selfie accident
-
వీడియో: సెల్ఫీ తెచ్చిన తంటా.. యువతి పరిస్థితి విషమం!
ముంబై: సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకునే సందర్భంగా ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు తమ ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తాజాగా ఓ యువతి సెల్ఫీ తీసుకునే క్రమంలో లోయలో పడిపోయింది. దీంతో, అతి కష్టం మీద ఆమెను కాపాడారు.కాగా, పూణేకు చెందిన ఒక టీమ్ థోస్గర్ జలపాతాన్ని చూసేందుకు అక్కడకి చేరుకున్నారు. ఈ క్రమంలో వారిలో ఒక్కరైన నస్రీన్ అమీర్ ఖురేషీ(29) సెల్ఫీ దిగుతున్నారు. ఈ క్రమంలో కొండ చివరన సెల్ఫీ దిగే ప్రయత్నం చేయడంతో ఆమె 60 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. దీంతో, అప్రమత్తమైన హోంగార్డ్, స్థానికులు ఆమెను రక్షించారు. ఇక, నస్రీన్ లోయలో పడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కింద నుంచి ఆమెను పైనకి తీసుకువస్తున్న సమయంతో గాయాల కారణంగా పెద్దగా అరుస్తూ కన్నీరుపెట్టుకుంది.#Pune girl taking #selfie falls into 60-foot gorge. The girl was rescued with the help of the Home Guard and local residents. The incident occurred amidst #heavyrain in the region. The girl was successfully pulled out of the gorge & immediately admitted to hospital in #Satara. pic.twitter.com/DSde9iMLJX— E Global news (@eglobalnews23) August 4, 2024 ఆమెకు గాయాలు కావడంతో సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా సతారా జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, థేఘర్ సహా జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, తాజా ప్రమాదం సందర్బంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పర్యాటక ప్రాంతాలు, జలపాతాలను కొద్దిరోజులు మూసివేయాలని జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి ఆదేశించారు. -
రైలుతో సెల్ఫీకి యత్నం.. చూస్తుండగానే ప్రాణం పోయింది
ఫొటోలు దిగడం సరదాకే అయినా.. ఒక్కోసారి ఆ సరదానే ఏమరపాటులో ప్రాణాలు పోయేందుకు కారణం అవుతోంది. స్మార్ట్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజుతో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లెందరినో చూస్తున్నాం. అలాంటి ఘటనలు చూశాక కూడా.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఆపడం లేదు చాలామంది. తాజాగా.. మెక్సికోలో ఓ యువతి అంతా చూస్తుండగానే.. సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి బయల్దేరి ఎంప్రెస్ అనే రైలు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తున్నారు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. పైగా అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తుంటారు. సోమవారం రైలు వెళ్తున్న టైంలో హిడాల్గో వద్ద ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024 -
TS: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి
నడికూడ: సెల్ఫీ సరదా ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. వాగు మాటు వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామం వాగులో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (19) హసన్‌పర్తిలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువా రం ఉదయం కాలేజీ స్నేహితులు సయ్యద్ జాహెద్‌షా, అబ్దుల్ షాదాబ్తో కలిసి బైక్‌పై సరదాగా కంఠాత్మకూర్ వాగు వద్దకు వచ్చారు. ఇస్మాయిల్ వాగులోని ఓ మాటు (నీటిని నిల్వచేసేందుకు అడ్డంగా వేసిన కట్ట) వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయాడు. దూరంగా ఉన్న స్నేహితులు గట్టిగా అరవడంతో స్థానికంగా ఉన్న వారు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతను మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఇది కూడా చదవండి: ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్ -
విహారయాత్రలో విషాదం.. అమ్మాయిలు మృతి
సరదా కోసం వెళ్లిన విహారయాత్ర విద్యార్థులకు విషాదాన్ని నింపింది. వాటర్‌ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేసే క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నలుగురు విద్యార్థినిలు మృత్యువాతపడగా.. మరో యువతి ప్రాణాల కోసం ఆసుప్రతిలో పోరాడుతోంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కర్నాటలోని బెలగావికి చెందిన 40 మంది విద్యార్థినిలు పిక్నిక్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో టూర్ కోసం మహారాష్ట్ర వెళ్లారు. ఈ సందర్భంగా కొల్హాపూర్ జిల్లాలోని కిట్వాడ్ వాటర్‌ఫాల్స్ వద్దకు చేరుకున్నారు. అనంతరం, యువతుందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో మృత్యువు వారిని వెంటాడింది. విద్యార్థినిలు సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో ఐదుగురు యువతులు అదుపుతప్పి జలపాతంలో పడిపోయారు. ఈ క్రమంలో నలుగురు యువతులు మృతిచెందగా.. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది మరో యువతిని కాపాడారు. కానీ, ఈ ప్రమాదంలో సదరు యువతి తీవ్రంగా గాయపడటంతో ఆమెను వెంటనే బెలగావిలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక, మృతిచెందిన వారిని ఆసియా ముజావర్(17), కుద్రషియా హసమ్ పటేల్(20), రుక్కాషా భిస్తీ(20), తాస్మియా(20)గా గుర్తించారు. వీరి మృతి కారణంగా విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా ముగిసింది. Maharashtra: 4 college girls drown while clicking selfies at Kitwad waterfall in Kolhapur https://t.co/4dlwRCdYmP — TOI Cities (@TOICitiesNews) November 26, 2022 -
పట్టాలపై సెల్ఫీ.. దూసుకొచ్చిన లోకల్ ట్రైన్.. క్షణాల్లో!
కోల్‌కతా: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫీలకు క్రేజ్ పెరిగింది. అయితే, అదే సెల్ఫీ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదమని తెలిసి కూడా సెల్ఫీలకు పోజులిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి విషాద సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర రీతిలో సెల్ఫీ తీసుకుంటుండగా ఇద్దరు టీనేజర్లపైకి లోకల్ ట్రైన్ దూసుకొచ్చింది. క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సోమవారం రాత్రి కుల్గాచియా- బగ్నాన్ రైల్వేస్టేషన్ల మధ్య మహిష్రేఖ వంతెన సమీపంలో ఈ దుర్ఘటన జరిగిందని జీఆర్పీ పోలీసులు మంగళవారం తెలిపారు. మృతులను బగ్నాన్ ప్రాంతానికి చెందిన షరీఫ్ అలీ ముల్లిక్ (18), షరిఫుల్ ముల్లిక్ (14)గా గుర్తించినట్టు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వివరించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత గుడ్‌బై.. బీజేపీలో చేరిక! -
సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి గల్లంతు
దొడ్డబళ్లాపురం: సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు గల్లంతైన సంఘటన కనకపుర తాలూకాలోని పర్యాటక కేంద్రం చుంచి ఫాల్స్ వద్ద జరిగింది. బెంగళూరు శంకరమఠం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రవీణ్ చంద్ర (26) మంగళవారంనాడు ముగ్గురు స్నేహితులతో కలిసి చుంచి ఫాల్స్ చూడడానికి వచ్చాడు. నీరు ప్రవహించే చోట బండరాయిపై కూర్చుని సెల్ఫీ తీసుకుంటుండగా జారి 18 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలోకి పడిపోయాడు. అతని స్నేహితులు కొంతసేపు వెతికినా కనిపించలేదు. దీంతో సాతనూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. చెక్‌డ్యాంలో మునిగి ఇద్దరు మృతి మైసూరు: దేవస్థానం దర్శనం కాస్తా విషాదమయం అయ్యింది. చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అందులో మునిగిపోయి మృతి చెందిన సంఘటన చామరాజనగర జిల్లాలో కొళ్లెగాల తాలూకాలోని చిక్కల్లూరులో చోటుచేసుకుంది. మళవళ్లి తాలూకా లింగపట్టణ గ్రామానికి చెందిన సునీల్ (26), చంద్రు (19)లు 30 మందితో కలిసి చిక్కల్లూరు దేవస్థానానికి వచ్చారు. దేవుని దర్శనం అయిన అనంతరం హోసమఠం ముందు భాగంలో ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లారు. చాలా లోతుగా ఉండడంతో ఈత కొట్టలేక మునిగిపోయారు. స్థానికులు ఈతగాళ్ళను రప్పించి వారి మృతదేహాలను బయటికి తీశారు. కొళ్లెగాల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్) -
ప్రాణం మీదకు తెచ్చిన సరదా..సెల్ఫీ కోసం రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి..
బెంగళూరు: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల కిరణ్ రాజ్‌పుర్ నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వెళ్లాడు. ఇతరుల కంటే భిన్నంగా సెల్ఫీ దిగాలనే ఉత్సుకతతో నీర్సాగర్ రిజర్వాయర్ వద్ద ఎత్తైన అంచుకు వెళ్లాడు. ఆనందంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో పొరపాటున కాలుజారి పడిపోయాడు. అనంతరం వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. యువకుడి కోసం అతని స్నేహితులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. అతని కోసం గాలింపు చేపట్టిన సహాయక బృందాలు భారీ వర్షం, వరదల కారణంగా ఆపరేషన్ నిలిపివేశాయి. ధార్వాడ్ బెగూర్‌కు చెందిన ఈ యువకుడు చాలా ఎత్తైన ప్రాంతం నుంచి పడిపోయాడని పోలీసులు తెలిపారు. వర్షాకాలంలో గజ ఈతగాల్లు కూడా అక్కడి నుంచి దూకే సాహయం చేయరని తెలిపారు. యువకుడు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కష్టమే అన్నారు. రిజర్వాయర్ దిగువన ఉండే గ్రామస్థులకు సమాచారం అందించామని, ఏమైనా ఆచూకీ లభిస్తే తెలుస్తుందని చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్దకు వెళ్తుంటే అడ్డుకుని వెనక్కి పంపించామని వివరించారు. వానలు పడినప్పుడు నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు చాలా మంది వెళ్తుంటారు. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దని అక్కడున్న సిబ్బంది, పోలీసులు సందర్శకులను హెచ్చరిస్తూనే ఉంటారు. కొంతమంది మాత్రం అవేమి పట్టించుకోకుండా ఫోటోలు దిగేందుకు రిజర్వాయర్ అంచు వరకు వెళ్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారినపడుతున్నారని చెప్పారు. డ్యాంలో నీటి స్థాయి తగ్గేవరకు సందర్శకులు రాకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్ -
ప్రాణం తీసిన సెల్ఫీ.. వినిత చౌదరి కన్నుమూత
తిరువొత్తియూరు: సెల్ఫీ మోజు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సెల్ఫీ చేసుకుంటున్న సమయంలో కాలుజారి కల్లాడి నదిలో పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆదివారం శవమై తేలింది. వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన కట్టా వినిత చౌదరి (26) కర్ణాటకలోని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శని, ఆదివారం సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఊటీ విహారయాత్రకు వచ్చారు. శనివారం సాయంత్రం కల్లాడి నది ఒడ్డుపై స్నేహితులతో కలిసి సెల్ఫీ చేసుకుంటున్న సమయంలో వినిత చౌదరి నదిలో పడిపోయారు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. శనివారం రాత్రి వరకూ గాలించిన ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉదయం గాలింపు చేపట్టి వినితా చౌదరి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: విహారంలో విషాదం.. పడవ బోల్తాపడి ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి -
సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి!
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ పిచ్చి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తుమ్మినా..దగ్గినా సెల్ఫీనే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా..చివరికి ప్రాణాలు పోతున్నా ఈ విపరీత ధోరణిలో మార్పు రావడంలేదు. సెల్పీ మోజులో ప్రపంచాన్నే మర్చి పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీల కోసం ఎగబడుతూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందంగా ముస్తాబై బయటకు వచ్చిన యువతి సెల్ఫీ కోసం ప్రయత్నించింది. తన అందాన్ని కెమెరాలో బంధించాలని తాపత్రయ పడిన ఆ అమ్మాయి సమీపంలోని కాలువ ఒడ్డున నిల్చొని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. చివరకు అదుపు తప్పి బురదలో పడిపోయింది. నవ్వాలో.. చిరాకు పడాలో అర్థం కావడం లేదు. జాలేస్తోంది అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. View this post on Instagram A post shared by hepgul5 (@hepgul5) -
సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోందా.. ఈ ఏడు జాగ్రత్తలు అవసరం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 4న సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోటగిరి నాగరాజు (34) మరణం.. జూన్ 6న నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గాం చెరువులో అక్కాచెల్లెళ్లు, సమీప బంధువైన ఎల్మె స్మిత (17), ఎల్మె వైశాలి (14), లహుబందే అంజలి (16) మృతి.. సెప్టెంబర్ 5న వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని లక్నాపూర్ ప్రాజెక్ట్ అలుగు వద్ద వీరరాజు (25), మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దుందుబీవాగు పరిధిలోని చెక్‌డ్యాం వద్ద కుందేళ్ల శివప్రసాద్ (23) అసువులుబాయడం.. ఇదేనెలలో సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలోని మోయతుమ్మెద వాగులో మామ అల్లుళ్లు మ్యాదరి రాజు(27), చెంచల రుషి (11) తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. ఇలా సెల్ఫీలు ‘కిల్ఫీ’లుగా మారుతున్నాయి. విహారయాత్రలను విషాదంతో నింపిన ఈ ఏడాది ఉదంతాలివి. స్టేటస్లు, ప్రొఫైల్ పిక్ తదితరాలకు సెల్ఫీల కోసం ప్రత్యేక సెల్ఫోన్లు, స్టిక్స్‌తో పాటు కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అత్యంత దారుణమైన అంశాలూ దాగి ఉంటున్నాయి. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాల బారినపడి అశువులుబాస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు సెల్పీ మరణాలకు లోనుకాగా... వీటిలో రెండు మరణాలు ఇటీవల ఒక్కరోజే జరిగాయి. యువతలో ఈ ధోరణి ఎక్కువ... సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన చాలాకాలం తర్వాత ఈ సెల్ఫీల యుగం ప్రారంభమైంది. ప్రధానంగా ఫ్రంట్ కెమెరా సౌకర్యం ఉన్న సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక, నానాటికీ వాటి రెజుల్యూషన్ పెరగడంతో ఈ క్రేజ్ మొదలైంది. అనేక మంది ప్రముఖులు సైతం బహిరంగంగా సెల్ఫీ తీసుకుంటున్న సందర్భాలు అనేకం. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. తామున్న ప్రాంతం, పరిస్థితులు, ప్రభావాలను పట్టించుకోకుండా సెల్ఫీ దిగడానికి ఆరాటపడుతున్నారు. ఈ ధోరణితోనే ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఎక్కువగా సోషల్‌మీడియా కోసమే... సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీలు దిగే అలవాటు మరింత ఎక్కువైంది. ఒకప్పుడు కేవలం తమ, తాము తీసిన ఫొటోలనే వీటిలో పెట్టేవాళ్లు. సెల్ఫీలు తీయడం ఎక్కువైన తరవాత సోషల్ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్ పిక్ చూసినా, అప్లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తున్నాయి. దీంతో ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీ బాటపడుతున్నారు. ఈ ధోరణి వారితో పాటు ఇతరులకూ ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోంది... దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో ఉపయోగాలు ఉంటున్నాయి. అదే సమయంలో కొన్ని అనర్థాలు తప్పట్లేదు. అలాంటి వాటిలో సెల్ఫీ అడిక్షన్ ప్రధానమైంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ 2013లో సెల్ఫీ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా పరిగణించింది. లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడుతూ సొంతంగా తీసుకున్న చిత్రాలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసే విధానం నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో భాగంగా ఎదుటి వారిని ఆకర్షించే, ఆశ్చర్యపరిచే సెల్ఫీ తీసుకోవడానికి ప్రయతి్నస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వీలున్నంత వరకు గ్రూప్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం, కౌన్సిలింగ్ పొందడం, యువతపై పెద్దల పర్యవేక్షణ ద్వారా ఈ సెల్ఫీ అడెక్షన్ నుంచి బయటపడవచ్చు. – డాక్టర్ అనిత రాయిరాల, ప్రొఫెసర్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సేఫ్టీ కోసం ‘సప్త ప్రశ్నలు’... యూత్‌కు లేటెస్ట్ క్రేజ్‌గా మారిపోయిన ఈ సెల్ఫీ ప్రమాదభరితం కాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ఉపక్రమించే ప్రతి ఒక్కరూ... దానికి ముందు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలని కోరుతున్నారు. ఎవరి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు, అవి వర్తించే ప్రాంతాల్లో కొన్ని ఇలా... 1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో అసలు ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా? (మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో) 2. సెల్ఫీ కారణంగా నాకు, నా చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందా? (జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్వేస్, విమానాశ్రయాలు, వాహనాలు నడుపుతూ) 3. సెల్ఫీ తీసుకుంటూ ఎదుటివారు చూస్తున్న వాటికి నేను అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా? (థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు) 4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీస్తున్నామా? (మత సంబంధ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు) 5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా? (జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు) 6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా? (ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమయాత్రలు) 7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతరకరం అవుతుందా? (పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో) ఆ రెండు చోట్లా ‘నో సెల్ఫీ’... యువతలో మితిమీరిపోతున్న ఈ సెల్ఫీ ఆసక్తి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ‘నో పార్కింగ్’ప్రాంతాల తరహాలో ‘నో సెల్ఫీ ప్రాంతాలు అమలులోకి వస్తున్నాయి. 2015లో మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభ్‌మేళాలో సెల్ఫీ ప్రియులతో అనేక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో కుంభమే ళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. వీటి వల్ల జరిగే ప్రమాదాలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు ఆ నగరంలోని 29 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం గోవా అధికార యంత్రాంగం సైతం అక్కడి 23 ప్రాంతాలను ఇలానే ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేసింది. -
సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు
చిన్నకోడూరు (సిద్దిపేట): సెల్ఫీ సరదా ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. నీటి ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లిన బాలుడు అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు ప్రాజెక్ట్ నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగింది. దీంతో సిద్దిపేటలో విషాదం నిండింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. సిద్దిపేటకు చెందిన వెగ్గలం కార్తీక్ (15) తన మిత్రులు చరణ్, హేమంత్‌చారి, సాయిచరణ్‌లతో కలిసి చంద్లాపూర్ శివారులో ఉన్న రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ చూసేందుకు శుక్రవారం వెళ్లాడు. అక్కడ మొత్తం ప్రాంతం కలియతిరిగి సరదాగా గడుపుతున్నారు. ఈక్రమంలో స్నేహితులతో కలిసి కార్తీక్ ఫొటోలు దిగుతున్నాడు. అనంతరం సెల్ఫీ ఫొటో కోసం ప్రయత్నాలు చేశాడు. పంపింగ్ చేసే స్థలంలో కార్తీక్, చరణ్ కలిసి సెల్ఫీ దిగుతుండగా ఒక్కసారిగా కింద ఉన్న మట్టిపెళ్లలు నీటిలోకి జారాయి. దానిపైన నిలబడ్డ కార్తీక్, చరణ్ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనతో తోటి మిత్రులు షాక్‌కు గురయ్యారు. అయితే చరణ్ ఓ కట్టె సాయంతో నీటిలో నుంచి బయటపడగా కార్తీక్ నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి కార్తీక్ కోసం గాలించారు. గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో కార్తీక్ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
సెల్ఫీ మోజులో మహిళ మృతి
ఇండోర్ : ఎక్కడ చూసినా, ఎవర్ని చూసిన సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. యువత సమయంతో సంబంధ లేకుండా ఫోన్లోనే కాలక్షేపం చేస్తూ సెల్ఫీలకు బానిసవుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా లేకున్నా సరే సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు నేటి జనం. ఎక్కడ ఉండి సెల్ఫీ దిగుతున్నామన్న ఆలోచన లేకుండా ఎక్కడ బడితే అక్కడ దిగేస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం ఆరాట పడుతూ ప్రమాదకరమైన చోట్ల సెల్ఫీలు దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ప్రాణాలు వదులుకున్న సందర్భాలు గతంలో చాలా ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. ఆలోచించకుండా దిగరాని చోట్ల సాహసాలు చేసి ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. తాజాగా సెల్ఫీ దిగుతూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ నగరానికి చెందిన 30 ఏళ్ల మహిళ పిక్నిక్ స్పాట్ లో సెల్ఫీ దిగుతూ లోయలో జారి పడి గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నీతూ మహేశ్వరి సరదగా గడపడానికి కుటుంబంతో కలిసి పిక్నిక్ కోసం ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్ గేట్ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. కొండ మీద సెల్ఫీ దిగుతూ జారిపడి లోయలో పడిందన్నారు. నాలుగు గంటల గాలింపు తరువాత లోయ నుంచి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
ఎమ్మెల్యే స్పందన; ఇద్దరు యువకులు సేఫ్
సాక్షి, బొమ్మలసత్రం/కర్నూలు: కుందూనది వంతెనపై సరదాగా సెల్ఫీ దిగేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఘటన నంద్యాల పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. రూరల్ సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. స్థానిక కల్పన సెంటర్లో నివాసముంటున్న ప్రవీణ్.. కర్నూలు పుల్లారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. శని, ఆది వారాలు సెలవు దినాలు కావటంతో వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామనికి చెందిన స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న కుందూనది వంతెన వద్దకు వెళ్లారు. సరదాగా సెల్ఫీ దిగేందుకు వంతెన చివరి భాగంలో నిలబడ్డారు. సెల్ఫీ దిగుతుండగా ప్రవీణ్ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ప్రవీణ్‌ను కాపాడేందుకు విష్ణువర్ధన్ రెడ్డి దూకే క్రమంలో అదుపు తప్పి రాళ్లపై పడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వాహనం నిలిపి తన అనుచరులతో యువకులను కాపాడారు. ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయప డ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విష్ణువర్ధన్ రెడ్డిని వైద్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. కళాశాలలో ఓ యువతి ప్రేమ పేరుతో ప్రవీణ్‌నను మోసం చేయడంతో తట్టుకోలేక కుందూలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని.. అతన్ని కాపాడే క్రమంలో స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డి గాయపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే శిల్పా రవి -
ప్రాణాలు తీస్తున్న సెల్ఫీలు,టిక్టాకులు
-
విద్యార్థిని జీవితం సెల్ఫీకి బలైపోయింది!
సాక్షి, గుంటూరు: సెల్ఫీ దిగితే చాలా అందంగా ఉంటాం.. కానీ జీవితం అంతకంటే అందమైనదీ, అద్భుతమైనది. ఒక్క సెల్ఫీ కోసం అలాంటి జీవితాన్ని పణంగా పెట్టకూడదు. సెల్ఫీ విషాదాలు ఎన్ని జరిగినా.. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట సెల్ఫీ విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని జీవితం సెల్ఫీకి బలైపోయింది. సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూసి ఉంటాం.. జాగ్రత్త పడండి అంటూ వచ్చే సందేశాలు చూసి ఆ ప్రమాదం మనదాకా రాదులే అనుకుంటాం. అలా అనుకొనే గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ధనలక్ష్మి నిర్లక్ష్యంగా సెల్ఫీ దిగుతూ.. ప్రమాదవశాత్తు కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయింది. నరసరావుపేటకు చెందిన 20 ఏళ్ల ధనలక్ష్మి... గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. బంధువుల ఇంట్లోని పెళ్లి కోసం తన స్వగ్రామం వెళ్లింది. అదే రోజు కండ్లకుంటలో నివసిస్తున్న తన అక్క పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో నీటితో పరవళ్లు తొక్కుతున్న గుంటూరు బ్రాంచ్ కాలువ కనిపించింది. మిగతా కుటుంబ సభ్యులతో కలిసి కాల్వ వద్ద చాలాసేపు రకరకాల సెల్ఫీ ఫోటోలు దిగారు. అందరూ తిరగి వెళ్తున్నప్పుడు చివరిగా ఒక్క ఫోటో దిగుతానంటూ ధనలక్ష్మి మళ్లీ కాల్వ వద్దకు వెళ్లింది. అంతే సెల్ఫీకి ఫోజిచ్చే క్రమంలో కాల్వలోకి జారి పడిపోయింది. అంతా తేరుకొని చూసేసరికి సెల్ ఫోన్ మాత్రమే గట్టుమీద కనిపించింది.. సెల్ ఫోన్లోని ఫోటోలు చూశాక ఆమె నీటిలో పడిపోయిందని నిర్ధారించుకున్నారు. పది నిమిషాల్లోనే ధనలక్ష్మి నీటిపై తేలుతూ కనిపించడంతో కాల్వలోకి దిగి బయటికి తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక ప్రతి జ్ఞాపకాన్నీ స్మార్ట్ గా బంధించాలనీ.. అందరితో పంచుకోవాలనీ యువత ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జరిగే ప్రమాదాలను ఉపద్రవాలనూ గుర్తించకపోవడంవల్ల కన్నవారికి కడుపుకోత మిగులుతోంది.. సెల్ఫీ అందంగానే ఉంటుంది.. కానీ జీవితం అంతకంటే అపురూపమైనది.. ! -
గంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ యువకుడి గల్లంతు
సాక్షి, చిత్తూరు : యువకుడు తెలుగుగంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన సంఘటన ఉబ్బలమడుగు అడవిలో మంగళవారం జరిగింది.. పోలీసుల కథనం మేరకు చెన్నైకు చెందిన మహేష్‌కుమార్ కుమారుడు మనోజ్ (24) స్నేహితులైన మాణిక్యం, ప్రశాంత్‌తో కలసి మంగళవారం ఉబ్బలమడుగు అడవిలోని జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. మనోజ్ స్నేహితులతో కలసి తెలుగు గంగ మెయిన్ కాలువపై నిలుచుని సెల్ఫీ తీసుకునేందుకు ఉపక్రమించాడు. కాలుజారి కాలువలో పడిపోయాడు. కాలువలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.. ఈ విషయన్ని మాణిక్యం, ప్రశాంత్ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ధర్మారెడ్డి కేసు నమోదు చేసుకుని, మృతదేహాం కోసం గాలిస్తున్నారు. -
ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి
-
ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి: వైరల్
ముంబై : సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. వంద అడుగుల మేర లోయలో పడి కొన్ని గంటల పాటు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సి వచ్చింది. ఈ సంఘటన గురువారం మహారాష్ట్రలోని లోనావాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోనావాలకు చెందిన నిలేశ్ భగవత్ అనే యువకుడు గురువారం అక్కడి లోనావాల హిల్ స్టేషన్‌కు వెళ్లాడు. సరదాగా అంతా తిరుగుతూ ఓ లోయవద్దకు చేరుకున్నాడు. లోయ మీదనుంచి కింద ప్రాంతం మొత్తం అందంగా కనిపిస్తుండటంతో సెల్ఫీ తీసుకోవటానికి ముచ్చట పడ్డాడు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో పట్టుతప్పి వంద అడుగుల వరకు లోయలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతడ్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో శ్రమకు ఓడ్చి ట్రెక్కింగ్ తాడు సహాయంతో అతడ్ని లోయలోనుంచి బయటకు లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
విషాదం మిగిల్చిన ఫొటో సరదా
సాక్షి, జనగామ: సెల్ఫోన్లో ఫొటోలు దిగాలనే సరదా ప్రాణాలను బలితీసుకుంది. రిజర్వాయర్‌లోకి దిగిన బావతోపాటు ఇద్దరు మరదళ్లు మృత్యువాత పడిన ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మకూర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ మూడ్ లక్ష్మణ్‌నాయక్, కాంతాబాయి దంపతుల కుమారుడు మూడ్ అవినాష్ (29)కు రఘునాథపల్లి మండలం గిద్దెబండ తండా (జీబీతండా)కు చెందిన లకావత్ లక్ష్మణ్, లీల దంపతుల కుమార్తె దివ్య వివాహం ఏడాదిన్నర క్రితం జరిగింది. హైదరాబాద్‌లో ఉంటున్న అవినాష్ శుక్రవారం రాత్రి జనగామకు వచ్చాడు. శనివారం గిద్దెబండతండాలోని అత్తగారింటికి వెళ్లాడు. మధ్యాహ్నం తల్లిగారింటి వద్ద ఉన్న భార్య దివ్యతోపాటు చిన్న మామ లకావత్ అంజయ్య కుమార్తెలు సంగీత (17), సుమలత(15)తో కలసి నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఒడ్డున ఉన్న దివ్య ఫొటోలు తీస్తుండగా అవినాష్, సంగీత, సుమలత నీటిలోకి దిగి సరదాగా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. అకస్మాత్తుగా రిజర్వాయర్‌లోని ఊబిలోకి అవినాష్ మునిగిపోయాడు. సంగీత, సుమలత సైతం నీటిలో గల్లంతయ్యారు. దివ్య గమనించి కేకలు వేయగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చి నీటిలోకి దిగి గాలించి ముగ్గురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరిలించారు. సంగీత ఇటీవలే ఇంటర్ ఉత్తీర్ణత కాగా సుమలత పదో తరగతి పాసైంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సరదాగా చెరువులో ఆడుకుంటు ముగ్గురు మృతి
-
విషాదం: భార్య కళ్లెదుటే భర్త.. చెల్లెళ్లు మృతి
సాక్షి, జనగామ: జిల్లాలోని నర్మెట్ట మండలం బొమ్మకూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. రిజర్వాయర్‌ను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు జలశయంలో సరదాగా ఆడుకుంటున్న క్రమంలో చెరువులో మునిగిపోయి మృతిచెందారు. ఈ ఘటన బొమ్మకూర్ జలాశయం వద్ద శనివారం జరిగింది. చెరువులో గల్లంతైన వారిలో బావ మరదళ్లు అవినాష్ (32), సంగీత (19), సుమలత (20) ఉన్నారు. కాగా ఇద్దరు మరదళ్లతో కలిసి చెరువులోకి దిగిన అవినాష్.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ దృశ్యానంతా అవినాష్ భార్య ఫోన్లో రికార్డు చేస్తునే ఉన్నారు. అప్పటి వరకు నీళ్లలో అడిన ముగ్గరు ఒక్కసారిగా చెరులో గల్లంతయ్యారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. మృతులంతా రఘునాథపల్లి మండలం మేకలగుట్ట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా సెల్ఫీ దిగే క్రమంలో చాలా మంది ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సరదాగా చెరువులో ఆడుకుంటు ముగ్గురు మృతి -
పెళ్లికి వచ్చి.. సెల్ఫీ కారణంగా..
చండీగఢ్ : హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ పిచ్చితో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. పానిపట్‌లోని ఓ రైల్వేట్రాక్‌పై బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నలుగురు వ్యక్తులు పానిపట్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఓ రైల్వేట్రాక్‌పై సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అంతలోనే ఎదురుగా ట్రైన్ రావడంతో.. పక్కకు తొలగాలని భావించారు. కానీ అదే సమయంలో పక్క ట్రాక్‌పై కూడా మరో ట్రైన్ రావడంతో దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు మరణించగా.. ఓ వ్యక్తి ట్రాక్‌కు మరోవైపు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు’ అని వెల్లడించారు. సోషల్ మీడియా మేనియాలో పడిపోయి సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు కోల్పోవద్దని యువతకు విఙ్ఞప్తి చేశారు. కాగా సెల్ఫీలు తీసుకునే క్రమంలో సంభవించే మరణాల సంఖ్యలో భారత్ మొదటి స్థానంలో ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, అమెరికా, పాకిస్తాన్ దేశాలున్నాయని వెల్లడించాయి. గతేడాది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేసిన పరిశోధన ఆధారంగా.. 2011 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా 259 మంది సెల్ఫీ పిచ్చి కారణంగా ప్రాణాలు కోల్పోయారని తేలింది. -
సెల్ఫీ తీసుకుంటూ భారత విద్యార్థి మృతి
లండన్: ఐర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మొహెర్ కొండ అంచుల్లో సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటూ జారిపడి భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బాధితుడు డబ్లిన్‌లో చదువుకుంటున్న ఓ భారత సంతతి విద్యార్థి అని మాత్రమే తెలిసిందని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ విద్యార్థి ఎత్తైన మొహెర్ కొండ అంచులకు చేరుకుని, తన మొబైల్‌తో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా కాలు జారి పట్టుతప్పి కిందపడిపోయాడు. తోటి పర్యాటకుల హెచ్చరికలతో రంగంలోకి దిగిన పోలీసులు హెలికాప్టర్ సాయంతో అతడిని గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భారత్‌లో ఉన్న అతడి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సెల్ఫీల గోల.. ప్రాణాలు విలవిల
కలెక్టరేట్: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తారు.. చేయిని అలా దూరంగా ఉంచి మొహంలో విచిత్రమైన భావాలు పలికించి స్మార్ట్ ఫోన్లో ఫొటో తీసుకుంటారు.. దానిని వెంటనే సోషల్‌మీడియాలో అప్లోడ్ చేయడం.. తరువాత లైక్‌లు..కామెంట్ల కోసం ఎదురు చూడటం పరిపాటిగా మారింది. ఈ జాడ్యం ఇటీవల కాలంలో మరీ ఎక్కువైంది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ప్రాణాలకు తెగించి మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కెమెరా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత సెల్ఫీలగోల మరీ ఎక్కువైంది. తమ ముఖాలలోని అన్ని రకాల భావాలను క్షణాల వ్యవధిలో మరొకరితో పంచుకునేందుకు ‘సెల్ఫీ’ని సులభ మార్గంగా నేటి యూత్ ఈ ఆధునికత ట్రెండ్‌ను ఎంచుకుంటోంది. ఈ వ్యసనం ప్రతి పదిమందిలో ఆరుగురికి ఉందని సర్వేలు చెబుతున్నాయి. నయా ట్రెండ్ రాకతో సామాజిక సంబంధాల వెబ్సైట్లు వింత వింత అనుభూతులతో కూడిన సెల్ఫీ ఫోటోలతో దర్శనమిస్తున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడి నుంచైనా స్మార్ట్ఫోన్ల ద్వారా సెల్ఫీ ఫోటోలను చిత్రీకరించి వాటిని తమకు కావల్సిన వారికి షేర్ చేసకుంటున్నారు. మానవత్వం మరచి.. ⇔ మాజీ రాజ్యసభ సభ్యుడు,టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినపుడు కామినేని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం విమర్శలకు దారి తీసింది. హరికృష్ణ భౌతిక కాయంతో సెల్ఫీ తీసుకొని సోషల్‌మీడియాలో అప్లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. మానవత్వం మరిచి ఇలా ప్రవర్తించడం ఏంటని చీవాట్లు పెట్టారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు విచక్షణ మరచి ప్రవర్తిస్తారా అని దుమ్మెత్తి పోశారు. ⇔ రెండేళ్ల క్రితం నగరంలో నెహ్రూ జూ పార్క్ సందర్శనకు వచ్చిన పదోతరగతి విద్యార్థి ఫౌంటేన్పైకి ఎక్కి సెల్ఫీ తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో 15 అడుగుల ఎత్తునుంచి జారి నీటిలో పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ⇔ మోతీనగర్‌కు చెందిన అభిషేక్ అనే బీటెక్ విద్యార్థి శామీర్‌పేట మండలం హనుమండ్ల కుంట వద్ద సెల్ఫీ దిగుతున్న క్రమంలో కుంటలో పడి నీటమునిగి మృతి చెందాడు. ⇔ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఓ పదోతరగతి విద్యార్థి గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యాడు. ⇔ రాజస్థాన్‌లో కూతురికి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తరువాత తల్లిదండ్రులు షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. ఎస్కలేటర్‌పై వెళుతూ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తల్లి చేతిలో ఉన్న చిన్నారి ఎస్కలేటర్ బెల్ట్ తగిలి కిందకు పడి ప్రాణాలు కోల్పోయింది. అదే రాష్ట్రంలో కొండపై సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు మృతి చెందాడు. పది రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సెల్ఫీలకు అడిక్ట్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఒంటరిగా బాధపడేవారు సెల్ఫీలను షేర్ చేస్తుంటారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటే చివరకు ఒక వ్యసనంలా మారుతుంది. ఈ కారణంగా వారి వ్యక్తిగత జీవితం కూడా నాశనం చేసుకుంటారు. ఒంటరితనం, నిద్రలేమితో బాధపడుతూ అనారోగ్యానికి గురవుతుంటారు. చివరకు జీవితాలు చిన్నాభిన్నం చేసుకుంటారు.ఇటువంటి సమస్య ఉన్న వారు వెంటనే మానసిక వైద్యుడినిసంప్రదించాలి.– డాక్టర్ అనిత, మానసిక వైద్యురాలు -
సెల్ఫీ తీసుకుంటూ చూస్తుండగానే..
సాక్షి, ముంబై : సరదాగా కుటుంబంతో గడుపుదామని విహారయాత్రకు వెళ్లిన ఓ వివాహిత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించింది. ఈ ఘటన రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరన్ హిల్ స్టేషన్లో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ సంజయ్ పాటిల్ ప్రకారం.. ఢిల్లీకి చెందిన సరితా రామేష్ చౌహన్(33) తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం చుట్టూ కొండలతో, ప్రకృతి రమణీయంగా ఉండే మాథెరన్ హిల్ స్టేషన్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఎత్తయిన కొండ ప్రాంతం లూసియా పాయింట్ వద్ద సాయంత్రం అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో సరితా 500 అడుగుల లోయలో కాలుజారిపడిపోయారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని ఎస్పీ వెల్లడించారు. అప్పటికే చీకటి పడడంతో స్థానికుల సహాయంతో అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని వెలికి తీశామని పోలీసులు తెలిపారు. కాగా, తమిళనాడుకు చెందిన పర్యాటకులు సెల్ఫీ తీసుకునే క్రమంలో సోమవారం గోవా సముద్ర జలాల్లో నీటిలో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్టు రిపోర్టు ప్రకారం.. 2015లో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న సెల్ఫీ ప్రమాద మరణాల్లో భారత్ వాటా సగమని తెలిపింది.