semifinals
-
సెమీస్‌లో కిరణ్ జార్జి
ఇక్సాన్ సిటీ: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ కిరణ్ జార్జి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ కిరణ్ జార్జి 21–14, 21–16తో ప్రపంచ 34వ ర్యాంకర్, ఐదో సీడ్ టకుమా ఒబయాషి (జపాన్)పై గెలుపొందాడు. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.ఒబయాషిపై కిరణ్కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో కిరణ్ తలపడతాడు. -
సెమీస్‌లో సబలెంకా
రియాద్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పర్పుల్ గ్రూప్ రెండో లీగ్ మ్యాచ్‌లో సబలెంకా 6–3, 7–5తో నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలిచింది. తద్వారా వరుసగా రెండో విజయంతో సబలెంకాకు సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇదే గ్రూప్‌లోని మరో లీగ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 7–6 (7/4), 3–6, 6–1తో ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్)ను ఓడించింది. ఫలితం రెండు పరాజయాలతో రిబాకినా సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. జాస్మిన్, కిన్వెన్ జెంగ్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేతకు రెండో సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. -
టీ20 వరల్డ్‌కప్ : చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికా (ఫొటోలు)
-
టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!?
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లు విభజించబడి పోటీపడతాయి. భారత్ విషయానికి వస్తే గ్రూపు-ఏలో ఉంది. గ్రూప్-ఏలో టీమిండియాతో పాటు పాకిస్తాన్‌తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడుతుంది. అనంతరం జూన్ 9న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే.. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు చేరే జట్లను న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంచనా వేశాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కచ్చితంగా సెమీస్‌కు చేరుతాయని, నాలుగో జట్టుగా ఇంగ్లండ్ లేదా పాకిస్తాన్ వచ్చే అవకాశముందని గప్టిల్ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ తరపున 112 టీ20లు ఆడిన గప్టిల్ 3531 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా గప్టిల్ కొనసాగుతున్నాడు. -
Five States Assembly Elections 2023: బీజేపీ తీన్మార్
ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్ పోరులో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాలను సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో భారీ విజయంతో అధికారాన్ని నిలుపుకోగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్ నుంచి చేజిక్కించుకుంది. తద్వారా ఉత్తరాది హిందీ బెల్టులో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో లభించిన ఈ సానుకూల ఫలితాలతో బీజేపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ఘోరమైన ఓటమి మూటగట్టుకుని కాంగ్రెస్ చతికిలపడింది. తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెర దించుతూ విజయం సాధించడం ఒక్కటే ఈ ఎన్నికల్లో దానికి ఊరట. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 164 సీట్లతో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ 65 స్థానాలతో సరిపెట్టుకుంది. రాజస్తాన్‌లో పోలింగ్ జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 115 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌కు 69 సీట్లు దక్కాయి. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 54 సీట్లు సాధించగా కాంగ్రెస్‌కు 35 దక్కాయి. ఇక తెలంగాణలో 119 సీట్లకు కాంగ్రెస్ 64 చోట్ల నెగ్గి మెజారిటీ సాధించగా అధికార బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా స్థానిక పార్టీలైన ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం మధ్యే పోరు సాగిందన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ పెద్దగా ఆశలేమీ లేవు. ఆద్యంతమూ ఆధిక్యమే... ఫలితాల వెల్లడిలో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవాయే సాగింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే మధ్యప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో తొలుత కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్టు కని్పంచినా కాసేపటికే పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చాలామంది భావించిన ఛత్తీస్‌గఢ్‌లో కూడా స్పష్టమైన ఆధిక్యం కని్పస్తుండటం పార్టీలో జోష్ నింపింది. దాంతో ఒకవైపు లెక్కింపు కొనసాగుతుండగానే బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. జై శ్రీరాం, మోదీ నాయకత్వం వరి్ధల్లాలి అంటూ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రధాన కార్యాలయాల వద్ద బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత ప్రభావం నుంచి తప్పించుకోవడంతో పాటు రాజస్తాన్‌లో నేతల మధ్య కుమ్ములాటలకు కూడా పార్టీ చెక్ పెట్టిందని చెబుతున్నారు. మోదీ కేంద్రంగా సాగించిన ప్రచారం ఫలించింది. అంతిమంగా బీజేపీ మీద ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనగా, కాంగ్రెస్ మత, విభజన రాజకీయాలను వారు తిరస్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నిరుత్సాహంలో కాంగ్రెస్ గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఊపులో ఉన్న కాంగ్రెస్‌లో తాజా ఫలితాలు నిరుత్సాహం నింపాయి. ఇది తాత్కాలిక వెనుకంజేనని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కలిపి 84 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా విజయాలతో ఉత్తర, పశి్చమ భారతంలో అత్యధిక రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వెళ్లాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి ఆ ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శనే ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఆశించినన్ని సీట్లు నెగ్గకపోవడం బీజేపీకి నిరాశ కలిగించగా అక్కడ తొలిసారిగా అధికారం చేపట్టనుండటం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. రాజస్తాన్ బీజేపీదే 115 అసెంబ్లీ స్థానాల్లో విజయం 69 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఏకంగా 115 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ ఆనవాయితీని కాంగ్రెస్ బద్దలు కొట్టలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో 69 సీట్లకు పరిమితమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీని గెలిపించలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు దూకుడుగా సాగించిన ప్రచారం ముందు కాంగ్రెస్ చేతులెత్తేసింది. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామంటూ ముఖ్యమంత్రి గెహ్లోత్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ పరాజయాన్ని ఊహించలేదని పేర్కొన్నారు. తమ ప్రణాళికలు, పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నాయని అంగీకరించారు. సీఎం గెహ్లోత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు సమరి్పంచారు. రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నా చిన్నాచితక పారీ్టలు సైతం ప్రభావం చాటాయి. భారత ఆదివాసీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రా్రïÙ్టయ లోక్తాంత్రిక్ పార్టీ, రా్రïÙ్టయ లోక్‌దళ్ కొన్ని సీట్లు గెలుచుకున్నాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. పలువురు కాంగ్రెస్ మంత్రులు ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సి.పి.జోïÙకి సైతం పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ జోద్పూర్ జిల్లాలోని సర్దార్‌పురా నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించడం విశేషం. గత ఎన్నికల్లో ఆయనకు 45,597 ఓట్ల ఆధిక్యం లభించగా, ఈసారి 26,396కు తగ్గింది. మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాషాయమే 163 స్థానాలు బీజేపీ కైవసం 66 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 230 స్థానాలకు గాను ఏకంగా 163 స్థానాలను సొంతం చేసుకుంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ఈసారి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న అధికార కాంగ్రెస్ వ్యూహాలు ఫలించలేదు. ఆ పార్టీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజధాని భోపాల్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సంబరాలు హోరెత్తాయి. కాంగ్రెస్ కార్యాలయం బోసిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వల్లే విజయం సాధ్యమైందని బీజేపీ నాయకులు చెప్పగా పరాజయానికి కారణాలను సమీక్షించుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బుద్నీ అసెంబ్లీ స్థానంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏకంగా లక్షకు పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈసారి బీజేపీ మధ్యప్రదేశ్‌తో పాటు ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యరి్థని ముందుగా ప్రకటించకపోవడం తెలిసిందే. అయినా పార్టీ ఘనవిజయం నేపథ్యంలో శివరాజ్ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. అయితే బీజేపీ ఇంతటి ఘనవిజయం సాధించినా ఏకంగా 12 మంది మంత్రులు ఓటమి పాలవడం విశేషం! అయితే అసెంబ్లీ బరిలో దిగిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ మాత్రం విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 165 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ 58 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి 44.88 శాతం, కాంగ్రెస్‌కు 36.38 శాతం ఓట్లు లభించాయి. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 40.89 శాతం ఓట్లతో 114 స్థానాలు సాధించింది. బీజేపీ 41.02 శాతం ఓట్లు సాధించినా 109 సీట్లే నెగ్గింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. 15 నెలలకే కాంగ్రెస్ అగ్ర నేత జ్యోతిరాదిత్య తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఫిరాయించారు. దాంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలింది. శివరాజ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఛత్తీస్‌గఢ్‌లో విరబూసిన కమలం 54 సీట్లతో బీజేపీ విజయహాసం 35 స్థానాలతో కాంగ్రెస్ ఓటమి రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారతీయ జనతా పార్టీని వరించింది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాలు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్‌కు 35 స్థానాలే లభించాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన కమలం పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికార పీఠం సొంతం చేసుకుంది. ‘మోదీ కీ గ్యారంటీ–2023’ పేరిట బీజేపీ ఇచి్చన హామీలను ప్రజలు విశ్వసించినట్లు కనిపిస్తోంది. క్వింటాల్ రూ.3,100 చొప్పున ధరకు ఎకరాకు 21 క్వింటాళ్ల చొప్పున ధాన్యం కొనుగోలు, మహతారీ వందన్ యోజన కింద వివాహమైన మహిళలకు ఏటా రూ.12,000 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రజలను ఆకర్శించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా బీజేపీ గెలుపునకు తోడ్పడింది. కాగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పారీ్టకి ప్రతికూలంగా మారాయి. స్వయానా సీఎం బఘెల్, డిప్యూటీ సీఎం సింగ్‌దేవ్ మధ్య స్పర్థలుండటం కూడా బాగా చేటు చేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి చతికిలపడింది. సీఎం బఘెల్ తన సొంత నియోజకవర్గం పటన్‌లో నెగ్గినా రాష్ట్రంలో మాత్రం పార్టీని గెలిపించుకోలేకపోయారు. డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్ కూడా ఓటమి చవిచూశారు! అంబికాపూర్ అసెంబ్లీ స్థానంలో సమీప బీజేపీ ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘెల్ ముడుపులు స్వీకరించారంటూ పోలింగ్ సమీపించిన వేళ వచి్చన ఆరోపణలు కూడా కాంగ్రెస్‌కు బాగా నష్టం చేసినట్టు కనబడుతోంది. మరోవైపు బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీకి దిగింది. అయినా ప్రధాని మోదీకి ఉన్న జనాదరణ, ఆయన పేరుతో ఇచి్చన హామీల ఆసరాతో పార్టీ విజయ తీరాలకు చేరింది. -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్‌లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్‌ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే తుది పోరులో భారత్‌తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్‌తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్‌తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్‌లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్‌కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్‌కతా: ఐదుసార్లు వరల్డ్‌కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్‌తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్‌వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్‌లోనే భారత్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్‌టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్‌కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్‌తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్‌లోనే వార్నర్ 3 సిక్స్‌లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్‌లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్‌లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్‌పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్‌ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్‌లో లబుõÙన్ (18), మ్యాక్స్‌వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్‌గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్‌తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్‌వుడ్ 3; బవుమా (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్‌వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్‌వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్‌వెల్ (బి) షమ్సీ 1; ఇన్‌గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
ACC Emerging Asia Cup 2023: సెమీఫైనల్లో భారత్ ‘ఎ’
కొలంబో: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోరీ్నలో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట నేపాల్ 39.2 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (65; 7 ఫోర్లు) రాణించాడు. గుల్షన్ ఝా (38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్ ‘ఎ’ బౌలర్లలో నిశాంత్ సింధు 4, రాజ్వర్ధన్ 3, హర్షిత్ రాణా 2 వికెట్లు తీశారు. తర్వాత సులువైన లక్ష్యాన్ని భారత జట్టు 22.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (87; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (58 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. ధ్రువ్ (21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా పరుగులు చేశాడు. ఈ గ్రూపులో బుధవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ‘ఎ’తో తలపడుతుంది. -
పదేళ్ల తర్వాత మళ్లీ సెమీస్‌లోకి
మెల్బోర్న్: తన పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా పదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ అజరెంకా మూడోసారి సెమీఫైనల్‌కు చేరింది. 2012, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అజరెంకా 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరాక మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అజరెంకా 6–4, 6–1తో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై అలవోకగా గెలిచింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో అజరెంకా 17 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–4తో 17వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించి సెమీస్‌లో అజరెంకాతో పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 18వ సీడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సిట్సిపాస్ 6–3, 7–6 (7/2), 6–4తో లెహచ్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... ఖచనోవ్ 7–6 (7/5), 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు. ‘మిక్స్డ్’ సెమీస్‌లో సానియా–బోపన్న జోడీ సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. సానియా–బోపన్నలతో ఆడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. -
Duleep Trophy 2022: సాయికిశోర్‌కు 7 వికెట్లు
సేలం (తమిళనాడు): ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆర్.సాయికిశోర్ (7/70) ఏడు వికెట్లతో తిప్పేయడంతో... నార్త్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 17/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 67 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), నిశాంత్ (40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 423 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన సౌత్ జోన్ జట్టు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. రోహన్ (77; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు), టి.రవితేజ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌత్ జోన్ ఓవరాల్ ఆధిక్యం 580 పరుగులకు చేరుకుంది. -
US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ గార్సియా తన జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గార్సియా 6–3, 6–4తో అమెరికా టీనేజర్, 12వ సీడ్ కోకో గాఫ్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది మూడు టైటిల్స్ నెగ్గి సూపర్ ఫామ్‌లో ఉన్న 28 ఏళ్ల గార్సియా యూఎస్ ఓపెన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీఫైనల్‌కు చేరింది. కోకో గాఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో గార్సియా నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 24 విన్సర్స్ కొట్టిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచింది. 2011లో ప్రొఫెషనల్‌గా మారిన గార్సియా ఇప్పటివరకు 41 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2017లో ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆమె అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. పదోసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న గార్సియా సెమీఫైనల్ చేరడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన మూడోఫ్రాన్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో ఫ్రాన్స్ నుంచి అమెలీ మౌరెస్మో (2002, 2006), మేరీ పియర్స్ (2005) సెమీఫైనల్ చేరారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)తో గార్సియా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో జబర్ 2–0తో గార్సియాపై ఆధిక్యంలో ఉంది. జబర్ జోరు... ఈ ఏడాది 42 విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ట్యూనిషియా ప్లేయర్ ఆన్స్ జబర్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జబర్ 6–4, 7–6 (7/4)తో తొమ్లాయనోవిచ్పై గెలిచింది. ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా జబర్ నిలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఆరో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) 6–1, 7–6 (7/4)తో 22వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 82 నిమిషాలపాటు జరి గిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. కిరియోస్ జోరుకు ఖచనోవ్ బ్రేక్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా) తొలిసారి తన కెరీర్లో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో... ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్, 23వ సీడ్ నిక్ కిరియోస్తో 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 7–5, 4–6, 7–5, 6–7 (3/7), 6–4తో గెలుపొందాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 30 ఏస్‌లు సంధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించిన కిరియోస్ 31 ఏస్‌లు సంధించినా 58 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కిరియోస్ కోపంతో తన రెండు రాకెట్లను నేలకేసి కొట్టి విరగొట్టడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో కాస్పర్ రూడ్ 6–1, 6–4, 7–6 (7/4)తో 13వ సీడ్ మారియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ సెమీఫైనల్లో ఖచనోవ్‌తో ఆడతాడు. -
Cincinnati Masters: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మెద్వెదెవ్
సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మెద్వెదెవ్ 7–6 (7/1), 6–3తో 11వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2019లో ఈ టోర్నీ టైటిల్ సాధించిన మెద్వెదెవ్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)తో తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్ 7–6 (7/5), 5–7, 6–3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై విజయం సాధించాడు. మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో కామెరాన్ నోరీ (బ్రిటన్) 7–6 (7/4), 6–7 (4/7), 6–4తో మూడో సీడ్ అల్కారజ్ (స్పెయిన్)పై, బోర్నా చొరిచ్ (క్రొయేషియా) 6–4, 6–4తో ఫీలిక్స్ అలియాసిమ్ (కెనడా)పై నెగ్గారు. -
Commonwealth Games 2022: సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
బ్యాడ్మింటన్‌లో మహిళల సింగిల్స్‌లో సింధు... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 19–21, 21–14, 21–18తో గో వె జిన్ (మలేసియా)పై, శ్రీకాంత్ 21–19, 21–17తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై, లక్ష్య సేన్ 21–12, 21–11తో జూలియన్ (మారిషస్)పై గెలిచారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 21–8, 21–6తో తాలియా–కేథరిన్ (జమైకా) జంటపై గెలిచింది. -
Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు
ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో భారత మహిళలు అసమానంగా పోరాడారు. ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయినా ఆ తర్వాత కోలుకొని సత్తా చాటారు. చివర్లో ఎదురుదాడికి దిగి లెక్క సరి చేశారు కూడా. దాంతో ఫలితం పెనాల్టీ షూటౌట్‌కు చేరింది. అక్కడా ప్రత్యర్థి తొలి ప్రయత్నాన్ని కీపర్ సవిత అద్భుతంగా అడ్డుకోగలిగింది. ఇదే జోరు కొనసాగిస్తే విజయం సాధించడం ఖాయమనిపించింది. కానీ ఇక్కడే రిఫరీ భారత్‌ను దెబ్బ కొట్టింది. ‘గడియారం గంట కొట్టలేదంటూ’ మొదటి గోల్ ప్రయత్నంలో లెక్కలోకి రాదంది. మళ్లీ పెనాల్టీ తీసుకునేందుకు ఆసీస్‌కు అవకాశం కల్పించింది. దాంతో ఏకాగ్రత చెదిరిన మన మహిళలు ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం కోల్పోయారు. షూటౌట్లో తడబడి చివరకు ఓటమి పక్షాన నిలిచారు. భారత్ పరాజయానికి ఆటలో వైఫల్యంకంటే అసమర్థ రిఫరీనే కారణమనడంలో సందేహం లేదు. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్లో 3–0 తేడాతో భారత్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. మ్యాచ్ 10వ నిమిషంలో ఆస్ట్రేలియా తరఫున రెబెకా గ్రీనర్ గోల్ చేయగా, 49వ నిమిషంలో భారత్ తరఫున వందనా కటారియా గోల్ నమోదు చేసింది. తొలి క్వార్టర్లో వెనుకబడిన భారత జట్టు తర్వాతి రెండు క్వార్టర్లలో దూకుడుగా ఆడింది. గోల్ లేకపోయినా ఆసీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించగలిగింది. అదే ఊపులో చివరి క్వార్టర్లో గోల్‌తో స్కోరు సమం చేసింది. పెనాల్టీ షూటౌట్లో ఆస్ట్రేలియా నుంచి ఆంబ్రోసియా మలోన్, కైట్లిన్ నాబ్స్, ఎమీ లాటన్ గోల్స్ చేయగా... భారత్ నుంచి లాల్రెమ్సియామి, నేహ, నవనీత్ కౌర్ విఫలమయ్యారు. కాంస్యం కోసం నేడు జరిగే పోరులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఏం జరిగింది... తొలి పెనాల్టీని మలోన్ తీసుకోగా, భారత కీపర్ సవిత దానిని గోల్ కాకుండా సమర్థంగా అడ్డుకోగలిగింది. అంతా ముగిసిన తర్వాత అది చెల్లదని, మళ్లీ పెనాల్టీ తీసుకోవాలని రిఫరీ ఆదేశించింది. పెనాల్టీ సమయం గరిష్టంగా 8 సెకన్లు చూపించే ‘స్టాప్‌వాచ్’ టైమర్ స్టార్ట్ కాలేదని, దానికి ముందే పెనాల్టీ తీసుకున్నందున గుర్తించలేమని రిఫరీ ప్రకటించింది. నిబంధనల ప్రకారమైతే మైదానంలో ఉండే టెక్నికల్ అఫీషియల్ ముందుగా చేయి పైకెత్తుతారు. ఆ తర్వాత చేతిని కిందికి దించితే ‘టైమర్’ ప్రారంభమవుతుంది. అదే సమయంలో రిఫరీ విజిల్ వేస్తే పెనాల్టీ తీసుకోవాలి. అయితే ఈ టెక్నికల్ అఫీషియల్ చేతికి కిందకు దించలేదు. ఇది పూర్తిగా ఆమె తప్పు. దాంతో స్టాప్‌వాచ్‌ను మరో అధికారిణి స్టార్ట్ చేయలేదు. దానిని గుర్తించి ‘నో నో’ అనే లోపే పెనాల్టీ ముగిసిపోయింది. దీనిని ఆమె వివరించడంతో రిఫరీ మళ్లీ పెనాల్టీ తీసుకోవాల్సిందిగా కోరింది. మా ఓటమికి దీనిని సాకుగా చెప్పను. అయితే మొదటి పెనాల్టీని ఆపితే సహజంగానే వచ్చే ఉత్సాహం ఆ తర్వాత నీరుగారిపోయింది. అందరం చాలా నిరాశ చెందాం. తాము పెనాల్టీని కోల్పోయామని గుర్తించిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు రిఫరీ ఎందుకు కల్పించుకోవాలి. అధికారులు ఆటతో పాటు ముడిపడి ఉండే భావోద్వేగాలని అర్థం చేసుకోలేరు. –భారత కోచ్ జేనెక్ స్కాప్‌మన్ -
Asia Cup hockey: లెక్క సరిచేసిన భారత్
జకార్తా: లీగ్ దశలో జపాన్ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీ సూపర్–4 సెమీఫైనల్ లీగ్‌లో భారత్ శుభారంభం చేసింది. 2018 ఆసియా క్రీడల చాంపియన్ జపాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో డిఫెడింగ్ చాంపియన్ భారత్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున మంజీత్ (8వ ని.లో), పవన్ రాజ్‌భర్ (35వ ని.లో) ఒక్కో గోల్ సాధించగా... జపాన్ జట్టుకు టకుమా నివా (18వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. నేడు జరిగే సూపర్–4 రెండో మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
Thomas Cup 2022: ఎన్నాళ్లో వేచిన పతకం
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఐదుసార్లు చాంపియన్ మలేసియా జట్టును క్వార్టర్ ఫైనల్లో ఓడించిన భారత్ 1979 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ సెమీఫైనల్ చేరింది. తద్వారా 73 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత పురుషుల జట్టు తొలిసారి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. 1990 నుంచి థామస్ కప్‌లో సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకూ కాంస్య పతకాలు అందజేస్తున్నారు. అంతకుముందు మాత్రం సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య ప్రత్యేకంగా కాంస్య పతకం కోసం మ్యాచ్‌ను నిర్వహించేవారు. బ్యాంకాక్: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించింది. గతంలో సాధ్యంకాని ఘనతను ఈసారి సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్ అయిన థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో ఐదుసార్లు చాంపియన్ మలేసియా జట్టును ఓడించి సెమీఫైనల్ చేరింది. థామస్ కప్‌లో సెమీఫైనల్ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. నేడు జరిగే సెమీఫైనల్లో 2016 చాంపియన్ డెన్మార్క్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో ఇండోనేసియాతో జపాన్ ఆడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో డెన్మార్క్ 3–2తో దక్షిణ కొరియాపై... జపాన్ 3–2తో చైనీస్ తైపీపై... ఇండోనేసియా 3–0తో చైనాపై విజయం సాధించాయి. గెలిపించిన ప్రణయ్ మలేసియాతో పోటీలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–23, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ జి జియా చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–19, 21–15తో గో జె ఫె– నూరుజుద్దీన్ జోడీని ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్ చక్కటి సమన్వయంతో ఆడుతూ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ జోరు పెంచి ప్రత్యర్థి జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడో మ్యాచ్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ 21–11, 21–17తో ఎన్జీ జె యోంగ్‌పై గెలిచి భారత్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌లో చెలరేగిపోగా... రెండో గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. నాలుగో మ్యాచ్‌లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట 19–21, 17–21తో ఆరోన్ చియా–తియో యె యి ద్వయం చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. తెలంగాణ ప్లేయర్ విష్ణువర్ధన్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కృష్ణప్రసాద్ పోరాటపటిమ కనబరిచినా కీలకదశలో తడబడ్డారు. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన హెచ్ఎస్ ప్రణయ్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆడి 21–13, 21–8తో లియోంగ్ జున్ హావోపై నెగ్గడంతో భారత్ 3–2తో చిరస్మరణీయ విజయాన్ని ఖరారు చేసుకుంది. స్కోరు 20–8 వద్ద ప్రణయ్ స్మాష్ షాట్ కొట్టి చివరి పాయింట్ రాబట్టిన వెంటనే భారత జట్టు సభ్యులందరూ ఆనందంతో కోర్టులోకి దూసుకెళ్లి సంబరాలు చేసుకున్నారు. -
PV Sindhu: సూపర్ సింధు...
మనీలా (ఫిలిప్పీన్స్): ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండో పతకాన్ని ఖాయం చేసుకుంది. గతంలో 2014లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఈసారి కూడా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–9, 13–21, 21–19తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఒకదశలో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది. అయితే రెండో గేమ్‌లో హి బింగ్ జియావో పుంజుకుంది. స్కోరు 9–10 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గిన హి బింగ్ జియావో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో సింధు 7–3తో ఆధిక్యంలోకి వెళ్లి దానిని కాపాడుకుంది. చివర్లో సింధు 20–16తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు కోల్పోయిన సింధు ఆ వెంటనే మరో పాయింట్ గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 13–8తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పతకం సాధించలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 53 నిమిషాల్లో 21–12, 14–21, 16–21తో ఐదో సీడ్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ జంట గెలిచిఉంటే సెమీస్ చేరినందుకు కనీసం కాంస్య పతకం లభించేది. నేటి సెమీఫైనల్స్ ఉదయం గం. 10:30 నుంచి సోనీ టెన్–2లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్ సీడ్ జో సాలిస్బరీ (బ్రిటన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి. -
తొమ్మిదేళ్ల తర్వాత...సెమీస్‌లో భారత్
పోష్‌స్ట్రూమ్: తమ అజేయ రికార్డును కొనసాగిస్తూ భారత మహిళల హాకీ జట్టు తొమ్మిదేళ్ల తర్వాత జూనియర్ ప్రపంచకప్‌లో మరోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చిన భారత జట్టు క్వార్టర్స్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభం నుంచే దాడులకు పదునుపెట్టిన అమ్మాయిలు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ముంతాజ్ ఖాన్ (11వ ని.లో), లాల్రిండికి (15వ ని.లో), సంగీత (41వ ని.లో) ఒక్కో గోల్ చేసి జట్టును గెలిపించారు. 33 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు సెమీస్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2013 ప్రపంచకప్ టోర్నీలో భారత్ సెమీస్ చేరింది. అప్పుడు సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతకపోరులో ఇంగ్లండ్‌ను 3–2తో పెనాల్టీ షూటౌట్లో ఓడించి పతకం గెలుచుకుంది. 2016 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించలేకపోయింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్ అయిన నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. -
గాయత్రి–త్రిషా జంట సంచలనం
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... ఒత్తిడిని దరిచేరనీయకుండా సహజశైలిలో ఆడితే అద్భుతాలు చేయవచ్చని భారత బ్యాడ్మింటన్ టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ నిరూపించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో గాయత్రి–త్రిషా ద్వయం నమ్మశక్యంకానీ రీతిలో ఆడి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో వందేళ్లపైబడిన చరిత్ర కలిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా గాయత్రి–త్రిషా జంట రికార్డు నెలకొల్పింది. బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం అద్భుతం జరిగింది. మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే భారత టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ సంచలనం సృష్టించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంక్ జోడీ గాయత్రి–త్రిషా 14–21, 22–20, 21–15తో ప్రపంచ రెండో ర్యాంక్, రెండో సీడ్ ద్వయం లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఈ క్రమంలో 19 ఏళ్ల కేరళ అమ్మాయి త్రిషా జాలీ, 18 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి గాయత్రి 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్న భారతీయ జంటగా రికార్డు నెలకొల్పింది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం, టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ జంటతో జరిగిన పోరులో గాయత్రి–త్రిషా అద్భుతంగా ఆడారు. తొలిసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడుతున్న గాయత్రి–త్రిషా తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్‌లో 18–20తో ఓటమి అంచుల్లో నిలిచారు. కొరియా జంట మరో పాయింట్ గెలిచిఉంటే గాయత్రి–త్రిషా ఇంటిదారి పట్టేవారే. కానీ అలా జరగలేదు. రెండు పాయింట్లు వెనుకంజలో ఉన్నప్పటికీ గాయత్రి–త్రిషా పట్టువదలకుండా పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచారు. రెండో గేమ్‌ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో గాయత్రి–త్రిషా స్కోరు 8–8తో సమంగా ఉన్న దశలో ఒక్కసారిగా విజృంభించారు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొరియా జోడీ తేరుకునే ప్రయత్నం చేసినా గాయత్రి–త్రిషా తమ దూకుడు కొనసాగించి ప్రత్యర్థి ఆట కట్టించారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 276వ ర్యాంక్ జోడీ జెంగ్ యు–షు జియాన్ జాంగ్ (చైనా)లతో గాయత్రి–త్రిషా ద్వయం తలపడుతుంది. సెమీస్‌లో లక్ష్య సేన్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువతార లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్‌తో తలపడాల్సిన చైనా ప్లేయర్ లూ గ్వాంగ్ జు గాయం కారణంగా వైదొల గడంతో లక్ష్య సేన్‌కు వాకోవర్ లభించింది. ప్రకాశ్ పదుకొనె, పుల్లెల గోపీచంద్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. డిఫెండింగ్ చాంప్ లీ జి జియా (మలేసియా)–మాజీ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) మధ్య మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ జోడీ మార్కస్ గిడియోన్ –కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–24, 17–21తో ఓడింది. తొలి గేమ్‌లో భారత జంటకు ఆరు గేమ్ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది. నిజానికి ఈ టోర్నీలో మాకు ఎంట్రీ లభిస్తుందని ఆశించలేదు. అయితే చివరి నిమిషంలో కొన్ని జోడీలు వైదొలగడంతో రిజర్వ్ జాబితా నుంచి మాతోపాటు వేరే జోడీలకూ ఎంట్రీ లభించింది. ప్రతి మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. క్వార్టర్ ఫైనల్లోని రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడ్డా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఆడి విజయాన్ని అందుకున్నాం. –గాయత్రి తల్లిదండ్రులకు తగ్గ తనయ గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించారు. తల్లి పీవీవీ లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. తల్లిదండ్రులు రాణించిన ఆటలోనే ఇప్పుడు కుమార్తె మెరి సింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి గాయత్రి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. -
ప్రణయ్‌పై గెలుపుతో సెమీఫైనల్లో లక్ష్య సేన్
జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువస్టార్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–16తో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌పై గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 10–21, 21–23తో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో ఓటమి. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ జోడీ 11–21, 21–23తో హి జి టింగ్–హావో డాంగ్ జౌ (చైనా) జంట చేతిలో ఓడింది. -
ముందుంది మరింత మంచికాలం!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తమ జట్టు ప్రదర్శన పట్ల హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) యజమాని వరుణ్ త్రిపురనేని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో నిలకడైన ప్రదర్శనతో హెచ్ఎఫ్సీ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. మున్ముందు తమ జట్టులో స్థానిక క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్న ఆయన... ఓవరాల్‌గా ఐఎస్ఎల్ కూడా ఒక బలమైన బ్రాండ్‌గా మారిందని విశ్లేషించారు. లీగ్‌లో తమ ఆట తదితర అంశాలపై వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్ ఎఫ్‌సీ ప్రదర్శనపై... చాలా బాగుంది. ఇది మాకు మూడో సీజన్. తొలిసారి ఆడినప్పుడు జట్టు చివరి స్థానంలో నిలవడంతో పలు కీలక మార్పులు చేసి భిన్నమైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. ఫలితంగా గత ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరువగా వచ్చాం. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో సెమీస్‌ను లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాం. హైదరాబాదీ ఆటగాడు లేకపోవడంపై... స్థానికంగా ప్రతిభ ఉన్నవారిని తీసుకునేందుకు మేం గట్టిగానే ప్రయత్నిం చాం. హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ టోర్నమెంట్లు కూడా లేకపోవడంతో మేం ఆశించిన స్థాయి ప్రమాణాలు గల ఆటగాళ్లు లభించలేదు. ‘నామ్‌కే వాస్తే’గా టీమ్‌లోకి తీసుకోలేం కదా. చివరకు అభినవ్ అనే కుర్రాడిని గుర్తించగలిగాం. గోల్‌కీపర్‌గా అతను మా రిజర్వ్ జట్టులో భాగంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక పద్ధతి ప్రకారం ఆటగాళ్లను ఐఎస్ఎల్ కోసం తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైరైన విదేశీయులతో ఆడటంపై... అది ఆరంభ సీజన్లలో మాత్రమే జరిగింది. ఇది ఎనిమిదో ఐఎస్ఎల్ సీజన్. ఇప్పుడు ఈ టోర్నీ గురించి బయటి ప్రపంచానికి కూడా బాగా తెలుసు. పలు విదేశీ సంస్థలు మాకు స్పాన్సర్లుగా రావడం అందుకు నిదర్శనం. ప్రతీ సీజన్‌కు లీగ్ బలంగా మారుతోంది. మున్ముందు ఐఎస్ఎల్ స్థాయి పెరగడం ఖాయం. వచ్చే సీజన్ నుంచి లీగ్ మళ్లీ ప్రేక్షకుల మధ్యలో రానుంది కాబట్టి ఐఎస్ఎల్ ఎదుగుదలను మనం స్పష్టంగా చూడవచ్చు. -
సెమీఫైనల్లో ఓడిన సానియా జంట
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–2, 2–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కిచెనోక్ (ఉక్రెయిన్)–ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ చేతిలో ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సానియా–హర్డెస్కా జోడీకి 12,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 33 వేలు) లభించింది. -
విష్ణు–బాలాజీ జంట ఓటమి
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ– 250 టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో విష్ణు వర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ల్యూక్ స్మిత్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తమ సర్వీస్‌ను మూడు సార్లు కోల్పోయింది. నేడు సాదియో –ఫాబియన్ (ఫ్రాన్స్); రోహన్ బోపన్న–రామ్ కుమార్ (భారత్) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో రేపు జరిగే ఫైనల్లో ల్యూక్–జాన్ ప్యాట్రిక్ జంట ఆడుతుంది. సుహానా సైనీకి కాంస్యం ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి సుహానా సైనీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్లో శుక్రవారం జరిగిన అండర్–19 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో సుహానా 11–9, 9–11, 10–12, 11–13తో ప్రపంచ నంబర్‌వన్ ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో ఓడింది. -
రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్‌లో యువ భారత్
కూలిడ్జ్ (అంటిగ్వా): అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో యువ భారత్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో 2020 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 37.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఎడంచేతి వాటం పేస్ బౌలర్ రవి కుమార్ (3/14) స్వింగ్ బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను హడ లెత్తించాడు. స్పిన్నర్ విక్కీ (2/25) కూడా రాణించాడు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అంగ్కృష్ (44; 7 ఫోర్లు), ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (26; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. కెప్టెన్ యశ్ ధుల్ (20 నాటౌట్; 4 ఫోర్లు), కౌశల్ (11 నాటౌట్; 1 సిక్స్) రాణించారు. రవి కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఫిబ్రవరి 1న తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో అఫ్గానిస్తాన్; ఫిబ్రవరి 2న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడ తాయి. ఫైనల్ ఫిబ్రవరి 5న జరుగుతుంది. -
44 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర...
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే పురుషుల సింగిల్స్‌లో తొలిసారి భారత ప్లేయర్ ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా మహిళల సింగిల్స్‌లో 2019లో పీవీ సింధు విశ్వవిజేతగా నిలిచింది. హుఎల్వా (స్పెయిన్): రెండు నెలల క్రితం థామస్ కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ టోర్నీ మ్యాచ్‌లో ఓడిపోయి జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువతార లక్ష్య సేన్... నిలకడలేని ఆటతీరుతో గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి పది గంటలకు మొదలయ్యే సెమీఫైనల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడతారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–7తో ప్రపంచ 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)ను చిత్తు చేయగా... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 67 నిమిషాల్లో 21–15, 15–21, 22–20తో 42వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచాడు. జున్ పెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్ 19–20 వద్ద మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. ఈ స్కోరు వద్ద ఒక్కసారిగా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ ప్రణయ్ కూడా గెలిచి ఉంటే భారత్‌కు మూడో పతకం ఖరారయ్యేది. కానీ క్వార్టర్ ఫైనల్లో కీన్ యియు (సింగపూర్) 21–14, 21–12 తో ప్రణయ్‌ను ఓడించి రెండో సెమీఫైనల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో పోరుకు సిద్ధమయ్యాడు. సింధుకు నిరాశ... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17–21, 13–21తో ఓడిపోయింది. తై జు చేతిలో సింధు ఓడటం ఇది 15వ సారి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారుల సంఖ్య. గతంలో ప్రకాశ్ పదుకొనే (1983లో), సాయిప్రణీత్ (2019లో) కాంస్య పతకాలు నెగ్గారు. ఈసారి లక్ష్య సేన్, శ్రీకాంత్‌లలో ఒకరికి కనీసం రజతం లేదా స్వర్ణం... మరొకరికి కాంస్య పతకం ఖరారు కానుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. మహిళల సింగిల్స్‌లో సింధు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్ రెండు పతకాలు (ఒక కాంస్యం, ఒక రజతం) సాధించారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట ఒక కాంస్యం గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే, సాయిప్రణీత్ ఒక్కో కాంస్యం నెగ్గారు. శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా ఒక్కో పతకం ఖరారు చేశారు.