resolution
-
Jammu & Kashmir: రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానం ఆమోదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నూతన సీఎం ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన మొదటి సమావేశంలో జమ్ముకశ్మీర్ మంత్రివర్గం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, మంత్రులు సకీనా మసూద్ ఇటూ, జావేద్ అహ్మద్ రాణా, జావైద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ హాజరయ్యారు.‘తీర్మానం ముసాయిదా సిద్ధం అయ్యింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ముసాయిదాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి ముఖ్యమంత్రి రెండు రోజుల్లో న్యూఢిల్లీకి వెళతారు’ అంటూ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే తమ పార్టీ కేబినెట్లో భాగం అవ్వదని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విశ్వాసం వ్యక్తం చేశారు."మేము రాజ్యాధికారం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోదీనిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని భావిస్తున్నాను’ అని అబ్దుల్లా తెలిపారు. ఇదిలా ఉండగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి నికూడా రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్. అలాగే లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.. -
జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోండి: కేరళ తీర్మానం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించటంపై ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరమని తీర్మానంలో పేర్కొన్నారు.Kerala Legislative Assembly passed a resolution urging the central government to withdraw its proposed 'One Nation, One Election' reform, describing it as undemocratic and detrimental to the nation's federal structure.— ANI (@ANI) October 10, 2024కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా.ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం. -
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం: బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కలకత్తా: రాష్ట్ర విభజన కోసం జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా వ్యతిరేకిస్తున్నట్లు వెస్ట్‌బెంగాల్ అసెంబ్లీ సోమవారం(ఆగస్టు5) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ‘మేం కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని నమ్ముతున్నాం. బెంగాల్ విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తాం’అని సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఈ తీర్మానానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కూడా మద్దతిచ్చారు. తాము కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉత్తర వెస్ట్బెంగాల్ను విభజించి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. -
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లవి బ్లాక్మెయిల్ పాలిటిక్స్: కిషన్‌రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమేనని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం(జులై 25) ఆయన మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో దీక్ష చేద్దాం.. అమరణ దీక్షలు చేద్దామనడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆలోచనను స్పష్టం చేస్తోంది. నరేంద్ర మోదీ సర్కారు పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశాం. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 35శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో కోరాయి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు పొందుపరిచాం. ఈ బడ్జెట్ పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నారు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
నీట్‌ను వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీర్మానం!
బెంగళూరు: నీట్ యూజీ- 2024 పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలు దేశంలో దుమారం రేపాయి. అయితే తాజాగా నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో రెండు తీర్మానాలను సోమవారం కర్ణాటక రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం. మరో రెండు తీర్మానాలు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. నీట్‌ను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రాలే సొంతంగా తమ పరీక్షలను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో నీట్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే తరహా తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.మరోవైపు.. కేబినెట్లో ఆమోదం పొందిన ఈ తీర్మానాలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపట్టనున్నారు. వీటీతోపాటు, గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ బిల్లు 2024కు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
బిహార్ ప్రత్యేక హోదా.. అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం
పట్నా: బిహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. శనివారం రాష్ట్ర అసెంబ్లీలో బిహార్ ముఖ్య మంత్రి నితీష్‌కుమార్ పార్టీ జేడి(యూ) ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నితీష్‌కుమార్ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు.హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ.. నితీష్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం గతేడాది ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్లను పరిశీలించబోమని కేంద్రం గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ కొన్నేళ్ల నుంచి ఉంది. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో జేడీ(యూ)తో పాటు టీడీపీ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ విషయంలో సీఎం చంద్రబాబుపై కూడా ఒత్తిడి పెరుగుతుందనటంలో సందేహం లేదు. -
నీట్ రద్దు చేయాలంటూ.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమతున్న విషయం తెలిసిందే. అటు పార్లమెంట్‌ను సైతం ఈ అంశం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నీట్ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.నీట్ పరీక్ష నిర్వహణపై అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు, పరీక్షపై వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నీట్‌ను రద్దు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని సముచితంగా సవరించాలని తీర్మానంలో పేర్కొన్నారు.అయితే సభ ఆమోదించినప్పటికీ, దీనిని నిరసిస్తూ బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనూహ్యంగా దాని మిత్రపక్షం పీఎంకే డీఎంకే తీర్మానానికి మద్దతు ఇచ్చింది.కాగా, నీట్-యూజీ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్, నీట్-పీజీ 2024 పరీక్షను ఆకస్మికంగా వాయిదా వేయడంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం నీట్ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మణితనేయ మక్కల్ కట్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళగ వెట్రి కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. -
Parliament Special Session: కాక రేపిన ఎమర్జెన్సీ తీర్మానం
న్యూఢిల్లీ: స్పీకర్‌గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్‌సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్‌సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్‌గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. -
Parliament Special Session: స్పీకర్‌గా బిర్లా.. మోదీ, రాహుల్ అభినందన
న్యూఢిల్లీ: అనూహ్యమేమీ జరగలేదు. అధికార ఎన్డీఏ పక్ష అభ్యర్థి ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీ కూడా ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు. దాంతో మూజువాణి ఓటు ద్వారా విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై బిర్లా విజయం సాధించినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. స్పీకర్ ఎన్నికపై అధికార, విపక్ష కూటముల మధ్య నెలకొన్న రగడకు ఆ విధంగా తెర పడింది. అనంతరం మోదీ, విపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు 61 ఏళ్ల బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. పారీ్టలకు అతీతంగా సభ్యులంతా చప్పట్లతో హర్షధ్వానాలు వెలిబుచ్చారు. అఖిలేశ్ యాదవ్ తదితర విపక్ష సభ్యులంతా ఈ సందర్భంగా బిర్లాను అభినందించారు. విధి నిర్వహణలో ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని, ప్రజల గొంతుక వినిపించేందుకు విపక్షాలకు తగిన అవకాశాలిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. బలరాం జాఖడ్ అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని తిరిగి స్పీకర్‌గా ఎన్నికైన రికార్డును బిర్లా సొంతం చేసుకున్నారు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలముంది. వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాతో సభలో ఒక ఖాళీ ఉంది. మోదీ తొలి ప్రసంగం బిర్లా ఎన్నిక అనంతరం 18వ లోక్‌సభలో మోదీ తొలి ప్రసంగం చేశారు. గత ఐదేళ్లలో సభ హుందాతనాన్ని పరిరక్షించడంలో స్పీకర్‌గా బిర్లా గొప్ప పరిణతి చూపారంటూ ప్రశంసించారు. పలు చరిత్రాత్మక నిర్ణయాలతో లోక్‌సభ చరిత్రలో స్వర్ణయుగానికి సారథ్యం వహించారంటూ కొనియాడారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చన సందర్భాల్లోనూ ఆయన చక్కని సంతులనం పాటించారన్నారు. సభ నిర్వహణలో బిర్లా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతారని విశ్వాసం వెలిబుచ్చారు. పార్లమెంటేరియన్‌గా ఆయన పనితీరును కొత్త సభ్యులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విపక్షాల అభినందనలురాహుల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా 18వ లోక్‌సభ చక్కగా పని చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈసారి సభలో విపక్షాల బలం పెరిగిందని గుర్తు చేశారు. వాటికి అందుకు తగ్గట్టుగా ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు వీలైనన్ని అవకాశాలు లభించాలన్నారు. ఈ సభలో సభ్యుల సస్పెన్షన్ల వంటి సభ హుందాతనాన్ని తగ్గించే చర్యలుండబోవని అఖిలేశ్ ఆశాభావం వెలిబుచ్చారు. సుదీప్ బంధోపాధ్యాయ (టీఎంసీ), టీఆర్ బాలు (డీఎంకే) తదితరులు మాట్లాడారు. నేడు పార్లమెంటు సంయుక్త సమావేశం గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. మోదీ 3.0 నూతన సర్కారు ప్రాథమ్యాలను ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు ముందుంచే అవకాశముంది. రాజ్యాంగంలోని 87వ ఆరి్టకల్ ప్రకారం లోక్‌సభ ఎన్నిక అనంతరం సమావేశాలు ప్రారంభమయ్యాక ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముర్ము గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో సంప్రదాయ పద్ధతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకుంటారు. గజద్వారం వద్ద ప్రధానితో పాటు లోక్‌సభ, రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారులు స్వాగతం పలుకుతారు. సంప్రదాయ సెంగోల్ చేబూని ముందు నడుస్తూ రాష్ట్రపతిని లోక్‌సభ చాంబర్లోకి తీసుకెళ్తారు. మోదీ రాహుల్ కరచాలనంస్పీకర్గా ఎన్నికయ్యాక బిర్లాను పోడియం వద్దకు తీసుకెళ్లే సందర్భంలో లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు నవ్వుతూ మాట్లాడుకోవడం సభ్యులందరినీ ఆకర్షించింది. రాహుల్ నయా లుక్ స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఆయన తెలుపు రంగు లాల్చీ, పైజామా ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆయన కొన్నేళ్లుగా టీ షర్టు, బ్యాగీ ప్యాంటే ధరిస్తున్నారు. భారత్ జోడో యాత్రల్లోనూ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ అదే వస్త్రధారణ కొనసాగించారు. సోమ, మంగళవారాల్లో లోక్‌సభకు వచి్చనప్పుడు, సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా టీ షర్టు, బ్యాగీ ప్యాంటులోనే కని్పంచారు. రాహుల్ ప్రస్తుతం లోక్‌సభలో విపక్ష నేత కావడంతో అందుకు తగ్గట్టుగా లాల్చీ, పైజామాకు మారినట్టు భావిస్తున్నారు. ‘‘స్పీకర్‌గా ఎన్నికైన మీకు విపక్షం తరఫున, ‘ఇండియా’ కూటమి తరఫున మీకు అభినందనలు. ఉభయ సభలు సజావుగా సవ్యంగా సాగాలని ఆశిస్తున్నాం. విశ్వాసంతోనే సహకారం సాధ్యమవుతుంది. ప్రజావాణి పార్లమెంట్లో ప్రతిధ్వనించాలి. ప్రభుత్వం వెంట అధికార బలం ఉండొచ్చేమోగానీ విపక్షాలు గతంతో పోలిస్తే మరింత గట్టిగా ప్రజావాణిని పార్లమెంట్లో వినిపించనున్నాయి. మమ్మల్ని మాట్లాడేందుకు మీరు అనుమతిస్తారని విశ్వసిస్తున్నాం. విపక్షసభ్యులు మాట్లాడితే ప్రజల గొంతు పార్లమెంట్లో మోగినట్లే. ఈ మేరకు మీరు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి’’ ‘‘గత లోక్‌సభ సెషన్లు అత్యంత ఫలవంతమయ్యాయని ప్రభుత్వం ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. విపక్షసభ్యులందరినీ సస్పెండ్ చేసి సభలో మౌనం రాజ్యమేలేలా చేయడం అప్రజాస్వామిక విధానం. సభ అత్యంత ప్రభావవంతంగా నడవడం కంటే ప్రజావాణి ఎంతగా సభలో వినిపించింది అనేదే ముఖ్యం’’ – రాహుల్ గాంధీ‘‘ప్రజాస్వామ్య న్యాయానికి ఓం బిర్లాయే చీఫ్ జస్టిస్. మరెవరి ఆదేశాల ప్రకారమోకాకుండా ఆయన మార్గదర్శకత్వంలోనే సభ సజావుగా సాగాలని ఆశిస్తున్నా. వివక్షలేకుండా ప్రతి రాజకీయ పక్షానికి సమానమైన అవకాశాలు కలి్పంచాలి. నిష్పక్షపాత వైఖరి ప్రదర్శించడం గొప్ప బాధ్యత. సస్పెన్షన్ వంటి సభ గౌరవానికి హాని కల్గించే చర్యలు పునరావృతంకాబోవని భావిస్తున్నా’’ – అఖిలేశ్ యాదవ్ ‘‘ సభలో విపక్షాలు బలం పుంజుకున్నాయి. దీంతో సభ కొత్తరూపు సంతరించుకుందిగానీ బీజేపీ వైఖరి మారలేదు. మెజారిటీ సభ్యులున్న పారీ్టలకు ప్రాధాన్యత దక్కుతోంది. సభకు సారథి అయిన స్పీకర్ చిన్న పార్టీలనూ పట్టించుకోవాలి’’ – అసదుద్దీన్ అడ్డంకులు లేకుండా సాగాలి... ‘‘నన్ను స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు. అధికార, విపక్ష సభ్యులు ఒక్కతాటిపై నడిస్తేనే సభ సాగుతుంది. ప్రతి ఒక్కరి గొంతుకనూ వినడమే భారత ప్రజాస్వామ్యపు మూలబలం. ఏకైక సభ్యుడున్న పారీ్టకి కూడా సభలో కావాల్సినంత సమయం లభించాలి. మనల్ని ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు. కనుక వారి సమస్యల పరిష్కారం కోసం సభ అడ్డంకుల్లేకుండా నడుస్తుందని ఆశిస్తున్నా. విమర్శలుండొచ్చు. కానీ సభను అడ్డుకోవడం సరి కాదు. సభ్యులపై చర్యలు తీసుకోవాలని నాకెప్పుడూ ఉండదు. కానీ ఉన్నత పార్లమెంటరీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు’’ – స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం లోక్‌సభనుద్దేశించి ఓం బిర్లా -
మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
నగరంపాలెం: గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా జడ్జి హాల్లో సోమవారం సుప్రీంకోర్టు మీడియేషన్/కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ(ఎంసీపీసీ–న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(అమరావతి) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గుంటూరు జోన్‌లోని గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఏపీ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయాధికారులు హాజరు కాగా, ఈ నెల 20 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి.శిక్షణ అధికారులుగా ఎంపికైన సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఢిల్లీ నుంచి నిషా సక్సేనా(జిల్లా జడ్జి), నీర్జాభాటియా(జిల్లా జడ్జి) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. వారు మధ్యవర్తిత్వానికి సంబంధించి పలు అంశాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్ఏసీ చైర్మన్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్‌బాబు, సంస్థ టి.లీలావతి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం అని అన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వం అనే సాధనం చక్కగా ఉపకరిస్తుందని వివరించారు. -
Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్–హమాస్ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఎవరూ వ్యతిరేకించనప్పటికీ శాశ్వత సభ్యదేశం అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ‘గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది’అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ‘ఎక్స్’లో తెలిపారు. అలాగే, గాజాలో చిక్కుకున్న పాలస్తీనియన్ల వైద్య, ఇతర మానవతా అవసరాలను పరిష్కరించాలని, నిర్బంధించిన వారందరికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉందని తీర్మానం పేర్కొంది. ‘ఈ తీర్మానాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. వైఫల్యం క్షమించరానిది’ అంటూ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. మండలి తీర్మానంపై ఇజ్రాయెల్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ ల్యూయిస్ పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల ఆకలిచావులను ఆపేందుకు మానవతా సాయం అందించేందుకు వీలు కల్పించాలని, చట్ట విరుద్ధ దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నెతన్యాహు ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్ నిర్ణయించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడం, ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి యుద్ధంతో విరుచుకుపడుతుంటం తెలిసిందే. -
ఆరు నెలల్లో 7,877 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల్లోనే 7,877 కేసులను పరిష్కారించామని, ఈ విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు ఇతర సిబ్బంది కృషి ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేయడం, కాగిత రహిత ఫైలింగ్ వంటి అంశాలు కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించడం హర్షణీయమన్నారు. త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభం కానుందని, అందరికీ అన్ని వసతులు, సాంకేతికతతో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లోనూ న్యాయస్థానాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. ఈ జిల్లాల్లో అన్ని వసతులతో భవన నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ.. హైకోర్టు ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీజే జస్టిస్ అలోక్ అరాధే శుక్రవారం భూమిపూజ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. -
కాల్పుల విరమణపై తీర్మానం..అమెరికా వీటో!
న్యూయార్క్: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా మోకాలడ్డింది యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్ మిలిటెంట్లు బేషరతుగా వెంటనే విడిచిపెట్టాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన ప్రతిపాదనకు ఐరాసలోని 90 సభ్యదేశాలు మద్దతు పలికాయి. ఆ దేశం మండలిలో ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి మొత్తం 15 దేశాలకు గాను 13 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. మరో శాశ్వత సభ్యదేశం బ్రిటన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. తక్షణమే మానవతా కోణంలో కాల్పుల విరమణ జరగాలని, పౌరుల రక్షణ కోసం, అత్యవసర సాయం అందజేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని మండలి దేశాలకు గుటెరస్ పిలుపునిచ్చారు. యూఎన్ ఛార్టర్‌లోని ఆర్టికల్ 99 కింద ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశ పరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో యూఏఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన వీటో అధికారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశ ప్రతినిధి రాబర్ట్ వుడ్ మండలిలో మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. అయితే, అస్థిరమైన కాల్పుల విరమణకు అంగీకరిస్తే హమాస్ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముసాయిదాలో సవరణలు చేయాలని అమెరికా అంటోంది. మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంపై యూఏఈ రాయబారి మహ్మద్ అబుషాహబ్ విచారం వ్యక్తం చేశారు. -
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. భారత్ ఆమోదం
న్యూయార్క్: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 91 దేశాలు ఓటు వేశాయి. ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం నాడు ఓటింగ్ జరిగింది. "ఆక్రమిత సిరియన్ గోలన్ ప్రాంతం నుండి జూన్ 4,1967 నాటి రేఖ వరకు వైదొలగాలని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి తీర్మానిస్తోంది' అని పేర్కొంటూ ఐరాస అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. 1967 యుద్ధంలో సిరియా నుంచి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా సహా 91 దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మాణానికి 8 దేశాలు-- ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, మైక్రోనేషియా, ఇజ్రాయెల్, కెనడా, మార్షల్ దీవులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇదీ చదవండి: జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం -
గాజా మానవతా సంధి తీర్మానానికి ఓటేయని భారత్
ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో.. తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే పలు ప్రతిపాదనలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా.. అందులో భారత్ కూడా ఉంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే దూరంగా ఉన్నాయి. ‘‘పౌరుల రక్షణ, చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ పేరిట జోర్దాన్ ఈ తీర్మానం ప్రతిపాదించింది. బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు మద్దతు తీర్మానానికి ఇచ్చాయి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే.. ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాల్ని భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తన నిర్ణయాన్ని వివరించింది. "ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని, దౌత్యం-చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించగా.. భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌లో పాల్గొంటామని యోజనా ముందుగానే తెలిపారు. కానీ, అది జరగలేదు. జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో హమాస్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్‌లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్ సహా 87 దేశాలు ఓటు వేశాయి. అయితే.. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది హమాస్. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సైన్యంతో ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ చేపట్టింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఫలితంగా.. గాజా ఛిద్రమైపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
‘అసైన్డ్’ రైతులకు యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల(ప్రొబిషన్ ట్రాన్స్ఫర్) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావేశాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది. ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది. నిరుపేదలకు భూ పంపిణీ రాష్ట్రంలో భూదాన్–గ్రామదాన్ బోర్డును ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్ – గ్రామదాన్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్ – గ్రామదాన్లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది. డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్‌కు ఉద్యోగం రాష్ట్రానికి చెందిన డెఫ్ ఒలింపిక్ విజేత, అంతర్జాతీయ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్‌కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది. -
ఇండియా బదులుగా భారత్ అని ముద్రించిన కేంద్రం
-
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
సాక్షి, హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ పేర్కొన్నారు. కోర్టులు, చట్టాల ద్వారా అందేది కక్షిదారులపై బయటి నుంచి రుద్దిన పరిష్కారమే అవుతుందని.. మనుషులంతా కూర్చుని సంప్రదింపులతో జరిపే మానవీయ పరిష్కారం కాదని చెప్పారు. విద్వేష భావనలు, విద్వేష ప్రసంగాలతో కలుషితం అవుతున్న సమాజంలో సోక్రటీస్ వంటి మహనీయులు ప్రవచించిన జీవన విధానం మంచిదని సూచించారు. శనివారం హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 20వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్సలర్ అలోక్ అరాధే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ‘‘మనుషులం కనుకే ఆలోచిస్తాం.. ఒకరికొకరు భిన్నంగా ఆలోచిస్తాం. తర్క, వితర్కాలతో సంభాషించుకుంటూనే శాంతియుతంగా జీవించే సమాజం ఉండాలి. మన రాజ్యాంగ నైతికత కూడా దీన్నే తెలియజేస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానంలో అందరి తర్కం, వాదన విని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. నాలుగు మెదళ్ల సంఘర్షణ నుంచి వచ్చే పరిష్కారం మెరుగ్గానే ఉంటుందనడంలో అశ్చర్యం అవసరం లేదు..’’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిది.. నల్సార్ వర్సిటీలో వసతులు కల్పించడంలో సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిదని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 25 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 25ఏళ్ల నల్సార్ వర్సిటీ ప్రస్థానంలో ఎన్నో కొత్త కోర్సులను తీసుకొచ్చామని, ఎందరో విద్యార్థులను సమాజానికి అందించామని చెప్పారు. లీగల్ ఎయిడ్‌తోపాటు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ప్రోత్సహించడంలో నల్సార్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలతో పాటు 58 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రొఫెసర్ బాలకృష్ణరెడ్డితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్థన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పేరు మార్చుకోనున్న కేరళ!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం అధికారికంగా పేరు మార్చుకోనున్నట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం ప్రస్తుతం ఉన్న కేరళ పేరును 'కేరళమ్'గా మారుస్తారు. అసెంబ్లీ మద్దతు లభించడంతో ఈ బిల్లును కేంద్ర ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సీఎం పినరయ్ విజయన్ కేంద్రాన్ని కోరారు. ఇంగ్లీష్‌తో సహా అన్ని భాషల్లో రాష్ట్ర పేరను కేరళమ్‌గా మార్చాలని అన్నారు. సభ్యులు తీర్మాణాన్ని అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శంషీర్ కూడా ఆమోదించారు. కేరళ రాష్ట్ర పేరును మలయాళంలో కేరళమ్ అనే అంటారు. కానీ, మిగిలిన అన్ని భాషల్లో కేరళగానే పిలుస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి మలయాళ భాష మాట్లాడే వారందర్ని కలిపి ఒక రాష్ట్రంగా పరిగణించారు. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రం పేరును కేరళగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పేరును రాష్ట్ర సర్కార్ మార్చాలని నిర్ణయించింది. ఇదీ చదవండి: మరో వివాదంలో రాహుల్ గాంధీ -
Manipur: మతం రంగు పులమొద్దు
ఢిల్లీ: మణిపూర్ హింసకు మతం రంగును అద్ది.. ఏకంగా పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టింది యూకే. అయితే దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత విషయాల్లో జోక్యాన్ని సహించబోమని చెబుతూనే.. వలసవాద బుద్ధిని ప్రదర్శించారంటూ మండిపడింది. తాజాగా ఈ ఎపిసోడ్లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇంఫాల్‌కు చెందిన పౌర సంఘాలన్నీ Coordinating Committee on Manipur Integrity సంయుక్తంగా.. యూరోపియన్ పార్లమెంట్‌కు లేఖలు రాశాయి. మణిపూర్ అల్లర్లు వలస చిన్-కుకీ నార్క్ ఉగ్రవాదులకు, స్థానిక మెయితీ తెగలకు మధ్య జరుగుతోంది. అంతేకాని దానికి మతం రంగు పులమడం సరికాదని పేర్కొన్నాయి. ఈ మేరకు స్ట్రాస్బోర్గ్కు చెందిన యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలాకు సీవోసీవోఎంఐ కో-ఆర్డినేటర్ జితేంద్ర నిన్గోంబా లేఖ రాశారు. ‘‘మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవహించడం సరికాదని, కేంద్రం సత్వరమే జోక్యం చేసుకుని ఉంటే ఉంటే పరిస్థితి ఇలా తయారయ్యేది కాదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలంటూ యూరోపియన్ పార్లమెంట్ తొలిసారిగా మణిపూర్ అంశం మీద తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ పరిణామాన్ని స్వాగతించిన సీవోసీవోఎంఐ.. మతం రంగు అద్దడంపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మణిపూర్ ఘర్షణలకు ఆజ్యం పోసింది నార్క్-టెర్రరిజం. అలాంటి ప్రధాన సమస్యను మీరు విస్మరించారు. తద్వారా మణిపూర్‌ను మరో న్యూ గోల్డెన్ ట్రయాంగిల్‌గా మారేందుకు అవకాశం కల్పించారు. (చైనా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ కారిడార్లను కలిపి ది గోల్డెన్ ట్రయాంగిల్‌గా అభివర్ణిస్తుంటారు.) ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టడం విచారకరం. చిన్-కుకీ ఉగ్ర సంస్థల ప్రచారం వల్లే.. మణిపూర్‌లో క్రైస్తవ మైనారిటీ, మెజారిటీ మెయితీ హిందువుల మధ్య వివాదంగా మీరు తప్పుగా అర్థం చేసుకోగలిగేలా చేసింది. మణిపూర్‌లో మతపరమైన కారణాల వల్ల హింస చెలరేగలేదు. పైగా ఇక్కడెంతో సామరస్యం విరజిల్లుతోంది కూడా. రాజధాని ఇంఫాల్ సహా మెయితీల ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లోనూ చర్చిల కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలగలేదని మీరు గమనించాలి. మణిపూర్‌లో లక్షాల డెబ్భై వేల జనాభా ఉన్న మెయితీ తెగ ప్రజలు క్రైస్తవులే. అలాగే.. కుకీ జనాభాలో 35 శాతం క్రైస్తవులు ఉన్నారు. కేవలం గంజాయి, మత్తు పదార్థాల రవాణా(నార్కో టెర్రరిజం), ఆయుధాల అక్రమ రవాణా మీద ఆధారపడి ఉన్న వలస ‘చిన్-కుకీ’ గ్రూప్‌ల వల్లే మణిపూర్‌కు ఈ పరిస్థితి దాపురించింది. వీళ్ల ప్రభావం సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్‌కు కూడా తప్పడం లేదు అని లేఖలో స్పష్టం చేసింది సీవోసీవోఎంఐ. ఇదీ చదవండి: మెయితీల వలసబాట.. కారణం ఎవరంటే.. -
అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీర్మానం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ చీఫ్ దివంగత జయలలితను ఉద్దేశించి పరోక్షంగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అమ్మను తెరపైకి తెచ్చి అవినీతి విమర్శ చేశాడంటూ అన్నామలైపై ఏఐఏడీఎంకే కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిత్రధర్మాన్ని బీజేపీ పాతరేస్తోందని మండిపడుతోంది. అదే టైంలో పొత్తు తెగిపోతోందనే ఊహాగానాల నడుమ ఇవాళ(మంగళవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎకేం ఓ తీర్మానం చేసి.. ఆమోదించింది. అన్నామలై చేసిన వ్యాఖ్యలు అనుభవలేమి, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవంటూ ఆ తీర్మానంలో పేర్కొంది పార్టీ. గత కొంతకాలంగా మిత్రపక్షంతో అన్నామలై తీరు సరిగా ఉండడం లేదని, తన వ్యాఖ్యలకు గానూ ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో మిత్రపక్షం(బీజేపీ) దృష్టిసారించాల్సిన అవసరం ఉందంటూ అందులో పేర్కొంది. వాస్తవానికి ఇవాళ జరిగిన ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శలు సమావేశమే. కొత్త సభ్యత్వం నమోదు గురించి చర్చించాల్సి ఉంది. అయితే అన్నామలై వ్యాఖ్యలు మంట పుట్టించిన నేపథ్యంలో అనూహ్యంగా ఇలా ఆయనకు వ్యతిరేక తీర్మానం ఆమోదించింది పార్టీ. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై.. జయలలితపై నమోదు అయిన అక్రమాస్తుల కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. ‘‘ఈ రాష్ట్రంలో(తమిళనాడు) అవినీతి పేరుకుపోయి ఉంది. మాజీ ముఖ్యమంత్రులు సైతం అవినీతి కేసుల్లో దోషులుగా తేలారు. ఈ కారణం వల్లే తమిళనాడు ఇవాళ దేశంలోనే అవినీతి రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అలాంటి ప్రభుత్వాలను బీజేపీ నిలదీసి తీరుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఏఐఏడీఎంకే క్యాడర్ నొచ్చుకుంది. 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సాయం చేసిన విషయాన్ని మరిచిపోయి ఉంటుందంటూ అన్నామలైకు చరకలు అంటించారు పలువురు నేతలు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అన్నామలై వెనక్కి తీసుకోకపోతే.. పొత్తు తెంచుకునే విషయంపై ఆలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది పార్టీ. ఇక ఇవాళ ఏకంగా అన్నామలైకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో తగ్గడం లేదు. అన్నామలై వ్యాఖ్యలను అన్నాడీఎంకే తప్పుగా అర్థం చేసుకుందని అంటోంది. మరోవైపు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే నేత డీ జయకుమార్‌పై బీజేపీ మండిపడింది. అన్నామలై అసలు ఓ పార్టీ చీఫ్‌గా ఉండేందుకు అర్హుడే కాదు. ఆయన మాటలు జారవిడిచి ఉండాల్సింది కాదు. ఆయన తీరు చూస్తుంటే మాతో పొత్తు కొనసాగించేందుకు ఆసక్తితో లేనట్లు కనిపిస్తోంది. లేదంటే.. మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని అనుకోవట్లేదమో అంటూ జయకుమార్ మండిపడ్డారు. ఇక అక్రమాస్తుల కేసులో A1 నిందితురాలుగా జయలలితే ఉన్నారు. అయితే తీర్పు వెలువడడానికి కంటే ముందే జయలలిత కన్నుమూశారు. ఈ కేసులో ఆమె నిచ్చెలి శశికళ, మరొకందరికి జైలు శిక్ష పడింది. జయలలిత అక్రమాస్తుల కేసు.. ఇవీ పూర్తి వివరాలు -
హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన యూఎస్ రాష్ట్రం
హిందూ ఫోబియాను, హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ యూఎస్‌లోని జార్జియా రాష్ట్రం ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న తొలి అమెరికన్ రాష్ట్రంగా నిలించింది. ఆ తీర్మానంలో.. హిందూఫోబియాను ఖండిస్తూ.. దాదాపు 100 దేశాలలో 1.2 బిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న అతిపెద్ద పురాతన మతాలలో హిందూ మతం ఒకటి. పైగా పరస్పర గౌరవం, శాంతి విలువలతో విభిన్న సంప్రదాయాలు, విశ్వాస వ్యవస్థలను కలిగి ఉన్న మతం అని తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానాన్ని అట్లాంటా శివారులోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు లారెన్ మెక్‌డొనాల్డ్, టాడ్‌జోన్స్ ప్రవేశపెట్టారు. అంతేగాదు ఈ తీర్మానంలో వైద్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్, అకాడెమియా, తయారీ, ఇంధనం, రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాలకు అమెరికన్-హిందూ కమ్యూనిటీ ప్రధాన సహకారాన్ని అందించిందని గుర్తించింది. అలాగే యోగా, ఆయుర్వేదం, ధ్యానం, ఆహారం, సంగీతం, కళలు వంటివి అమెరికా సాంస్కృతికతను సుసంపన్నం చేశాయి. పైగా అమెరికన్ కమ్యూనిటీ వాటిని అడాప్ట్ చేసుకోవడమేగాక మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచాయని కూడా పేర్కొంది. అలాగే దేశంలోని అనేక ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదైన ఘటనలను వివరిస్తూ..హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్యారంగానికి చెందిన కొందరు హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారని ఈ తీర్మానం పేర్కొంది. వాస్తవానికి ఈ నినాదం జార్జియా రాజధానిలో మార్చి 22న తొలిసారిగా హిందూ న్యాయవాద దినోత్సవాన్ని నిర్వహించే ఉత్తర అమెరికా హిందువలు కూటమి(కోహెచ్‌ఎన్‌ఏ) నుంచి వచ్చింది. దీనికి అమెరికాలోని రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు సంబంధించి సుమారు 25 మంది చట్టసభ సభ్యులు హాజరయ్యారు. అలాగే హిందూ కమ్యూనిటీలో చేరిన కొందరూ తమ ఆందోళనలు ఆర్థం చేసకుని, ఈ వివక్షకు వ్యతిరేకంగా సమాజాన్ని రక్షించే మార్గాలను రూపొందించడానికి కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు కోహెచ్‌ఎన్‌ఏ పేర్కొంది. కాగా, ఈ కౌంటీ రిజల్యూషన్‌ను ఆమోదించే ప్రక్రియలో మాకు మార్గనిర్దేశం చేసిన రెప్ మెక్‌డొనాల్డ్, రెప్ జోన్స్ తోపాటు చట్టసభ సభ్యులతో కలిసి పనిచేయడం నిజమైన గౌరవం అని కోహెచ్‌ఎన్‌ఏ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మీనన్ అన్నారు. ఇప్పటి వరకు శాసనసభ్యులందరూ ఎజెండాలోని శాసనపరమైన అంశాల ప్రకారం చాలా గంటలు పని చేస్తున్నారని విన్నాం. కానీ ఈ రోజు వారంతా హిందూ సమాజానికి ఎంత విలువ ఇస్తున్నారో చూపించడానికి న్యాయవాద దినోత్సవంలో మాతో చేరడమే గాక దాన్ని నిజం చేసి చూపించారని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కోహెచ్‌ఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి శోభా స్వామి మాట్లాడుతూ..హిందూ అమెరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అసత్య ప్రచారం తోపాటుగా ఈ హిందూ ఫోబిక్ కథనాలు కూడా అమెరికా కమ్యూనిటిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇవి ఒకరకరంగా హిందువులపై విద్వేషాన్ని పెంచేలా చేయడమేగాక భారతీయ అమెరికన్ సంతతికిచెందిన ప్రజలపై వివక్ష చూపేందుకు కారణమవుతోంది. అందువల్ల అటువంటి మతోన్మాదాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యేక చట్టాలు, పర్యవేక్షణ అవసరమని చెబుతూ వారి సహాయన్ని కోరినట్లు శోభా వివరించారు. (చదవండి: భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు) -
గెయిల్ గూటికి జేబీఎఫ్ పెట్రోకెమికల్స్
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో ఉన్న జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ కంపెనీని ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ కొనుగోలు చేయనుంది. రూ.2,079 కోట్లతో గెయిల్ వేసిన బిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించాలన్న పట్టుదలతో గెయిల్ కొంతకాలంగా ఉంది. ఇప్పుడు జెబీఎఫ్ కొనుగోలుతో కంపెనీ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు పడుతుంది. తాము ఇచ్చిన రుణాలను జేబీఎఫ్ చెల్లించక పోవడంతో రుణదాతలు ఎన్సీఎల్టీ అనుమతితో విక్రయానికి పెట్టారు. దీనికి గెయిల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ కర్సార్షియంతో పోటీ పడి మరీ గెయిల్ జేబీఎఫ్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.5628 కోట్లను రాబట్టుకునేందుకు జేబీఎఫ్‌ను వేలం వేసింది. కొనుగోలు లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని గెయిల్ తెలిపింది. జేబీఎఫ్కు మంగళూరు సెజ్‌లో 1.25 మిలియన్ టన్నుల టెరెఫ్తాలిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ ఉంది. గెయిల్‌కు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని పతా వద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ 8,10,000 టన్నుల వార్షిక పాలీమర్స్ తయారు చేయగలదు. వచ్చే ఏడాదికి మహారాష్ట్రలోని ఉసార్‌లో ప్రొపేన్ డీహైడ్రోజెనేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది (ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
కులవివక్షను నిషేధించిన సియాటిల్
వాషింగ్టన్: కులవివక్షను నిషేధిస్తూ అమెరికాలోని సియాటిల్ నగరం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం సావంత్ మీడియాతో మాట్లాడారు. కులవివక్ష వ్యతిరేక తీర్మానం భారీ మద్దతుతో ఆమోదం పొందిందని హర్షాతిరేకాల నడుమ వెల్లడించారు. ‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్ టైమ్స్ వార్తా పత్రిక కొనియాడింది. ‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్‌లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు. పలు సంస్థల వ్యతిరేకత! సియాటిల్ కౌన్సిల్ నిర్ణయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి! ‘‘ఈ విషయంలో కేవలం దక్షిణాసియావాసులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. ఇలా వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని జోడించడం అసంబద్ధం’’ అని హెచ్ఏఎఫ్ సహ వ్యవవస్థాపకుడు సుహాగ్ శుక్లా ఆరోపించారు. ‘‘ఈ ముసుగులో దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికావాసులతో మిగతా వారి కంటే భిన్నంగా వ్యవహరించనున్నారు. ఈ కుటిల యత్నాలకు ఈ ఓటింగ్ ద్వారా ఆమోదముద్ర పడింది’’ అంటూ దుయ్యబట్టారు. ఇదో ప్రమాదకరమైన తప్పుడు చర్య అని సంస్థ ఎండీ సమీర్ కల్రా అభిప్రాయపడ్డారు. ఈ చర్య సియాటిల్‌లోని దళిత బహుజనులకు కచ్చితంగా హాని చేసేదేనని అంబేడ్కర్–పూలే నెట్వర్క్ ఆఫ్ అమెరికన్ దళిత్స్ అండ్ బహుజన్స్కు చెందిన టి.మధు ఆరోపించారు. ఇలా కులాన్ని విధాన నిర్ణయంలో భాగం చేయడం స్థానికుల్లో హిందువుల పట్ల ఉన్న భయాన్ని (హిందూఫోబియా)ను మరింత పెంచుతుందని అమెరికాలోని భారత సంతతివారు ఆందోళన చెందుతున్నారు. హిందువులను భయభ్రాంతులను చేసే యత్నాల్లో భాగంగా అమెరికాలో గత మూడేళ్లలో పది హిందూ ఆలయాలు, గాంధీ, శివాజీ వంటి ఐదు విగ్రహాల విధ్వంస చర్యలు చోటుచేసుకున్నాయి. 2018 అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి. -
జగిత్యాల, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ల రద్దు! కౌన్సిళ్ల కీలక నిర్ణయం
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ జగిత్యాల: తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికీ పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. రైతుల ఉధృత ఉద్యమంతో.. కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి డీటీసీపీ, ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ సంస్థలు కలిసి ముసాయిదా రూపొందించడం, అందులో పంట భూములను పారిశ్రా మిక, వాణిజ్య జోన్లుగా చూపడాన్ని తప్పుపడుతూ రైతులు ఆందోళనకు దిగడం తెలిసిందే. జెడ్పీ మాజీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమానికి దిగారు. దీనికి వివిధ రాజ కీయ పక్షాలు మద్దతుగా నిలి చాయి. అయితే అడ్లూర్ ఎల్లా రెడ్డికి చెందిన రైతు పయ్యవుల రాములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో పోరాటం ఉధృతమైంది. చివరికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌లతో సమీక్షించారు. అనంతరం ముసా యిదా ప్రక్రియను నిలిపివేస్తున్నామని అరవింద్‌కుమార్ ప్రక టించారు. విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసు కుని కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. రైతుల భూమిని సేకరించే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయ లేదని, రైతుల భూములు ఎక్కడికీ పోవని చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణంలో రైతులకు నష్టం జరగకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో టపాసులు కాల్చారు. ఉద్యమానికి అండగా నిలిచారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అభినందించారు. జగిత్యాల మున్సిపాలిటీలోనూ.. జగిత్యాల మున్సిపాలిటీలోనూ ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ పాలకవర్గం శుక్రవారం తీర్మానించింది. జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ శివార్లలోని హుస్నాబాద్, తిప్పన్నపేట, మోతె, తిమ్మాపూర్, ధరూర్, నర్సింగాపూర్ గ్రామాలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. పలుగ్రామాల్లోని వ్యవసాయ భూములను రిక్రియేషన్, ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల పరిధిలో చేర్చారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజ లు, రైతులు ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారో కోలు, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, వంటావార్పుతో నిరసనలు తెలిపారు. గురువారం జగిత్యాల మున్సిపాలిటీ ముట్టడి, పట్టణ దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది.