Samajwadi Party
-
మైనర్‌పై అత్యాచారం.. ఎస్పీ నేత అరెస్ట్!
లక్నో: మైనర్‌పై అత్యాచారం కేసులో రాజకీయ నాయకుడు నవాబ్ సింగ్ యాదవ్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నవాబ్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడని తెలుస్తోంది. మరోవైపు.. నవాబ్ సింగ్‌కు బీజేపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం.ఈ ఘటనపై కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల యూపీలోని అయోధ్యలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. నిన్న రాత్రి 1.30 సమయంలో ఓ బాలిక 112 నంబర్‌కు కాల్ చేసింది. ఈ సందర్బంగా తనపై అత్యాచారం చేశారని, తన అత్తను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో, ఓ పోలీసు ఆమె వద్దకు వెళ్లారు. అనంతరం, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. అక్కడ నవాబ్ సింగ్, మరో మహిళ ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవాబ్ సింగ్‌పై పోక్సో నమోదు చేసి అరెస్ట్ చేశాము. కాగా, ఉద్యోగం పేరుతో ఆశ చూపించి నవాబ్ సింగ్ వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను బాధితురాలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. #WATCH | Uttar Pradesh: SP leader Nawab Singh Yadav arrested in Kannauj for allegedly attempting to rape a minor girl. Kannauj SP, Amit Kumar Anand says, "Last night around 1.30 am, a call was received on UP 112 wherein a girl said that she had been stripped and an attempt of… pic.twitter.com/7nD114yei9— ANI (@ANI) August 12, 2024 మరోవైపు.. నవాబ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఎస్పీ అమిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవాబ్ సింగ్ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. అతడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. కానీ, అతడిని రక్షించేందుకు కొందరు బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. The rape survivor minor girl herself called police and took them to the rapist Samajwadi party leader Nawab.He's a close man to Dimple Yadav...Some people really vote for these people? I mean why? pic.twitter.com/6XCIzO5szJ— Mr Sinha (@MrSinha_) August 12, 2024 -
ఈసారి ఓటు మార్పు కోసమే
మెయిన్‌పురి: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా మార్పు కోసమే ఓటేస్తారని సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ధీమా వెలిబుచ్చారు. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామం సైఫైలో పీటీఐ ప్రత్యేక ముఖాముఖిలో పలు అంశాలపై డింపుల్ తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు... బీజేపీపై.. బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మునిగిపోయింది. కులాల లెక్కన జనాన్ని విడగొడుతోంది. జనం మనోభావాలతో ఆడుకుంటోంది. కీలక సమస్యల నుంచి జనం దృష్టి మరల్చుతోంది. బీజేపీ రాజకీయ ఒత్తిళ్లతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. విభజన రాజకీయాలతో వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటోందని వారికి తెలిసొచి్చంది. అందుకే కేంద్రంలో ఈసారి అధికార మార్పు కోసమే జనం ఓటేస్తారు.దర్యాప్తు సంస్థలు, ధరలపై.. ఈడీ, సీబీఐ, ఐటీ ఇలా ప్రతి దర్యాప్తు సంస్థనూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ దురి్వనియోగం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో జిల్లా స్థాయిలోనూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ జనాన్ని పీడిస్తోంది. ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు జనాలకు చేరట్లేవు. వాగ్దానాలైతే జోరుగా చేస్తున్నారుగానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు అస్సలు కనిపించట్లేదు. దేశాన్ని బీజేపీ ఎటువైపు తీసుకెళ్తుందో అందరికీ తెలుసు. పోషకాహార లోపం, ఆకలి చావుల రేటింగ్స్, గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం ఏటికేడు దిగజారుతోంది. మళ్లీ బీజేపీ గెలిస్తే దేశం 15 ఏళ్లు తిరోగమనంలోకి వెళ్లడం ఖాయం. దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన తరుణంలో వచ్చిన ఎన్నికలివి.మోదీ మంగళసూత్రం వ్యాఖ్యలపై ఇదొక్కటే వాళ్లకు ఆయుధంగా దొరికింది. జనం భవితకు సంబంధించిన ఏ అంశమూ బీజేపీకి పట్టదు. యూపీలో మొత్తం 80 సీట్లు గెలిచేస్తామని అబద్ధాలు చెబుతున్నారు. అందులో నిపుణులు వాళ్లు. కానీ వాళ్ల మాటలను ఈసారి జనం నమ్మట్లేరు. గట్టి గుణపాఠమే చెప్తారు. అత్యంత అవినీతి నేతలను బీజేపీ లాగేసి డ్రై క్లీనింగ్ మెషీన్లో పడేస్తోంది. అంతా రాజకీయ లబ్దికోసమే చేస్తుంది. గెలుపు మెజారిటీ తగ్గడంపై.. మామ ములాయం సింగ్ యాదవ్ కాలం నుంచి చూస్తే భారీ మెజారిటీ అనేది తగ్గడం వాస్తవమే. 2019లో ఆ మెజారిటీ కేవలం 94000కు తగ్గింది. ఎన్నికలు ఎప్పుడూ ఒకేలా జరగవు. ప్రతిసారీ గెలుపును వేర్వేరు కారణాలు ప్రభావితం చేస్తాయి. తన ప్రచార సరళిపై.. రోజుకు ఎనిమిది, తొమ్మిది మీటింగ్‌లలో పాల్గొంటున్నా. విపక్షాల ‘ఇండియా’ కూటమికి జనం నుంచి వస్తున్న స్పందన అద్భుతం. నా కూతురు అదితి యాదవ్ సైతం తొలిసారిగా ప్రచారంలో పాల్గొంటోంది. గ్రామాలకు వెళ్తూ వారిని కలుస్తోంది. ములాయం మరణంతో వెల్లువెత్తిన సానుభూతి కారణంగానే 2022 మెయిన్‌పురి ఉపఎన్నికల్లో 2.8 లక్షల భారీ మెజారిటీతో ఎస్పీ గెలిచిందన్న బీజేపీ వ్యాఖ్యల్లో నిజంలేదు. జనం మనసుల్లో మేమే ఉన్నాం. ఈసారీ గెలుపు మాదే. ఆర్మీలో పనిచేస్తున్న యువతతోపాటు వృద్ధులు, మహిళలు అంతా బీజేపీ వాగ్దానాలను నెరవేర్చలేదన్న నిస్పృహలో ఉన్నారు. -
ఎన్నికల్లో ఓటమి భయం.. బీజేపీపై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం
లక్నో: త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఇండియా కూటమి అభ్యర్ధులకు బేషరతు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి జరుగుతున్నాయని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆప్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భేషరుతుగా ఇండియా కూటమికి భేషరతుగా మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో మా పాత్ర , ప్రచారం తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయిస్తారు’అని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఇవి సాధారణ ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, నిరంకుశ పాలనను అంతం చేయడం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మేం యూపీలో కలిసి పనిచేస్తున్నాం. కూటమిలో భాగంగా సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్న చోట మేము వారి కోసం పని చేస్తాము అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో భారత కూటమి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రతి కార్యకర్త తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం ఎస్పీ అభ్యర్థుల కోసం పనిచేస్తారని సంజయ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఎన్నికలకు ముందు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌లను జైలుకు పంపినందుకు కేంద్ర ప్రభుత్వంపై యాదవ్ మండిపడ్డారు.ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇలా చేస్తోందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మీరట్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి మార్పు?
యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలకు మీరట్ స్థానం నుంచి గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని సమాచారం. అతుల్ ప్రధాన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య సునీతా వర్మను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరట్ అభ్యర్థిని మార్చడంపై జరుతున్న చర్చల మధ్య అతుల్ ప్రధాన్ తన ట్విట్టర్లో ఖాతాలో ఇలా రాశారు. ‘పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయం నాకు సమ్మతమే. త్వరలో పార్టీ నేతలతో కూర్చొని మాట్లాడతాను’ అని రాశారు. కాగా బుధవారం అతుల్ ప్రధాన్ నామినేషన్ దాఖలు చేయగానే మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ మద్దతుదారులు నిరసన గళం వినిపించారు. దీంతో అతుల్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి, మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ భార్య, మేయర్ సునీతా వర్మను మీరట్ అభ్యర్థిగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కూడా అంటున్నారు. 2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి సునీతా వర్మ, ఆమె భర్త యోగేశ్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారు 2021లో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. పార్టీ హైకమాండ్ తమ అభియాన్ని గౌరవించిందని, తన భార్య సునీతా వర్మను అభ్యర్థిగా ఎంపికచేసిందని అంగీకరించిందన్నారు. -
బాండ్లు కాదు.. బీజేపీ బలవంతపు వసూళ్లు: అఖిలేశ్
కనౌజ్(యూపీ): ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి విరచుకుపడ్డారు. బీజేపీ బాండ్ల రూపంలో బలవంతంగా డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. చందాల ముసుగులో వసూళ్ల దందాకు తెరతీసిందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. బలవంతపు వసూళ్ల కోసం సీబీఐ, ఈడీ ఐటీ వంటి సంస్థలను బీజేపీ విచ్చలవిడిగా వాడుకుందని మండిపడ్డారు. కొందరు కాంట్రాక్టర్లపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ నుంచి ఒత్తిళ్లు పెరిగినప్పుడల్లా బీజేపీ ఖాతాలోకి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లతో ఇప్పు డు బీజేపీ ప్రతిష్ట మసకబారిందని పేర్కొన్నారు. భిన్నమైన పార్టీ అని చెప్పుకొనే బీజేపీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించారని అఖిలేశ్ ఆక్షేపించారు. -
సీబీఐ విచారణకు అఖిలేశ్ గైర్హాజరు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల తవ్వకం కేసులో సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ ఇచి్చన సమన్లను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బేఖాతరు చేశారు. సీబీఐ సమన్ల ప్రకారం గురువారం ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌కు అఖిలేశ్ వెళ్లాలి. కానీ ఆయన లక్నోలోనే ఉండిపోయారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ‘‘ అంతకుముందే ఖరారైన షెడ్యూల్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున గురువారం మీ ఆఫీస్‌కు అఖిలేశ్ రావట్లేదు. కానీ అవకాశం ఉన్నంతమేరకు మీకు నా సహాయసహకారాలు ఉంటాయి’’ అని అఖిలేశ్ తరఫున న్యాయవాది సీబీఐకి వివరణ ఇచ్చారు. తర్వాత లక్నోలో పార్టీ ఆఫీస్‌లో జరిగిన వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సభలో అఖిలేశ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అధికారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టడాన్ని అఖిలేశ్ ప్రస్తావించారు. -
చిన్న బుద్ధుల పెద్ద ఎన్నిక
అసెంబ్లీలో పార్టీలకు స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నచోట రాజ్యసభ ఎన్నికలనేవి అంతా సజావుగా సాగిపోయే మామూలు తంతు. కానీ, పార్టీ ఏదైనా సరే పాలకపక్షంతో అంటకాగడానికీ, జెండా కన్నా సొంత అజెండాకు పెద్ద పీట వేయడానికీ ప్రజాప్రతినిధులు దిగజారితే, పెద్దల సభకు ఎన్నికలు సైతం చిన్న బుద్ధులకు వేదిక అనిపించక మానవు. ఫిబ్రవరి 27న యూపీ (10 సీట్లు), కర్ణాటక (4 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (1)లలో ఎగువసభ ఎన్నికలు అలానే సాగాయి. హిమాచల్‌లో అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు, యూపీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఏడుగురు క్రాస్ ఓటింగ్‌కు దిగడంతో ఆ పార్టీలు చెరొక స్థానాన్ని బీజేపీకి కోల్పోయాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు ఓటేసిన కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ నాలుగింట తనకు దక్కాల్సిన 3 స్థానాల్ని నిలబెట్టుకుంది. మంగళవారం 15 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగితే, బీజేపీ తన బలంతో గెలవగలిగిన వాటి కన్నా రెండు సీట్లు ఎక్కువగా 10 సొంతం చేసుకుంటే, కాంగ్రెస్, ఎస్పీలు తమ సంఖ్యాబలం కన్నా చెరొకటి తక్కువగా వరుసగా 3, 2 సీట్లే దక్కించుకోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల్ని రకరకా లుగా ప్రలోభపెట్టి, క్రాస్ ఓటింగ్‌కు దిగజార్చే దుష్టసంస్కృతి పూర్తి స్థాయిలో స్థిరపడినట్టు మరో సారి రుజువైంది. రాజ్యసభ ఎన్నికలకు విప్ల జారీ కుదరదు కానీ, తమ పార్టీ నియమించిన ఏజెంట్‌కు లెజిస్లేటర్లు తమ బ్యాలెట్ పేపర్లు చూపాలి. అయినా సరే, ఎమ్మెల్యేలు తామున్న పార్టీ వైఖరికి భిన్నంగా ఓటేయడం వర్తమాన రాజకీయాలలో విలువల పతనానికి విషాద నిదర్శనం. చిత్రమేమంటే, హిమాచల్‌లో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మనుగడనే బీజేపీ ప్రశ్నార్థకం చేసింది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల్లో గత ఏడాదే గెలిచి, హస్తం పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రం నుంచి తమ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన బలం కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలే తమకున్నారని అధికార కాంగ్రెస్ పెద్దలు ఏమరుపాటుగా ఉంటే, అదను కోసం చూస్తున్న ప్రతిపక్ష బీజేపీ తమ ‘ఆపరేషన్ కమల్’కు పదును పెట్టింది. ఫలితంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసి, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. ఫలితంగా, మెజారిటీతో ఇట్టే గెలవాల్సిన కాంగ్రెస్ అభ్యర్థి – ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి కాస్తా ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థితో సమానంగా మాత్రమే ఓట్లొచ్చిన పరిస్థితి. లాటరీలోనూ అదృష్టం బీజేపీ పక్షాన నిలిచేసరికి, ఆ రాజ్యసభా స్థానం కాంగ్రెస్ చేజారింది. హిమాచల్‌లో కొద్దినెలలుగా కుతకుతలాడుతున్న అసంతృప్తిని అలక్ష్యం చేసి, బీజేపీ ‘ఆకర్షణ మంత్రాన్ని’ తక్కువగా అంచనా వేసి, కాంగ్రెస్ చేజేతులా ఈ ఓటమి కొనితెచ్చుకుంది. చివరకు అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందాల్సినవేళ సభలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే దుఃస్థితి తలెత్తింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలస్యంగానైనా బరిలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. సీనియర్ నేతలు డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హూడా తదితరుల్ని హిమాచల్ పంపింది. సుఖూ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. ఈ విషయంపై వారు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్ఠానం తాజా బుజ్జగింపులతో అంతా సద్దుమణుగుతుందా అన్నది చూడాలి. ‘నేను పోరాట యోధుణ్ణి, రాజీనామా ప్రసక్తే లేదు’ అని సీఎం సుఖూ బింకంగా చెబుతున్నా, సభలో మెజారిటీ ఆయనకుందా, సొంత ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉన్నందున ఆయన అధికారంలో కొనసాగగలరా అన్నది అనుమానమే. మొత్తం 68 మంది సభ్యుల హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలగం 40 మంది. ఆరుగురి క్రాస్ ఓటింగ్‌తో దాని బలం 34కు పడిపోయింది. ఇక, బీజేపికి 25 మంది ఉంటే, ఇండిపెండెంట్లు ముగ్గురున్నారు. బీజేపీ పాలిత హర్యానాలో పంచ కులాలో మకాం వేసిన కాంగ్రెస్ రెబెల్స్‌తో కలుపుకొంటే కాషాయ బలమూ 34కు చేరింది. సభలో మెజారిటీ మార్కు 35. ఇంకా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను సంప్రతిస్తున్నారని బీజేపీ అంటున్నందున ఏమైనా జరగవచ్చు. ఈ నేపథ్యంలో నాటకీయత పెంచుతూ బుధవారం 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌తో ఇప్పటికి గండం గట్టె క్కాలన్నది తాపత్రయం. అదే జరిగినా, సుఖూను వ్యతిరేకిస్తూ, సీఎం పీఠానికై విక్రమాదిత్య సింగ్ సహా ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండడం గమనార్హం. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమా రుడైన విక్రమాదిత్య మంత్రి పదవికి రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటించడం కథలో కీలక మలుపు. ఎన్నికల్లో మెజారిటీ ఏ పార్టీకి దక్కినా, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా, ఆఖరుకు అక్కడ బీజేపీయే అధికార చక్రం తిప్పడం కొన్నేళ్ళుగా పెరుగుతున్న ధోరణి. సామ దాన భేద దండోపా యాలు ప్రయోగించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యర్థి పార్టీ నేతల్ని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీది ఇప్పుడు తిరుగులేని రికార్డు. 2019లో కర్ణాటకలో జేడీ–ఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వం, 2020లో మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్, 2022లో మహారాష్ట్రలోని శివ సేన ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్... ఇలా గత నాలుగేళ్ళలో కాషాయపార్టీ పాలబడినవి ఎన్నో. తాజాగా హిమాచల్‌లోని సుఖూ సారథ్య కాంగ్రెస్ సర్కార్ ఆ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. సుఖూ పట్ల పార్టీలో వ్యతిరేకతను సర్దుబాటు చేసుకోవాల్సింది కాంగ్రెస్. కానీ, ఒక పార్టీ అంతర్గత విభేదాల కుంపటిలో మరొక పార్టీ చలి కాచుకొని, అధికారం చేజిక్కించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే. సంతలో ప్రజాప్రతినిధులను కొని, ప్రజాతీర్పు తమ వైపు ఉందని ఏ పార్టీ భావించినా అది అవివేకం. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సమయం చూసి సమాధానం చెబుతారు. -
భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేశ్
ఆగ్రా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారథ్యంలో యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో సీట్ల పంపిణీపై రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆగ్రాలో రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ వారు ముందుకు సాగారు. భారీగా హాజరైన ఇరుపార్టీల కార్యకర్తలు వారికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం రైతుల శక్తిని చూసి భయపడే పరిస్థితికి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం గద్దెదిగి, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకు తగు గౌరవం ఇస్తుందని చెప్పారు. వెనుకబడిన కులాలు, దళితులు, మైనారిటీలకు బీజేపీ తగు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రి యాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొ న్నారు. అంతకుముందు నేతలు ఆగ్రాలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జోడో యాత్రలో అఖిలేశ్ పాల్గొనడంపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. -
అలా అని కొంపదీసి మనల్ని బయటకు పంపరుగా..!
అలా అని కొంపదీసి మనల్ని బయటకు పంపరుగా..! -
India alliance: సీట్ల సర్దుబాటు కింద 11 స్థానాలిస్తాం
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామి పారీ్టగా భావిస్తూ 11 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ కేటాయింపుతో విపక్షాల కూటమిలో సీట్ల సర్దుబాటు పర్వానికి చక్కటి శుభారంభం లభించిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ ఈ పంథా గెలుపు సమీకరణాలతో మరింత ముందుకెళ్తుంది. వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాల వర్గాల ఫార్ములాతో ఇండియా కూటమి చరిత్ర సృష్టించనుంది’’ అని అఖిలేశ్ అభిలíÙంచారు. ‘‘ కాంగ్రెస్‌కు ఇస్తామన్న సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదు’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి స్పష్టంచేశారు. ‘‘ యూపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా మేం కాంగ్రెస్‌కు 11, రా్రïÙ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి ఏడు సీట్లు ఇస్తాం. మిగతా మొత్తం 62 స్థానాల్లో మేమే పోటీచేస్తాం’’ అని వివరించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ స్పందించారు. ‘‘ మిత్ర పక్షం ఎస్పీ చేసిన ప్రతిపాదనపై తుది నిర్ణయం కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని కమిటీ తీసుకోనుంది’ అని అన్నారు. -
Parliament elections 2024: రాయ్‌బరేలీ, అమేథీల్లో సమరమే!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి వారి కంచుకోటలుగా పేరొందిన లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు విఫలమైంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోకి బీఎస్పీని ఆహా్వనించాలన్న ప్రతిపాదనను సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలను నియమించింది. ప్రస్తుతం యూపీలో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), అప్నాదళ్ (కమేరావాదీ)తో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు కొనసాగిస్తోంది. సర్వశక్తులూ ఒడ్డుతాం: అఖిలేశ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామని, సంక్రాంతి తర్వాత పొత్తులపై మాట్లాడుతామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ పారీ్టతో స్నేహాన్ని వదులుకొని, తమ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమను బాగా అవమానించిందన్న భావన ఆయనలో ఉందంటున్నారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ నుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పారీ్టకి బలమైన క్యాడర్ ఉంది. అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ పారీ్టకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీకి నలుగురు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, సిట్టింగ్ ఎంపీ సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయారు. రాయ్‌బరేలీ నుంచి ఉంచాహర్ ఎమ్మెల్యే మనోజ్ పాండేను, అమేథీ నుంచి గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్‌సింగ్‌ను బరిలో దింపే యోచనలో అఖిలేశ్ ఉన్నట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు లేనప్పుడు రాయ్‌బరేలీ, ఆమేథీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను పోటీ చేయించలేదు. ఈసారి మాత్రం పోటీకి సై అంటుండడం ఆసక్తికరంగా మారింది. సమాజ్‌వాదీ అభ్యర్థులు పోటీ చేస్తే రెండు కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చక తప్పదు. -
Mayawati: మీ సంగతి చూసుకోండి
లక్నో: బీఎస్పీపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసే ముందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు మాయావతి సూచించారు. బీఎస్పీని ఇండియా కూటమిలో చేర్చుకుంటారా అని మీడియా ప్రశ్నించగా ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే అలవాటున్న మాయావతి పార్టీని ఎవరు నమ్ముతారని అఖిలేశ్ ప్రశ్నించారు. వీటిపై మాయా మండిపడ్డారు. బీజేపీని బలోపేతం చేస్తూ, వారితో అంటకాగుతున్న అఖిలేశ్ ప్రతిష్ట మంటగలిసిందని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు, తర్వాత ప్రధాని మోదీని నాటి ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆశీర్వదించారని గుర్తు చేశారు. -
‘ఇండియా’ భారత్ అంత ఐక్యంగా ఉండాలేమో సార్!
‘ఇండియా’ భారత్ అంత ఐక్యంగా ఉండాలేమో సార్! -
వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ బీజేపీని ఓడిస్తుంది: అఖిలేశ్
లక్నో: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’అధికార బీజేపీని ఓడిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీతోపాటు మిత్ర పక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2024లో బీజేపీని ఇండియా ఓడించనుంది. సమాజ్‌వాదీ పార్టీ, మిత్రపక్షాలు ఎన్నికలు ముందొచ్చినా, తర్వాత వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని మీడియాతో అన్నారు. -
ఎస్పీకి ఎసరుపెడుతూ.. మజ్లిస్ పార్టీ హవా!
తెలంగాణలో, అదీ హైదరాబాద్‌లో అధిక ప్రభావం చూపే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM).. వడివడిగా మిగతా రాష్ట్రాల్లోనూ అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బొటాబొటీ ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న పార్టీ.. తాజాగా యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన హవాపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా పదవులను చేపట్టే స్థాయికి చేరుకోగా.. మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒకే ఒక్క సీటు.. 0.49 శాతం ఓట్లు.. కిందటి ఏడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం రాబట్టిన ఫలితం ఇది. థర్డ్ ఫ్రంట్ ‘భగీదారి పరివర్తన్ మోర్చా’ పేరుతో ఎన్నికల్లో దిగినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మజ్లిస్ పార్టీ. అయితే.. యూపీ నగర పాలికా పరిషత్‌లో ఐదుగురు మజ్లిస్ అభ్యర్థులు చైర్మన్లుగా, మరో 75 మంది కౌన్సిలర్లుగా ఎన్నికైనట్టు ఒవైసీ తెలిపారు. మీరట్‌లో 11 మంది కౌన్సిలర్ స్థానాలను దక్కిం చుకొని మజ్లిస్ డిప్యూటీ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. మీరట్‌లో అయితే ఏకంగా మేయర్ అభ్యర్థిత్వానికి జరిగిన పోటీలో బీజేపీ నామిని తర్వాత రెండో స్థానంలో నిలిచారు ఎంఐఎం అభ్యర్థి. అయితే.. ఈ మొత్తంలో నష్టపోయింది ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీనే!. ముస్లిం ఓటు బ్యాంకును ఇంతకాలం మెయింటెన్ చేస్తూ వస్తున్న ఎస్పీకి ఇది ఊహించిన షాక్ అనే చెప్పాలి. అదీగాక.. ఇంతకాలం బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలకే పరిమితమైన స్థానిక సంస్థల్లో మజ్లిస్ పాగా వేయడం ఓ మైలురాయిగా చెప్పొచ్చు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లిం ఓట్ బ్యాంకు అంతా దాదాపుగా సమాజ్‌వాదీ పార్టీ వైపే వెళ్లింది. మిత్రపక్షాలతో కలిసి 34 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపి.. విజయం సాధించింది ఎస్పీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంఐఏం చేజిక్కించున్న నగర పాలిక పరిషత్‌లలో ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండు చోట్ల చివరాఖరి స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అన్నింటికి మించి.. మీరట్ ఫలితం మజ్లిస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. 2.35 లక్షల ఓట్లతో(41 శాతం) బీజేపీ అభ్యర్థి హిరాకాంత్ అహ్లువాలియా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో 1.28 లక్షల ఓట్లతో(22.37 శాతం) ఎంఐఎం అభ్యర్థి అనస్ రెండో స్థానంలో నిలిచారు. ఇక.. మూడో స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ భార్య సీమా ప్రధాన్ నిలిచారు. 17 మేయర్ సీట్లకుగానూ 10 చోట్ల, అలాగే.. 52 నగర పాలిక పరిషత్ చైర్పరిషత్ అభ్యర్థులను, 63 మంది నగర పంచాయితీ చైర్పర్సన్ అభ్యర్థులను, 653 వార్డ్ మెంబర్.. పరిషత్ మెంబర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో దింపింది ఎంఐఎం. మొత్తంగా అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో 83 వార్డులు గెల్చుకున్నట్లు ప్రకటించుకుంది ఆ పార్టీ. మజ్లిస్ పార్టీ సాధించిన ఈ ఫలితం కంటే సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం అనే కోణంలోనే చర్చ నడుస్తోంది అక్కడ. ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా.. ఎస్పీ ఓటు బ్యాంకుకు ఎంఐఎం దెబ్బ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యూపీ, బీహార్, మహారాష్ట్రలలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ మెంట్ అయ్యింది మజ్లిస్ పార్టీ. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లతో పాటు దళిత ఓట్లను సైతం ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం యూపీ థర్డ్‌ఫ్రంట్‌లోకి మాయావతి బీఎస్పీకి సైతం ఆహ్వానం పంపింది. అటు నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఎంఐఎం భావిస్తోంది కూడా. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీజేపీ పసమందా ముస్లిం(వెనుకబడిన ముస్లింలు)లను ఆకర్షించేలా స్వయంగా ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పది నుంచి పదిహేను స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోందట. ఈ విషయాన్ని ఎంఐఎం జనరల్ సెక్రటరీ పవన్ రావ్ అంబేద్కర్ ప్రకటించారు. -
విపక్ష కూటమి తథ్యం: అఖిలేశ్
ఇండోర్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాల కూటమి సాకారమవుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇప్పటికే కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్ వంటి ముఖ్యమంత్రులు ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ‘‘విపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటికి దన్నుగా నిలిచేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని శుక్రవారం పిలుపునిచ్చారు. తద్వారా విపక్ష కూటమి బలోపేతానికి ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. తప్పుడు ఎన్కౌంటర్లపై కోర్టులు తమంత తాము విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమవారిని బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చారని భావిస్తున్న వాళ్లు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఇదే నిజమైన నివాళి.. సీఎం యోగికి ధన్యవాదాలు..
లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఓ హత్య కేసు(ఉమేశ్ పాల్‌కు సంబంధించిన కేసు)లో నిందితుడిగా ఉన్న అసద్‌ను.. ఝాన్సీ వద్ద పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. గురువారం అతిఖ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలోనే.. ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. ఇక, ఈ ఎన్‌కౌంటర్‌పై ఉమేశ్ పాల్ తల్లి శాంతి దేవి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్కౌంటర్.. నా కొడుకు మరణానికి ఇచ్చిన నిజమైన నివాళి అంటూ సంతోషం వ్యక్తం చేశారు. నాకు, మా కుటుంబానికి న్యాయం చేసినందకు సీఎం యోగికి జీకి ధన్యవాదాలు. మున్ముందు కూడా మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం యోగిపై మాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ విధులను నిర్వర్తించిన ముఖ్యమంత్రికి, పోలీసు శాఖకు ధన్యవాదాలు అని అన్నారు. After the encounter of former MP Atiq Ahmed's son Asad and his aide, CM Yogi Adityanath took a meeting on law and order. CM Yogi praised UP STF as well as DGP, Special DG law and order and the entire team. Sanjay Prasad, Principal Secretary Home informed the CM about the… pic.twitter.com/4IzTxkLwxs — ANI (@ANI) April 13, 2023 మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్‌పై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. ఈ సందర్బంగా అఖిలేష్ మాట్లాడుతూ.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి కోర్టులపై నమ్మకం లేదని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోందని విమర్శించారు. ఏది ఒప్పో, ఏది తప్పో నిర్ణయించే హక్కు వారికి లేదన్నారు. ఇదిలా ఉండగా, అంతకుముందు.. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ అనే లాయర్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉమేశ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని ఆయన ఇంటి వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అసద్‌తో పాటు గులాం అనే ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం వాళ్లను పట్టుకునే యత్నం చేసిన పోలీసులపై ఇద్దరూ కాల్పులు ప్రారంభించగా.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో అసద్‌తో పాటు గులాం కూడా చనిపోయాడు. వీళ్లిద్దరిపై ఐదేసి లక్షల రూపాయల రివార్డు ఉంది. మరోవైపు.. బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను 2006లో కిడ్నాప్ చేశాడనే కేసు అతిఖ్ అహ్మద్‌పైనా ఉంది. ఈ కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అయిన అతిఖ్ అహ్మద్‌కు నెలలో శిక్ష కూడా పడింది. సుమారు వంద కేసుల్లో నిందితుడైన అతిఖ్ అహ్మద్.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌పేరుతో తననూ చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. "Tribute to my son," Umesh Pal's mother thanks CM Yogi after Atiq Ahmed's son killed in encounter Read @ANI Story | https://t.co/i9jHYMPmaZ #UmeshPal #CMYogi #AtiqAhmed #Encounter pic.twitter.com/4Ifyz9Z8MQ — ANI Digital (@ani_digital) April 13, 2023 -
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్!
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్! -
సమాజ్‌వాదీ పార్టీకి ఎదురు దెబ్బ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు యూపీ అసెంబ్లీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ సీనియర్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. పదిహేనేళ్ల కిందటి నాటి కేసులో(2008).. సువార్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌కు మోరాదాబాద్ కోర్టు రెండేళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన ఫిబ్రవరి 13వ తేదీ నాటి నుంచి అబ్దుల్లాపై అనర్హత వేటు అమలులోకి వస్తుంది అంటూ అసెంబ్లీ సెక్రెటరీ పేరిట ప్రకటన వెలువడింది. అబ్దుల్లా అజాం ఖాన్ ఎవరో కాదు.. ఎస్పీ దిగ్గజనేత, వివాదాస్పద అజాం ఖాన్ తనయుడు. ఏం జరిగిందంటే.. డిసెంబరు 31, 2007న రాంపూర్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SEPF) క్యాంపుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో.. యూపీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అయితే 2008, జనవరి 29వ తేదీన అజాం ఖాన్, అబ్దుల్లా ఖాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని తనిఖీ చేయడం కోసం పోలీసులు ఆపారు. దీనిని నిరసిస్తూ.. జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టారు తండ్రీకొడుకులు. అయితే.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ వీళ్లిద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులోనే మోరాదాబాద్ కోర్టు తాజాగా ఇద్దరినీ దోషులుగా తేలుస్తూ.. రెండేళ్ల శిక్షలు ఖరారు చేసింది. మరో విశేషం ఏంటంటే.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు ఎదుర్కొవడం అబ్దుల్లా అజాం ఖాన్‌కు ఇది రెండోసారి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సువార్ నియోజకవర్గంలో ఎస్పీ తరపున పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్. అయితే.. అప్పటికీ ఎమ్మెల్యేగా అర్హత వయసు(25 సంవత్సరాలు) నిండకుండానే నామినేషన్స్ దాఖలు చేశాడు అతను. ఈ పంచాయితీ కోర్టుకు ఎక్కింది. దీంతో.. 2020లో.. అలహాబాద్ హైకోర్టు అతని ఎన్నికను రద్దు చేసింది. అయితే తిరిగి 2022 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్. చట్ట సభ్యులెవరైనా సరే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష గనుక పడితే.. వాళ్ల సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుంది. -
Mainpuri Bypoll Result: ములాయం కోడలు డింపుల్ యాదవ్ భారీ విజయం
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని 5 రాష్ట్రాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం వెలువడుతున్నాయి. ఇందులో ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్ పూరి లోక్‌సభ స్థానం కూడా ఒకటి. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ అక్టోబర్‌లో మృతి చెందడంతో మెయిన్‌పూరి లోక్‌సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి ఎస్పీ తరపున ములాయం కోడలు, అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు. మెయిన్‌పూరి ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ చరిత్రను తిరగరాస్తూ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడు లక్షల బంపర్ మెజార్టీతో మెయిన్‌పూరిని కైవసం చేసుకున్నారు. తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2,88,461 ఓట్ల భారీ తేడాతో విజయ కేతనం ఎగరవేశారు. మొయిన్‌పూరి విజయంపై డింపుల్ యాదవ్ స్పందించారు.. తన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మినందుకు మెయిన్‌పురి ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం నేతాజీకి (దివంగత ములాయం సింగ్ యాదవ్) అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌కు నమ్మకస్తుడైన రఘురాజ్ సింగ్ షాక్యాను బీజేపీ రంగంలోకి దింపినా ఓటర్లు మాత్రం డింపుల్‌వైపు మొగ్గుచూపారు. ఒకానొక దశలో ఆమె వెనుకంజలో ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ పుంజుకొని మెజార్టీ సాధించారు. సమాజ్‌వాదీకి కంచుకోటగా పిలిచే మొయిన్‌పూరిలో సైకిల్ పరుగులు పెట్టడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సహంలో మునిగిపోయారు. చదవండి: గుజరాత్ ఎన్నికలతో చరిత్ర సృష్టించిన ఆప్.. దేశంలో తొమ్మిదో పార్టీగా రికార్డ్ కాగా మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ములాయం ఐదుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై విజయం సాధించారు. ఇప్పుడు డింపుల్ యాదవ్ రెండు లక్షలకుపైగా మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్.. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె. చదవండి: Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా -
Dimple Yadav: మామ స్థానంలో బరిలో కోడలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణంతో.. ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ట్విటర్లో ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. వీటితోపాటే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఫలితాలు.. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ప్రకటిస్తారు. समाजवादी पार्टी द्वारा लोकसभा क्षेत्र मैनपुरी उपचुनाव - 2022 हेतु श्रीमती डिंपल यादव पूर्व सांसद को प्रत्याशी घोषित किया गया है। pic.twitter.com/gZIvtETfLT — Samajwadi Party (@samajwadiparty) November 10, 2022 మామ ములాయంతో డింపుల్ (పాత ఫొటో) మోదీ 2.0 వేవ్‌ను తట్టుకుని ములాయం సింగ్ యాదవ్.. బీజేపీ అభ్యర్థిపై 94వేల ఆధిక్యంతో 2019 ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి నెగ్గారు. అయితే 2014లో ములాయం ఏకంగా మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గడం గమనార్హం. దీంతో మెయిన్‌పురి ఆయన ఇలాకాగా పేరు దక్కించుకుంది. భర్త అఖిలేష్‌తో డింపుల్ మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్(44).. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె. -
దివంగత ములాయం సింగ్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీలో ఆయన పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్‌తోపాటు, ఎమ్మెల్సీ కవిత, పలువురు టీఆర్ఎస్ నాయకులు ములాయంకు నివాళులు అర్పించారు. అనంతరం ములాయం అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ములాయం అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖలతో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. #Telangana Chief Minister KCR paid respects and offered tributes to the mortal remains of the #SamajwadiParty patriarch #MulayamSinghYadav ji and consoles his son and former CM of UP #AkhileshYadav at Saifai today. #Saifai #UttarPradesh #Netaji #Dhartiputra #MulayamSingh #KCR pic.twitter.com/4dPPPlskDi — Surya Reddy (@jsuryareddy) October 11, 2022 #WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. -
ములాయం సింగ్ యాదవ్ అరుదైన (ఫొటోలు)
-
సొంతంగా కారు కూడా లేదు.. ములాయం సింగ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
లక్నో: రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూసిన విషయం తెలిసింది. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆనారోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. ములాయం సింగ్ మరణాన్ని ఆయన కుమారుడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘మా తండ్రి, మీ ‘నేతాజీ’ ఇక లేరు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు అక్టోబర్ 11(మంగళవారం) సౌఫయ్ గ్రామంలో జరుగుతాయి’. అని తెలిపారు. ములాయం సింగ్ ఆస్తులు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతగా గుర్తింపు పొందిన ములాయం సింగ్ ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ములాయం సింగ్ నికర ఆస్తులు విలువ రూ. 20.56 కోట్లు. ఈ అఫిడవిట్ ప్రకారం తన మొత్తం చర, స్థిరాస్తులు దాదాపు రూ.16.5 కోట్లు.(16,52,44,300). 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే ఇది రూ. 3.20 కోట్లు తక్కువ. వీటితోపాటు ములాయం ఏటా రూ.32.02 లక్షలు సంపాదిస్తుండగా.. ఆయన భార్య సాధనా యాదవ్ వార్షికాదాయాన్ని రూ. 25.61 లక్షలుగా పేర్కొన్నారు. చదవండి: ప్చ్.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు బ్యాంక్ డిపాజిట్లు, బంగారం ములాయం సింగ్ యాదవ్ వద్ద రూ.16,75,416 నగదు ఉండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్బీఎఫ్సీల్లో రూ.40,13,928 డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం రూ. 9,52,298 విలువైన ఎల్ఐసీ ఇతర బీమా పాలసీలను కలిగి ఉన్నాడు. అంతేగాక ఆభరణాల విషయానికొస్తే.. ఆయన వద్ద 7.50 కిలోల బంగారం ఉంది. దీని విలువ రూ.2,41,52,365. తదితర ప్రాంతాల్లో ఆయనకు రూ.7,89,88,000 విలువైన వ్యవసాయ భూమి కూడా ఉంది. వ్యవసాయేతర భూమిపరంగా రూ.1,44,60,000 విలువైన ఆస్తులు ఉన్నాయి. యూపీలో అతని నివాస ప్రాపర్టీ ధర రూ.6,83,84,566. చదవండి: రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు! కారు లేదు, కొడుకు నుంచి అప్పు ములాయం సింగ్ యాదవ్ తన వద్ద కారు లేదని అఫిడవిట్లో వెల్లడించారు. అలాగే కుమారుడు అఖిలేష్ యాదవ్ నుంచి రూ.2,13,80,000(2.13 కోట్లు) అప్పు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక ములాయం చదువు విషయానికొస్తే 1968లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. 1964లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి బీటీ పట్టా పొందారు. ఎస్పీలో విషాదఛాయలు ములాయం మృతితో ఎస్పీ పార్టీలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి, రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. కాగా 22 నవంబర్ 1939న యూపీలోని ఇటావా జిల్లాసైఫయ్ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ములాయం రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా సేవలు అందించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. ఇది కూడా చదవండి: ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా! ములాయం సింగ్ ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పనిచేశారు. యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పడంతోపాటు జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రముఖపాత్ర పోషించారు.పదిసార్లు ఎమ్మెల్యే, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో(1996-98) రక్షణశాఖ మంత్రిగానూ సేవలందించారు. సుధీర్ఘకాలంపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగారు. పార్టీ నేతలు, అభిమానులు ఆయన్ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకుంటారు. ఆయన తుదిశ్వాస వరకు మెయిన్‌పూరి లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. -
ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా!
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ఒక ఎత్తు అయితే.. యూపీ రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారాయన. ఓటమెరుగని నాయకుడిగా, రాజకీయ దురంధరుడిగా.. భారతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు. బీసీ నేతగా.. యూపీలో అత్యధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, ఔనత్యానికి ఆయన చేసిన కృషి విశేషమైనది. అంతేకాదు.. అభిమానుల చేత ముద్దుగా ‘నేతాజీ’ అని పిలిపించుకుంటూ.. లక్షల మంది ఎస్పీ కార్యకర్తలను విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు. ► ములాయం సింగ్ యాదవ్.. 1939 నవంబర్ 22న ఎటావా జిల్లా సైఫయి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మూర్తి దేవి, సుఘార్ సింగ్‌లు. పేద కుటుంబం అయినప్పటికీ కష్టపడి బాగా చదువుకుని పైకొచ్చారు ములాయం. ► ములాయం సోదరి కమలా దేవి, శివపాల్ సింగ్ యాదవ్, రతన్‌సింగ్ యాదవ్, అభయ్ రామ్ యాదవ్, రాజ్‌పాల్ సింగ్ యాదవ్ సోదరులు. దగ్గరి బంధువు రామ్ గోపాల్‌యాదవ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ► ములాయం చదివింది ఎంఏ. సోషలిస్ట్ మూమెంట్లో, రాజకీయాల్లో చేరకముందు మెయిన్‌పురిలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పాఠాలు చెపారు ములాయం. ► సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, కీలక నేతలు అంతా ములాయంను నేతాజీ( గౌరవ నేత) అని పిలుస్తుంటారు. ఎప్పుడైతే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి దూరం అయ్యారో.. అప్పటి నుంచి అఖిలేష్‌కు ఆ పిలుపు సొంతం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎస్పీ నుంచి ఆ గౌరవం అందుకునే అర్హత ఒక్క ములాయంకే పార్టీ శ్రేణులు బలంగా ఫిక్స్ అయిపోయాయి. ప్రొఫెషనల్ రెజ్లర్ ములాయం సింగ్ యాదవ్ ప్రొఫెషనల్ కుస్తీ వీరుడు కూడా. రాజకీయాలు ఛాయిస్ కాకుంటే ఆయన మల్లు యుద్ధవీరుడిగా గుర్తింపు దక్కించుకునేవారేమో. మెయిన్‌పురిలో ఓసారి జరిగిన కుస్తీ పోటీల్లో కుర్రాడిగా ములాయం పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నాథూ సింగ్.. ములాయం కుస్తీ పట్లకు ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత జస్వంత్ నగర్ సీటును ములాయంకు ఇప్పిదామని నాథు సింగ్ ప్రయత్నాలు చేసినా అది ఎందుకనో కుదర్లేదు. ఇక ములాయంను ముద్దుగా పహిల్వాన్ అని పిలుస్తుంటారు. రెండు వివాహాలు.. ములాయం సింగ్ యాదవ్‌కు రెండు వివాహాలు జరిగాయి. మొదటి వివాహం మాలతీ దేవి. వీరికి అఖిలేష్ యాదవ్ సంతానం. దీర్ఘకాలిక సమస్యలతో 2003లో మాలతీ దేవి కన్నుమూశారు. మొదటి భార్య బతికున్న సమయంలో.. 1980 సమయంలో సాధనా గుప్తాతో ఆయన సహజీవనం కొనసాగించారు. వీళ్లకు ప్రతీక్ యాదవ్ అనే కొడుకు ఉన్నాడు. 2007 ఫిబ్రవరిలో ములాయం చెప్పేదాకా వీళ్లిద్దరికీ వివాహం అయ్యిందనే విషయం ఈ సమాజానికి తెలియలేదు. జులై 9, 2022న సాధనా గుప్తా అనారోగ్యంతో కన్నుమూశారు. రాజకీయాలు ఇలా.. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన.. రామ్ మనోహర్ లోహియా ఆదర్శాలతో ఇటుగా అడుగులేశారు. పదిహేనేళ్ల వయసులో ములాయం.. జానేశ్వర్ మిశ్రా, రామ్ సేవక్ యాదవ్, కర్పూరీ థాకూర్.. ఇలా ఎందరినో కలిశారు. ► 1960లో జనతా దళ్‌లో చేరారు ములాయం. 1962లో ములాయం.. షికోహాబాద్‌లోని ఏకే కాలేజీ విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ► 1967లో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1977ల తొలిసారి రాష్ట్ర మంత్రి అయ్యారు. 1989లో జనతాదళ్ పార్టీ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో ఏకంగా జనతా దళ్‌కు జాతీయాధ్యక్షుడు అయ్యాడు. ► 1982లో యూపీ కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్లపాటు అలా ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1985లో జనతా దల్ చీలిపోయాక.. చంద్ర శేఖర్, సీపీఐలతో కలిసి క్రాంతికారి మోర్చాను స్థాపించారు. ఈ పార్టీ ఆధ్వర్యంలోనే 1989లో తొలిసారి ఉత్తర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారాయన. ► 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పకూలాక.. చంద్ర శేఖర్ జనతా దల్(సోషలిస్ట్)లో చేరారు ములాయం. కాంగ్రెస్, జనతా దల్ మద్దతుతో సీఎంగా కొనసాగారు. ► 1991 ఏప్రిల్‌లో.. కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోగా.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ములాయం.. బీజేపీ చేతిలో ఓడిపోయారు. ► ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్సీ)తో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ► ఆపై దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర కొనసాగింది. పార్లమెంటేరియన్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. అదే సమయంలో(1996లో) మెయిన్‌పురి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ములాయం. దీంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా ములాయం సింగ్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ► అయితే.. 1998లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో ఆయన రక్షణ మంత్రి కోల్పోవాల్సి వచ్చింది. 1999 ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంభల్, కన్నౌజ్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో నెగ్గారు ఆయన. అయితే తనయుడు అఖిలేష్ కోసం కన్నౌజ్ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ► 2003, సెప్టెంబర్‌లో తిరిగి.. స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయానికి ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. శాసనసభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో.. గున్నావుర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి.. రికార్డు స్థాయి బంపర్‌మెజార్టీతో 2004 జనవరిలో గెలిచారాయన. ఆ ఎన్నికల్లో 94 శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. అందుకే సైకిల్ సింబల్! పేద కుటుంబంలో పుట్టిన ములాయంకు.. చిన్నప్పుడు సైకిల్ నడపాలనే కోరిక విపరీతంగా ఉండేదట. కానీ, తండ్రి సంపాదన తక్కువగా ఉండడంతో ఆ స్తోమత లేక చాలా కాలం ఆ కోరిక తీరలేదు. ఇక కొంచెం సంపాదన వచ్చాక.. అద్దె సైకిల్‌తో ఇరుగు పొరుగు ఊర్లకు వెళ్తూ సరదా తీర్చుకున్నారాయన. ఎప్పుడైతే.. సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించారో.. అప్పుడే తన పార్టీకి సైకిల్ గుర్తుగా ఉంటే బాగుంటుందని ఆయన ఫిక్స్ అయిపోయారట. ► తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012-17 మధ్య అఖిలేశ్ యాదవ్ యూపీ సీఎంగా వ్యవహరించారు. ► ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. మొత్తం జీవిత కాలంలో వివిధ రకాల ఉద్యమాలు, ఇతరత్రాలతో తొమ్మిసార్లు జైలుకు వెళ్లారు. వివాదాలు.. ► అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేతకు ముందు.. తరువాత జరిగిన పరిణామాలు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితాన్ని కీలక మలుపులు తిప్పాయి. ► 2012 నిర్భయ ఘటనపై స్పందించే క్రమంలో ములాయం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మగాళ్లు అన్నాక తప్పులు చేయడం సహజమని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ సైతం స్పందించారు. ఇక ములాయం చేఏసిన వ్యాఖ్యలకు మోహాబా జిల్లా కోర్టు ఆయనకు సమన్లు సైతం జారీ చేసింది. ► టిబెట్ సార్వభౌమాధికారం కోసం చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. ► ఇక ములాయం పెద్ద కొడుకు అఖిలేష్ యాదవ్ 2012లో యూపీ సీఎం అయ్యాక.. కుటుంబ కలహాలు బయటపడ్డాయి. సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ వేరు కుంపటితో వివాదం రచ్చకెక్కింది. ఒక గ్రూప్‌కు అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వం వహించగా.. మరో గ్రూప్‌నకు ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌లు, అమర్ సింగ్‌లు నేతృత్వం వహించారు. ► తండ్రికి ఎదురు తిరిగేలా అఖిలేష్ నిర్ణయాలు తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. చివరికి.. 2016 డిసెంబర్ 30న ఏకంగా కొడుకు అఖిలేష్, బంధువు రామ్ గోపాల్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు. అయితే.. 24 గంట్లోలనే ఆ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. కానీ.. ► దానికి బదులుగా తన తండ్రికి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ.. తనను తాను పార్టీ చీఫ్‌గా ప్రకటించుకున్నారు. ఈ మేరకు జనవరి 1, 2017 నిర్వహించిన జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ములాయం బహిరంగంగా ఖండించారు. అయితే.. ఎన్నికల సంఘం కూడా అఖిలేష్ నిర్ణయానికి మద్దతుగా.. ములాయం ఆదేశాలను తప్పుబట్టడంతో.. అప్పటి నుంచి అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ జాతీయ నేతగా కొనసాగుతూ వస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మీద 2021లో డైరెక్టర్ సువేందు రాజ్ ఘోష్ ‘మెయిన్ ములాయం సింగ్ యాదవ్’ అనే చిత్రాన్ని తీశాడు. అమిత్ సేథీ ఇందులో ములాయం పాత్రలో కనిపించారు. ఇక 2019లో విజయ్ గుట్టే డైరెక్ట్ చేసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో సుభాష్ త్యాగి, ములాయం సింగ్ యాదవ్ పాత్రలో కనిపించారు.