sajjala Ramakrishnareddy
-
వైఎస్ జగన్ పథకాలపై బాబు కుట్ర: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలపై చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సోమవారం(డిసెంబర్ 9) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసు నుంచి పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సజ్జల మాట్లాడారు. టెలీ కాన్ఫరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ సమన్వయకర్తలు,రీజనల్ ఇంఛార్జులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ పథకాలను ఉద్దేశపూర్వకంగా కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాం. ఈనెల 13న రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం.రైతులతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహిస్తాం. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తాం. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఈ నెల 27న,ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ జనవరి 3న ధర్నాలు చేస్తాం. సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లలో మగ్గేలా చేస్తోంది. బాధితులకు పార్టీ అండగా ఉంది. వారికి న్యాయ సహాయం అందిస్తూనే ఉంటుంది’అని సజ్జల తెలిపారు. -
టీడీపీ ప్రభుత్వంపై సజ్జల ఫైర్
-
ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. -
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.‘‘రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరయ్యారు. పోలింగ్‌కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు. విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్సఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది’’ అని సజ్జల ధ్వజమెత్తారు.జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది’’ అని సజ్జల చెప్పారు.‘‘సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్‌గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. -
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
-
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, జగన్ కోసం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.వేరే దేశాలలో ఉన్న ఎన్నారైలు ఏపీకి వచ్చి పని చేయడం హ్యాపీగా ఉందని.. జగన్ గెలుపు మన ఇంట్లో గెలుపులా మహిళలు సైతం భావిస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందన్న ఆయన... చేసిన మంచి గురించి ప్రజలకు వివరించటం చాలా మంచి పరిణామన్నారు.పార్టీ, జగన్ తరపున ఎన్నారైలకు కృతజ్ఞతలు. టీడీపీ వికృత చేష్టలు పెరిగాయి. కోమటి జయరాం అనే టీడీపీ అహంకారి నోట్లతో ఓట్ల కొనాలనటం సిగ్గు చేటు. రాజకీయం అంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయడం. లీడర్ని బట్టి కార్యకర్తలు ఉంటారు. ప్రజల కోసం వైసీపీ ఎన్నారై లు వస్తే.. డబ్బులు పంచడం కోసం టీడీపీ ఎన్నారైలు వచ్చారు. సమాజంలో మార్పు ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎన్నారై టీమ్ పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 బస్సులతో స్టార్ క్యాంపైనర్స్ ప్రచారం చేస్తారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
మల్లాది విష్ణుకి టికెట్ ?..సజ్జల కీలక కామెంట్స్
-
సమ్మెకు తెర.. నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు, చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం.. అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని జూలై నుంచి అమలు చేసే దిశగా పని చేస్తున్నామని తెలిపారు. ‘అంగన్వాడీల శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వర్కర్లకు రూ.50 వేల నుంచి ఏకంగా రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతున్నాం. అందరి ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు.. ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నాం. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్ చేస్తాం. అంగన్వాడీల్లో పని చేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వ దృష్టికి గ్రాట్యుటీ అంశం తీసుకెళ్లి.. వారిచ్చేది నేరుగా అమలు చేస్తాం. భవిష్యత్తులో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి సమ్మె కాలంలోని అంగన్వాడీల వేతనం, పోలీసు కేసుల అంశం తీసుకెళ్లి.. న్యాయం జరిగేలా చూస్తాం. ఇన్ని డిమాండ్లను అంగీకరించడం అంటే అంగన్వాడీ అక్కచెల్లెమ్మల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అని మంత్రి తెలిపారు. ఇక విధుల్లోకి వెళ్తున్నాం.. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో విజయవంతం అయ్యాయని అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు. ఇకపై తాము విధుల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందన్నారు. సర్వీసులో ఉండి అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చులు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు. అంగన్వాడీలకు ప్రత్యేకంగా వైఎస్సార్ బీమా, అంగన్వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో టీఏ బిల్లులు నిలిచిపోయాయని, ఆ బిల్లులు వచ్చిన వెంటనే విడుదల చేస్తామన్నారని తెలిపారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి నెలకు ఒక టీఏ బిల్లు ఇస్తామనడం సంతోషంగా ఉందన్నారు. యాప్‌ల భారాన్ని సైతం తగ్గిచేందుకు స్పష్టమైన హామీ లభించిందన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ బిల్లులు, గ్యాస్ మెనూ పెంపు, చిన్నారుల మెనూ పెంచాలని కోరగా ప్రత్యేక కమిటీలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారన్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడానికి చర్యలు చేపడతామనడం ఆనందాని్నస్తోందన్నారు. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి, గౌరవాధ్యక్షురాలు మంజుల, వీఆర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ‘ఛలో’ భగ్నం ఇదిలా ఉండగా.. అంగన్వాడీల ఆందోళనను అడ్డు పెట్టుకుని పలుచోట్ల టీడీపీ నేతలు టెంట్లు, కుర్చీలు, భోజనాలు సమకూరుస్తూ కొన్ని శక్తులను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. అంగన్వాడీల ముసుగులో అసాంఘిక శక్తులు ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ‘ఛలో విజయవాడ’కు పిలుపునిచ్చాయి. నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. -
చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిల: సజ్జల
-
AP: బీసీల అభివృద్ధికి సీఎం జగన్ తపన : సజ్జల
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడేలా చేసేందుకు తపన పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీమ్‌ల నుంచి అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలేనని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన రజకుల ఆత్మీయ సమావేశంలో సజ్జల పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రజక కార్పోరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వివిధ స్కీమ్‌లను పరిశీలిస్తే నాలుగున్నరేళ్ల కాలంలో 18 లక్షల రజక కుటుంబాలకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాల్లో 5,600 కోట్ల రూపాయలు వేశాం. నాన్ డీబీటీలను కూడా కలుపుకుంటే 17 వేల కోట్ల రూపాయలు రజక కుటుంబాలకు ఇచ్చాం. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోవచ్చు. దేశంలో బీసీలు సీఎంలుగా ఉన్న ఏపీలో ఇచ్చినన్ని నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వలేదనే వాస్తవాన్ని గమనించాలి. రాజకీయపార్టీలు ఆయా వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూశాయి. గతంలో రజకులకు చంద్రబాబు కేవలం ఐరన్ బాక్సులు ఇచ్చి మభ్యపెట్టాడు. బీసీల సమస్యల పరిష్కారం కోసం వెళ్తే అవమానించారు. మళ్లీ ఇప్పుడు మాత్రం జయహో బీసీ అంటూ సభలు పెట్టి ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. బీసీలు ముమ్మాటికి చంద్రబాబును నమ్మేస్దితిలో లేరు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్ రజకుల అభివృద్ధి కోసమే పథకాలు తీసుకువచ్చారు’ అని సజ్జల వివరించారు. రజక కార్పొరేషన్ ఛైర్మన్ మీసాల రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల అభివృద్దికి సీఎం జగన్ చేస్తున్న కృషిని ప్రతి నియోజకవర్గానికి తీసుకువెళ్తానన్నారు. పలు రజక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రజకుల సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఇదీచదవండి..పార్టీ ఫిరాయించిన వారితో వెళ్లి దొంగ ఓట్లపై ఫిర్యాదా -
AP: అంగన్వాడీలు రాజకీయాలకు బలి కావొద్దు: సజ్జల
సాక్షి,తాడేపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు రాజకీయ అజెండాలకు బలికావొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై తాడేపల్లిలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల ఆందోళనలపై అనేక స్థాయిల్లో చర్చించామని, ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నామని తెలిపారు. ‘అంన్వాడీల సమ్మె వెనుక రాజకీయ కోణం ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో వారి ఆడియోలు మేం విన్నాం. కొందరు రాజకీయ కోణంలో రెచ్చగొడుతూ మాట్లాడారు. రాజకీయ అజెండాకి బలి కావద్దు. ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నాం. గర్భిణీలు, పసిపిల్లలను ఇబ్బందులు పెట్టొద్దు. పట్టు వీడకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుంది. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కూడా ఇది వర్తిస్తుంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారంతా అంగన్వాడీలను రెచ్చగొడుతున్నారు. వారి వలలో చిక్కుకోవద్దు. ప్రభుత్వాన్ని దించుతాం, జైళ్లకైనా వెళ్తాం అంటూ కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. పేద తల్లులు, పిల్లలకు ఆహారం అందకపోవటం మంచిదేనా చంద్రబాబు చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంగన్వాడీలకు అన్యాయం చేశారు. సమ్మె విరమించాల్సిందిగా అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులను కోరుతున్నాం. సమ్మె కొనసాగిస్తే నోటీసులు ఇస్తాం తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీకి అభ్యర్థులు లేరు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. మేము కాన్ఫిడెంట్‌గా సీట్లపై నిర్ణయాలు తీసుకుంటున్నాం. లోకేష్, గంటా శ్రీనివాసరావు, అనిత, జవహర్ ఇలా ఎంతమంది ఎన్ని నియోజకవర్గాలు మారారో తెలియదా.. అన్ని పార్టీలు కట్ట కట్టుకుని వచ్చినా మాకు ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు, అలాంటప్పుడు ఎన్నికల విధుల్లో ఎలా పాల్గొంటారు? ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటమి తప్పదని ఊహించే ముందుగా కారణాలు వెతుక్కుంటున్నారు. గతంలో ఓడిపోగానే ఈవీఎంలపైకి నెట్టారు’అని సజ్జల గుర్తుచేశారు. ఇదీచదవండి.. రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు -
ఆ ఎమ్మెల్యేలను మారుస్తాం..సజ్జల క్లారిటీ..
-
చంద్రబాబుపై సజ్జల కామెంట్స్
-
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా అవినీతిమయమే
తాడేపల్లి: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ సందర్బంగా నారా లోకేష్ బూతుపురాణం గురించి దత్తపుత్రుడి ఓవర్ యాక్షన్ గురించి ఆయన ప్రస్తావించారు. వారిద్దరూ శాంతికి భగ్నం కలిగించే ప్రయత్నం చేశారు కాబట్టే తాను మాట్లాడవలసి వస్తోందన్నారు. ఆదివారం సాయంత్రం ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా అవినీతిమయమేనని, ఈ స్కీముకు దర్శకత్వం, రూపకర్త అంతా చంద్రబాబేనన్నారు. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై పూర్తి ఆధారాలున్నాయని కోర్టు వాటినన్నిటిని పరిగణనలోకి తీసుకునే తీర్పునిచ్చిందని అన్నారు. ఇక నిన్నటి నుంచి నారా లోకేష్, దత్తపుత్రుడు ఇద్దరూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించారని చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. వాళ్ళు హుందాగా ప్రవర్తించి ఉంటే మేము మాట్లాడాల్సి వచ్చేది కాదని రాత్రి పవన్ కళ్యాణ్ అయితే చాలా ఓవర్ యాక్షన్ చేశారన్నారు. మరోపక్క నారా లోకేష్ బూతు పురాణం మొదలు పెట్టాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేస్తే ఎంతటి పెద్ద వారికైనా న్యాయపరమైన శిక్షలు తప్పవు. చట్టాలను, న్యాయవ్యవస్థను మనం గౌరవించాలని అన్నారు. ఇది కూడా చదవండి: ఇక జైలుకే.. ఏసీబీ కోర్టులో బాబుకు షాక్.. Babu @ Jail : న్యాయం గెలిచింది! -
ఛార్జ్ షీట్ లో అంతా కల్పిత కథలే
-
మళ్లీ చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారు: సజ్జల
సాక్షి, విజయవాడ: విశాఖలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో కేంద్రహోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పార్టీ పరంగా అమిత్ షా విమర్శలు చేశారు. దేశంలో ఏపీ భాగం కాదు అన్నట్టుగా అమిత్ షా మాట్లాడారు. ఎవరో స్క్రిప్టులు రాసిస్తే చదివేయడం కాదు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పవన్ కల్యాణ్ ఖచ్చితమైన ఆలోచనలతో రాజకీయాలు చేయడం లేదు. పవన్ వాయిదా వేసుకుంటూ యాత్రలు చేయడం కాదు. గత రెండుసార్లూ పవన్.. చంద్రబాబునే మోశారు. ఇప్పుడు మరోసారి పవన్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీసీ కులాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ కృషిచేస్తోంది. వెనుకబడ్డ కులాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోందన్నారు. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు బీసీ డిక్లరేషన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కోలా అనుకున్నారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా సీఎం జగన్ చేసి చూపించారు. రాష్ట్రంలో జనాభా ప్రకారం అందరికీ న్యాయం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. సామాజిక న్యాయం అమలు కాకపోతే సమాజానికి మంచిది కాదు. ఎప్పటికైనా తిరుగుబాటు వస్తుంది. అందరి చేతుల్లోనూ అధికారం ఉండాలనే దిశగానే సీఎం జగన్ అడుగులు వేశారు. రాబోయే ఐదారేళ్లలో ఎంతో మార్పు వస్తుంది. కాలం మారుతోంది.. ఓ నలుగురు కూర్చుని రాజకీయం చేస్తామంటే కుదరదు. పేదలు.. సంపన్నులతో కలిసి విద్యను అభ్యసించేలా చేస్తున్నాం. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రతీ విద్యార్ధీ ఆత్మగౌరవంతో స్కూళ్లకు వెళ్లేలా సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో సామాజిక న్యాయం ఎంతో వేగంగా జరిగింది. రాజకీయ వేదికల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా సాధికారతకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు. రాబోయే ఎన్నికల్లోనూ బలమైన నాయకత్వం రావడం ఖాయం. 175 కి 175 సీట్లు దక్కించుకునేలా అడుగులు వేద్దాం. మరింత మెరుగైన మెజార్టీతో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కడుపుమంటతోనే ఆ వ్యాఖ్యలు.. అమిత్‌షాకు మంత్రి బొత్స కౌంటర్ -
రజినీకాంత్ చంద్రబాబు ఫోన్ కాల్ పై సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు....
-
సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పదవికి రాజీనామా...సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ
-
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచే ఆదాల పోటీ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేస్తారన్నారు. సీఎంను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తా: ఆదాల ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, రూరల్ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషకరమన్నారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే: బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును కోటంరెడ్డి కలిసి టిక్కెట్ హామీ తీసుకున్నారని, బాబును కలిసిన తర్వాత ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నారని బాలినేని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై రుజువు చేసి మాట్లాడాలని, రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడెందుకు మాట్లాడారంటూ ఆయన దుయ్యబట్టారు. రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం ఖరారు చేశారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరగనున్నాయని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి -
ముందస్తు ఎన్నికలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
-
టీడీపీ, జనసేనలు ఎప్పుడూ కలిసే ఉన్నాయి: సజ్జల రామకృష్ణా రెడ్డి
-
రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం.. మాకు కూడా ఇవే రూల్స్ : సజ్జల
-
ప్లాన్ ప్రకారమే ఇరుకు రోడ్డులో సభ నిర్వహించారు : సజ్జల
-
దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉంది : సజ్జల
-
చంద్రబాబు ముందస్తు ఆశలు నెరవేరే అవకాశం లేదు : సజ్జల