Ranarangam Movie
-
Maya Nelluri: కళల్లో రాణించాలన్నదే నా కల!
మాయా నెల్లూరి ఫిల్మ్ ఆర్టిస్ట్. రణరంగం, తిమ్మరుసు చిత్రాలలోనూ అనగనగా (వెబ్‌సీరీస్), కృష్ణ ఘట్టంలో కథానాయికగానూ నటించింది. చిత్రకారిణి.. పురాణేతిహాసాల మూలాంశాలతో ఆకట్టుకునే పెయింటింగ్స్ వేస్తుంది. రైటర్.. ‘స్టార్ స్టైల్ ’ పేరుతో 80 ఏళ్ల సినిమా తారల ఫ్యాషన్స్‌ని పుస్తకం రూపంలో తీసుకువచ్చింది. సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకున్న మాయా నెల్లూరి హైదరాబాద్ అమ్మాయి. మల్టీటాలెంటెడ్ గర్ల్‌గా పేరుతెచ్చుకున్న ఈ హార్టిస్ట్ను కలిసినప్పుడు గలగలా నవ్వుతూ సినిమాయే తన ప్రపంచమని, సాధించాలనుకుంటున్న కలల గురించి ఎన్నో విశేషాలను ఇలా మన ముందుంచింది...‘మా అమ్మానాన్నలు నేను జాబ్ చేయాలనుకున్నారు. నా ఇష్టం మాత్రం సినిమా రంగం వైపే ఉంది. అమ్మ న్యూజిలాండ్‌లో ఆప్తమాలజిస్ట్. దీంతో చిన్నప్పుడే మా కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడి΄ోయింది. న్యూజిలాండ్‌లోనే సైకాలజీలో డిగ్రీ చేశాను. సినిమా అంటే ఉన్న ఇష్టంతో అమ్మ వాళ్లను ఒప్పించి తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సౌత్ స్కోప్ మ్యాగజైన్‌కు ఆర్టికల్స్ రాసేదాన్ని. అక్కణ్ణుంచే నాకు సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా, సినిమాలోనూ నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. స్టార్స్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ‘ఐడియల్ బ్రెయిన్’కి రైటర్‌గానూ ఉన్నాను.80 ఏళ్ల ‘స్టార్ స్టైల్’బామ్మల కాలం నుంచి వింటున్న కథానాయికల ఫ్యాషన్‌ని ఒక చోట కూర్చితే బాగుంటుందనుకున్నాను. తెలుగు సినిమా ఆన్‌స్క్రీన్ ఫ్యాషన్ గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే ‘స్టార్ స్టైల్’ బుక్ బాగా ఉపయోగపడుతుంది. సినీతారల ఫ్యాషన్, వారి స్టైల్స్ గురించి తెలుసుకోవడం, సేకరణకు నాలుగైదేళ్ల సమయం పట్టింది. ఈ రీసెర్చ్కోసం 1930ల కాలం నుంచి వచ్చిన తెలుగు సినిమాలు, హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూశాను, చదివాను. ఫొటోగ్రాఫర్స్, డైరెక్టర్స్‌తో మాట్లాడాను. అలా 2012 వరకు తారల స్టైల్స్ తీసుకున్నాను. నాటి తారల్లో వాణిశ్రీ ఫ్యాషన్ అల్టిమేట్ అనిపించింది. ఆన్‌స్క్రీన్ లుక్ కోసం ఆవిడ చాలా ఎఫర్ట్ పెట్టేది అనిపించింది.‘పురాణేతిహాసాల’ పెయింటింగ్స్నా పెయింటింగ్స్‌లో స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. అమ్మ సబిత ఆధ్యాత్మికత నాలో అలాంటి పెయింటింగ్స్ వేయడానికి ప్రేరణ కలిగిస్తుంది అనుకుంటాను. కాలేజీ రోజుల నుంచి సోలో, గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో నా చిత్రాలు ప్రదర్శిస్తున్నాను. కాస్మిక్ పవర్, శివ– శక్తికి సంబంధించిన పెయింటింగ్స్ ఎక్కువ వేస్తుంటాను. బ్యాక్‌గ్రౌండ్‌లో సంస్కృత మంత్రాలతో నాదైన మార్క్ కనిపిస్తుంటుంది. యాక్టర్ సాయిధరమ్ తేజ్‌కు, డైరెక్టర్ సుధీర్ వర్మ, ఈషారెబ్బా, మేఘా ఆకాష్, హరీష్ శంకర్.. మొదలైన వారికి పెయింటింగ్ వర్క్స్ చేసిచ్చాను. హైదరాబాద్‌లో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘ఓమ్’, గ్రూప్ ఎగ్జిబిషన్ ‘జస్ట్ ఆర్ట్ షో’, ‘ది ఆర్ట్ ఎడిషన్’, ‘ఒర్కా’ వంటివి పేరు తెస్తే, ఆస్ట్రేలియా, చెన్నై, బెంగళూరులోనూ సోలో, గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో నా పెయింటింగ్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి. మైథా యాప్‌లో రెండు పురాణేతిహాస కథలకు డిజిటల్ డిజైన్ చేశాను.నటిగా నిరూపణకోవిడ్కు ముందు 2019లో ‘రణరంగం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత వచ్చిన ‘తిమ్మరుసు’ కూడా మంచి పేరు తెచ్చింది. కోవిడ్ టైమ్‌లో రైటింగ్, పెయింటింగ్ మీద ఎక్కువ వర్క్ చేశాను. ఇప్పుడు ‘బచ్చన్’ సినిమాలో నటిస్తున్నాను. నా ఫోకస్ మొత్తం యాక్టింగ్, రైటింగ్ మీద ఉంది. ఒక మూవీ నుంచి మరో మూవీకి వెళ్లడం అంటే ఒక జాబ్ నుంచి మరో జాబ్‌కు వెళ్లడం లాంటిదే. అలా నన్ను నేను ట్యూన్ చేసుకుంటాను. ఆన్‌స్క్రీన్‌కు నా ఇతర వర్క్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ, బెస్ట్ యాక్ట్రెస్‌గా నిరూపించుకోవాలన్నదే నా కల. అలాగే మంచి స్క్రిప్ట్ రైటర్ని అవ్వాలి. పెయింటింగ్స్‌లోనూ బెస్ట్ మార్క్ తెచ్చుకోవాలి. నాకు బాగా నచ్చితే మిగతా అందరికీ నచ్చుతుందని నమ్ముతాను. నేను పెట్టే ఎఫర్ట్ పెడుతుంటాను. ఆ రిజల్ట్ ఎలా వచ్చినా అంగీకరిస్తాను’’ అంటూ నవ్వుతూ తన మల్టీ వర్క్స్ గురించి వివరించింది ఈ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఒక జానర్‌కి ఫిక్స్ అవ్వను
‘‘ఒక జానర్‌కి, ఒక స్టైల్‌కి ఫిక్స్ అవడానికి ఇష్టపడను. సినిమా సినిమాకు జానర్స్ మార్చుకుంటూ వెళ్లడానికి ఇష్టపడతాను. ప్రతి స్క్రిప్ట్ విభిన్నంగా ఉండాలి. ఎప్పుడూ ఒకటే చేసుకుంటూ వెళ్తే ఆడియన్స్‌కు బోర్ కొట్టేస్తాం’’ అన్నారు శర్వానంద్. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా, కల్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగ ర్వాల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం గత గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా శర్వానంద్ చెప్పిన విశేషాలు. ► సినిమాకు వస్తున్న ఫీడ్‌బ్యాక్ బావుంది. రిలీజ్ రోజు ఉదయం డివైడ్ టాక్ వచ్చింది. తర్వాత యావరేజ్ అన్నారు. ఇప్పుడు ఎబౌ యావరేజ్ అంటున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ కూడా బాగాలేదు అనడం లేదు. ‘చాలా బావుంటుంది’ అంటారనుకున్నాం. ఈ రిజల్ట్ ఊహించలేదు. రివ్యూలు ఒకలా ఉన్నాయి. ప్రేక్షకులు చెబుతున్నది ఒకలా ఉంది. ఏం జరిగిందో అని విశ్లేషించుకుంటున్నాను. ఒక విధంగా హ్యాపీగా ఉంది. ఇంకో విధంగా చిన్న అసంతృప్తి. కలెక్షన్స్ పరంగా సూపర్ హ్యాపీ. రివ్యూలు కూడా ఇంకొంచెం బావుంటే కలెక్షన్స్ ఇంకా బావుండేవేమో? అని చిన్న ఆశ (నవ్వుతూ). ► విమర్శ అనేది ప్రతి ఆర్టిస్ట్‌కు అవసరం. అది విలువైనది అయితే దాన్ని తీసుకొని మనల్ని మనం మెరుగుపరచుకోవాలి. ఫ్యామిలీ సినిమాలు, కామెడీ సినిమాలు చేశాను. జానర్ మార్చుదామని ఈ సినిమా చేశాను. సుధీర్, నేను ఓ స్టైలిష్, యాక్షన్ సినిమా చేయాలనుకున్నాం. సినిమాలో స్క్రీన్‌ప్లే నాకు బాగా నచ్చింది. రెండుషేడ్స్ ఉన్న పాత్రలు ఉన్నాయి. యాక్టర్‌గా చాలెంజింగ్‌గా ఉంటుందనిపించింది. ‘ప్రస్థానం. రన్ రాజా రన్’ సినిమాల తర్వాత ‘ప్రతి ఫ్రేమ్‌లో బావున్నాను’ అని ఈ సినిమాకు అనిపించింది. ► సినిమాలో ఓల్డ్ లుక్‌కి కష్టపడలేదు. ఆ గెటప్ వేయగానే హుందాతనం వచ్చింది. యంగ్ లుక్‌లో నేను చిరంజీవి ఫ్యాన్‌లా నటించాను. ‘ఘరానా మొగుడు, అల్లుడా మజాకా’ సినిమాల్లో మేనరిజమ్స్‌ని నా స్టైల్లో ఇమిటే ట్ చేశాను. ► ‘మాకు మంచి సినిమా తీసి ఇవ్వండి’ అన్నారు నిర్మాత చినబాబు గారు. సినిమా కోసం నాగవంశీ కూడా చాలా కష్టపడ్డాడు. ఈ బ్యానర్ నుంచి మంచి సినిమాలే వస్తాయి. కుదిరితే ఈ బ్యానర్లో మళ్లీ చేస్తా. ► నెక్ట్స్ ‘96, శ్రీకారం’ సినిమాలు చేస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. ‘96’ షూటింగ్ సగం వరకూ వచ్చింది. ► ‘రణరంగం’కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సురేఖ ఆంటీ (చిరంజీవి సతీమణి) ఫోన్ చేసి ‘చాలా అందంగా ఉన్నావు. ఎంత బావున్నావో. 80స్ లుక్ భలే కుదిరింది’ అన్నారు. నాక్కూడా పర్సనల్‌గా సినిమాలో ఆ లుక్ చాలా ఇష్టం. ► ప్రేక్షకుడికి కొత్త కథను ఇవ్వాలంతే. కచ్చితంగా చూస్తారు. కథను ఎంత చక్కగా చెప్పగలం అన్నదే ముఖ్యం. ఈ ప్రాసెస్‌లో మేం (యాక్టర్స్) కూడా చాలా నేర్చుకుంటున్నాం. కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి. కొన్ని అవ్వవు. మా సినిమా చూడలేదంటే అది వాళ్ల తప్పు కాదు. మన తప్పు ఉంది. మంచి కథలు ఎంచుకుంటూ వాళ్లను ఎంటర్టైన్ చేయాలి. మంచి కథలు చెబుతూ, ‘యాక్టర్‌గా అన్నీ చేయగలడు’ అనిపించుకోవాలనుకుంటున్నాను. -
నాకు నేను నచ్చాను
‘‘రణరంగం’ విడుదలైన తొలిరోజు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వినిపిస్తోందన్నారు. మ్యాట్నీ షోకి యావరేజ్ అన్నారు. సెకండ్ షో పడేసరికి ఎబౌ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు ఇంకా∙చేరువ అవుతుందని నమ్ముతున్నాను’’ అని శర్వానంద్ అన్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత గురువారం విడుదలైంది. చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్న చిత్రబృందం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ అండ్ ప్రాపర్ యాక్షన్ సినిమా ఇవ్వాలని ‘రణరంగం’ సినిమా చేశాను. ఈ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన మంచి క్వాలిటీ æఫిల్మ్‌గా ‘రణరంగం’ పేరును చెబుతుంటే హ్యాపీగా ఉంది. నా కెరీర్లో ఇలాంటి మాస్ పాత్ర చేయలేదు. నాకు నేను నచ్చాను. స్క్రీన్‌ప్లే బేస్డ్ పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది. క్లైమాక్స్ అలా ఉండకపోతే రెగ్యులర్ సినిమాలా ఉండేది. సినిమాలో కల్యాణీకి, నాకు మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. మా ఇద్దరి లవ్‌ట్రాక్ నా కెరీర్లోనే బెస్ట్. చిన్న పాత్ర అయినా చేసినందుకు కాజల్‌కి థ్యాంక్స్. కలెక్షన్స్ గురించి మాట్లాడను. ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్. రణరంగం నిర్మాతలకు థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘విడుదలకు ముందే ఇది శర్వానంద్ సినిమా అని చెప్పా. మంచి ఓపెనింగ్స్ రావడానికి శర్వానే కారణం. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనకాడలేదు. ఓపెనింగ్ ట్రెండ్ ఇలానే కొనసాగితే నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అన్నారు సుధీర్ వర్మ. ‘‘రాంగ్ ఫిగర్లు (వసూళ్లు) చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఈ సినిమాకు తెలుగురాష్ట్రాల్లో తొలి రోజు ఏడున్నర కోట్ల గ్రాస్ వచ్చింది. దాదాపు నాలుగున్నర కోట్ల షేర్ వచ్చింది. ఇలానే ప్రేక్షకాదరణ కొనసాగితే భవిష్యత్ కలెక్షన్స్ బాగుంటాయనుకుంటున్నాం. ఫ్యామిలీ సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు’’ అని పీడీవీ ప్రసాద్ అన్నారు. ‘‘విజువల్స్ క్వాలిటీగా ఉన్నాయని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు దివాకర్ మణి. ‘‘జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రాజా. -
‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’
స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా రిలీజ్ అయిన శర్వానంద్ సినిమా రణరంగం. శర్వా గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటించారు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర సమర్పకుడు పి.డి.వి. ప్రసాద్ మాట్లాడుతూ... ‘కలెక్షన్లు చాలా బాగున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 7.50 కోట్ల గ్రాస్, రూ. 4.45 కోట్ల షేర్ వచ్చింది. 1985లో గిరిబాబుగారి డైరెక్షన్లో వచ్చిన రణరంగంను కూడా మేమే నిర్మించాం. అది మంచి సక్సెసయింది. ఆ సినిమా ఆడిన అనేక థియేటర్లలో ఇప్పుడు ఈ రణరంగం విడుదలవడం చక్కని అనుభవం. సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ చాలా బాగా చేశాడని అంతా ప్రశంసిస్తున్నారు. అలాగే హ్యూమన్ రిలేషన్స్‌ను బాగా చూపించారనే పేరొచ్చింది’ అన్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ ‘ఇది శర్వానంద్ సినిమా అని విడుదలకు ముందే చెప్పాను. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం శర్వానే. ఇప్పటి దాకా నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో దేనికీ రానన్ని ఫోన్లు ఈ సినిమా విడుదలయ్యాక వస్తున్నాయి. నిన్న సెకండ్ షో టికెట్లు దొరకలేదని ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. ప్రశాంతి పిళ్లై మ్యూజిక్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాతలు చాలా రిచ్‌గా సినిమాని నిర్మించారు. ఓపెనింగ్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఫిల్మ్ అవుతుంది’ అని తెలిపారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకానికి రుణపడి ఉంటా. రణరంగంకు మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇవ్వాలనుకొని, ఒక యాక్షన్ ఫిల్మ్ తియ్యాలనుకొని రణరంగం చేశాం. ఆ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సూపర్బ్ అనే పేరొచ్చింది. ఫైట్ సీన్స్‌ని వెంకట్ మాస్టర్ చాలా సహజంగా కంపోజ్ చేశారు. నా ఫ్రెండ్స్‌గా నటించిన రాజా, ఆదర్శ్, సుదర్శన్లకు మంచి పేరొచ్చింది. తనది చిన్న రోల్ అయినా.. చేసినందుకు కాజల్‌కు థాంక్స్ చెప్పుకోవాలి. సినిమా రిలీజైనప్పుడు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చింది. మ్యాట్నీకి ఫర్వాలేదన్నారు. సెకండ్ షోకు వచ్చేసరికి ఎబోవ్ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్ వచ్చి బాగా ఆడుతుందని నమ్ముతున్నా. ఇప్పటివరకూ ఈ సినిమాలో చేసినటువంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. ఇందులో నాకు నేనే నచ్చాను. రెండు దశలున్న క్యారెక్టర్‌ను చేసేప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది’ అన్నారు. -
‘రణరంగం’ మూవీ రివ్యూ
టైటిల్ : రణరంగం జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం : శర్వానంద్, కళ్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ తదితరులు సంగీతం : ప్రశాంత్ పిళ్లై నిర్మాత : సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం : సుధీర్ వర్మ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే శర్వానంద్.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రయోగాలతో అదృష్టాన్ని పరీక్షించుకునే ఈ హీరో.. ‘రణరంగం’ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో శర్వానంద్ మంచి విజయాన్ని అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం. కథ విశాఖపట్నంలో తన స్నేహితులతో కలిసి బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే దేవా (శర్వానంద్).. లిక్కర్ మాఫియాకు కింగ్‌లా మారుతాడు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేదం అయిన సమయంలో దేవా లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ.. ఎవరికి అందనంత ఎత్తుకు చేరుతాడు. ఈ క్రమంలో లోకల్ ఎమ్మెల్యే సింహాచలం(మురళీ శర్మ)-దేవాల మధ్య శత్రుత్వం పెరుగతుంది. అదే సమయంలో గీత(కళ్యాణీ ప్రియదర్శిణి)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవా.. ఓ పాప పుట్టిన తరువాత గొడవలన్నింటిని వదిలేసి స్పెయిన్‌కు వెళ్తాడు. దేవా స్పెయిన్‌కు ఎందుకు వెళ్లవలసి వచ్చింది? గీత ఏమైంది? డాన్‌గా మారిన దేవాకు అసలు శత్రువు ఎవరు? అనేది మిగతా కథ నటీనటులు తన వయసుకు కంటే ఎక్కువ ఏజ్ ఉన్న పాత్రలను, ఎక్కువ ఇంటెన్సెటీ ఉన్న పాత్రలను చేయడంలో శర్వానంద్ దిట్ట అని అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఈ చిత్రంలో యంగ్ లుక్, ఓల్డ్ లుక్‌తో పాటు నటనతో నూ మెప్పించాడు. కళ్యాణీ ప్రియదర్శన్ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ కట్టిపడేస్తాయి. తన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో.. కాజల్ ఆటలో అరిటిపండులా అయిపోయింది. ఇక మురళీ శర్మ, దేవా స్నేహితుల పాత్రలో నటించిన వారు తమ పరిధిమేరకు నటించారు. విశ్లేషణ మాఫియా డాన్ లాంటి నేపథ్యం ఉన్న సినిమాలను తెరపై ఇప్పటివరకు ఎన్నో చూశాం. అయితే అన్నిసార్లు ఈ కథలు ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చు. ఒక్కోసారి కథా లోపం కావచ్చు.. ఆ కథను చెప్పడానికి ఎంచుకున్న కథనం కావచ్చు ఇలా మాఫియా నేపథ్యంలో వచ్చిన కథలు బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. రణరంగం విషయానికొస్తే.. కథ పాతదే అయినా దానికి మద్యపాన నిషేదం అంటూ లోకల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో కథ కాస్త ముందుకు వెళ్తుంది మళ్లీ వెనక్కు వస్తుంది. ఇలా ముందుకు వెళ్తూ వెనుకకు రావడంతో ప్రేక్షకుడు కాస్త అసహనానికి లోనయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగగా.. సెకండాఫ్‌ను ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. అయితే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్‌ను అందంగా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ పాతదే కావడం, ఎంచుకున్న స్క్రీన్‌ప్లే సరిగా లేకపోడంతో రణరంగం అస్తవ్యస్తంగా మారింది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగున్నా.. కథనాన్ని మాత్రం ముందే పసిగట్టేస్తాడు ప్రేక్షకుడు. ఆడియెన్స్ ఊహకు అందేలా కథనం సాగడం మైనస్ కాగా.. సంగీతం, నేపథ్యం సంగీతం ప్రధాన బలం. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు సంగీత దర్శకుడు. 1990 బ్యాక్ డ్రాప్‌ను అందంగా తెరకెక్కించేందుకు కెమెరామెన్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెడితే బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ శర్వానంద్ సంగీతం సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ కథాకథనాలు ఎంటర్టైన్మెంట్ లోపించడం ఊహకందేలా సాగే కథనం -
శర్వానంద్ మిస్ అయ్యాడు?
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’తో పాటు శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన రణరంగం సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత వారం రిలీజ్ అయిన సినిమాల ప్రభావం పెద్దగా లేకపోవటం, ఆగస్టు 15 సెలవు కూడా కావటంతో రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయని భావించారు. అయితే ఈ అడ్వాంటేజ్‌ను శర్వా మిస్ చేసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్ విషయంలో ఒక అడుగు ముందున్న అడివి శేష్ సినిమా మీద అంచనాలను పెంచటంలో సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు ఒక రోజు ముందుగానే సినిమాను సినీ ప్రముఖులకు, మీడియాకు ప్రదర్శించటం కూడా కలిసొచ్చింది. స్పెషల్ ప్రీమియర్లతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఎవరు భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. రణరంగం విషయంలో అలాంటి సందడి కనిపించటం లేదు. సోషల్ మీడియాలోనూ రణరంగంకు సంబంధించి హడావిడి లేదు. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగటంలేదన్న టాక్ వినిపిస్తోంది. తన పాత్రకోసం ఎంతో కష్టపడే శర్వానంద్ ప్రమోషన్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది అంటున్నారు విశ్లేషకులు. -
వారికి శర్వానంద్ ఆదర్శం
‘‘ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా శర్వానంద్ ఈ స్థాయిలో ఉండటం నిజంగా గొప్ప విషయం. ఎంతోమంది యువ హీరోలకు శర్వానంద్ ఆదర్శం’’ అని హీరో నితిన్ అన్నారు. శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియ దర్శన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రి–రిలీజ్ వేడుకలో అతి«థిగా పాల్గొన్న నితిన్ మాట్లాడుతూ– ‘‘ ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో 45 ఏళ్ల వ్యక్తిగా ఎలా కనిపిస్తాడా? అనుకున్నా. కానీ పోస్టర్స్, ప్రోమోస్ చూస్తుంటే కరెక్ట్‌గా సెట్ అయ్యాడనిపిస్తోంది. డైరెక్టర్ సు«ధీర్ వర్మ మంచి టెక్నీషియన్’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. దర్శకుడు సుధీర్ వర్మ టేకింగ్ సినిమాకు అదనపు ఆకర్షణ. నేను హ్యాపీగా ఉన్నానని వంశీ చెప్పడం ఇంకా హ్యాపీ. ‘రణరంగం’ చూసిన యూనిట్ అంతా సినిమా బాగుందంటున్నారు. ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయం చెబుతారనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్. ‘‘ఇందులో హీరో శర్వానంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. శర్వా బాగా నటించారు’’ అన్నారు సుధీర్‌వర్మ. ‘‘శర్వానంద్ దగ్గర కొత్త విషయాలు నేర్చుకున్నా. అనుకున్న కథను స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్ చేశారు సుధీర్వర్మగారు. నిర్మాతల సహకారం మరవ లేనిది’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్. -
‘రణరంగం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
నాకు తెలిసిందే తీస్తా!
‘‘నేను ఏ కథ రాసినా క్రైమ్ వైపు మర్డర్ వైపు వెళ్లిపోతుంది. నాకు అలాంటి సినిమాల మీదే ఎక్కువ ఆసక్తి ఉండటం కూడా కారణం అనుకుంటా. నేను చేస్తున్న సినిమాలతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు రాని జానర్లు ట్రై చేసి హీరోల కెరీర్లు, నిర్మాతల డబ్బులు రిస్క్‌లో పెట్టదలుచుకోలేదు’’ అన్నారు సుధీర్ వర్మ. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా సుధీర్ వర్మ చెప్పిన విశేషాలు. ఈ కథను రవితేజగారితో తీయాలని సిద్ధం చేసుకున్నాను. ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యలో శర్వానంద్, నేను ఓ సినిమా చేయాలనుకున్నాం. కొన్ని కథలు అనుకున్నాం. మాటల్లో రవితేజగారి కోసం అనుకున్న కథ గురించి చెప్పాను. నచ్చి, చేస్తాను అన్నాడు శర్వా. రవితేజగారిని అడిగితే చేసుకోమన్నారు. శర్వా సినిమాల్లో నాకు ‘ప్రస్థానం’ బాగా ఇష్టం. అందులో తన పాత్ర చాలా డెప్త్‌గా ఉంటుంది. తనతో చేస్తే ఇంటెన్స్ సబ్జెక్టే చేయాలనుకున్నాను. ఈ సినిమాతో అది కుదిరింది. ఇందులో హీరో పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుంది. 40 ఏళ్ల వయసు పాత్రలో శర్వా సూట్ అవుతాడా? అని చిన్న సందేహం ఉంది. లుక్ టెస్ట్ జరిగాక పూర్తి నమ్మకం వచ్చేసింది. ఈ సినిమాకు ముందు ‘దళపతి’ టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ అది వేరేవాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. మా నిర్మాత నాగవంశీగారు ‘రణరంగం’ టైటిల్ సూచించారు. నా కెరీర్లో చాలెంజింగ్ సినిమా ఇది. ఈ సినిమా కథ 1990 నుంచి 2015 వరకూ జరుగుతుంది. 1990 కాలంలో జరిగిన సీన్లు చిత్రీకరించినప్పుడు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఓ కాలనీ సెట్‌ను హైదరాబాద్‌లో వేశాం. ‘స్వామిరారా’ తర్వాత చినబాబుగారు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పటికి వాళ్ల బ్యానర్లో చేయడానికి కుదిరింది. ఈ సినిమాకు బడ్జెట్ ఎంతైందో నాకు తెలియదు. నాగవంశీ అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నెక్ట్స్ సినిమా మాకే చేయాలి.. ఏ హీరో కావాలని అడుగుతుంటారు. సినిమా ప్రోమోల్లో కాజల్‌ను ఎక్కువ చూపించకపోవడానికి కారణం తనది చిన్న పాత్ర కావడమే. ప్రేక్షకుడు సినిమాకి వచ్చి నిరాశ చెందకూడదు. కమర్షియల్ స్టైల్లో చేసిన ‘దోచేయ్’ అనుకున్నంత ఆడలేదు. ఈ సినిమాను నాకు నచ్చిన విధంగా తీశాను. ఏమనుకున్నానో అదే తీశాను. ఏ సినిమా అయినా నాకు కంఫర్ట్‌బుల్‌గా ఉండేలా, నాకు తెలిసిందే తీస్తాను. ఈ సినిమాకు సీక్వెల్ తీయొచ్చు అనే ఐడియాను శర్వానంద్ ఈ మధ్య చెప్పాడు. ఐడియా బావుంది. చూడాలి. నెక్ట్స్ రవితేజగారితో సినిమా ఉంటుంది. ఈ సినిమా రెండేళ్ల నుంచి మేకింగ్‌లో ఉంది. సుమారు 700 రోజుల్లో మేం షూట్ చేసింది 70 రోజులు మాత్రమే. శర్వా ‘పడిపడి లేచె మనసు’ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ సినిమాలో లుక్ ఇందులో లుక్ డిఫరెంట్. అందుకే ఆలస్యం అయింది. ఈ సినిమా ఐడియాను ‘గాడ్ ఫాదర్ 2’ నుంచి తీసుకున్నాను. మనం ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందామో ముందే చెప్పేస్తే ఇది అందులో ఉంది.. ఇందులో ఉంది అని చెప్పకుండా చూస్తారని నమ్ముతాను. -
‘రణరంగం’ను వదిలేసిన మాస్ హీరో
శర్వానంద్, కల్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ డ్రామా రణరంగం. స్వాతంత్ర్యదినోత్సవ కారణంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా కథను ముందుగా రవితేజకు వినిపించారట. రవితేజ కూడా రణరంగం చేసేందుకు ఓకే చెప్పారట. అదే సమయంలో రణరంగం కథ గురించి తెలుసుకున్న శర్వానంద్ తాను హీరోగా నటించేందుకు ఇంట్రస్ట్ చూపించారు. అయితే సుధీర్ ఇప్పటికే రవితేజతో సినిమా కమిట్ అయినట్టుగా చెప్పటంతో శర్వానంద్ పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసి రణరంగం కథను తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రణరంగం సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు ప్రామిసింగ్‌గా ఉండటంతో సినిమా విజయంపై చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఉన్న రవితేజ ఇలాంటి ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్‌ను త్యాగం చేయటంపై ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
కో అంటే కోటి గుర్తుకొచ్చింది
‘‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూశా. శర్వానంద్‌ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగే ఉంది. తనకు కరెక్ట్‌గా సరిపోయింది’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సినిమా సౌండ్ కట్ ట్రైలర్‌ని రామ్‌చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘శర్వాలో కష్టపడేతత్వం ఉంది. అదే మాకు నచ్చింది. అతని చిత్రాల్లో ‘కో అంటే కోటి’ నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాణ్ణి. సౌండ్ కట్ ట్రైలర్ చూసిన తర్వాత ‘రణరంగం’ అలాంటి చిత్రం అనిపించింది. ఈ సినిమాతో సుధీరవర్మ తన ప్రతిభను మళ్లీ నిరూపించుకున్నారనిపించింది. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటంతో పాటు కొత్తగా ఉంది’’ అన్నారు. శర్వానంద్, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. -
శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్
కథకు ప్రాధాన్యం ఉండే చిత్రాలను ఎంచుకుంటూ.. ఎంచుకునే పాత్రలకు న్యాయం చేసే నటుడు శర్వానంద్. అతని కెరీర్లో ఎన్నో విభిన్న చిత్రాలు ఉన్నాయి. చివరగా పడి పడి లేచే మనసు చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మళ్లీ రణరంగం చిత్రంతో తన అదృష్టాన్ని పలకరించేందుకు రెడీ అయ్యాడు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేవిదంగా ఉంది. ట్రైలర్‌కు తోడుగా ఈ చిత్రంలోంచి స్పెషల్ సౌండ్ ట్రాక్‌ను విడుదల చేశారు. ఈ ట్రాక్‌ను మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ విడుదల చేస్తూ.. ‘సూపర్బ్..సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగావుంది.టెర్రిఫిక్ గా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. మళ్ళీ శర్వానంద్ ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలావుంది. పర్ఫెక్ట్ గా ఉంది. శర్వా లో ఉన్నది, మాకు నచ్చింది. అతనిలో ఉన్న ఇంటెన్సిటీ. అతని చిత్రాల్లో కో అంటే కోటి చిత్రం నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడీ రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన తరువాత అలాంటి చిత్రం అనిపించింది. దర్శకుడు సుధీరవర్మ ఈ చిత్రం తో తన ప్రతిభను మళ్ళీ నిరూపించుకున్నారనిపించింది. చాలా మంచి ప్లాట్ ఉన్న చిత్రం. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా బాగున్నాయి. ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టెర్రిఫిక్ గా ఉంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటం తో పాటు కొత్తగా ఉంది. డెఫినెట్ గా చిత్రం విజయం సాధించాల’ని అన్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అందుకే చిన్న పాత్ర అయినా చేశా!
‘‘ఏ సినిమాకైనా చాలా కష్టపడి పనిచేస్తా. నా పాత్రకి 100శాతం న్యాయం చేస్తా. కానీ, ఫలితం అనేది మన చేతుల్లో ఉండదు. అది ప్రేక్షకులు నిర్ణయించాలి. ఇటీవల వచ్చిన ‘సీత’ సినిమా సరిగ్గా ఆడలేదంటే ఎన్నో కారణాలుండొచ్చు. అయితే ఆ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా.. ఎటువంటి అసంతృప్తి లేదు’’ అన్నారు కాజల్ అగర్వాల్. శర్వానంద్ హీరోగా, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► ‘రణరంగం’ సినిమాలో డాక్టర్‌గా చేశా. ఈ చిత్రంలో నాది పెద్ద పాత్ర కాదు కానీ, చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కథ గ్రిప్పింగ్‌గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర నాది.. అందుకే చిన్నదైనా చేశా. ‘సీత’ సినిమాకి మెంటల్‌గా, ఫిజికల్‌గా బాగా కష్టపడ్డా. ‘రణరంగం’ చాలా ఉపశమనం ఇచ్చింది. శర్వానంద్ మంచి సహనటుడు. సుధీర్ వర్మ చక్కని ప్రతిభ ఉన్న దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి మంచి బ్యానర్లో ‘రణరంగం’ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. ► సాయంత్రం 6 గంటలకు షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక షూటింగ్స్, సినిమా విషయాల గురించి మాట్లాడను. పుస్తకాలు చదువుతాను.. యోగా, వ్యాయామాలు చేస్తా. ‘అ’ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నేను నటించనున్న సినిమాని నేను నిర్మించడం లేదు. నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో నా పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుంది. ► హిందీ ‘క్వీన్’ సినిమాని దక్షిణాదిలో రీమేక్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళంలో ఎటువంటి సెన్సార్ కట్స్ లేవు. కానీ, తమిళ్లో మాత్రం అభ్యంతరాలు చెప్పారు. దీనిపై యూనిట్ సెన్సార్ రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ► నేను ఇండస్రీకి వచ్చి 12ఏళ్లయింది. ఇప్పటికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాలు చేశా. ఈ మైలురాయిని త్వరగా చేరుకున్నాననిపిస్తోంది. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బబ్లీగా ఉండే పాత్రలు చేశా. కానీ, ఇప్పుడు బాధ్యతగా భావిస్తున్నా. ఆ మధ్య మేకప్‌లేని ఫొటోలు పోస్ట్ చేశాను. అయితే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మేకప్ అవసరమే. కానీ, వ్యక్తిగత జీవితంలో మేకప్ అవసరం లేదు.. మహిళలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని, తాము ఎలా ఉన్నా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ► చిరంజీవి సార్‌తో కొరటాల శివ దర్శకత్వం వహించనున్న చిత్రం కోసం నన్నెవరూ సంప్రదించలేదు. మళ్లీ చాన్స్ వస్తే హ్యాపీగా చేస్తా. తేజగారి దర్శకత్వంలో 3 సినిమాలు చేశా. మళ్లీ అవకాశమొచ్చినా నటిస్తా. ‘భారతీయుడు 2’లో నాది పవర్ఫుల్ పాత్ర. -
డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే
‘ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్‌మహల్ కట్టాడంటే డబ్బులు ఎక్కువై అనుకున్నా.. కొంతమంది కోసం కట్టొచ్చు.. ఖర్చు పెట్టొచ్చు, పవర్ ఉంటే సరిపోదు.. అది ఎవరిమీద ఉపయోగించాలో కూడా తెలుసుకో, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉందంటే అది డబ్బొక్కటే, మూడో ప్రపంచ యుద్ధం నీళ్ల కోసమే అంటే నమ్మలేదు.. ఇప్పుడు నమ్మక తప్పట్లేదు’... అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగులు ‘రణరంగం’ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. శర్వానంద్ హీరోగా, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘సుధీర్ వర్మ ‘రణరంగం’ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. శర్వానంద్ ఇందులో పోషించిన గ్యాంగ్‌స్టర్ పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా, ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. మంచి భావోద్వేగాలుంటాయి. హీరో జీవితంలో 1990, ప్రస్తుతకాలంలోని సంఘటనల సమాహారమే మా ‘రణరంగం’. కాకినాడలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కాజల్ అగర్వాల్, కల్యాణీల పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ పిళ్లై, కెమెరా: దివాకర్ మణి. -
అదే ఈ సినిమా మొదటి విజయం
‘‘సినిమా ట్రైలర్స్ చూసినప్పుడు మళ్లీ చూడాలని చాలా కొద్ది సార్లే అనిపిస్తుంది. ‘రణరంగం’ ట్రైలర్ చూడగానే అలా అనిపించింది’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానా యికలు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. కాకినాడలో ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు మా నాన్నగారి బలవంతం మీద ఉద్యోగం కోసం కాకినాడ వచ్చాను. ఆ ఉద్యోగం రాకూడదని అప్పట్లో ప్రార్థనలు కూడా చేశా. మళ్లీ కాకినాడకు రావడం ఇదే. నాకు ఏ ఊరితో అయినా సినిమాలతో కూడిన జ్ఞాపకాలే గుర్తుంటాయి. తొలిసారి కాకినాడకు వచ్చినప్పుడు ‘ఆదిత్య 369’ సినిమా చూశాను. శ్రీనాథ్‌అనే వ్యక్తి ద్వారా శర్వానంద్ ఎప్పట్నుంచో తెలుసు. ‘ప్రస్థానం’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. ‘రణరంగం’ సినిమాలో 40ఏళ్ల కుర్రాడిలా శర్వా బాగా నటించాడు. లేట్ ట్వంటీస్‌లో ఉన్న కుర్రాడు మిడ్ 40 ఏజ్ ఉన్న పాత్రను బాగా చేయడమే ఈ సినిమా మొదటి విజయంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో 1980లో జరిగే కథ కొంత, ఇప్పటి కాలానికి చెందిన కథ కొంత ఉంటుందన్నారు. చాలా కేర్ తీసుకుని బ్యాలెన్డ్స్‌గా తీశారనిపిస్తోంది. కల్యాణి చెప్పినట్లు సుధీర్ లవ్‌స్టోరీస్ కూడా తీయొచ్చు. సినిమా విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ను లాంచ్ చేసిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్. నేను సినిమాల్లోకి రావడానికి క్యారెక్టర్ల కోసం ప్రయత్నించే సమయంలో త్రివిక్రమ్‌గారిని కలుస్తుండేవాణ్ణి. అప్పుడు ఆయన దర్శకుడు కాలేదు. పెద్ద రైటర్. ఓ సందర్భంలో ఆయన, నేను కలిసి కారులో వెళ్తున్నప్పుడు ‘ఏదైనా సినిమాల్లో క్యారెక్టర్ ఇవ్వండి సార్’ అన్నాను. ‘నీతో చేస్తే కచ్చితంగా హీరోగానే చేస్తా. క్యారెక్టర్ అయితే ఎప్పటికీ ఇవ్వను’ అన్నారు. అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో... ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. మా ట్రైలర్ ఆడియన్స్‌కు నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. ఫస్ట్ డే ఎంత ఎనర్జీతో ఉన్నాడో లాస్ట్ డే కూడా అంతే ఎనర్జీతో వర్క్ చేశాడు శర్వా. ఏం మాట్లాడాలనుకుంటున్నానో ట్రైలర్‌తో చెప్పాం. ఏం చూపించాలనుకుంటున్నామో సినిమాలో చూపిస్తాం. మాకు సహకరించిన టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు సుధీర్ వర్మ. ‘‘కాకినాడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. త్రివిక్రమ్‌గారికి నేను అభిమానిని. శర్వా మంచి కో స్టార్. సుధీర్‌గారి గత సినిమాలు గమనిస్తే గన్స్, బ్లడ్‌లతో కొన్ని వయలెన్స్ అంశాలు ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత క్యూట్ లవ్ స్టోరీస్ కూడా ఆయన తీయగలరని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. నాకు గన్ పట్టుకోవడం నేర్పించారు. కెమెరామెన్ దివాకర్ అందమైన విజువల్స్ అందించారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, నటులు అజయ్, రాజా, సంగీత దర్శకుడు కార్తీక్, రచయితలు కృష్ణచైతన్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
పిక్చర్ పర్ఫెక్ట్
ఫ్రెండ్సంతా బీచ్ సైడ్ పార్టీకు వెళ్లారు. అక్కడ మూడ్‌కి తగ్గట్టు షాంపైన్ పొంగించారు. బీట్స్‌కి తగ్గట్టు పాటను అందుకోవాలి. వెంటనే కాజల్ ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్..’ అంటూ సాంగ్ అందుకున్నారు. దానికి తగ్గట్టు హుషారుగా నాలుగు స్టెప్పులు కూడా వేశారు. కాజల్ హుషారుని కామ్‌గా దూరం నుంచి చూస్తూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు శర్వానంద్. ఇదంతా ‘రణరంగం’ సినిమాలో మూడో సాంగ్ ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్..’ సందర్భం. కృష్ణ చైతన్య రచించిన ఈ పాటకు సన్నీ ఎం.ఆర్ స్వరాలు అందించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కాజల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణరంగం’. ఆగస్ట్ 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నట్లు.. ఈ పాటలోని కాజల్ స్టిల్ చూస్తే ‘పిక్చర్ పర్ఫెక్ట్’ అనుకుండా ఉండలేం కదూ. -
గ్యాంగ్‌స్టర్ గాయకుడాయెనే
నచ్చిన అమ్మాయి ఓర చూపు విసిరితే.. గాలికి తిరిగేవాడైనా గన్స్ చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ అయినా ఒకటే. గాల్లో తేలిపోవడమే. అదే కన్ను కొట్టి చూస్తే? ఇంకా రాకెట్లో ఆకాశాన్ని అంటేస్తారు. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ అయిన శర్వా కూడా గాయకుడిగా మారిపోయి ‘కన్ను కొట్టి చూసేనంట సుందరి...’ అంటూ పాడుకున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లు. కామన్ మ్యాన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో రెండోపాట ‘‘కన్ను కొట్టి చూసెనంట సుందరి... మనసు మీటి వెళ్లెనంట మనోహరి..’ను రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య రచించిన ఈ పాటను సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రిగ్రూజ్ ఆలపించారు. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని పీడీవి ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. -
ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!
సినిమా: కాజల్‌అగర్వాల్ ఈ పేరు చుట్టూ చాలా విషయాలు ఉంటాయి. ముఖ్యంగా బహుభాషా నటి. పంజాబీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఆదిలో హింది చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసినా, స్టార్ హీరోయిన్ను చేసింది తెలుగు, తమిళ సినిమాలే. కథానాయకిగా పుష్కర కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కాజల్ సినిమాల పరంగా అర్ధసెంచరీ కొట్టేసి నాటౌట్‌గా నిలిచింది. అయితే ఇటీవల విజయాలు మాత్రం ముఖం చాటేస్తున్నాయి. మెర్షల్ చిత్రం తరువాత ఈ అమ్మడు కోలీవుడ్‌లో సక్సెస్‌ను చూడలేదు. టాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. ఇకపోతే ఈ బ్యూటీ నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం ప్యారీస్ ప్యారీస్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలం అయినా ఇంకా తెరపైకి రాలేదు. ఇది కాజల్‌ను చాలా ఆశగా ఎదురు చూసేలా చేస్తున్న చిత్రం. కారణం హిందిలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్ కావడమే. ఇక ఈ జాణను నిరాశ పరుస్తున్న విషయం ఇండియన్–2 చిత్రం. ఇందులో కమలహాసన్‌కు జంటగా శంకర్ దర్శకత్వంలో తొలిసారిగా నటించే అవకాశం వచ్చిందనుకునేలోపే ఈ చిత్రం ప్రారంభం అయినట్లే అయ్యి ఆగిపోయింది. అందుకు పలు కారణాలు. అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో, అసలు ఉంటుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితి. ప్రస్తుతం తమిళంలో జయంరవి సరసన నటిస్తున్న కోమాలి, తెలుగులో రణరంగం అనే చిత్రం. ఈ రెండూ చిత్రాల నిర్మాణం చివరి దశకు వచ్చింది. చేతిలో మరో చిత్రం లేదు. అయినా ఈ అమ్మడు పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకు కారణం తెలుగులో రాజుగారి గది–3 చిత్రంలో నటించే అవకాశం రాగా, కాజల్ అగర్వాల్ అడిగిన పారితోషికం ఆ చిత్ర నిర్మాతలకు స్పృహ తప్పేలా చేసిందట. దీంతో అంతకన్నా తక్కువ పారితోషికానికి నటించే వేరే నటిని చేసుకుంటామని ఆ చిత్ర నిర్మాతలు వెళ్లిపోయినట్లు సమాచారం. పారితోషికం తగ్గిస్తే మార్కెట్ తగ్గిపోయిందని ప్రచారం చేస్తారనే భయమో, లేక తన క్రేజ్ ఇంకా తగ్గలేదనే ధీమానో కానీ ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట. కాగా మరో పక్క అవకాశాల గాలం కోసం కాజల్ అగర్వాల్ కొత్త కొత్తగా ఫొటో సెషన్లు తీయించుకుంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూనే ఉంది. అన్నట్టు ఇటీవల ఈ సక్కనమ్మ చాలా చిక్కి మరింత నాజూగ్గా తయారైంది. ఆ ఫొటోలే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
‘రణరంగం’ వాయిదా పడనుందా?
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా రణరంగం. శర్వ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ విషయంలోనూ చాలా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమాను ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కావటం కూడా అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పెండింగ్ ఉండటంతో సినిమా వాయిదా పడటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల శర్వానంద్ గాయపడటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు. శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. -
శర్వానంద్ కొత్త సినిమాకు ‘శ్రీకారం’
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరో సినిమాను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణరంగం పనుల్లో బిజీగా ఉన్న శర్వా, త్వరలో 96 రీమేక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల స్కైడైవింగ్ ప్రాక్టీస్‌లో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఈ యంగ్ హీరో తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించాడు. 96 రీమేక్‌తో పాటు కిశోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రూపొందిస్తున్న శ్రీకారం సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఆదివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, శశికాంత్ వల్లూరి, బుర్రా సాయి మాధవ్‌లు ముఖ్య అతిథిలుగా హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా 2020 సంక్రాంతి రిలీజ్ కానుంది. -
హీరోనా? విలనా?
కొందరికి అతను విలన్. మిగతావారికి అతను హీరో. ఇంతకీ అతను హీరోనా? విలనా? ఆ సంగతి ఆగస్ట్‌లో తెలుస్తుంది. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రణరంగం’. పీడీవి ప్రసాద్, నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ‘‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. అదే మనుషుల్ని నమ్మాలంటే ధైర్యం కావాలి. కోపాన్ని, దాహాన్ని ఒకడు శాసించే పరిస్థితుల్లో మనం ఉండకూడదు’’ అంటూ ఈ టీజర్లో శర్వానంద్ చెప్పే డైలాగులు ఓ హైలెట్. అలాగే టైటిల్, టీజర్ చూస్తుంటే సినిమా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని అర్థం చేసుకోవచ్చు. రెండు డిఫరెంట్స్ షేడ్స్‌లో శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. ఆగస్ట్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: దివాకర్ మణి, సంగీతం: ప్రశాంత్ పిళ్లై. -
‘మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి’
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రణరంగం. శర్వానంద్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. మాఫియా నేపథ్యంలో సాగే రణరంగం సినిమాలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతమందిస్తున్నాడు. -
మీకు రుణపడి ఉంటాను : శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 96 సినిమా రీమేక్ కోసం స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో శర్వా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో శర్వా భుజం ఎముక ఫ్యాక్చర్ అయింది. వెంటనే శర్వాను హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. డాక్టర్లు గురవారెడ్డి, ఆదర్శ్‌లు శర్వానంద్‌కు చికిత్స అందించారు. అభిమానుల కోసం చికిత్సకు సంబంధించి డాక్టర్ ఓ వీడియో మేసేజ్‌ను కూడా రిలీజ్ చేశారు. గాయం నుంచి త్వరగా కోలుకుంటున్న శర్వానంద్ తనకు ట్రీట్మెంట్ అందించిన సన్‌షైన్ హాస్పిటల్ వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు, డాక్టర్ గురువారెడ్డి, డాక్టర్ ఆదర్శ్‌లతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన శర్వా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రణరంగం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుండగా 96 రీమేక్ త్వరలో పట్టాలెక్కనుంది. Thank you for the warm wishes every one. Can't wait to get back in action for #Ranarangam! Dr. Guruva Reddy garu and Dr. Adarsh.. always indebted! - #Sharwanand @Rajkamal0069 @UrsVamsiShekar pic.twitter.com/HqjGYnFzRM — Team Sharwa (@TeamSharwa) 28 June 2019 -
బీచ్ బేబి
శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో శర్వానంద్ డ్యూయెల్ రోల్ చేశారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. బుధవారం కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘రణరంగం’ చిత్రంలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో బీచ్ ఒడ్డున కాజల్ ఆనందంగా సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘మను చరిత్ర’ సినిమాకు కాజల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
కష్టాల్లో శర్వానంద్ సినిమాలు
టాలీవుడ్లో యంగ్ హీరోలు వరుసగా గాయాలపాలవ్వటం ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతోంది. వరుసగా సందీప్ కిషన్, నాగశౌర్య, శర్వానంద్‌లు గాయపడటం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల మీద ప్రభావం చూపిస్తోంది. శర్వానంద్ విషయంలో పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రణరంగం షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద చాలా అనుమానాలున్నాయి. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్, అదే సమయంలో శర్వానంద్‌కు ప్రమాదం జరగటంతో రిలీజ్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. శర్వా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉండటంతో 96 రీమేక్ కూడా ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా లేదు. ఇక రణరంగం సినిమాను ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ లోపు శర్వా కోలుకొని ప్రచారంలో పాల్గొనటం అనుమానమే. ఈ పరిస్థితుల్లో చిత్రయూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.