Sanjeev
-
ఫెడ్ వడ్డీ కోత పసిడికి బూస్ట్
న్యూఢిల్లీ: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. నాలుగేళ్ల తదుపరి బుధవారం 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. అయితే చౌకగా లభించనున్న ఫైనాన్సింగ్ భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెద్దగా కలసిరాకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విదేశీ నిధులు బంగారం ధరలకు దన్నునిచ్చే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. మిశ్రమ అంచనాలు సుమారు 14 నెలలపాటు రెండు దశాబ్దాల గరిష్టం వద్ద కొనసాగిన ఫెడ్ ఫండ్స్ రేట్లు దిగివస్తున్నాయి. తాజాగా రేట్ల తగ్గింపు టర్న్ తీసుకున్న ఫెడ్ ఈ ఏడాది చివరి(డిసెంబర్)కల్లా మరో 0.5 శాతం కోత పెట్టనున్నట్లు అంచనా. అయితే ఫెడ్ రేట్ల తగ్గింపుతో ఈక్విటీలపై రాబడి క్షీణించనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు బలపడే వీలున్నట్లు పేర్కొన్నారు. కామా జ్యువెలరీ ఎండీ కొలిన్ షా సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సమీపకాలంలో పసిడి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరవచ్చని తెలియజేశారు. యూఎస్ రేట్ల కోత బంగారంలో పెట్టుబడులకు దారిచూపుతుందని అభిప్రాయపడ్డారు. రేట్ల కోతకు దారి... ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు బిజ్2క్రెడిట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ అరోరా పేర్కొన్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు అంచనా వేశారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేశారు. వెరసి ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనున్న విషయం విదితమే.అయితే ప్రపంచ దేశాల వడ్డీ రేట్ల ప్రభావం భారత్‌పై ఉండదని ఇండియాబాండ్స్.కామ్ సహవ్యవస్థాపకుడు విశాల్ గోయెంకా పేర్కొన్నారు. రిస్క్ ఆస్తులలో భారీ ర్యాలీ, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణ ప్రభావాల కారణంగా ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపునకు చాన్స్ తక్కువేనని తెలియజేశారు. అంచనాలకు మించి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎడిల్వీజ్ ఎంఎఫ్ ఈక్విటీస్ సీఐవో త్రిదీప్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.భారత్‌పై ప్రభావం అంతంతే..మార్కెట్‌వర్గాలు ఇప్పటికే చాలా మటుకు ఫెడ్ వడ్డీ రేట్ల కోతను పరిగణనలోకి తీసుకున్నందున దీని ప్రభావం భారత్‌పై పెద్దగా ఉందు. దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, మొత్తం మీద రేట్ల తగ్గింపనేది వర్ధమాన మార్కెట్లకు మాత్రం సానుకూలమే. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే..
సాక్షి, ఆదిలాబాద్: లోకేశ్వరం మండలంలోని గడ్‌చాంద గ్రామంలో గురువారం రాత్రి ఒకరిపై కత్తితో దాడిచేయగా గాయాలయ్యాయి. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం... గడ్‌చాంద గ్రామానికి చెందిన గొల్ల సంజీవ్ బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. సంజీవ్ భార్యకు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. మూడేళ్లుగా గల్ఫ్ నుంచి పంపించిన డబ్బుల విషయమై భార్యను ప్రశ్నించగా ఆమె నుంచి సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ కాగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మరింతగా అనుమానం పెంచుకున్నాడు. తాను లేని సమయంలో తన భార్యకు మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులన్నీ వాడుకున్నాడని శ్రీనివాస్‌పై అనుమానం పెంచుకుని గురువారం రాత్రి తెల్లకల్లు దుకాణంలో ఉండగా కత్తితో దాడిచేశాడు. గాయాలపాలైన శ్రీనివాస్‌ను లోకేశ్వరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం శ్రీనివాస్ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్ పంపినట్లు ఎస్సై పేర్కొన్నాడు. -
లక్నో కోర్టు ఆవరణలో గ్యాంగ్‌స్టర్ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ శిరాద్కర్ తెలిపారు. కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్‌నగర్ జిల్లా వాసి. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్‌మెన్ హత్య కేసులో ట్రయల్‌కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు. -
అంత్యక్రియలకొచ్చి అనంతలోకాలకు.. ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కారు అదుపు తప్పి చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఎరుకల కృష్ణ(47), సంజీవ్(43), సురేష్(38), వాసు(35)లు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం స్వగ్రామంలో చిన్నాన్న ఎరుకుల కనకయ్య మృతి చెందడంతో వారంతా కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. అంత్యక్రియలు పూర్తి కావడంతో మంగళవారం మధ్యాహ్నం నలుగురు అన్నదమ్ములూ భార్యా పిల్లలను గ్రామంలో వదిలేసి, కారులో సూరత్‌కు బయలుదేరారు.అర్ధరాత్రి దాటిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయా ణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిసేపటికి మరొకరు మృతి చెందారు. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం మే 24న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. -
వస్తు సేవల పన్ను వ్యవస్థ సరళీకరణ అవశ్యం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ మరింత సరళీకరణ అవసరమని పారిశ్రామిక వేదిక– సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ స్పష్టం చేశారు. విద్యుత్‌తో పాటు ఇంధనాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. దీనివల్ల పరిశ్రమను మరింత పోటీ పరిస్థితుల్లో నిలబెట్టవచ్చని ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. జీఎస్టీ కింద ఉన్న పన్ను శ్లాబుల సంఖ్యను మూడుకు తగ్గించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మినహాయించిన విభాగంకాకుండా, జీఎస్టీ 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను శ్లాబ్‌లను కలిగి ఉంది. బంగారం, విలువైన, పాక్షిక విలువైన రాళ్లకు ప్రత్యేక పన్ను రేట్లు అమలవుతున్నాయి. నిత్యావసరాలపై 5 శాతం పన్ను రేటు మొదటిది. కార్లు, డీమెరిట్, లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శాతం అత్యధిక రేటు అమలవుతోంది. మధ్యస్థంగా 12, 18 శాతం రేట్లు అమలవుతున్నాయి. క్యాసినోలు, గుర్రపు పందాలు ఆన్లైన్ గేమింగ్ సేవలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. రూపాయి అనిశ్చితికి ఆర్బీఐ చెక్ కాగా, డాలర్ మారకంలో రూపాయి ఒడుదుడుకులను నిరోధించి స్థిరీకరణ చేయగలిగిన సామర్థ్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఉందని సీఐఐ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు. ఇందుకు తగిన విదేశీ మారకపు నిల్వలు ఆర్బీఐ వద్ద ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఏదోఒకరోజు రూపాయి తన స్వంత స్థాయిని కనుగొనవలసి ఉంటుందని మేము నమ్ముతున్నాము. అది భారత్ స్వంత పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ‘‘అయితే మారకపు విలువ అస్థిరతను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ ఇందుకు ప్రయ త్నిస్తుందని విశ్వసిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం... అధిక ద్రవ్యోల్బణం గురించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని అన్నారు. ‘‘మీరు ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే, ఇందుకు ఇంధనం, ఆహార ధరలు కారణంగా కనబడుతున్నాయి. రుతుపవన పరిస్థితి బాగుంటుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ పరిణామం కనీసం ఆహార ధరలను తగ్గడానికి దోహదపడుతుంది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్న ఇంధన ధర కూడా తగ్గడం ప్రారంభమవుతుందని భావిస్తునట్లు పేర్కొన్నారు. భారత్ పరిస్థితి బెటర్... భారత్ ఎకానమీపై బజాజ్ ఏమన్నారంటే... పరిశ్రమల సామర్థ్య వినియోగం 74–75 శాతానికి చేరుకుంది. లాజిస్టిక్స్, కెమికల్స్, కమోడిటీలు, నిర్మాణ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు కీలక చర్యల కారణంగా భారతదేశ ఎకానమీ అనేక ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. గత కొన్ని త్రైమాసికాల్లో డిమాండ్ తిరిగి పుంజుకోడాన్ని మేము చూస్తున్నాము. అయితే గత నెలా, రెండు నెలల్లో కొంత నిరాశాజనక ఫలితాలు ఉన్నా... తిరిగి భారీగా పుంజుకుంటుందని భావిస్తున్నాము. ఆశాజనక మంచి రుతుపవనాలు, ద్రవ్యోల్బణం తగ్గుదల వల్ల భారత్ బలమైన వృద్ధిని తిరిగి చూడటం ప్రారంభిస్తుందని విశ్వసిస్తున్నాం. -
ప్రజల మనిషి సంజీవయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లను ప్రారంభించింది, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేసింది దామోదరం సంజీవయ్యేనని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. సింగరేణిలో బోనస్ విధానాన్ని అమలు చేసి బోనస్ సంజీవయ్య అని పేరు తెచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విప్లవాత్మక విధానాలు, పథకాలను ప్రజల కోసం తీసుకొచ్చారని చెప్పారు. ఉమ్మడి ఏపీ సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన ఇందిరాభవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సంజీవయ్య జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తానే ముఖ్యమంత్రి అయి కేసీఆర్ మోసం చేస్తే దేశంలోనే తొలి దళిత సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని జగన్‌ను కోరతా: గద్దర్ కాంగ్రెస్ పార్టీ ఉదారమైన పార్టీ అని, ఆ పార్టీలో ఎంతో మంది త్యాగధనులున్నా రని, వారి త్యాగాలకు వెలకట్టలేం కానీ విలువ కట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఏపీ సీఎం జగన్‌ను కలిసి కోరతానన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, కాం గ్రెస్ నేత పొన్నాల, కోదండరెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, వినోద్ కుమార్, సంజీవయ్య సోదరుడు నాగేందర్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లోకి ఉత్తరాఖండ్ మంత్రి, ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యశ్పాల్ ఆర్య, తన కుమారుడు, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యతో కలిసి సోమవారం బీజేపీకి రాజీనామా చేసి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరారు. యశ్పాల్ ఆర్య 2007 నుంచి 2014 దాకా ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. యశ్పాల్, సంజీవ్, వారి మద్దతుదారులు ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు హరీష్ రావత్, కె.సి.వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు వారు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. తనకు చాలా సంతోషంగా ఉందని, సొంతింటికి తిరిగి వచ్చానని యశ్పాల్ వ్యాఖ్యానించారు. ఇది తన ‘ఘర్ వాపసీ’ అని చెప్పారు. ఆయన ఇప్పటిదాకా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ బలోపేతం అయితే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని యశ్పాల్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయన కుమారుడు సంజీవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో బీజేపీ నేత హరీందర్ సింగ్ లడ్డీ కూడా కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో చేరిన దేవేందర్ రాణా, సూర్జిత్‌సింగ్ మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కీలక నేతలు దేవేందర్ రాణా, సూర్జిత్ సింగ్ స్లాథియా సోమవారం బీజేపీలో చేరారు. వారు ఆదివారమే నేషనల్ కాన్ఫరెన్స్‌కు రాజీనామా సమర్పించారు. వారిద్దరూ ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్సింగ్ పురి, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దేవేందర్ రాణా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత అగ్రనేత ఒమర్ అబ్దుల్లాకు రాజకీయ సలహాదారుగా సేవలందించారు. -
హెచ్‌యూఎల్ లాభం రూ. 1,974 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిమాండ్ పుంజుకుంటోందనడానికి సూచనగా కంపెనీ లాభాలు, ఆదాయాలు పెరిగాయి. క్యూ2లో హెచ్‌యూఎల్ రూ. 1,974 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 1,818 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 9 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో అమ్మకాలు రూ. 9,931 కోట్ల నుంచి సుమారు 16 శాతం పెరిగి రూ. 11,510 కోట్లకు పెరిగాయి. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో హెచ్‌యూఎల్ మొత్తం వ్యయాలు రూ. 7,885 కోట్ల నుంచి రూ. 9,054 కోట్లకు చేరాయి. రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 14 మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. ‘సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ మేం లాభదాయక వృద్ధి నమోదు చేశాం. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేయడం కొనసాగిస్తాం‘ అని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. గడ్డు పరిస్థితులు గట్టెక్కినట్లేనని వ్యాఖ్యానించారు. తమ కార్యకలాపాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఓ మోస్తరుగానే ఉందని మెహతా చెప్పారు. విభాగాలవారీగా చూస్తే.. ఫుడ్, రిఫ్రెష్మెంట్ వ్యాపార విభాగం అమ్మకాలు క్యూ2లో దాదాపు 83 శాతం ఎగిశాయి. హోమ్‌కేర్, సౌందర్య .. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరాయి. గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్‌కి చెందిన హెల్త్ డ్రింక్స్ (హార్లిక్స్ మొదలైనవి) కూడా పోర్ట్‌ఫోలియోలో చేరడం సంస్థ ఆదాయాలకు ఊతమిచి్చంది. హార్లిక్స్‌తో కలిపితే ఆరోగ్య పానీయాల విభాగం 16 శాతం వృద్ధి నమోదు చేసింది. బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు స్వల్ప నష్టంతో రూ. 2,172 వద్ద ముగిసింది. -
ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..
న్యూఢిల్లీ: తెల్లని మేనిఛాయే సౌందర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రామాణికమనే విధంగా అనేక సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తూ వస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ తాజాగా కొత్త మార్పులకు లోను కానుంది. రీబ్రాండింగ్ కసరత్తులో భాగంగా ఉత్పత్తి పేరు మార్చనున్నట్లు ఫెయిర్ అండ్ లవ్లీ తయారీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హెచ్‌యూఎల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్ని వర్ణాలకు ప్రాధాన్యమిచ్చేలా ఇకపై తమ చర్మ సౌందర్య సాధనాల పోర్ట్‌ఫోలియో ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘ఇకపై ఫెయిర్ అండ్ లవ్లీతో పాటు హెచ్యూఎల్కి చెందిన మిగతా స్కిన్‌కేర్ సాధనాల పోర్ట్‌ఫోలియో కూడా సౌందర్యానికి సంబంధించి కొత్త దృష్టికోణాన్ని ఆవిష్కరించే విధంగా ఉంటుంది‘ అని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఫెయిర్ అండ్ లవ్లీకి సంబంధించి కొత్త పేరు గురించి దరఖాస్తు చేసుకున్నట్లు, నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చాక త్వరలోనే దీన్ని ప్రకటించనున్నట్లు మెహతా తెలిపారు. మరికొద్ది నెలల్లో మారిన పేరుతో ఈ ఉత్పత్తి మార్కెట్లో లభ్యమవుతుందని వివరించారు. అలాగే మహిళల విద్యాభ్యాసానికి స్కాలర్షిప్లు ఇచ్చేందుకు 2003లో ఏర్పాటు చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్‌కు కూడా త్వరలో కొత్త పేరు ప్రకటించనున్నట్లు మెహతా పేర్కొన్నారు. ఫెయిర్, ఫెయిర్‌నెస్, వైట్, వైటెనింగ్, లైట్, లైటెనింగ్ వంటి పదాలన్నింటినీ తమ ఉత్పత్తుల ప్యాక్‌లు, ప్రకటనల నుంచి తొలగించనున్నట్లు హెచ్‌యూఎల్ మాతృసంస్థ యూనిలీవర్ వెల్లడించింది. బ్రాండ్ పేరు మార్చాలంటూ చేంజ్డాట్ఆర్గ్ ద్వారా సంతకాల ఉద్యమం చేస్తున్న కార్యకర్తలు హెచ్‌యూఎల్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. -
కర్నూలుకు చేరుకున్న ముంబై వలస కార్మికులు
-
సంజీవ్ దొరకలె..
గోదావరిఖని(రామగుండం): గనిలోకి దిగి అదృశ్యమై 24 గంటలు గడిచింది.. ప్రత్యేక బృందాల ద్వా రా గనిలోని ప్రతీ ప్రాంతా న్ని క్షుణ్ణంగా గాలిస్తున్నా రు. షిఫ్ట్‌నకు 8 ప్రత్యేక బ్యాచ్‌లతో పెట్టి గనిలోని ప్రతి గుళాయిని జల్లెడ పడుతున్నారు.. అయినా జనరల్ మజ్దూర్ కార్మికుడు కొడెం సంజీవ్ ఆచూకీ మాత్రం లభించలేదు.. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే –11గనిలో జనరల్ మజ్ధూర్‌గా ప నిచేస్తున్న కొడెం సంజీవ్(58) మంగళవారం మొద టి షిఫ్టులో ఆక్టింగ్ పంప్‌ఆపరేటర్ గనిలోని 4వ సీమ్, 27వ లెవల్, ఒకటవ డీప్‌లో 75హెచ్‌పీ పంప్‌ను నడిపించేందుకు వెళ్లాడు. మంగళవారం మొ దటి షిఫ్ట్‌లో పనిస్థలం వద్దకు వెళ్లిన అతడు రాత్రి షిఫ్ట్‌లో ఉన్న ఆపరేటర్ నుంచి చార్జ్ తీసుకున్నాడు. అయితే సాయంత్రం మూడు గంటలకు రెండో షిఫ్ట్‌కు వచ్చే ఆపరేటర్‌కు చార్జ్ ఇవ్వలేదు. పంప్ ర న్నింగ్‌లో ఉన్నప్పటికీ సంజీవ్ మాత్రం అక్కడ లేడు. దీంతో ఈ విషయాన్ని గని అధికారులకు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు పూర్తి వివరా లను సేకరించారు. గనిపైన సంజీవ్ అవుట్ మస్టర్ పడలేదు. ల్యాంప్ రూంలో కూడా లైట్‌ను అప్పగించలేదు. అతడి ద్విచక్రవాహనం గనిపైనే ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆర్జీ–1 జీఎం కె.నా రాయణకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆయన గనిపైకి చేరుకుని మంగళవారం రాత్రే గనిలోని పని స్థలాలను తనిఖీ చేసి వచ్చారు. గనిలోకి దిగిన ఎమ్మెల్యే, మేయర్ సంజీవ్ అదృశ్యం కావడంతో బుధవారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గనిపై చేరుకున్నారు. జీఎం నారాయణతో కలిసి ఎమ్మెల్యే, మేయర్ అనిల్‌కుమార్, గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఆర్జీ–1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు, గోదావరిఖని టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు గనిలోకి దిగి కార్మికుడు పనిచేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. సంప్‌లో గాలింపు.. అదృశ్యమైన కార్మికుడు పనిచేసిన పంప్‌నకు 500మీటర్ల దూరంలోని సంప్‌లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. సంప్‌లో నీటిని పూర్తిగా తోడివేయగా, మిగిలిన 10మీటర్ల దూరం వరకు ఉన్న బురదలో కూడా గాలింపు నిర్వహిస్తున్నారు. ఆర్జీ– 1, 2, 3, ఏరియా సేఫ్టీ జీఎంలు కె.నారాయణ, సురేష్, సూర్యనారాయణ, బళ్లారి శ్రీనివాస్ గనిపైనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కార్మికుడి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితిని సమీక్షించిన డైరెక్టర్(పా) డైరెక్టర్(పా), ఆపరేషన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ బుధవారం గనిపై చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. గనిలోకి దిగి కార్మికుడు పనిచేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. డైరెక్టర్ వెంట ఆర్జీ–1,2,3,ఏపీఏ,రెస్క్యూ, ఏరియా సేఫ్టీ జీఎంలు ఉన్నారు. -
కేన్సర్‌తో పోరాడుతున్న సేవకుడు
సాక్షి, హైదరాబాద్: అతనో సేవకుడు. తాను పేదరికంలో ఉన్నా.. ఆపన్నులకు సేవా హస్తం అందించి సాయపడే గుణం అతనిది. స్వతహాగా ఆటో డ్రైవరైన అతను వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణులకు తన ఆటోను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చేవాడు. ఇలా ఎంతో మందికి తోడ్పాటును అందించిన ఆపద్బాంధవుడు మ్యాదరి సంజీవ్‌కు ఆపద వచ్చింది. ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నాడు. నలుగురికి సేవలందిస్తున్న ఆ పేదవాడి జీవితంలో కేన్సర్ దుఃఖాన్ని మిగిల్చింది. అందినకాడల్లా అప్పులు చేసి మూడెళ్ల క్రితం ఎముకల కేన్సర్‌కు ఆపరేషన్ చేయించుకున్నాడు. కోలుకుంటున్న తరుణంలో కేన్సర్ మహమ్మారి మళ్లీ సోకింది. అయినా కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడపడం మానుకోలేదు. ఈ క్రమంలోనే శరీరంలోని మిగతా భాగాలకు వ్యాధి సోకినట్లు వైద్యులు ప్రకటించారు. మరోసారి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. కుటుంబ పోషణ, అప్పుల భాదతో తల్లడిల్లుతున్న సంజీవ్‌కు ఆపరేషన్ చేయించుకోవడం మృగ్యంగా మారింది. దిక్కుతోచని స్ధితిలో అటు ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్ధితి లేక ఇటు కుటుంబాన్ని పోషించుకోలేక సంజీవ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆపదలో నేనున్నానంటూ.. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ఎవరికి ఆపద వచ్చినా తన ఆటోలో వారి గమ్యస్థానాలకు చేర్చేవాడు సంజీవ్. అర్ధరాత్రయినా సరే వెంటనే చేరుకునేవాడు. తన ఆటోపై వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం ఉచితంగా ప్రయాణం అని తన ఫోన్ నంబర్ రాసి ఎంతో మందిని ఆపదల్లో ఆదుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో లేక తాను ఎదుర్కొన్న అవస్థలు మరొకరికి రావద్దని నిర్ణయించుకున్న సంజీవ్ సేవలందించాడు. తనయుడే ఆటో నడుపుతూ.. ఎస్పీఆర్‌హిల్స్‌లోని వినాయకనగర్ బస్తీకి చెందిన మ్యాదరి సంజీవ్ తన కుటుంబంతో కిరాయి గృహంలో ఉంటున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న సంజీవ్ కుమారుడు కార్తీక్ తండ్రి దయనీయ పరిస్థితితో రహమత్‌నగర్, ఎస్పీఆర్హిల్స్ మార్గంలో ఆటో నడుపుతున్నాడు. వచ్చిన డబ్బులతో తండ్రి వైద్య ఖర్చులు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంజీవ్ కూతురు కల్యాణి ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపి కుటుంబ పనుల్లో తల్లికి చేదుడువాదోడుగా ఉంటోంది. దాతలు తనను ఆదుకోవాలని సంజీవ్ కోరుతున్నాడు. ఆర్థికంగా సాయపడేవారు 80080 55788ను సంప్రదించాలని వేడుకుంటున్నాడు. -
బుల్లితెర నటుడు మృతి
యశవంతపుర : హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సీరియల్ కళాకారుడు, నిర్మాత సంజీవ్ కులకర్ణి (49) శనివారం సాయంత్రం కన్నుమూశారు. సంజీవ్ బుల్లితెరపై కూడా నటించారు. ఆయన గత కొంతకాలంగా బెంగళూరు నారాయణ హృదయాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చామరాజపేట టీఆర్ మిల్ వద్దనున్న స్మశాన వాటికలో ఆదివారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి. -
మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
చెన్నై ,అన్నానగర్: పల్లడమ్ సమీపంలో బుధవారం ఎనిమిదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బంధువులు పోలీసు స్టేషన్‌ని ముట్టడించారు. వివరాలు.. పల్లడమ్ సమీపంలో ఉన్న సెమ్మిపాలైయమ్ సుందరమ్ నగర్‌కు చెందిన శక్తివేల్ (40), తిలకమ్ (36) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజు అక్కడ ఉన్న ఓ పాఠశాలలో ప్లస్ – 1 చదువుతున్నాడు. చిన్న కుమారుడు సంజీవ్ (13) పెరుమ్బాల్లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు వెళ్లిన సంజీవ్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సంజీవ్ తలుపువేసి ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దుకాణానికి వెళ్లిన తల్లి తలుపులు తెరిచే ప్రయత్నం చేసింది. ఫలితం లేకపోవడంతో ఇంటి కిటికీలను తెరచి చూడగా సంజీవ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ స్థితిలో సంజీవ్ బంధువులు, తల్లిదండ్రలు పోలీసు స్టేషన్‌ని ముట్టడించారు. దీని గురించి విద్యార్థి తండ్రి శక్తివేల్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా సంజీవ్ చాలా నిరాశలో ఉన్నాడని, పరామర్శించినా సమాధానం లేదన్నాడు. సంజీవ్ ఆత్మహత్య కారణం ఏంటో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సంజీవ్ చదివిన పాఠశాలకి వెళ్లిన కొంత మంది బంధువులు, పాఠశాలలో ఉన్న సీపీటీవీ కెమెరా దృశ్యాలను చూడాలని అడిగినందుకు పాఠశాల యాజమాన్యం ఒప్పుకోలేదని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. -
‘సంచలన’ అభిమానిని చూసి హీరో షాక్!
లండన్/విదిషా: డాన్సింగ్ వీడియోతో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిపోయిన తన వీరాభిమాని, ‘డాన్సింగ్ అంకుల్’ సంజీవ్ శ్రీవాస్తవకు హీరో గోవిందా సందేశం పంపాడు. ఓ స్నేహితుడు పంపిన ఆ డాన్సింగ్ వీడియో చూసి చిన్నపాటి షాక్‌కు గురయ్యానని, ఒకరు మనల్ని అనుకరించడం ఎంతైనా ఆనందించాల్సిన విషయమేనని వెటరన్ హీరో అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన ‘ఇండియా టుడే’ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. మీ భార్య కూడా కాలుకదపడం చాలా బాగుంది: ‘‘ ఏదో డాన్స్ చేస్తున్నట్లు కాకుండా పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారు. తెలియకుండానే నన్ను అనుకరించారు. నిజంగా ఎవరైనా మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? ఈ సందర్భంగా సంజీవ్ శ్రీవాస్తవ గారికి నా సందేశమిదే.. ‘మీరు డాన్స చేసిన విధానం, ఎంజాయ్ చేసిన తీరు నిజంగా ఆనందింపజేసేలా ఉన్నాయి. కూడా మీ భార్య సైతం స్టెప్స్ వేయడం చాలా బాగుంది. ఎప్పటికీ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..’’ అని గోవిందా అన్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం: ‘డాన్సింగ్ అంకుల్’గా ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన విదిషా వాసి, ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర్నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలంతా పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. డాన్స్‌లో గోవిందానే తనకు ప్రేరణ అని చెప్పుకున్న సంజీవ్ని.. విదిషా మున్సిపల్ కార్పొరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
ఎల్లలు దాటిన తరతరాల ప్రేమ
⇒పెందుర్తి అబ్బాయి.. స్వీడన్ అమ్మాయికి వివాహం ⇒30 ఏళ్ల క్రితం వరుడి తండ్రిదీ అదే తరహాలో పెళ్లి ⇒చూటముచ్చటగా సాగిన వివాహ తంతు తండ్రి ప్రేమ ఎల్లలు దాటింది. ఉపాధి నిమిత్తం స్వీడన్ వెళ్లిన ఆ తండ్రి అక్కడే ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు దశాబ్దాల క్రితం తండ్రి నడిచిన బాటలోనే నేడు కొడుకు నడిచాడు. అదే దేశానికి చెందిన ఓ యువతిని వలచి భారతీయ సంప్రదాయంతో మనువాడాడు. ఆ జంటను ఇరుదేశాల పెళ్లిపెద్దలతో పాటు సీతారాములు ఆశీర్వదించారు. పెందుర్తి: పెందుర్తి అబ్బాయి స్వీడన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెంలోని రాములవారి సన్నిధిలో ఈ జంట ఒక్కటైంది. చూడముచ్చటైన ఈ వివాహబంధం పూర్వాపరాలివి.. పెందుర్తికి చెందిన పెంటకోట అప్పారావు 40 ఏళ్ల క్రితం స్వీడన్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్లిపోయారు. పదేళ్లకు అక్కడే స్థిరపడ్డ అప్పారావు ఇవా అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగ సంతానం. వీరిలో పెద్ద కుమారుడు జాన్ సంజీవ్ స్వీడన్ దేశానికే చెందిన ఎలిన్ లండన్ అనే యువతిని ఇష్టపడ్డాడు. విషయం ఇరువురి తల్లిదండ్రులకు చేరడంతో వారు పెళ్లికి అంగీకరించారు. అయితే తన సొంత ప్రాంతంలోనే పెళ్లి చేయాలని సంకల్పించిన పెంటకోట అప్పారావు–ఇవా దంపతులు సంజీవ్, ఎలిన్ల పెళ్లి పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెంలో చేయాలని నిర్ణయించారు. బుధవారం గ్రామంలోని రామాలయంలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా సంజీవ్–ఎలిన్ల వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. సీతారాముల సన్నిధిలో సంజీవ్ తాళి కడుతుండగా ఎలిన్ సిగ్గుమొగ్గలైంది. నూతన దంపతులు ముత్యాల తలంబ్రాలు పోటాపోటిగా పోసుకుని సందడి చేశారు. పెళ్లిలో మహిళలు పట్టుచీరలు దరించి భారతీయ సంప్రదాయాన్ని సగర్వంగా చాటిచెప్పగా పురుషులు పట్టుపంచెలు దరించి ఉగాది ముందు అచ్చమైన తెలుగు సంప్రదాయాన్ని రుచి చూపించారు. ఈ వివాహ వేడుకను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలిరావడం విశేషం. -
స్వచ్ఛమైన తెలుగు ప్రేమకథ
సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. కమల్‌కుమార్ పెండెం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం యూనిట్ అంతా ఓ కుటుంబంలా ఏడాది ప్రయాణం చేశాం. ఈ చిత్రానికి పాటలు, నేపథ్య సంగీతం హైలెట్ అవుతాయి’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. అచ్చ తెలుగు స్వచ్ఛమైన ప్రేమకథ. యువతకు సందేశం ఉంటుంది. కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. కృష్ణాజిల్లాలో 46 రోజులు ఏకధాటిగా షూటింగ్ జరిపాం. సుమారు వంద థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు. -
మనుషులు.. మనసులు....
సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్య తారలుగా శ్రీమతి శైలజ సమర్పణలో శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం నిర్మించిన సినిమా ‘పిచ్చిగా నచ్చావ్’. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు అవసరాల శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ‘‘నేటి యువత చిన్న చిన్న విషయాలను అపార్థం చేసుకుంటున్నారు. తద్వారా మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని, తన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? అన్నదే చిత్ర కథ. ఈ నెల 17న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
భారత షూటర్లకు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో మూడో రోజు భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ ఐదో స్థానాన్ని సాధించగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హర్వీన్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్స్‌లో సంజీవ్ 420.6 పాయింట్లు, హర్వీన్ 133.6 పాయింట్లు స్కోరు చేశారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ హీనా సిద్ధూ క్వాలిఫయింగ్‌లో 378 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. -
రాంకీ హీరోగా ఆంగ్లపడం
నటుడు రాంకీ చాలా కాలం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం ఆంగ్లపడం. ఆయనతో పాటు సంజీవ్ మరో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నటి మీనాక్షి, శ్రీజ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సింగంపులి, సింగముత్తు, మధుమిత నటించారు. ఆర్జే. మీడియా క్రియేషన్స పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు కుమరేశ్కుమార్ పరిచయం అవుతున్నారు. ఎంసీ.గిరీశ్ సం గీతాన్ని, సాయిసతీష్ ఛాయాగ్రహణాన్ని అం దించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ హా లీవుడ్ చిత్రాల తరహాలో అనూహ్య కథ, కథనాలతో చిత్రం జెట్ స్పీడ్‌లో సాగుతుం దని, అందుకే దీ నికి ఆంగ్లపడం అన్న టైటిల్‌ను నిర్ణయించి నట్లు తెలిపారు.నిజం చెప్పాలంటే ఈ చిత్ర కథను చాలా మంది నటులకు చెప్పానన్నారు. అయితే వారంతా చాలా బాగుందని, నువ్వు చెప్పినట్లు చిత్ర కథను తెరకెక్కించగలవా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారన్నారు. ఆ తరువాత రాంకీ, సంజీవ్ నటించడానికి ముందుకు వచ్చారని చెప్పారు. ఇంతకు ముందెప్పుడూ చూడని రాంకీని ఈ చిత్రంలో చూడనున్నారని తెలిపారు. అదే విధంగా తమిళ తెరకు ఆంగ్లపడం చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. -
ఘట్కేసర్లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం
ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లాలో ఆస్తి తగాదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఘట్కేసర్లోని మైసమ్మగుట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు ఒక్క కుటుంబంపై మరో కుటుంబం కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురికి కత్తిపోట్లు తగిలాయి. ఈ ఘటనలో గాయపడిన సంజీవ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హాల్లో భార్య, కుమారుడు.. కప్ బోర్డులో భర్త శవం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తుల హత్య కలకలం రేపింది. వారిలో ఒకరి మృతదేహాన్ని హంతకులు కప్ బోర్డులో కుక్కిపెట్టారు. ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎప్పటిలాగే ఆ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి తన పనుల నిమిత్తం ఆ ఇంటికి వచ్చి తలుపుతీసి చూడగా ఆమె యజమానురాలు జ్యోతి, ఆమె కుమారుడు హత్యకు గురై కనిపించారు. దీంతో ఆ పనిమనిషి హడలెత్తి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తనఖీలు చేయగా జ్యోతి భర్త సంజీవ్ కూడా హత్య గురై అతడి మృతదేహం కప్ బోర్డులో కనిపించింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును భిన్నకోణాల్లో పరిశీలిస్తున్నారు. బహుశా ఆ కుటుంబానికి బాగా తెలిసినవారే తొలుత మంచితనంగా ఇంట్లోకి వచ్చి అనంతరం ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పని మనిషిని కూడా ప్రశ్నిస్తున్నారు. -
అప్పుడు అడ్డుకున్నది ఎవరు?
షీనా మృతదేహం మూడేళ్ల కిందటే దొరికినా కేసు ఎందుకు పెట్టలేదు? తాజా విచారణకు ఐజీపీ ఆదేశం అలీబేగ్/ముంబై: సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య మిస్టరీ మరో మలుపు తిరిగింది. మూడేళ్ల కిందట రాయ్‌గఢ్ జిల్లా పెన్ తాలూకాలో షీనా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. దానికి సంబంధించి ఎటువంటి హత్య లేదా ప్రమాద మరణం కేసునూ నమోదు చేయలేదని పోలీసులు అంగీకరించారు. దీంతో ఆనాడు విచారణను ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీడియా రంగానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తి ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె షీనా బోరా 2012లో హత్యకు గురైన విషయం కొద్ది రోజుల కిందటే వెలుగు చూడ్డం తెలిసిందే. షీనాను ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె డ్రైవర్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించటం విదితమే. '2012 మే 23వ తేదీన సగం కాలి, పాడైపోయివున్న స్థితిలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఒక వ్యక్తి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ పంచనామా నిర్వహించి.. కొన్ని అవశేషాలను జేజే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పుడు ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. స్టేషన్ డైరీలో మాత్రం నమోదు చేశారు' అని రాయ్‌గఢ్ ఎస్పీ సువేజ్ హక్ శనివారం అలీబేగ్‌లో విలేకరులకు చెప్పారు. ఇందుకు కారణాలు, చేసిన తప్పులపై విచారణ జరపాలన కొంకణ్ రేంజ్ ఐజీపీ తనను ఆదేశించినట్లు తెలిపారు. దీంతో కేసుకు మసిపూసి మాఫీ చేయటానికి అప్పుడే ప్రయత్నాలు జరిగాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కేసు నమోదు చేయకపోవటంపై విచారణ నివేదిక అనంతరం తప్పు చేసిన అధికారులపై చర్యలు చేపడతామని డీజీపీ సంజీవ్ దయాల్ పేర్కొన్నారు. ఇదిలావుంటే.. శుక్రవారం వెలికితీసిన షీనా అస్థికలను ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. నన్ను కూడా చంపేవారు: షీనా తమ్ముడు షీనాను ఏ కారులో గొంతు నులిమి చంపారని నిందితులు వెల్లడించారో.. ఆ కారును పోలీసులు గుర్తించారు. ఆ కారును సమకూర్చిన వ్యక్తిని త్వరలో ప్రశ్నించే అవకాశముంది. ఇదిలావుంటే.. షీనా తమ్ముడు మైఖేల్ బోరా పోలీసుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తన తల్లి ఇంద్రాణి తనను కూడా చంపాలని కుట్ర పన్నినట్లు చెప్పారు. షీనాను హత్య చేసిన రోజున తాను కూడా.. ఖన్నా బసచేసిన హోటల్లో ఉన్నానని, మత్తుమందు కలిపిన నీటిని తనకు ఇవ్వజూపారని, కానీ తాను తప్పించుకోగలిగానని ఆయన వివరించినట్లు సమాచారం. షీనా హత్యకు తాను సహకరించానని చెప్పిన సంజీవ్ ఖన్నా.. పోలీసుల విచారణలో మైఖేల్ బోరాను కూడా తాము హత్య చేసి ఉండేవారమని అంగీకరించినట్లు తెలిసింది. ముగ్గురు నిందితులను రాయ్‌గఢ్‌లో షీనాను హత్య చేసిన అటవీ ప్రాంతానికి మరోసారి తీసుకెళ్లనున్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో నచ్ అనే చిత్రం తెరకెక్కనుంది. మలయాళంలో 17 చిత్రాలు నిర్మించి ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన మరికార్ ఫిలింస్ అనుబంధ సంస్థ మరికాల్ ఆర్ట్స్ తమిళంలో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఈ సంస్థ తొలి ప్రయత్నంగా నచ్ అనే చిత్రాన్ని నిర్మించనుంది. చిత్ర వివరాలను దర్శకుడు అహ్మద్ మరికాల్ తెలుపుతూ ఇది పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించనున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. కత, కథనాలు నవ్యతతో కూడి వుంటాయన్నారు. చిత్ర కథ మొత్తం 12 పాత్రల చుట్టూ తిరుగుతుందని తెలిపారు. అంగాడితెరు ఫేమ్ మహేష్, సంజీవ్, ప్రవీణ్ ప్రేమ్, రియాజ్‌ఖాన్, కాళీ, మదుమిత బెనర్జి, పూనం జవర్, ఎదన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నార ని చెప్పారు. వీరితో పాటు ప్రముఖ నటుడు మమ్ముట్టి సోదరుడు ఇబ్రహీం కొడుకు మక్భుల్ సల్మాన్ ఒక హీరోగా నటించనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక దర్శకుడితో పాటు సీనియర్ నటీనటులున్నట్లు చెప్పారు. చిత్రానికి మన్సూర్ అహ్మద్, గౌరి లక్ష్మి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభించి చెన్నై, కేరళ, మలేషియా ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
పల్లియార్డు సూపర్వైజర్ నోటిదురుసు
పల్లి, పసుపు యార్డుల్లో కాంటాలు నిలిపివేసిన దడువాయిలు,హమాలీలు మూడున్నర గంటలపాటు రైతుల నిరీక్షణ క్షమాపణ చెప్పిన అధికారి కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని పల్లి, పసుపు యార్డులో బుధవారం సుమారు మూడున్నర గంటలపాటు కాంటాలు నిలిచిపోయాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పల్లియార్డులో పనిచేస్తున్న సూపర్వైజర్ సంజీవ్ ఉదయమే మద్యం సేవించి పలువురు హమాలీ కార్మికులతోపాటు దడువాయిలను దూషించాడు. దీంతో హమాలీ, దడువాయి కార్మికులు ఆ అధికారిని పల్లియార్డు నుంచి మార్చేదాకా కాంటాలు నిర్వహించమని మార్కెట్ కార్యదర్శి ఉప్పుల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. కాంటాలు ఆలస్యం కావడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. బస్తాల వద్ద, మార్కెట్ కార్యాలయం ఎదుట కునుకు తీస్తూ కొనుగోళ్ల కోసం నిరీక్షించారు. చివరగా రైతులంతా మూకుమ్మడిగా మార్కెట్ కార్యదర్శిని కలిసి పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సమయంలోనే మార్కెట్‌కు వచ్చిన జేడీఎం సుధాకర్ కు కూడా రైతులు మొరపెట్టుకున్నారు. సూపర్వైజర్ సంజీవ్‌తో జేడీఎం, కార్యదర్శి దడువాయిలు, హమాలీలకు క్షమాపణ చెప్పించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎట్టకేలకు మూడున్నర గంటల అనంతరం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతంలోనూ ఈ అధికారి తీరు ఇంతే.. గతంలో పలుమార్లు ఈ సూపర్వైజర్ ఉదయం, మధ్యాహ్నం సమయంలో మద్యం సేవిస్తూ అధికారులతో పాటు హమాలీ, గుమస్తా, దడువాయిలను సైతం నానా రకాలుగా వేధించాడు. ఇప్పటికైనా మార్కెట్ ఉన్నతాధికారులు స్పందించి సూపర్వైజర్పై చర్య తీసుకోవాలని రైతులు, హమాలీ కార్మికులు, దడువాయిలు, గుమస్తాలు, ఉద్యోగులు, రైతులు కోరుతున్నారు.