Ranji Trophy final
-
మరోసారి రెచ్చిపోయిన శార్దూల్ ఠాకూర్
టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ రంజీల్లో చెలరేగిపోతున్నాడు. ఇటీవల తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో మెరుపు శతకం (104 బంతుల్లో 109) బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్.. ప్రస్తుతం విదర్భతో జరుగుతున్న ఫైనల్లో విధ్వంసకర అర్దసెంచరీ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. Century in the semi-final& a brilliant 75 when the team was struggling at 111-6 in finalLORD @imShard show in #RanjiTrophy2024 🔥pic.twitter.com/U1vjWvk9Ws— CricTracker (@Cricketracker) March 10, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. విదర్భ బౌలర్లు రెచ్చిపోవడంతో 224 పరుగులకే పరిమితమైంది. హర్ష్ దూబే (3/62), యశ్ ఠాకూర్ (3/54), ఉమేశ్ యాదవ్ (2/43), ఆదిత్య థకారే (1/36) ముంబై పతనాన్ని శాశించారు. ముంబై ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లాల్వాని (37) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది. ముషీర్ ఖాన్ (6), అజింక్య రహానే (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్దిక్ తామోర్ (5), షమ్స్ ములానీ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. భీకరఫామ్‌లో ఉన్న 10, 11వ ఆటగాళ్లు తనుశ్ కోటియన్ (8), తుషార్ దేశ్‌పాండే (14) ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. బ్యాటింగ్‌లో రాణించిన శార్దూల్.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భను శార్దూల్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. శార్దూల్ విదర్భ ఓపెనర్, ఇన్ ఫామ్ బ్యాటర్ దృవ్ షోరేను డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. నాలుగు ఓవర్ల అనంతరం విదర్భ స్కోర్ వికెట్ నష్టానికి నాలుగు పరుగులుగా ఉంది. -
'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను'
రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ విజేతగా అవతరించి తొలి టైటిల్ గెలిచింది మధ్యప్రదేశ్. బెంగళూరు వేదికగా ముంబైతో జరిగిన ఫైన్లలో మధ్యప్రదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ గెలుపులో హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన చంద్రకాంత్.. తమ కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవపై ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రీవాస్తవ అద్భుతమైన కెప్టెన్ అని అతడు కొనియాడాడు. శ్రీవాస్తవ వివాహానికి కేవలం రెండు రోజులు సెలవు మాత్రమే మంజూరు చేసినట్లు చంద్రకాంత్ తెలిపాడు. ‘‘గతేడాది శ్రీవాస్తవ వివాహం జరిగింది. ఏ ట్రోఫీ గెలిచినా సంతృప్తిని ఇస్తుంది. కానీ రంజీట్రోఫీ విజయం చాలా ప్రత్యేకమైనది. 23 ఏళ్ల క్రితం మధ్యపదేశ్ కెప్టెన్‌గా నేను ఇది సాధించలేకపోయాను. నేను ఇన్నాళ్లూ ఏదో కోల్పోయాను అనే బాధలో ఉన్నాను. ఇప్పుడు నా కల నేరవేరడంతో కాస్త ఉద్వేగానికి లోనయ్యాను. అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలంటే మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. గత ఏడాది శ్రీవాస్తవ పెళ్లి చేసుకోబోతున్నప్పుడు, నా దగ్గరకు వచ్చి అనుమతి అడిగాడు. అయితే తన పెళ్లికి కేవలం రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను. ఇది ఒక మిషన్ వంటింది. రోజుకి చాలా గంటల తరబడి కష్టపడాల్సి ఉంటుంది అని మా ఆటగాళ్లకు చెప్పాను. వారు కూడా చాలా కష్టపడి నా కలను నిజం చేశారు" అని చంద్రకాంత్ పండిట్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. విజయం దిశగా ఇంగ్లండ్..! -
అపూర్వ విజయం.. అద్భుతంగా సాగిన మధ్య ప్రదేశ్ గెలుపు ప్రస్థానం
ఏప్రిల్ 1999... ఇదే బెంగళూరు, ఇదే చిన్నస్వామి స్టేడియం... కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు ఆలౌట్ కాకుండా జాగ్రత్తగా ఆడుకుంటే టైటిల్ దక్కేది. కానీ అనూహ్యంగా కుప్పకూలిన మధ్యప్రదేశ్ మ్యాచ్ మరో 5.1 ఓవర్లు మిగిలి ఉండగా ఆలౌటైంది. అయితే ఈ సారి ఆ జట్టు ఎలాంటి తప్పూ చేయలేదు. భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత కూడా పట్టు జారకుండా చూసుకుంది. తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలిచింది. నాడు కెప్టెన్‌గా ఓటమి వేదన అనుభవించిన చంద్రకాంత్ పండిత్ 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే మధ్యప్రదేశ్ కోచ్‌గా విజయానందాన్ని ప్రదర్శించాడు! సీజన్ తొలి మ్యాచ్ నుంచి విజేతగా నిలిచే వరకు ఆటగాళ్ల చక్కటి ప్రదర్శనతో పాటు కోచ్‌గా చంద్రకాంత్ దూరదృష్టి, వ్యూహాలు టీమ్‌ను ముందుకు నడిపించాయి. నరేంద్ర హిర్వాణీ, రాజేశ్ చౌహాన్, అమయ్ ఖురాసియా, నమన్ ఓజా, దేవేంద్ర బుందేలా, జలజ్ సక్సేనా... సుదీర్ఘ కాలం పాటు మధ్యప్రదేశ్ జట్టుకు ఆడి తమ సర్వస్వం ధారబోసినా రంజీ టైటిల్ విజయాన్ని మాత్రం వారంతా రుచి చూడలేకపోయారు. జట్టును ఈ స్థాయికి చేర్చడంలో ఇన్నేళ్లలో వీరంతా కీలక పాత్ర పోషించారు. వారంతా గర్వపడే క్షణమిది. తాజా సీజన్లో ముగ్గురు బ్యాటర్లు ప్రధానంగా జట్టు భారాన్ని మోశారు. ఐపీఎల్ ప్రదర్శన గాలివాటం కాదని నిరూపిస్తూ రజత్ పటిదార్ (మొత్తం 658 పరుగులు) అందరికంటే ముందుండగా... యశ్ దూబే (614), శుభమ్ శర్మ (608) దేశవాళీ క్రికెట్లో ఇప్పుడు తమపై దృష్టి పడేలా చేసుకున్నారు. హిమాన్షు మంత్రి (375) కీలక సమయాల్లో రాణించగా, కోచ్ నమ్మకముంచిన 18 ఏళ్ల అక్షత్ రఘువంశీ 6 ఇన్నింగ్స్‌లలోనే 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో 295 పరుగులు చేయడం విశేషం. బౌలింగ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (32 వికెట్లు), పేసర్ గౌరవ్ యాదవ్ (23 వికెట్లు) ఆరంభంలోనే వికెట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. విడిగా చూస్తే ఏ ఒక్కరూ అసాధారణ ఆటగాళ్లు కాదు. కానీ జట్టుగా, సమష్టిగా వీరంతా సత్తా చాటడంతో మధ్యప్రదేశ్ టీమ్ కల నెరవేరింది. భారత జట్టుకు ఎంపిక కావడంతో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ టీమ్‌కు దూరమైనా ఆ ప్రభావం పడకుండా కుర్రాళ్లు చూసుకోగలిగారు. మైదానంలో జట్టులో స్ఫూర్తి నింపడంలో కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవది కూడా కీలక పాత్ర. ‘నేను ఒక ప్లేయర్‌ను చెంపదెబ్బ కొట్టినా దానికో కారణం ఉంటుంది. ఆటగాడు కూడా అర్థం చేసుకుంటాడు. ఇది నా కోచింగ్ శైలి’ అంటూ చంద్రకాంత్ పండిత్ చెప్పుకున్నారు. టైమ్ మేనేజ్మెంట్, ప్రణాళికలు, సన్నద్ధత విషయంలో ఆయన ఇచ్చిన ‘బ్లూ ప్రింట్’ను జట్టు సభ్యులు సమర్థంగా అమలు చేశారు. వికెట్ కీపర్‌గా భారత్ తరఫున 5 టెస్టులు, 36 వన్డేలు ఆడిన పండిత్ కోచింగ్ రికార్డు అద్భుతం. ముంబై చివరిసారి విజేతగా నిలిచిన 2015–16 సీజన్లో ఆయన ఆ టీమ్‌కు కోచ్‌గా ఉన్నారు. రంజీ దిగ్గజ జట్టే కాదు ఎలాంటి టీమ్‌నైనా నేను నడిపించగలను అన్నట్లుగా చాలెంజ్ చేస్తూ విదర్భ టీమ్‌కు పండిత్ వెళ్లారు. అప్పటి వరకు దిగువ స్థాయికే పరిమితమవుతూ గుర్తింపే లేని విదర్భ కూడా ఆయన మార్గనిర్దేశనంలో తొలి టైటిల్ సాధించడంతో పాటు తర్వాతి ఏడాది దానిని నిలబెట్టుకోవడం విశేషం. ఇప్పుడు కూడా అదే తరహాలో తొలి ప్రయత్నంలోనే జట్టును విజేతగా నిలపగలిగారు. తాజా గెలుపుతో మున్ముందు భారత దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ మరింతగా దూసుకుపోవడం ఖాయం. చదవండి: Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ 2022లో అదరగొట్టిన హీరోలు వీళ్లే..! -
కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్ పాత్రలో.. అందుకే ఆ కన్నీళ్లు
రంజీ ట్రోఫీ కొత్త విజేతగా మధ్యప్రదేశ్ అవతరించింది. మధ్యప్రదేశ్ జట్టుకు ఇదే మెయిడెన్ రంజీ ట్రోఫీ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1998-99 రంజీ సీజన్లో రన్నరప్‌గా నిలిచిన మధ్యప్రదేశ్ మళ్లీ 23 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్ కెప్టెన్ ఆధిత్య శ్రీవాస్తవ జట్టును విజయవంతగా నడిపించి విజయంలో ప్రత్యక్ష పాత్ర వహిస్తే.. పరోక్షంగా ఆ జట్టు కోచ్ టీమిండియా మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ కీలకపాత్ర వహించాడు. కెప్టెన్‌గా తాను సాధించలేనిది ఇవాళ కోచ్ పాత్రలో అందుకున్న సంతోషం ఆయన కళ్లలో కనబడింది. మధ్యప్రదేశ్ విజేతగా అవతరించిదని తెలియగానే కన్నీటి పర్యంతమైన చంద్రకాంత్ పండిట్ గ్రౌండ్లోకి నడుచుకుంటూ వెళ్లాడు. తమ విజయం వెనుక కోచ్ పాత్రను గుర్తించిన మధ్యప్రదేశ్ ఆటగాళ్లు చంద్రకాంత్ పండిట్‌ను తమ భుజాలపై మోసుకుంటూ గ్రౌండ్ మొత్తం కలియదిరిగారు. ఒక కోచ్‌కు ఇంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్ కాలేకపోయిన చంద్రకాంత్ పండిట్ రంజీ కోచ్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. చంద్రకాంత్ రంజీ కోచ్‌గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్‌ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్.. కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్‌గా తన లక్ష్యం నెరవేర్చుకున్నాడు. కెప్టెన్‌గా సాధించలేకపోయాడు.. కోచ్ పాత్రలో మధ్యప్రదేశ్ రంజీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది 1998-99 సీజన్లో. ఆ సీజన్లో మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా చంద్రకాంత్ పండిట్ వ్యవహరించాడు. సీజన్ ఆరంభం నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన పండిట్ సేన ఫైనల్లో కర్ణాటకతో తలపడింది. ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించినప్పటికీ.. ఆఖరి రోజు ఆఖరి సెషన్లో అనూహ్యంగా కుప్పకూలి ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రంజీ కోచ్‌గా అవతారం ఎత్తిన చంద్రకాంత్ పండిట్ గోల్డెన్ కోచ్‌గా మారిపోయాడు. ఇక చంద్రకాంత్ పండిట్ టీమిండియా తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున చంద్రకాంత్ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ ఈసారి మాత్రం అనుకున్నది సాధించింది. ఫైనల్లో ముంబైపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి రంజీ చాంపియన్‌గా అవతరించింది. 113/2 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన ముంబై 269 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించింది. హిమాన్షు మాంత్రి 37 పరుగులు చేయగా.. రజత్ పాటిధార్ 30 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏 Madhya Pradesh beat Mumbai by 6 wickets & clinch their maiden #RanjiTrophy title👍 👍 @Paytm | #Final | #MPvMUM Scorecard ▶️ https://t.co/xwAZ13D0nP pic.twitter.com/XrSp2YzwSu — BCCI Domestic (@BCCIdomestic) June 26, 2022 This is for Chandrakant Pandit, he was in tears when Madhya Pradesh lost in the 1999 Ranji Trophy final as a captain and 23 years later, he won the Ranji Trophy title for his state team as a coach. pic.twitter.com/l9GlEpjGof — Johns. (@CricCrazyJohns) June 26, 2022 చదవండి: కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్ -
Ranji Trophy 2022: చరిత్ర సృష్టించనున్న మధ్యప్రదేశ్..!
మధ్యప్రదేశ్ రంజీ జట్టు చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో ఉంది. ఫైనల్లో ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (162 పరుగులు) సాధించడం ద్వారా ఆ జట్టు తొలి రంజీ టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. రజత్ పాటిదార్ (219 బంతుల్లో 122; 20 ఫోర్లు) సూపర్ శతకంతో మధ్యప్రదేశ్ విజయానికి బాటలు వేశాడు. నాలుగో రోజు ఆటలో పాటిదార్ ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని తన జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. కాగా, రంజీల్లో మ్యాచ్ ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. 368 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన మధ్యప్రదేశ్ మరో 7 పరుగులు చేసి లీడ్‌ను సాధించి 536 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ముంబై ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకే ఆలౌటైన విషయం విధితమే. ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. 1998-99 సీజన్లో ఆ జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆ సీజన్ ఫైనల్లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించినప్పటికీ.. ఆఖరి రోజు ఆఖరి సెషన్లో అనూహ్యంగా కుప్పకూలి ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక, ప్రస్తుత సీజన్ ఫైనల్ విషయానికొస్తే ఏదో అద్భుతం జరిగితే తప్ప ముంబైకు విజయావకాశాలు లేవు. ముంబై చివరిరోజు ఆటలో మధ్యప్రదేశ్‌కు టార్గెట్ సెట్ చేసి ఆ జట్టును ఆలౌట్ చేయగలిగితేనే టైటిల్ సాధించే అవకాశం ఉంటుంది. చదవండి: Ranji Trophy Final: వారెవ్వా.. రజత్ పాటిదార్.. సూపర్ సెంచరీ! ఇక -
రంజీ ట్రోఫీ 2022 ఫైనల్.. దీపక్ చహర్‌కు వింత అనుభవం
రంజీ ట్రోఫీ 2022 భాగంగా మధ్యప్రదేశ్, ముంబై మధ్య జరుగుతున్న ఫైనల్ ఆసక్తికరంగా మారింది. మధ్య ప్రదేశ్ తొలిసారి రంజీ ట్రోపీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్య ప్రదేశ్ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగులకు ఆలౌటైంది. ముగ్గరు మధ్య ప్రదేశ్ ఆటగాళ్లు(రజత్ పాటిదార్, శుభమ్ శర్మ, యష్ ధూబేలు) సెంచరీలతో చెలరేగడంతో మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం ద్వారా మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ చాంపియన్‌గా అవతరించనుంది. ఇంతకముందు 1998-99 రంజీ సీజన్లో మధ్య ప్రదేశ్ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఫైనల్ మ్యాచ్‌ను ఆట ఆఖరి రోజున చూసేందుకు వచ్చిన సీఎస్కే స్టార్ దీపక్ చహర్‌కు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు స్టాండ్స్‌లోకి అడుగుపెట్టగానే ప్రేక్షకులు.. సీఎస్కే.. సీఎస్కే అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. చహర్ కూడా చిరునవ్వుతో అక్కడున్న ప్రేక్షకులని కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక దీపక్ చహర్ గాయంతో ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరమయ్యాడు. మెగావేలంలో రూ.14 కోట్లకు దీపక్ చహర్‌ను సీఎస్కే కొనుగోలు చేసింది. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉంటున్నాడు. Look who's here! pic.twitter.com/AkXyy7mor2 — cricket fan (@cricketfanvideo) June 25, 2022 చదవండి: కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే.. -
రంజీ ట్రోపీ 2022 ఫైనల్.. దుమ్మురేపిన యష్ దూబే, శుభమ్ శర్మ
రంజీ ట్రోపీ 2022 సీజన్లో భాగంగా ముంబైతో జరుగుతున్న ఫైనల్లో మధ్య ప్రదేశ్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఓపెనర్ యష్ దూబే 366 బంతుల్లో 133, 14 ఫోర్లు), శుభమ్ ఎస్ శర్మ(215 బంతుల్లో 116, 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలో చెలరేగారు. ఆట ముగిసే సమయానికి రజత్ పాటిదార్ 67 బ్యాటింగ్, కెప్టెన్ ఆదిత్య శ్రీ వాత్సవ 11 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ముంబై కంటే ఇంకా ఆరు పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. నాలుగో రోజు ఆటలో మధ్య ప్రదేశ్ భారీ ఆధిక్యం సాధిస్తుందా లేక చతికిలపడుతుందా అన్నది వేచి చూడాలి. అంతకముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌట్ అయింది. That's Stumps on Day 3 of the @Paytm #RanjiTrophy #Final! #MPvMUM Madhya Pradesh ended the Day at 368/3. Mumbai scalped a wicket each in the 2nd & 3rd Session. We will be back for the Day 4 action tomorrow. Scorecard ▶️ https://t.co/xwAZ13D0nP pic.twitter.com/Xoszp8yKmI — BCCI Domestic (@BCCIdomestic) June 24, 2022 -
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్..!
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతోన్న ఫైనల్లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన సర్ఫరాజ్.. జట్టు 374 పరుగుల చేయడంలోకీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 937 పరుగులు సర్ఫరాజ్ సాధించాడు. గత రంజీ సీజన్లో కూడా సర్ఫరాజ్ అద్భుతంగా రాణించాడు. అతడు 928 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 80.4 సగటుతో 2252 పరుగులు చేశాడు. "ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో అతడి ప్రదర్శనలు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అతడు గత ఏడాది భారత-ఏ జట్టు తరపున కూడా అద్భుతంగా ఆడాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. చదవండి: TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 -
సర్ఫరాజ్ సూపర్ సెంచరీ.. ముంబై 374 పరుగులకు ఆలౌట్..!
బెంగళూరు: రంజీ ట్రోఫీ సీజన్లో తొలి మ్యాచ్‌నుంచి చెలరేగుతూ వచ్చిన ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ ఫైనల్ పోరులోనూ అదే జోరును కొనసాగించాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ (243 బంతుల్లో 134; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో సత్తా చాటాడు. కఠిన పరిస్థితులను అధిగమించి అతను చూపించిన బ్యాటింగ్‌తో ప్రదర్శనతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్లో సర్ఫరాజ్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. మరో 2 అర్ధ సెంచరీలు సహా 133.85 సగటుతో సర్ఫరాజ్ ఏకంగా 937 పరుగులు సాధించాడు. గత రంజీ సీజన్ రద్దు రాగా, 2019–20 సీజన్లో కూడా సర్ఫరాజ్ 928 పరుగులు చేశాడు. ఫైనల్లో మరో ఇన్నింగ్స్ ఆడే అవకాశం వస్తే అతను 1000 పరుగులు దాటవచ్చు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ రెండో రోజు గురు వారం ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 123 పరుగులు చేసింది. హిమాన్షు మంత్రి (31) అవుట్ కాగా, యశ్(44 నాటౌట్), శుభమ్ శర్మ (41 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ మరో 251 పరుగులు వెనుకబడి ఉంది. అతనొక్కడే... రెండో రోజు ముంబై తమ ఓవర్‌నైట్ స్కోరుకు 126 పరుగులు జోడించగా...అందులో సర్ఫరాజ్ ఒక్కడే 94 పరుగులు చేశాడు. 248/5తో ముంబై ఆట కొనసాగించగా, రెండో బంతికే షమ్స్ ములాని (12) వెనుదిరిగాడు. దాంతో జట్టును ఆదుకునే భారం సర్ఫరాజ్‌పై పడింది. చివరి వరుస ఆటగాళ్లను కాపాడుకుంటూ పట్టుదలగా ఆడిన అతను మధ్యప్రదేశ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రత్యర్థి కెప్టెన్ శ్రీవాస్తవ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని నిలువరించలేకపోయాడు. కార్తికేయ బౌలింగ్‌లో నేరుగా కొట్టిన ఫోర్‌తో 190 బంతుల్లో సర్ఫరాజ్ సెంచరీ పూర్తయింది. ఆ సమయంలో గాల్లోకి ఎగిరి భావోద్వేగం ప్రదర్శించిన అతను...ఇటీవల మరణించిన పంజాబీ గాయకుడు మూసేవాలా శైలిలో తొడకొట్టి సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత తన స్కోరుకు మరిన్ని పరుగులు జోడించిన అనంతరం వేగంగా ఆడే క్రమంలో చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం మధ్యప్రదేశ్‌కు హిమాన్షు శుభారంభం అందించాడు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన అనంతరం హిమాన్షును తుషార్ అవుట్ చేశాడు. అయితే యశ్, శుభమ్ కలిసి క్రీజ్‌లో పట్టుదలగా నిలిచారు. చదవండి: TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 -
Ranji Trophy: మూడు సెంచరీలు.. సంతోషం! ఆయన వల్లే ఇదంతా!
Ranji Trophy 2021- 2022: Mumbai- Yashasvi Jaiswal: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2021-22 సీజన్లో ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తమ జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌తో సెమీస్‌లో యశస్వి రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 100, 181 పరుగులు చేయడం విశేషం. తద్వారా ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు కూడా! ఇక మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా మరో శతకం బాదే అవకాశం చేజారినా యశస్వి.. 78 పరుగులతో రాణించాడు. ఇక ఈ 20 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్.. ఈ ఎడిషన్‌లో మొత్తంగా 497 పరుగులు చేయడం గమనార్హం. నాకు గర్వకారణం ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో యశస్వి జైశ్వాల్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్‌తో కలిసి పలు ఇన్నింగ్స్‌లో ఈ కుర్ర బ్యాటర్ ఓపెనింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీలో తన ప్రదర్శ, బట్లర్‌తో అనుబంధం గురించి బీసీసీఐ ఇంటర్వ్యూలో యశస్వి మాట్లాడాడు. యశస్వి జైశ్వాల్(PC: Yashasvi Jaiswal Twitter) ఈ మేరకు.. ‘‘మూడు సెంచరీలు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరో శతకం చేజారినా.. మరేం పర్లేదు. ఒక్కోసారి ఇలా జరుగుతుంది. నిజానికి ముంబై క్యాప్ ధరించగానే నేను ఎంతో అదృష్టవంతుడినన్న భావన కలుగుతుంది. ముంబైకి ఆడుతున్నామంటే ఎల్లప్పుడూ ఎంతో జాగరూకతతో ఉండాలి. మానసికంగా దృఢంగా ఉంటేనే సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగగలం. ముంబైకి ఆడటం నిజంగా నాకు గర్వకారణం’’అని యశస్వి చెప్పుకొచ్చాడు. ఆయన వల్లే ఇదంతా ఇక తన బ్యాటింగ్ మీద జోస్ బట్లర్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు నిజంగా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బంతిని చూస్తూ.. పరిస్థితులను అంచనా వేసుకుంటూ షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇవన్నీ ఏకకాలంలో జరిగిపోవాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాన్ని పొందగలం అని అన్నాడు. ఆయన టిప్స్ ఫాలో అవుతున్నాను’’ అని యశస్వి జైశ్వాల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో 10 ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు.. 68. చదవండి: Ranji Trophy 2022 FInal: 'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ What does it mean to play for Mumbai? 🤔 How does it feel to score runs in tons? 🤔 The @josbuttler impact 👍 Aman Khan interviews @ybj_19 as he sums up the Day 1 of the @Paytm #RanjiTrophy #Final. 👌 👌 - By @ameyatilak Full interview 🎥 🔽 #MPvMUM https://t.co/1xxSOsxoEE pic.twitter.com/sqv77EY0tW — BCCI Domestic (@BCCIdomestic) June 22, 2022 50*, 181, 100, 103 👏 Yashasvi Jaiswal just loves to bat. 😋💗#MPvMUM | 📸: @bccidomestic pic.twitter.com/n64y2yLazB — Rajasthan Royals (@rajasthanroyals) June 22, 2022 -
'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇప్పటికే రంజీ ట్రోపీ 2022 సీజన్ మూడు సెంచరీలు బాదిన సర్ఫరాజ్ తాజాగా నాలుగో సెంచరీ అందుకున్నాడు. బెంగళూరు వేదికగా మధ్య ప్రదేశ్‌తో జరుగున్న ఫైనల్ మ్యాచ్‌లో కీలక సమయంలో శతకంతో రాణించాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఓపికతో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ 190 బంతుల్లో శతకం మార్క్‌ను అందుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 40 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్ రెండో రోజు ఆటలో 152 బంతులాడి అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్న సర్ఫరాజ్ తర్వాతి 50 పరుగులను మాత్రం కేవలం 38 బంతుల్లోనే అందుకోవడం విశేషం. సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు , ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా ఈ సీజన్లో ఇప్పటికే 900 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ వెయ్యి పరుగుల మార్కను అందుకునేందుకు కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాడు. కాగా ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసి కీలక సమయంలో సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఆటకు క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. 'నీ ఓపికకు సలాం.. మేము గులాం' అంటూ కామెంట్ చేశారు. ఇక 248/5 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ముంబై లంచ్ విరామం సమయానికి 8 వికెట్లు నష్టపోయి 351 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 119, తుషార్ దేశ్‌పాండే 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. మధ్య ప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 3, సారాన్ష్ జైన్ 2, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయా ఒక వికెట్ పడగొట్టాడు. 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 చదవండి: అర్థ సెంచరీతో ఆకట్టుకున్న జైశ్వాల్.. తొలి రోజు ముగిసిన ఆట టోర్నీకి ఎంపిక చేయలేదని యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం -
అర్థ సెంచరీతో ఆకట్టుకున్న జైశ్వాల్.. తొలి రోజు ముగిసిన ఆట
ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీ 2022లో భాగంగా ముంబై, మధ్య ప్రదేశ్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసింది. మొదటిరోజు ముగిసే సమయానికి ముంబై 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్‌లో యశస్వి జైశ్వాల్(163 బంతుల్లో 78 పరుగులు, 7 ఫోర్లు, ఒక సిక్సర్)తో రాణించాడు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపిన యశస్వి అదే ఫామ్‌ను ఫైనల్లోనూ కంటిన్యూ చేశాడు. జైశ్వాల్‌కు.. మరో ఓపెనర్ కెప్టెన్ పృథ్వీ షా 47 పరుగులతో సహకరించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. పృథ్వీ షా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆర్మాన్ జాఫర్(26), సువేద్ పార్కర్(18) పెద్దగా రాణించలేకపోయారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ యశస్వికి జత కలిశాడు. అయితే 78 పరుగులు చేసిన జైశ్వాల్ ఔట్ కావడంతో ముంబై 185 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ హార్దిక్ తామోర్ 24 పరుగులు చేసి ఔటవ్వడంతో ముంబై 228 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన షామ్స్ ములానీ(12 పరుగులు బ్యాటింగ్)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్(125 బంతుల్లో 40 పరుగులు బ్యాటింగ్) 5 వికెట్ల నష్టానికి 248 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించాడు. మధ్య ప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, సారాన్ష్ జైన్లు చెరో రెండు వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయ ఒక వికెట్ తీశాడు. ఇక ముంబై రంజీలో 47వ సారి ఫైనల్‌కు చేరుకోగా.. మధ్య ప్రదేశ్ మాత్రం 23 ఏళ్ల తర్వాత రెండో సారి రంజీ ట్రోపీ ఫైనల్లో అడుగుపెట్టింది. Stumps Day 1: Mumbai - 248/5 in 89.6 overs (S Z Mulani 12 off 43, S N Khan 40 off 125) #MPvMUM #RanjiTrophy #Final — BCCI Domestic (@BCCIdomestic) June 22, 2022 చదవండి: Rumeli Dhar Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ గుడ్ బై -
Ranji Trophy 2022: ముంబైను ఆపతరమా!
బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్ దిగ్గజ జట్టు ముంబై ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 46 సార్లు ఫైనల్ చేరిన ఆ టీమ్ ఐదుసార్లు మాత్రమే తుది పోరులో పరాజయం పాలైంది. మరోవైపు మధ్యప్రదేశ్ ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క రంజీ టైటిల్ కూడా లేదు. 23 ఏళ్ల క్రితం ఒకే ఒకసారి ఫైనల్ చేరిన ఆ టీమ్ ఓటమితో సరిపెట్టుకుంది. ఇప్పుడు తమ అంకెను 42కు పెంచుకునేందుకు ముంబైకి, తొలి ట్రోఫీని ముద్దాడేందుకు మధ్యప్రదేశ్‌కు అవకాశం వచ్చింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రాబోయే ఐదు రోజుల పాటు ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలుస్తుందనేది ఆసక్తికరం. బలాబలాలను బట్టి చూస్తే ముంబైది పైచేయిగా కనిపిస్తున్నా... ఈ సీజన్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన మధ్యప్రదేశ్ అంత సులువుగా ఓటమిని అంగీకరించకపోవచ్చు. ఫామ్‌లో బ్యాటర్లు... 7 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో ఏకంగా 803 పరుగులు... ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ఫామ్ ఇది. యశస్వి జైస్వాల్ (419) కూడా సత్తా చాటగా, అర్మాన్ జాఫర్, సువేద్ పార్కర్ కూడా కీలక పరుగులతో ముంబైని నడిపించారు. రజత్ పటిదార్ కీలకం... ఆదిత్య శ్రీవాస్తవ కెప్టెన్సీలోని మధ్యప్రదేశ్ జట్టులో స్టార్స్ లేకపోయినా సమష్టి తత్వమే టీమ్‌ను ఫైనల్ వరకు చేర్చింది. ఐపీఎల్లో సత్తా చాటిన రజత్ పటిదార్ (506 పరుగులు) దేశవాళీ టీమ్ తరఫున కూడా టాప్ స్కోరర్‌గా బ్యాటింగ్ భారం మోస్తున్నాడు. యశ్ దూబే (480), శుభమ్ శర్మ (462), హిమాన్షు (307) కీలక ఆటగాళ్లు. వీరిలో ఏ ఇద్దరు రాణించినా మధ్యప్రదేశ్ మెరుగైన స్థితికి చేరగలదు. ఐపీఎల్లో ముంబై తరఫున ఆకట్టుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (27 వికెట్లు) బౌలింగ్‌లో మరోసారి ముందుండి నడిపించనున్నాడు. -
సౌరాష్ట్రకు ‘జై’
గత ఏడు సీజన్లలో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా... ఒక్కసారి కూడా రంజీ ట్రోఫీ గెలవలేకపోయిన సౌరాష్ట్ర ఎట్టకేలకు విజయబావుటా ఎగరేసింది. జైదేవ్ ఉనాద్కట్ నాయకత్వంలో తొలిసారి విజేతగా అవతరించింది. సొంత మైదానంలో హోరాహోరీగా సాగిన తుది పోరులో బెంగాల్‌పై సాధించిన 44 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సౌరాష్ట్రను చాంపియన్‌ను చేసింది. చివరి రోజు నాలుగు వికెట్లతో ఆధిక్యం కోసం బెంగాల్ పోరాడినా లాభం లేకపోయింది. చివరకు రంజీ చరిత్రలో ఎక్కువ సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది. రాజ్‌కోట్: భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. జైదేవ్ ఉనాద్కట్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు మొదటిసారి విజేతగా నిలిచింది. సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం ‘డ్రా’గా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సౌరాష్ట్రకు ట్రోఫీ ఖరారైంది. చివరి రోజు 72 పరుగులు చేస్తే ఆధిక్యం అందుకునే స్థితిలో ఆట కొనసాగించిన బెంగాల్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. దాంతో మొదటి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసిన సౌరాష్ట్రకు 44 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 105 పరుగులు చేసింది. అయితే విజేత ఖరారైన నేపథ్యంలో ముందుగానే ఆటను నిలిపివేసేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఆ వెంటనే సొంత గడ్డపై సౌరాష్ట్ర సంబరాలు మొదలయ్యాయి. విజేత సౌరాష్ట్రకు రూ. 2 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది. ఉనాద్కట్ జోరు... సీజన్ మొత్తం తన అద్భుత బౌలింగ్, కెప్టెన్సీతో సౌరాష్ట్రను నడిపించిన ఉనాద్కట్ చివరి రోజు కూడా కీలక పాత్ర పోషించాడు. ఓవర్‌నైట్ స్కోరు 354/6తో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు అనుస్తుప్ మజుందార్ (151 బంతుల్లో 63; 8 ఫోర్లు)పైనే తమ ఆశలు పెట్టుకుంది. అయితే ఆరో ఓవర్లోనే ఆ జట్టుకు దెబ్బ పడింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో అనుస్తుప్ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. బ్యాట్స్‌మన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అదే ఓవర్లో మరో రెండు బంతులకే ఆకాశ్ దీప్ (0) రనౌటయ్యాడు. సింగిల్ తీసేందుకు అవకాశం లేకపోయినా షాట్ ఆడిన ఆకాశ్ ముందుకు వచ్చాడు. కీపర్ బారోత్ విసిరిన బంతి స్టంప్స్‌ను తాకలేదు. అయితే చురుగ్గా వ్యవహరించిన ఉనాద్కట్ వెంటనే దాన్ని అందుకొని వికెట్లపైకి విసిరాడు. అప్పటికీ క్రీజ్‌లో వెనక్కి రాని ఆకాశ్ వెనుదిరిగాడు. ముకేశ్ కుమార్ (5)ను ధర్మేంద్ర జడేజా పెవిలియన్‌కు పంపగా... కొద్ది సేపటికే ఇషాన్ పొరెల్ (1)ను అవుట్ చేసి ఉనాద్కట్ బెంగాల్ ఆట ముగించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర తరఫున అవి బారోత్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హార్విక్ దేశాయ్ (21), విశ్వరాజ్ జడేజా (17), అర్పిత్ వసవాద (3) వికెట్లు తీయడంలో బెంగాల్ సఫలమైంది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ చివరి బంతికి బారోత్ అవుట్ కాగానే ఇరు జట్లు ఆటగాళ్లు కరచాలానికి సిద్ధపడ్డారు. ►1 సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి. 1950–51 సీజన్ నుంచి జట్టు ఈ పేరుతో బరిలోకి దిగుతోంది. అంతకుముందు సౌరాష్ట్రకు పూర్వ రూపంగా ఉన్న, ఇదే ప్రాంతానికి చెందిన రెండు జట్లు నవానగర్ (1936–37), వెస్టర్న్ ఇండియా (1943–44) రంజీల్లో విజేతలుగా నిలిచాయి. ఆ రెండు సార్లు ఫైనల్లో బెంగాలే ఓడింది. ►12 రంజీల్లో అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది. 14 సార్లు తుది పోరుకు అర్హత సాధించిన బెంగాల్ 2 సార్లు మాత్రమే టైటిల్ అందుకోగలిగింది. బెంగాల్ ఆఖరిసారిగా 1989–90లో టైటిల్ సాధించింది. ►67 ఈ సీజన్లో జైదేవ్ ఉనాద్కట్ తీసిన వికెట్లు. రంజీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జైదేవ్ రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది బిహార్ బౌలర్ అశుతోష్ అమన్ 68 వికెట్లు పడగొట్టాడు. -
బెంగాల్‌కు 72 పరుగులు... సౌరాష్ట్రకు 4 వికెట్లు!
రాజ్‌కోట్: సౌరాష్ట్ర, బెంగాల్ మధ్య జరుగుతోన్న రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ రసకందాయంలో పడింది. ఇప్పటికే నాలుగు రోజులు గడవడంతో మ్యాచ్‌లో విజేత తేలే పరిస్థితి లేదు... అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనుండటంతో ఇరు జట్లు కూడా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో బెంగాల్‌కు 72 పరుగుల కావాల్సి ఉండగా... సౌరాష్ట్రకు 4 వికెట్లు అవసరం. నేడు ఆటకు చివరి రోజు. 291 పరుగులు వెనుకబడి... 134/3 స్కోరుతో గురువారం ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ ఆట ముగిసే సమయానికి 147 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగులు చేసింది. ప్రస్తుతం అనుస్తుప్ మజుందార్ (58 బ్యాటింగ్; 8 ఫోర్లు), అర్నబ్ నంది (28 బ్యాటింగ్; 3 ఫోర్లు, సిక్స్) క్రీజులో ఉన్నారు. ఆదుకున్న సుదీప్, సాహా అంతకుముందు నాలుగో రోజు ఆటను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ సుదీప్ చటర్జీ (81; 7 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (64; 10 ఫోర్లు, సిక్స్) నిలకడగా ఆరంభించారు. ఈ రంజీ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సాహాకు గురువారం ఆటలో అదృష్టం బాగా కలిసొచ్చింది. రెండు సార్లు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుంచి తప్పించుకున్న అతడికి... సౌరాష్ట్ర ఫీల్డర్ల నుంచి రనౌట్, క్యాచ్ రూపాల్లో రెండు లైఫ్‌లు లభించాయి. దీనిని ఆసరాగా చేసుకున్న సాహా... సుదీప్తో కలిసి నాలుగో వికెట్‌కు 101 పరుగులు జోడించాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో పాటు షహబాజ్ అహ్మద్ (16; 2 ఫోర్లు) అవుట్ అవడంతో... మ్యాచ్ మరోసారి సౌరాష్ట్ర వైపుకు మళ్లింది. ఈ దశలో జతకట్టిన అనుస్తుప్, అర్నబ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో ఉన్న హార్విక్ దేశాయ్ నేలపాలు చేయడంతో బతికి బయటపడ్డ అనుస్తుప్... ఆ తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు అర్నబ్‌తో కలిసి ఏడో వికెట్‌కు అభేద్యంగా 91 పరుగులు జోడించాడు. నేడు జరిగే ఆఖరి రోజు ఆటలో బెంగాల్ 72 పరుగులు సాధిస్తే... 30 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలుస్తుంది. చివరిసారిగా 1989–90 సీజన్లో బెంగాల్ టైటిల్ సాధించింది. అయితే పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటం... చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉండటం బెంగాల్ చారిత్రక విజయానికి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. -
రెండు వైపుల నుంచి ఒకరే అంపైరింగ్!
రంజీ ఫైనల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో సి.షంషుద్దీన్‌కు దెబ్బ తగిలింది. వికెట్ తీసిన ఆనందంలో బెంగాల్ ఫీల్డర్ ఒకరు బంతిని విసరగా దీనిని గమనించని షంషుద్దీన్ పొత్తి కడుపునకు బలంగా తగిలింది. దాంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అంపైర్‌ను సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఒక సెషన్ పాటు మరో ఆన్‌ఫీల్డ్ అంపైర్ కేఎన్ అనంతపద్మనాభన్ ప్రతీ ఓవర్‌కు మారుతూ రెండు ఎండ్ల నుంచి అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. స్థానిక అంపైర్ పీయూష్ కక్కడ్ స్క్వేర్ లెగ్ అంపైర్‌గా నిలబడిపోయారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ మ్యాచ్‌కు తటస్థ అంపైర్లు ఉండాలి. పీయూష్ సౌరాష్ట్రకు చెందినవాడు కావడంతో మెయిన్ ఎండ్ నుంచి అంపైరింగ్ చేయనివ్వలేదు. థర్డ్ అంపైర్ రవికి మాత్రమే డీఆర్ఎస్ విధానంపై అవగాహన ఉండటంతో ఆయనా మైదానంలోకి రాలేదు. చివరకు షంషుద్దీన్‌ను టీవీ అంపైర్ స్థానంలో కూర్చోబెట్టి రవి ఆ తర్వాత అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు. రంజీ ఫైనల్ నిర్వహణలో ఈ తరహా బీసీసీఐ వైఫల్యంపై విమర్శలు వచ్చాయి. ముంబై నుంచి రానున్న యశ్వంత్ బర్డే నేటినుంచి ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తారు. -
అర్పిత్ సెంచరీ: సౌరాష్ట్ర 384/8
రాజ్‌కోట్: అర్పిత్ వసవాడా (287 బంతుల్లో 106; 11 ఫోర్లు) అద్భుత సెంచరీ... చతేశ్వర్ పుజారా (237 బంతుల్లో 66; 5 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్... వెరసి బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 206/5తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 160 ఓవర్లలో 8 వికెట్లకు 384 పరుగులు చేసింది. తొలి రోజు అస్వస్థత కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పుజారా రెండో రోజు మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అర్పిత్‌తో కలిసి పుజారా సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ రెండు సెషన్లపాటు ఆడటంతోపాటు ఆరో వికెట్‌కు 380 బంతుల్లో 142 పరుగులు జోడించారు. గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన అర్పిత్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాడు. ఓవరాల్‌గా రెండో రోజు సౌరాష్ట్ర 79.1 ఓవర్లు ఆడి మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. చివరి సెషన్లో అర్పిత్, పుజారా అవుటైనా అప్పటికే బెంగాల్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం చిరాగ్ జానీ (44 బంతుల్లో 13 బ్యాటింగ్), ధర్మేంద్ర సింగ్ జడేజా (22 బంతుల్లో 13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
సౌరాష్ట్ర 206/5
రాజ్‌కోట్: తొలిసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించాలని ఆశిస్తున్న సౌరాష్ట్ర జట్టు శుభారంభాన్ని అనుకూలంగా మల్చుకోలేకపోయింది. మాజీ చాంపియన్ బెంగాల్‌తో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 80.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. భారత స్టార్ క్రికెటర్, సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా జ్వరంతో బాధపడుతుండటంతో... ఆరో నంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 24 బంతులు ఆడి ఐదు పరుగులు చేశాక అస్వస్థతతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రెండో రోజు పుజారా బ్యాటింగ్‌కు వస్తాడని సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ తెలిపాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్రకు ఓపెనర్లు హార్విక్ దేశాయ్ (111 బంతుల్లో 38; 5 ఫోర్లు), అవీ బారోట్ (142 బంతుల్లో 54; 6 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. బెంగాల్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో నిలదొక్కుకున్న ఈ జంట తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించింది. హార్విక్‌ను అవుట్ చేసి స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అవీ బారోట్‌ను ఆకాశ్‌దీప్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత విశ్వరాజ్‌సింగ్ జడేజా (92 బంతుల్లో 54; 7 ఫోర్లు), అర్పిత్ (94 బంతుల్లో 29 బ్యాటింగ్; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 50 పరుగులు జత చేయడంతో సౌరాష్ట్ర స్కోరు 150 దాటింది. చివరి సెషన్లో బెంగాల్ పేస్ బౌలర్ ఆకాశ్‌దీప్ విజృంభించడంతో సౌరాష్ట్ర మూడు వికెట్లను కోల్పోయింది. సంక్షిప్త స్కోర్లు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 206/5 (80.5 ఓవర్లలో) (హార్విక్ దేశాయ్ 38, అవీ బారోట్ 54, విశ్వరాజ్‌సింగ్ జడేజా 54, అర్పిత్ 29 బ్యాటింగ్, షెల్డన్ జాక్సన్ 14, చేతన్ సకారియా 4, ఆకాశ్‌దీప్ 3/41); బెంగాల్‌తో మ్యాచ్. -
ధ్రువ్ సెంచరీ
ఇండోర్: ఆధిక్యం చేతులు మారుతూ... రంజీ ట్రోఫీ తుది సమరం ఆసక్తికరంగా ప్రారంభమైంది. విదర్భతో శుక్రవారం మొదలైన ఫైనల్లో తొలి రోజు ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సీనియర్ బ్యాట్స్‌మన్ గంభీర్ (15)తో పాటు నితీశ్ రాణా (21), కెప్టెన్ రిషభ్ పంత్ (21) కూడా విఫలమవడంతో ఒక దశలో 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ షరాయ్ (256 బంతుల్లో 123 బ్యాటింగ్; 17 ఫోర్లు) అద్భుత శతకంతో ఆదుకున్నాడు. హిమ్మత్ సింగ్ (72 బంతుల్లో 66; 2 సిక్స్‌లు, 8 ఫోర్లు) అండగా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వీరిద్దరూ అయిదో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన హిమ్మత్... గుర్బానీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మనన్ శర్మ (13)తో ధ్రువ్ ఆరో వికెట్‌కు 36 పరుగులు జత చేశాడు. విదర్భ బౌలర్లలో థాకరే, గుర్బానీ చెరో రెండు వికెట్లు తీశారు. -
విదర్భ అద్భుతం చేస్తుందా!
ఇండోర్: పదేళ్ల తర్వాత దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని గెలుచుకోవాలని ఓ జట్టు... ఫైనల్‌కు వచ్చిన తొలిసారే టైటిల్ దక్కించుకుని చరిత్ర సృష్టించాలని మరో జట్టు తుది పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి ఇండోర్‌లో జరగనున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ఢిల్లీ, విదర్భ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశను రెండో స్థానంతో ముగించిన ఢిల్లీ క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌పై, సెమీస్‌లో బెంగా ల్‌పై విజయాలతో ఫైనల్‌కు రాగా.. ఈ సీజన్లో ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా క్వార్టర్స్ చేరిన విదర్భ అక్కడ కేరళను, సెమీస్‌లో కర్ణాటకను ఖంగుతినిపించి ఫైనల్ చేరింది. గతంలో ఏడు సార్లు రంజీ టైటిల్‌ను సాధించిన రికార్డు ఢిల్లీకి ఉంది. గంభీర్ రాణించేనా... గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, ఉన్ముక్త్ చంద్‌లతో ఢిల్లీ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై 95 పరుగులతో పాటు సెమీస్‌లో బెంగాల్‌పై సెంచరీ చేసిన సీనియర్ బ్యాట్స్‌మన్ గంభీర్‌పై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. మరో ఓపెనర్ కునాల్ చండేలా కూడా సెమీస్‌లో సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్లో నితీశ్ రాణా కూడా కీలకం కానున్నాడు. బౌలింగ్ విషయానికొస్తే పేసర్ నవదీప్ సైనీ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆకట్టుకుంటుండగా... అతనికి కర్నాల్, కుల్వంత్లు చక్కగా సహకరిస్తున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్లు వికాస్ మిశ్రా, మనన్లను ఎదుర్కోవడం ప్రత్యర్థికి సవాలే. సంచలనం సృష్టిస్తుందా... ఈ సీజన్లో ఇప్పటివరకు నిలకడగా రాణిస్తూ... ఫైనల్ చేరిన విదర్భ తొలిసారే సంచలనం సృష్టించాలని చూస్తోంది. టాపార్డర్ బ్యాట్స్మెన్లు మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. కెప్టెన్, ఓపెనర్ ఫైజ్ ఫజల్ ఈ సీజన్లో 76.63 సగటుతో 843 పరుగులు సాధించి మంచి ఊపు మీదుండగా... మరో ఓపెనర్ సంజయ్ రామస్వామి 735 పరుగులతో అతనికి అండగా నిలుస్తూ వచ్చాడు. వీరికి తోడు రంజీ రికార్డుల వీరుడు వసీం జాఫర్ ఆ జట్టుతో ఉండటం అదనపు బలం. విదర్భ కోచ్ చంద్రకాంత్, సీనియర్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్‌లకు గతంలో ముంబై తరఫున ఈ మెగా టోర్నీ గెలిచిన అనుభవం ఉండటం కలిసొచ్చే అంశం. సెమీఫైనల్లో అద్భుతంగా రాణించిన పేసర్ గుర్బానీ ఈ మ్యాచ్‌లో చెలరేగాలని ఆ జట్టు కోరుకుంటోంది. -
గుజరాత్‌కు ఆధిక్యం
రాణించిన పార్థివ్, జునేజా ముంబైతో రంజీ ట్రోఫీ ఫైనల్ ఇండోర్: తొలి రోజు బౌలర్లు రాణించగా... రెండో రోజు బ్యాట్స్‌మెన్ బా ధ్యతాయుతంగా ఆడటంతో... ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో గుజరాత్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 2/0తో రెండో రోజు బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్... ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో ఆరు వికెట్లకు 291 పరుగులు సాధించింది. కెప్టెన్ పార్థివ్ పటేల్ (90; 12 ఫోర్లు), మన్‌ప్రీత్ జునేజా (77; 11 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించి గుజరాత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను జునేజా, భార్గవ్ (45; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 69 పరుగులు జతచేశారు. ప్రస్తుతం గుజరాత్ 63 పరుగుల ఆధిక్యంలో ఉండగా... చేతిలో నాలుగు వికెట్లున్నాయి. చిరాగ్ గాంధీ (17 బ్యాటింగ్), కలారియా (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో అభిషేక్ నాయర్ మూడు వికెట్లు తీశాడు. -
తొలి రోజు గుజరాత్‌దే
ముంబై 228 ఆలౌట్ ఇండోర్: డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజే గుజరాత్ జట్టు పట్టు సాధించింది. తమ బౌలర్ల అద్భుత రాణింపుతో పటిష్ట ముంబైని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగింది. ఫలితంగా మంగళవారం ముంబై జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 83.5 ఓవర్లలో 228 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీనేజి సంచలనం పృథ్వీ షా (93 బంతుల్లో 71; 11 ఫోర్లు) తన బ్యాటింగ్ ఫామ్‌ను మరోసారి ప్రదర్శించగా.. సూర్యకుమార్ (133 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. అభిషేక్ నాయర్ (94 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపిం చాడు. ఆర్పీ సింగ్, చింతన్ గజా, రుజుల్ భట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన గుజరాత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్లో 2 పరుగులు చేసింది. క్రీజులో సమిత్ గోహెల్ (2 బ్యాటింగ్), ప్రియాంక్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. -
ఎవరు గెలిచినా చరిత్రే
42వ టైటిల్‌పై ముంబై దృష్టి తొలిసారి నెగ్గేందుకు గుజరాత్ ఆరాటం నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్ ఇండోర్: ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఏడు దశాబ్దాల ఎదురుచూపుల అనంతరం గుజరాత్ జట్టుకు అపూర్వ అవకాశం దక్కింది. తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటిదాకా ఆ జట్టు చాంపియన్‌గా నిలి చింది లేదు. అయితే ఈసారి మాత్రం విజేతగా నిలిచే అవకాశం వారి ముంగిట నిలి చింది. నేటి (మంగళవారం) నుంచి రంజీ రారాజు ముంబై జట్టుతో జరిగే తుది సమరంలో పార్థివ్ పటేల్ బృందం అమీతుమీ తేల్చుకోనుంది. అప్పుడెప్పుడో 1950–51లో ఈ జట్టు రంజీ ఫైనల్‌కు చేరినా తమ కలను నెరవేర్చుకోలేకపోయింది. అప్పటి నుంచి కనీసం రన్నరప్‌గా నిలిచే అవకాశం కూడా దక్కలేదు. 65 ఏళ్ల అనంతరం ఈసారి తమ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇక మరోవైపు రంజీ టైటిల్‌ను మంచినీళ్ల ప్రాయంలా తమ ఖాతాలో వేసుకోవడం అలవాటుగా చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. 45 సార్లు ఈ జట్టు రంజీ ఫైనల్లోకి రాగా... ఏకంగా 41 సార్లు విజేతగా నిలిచిందంటే వీరి హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివరిసారిగా 1990–91 సీజన్ ఫైనల్లో హరియాణా చేతిలో ముంబై ఓడిపోయింది. అప్పటి నుంచి తొమ్మిది సార్లు ఫైనల్‌కు చేరగా ప్రతిసారీ ముంబైనే విజేతగా నిలిచింది. బుమ్రా దూరం: బరిలోకి దిగకముందే గుజరాత్ జట్టు తమ కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కోల్పోవాల్సి వచ్చింది. ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం అతను జాతీయ జట్టులో చేరనున్నాడు. అయితే జార్ఖండ్‌తో జరిగిన సెమీస్‌లో ఆర్పీ సింగ్ తన కెరీర్లోనే అద్భుత గణాంకాలు (6/29) నమోదు చేసి ఫుల్ జోష్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చేదే. రుష్ కలారియా, మెహుల్ పటేల్ కూడా బౌలింగ్ బాధ్యతను పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్‌లో ప్రియాంక్ పాంచల్ ఇప్పటికే సీజన్లో అత్యధిక పరుగులు (1,270) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మరో ఓపెనర్ సమిత్ గోహెల్ (889 పరుగులు) కూడా మంచి ఫామ్‌లో ఉండడంతో జట్టుకు శుభారంభం అందనుంది. జునేజా, పార్థివ్‌లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. సమష్టి బలంతో బరిలోకి: సీజన్ ఆద్యంతం ఆటగాళ్లు గాయాల బారిన పడినా ముంబై జట్టు తమ రిజర్వ్ బెంచ్ సత్తా ఏమిటో ప్రత్యర్థులకు రుచి చూపించింది. సెమీఫైనల్‌కు ముందు జట్టులో చేరిన టీనేజి సంచలనం పృథ్వీ షా తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టి జట్టు విజయానికి కారకుడయ్యాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, కెప్టెన్ ఆదిత్య తారే, సిద్దేష్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ విజయ్ గోహిల్ ఇప్పటికే 27 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పేసర్లు శార్దుల్ ఠాకూర్, బల్విందర్ సంధూ కీలకం కానున్నారు. ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–4లో ప్రత్యక్ష ప్రసారం -
18 ఏళ్ల క్రితమే భారత్‌లో డేనైట్ మ్యాచ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం టెస్టు క్రికెట్లో డే నైట్ మ్యాచ్‌లు ఓ హాట్ టాపిక్. ఆటతో కాస్త పరిచయం ఉన్న వాళ్లలో ఎవర్ని కదిలించినా దీని గురించి కాస్త వింతగానో, ఆశ్చర్యంగానో మాట్లాడుకుంటున్నారు. అయితే 138 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి డే నైట్ టెస్టుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ (27న)తో రంగం సిద్ధమైతే... 18 ఏళ్ల కిందటే భారత్‌లో డే నైట్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ జరిగిందని చాలా మందికి తెలియకపోవచ్చు. 1997 ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌ను డే నైట్‌గా నిర్వహించారు. గ్వాలియర్‌లోని రూప్సింగ్ స్టేడియం ఇందుకు వేదికైంది. అయితే ఆ మ్యాచ్‌లో తెల్లబంతిని వాడారు. కానీ ఆసీస్, కివీస్ టెస్టుకు పింక్ బంతిని ఉపయోగిస్తుండటం ఒక్కటే తేడా. మామూలుగా టెస్టు మ్యాచ్‌లో లంచ్‌తో తొలి విరామం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయ్యింది. లంచ్ తర్వాత ఆట మొదలై టీకి 20 నిమిషాల పాటు తొలి బ్రేక్ ఇస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఇది 4 గంటలకు ఉంటుంది. డిన్నర్ బ్రేక్‌గా పిలవబడే ‘సూపర్ బ్రేక్’ గం.6.20 మొదలై 40 నిమిషాల పాటు ఉంటుంది. ఇక 7 గంటలకు మొదలయ్యే చివరి సెషన్ పూర్తిగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో 9 గంటల వరకు కొనసాగుతుంది. -
తడబడి... నిలబడి...
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ర్ట మొదట తడబడినా తర్వాత నిలబడింది. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయినా ఆ జట్టు కోలుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కర్ణాటకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అంకిత్ బావ్నే (172 బంతుల్లో 89 బ్యాటింగ్; 10 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. ఓపెనర్ చిరాగ్ ఖురానా (145 బంతుల్లో 64; 8 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసే సమయానికి బావ్నేతో పాటు సంగ్రామ్ అతీత్కర్ (66 బంతుల్లో 29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. కర్ణాటక బౌలర్లలో మిథున్‌కు 2 వికెట్లు దక్కాయి. కట్టడి చేసిన బౌలర్లు టాస్ గెలిచిన మహారాష్ట్ర బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే ఇబ్బంది పడ్డ ఓపెనర్ హర్షద్ ఖడివాడే (15)ను వినయ్ ఎల్బీగా పంపడంతో మహారాష్ట్ర తొలి వికెట్ కోల్పోయింది. భారత అండర్-19 కెప్టెన్ జోల్ (5) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో ఖురానా, కేదార్ జాదవ్ (44 బంతుల్లో 37; 6 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్‌లో పాండే క్యాచ్ వదిలేయడంతో ఖురానా బతికిపోగా... ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన జాదవ్ దూకుడు ప్రదర్శించాడు. అయితే అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో జాదవ్ పెవిలియన్ చేరడంతో మహారాష్ట్ర ఇబ్బందుల్లో పడింది. కీలక భాగస్వామ్యాలు లంచ్ విరామం తర్వాత క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఖురానా 126 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం కరుణ్ నాయర్ బౌలింగ్‌లో ఖురానా నిష్ర్కమించాడు. మరో వైపు ఓపిగ్గా ఆడిన బావ్నే 102 బంతుల్లో అర్ధసెంచరీని చేరుకున్నాడు. టీ బ్రేక్ అనంతరం కెప్టెన్ మొత్వాని (17) అవుట్ కావడంతో 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే అతీత్కర్తో కలిసి బావ్నే మరో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. స్కోరు వివరాలు మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: ఖడీవాలే (ఎల్బీడబ్ల్యూ బి) వినయ్ 15; ఖురానా (ఎల్బీడబ్ల్యూ బి) నాయర్ 64 ; జోల్ (సి) గౌతమ్ (బి) అరవింద్ 5; జాదవ్ (సి) గౌతమ్ (బి) మిథున్ 37; బావ్నే (బ్యాటింగ్) 89; మొత్వాని (సి) గౌతమ్ (బి) మిథున్ 17; అతీత్కర్ (బ్యాటింగ్) 29; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 272. వికెట్ల పతనం: 1-24; 2-42; 3-90; 4-144; 5-215. బౌలింగ్: వినయ్ 23-5-56-1; మిథున్ 19-6-44-2; అరవింద్ 23-6-62-1; మనీశ్ పాండే 1-0-2-0; గోపాల్ 13-0-54-0; నాయర్ 5-1-21-1; వర్మ 4-0-14-0; గణేశ్ 2-0-8-0. ఆదరణ శూన్యం సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్లో అతి పెద్ద టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్‌ను తటస్థ వేదికలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బీసీసీఐని కూడా ఆలోచనలో పడేస్తుందేమో. రంజీ ఫైనల్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అదే తరహాలో ఉంది. మ్యాచ్ ఆరంభంలో పదుల సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు ఆ తర్వాత కాస్త పెరుగుతూ వచ్చినా మొత్తంగా ఈ సంఖ్య దాదాపు 200కు మించి లేదు. ఒక స్కూల్ నుంచి 50 మంది విద్యార్థులు వచ్చినా కొద్ది సేపు తర్వాత వారంతా వెళ్లిపోయారు. ఫైనల్ చూడమంటూ హెచ్‌సీఏ ప్రవేశం కల్పించినా అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. తమ సొంత జట్టు లేకపోవడం, ఇరు జట్లలోనూ తెలిసిన ఆటగాళ్లు లేకపోవడమే ఇందుకు కారణం. దీనికన్నా ఇరు జట్లకు సంబంధించిన వేదికల్లో ఎక్కడైనా నిర్వహిస్తే కనీసం ఒక టీమ్ కోసమన్నా ప్రేక్షకులు మ్యాచ్‌కు వచ్చేవారు. ఐదుగురు సెలక్టర్లూ.... బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఐదుగురూ రంజీ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఫస్ట్ ఫ్లోర్‌లోని సీఎం బాక్స్ నుంచి వీరు మ్యాచ్‌ను తిలకించారు. బీసీసీఐ క్రికెట్ డెవలప్మెంట్ మేనేజర్ రత్నాకర్ షెట్టి కూడా ఫైనల్‌కు వచ్చారు.