sell
-
ఆ ప్రేమ జంట టీ దుకాణానికి వినియోగదారుల క్యూ!
మన దేశంలో టీ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. తేనీరులో అనేక రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రుచి అంటే ఇష్టం. ఏదిఏమైనా టీ లేకుండా చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక ప్రేమ జంట విక్రయిస్తున్న టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ప్రేమ జంట తయారు చేసే టీ, వారు ఏర్పాటు చేసిన టీ స్టాల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటూ, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జార్ఖండ్‌లోని రాంచీలో వీరు ఈ వినూత్న టీ దుకాణాన్ని నడుపుతున్నారు. ప్రేమ జంట మనీష్, పుతుల్ కుమారి ఇద్దరూ కలసి ఈ టీ స్టాల్‌ను ప్రారంభించారు. ఓ కంపెనీలో కలుసుకున్న వీరు ఈ రోజు సొంతగా టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.మనీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను శారదా గ్లోబల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేశానని, ఆ తర్వాత గోద్రెజ్ టెక్ మహీంద్రాలో పనిచేశానని తెలిపారు. అదే సమయంలో పుతుల్‌ను కలిశానని, తాము ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నామన్నారు. తాము ఏదో ఒక వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని ఈ టీ స్టాల్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం రాంచీలోని తమ స్టాల్ ఎంతో ఆదరణ పొందుతున్నదని, ఇక్కడికి టీ తాగడానికి చాలామంది వస్తుంటారని తెలిపారు.తమ పాకెట్ మనీతో ఈ స్టాల్ ఓపెన్ చేశామని మనీష్ తెలిపారు. చిన్నగా వ్యాపారం ప్రారంభించి, క్రమంగా దానిని విస్తరించాలనుకున్నామన్నారు. తాము మట్టి కుండలో రకరకాల టీలను అందిస్తామని తెలిపారు.ప్రస్తుతం తాము రోజూ సాయంత్రం టీ దుకాణం తెరిచి, 500 కప్పుల టీలు విక్రయిస్తున్నామని తెలిపారు. రాంచీలో మరిన్ని టీ స్టాల్స్ తెరవాలనేది తమ కల అని, ఏ పని అయినా ప్రాణం పెట్టి చేస్తే విజయం సాధిస్తామని మనీష్ తెలిపారు. తాము ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామని, భవిష్యత్తులో ఈ సంబంధాన్ని కొనసాగిస్తామని మనీష్ పేర్కొన్నారు. -
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
సాక్షి, మహబూబ్‌నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్‌ను ట్రాక్ చేశారు. హైదరాబాదులోని యాకత్‌పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు. -
ఇళ్ల అమ్మకాల్లో 5 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది ఇళ్ల విక్రయాలు (అన్నిరకాల విభాగాలు) మొత్తం మీద 5 శాతం పెరిగాయి. 3,29,907 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది పదేళ్ల గరిష్ట స్థాయి. మధ్యస్థ, ప్రీమియం విభాగంలో ఇళ్లకు నెలకొన్న డిమాండ్ అమ్మకాల్లో వృద్ధికి దారి తీసింది. అయితే రూ.50 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్ల అమ్మకాలు (అందుబాటు ధరల) అంతక్రితం ఏడాదితో పోలిస్తే 16 శాతం తగ్గాయి. 97,983 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 2022లో ఈ విభాగంలో అమ్మకాలు 1,17,131 యూనిట్లుగా ఉన్నాయి. రూ.50 లక్షల్లోపు ఇళ్ల సరఫరా (కొత్త వాటి నిర్మాణం) గతేడాది 20 శాతం తగ్గింది. ఇది కూడా విక్రయాలు తగ్గేందుకు ఒక కారణం. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో అందుబాటు ధరల ఇళ్ల వాటా 37 శాతం నుంచి 30 శాతానికి పరిమితమైంది. ఈ వివరాలను నైట్‌ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. రూ.కోటిపైన ఖరీదైన ఇళ్ల అమ్మకాలు 2022లో 27 శాతం పెరగ్గా, 2023లో 34 శాతం వృద్ధిని చూశాయి. అమ్మకాల గణాంకాలు.. ► హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద గతేడాది 6 శాతం పెరిగి 32,880 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 31,406 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ► ముంబైలో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు (రూ.50లక్షల్లోపు) 6 శాతం తగ్గి 39,093 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 86,871 యూనిట్లకు చేరాయి. ► బెంగళూరులోనూ అందుబాటు ధరల ఇళ్లు 46 శాతం క్షీణించి 8,141 యూనిట్లకు పరిమితమయ్యాయి. అన్ని విభాగాల్లోనూ ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 54,046 యూనిట్లుగా ఉన్నాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 3 శాతం పెరిగి 60,002 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ అందుబాటు ధరల ఇళ్ల విక్రయాలు 44 శాతం తగ్గాయి. 7,487 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► పుణెలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం వృద్ధితో 49,266 యూనిట్లకు చేరాయి. ► చెన్నైలో 5 శాతం అధికంగా 14,920 ఇళ్లు అమ్ముడయ్యాయి. ► కోల్‌కతాలో 16 శాతం అధికంగా 14,999 ఇళ్ల యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఖరీదైన ఇళ్లకు ఆదరణ ఇళ్ల విక్రయాల పరంగా 2023 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దేశ బలమైన ఆర్థిక మూలాల నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లలో నమ్మకం నెలకొంటోంది. ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, గడిచిన దశాబ్ద కాలంలో ఇళ్ల కొనుగోలు సామర్థ్యం పెరిగింది. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో కొంత ఒత్తిడి నెలకొంది. ఇది విక్రయాల్లో ప్రతిఫలిస్తోంది. –ఎండీ శిశిర్‌బైజాల్ ,నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్ బలమైన పనితీరు వడ్డీ రేట్లు పెరగడం, నిర్మాణ వ్యయాలు పెరగడం, అంతర్జాతీయ అనిశి్చతులు, ఇళ్ల ధరలు పెరుగుదల వంటి ఆరంభ సవాళ్లు గతేడాది ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగం అసాధారణ పనితీరు చూపించింది. కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో ప్రాపర్టీ మార్కెట్ అసాధారణ స్థాయికి చేరుకుంది. 2023 ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్ల పెంపును ఆర్బీఐ నిలిపివేయడం కూడా కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచింది. కొనుగోలుదారుల్లో సానుకూల ధోరణితో మధ్యస్థ ప్రీమియం, ఖరీదైన ఇళ్లకు బలమైన డిమాండ్‌ను తీసుకొచ్చింది. ధరలు పెరగడంతో బడ్జెట్ ఇళ్ల (అఫర్డబుల్) విభాగం సవాళ్లను ఎదుర్కొంటోంది. –వికాస్ వాధ్వాన్, ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఎఫ్‌వో హైదరాబాద్‌లో ఇళ్లకు భలే గిరాకీ హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌కు హైదరాబాద్ ప్రముఖ మార్కెట్‌గా వృద్ధి చెందుతోంది. 2023 సంవత్సరానికి ఇళ్ల అమ్మకాల పరంగా దేశంలో హైదరాబాద్ రెండో అతిపెద్ద వృద్ధి మార్కెట్‌గా నిలిచింది. 2022 సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 49 శాతం పెరిగాయి. 2022లో హైదరాబాద్‌లో 35,372 ఇళ్ల యూనిట్లు అమ్ముడు పోగా, 2023లో 52,571 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్ తర్వాత అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. 2023 చివరి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 20,491 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో అమ్మకాలు 14,191 యూనిట్లతో పోలిస్తే 44 శాతం వృద్ధి నమోదైంది. 2022 చివరి త్రైమాసికం విక్రయాలు 10,335 యూనిట్లతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నూతన ఇళ్ల సరఫరా 2023లో అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం తగ్గింది. 2022లో 82,801 యూనిట్లు సరఫరాలోకి రాగా, 2023లో 76,819 యూనిట్లు ప్రారంభం అయ్యాయి. ఈ వివరాలను ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాలకు సంబంధించిన వివరాలతో వార్షిక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది 4.10 లక్షల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 33% వృద్ధి నమోదైంది. -
క్యాపిటల్ అసెట్ అంటే?
గత పది వారాలుగా స్థిరాస్తి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన కాగితాలు, సోర్స్ ఎలా వివరించాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత స్థిరాస్తి మీద వచ్చే ఆదాయం, అంటే అద్దె, పన్ను భారానికి ఎలా గురి అవుతుందో, వచ్చే మినహాయింపులు.. పన్ను భారం.. టీడీఎస్ బాధ్యతలు మొదలైనవి ఏమిటో తెలుసుకున్నాం. ఈ వారం నుంచి స్థిరాస్తి అమ్మకంలో ఏర్పడే లాభనష్టాలకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్నంగా తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2 (14)లో ‘క్యాపిటల్ అసెట్’ అనే దాన్ని నిర్వచించారు. దీని ప్రకారం.. ♦ అసెసీకి ఉన్న ఆస్తి ♦ ఈ ఆస్తి వ్యక్తిగతమైనదైనా, వ్యాపార–వృత్తిపరమైనదైనా ఎటువంటి తేడా లేదు ♦ స్థిరాస్తి అయినా.. చరాస్తి అయినా.. ♦కంటికి కనిపించేది అయినా.. కనిపించనిది అయినా.. ♦ఆస్తి ద్వారా సంక్రమించిన హక్కులు, నిర్వహణ ప్రయోజనం పొందే హక్కులు అయితే, ఏది క్యాపిటల్ అసెట్ కాదో.. అంటే వేటిని క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరో, వాటి జాబితా కూడా ఉంది. ఈ కింద అసెట్లను క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. ♦వ్యాపారంలో అమ్ముకోవడానికి కొనుక్కున్న వస్తువులు. మీరు ఏ వస్తువులను కొని, వాటిని వ్యాపారంలో భాగంగా అమ్ముతారో వాటిని క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. ఉదాహరణకు బంగారాన్ని ఆస్తిగా పరిగణిస్తాం కానీ.. బంగారం అమ్మే వ్యక్తికి మాత్రం అది క్యాపిటల్ అసెట్ కాదు. ఈ మినహాయింపులో మన మీద ఎటువంటి ప్రేమ, కనికరం ఉండదు. వ్యాపారంలో లాభనష్టాలను వేరే శీర్షిక కింద విభజించి, అసెస్ చేస్తారు. ♦వ్యక్తిగత అవసరాలకు వాడుకునే బట్టలు, ఫర్నిచర్, కార్లు, టూ వీలర్లు, టీవీలు, ఫ్రిజ్, గన్ను, జనరేటర్లు, సంగీత పరికరాలు మొదలైనవి మినహాయింపు ఇస్తారు. కానీ బంగారం, జ్యుయలరీ, ఆభరణాలు, విలువైన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, పురాతన వస్తువులు, శిల్ప సంపద వీటిని మాత్రం క్యాపిటల్ అసెట్‌గా పరిగణిస్తారు. ♦ వ్యవసాయ భూములు (షరతులకు లోబడి) ♦బాండ్లు.. గిల్ట్ బాండ్లు, స్పెషల్ బేరర్ బాండ్లు, గోల్డ్ స్కీముకి సంబంధించిన బాండ్లు. ♦కానీ వ్యవసాయ భూముల విషయంలో కొన్ని షరతుల వర్తిస్తాయి. మొదటిది జనాభా ప్రాతిపదిక కాగా, రెండోది ఆ ఊరి లోకల్ లిమిట్ (పాత కాలంలో పొలిమేర) నుంచి కిలోమీటర్ల లెక్కన ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం.. కొలతల ప్రకారం నిర్ధారించాలి. ♦మీకున్న వ్యవసాయ భూమి, జనాభాని బట్టి పైన చెప్పిన కిలోమీటర్లు దాటిన తర్వాత ఉన్న భూమి.. అదీ సాగులో ఉండాలి. అటువంటి దాన్ని వ్యవసాయ భూమి అంటారు. నగరం నడిరోడ్డున మీరు సాగు చేసి వరి పండించినా ఆ భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. -
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్‌చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్‌పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్‌లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్‌గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్‌వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్‌కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్‌ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
ఎకో హోటల్స్‌లో ఈజీ ట్రిప్ ప్లానర్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సర్వీసులందించే ఈజీ ట్రిప్ ప్లానర్స్ తాజాగా ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో 13.39 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్ల మార్పిడి ద్వారా వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 1: 1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఈజ్‌మైట్రిప్ బ్రాండ్‌తో సేవలందించే కంపెనీ ప్రతీ ఒక ఎకో హోటల్స్ షేరుకి ఒక ఈజీ ట్రిప్ షేరుని కేటాయించనుంది. ఆపై ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 10 ముఖ విలువగల 40 లక్షల ఎకో హోటల్స్ ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోనుంది. ఎన్ఎస్ఈలో ఈజ్‌మైట్రిప్ షేరు 0.8 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
రికార్డు ధరకు నెపోలియన్ టోపీ
నెపోలియన్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ధరించిన టోపీ వేలంలో కొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం పారిస్‌లో దీనిని వేలం వేయగా, దాదాపు రెండు మిలియన్ యూరోలకు అంటే రూ.17 కోట్ల ధర పలికి, సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టోపీ 1.932 మిలియన్ యూరోలకు అమ్ముడైంది. 2014లో ఇదే నెపోలియన్ టోపీ 1.884 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించింది. ఈ నెపోలియన్ టోపీని బైకార్న్ అని పిలుస్తారు. దీనిపై ఫ్రెంచ్ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో పాటు నెపోలియన్ సంతకం ఉంటుంది. ఇంతవరకూ ఈ టోపీ గత ఏడాది మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త జీన్-లూయిస్ నోయిసీజ్ యాజమాన్యంలో ఉంది. నోయిసీజ్ దగ్గర పలు నెపోలియన్ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. కాగా ఈ టోపీ రిజర్వ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధర పలికిందని పారిస్‌లోని ఫాంటైన్‌బ్లూలోని వేలం హౌస్ తెలిపింది. నెపోలియన్ తన 15 సంవత్సరాల పాలనా కాలంలో మొత్తం 120 టోపీలను ధరించాడని చెబుతారు. అయితే తాజాగా అమ్ముడైన ఈ టోపీ ఎంతో ప్రత్యేకమైనదని వేలం నిర్వాహకులు తెలిపారు. వేలం హౌస్ తెలిపిన వివరాల ప్రకారం నెపోలియన్ చక్రవర్తి తన పదవీకాలం మధ్యలో ఈ ప్రత్యేకమైన టోపీని ధరించాడు. ఆ సమయంలోని ఇతర అధికారుల మాదిరిగా కాకుండా, నెపోలియన్ తన టోపీని ఒక పక్కకు ధరించేవాడు. ఇది అతనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ టోపీ కారణంగానే యుద్ధ సమయంలో అతని దళాలు అతనిని సులభంగా గుర్తించేవి. ఫ్రెంచ్ విప్లవం సమయంలో నెపోలియన్ కీలకంగా ఎదిగాడు. ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు -
అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!
అలీగఢ్: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అవుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే తమ కుమార్తెను పోషించేందుకు కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రుల ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. అలీగఢ్‌లో వడ్డీ వ్యాపారుల వేధింపులకు విసిగిపోయిన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తండ్రి తన 11 ఏళ్ల కుమారుడిని విక్రయించడానికి నగరంలోని గాంధీపార్క్ బస్టాండ్ కూడలిలో భార్య, కొడుకు, కూతురితో సహా కూర్చున్నాడు. తన మెడలో ఒక ప్లకార్డును వేలాడదీసుకున్నాడు. ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు’ అని రాసి ఉంది. తన కుమారుని ధర రూ.6 నుంచి 8 లక్షలు ఉందని ఆ తండ్రి చెబుతున్నాడు. మహుఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్‌పూర్ కయామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తండ్రి కొన్ని నెలల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన కొద్ది రోజులకే వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితుడు తెలిపాడు. ‘నా చేతిలో డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితిలో రుణం చెల్లించాలంటూ రౌడీలు నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రౌడీలు నా ఈ-రిక్షాను లాక్కున్నారు. దీంతో కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా నా కుమారుడిని రూ.6 నుంచి 8 లక్షలకు కొనుక్కోవాలని, అప్పడే తాను తన కూతురిని సక్రమంగా పోషించుకోగలనని’ ఆ తండ్రి కనిపించిన అందరికీ చెబుతూ కంటనీరు పెట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన బంధువు వద్ద తాను అప్పు తీసుకున్నానని, తిరిగి చెల్లించలేకపోయానని బాధిత తండ్రి తెలిపాడు. అనంతరం పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ నేపధ్యంలో బాధితుడు డబ్బులు త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో భారత్‌కు నష్టం ఏమిటి? -
ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం!
వాషింగ్టన్: వైద్య పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలను అమ్ముకుంటున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. ఈ దారుణం అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మార్చురీకి మేనేజర్‌గా పనిచేసిన సెడ్రిక్ లాడ్జ్ ఈ వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. అతను మృతదేహాలను ముక్కలుగా చేసి.. తల, మెదడు, చర్మం, ఎముకలను తస్కరించి, ఆన్లైన్లో అమ్ముతున్నట్లు తేలింది. సెడ్రిక్ తన భార్య డెనిస్ (63)తో కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. మానవ అవశేషాలను కత్రినా మక్లీన్, జాషువా టేలర్, మాథ్యూ లాంపి వంటి వ్యక్తులకు విక్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అనుమానితులను జెరెమీ పాలీ, కాండస్ చాప్మన్ స్కాట్లుగా గుర్తించారు. నిందితులపై కుట్ర, దొంగిలించిన వస్తువులను అంతరాష్ట్ర రవాణా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్రినా మసాచుసెట్స్‌లోని పీబాడీలో కాట్స్ క్రీపీ క్రియేషన్స్ పేరుతో ఒక స్టోర్‌ని కలిగి ఉంది. దొంగిలించిన ఈ శరీర భాగాలను ఆమె ఆ దుకాణంలో విక్రయించినట్లు అధికారులు కనుగొన్నారు. 2018 నుంచి 2022 మధ్య ఈ వ్యవహారంలో లక్ష డాలర్ల వరకు లావాదేవీలు జరిగి ఉండవచ్చని సమాచారం. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ.. సెడ్రిక్ లాడ్జ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. గత నెలలోనే హార్వర్డ్ యాజమాన్యం సెడ్రిక్పై వేటు కూడా వేసింది. చదవండి: అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి! -
గూగుల్ సీఈవో చిన్ననాటి ఇల్లు విక్రయం.. కన్నీటి పర్యంతమైన తండ్రి
చెన్నై: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలో తను పుట్టి పెరిగిన ఇంటిని విక్రయించారు. ఆ ఇంటిని కొనుగోలు చేసిన తమిళ నటుడు, నిర్మాత సి.మణికందన్ ఈ విషయం వెల్లడించారు. ఆస్తి పత్రాల అప్పగింత సమయంలో ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. ‘ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని అన్వేషిస్తుండగా చెన్నైలోని అశోక్ నగర్లో ఓ ఇల్లు ఉందని తెలిసింది. అది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పుట్టి, పెరిగిన చోటని తెలియడంతో కొనుగోలు చేయాలని వెంటనే నిర్ణయించుకున్నా’అని మణికందన్ అన్నారు. ‘మన దేశానికి సుందర్ పిచాయ్ గర్వకారణంగా నిలిచారు. ఆయన నివసించిన ఇంటిని కొనుగోలు చేయడమంటే నా జీవితంలో గొప్ప ఆశయం సాధించినట్లేనని ఆనందం వ్యక్తం చేశారు. ఆస్తి పత్రాలు అందజేసే సమయంలో సుందర్ తండ్రి రఘునాథ పిచాయ్ కన్నీటి పర్యంతమయ్యారని చెప్పారు. ‘వారి ఇంటికి వెళ్లినప్పుడు సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి తీసుకువచ్చారు. ఆయన తండ్రి ఆస్తి పత్రాలు ఇవ్వబోయారు’వారి నిరాడంబర వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోయా. రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద రఘునాథ గంటలపాటు వేచి ఉన్నారు. ఆస్తి పత్రాలను నాకు అప్పగించడానికి ముందు అన్ని పన్నులను ఆయనే చెల్లించారు. పత్రాలను నా చేతికి ఇచ్చేటప్పుడు ఆయన ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు’అని మణికందన్ చెప్పారు. 1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌కు వెళ్లేవరకు సుందర్ పిచాయ్ కుటుంబం ఆ ఇంట్లోనే ఉంది. 20 ఏళ్లు వచ్చే వరకు సుందర్ పిచాయ్ ఆ ఇంట్లోనే గడిపినట్లు పొరుగు వారు చెప్పారు. సుందర్ గత ఏడాది చెన్నైలోని ఆ ఇంటికి వచ్చారు. -
ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం: చైనా
బీజింగ్: ఏడాదికి పైగా యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రకటించింది. చైనా మిత్ర దేశమైన రష్యా యుద్ధం కారణంగా సాయుధ సంపత్తిని భారీగా కోల్పోవడం తెలిసిందే. దాంతో రష్యాకు చైనా భారీగా ఆయుధాలు సరఫరా చేయవచ్చని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. అలాంటి ఉద్దేశమేమీ తమకు లేదని చైనా విదేశాంగ మంత్రి క్విన్ కాంగ్ శుక్రవారం ప్రకటన చేశారు. పౌర, సైనిక వాడకం రెండింటికీ పనికొచ్చే వస్తువులను రష్యాకు ఎగుమతి చేయడంపైనా నియంత్రణ విధిస్తామన్నారు. యుద్ధంలో తమది తటస్థ పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే యుద్ధం మొదలైనప్పటి నుంచీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా రష్యాకు చైనా మద్దతుగానే నిలుస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో చైనా దన్ను రష్యాకు ఎంతగానో ఆసరా అయింది. అదే క్రమంలో రష్యాకు ఆయుధాలు కూడా సమకూర్చేందుకు చైనా సన్నద్ధమవుతున్నట్టు తమకు నిఘా సమాచారముందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల పేర్కొనడం తెలిసిందే. చదవండి: పదేళ్లలో మరో మహమ్మారి!.. ఆ నివేదికలో భయంకర విషయాలు -
అమ్మకానికి బొగ్గు గనులు.. మరి సింగరేణి పరిస్థితి ఏంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బొగ్గు, గనుల శాఖ సింగరేణి పరిధిలోని గనులను మరోసారి అమ్మకానికి పెట్టింది. బుధవారం బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారికంగా ఏడో రౌండ్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి దేశంలోని తెలంగాణతో సహా మరో 8 రాష్ట్రాల్లో ఉన్న 106 బొగ్గు బ్లాకులను వేలం వేయనుంది. ఇందులో సింగరేణికి చెందిన కొత్తగూడెం ఏరియాలోని పెనగడప, మందమర్రి ఏరియాలోని శ్రావణపల్లి బ్లాక్ ఉన్నాయి. గతంలో ఈ బ్లాక్‌ను వేలంలో చేర్చగా పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటివరకు అన్ని రౌండ్లలోనూ సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తోంది. తాజా రౌండ్లో పాల్గొంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. -
ఉప్పు అమ్మకాల నుంచి తప్పుకున్న హిందుస్థాన్ యూనీలివర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ ప్రధాన వ్యాపారేతర ఆటా (పిండి), ఉప్పు విభాగాల నుంచి తప్పుకుంటోంది. తమ అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ బ్రాండ్లను సింగపూర్‌కు చెందిన ఉమా గ్లోబల్ ఫుడ్స్‌కి విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 60.4 కోట్లు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ రెండు బ్రాండ్లను దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి టర్నోవరు రూ. 127 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ మొత్తం టర్నోవరులో ఒక్క శాతంలోపే ఉండటం గమనార్హం. సింగపూర్‌కి చెందిన రియాక్టివేట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్‌కు ఉమా గ్లోబల్ ఫుడ్స్ అనుబంధ సంస్థ. -
యస్ బ్యాంక్‌లో వాటాలకు కార్లైల్‌కి గ్రీన్ సిగ్నల్
ముంబై: యస్ బ్యాంక్‌లో 9.99 శాతం వరకూ వాటాలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు ది కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్లకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యస్ బ్యాంక్‌లో రూ. 8,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ ఏడాది జూలైలో ఈ రెండు సంస్థలు ప్రతిపాదించాయి. నిబంధనల ప్రకారం బ్యాంక్‌లో 5 శాతానికి మించి వాటాలు తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. కార్లైల్, యాడ్వెంట్ ప్రతిపాదనలపై రిజర్వ్ బ్యాంక్ రెండు వేర్వేరు లేఖల ద్వారా నవంబర్ 30న ‘షరతులతో కూడిన ఆమోదం‘ తెలిపినట్లు బ్యాంక్ వెల్లడించింది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
సాఫ్ట్‌బ్యాంక్.. పేటీఎం వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో 4.5 శాతం వాటా విక్రయానికి సాఫ్ట్‌బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. బ్లాక్‌డీల్ ద్వారా ఈ వాటాను 20 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 1,627 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ ద్వారా పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్ 17.5 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. షేరుకి రూ. 555–601.55 ధరల శ్రేణిలో వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. పేటీఎమ్ ఐపీవో తదుపరి లాకిన్ గడువు ముగియడంతో సాఫ్ట్‌బ్యాక్ వాటా విక్రయ సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షేరు పతనం బీఎస్ఈలో పేటీఎం షేరు బుధవారం(16న) 4 శాతం పతనమై రూ. 601.55 వద్ద ముగిసింది. ఈ ధరలో షేర్లను విక్రయిస్తే సాఫ్ట్‌బ్యాంక్‌కు 21.5 కోట్ల డాలర్లు లభిస్తాయి. 2017 చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌బ్యాంక్ 160 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి ఐపీవోలో 22 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీని విక్రయించింది. పేటీఎమ్‌లో ప్రస్తుత సాఫ్ట్‌బ్యాంక్ వాటా విలువ 83.5 కోట్ల డాలర్లుగా లెక్కతేలుతోంది! చదవండి: భారత్‌లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
పండగ సీజన్: తగ్గేదేలే అంటున్న కంపెనీలు, పుల్ జోష్‌లో ఆ రంగం!
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. వినియోగ డిమాండ్‌ను అనుకూలంగా మలుచుకునేందకు తమ ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ కామర్స్, ఫ్యాషన్, అప్పారెల్, ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు ఈ పండుగల సీజన్ కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 15–20 శాతం పెంచాయి. దీన్నిబట్టి కంపెనీలు విక్రయాలకు సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దసరా నుంచి పండుగల సీజన్ మొదలు కాగా, ఇప్పటికే ఈ విభాగాల్లో విక్రయాలు అంచనాలను మించాయి. దీంతో కంపెనీలు సైతం తగ్గేదేలా అంటూ ప్రకటనలకు మరింత ఖర్చు చేస్తున్నాయి. ‘‘ఈ కామర్స్, అప్పారెల్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, బ్యూటీ, వెల్నెస్ ఉత్పత్తులు, వినోద, జ్యుయలరీ సంస్థలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను (నిధుల కేటాయింపులు) 15–20 శాతం పెంచాయి. పండుగల డిమాండ్‌కు అనుకూలంగానే ఇది ఉంది. ఈ కేటగిరీల్లో ఇప్పటి వరకు విక్రయాలు లక్ష్యాలను మించి నమోదయ్యాయి’’అని మీడియా టెక్నాలజీ స్టార్టప్ ఆర్డీ అండ్‌ఎక్స్ నెట్వర్క్ చైర్మన్ ఆశిష్ భాసిన్ తెలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో మాత్రం ప్రకటనల పరంగా ఆచితూచి అనుసరించే ధోరణి ఉన్నట్టు చెప్పారు. ఇక ముందూ కొనసాగొచ్చు.. పండుగల సమయాల్లో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తుంటారు. గత రెండు సంవత్సరాల్లో కరోనా ప్రభావం కొనుగోళ్ల డిమాండ్‌పై చూపించింది. కానీ, ఈ ఏడాది వైరస్ ప్రభావం ఏమీ లేదు. సాధారణ ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో వినియోగ డిమాండ్ పట్టణాల్లో బలంగానే ఉంది. దీంతో విక్రయాలు గణనీయంగానే నమోదవుతున్నాయి. దీపావళి వరకు ఈ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. ఆ తర్వాత పండుగల సీజన్ కూడా కలిసొస్తుందని అన్నారు. విస్తృత స్థాయిలో ఉత్పత్తులు, వాటిపై ఆఫర్లను ఈ సీజన్లో అందిస్తున్నట్టు ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. అన్ని మాధ్యమాల్లో తమ ఉత్పత్తులకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సీజన్లో ఎక్కువే.. ‘‘మా జ్యుయలరీ బ్రాండ్లు తనిష్క్, మియా, జోయ, కార్ట్‌లేన్‌కు సంబంధించి ప్రకటనలపై చేసే ఖర్చు గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో పెరిగింది’’అని టాటా గ్రూపు కంపెనీ టైటాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ చావ్లా తెలిపారు. ఎగువ మధ్య తరగతి, ఖరీదైన విభాగాల్లో వినియోగదారుల ఆసక్తి పెరిగినట్టు చెప్పారు. దీంతో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడం ద్వారా, మెరుగైన వృద్ధి అంచనాలను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగ విభాగంలో ఇప్పటి వరకు డిమాండ్ బలంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రకటనలపై అధిక వ్యయాలకు మద్దతునిస్తున్నట్టు చెప్పాయి. ఫ్రెంచ్ అప్పారెల్ బ్రాండ్ సెలియో సీఈవో సత్యేన్ మొమాయ మాట్లాడుతూ.. దసరా సమయంలో పెట్టుబడులపై మంచి రాబడులు రావడంతో ప్రకటనల బడ్జెట్‌ను 25 శాతం పెంచినట్టు ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
జేసీ ఫ్లవర్స్‌కు యస్ బ్యాంక్ మొండి రుణాలు.. విలువ రూ. 48,000 కోట్లు
న్యూఢిల్లీ: ఒత్తిడిలో పడిన మొండి రుణాలను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఎంపిక చేసిన మొత్తం రూ. 48,000 కోట్ల రుణాలను యూఎస్‌కు చెందిన ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి విక్రయించనున్నట్లు పేర్కొంది. ఈ రుణాల పోర్ట్‌ఫోలియోకు జేసీ ఫ్లవర్స్ ఏకైక బిడ్డర్‌గా నిలిచినట్లు తెలియజేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పారదర్శక బిడ్డింగ్ విధానాలను అవలంబిస్తూ స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లకు ఆహ్వానం పలికినట్లు బ్యాంక్ వెల్లడించింది. ప్రాథమిక(బేస్) బిడ్డింగ్‌కు జులైలోనే జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీ మాత్రమే రేసులో నిలిచినట్లు పేర్కొంది. ఇతర బిడ్స్ దాఖలుకాకపోగా.. స్విస్ చాలెంజ్ ప్రాసెస్‌ను ముగించినట్లు తెలియజేసింది. వెరసి ఈ విధానం ప్రకారం గెలుపొందిన జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. ఒప్పందం ప్రకారం జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీలో 19.99 శాతం వాటా కొనుగోలుకి బ్యాంక్ తగిన పెట్టుబడులకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకునే సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు -
ఇంటర్‌గ్లోబ్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సహప్రమోటర్ రాకేష్ గంగ్వాల్, ఆయన భార్య శోభా గంగ్వాల్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో 2.74 శాతం వాటాను విక్రయించారు. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.05 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. వీటి విలువ దాదాపు రూ. 2,005 కోట్లుకాగా.. షేరుకి రూ. 1,886.47– రూ. 1,901.34 మధ్య షేర్లను విక్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్‌గ్లోబ్ బోర్డు నుంచి తప్పుకున్న గంగ్వాల్ ఐదేళ్లలో క్రమంగా ఈక్విటీ వాటాను తగ్గించుకోనున్నట్లు గతంలోనే ప్రకటించారు. చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను రాహుల్ భాటియాతో కలసి గంగ్వాల్ ఏర్పాటు చేశారు. 2022 జూన్ చివరికల్లా గంగ్వాల్, ఆయన కుటుంబీకులకు 36.61 శాతం వాటా ఉంది. చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం! -
బంగారు బాతును కాపాడుకోవాలి!
ఎల్ఐసీ దేశానికి ఎంతో ఇచ్చింది. ఇంకెంతో ఇవ్వనుంది. మరి ప్రభుత్వం దానికి తిరిగి ఏమిస్తోంది? నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలనూ, కార్పొరేషన్లనూ ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయడం ఒక విధానంగా పెట్టుకున్న కేంద్రం... అక్షయ పాత్రలాంటి ఎల్ఐసీనీ ప్రైవేటీకరించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 1956లో ప్రభుత్వం సమకూర్చిన ఐదు కోట్ల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 66 ఏళ్లలో రూ. 31 వేల కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఇచ్చింది ఎల్ఐసీ. 2022 మార్చి 31 నాటికి రూ. 40,84,826 కోట్లు దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిగా పెట్టింది. అదే సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు చౌకగా బీమా సౌకర్యాన్నీ కల్పిస్తూ వచ్చింది. అయినా ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను ప్రభుత్వం అమ్మివేసింది. ఈ మధ్య ఎన్టీఆర్ఐను ప్రారంభిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) లేకుండా దేశ ప్రగతిని ఊహించుకోలేమనీ, ఎల్ఐసీ గత 66 ఏళ్లలో అద్భుతంగా రాణిస్తోందనీ కితాబు ఇచ్చారు. అటువంటి అద్భుత సంస్థ ‘యోగక్షేమం వహామ్యహం’ (ప్రజల యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను) అనే నినాదంతో మొదలై 2022 సెప్టెంబర్ 1 నాటికి 66 ఏళ్ళు పూర్తి చేసుకుని 67వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 1956లో ఎల్ఐసీ ఆవిర్భవించిన నాటి నుండి ‘ప్రజల పొదుపు ప్రజా సంక్షేమానికి’ అనే నినాదంతో, ఉన్నత లక్ష్యాలతో పనిచేయబట్టే... నేడు ప్రజల, పాలసీ దారుల చిరస్మరణీయమైన నమ్మకం చూరగొంది. అడుగడుగునా తనను నమ్మి తన మీద భరోసా పెట్టుకున్న ఖాతాదారులకు అభయం ఇచ్చి, ఎల్ఐసీ దేశీయ జీవిత బీమా రంగంలో మార్కెట్ మేకర్‌గా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022 మార్చి 31 నాటికి ఎల్ఐసీ రూ. 40,84,826 కోట్ల పెట్టుబడులను మన దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టింది. ఇందులో రూ. 28,85,569 కోట్ల నిధులను హౌసింగ్, నీటిపారుదల సౌకర్యాల కల్పనకూ; కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలకూ కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూ. 14,23,055 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ సమకూర్చింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలలో ఎల్ఐసీ వాటా 25 శాతం పైమాటే! 2021–22 ఆర్థిక సంవత్సరంలో క్లెయిముల చెల్లింపుల రూపేణా దాదాపు లక్ష కోట్ల మేరకు పాలసీ దారులకు చెల్లించింది. 99 శాతం క్లెయిముల పరిష్కారం రేటుతో క్లెయిముల పరిష్కారంలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా పేరెన్నికగన్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే (ఏప్రిల్ నుండి జూన్ లోపల) 85,298 కోవిడ్ డెత్ క్లెయిములను పరిష్కరించి, రూ. 2,334 కోట్లు పాలసీదారుల వారసులకు చెల్లించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 614 శాతం ఎక్కువ. నిమిషానికి 41 పాలసీలను విక్రయిస్తూ, 2021–22 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల 17 లక్షల పాలసీలను ఎల్ఐసీ సేకరించింది. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం నికర ప్రీమియం ఆదాయం పెరిగింది. 22 సంవత్సరాల పోటీ తర్వాత కూడా ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం అంశంలో మార్కెట్ వాటాలో 65 శాతం కలిగి ఉంది. పాలసీల సంఖ్యలో దాదాపు 74 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది అపూర్వమైన ఘనత. ఏ దేశంలో లేని విధంగా... ఒకే కంపెనీ, అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీ, మార్కెట్ ఆధిపత్యాన్ని కలిగి ఉండటం ఒక్క ఎల్ఐసీ విషయంలో మాత్రమే సాధ్యమైంది. గత ఏడాది ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడులపై రూ. 36,000 కోట్లు లాభం ఆర్జించిన ఎల్ఐసీ సంస్థ, ఈ ఏడాదిలో రూ. 42,000 కోట్లు లాభాలు ఆర్జించింది.గత ఏడాది జూన్ నాటికి ఎల్ఐసీ ఆస్తులు రూ. 38.13 లక్షల కోట్లు కాగా, ఇప్పుడవి రూ. 42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 23 ప్రయివేటు బీమా కంపెనీల మొత్తం ఆస్తుల కన్నా 3 రెట్లు ఆస్తులు, ఎల్ఐసీ సంస్థ కలిగి ఉంది. రెండో అతిపెద్ద ప్రయివేటు జీవిత బీమా కంపెనీ ఎస్బీఐ లైఫ్‌తో పోలిస్తే, ఎల్ఐసీ ఆస్తులు 16 రెట్లు ఎక్కువ. దేశంలో మొత్తం మ్యూచ్యువల్ ఫండ్ల ఆస్తుల కన్నా, ఎక్కువ ఆస్తులను ఎల్ఐసీ కలిగి ఉంది. 2021–22లో పాలసీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులలో 98 శాతం 15 రోజుల వ్యవధిలోనే పరిష్కరించి అత్యుత్తమ పారదర్శక సంస్థగా నిలిచింది. ‘ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన’ పథకం ద్వారా అతి తక్కువ ప్రీమియంతో ప్రజలకు బీమా రక్షణ కల్పిస్తోంది. కార్పొరేట్ నిర్వహణలో ఎల్ఐసీ అనేక అవార్డులు, రివార్డులు పొందింది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్న ప్రతి సందర్భంలోనూ ఎల్ఐసీనే మార్కెట్లను ఆదుకుంది. ‘మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్’. ‘బెస్ట్ బ్రాండ్ అవార్డ్’తో సహా ప్రతిష్టాత్మకమైన 25 అవార్డులను ఎల్ఐసీ సొంతం చేసుకుంది. అనేక సార్లు అత్యుత్తమ కార్పొరేట్ నిర్వహణకు ‘బంగారు నెమలి‘ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలై ఉన్న అస్తవ్యస్త పరిస్థితుల నడుమ ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేశారు. దాంతో తర్వాత కాలంలో ఎల్ఐసీ షేర్ విలువ దాదాపు 28 శాతం తగ్గిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఎల్ఐసీ సంస్థ ఏనుగు వలే శక్తి మంతమైనది అయినప్పటికీ, అది నాట్యం చేయలేదని కొందరు మార్కెట్ పండితులు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. అయితే, జేపీ మోర్గాన్ సంస్ధ తన తాజా నివేదికలో, ఎల్ఐసీ నిజ విలువను, శక్తిని గుర్తించడంలో మార్కెట్ విఫలమైందని వ్యాఖ్యానించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో ఎల్ఐసీ నూతన వ్యాపార వృద్ధి రేటు 95 శాతంగా ఉంది. కాగా, ప్రయివేటు బీమా కంపెనీల వృద్ధి దాదాపు 48 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఎల్ఐసీ వృద్ధి రేటు 63 శాతం కాగా, ప్రయివేటు కంపెనీల వృద్ధి రేటు 38 శాతంగా ఉంది. తాజాగా ఎల్ఐసీ ఫార్ట్యూన్ గ్లోబల్ –500 కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి లిస్ట్ అయిన కంపెనీల ఆదాయం, లాభాల ఆధారంగా తయారు చేసిన ఈ జాబితాలో లిస్టింగ్ అయిన రెండు నెలల లోపలే ఎల్ఐసీ 98వ స్థానం పొందింది. ఎల్ఐసీ వ్యాపారాభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఎల్ఐసీ షేర్ విలువ కూడా పెరుగుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం దౌడుతీస్తోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి నానాటికీ క్షీణిస్తోన్న పరిస్థితుల్లో సైతం ఎల్ఐసీ చక్కని ప్రదర్శన చేస్తోంది. ప్రయివేటు బీమా సంస్థలు మెట్రోలు, మహానగరాలకే పరిమితమయినా... ఎల్ఐసీ గ్రామీణ ప్రాంతాలకూ తన సేవలను విశేషంగా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుండి ఎల్ఐసీకి 48.22 శాతం ఏజెంట్లు ఉండగా, వారి ద్వారా ఎల్ఐసీకి మొత్తం పాలసీలలో 21.46 శాతం, ప్రీమియంలో 15.6 శాతం వ్యాపారం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలను, బలహీన వర్గాలను విస్మరిస్తే తలెత్తే ప్రతికూల ప్రభావం ఈ గణాంకాల ద్వారా అర్థమవుతుంది. ఎల్ఐసీ వ్యాపారాన్ని గమనిస్తే 28.89 శాతం పాలసీదారులు సాలీనా లక్ష కంటే తక్కువ సంపాదన గలవారు. 43 శాతం పాలసీదారుల వార్షిక ఆదాయం రూ. లక్ష నుండి రెండు లక్షల మధ్యలో ఉన్నది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పాలసీల సగటు ఏడాది ప్రీమియం రూ. 25,000 కాగా, ప్రయివేటు కంపెనీ లలో ఇది రూ 1,06,000 గా ఉంది. దీనిని విశ్లేషించినప్పుడు ప్రైవేటు బీమా కంపెనీలు పెద్ద పాలసీలపై దృష్టి పెడితే, ఎల్ఐసీ సంస్థ ఒక్కటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బీమా రక్షణ కలిగిస్తోందని స్పష్టమవుతోంది. పెద్ద ప్రీమియం పాలసీలు, అర్బన్ వ్యాపారం బీమా సంస్థలకు లాభసాటి గనుక, ఎల్ఐసీలో వాటాలు కొన్న పెట్టుబడిదారులకు అధిక లాభాలను తెచ్చి పెట్టే వ్యాపారం వైపు సంస్థ పరుగులు పెట్టవలసి వస్తే అది భారతదేశ గ్రామీణ పేద, బలహీన వర్గాల ప్రయోజనాలకు భంగకరం అవుతుంది. 40 లక్షల మంది ఎల్ఐసీ షేర్ హోల్డర్ల ప్రయోజనాల కన్నా, 40 కోట్ల పాలసీదారుల ప్రయోజనాలూ, విశాల దేశ ప్రయోజనాలే పరమావధిగా ఎల్ఐసీ బోర్డు అడుగులు వేయాలి. ప్రజల, ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత నడుమ ఎల్ఐసీలో 3.5 శాతం వాటాలు మాత్రమే ప్రస్తుతానికి అమ్మడం జరిగింది. ఎల్ఐసీ కేంద్ర ప్రభుత్వానికి అక్షయ పాత్ర లాంటిది. 1956లో ప్రభుత్వం ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలతో కార్యకలాపాలు ప్రారంభించి... ఇప్పటివరకూ 31 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి డివిడెంట్ చెల్లించింది. నిరంతరం, దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం నిధులు అందిస్తూనే ఉంది. అటువంటి బంగారు బాతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది పోయి తెగనమ్మే ప్రయత్నాలు చేయడం సరికాదు. ప్రభుత్వం తన విధానాన్ని పునస్సమీక్షించుకుంటుందని ఆశిద్దాం. పి. సతీష్, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు ‘ 94417 97900 -
ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే!
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 12,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. వెరసి అమ్మకాల్లో 16 శాతం వృద్ధిని ఆశిస్తోంది. దక్షిణాదిన పటిష్ట కార్యకలాపాలు కలిగిన కంపెనీ ఇటీవల ముంబై మార్కెట్లో ప్రవేశించింది. గతేడాది(2021–22) అమ్మకాల బుకింగ్స్ 90 శాతం పుంజుకున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,382 కోట్లను అధిగమించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలో కనీసం రూ. 12,000 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాలని చూస్తున్నట్లు కంపెనీ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువ వృద్ధినే అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే వివిధ ప్రాజెక్టులను ఎంత త్వరగా అనుమతులు లభించేదీ అన్న అంశం ఆధారంగా లక్ష్యాలను చేరుకోగలమని వివరించారు. చదవండి: టెస్లా మరో ఘనత: ఆనందంలో ఎలాన్ మస్క్ -
ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్‌లైన్స్ జారీ.. ఇకపై..
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్‌డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. అన్ని థియేటర్లు,ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి. విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం మాత్రం సర్వీస్ చార్జీ వసూలు చేయాలి. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలి. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మకాలు జరపాలి. చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి -
ప్రధాని మోదీ పర్యటన.. కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకున్న జపాన్ ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన భారత రక్షణ వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు కీలకంగా మారనుంది. ఈ పర్యటన జరిగిన వారంలోపే.. భారత్‌కు క్షిపణులు, జెట్లతో సహా శక్తివంతమైన సైనిక పరికరాలను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది జపాన్ ప్రభుత్వం. నివేదిక ప్రకారం.. భారతదేశం, ఆస్ట్రేలియాతో పాటు కొన్ని యూరోపియన్, ఆగ్నేయాసియా దేశాలకు ఆయుధాలను ఎగుమతులు చేయడానికి జపాన్ ప్రభుత్వ ఆ దేశ ఆయుధాలపై ఎగుమతులపై ఉన్న నిబంధనలను సడలించనుంది. కాగా మంగళవారం టోక్యోలో జరిగిన సమావేశంలో రక్షణ తయారీతో సహా ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి క్యాడ్ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరగడం విశేషం. గతంలో దాదాపు 47 సంవత్సరాల తర్వాత 2014లో జపాన్ ప్రధాని షింజో అబే పరిపాలన రక్షణ ఎగుమతులను నిషేదించే నిబంధలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులను నిషేధిస్తుంది. తాజాగా జపాన్ ప్రభుత్వం ఈ చట్టానికి మరిన్ని సడలింపులు తీసుకురానుంది. దీని ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జపాన్ స్వీయ-రక్షణ దళాలు, భారత సైన్యం మధ్య అక్విజిషన్ క్రాస్-సర్వీసింగ్ అగ్రిమెంట్ సెప్టెంబర్ 2020లో పలు ఒప్పందాలు జరిగాయి. చదవండి: Elon Musk: అప్పుడు డేటింగ్‌తో చిచ్చు రాజేశావ్! ఇప్పుడేమో ఇలా.. -
Crime News: బుల్లెట్ బండి మీద కన్నేశారు
పంజగుట్ట: రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పంజగుట్ట క్రైమ్ టీం అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి ఐదు లక్షలు విలువచేసే నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఏలూరు జిల్లా, జగ్గారెడ్డిగూడెంకు చెందిన దేవ సన్ని అలియాస్ మహేష్ (26) ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. సూర్యాపేట జిల్లా, ఆత్మకూరుకు చెందిన బి.మనోహర్ (21) ఇతనికి నాలుగు సంవత్సరాలుగా స్నేహితులు. త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ద్విచక్రవాహనాలు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఖరీదైన వాహనాలు దొంగిలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు దొంగతనం చేద్దామనుకున్నారు. నగరానికి వచ్చి సరూర్‌నగర్, హయత్‌నగర్, జూబ్లీహిల్స్‌తోపాటు గత ఏప్రిల్ నెలలో పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాఫర్అలీ బాగ్‌లో ఒక వాహనం దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం పంజగుట్ట క్రైమ్ ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన వాహనంపై నిందితులు పట్టుబడ్డారు. పత్రాలు చూపించమంటే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా గతంలో చేసిన దొంగతనాలగూర్చి వివరించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు ఎలా అమ్మలి, కొనే వారు ఎవరైనా దొరుకుతారా అని ఎదురుచూస్తుండగానే పోలీసులకు దొరికిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. (చదవండి: 24 గంటలు ఆగాలంటూ..) -
యువతికి సాయం చేస్తానని నమ్మించి..
దొడ్డబళ్లాపురం: ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి బెంగళూరు వచ్చిన యువతిని సహాయం చేస్తానని మాయమాటలు చెప్పి విక్రయించడానికి ప్రయత్నించిన నిందితుడిని కెంపేగౌడ ఎయిపోర్టు పోలీసులు అరెస్టు చేసారు. కోలారుకు చెందిన యువతి ఇంట్లో గొడవపడి బెంగళూరుకు వచ్చి మెజెస్టిక్‌లో కూర్చుని ఉండగా ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న నాగేశ్ యువతిని పలకరించి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దేవనహళ్లికి తీసుకువచ్చాడు. ఆపై యువతిపై అత్యాచారం చేసి తరువాత ఢిల్లీకి తీసుకెళ్లి వ్యభిచార గృహానికి విక్రయించాలని పథకం వేశాడు. అయితే ఎయిర్‌పోర్టులో నాగేశ్, యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పసికందు అమ్మకం: తండ్రి అరెస్టు
భువనేశ్వర్: పసికందు అమ్మకం ఘటనలో తండ్రి అరెస్టయిన ఘటన జాజ్‌పూర్ జిల్లాలో సంచలనం రేకిత్తించింది. ఇదే వ్యవహారంలో ఇద్దరు మధ్యవర్తులు, మరో ఇద్దరు కొనుగోలుదారులు అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో శిశువుని కొనుగోలు చేసిన దంపతులు(కైలాస్ బారిక్, సస్మిత బారిక్), శిశువు అమ్మకానికి బేరం కుదిర్చిన అంగన్వాడీ కార్యకర్త ప్రభాషినీ దాస్, ఆమె సోదరుడు దీపక్ దాస్, శిశువును అమ్మకానికి పెట్టిన తండ్రి నటవర బెహరా ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. జాజ్‌పూర్ జిల్లాలోని ధర్మశాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సనొరాయిపొడా గ్రామానికి చెందిన నటవర బెహరా భార్య కాంచన్ బెహరా ధర్మశాలఆరోగ్య కేంద్రంలో ఈ నెల 27వ తేదీన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 28వ తేదీన డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లింది. అదే రోజు శిశువు తండ్రి నటవర బెహరా కేంద్రాపడా జిల్లాలోని మహాకలపడా ప్రాంతానికి చెందిన దంపతులకు రూ.12 వేలకు తన బిడ్డను అమ్మేశాడు. శనివారం సాయంత్రం ఈ సంఘటన వెలుగుచూడడంతో జిల్లా శిశు సంరక్షణ అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. దీనిపై కొత్తొపూర్ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు దాఖలైంది. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి శిశువుని కొనుగోలు చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఆదివారం ఉదయం సదరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నటవర్, కాంచన్ దంపతులకు ఈ బిడ్డ నాలుగో సంతానం కాగా రోజువారీ కూలి పనులతో బతుకు భారమవుతుండడంతోనే శిశువును అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. తమ అభ్యర్థన మేరకే అంగన్వాడీ కార్యకర్త బిడ్డను దత్తత తీసుకునే వారిని సంప్రదించిందని దంపతులు తెలిపారు.