Restriction
-
ఐఫోన్ 14 కొనుగోలు చేశారా? తాజా వార్నింగ్ ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 మోడల్స్ (ఐఫోన్ 14 ప్రొ,ప్రో మ్యాక్స్) కొనుగోలు చేసిన వినియోగదారులకు మరికొంత కాలం వేచి ఉండాల్సి వస్తుందనే హెచ్చరికలను జారీచేసింది. కరోనా కారణంగా తమ వినియోగదారులకు ఐఫోన్ 14 డెలివరీ అనుకున్న దానికంటే ఆలస్యం కానుందని యాపిల్ తెలిపింది. ఇటీవల కోవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆంక్షలతో ఉత్పత్తి ఆలస్యమవుతోందని వెల్లడించింది. చైనాలోని జెంగ్జౌలో కరోనా ఆంక్షలు అసెంబ్లింగ్ ప్లాంట్‌ను తాత్కాలింగా ప్రభావితం చేశాయని, ప్రస్తుతం చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని వెల్లడించింది. అలాగే సప్లయ్ చెయిన్ కార్మికుల ఆరోగ్యం, భద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫలితంగా షిప్‌మెంట్స్ లేట్ అవుతున్నాయని తాజా ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపింది. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్) చైనాలో రానున్న ఇయర్ ఎండ్ హాలిడే సీజన్‌కు ముందు చాలావరకు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు బిజీగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కరోనా ఆంక్షలు అక్కడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు పనిచేసే సెంట్రల్ చైనాలోని జెంగ్జౌ యాపిల్‌కు ఎంతో కీలకమైన ప్లాంట్‌లో తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చైనాలో కోవిడ్ నియంత్రణల కఠినతరంతో వచ్చే నెలలో ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్‌లో ఐఫోన్ల ఉత్పత్తి 30శాతం క్షీణించనుందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్‌ఫోర్స్ గత వారం జెంగ్జౌ ప్లాంట్‌లో సమస్యల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్మెంట్ల అంచనాను 80 మిలియన్ల నుండి 2-3 మిలియన్ యూనిట్లకు తగ్గించడం గమనార్హం. మరోవైపు అతిపెద్ద ఐఫోన్ తయారీదారు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, కరోనా నియంత్రణలతో దెబ్బతిన్న జెంగ్జౌ ప్లాంట్‌లో పూర్తి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. -
రష్యన్ బ్యాంకులతో సంబంధాలు కట్
HSBC-Russia: ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికా మొదలు అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో రష్యాతో లావాదేవీలు నిలిపేయాలంటూ పెద్ద బ్యాంకులు సైతం తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇంగ్లండ్‌కి చెందిన హెచ్ఎస్బీసీ బ్యాంకు రష్యాకి చెందిన పెద్ద బ్యాంకయిన వీటీబీతో లావాదేవీలు నిలిపేయాలని కోరింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఉద్యోగులకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లండ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అనుగుణంగా హెచ్‌స్‌బీసీ ఈ నిర్ణయం ప్రకటించింది. హెచ్ఎస్బీసీ బ్యాంకు దారిలోనే మరిన్ని ఆర్థిక సంస్థలు త్వరలో తమ నిర్ణయాలు ప్రకటించనున్నట్టు సమాచారం. -
‘బూస్టర్’ తీసుకున్న వారికే యూఏఈ అనుమతి
మోర్తాడ్ (బాల్కొండ): కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ దేశానికి వచ్చే విదేశీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కొత్త నిబంధనలను విధించింది. టీకా రెండు డోస్‌లు తీసుకున్న వారు బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన ఈ నెల 10 నుంచి అమలులోకి రానుంది. సాధారణంగా ఎక్కడైనా రెండు డోస్‌ల టీకాలనే ఇస్తున్నారు. మన దేశంలో బూస్టర్ డోస్ కేవలం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కే ఇవ్వాలని నిర్ణయించారు. ఇతరులకు బూస్టర్ డోస్ ఇచ్చే ఆంశం ఇంకా వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనలో ఉంది. దేశంలో కోవిషీల్డ్ టీకా ఎక్కువగా ఇస్తుండగా మొదటి డోస్‌కు, రెండో డోస్‌కు 84 రోజుల కాలపరిమితి విధానాన్ని అమలు చేస్తున్నారు. కేవలం విదేశాలకు వెళ్లే వారికి వీసా ఉంటేనే నెల రోజుల వ్యవధిలో రెండు డోస్‌ల టీకాలను ఇస్తున్నారు. ఇప్పుడు బూస్టర్ డోస్ అంశాన్ని యూఏఈ తెరమీదపైకి తేవడంతో యూఏఈ వెళ్లే వలస కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. వీసా గడువు సమీపించే వారికి కేంద్రం బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరుతున్నారు. డోస్‌ల మీద డోస్‌లు.. దేశంలో 2 డోస్‌ల టీకా కార్యక్రమం ఇంకా సాగుతుండగా యూఏఈలో వలస కార్మికులకు డోస్‌ల మీద డోస్‌ల టీకాలు వేస్తున్నారు. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్‌లను దృష్ట్యా చైనా ఉత్పత్తి చేసిన సినోఫాం టీకా రెండు, మూడు డోస్‌లు ఇచ్చారు. సినోఫాం టీకాతో వైరస్ కట్టడి కావడం లేదని తాజాగా ఆ టీకాలు మూడు డోస్‌లు తీసుకున్నవారికి మళ్లీ ఫైజర్ టీకా ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికీ 3, 4 డోస్‌లకు మించి టీకాలు ఇస్తున్నారు. చదవండి: ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!! -
Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు!
ముంబై: జనవరి మూడో వారం నాటికి మహారాష్ట్రలో రెండు లక్షల కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదు కావచ్చని అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా. ప్రదీప్ వ్యాస్ హెచ్చరించారు. ఒమిక్రాన్ మూడో వేవ్ ప్రమాదకారి కాదని ప్రజలు నిర్లక్ష్యం వహించడం తగదని, వ్యాక్సిన్ వేయించుకోనివారికి ప్రాణాంతకం కావొచ్చని, వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా మహారాష్ట్రలో శనివారం నాడు 9,170 కరోనావైరస్ కొత్త కేసులు నమోదవ్వగా, ఏడుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గత 11 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివాహాలు, సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, అంత్యక్రియల హాజరుపై గురువారం కొత్త ఆంక్షలు ప్రకటించింది. తాజా ఆంక్షల ప్రకారం వివాహాలు లేదా ఏదైనా ఇతర సామాజిక, రాజకీయ లేదా మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యేవారి గరిష్ట సంఖ్య 50 మందికి మించకూడదు. అలాగే అంత్యక్రియలకు హాజరయ్యేవారి గరిష్ట సంఖ్య 20కి పరిమితం చేయబడింది. సోమవారంనాటికి దేశంలోనే అధిక సంఖ్యలో మొత్తం 510 ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. చదవండి: Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా! -
సింగపూర్ నుంచి వచ్చేవారికి తప్పిన ‘ రిస్క్’ ! కేంద్రం కొత్త ఆదేశాలు
సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చే ఎన్నారైలు, అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కేంద్రం తాజాగా సవరించిన అట్ రిస్క్ దేశాల జాబితా నుంచి సింగపూర్‌ని తొలగించింది. అదే సమయంలో కొత్తగా ఘనా, టాంజానియా దేశాలు ఈ జాబితాలో చేర్చింది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభనతో అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు పెంచారు. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులలో కోవిడ్ పరీక్షలు, ఆ తర్వాత క్వారంటైన్ నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఒమిక్రాన్ ప్రభావం నుంచి దేశాల జాబితాను అట్ రిస్క్ పేరుతో కేంద్రం ప్రకటించింది. ఇందులో తొలుత యూకే, దక్షిణాఫ్రిక, బ్రెజిల్, బొట్సవానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజీల్యాండ్, జింబాబ్వే, సింగపూర్, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ దేశాలు ఉన్నాయి. తాజాగా సవరించిన జాబితాలో సింగపూర్ దేశాన్ని ఈ జాబితా నుంచి తొలగించగా ఘనా, టాంజానియాలు ఇందులో చేరాయి. తాజా నిబంధనల ప్రకారం ఇకపై సింగపూర్ దేశం నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్టులలో కోవిడ్ నిర్థారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం ఎదురు చూడక్కర్లేదు. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కారణంగా దాదాపు అన్ని ఎయిర్‌పోర్టులలో అట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కనీసం రెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. చదవండి:అంతర్జాతీయ విమానాలు రద్దు.. డీజీసీఏ కొత్త ఆదేశాలు -
భారతీయులు సౌదీకి రావచ్చు.. కానీ ఈ రూల్ పాటించాల్సిందే?
కోవిడ్ ఆంక్షల నుంచి పలు దేశాల పౌరులకు సౌదీ అరేబియా మినహయింపు ఇచ్చింది. అయితే విదేశాల నుంచి సౌదీ అరేబియా వచ్చే పౌరులు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తో పాటు కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. తమ రాజ్యంలోకి బయటి దేశాల వ్యక్తులను అనుమతించడం లేదు. అయితే ఇటీవల వ్యాక్సినేషన్ పెరగడంతో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. దీంతో భారత్ , పాకిస్తాన్, ఇండోనేషియా, ఈజిప్టు, బ్రెజిల్, వియత్నాం దేశాల పౌరులు సౌదీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇచ్చింది. క్వారంటైన్ అనుమతి పొందిన ఆరు దేశాల నుంచి సౌదీ వచ్చే పౌరులు తప్పని సరిగా 5 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనంటూ సౌదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆయా దేశాలలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తమ దేశంలో క్వారంటైన్లో ఉండాలని సూచించింది. డిసెంబరు 1 నుంచి తమ దేశంలోకి విదేశీ ప్రయాణికులను అనుమతిస్తామని తెలిపింది. చదవండి: Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం -
ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్ అక్కర్లేదు.. కొత్త మార్గదర్శకాలు
చాన్నాళ్లుగా విదేశాల్లో చిక్కుపోయిన వారికి, ఎన్నాళ్ల నుంచో స్వదేశం రావాలని ప్లాన్ చేసుకున్న ఎన్నారైలకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంతార్జతీయ ప్రయాణికులపై ఉన్న క్వారంటైన్ నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. లిస్ట్ ఏలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో క్వారెంటైన్ భయాలు తొలగిపోయాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్‌కి సంబంధించి 99 దేశాలతో భారత్ అవగాహన కుదుర్చుకుంది. ఈ దేశాల్లో డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన వ్యాక్సిన్లు అందిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఎయిర్ సువిధా పోర్టల్‌లో తమ వ్యాక్సినేషన్‌కి సంబంధించిన రిపోర్టుని అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ప్రయాణానికి 72 గంటల ముందు జారీ చేసిన కోవిడ్ నెగటీవ్ రిపోర్టకు కూడా జత చేయాలి. ఈ రెండు పనులు చేసిన ప్రయాణికులు ఇండియా వచ్చిన తర్వాత 14 రోజుల నిర్బంధ క్వారంటైన్ ఉండక్కర్లేదు. లిస్ట్ ఏలో 99 దేశాల జాబితాలో విదేశీ ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఖతర్, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ తదితర దేశాలు ఉన్నాయి. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతెఓ పాటు ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రయాణం సందర్భంగా కోవిడ్‌రూల్స్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అక్టోబరు 15 నుంచే విదేశీ ప్రయాణికులను ఇండియాలోకి అనుమతి ఇస్తున్నారు. అయితే అప్పుడు కేవలం ఛార్టెడ్ ఫ్లైట్లకే అనుమతి ఇచ్చారు. కాగా ఇప్పుడు కమర్షియల్ విమానాలకు పచ్చజెండా ఊపారు. చదవండి: వలస కార్మికులకు ఉచిత వీసాలు -
జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం...!
Google Get Rid Of Stalkerware Ads Promoting Spying On Spouse: ప్రస్తుత టెక్నాలజీతో ప్రతిదీ సాధ్యమే..! టెక్నాలజీను మంచి మార్గంలో వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు..! అదే చెడు కోసం వాడితే భారీ ముప్పునే కల్గిస్తుంది. కొంత మంది వీపరిత బుద్దితో సాంకేతికతను దుర్వినియోగం కోసం వాడే వారు ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని ఉపయోగించి తమ భాగస్వాములపై నిఘా పెట్టడం కోసం పలువురు స్టాకర్వేర్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదే కొంత మందికి అదునుగా మారి ఆయా వ్యక్తుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ జీవిత భాగస్వామిపై నిఘా పెట్టేందుకు స్టాకర్వేర్ యాప్స్ భారీగానే అందుబాటులో ఉన్నాయి. ఈ స్టాకర్వేర్ యాప్స్ ద్వారా జీవిత భాగస్వామి ఫోన్ మెసేజ్‌లు, కాల్ లాగ్‌లు, లొకేషన్, ఇతర వ్యక్తిగత కార్యకలాపాలను తెలుసుకుంటున్నారు. ఈ స్టాకర్వేర్ యాప్స్ ఫోన్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. చదవండి: మొన్న ఫేస్బుక్ డౌన్..! ఇప్పుడు జీ మెయిల్..! స్టాకర్వేర్ యాప్స్‌పై గూగుల్ కీలక నిర్ణయం..! తాజాగా స్టాకర్వేర్ యాప్స్‌పై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాకర్వేర్ యాప్స్‌ను ప్రోత్సహించే యాప్స్‌పై గూగుల్ ఉక్కుపాదం మోపింది. అంతేకాకుండా స్టాకర్వేర్ యాడ్స్‌ను కూడా గూగుల్ యాడ్స్‌లో కన్పించకుండా చేసింది. జీవిత భాగస్వాములపై నిఘా పెట్టే యాప్స్ గూగుల్ కఠినవైఖరిని అవలంభిస్తోందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. కొన్ని యాప్స్ అనేక పద్దతులను ఉపయోగించి స్టాకర్వేర్ యాప్స్‌ను ప్లేస్టోర్‌లో చొప్పించే ప్రయత్నాలను చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. స్టాకర్వేర్ యాప్స్‌పై గూగుల్ ఎప్పటికప్పుడు నిఘా పెడుతుందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. భారత్‌లో నిఘా ఎక్కువే...! ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కాస్పర్‌స్కై నివేదిక ప్రకారం...స్టాకర్వేర్ యాప్స్‌తో భారత్‌లో సుమారు 4627 మంది ప్రభావితమైనట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా స్టాకర్వేర్ యాప్స్‌తో 2019లో 67,500 మంది, 2020లో 53,870 మంది ప్రభావితమయ్యారు. చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...! -
విమాన ప్రయాణికులకు శుభవార్త! ఇకపై ఆంక్షల్లేవ్
విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సర్క్యూలర్‌ని జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబరు 18 నుంచి దేశీయంగా విమాణ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభనతో దేశంలో విమాన సర్వీసులపై ఆంక్షలు విధించారు. ప్లైట్‌లో ప్రయాణించాలంటే కోవిడ్ నెగటీవ్ సర్టిఫికేట్, మాస్క్ తదితర రక్షణ చర్యలను కట్టుదిట్టం చేశారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించే లక్ష్యంతో విమానంలో ప్రయాణికుల పరిమితిపరై ఆంక్షలు విధించారు. మే 21వ తేది నుంచి ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే కోవిడ్ తగ్గుముఖం పడుతుంటంతో క్రమంగా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తి వేస్తూ వస్తున్నారు. చివరి సారిగా విమాన ప్రయాణాలపై సెప్టెంబరు 18 మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. వాటి ప్రకారం 85 సామర్థ్యంతో మాత్రమే ప్రయాణికులకు అనుమతించారు. తాజాగా ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఇకపై విమానాలు వంద శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 18 నుంచి విమానయాన సంస్థలు వంద శాతం టిక్కెట్లను విక్రయించనున్నాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ఫ్టైట్ ఆపరేటర్లు పూర్తి స్థాయిలో టిక్కెట్లు విక్రయించడం లేదు. దీంతో సమయానికి టిక్కెట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది. చదవండి:ఎయిర్‌లైన్స్ మహిళా సిబ్బంది..... ఇక హైహిల్స్, స్కర్ట్స్‌కి స్వస్తీ -
కర్ణాటక: వినాయక చవితి వేడుకలకు ఓకే.. కండిషన్స్ అప్లై
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో బహిరంగ స్థలాల్లో గణేశ్ చతుర్ధి ఉత్సవాలపై ఉత్కంఠ వీడిపోయింది. గరిష్టంగా అయిదు రోజులపాటు మండపాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పలు షరతులతో సమ్మతించింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలనపై పూర్తిగా నిషేధం విధించింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అధ్యక్షతన ఆదివారం బెంగళూరులో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ చవితి పండుగ ఆచరణ గురించి వెల్లడించారు. చదవండి: గణేష్ మండపాల ఏర్పాటులో ఈ జాగ్రత్తలు పాటించండి గణేశ్ ఉత్సవాలకు షరతులు ► కరోనా నియమాలతో సార్వజనిక గణనాథుల విగ్రహాల ప్రతిష్టాపనకు జిల్లా యంత్రాంగం అనుమతి తప్పనిసరి. తాలూకా, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అధికారుల అనుమతి ఉండాలి ►నగర ప్రాంతాల్లో వార్డుకు ఒకచోట మాత్రమే విగ్రహం ఏర్పాటు చేయాలి ►గణేశ ఉత్సవ సంఘాలవారు కోవిడ్ టీకా వేసుకోవాలి ►గణనాథుల మండపాల వద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ అభియాన్ నిర్వహించాలి ►మండపాల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు, డీజేలకు అనుమతిలేదు ►నిమజ్జన సమయంలో వాయిద్యాలు, ఊరేగింపులకు నో ►సరిహద్దు జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉన్నచోటే అనుమతిస్తారు. ►నగరాల్లో అపార్టుమెంట్లలో విగ్రహాలను ప్రతిష్టించవచ్చు. 20 మంది కంటే ఎక్కువ మంది గుంపుగా చేరరాదు. ►రాత్రి 9 గంటల తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి లేదు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి -
విమాన రాకపోకలపై ఆంక్షలను పొడిగించిన కెనడా
సాక్షి,న్యూఢిల్లీ: కోవిడ్-19 పరిస్థితిని పరీక్షించిన అనంతరం కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా-కెనడా మధ్య విమానాల రాకపోకలపై ఆంక్షలను మరికొంతకాలం పొడిగించింది. ముఖ్యంగా ఇండియాలో కరోనా పరిస్థితి నేపథ్యంలో ఆగస్టు 21 వరకు ఇండియన్ విమానాలపై సస్పెన్షన్ విధించినట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది. పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసుల ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రవాణా మంత్రి ఒమర్ అల్ఘాబ్రా ట్వీట్ చేశారు. తమ దేశ వాసుల ఆరోగ్యం, భద్రతే మొదటి ప్రాధాన్యమని కెనడా ఆరోగ్య మంత్రి వెల్లడించారు. రెండు దేశాల మధ్య డైరెక్ట్ విమానాలను మరో 30 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. దీని ప్రకారం భారతీయ విమానాలపై ఆగస్టు 21 వరకు బ్యాన్ కొనసాగనుంది. అయితే పరోక్ష మార్గం ద్వారా భారతదేశం నుండి కెనడాకు ప్రయాణించేవారు మూడో దేశం నుంచి కోవిడ్-19 మాలిక్యులర్ టెస్ట్ ఫలితాలను ప్రకటించాలని కెనడా కోరింది. దీంతోపాటు పూర్తిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నఅమెరికన్ పౌరులు, కెనడా పౌరులకు ఆగస్టు 9 నుంచే అనుమతి ఉంటుందని తెలిపింది. కాగా ఇండియాలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి ఇపుడిపుడే చల్లారుతున్నప్పటికీ థర్డ్ వేవ్ భయం వెన్నాడుతోంది. ముఖ్యంగా దేశంలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్న వైనం ఆందోళన రేపుతోంది. దీంతో పలు దేశాలు భారతీయ విమానాలపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇండియా, పాకిస్తాన్ విమానాలపై కెనడా ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. -
అమెరికా తీరుపై రష్యా ఆగ్రహం..!
మాస్కో: మానవుడి మేధస్సుతో శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి అనేక రంగాల్లో విజయాలను ఇప్పటికే జయించాడు. ఒక అడుగు ముందుకువేసి అంతరిక్షరంగంలో తనదైన ముద్ర వేశాడు. ప్రపంచంలోని అగ్రదేశాలు ఇతర గ్రహాలపై పరిశోధనలను కూడా మొదలుపెట్టాయి. అంతేకాకుండా అంతరిక్షంలో పాగా వేసేందుకు అగ్రదేశాలు ఇప్పటికే పనులను షురూ చేశాయి. అందులో భాగంగానే చైనా ఏప్రిల్ 29 రోజున తన సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడంలో విఫలమైన విషయం తెలిసిందే. చైనా అవలంభిస్తోన్న స్పేస్ కార్యక్రమాలపై ప్రపంచదేశాలు కన్నెర్ర చేశాయి. చైనా తన సొంత స్పేస్ స్టేషన్‌ను నిర్మాణం తలపెట్టడానికి ముఖ్యకారణం ప్రస్తుతమున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చోటులేకపోవడం. ఆంక్షలను ఎత్తి వేయండి...! ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌పై అమెరికా అవలంభిస్తోన్న తీరుపై రష్యా ఆగ్రహం..! పెదవి విరిచింది. స్పేస్ సెక్టార్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాను హెచ్చరించింది లేకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వైదొలుగుతుందని రష్యా తెలిపింది. రష్యా ఐఎస్ఎస్లో ఆపరేషల్ గడువు 2025 కు ముగియనుంది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ అధిపతి డిమిత్రి రోగోజిన్ జెనీవాలో శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ వ్యాఖ్యలను చేశారు. శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, రష్యా దేశాల అధ్యక్షులు పాల్గొంటారు. జో బైడెన్ వైట్ హౌస్ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఇరు దేశాధినేతలు సమావేశమవుతున్నారు. అమెరికా స్పేస్ రంగంపై విధించిన ఆంక్షలు అంతరిక్ష రంగ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కల్గిస్తోందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ అధిపతి డిమిత్రి రోగోజిన్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను భూమి నుంచి 200 మైళ్ల దూరంలో యూఎస్, యూరప్, రష్యా దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో యూఎస్, రష్యాకు సంబంధించిన వ్యోమగాములు పాలు పంచుకుంటున్నారు. జెనీవాలో జో బైడెన్‌తో జరిగే శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పేస్ రంగంపై అమెరికా విధించిన ఆంక్షలపై చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది. చదవండి: చైనా తీరుపై మండిపడ్డ నాసా..! -
ఈ హెరిటేజ్ సైట్స్‌లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు.. మన దేశంలోనూ చాలా ఉన్నాయి. ఇవన్నీ మన వారసత్వ సంపద. కొంతమంది వీటిల్లో కొన్నిటికి వెళ్లి ఉంటారు కూడా.. ఈ హెరిటేజ్ సైట్స్ గురించి మనకు తెలుసు.. మరి.. కేవలం గూగుల్ మ్యాప్‌లోనే చూడగల సైట్స్ గురించి మీకు తెలుసా? ఎందుకంటే.. ఇక్కడ మనకు నో ఎంట్రీ.. ఈ ఆదివారం వరల్డ్ హెరిటేజ్ డే. ఈ సందర్భంగా అలాంటి డిఫరెంట్ ప్రదేశాల గురించి కాస్త తెలుసుకుందామా.. స్నేక్ ఐలాండ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. విస్తీర్ణం కేవలం 106 ఎకరాలు. బ్రెజిల్ తీరంలో ఉండే ఈ ప్రదేశం అత్యంత విషపూరితమైన సర్పాలకు నిలయం. చిన్న ద్వీపమే అయినా.. ఇక్కడ 4 వేలకు పైగా విషపూరితమైన పాములు ఉంటాయి. అందుకే.. బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడ పర్యాటకులను అనుమతించదు. శాస్త్రవేత్తలకు పరిశోధనల నిమిత్తం పరిమిత స్థాయిలో మాత్రమే అనుమతిస్తుంది. సర్ట్ట్సీ ఇదో ద్వీపం.. ఎలా ఏర్పడిందో తెలుసా? 1963లో సముద్రంలో పేలిన ఓ అగ్నిపర్వతం వల్ల.. దాని తాలూకు లావా అవన్నీ సముద్ర ఉపరితలం మీదకు వచ్చి.. కాలక్రమేణా ద్వీపంలా ఏర్పడింది. అప్పటినుంచి దీన్ని ఓ నేచర్ ల్యాబొరేటరీగా పరిరక్షిస్తున్నారు. ఏమీలేని బంజరు భూమిలాంటి దానిపై మళ్లీ జీవం పురుడుపోసుకోవడం.. మొక్కలు తదితర జీవజాతులు ఏర్పడటం వంటిదాన్ని జీవశాస్త్రవేత్తలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ఇక్కడ ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. ఈ దీవి ఐస్‌ల్యాండ్‌కు దగ్గరగా ఉంది. వాటికన్ రహస్య పత్రాలు.. ఇక్కడ ఎవరు పడితే వారు వెళ్లలేరు.. ఈ రహస్య పత్రాలపై అజమాయిషీ అంతా పోప్‌దే. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పండితులకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ. ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల పరిశీలనల అనంతరం అనుమతి ఇస్తారు. ఇక్కడ వెయ్యేళ్ల క్రితం నాటి పత్రాలు ఉన్నాయి. అందులోనూ కొన్నిటిని మాత్రమే చూడటానికే అనుమతి ఇస్తారు.. ఇందులో ప్రఖ్యాత శాస్త్రవేత్త గెలీలియో విచారణకు సంబంధించినవి.. కింగ్ హెన్రీ–8, మార్టిన్ లూథర్ ఇలా ఎంతోమంది ప్రముఖులతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. .. తొలుత అయితే.. సదరు శాస్త్రవేత్త లేదా పండితుల వయసు 75 ఏళ్లు దాటి ఉండాలనే నిబంధన కూడా ఉండేది.. తర్వాతి కాలంలో దీన్ని సడలించారు.. బొహీమియన్ గ్రోవ్.. కాలిఫోర్నియాలో 2700 ఎకరాల పరిధిలో వెయ్యేళ్లనాటి భారీ వృక్షాలతో కూడిన చిన్నపాటి అటవీ ప్రాంతంగా దీన్ని చెప్పవచ్చు. అమెరికాలోని రిచ్ అండ్ పవర్ఫుల్ వ్యక్తులకు సంబంధించిన బొహీమియన్ క్లబ్.. దీని ఓనర్. 1872లో ఈ క్లబ్‌ను స్థాపించారు. ఇందులో అత్యున్నత స్థాయి వ్యక్తులు, అమెరికా మాజీ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. మాజీ సైనికులు ఇక్కడ రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఏటా వేసవిలో క్లబ్ సభ్యులు ఇక్కడ కలుసుకుంటారు. స్వాల్బార్డ్ ప్రపంచ విత్తన బ్యాంకు నార్వేకు సంబంధించిన ఓ ద్వీపంలో ఉందీ విత్తన బ్యాంకు. ప్రపంచంలో ఆహార సంక్షోభం లాంటివాటిని ఎదుర్కోవడానికి అన్ని రకాల పంటల విత్తనాలను ఇక్కడ దాచి ఉంచుతున్నారు. ప్రస్తుతం 9.3 లక్షల విత్తనాల శాంపిల్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం గూగుల్ మ్యాప్‌లోనూ.. ఫొటోల్లోనూ చూడాల్సిందే.. ఇక్కడ పర్యాటకులకు ఎంట్రీ నిషిద్ధం. ఏరియా 51 ఇది చాలా ఫేమస్ ప్లేస్.. దీనిపై సినిమా కూడా తీశారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రదేశం.. నెవడాలో ఉంది. పై నుంచి విమానాలు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఇక మనలాంటోళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఫొటోలే చాలా రేర్‌గా దొరుకుతాయి. ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నడుస్తాయని పైకి చెబుతారు కానీ.. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతోందన్నది ఎవరికీ తెలియదు. ఉత్తర సెంటినల్ ద్వీపం.. సెంటినలీజ్.. మిగతా ప్రపంచంతో అస్సలు సంబంధం లేకుండా జీవనం సాగించే తెగ ఇది. ఈ ద్వీపానికి వాళ్లు ఎవరినీ రానివ్వరు.. కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు.. వీళ్లతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నించిన కొందరిని చంపేశారు కూడా.. ఈ సెంటినల్ ద్వీపం మరెక్కడో లేదు.. మన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఇది కూడా ఒకటి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అంబానీ కుమారుడు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల దృష్ట్యా వ్యాపారాలపై విధించిన ఆంక్షలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాదు నటులు, ప్రొఫెషనల్ క్రికెటర్లు, రాజకీయ నాయకులకు లేని ఆంక్షలు వ్యాపారాలకు ఎందుకుంటూ మండిపడ్డారు. అసలు 'ఎసెన్షియల్’ అర్థం ఏమిటి? అంటూ మహారాష్ట్ర అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రొఫెషనల్ 'నటులు' వారి వారి సినిమాల షూటింగ్ కొనసాగించుకోవచ్చు. ప్రొఫెషనల్ 'క్రికెటర్లు' అర్థరాత్రి వరకు ఆడుకోవచ్చు. ప్రొఫెషనల్ 'రాజకీయ నాయకులు' భారీగా గుమిగూడిన జనాలతో ర్యాలీలను కొనసాగించవచ్చు. కానీ వ్యాపారం లేదా పని ఎసెన్షియల్ కాదా అని అన్మోల్ అంబానీ ప్రశ్నించారు. ఎవరి పని వారికి అత్యవసరమే అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మరోవైపు కరోనా కేసుల పెరుగుదల మధ్య మహారాష్ట్రలో వ్యాక్సిన్లు అయి పోతున్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇక మూడు రోజులకు సరిపడా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 14 లక్షల వ్యాక్సిన్ మోతాదులు ఉన్నాయని, రాబోయే మూడు రోజులకు ఇవి సరిపోతాయని అన్నారు. కాగా దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో మరింత తీవ్రంగా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. సినిమా హాళ్ళు, పార్కులు, మ్యూజియంలు , రెస్టారెంట్లు అన్ని మత ప్రదేశాలను మూసి ఉంచాలని, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని, రాత్రిపూట సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూ ఉంటుందని ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో, అవసరమైన సేవలను మాత్రమే అనుమతిస్తామని మంత్రివర్గం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వారాంతంలో (శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు) పూర్తి లాక్డౌన్ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. What does essential even mean? EACH INDIVIDUALS WORK IS ESSENTIAL TO THEM. #scamdemic — Anmol A Ambani (@anmol_ambani) April 5, 2021 -
అలా అయితే నాల్గో టెస్టు వాకౌట్ చేస్తాం
అంతా సాఫీగా, ఆత్మీయంగా సాగిపోతే... ఏదో ఒక రచ్చ లేకపోతే అది భారత్–ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ఎలా అవుతుంది? ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా సాగుతున్న పర్యటనలో అనూహ్యంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హోటల్లో భోజనం కారణంగా ‘ఐసోలేషన్’తో మొదలైన చర్చ తర్వాతి రోజు భారత జట్టు నాలుగో టెస్టును బాయ్‌కాట్ చేయడం వరకు చేరింది! కరోనా నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మళ్లీ కఠిన ఆంక్షల మధ్య ఆడాల్సి వస్తుండటం టీమిండియా అసంతృప్తికి కారణం. మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెటర్లు సుమారు రెండు నెలల పాటు బయో బబుల్‌లోనే ఐపీఎల్ ఆడారు. ఇక్కడికి చేరుకోగానే రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండి ఆ తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టారు. 3 వన్డేలు, 3 టి20లు, 2 టెస్టులు కూడా జరిగిపోయాయి. జనవరి 7 నుంచి జరిగే మూడో టెస్టుకు క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. ఆపై మరో మ్యాచ్ ఆడితే స్వదేశం తిరిగి వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఒక్క మ్యాచ్ కోసమే మళ్లీ కఠిన కరోనా ఆంక్షలు పాటించాల్సి వస్తే..! ఇదే ఇప్పుడు జట్టు ఆటగాళ్లను అసహనానికి గురి చేస్తోంది. అవసరమైతే చివరి టెస్టు ఆడకుండానే వెళ్లిపోతామని కూడా వారు చెబుతున్నారు. హోటల్ గది... గ్రౌండ్... హోటల్... షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మూడో టెస్టు వేదిక అయిన సిడ్నీలో కూడా కేసులు ఎక్కువగా ఉండటంతో క్వీన్స్లాండ్ రాష్ట్రం ఇప్పటికే సిడ్నీకి వెళ్లే సరిహద్దులు మూసేసి రాకపోకలపై నిషేధం విధించింది. అయితే సిరీస్ ఆరంభానికి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఇచ్చిన మాట ప్రకారం ఆటగాళ్లు తమ నగరానికి వచ్చి టెస్టు ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే సిడ్నీ నుంచి వచ్చేవారి విషయంలో ఎలాంటి కరోనా ఆంక్షలు విధిస్తారో అనే విషయంపై స్పష్టత లేదు. ఇంకా చెప్పాలంటే బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాలంటే సిడ్నీ నుంచి ఆంక్షలు పాటిస్తూ రావాల్సి రావచ్చు. ఇక్కడే మన ఆటగాళ్లు భయపడుతున్నారు. అయితే మరోసారి పూర్తిగా హోటల్ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని వారు స్పష్టంగా చెప్పేశారు. ‘ప్రస్తుత పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. ఈ పర్యటన విషయంలో సీఏ, బీసీసీఐ కలిసి బాగా పని చేశాయి. మేం కూడా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఆస్ట్రేలియా పర్యటించేందుకు సిద్ధమయ్యాం. అయితే మేం ఒకసారి ఇక్కడికి రాగానే క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మమ్మల్ని కూడా సాధారణ ఆ స్ట్రేలియా పౌరుల్లాగానే చూడాలి. ఐపీఎల్ నుంచి మేం బబుల్‌లోనే ఉంటున్నాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా బ్రిస్బేన్‌లో మరో బబుల్ అంటే మా వల్ల కాదు. అవకాశం ఉంటే చివరి టెస్టు కూడా సిడ్నీలోనే నిర్వహించాలి. లేదంటే మేం చివరి టెస్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడం’ అని భారత క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే చివరి టెస్టుకు మరికొంత సమయం ఉన్నందున ప్రస్తుతానికి టీమ్ మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉంది. మేం బ్రిస్బేన్‌లోనే ఆడతాం... ఒకే వేదికపై వరుసగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధంగా లేము. సిరీస్ ఆరంభానికి ముందు నిర్ణయించిన షెడ్యూల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కట్టుబడి ఉంది. మా వైపు నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు లేదు. మేం బ్రిస్బేన్‌లో ఆడేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. అక్కడ కఠినమైన ఆంక్షలు, బయో బబుల్ ఉండవచ్చు కూడా. అయితే అన్నింటినీ మేం పాటిస్తాం. హోటల్ నుంచి మైదానానికి మాత్రమే వెళ్లి వచ్చే అనుమతి ఉంటే తప్పేముంది. అలాగే చేద్దాం. –మాథ్యూ వేడ్ భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దు. ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి. –రాస్ బేట్స్, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు (షాడో మినిస్టర్) అంతా కలిసి సిడ్నీకి... మూడో టెస్టు కోసం భారత జట్టు మొత్తం నేడు ప్రత్యేక విమానంలో సిడ్నీకి వెళుతుంది. బయో సెక్యూరిటీ బబుల్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ‘ఐసోలేషన్’లోకి వెళ్లిన ఐదుగురు ఆటగాళ్లు రోహిత్, పంత్, పృథ్వీ, గిల్, సైనీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా జట్టుతో పాటే ప్రయాణిస్తారు. హోటల్ ఘటనపై సీఏ విచారణ కొనసాగిస్తున్నా... సహచరులతో వెళ్లే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాకు తెలిసి ఆటగాళ్లపై ఎలాంటి చర్యా ఉండదు. ఆ అభిమాని తనను పంత్ హత్తుకున్నాడని అబద్ధం చెప్పి ఉండకపోతే పరిస్థితి అసలు ఇంత దూరం వచ్చేదే కాదు. ఏదో బయట వర్షం పడుతుంటే క్రికెటర్లంతా లోపలికి వెళ్లారు. ఆటగాళ్ల అనుమతి లేకుండా అతను వీడియో తీశాడు. పైగా ఎవరూ అడగకపోయినా బిల్లు చెల్లించి ప్రచారం కోసం సోషల్ మీడియాలో పెట్టాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సదరు ఘటన విషయంలో టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీశ్ డోంగ్రీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లు ఒక జాబితా పట్టుకొని తిరగరు. ఇవన్నీ చూసుకోవాల్సింది మేనేజర్ మాత్రమే. ఈ విషయంలో అతను తప్పు చేసినట్లు అనిపిస్తోంది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. -
ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి.. నో సెల్‌ఫోన్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్ల మొబైల్ ఫోన్లను ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి అనుమతించొద్దని ప్రిసైడింగ్ అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో కొందరు ఓటర్లు ఓటేసే క్రమంలో సెల్ఫోన్లో వీడియోలు తీసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టాలని పేర్కొంది. అలాగే ఓటర్లు ఓటింగ్ కంపార్ట్మెంట్లోనే ఓటేసేలా చూడాలని, రహస్య ఓటింగ్‌కు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ఎన్నికల అధికారులు, సిబ్బంది గోప్యత పాటించాలని, సమాచారాన్ని బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల అధికారులు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా సమాచారాన్ని బయటపెడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు సవరణ పోస్టల్ బ్యాలెట్ కోసం పోలింగ్ తేదీకి 4 రోజుల ముందు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సౌలభ్యాన్ని ఎస్ఈసీ కల్పించింది. గతంలో వారం ముం దు దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనను ఈ మేరకు సవరించింది. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు పోలింగ్‌కు 4 రోజుల ముందు బదులు 3 రోజుల ముందు వరకు పోస్టల్ బ్యాలెట్ జారీచేసేలా సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 100 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 శాతం ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 50 శాతం మించనందున ఈసారి పోలింగ్‌కు బుధవారంలోగా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని సూచించింది. స్లిప్పుల పంపిణీ సరిగ్గా జరిగిందా లేదా అనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించుకోవాలని పేర్కొంది. ఈ విషయంలో అలసత్వంతో వ్యవహరించే వారిపై కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. -
పెళ్లి వేడుకలకు 50మందికే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయన్న ఊహగానాలు వ్యాప్తిస్తున్నతరుణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. ఢిల్లీలో లాక్డౌన్ విధించే అవకాశంలేదని స్పష్టం చేశారు. అయితే ఒకే ప్రదేశంలో ఎక్కువమంది గుమిగూడకుండా ఉండాలని సూచించారు. అలాగే వివాహ అతిధుల సంఖ్యను 50 మందికి పరిమితం చేసినట్టు తెలిపారు. ఇకపై గరిష్టంగా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. (అంతకుముందు ఇది 200గా ఉంది) ఇందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లభించినట్టు వెల్లడించారు. దేశ రాజధానిలో ప్రస్తుతం మూడో దశ కొనసాగుతున్నసంగతి తెలిసిందే. అటులాక్డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు రాష్ట్ర ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్. కానీ ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం చాలా హానికరమని, అందుకే దీన్ని నివారించాలని సూచించారు. కరోనాపై పోరుకు లాక్డౌన్పరిష్కారం కాదని తాము నమ్ముతున్నామన్నారు. ఈ మేరకు దుకాణదారులు భయ పడాల్సిన అసరం లేదంటూ సత్యేంద్ర జైన్ భరోసా ఇచ్చారు. షాపులు తెరుచుకోవచ్చుగానీ, నిబంధనలు పాటించాలన్నారు. అలాగే ఛత్ పూజా సందర్బంగా పెద్ద ఎత్తున జనాలు ఒకే చోట చేరితే వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది అందకే ఆంక్షలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. (ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్?) ఛత్ పూజ - ఆంక్షలు కరోనావైరస్ కేసులు పెరుగుతున్నందున బహిరంగ ప్రదేశాల్లో ఛత్ పూజ వేడుకలను నిషేధించాలన్న ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయానికి జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీప్రభుత్వ నిర్ణయం ప్రజల మత విశ్వాసాలను ప్రభావితం చేస్తుందంటూ దాఖలైన పిటిషన్ విచారించిన కోర్టు ఢిల్లీలో కరోనా పరిస్థితి గురించి తెలియదా... పూజలు చేయాలంటే మీరు సజీవంగా ఉండాలి కదా అని పిటిషనర్‌నుద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు కరోనారోగులకు బెడ్స్, పరీక్షా సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్రం బుధవారం పది మల్టీ డిసిప్లనరీ బృందాలను ఏర్పాటు చేసింది. ఇవి ఢిల్లీలోని 100కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి అంచనా వేయనున్నాయి. కాగా కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో రద్దీగా ఉండే పలు మార్కెట్లను మూసివేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరివింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. దీంతో దేశరాజధాని మరో లాక్డౌన్ రానుందనే పుకార్లు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి డిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.95 లక్షలను అధిగమించగా, దేశంలో 38,617 కొత్త కరోనావైరస్ కేసులతో మొత్తం సంఖ్య 89,12,907 కు చేరుకుంది. Lt Gov has given approval. This was essential as larger the crowd at a place, the more harmful it is. Lockdown won't be imposed but people have to be stopped from gathering in large numbers: Delhi Deputy CM Manish Sisodia on capping number of attendees at weddings in Delhi to 50 https://t.co/Q7P4DHDx58 pic.twitter.com/wEX7GwleNi — ANI (@ANI) November 18, 2020 -
ఇరాన్‌పై వీగిన అమెరికా తీర్మానం
ఐక్యరాజ్యసమితి: ఇరాన్‌పై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలని కోరుతూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం భద్రతా మండలిలో వీగిపోయింది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా కేవలం డొమినికన్ రిపబ్లిక్ నుంచి మాత్రమే మద్దతు లభించింది. తీర్మానాన్ని ఆమోదించడానికి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో కనీసం 9 దేశాలు మద్దతు పలకాల్సి ఉంటుంది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా రెండు ఓట్లు, వ్యతిరేకంగా రెండు ఓట్లు రాగా, 11 మంది సభ్యులు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. ఈ తీర్మానాన్ని రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, తమ వీటో పవర్‌ని ఉపయోగించే అవసరం ఆ దేశాలకు రాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీర్మానం ఓడిపోయినట్లు ప్రకటించారు. 2015లో ఇరాన్‌కీ, ఆరు పెద్ద దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మధ్య, అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తూ, నిరాయుధీకరణకు కృషిచేయాలి. ఈ ఒప్పందం నుంచి 2018లో ట్రంప్ ప్రభుత్వం వైదొలిగింది. -
కరోనా ఎఫెక్ట్: ఆ ఎగుమతులపై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశంలో కూడా కోవిడ్-19 (కరోనా వైరస్) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఔషధాల లభ్యతకు సమస్యలు లేకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 26 యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. పారాసెటమల్, విటమిన్ బీ1, బీ12 మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. తాజా ఆంక్షలతో ఇకపై వీటి ఎగుమతుల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని డీజీఎఫ్టీ మంగళవారం ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. ఔషధాల తయారీలో కీలకమైన ఏపీఐల కోసం భారత్ ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతున్నప్పటికీ .. పరిమిత స్థాయిలో ఎగుమతులు కూడా చేస్తోంది. కరోనా వైరస్ ధాటికి చైనా నుంచి సరఫరా దెబ్బతిన్న కారణంగా .. దేశీయంగా ఏపీఐలు, ఔషధాల కొరత తలెత్తకుండా కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. కేంద్ర ఫార్మా విభాగం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ.. ఈ మేరకు సిఫార్సులు చేసింది. -
ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కొరడా ఝుళిపించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన ఇరాన్ సెంట్రల్ బ్యాంకుపై శుక్రవారం సరికొత్త ఆంక్షలను విధించారు. ‘మేం ఇరాన్ నేషనల్ బ్యాంకుపై సరికొత్త ఆంక్షలు విధించాం. ఓ దేశంపై విధించిన ఆంక్షల్లో ఇదే అత్యధికం. ఈ ఆంక్షల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది’ అంటూ ట్రంప్ ఓవల్ ఆఫీసు వద్ద మీడియాతో అన్నారు. దీనితో పాటు ఇరాన్ సార్వభౌమ సంక్షేమ నిధిపై కూడా ఆంక్షలు విధించారు. ఈ బోర్డులో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహని కూడా ట్రస్టీగా ఉన్నారు. సౌదీ ఆరేబియా చమురు కర్మాగారాలపై ఇటీవల డ్రోన్ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులు ఇరానే చేసిందంటూ అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఆంక్షలను మరింత పెంచుతామని కూడా హెచ్చిరించారు. బలగాల పోరుకు తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని కూడా ట్రంప్ హెచ్చరించారు. అయితే శాంతియుత మార్గమే తమ ప్రాధాన్యమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గురువారం తెలిపారు. అయితే అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ఈ దాడులు తాము చేయలేదని తెలిపింది. -
ఎస్–400 కొంటే ఆంక్షలే: అమెరికా
వాషింగ్టన్: రష్యా నుంచి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్–400ను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. కాస్టా (ఆంక్షల ద్వారా అమెరికా వ్యతిరేక శక్తులను ఎదుర్కొనడం)కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలు, వ్యవస్థలపై ఆంక్షలు అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్–400 వ్యవస్థల కొనుగోలుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం పడే వీలుంది. ట్రంప్ సంతకంచేయగానే ఇటీవలే రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలు, ఎస్–400లను కొన్న చైనా సంస్థ, దాని డైరెక్టర్ షాంగ్‌ఫూపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యాను లక్ష్యంగా చేసుకునే కాస్టా చట్టాన్ని తెచ్చినట్లు అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు. -
నో ఎంట్రీ..
నిడదవోలు : మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై బ్రిటీష్ హయాంలో 1932లో నిర్మించిన పురాతన వంతెనపై భారీ వాహనాల రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి భారీ వామనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆర్అండ్బీ ఏఈ డి.నందకిశోర్ తెలిపారు. భారీ లోడు వాహనాలు వెళ్తే వంతెన కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని ఇటీవల హైదారాబాద్ నుంచి స్రైయోరంట్ సంస్థకు చెందిన నలుగురు బృదం సభ్యులు నివేదికలు అందించారు. నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆర్‌అంబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. పురాతన వంతెనపై 10 టన్నులకు మించి లోడు వాహనాలను పూర్తిగా నిషేధించారు. వంతెనపై గంటకు 15 కిలోమీటర్లకు మించి ఎటువంటి వాహనాలు వెళ్లరాదని హెచ్చరించారు. వంతెన ముఖద్వారంలో 10 అడుగుల దూరంలో ఐరన్ గడ్డర్( స్టాపర్)ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా నిడదవోలు పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ముఖద్వారంలో ఐరన్ స్టాపర్లను ఏర్పాటు చేయనున్నారు. వాహనాల దారి మళ్లింపు ఇలా... నిడదవోలు మండలం సమిశ్రగూడెం వంతెన వద్ద ఇరుకు, భారీ వాహనాలు నిషేధించడంతో పాటు బరువు 10 టన్నులు, వేగ పరిమితి గంటకు 15 కిలోమీటర్లు మాత్రమేనని హెచ్చరిక బోర్డులను ఆర్అండ్బీ అధికారులు ఏర్పాటు చేశారు. అదే విధంగా కొవ్వూరు మండలం పంగిడి, తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడు జంక్షన్లో నిడదవోలు వైపుగా భారీ వాహనాలు రాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రాజమండ్రి, కొవ్వూరు నుంచి తాడేపల్లిగూడెం వైపుగా వెళ్లే వాహనాలు సమిశ్రగూడెం వంతెన ఎడమ వైపు నుంచి డి,ముప్పవరం, కానూరు, పెరవలి, తణుకు మీదుగా మళ్లిస్తారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రికి వెళ్లాల్సిన భారీ వాహనాలు ప్రత్తిపాడు నుంచి తణుకు, రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకోవచ్చును. -
144 సెక్షన్ బేఖాతర్
యల్లనూరు: అధికారంలో ఉన్నాం కదా అని.. తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నిబంధనలను బేఖాతరు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నా అవేమీ తనకు పట్టవన్నట్లు వ్యవహరించారు. పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలికారు. వివరాల్లోకెళితే.. యల్లనూరు మండలం కొడవండ్లపల్లి పెద్దమ్మతల్లి ఆలయం నిర్వహణ విషయం ఇటీవల వివాదాస్పదమైంది. ఇక్కడ అవాంఛనీయ ఘటనలలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఈ నెల ఆరో తేదీ నుంచి పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ సెక్షన్ అమలులో ఉన్నపుడు ఆలయానికి 400 మీటర్ల పరిధిలో ఎక్కడా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదు. భారీగా వాహనాల్లో రావడం తదితర వాటిని చేయకూడదు. నిబంధనలు జాన్తా నై.. పామిడి సీఐ నరేంద్రరెడ్డి, తాడిపత్రి రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, పుట్లూరు ఎస్ఐ సురేష్‌బాబు, పెద్దపప్పూరు ఎస్ఐ ఆంజనేయులు, యల్లనూరు ఎస్ఐ గంగాధర్, తాడిపత్రి తాలూకా పీఎస్ఐ, యల్లనూరు స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది సుమారు 60 మంది పోలీసుల బందోబస్తు నడుమ శనివారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో కొడవండ్లపల్లి పెద్దమ్మతల్లి ఆలయం చేరుకున్నారు. ఆయనతోపాటు మండల వ్యాప్తంగా ఉన్న వారి అనుచర వర్గం కూడా తరలివచ్చింది. ఆలయం వద్ద అనుచర వర్గానికి ఎమ్మెల్యే అల్పాహార విందు ఇచ్చారు. ఆలయ ఆవరణంలోనే చీరల పంపిణీ చేపట్టారు. 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించినా పోలీసులే దగ్గరుండీ పర్యవేక్షించడం విమర్శలకు దారితీసింది. తాడిపత్రి ఎమ్మెల్యే యల్లనూరు మండలానికి వచ్చి చీరలు పంపిణీ చేయడం రాజకీయలబ్ధి పొందడం కోసమేనన్న వాదనా లేకపోలేదు. కొడవండ్లపల్లిలో 144 సెక్షన్ అములులో ఉందా లేదా అనే విషయంపై తహసీల్దార్ నాగరాజును వివరణ కోరగా ఉందని సమాధానమిచ్చారు. -
హోదాపై ఆంక్షలా?
-
ఏపీ భవన్లో మీడియాపై ఆంక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా ఆందోళనలు కవర్ చేస్తున్న మీడియాపై ఢిల్లీలోని ఏపీ భవన్లో నిషేధాజ్ఞలు విధించారు. రెండురోజులు పాటు ఇంటర్వ్యూలు చేయొద్దని అనధికారికంగా హుకుం జారీ చేశారు. ఆందోళనలు ప్రసారం చేసేందుకు ప్రయత్నించిన సాక్షి టీవీ విలేకరులను కూడా పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ భవన్లో ఇంటర్వ్యూలు చేయొద్దని, ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతో లిఖిత పూర్వక ఉత్తర్వులు చూపాలని అమర్నాథ్ కోరగా.. రెసిడెంట్ కమిషనర్‌తో మాట్లాడుకోవాలని దురుసుగా ప్రవర్తించారు. ఏదేమైనా ఏపీ భవన్ నుంచి బయటకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు తీవ్రతరం చేస్తుండటంతో ఎక్కడ తమకు చెడ్డ పేరొస్తుందనే ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వమే కావాలని ఏపీ భవన్లో మీడియాపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. సోమవారం సంసద్ మార్గ్‌లో వైఎస్సార్సీపీ నేతలు ధర్నా నిర్వహించనున్న నేపధ్యంలో కావాలనే ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించిందని పార్టీ నేతలు చెబుతున్నారు.