ranking
-
ఇదేనా ‘దూర’దృష్టి!
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాక్ ర్యాంకింగ్‌తో ఆంధ్రా యూనివర్సిటీని అగ్రస్థానంలో నిలబెట్టగా.. ఇప్పుడు సొంత బాకా కొట్టుకునేందుకే అన్నట్టుగా మార్చేశారు. ఏయూలో ఎంఏ జర్నలిజం దూరవిద్య పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన పరీక్షలో ఏయూ వీసీ శశిభూషణరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెప్పు పొందేందుకు టీడీపీ కరపత్రికగా ఉన్న ఈనాడు గురించి ప్రశ్నలు సంధించారు.వీసీ, ఏయూ అధికారుల వ్యవహారంపై విద్యార్థులు నిర్ఘాంతపోయారు. హిస్టరీ ఆఫ్ మాస్ మీడియా పరీక్ష ప్రశ్నపత్రంలో విద్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. సెక్షన్–ఏ లో మొదటి ప్రశ్నలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ 4 మార్కులు ప్రశ్న ఇచ్చారు. ఇందులో ఎనిమిది టాపిక్స్ ఇవ్వగా.. అందులో ఏడు మాత్రం సిలబస్‌లో ఉన్నవే ఇచ్చారు. కానీ.. సిలబస్‌లో లేని ‘ఈనాడు’ గురించి కూడా రాయాలంటూ ప్రశ్నపత్రంలో ఇవ్వడంపై విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈనాడు గురించి సిలబస్‌లో ఉంటే కచ్చితంగా ప్రశ్న ఇచ్చినా ప్రిపేరై రాసేవాళ్లమని.. కానీ, ఎక్కడాలేని ప్రశ్నని ఇస్తే.. తాము ఎలా రాస్తామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎనిమిదింటిలో నాలుగు ప్రశ్నలు మాత్రమే తెలుసనీ.. ఈనాడు బదులు సిలబస్‌లో ఉన్నది ఇచ్చి ఉంటే మరో ప్రశ్న కూడా రాసేవాళ్లమని చెబుతున్నారు. కేవలం ప్రభుత్వం మెప్పు పొందేందుకే వైస్ చాన్సలర్ ఈ విధంగా ప్రశ్నపత్రం తయారు చేయించి ఉంటారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో పరీక్షలో ఇంకెవరి గురించి రాయమని ప్రశ్నపత్నం తయారు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
NIRF rankings 2024: ఐఐటీ మద్రాస్ టాప్
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)–2024 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఓవరాల్‌తోపాటు ఇంజినీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ వరుసగా ఆరోసారి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు 8వ ర్యాంకు దక్కింది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరు వరుసగా 9వసారి మొదటి స్థానం సంపాదించుకుంది. అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం విడుదల చేశారు. ఓవరాల్ టాప్–10 జాబితాలో 8 ఐఐటీలతోపాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ చోటుసంపాదించాయి. యూనివర్సిటీల కేటగిరీలో టాప్–3లో బెంగళూరు ఐఐఎస్సీ, ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియాలున్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు ఆరు, విశాఖపట్టణంలోని ఆంధ్రా వర్సిటీకి ఏడో ర్యాంకు దక్కాయి.ఫార్మసీ విభాగంలో... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్)హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ఈసారి మొదటి స్థానాన్ని జామియా హందర్డ్ దక్కించుకోగా బిట్స్ పిలానీ మూడో ర్యాంకు సాధించింది. లా యూనివర్సిటీల్లో నల్సార్ హైదరాబాద్‌కు మూడో ర్యాంకు దక్కింది. -
నెం1 స్థానంలోకి దూసుకెళ్లిన రవిచంద్రన్ అశ్విన్..
-
‘టాప్’ ర్యాంక్‌లో షాహిన్ అఫ్రిది
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది తొలిసారి టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో షాహిన్ అఫ్రిది 673 పాయింట్లతో ఏడు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. హాజల్‌వుడ్ (ఆస్ట్రేలియా) టాప్ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్ యాదవ్ వరుసగా మూడు, ఏడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో షాహిన్ 16 వికెట్లు పడగొట్టి ఆడమ్ జంపా (ఆ్రస్టేలియా), మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వన్డే ఫార్మాట్లో ఏకకాలంలో బౌలింగ్, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ క్రికెటర్లు నంబర్‌వన్ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. -
వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో వెనుక పడిన భారత్.. రీజన్ ఇదే!
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (IMD) విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ ఇంతకు ముందుకంటే కూడా నాలుగు స్థానాలు దిగజారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోని 64 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 56 స్థానం పొందింది. 2022లో ఇండియా ర్యాంక్ 52 కావడం గమనార్హం. ఈ లెక్కన గతం కంటే ఇండియా నాలుగు స్థానాలు కిందికి వెళ్ళింది. భారతదేశ మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పటికీ, ప్రతిభ పోటీతత్వాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇది మెరుగుపడితే ఇండియా మరింత ముందుకు వెళుతుందని అభిప్రాయపడుతున్నారు. 2023 ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, లక్సెంబర్గ్ రెండవ స్థానంలో ఉంది, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా 15వ స్థానంలో, యూకే 35, చైనా 41 ఉన్నాయి. చివరి రెండు స్థానాల్లో బ్రెజిల్ 63, మంగోలియా 64 చేరాయి. ఇదీ చదవండి: భారత్‌లో ధాన్యం ధరలు పెరిగే అవకాశం! కారణం ఇదే.. ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ అనేది క్వాలిటీ లైఫ్, చట్టబద్ధమైన కనీస వేతనం, ప్రాథమిక & మాధ్యమిక విద్యతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించడం జరుగుతుంది. దీని ప్రకారం భవిష్యత్ సంసిద్ధతలో భారతదేశం 29వ స్థానంలో ఉన్నట్లు తెలిసింది. -
LinkedIn ranking: చేస్తే ఈ స్టార్టప్ కంపెనీలోనే పని చేయాలి..
ఇటీవల యునికార్న్‌గా మారిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto) భారత్‌లో అత్యధిక మంది ప్రొఫెషనల్స్ ఇష్టపడే వర్క్‌ప్లేస్ పరంగా అగ్ర స్టార్టప్‌గా అవతరించింది. ప్రముఖ రిక్రూటింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ 'టాప్ 20 ఇండియన్ స్టార్టప్‌ల జాబితా'ను తాజాగా విడుదల చేసింది. తమకున్న దాదాపు కోటి మంది సభ్యుల డేటా ఆధారంగా నిపుణులు పని చేయాలనుకునే అభివృద్ధి చెందుతున్న కంపెనీల వార్షిక ర్యాంకింగ్ లింక్డ్ఇన్ రూపొందించింంది. ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగార్థుల ఆసక్తి, కంపెనీలో మెంబర్ ఎంగేజ్మెంట్ తదితర అంశాల్లో పురోగతి సాధించి జెప్టో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గతేడాది ఇదే లింక్డ్ఇన్ టాప్ కంపెనీల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది మూడు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌ను సాధించింది. ఇక ఈ ర్యాంకింగ్‌లో జెప్టో తర్వాతి స్థానాలలో వరుసగా ఈవీ క్యాబ్ అగ్రిగేటర్ బ్లూస్మార్ట్, ఫిన్‌టెక్ కంపెనీ డిట్టో ఇన్సూరెన్స్, ఆడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్ పాకెట్ ఎఫ్ఎం, స్కైరూట్ ఏరోస్పేస్ ఉన్నాయి. ఈ సంవత్సరం జాబితాలో ఉన్న 20 స్టార్టప్‌లలో 14 కొత్తగా చోటు దక్కించుకోవడం విశేషం. -
ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్..
Global Happiness Ranking: 'ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది' అలనాడు ఎంతోమందిని అలరించిన పాట పనిచేయడంలో భారతీయులకు సరిగ్గా సరిపోతుందని తాజాగా కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఆనందంగా పనిచేయడంలో ఇండియన్స్ ముందు వరుసలో ఉంటారని మరోసారి రుజువైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పని ఎలాంటిదైనా.. ఇష్టంగా పనిచేస్తే కష్టం ఉండదు. ఏ దేశంలోని ఉద్యోగులు సంతోషంగా ఉన్నారనే విషయం మీద ఒక సంస్థ నివేదికను రూపొందించింది. ఇందులో భారతీయులే అగ్రస్థానంలో నిలిచింది.12 దేశాల్లోని మొత్తం 15,600 మంది ఐటీ ఉన్నతాధికారులు, బిజినెస్ లీడర్స్ మీద నిర్వహించిన ఈ సర్వేలో ఇండియా నుంచి 1,300 మంచి పాల్గొన్నారు. సుమారు 50శాతం కంటే ఎక్కువ మంది పనిచేయడంలోనే ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. హెచ్‌పీ వర్క్ రిలేషన్షిప్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 27 శాతం మంది ఉద్యోగం చేయడంలో ఆనందాన్ని పొందుతున్నట్లు సమాచారం. మన దేశంలోని ఉద్యోగులు ఫ్లెక్సిబులిటీ, మానసిక ప్రశాంతత, సమర్థవంతమైన నాయకత్వం వంటి వాటిని కలిగి ఉండటం ద్వారా సంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తగినట్లుగానే యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంటోంది. ఇదీ చదవండి: నకిలీ వెబ్సైట్లో రూ.11 లక్షలు మోసపోయిన బెంగళూరు వాసి - ఎలా జరిగిందంటే? వేతనం కంటే సంతోషానికి ప్రాధాన్యం భారతదేశంలోని చాలామంది తక్కువ జీతం పొందే ఉద్యోగాల్లో కూడా ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు. దీనికి కారణం వారి ఎక్స్పీరియన్స్ పెంచుకోవడం మాత్రమే కాకుండా.. కమ్యూనికేషన్ వంటి వాటిని పెంచుకోవడానికి కూడా అని తెలుస్తోంది. మొత్తం మీద ఈ సర్వేలో భారత్ అగ్రస్థానంలో నిలిచి ప్రపంచంలోని ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. -
దేశీయ పర్యాటకుల ఆకర్షణలో మూడో స్థానంలో ఏపీ
-
భారత కంపెనీల్లో టాప్ ర్యాంకర్‌గా రిలయన్స్
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ గ్లోబల్ 500, 2023 జాబితాలో మెరుగైన స్థానాన్ని సంపాదించింది. 16 స్థానాలు మెరుగుపడి 88వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 2022 జాబితాలో రిలయన్స్ స్థానం 104గా ఉండడం గమనించొచ్చు. భారత కంపెనీల్లో టాప్ ర్యాంకర్‌గా రిలయన్స్ నిలిచింది. 2021 నుంచి చూస్తే రిలయన్స్ అంతర్జాతీయంగా తన ర్యాంక్‌ని గణనీయంగా పెంచుకుంది. 2021లో రిలయన్స్ స్థానం 155గా ఉంది. ఇక ఈ ఏడాది ఫార్చూన్ 500 జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 94వ స్థానాన్ని సంపాదించుకుంది. గతేడాదితో పోలిస్తే 48 మెట్లు పైకెక్కింది. ఎల్ఐసీ 9 స్థానాలు దిగజారి 107వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఓఎన్జీసీ 158, బీపీసీఎల్ 233, ఎస్బీఐ 235 ర్యాంకులు దక్కించుకున్నాయి. టాటా మోటార్స్ ర్యాంక్ 33 స్థానాలు మెరుగుపడి 337కు చేరింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 84 స్థానాలు ముందుకు వచ్చి 353 ర్యాంకును సొంతం చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ 500 జాబితాలో చోటు సంపాదించుకోవడం 20వ ఏడాది కావడం గమనార్హం. -
స్పార్క్ ర్యాంకింగ్‌లో ఏపీకి మొదటి స్థానం.. అవార్డు అందుకున్న మెప్మా డైరెక్టర్
సాక్షి, అమరావతి: పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మెప్మా సంస్థకు జాతీయస్థాయి స్పార్క్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానం లభించింది. దీనదయాళ్ అంత్యోదయ అమలులో మెప్మా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొదటి స్థానం ప్రకటించింది. కేరళలో మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మికి స్థానిక స్వపరిపాలన మంత్రి ఎంబీ రాజేష్ చేతుల మీదగా అవార్డు ప్రదానం చేశారు. చదవండి: అర్హులందరికీ జగనన్న సురక్షతో లబ్ధి: సీఎం జగన్ -
Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో...
ఆకాశంలో సగం కాదు... నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది. 100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్ స్థాయికి ఎదిగారు. భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్ సహా వివిధ కమాండ్ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్‌గా పదోన్నతులు పొందారు. 1992 నుంచి 2006 బ్యాచ్‌కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కోర్, ఆర్మీ సర్వీస్ కోర్, ఆర్మీ ఆర్డన్స్ కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్స్ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు. ఇంజనీర్లు, న్యాయవాదులు, వంటి అడ్మినిస్ట్రేటివ్ పాత్రలే పోషిస్తున్నారు. యుద్ధ క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకి చికిత్స అందించే వైద్యులు, నర్సులుగా కూడా ఉన్నారు. 16–18 ఏళ్లు సర్వీసు ఉంటేనే కమాండర్ పదవికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు కోర్ ఆఫ్ ఆర్టిలరీ, కంబాట్ సపోర్ట్ ఆర్మ్‌లలో మహిళా అధికారుల్ని నియమించనున్నారు. భారత వాయుసేన, నావికాదళంలో అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఉన్నారు. వారికి శాశ్వత కమిషన్లు కూడా ఉన్నాయి. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకల్ని నడిపించే మహిళలూ ఉన్నారు. త్రివిధ బలగాల్లో అతి పెద్దదైన పదాతి దళంలో మాత్రమే మహిళల పట్ల ఇన్నాళ్లూ వివక్ష కొనసాగుతూ వచ్చింది. ఎందుకీ వివక్ష పురుషులతో పోలిస్తే మహిళల శారీరక దారుఢ్యంపైనున్న సందేహాలే ఇన్నాళ్లూ వారికి అవకాశాల్ని దూరం చేశాయి. మాతృత్వం, పిల్లల పోషణ, ప్రసూతి సెలవులు వంటివి మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలని, యుద్ధం ముంచుకొచ్చే నేపథ్యాల్లో అది సాధ్యం కాదనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మహిళలకు ఎక్కడైనా పని చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. భారత వాయుసేన, నావికాదళంతో పోలిస్తే ఆర్మీలో వివక్ష ఎక్కువగా ఉంది. యుద్ధభూమిలో నేరుగా మహిళలుంటే శత్రు దేశానికి చిక్కితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ పోరాట క్షేత్రాల్లో మహిళా కమాండర్లను నియమించడానికి భారత సైన్యం ఇంకా సిద్ధంగా లేదు. సుప్రీం తీర్పుతో నెరవేరిన కల భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కమాండింగ్ పదవులు ఇవ్వాల్సిందేనని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా అందరికీ శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్మీలో మహిళలు పురోగతి సాధించడానికి, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదోన్నతులకు మార్గం సుగమమైంది. యూనిట్‌ను కమాండ్ చేయడమంటే..? పదాతి దళంలో క్షేత్రస్థాయిలో సైనికులందరికీ నేరుగా ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించే కీలక బాధ్యత. ఇప్పటివరకు పురుషులు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతల్ని మహిళలు కూడా అందుకున్నారు. సైన్యంలో కల్నల్ పదవి మహిళకి లభిస్తే ఆమె కనుసన్నల్లోనే సైన్యం నడుస్తుంది. బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ వంటి ఉన్నతాధికారులు నేరుగా సైనికులతో సంబంధాలను కొనసాగించరు. ఇలాంటి పదవుల్లోనే ఎన్నో సవాళ్లను మహిళలు ఎదర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మహిళల్లో నాయకత్వ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది. ‘‘సియాచిన్‌లో మొట్టమొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్‌ను నియామకం మాలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా ప్రతీ ఒక్కరికీ వారికి మాత్రమే సొంతమయ్యే సామర్థ్యాలుంటాయి. ఆర్మీలో మహిళలకు మంచి భవిష్యత్ ఉంది. శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఇన్నాళ్లూ వివక్ష కారణంగా పదవులకి దూరమయ్యారు. ఇక ఆ రోజులు పోయాయి’’ – దీక్షా ధామిన్, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి ‘‘ఆర్మీలోకి రావాలనుకునే మహిళల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పోరాట క్షేత్రాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళా అధికారులు రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతో చురుగ్గా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో ఉంటారు’’ – దీప్‌నూర్ సహోతా, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్ ఐఐటీ అదుర్స్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో నిలిచి హైదరాబాద్ ఐఐటీ మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకుల్లో హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ(హెచ్) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఐఐటీ(హెచ్) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. దేశంలోకెల్లా ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ తొలిస్థానంలో నిలిచి వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. హెచ్‌సీయూ భళా.. జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకు, రీసెర్చ్‌లో 27వ ర్యాంకు సాధించింది. వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా వర్సిటీ 22వ ర్యాంకు పొందింది. ఓవరాల్ ర్యాంకుల విభాగంలో 46వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలోవరంగల్ ఎన్ఐటీ 21 ర్యాంకు ఓవరాల్ విభాగంలో 45వ ర్యాంకు పొందింది. ఇంజనీరింగ్ విద్యలో జేఎన్టీయూ (హైదరాబాద్)కు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు దక్కింది. కాగా, ప్రతిభగల విద్యా ర్థులు, సమర్థులైన అధ్యాపకుల కృషివల్లే ఐఐటీ (హెచ్) దినదినాభివృద్ధి చెందుతోందని సంస్థ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు. వివిధ విభాగాల్లో ఓయూ ర్యాంకులు సాధించడంపై వర్సిటీ వీసీ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. -
సులభతర వాణిజ్యం ర్యాంకులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వం ప్రకటించే సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకుల కోసం రాష్ట్రాలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరుకు అద్దం పట్టే ఈ ర్యాంకులు పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలోనూ కీలకమవుతున్నాయి. ఈఓడీబీ ర్యాంకుల్లో ఒక్కసారి మినహా ప్రతిసారి తొలి మూడు స్థానాల్లో నిలిచిన తెలంగాణ కూడా ఈ ర్యాంకులు ఎప్పుడు వస్తాయోనని చూస్తోంది. ఏడాదవుతున్నా కొలిక్కిరాని మదింపు ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) 2015 నుంచి ఈఓడీబీ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పాలన సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ర్యాంకుల ప్రకటనలో కేంద్రం సూచించే బిజినెస్ రిఫారŠమ్స్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఏపీ) పాయింట్లు కీలకంగా మారుతున్నాయి. 2015 ఈఓడీబీ ర్యాంకుల్లో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2016లో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి మొదటి స్థానంలో, 2018లో రెండు, 2019లో మూడో స్థానంలో నిలిచింది. 2017లో కేంద్రం ఈఓడీబీ ర్యాంకులను ప్రకటించలేదు. 2020 ఈఓడీబీ ర్యాంకులకు సంబంధించి డీపీఐఐటీ 301 బీఆర్ఏపీ సంస్కరణలను సూచించి గతేడాది సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించింది. డీపీఐఐటీ సూచించిన సంస్కరణలను అమలు చేసిన ప్రభుత్వం అందుకు అవసరమైన పత్రాలనూ డీపీఐఐటీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. వివిధ రాష్ట్రాల సంస్కరణల వివరాలను పరిశీలించి, సంబంధిత వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటన్నింటినీ డీపీఐఐటీ మదింపు చేస్తుంది. 2020 ఈఓడీబీ ర్యాంకులకు సంబంధించి వివరాలు సమర్పించి ఏడాదవుతున్నా ఈ మదింపు ప్రక్రియ కొలిక్కి రావట్లేదు. మెరుగైన స్థానం వస్తుందనే ఆశతో తెలంగాణ ఈఓడీబీ ర్యాంకుల్లో 2015 మినహా మిగతా అన్ని సందర్భాల్లో రాష్ట్రం తొలి మూడు స్థానాల్లో నిలుస్తూ వస్తోంది. 2019 ర్యాంకింగులో ఉత్తరప్రదేశ్ రెండో స్థానం, తెలంగాణ మూడో స్థానంలో నిలిచాయి. దీంతో మదింపు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2020లో సూచించిన 301 సంస్కరణలను నిర్దేశిత గడువులోగా అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీఆర్ఏపీ సంస్కరణలపై సంబంధిత వర్గాలు సానుకూలంగా స్పందించాయని సమాచారం తమకు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈఓడీబీ సంస్కరణలు ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగు పరుచుకునేందుకు ఓ అవకాశంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. 2020 ర్యాంకుల్లో రాష్ట్రం మెరుగైన ర్యాంకు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు
న్యూఢిల్లీ: పత్రికా స్వేచ్ఛ సూచిలో మన దేశం ఏమాత్రం మెరుగ్గా లేదు. నానాటికీ తీసికట్టుగా పరిస్థితి తయారైందని తాజా అధ్యయనం వెల్లడించింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) తాజాగా ప్రకటించిన దేశాల జాబితాలో మన దేశం 150వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ ర్యాంక్ 142. ప్రతి దేశంలో పాత్రికేయులు, వార్తా సంస్థలు, నెటిజన్లకు ఉన్న స్వేచ్ఛను.. అలాంటి స్వేచ్ఛను గౌరవించే ప్రభుత్వ ప్రయత్నాలను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ హైలైట్ చేస్తుంది. జర్నలిజానికి ‘చెడు’గా పరిగణించబడే దేశాల జాబితాలో భారత్ గతేడాది చేర్చబడింది. జర్నలిస్టులపై జరుగుతున్న హింస, రాజకీయంగా పక్షపాత మీడియా, కేంద్రీకృత మీడియా యాజమాన్యం ఇవన్నీ భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాయని ఆర్ఎస్ఎఫ్ నివేదిక పేర్కొంది. ‘ఇండియా స్పెండ్’ నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ షట్‌డౌన్, తప్పుడు సమాచారం విస్త్రృత వ్యాప్తి కూడా గత ఐదేళ్లలో పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం ర్యాంక్ పడిపోవడానికి కారణమని వెల్లడించింది. కాగా, పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే మొదటి స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ 157వ స్థానంలో ఉంది. (క్లిక్: ఇంటర్నెట్ షట్డౌన్లో టాప్ ఎవరంటే?) -
విజేత రుత్విక శివాని
పుణే: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో క్వాలిఫయర్ రుత్విక 21–10, 21–17తో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక ఈ టోర్నీలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయాలబారిన పడ్డ రుత్విక ఇటీవలే కోలుకొని పునరాగమనం చేసింది. మహిళల డబుల్స్‌లో బండి సాహితి (తెలంగాణ)–నీల (తమిళనాడు) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాహితి–నీల జోడీ 12–21, 17–21తో టాప్ సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జంట చేతిలో ఓడిపోయింది. -
మళ్లీ టాప్-10లో హెచ్‌సీయూ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2020లో హెచ్‌సీయూ వరుసగా రెండోసారి టాప్‌టెన్ జాబితాలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ జాబితాలో మొదటి స్థానంలో ఐఐటీ–బాంబే, ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానం, ఐఐటీ–ఢిల్లీ–మూడోస్థానం పొందగా హెచ్‌సీయూ 8వ స్థానం సాధించింది. దేశంలోని వంద విద్యాసంస్థలను పరిశీలించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. స్టాఫ్ విత్ పీహెచ్డీ కేటగిరీలో బెస్ట్ స్కోర్ ఇండికేటర్‌ను హెచ్‌సీయూ సాధించడం మరో విశేషం. ఈ ర్యాంకింగ్స్‌లో ముఖ్యంగా ఫ్యాకల్టీ–స్టూడెంట్స్‌లో 26.9 పాయింట్లు, సిటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ 40.5, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 3.4, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ 2.5, ఎంప్లాయర్ రెప్యూటేషన్ 5.3, అకాడమిక్ రెప్యూటేషన్లో 10.8 పాయింట్లు సాధించింది. వీటి ఆధారంగానే ర్యాంకింగ్స్‌ను ఖరారు చేశారు. -
పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్ వెనుకబడింది. అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన ‘గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్’లో క్రితం ఏడాది 58వ స్థానంలో నిలిచిన భారత్, ఈ ఏడాది 68కి పరిమితమైంది. ప్రధానంగా ఇతర ఆర్థిక వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉండడం భారత్ వెనక్కి వెళ్లిపోవడానికి కారణం. కొలంబియా, దక్షిణాఫ్రికా, టర్కీ తమ స్థానాలు మెరుగుపరుచుకుని భారత్‌ను అధిగమించినట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. అంతర్జాతీయంగా అత్యంత పోటీపడగల ఆర్థిక వ్యవస్థగా సింగపూర్ అవతరించి ఆశ్చర్యపరించింది. ఈ విషయంలో అమెరికా స్థానాన్ని కొల్లగొట్టింది. బ్రిక్స్‌లోని ఐదు దేశాల్లో భారత్, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థల ర్యాంకులే తక్కువగా ఉండడం గమనార్హం. ఈ సూచీలో బ్రెజిల్ 71వ స్థానంలో ఉంది. అయితే, స్థూల ఆర్థిక అంశాల పరంగా స్థిరత్వం, మార్కెట్ సైజు పరంగా భారత్ ర్యాంకు ఉన్నత స్థానంలోనే ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. వాటాదారుల గవర్నెన్స్ విషయంలో అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలిచింది. 103 అంశాల ఆధారంగా గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో స్థానాలను డబ్ల్యూఈఎఫ్ ఏటా నిర్ణయిస్తుంటుంది. మొత్తం 141 దేశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటుంది. -
స్మార్ట్ సిటీగా ‘బిగ్ ఆపిల్’
బార్సిలోనా : ప్రపంచంలోనే అత్యంత ఆకర్షయణీయ నగరం(స్మార్ట్ సిటీ)గా న్యూయార్క్ నిలిచింది. స్పెయిన్‌కు చెందిన ప్రఖ్యాత ఐఈఎస్ఈ బిజినెస్ స్కూల్ పరిశోధన సంస్థ విడుదల చేసిన ఐఈఎస్ఈ సిటీస్ ఇన్ మోషన్ ఇండెక్స్- 2018 ప్రకారం ‘బిగ్ ఆపిల్ సిటీ’ వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించింది. ఐఈఎస్ఈ విడుదల చేసిన జాబితా ప్రకారం లండన్, పారిస్, టోక్యో, రెజావిక్, సింగపూర్, సియోల్, టొరంటో, హాంగ్‌కాంగ్, ఆమ్స్టర్డామ్ నగరాలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి. కాగా యూరప్ నుంచి 12, ఉత్తర అమెరికా నుంచి 6, ఆసియా నుంచి 4 నగరాలు టాప్ 25 స్మార్టెస్ట్ సిటీలుగా నిలిచాయి. మెరుగైన నగరాల కోసం... తొమ్మిది ప్రామాణిక అంశాల ఆధారంగా సుమారు 80 దేశాలకు చెందిన 165 సిటీల నుంచి 25 స్మార్ట్ సిటీలను ఎంపిక చేసినట్లు ఐఈఎస్ఈ తెలిపింది. సుస్థిరాభివద్ధి, ప్రతిభావంతులైన మానవ వనరులు, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ, వివిధ సామాజిక నేపథ్యాలు, పర్యావరణం, పాలన, పట్టణ ప్రణాళిక, అంతర్జాతీయ సంబంధాలు, సాంకేతికత, రవాణా తదితర అంశాల్లో టాప్‌గా నిలిచిన న్యూయార్క్‌ను స్మార్టెస్ట్ సిటీగా గుర్తించినట్లు ఐఈఎస్ఈ పేర్కొంది. గత నాలుగేళ్లుగా ర్యాంకులను ప్రకటిస్తున్నామన్న ఐఈఎస్ఈ ప్రతినిధులు.. ఐదో ఎడిషన్‌లో(2018) నూతన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉగ్రదాడుల సంఖ్య, తలసరి ఆదాయం, ఉష్ణోగ్రత పెరుగుదల వంటి అంశాలు ఈ జాబితా ఎంపికలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ర్యాంకింగ్ వ్యవస్థ వల్ల పాలకుల్లో పోటీ ఏర్పడుతుందని, తద్వారా మెరుగైన నగరాలు రూపుదిద్దుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వన్డేల్లో భారత్ ‘టాప్’ చేజారింది
దుబాయ్: టెస్టుల్లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా వన్డేల్లో టాప్ ర్యాంకును కోల్పోయింది. ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ నంబర్‌వన్ ర్యాంకుకు ఎగబాకింది. 2015–16, 2016–17 సీజన్లలోని వెయిటేజీతో ఏకంగా 8 పాయింట్లు మెరుగుపర్చుకున్న ఇంగ్లండ్ 125 రేటింగ్ పాయింట్లతో ‘టాప్’ లేపింది. భారత్ ఒక పాయింట్ కోల్పోయి 122 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా(113) మూడో స్థానానికి దిగజారగా, న్యూజిలాండ్ (112) నాలుగో ర్యాంకులో ఉంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా (104) ఐదో ర్యాంకులో పాకిస్తాన్ (102) ఆరో ర్యాంకులో కొనసాగుతున్నాయి. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ (123) మూడో స్థానంలో ఉండగా... పాక్ (130), ఆస్ట్రేలియా (126) టాప్–2 ర్యాంకుల్లో ఉన్నాయి. -
నాలుగు విభాగాల్లో లీడర్‌గా సైయంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్.. నాలుగు వ్యాపార విభాగాల్లో ఆధిపత్య రేటింగ్ దక్కించుకుంది. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ రూపొందించిన జిన్నోవ్ జోన్స్ 2016 ప్రోడక్ట్ ఇంజినీరింగ్ సర్వీసెస్ నివేదికలో సైయంట్‌కు ఈ ర్యాంకింగ్ దక్కింది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎనర్జీ అండ్ యుటిలిటీస్, రవాణా, కన్స్ట్రక్షన్ అండ్ మెషినరీ విభాగాల్లో సైయంట్‌ను లీడర్‌గా జిన్నోవ్ రేటింగ్ ఇచ్చింది. అలాగే మెకానికల్ ఇంజినీరింగ్ సేవల్లో కీలకమైన సంస్థగా పేర్కొంది. క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా పనిచేయడం, పదునైన కొనుగోళ్ల వ్యూహాలు మొదలైనవి ఈ ర్యాంకింగ్‌లకు దోహదపడ్డాయని సైయంట్ సీఈవో కృష్ణ బోదనపు పేర్కొన్నారు. -
టాప్–12 ర్యాంకుల్లో సగం మనకే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాలు అంటూ ముఖ్యమంత్రి ఎ¯ŒS.చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించారు. రాష్ట్రంలో టాప్–12 నియోజకవర్గాల జాబితాను బుధవారం ప్రకటించగా.. అందులో ఆరు నియోజకవర్గాలు మన జిల్లావే కావడం గమనార్హం. పైగా మొదటి నాలుగు స్థానాలు జిల్లాకే దక్కాయి. బుధవారం విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. గోపాలపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కగా, రెండో స్థానంలో భీమవరం, మూడో స్థానంలో ఉంగుటూరు, నాలుగో స్థానంలో ఉండి నియోజకవర్గాలు ఉన్నాయి. 8వ స్థానంలో నిడదవోలు, 9వ స్థానంలో తణుకు నిలిచాయి. 14 అంశాల ఆధారంగా నియోజకవర్గాలకు ర్యాంకులు ప్రకటించారు. జీవీఏ (గ్రాస్ వేల్యూ ఆడిట్), తలసరి ఆదాయం, నీరు–ప్రగతి, మీ కోసం ఫిర్యాదుల పరిష్కారం, ఎన్టీఆర్ వైద్యసేవ, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ల పంపిణీ, రోడ్ల పరిస్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చినట్టు ప్రకటించారు. ఈ ప్రకటనపై జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి థాయ్‌లాండ్
అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశారుు. గ్రూప్ ‘ఎ’ నుంచి దక్షిణ కొరియా, భారత్... గ్రూప్ ‘బి’ నుంచి థాయ్‌లాండ్, ఇరాన్ సెమీఫైనల్‌కు చేరుకున్నారుు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో కొరియాతో ఇరాన్; థాయ్‌లాండ్‌తో భారత్ తలపడతారుు. బుధవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ 67-26తో అర్జెంటీనాపై విజయం సాధించి 16 పారుుంట్లతో గ్రూప్ ‘ఎ’లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక గ్రూప్ ‘బి’ కీలక మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 37-33తో జపాన్ను ఓడించింది. ఈ విజయంతో గ్రూప్ ‘బి’లో థాయ్‌లాండ్, ఇరాన్ 20 పారుుంట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారుు. అరుుతే మెరుగైన పారుుంట్ల సగటు (సాధించిన పారుుంట్లు, కోల్పోరుున పారుుంట్ల మధ్య తేడా) ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... థాయ్‌లాండ్ (+82)కు టాప్ ర్యాంక్ దక్కింది. ఇరాన్ (+71) రెండో స్థానంలో నిలిచింది. జపాన్ చేతిలో కనీసం ఏడు పారుుంట్ల తేడాతో ఓడిపోకుంటే సెమీస్‌కు చేరుకునే పరిస్థితిలో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ ఈ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడింది. రెండో అర్ధభాగంలో ఒకదశలో థాయ్‌లాండ్ 26-31తో వెనుకబడింది. అరుుతే చివరి ఐదు నిమిషాల్లో థాయ్‌లాండ్ అద్భుతంగా ఆడి... విజయం సాధించి అగ్రస్థానం దక్కించుకుంది. -
జాతీయ స్థాయి సీనియర్ ర్యాంకింగ్ టోర్నీ.. విజేత రుత్విక శివాని
ఖమ్మం స్పోర్ట్స్: మహిళల జాతీయస్థాయి సీనియర్ ర్యాకింగ్ టోర్నీలో ఖమ్మంకు చెందిన గాదె రుత్విక శివాని సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకొని విజేతగా నిలిచింది. మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 1నుంచి 6వ తేదీ వరకు జరిగిన ఆల్ ఇండియా సీనియర్ మహిళల సీనియర్ ర్యాకింగ్ టోర్నీలో నంబర్ వన్ ర్యాంకర్ పీసీ.తులసిని ఓడించడం విశేషం. సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రుత్విక శివాని మొదటి సెట్లో కొద్దిగా కష్టపడినప్పటికీ, రెండో సెట్‌ను తన చేతిలోకి తీసుకుని సునాయసంగా నెగ్గి సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈమ్యాచ్‌లో రుత్విక శివాని, పీసీ.తులసిపై 21–18, 21–06 తేడాతో గెలుపొందింది. రుత్విక శివాని రాణించడం పట్ల బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
చేతివేళ్ల ముద్రలకూ ర్యాం‘కింగ్’
రేషన్‌కార్డుదారుల కుటుంబ సభ్యుల పది వేళ్ల ముద్రల సేకరణ బాగా ముద్ర పడే వేలుకు మొదటి ర్యాంక్ ఆ వేలితోనే బయోమెట్రిక్ ద్వారా సరుకుల పంపిణీ వేలిముద్రల సేకరణలో డీలర్లు బిజీ అమలాపురం టౌన్: చేతివేళ్ల ముద్రలకు ర్యాంకింగ్... ఇదేమిటా? అనే సందేహం కలుగుతోంది కదూ... చేతి వేలిముద్రలు అరిగిపోయి ఒక్కోసారి బయోమెట్రిక్ మిషన్లకు అనుసంధానం కాదు. సమస్య పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుదారుల కుటుంబంలోని అందరి చేతుల పదివేళ్ల ముద్రలను సేకరిస్తారు. అందులో వేలిముద్ర బాగా ఉన్న వేలును బయో మెట్రిక్కు ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువులను ఇ–పాస్ విధానంతో బయోమెట్రిక్ ఆధారంగా రేషన్ సరుకులు బట్వాడా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పింఛన్లు, రేషన్ బట్వాడా సమయంలో ఎక్కువlమంది లబ్ధిదారుల చేతి వేలిముద్రలు బయో మెట్రిక్ మిషన్లతో సరిపోలక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రేషన్ పంపిణీకి అంతరాయం ఏర్పడుతోంది. దీంతో బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ (బీఎఫ్‌డీ) పేరుతో రేషన్‌కార్డు కలిగిన కుటుంబంలోని ప్రతి ఒక్కరి చేతుల పదివేళ్ల వేలిముద్రలు విడివిడిగా సేకరిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని దాదాపు 2400 రేషన్ డిపోల్లో ప్రస్తుతం బీఎఫ్‌డీ ప్రక్రియ సాగుతోంది. గురువారం నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కూడా నిరే్ధశించారు. జిల్లాలో దాదాపు 15 లక్షల కుటుంబాలకు చెందిన 54 లక్షల జనాభా ఉన్నారు. అంటే 54 లక్షల మంది నుంచి ప్రతి ఒక్కరి పది వేళ్ల ముద్రలను సంబంధిత డీలర్లు బయోమెట్రిక్ మిషన్ ద్వారా సేకరించాల్సి ఉంది. అక్కడికక్కడే బెస్ట్ ఫింగర్‌కు ర్యాంకింగ్ ఈనెల సరుకుల కోసం కార్డుదారులను కుటుంబ సమేతంగా రమ్మని డీలర్లు కోరుతున్నారు. లేదా డీలర్లే బయోమెట్రిక్ మిషన్లతో కార్డుదారుల ఇళ్లకుSవెళ్లి కుటుంబంలోని సభ్యులందరి పది వేళ్ల ముద్రలనూ సేకరిస్తున్నారు. పది వేళ్లలో ఏ వేలిముద్రలు బాగా ఉన్నాయో... దాని తర్వాత ఏ వేలి ముద్ర బాగుందో... ఇలా వేళ్ల వారీగా పది వేళ్లకు ర్యాంకులు నిర్ధారిస్తూ ప్రింటింగ్ పత్రాని అందిస్తోంది. మిషన్ బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ చేసిన వేలును ఇకనుంచి బయో మెట్రిక్కు ఉపయోగించేలా ఆధార్ కార్డు నంబరుతో అనుసంధానం చేస్తారు. ఇక నుంచి డీలరు బీఎఫ్‌డీ ప్రకారం కార్డుదారుడు వచ్చినప్పుడు ఈ వేలునే బయోమెట్రిక్‌కు ఉపయోగించడం ద్వారా వేలిముద్రల సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొంటున్నారు. ఒక్కో వేలుకు ఒక్కో నిమిషం డీలర్లకు పదివేళ్ల ముద్రల సేకరణ ఓ ప్రసవంగా మారింది. ఇ–పాస్ సర్వర్ సరిగా పనిచేస్తే ఒక్కో వేలుకు కనీసం నిమిషం సమయం పడుతుంది. అంటే పదివేళ్లకు పది నిమిషాలు పడుతోంది. ఇక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికీ పదేళ్లకూ వేలిముద్రల సేకరణ అంటే ఎంత సమయం పడుతుందో అంచనా వేయవచ్చు. ఒక్కో చౌక డిపో పదిధిలో 2,000 నుంచి 2,500 వరకూ కార్డులు ఉంటాయి. ఇప్పటి వరకూ జిల్లాలో ప్రతి డిపో పరిధిలో 600 నుంచి 1000 వరకూ కార్డులు మాత్రమే మాత్రమే పూర్తయ్యాయి. గడువు మరో నెల రోజులు పెంచితేనే బీఎఫ్‌డీ పూర్తవుతుందని డీలర్లు అంటున్నారు. -
తెలంగాణకు 13వ ర్యాంకా?
హైదరాబాద్: పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల్లో తెలంగాణకు 13వ ర్యాంకు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంకింగ్‌లో తెలంగాణను వెనక్కి నెట్టడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ఏ పద్దతి ప్రకారం ర్యాంకులు ప్రకటించారో సరిగ్గా తెలియదు కానీ, మేం ఏం చేస్తున్నామో మా పని తీరే చెబుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ర్యాంకుల ప్రకటనపై అంతగా దిగులు చేందాల్సిన అవసరం లేదన్నారు. సులభంగా వ్యాపారం చేసే అంశంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ఇవ్వగా, వాటిలో ఆంధ్రప్రదేశ్ రెండో ర్యాంకు సాధించింన విషయం తెలిసిందే. మొదటి స్థానంలో ఎప్పటిలాగే గుజరాత్ నిలవగా, మూడో స్థానంలో జార్ఖండ్ ఉంది. గుజరాత్ స్కోరు 71.14 శాతం కాగా, ఏపీ స్కోరు 70.12 శాతం. ఇక తెలంగాణ రాష్ట్రం 42.45 శాతం స్కోరుతో 13వ స్థానంలో నిలిచింది. మొత్తం 29 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులు ఇచ్చింది. Lot of folks wondering about ease of doing business ranking. Not sure about methodology but, We will let our work speak & not fret over this — KTR (@KTRTRS) September 15, 2015