Rohit
-
బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి
భోపాల్: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య బీజేపీ పార్టీలో చేరారు. కాగా, రోహిత్ ఆర్య అనేక కేసుల్లో తీర్పులను వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.వివరాల ప్రకారం.. రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాగా, పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు. 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. జస్టిస్ రోహిత్ ఆర్య వెల్లడించిన కొన్ని తీర్పులు వివాదాస్పదం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. 2020లో మహిళ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తికి జస్టిస్ రోహిత్ ఆర్య బెయిల్ మంజూరు చేశారు. రక్షా బంధన్ రోజున బాధిత మహిళకు రాఖీ కట్టాలని, ఆమెకు రక్షణ కల్పించేలా నిందితుడు హామీ ఇవ్వాలని షరతు విధించారు. అయితే ఈ తీర్పు వివాదస్పదం కావడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది.అలాగే, 2021లో ఇండోర్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్‌లకు బెయిల్ నిరాకరించారు. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఫరూఖీకి బెయిల్ మంజూరు చేసింది. -
‘శరద్ పవార్‌కు టచ్‌లో 19 మంది అజిత్ వర్గం ఎమ్యెల్యేలు’
ముంబై: లోక్‌సభ ఎన్నికల ముగిసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) నేత రోహిత్ పవార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని అధికార ఎన్సీపీ నుంచి 18-19 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారని తెలిపారు. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారన్నారు. 2023 జూలైలో ఎన్సీపీలో చీలికలు జరిగినప్పటి నుంచి అజిత్ వర్గంవైపు ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒక్కమాట కూడా ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, ఇతర సీనియర్ నేతలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.‘అజిత్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల నిధుల కోసం సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత వారంతా అజిత్ వర్గం నుంచి బయటకు వచ్చేస్తారు. 18 నుంచి 19 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్‌తో టచ్‌లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత శరద్ పవార్ వర్గంలో వారంతా చేరనున్నారు’అని రోహిత్ పవార్ అన్నారు. అజిత్ పవార్ వర్గం రాజ్యసభ ఎంపీప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. తనకు కేబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెతున్నారు. అంటే అజిత్ పవార్ వర్గంపై ప్రఫుల్‌కు మంచిపట్టు ఉందని తెలుస్తోంది. కానీ, అజిత్ పవార్ అనుకుంటున్న రాష్ట్ర అభివృద్ధి కోసమా? లేదా తనను ఈడీ నుంచి రక్షించుకోవడానికా? అని రోహిత్ పవార్ నిలదీశారు.ఇటీవల ఎంపీ ప్రఫుల్ పటేల్‌కు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రమంత్రి( సంతంత్ర హోదా) పదవి ఆఫర్ ఇస్తే.. దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపి( ఎస్పీ) 8, అజిత్ వర్గం ఎన్సీపీ 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జూన్ జూన్ 27 నుంచి జూలై 12 వరకు జరగనున్నాయి. అక్టోబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..
-
రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది. రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐ ఆర్‌ను రద్దు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వర్సిటీ వైస్ చాన్సిలర్ అప్పారావుతో పాటు పలు కారణాలతో మరికొందరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శుక్రవారం తీర్పు వెలువరించా రు. ట్రయల్ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిగణన లోకి తీసుకుని ఇక్కడి పిటిషన్లలో విచారణ ముగిస్తున్నట్లు చెప్పారు. సస్పెండ్ చేయడంతోనే ఆత్మహత్యరోహిత్ వేములను సస్పెండ్ చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ట్రయల్ కోర్టులో పోలీసులు రిపోర్టు దాఖలు చేశారు. రోహిత్ మృతిపై నిరసనలు వెల్లువెత్తడంతో గచ్చిబౌలి స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశామని అతనిది హత్య అనేందుకు ఎలాంటి సాక్ష్యాధారాల్లేవని, కనుక కేసును మూసివేయాలని భావిస్తున్నామని అందులో పేర్కొన్నారు. రోహిత్ వేముల కుటుంబానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారని, అతడు దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని అందులో తెలిపారు.దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు: హైకోర్టుపోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది. దీంతో.. ఈ కేసులో నిందితులుగా ఉన్న సికింద్రాబాద్ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ఏబీవీపీ నేతలకు ఈ కేసు నుంచి ఉపశమనం దొరికినట్లైంది. -
ముంబై ‘మూడు’పోయింది
ముంబై ఇన్నింగ్స్... తొలి 21 బంతుల్లో 20 పరుగులు, 4 వికెట్లు... ఇందులో రోహిత్ శర్మ సహా ముగ్గురు తొలి బంతికే డకౌట్... ముంబై ఇన్నింగ్స్ మొదలవడంతోనే ముగిసినట్లు అనిపించింది... బౌల్ట్ కొట్టిన ఈ దెబ్బ తర్వాత కొంత కోలుకున్నా 125 పరుగుల స్కోరు ఏమాత్రం సరిపోలేదు... రాజస్తాన్ రాయల్స్ అలవోకగా మరో 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేసింది... సొంతగడ్డపై కూడా బోణీ చేయలేకపోయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇంకా గెలుపు ఖాతా తెరవని ఏకైక జట్టుగా నిలిచింది. అభిమానులు...అదే తీరు! హార్దిక్ పాండ్యాకు ముంబై సొంత మైదానం వాంఖెడేలోనూ ఫ్యాన్స్ నుంచి నిరసన ఎదురైంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న అభిమానులు గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే ఈసారి కూడా పాండ్యా పేరు వినిపించినప్పుడల్లా గేలి చేశారు. టాస్కు వచ్చినప్పుడు మాట్లాడకుండా అంతరాయం కలిగించారు. చివరకు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ‘మర్యాద పాటించండి’ అని చెప్పినా జనం పట్టించుకోలేదు. అనంతరం ముంబై ఫీల్డింగ్ సమయంలో ఒక అభిమాని నేరుగా గ్రౌండ్లో రోహిత్ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని చూపించింది. అనూహ్యంగా దూసుకొచి్చన ఫ్యాన్ రోహిత్ కూడా ఒక్కసారిగా భయపడిపోయాడు! ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పరాజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. సోమవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ముంబైను ఓడించి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 34; 6 ఫోర్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 32; 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/22) పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఆరంభంలోనే దెబ్బ తీయగా... చహల్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. రియాన్ పరాగ్ (39 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో గెలిపించాడు. టపటపా... రాజస్తాన్ బౌలింగ్ ధాటికి ముంబై బ్యాటింగ్ ఆరంభంలోనే కకావికలమైంది. బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ (0) తొలి బంతికే అవుట్ కాగా, తర్వాతి బంతికే నమన్ ధీర్ (0) వెనుదిరిగాడు. ఐపీఎల్లో అతి ‘తొందరగా’ రెండో ఓవర్లోనే ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన బ్రెవిస్ (0) కూడా తన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (16) వికెట్ బర్గర్ ఖాతాలో పడింది. స్కోరు 20/4కు చేరిన దశలో తిలక్, పాండ్యా కొద్దిసేపు నిలిచి జట్టును ఆదుకున్నారు. బర్గర్ ఓవర్లో 3 ఫోర్లతో పాండ్యా ధాటిని ప్రదర్శించాడు. అయితే ఐదో వికెట్‌కు 36 బంతుల్లో 56 పరుగులు జోడించిన తర్వాత ముంబైని చహల్ దెబ్బ తీశాడు. తక్కువ వ్యవధిలో అతను పాండ్యా, తిలక్లను అవుట్ చేయడంతో ముంబై పరిస్థితి మరింత దిగజారింది. తిలక్ వెనుదిరిగాక జట్టు కోలుకోలేకపోయింది. అతను అవుటైన తర్వాత 40 బంతుల్లో 30 పరుగులే వచ్చాయి. టిమ్ డేవిడ్ (17) కూడా ప్రభావం చూపలేకపోయాడు. రాణించిన పరాగ్... లక్ష్యం చిన్నదే అయినా రాయల్స్ ఇన్నింగ్స్ కాస్త తడబాటుకు లోనైంది. తొలి ఓవర్లోనే యశస్వి (10) వెనుదిరగ్గా... సంజూ సామ్సన్ (12), బట్లర్ (13) కూడా విఫలమయ్యారు. అయితే పరాగ్ జాగ్రత్తగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. అశి్వన్ (16)తో కలిసి అతను ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేశాడు. విజయానికి 15 పరుగులు కావాల్సిన దశలో పరాగ్ వరుసగా 6, 6, 4 బాది ముగించాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) సామ్సన్ (బి) బర్గర్ 16; రోహిత్ (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; నమన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; బ్రెవిస్ (సి) బర్గర్ (బి) బౌల్ట్ 0; తిలక్ (సి) అశ్విన్ (బి) చహల్ 32; పాండ్యా (సి) (సబ్) పావెల్ (బి) చహల్ 34; చావ్లా (సి) హెట్‌మైర్ (బి) అవేశ్ 3; డేవిడ్ (సి) బౌల్ట్ (బి) బర్గర్ 17; కొయెట్జీ (సి) హెట్‌మైర్ (బి) చహల్ 4; బుమ్రా (నాటౌట్) 8; ఆకాశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–14, 4–20, 5–76, 6–83, 7–95, 8–111, 9–114. బౌలింగ్: బౌల్ట్ 4–0–22–3, బర్గర్ 4–0–32–2, అవేశ్ ఖాన్ 4–0–30–1, చహల్ 4–0–11–3, అశ్విన్ 4–0–27–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) డేవిడ్ (బి) మఫాకా 10; బట్లర్ (సి) చావ్లా (బి) ఆకాశ్ 13; సామ్సన్ (బి) ఆకాశ్ 12; పరాగ్ (నాటౌట్) 54; అశ్విన్ (సి) తిలక్ (బి) ఆకాశ్ 16; శుభమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (15.3 ఓవర్లలో 4 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–48, 4–88. బౌలింగ్: మఫాకా 2–0–23–1, బుమ్రా 4–0–26–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–20–3, కొయెట్జీ 2.3–0–36–0, పీయూష్ చావ్లా 3–0–18–0. -
పురుడు పోశారు.. పునర్జన్మనిచ్చారు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొండపైకి 150 మెట్లెక్కి వెళ్లి మరీ ఓ గర్భిణికి పురుడు పోసి పునర్జన్మనిచ్చి స్థానికుల ప్రశంసలు 108 సిబ్బంది అందుకున్న ఘటన విజయవాడలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... బతుకుతెరువు కోసం కాశీ నుంచి నగరానికి వచ్చి న రోహిత్, హారతి కుటుంబం విజయవాడ భవానీపురం పరిధిలోని కుమ్మరిపాలెం కొండ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. నెలలు నిండిన హారతికి నొప్పులు రావడంతో దిక్కుతోచని స్థితిలో రోహిత్ 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న 108 సిబ్బంది ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. కొండపైన 150 మెట్లు ఎక్కి ఆమె వద్దకు చేరుకున్నారు. నొప్పులు తీవ్రం కావడంతో అల్లాడుతున్న భార్యను చూసి భర్త కన్నీరుమున్నీరుగా విలపించసాగాడు. అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయిన 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్, పైలెట్ సందీప్‌కుమార్ తీవ్రంగా శ్రమించి ఆమెకు కాన్పు చేశారు. మగ బిడ్డ జన్మించాడు. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదంతా గమనించిన స్థానికులు శెభాష్ అంటూ 108 సిబ్బందిని అభినందించారు. -
దేశానికి కీలక ఆస్తి మానవ వనరులే
రాయదుర్గం: మానవ వనరులపై సకాలంలో దృష్టి పెట్టడం భారతదేశ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆయన ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి రచించిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్’ పుస్తకంపై ఐఎస్బీ ప్రొఫెసర్ భగవాన్ చౌదరితో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని ఖేమ్కా ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, రాబోయే దశాబ్దాలలో దేశాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ అత్యంత ముఖ్యమైన ఆస్తిగా మానవ వనరులని చెప్పవచ్చని, పెద్ద సంఖ్యలో వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే దేశానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దేశంలో అభివృద్ధికి అనేక ప్రణాళికలు ఉన్నాయని, అయితే వాటిని అమలు చేయడంలోనే లోపం ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారడానికి లక్ష్యాలను నిర్దేశించుకునే ముందు ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాల కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఐఎస్బీ లాంటి విద్యాసంస్థలో చదివే విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలు సృష్టించడం కంటే ఉద్యోగాలు చేయడంపైనే దృష్టి సారించారని రఘురాం రాజన్ పేర్కొన్నారు. విద్యార్థులంతా సంస్థలను స్థాపించి తాము ఉపాధి పొందుతూ, నలుగురికి ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపార పాఠశాలల్లో ఐఎస్బీ ఒకటని, ఈ విద్యాసంస్థ దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే సత్తా కలిగిన విద్యార్థులను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సహ రచయిత రోహిత్ లాంబా, పలువురు ఐఎస్బీ ఫ్యాకల్టి, విద్యార్థులు పాల్గొన్నారు. -
మూడు ముళ్లు... ఏడడుగులు
సీనియర్ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ హీరోయిన్ కార్తీక వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. రోహిత్ మేనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ఫ్యాలెస్ కన్వెన్షన్ సెంటర్లో కేరళ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు హీరో చిరంజీవి–సురేఖ దంపతులు, నటీనటులు రాధిక, సుహాసిని, రేవతి, భాగ్యరాజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నాగచైతన్య హీరోగా రూపొందిన ‘జోష్’(2009) సినిమాతో కార్తీక తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీ అయ్యారు. -
19 ఏళ్ల పోరాటం.. ఈసారైనా ఆమెను ఓడిస్తారా?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒకే ప్రత్యర్థిపై ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు మెదక్ నియోజకవర్గంలో కనిపించింది. ఎమ్మెల్యే పద్మపై మైనంపల్లి కుటుంబీకులు చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ రావడం ఆసక్తి సంతరించుకుంది. మెదక్: ప్రస్తుత మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉమ్మడి ఏపీలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనం పల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో.. అనంతరం నియోజకవర్గాల పునర్ విభజనలో రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దుచేసి చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలను మెదక్ నియోజకవర్గంలో కలిపారు. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మైనంపల్లి చేతిలో మరోసారి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2014, 2018 లో వరుసగా పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యరి్థగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి సైతం పద్మారెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈసారి పద్మపై రోహిత్.. గతంలో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులు పద్మాదేవేందర్‌రెడ్డిపై పోటీ పడగా, ప్రస్తుతం వారి కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యరి్థగా పద్మకు పోటీగా బరిలో నిలిచారు. నాడు తల్లీదండ్రులు, నేడు కొడుకు పోటీపడుతుండడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 19 ఏళ్లుగా రాజకీయ వైరం వీరి మధ్యలోనే జరుగుతుండడం విశేషం. -
రెండు ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలో అరుదైన ట్రాన్స్‌ప్లాంట్
సికింద్రాబాద్, రాంగోపాల్‌పేట్: విషం తాగి తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ యువకుడికి యశోద ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌తో ప్రాణం పోశారు. ఒకేసారి డబుల్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా చేసి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఇలాంటి శస్త్ర చికిత్స నాలుగవది కావడం గమనార్హం. శుక్రవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్‌లు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్ గత నెలలో వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో అతన్ని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్చారు. విషం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్ పరిస్థితి ఏర్పడింది. అలాగే కిడ్నీలు, కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయనకు మెకానికల్ వెంటిలేటర్స్ వైద్యం అందించిన తర్వాత 20 రోజులకు పైగానే ఎక్మోపై చికిత్స అందించారు. అయినా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడలేదు. దీంతో రెండు ఊపిరితిత్తులను మారిస్తేనే యువకుడి ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్యులు బావించారు. కానీ భారతదేశంలో ఇలాంటి కేసుల్లో ఎక్మో వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన వాళ్లు లేరు. శరీరంలో ఎటువంటి పురుగుల మందు అవశేషాలు లేవని నిర్ధారించుకున్నాక ఊపిరితిత్తుల మారి్పడి కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేశారు. జీవన్‌దాన్ చొరవతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్, థొరాసిక్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కేఆర్ బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ మిమి వర్గీస్‌లతో కూడిన బృందం ఆరు గంటల పాటు శ్రమించి విజయవంతంగా రెండు ఊపిరితిత్తులను మార్చారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో రోహిత్‌ను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. -
అధికారమే లక్ష్యంగా కొట్లాడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా కొట్లాడాలని ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ సహా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మేడ్చల్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్, భువనగిరి నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. నేతలందరినీ రాహుల్‌కు రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి నేతలను ఆహ్వనించిన రాహుల్, వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇప్పటికే పార్టీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే పార్టీ విజయం తథ్యమన్నారు. కొత్త, పాత తారతమ్యాలను పక్కనపెట్టి నేతలంతా ఒక్కటిగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. -
బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో ప్రకటనను ఆయన విడుదల చేశారు. మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు.మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మైనంపల్లి తన కుమారుడు రోహిత్‌కు మెదక్ నుంచి పార్టీ టికెట్ ఆశించారు. ఈ క్రమంలో గత నెల 21న బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్ కేటాయించిన కేసీఆర్.. రోహిత్‌కు మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా బీఆర్ఎస్ వేచి చూసే ధోరణి అవలంభించింది. ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌పై త్వరలో ప్రకటన నెల రోజుల క్రితం మైనంపల్లి ధిక్కార స్వరం వినిపించిన మరుక్షణం నుంచే కేసీఆర్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఎంపీగా పోటీ చేసిన మర్రి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచే ఆయన పోటీ చేస్తారని భావించినా, తాజా పరిణామాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను ఇచ్చి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయించే యోచన లో కేసీఆర్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
మైనంపల్లికి సన్‌స్ట్రోక్ తప్పదా?
హైదరాబాద్: ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది ప్రస్తుతం మల్కాజిగిరిలో చర్చనీయాంశంగా మారింది. అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మల్కాజిగిరి అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మైనంపల్లి ఈ దఫా తనకు సిట్టింగ్ సీటుతో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఆశించారు. రోహిత్ కొన్నాళ్లుగా మెదక్‌లో తన సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. మైనంపల్లికి సైతం మెదక్ జిల్లాతో సత్సంబంధాలు ఉండటంతో కచ్చితంగా అక్కడి నుంచి రోహిత్ పోటీలో ఉంటారంటూ ఇటీవల కాలంలో చెబుతూ వచ్చారు. అయితే.. బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికే మాత్రమే టికెట్ ఖరారు చేసింది. తన కుమారుడికి టికెట్ ప్రకటించకపోవడంపై మైనంపల్లి గుస్సా అయ్యారు. మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అధిష్టానం చివరి నిమిషంలోనైనా తన కుమారుడికి టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని, కొందరి నేతలపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అయిదు రోజుల క్రితం తన నివాసంలో మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పర్యటించి ప్రజాభిప్రాయం కూడా సేకరించి వారం రోజుల తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని మీడియా సమావేశంలో మైనంపల్లి ప్రకటించారు. కాగా.. ఇప్పటివరకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి మైనంపల్లి హన్మంతరావుకు పిలుపు రాలేదని తెలుస్తోంది. ఆయన కూడా అధిష్టానం వద్దకు వెళ్లివచ్చినట్లు కనిపించలేదు. అభ్యర్ధి మార్పుపై ఊహాగానాలు బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లిని మార్చడానికే సిద్ధమైనట్లు ప్రచార మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, శంభీపూర్ రాజు.. వీరిలో ఒకరిని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారనే వాదనలు బయలుదేరాయి. ఈ వాదనలను వారిద్దరూ ఖండించినప్పటికీ మైనంపల్లిని తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజెపీలో ఆయనకు చోటు లేదని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తండ్రీకొడుకుల్లో ఒక్కరికి మాత్రమే సీటు ఇచ్చేందుకు రెడీ అన్నట్టు తెలుస్తోంది. అది కూడా మల్కాజిగిరి నుంచి కాకుండా మేడ్చల్, మెదక్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. మైనంపల్లిని మల్కాజిగిరి నుంచి తప్పిస్తే ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రభావితం చూపుతారన్న విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందా? తేడా వస్తే ఎవరినీ లెక్క చేయని ఆ పార్టీ అధినేత ఇవన్నీ పట్టించుకుంటారా? మొత్తంగా తనయుడికి సీటు కోసం యుద్ధం చేస్తున్న మైనంపల్లి విజయం సాధిస్తారా? లేదంటే చివరికి సన్ స్ట్రోక్ తగిలి ఆయనే దెబ్బతింటారా? అనేది త్వరలోనే తేలనుంది. -
మైనంపల్లి రోహిత్ దారెటు?
మెదక్: మెదక్ టికెట్ తనకే వస్తుందని ఆశాభావంతో గత ఆరు నెలలుగా నియోజకవర్గంలో సొంత డబ్బులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు డాక్టర్ మైనంపల్లి రోహిత్. తీరా సోమవారం సీఎం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. కాగా ఇన్నాళ్లు తననే నమ్ముకుని వెంట వచ్చిన వారికి న్యాయం చేయాలంటే తన కొడుకును పోటీలో నిలిపి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని మైనంపల్లి హన్మంతరావు బహిరంగంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళతారా..? లేక బీజేపీలో చేరి పోటీలో నిలబడతారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా.. అనే చర్చసాగుతోంది. మంత్రి హరీశ్‌రావుపై ఆయన చేసిన విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్లో కొనసాగే అవకాశం లేదని, మల్కాజ్గిరి టిక్కెట్‌ను కూడా హన్మంతరావు తిరస్కరిస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఇప్పటికే వీరికి ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతోంది. మెదక్ బరిలో దిగి సత్తా చాటాలని హన్మంతరావు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మకు పలువురు నుంచి గట్టి పోటీ తప్పేలాలేదు. మైనంపల్లి రోహిత్ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకయిన రోహిత్ గత కొన్నాళ్లుగా వేర్వేరు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మెడిసిటీ నుంచి MBBS చదివి డాక్టర్ అయిన రోహిత్.. మెడికల్ ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా రాజకీయాల్లోకి రూటు మార్చారు. "మైనంపల్లి సోషల్ సర్వీస్ అర్గనైజేషన్" పేరిట ఓ స్వచ్ఛంధ సంస్ధను నెలకొల్పి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మల్కాజ్ గిరితో పాటు మెదక్ లో వేర్వేరుకార్యక్రమాలు చేపట్టారు. శానిటైజర్లు, మాస్క్ ల పంపిణీ, కమ్యూనిటీ హళ్ల నిర్మాణం, పేదలకు బియ్యం పంపిణీ, కాలనీల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేశారు. మెదక్ నుంచి ఎలాగైనా టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఇప్పటికే కోట్లాది రుపాయలు అక్కడ ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఇక సిల్వర్ స్పూన్ తో పుట్టిన రోహిత్ లైఫ్ స్టైల్ లోనూ అదే తరహాలో కనిపిస్తాడు. ఫెర్రారీ 488 స్పైడర్, మెర్సిడెస్ AMG, రేంజ్ రోవర్స్, ఆడి కార్లతో పాటు తరచుగా హర్లీ డేవిడ్ సన్ బైక్ లపై తిరుగుతాడు. ముఖ్యంగా మల్కాజ్ గిరిలో సీఎం కెసిఆర్ కు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా రోహిత్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. వేలాది బ్యానర్లు, నిలువెత్తు కటౌట్లతో బోలెడు ప్రచారం నిర్వహించడం మైనంపల్లి కుటుంబానికే చెల్లింది. చదవండి: మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం! -
కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల్లో ఆదివాసీ గిరిజనుల ఓట్లే కీలకమని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లోనూ తెలంగాణ గిరిజన ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ప్రాధాన్యతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులను మోసం చేస్తున్నాడని, మాయమాటలు చెప్పి వారి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరీలో బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ భరత్ చౌహాన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో పాటు కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, అన్ని జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మైనంపల్లి రోహిత్ రాకతో పద్మా దేవేందర్ రెడ్డికి తలనొప్పి
-
వికాస్ ‘కంచు’ పట్టు
అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ రెండో రోజు పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు ఒక కాంస్య పతకం లభించింది. 72 కేజీల విభాగంలో వికాస్ కాంస్య పతక బౌట్లో 8–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో జెయిన్ తాన్ (చైనా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన సుమిత్ (60 కేజీలు), రోహిత్ దహియా (82 కేజీలు), నరీందర్ చీమా (97 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో పోటీపడ్డారు. కానీ ఈ ముగ్గురికీ నిరాశే ఎదురైంది. కాంస్య పతక బౌట్లలో సుమిత్ 6–14తో మైతా కవానా (జపాన్) చేతిలో... రోహిత్ 1–5తో అలీరెజా (ఇరాన్) చేతిలో... నరీందర్ 1–4తో ఒల్జాస్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
లోన్‌యాప్, క్రికెట్ బెట్టింగ్‌కు రోహిత్ బలి.. నా కొడుకులా మరొకరు కాకూడదంటూ..
సాక్షి, విజయవాడ: లోన్‌యాప్, క్రికెట్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. ఎన్టీఆర్ జిల్లా వేలేరు గ్రామానికి చెందిన రోహిత్ క్రికెట్ బెట్టింగ్ కోసం లోన్ యాప్‌లలో రుణం తీసుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో తిరిగి చెల్లించలేకపోయాడు. ఓ వైపు లోన్ యాప్ నిర్వాహకులు, మరోవైపు క్రికెట్ బుకీల వేధింపులు తాళలేక రెండు రోజుల క్రితం గడ్డిమందు తాగి రోహిత్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో రోహిత్ మృతదేహానికి గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై రోహిత్ తండ్రి కోదండరామయ్య మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగ్ వల్లే నాకొడుకు బలయ్యాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్‌లలో నా కొడుకుని మోసం చేశారు. 4వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి వెంటనే ఆస్పత్రిలో చేర్పించాం. రెండు రోజులు మృత్యువుతో పోరాడి నాకొడుకు మరణించాడు. హనుమాన్ జంక్షన్‌కు చెందిన జోజి సునీల్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేసినట్లు నా కొడుకు చెప్పాడు. లోన్యాప్లో కూడా రూ.2.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. జోజి సునీల్, లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక, మాకు చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నా కొడుకు తెలిపాడు. రాజు అనే వ్యక్తికి 60 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షలు బ్యాంక్ ద్వారా పంపాడు. ఆ డబ్బులు అతనికి ఎందుకు ఇచ్చాడు, ఆ డబ్బులు ఎక్కడవి అనేది తెల్చాలి. నా కొడుకులా మరొకరు కాకూడదు. క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్‌లపై పోలీసులు నిఘా పెట్టాలి. కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని రోహిత్ తండ్రి కోదండరామయ్య కోరారు. చదవండి: (Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..) -
కీర్తి వల్ల ఆత్మహత్యలు ఆగుతాయి: ఆదిరెడ్డి
స్పెషల్ గెస్టులతో బిగ్‌బాస్ ఫినాలే అదిరిపోయింది. అయితే సెలబ్రిటీలను ఊరికే పిలుస్తారా? వారితో ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. మొదటగా నిఖిల్ హౌస్‌లోకి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరైన రోహిత్‌ను ఎలిమినేట్ చేసి తనతోపాటు స్టేజీపైకి తీసుకొచ్చాడు. తర్వాత ధమాకా హీరోహీరోయిన్లు రవితేజ, శ్రీలీల జింతాత స్టెప్పుతో స్టేజీని అల్లాడించారు. అనంతరం ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. పదిమంది నామీద పడి మాట్లాడినా నేను ఎదురునిలబడగలనన్న ధైర్యం బిగ్‌బాస్‌తో వచ్చిందన్నాడు ఆది. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. 'కీర్తి బిగ్‌బాస్ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత ధైర్యంగా ముందుకెళ్లడం చాలామందికి ఇన్స్పిరేషన్. రేవంత్‌లో 20 తప్పులు ఉంటే 40 పాజిటివ్‌లు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి వచ్చి హౌస్‌లో గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. నాకంటే ఆ ముగ్గురు బాగా ఆడారు. కాబట్టి వాళ్లకంటే ముందే ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు. చదవండి: కాసేపట్లో పెళ్లి పెట్టుకుని గ్రాండ్ ఫినాలేకు వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ లవర్ బాయ్ ఎవరంటే? -
రూ.5 లక్షలు గెలుచుకున్న శ్రీహాన్, రియలైజ్ అయిన కీర్తి
మాజీ కంటెస్టెంట్ల రాకతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కళ వచ్చింది. మొదటగా రోల్ రైడా హౌస్‌లో అడుగుపెట్టి త్వరలో బీబీ జోడీ షో రాబోతుందంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అది కంటెస్టెంట్లు జంటలుగా పాల్గొనే రియాలిటీ డ్యాన్స్ షో అని తెలిపాడు. తర్వాత ఫైనలిస్టులకు ఆల్ ద బెస్ట్ చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత మెహబూబ్, అషూ జంటగా లోపలకు ఎంట్రీ ఇచ్చారు. వారు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా ఏ ప్రశ్న అడిగినా తప్పు సమాధానమే చెప్పాలన్నారు. ఇందులో కీర్తి.. శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అని అడగ్గా ఆదిరెడ్డి టపీమని ఇనయ పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. అంతలోనే బ్యాడ్‌న్యూస్ అంటూ.. హౌస్‌లో ఒకరిని తమతోపాటు ఎలిమినేట్ చేసి తీసుకెళ్తామనగానే అందరి ముఖాలు వాడిపోయాయి. మరీ టెన్షన్ పెట్టడం మంచిదికాదని భావించిన వాళ్లు ఇది ప్రాంక్ అని చెప్పడంతో హౌస్మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. వారు వెళ్లిపోగానే అవినాష్- అరియానా వచ్చి డ్యాన్స్ చేసి, పంచ్‌లు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత చైతూ, కాజల్ వచ్చి ఫైనలిస్టులను సర్ప్రైజ్ చేశారు. శ్రీహాన్ అంటే ఎంటర్టైన్మెంట్, రేవంత్.. కోపం, ఆదిరెడ్డి.. కాన్ఫిడెంట్, రోహిత్.. కామ్ అండ్ కంపోజ్డ్, కీర్తి గేమ్ బాగా ఆడుతుందంటూ ఒక్కొక్కరి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాడు చైతూ. అనంతరం కొన్ని వస్తువులు వాడుతూ డ్యాన్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కీర్తి గెలిచి ఫ్రైడ్ చికెన్ సంపాదించుకుంది. ఈ జంట వెళ్లిపోగానే రవి-భాను లోపలకు ఎంట్రీ ఇచ్చారు. ఫైనలిస్టులకు టంగ్ ట్విస్టర్స్ ఇచ్చి వాటిని స్పీడ్‌గా చెప్పాలన్నాడు. అందరూ బానే చెప్పినా తెలుగు రాని కీర్తి కొంత తడబడుతూ దాన్ని పూర్తి చేసింది. తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. సీజన్ ముగింపుకు వచ్చేసరికి ఎవరి మీద అభిప్రాయం మారిందో చెప్పాలన్నాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. మొదట్లో కీర్తి మంచి ఫ్రెండ్‌గా ఉండేది. కానీ రానురానూ గొడవలయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ గేమ్ మీద ఫోకస్ పెట్టి ఇంతవరకు రావడం చిన్న విషయం కాదంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి.. మొదట్లో రేవంత్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడనిపించింది. కానీ చాలాకాలానికి అది యాటిట్యూడ్ కాదని అర్థమైందన్నాడు. రోహిత్ వంతు రాగా ఆదిరెడ్డి తప్పును అంగీకరిస్తారని తెలుసుకున్నానన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. ఆదిరెడ్డి రివ్యూయర్ కాబట్టి మానిప్యులేటర్ అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో అతడితో ఎక్కువగా ఉంటున్నాను. ఆ సమయంలోనే ఆయన్ను నేనెందుకు అర్థం చేసుకోలేకపోయానని ఫీలయ్యానని చెప్పాడు. కీర్తి వంతు రాగా.. శ్రీహాన్ జెన్యూన్ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది అని చెప్పింది. ఇకపోతే కొన్నివారాలుగా ఆన్లైన్లో లెన్స్‌కార్ట్ స్టైలిష్ కంటెస్టెంట్ పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా! ఇందులో శ్రీహాన్ గెలిచి స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలవడమే కాకుండా రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మరుసటి రోజు అఖిల్ సార్థక్, తేజస్విని మదివాడ హౌస్‌లోకి వచ్చి ఆటపాటలతో సందడి చేసి వీడ్కోలు తీసుకున్నారు. చదవండి: అర్జున్ కల్యాణ్‌కు నేనంటే లవ్.. వీడియో చూసి షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ విన్నర్ అతడే! -
సస్పెన్స్‌కు తెరపడింది.. బిగ్‌బాస్6 విన్నర్ అతడే!
బిగ్‌బాస్ సీజన్-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్‌తో రేవంత్‌ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్‌బాస్ సీజన్-6 విజేత ఎవరన్నదానిపై హౌస్మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్-4 ప్లేస్‌ను కీర్తి దక్కించుకుంది. టాప్-3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్‌లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్-6 విజేతగా నిలవగా, శ్రీహాన్ రన్నరన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
నా తప్పులు మన్నించి విజేతగా నిలపండి.. ప్రేక్షకులను ఓట్లడిగిన శ్రీసత్య
Bigg Boss Telugu 6, Episode 102 Highlights: కంటెస్టెంట్లు అందరూ మీ గమ్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఫినాలే కోసం ఊదరగొట్టాడు బిగ్‌బాస్. మీ మనసుల్లోని మాటలను ప్రేక్షకులతో నేరుగా పంచుకుని వారి నుంచి ఓట్లు కోరవచ్చంటూ ఓట్ అప్పీల్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మొదటగా మీకు వినిపిస్తుందా? అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో బిగ్‌బాస్ ప్లే చేసిన సౌండ్స్‌ను గుర్తించి సరైన ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఛాలెంజ్ నుంచి తొలగిపోయారు. అయితే శ్రీసత్య అరవడం వల్లే తన గేమ్ పోయిందని విసుకున్నాడు శ్రీహాన్. నీ తప్పు కూడా ఉంది, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకు అని గట్టిగానే ఆన్సరిచ్చింది శ్రీసత్య. కాసేపటికి శ్రీహాన్ సారీ చెప్పడంతో గొడవ చప్పున చల్లారింది. మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ఆదిరెడ్డి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ల అప్పీలు కోసం ఎన్నుకోమన్నాడు బిగ్‌బాస్. రేవంత్ మినహా మిగిలిన ముగ్గురూ రోహిత్‌కే ఓటేయడంతో అతడు ఓట్లు అడిగే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో రోహిత్ మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను ఎలా ఆడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? నా థింకింగ్ ఏంటి? నా క్యారెక్టర్ ఏంటి? అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మొదట్లో మెరీనాతో కలిసి ఆడేవాళ్లం. సెపరేట్ అయ్యాక విడివిడిగా ఆడాం. నాకు ఎప్పుడూ అదృష్టం కలిసిరావట్లేదు. ఈ సీజన్ 6 టైటిల్ గెలవాలన్నదే నా కోరిక. నా కుటుంబం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి' అంటూ తన స్పీచ్ ముగించాడు. తర్వాత ఎగ్స్ షాట్ అనే ఛాలెంజ్‌లో రేవంత్, శ్రీసత్య, కీర్తి, శ్రీహాన్ పాల్గొనగా రేవంత్, శ్రీసత్య గెలుపొందారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో సెలక్ట్ చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్, కీర్తి, రోహిత్.. శ్రీసత్యకు ఓటేయగా ఆదిరెడ్డి ఒక్కడే రేవంత్‌కు మద్దతు పలికాడు. గెలిచేవాడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆదిరెడ్డి పరోక్షంగా రేవంతే విజేత అని అభిప్రాయపడినట్లు కనిపించింది. రేవంత్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అతడికి ఈ ఓట్ అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలని శ్రీసత్యకు ఇస్తే ఏం యూజ్ ఉంటుందని మాట్లాడాడు. దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా ఈ ఛాలెంజ్‌లో తనకు సపోర్ట్ చేయలేదని రేవంత్ ఒకింత హర్టయ్యాడు. ఇక శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లు అడుగుతూ.. 'మొదట్లో నాకు దెబ్బలు తగలకుండా ఆడాలనుకునేదాన్ని. కానీ మూడో వారం నుంచి నేను వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నేనేమైనా తప్పు చేసుంటే క్షమించండి. ఈ హౌస్‌లోకి వచ్చినప్పుడే విన్నర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ విజయం మీ చేతుల్లోనే ఉంది. ఈ టైటిల్ నాకెంతో ముఖ్యం.. ఈ సీజన్‌కు లేడీ విన్నర్ అయితే బాగుంటుంది. కాబట్టి మర్చిపోకుండా నాకు ఓటేయండి' అని అభ్యర్థించింది. మరోపక్క సోషల్ మీడియాలో శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె లేడీ విన్నర్ కావాలనుకుంటుందని చెప్పడంతో అభిమానుల మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి ఎన్నో వారాలుగా అన్యాయం.. ఎట్టకేలకు రోహిత్‌కు ఛాన్స్ -
ఎన్నోవారాలుగా అన్యాయం.. చిట్టచివరికి రోహిత్‌కు ఒక్క ఛాన్స్
కంటెస్టెంట్ల ఎమోషన్స్‌తో ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టబోతున్నామని ఫుల్ ఖుషీలో ఉన్నారు టాప్ 6 కంటెస్టెంట్లు. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ వారిలో ఒకరిని నేడే హౌస్ నుంచి పంపించేయనున్నారు. మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి కేవలం ఐదుగురిని మాత్రమే ఫినాలేకు పంపించనున్నారు. ఇకపోతే ఎప్పటిలాగే ఓట్ అప్పీల్ కోసం హౌస్‌మేట్స్‌కు ఆఖరి పోరాటం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో సౌండ్స్ విని వాటిని గుర్తుపట్టి అవేంటో రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి, రోహిత్ ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్నారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ అప్పీలు కోసం ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. ఏకాభిప్రాయం అన్న ప్రతిసారి రోహిత్‌ను సైడ్ చేసుకుంటూ వచ్చిన హౌస్మేట్స్ ఈ ఒక్కసారికి మాత్రం అతడికే అవకాశం ఇవ్వడం గమనార్హం. దీంతో అతడు.. పదిహేను వారాలుగా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కచ్చితంగా టైటిల్ గెలుస్తానని నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ ఇవ్వగా ఇందులో రేవంత్, శ్రీసత్య ముందు స్థానాల్లో నిలిచారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఎన్నుకోమనగా ఆదిరెడ్డి.. రేవంత్‌కు, శ్రీహాన్.. శ్రీసత్యకు ఓటేశారు. మరి మిగతావాళ్లు ఎవరిని సెలక్ట్ చేశారు? ఎవరు ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకున్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి నన్ను ఛీ, తూ అని గెంటేశారు, ఇప్పుడు చెప్తున్నా..: కీర్తి -
బిగ్‌బాస్ 6 విజేత ఎవరో తెలుసా? గూగుల్ తల్లి ఏం చెప్తుందంటే?
బిగ్‌బాస్ షో ప్రారంభమవుతుందంటే మురిసిపోయే జనాలు షోకి శుభం కార్డు పడుతుందంటే మాత్రం తెగ ఫీలైపోతుంటారు. కానీ ఈసారి మాత్రం హమ్మయ్య, ఎట్టకేలకు ముగింపు కాబోతుందని ఊపిరి పీల్చుకుంటున్నారు. అలా ఉంది మరి ఈ సీజన్. ఎంటర్టైన్మెంట్కు అడ్డా ఫిక్స్ అని నాగ్ అన్నాడే తప్ప మరీ అంత భీభత్సమైన ఎంటర్టైన్మెంట్ అయితే లేదు. పైగా బాగా ఆడుతున్నారనుకున్న కంటెస్టెంట్లను అన్యాయంగా ఎలిమినేట్ చేసేసి తమకు కావాల్సిన వాళ్లనే టాప్ 5లో పెట్టుకుంది బిగ్‌బాస్ యాజమాన్యం.. అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇనయ సుల్తాన ఎలిమినేట్ అయిన తర్వాత ఆరో సీజన్‌పై మరింత విమర్శలు వచ్చిపడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టీఆర్పీ కూడా ఢమాల్ అని పడిపోయింది. ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు ఉన్నారు. రోహిత్, రేవంత్, కీర్తి, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య.. వీరిలో ఒకరు రేపు ఎలిమినేట్ కాబోతున్నారు. దీంతో మిగిలిన మిగతా ఐదుగురు ఫినాలేలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే విన్నర్ ఎవరనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో గూగుల్ తల్లి బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విజేత ఎవరనేది ప్రకటించింది. ఈ షోలో మిస్టర్ పర్ఫెక్ట్గా నిలిచిన రోహిత్ విన్నర్‌గా అవతరించనున్నాడని తెలిపింది. బిగ్‌బాస్ 6 విన్నర్ ఎవరు? బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విజేత ఎవరు? ఇలా ఎలా అడిగినా రోహిత్ పేరే సూచిస్తోంది. మరి నిజంగానే అతడు టైటిల్ అందుకుంటాడేమో చూడాలి! ప్రస్తుతానికి అనఫీషియల్ ఓటింగ్‌లో రేవంత్, శ్రీహాన్ మొదటి స్థానం కోసం పోటీపడుతున్నారు. ఆదిరెడ్డి, రోహిత్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. కీర్తి, శ్రీసత్య ఓట్ల శాతంలో వెనకపడినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ షోకి ముందు వరకు రోహిత్ ఎవరికీ పెద్దగా తెలియదు. హౌస్‌లో అడుగుపెట్టాకే తన మాటతో, ఆటతో, నిజాయితీతో అభిమానులను సంపాదించుకున్నాడు. అటు హౌస్‌మేట్స్‌తో, ఇటు ప్రేక్షకులతో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. కానీ ఆటలో మిగతావారికంటే కొద్దిగా వెనుకబడటంతో ఓట్లలో కూడా వెనుకపడుతున్నాడు. ప్రస్తుతానికైతే రేవంత్ గెలిచే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు.. శ్రీహాన్ ఎమోషనల్ -
‘లవ్ యూ రామ్’లో స్ఫూర్తి, సందేశం రెండూ ఉన్నాయి
రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ జంటగా నటించిన చిత్రం‘లవ్ యూ రామ్’. దర్శకుడు దశరథ్ కథ అందించిన ఈ సినిమాకు డీవై చౌదరి దర్శకత్వం వహించారు. దశరథ్, డీవై చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ.. ‘దశరత్ నాకు మంచి మిత్రుడు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న డీవై చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ తొలి సినిమా విజయం సాధించాలి’ అన్నారు. ‘నా పాతికేళ్ల మిత్రుడు చౌదరితో కలిసి ఈ సినిమా చేయడం హ్యాపీ’అన్నారు కే. దశరథ్. ‘ఈ తరానికి కావాల్సిన సందేశం, స్పూర్తి ఈ సినిమాలో ఉన్నాయి’ అన్నారు డీవై చౌదరి. ‘ఈ సినిమా నాకు స్పెషల్’ అన్నారు రోహిత్. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సుధాకర్ బొర్రా, డి. నేగేశ్వర్రావు.