి’
లక్నో: భవ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగే రోజున దీపావళి నిర్వహిస్తామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. భూమి పూజ జరిగే ఆగస్టు 5 ను శ్రీరాముడు అయోధ్యకు తిరిగొచ్చిన రోజుగా భావించి ఈ వేడుక నిర్వహిస్తామని ప్రకటించారు. ఆగస్ట్ 4, 5వ తేదీల్లో అయోధ్యలోని అన్ని ఆలయాలు, ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. రామమందిర భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం ఆయన అయోధ్యలో పర్యటించారు. భూమిపూజ జరిగే ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. తర్వాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులతో సమావేశమయ్యారు. ఆగస్టు 5 న ప్రధాని మోదీ చేతులమీదుగా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరగనున్నది తెలిసిందే. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక) -
ఆయోధ్య ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు
-
రామ మందిరం ఎలా వుండాలంటే...
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు చాలా సంతోషాన్ని కలిగించిందనీ, రాముడు ఉత్తరప్రదేశ్‌లోని నగరంలోనే జన్మించాడనేది నిరూపితమైందని వ్యాఖ్యానించారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. రామమందిరాన్ని నిర్మించడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశంపై స్వరూపానంద స్పందిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే ఉందని వ్యాఖ్యానించారు. అయితే, అయోధ్యలో అనేక దేవాలయాలున్నాయని సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీం ఆదేశాలపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రతిపాదిత రామమందిరం డిజైన్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా వెలుగొందుతున్న కంబోడియాలోని "అంగ్కోర్ వాట్ దేవాలయం" అంత ఘనంగా, అంత విశాలంగా ఉండాలని స్వరూపానంద సరస్వతి అభిలషించారు. -
‘బంగారు ఇటుకలతో రామ మందిర నిర్మాణం’
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో నిర్మించబోయే రామమందిర నిర్మాణంలో పూర్తిగా బంగారపు ఇటుకలు వాడాలని హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ‘రామ మందిర నిర్మాణంపై త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు రానుంది. మందిర నిర్మాణానికి అనుకూలంగానే తీర్పు రాబోతుంది. మందిరాన్ని పూర్తిగా బంగారపు ఇటుకలతో నిర్మించాలి’ అని డిమాండ్ చేశారు. కాగా భారత రాజకీయాలను ప్రభావితం చేయగల ‘రామ జన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదం’ కేసు తీర్పు నవంబర్‌లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థల వివాదానికి సంబంధించి కేసులో ఇరు పక్షాల తరఫున వాదనలను అక్టోబర్ 18కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇరుపక్షాలను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసు తీర్పు మరో రెండు నెలల్లో వెలువడనుంది. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా ఇరుపక్షాల వారు వివాదాన్ని పరిష్కరించుకోవాలనుకుంటే అందుకు తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. -
బీజేపీకి వీహెచ్‌పీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ బీజేపీకి షాక్ ఇచ్చింది. రామమందిర నిర్మాణాన్ని మేనిఫెస్టోలో పెడితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని స్పష్టంచేసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న వీహెచ్‌పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమకు అన్ని దారులు మూసేసిందని.. రామ మందిరాన్ని మేనిఫెస్టోలో చేర్చగలిగితే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రామమందిరంపై చట్టం తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 31న వీహెచ్‌పీ ధర్మ సన్సద్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో...అలోక్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా వీహెచ్‌పీ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. అయోధ్య కేసును సుప్రీంకోర్టులో అడ్డుకుంటోంది కాంగ్రెస్ ఎంపీలేనని గుర్తుచేశారు. రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. -
రాజ్‌నాథ్ ప్రసంగాన్ని అడ్డుకున్న రామభక్తులు
లక్నో: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఉత్తర ప్రదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం లక్నోలో ఆదివారం పర్యటించిన ఆయనకు రామభక్తులు ఊహించని ఝలక్ ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడుతుండగా.. ‘‘అయోధ్యలో రామమందిరం నిర్మించిన వారికే తాము ఓటువేస్తాం. వారినే ఎన్నుకుంటాం’’ అంటూ నినాదాలు చేశారు. ఆయన ప్రసంగానికి అడ్డుపడి ఒక్కింత ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో రాజ్‌నాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడున్న పోలీసులు కల్పించుకుని సంయమనం పాటించాలని కోరడంతో వారు వెనుక్కి తగ్గారు. -
ఏనాటి నుంచో ఈనాటి ‘ఈ బంధం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో రాజకీయాలకు, మతానికి మధ్యనున్న తెర క్రమంగా తొలగిపోతోంది. ఇక మనది లౌకిక రాజ్యాంగం అనడానికి వీల్లేకుండా అర్థం మారిపోతోంది. పొరుగునున్న భూటాన్ దేశం మత రాజకీయ వ్యవస్థకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు వేస్తే అందుకు పూర్తి విరుద్ధంగా భారత్ లౌకికవాద ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వస్తి చెప్పి మత వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలకు మతానికి మధ్య ఆమడ దూరం ఉండాలని భావించి అలా ఉంచేందుకు ప్రయత్నించారు. రాజకీయ నాయకులు స్వాములను, సాధువులను సందర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడంతో మొదలైన రెండింటి మధ్య బంధం, స్వాములనే ఎన్నికల్లో నిలబెట్టి, వారి ఆదేశాలను ఆచరించే స్థాయికి పెనవేసుకుపోయింది. పీఠాలు, పీఠాధిపతుల వద్దకే కాకుండా రాజకీయ నాయకులు కర్ణాటకలోని మఠాలు, పంజాబ్, హర్యానాలోని డేరాలను కూడా సందర్శిస్తుంటే వారే ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలో ప్రజలకు సూచించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా మత రాజకీయాలను ఆచరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లినా దేవాలయాలను సందర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివాలయాలు తిరుగుతూ క్షీరాభిషేకాలు చేస్తున్నారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా కేంద్రంలో చంద్రస్వామి నిర్వహించిన పాత్రను మనం మరచిపోలేం. యోగా గురువు రామ్‌దేవ్, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌లు బీజేపీకి మద్దతుగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర తెల్సిందే. ఆ ఎన్నికల సందర్భంగా వారు సూచించిన అభ్యర్థులకు కూడా బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ తూర్పు ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు మహేశ్ గిరి ఇంతకుముందు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఎన్నికల రాజకీయాల కోసం మతాలను ఉపయోగించుకోవడం ఇటు భారతీయ జనతా పార్టీకి, అటు శిరోమణి అకాలీ దళ్‌కు కొత్త కాదు. బీజేపీ హిందూ మత పార్టీ అని, అలాంటప్పుడు హిందూత్వ ఎజెండాను దాచుకోవాల్సిన అవసరం లేదని ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గోరక్నాథ్ మఠం పీఠాధిపతి ఆదిత్యనాథ్ యోగి, అటు పీఠాధిపతిగా, ఇటు యూపీ ముఖ్యమంత్రిగా రెండు పదవులు నిర్వహిస్తున్నారు. అందుకేనేమో పాపం! ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి సమయం దొరకడం లేదు. ఉమాభారతి నుంచి మొదలు పెడితే సాధ్వీ నిరంజన్ జ్యోతి, స్వామి ఆదిత్యనాథ్ వరకు, సాక్షి మహరాజ్ నుంచి సత్పల్ మహరాజ్ వరకు బీజేపీలో స్వాములు జాబితా చాంతాడులా పెరిగిపోతోంది. మొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదుగురు హిందూ గురువులను పిలిపించి ఏకంగా మంత్రి హోదాను కల్పించారు. నర్మదా నది ప్రాంతంలో జల వనరులను, అడవులను రక్షించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వారితోని ఓ కమిటీని వేశారు. నర్మదా నది వెంట అక్రమ మైనింగ్‌ను అరికట్టకపోతే తాను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని హెచ్చరించిన నామ్‌దేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబుకు నలుగురితోపాటు మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాబాలను మంచి చేసుకోవడం మంచిదని మన శివరాజ్ సింగ్ చౌహాన్ భావించారు. ఢిల్లీలో నవంబర్ 4,5 తేదీల్లో అఖిల భారతీయ సంత్ సమితి ఏర్పాటు చేసిన సమ్మేళనానికి 124 తెగలకు చెందిన మూడువేల మంది సాధువులు హాజరై అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తీర్మానించడంతోపాటు ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. 2019, మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 2019, జనవరి–మార్చి మధ్యన జరుగనున్న మహా కుంభమేళాకు ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి అత్యంత ఆర్భాటంగా నిర్వహించాలని పాలకపక్షం బీజేపీ నిర్ణయించినట్లు తెల్సింది. భూటాన్‌లో ఒకప్పుడు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో బౌద్ధ మతం ఉండేది, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా బౌద్ధ గురువులు జోక్యం చేసుకునేవారు. 2008లో భూటాన్‌లో తొలిసారిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. నాటి నుంచి అక్కడ మత గురువులు ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, ఎన్నికల వ్యవహారాల్లోనే జోక్యం చేసుకోవడం లేదు. వారికి ఓటు వేసే హక్కు కూడా లేదు. రాజకీయాలకు మతం అతీతంగా ఉండాలనే దృష్టితో మత గురువులు రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఆ దేశానికి భిన్నంగా మన మత గురువులు రాజకీయాల్లోకి వస్తున్నారు. మున్ముందు పార్లమెంట్లో వీరి సంఖ్య పెరిగితే ‘జై శ్రీరామ్’ నినాదాలతో పార్లమెంట్ హాలు మారుమోగి పోవచ్చు. ఇక అక్కడ ప్రార్థనలు, పూజలు కూడా మొదలు వెడితే ప్రజలు కూడా ఎంచక్కా భక్తి ఛానళ్లను కట్టేసి పార్లమెంట్ ఛానల్‌ను చూస్తూ పారవశ్యంతో తరించవచ్చు. -
సుప్రీం కోర్టు మాది; బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
లక్నో: రామ మందిరం విషయంలో బీజేపీ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మంత్రి ముకుత్ బిహారీ వర్మ మాట్లాడుతూ..‘ బీజేపీ హామీ ఇచ్చినట్టుగానే అయోధ్యలో రామ మందిరం నిర్మించి తీరుతాం.. ఎందుకంటే సుప్రీం కోర్టు మాది’ అని వ్యాఖ్యానించారు. బహ్రయిచ్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి ప్రణాళికతో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. తప్పకుండా రామ మందిరం నిర్మించి తీరుతాం. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.. సుప్రీం కోర్టు మాది. న్యాయవ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, దేశం అలాగే రామ మందిరం కూడా మాదే’నని పేర్కొన్నారు. ఈ కామెంట్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వర్మ వెనక్కితగ్గారు. సుప్రీం కోర్టు మాది అంటే దేశ ప్రజలందరిది అనే ఉద్దేశంతో అన్నానని.. మాది అంటే తమ ప్రభుత్వానిది కాదని వివరణ ఇచ్చారు. గతంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మౌర్య మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకొస్తుందని అన్నారు. అన్ని దారుల మూసుకుపోతే తాము ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
‘ఒవైసీ, బాబ్రీ కమిటీతో రాహుల్ కుమ్మక్కు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, ఒవైసీ తదితరులతో... రాహుల్ కుమ్మక్కయ్యారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రాహుల్ పూర్తిగా బాబర్ భక్తుడని, ఖిల్జీ వారసుడని వ్యాఖ్యానించారు. బాబర్ రామాలయాన్ని ధ్వంసం చేస్తే ఖిల్జీ సోమ్నాధ్ దేవాలయాన్ని ఛిద్రం చేశారని, నెహ్రూ వారసులు దేశంపై దండెత్తిన ఇస్లాం పాలకులకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపిస్తున్న కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసులో కోర్టు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే కారణంగా నిర్ణయాన్ని సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జులై 2019 వరకూ వాయిదా వేయాలని సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరిన నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.