saibaba
-
ఊదీ ఏం బోధిస్తోంది..?
బాబా తన దర్శనార్థం వచ్చే భక్తుల నుంచి దక్షిణ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కొందరి దగ్గర అయితే అడిగి మరీ తీసుకునేవారు. అలా వసూలు చేసిన మొత్తాన్ని సర్వసంగ పరిత్యాగి అయిన సాయి ఏం చేసుకుంటారనే కదా అందరి సందేహం... సాయిబాబా తన భక్తులనుంచి శ్రద్ధను, భక్తి విశ్వాసాలను దక్షిణగా కోరారు. ఎందుకంటే శ్రద్ధ, భక్తి విశ్వాసాలే ఏ పనిని చేయడానికైనా అత్యంత ఆవశ్యకాలు. అందుకే ఆయన భక్తులనుంచి శ్రద్ధ, సబూరి రూపంలో దక్షిణను అడిగి మరీ తీసుకునేవారు. వాటిని తనకిస్తే వారి జీవితాలను తీయబరుస్తానని చెబుతూ... ‘‘శ్రద్ధ, సబూరి అనే రెండు కాసులను ఎవరు దక్షిణగా సమర్పిస్తారో వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను. భక్తులలోని ఉన్నతమైన శ్రద్ధాభక్తులే వారిని ఆధ్యాత్మికంగా సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. నా పలుకులను విశ్వసించే వారు ధన్యులు’’ అని ఆయన పదే పదే బోధించేవారు. ఆయన బోధలను ఆచరించిన వారికి ఆయన అనుగ్రహంతో సకలైశ్వర్యాలు చేకూరతాయన టంలో సందేహం లేదు. తన వద్ద పోగుపడిన ధనంలో ఎక్కువభాగం దానం చేసి, మిగతా దానితో వంట చెరుకును కొనేవారు. ఈ కట్టెలను బాబానే స్వయంగా ధునిలో వేసి మండించేవారు. మసీదులో బాబా నిత్యం ధునిని వెలిగిస్తూనే ఉండేవారు. అది ఇప్పటికీ అలా మండుతూనే ఉంది. అందులో నుంచి ఉద్భవించే బూడిదనే ఊదీ అంటారు. బాబా ఆ ఊదీనే తీసి భక్తులకు ఇళ్లకు తిరిగి వెళ్లేముందు ఆశీర్వదించి వారికి అందించేవారు. ఒక్కోసారి దానితోనే వైద్యం చేసేవారు. చిటికెడు ఊదీని బాబా తన భక్తుల నుదుటిపై పెట్టారంటే వారికి సర్వ రోగాలూ నయమయేవి.ఊదీ ద్వారా భక్తులకు బాబా ఏం బోధించారంటే... ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ అశాశ్వతాలు. పంచభూతాలచే రూ΄÷ందిన మన శరీరాలన్నీ సౌఖ్యాలు అనుభవించిన తరువాత పతనమైపోయి శిథిలమై బూడిదవుతాయి. ఈ విషయాన్నే నిరంతరం గుర్తు చేసేందుకే బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని అందించేవారు. ఈ ఊదీ వల్లనే బ్రహ్మము నిత్యమని, ఈ జగత్తు అశాశ్వతమని, ప్రపంచంలో గల మన బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారని బాబా బోధించారు. మనం ఎందరితో ఎన్ని రకాలుగా ఎంతగా ఎన్ని బంధాలు, అనుబంధాలు పెనవేసుకున్నా, అవేవీ శాశ్వతం కావని, ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాము, తిరిగి ఒంటరిగానే వెళ్తామన్న సత్యాన్ని బోధించేవారు.ఊదీకి ఆధ్యాత్మిక విశేషమే కాదు, భౌతికప్రాముఖ్యం కూడా ఉంది. ఊదీ అనేక విధాలుగా శారీరక మానసిక రోగాలకు ఔషధంగా పనిచేసేది. రోగులకు, బాధార్తులకు స్వస్థత కలిగించేది. తాము ధరించిన ఊదీ ద్వారా భక్తుల చెవిలో నిత్యానిత్యాలకు గల తారతమ్యం, అనిత్యమైన దానిపై అభిమాన రాహిత్యం గంట మోతవలె వినిపించి, చెడుపనులు, చెడు తలంపుల నుంచి దూరం చేస్తాయి. అలాగే ఊదీ ధరించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే బాబా భక్తులు తప్పనిసరిగా నుదుట విభూది ధరిస్తారు. -
డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీ.ఎన్ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో గతంలో సాయిబాబాను అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై 2014లో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్ట్ చేశారు. సాయిబాబా కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. 2017లో గడ్చిరోలి కోర్టు నిందితులకు జీవితఖైదు విధించగా.. ఆయన నాగ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. సాయిబాబాను నిర్ధోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది. మార్చి నెలలో నాగ్‌పూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పోలియో కారణంగా ఐదేళ్ల వయస్సు నుంచి వీల్ చైర్‌ను ఉపయోగిస్తున్నారు. ఆయన జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్లు ఇంగ్లీష్ బోధించారు. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే కేసులో జైలుకు వెళ్లారు. దీంతో ఫిబ్రవరి 2021లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుండి తొలగించబడ్డారు.మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌లాల్‌ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది.సెషన్స్‌కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్‌ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది.చదవండి: డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్ -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను కొట్టివేసింది. -
ప్రొఫెసర్ సాయిబాబా కేసు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
నాగ్‌పూర్: మావోయిస్టులతో లింకు ఉందన్న కేసులో జీవిత ఖైదు పడిన ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా పేర్కొంటూ మంగళవారం తీర్పిచ్చింది. తమకు ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సాయిబాబాతో పాటు మరో ఐదుగురు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. దీంతో మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబాతో పాటు శిక్షపడిన మరో ఐదుగురు జైలు నుంచి విడుదలవనున్నారు. కేసు వివరాలు ఇలా.. మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌లాల్‌ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది. సెషన్స్‌కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్‌ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది. దీంతో తాజాగా అప్పీల్ విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఇదీ చదవండి.. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు -
టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తా..
చిలకలగూడ: అధిష్టానం ఆదేశిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగులూరి సాయిబాబా అన్నారు. చిలకలగూడ సాయిలత ఫంక్షన్హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టానని, ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని, వేరొకరికి టిక్కెట్ ఇచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే వ్యక్తిగా స్థానికుడైన నాగులూరి సాయిబాబా అన్నివర్గాల ప్రజలకు సుపరిచితుడని గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అచ్యుత రమేష్ బాబు అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ ప్రతినిధులు దేవుడు వెంకటేష్, ప్రవీణ్‌కుమార్, కమలాకర్, అరుణ్‌కుమార్, రాజు, కాంగ్రెస్ నాయకులు తుమ్మశ్రీను, సతీష్, ప్రమోద్, ఆంజనేయులు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సాయిబాబా కేసును మరోసారి విచారించండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రోఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాను నిర్ధోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును బుధవారం ఆదేశించింది. ఈ మేరకు నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎమ్ ఆర్ షా, సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. గతంలో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నందున సముచిత ప్రయోజనాల దృష్ట్యా మరో బెంచ్ అన్ని కోణాల్లో ఒకే విధంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు దాఖలైన అప్పీల్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 15న చట్ట వ్యతిరే కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) కింద.. సాయిబాబా ఇతరులపై ప్రాసిక్యూషన్ చెల్లుబాటు కాదని కొట్టేసిన బాంబే హైకోర్టు.. వాళ్లను తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ట్రయల్ కోర్టుల తీర్పు ప్రకారం దోషులుగా నిర్థారించిన వారి నేరాల తీవ్రతను బాంబే హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని అభిప్రాయపడింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా హైకోర్టు అభ్యంతరకరమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, ఈ కేసుకి సంబంధించిన యూఏపీఏ కింద గడ్చిరోలి కోర్టులోని విచారణ ప్రకియను చెల్లదని పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ అక్టోబర్ 14న ఈ కేసులో జీవిత ఖైదు పడిన సాయిబాబాను విడుదల చేసింది. అలాగే ఈ కేసుకి సంబంంధించిన మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఆరో నిందితుడు 2022లో చనిపోయాడు. (చదవండి: బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని కమలం పార్టీ ఎంపీ ఫైర్..) -
సాయిబాబా కాలేజీ విద్యార్థిని జయలక్ష్మికి ఎస్పీ ఫక్కీరప్ప అభినందనలు
-
అనంతపురం: సాయిబాబా కాలేజీ గొడవలో కొత్త ట్విస్ట్
-
అలరించిన చైతన్యప్రభు నాటిక
పుట్టపర్తి అర్బన్: విశ్వశాంతి కోసం పరితపించిన సత్యసాయి బాబా తన భక్త లోకాన్ని శాంతి, ప్రేమ అనే మార్గాల్లో చైతన్యపరిచి నడిపించిన మహనీయుడనే ఇతి వృత్తంతో కూడిన ‘శ్రీకృష్ణ చైతన్యప్రభు’ నాటిక అబ్బురపరిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్త బృందం, బాలవికాస్ విద్యార్థులు శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయం విచ్చేశారు. పర్తి యాత్ర పేరుతో విచ్చేసిన భక్త బృందం శ్రీకృష్ణుని జీవిత గాథలను సత్యసాయికి అనుకరిస్తూ పలు నృత్య నాటికలు, సంగీత కచేరీలు నిర్వహించారు. 16వ శతాబ్దంలో కృష్ణభగవానుడి ప్రియభక్తుడైన కృష్ణ చైతన్య ఇతివృత్తాన్ని అభినయించారు. -
అలరించిన ‘కృష్ణం వందే జగద్గురం’
పుట్టపర్తి టౌన్ : పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ప్రకాశం జిల్లా సత్యసాయి భక్తులు రెండో రోజు ఆదివారం సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహా సమాధి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల వికాస్ చిన్నారులు 55 మంది ‘కృష్ణం వందే జగద్గురం’ నృత్యరూకం ప్రదర్శించారు. శ్రీకృష్ణుడి చిన్ననాటి ఆటలు, ఆయన భక్త కోటికి చూపిన మహిమాన్విత ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించి భక్తులను అలరించారు. అనంతరం నృత్యరూపంలో పాత్రధారులైన చిన్నారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. పర్తియాత్రలో దాదాపు 200 మంది సత్యసాయి విద్యావాహిని పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ సేవలు అనితర సాధ్యం
సందర్భం :నేడు ప్రేమమూర్తి ఆరాధనోత్సవం ప్రేమతత్వమే విశ్వశాంతికి మూలం.. అదే సత్యసాయి బాబా అభిమతం. మానవళిని సన్మార్గం వైపు పయనింపజేసే ఆధ్యాత్మిక బోధనలు... ఆర్తించే ఆపన్నులకు అన్నీ తానై కాపాడుకుంటూ వచ్చిన సత్యసాయి కోట్లాది భక్తుల గుండెల్లో భగవంతుడిగా కొలువై ఉన్నారు. ‘నా జీవితమే నా సందేశం’ అన్న సత్యసాయి బోధ భక్తకోటి మదిలో అను నిత్యం ప్రతిధ్వనిస్తోంది. భౌతికంగా దేహం వీడి పరమపదించినా సర్వాంతర్యామిగా సత్యసాయి ప్రపంచ నలుమూలలా కొలువబడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 24న సత్యసాయి ఆరాధనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. - పుట్టపర్తి టౌన్ పూర్వం గొల్లపల్లిగా పిలవబడే పుట్టపర్తిలో ఈశ్వరాంబ, పెద్దవెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యసాయి జన్మించారు. బాల్యంలో సత్యనారాయణ రాజుగా పిలువబడిన ఆయన మెండైన ఆధ్యాత్మిక చింతనతో 1940లో తన 14వ ఏట సత్యసాయి బాబా అవతార ప్రకటన చేశారు. నాటి నుంచి కాషాయ వస్త్రధారిగా దేశదేశాల సంచరిస్తూ ఆధ్యాత్మికత, మానవతా విలువలను ప్రభోదిస్తూ సువిశాల భక్త సామ్రాజాన్ని నిర్మించుకున్నారు. అచిర కాలంలోనే పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో అనంతపురం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆర్తులను ఆదుకున్న భగవాన్ వరుస కరువులతో గుక్కెడు నీరు గగనమైపోయిన పరిస్థితుల్లో జిల్లాలోని వందలాది గ్రామాల గొంతు తడిపి దప్పిక తీర్చారు. ఉభయగోదావరి, చెన్నై నగరానికి కూడా తాగునీటిని అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వాలు సైతం చేయలేని ఎన్నో గొప్ప కార్యక్రమాలను వందల కోట్ల రూపాయలు వెచ్చించి, అనతి కాలంలోనే పూర్తి చేసిన సత్యసాయి అపరభగీరథుడుగా కీర్తింపబడుతున్నారు. పేదలకు నయాపైసా ఖర్చులేకుండా కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్‌లో సత్యసాయి వైద్య సంస్థలను నెలకొల్పారు. విలువైన విద్య ఉన్నత సమాజాన్ని నిర్మింస్తుందని ఆకాంక్షించిన సత్యసాయి పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్శిటీని నెలకొల్పారు. వీటితోపాటు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రకృతి విలయాలకు గురై గూడు చెదిరిన వేలాది అపన్నులకు సత్యసాయి తన ట్రస్ట్ ద్వారా గూడు నిర్మించి వారి జీవితాలకు భరోసా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలలో సేవా సంస్థలను నెలకొల్పి ఆయా ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ తన ఆధ్యాత్మిక బోధన ద్వారా చైతన్యవంతులను చేస్తూ సన్మార్గదర్శనం చేసిన భగవాన్ తన 85 ఏట 2011 ఏప్రిల్ 24న శివైక్యం పొందారు.అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 24న సత్యసాయి ఆరాధనోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. నేటి ఆరాధనోత్సవాలు ఇలా.. ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభామందిరంలోని సత్యసాయి మహా సమాధి చెంత విద్యార్థుల వేదపఠనం. ఉదయం 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు పంచరత్న కీర్తన ఉదయం 8.40 గంటలకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు నాగానంద, నిమిష్ పాండ్యల ప్రసంగం అనంతరం సత్యసాయి విద్యార్థుల సంగీత కచేరి ఉదయం 9.45 గంటలకు మహా మంగళహారతి ఉదయం 10 గంటలకు హిల్‌వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ సాయంత్రం సాయికుల్వంత్ సభామందిరంలో అనంత నారాయణ బృందం సాంస్కృతిక ప్రదర్శన -
సాయిబాబాకు ప్రాణాపాయం
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అడవిబిడ్డల హక్కుల గురించి మాట్లాడారు. దళితులపై అకృత్యాల గురించి గొంతెత్తి నినదించారు. రాజ్యం పౌరుల సర్వ హక్కులనూ హరించి వేస్తుంటే చూస్తూ ఊరుకోక పోవడమే ఆయన నేరం. ‘‘సాయిబాబాని మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో కలిసాను. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించింది. ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందనిపించింది. జైలు అధికారులు ఎటువంటి వైద్య సౌకర్యాలను, అందిం చడం లేదు. పైగా తప్పుడు వైద్య నివేదికలనిచ్చి, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు నమ్మబలుకుతు న్నారు. సాయిబాబా బీపీ కూడా నార్మల్‌గా లేదు. లాయర్ల ద్వారా పంపిన మందులను సైతం అత్య వసర పరిస్థితుల్లో మాత్రమే ఆయనకు అందిస్తు న్నారు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కిడ్నీల్లో రాళ్ళు, ఛాతీ నొప్పి, శ్వాస సంబంధమైన సమస్యతో పాటు గాల్‌బ్లాడర్‌లో, పాంక్రియాటిక్ నొప్పులు, ఆయనను తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రాసై్టట్ సమస్య వల్ల మూత్ర విసర్జన కూడా కష్ట సాధ్యం అవుతోందని చెప్పారు. ఒకనెల జైలు జీవితంలో మూడుసార్లు తీవ్రమైన పాంక్రియాటిక్ నొప్పి వచ్చింది. వైద్యుల సలహా మేరకు ప్రతి రోజు ఆయన గుండె సంబంధమైన పాంక్రియా టిక్ నొప్పికి సంబంధించిన మందులు వాడాలని సూచిం చినప్పటికీ ఆ మందులను ఇంత వరకు ఆయనకు అందించలేదు. ఇంత అనారోగ్యం కారణంగా ఆయన జైల్లో ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. బయట జరుగుతున్న ఘట నలకు సంబం«ధించిన వార్తలను చదివే, చూసే అవ కాశాన్ని ఇవ్వడం లేదు. అరుదుగా పత్రికలు ఇచ్చి నప్పటికీ ఉద్యమ వార్తలను కత్తిరించి ఇస్తున్నారు. నేను స్వయంగా రాసిన ఉత్తరాలను కూడా ఆయనకు అందించడం లేదు. రాజ్యం సాయిబాబా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది. తక్షణమే ఆయనను ఢిల్లీ జైలుకి తరలించాలి. లేదా హైదరాబాద్‌కి తరలించి సరైన వైద్యం అందించాలి.’’ ‘‘చేతులకు చెప్పులేసుకొని సైకిల్ మీద వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసేదాన్ని. 15 ఏళ్ళప్పుడేర్పడిన మా పరిచయం ప్రేమగా ఎదిగి సమానత్వం దిశగా ఎదు గుతున్న క్రమంలో ఈ సమాజంలో ఆదివాసీలపై, దళితులపై, స్త్రీలపై, మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అవే చెప్పులు తొడిగిన చేతుల్తో ఎన్నో వేదికలెక్కారు సాయిబాబా. ఈ సమాజం మార్పుకోసం ఎంతో తపించారు. అడవి బిడ్డల హక్కుల గురించి మాట్లాడారు. దళితులపై అకృత్యాల గురించి గొంతెత్తి నినదించాడు. పౌరు లను రక్షించాల్సిన రాజ్యమే వారి సర్వహక్కులనూ హరించి వేస్తుంటే చూస్తూ ఊరుకోకుండా ఉండడమే ఆయన చేసిన నేరమయ్యింది. ‘‘90 శాతం వైక ల్యంతో ఉన్నా ఆయనపట్ల ఉదారంగా వ్యవహరిం చలేం. ఆయన మేధోపరంగా గొప్పవాడు. నిషేధిత మావోయిస్టు్ట పార్టీకి సలహాదారుడు. కాబట్టి ఆయన కీశిక్ష సరిపోదు అంటూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనకి కఠిన శిక్షను విధించింది. ఇదెక్కడి న్యాయం?’’ అని ఈ నెల మూడవ తేదీన హైదరా బాద్‌లో జరిగిన సాయిబాబా, తదితరుల విడుదల సభలో మాట్లాడాను. ప్రొఫెసర్ సాయిబాబా, ప్రశాంత్ రాహి (జర్న లిస్ట్), హేమ్ మిశ్రా (జెఎన్‌యులో పరిశోధక విద్యార్థి), పాండు నరోత్, మహేశ్ టిర్కిలకు జీవిత శిక్ష వేసింది. వీరితో పాటు విజయ్ టిర్కికి 10 సంవ త్సరాల జైలు శిక్షను విధించింది, భారతదేశంపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నారనీ, నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనీ, వీరి పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ. మరో మనిషి సాయం లేకుండా కదల్లేని మనిషి ఏ ప్రభుత్వాన్ని కూల్చడానికైనా చేసే కుట్ర ఏముంటుంది? సాయిబాబాని ఇంటినుంచి ఓ ఇసుకబస్తాని విసిరేసినట్టు పోలీసు వాహనంలో విసిరేస్తే వీల్ చైర్ విరిగిపోయింది. ఆ విరిగిపోయిన కుర్చీలో కదల్లేని స్థితిలో 72 గంటల పాటు పోలీసులు బంధించి తీసుకెళ్ళారు. మధ్యలో మూత్ర విసర్జన అత్యవసరమని చెప్పినా అనుమతించకుండా అత్యంత అమానవీయంగా పోలీసులు వ్యవహ రించారు. సాయిబాబాకి మందులివ్వ కుండా, కనీసం కదలనైనా లేని వ్యక్తిని అత్యంత వేడిగా ఉండే నరకప్రాయ మైన అండాసెల్‌లో ఉంచడం ద్వారా ఈ ప్రభుత్వం ఏం సాధించదల్చుకుందో అర్థం కాదని మేధావులు వాదిస్తున్నారు. ‘‘అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కలిసే అవకాశాన్ని సైతం ఇవ్వకుండా నన్నూ, నా కుమార్తెను వే«ధిస్తున్న స్థితి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఉదయం ములాఖత్‌కి పెట్టు కుంటే సాయంత్రం 5గంటల 45 నిముషాలకు లోప లికి పిలుస్తారు. అది కూడా జాలీ ములాఖత్. మధ్యలో గ్లాస్, ఆ తర్వాత జాలీ. అంత దూరంలో ఆయన్ను కూర్చోబెడతారు. తను నించుంటే తప్ప నేను చూడలేను. కానీ తను నించోలేడు. మూడు చక్రాల బండిలో తను, అంత దూరంలో నేను. కనీసం మాట్లాడింది వినిపించదు. ఎలాగోలా ఆయన్ను దూరం నుంచి చూసే ప్రయత్నంలో ఉండగానే 6 గంటలకు టకటకమని కొట్టుకుంటూ వచ్చి టైం అయిపోయిందని తరిమేస్తారు’’. సాయి బాబా విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి 20,000 ఉత్తరాలొచ్చాయని ప్రభుత్వమే చెప్పింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా ప్రపంచ మేధావు లంతా సాయిబాబా విడుదలను కోరుతున్నారు. ప్రభుత్వం సాయిబాబాపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొని, ఆయన్ను, అయనతో పాటు అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలి. ఇది ప్రజాస్వామికవాదుల డిమాండ్ కూడా. -వసంత, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహచరి -
'ఆయన జైల్లోనే చనిపోతారేమో'
హైదరాబాద్: దళితులు, ఆదివాసీలు, మైనార్టీల గురించి మాట్లాడితే.. ప్రభుత్వం వారిపై నక్సల్స్ అనే ముద్ర వేస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. భావప్రకటనా హక్కును కాలరాస్తోందని అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దవయసు కావడంతో అనేక వ్యాధులకు గురైన సాయిబాబాకు సరైన మందులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చత్తీస్‌గఢ్‌లోని పోలీసు బలగాల మారణకాండను ప్రపంచానికి తెలియజేయడానికి వెళ్లిన టీడీఎఫ్ నాయకులను పోలీసులు అక్కడే నిర్భందించారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మాట్లాడుతూ... ఈ నెల 23న బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో సాయంత్రం 6 గంటలకు రాజకీయ ఖైదీల విడుదల పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిపై తమకున్న కృతజ్ఞతను చాటుతూ సత్యసాయి విద్యాసంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్ పీజీ విద్యార్థులు, సంగీత కళాశాల విద్యార్థులు ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సుమారు గంట పాటు సంగీత కచేరి నిర్వహించారు.చక్కటి భక్తిగీతాలతో విద్యార్థులు భక్తులను మైమరపింపజేశారు. విద్యార్థుల బ్యాస్బ్యాండ్ వాయిద్యంతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. పిదప భరత నాట్య కచేరితో విద్యార్థులు ఆహూతులను ఆలరించారు. చక్కటి నృత్యభంగిమలతో,సుమధుర స్వరాల నడుమ విద్యార్థులు నాట్య కచేరీ భక్తులను మంత్రముగ్దులను చేసింది. -
లోక కల్యాణం కోసమే సాయి అవతరణ
పుట్టపర్తి టౌన్ : లోక కల్యాణం కోసమే సత్యసాయి అవతరించారని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు అన్నారు. పట్టణంలోని పెద్దవెంకమరాజు కల్యాణ మండపంలో శనివారం సత్యసాయి పూర్వవిద్యార్థులు సాయి బోధనలు, మానవతా విలువలతో కూడిన బోధన అన్న అంశంపై ఉపాధ్యాయులు, యువతకు వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రత్నాకర్రాజు హాజరై ప్రసంగించారు. విద్యతోనే సమాజంలో వెలుగులు నింపవచ్చని నమ్మిన సత్యసాయి విలువైన విద్యను అందించేందుకు కృషి చేశారన్నారు.దేశీయంగా 105 సత్యసాయి విద్యాసంస్థలు నడుస్తున్నాయని, వీటి ద్వారా 65 వేల మందికి పైగా విద్యాబుద్ధులు పొందారన్నారు. బాల్యం నుంచే మానవతా విలువులు, ఆధ్యాత్మికతను పెంపొందించే లక్ష్యంతో బాలవికాస్ విద్యా విధానాన్ని రూపొందించారని, దేశీయంగా బాలవికాస్ శిక్షణను మూడు లక్షల మంది విద్యార్థులు పొందుతున్నారని, 20 వేల మంది వలంటీర్లు విద్యార్థులకు శిక్షణనిస్తున్నారన్నారు. జనవరి 7, 8న ప్రశాంతి నిలయంలో బాలవికాస్ స్నాతకోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం విలువలు, ఆధ్యాత్మిక, సృజనాత్మకతను పెంపొందించే పాఠ్యపుస్తకాలను వివిధ మండలాల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు రత్నాకర్రాజు అందజేశారు. అంతకుమునుపు సత్యసాయి పూర్వవిద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు పట్టణంలో సత్యసాయి బోధనలను చాటుతూ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు తదితర మండలాల చెందిన ఉపాధ్యాయులు, యువత వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. -
సీనియర్ హీరోలే నాకు స్ఫూర్తి!
కొత్తపేట : సీనియర్ హీరోల స్ఫూర్తి, నాన్న కోరికతో సినిమా రంగంలో ప్రవేశించినట్టు వర్ధమాన హీరో యలమంచిలి రేవంత్ అన్నారు. నాడు సీనియర్ ఎన్టీఆర్ 'లవకుశ' ఆధారంగా బాలకృష్ణతో 'శ్రీరామరాజ్యం'ను నిర్మించిన యలమంచిలి సాయిబాబా తన కుమారుడు రేవంత్ హీరోగా ‘ఇంటింటా అన్నమయ్య’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. శ్రీశైలంలో షిర్డీసాయిబాబా ఆలయం ప్రాంగణంలో నెలకొల్పేందుకు రేవంత్ తాత, ఎస్ఈడబ్ల్యూ కన్స్ట్రక్షన్స్ అధినేత యలమంచిలి నాగేశ్వరరావు పంచలోహ విగ్రహం రూపకల్పనను కొత్తపేటలోని ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్‌కు అప్పగించారు. బుధవారం ఆ విగ్రహం నమూనా పరిశీలనకు వచ్చిన రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ సాయిబాబా మూవీస్ బ్యానర్‌పై తండ్రి నిర్మించిన ‘ఇంటింటా అన్నమయ్య’లో అన్నమయ్య కీర్తనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే గాయకుడి పాత్రను పోషించానన్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో హీరోయిన్గా అనన్య (జర్నీ ఫేం), ఇతర ముఖ్య పాత్రలను బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు పోషించారని, సంగీతం కీరవాణి సమకూర్చారని చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తన ద్వితీయ చిత్రం 'రాజా మీరు కేక' నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ చిత్రంలో సోబిత హీరోయిన్ కాగా తారకరత్న విలన్ రోల్ పోషిస్తున్నారని తెలిపారు. తాను ఒక్కో తరహా పాత్రల్లో ఒక్కో హీరోను అభిమానిస్తానని, అలా సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున,బాలకృష్ణ తదితరుల స్ఫూర్తితో సినీ రంగానికి వచ్చానన్నారు. ఫిబ్రవరి 24న తాత జన్మదినోత్సవం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. విగ్రహం చాలా బాగా వచ్చిందని శిల్పి రాజ్‌కుమార్‌ను అభినందించారు. -
ఓం సాయి..శ్రీసాయి..
- ఘనంగా దత్తజయంతి వేడుకలు – భక్తులతో కిటకిటలాడిన సాయిమందిరాలు కర్నూలు (న్యూసిటీ/కల్చరల్) దత్త జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని సాయిబాబా ఆలయాల్లో ఓం సాయి.. శ్రీసాయి.. జయ జయ సాయి నామస్మరణ మార్మోగింది. తెల్లవారుజామునే మహిళలు కుటుంబసమేతంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవిష్ణు సహస్ర నామావళి మంత్రాలను పఠించారు. గురు చరిత్ర పారాయణం చేశారు. అంతకు ముందుగా వేద పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి విగ్రహాలకు అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు, పూజలతో అలంకరణ చేశారు. కర్నూలు నగరంలో పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున వెలసిన దక్షిణ షిరిడి శ్రీసాయిబాబా, బాలాజీ నగర్, బుధవారపేట, అశోక్‌నగర్, వినాయక ఘాట్, కృష్ణారెడ్డి నగర్లలోని సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. బిర్లాగేట్ సమీపంలోని శంకర మందిరరంలో షిరిడీసాయి జీవిత చరిత్రపై ప్రముఖ వాగ్గేయకారులు ఈమని రామకృష్ణప్రసాద్ మధురమైన గీతాలు వినిపించారు. సంగీత విభావరికి నాగరాజు, గోపాల్, శిరీష, వాయిద్యా సహకారం అందించారు. ఆలయ కమిటీలు, దాతల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. -
'కూంబింగ్ పేరుతో భయపెడుతున్నారు'
న్యూఢిల్లీ: పోలీసులు అదుపులో ఉన్న మావోయిస్టు అగ్రనేత ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపరచాలని హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా డిమాండ్ చేశారు. ఏవోబీ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు. ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చూస్తూ బుధవారం జంతర్ మంతర్ వద్ద ప్రజాసంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏవోబీ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూంబింగ్ పేరుతో గిరిజనులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూంబింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
'బహిరంగ చర్చకు రండి’
హైదరాబాద్: సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వామి స్వరూపానంద వివాదం రోజురోజుకు ముదురుతోంది. సాయిబాబా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకొని బహిరంగ చర్చకు రావాలని హైదరాబాద్ సాయి భక్త సమాజం స్వామికి సవాల్ విసిరింది. రేపు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరగబోయే సాయి భక్తుల సమ్మేళనానికి రావాలని అక్కడ ఈ విషయం పై చర్చించుకుందామని హైదరాబాద్ సాయిభక్త సమాజం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. -
20న గురురామ్‌రతన్‌జీ రాక
కర్నూలు(న్యూసిటీ): నగరంలోని శ్రీసాయిబాబా దేవస్థానంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు శ్రీసిద్ధయోగి గురురామ్‌రతన్‌జీ చేత సాయి ప్రవచానాల కార్యక్రమం నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. అనంతరం సాయిబాబా సత్సంగం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి సాయిబాబా భక్తులు హాజరు కావాలన్నారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల సత్యసాయి భక్తులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన బీహార్, జార్ఖండ్ భక్తు లు ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు సత్యసాయిపై భక్తితో సుమారు గంట పాటు నిర్వహించిన కచేరితో సాయికుల్వంత్ సభా మందిరం మా ర్మోగింది. అనంతరం భక్తులు సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. -
వైభవంగా సాయినాథుడి నగరోత్సవం
నెల్లూరు(బందావనం) : గురుపూర్ణిమ మహోత్సవాలను పురస్కరించుకుని స్థానిక ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ సమీపంలోని శ్రీషిర్డీసాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సాయినాథుడి నగరోత్సవ వైభవంగా జరిగింది. విశేషపుష్పాలంకరణలో, సర్వాలంకారశోభితంగా కొలువుదీరిన స్వామివారిని మంగళవాయిద్యాలతో, భజనలు, కోలాటాలు, వివిధ సాంస్కతిక ప్రదర్శనలు, బాణసంచావేడుకల నడుమ నగరోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గాంధీబొమ్మ మీదుగా ట్రంకురోడ్డు, ఏసీ సెంటర్, సంతపేట నాలుగుకాళ్ల మండపం,చిన్నబజార్, పెద్దబజార్, బారకాసు, వీఆర్ కళాశాల సెంటర్, కో–ఆపరేటివ్ సెంట్రల్‌బ్యాంక్ మీదుగా సాగింది. మందిరం కార్యవర్గసభ్యులు మన్నెం అమరనాథ్‌రెడ్డి, పైడిపాటి సుధాకర్‌రావు, కొల్లి శ్యాంసుందర్‌రెడ్డి, దువ్వూరి జయమ్మ, బి.మోహన్‌రావు పర్యవేక్షించారు. కాగా ఉదయం సాయినాథుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అష్టోత్తర సహస్రనామ, విశేషపూజలు, హారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని సభ్యులు తెలిపారు. -
సాయిబాబాను అడ్డుకోవడం తగదు
- ప్రొఫెసర్ హరగోపాల్ సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు బేషరతు బెయిల్ పొందిన హక్కుల కార్యకర్త, సహాయ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను తిరిగి విధుల్లో చేర్చుకోకుండా రామ్‌లాల్ కళాశాల యాజమాన్యం అడ్డుకోవడాన్ని ‘కమిటీ ఫర్ డిఫెన్స్.. రిలీజ్ ఆఫ్ డాక్టర్ సాయిబాబా’ చైర్మన్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, హనీబాబు ఎం.టీ మంగళవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. విధుల్లో చేరేందుకు అనుమతి కోరుతూ సాయిబాబా కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారని... మహారాష్ట్రలో నమోదైన క్రిమినల్ కేసు పరిష్కారమయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని ప్రిన్సిపాల్ బదులిచ్చారని వారు తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు సాయిబాబా ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని పేర్కొనడం దారుణమన్నారు. అణచివేతకు గురైనవారి హక్కుల కోసం పోరాడుతున్న సాయిబాబాను నేరారోపణతో భయపెట్టేందుకు కళాశాల యాజమాన్యం ప్రయత్నించినట్లు లేఖలో వాడిన పరుష పదజాలం ద్వారా తెలుస్తోందన్నారు. -
'సొంత నిర్ణయాల వల్లే డిప్యూటీ సీఎంను తొలగించారు'
సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ హన్మకొండ : సీఎం కేసీఆర్ మంత్రులను రిమోట్ ద్వారా నడిపిస్తున్నారని, మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ విమర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునెటైడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయూస్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో రెండో ఏఎన్ఎంలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్ష చేస్తున్న వారిని ఆయన శనివారం కలుసుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి వైద్య, ఆరోగ్యశాఖమంత్రిగా, విద్యావేత్త కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా, పంచె కట్టిన వ్యవసాయదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నా, వీరు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ఎక్కడ తమను తొలగిస్తారనే భయం మంత్రులలో నెలకొందన్నారు. అందుకే ఎలాంటి నిర్ణయాల జోలికి వెళ్లకపోవడమే మంచి అనే ఆలోచనతో పాటు సీఎం కేసీఆర్‌కు భజన చేస్తే చాలు అన్నట్లుగా రాష్ట్ర మంత్రులున్నారని విమర్శించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా డాక్టర్ ఉన్నా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు, ధర్నాలు నిత్యకృత్యమయ్యాయని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. గుడ్డి ప్రభుత్వం మేల్గొనేలా పోరాటాలు చేస్తామని సాయిబాబ పేర్కొన్నారు. -
ఎన్ఎఫ్సీ ఛైర్మన్‌గా కళ్యాణ క్రిష్ణన్
హైదరాబాద్: అణు ఇంధన రంగంలో విశేష సేవలందిస్తోన్న హైదరాబాద్‌లోని అణు ఇంధన సంస్థ (ఎన్ఎఫ్సీ) ఛైర్మన్, సీఈవోగా ప్రముఖ శాస్త్రవేత్త కళ్యాణ క్రిష్ణన్ నియమితులయ్యారు. రెండేళ్ల పదవికాలం ముగియడంతో ఎన్ఎఫ్సీ ఛైర్మన్, సీఈవోగా వ్యవహరించిన ఎన్.సాయిబాబ బుధవారం పదవివిరమణ పొందారు. ఎన్ఎఫ్సీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న జీ కళ్యాణకృష్ణన్కు ఎన్ఎఫ్సీ కొత్త సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. అణు ఇంధన ఉత్పత్తిలో ఎన్ఎఫ్సీ ప్రపంచ రికార్డు నెలకొల్పడంలో కళ్యాణ క్రిష్ణ తనవంతు కృషి చేశారు. 1980 ఆర్ఈసీ(ప్రస్తుత ఎన్ఐటీ-వరంగల్)లో కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ముంబైలో ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ బార్క్(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో(24వ బ్యాచ్)లో చేరి న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ప్రావీణ్యం పొందారు. రాజస్తాన్‌లో కోటాలోని అణు ఇంధన సంస్థలో హెవీ వాటర్ బోర్డులో పని చేశారు. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్ల(ఐఐసీహెచ్ఈ)ల సభ్యుల్లో కళ్యాణ క్రిష్ణన్ ఒకరు. జిర్కోనియం కాంప్లెక్స్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కళ్యాణ క్రిష్ణన్ చేసిన కృషికిగానూ డీఏఈ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు.