RTC bus driver
-
బస్సు డ్రైవర్‌కు ఫిట్స్
శృంగవరపుకోట: బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై పడిపోయాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిని, బాలుడిని ఢీకొట్టింది. బాలుడు మృతిచెందగా, ఇంటి వద్ద ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి. ఎస్.కోట ఆర్టీసీ డిపో నుంచి ఆదివారం ఉదయం విజయనగరం బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ధర్మవరం శివారు మారుతీనగర్ మలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ గంగునాయుడుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. డ్రైవర్ స్టీరింగ్‌పై పడిపోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిపైకి దూసుకుపోయింది. ఇంటి ముందు ఉన్న బాలుడు శిరికి అభిషేక్ (12)ను, సమీపంలో వంట చేస్తున్న తొత్తడి పాపను ఢీకొట్టింది. అభిషేక్‌ను 108లో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాపకు కూడా గాయాలయ్యాయి. -
బస్సులో మహిళ హల్చల్.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
సాక్షి, విజయవాడ: నగరంలో ఓ మహిళ హల్చల్ చేసింది. ఆవేశంలో ఊగిపోతూ విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. ఆమె ఓవరాక్షన్‌కు బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వివరాల ప్రకారం.. విజయవాడలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ హల్చల్ చేసింది. ఆర్టీసీ బస్సు తన బైకును ఢీకొట్టడంతో సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంలో ఊగిపోతూ బస్సును ఆపింది. అనంతరం, బస్సులో డ్రైవర్‌ను ఎడాపెడా చితకబాదింది. కాగా, ఘటన పోలీసుల దృష్టికి చేరడంతో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: అబద్దాలకు లిమిట్ లేదా.. 1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా?: అంబటి ఫైర్ -
ప్రమాదాలకు చెక్.. వాటేన్ ఐడియా.. డ్రైవర్ రాజా..!
కొత్తపేట/రావులపాలెం(కోనసీమ జిల్లా): ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్టుగా.. ఆ ఆర్టీసీ డ్రైవర్ మదిలో పుట్టిన ఓ ఐడియా.. ఎన్నో ప్రమాదాలను నివారిస్తోంది. బస్సుకు ఆయన అమర్చిన స్టీల్ బాల్ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. ఈ ఐడియా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజుది. రావులపాలెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న రాజు ఆ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. చదవండి: ప్రేమ పేరుతో ఎస్ఐ వంచన రోడ్డుపై వాహనంలో వెళ్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చే ఇతర వాహనాలను గుర్తించేందుకు వాటికి కుడి, ఎడమ వైపు రియర్ వ్యూ అద్దాలు ఉంటాయి. వాటి ద్వారా వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ డ్రైవర్లు తమ వాహనాలను జాగ్రత్తగా నడుపుతూంటారు. సాధారణంగా బస్సు డ్రైవర్‌కు ముందు భాగంలో 5 అడుగుల ఎత్తు వరకూ కనిపించదు. బస్టాండ్లు, బస్టాపుల్లో ఆగి ఉన్న బస్సు ముందు నుంచి ప్రయాణికులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అలా ఎవరైనా వెళ్తున్నప్పుడు వారు కనిపించక, ఎవరూ లేరని భావించి, డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తూంటారు. దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేవిధంగా గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే రెండు ప్రమాదాలు జరిగి, ఆయా డ్రైవర్లు 6 నెలల పాటు సస్పెండయ్యారు. బాధితులకు ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి ప్రమాదాలను, ఆర్టీసీ పరిహారాలు చెల్లించే పరిస్థితిని అరికట్టాలని సత్యనారాయణరాజు తీవ్రంగా ఆలోచించారు. ఆ క్రమంలోనే ఆయనకు స్టీల్ బాల్ పెట్టాలనే ఐడియా వచ్చింది. 180 డిగ్రీల కుంభాకారపు స్టీల్ బాల్‌ను 2 అడుగుల రాడ్‌కు అమర్చి, దానిని డ్రైవర్ సీటుకు కుడివైపున అద్దం ముందు బిగించారు. ఆ స్టీల్ బాల్లో బస్సు ముందు భాగం ఎడమ నుంచి కుడివైపు డ్రైవర్ డోర్ వరకూ కనిపిస్తోంది. దీంతో బస్సు ముందు ఎవరూ లేరని గుర్తించడం సులభమైంది. తద్వారా ఇటువంటి ప్రమాదాలకు చెక్ పడింది. ఈ స్టీల్ బాల్‌ను అన్ని బస్సులకూ అమర్చాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. ఈ స్టీల్ బాల్ తయారీకి కేవలం రూ.100 ఖర్చయినట్టు సత్యనారాయణరాజు తెలిపారు. ఆయన వినూత్న ఆలోచనను ఆర్టీసీ అధికారులు, సహచర డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఎంతగానో మెచ్చుకుని, అభినందించారు. -
మహిళ వీరంగం.. బూతులు తిడుతూ.. చేత్తో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ..
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ మహిళ దాడి చేసిన ఘటన నగరంలో బుధవారం కలకలం రేపింది. సూర్యారావుపేట సీఐ జానకి రామయ్య కథనం మేరకు.. విద్యాధరపురం డిపోనకు చెందిన ఐదో నంబర్ రూట్ బస్సు బుధవారం సాయంత్రం కాళేశ్వరరావు మార్కెట్ నుంచి ఆటోనగర్‌కు బయలుదేరింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన కె.నందిని తన ద్విచక్ర వాహనంపై వన్ వేలో రాంగ్రూట్లో కేఎల్ యూనివర్సిటీ జంక్షన్ వద్ద బస్సుకు అడ్డంగా వచ్చింది. దీంతో డ్రైవర్ ఎం.ముసలయ్య అత్యవసర బ్రేకు వేసి ప్రమాదం జరగకుండా బస్సును అదుపు చేశారు. చదవండి: కాటేసిన బాబాయ్.. టాటా చెబుతూ నవ్వుతూ వెళ్లిన చిన్నారి.. అంతలోనే.. అయితే నందిని ఆగ్రహంతో చంపేస్తావా అంటూ బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌పై దాడి చేసింది. డ్రైవర్‌ను బూతులు తిడుతూ చేతులు, కాళ్లతో దాడిచేయడాన్ని అక్కడే ఉన్న మరో మహిళ తన ఫోన్లో చిత్రీకరించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీడియో దృశ్యాలను పరిశీలించి, విచారణ చేపట్టిన అనంతరం డ్రైవర్ ముసలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందినిపై కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్‌పై నందిని దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. -
Tamil Nadu: 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడిలోకి ఆర్టీసీ డ్రైవర్
చెన్నై: తను చనిపోయే ముందు 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు ఓ ఆర్టీసీ డ్రైవర్.. తనకు ప్రమాదం ఎదురవబోతుందని ముందే గమనించి అప్రమత్తమైన డ్రైడర్ బస్సును రోడ్డు పక్కన నిలిపిన అయిదు నిమిషాల్లోనే గుండెపోటుతో మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి సమీపంలో చోటుచేసుకుంది. తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఎమ్ ఆరుముగమ్(44) ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే కండక్టర్ భాగ్యరాజ్‌తో కలిసి అరప్పాలయం నుంచి కొడైకెనాల్‌కు బస్సు నడుపుతున్నాడు. ఉదయం 6.20 నిమిషాలకు అరప్పాలయం నుంచి బస్సు బయలు దేరింది. బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. బస్సు బయల్దేరిన అయిదు నిమిషాలకు గురు థియేటర్ వద్దరు చేరుకోగానే అరుముగమ్‌కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు పార్క్ చేసి కండక్టర్‌ను సమాచారం అందించాడు. అనంతరం బస్సులోని సీట్లో కుప్పకూలిపోయాడు. కండక్టర్ వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. కానీ అంబులెన్స్ వచ్చేలోపే డ్రైవర్ అరుముగమ్ గుండెపోటుతో మరణించాడు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చదవండి: సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి! టీఎన్ఎస్టీసీ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ యువరాజ్ మాట్లాడుతూ.. ఆరుముగం ఆర్టీసీలో డ్రైవర్‌గా 12 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. 30 మంది ప్రాణాలను కాపాడిన అతని ఆదర్శప్రాయమైన సాహసం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కరిమేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Tejashwi Yadav: ఘనంగా తేజస్వి యాదవ్ వివాహం -
నాన్నా.. అమ్మ, తాతను చంపొద్దు
మానకొండూర్: కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. అమ్మను, తాతను చంపొద్దని చిన్నారులు వేడుకున్నా..నాన్న, చిన్నాన్నల మనసు కరగలేదు. పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో భార్యను, మామను అల్లుడు, అతడి సోదరుడు దారుణంగా హత్య చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని శ్రీనివాస్‌నగర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన లావణ్య(34)కు ఇదే మండలం అన్నారం గ్రామానికి చెందిన రమేశ్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రమేశ్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులకు అజిత్, అక్షిత సంతానం. ఈ నేపథ్యంలో భార్యపై రమేశ్ అనుమానం పెంచుకోగా, మనస్పర్థలు వచ్చి కొద్దిరోజులుగా ఇద్దరికీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. లావణ్య పిల్లలతో కలసి తల్లి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం కరీంనగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో దంపతులకు కౌన్సెలింగ్ చేసి, మళ్లీ రెండ్రోజులకు రావాలని సూచించారు. దీంతో లావణ్య, పిల్లలతోపాటు తండ్రి బాలసాని ఓదెలు(60) ఆటోలో వెల్దికి బయల్దేరారు. మార్గమధ్యంలోని శ్రీనివాస్‌నగర్ గ్రామ శివారులో బైక్‌పై వచ్చిన రమేశ్ అతడి తమ్ముడు అనిల్ ఆటోను అడ్డగించి దాడికి పాల్పడ్డారు. కత్తితో లావణ్య, ఓదెలు గొంతు కోసి వెళ్లిపోయారు. అడ్డగించిన చిన్నారులకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్
తిరువనంతపురం: ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటించేలా పోలీసులు, ప్రభుత్వ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాస్క్ ధరించకుండా ఉండడంతో అతడిని చితకబాదిన సంఘటన కేరళలో జరిగింది. కేరళ ఆర్టీసీలో పని చేసే బస్ డ్రైవర్ అంగమలి బస్టాండ్‌లో మాస్క్ లేకుండా ఓ వ్యక్తి నిలబడడాన్ని గుర్తించాడు. వెంటనే కర్ర అందుకుని మాస్క్ ధరించని పెద్దాయనను చితక్కొట్టాడు. కాళ్లు, చేతులపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అతడి దాడితో తీవ్రగాయాలై ముసలాయన కిందపడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో నెటిజన్లు ఆర్టీసీ బస్ డ్రైవర్ తీరుపై మండిపడుతున్నారు. పెద్దాయనను మానవత్వం లేకుండా దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ లేకుంటే చెప్పాలి కానీ అలా విచక్షణ రహితంగా దాడి చేయడం సరికాదని చెబుతున్నారు. చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం -
తల నొప్పిని భరించి.. ప్రయాణికులను కాపాడి..!
సాక్షి, అమరావతి: ఆ బస్సు గుంటూరు నుంచి అమరావతికి బయలుదేరింది. మరో ఆరు కిలో మీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరుతుంది. ఉన్నట్టుండి బస్సు అదుపు తప్పింది.. స్టీరింగ్‌పై డ్రైవర్ చేతులు ఉన్నా నియంత్రణ చేయలేకపోతున్నాడు.. భరించలేని తలనొప్పి, కళ్లు బైర్లుకమ్మడంతో డ్రైవింగ్‌పై దృష్టిపెట్టలేకపోయాడు.. బస్సు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్లడం.. కనుచూపు మేరలోనే కొండవీటివాగుపై బ్రిడ్జి కనిపించడం, బస్సుపై డ్రైవర్ నియంత్రణ లేపోవడం.. గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వారి అరుపులతో స్పృహలోకి వచ్చిన డ్రైవర్ బస్సును పక్కకుతీసి ఆపడంతో ప్రయాణికులు ఊరిపీల్చుకున్నారు. నొప్పి భరించలేని డ్రైవర్ సీటులో కూర్చోలేక రోడ్డుపై పడుకుని తల్లడిల్లాడు. డ్రైవర్‌ను ప్రయాణికుల సాయంతో బస్సు కండక్టర్ అమరావతి సీహెచ్‌సీకి తరలించాడు. బస్సు కండక్టర్ కుమారి, ప్రయాణికుల కథనం మేరకు.. గుంటూరు నుంచి అమరావతిగుడి సర్వీసు ఆర్టీసీ బస్సు డ్రైవర్ రవికిరణ్ మధ్యాహ్నం భోజనం తరువాత ఆరోగ్యం బాగాలేదని బస్టాండులో ఆర్టీసీ సంస్థకు చెందిన డాక్టర్‌కు చూపించుకున్నారు. డాక్టర్ పారాసిటమాల్ మాత్రలు ఇచ్చి పంపించారు. అనంతరం రవికిరణ్ డ్యూటీ ఎక్కాడు. బస్సు గుంటూరు నుంచి అమరావతి వస్తుండగా తాడికొండ అడ్డరోడ్డు దగ్గర తనకు తలనొప్పిగా ఉందని రవికిరణ్ కండక్టర్ కుమారికి చెప్పారు. తీరా ఎండ్రాయి వద్దకు వచ్చేసరికి రవికిరణ్ తలనొప్పిని తట్టుకోలేక తల్లడిల్లాడు. కళ్లు బైర్లుకమ్మడంతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డుకు అడ్డదిడ్డంగా వెళ్లడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు భయపడ్డారు. కొండవీటి వాగుపై ఉన్న వంతెన ఎదురుగా కనిపించడంతో ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని హాహాకారాలు చేశారు. వారి అరుపులకు తేరుకున్న రవికిరణ్ బస్సును పక్కకుతీసి నిలిపాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను అమరావతి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం డ్రైవర్ కోలుకున్నాడు. కోలు కున్న రవికిరణ్ మాట్లాడుతూ తనకు ఆరోగ్యం బాగాలేదని ఆర్టీసీ డాక్టర్ వద్దకు వెళ్తే పారాసిటమల్ మాత్రలు ఇచ్చి పంపించారని, ఒక మాత్ర వేసుకుని డ్యూటీకి వచ్చానని చెప్పాడు. -
మైసయ్య.. ఇదేందయ్యా!
సాక్షి, యాదాద్రి: సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. వాహనం నడపడం ప్రమాదకరం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా జనాల్లో మార్పు రావడం లేదు. సొంత వాహనాలను నడిపేవారి గురించి మనం చెప్పలేం. కానీ ప్రజా రవాణ వ్యవస్థలో పని చేస్తున్న డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. సెల్ఫోన్లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయో అందరికి తెలిసిందే. కొండగట్టు లాంటి బస్సు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఓ కారణం. అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ.. బస్సు నడుపుతున్న సంఘటన ఒకటి వెలుగు చూసింది. వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి నల్లగొండ వెళ్లే నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఏపీ 21 జడ్ 208 ఆర్టీసీ బస్సు డ్రైవర్ మైసయ్య ఫోన్లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తూ కెమరాకు చిక్కాడు. బస్సులో పదుల సంఖ్యలో ఉన్న ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి.. తన పాటికి తాను మొబైల్లో రియల్ ఎస్టెట్ వ్యాపారం గురించి చర్చిస్తూ.. బస్సు నడుపుతున్నాడు మైసయ్య. మైసయ్య వైఖరికి బస్సులో ఉన్న ప్రయాణికులు హడలిపోయారు. ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. అయితే మైసయ్య ప్రవర్తన పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవరన్నా.. ప్రమాదం జరిగితే నీ ఇంటితో పాటు ప్రయాణికుల ఇళ్లు కూడా మునుగుతాయ్ జర భద్రం అంటూ కామెంట్ చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బైక్ నడుపుతూ.. మొబైల్ ఫోన్ మాట్లాడితే.. రూ. 2 వేలు జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. మరి ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం అంటున్నారు. ఈ సంఘటనపై నార్కట్ పల్లి డిపో మేనేజర్ స్పందించాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి కేసులో పురోగతి
-
కండక్టర్ అవమానించాడని..
కామారెడ్డి క్రైం: కండెక్టర్ అవమానించాడని మనస్తాపానికి లోనైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి కామారెడ్డి డిపోలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన సుతారి శ్రీనివాస్ బుధవారం విధుల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లాడు. సాయంత్రం జూబ్లీ బస్టాండ్ నుంచి కామారెడ్డికి తిరిగి వస్తుండగా మేడ్చల్ సమీంలో మేడ్చల్ డిపోలో కండక్టర్‌గా పనిచేసే సిద్దిరాములు బస్సు ఎక్కి రామాయంపేట వద్ద దింపాలన్నాడు. నాన్‌స్టాప్ బçస్సు అయినందున అక్కడ ఆపడం కుదరదని శ్రీనివాస్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి లోనైన శ్రీనివాస్ కామారెడ్డికి వచ్చిన అనంతరం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి ఉద్యోగులు అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. -
ఆర్టీసీ డ్రైవర్‌పై టీడీపీ నాయకుల దాడి
అనంతపురం, కళ్యాణదుర్గం: తను కోరిన చోట ఆపలేదన్న అక్కసుతో టీడీపీ బెళుగుప్ప మండల కన్వీనర్ నరసాపురం ప్రసాద్ తన అనుచరులతో కలిసి కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేశాడు. వివరాల్లోకెళితే.. కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్ నుంచి కేఏ06ఎఫ్ 1012 నంబరు గల ఆర్టీసీ బస్సు ఉదయం 9.10 గంటలకు బెంగుళూరుకు బయల్దేరింది. పట్టణ శివారులోని బైపాస్ వద్ద రోడ్డుపక్కన ప్రసాద్, అతని అనుచరులు బస్సును కారులోనుంచే ఆపారు. డ్రైవర్ తిమ్మరాజు ప్రయాణికులు వస్తారని కాసేపు బస్సు ఆపాడు. ఎంతసేపటికీ కారులోంచి రాకపోవడంతో ముందుకు వెళ్లిపోయాడు. దీంతో చిర్రెత్తిన టీడీపీ నాయకుడు కారును వేగంగా వెళ్లమని డ్రైవర్‌కు చెప్పి బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. చివరకు యర్రంపల్లి గేటు సమీపంలోకి బస్సు చేరుకోగానే బస్సుకు అడ్డంగా కారును ఆపాడు. డ్రైవర్ బస్సు ఆపుతుండగానే వెళ్లి కిందకు లాక్కుని చితకబాదారు. బస్సు డ్రైవర్ దాడికి పాల్పడిన వారి కారు నంబర్‌ను తన సెల్ఫోన్లో చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుండగా ప్రసాద్ కారు డ్రైవర్, తనఅనుచరులు మరోసారి డ్రైవర్‌పై దాడికి దిగారు. దాడిలో డ్రైవర్ కుడికన్నుకు, ఎడమ చేతికి గాయాలయ్యాయి. బస్సుతో పాటు స్టేషన్‌కు.. ఆపై ఆస్పత్రికి... సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్ బస్సులో ప్రయాణికులతో పాటు కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకోకుండా, ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. తిరిగి బస్సుతో పాటు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి పార్కింగ్‌లో ఉన్న ఒక ఆటో, మూడు కార్లను ఢీకొట్టిన సంఘటన మంగళవారం రాత్రి చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందారు. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాణిగంజ్ డిపో–1కు చెందిన ఏపీ29జడ్3560 219 నంబరు బస్సు పటాన్చెరు నుంచి సికింద్రాబాద్‌కు 45 మంది ప్రయాణికులతో వెళ్తుండగా మార్గమధ్యంలో చందానగర్ ఆర్.ఎస్.బ్రదర్స్, మలబార్ గోల్డ్ ముందుకురాగానే డ్రైవర్ మల్లారెడ్డికి గుండెనొప్పి రావడంతో బస్సు అదుపుతప్పి మొదట ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ పక్కకు దూకేశాడు. ఆ తర్వాత పార్కింగ్ చేసి ఉన్న మూడు కార్లను బస్సు ఢీ కొట్టింది. ఇందులో రెండు కార్లు, ఓ ఆటో పూర్తిగా ధ్వంసం కాగా మరో కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ çఘటనలో శైలజ అనే బస్సు ప్రయాణికురాలికి స్వల్పగాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మిగతావారంతా క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ మల్లారెడ్డి మృతి బస్సు నడుపుతున్న డ్రైవర్ మల్లారెడ్డి గజ్వేల్‌కు చెందినవారు. మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉన్నప్పుడు గుండెపోటుకు గురైనప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి రోడ్డు ఎడమవైపునకు బస్సును తిప్పడంతో పెనుప్రమాదం తప్పింది. అతని పరిస్థితిని గమనించిన ప్రయాణికులు, స్థానికులు మల్లారెడ్డిని వెంటనే సమీపంలోని అర్చన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మల్లారెడ్డి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా పని ఒత్తిడితోనే ఆయన గుండెపోటుకు గురయ్యారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపించాయి. తప్పిన పెనుప్రమాదం ఈ ఘటన జరిగిన చందానగర్ జాతీయరహ దారి అత్యంత రద్దీగా ఉన్నప్పటికీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమా దం తప్పింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి స్వల్ప దూరంలోనే బస్‌స్టాప్ ఉన్నప్పటికీ, అక్కడికి చేరుకోవడానికి ముందే బస్సు నిలిచిపోవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కండక్టర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్యూటీ వేయకపోతే దూకేస్తా...
విజయనగరం అర్బన్: విధులు కేటాయించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ బుధవారం హల్చల్ చేశాడు. డిపో ప్రాంగణంలోని ఆర్టీసీ డిస్పెన్షనరీ భవనం పైకి ఎక్కి అక్కడ నుంచి దూకేస్తానని బెదిరించిన సంఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... ఆర్టీసీ విజయనగరం డిపో పరి«ధిలో అనకాపల్లి వెళ్లే అద్దె బస్సుకు సంతోష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆయనకు బుధవారం డ్యూటీ వేయలేదు. ముందురోజు ఎటువంటి అనుమతి లేకుండా డ్యూటీకి హాజరుకాకపోవడంతో మరుచటి రోజు డ్యూటీ వేయవద్దని ఆర్టీసీకి సిబ్బందిని బస్సు యజమాని కోరాడు. దీంతో ఆర్టీసీ అధికారులు అతనిడి డ్యూటీ వేయలేదు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని.. డ్యూటీ వేయమని సంతోష్ కోరినా ఫలితం లేకపోయింది. దీంతో డ్రైవర్ సంతోష్ సమీప భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. దాదాపు గంటపాటు ఎవరు చెప్పినా వినలేదు. చివరకు డిపో మేనేజర్ బాపిరాజు వచ్చి సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో దిగి వచ్చాడు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ, అద్దె బస్సు డ్రైవర్లకు వారే డ్యూటీలు కేటాయిస్తామన్నారు. -
బస్సులో 40మంది.. డ్రైవర్‌కు గుండెపోటు..!
పాడేరు రూరల్: గుండెపోటు వచ్చినా ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమనుకున్న ఆర్టీసీ డ్రైవర్ వారిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చి చివరకు మృత్యువు ఒడిలోకి జారుకున్న విషాదకర ఘటన విశాఖ జిల్లా పాడేరులో శనివారం జరిగింది. ఇదే జిల్లా నాతవరానికి చెందిన ఈఎస్.నారాయణ పాడేరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాడేరు–అరుకు మార్గంలో నైట్‌డ్యూటీ విధులకు వెళ్లాడు. తిరిగి శనివారం మధ్యాహ్నం అరుకు నుంచి పాడేరుకు 40 మంది ప్రయాణికులతో వస్తుండగా పాడేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో చింతలవీధికి చేరుకునే సరికి డ్రైవర్ నారాయణకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాన్ని భరిస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాలన్న ఉద్దేశంతో బస్సును పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు చేర్చి సంతకం పెట్టి డ్యూటీ దిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది అతడిని వెంటనే స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చూరిలో భద్రపరిచి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడు నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్‌పై ఎస్ఐ దాడి
ఓర్వకల్లు: సీఎం సభకు ప్రజలను తరలిస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ ఎస్ఐ దాడికి పాల్పడిన ఘటన గురువారం ఓర్వకల్లులో చోటుచేసుకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు బనగానపల్లె డిపోకు చెందిన బస్సు(ఏపీ02జెడ్–269)లో డ్రైవర్ బాబు పాణ్యం మండలం గోనవరం, భూపనపాడు గ్రామాల ప్రజలను ఓర్వకల్లు సభకు తీసుకొచ్చాడు. ప్రజలు దిగిపోయాక బస్సును పార్కింగ్ చేసే క్రమంలో పోలీసులు డ్రైవర్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన డ్రైవర్ మీరు చెప్పినట్లుగానే పార్కింగ్ చేస్తున్నానని చెప్పాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న బండిఆత్మకూరు ఎస్ఐ విష్ణునారాయణ ఆగ్రహంతో డ్రైవర్ పై చేయి చేసుకోవడమేగాక దుర్భాషలాడాడని డ్రైవర్ బాబు వాపోయాడు. తోటి డ్రైవర్ కంబగిరి అక్కడికి చేరుకొని ఘటనపై పోలీసులను ప్రశ్నించాడు. ఈ క్రమంలో పోలీసులకు డ్రైవర్ల మధ్య వాగ్వాదం జరిగింది. విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా సదరు ఎస్ఐ సభ ముగిశాక మీ సంగతి చూస్తానని బెదిరించడంతో డ్రైవర్లు హైవేపై ఆందోళనకు దిగారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, నంద్యాల డీఎస్పీకి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు çహామీ నివ్వడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు. -
ఆర్టీసీ డ్రైవర్‌పై టీడీపీ నేత దాడి
వైస్సార్ కడప, రాజంపేట : రాజంపేట పట్టణంలోని పాతబస్టాండులో తాడిపత్రి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వర్గీయుడు దాడి చేశారు. ప్రయాణికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం తిరుపతి నుంచి తాడిపత్రికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం రాజంపేట పాతబస్టాండుకు చేరుకుంది. ఆ సమయంలో బస్సులోని ప్రయాణికులను దింపేందుకు డ్రైవరు ఎం.మల్లికార్జున బస్సు నిలిపాడు. అయితే అదే సమయంలో ముందున్న టాటా సఫారీ వాహనాన్ని(ఏపీ04బీకె 3333) పక్కకు తీయమని పలుమార్లు హారన్ కొట్టాడు. దీంతో అందులో ఉన్న మనోహర్‌రెడ్డి దిగి బస్సువద్దకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను ఎందుకు హారన్ కొట్టావంటూ డ్రైవర్‌ను దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన ఆర్టీసీ డ్రైవర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పటికీ పోలీసులు ఫిర్యాదును తీసుకోవడంలో జాప్యం చేశారు. ఎట్టకేలకు దాడికి పాల్పడిన టీడీపీ నేత మనోహర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సాయంత్రం వరకు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేయలేదు. -
ఆర్టీసీ డ్రైవర్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం
-
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం..!
సాక్షి, రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అనుచరుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రాజంపేటలో ఆర్టీసీ బస్సు ముందు తన వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యే మేడా అనుచరుడు మనోహర్‌రెడ్డి అడ్డంగా నిలిపేవాడు. దీంతో బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. తన వాహనానికే హరన్ కొడతావా అంటూ మనోహర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మల్లికార్జున్‌పై దాడికి దిగాడు. రక్తం వచ్చేలా డ్రైవర్‌ను కొట్టాడు. దీంతో బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చేరాడు. దాడి సమయంలో నిందితుడు 84శాతం అల్కాహల్ సేవించి ఉన్నాడని రాజంపేట అర్బన్ పోలీసులు తెలిపారు. -
విద్యార్థులను దుర్భాషలాడిన బస్సు డ్రైవర్!
మెదక్‌రూరల్: ‘బస్ పాస్ పెట్టుకొని రోజూ తిరుగుతున్నారు.. అంటూ’ దుర్బాషలాడిన డ్రైవర్ క్షమాపణ చెప్పే వరకు బస్సును కదలనీయమంటూ విద్యార్థులతో పాటు గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఈ సంఘటన మెదక్ మండలం అవుసులపల్లి వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీహరి, సౌమ్య, సిద్దు, జ్యోతి, నసీర్‌బేగం, వెన్నెల అనే డైట్ విద్యార్థులు సిద్దిపేట దగ్గరలోని డైట్ కళాశాలలో చదువుతున్నారు. ప్రతి రోజు పాస్ తీసుకొని కళాశాలకు ఆర్టీసీ బస్‌లో వెళ్లి వస్తుంటారు. సోమవారం సాయంత్రం సిద్దిపేట నుంచి మెదక్‌కు వస్తున్న దుబ్బాక డిపోకు చెందిన బస్సులో గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో బస్ డ్రైవర్ విద్యార్థులనుద్ధేశించి నోటికొచ్చిన మాటలు తిడుతూ దర్భాషలాడినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. డ్రైవర్‌తో బస్‌లో వాగ్వివాదం పెట్టుకుంటే దాడికి పాల్పడుతాడేమో అనే భయంతో ముందుగానే తమ గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచాం అందించినట్లు తెలిపారు. అవుసులపల్లి వద్దకు చేరుకోగానే విద్యార్థులతో పాటు గ్రామస్తులు బస్సుకు అడ్డంగా నిలబడి రాస్తారోకో చేశారు. డ్రైవర్ క్షమాపణ చెప్పే వరకు బస్సును కదలనీయమని ఆందోళన చేశారు. సుమారు అరగంట పాటు ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. మెదక్ డిపో మినహయిస్తే ఇతర డిపో బస్సులో ప్రయాణిస్తే ఆర్టీసీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. -
మానవత్వం మరిచారు.. నిండు ప్రాణం తీశారు
భోగాపురం: అస్వస్థతతో ఉన్న వ్యక్తిని మార్గమధ్యంలో దించేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, గుండెనొప్పితో బాధపడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలోచించిన ఆటో డ్రైవర్లు కలిసి ఒక నిండు ప్రాణం పోవడానికి కారకులయ్యారు. కళ్లముందే కన్నతండ్రి గుండెపట్టుకుని విలవిలలాడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కుమారుడు పడిన వేదన వర్ణనాతీతం. చూసిన వారు అయ్యో పాపం అన్నారే తప్ప సాయం చేసేవారే కరువయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద బుధవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పొన్నాడ అచ్యుత్ (50) ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన వారం రోజులుగా దగ్గుతో బాధపడుతున్నాడు. శ్రీకాకుళంలో వైద్యం చేయించినప్పటికీ తగ్గలేదు. దీంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేందుకు కుమారుడు విష్ణుతో బుధవారం ఆర్టీసీ బస్సు ఎక్కారు. భోగాపురం ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి అచ్యుత్ అస్వస్థతకు లోనయ్యాడు. ఛాతీ నొప్పి వస్తోందని కుమారుడికి చెప్పాడు. దీంతో విష్ణు వెంటనే ఆస్పత్రి ఏదైనా ఉంటే ఆపాలని కండక్టర్‌ను కోరాడు. అయితే చాకివలస కూడలి వద్దకు వచ్చేసరికి అచ్యుత్‌కు నొప్పి ఎక్కువ కావడంతో డ్రైవర్ బస్సు ఆపి దించేశాడు. ఛాతీ నొప్పితో విలవిలలాడుతున్న ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటోవాలాలు తిరస్కరించారు. తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ముందుకు వచ్చాడు. కొంచెం దూరం వెళ్లగానే తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఎస్బీఐ బ్రాంచ్ వద్ద దించేశాడు. అంతే కన్నకొడుకు చేతిలోనే ఆ తండ్రి చనిపోయాడు. సంఘటన స్థలానికి కూతవేటు దూరంలోనే ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. కిలోమీటరు దూరంలోనే సీహెచ్‌సీ ఉంది. బస్సు డ్రైవర్ బస్సును వెంటనే వెనక్కి తిప్పి సీహెచ్‌సీకి తీసుకెళ్లినా, ఆటో డ్రైవర్లు ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఒక నిండు ప్రాణాన్ని కాపాడేవారు. చుట్టూ ఎంతమంది ఉన్నా సాయం చేసేవారు లేకపోవడంతో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
బస్ డ్రైవర్‌గా అవకాశం ఇవ్వండి
మంత్రి మహేందర్‌రెడ్డిని కోరిన ‘ఢిల్లీ డ్రైవర్’ సరిత సాక్షి, హైదరాబాద్: సరిత.. ఢిల్లీ మహా నగర బస్సు డ్రైవర్! సంస్థాన్ నారాయణ పురం సమీపంలోని సీతియా తండాకు చెందిన ఆమెది నిరుపేద కుటుంబం. ఐదుగురు అక్కాచెల్లెళ్లు. దీంతో హైదరాబాద్ వచ్చి బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. 2011 లో ఢిల్లీవెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా చేసింది. ఇప్పు డామె హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చింది. సీఎం బిజీగా ఉండటంతో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిని కలసి.. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టు ఇవ్వాలని కోరింది. మహిళా డ్రైవర్‌గా సరితకు తప్పకుండా ప్రాధాన్యమిస్తామని మంత్రి చెప్పారు. షీక్యాబ్ నడుపుతానంటే ఆమెకు కారు కేటాయిస్తామన్నారు. -
స్టీరింగ్‌పైనే కన్నుమూసిన ఆర్టీసీ డ్రైవర్
నకిరేకల్(నల్గొండ జిల్లా) బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తలవాల్చి మృతిచెందాడు. ఒక్కసారిగా ఛాతీనొప్పి రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును స్లోచేసి రోడ్డుపక్కన ఆపేశాడు. దీంతో బస్సులోని 37 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన నకిరేకల్ బైపాస్‌లో ఆదివారం వేకువజామున 3 గంటలకు చోటుచేసుకుంది. ఖమ్మం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ బయలుదేరింది. డ్రైవర్ జి.సైదులు(45) బస్సు నడుపుతున్నాడు. మార్గమధ్యంలో ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. అయినా చలించని డ్రైవర్ బస్సును మెల్లగా రోడ్డుపక్కన ఆపి స్టీరింగ్‌పైనే తలవాల్చి కన్నుమూశాడు. చిమ్మ చీకట్లో బస్సు ఆగడంతో ఏమైందో ఏమో అని ఆందోళనచెందిన ప్రయాణికులు డ్రైవర్ స్టీరింగ్‌పైనే మృతిచెంది ఉండటాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆర్టీసీ అధికారులకు తెలిపి మరో బస్సులో ప్రయాణికులను హైదరాబాద్ తరలించారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై హిజ్రా దాడి
వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్‌లో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌పై హిజ్రా దాడి చేయడంతో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే కొత్త బస్టాండ్‌కు చెన్నై నుంచి ప్రభుత్వ బస్సును డ్రైవర్ రమేష్ మధ్యాహ్నం 1.30 గంటలకు నడుపుకుంటూ వచ్చి నిలిపాడు. అనంతరం ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లేందుకు బస్సు ను నిలిపాడు. ఆ సమయంలో బస్టాండ్‌లోని ఒక హిజ్రా బస్సులోనికి ఎక్కి ప్రయాణికుల వద్ద డ బ్బులు వసూలు చేస్తున్నారు. ఆ సమయంలో బస్సు డ్రై వర్ రమేష్ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా బస్సు నుంచి కిందకు దిగాలని తెలిపాడు. దీంతో ఆగ్రహించిన హిజ్రా డ్రైవర్‌పై దాడికి దిగి అసభ్య పదజాలంలో దూషించింది. దీంతో హిజ్రా, డ్రైవర్ మద్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో బస్సు డ్రైవర్ రమేష్ షర్టును హిజ్రా చించివేసింది. అనంతరం కండక్టర్ అడ్డగించడంతో కండక్టర్ బ్యాగులో ఉన్న రూ.2500 నగదును దోచేసి పరారయ్యేందుకు ప్రయత్నించింది. వెంటనే ప్రయాణికులు హిజ్రాను అడ్డుకొని అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న సహ డ్రైవర్లు చెన్నై బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. వెంటనే హిజ్రాపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు ప్రభుత్వ బస్సు డ్రైవర్లను అడ్డుకొని చర్చలు జరిపారు. అనంతరం ప్రయాణికుల చర్చల అనంతరం బస్సు డ్రైవర్ బస్సును నడిపాడు. దీంతో అరగంట పాటు కొత్త బస్టాండ్‌లోని ప్రభుత్వ బస్సులు నిలిచి పోయింది. -
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
పాఠశాల బస్సు ఢీకొనటంతో బైక్‌పై వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని భీమవరం రోడ్డులో లంకలకోడేరు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భీమవరం వైపు బైక్‌పై వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ నబ్బూరి నరసింహ వరహాల రాజు(55)ను ఎదురుగా వచ్చినభీమవరం చైతన్యస్కూలు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన వరహాల రాజు భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.