serials
-
బుల్లితెర అవార్డుల పండుగ.. ఛీఫ్ గెస్ట్ ఎవరంటే?
స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేడుక బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో స్టార్ మా సీరియల్స్‌కు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అందించే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం ఇవాళ బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనుంది.ఈ గ్రాండ్ అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరావు శతజయంతి పురస్కరించుకొని టీవీ నటులు, అక్కినేనిని గుర్తు చేస్తూ చేసిన మెడ్లీ ఈ కార్యక్రమంలో హైలైట్‌గా నిలువనుంది. ఈ వేడుకలో బుల్లితెర నటీనటుల సందడి స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో చూసేయండి. -
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
ఒకప్పుడు అవే వినోదం.. కానీ వీటి రాకతో ఊహించని ఎంటర్టైన్మెంట్..
ఎంటర్టైన్మెంట్.. అరచేతిలో అలరిస్తోంది. నడక.. నడతను మార్చుకున్న కంటెంట్ కనికట్టుతో వీక్షకుడిని కట్టుబానిసను చేస్తోంది! శ్వాస ఆగినా ధ్యాస లేదు.. కానీ కాలక్షేపంలో క్షణం మిస్ అయితే మాత్రం ఆగమాగమే! అంతలా తన సేవనంలో తరించేలా చేస్తున్న ఆ వినోదం తీరుతెన్నుల కబుర్లను అందించాలనే సరదా ప్రయత్నం.. అప్పట్లో నాటకాలు, రేడియోలు మన దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే వినోద పరిశ్రమ మంచి బూమ్‌లో ఉంది. కొన్నేళ్లలోనే అది వంద బిలియన్ డాలర్ల మార్క్‌ను చేరనున్నట్టు అంచనా! అంతా సాంకేతిక మార్పుల చలవ.. అందులో భాగమైన సోషల్ మీడియా పుణ్యం! వన్స్ అపాన్ ఎ టైమ్.. సీన్ రివర్స్‌లో ఉండేది. అంటే అప్పటి ఎంటర్టైన్మెంట్ మీన్స్ అండ్ మోడ్స్ కూడా వేరు కదా! ఏదైనా బహు స్వల్పమే. అది యంత్ర యుగం కాదు కాబట్టి.. చేసేవాళ్లకు చేసుకున్నంత పని! అలసిన మనసు, శరీరాలకు నిద్రే వినోదం.. విలాసం! అక్షరం వచ్చిన వాళ్లకు పుస్తకం కాస్త రిలాక్సేషన్. పనులతో మరీ విసిగిపోయిన సామాన్యులకు మరో కాలక్షేపం.. నాటకాలు! రేడియో.. సినిమాలు వినిపించి.. కనిపించాక అవి ఊహించని వినోదాన్నే పంచాయి. టీవీ అంటే లగ్జరీ.. అయినా ఆ సమయం.. దాకా ఎందుకు కొన్ని దశాబ్దాల కిందటి వరకూ సినిమాకు వెళ్లడం అంటే ఒక వేడుకే! అంతలోనే టెలివిజన్ ఎంటర్ అయింది. ఒకే ఒక ప్రసార చానల్ దూరదర్శన్గా! ఆ సీన్‌ని రూల్ చేసింది. సినిమాలను మించిన సీరియల్స్‌ని క్రియేట్ చేసింది. కామన్ మన్ కాలాన్ని కాస్త లాక్కుంది. అప్పటికీ రేడియోల ప్రాబల్యమేమీ తగ్గలేదు. అయితే రేడియో సామాన్యుల ఎంటర్టైన్మెంట్గా ఉన్న రోజుల్లో టీవీ కాస్త లగ్జరీనే. వార్తలు, ఇతర వినోదానికి ప్రధాన మాధ్యమం ఆ శ్రవణ యంత్రమే! ఇంట్లో పనంతా అయిపోయాక ఇంటిల్లిపాది రేడియో చుట్టూ చేరి కార్యక్రమాలు విన్న దృశ్యాలకు ప్రతి చూరూ సాక్ష్యమే! ఈ వరుసలో టేప్రికార్డర్లు.. క్యాసెట్స్‌ను మరవొద్దు. టేప్ రికార్డర్.. దీన్నెలా మర్చిపోగలం రేడియోలో కోరిన పాటల టైమ్ బ్యాండ్‌ను వెదకడం కన్నా నచ్చిన పాటల క్యాసెట్స్‌ను.. లేదా రికార్డ్ చేయించుకున్న క్యాసెట్స్‌ను తెచ్చుకుని నచ్చినన్నిసార్లు వినడమే అసలైన వినోదంగా భావించిన శ్రోతలు ఎంతోమంది! పాటలేనా..నచ్చిన సినిమాలు.. నాటకాలనూ (కచ్చితంగా.. రేడియో కూడా ఆ పని చేసింది.. కానీ టైమ్ బౌండ్‌తో) వినిపించింది. మనలోని సృజననూ కదిలించింది టేప్ రికార్డర్. ఏకాపాత్రాభినయాల డైలాగ్స్.. పాటలు.. కవితలు.. ఇంట్లో ముచ్చట్లనూ రికార్డ్ చేసుకుని మనకు మనమే విని ఆనందించుకునేలా! అంతేకాదు.. ఎస్టీడీ.. ఐఎస్డీ ఫోన్ సౌకర్యాలు లేని ఊళ్లల్లో.. వాటి ఖర్చును భరించలేని ఇళ్లల్లో.. టేప్‌రికార్డర్ క్యాసెట్స్ రూపంలో ఉత్తరాల బట్వాడా బాధ్యతనూ నిర్వహించింది. టీవీ సీరియల్స్.. రియాలిటీ షోస్ జాబుల్లో రాయాలనుకున్న విషయాలను.. విశేషాలను క్యాసెట్లో రికార్డ్ చేసి అందాల్సిన చిరునామాకు చేరవేసింది. లేఖల్లోని అక్షరాల్లో పట్టుకోలేని భావోద్వేగాలను ఈ క్యాసెట్స్లోని మాటలతో ఆస్వాదించిన ఆత్మీయులు అనేకులు! అందుకే అది ఆప్యాయతానురాగాల వినోదంగా విరాజిల్లింది. మళ్లీ టీవీ దగ్గరకు వద్దాం. ప్రైవేట్ చానళ్లకంటే ముందు.. వీసీపీలు.. వీసీఆర్‌లు తమ ఘనతను చాటాయి. ప్రైవేట్ చానళ్ల ఆగమనం తర్వాత 24 గంటలు వార్తలే కాదు.. ట్వంటీఫోర్ అవర్స్ ఎంటర్టైన్మెంటూ షురూ అయింది. డైలీ సోప్స్ మజా.. రియాలిటీ షోస్ రొదను ఆస్వాదించడం మొదలైంది. రేటింగ్ కోసం పరిమితి గీత కూడా కొంచెం తగ్గడం మొదలైంది. పగ-ప్రతీకారాలతో సీరియల్స్ క్రైమ్ ఎలిమెంట్ ఇన్క్లూడ్ అయింది. డైలీ సోప్స్.. కుటుంబ గాథల్లోని బంధాలు.. అనుబంధాలూ పగ–ప్రతీకారాల చుట్టే అల్లుకోవడం అవసరం అని భావించాయి. ఇందులో అన్ని చానళ్ల మధ్య పోటీ పరాకాష్ఠకు చేరింది. ఇంతలోకే డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) ఇళ్ల తలుపులు తట్టింది. అప్పటిదాకా లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ మొనోపలీలో మగ్గిన ప్రేక్షకులకు ఒక వినోదాత్మక వరం. చానళ్లను ఎంపిక చేసుకునే వీలు కల్పించింది. వీక్షకుల ముందుకు ఆప్షన్స్‌ను తెచ్చింది. అయినా.. అవేవీ నియో ఎంటర్టైన్మెంట్ మీడియా చూపిస్తున్నంత ప్రభావాన్ని చూపించలేదు. జీవితాలను మార్చలేదు. కొత్త మీడియా.. సంప్రదాయ వినోద మాధ్యమాల శ్రోతలు, ప్రేక్షకులు, వీక్షకుల పగ్గాలను తెంచేసింది. ఇందులో ప్రధాన పాత్ర టెక్నాలజీ. దాని విప్లవాత్మక మార్పే కదా వినోదానికున్న అర్థం విస్తృతమవడానికి కారణమైంది! బింజ్ వాచింగ్ ఎరా.. ఇదివరకైతే వారం వారం సినిమాలు విడుదలైనట్టే టీవీ సీరియళ్లూ వచ్చేవి. ప్రైవేట్ చానళ్లు డైలీ సోప్స్‌ను వెంటబెట్టుకొచ్చాయి. ఇంటర్నెట్.. ఓటీటీ (ఓవర్ ద టాప్)కి జన్మనిచ్చాక అది డజన్ల కొద్దీ ఎపిసోడ్స్‌తో ఒక సిరీస్‌ను స్ట్రీమ్ చేస్తోంది. అలాంటివి కొన్ని సీజన్లై కొనసాగుతున్నాయి. బింజ్ వాచ్.. ఏకబిగిన చూసే చాన్స్నిస్తున్నాయి. వాటికి విదేశీ సిరీస్ ‘గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ నుంచి దేశీ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’ దాకా ఎన్నో వాచింగ్ ఎగ్జాంపుల్స్! ఇలాంటి స్ట్రీమింగ్ జాబితాలో యూట్యూబ్ సెన్సేషన్స్ టీవీఎఫ్, ఏఐబీ వంటి చానళ్లూ ఉన్నాయి. అందుకే దీన్ని బింజ్ వాచింగ్ ఎరా అంటున్నారు. ఒకరకంగా ఇది జీవనశైలిలో భాగమైపోయింది. టెక్నాలజీ ఏలుతోంది అదీగాక వినోదం ఇప్పుడు ఒక్క టీవీకే పరిమితమై లేదు. లాప్టాప్స్.. టాబ్లెట్స్.. మొబైల్ ఫోన్స్ ఎట్సెట్రా డివైసెస్కీ చేరింది. ఇంటర్నెట్ బేస్‌గా మారి ఓటీటీ మొదలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌గా యూట్యూబ్.. ఫేస్బుక్.. ట్విటర్.. వాట్సాప్.. ఇన్స్టాగ్రామ్.. టిక్‌టాక్ (మన దగ్గర బ్యాన్ అయినప్పటికీ) వంటి ఎన్నో యాప్స్ ద్వారా వినోద కడలినే సృష్టించింది టెక్నాలజీ. తోడుకున్న వాళ్లకు తోడుకున్నంత! కాలక్షేపం కాదు కాలమే తెలియకుండా చేస్తోంది. ఎంటర్టైన్మెంట్ను ఏలుతోంది. సమకాలీన దేశీ ప్రేక్షకుల, వీక్షకుల వినోద అభిరుచిని మారుస్తోంది. సినిమా క్రేజే వేరప్పా! ఇంట్లోంచి కాలు బయటపెట్టనివ్వకుండా కూర్చున్నచోటే రంజింపచేసే వినోదాన్ని ఒక్క టచ్లోనో...స్వైప్లోనో దాచుకున్న లాప్టాప్.. టాబ్.. మొబైల్స్ ఎన్ని వచ్చినా సినిమా టాకీస్ కళను కోల్పోలేదు. ఇప్పటికీ సినిమాకు వెళ్లడం ఒక వేడుకే. ఇంకా చెప్పాలంటే మల్టీప్లెక్స్‌లో వాచింగ్ మూవీ అనేది మచ్ మోర్ ఫన్! ట్రాన్స్‌పోర్టేషన్, ట్రాఫిక్ నుంచి టికెట్స్, పాప్‌కార్న్ వరకు ప్రహసనం ప్లస్ ఖరీదైన వ్యవహారంగా అయినా.. టాకీస్‌లో సినిమా చూడ్డం సంబరమే! అంతేకాదు ఓటీటీ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తున్నా.. రిలీజ్ అయ్యే కొత్త సినిమా అంతే ఉత్సాహంగా ప్రేక్షకుడిని ఊరిస్తూనే ఉంది. కారణం.. నియో మీడియా క్రియేట్ చేస్తున్న కంటెంట్‌కి ప్రధాన ఆధారం సినిమానే! కొత్త వినోద మాధ్యమం సినిమాకు ప్రత్యామ్నాయం కాదనే అనిపిస్తోంది. అసలు గమనించాల్సిన సీన్.. అసలు గమనించాల్సిన సీన్ ఏంటంటే కంటెంట్! అదేంటీ సినిమా నుంచే ఎక్కువగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు.. మరి మళ్లీ కంటెంట్ గురించిన మాటేంటీ? అంటే.. నిజమే! రీల్స్.. షార్ట్స్ వంటివాటికి చాలా వరకు సినిమా డైలాగ్స్.. పాటలు.. పేరడీ సీన్సే ముడి సరుకునూ.. మెయిన్ సరుకునూ అందిస్తున్నా.. ఒరిజినల్ కంటెంట్ కూడా ఫ్లో అవుతుంది కదా! దాని గురించే.. అదే మర్యాద గురించి! ఎంచుకునే అంశం.. వాడే భాష.. క్రియేట్ చేసే తీరు.. ఒక్కటేమిటి అన్నిటికీ సంబంధించిన మర్యాద! ముందు కంటెంట్ విషయానికి వస్తే.. ఓటీటీ ఒరిజినల్ కంటెంట్ నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యాప్స్ వరకు అన్నింటి ఒరిజినల్ కంటెంట్ క్రైమ్ అండ్ సెక్స్ చుట్టే తిరుగుతోంది. డబుల్ మీనింగ్ డైలాగులు.. సాహిత్యం.. సంప్రదాయ మాధ్యమాలు కాలక్షేపంగా ఉన్న తరంలోని వినోదమంతా మర్యాద మడికే ముడిపడి ఉందా? అంటే.. ప్చ్.. అని పెదవి విరవాల్సిందే! శృంగారం.. నేరాలు.. ఘోరాలు.. డబుల్ మీనింగ్ పాటలు.. డైలాగులతో సినిమాలు జనాల్లోకి వచ్చినా.. అవేవీ లేని మిగిలిన కేటగిరీకి సంబంధించినవీ బోలెడు ఉండేవి. ఎంచుకోవడానికి చాయిస్ ఉండేది. ఇప్పుడు ఆ చాయిస్ పరిధి కుదించుకుపోయింది. వాడుతున్న భాషనూ లెక్కలోకి తీసుకోవాలి. మంచి, చెడులు.. మర్యాదమన్ననలు మనిషి దృక్కోణానికి సంబంధించినవే అయినా.. నాగరిక సమాజం వాటి మధ్య స్పష్టమైన గీతనే గీసింది. చదువు.. అనుభవాల జ్ఞానంతో పరిణతి చెందుతూ కొన్నిటిని అమర్యాదగా భావించి డిలీట్ చేశాం.. చేస్తున్నాం! సభ్యత లైన్ చెరిపేశారు అలాంటివిప్పుడు రీసైక్లింగ్ బిన్లోంచి వచ్చి మాటలుగా మారి.. ఎకో ఎఫెక్ట్స్‌లో వినబడుతున్నాయి. విరగబడి వైరల్ అవుతున్నాయి. ఆ వైరాలిటీ కోసం పోటీ పెరిగిపోతోంది. స్త్రీలను కించపరచే తిట్ల నుంచి భర్త భార్యను.. భార్య భర్తను.. తల్లిదండ్రులను పిల్లలు.. పిల్లలను పెద్దలు.. స్నేహితులు.. ఆడను మగ.. మగను ఆడ.. అంతా కలసి ఎల్జీబీటీక్యూఏప్లస్ను గేలి చేయడం∙వరకు.. కాలక్షేప కంటెంట్ అంతా సభ్యత లైన్‌ను చెరిపేసుకుంది. డబుల్ మీనింగ్ పాటలకు మ్యాచ్ అయ్యే అభినయంతో ఉన్న డాన్స్‌ను పిల్లలతో చేయించి తీసిన వీడియోలు రీల్స్‌గా ఇన్‌స్టా తెరిస్తే చాలు కాళ్ల మీద పడుతున్నాయి. ఇవి శాంపుల్స్ మాత్రమే. కామెడీ అద్దిన ట్రోలింగ్స్కైతే లెక్కేలేదు. ఫేక్ కంటెంట్ కూడా.. చాటు అనే మాటకు చోటే లేదు. విరహం.. శృంగారాలూ రీల్స్ అండ్ షాట్స్‌కి కంటెంటే! ఓటీటీ కంటెంట్కైతే బూతులు.. క్రైమ్.. సెక్సే ప్రధానంశాలు! ఫేక్ కంటెంట్‌కీ సోషల్ మీడియా మెయిన్ ప్లాట్‌ఫామ్ అయింది. మార్పు సహజం. దానికి వినోదం మినహాయింపు కాదు. అయితే ఆయా కాలాల్లో వచ్చిన కంటెంట్ పాపులర్ అవడం .. ఆయా కాలాలనాటి ప్రేక్షకుల.. వీక్షకుల అభిరుచి, సమ్మతిపై ఆధారపడి ఉంటుంది. అందులో ఆయా కాలాల్లో ఉన్న సాంకేతిక లభ్యత కూడా ఒక కారణం అవుతుంది. అందరినీ అలరించే కామెడీ అలా ఇప్పుడు ‘పచ్చి’ అనేదే వినోదం అయింది. అది కల్చర్‌గా మారే ప్రమాదమూ కనిపిస్తోంది. ఆ వినోదానికే టైమ్‌తో ఊడిగం చేస్తున్నాం. ఓటీటీ.. సోషల్ మీడియా అంతా ఇంతే అనే నెగెటివిటీ ఏం నింపట్లేదు! అద్భుతమైన క్రియేటివిటీ కూడా కళ్లబడుతోంది. అది చిన్నాపెద్దను అలరిస్తోంది. కామెడీ అయితే హాయిగా నవ్విస్తోంది. సీరియస్ అయితే తప్పకుండా ఆలోచింపచేస్తోంది. సమాజంలో అవహేళనకు గురైన సమూహాల పట్ల సున్నితంగా మెదిలే తత్వాన్నీ అలవరుస్తోంది. సమానత్వాన్ని కాపాడే ప్రయత్నమూ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా సెలబ్రిటీలు ఆ వుడ్.. ఈ వుడ్.. అనే తేడా లేకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఫొటోలు.. పోస్ట్‌లతో కొందరు.. రీల్స్‌తో ఇంకొందరు.. సినిమా ప్రమోషన్స్‌తో అందరూ! దేశీ నటీనటుల విషయానికి వస్తే రవీనా టండన్, విద్యాబాలన్, జెనీలియా – రితేశ్ దేశ్‌ముఖ్ దంపతులు, జానీ లీవర్.. ఆయన పిల్లలు జెస్సీ లీవర్, జెమీ లీవర్, హిమానీ శివపురి అండ్ మెనీ మోర్.. రీల్స్‌తో ఎంటర్టైన్ చేస్తున్నారు. స్ట్రీమ్‌లో ఉండడానికి సినిమాలు, సిరీస్‌లే అక్కర్లేదు రీల్స్, షార్ట్స్ అయినా సరే అన్నట్లుగా! ► నిత్యనూతనంగా కనపడుతున్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ 2026 కల్లా మొత్తం 2.9 ట్రిలియన్ (2లక్షల 90 వేల కోట్లు) అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించనుందని అంచనా! ► కరోనా టైమ్‌లో ప్రపంచంలోని మిగిలిన వ్యాపారాలు ఎలా ఉన్నా వినోద పరిశ్రమ మాత్రం లాభాల్లోనే గడిపింది. ముఖ్యంగా ఓటీటీ, వీఓడీ (వీడియో ఆన్ డిమాండ్), ఇతర సబ్స్క్రిప్షన్ ఆధారిత స్ట్రీమింగ్ సేవలన్నీ ప్రాఫిట్స్‌ని షేర్ చేసుకున్నాయి. ► మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని పునర్నిర్వచిస్తే.. సోషల్ మీడియా ముందు వరుసలో ఉంటుంది. జనాలను విపరీతంగా ఎంగేజ్ చేస్తోంది. సంగీతం, టెలివిజన్, ప్రచురణ రంగాల మీద దీని ప్రభావం నానాటికీ పెరుగుతోంది. అంతేకాదు సోషల్ మీడియా నెమ్మదిగా కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఇంటరాక్టివ్ టూల్స్‌గా మారుతోంది. కంటెంట్‌ను.. సమాచారాన్ని పంచుతూ! అనవసర మైందేదీ లేదు.. వినోదానికి అన్నీ అవసరమే అన్న ఫిలాసఫీతో సాగిపోతున్నట్టుంది సోషల్ మీడియా! అందుకే క్రియేటివిటీకే కాదు.. స్పిరుచ్యువాలిటీ.. ఫ్యాషన్.. హెల్త్.. ఫిట్నెస్.. కుకింగ్.. ఇంటీరియర్.. డ్రెస్ డిజైనింగ్.. మొదలు ఆ లిస్ట్‌లో లేనిది లేదు. అన్నిటికీ ప్రమోషన్ అండ్ బిజినెస్ సెంటర్గానూ యూజ్ అవుతోంది! అంటే ఇటు కంటెంట్‌కి.. అటు మార్కెటింగ్‌కి ఫెసిలిటేటర్‌గా ఉంటోందన్నమాట. సోషల్ మీడియా శక్తిని, ప్రభావాన్ని వాడుకోవడంలో స్ట్రీమింగ్ సర్వీసెస్ కూడా ముందంజలోనే ఉన్నాయి. సోషల్ మీడియా కీలకాంశాలలో వైరల్ ఎఫెక్ట్ ఒకటి. నేటి మార్కెట్లో దీని పాత్ర ఎనలేనిది. మీడియా, ఎంటర్టైన్మెంట్లో వైరల్ అయ్యేదంతా సోషల్ మీడియా డ్రైవ్ చేస్తున్నదే. బుక్‌టాక్ చాలెంజ్ సంగీతం, ప్రచురణల మీదా సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోందనడానికి చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. వాటిలో # బుక్‌టాక్ చాలెంజ్ ఒకటి. అమెరికాలోని ఒక బుక్ ఔట్లెట్ టిక్‌టాక్‌తో ఒప్పందం చేసుకుని మొన్నటి వేసవి (2022)లో #బుక్‌టాక్ చాలెంజ్ పేరుతో ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీనివల్ల అంతకుముందెన్నడూ ఆ బుక్ ఔట్లెట్ కనీవినీ ఎరుగని రీతిలో పుస్తకాలు అమ్ముడుపోయాయట. అది గ్రహించిన చాలా పుస్తకాలయాలు తమ స్టోర్స్‌లో.. ఆన్లైన్లో #బుక్‌టాక్ లేదా బుక్‌టాక్ కలెక్షన్స్ అని డిస్ప్లే పెట్టి మరీ పుస్తకాలను అమ్ముతున్నాయి. దీన్నిబట్టి టిక్‌టాక్ పబ్లిసిటీ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. 33 ట్రిలియన్ డాలర్లకు పెరగనున్న ఆదాయం 2020లో బ్యాంక్ ఆఫ్ అమెరికా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. 2030కల్లా జెన్ జెడ్ ఆదాయం 33 ట్రిలియన్ అమెరికా డాలర్లకు పెరుగుతుందట. అందుకే మార్కెట్లో కొనుగోలుదారులుగా వీళ్లకు ప్రత్యేకత ఉండబోతోంది. ఆ కొనుగోలు శక్తితో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు వచ్చే వీలూ ఉంది. ఒక మార్కెట్ సర్వే ప్రకారం జెన్ జెడ్ రోజులో సగటున 7.2 గంటల పాటు వీడియో కంటెంట్‌ను వీక్షిస్తోంది. ఈ తరంలోని అత్యధికులు రాజకీయ, సాంఘిక విషయాల పట్ల ప్రగతిశీల ఆలోచనలు, అభిప్రాయాలతో ఉన్నవారే. భవిష్యత్‌లో రూపురేఖలే మార్చేయొచ్చు క్లైమేట్ చేంజ్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో పాత తరం కంటే శ్రద్ధ.. నిబద్ధతతో ఉంటున్నారు. అందుకే పలు అంతర్జాతీయ కంపెనీలు ఈ తరంలోని ఆ లక్షణాల ఆసరాతో వాళ్లకు తగినట్లుగా తమ వ్యాపారాన్ని దిద్దుకుంటున్నాయట. కొత్త కొనుగోలుదారులుగా వాళ్లకు ఎనలేని ప్రాధాన్యాన్నిస్తున్నాయి. ఈ లెక్కన పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావం, జెన్ జెడ్ కొనుగోలు శక్తి .. ఈ రెండూ భవిష్యత్‌లో మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల రూపురేఖలనే మార్చేయొచ్చంటున్నారు నిపుణులు. అన్నింటినీ ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా ఏ సిరీస్‌ను ఏకబిగిన చూస్తున్నాం.. ఎలాంటి సినిమాలను కోరుకుంటున్నాం.. ఏ పుస్తకాలను చదువుతున్నాం.. ఎటువంటి సంగీతాన్ని వింటున్నాం.. మన ఆలోచనలు.. అభిరుచులు.. ప్రవర్తన.. నిర్ణయాత్మక శక్తి.. అన్నిటినీ సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. అంతేకాదు కన్జూమర్స్ ఫీడ్‌బ్యాక్‌ను.. ఆ ఫీడ్‌బ్యాక్‌కి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ స్పందననూ సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. అయితే షోలు.. సినిమాలు.. పుస్తకాలు.. పాటలు పాపులర్ అవడంలో కంటెంట్ క్రియేటర్స్దే ప్రధాన పాత్ర. మనం చూస్తున్న తాజా కంటెంట్లోంచే ట్రెండ్‌ని క్రియేట్ చేస్తారు. వాటి మీదే వీక్షకులు తమ అభిప్రాయాలను.. సిఫారసులను.. సమీక్షలను వెలిబుచ్చుతున్నారు. ఫోన్ యాప్స్ మీదే ఆధారం మన దేశంలో 82 శాతం సమయాన్ని మొబైల్ ఫోన్ యాప్స్‌లోని వినోదం మీదే వెచ్చిస్తున్నారట. 2025 కల్లా మన మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ 34.62 (దాదాపు రూ. 2,863.10 కోట్లు) బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరనుందని పలు అధ్యయనాల సారాంశం. ఆ వినోదంలో లైవ్ ఈవెంట్స్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఆన్లైన్ గేమింగ్ ముందు వరుసలో ప్లే అవనున్నాయి. ఎట్ ది ఎండ్ .. హద్దు ఆకాశం దాకే కాదు.. అధఃపాతాళానికీ చేరుతుంది. నియో ఎంటర్టైన్మెంట్ మీడియాకి నియంత్రణ చట్టం లేకపోవచ్చు. వినోదం పండిస్తున్న లాభాలు దాన్ని అడ్డుకోవచ్చు. కానీ సృజనకు ఓ గుణం ఉంటుంది.. విచక్షణ! వినోదం చుట్టూ నేమ్.. ఫేమ్.. పాపులారిటీ.. పబ్లిసిటీ 360 డిగ్రీల్లో తిరుగుతుంటే మనిషి మైమరచిపోవచ్చు. కాని మనిషిని నడిపించే విచక్షణ మాత్రం ఉనికి కోల్పోవద్దు! చదవండి: మంచు విష్ణుకు నా కృతజ్ఞతలు: అల్లు అర్జున్ -
సీరియల్స్, సినిమాల్లో నటించాలనే కోరిక.. ఫ్రెండ్ ఇంట్లో పూజ ఉందని చెప్పి..
సాక్షి, హైదరాబాద్: బాలిక మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే మధురానగర్ పోలీసులు పరిష్కరించారు. వివరాలివీ... రహమత్‌నగర్‌లో నివాసం ఉండే డి.సంతోషి కుమార్తె బుధవారం ఉదయం స్నేహితురాలు ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్లింది. గురువారం వరకు కూడా తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గురువారం రాత్రి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ అయినందున పోలీసులు బాలికను కనిపెట్టే విషయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఫోన్ ఆధారంగా యాదాద్రిలో ఉన్నట్టు గుర్తించారు. శుక్రవారం ఉదయం ఆ బాలిక యాదాద్రిలో తనకు తెలిసిన లక్ష్మీ అనే మహిళతో కలిసి తిరుగుతుండగా ఎస్ఐ నరేందర్, సిబ్బంది వెళ్లి పట్టుకున్నారు. బాలికను విచారించగా సీరియల్స్, సినిమాలలో నటించాలని కోరిక ఉందని, అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్‌లో కూడా నటించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో లక్ష్మీ అనే మహిళ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పడంతో యాదాద్రికి వచ్చినట్టు పోలీసులకు తెలిపింది. పోలీసులు బాలికను మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. -
హీరోయిన్‌తో ఎఫైర్ అంటగట్టి, బయటకు పంపించారు : నటుడు
సాధారణంగా సీరియల్స్‌లో కష్టపడి ఫేమ్ తెచ్చుకున్నాక సినిమాల్లో నటిస్తుంటారు. కానీ నటుడు సమీర్ విషయంలో మాత్రం సీరియల్స్ నుండి ఉన్నపలంగా తొలగించడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా పలు గుర్తిండిపోయే పాత్రలు చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానెల్లో వరుస సీరియల్స్‌లో నటించిన సమీర్ ఆ తర్వాత అదే ఛానెల్ నుంచి బయటకు పంపిచేయడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇష్యూపై స్పందించాడు. నా మొగుడు నాకు సొంతం సీరియల్ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నానని, సెట్లోనే రాసలీలలు అంటూ కొందరు నాపై ప్రచారం చేశారు. దీంతో సదరు యాజమాన్యం అసలు ఏం జరిగిందో కూడా కనుక్కోకుండా నన్ను అర్థాంతరంగా సీరియల్ నుంచి తప్పించారు. నాకు రావాల్సిన చెక్కులు కూడా ఆపేశారు. దీంతో అద్దెలు కట్టుకోలేక, ఈఐఎంలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ తర్వాత కొన్నాళ్లకు అసలు విషయం తెలిసి ఆయనే ఫోన్ చేసి సారీ చెప్పారు. కానీ అప్పటికే నా మనసు విరిగిపోయింది. అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు సమీర్. -
టాప్ రేటింగ్‌లో ‘రామాయణం’
న్యూఢిల్లీ: 33 ఏళ్ల కిందట దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం, మహాభారతం సీరియళ్లు టెలివిజన్ చరిత్రలో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియళ్లు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో మరోసారి బుల్లితెరపై కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం ప్రస్తుతం దంగల్ అనే ఛానల్లో ప్రసారమవుతోంది. తాజాగా బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన నివేదిక ప్రకారం టెలివిజన్‌లో ఎక్కువ మంది తిలకించే కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. (స్టార్ మాలో రామాయణం) ఆగస్టు 1 నుంచి 31 వరకు భారతీయ ప్రేక్షకులు టీవీల్లో ఏయే కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించారనే దానిపై బార్క్ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ఆధారంగా టీఆర్పీల పరంగా రామాయణం ఇప్పటికీ టాప్ రేటింగ్‌లో దూసుకుపోతుందని పేర్కొంది. జీ టీవీలో వస్తున్న శ్రద్ధా ఆర్య, ధీరజ్ ధూపర్ నటించిన కుండలి భాగ్య సీరియల్ రెండో స్థానంలో ఉంది. అలాగే మహిమా శానిదేవ్ కీ మూడవ స్థానంలో కొనసాగుతంది. దూరదర్శలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానం, స్టార్ ప్లస్‌లో ప్లే అవుతున్న అనుపమా అయిదో స్థానం దక్కించుకున్నాయి. (‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’) బార్క్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తితో సతమతమవుతున్న జనాలు కాస్తా వినోదం కోరుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో ప్రేక్షకులు కామెడీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ది కపిల్ షో, తారక్ మెహతా కా ఓల్తా చాష్మా వంటి కామెడీ కార్యక్రమాలతో మరోసారి నవ్వుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
‘నా కొడుకును హత్తుకోలేకపోతున్నాను’
కరోనా నేపథ్యంలో రెండు, మూడు నెలలుగా సినిమా, సీరియల్స్ షూటింగులకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. గత నెల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతిచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక, నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే షూటింగుల్లో పాల్గొంటున్న నటీనటులు కుటుంబ సభ్యులకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నటి రూపాలి గంగూలీ దీనిపై స్పందిస్తూ.. ‘షూటింగ్ నుంచి వచ్చాక నా కొడుకు రుద్రాన్ష్‌ను హత్తుకోవడం లేదు. ముద్దు పెట్టుకోవడం లేదు. తనకు వీలైనంత దూరంగా ఉంటున్నాను. చాలా బాధగా అనిపిస్తుంది. ఓ రోజు నా కొడుకు ‘అమ్మా.. నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఇంకో ఆరు నెలలు ఆగాలా’ అని అడిగాడు. అది విని నా గుండె బద్దలయ్యింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం నేను దూరంగా ఉన్నందుకు నా కుమారుడు బాధపడతాడేమో కానీ భవిష్యత్తులో నా నటన చూసి చాలా గర్వపడతాడు’ అని తెలిపారు. (ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్) రూపాలి గంగూలీ ప్రస్తుతం స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతున్న ‘అనుపమా’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ఇది ప్రసారం అవుతోంది. రూపాలి చివరిసారిగా సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ వెబ్‌సిరీస్‌లో నటించారు. గత ఏడేళ్లుగా రూపాలి టెలివిజన్‌కు దూరంగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘ఓ అద్భుతమైన పాత్రతో, గొప్ప ప్రదర్శనతో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కాస్తా భయంగా ఉంటుంది. కానీ చాలా మంది ఆశీర్వాదాలు పొందిన వారు మాత్రమే ఇలా తిరిగి రాగలరు. ఇది భయపెడుతుంది. మీపై పెద్ద బాధ్యత ఉన్నట్లు గుర్తు చేస్తుంది’ అన్నారు. -
‘టీవీ షూటింగ్స్‌కు అనుమతివ్వండి’
సాక్షి, హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని, వారిని ఎంటర్టైన్ చేసేందుకు టీవీ షూటింగులకు అనుమతులు ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పలు చానళ్ల ప్రతినిధులు కోరారు. శనివారం స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే,సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రసాద్‌లు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. టీవీ షూటింగులకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్‌లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చదవండి : ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ -
ఆఫీస్ బాయ్ నుంచి ఆర్టిస్టుగా..
ఊట్కూర్ (మక్తల్): నాటకాలపై చిన్ననాటి నుంచే మక్కువ ఉండడంతోపాటు.. డ్యాన్స్, పాటలు, డైలాగ్‌లు చెప్పడంలో ప్రతిభ కనబరుస్తుండేవాడు నాని. ఆ కళలనే నమ్ముకొని ఎలాగైనా టీవీ, సినిమా రంగాల్లో ప్రతిభ కనబర్చాలని పొట్టుచేత పట్టుకొని హైదరాబాద్ వెళ్లాడు. పట్టుదలగా ప్రయత్నించి.. ప్రస్తుతం పలు సీరియళ్లు, సినిమాలలో నటిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. తండ్రి మరణంతో బతుకుదెరువు కోసం.. ఊట్కూర్ మండలంలోని కొల్లూర్ గ్రామ పంచాయతీలో కారోబార్‌గా పనిచేస్తున్న ఏసప్ప, కమలమ్మ కుమారుడు తిమోతి (నాని). గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఊట్కూర్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేశాడు. తండ్రి మృతి చెందడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో వదిలి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే ఓ కాఫీ హౌస్‌లో పనిచేస్తుండగా సీనిమా ఇండ్రస్ట్రీలో పనిచేస్తున్న సంజీవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు నటన అంటే ఇష్టమని, పాఠశాలలో వార్సికోత్సవాల్లో చిన్న, చిన్న నాటకాలు వేసేవాడినని తనకు సినిమా ఇండ్రస్టీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరడంతో ఆఫిస్ బాయ్‌గా నియమించాడు. ఆఫీస్ బాయ్ నుంచి ఆర్టిస్టుగా.. కుటుంబ భారాన్ని మోసేందుకు కాఫీ షాపులో పనిచేస్తూనే.. మరో వైపు తనకు బాగా ఇష్టమైన నాటకాలు, డ్యాన్స్, డైలాగ్‌లు చెప్పడంపై నాని మరింత నైపుణ్యం పొందాడు. కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరక్టర్లు పరిచయం కావడంతో వారి సహకారంలో సినిమాల్లో, సీరియళ్లలో చిన్న, చిన్న ప్రాతలు వేస్తూ ప్రతిభ కనబరుస్తున్నాడు. సినీ హీరోలు నరేశ్, రాజ్‌తరుణ్, కమేడియన్ రఘుబాబు, పాసాని కృష్ణమురళి తదితరులతో కలిసి పాత్రలు వేశాడు. జెమిని, జీ తెలుగు, మా టీవీలలో సీరియళ్లలో నటిస్తున్నాడు. పల్లెటూరి యువకుడు.. సినిమాల్లో, టీవీ సీరియల్లలో నటించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నటిస్తున్న సీరియళ్లు ఇవే.. జెమిని టీవీలో మధుమాసం, రెండు రెండ్ల ఆరు, అభిలాశ, జీ టీవీలో బంగారు గాజులు, రాధమ్మ కూతురు, గుండమ్మ కథ, మా టీవీలో వదినమ్మ, లక్ష్మికళ్యాణం, కృష్ణవేణి సీరియళ్లలో నటిస్తున్నాడు. తమ గ్రామ యువకుడు టీవీ సీరియళ్లలో ప్రతిభ కనబర్చడంపై నానిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
పక్కింటి కుర్రాడు
రియల్నేమ్ కన్నా రీల్నేమ్ ఆదిత్యగానే సీరియల్ ప్రేక్షకులకు పరిచయం. రక్తసంబంధం కుర్రాడు అనో, దుర్గమ్మ కొడుకు అనో చెప్పుకుంటూ ఉంటారు. ‘చూసి కూడా పలకరించకుండా వెళ్లిపోతున్నావేం’ అని నిష్టూరమాడుతుంటారు. పక్కింటి కుర్రాడు అనిపించేంటంత ఆప్యాయతను చూపేలా తన నటన ద్వారా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు సిద్ధార్థ. ‘రెండేళ్లు అవుతోంది జీ తెలుగులో వచ్చే రక్తసంబంధం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువై’ అంటూ ఆనందంగా తన వివరాలను పంచుకున్నాడు సిద్ధార్ధ. అనుకోని ప్రయత్నం ‘పుట్టి పెరిగింది వైజాగ్ దగ్గర రాజవొమ్మంగి అనే ఊరు. నాన్న కుమార్ రాజు, అమ్మ సత్యాదేవి. ఇద్దరూ ఇప్పటికీ అన్ని విషయాల్లోనూ నాకు అండగా నిలుస్తారు. డిగ్రీ పూర్తయ్యాక ఎమ్సీయే చేద్దామనుకునే సమయంలో విజయనగరంలో సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. అలా ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. 3 జీ లవ్, నేను నా ఫ్రెండ్, దాగుడుమూతా దండాకోర్.. ఇలా సినిమాలో నటిస్తూ ఉన్నాను. అప్పుడే సీరియల్స్ నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. స్వాతిచినుకులు, ప్రతిఘటన, ఓకే జాను, మట్టిగాజులు .. ఇలా సీరియల్స్ చేస్తూ వచ్చాను. ఈ పరిశ్రమకు వచ్చి ఆరేళ్లు అవుతోంది. 2018 జీ కుటుంబం అవార్డులో ఉత్తమ కొడుకు అవార్డు, 2019లో బెస్ట్ హీరో అవార్డులు అందుకున్నాను. నా వర్క్‌కి పూర్తి న్యాయం చేయగలుగుతున్నానని ఆనందంగా ఉంది. బెటర్‌హాఫ్ నా భార్య విష్ణుప్రియ. తను కూడా సీరియల్స్‌లో నటిస్తుంది. విష్ణు ప్రియ, నేను చిన్ననాటి నుంచి స్నేహితులం. సినిమాల్లోనూ ఇద్దరం కలిసి చేశాం. మా ఇరువైపుల కుటుంబాలలో మా ప్రేమకు ఎవరూ అడ్డు చెప్పలేదు. దీంతో ఇద్దరం ఒకింటివారమయ్యాం. నా బెస్ట్ క్రిటిక్ తనే. అందరూ బాగా చేశారని చెప్పినా.. తను మాత్రం సరైన సూచనలు చేస్తుంటుంది. ఏ సీన్లో ఇంకా ఎలా చేస్తే బాగుండేదో చెబుతుంటుంది. మా అబ్బాయి అయాన్ వర్మ పుట్టి రెండు నెలలు అవుతోంది. వాడితో మాకు టైమే తెలియడం లేదు. స్నేహమే.. జీవితం ఎందుకు చెబుతున్నానంటే.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది నా స్నేహితులే. చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఫ్రెండ్స్ జాబితా ఎక్కువే. వాళ్ల వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. సీరియల్స్ చేయగలిగాను. ఈ పరిశ్రమకు వచ్చిన కొత్తలో వాళ్లే నాకు హెల్స్ చేశారు. ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని గట్టిగా కోరుకున్నారు. ఏ కాస్త టైమ్ దొరికినా ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం నాకున్న ఆనందాలలో ఒకటి. రక్తసంబంధం నన్ను ఆదిత్యగా తెలుగింటికి బాగా చేరువచేసిన సీరియల్ రక్తసంబంధం. బావ మరదళ్ల మధ్య లవ్ స్టోరీతో నడిచే ఈ సీరియల్లో రకరకాల మలుపులు ఉంటాయి. దుర్గమ్మ–ప్రియలు వదినామరదళ్లు. దుర్గమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుడితే సహించలేను అంటుంది. ఇది విన్న ప్రియ ఆందోళన పడుతుంది. ఇద్దరికీ ఒకేరోజున డెలివరీ అవుతుంది. దుర్గమ్మకు ఆడపిల్ల, ప్రియకు అబ్బాయి పుడతారు. దీంతో ప్రియ పిల్లలను మార్పిడి చేస్తుంది. ఈ కథలో బావామరదళ్లు అయ్యి ఆదిత్య–తులసిల మధ్య ప్రేమ ఆకట్టుకుంటుంది. తులసి గడసరి అమ్మాయి. అల్లారుముద్దుగా పెరిగిన క్యారెక్టర్ ఆదిత్య. దుర్గమ్మకు మేనకోడలు తులసి నచ్చదు. ప్రియకు కన్నకొడుకు ఎవరో తెలుసు. ఈ సన్నివేశాలన్నీ భావోద్వేగాల మధ్య నడుస్తుంటాయి. తులసికి–ఆదిత్యకు పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టకుండా అవాంతరాలు సృష్టిస్తుంటుంది దుర్గమ్మ. కుటుంబ బంధాలతో కూడిన కథనం అవడంతో ప్రేక్షకాదరణ బాగుంటోంది. ‘రక్త సంబంధం’ సీరియల్లో దృశ్యం పక్కింటి కుర్రాడు ఎప్పుడైనా దేవాలయానికి వెళితే.. అక్కడ చూసినవాళ్లు దగ్గరగా వచ్చి ‘మమ్మల్ని చూసి కూడా పలకరించట్లేదేంటి’ అని అడుగుతుంటారు. నేను ఆశ్చర్యపోతే వారే కాసేపాగి ‘మీరు సీరియల్లో చేస్తారు కదా! మా పక్కింటి కుర్రాడిలాగే అనిపిస్తారు’ అని మాటలు కలుపుతారు. వాళ్లు అలా అంటున్నప్పుడు నాకు ఈ గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందం వేస్తుంది. – నిర్మలారెడ్డి -
ఒక రాణి ఇద్దరు రాజులు
ఇండియన్ టెలివిజన్ సిరీస్‌లో మెగా బడ్జెట్ ఫాంటసీ సీరియల్ గురించి చెప్పుకోవాలంటే ప్రప్రథమంగా చంద్రకాంతనే గుర్తు చేసుకోవాలి. ఈ సీరియల్ సృష్టికర్త, రచయిత, నిర్మాత, దర్శకుడు నీర్జా గులేరీ బుల్లితెర మీద ఓ మెగా మాయను సృష్టించారు. మంత్ర తంత్ర విద్యలను కళ్లకు కట్టారు. రాజులు–రాజ్యాల మధ్య జరిగిన యుద్ధ హోరుతో ప్రేక్షకులను కట్టడి చేశారు. ఈ మెగా సీరియల్ ఇండియన్ టెలివిజన్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కథనం హోరు ‘చంద్రకాంత’ ఓ ఊహాజనిత ప్రేమ కథనం. విజయ్‌గఢ్ యువరాణి చంద్రకాంత. అపూర్వ సౌందర్యరాశి. అసామాన్యమైన తెలివితేటలు. రూపంలోనూ, వ్యక్తిత్వంలోనూ దేశదేశాల్లో ఆమె పేరు మార్మోగుతుంటుంది. నవ్‌గఢ్ రాజు వీరేంద్రసింగ్ చంద్రకాంతను ప్రేమిస్తాడు. విజయగఢ్కు పొరుగుననే ఉన్న చునాడ్గఢ్ రాజు శివదత్తుడూ చంద్రకాంతను మోహిస్తాడు. ఒక రాణి కోసం ఈ రెండు ప్రత్యర్థి రాజ్యాల రాజుల మధ్య జరిగిన ప్రేమ పోరాటం కథనమే చంద్రకాంత సీరియల్. కట్టడి చేసే మాయోపాయాలు యువరాణి చంద్రకాంత ఉన్న విజయగఢ్ కోటలోనే క్రూర్సింగ్ అనే వ్యక్తి ఆమెను పెళ్లిచేసుకొని, రాజ్య కిరీటం సొంతం చేసుకోవాలని కలలు కంటుంటాడు. అయితే, పొరుగున ఉన్న చునాడ్గఢ్ రాజు శివదత్తు శక్తివంతమైన రాజు కావడంతో తన పాచికలు పారవని గ్రహించి, అతనికి నమ్మిన బంటుగా మారిపోతాడు. క్రూర్సింగ్ మాయోపాయాలు పన్ని చంద్రకాంతను శివదత్తుని చేత బంధించడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. శివదత్తుడి మాయోపాయాలు, మంత్రతంత్రాలతో చంద్రకాంతను బందీ చేస్తాడు. అతని బందిఖానా నుంచి బయటపడి, పారిపోతున్న చంద్రకాంత్‌ను గుర్తించి శివదత్తకు సమాచారం చేరవేస్తాడు క్రూర్సింగ్. విషయమంతా తెలుసుకున్న వీరేంద్రసింగ్ అయ్యర్ల (గూఢచారులు+సైనికులు) సాయంతో శివదత్తతో పోరాడుతాడు. ఈ కథనం అంతా చంద్రకాంత అపహరణ, ఆమెను కాపాడటం.. వంటివాటితో నడుస్తుంది. చంద్రకాంతను ట్రాప్ చేయడానికి మాయలు, మంత్రవిద్యలు ప్రయోగించడం... వాటిని రాజు వీరేంద్ర తిప్పికొట్టే విధానాలతో నడుస్తుంది. శివదత్తుని మాయోపాయాలన్నీ వీరేంద్ర కనిపెట్టి, వాటిని తిప్పి కొట్టడంతో శివదత్తుడు వెనక్కి తగ్గుతాడు. ఈ పోరాటంలో శివదత్తు తన చునాడ్గడ్ కోటని వదులుకొని వెనుతిరగాల్సి వస్తుంది. వీరేంద్రసింగ్ చంద్రకాంతను పెళ్లి చేసుకొని విజయ్గఢ్ను, తన రాజ్యమైన నవగఢ్ను, శివదత్తుని రాజ్యమైన చునాడ్గఢ్ను కూడా సొంతం చేసుకొని పరిపాలిస్తుంటాడు. దీంతో విధిలేక శివగఢ్ నుంచి పరిపాలన కొనసాగిస్తుంటాడు శివదత్తు. అంతటితో ఊరుకోకుండా వీరేంద్రసింగ్, చంద్రకాంతలపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. శివదత్తు పాలనా వ్యవహారాలను చూస్తున్న పండిట్ జగన్నాథ్ చునాడ్గఢ్ని, చంద్రకాంతను ఎలా కైవసం చేసుకోవాలో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తుంటాడు. అనుచరులు క్రూర్సింగ్, అహ్మద్, నజిమ్లు వీరేంద్రసింగ్ మీద ప్రతీకారం తీర్చుకోమని శివదత్తుని ప్రేరేపిస్తుంటారు. వీరేంద్రసింగ్‌ను చంపి చంద్రకాంతను పెళ్లి చేసుకోవడానికి శివదత్తే కాదు క్రూర్సింగ్ కూడా ప్రయత్నిస్తుంటాడు. మూలకథకు చాలా దూరం ‘చంద్రకాంత’ నవల నుంచి స్టోరీ లైన్‌ని తీసుకున్నప్పటికీ నవలకి– సీరియల్‌కి పూర్తి భిన్నంగా నడుస్తుంది కథనం. ఈ సీరియల్ ఎన్నో కొత్త కొత్త పాత్రలను పరిచయం చేసింది. చంద్రకాంత మూల కథ రచయిత దేవకి నందన్ ఖత్రీ. ఇతను హిందీ భాషలో మొదటి తరానికి చెందిన ప్రసిద్ధ రచయిత. ఇతను మిస్టరీ నావలిస్ట్‌గా కూడా ప్రసిద్ధి. చంద్రకాంత సీరియల్‌ను 1994 నుంచి 1996 వరకు 130 ఎపిసోడ్లను దూరదర్శన్ ప్రసారం చేసింది. ఈ సీరియల్ నిర్మాత, దర్శకులు నిర్జా గులేరీ, సునీల్ అగ్నిహోత్రి. ఈ సీరియల్ ఒకదశలో వివాదాస్పదం కావడంతో పునః ప్రసారానికి నిర్మాతలు సుప్రీమ్‌కోర్టులో దావా వేశారు. దీంతో 1999లో చంద్రకాంత సీరియల్‌ని తిరిగి ప్రసారం చేశారు. ఇతర టీవీలలో ఆ తర్వాత స్టార్ ప్లస్, సోనీ టెలివిజన్లలోనూ చంద్రకాంత సీరియల్ ప్రసారమైంది. ‘కహానీ చంద్రకాంతకి’ సీరియల్ 2011లో సహారా ఒన్‌లో ప్రసారమయ్యింది. ఆ తర్వాత ‘చంద్రకాంత సంతతి’ పేరుతో దర్శకులు సునిల్ అగ్నిహోత్రి సీరియల్‌గా తీశారు. ఇది దేవకీ నందన్ ఖత్రీ నవలకు అసలు సిసలు రూపం. అయితే, ‘చంద్రకాంత సంతతి’ కథకి, టీవీ సీరియల్ ‘కహానీ చంద్రకాంత’కి చాలా భిన్న సారుప్యాలు ఉన్నాయి. 2017లో స్టార్ భారత్ ‘ప్రేమ్ యా పహేలీ –చంద్రకాంత’ అని మళ్లీ ఈ కథను పరిచయం చేసింది. ఏక్తాకపూర్ తీసిన ‘చంద్రకాంత’ సీరియల్ కలర్స్ టీవీ ప్రసారం చేసింది. విమర్శనాస్త్రాలు నవలా రచయిత దేవకీ నందన్ ఖత్రీ మనవడు కమలపతి ఖత్రీ ‘చంద్రకాంత’ సీరియల్‌కి దర్శకుడు నీర్జాగులేరి న్యాయం చేయలేదని విమర్శించాడు. నవలలోని చిట్టడవి, గూఢచర్యం, మంత్రవిద్యలు వంటి ప్రధానాంశాల పట్ల నిర్లక్ష్యం చేశారని ఆరోపించాడు. చునాగఢ్ కోటలోని పాత్రలు, వరసలను విమర్శిస్తూ అతిశయోక్తిగా ఉందని, అసలు చంద్రకాంతకు ఎంతోదూరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక ప్రేమ కథకు రూపాలు ఎన్నో ‘చంద్రకాంత’ స్టోరీలైన్ ఒకటే అయినా ఆ తర్వాత రకరకాల రూపాలను నింపుకున్న నవలలు ఎన్నో వచ్చాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి చంద్రకాంత – వీరేంద్రసింగ్ పిల్లల సాహసకృత్యాలతో కూడిన సిరీస్. సినిమా విరమణ ప్రముఖ సినీ నిర్మాత విధు వినోద చోప్రా ‘చంద్రకాంత’ని సినిమాగా తీయాలని ప్లాన్ చేశారు. అమితాబ్‌బచ్చన్, అభిషేక్ బచ్చన్లను ప్రధాన పాత్రలుగా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు రామ్మద్వని ఓకే అనుకున్నారు. కానీ, చివరకు చంద్రకాంత సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది. – ఎన్.ఆర్ వీరేంద్ర–చంద్రకాంత వీరేంద్రసింగ్గా మెప్పించిన నటుడు షహబజ్ఖాన్. చంద్రకాంతతో పాటు బేతాల్ పచ్చీసి, యుగ్, ది స్వరోద్ టిప్పు సుల్తాన్.. వంటి వాటిలో నటించి ప్రఖ్యాతి చెందాడు. 2018లో చైనీస్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘డైయింగ్ టు సర్వైవ్’లో నటించాడు. చంద్రకాంత హీరోయిన్ షిఖా స్వరూప్. 1988 మిస్ ఇండియా ఇంటర్నేషనల్ విజేత షిఖా. మోడల్, బాడ్మింటన్ ప్లేయర్ కూడా. టీవీ సీరియల్స్‌లోనే కాకుండా దాదాపు 11 సినిమాలో నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు షిఖా. -
మధ్యతరగతి జమాఖర్చులు
అద్దె డబ్బు, కరెంటు బిల్లు, పిల్లాడి స్కూలు ఫీజుకాదేది మధ్యతరగతి కష్టానికి అనర్హం.మర్యాద నిలబెట్టుకుంటూ పైపై బింకాన్నినటిస్తూ జీవితాన్ని లాగించడమేమధ్యతరగతివాడి కర్తవ్యం.అందులో కొన్ని సరదాలు ఉంటాయి.గులకరాయిని కొండరాయి అనుకునేఆందోళనలూ ఉంటాయి.నవ్వులూ పూస్తాయి.ఏ దిక్కూ లేని మధ్యతరగతి వాడికి నవ్వే దిక్కుఅని చెప్పిన సీరియల్ ‘వాగ్లే కీ దునియా’. మనదేశంలో మధ్యతరగతి కష్టాలు ఇన్నీ అన్నీ కావు. కొన్ని అయ్యో అనిపించేవి ఉంటాయి. మరికొన్ని మనసారా నవ్వుకునేవిగా ఉంటాయి. ఇంత చిన్నవి కూడా కష్టాలేనా అనిపించేవీ ఉంటాయి. శ్రీనివాస్ వాగ్లే కుటుంబపు కష్టాలు కూడా అలాంటివే. వాగ్లే కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే 1988–90నాటి కాలానికి వెళ్లి బుల్లితెరపై వచ్చిన ‘వాగ్లే కీ దునియా’ చూడాలి. ఇక్కడ వాగ్లే అనే అతను ఒక మధ్యతరగతి మనిషి. మనలాంటివాడు. మన ఇరుగుపొరుగు మనిషిలాంటి వాడు. వాగ్లే ఇంటి పని వాగ్లే ఓ ఆదివారం ఉదయం తీరికగా కూర్చుని పేపర్ చదువుతుంటాడు. పాడైన గడియారాన్ని షాపులో ఇచ్చి బాగు చేయించమని భార్య అంటే డబ్బులు వేస్ట్ అని, పైగా అందులోని ఒరిజనల్ సామాగ్రి షాప్‌వాడు తీసుకొని డూప్లికేట్వి వేస్తాడని, యాంటిక్ పీస్ అని.. తనే దానిని రిపేరు చేయడానికి పూనుకుంటాడు. గడియారం భాగాలను విడదీయడానికి స్క్రూ డ్రైవర్ కోసం ఇల్లంతా తుకుతాడు. చివరకు అటక మీద ఉండి ఉంటుందని పైకి ఎక్కి, పనికి రావని అటెక్కించిన సామాన్లన్నీ పనికి వస్తాయని భావించి ఒక్కోటి కిందకు దించుతాడు. పాత సామాన్లను ఏమీ చేయలేక, అటు చెత్త సామాన్లవాడికి అమ్మకుండా తిరిగి వాటిని అటకెక్కించి అలసిపోతాడు. చివరకు గడియారం పీస్‌ను సామాన్లల్లో ఎక్కడ పెట్టాడో గుర్తుకు రాదు. పొరపాటున అటక మీద పెట్టానేమోనని అనుమానంతో తిరిగి సామానంతా కిందకు దించే పని పెట్టుకుంటాడు. ఈ వాగ్లేలో ప్రేక్షక జనం తమని తాము చూసుకున్నారు. మనసారా నవ్వుకున్నారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ పెద్ద కొడుకు బ్యాడ్మింటన్ ఆడటానికి వెళుతున్నాడని తెలిసి ఇంటికి వచ్చాక ‘అమ్మకు సాయపడాలి కదా’ అంటూ మందలిస్తాడు వాగ్లే. తను కాలేజీ రోజుల్లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ అని, కుమారుల ఇద్దరికీ గుర్తు చేసి ఇంట్లోనే సామానంతా ఒక పక్కకు జరిపి ఇంటినే గ్రౌండ్ చేస్తాడు. కొడుకు స్కూల్లో గేమ్‌లో పాల్గొంటున్నాడని తెలిసి ఇంట్లో అంతా బయల్దేరుతారు. అప్పటికే గేమ్‌లో ఎలా పాల్గొనాలో ఎన్నో జాగ్రత్తలు చెబుతాడు కొడుక్కి. గేమ్‌లో కొడుకు సరిగా ఆడటం లేదని, గ్రౌండ్ దాటి బయటకెళ్లిపోతాడు. గేమ్ ముగిశాక అంతా బయటకు వస్తుంటారు. తండ్రి ఎవరికీ కనపడకూడదని ఒక దగ్గర దాక్కొని ఉండటం చూసిన మనోజ్ తన ఫ్రెండ్‌కి వచ్చిన కప్పు తీసుకొని తనకే వచ్చిందని చెప్పడంతో వాగ్లే చాలా ఆనందపడిపోతాడు.తమకన్నా పిల్లలు బాగా రాణించాలని తామే దగ్గరుండి ఆటపాటలు నేర్పించాలని తపించిపోయే తల్లిదండ్రులు వాగ్లేలో చూసుకున్నారు. సరదాగా నవ్వుకున్నారు. పనిమనిషి హడావిడి వాగ్లే భార్య రాధిక ఇంటి పని ఒక్కత్తే చేసుకోవడం కష్టంగా ఉందని పనిమనిషిని మాట్లాడుతుంది. వాగ్లే కూడా అందుకు సరేనంటాడు. మొదటి రోజు అన్ని పనులు చకచకా చేసేసిన పనిమనిషి మరుసటి రోజు నుంచి ఆలశ్యంగా వస్తుంది. పనిమనిషి కోసం ఎదురు చూసి రాధిక ఇంటి పని అంతా తనే చేసుకుంటుంటుంది. చివరి సమయంలో వచ్చిన పనిమనిషి ఆలశ్యానికి కారణం కూడా చెప్పకుండా పని చేసుకుపోతుంది. వాగ్లే, రాధిక ఆమెను ఏమీ అనలేకపోతారు. పనిమనిషి భర్త మాత్రం సమయానికి వచ్చి జీతం డబ్బులు దబాయించి తీసుకెళతాడు. వాగ్లే అతని భార్య రాధిక దిగాలుగా చూస్తుంటారు.పనిమనుషులతో తంటాలు పడే కుటుంబాలలో ప్రతి ఒక్కరికీ కాస్త అటూ ఇటుగా ఇది తెలిసిన విషయమే. ఈ ఎపిసోడ్‌తో వాగ్లే కుటుంబంలో తమ కుటుంబాన్ని కలిపేసుకున్నారు సీరియల్ చూస్తున్న ప్రేక్షకులు. పెన్ తెచ్చిన జబ్బు వాగ్లే చిన్న కొడుకు రాజు తన అన్న మనోజ్ దగ్గర పెన్ తీసుకుంటాడు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఇస్తానని బతిమాలి తీసుకుంటాడు. చిట్ట చివరకు సరే అంటాడు మనోజ్. స్కూల్ నుంచి వచ్చాక పెన్ కనిపించక రాజు టెన్షన్ పడుతుంటాడు. మనోజ్ వచ్చి తమ్ముడిని పెన్ ఇవ్వమంటాడు. అప్పటికే అన్న ఏమంటాడో అని భయపడుతున్న రాజు చూస్తున్నాను ఇస్తా, అంటాడు. ఆడుకొని వచ్చేసరికి పెన్ తీసి పెట్టాలి లేకపోతే అని బెదిరించి వెళతాడు. భయంతో తల్లి ఇచ్చిన పాలు కూడా తాగకుండా తండ్రి ఇచ్చిన బిస్కెట్ తినకుండా దిగాలుగా కూర్చుంటాడు. దాంతోపిల్లాడికి జబ్బు చేసిందని వాగ్లే, రాధిక భయపడతారు. రగ్గు నిండుగా కప్పి పడుకోబెడతారు. తనకేమీ కాలేదని చెప్పినా వినకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళతారు. డాక్టర్ దగ్గర ఫుల్ రష్ ఉంటుంది. ఆ రష్లో పిల్లవాడిని వదిలేసి డాక్టర్ వాగ్లేకి టెస్ట్ చేసి, జబ్బు ఏమీ లేదని బలానికి టానిక్ రాసిస్తాడు. పైగా వాగ్లేని టెస్ట్ చేసినందుకు ఇరవై రూపాయలు తీసుకుంటాడు. ఇంట్లో పిల్లల మధ్య గొడవలు, వారి అనారోగ్యాలు,పెద్దల హడావిడి ఈ ఎపిసోడ్లో కనిపిస్తుంది. మరో ఎపిసోడ్లో వాగ్లే దీపావళి పండక్కి కర్టెన్ల కోసం ఫ్యాబ్రిక్‌ను కొంటాడు. తమ దగ్గరున్న డబ్బుకన్నా పది రెట్ల ఫ్యాబ్రిక్ కోసం పెట్టాల్సి ఉంటుంది. అందుకు ఆ కుటుంబం కర్టెన్స్ వద్దనుకొని సోఫా కవర్స్‌ను కొనుగోలు చేయడాన్ని ఇష్టపడుతుంది. ఇవే కాదు మొత్తం నలభై నాలుగు ఎపిసోడ్లలో గుర్తుండిపోయే సన్నివేశాలు ఎన్నో. మధ్యతరగతిలో నిత్యం ఎన్నో ఇష్టమైన ఇక్కట్లు, గడిచిపోయాక తలుచుకుని నవ్వుకునే కష్టాలు ఉంటాయి. వాటిని అందంగా సాహిత్యంలో చాలామంది రాశారు. టీవీలో ఈ సీరియల్ ఆ పని చేసింది. అప్పడూ, ఇప్పుడూ బుల్లితెరపై కామన్ మ్యాన్ అంటే ‘వాగ్లే కి దునియా’ గుర్తుకురాక మానదు. – ఎన్.ఆర్ వాగ్లే ప్రపంచం ►వాగ్లే కి దునియా పూర్తి కామెడీ సీరియల్. వాగ్లే ధరించే ఖాదీ కుర్తాలు, ఆఫీసుకి వెళితే వేసుకెళ్లే కోటు–టై, కాన్వాస్ షూస్, బ్యాగీ ప్యాంట్స్, రాధిక కట్టే కాటన్ చీరలు.. మధ్యతరగతిని ప్రతిబింబిస్తుంటాయి ►ఆర్కేలక్ష్మణ్ తన మునివేళ్లతో భారతీయ మధ్యతరగతి నాడిని పట్టుకున్నాడు. కామన్ మ్యాన్ ఫీచర్‌ని తన స్కెచ్‌తో ఈ కార్టూనిస్ట్ సృష్టిస్తే దర్శకుడు కుందన్ షా బుల్లితెరకెక్కించారు. అప్పటికే ‘జానే భి దో యారో’, ‘ఏ జో హై జిందగీ’, ‘నుక్కడ్’ను పరిచయం చేసిన కుందన్ షా ‘వాగ్లే కీ దునియా’తో మరోమారు అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు ►మధ్యతరగతి మనిషి వాగ్లేగా అందరినీ ఆకట్టుకున్నవాడు అంజన్ శ్రీవాత్సవ్. ఇతని భార్యగా భారతి అచేర్కర్ నటించారు. సినీ నటుడు షారుఖ్ ఖాన్ ఇందులో ఒక ఎపిసోడ్లో అతిథి పాత్రలో కనిపిస్తారు. షారుఖ్ అప్పటికే ఫౌజీ సీరియల్ ద్వారా పేరు తెచ్చుకున్నారు ►2012లో వాగ్లే టీమ్ ‘డిటెక్టివ్ వాగ్లే’ పేరుతో మరోసారి బుల్లితెర మీద ప్రత్యక్షమైంది. ఇందులోనూ అంజన్ శ్రీవాత్సవ్ వాగ్లే రోల్‌ను పోషించారు. అతని భార్యగా సుల్భా ఆర్యా నటించారు. -
కృష్ణ పరవశం
రాముణ్ణి సీరియల్ హీరోగా చేయొచ్చని ‘రామాయణ్’ ద్వారా గ్రహించిన రామానంద్ సాగర్ కృష్ణుడి వేణుగానంతో 200 ఎపిసోడ్లు తీయవచ్చని నిరూపించాడు. శ్రీకృష్ణుడిపై నిర్మించిన ‘శ్రీకృష్ణ’ సీరియల్ ఆ విహారి విశ్వరూపాన్ని ఇంటింట్లో ప్రత్యక్షం చేయించింది. ఆ కృష్ణ పరవశం నేటికీ మరపురానిది. బాల్యంలో కన్నతల్లి దేవకి అయినా పెంచిన తల్లి యశోద దగ్గర అల్లారుముద్దుగా పెరుగుతాడు కృష్ణుడు. రామానంద్‌సాగర్ దేవకిలా శ్రీకృష్ణ సీరియల్‌కి ప్రాణం పోస్తే.. తాను యశోదలా మురిపెంగా పెంచి ప్రతి ఒక్కరి కళ్లకు కట్టింది దూరదర్శన్. 1993 నుంచి 1996 వరకు నాలుగేళ్ల పాటు శ్రీకృష్ణ లీలలను ప్రసారం చేసింది గ్రేట్ ఇండియన్ టెలివిజన్. 90ల కాలంలో బుల్లితెరకు దాదాపు వందకోట్ల ఆదాయం తెచ్చిన సీరియల్ శ్రీకృష్ణ కావడం విశేషం.కృష్ణుడి గురించి దేశమంతా తెలుసు. కథలు కథలుగా కృష్ణుడు ప్రతి ఇంటి బిడ్డడే. ఆ అల్లరి, కొంటెతనం తెలియనివారుండరు. ఆ వెన్నదొంగను అప్పటికే సినిమా పరిశ్రమ ఎన్నో విధాల పరిచయం చేసింది. మళ్లీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది అనుకోలేదు రామానంద్‌సాగర్. అప్పటికే రామాయణానికి ముందు తన పేరును సార్థకం చేసుకున్న రామానంద్‌సాగర్ రాముడు తర్వాత మరో పురాణ పురుషుడిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడిని అప్పటికే జనం చూసి ఉన్నారు. తిరిగి కృష్ణుడిని చూడాలంటే ఓ ప్రత్యేకత ఉండాలి. అందుకే భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, హరివంశం, విష్ణుపురాణం, పద్మపురాణం, గర్గ సంహిత, భగవద్గీత, మహాభారత్ గ్రం«థాల నుంచి కృష్ణుడున్న ప్రతీ సన్నివేశాన్ని తీసుకున్నారు. ఆసక్తిగా మలుచుకున్నారు. మూడేళ్ల పాటు టీవీ ప్రేక్షకులను కృష్ణలీలలతో అలరించారు. రాక్షస సంహారమే ప్రధానం కంసుడు తన చెల్లెలు దేవకి – బావ వసుదేవుడిని బంధించి చెరసాలలో ఉంచుతాడు. యోగులకు, దేవతలకు తాను భూమ్మీద జన్మిస్తున్నట్టు చెబుతాడు వైకుంఠ నారాయణుడు. దేవకి కడుపున అష్టమసంతానంగా జన్మిస్తాడు నారాయణుడు. కంసుడి కంటపడకుండా ఉండటానికి వసుదేవుడు ఆ బిడ్డను గంపలో పెట్టుకొని అర్ధరాత్రి కారాగారాన్ని ముంచేస్తున్నట్టు పరవళ్లు తొక్కుతున్న యమునా నదిని దాటుకొని రేపల్లెలో ఉన్న నందుని ఇంటికి చేరుతాడు. యశోద ప్రసవించిన ఆడబిడ్డను తీసుకొని, తన కొడుకును ఆమె పక్కన పడుకోబెట్టి తిరిగి కారాగారం చేరుకుంటాడు. దేవకి ప్రసవించిందని తెలుసుకున్న కంసుడు ఆ బిడ్డను చంపడానికి కత్తి ఎత్తుతాడు. దాంతో ఆ బిడ్డ అదృశ్యమై తను యోగ మాయ అని, తాను దేవకి బిడ్డ కాదని, రేపల్లెలో కృష్ణుడు పెరుగుతున్నాడని, అతడే కంసుడిని హతమారుస్తాడని చెప్పి అదృశ్యమౌతుంది. అప్పటినుంచి కంసుడు రేపల్లెలో పెరుగుతున్న కృష్ణుడిని చంపడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. యశోదా గారాబు తనయుడిగా కృష్ణుడు రేపల్లెలో చేయని అల్లరంటూ ఉండదు. గోకులంలో గోవర్ధానాన్ని ఎత్తి యాదవులందరినీ కాపాడిన విధం, సాందీపుని ఆశ్రమంలో నేర్చిన విద్య, రాక్షసులను సంహరించి, తన బలగాన్నంతా కాపాడుకున్న విధం... చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి మనసును గెలుచుకుంది. కృష్ణుడి బాల్యంతోపాటు కౌమారం అటు నుంచి రాధాకృష్ణుల ప్రేమనూ బుల్లితెర మీద హృద్యంగా చూపారు దర్శకులు. మంచి పక్షాన నిలిచిన దైవం బృందావనం నుంచి ద్వారక చేరి మామ కంసుడిని హతమార్చి తల్లిదండ్రులని చెరసాల నుంచి విడిపించిన బలరామకృష్ణుల గాధలను టీవీ కట్టేసినా మరచిపోలేక పోయారు ప్రేక్షక జనం. ద్వారకా నగరం, అక్కడ కృష్ణుడి వైభవంతోపాటు తనను కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించే సుగుణాన్ని ఎంతో అందంగా కళ్లకు కట్టారు. భారత యుద్ధ సమయంలో అర్జునుడు–దుర్యోదనాదుల రాక, యుద్ధంలో పాండవుల పక్షాన కృష్ణుడు పాల్గొనడం.. వంటి ఘట్టాలనూ చూపారు. కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణంతో సీరియల్ ముగుస్తుంది. – ఎన్.ఆర్ వందకోట్ల కృష్ణుడు 1993లో బుల్లితెరమీద ప్రత్యక్షమైన శ్రీ కృష్ణ సీరియల్‌ను 1995లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వరించింది. వందకోట్ల సంపాదనతో దూరదర్శన్ ద్వారకానగర వైభవమంత వెలిగిపోయింది ∙ సిరివెన్నెల సినిమా హీరో సర్వదమన్ డి. బెనర్జీ. కృష్ణుడిగా బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు ∙శ్రీ కృష్ణ సీరియల్‌ను రామానందసాగర్, సుభాష్ సాగర్, ప్రేమ్‌సాగర్‌లు ‘సాగర్ ఎంటర్ప్రైజెస్’ ద్వారా నిర్మించారు. దర్శకులు రామానంద్‌సాగర్, ఆనంద్‌సాగర్, మోతీసాగర్లు ∙యువ కృష్ణుడిగా స్వాప్నిల్ జోషి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడుగా బెనర్జీ నటించారు. స్వాప్నిల్ జోషి కన్నా బెనర్జీ కృష్ణుడిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరస్థానాన్ని పొందారు. అందుకు బెనర్జీ రూపమే కాదు చిరుమందహాసం, నటన జనాన్ని అమితంగా ఆకట్టుకున్నాయి ∙రవీంద్ర జైన్ ఈ సీరియల్ సంగీతాన్ని అందించారు. ‘శ్రీ కృష్ణ గోవింద్ హరే మురారీ’ టైటిల్ సాంగ్ ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా చాలా పాపులర్ అయ్యింది ∙ఈ సీరియల్ మారిషస్, నేపాల్, సౌత్ ఆఫ్రికా, జకర్తా, థాయిలాండ్ టీవీలు సైతం ప్రసారం చేశాయి ∙ఆ తర్వాత వివిధ చానెల్స్‌లో ప్రసారమైన జై శ్రీ కృష్ణ, రాధా కృష్ణ, పరమావతార్ శ్రీ కృష్ణ.. వంటి సీరియల్స్ ప్రేక్షకులను అలరించాయి. అలరిస్తున్నాయి. -
శక్తి మహాన్
ఇప్పటి పిల్లలకు అవెంజర్స్ అంటే పిచ్చి ఇష్టం. అందులోని వీరోచిత గాథలు, మ్యాజిక్స్‌ని కళ్లార్పకుండా చూస్తారు. అచ్చు ఇలాగే 90ల కాలం నాటి పిల్లలు టీవీలకు అతుక్కుపోయి ఒక వీరోచిత పోరాటయోధుణ్ణి చూశారు. ‘సూపర్‌హీరో..’ అంటూ చప్పట్లతో కేరింతలు కొడుతూ తామూ శక్తిమాన్‌లా పోజులిచ్చేవారు. ‘శక్తిమాన్’ ఇండియన్ సీరియల్స్‌లోనే సూపర్ హీరో. 1997 నుంచి దాదాపు ఏడున్నరేళ్లపాటు 520 ఎపిసోడ్స్‌తో పిల్లా పెద్దా అనే తేడా లేకుండా ఆకట్టుకుంది. ఈ సీరియల్ సృష్టికర్తలు ముఖేష్ఖన్నా, దినకర్ జైని. ఈ సీరియల్ ఒక్క దూరదర్శన్‌లోనే కాదు ఆ తర్వాత కాలంలో ఇతర టీవీ చానెల్స్‌లో అన్ని భాషల్లోనూ ప్రసారమైందంటే శక్తిమాన్కున్న శక్తి ఏంటో తెలుసుకోవచ్చు. ప్రొడ్యూసర్ ముఖేష్ ఖన్నా ఈ సీరియల్లో లీడ్ రోల్ శక్తిమాన్ పాత్ర పోషించారు. దినకర్ జైని దర్శకత్వం వహించారు. కథ ఇలా మొదలు.. పది వేల ఏళ్ల క్రితం ఎటు చూసినా పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, గలగలపారే నదీ నదాలు, సెలయేళ్ల తుళ్లింతలు, ఆరోగ్యకరమైన సకల జీవరాశితో ఈ పుడమి ఎంతో అందంగా ఉండేది. కాలుష్యమన్నదే లేకుండా ప్రకృతి వనరులు ఎంతో స్వచ్ఛంగా ఉండేవి. మహర్షుల నోటినుంచి వెలువడే పవిత్ర వేదనాదాలతో కొండలు, కోనలు పునీతమయ్యేవి. అలాంటిది.. 6వేల ఏళ్ల క్రితం నుంచి భూమి మీద ఎన్నో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. యుద్ధాల వల్ల ప్రకృతి వినాశనం జరుగుతూ వచ్చింది. మనుషుల్లో అన్యాయం పెచ్చుమీరటం వల్ల ఎంతో కీడు జరుగుతూనే ఉంది. వీటన్నింటి నుంచి ప్రకృతిని కాపాడటానికి ఒక మహోన్నత వ్యక్తి కావాలి. ఆ ఒక్కరు ఎవరు?! అనే ప్రశ్నకు హోమవాటిక ముందు కూర్చున్న వ్యక్తి సమాధానంగా కనిపిస్తారు. ఓంకార్ నాద్ ‘పండిట్ గంగాధర్ విద్యాధర్ మయాధర్ ఓంకార నాద శాస్త్రి అనే వ్యక్తి వేదపండితుల ద్వారా తెలుసుకున్న ధ్యానశక్తితో ఓ కొత్త శక్తిని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు మహర్షులూ తమవంతు సహకారం అందించారు. మహాయజ్ఞం తలపెడతాడు ఓంకారనాద శాస్త్రి. భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని.. ఈ పంచమహాభూతాల శక్తితో మనిషిలోని ఏడు చక్రాల అధారంగా కుండలిని శక్తిని వెలికి తీయొచ్చని, ఈ శక్తి ఎంతో మహిమాన్వితమైనదని చెబుతారు పండితులు. కుండలినిని ప్రార్థించిన ఓంకారనాద శాస్త్రి యజ్ఞవాటికలోని అగ్నిలోకి దిగుతాడు. అందులో నుంచి అతని ప్రాణ శక్తి బయటకు వస్తుంది. అది నీటిలో చేరి ఓ అమోఘమైన మనిషి రూపం బయటకు వస్తుంది. ఆ ప్రతీకను స్వీకరించమంటాడు వేదపండితుడు. అలా వాయు శక్తిని, అపవిత్రాన్ని పవిత్రంగా మార్చే అగ్నిని, భూ శక్తిని, జల శక్తిని, విశ్వశక్తిని యోగుల ద్వారా పొందిన ఓంకారనాద్ శక్తిమాన్‌గా ప్రత్యక్షమవుతాడు. సంకల్పంతో సంపూర్ణశక్తిని పొందిన శక్తిమాన్‌ని వేదపండితులు ఆశ్వీర్వదించి, తగు సూచనలు చేస్తారు. మనుషుల్లో ఉండే కామ, క్రోధ, మదమాత్సర్యాలు ఈ లోకంలో ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తున్నాయో చెబుతూ అందరిలోనూ పరివర్తన తీసుకురమ్మంటారు. అందుకు అంగీకరించి వారికి నమస్కరించి బయలుదేరుతాడు శక్తిమాన్. మహానగరంలో ఓ ఎల్తైన భవనం మీద నుంచుని కింద ఏమేం జరుగుతున్నాయో పరిశీలిస్తుంటాడు శక్తిమాన్. దోపిడీ నుంచి రక్షణ బ్యాంక్ దోపిడీ చేసిన దుండగులు, అడ్డుపడిన పోలీసులను చావచితక్కొట్టి అక్కడినుంచి తప్పించుకుని పారిపోవడానికి సిద్ధపడతారు. ఇది గమనించిన శక్తిమాన్ వారి బారి నుంచి పోలీసులను కాపాడుతాడు. ఇదంతా ఓ స్కూల్ పిల్లవాడు చూస్తాడు. ఆ పిల్లవాడిని అడ్డుపెట్టుకొన్న దుండగులు మరింత రెచ్చిపోతారు. కానీ, తనకున్న శక్తితో ఆ ముఠానంతటినీ పట్టుకొని పిల్లవాడిని, బ్యాంకు డబ్బును కాపాడి అక్కణ్ణుంచి అదృశ్యమవుతాడు. శక్తిమాన్ అవతారం పని పూర్తికాగానే దానికి పూర్తి భిన్నమైన పాత్రలోకి చేరుతాడు. ‘ముందుకు వచ్చిన వెడల్పాటి దంతాలు, నున్నగా దువ్విన జుట్టు..’తో అమెరికన్ కమెడియన్ జెర్రీ లెవిస్‌ను తలపిస్తాడు. లేజర్‌గన్స్‌తో ఎఫెక్ట్స్ ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమై, వారిని కాపాడుతుంటాడు శక్తిమాన్. షూటింగ్ మొత్తం లేజర్‌గన్స్, హైఫై గ్యాడ్జెట్స్‌తో ఒక చిన్న ప్రపంచాన్ని బుల్లితెర మీద ఆవిష్కరించారు. ముఖేష్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో శక్తిమాన్ గురించి మాట్లాడుతూ ‘మన దేశ పురాణాల్లో సూపర్ హీరోస్ అనదగ్గ ఎన్నో శక్తిమంతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటి నుంచే శక్తిమాన్ జన్మించాడు’ అని చెప్పారు. శక్తిమాన్‌లో సృజనాత్మకమైన విశ్వశక్తి ఉంటుంది. అతను ఎగరగలడు, ఎంతటి ఎత్తునుంచైనా దూకగలడు. అసలు ఈ శక్తిమాన్ చేయలేని పని అంటూ ఉండదు. దీంట్లోని స్పెషల్ ఎఫెక్ట్స్ చూస్తే నేటి టెర్మినేటర్, అవేంజర్స్ వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేనప్పటికీ ఉన్న వనరులతోనే మ్యాజిక్ చేయడం ఈ దర్శక నిర్మాతలకే చెల్లింది. ప్రతీ ఒక్క ఎపిసోడ్‌కి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేశారట. విమర్శల మాన్ శక్తిమాన్ సీరియల్ ఎదుర్కొన్నప్పి విమర్శలను నాడు ఏ సీరియల్ కూడా ఎదుర్కోలేదని చెప్పవచ్చు. పిల్లలు శక్తిమాన్ లాగే భవానాల మీదుగా జంప్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పెద్ద వివాదాస్పదమైంది. ఈ పరిస్థితిని గుర్తించిన సీరియల్ నిర్మాతలు ఎవరూ ఇలాంటి సాహసాలకు పూనుకోకూడదని మనవి చేసుకోవాల్సి వచ్చింది. ఈ సీరియల్ ద్వారా ఖన్నాకు వచ్చిన పాపులారిటీని తగ్గించడానికే ఇలాంటి రూమర్స్ సృష్టించారనే వాదనలూ వచ్చాయి.పిల్లల కామిక్ పుస్తకాల్లో శక్తిమాన్ కూడా చోటు చేసుకుంది. శక్తిమాన్ తరహా కాస్ట్యూమ్స్, స్టికర్స్, బొమ్మలు.. వంటివి కూడా మార్కెట్లోకి వచ్చి చేరాయి. 2001లో గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు ప్రభావిత ప్రాంతాలను శక్తిమాన్ కాస్ట్యూమ్స్‌లోనే సందర్శించి అక్కడి ప్రజలకు ఊరటినిచ్చారు ముఖేష్ ఖన్నా. మహాభారత్‌లో భీష్ముడిగా నటించి మెప్పించినప్పటికీ ముఖేష్ ఖన్నా పేరు ‘శక్తిమాన్’గానే ఇప్పటికీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. శక్తిమాన్ యానిమేషన్ సీరీస్‌ను 2012లో ప్రసారం చేశారు. నిజాన్ని, న్యాయాన్ని శక్తిమాన్ బుల్లితెర ద్వారా ప్రేక్షకుల కళ్లకు కట్టాడు. ఈ సీరియల్ చూసిన ప్రేక్షకులు తామూ నిజాయితీగా, స్వచ్ఛంగా, పరిశుభ్రంగా, విద్యాసక్తులై, దేశభక్తితో ఉండాలి నిర్ణయించుకునేంత స్థాయిని పెంచింది. – ఎన్.ఆర్ ►అమెరికన్లు సూపర్‌హీరోలను కనిపెట్టా రని అంటారుగాని మన దగ్గర లేకనా? ఆంజనేయుడు, ఘటో త్కచుడు, భీముడు... ►వీరంతా సూపర్ హీరోసే కదా. కాని సూపర్ మేన్, స్పైడర్ మేన్, హీ మేన్ వీరే తెలుసు మన పిల్లలకు. వారి ముక్కు పట్టుకుని మన హీరోల వైపు చూసేలా చేసిన సీరియల్ ‘శక్తిమాన్’. ఇది మన పవర్. మన శక్తి. -
తెలివిజన్
తెనాలి రామకృష్ణ తెలివే తెలివి.. విజనే విజను. ఇంకొకళ్లకు లేవు.. అలాంటి వికటకవులిక లేరు! ఆ తెలివిని, ఆ విజన్‌ని కలిపి దూరదర్శన్ వాళ్లు ‘తెనాలి రామ’గా ప్రసారం చేశారు.పదికాలాల నవ్వుల పువ్వుల్ని పూయించారు. బతుకు బాటలో అతను హాస్య చతురత కల చమత్కారి. కష్టాన్ని తన ప్రతిభతో ఇష్టసఖిగా మార్చుకొని ఇంటి ముంగిట్లో కట్టేసుకున్న ధీశాలి. తలతీసేయాల్సిన పరిస్థితుల్లోనూ తలవంచక చమత్కారంతో మరణం చేతనే మెప్పు సాధించిన మహా మేధావి. తెలుగువారినే కాదు భారతదేశమంతా తన ప్రతిభతో ఆకట్టుకున్నవాడు. అతని పేరు చెప్పగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరి పెదవులపై చిరునవ్వు చేరుతుంది. ఆ తెలివికి జోహార్ అంటుంది. అతడిని పరిచయం చేసుకోవాలంటే రాయల భువనవిజయానికి బయల్దేరాలి. ఆ కాలానికి వెళ్లాలంటే ఇప్పుడు మనకు టైమ్ మిషన్ అక్కర్లేదు. 90ల కాలంలో దూరదర్శన్‌లో వచ్చిన ‘తెనాలి రామ’ సీరియల్‌ను చూస్తే చాలు. నాటి చారిత్రక సంఘటలను కథలుగా పరిచయం చేయడానికి టెలివిజన్ నాడు ఎంతగానో ఉపయోగపడింది. అందుకు ఉదాహరణ ‘తెనాలి రామ’కృష్ణ కవి కథలనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో కూడిన సీరియల్స్ ఎన్ని వచ్చినప్పటికీ ‘తెనాలి రామ’ సీరియల్ ప్రస్తావన వస్తే మాత్రం నాటి పిల్లలు ఇప్పటికీ గొప్పగా చెబుతుంటారు. నాటి నుంచి నేటి వరకు టెలివిజన్ ఎన్నో ఆసక్తికర సీరియల్స్‌ను ప్రచారం చేసినప్పటికీ హాస్య సీరియల్స్‌లో తెనాలి రామ పెద్ద లెజండ్. బద్దకిస్టు రామకృష్ణుడు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పుట్టింది గుంటూరులో. కొన్నాళ్లకే తండ్రి మరణించడంతో తల్లి ఎంతో కష్టమ్మీద రామకృష్ణను పెంచుతుంటుంది. రామకృష్ణ సోమరిపోతు. ఎప్పుడూ నిద్రపోవాలని చూస్తుంటాడు. తినమని పండు ఇస్తే దాని తొక్క తీయాలి కదా అని బద్ధకించి అలాగే చేతిలో పెట్టుకొని నిద్రపోతాడు. స్కూల్‌కి వెళితే గురువు చెప్పే పాఠాల మీద ఎంత మాత్రమూ ఆసక్తి ఉండదు. తల్లికి రామకృష్ణ పెంపకం చాలా తలనొప్పిగా ఉంటుంది. నదిలో స్నానం చేసి రమ్మని తల్లి పోరితే వెళ్లి అక్కడి బండరాళ్ల మీద పడుకొని నిద్రపోతుంటాడు. నది దగ్గర జపం చేసుకుంటున్న ఒక సాధువు రామకృష్ణ పడుకుని ఉండడం చూసి ఓ రోజు విసుక్కుంటాడు ‘కాళీమాత గుడికి వెళ్లి పడుకోపో.. నా జపానికి విఘాతం కలిగించకు’ అని కోప్పడతాడు. విధిలేక రామకృష్ణ అమ్మవారి గుడికి వెళతాడు. ఆకలేస్తే తనకు కావల్సిన ప్రసాదాన్ని తినేసి అక్కడే పడుకుంటాడు. కలలో దేవత ప్రత్యక్షమై ధనం, జ్ఞానం ఉన్న రెండు గిన్నెల నిండా ప్రసాదం ఇస్తుంది తినమని. అవి తిన్న రామకృష్ణుడు నిద్రలేచి అమ్మవారి వైపుగా చూస్తాడు. ఆమె పాదాల వద్ద గిన్నెలోని ప్రసాదాన్ని సేవించి, దండం పెట్టుకొని పరుగున ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే రామకృష్ణుడు పడుకొని లేకపోవడం చూసిన తల్లి ఆశ్చర్యపోతుంది. ఎక్కడా కనిపించకపోవడంతో నది దగ్గరకు వెళుతుంది. కొడుకు కనిపించడు. అక్కడే ఉన్న సాధువుని అడుగుతుంది తన కొడుకు గురించి. ‘రామకృష్ణుడు బ్రహ్మముహూర్తంలోనే వచ్చి నదీ స్నానం చేసి వెళ్లాడు’ అని చెబుతాడు. తల్లి ఆశ్చర్యపోతూ ఇంటికి చేరుకుంటుంది. రామకృష్ణుడు పూజ చేస్తూ కనిపిస్తాడు. ఆకలేస్తుందని, పాఠశాలకు వెళ్లాలని ఏదైనా తినడానికి ఇమ్మని తల్లిని త్వరపెడతాడు. ఆవుకు మేత తెచ్చి వేస్తాడు. తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తాడు. ఖాళీ సమయం ఉంటే పాఠాలు వల్లెవేస్తుంటాడు. గురువును మెప్పించిన శిష్యుడు అవుతాడు. తల్లి ఆనందంతో కొడుకును చూసుకొని మురిసిపోతుంది. చిన్ననాటి చమత్కారం ఇంటిలో సరుకులు మోయడానికి కష్టంగా ఉందని తెలుసుకున్న రామకృష్ణుడు ఓ ఆలోచన చేస్తాడు. ఓ రోజు బట్టలు ఉతికే అతని దగ్గరకు వెళ్లి తన మాటలతో మెప్పించి, గాడిదను తీసుకెళతాడు. కొంతదూరం వెళ్లాక గాడిదకు శక్తి లేక అడుగు వేయలేకపోతుంది. మేతకోసం చూస్తాడు. ఒకామె గడ్డిమోపును నెత్తిమీద పెట్టుకొని అమ్ముకోవడానికి వెళ్లడం చూస్తాడు. ఆమెను కొద్దిగా మేత అడిగితే డబ్బు లేనిదే ఇవ్వను అంటుంది. గాడిదను తీసుకెళ్లి ఒకచోట ఉంచి, వచ్చీపోయేవాళ్లను చూస్తుంటాడు. దూరంగా ఒక సంపన్నుడు గుర్రం తీసుకొని రావడం చూస్తాడు. ఆ సమయంలో రామకృష్ణుడు గాడిదను ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ సంపన్నుడు ఆశ్చర్యపోయి ‘గాడిదను వేడుకుంటున్నావేం’ అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు ‘ఈ గాడిద మహిమాన్వితమైనది. దీనికి పిడికెడు గడ్డి వేస్తే ఏం కోరుకుంటే అది అవుతుంద’ని, చెబుతాడు. గడ్డి అమ్ముడుపోక నీరసంగా ఒక దగ్గర కూర్చున్న ఆమె దగ్గరకు వెళ్లి పిడికెడు గడ్డి కొని తీసుకొస్తే చాలంటాడు. ఆ సంపన్నుడు అలాగే చేస్తాడు. ఆ తర్వాత దారిన పోయేవారంతా వచ్చి గాడిదకు గడ్డి కొని ఇస్తారు, డబ్బులూ సమర్పించుకుంటారు. ఒకరు ఇద్దరు పోయి వందల మంది గాడిదకు మేత వేయడానికి వస్తారు. సాయంకాలమయ్యాక అంతా వెళ్లిపోయి రేపు రండి అని చెబుతాడు. సాయంకాలం బట్టలు ఉతికే అతను రామకృష్ణుడు తల్లి దగ్గరకు వచ్చి నా గాడిదను ఇవ్వమని వేడుకుంటాడు. తల్లి ఆశ్చర్యపోతుంది. అప్పుడే గాడిదతో వచ్చిన రామకృష్ణుడు ‘గాడిద మహారాజు సంపాదన ఇది. ఇదంతా నీదే’ అని బట్టలు ఉతికే అతనికి ఇస్తాడు. ‘నా సంపాదన ఇది’ అంటూ తల్లికి కొంత భాగాన్ని ఇస్తాడు. మాటలతో కోటలు చమత్కారానికో, లేక పిలవడానికి సులువు అనో కానీ.. కొద్ది కాలంలో రామకృష్ణుడినే ఊరివాళ్లు రామలింగా అని పిలిచేవారు. తల్లికి పనుల్లో సాయపడుతూ, విద్యను అభ్యసిస్తూ పెరిగి పెద్దవుతాడు. పెళ్లి చేసుకొని గృహస్థు అవుతాడు. ఒకరోజు ఆ ఊళ్లో ఆచారి అనే వ్యక్తి రామలింగడి కాళ్ల మీద పడతాడు కాపాడమని. విషయం ఏంటని అడుగుతాడు రామకృష్ణుడు. సేట్ తన జాతకం అడిగితే చూసి ‘నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. నీ పరివారం అంతా ముందే మరణిస్తారు’ అని చెప్పాను. తన పనివాళ్లతో చెప్పి నన్ను కొట్టించడానికి సిద్ధమయ్యాడు. నా దోషమేమీ లేదు ఉన్నదున్నట్టు చెప్పాను’ వగరుస్తూ అన్నాడు ఆచారి. ఆచారికి ఓ రహస్యం చెప్పి సేట్ని కలుస్తాడు రామకృష్ణుడు. కోపంలో ఉన్న సేట్ ఆచారిని తెగ తిడుతుంటాడు. రామకృష్ణుడు వెళ్లగానే ‘ఇంట్లో అందరూ జబ్బు చేసి చచ్చిపోతారని వాడు చెప్పాడు. శాంతి చేయాలి..’ అని టెన్షన్ పడుతూ ఉంటాడు సేట్. ఆ ఆచారి చెప్పింది అబద్ధం. బృహస్పతి వరం పొందిన ఓ సిద్ధుడు చెట్టుకింద కొలువుదీరాడు. ఎవరితోనూ అతను మాట్లాడడు. ఈ రాత్రే వెళ్లి అతన్ని కలవండి’ అని చెబుతాడు రామకృష్ణుడు. అలాగేనని వెళతాడు సేట్. రామకృష్ణుడు చెప్పిన విధంగా చెట్టుకింద ఉన్న స్వామీజీని చూసి ‘స్వామీజీ నేను పెద్ద పరేశాన్లో ఉన్నాను. మా ఇంటి పరిస్థితి ఇది. దయచేసి చెప్పండి’ అని వేడుకుంటాడు. జాతకం చూసిన అతను.. ‘మూడేళ్ల క్రితం మీ తండ్రి మరణించారు. వారం రోజులుగా మీ ఇంట్లో వారంతా మంచం పట్టారు. నువ్వు దీర్ఘాయుష్కుడివి. మీ ఇంట్లో వారందరికంటే నువ్వు రెండేళ్లు ఎక్కువ కాలం బతుకుతావు’ అని చెబుతాడు. అతను చెప్పిన దానికి చాలా సంతోషించిన సేట్ డబ్బు కూడా ఇచ్చి దండం పెట్టుకుంటాడు. ఆ స్వామీజీ వేషం కట్టింది ఆచారియేనని ఆ సేట్‌కి తెలియదు. మాట తీరుతో ఆపదల నుంచి ఎలా బయటపడవచ్చో రామకృష్ణకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని నిరూపిస్తాడు. ఆచారి రామకృష్ణుడిని కలిసి ‘రామా.. నువ్వు చాలా చమత్కారివి. చెప్పినదాన్నే మరో విధంగా చెప్పి నన్ను కాపాడావు’ అని మెచ్చుకొని ‘ఇంత తెలివైనవాడివి ఈ ఊళ్లో ఉంటే ఎలా? నువ్వు రాజ సభలో ఉండాలి. ఎందుకు ప్రయత్నించకూడదు’ అంటాడు. ఆ ఆలోచనతో భార్య సీతతో విజయనగరం బయల్దేరుతాడు రామకృష్ణుడు. కోటలోకి దారేది కోటలోకి వెళ్లడానికి ఎవరి రికమెండేషనూ లేదు. కనీసం పరిచయస్థులెవరూ లేరు. రోజూ కోట దగ్గరకు చేరి వచ్చీపోయేవాళ్లను చూస్తుంటాడు. ఓ రోజు కోటలోకి వెళ్లబోతున్న రాజగురువును కలుసుకుంటాడు. ‘మీరు నాకు తెలుసు.. మీరు ఫలానా కదా! మీరు మా ఊరు వచ్చారు. అప్పుడు నేనే దగ్గరుండి భోజనం వడ్డించాను’ అంటూ.. మాటలు కలుపుతాడు. రాజగురువు సందేహంగా చూసి, అనేక ప్రశ్నలు వేసి, తిట్టి లోపలికి వెళ్లిపోతాడు. ఎలాగైనా లోపలికి వెళ్లాలనే ఆలోచన చేసిన రామకృష్ణుడు రాజ భటులతో ‘రాజగురువుతో మాట్లాడుతుండగా చూశారుగా. రాజు గొప్ప బహుమానం ఇస్తానని చెబితే వచ్చాను. అందులో కొంత భాగం మీకు ఇద్దామనుకున్నాను. కానీ, మీరు లోపలికి వెళ్లనివ్వడం లేదు’ అంటాడు. ఆ మాటలు భటులను ఆకట్టుకుంటాయి. బహుమానంలో తమకూ కొంత భాగం ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటారు వాళ్లు. అలా కోటలోకి వెళతాడు రామకృష్ణుడు. కోటలో మొదటి ఛాలెంజ్ రాయల సభ కొలువుదీరి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన కాళీచరణ్ అనే ఇంద్రజాలికుడు తన విద్యలన్నీ ప్రదర్శిస్తుంటాడు. అందరూ అతన్ని కీర్తిస్తారు. ‘నాతో పోటీ పడేవారు మీ రాజ్యం లో ఉన్నారా?’ అని సవాల్ విసురుతాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో రామకృష్ణుడు ‘మహారాజా అనుమతి ఇస్తే, నేను ఈ సవాల్‌ను ఎదుర్కొంటాను’ అని ముందుకు వస్తాడు. రాజు అనుమతితో కారం తెప్పించి, ‘ఈ కారం కళ్ల మీదుగా వేసుకొని భరించగలవా?’ అంటాడు. తన వల్ల కాదంటాడు ఇంద్రజాలికుడు. రామకృష్ణుడు రెండు గుప్పిళ్ల నిండుగా కారం తీసుకొని, కళ్లు మూసుకొని ఆ కళ్ల మీదుగా పోసుకుంటాడు. ఇంద్రజాలికుడు తన ఓటమిని ఒప్పుకొని వెనుదిరిగిపోతాడు. రాజు రామకృష్ణుడి తెలివికి మెచ్చుకొని బహుమానం కోరుకోమంటే ‘వంద కొరడా దెబ్బలను ఇప్పించండి ప్రభూ’ అని వేడుకుంటాడు. ఇంత విచిత్రమైన కోరిక ఎవరూ కోరరు. అయినా సరే కానీ, అంటూ కొరడా దెబ్బలను అమలు చేయమంటాడు. అప్పుడు రామకృష్ణుడు ‘ప్రభూ తమకో విజ్ఞప్తి. ముగ్గురు ద్వారపాలకులకు మీరు ఇచ్చే బహుమానం ఇస్తాను అనే మాట మీద లోపలికి వచ్చాను. వాళ్లకు కూడా ఈ ఇనామ్లో భాగం ఉంది మహారాజా’ అని కోరుతాడు. ఆ ద్వారపాలకులను పిలిపించమంటాడు రాజు. లంచగొండులుగా మారిన ఆ ద్వారపాలకులకు అలా శిక్షపడేలా చేస్తాడు రామకృష్ణుడు. అంతేకాదు మహారాజు తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేలా ఆలోచన చేస్తాడు. రామకృష్ణుడి చాతుర్యాన్ని మెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు తన సాహిత్యసభలో కవిగా కొనసాగమని చేతి ఉంగరాన్ని బహుకరిస్తాడు. అలా రామకృష్ణుడు భువన విజయంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరిగా చేరిపోయాడు. వికటకవిగా పేరొందిన రామకృష్ణుడు 16వ శతాబ్దికి చెందినవాడు. ఇతని జీవిత సంఘటనలన్నీ చమత్కారపు కథనాలుగానే ఆకట్టుకుంటాయి. అక్బర్–బీర్బల్ కథల మాదిరిగానే రాయలు–రామకృష్ణుడు కథలుగా, తెనాలిరామలింగడి కథలుగా చిన్నాపెద్దను ఆకట్టుకున్నాయి. ఈ కథలను దర్శించిన చిన్నా పెద్ద పెదవులపై నవ్వులను పూశాయి. ‘శభాష్ తెనాలి రామ’ అని రామకృష్ణ తెలివికి జనం చేతులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశాయి. – ఎన్.ఆర్ దొంగల చేత నీళ్లు ఓ రాత్రి పూట తన ఇంట్లో దొంగలు పడి సొత్తు దోచుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటాడు రామకృçష్ణుడు. భార్యతో గట్టిగా అరిచి చెబుతూ ‘మన ఇంట్లో దొంగలు పడి, సర్వమూ దోచుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ‘నగలు, డబ్బు అంతా మూట గట్టి బావిలో వేద్దాం’ అని దొంగలకు వినపడేలా చెప్పి, ఓ మూటను బావిలో వేస్తాడు. రామకృష్ణుడు బావిలో వేసింది నగలు, డబ్బు ఉన్న మూటనే అని నమ్మిన దొంగలు తెల్లవార్లూ బావిలో నీటిని తోడుతూనే ఉంటారు. రామకృష్ణుడు ఆ నీటిని తన తోటకు పాదులు తీసి, మళ్లించుకుంటూ ఉంటాడు. తెల్లవారు జామున అలసిపోయిన దొంగలతో తోటకు నీళ్లు సరిపోయేలా పనిచేశారని కృతజ్ఞతలు చెబుతాడు రామకృష్ణుడు. అంతే! దొంగలు పారిపోతారు. తెనాలి రామ ►‘తెనాలి రామ’ సీరియల్‌ను తీసిన దర్శకుడు టి.ఎస్.నాగభరణ. రామకృష్ణుడిగా నాగభరణయే ఈ సీరియల్లో నటించారు. ►చిన్ననాటి రామకృష్ణుడిగా మాస్టర్ కార్తీక్ నటనలో మెప్పించాడు. ►కథా రచయిత్రి కమలా లక్ష్మణ్ (ఆర్కే లక్ష్మణ్ సతీమణి) రాసిన కథలే తెనాలి రామ సీరియల్‌కు మూలం. ►ఆర్కేలక్ష్మణ్ ఈ సీరియల్‌కి కార్టూన్ లైన్స్ ఇచ్చారు. ►రామకృష్ణుడు పెరిగింది తెనాలి అగ్రహారమైన తూములూరులో.ఇంటిపేరు గార్లపాటి కన్నా తెనాలి అనేపేరే రామకృష్ణుడి ఇంటిపేరుగా స్థిరపడింది.రామకృష్ణుడికే రామలింగడు అనే మరో పేరు ఉంది. -
చెట్టు దిగిన చిక్కుముడి
ఒకరికి ప్రశ్నించే హక్కుందనిదానికి జవాబివ్వాల్సిన బాధ్యతఇంకొకరికి ఉండదు.అలాగని చిక్కుముడి ప్రశ్నకుచటుక్కున ఆన్సర్ ఇవ్వలేకపోతే..మనకే అదోలా ఉంటుంది.ఈ థీమ్‌ని పట్టుకుని అద్భుతంగా అల్లిన ప్రశ్నావళికిసమాధానాల సరళే.. బేతాల్! ‘విక్రమ్ ఔర్ బేతాల్’ కథల సీరీస్‌ను రామాయణాన్ని తీసిన రామానంద్‌సాగర్ తన సాగర్ ఆర్ట్స్ లిమిటెడ్ ద్వారా 1985లో బుల్లితెర ద్వారా పరిచయం చేశారు. దాదాపు 52 నిమిషాల నిడివిగల ఈ సీరియల్ హిందీ, గుజరాత్ భాషలలో మొత్తం 26 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. కథల పుట్టుక మహాకవి సోమ్‌దేవ్ భట్టు 2,500 ఏళ్ల క్రితం కథాసరిత్సాగరంలో చోటుచేసుకున్న‘బేతాల్ పచ్చీసి’ కథలే ఈ విక్రమ్ ఔర్ బేతాల్ కథలకు మూలం. భూతాలకు అధిపతి అయిన బేతాలుడు రాజు విక్రమాదిత్యునికి చెప్పిన కథలివి. విక్రమాదిత్యుడు ఉజ్జయిని రాజు. ఈ రాజుకు ఒక భిక్షువు ప్రతీ రోజు ఒకపండును కానుకగా ఇచ్చి వెళుతుండేవాడు. ఆ భిక్షువు ఇచ్చిన ఫలం కోశాగారంలో భద్రపరుస్తుండేవారు. కొన్నాళ్లు గడిచాక సందేహం వచ్చి ఒక పండును కోయగా దాని నుంచి ఒక విలువైన రత్నం బయటపడుతుంది. రాజు అప్పటి వరకు తీసుకున్న ఫలాలన్నింటినీ తెప్పించి సగానికి కోయగా ఎన్ని ఫలాలు ఉన్నాయో అన్ని రత్నాలు బయటపడతాయి. మరుసటి రోజు ఆ భిక్షువు యధాప్రకారం రాజుకు ఫలాన్ని ఇవ్వబోగా దీనికి కారణమేంటో వివరిస్తేనే తీసుకుంటానని చెబుతాడు. దీంతో ఆ భిక్షువు మంత్రసిద్ధి కోసం తనకొక వీరుని సాయం అవసరమని, అది మీరే అని చెబుతాడు. దాంతో ఆ భిక్షువుకి సాయపడతానని విక్రమాదిత్యుడు మాట ఇస్తాడు. దాంట్లో భాగంగానే భిక్షువు రాబోయే అమావాస్య ముందు రోజు అర్ధరాత్రి రాజును శ్మశానానికి వచ్చి కలవమంటాడు. అలాగే అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లిన రాజును ఆ భిక్షువు శ్మశానంలో చెట్టుకు వేలాడుతున్న ఒక పురుష శవాన్ని తీసుకొచ్చి తనకు అప్పగించమని కోరుతాడు. ఆ ప్రయత్నంలో శవాన్ని తన వద్దకు తెచ్చేంతవరకూ మౌనం పాటించమని రాజుకు సూచిస్తాడు. ఆ భిక్షువు చెప్పిన విధంగా చెట్టుకు వేలాడుతున్న శవాన్ని దించి భుజం మీద మోసుకొని మౌనంగా వస్తుండగా ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు రాజుకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథను చెప్పి, ఆ కథ చివరలో ఒక చిక్కు ప్రశ్న వేసి దానికి సరైన జవాబు తెలిసీ చెప్పకపోతే తల పగిలి ఛస్తావని హెచ్చరిస్తాడు. విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పడంతో మౌనభంగం అయిన బేతాలుడు అదృశ్యమై శవం తిరిగి చెట్టుకు వేలాడుతుంది. దీంతో రాజు ఆ శవాన్ని పట్టి తేవడం కోసం మళ్లీ మరుసటి అర్ధరాత్రి వెళ్లి ప్రయత్నిస్తాడు. ఈ విధంగా ప్రతీసారి రాజు శవాన్ని మోసుకురావడానికి ప్రయత్నించడం, ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు చిక్కుముడులతో ఉన్న కథలను వరుసగా 25 రాత్రుళ్ళు చెబుతాడు. ప్రతి కథ చివరలో రాజుకు బేతాళుడు ప్రశ్న వేయడం, అతను వాటికి సరైన సమాధానం ఇవ్వడం, తిరిగి బేతాళుడు అదృశ్యం అయ్యి శవం చెట్టుకు వేళ్లాడ్డం, రాజు మళ్ళీ పట్టు విడవకుండా బేతాళుని కోసం ప్రయత్నించడం జరుగుతూనే ఉంటుంది. కథ ముగిసిన తీరు చివరకు 25వ కథలోని చిక్కుప్రశ్నకు విక్రమార్కుడికి సమాధానం తెలియక మౌనంగా ఉంటాడు. అప్పుడు బేతాళునితో జరిగిన సంభాషణలో భిక్షువు కపట క్షుద్ర తాంత్రిక సిద్ధుడు అని తెలుస్తుంది విక్రమార్కుడికి. అతను తననే బలి ఇచ్చే కుటిల పన్నాగాన్ని పన్నాడని తెలుసుకుంటాడు. శవాన్ని భుజం మీదుగా వేసుకొని విక్రమాదిత్యుడు భిక్షువు వద్దకు వస్తాడు. భిక్షువు తాంత్రిక పూజలు చేసి రాజును బలి ఇవ్వాలని అనుకుంటాడు. అయితే, ముందే ఈ ప్రమాదాన్ని గ్రహించిన రాజు ఆ కపట తాంత్రికుని శిరస్సును ఖండించి బేతాళుడికి అర్పిస్తాడు. ప్రసన్నుడైన భేతాళుడు విక్రమాదిత్యుడిని భూమండలానికి చక్రవర్తి కాగలవని దీవిస్తాడు. విక్రమార్కుని ద్వారా ‘బేతాళ పంచవింశతి’ పేరుతో ఈ కథలు ప్రపంచమంతటా తెలు స్తాయి. ఇదీ మూల కథ. బేతాళుడు చెప్పిన కథలు మొదటి ఎపిసోడ్ కథ విధివశాత్తూ భర్త, సోదరుడు ఒకేసారి మరణించి వారి తలలు, మొండేలు వేరై తారుమారుగా అతికించబడతాయి. పునర్జీవులైన భర్త, సోదరులలో తిరిగి ఎవరిని భర్తగా, ఎవరిని సోదరుడిగా స్వీకరించాలో తెలియక అయెమయంలో పడిన ఒక యువతికి ఎదురైన ధర్మ సంకటం గురించిన కథ ఇది.‘వారిద్దరిలో ఎవరు ఆమెకు భర్త?’ అడుగుతాడు విక్రమార్కుడిని బేతాళుడు. ఇది ఆ రాజును అడిగిన ప్రశ్న కాదు ప్రేక్షకులను అడిగిన ప్రశ్న. అతనా సమాధానం కోసం ఆలోచనలో పడగా ..‘మనిషి దేహాన్ని నియంత్రణ చేసేది మెదడు. కాబట్టి మెదడు ఉన్న తలకే ఆమె వరమాల’ అని చెబుతాడు రాజు. \ రెండవ ఎపిసోడ్ కథ మహారాజు రూపసేనుడి ప్రాణాలను రక్షించడం కోసం అతని బంటు అయిన వీరవరుడు ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. ఇది తెలిసిన అతని కుటుంబం అంతా ఒకరి తర్వాత ఒకరు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడతారు. విషయం తెలిసిన రాజు రూపసేనుడు వీరవరుడిని రక్షించాల్సిన బాధ్యత తనదేనని, దేవతకు తనే ఆహారం అవ్వాలని నిశ్చయించుకొని రాజ్యాన్ని వదిలి గుహకు చేరుకుంటాడు. అప్పటికే వీరవరుడు దేవతకు ఆహారం అవుతాడు. అతని విశ్వాసానికి దేవత ఎనలేని సంపదను అనుగ్రహిస్తుంది.‘విధులను నిర్వర్తించడంలో వీరవరుడు, రూపసేనుడు ఇద్దరిలో ఎవరు గొప్ప’ అని ప్రశ్నిస్తాడు బేతాళుడు. ‘రాజును కాపాడడం బంటుగా వీరవరుడి విధి. అది గొప్ప కాదు. తనకు అవసరం లేకపోయినా మానవత్వంతో ఒకరి ప్రాణాలని కాపాడాలని నిశ్చయించుకున్న రాజు తన ప్రాణాలను త్యాగం చేయడం గొప్ప’ అని చెబుతాడు విక్రమార్కుడు. ఇలాంటి చిక్కుముడుల కథలు ఈ సీరియల్లో మరో 23 ఉన్నాయి. దెయ్యాల కథలు, రాజుల కథలు అంటే అందరికీ ముఖ్యంగా పిల్లలకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వాటిని పట్టువదలకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మెప్పించింది దూరదర్శన్. ఇప్పటికీ నాటి పిల్లల కళ్లముందు ఆ కథలు దృశ్యరూపకంగా కదలాడుతూనే ఉండటం విశేషం. – ఎన్.ఆర్ ►రామానంద్‌సాగర్ రామాయణానికి రెండేళ్ల ముందుగానే ‘విక్రమ్ ఔర్ బేతాల్’ సీరియల్‌ని అందించారు ►రామాయణం సీరియల్ ద్వారా యావత్ భారతదేశానికి సుపరిచితుడైన అరుణ్‌గోవిల్ ఈ సీరియల్లో విక్రమాదిత్యుని పాత్ర పోషించారు ►రామాయణంలో సీతగా నటించిన దీపికా చికాలియా బేతాల్ కథలలోని చాలా పాత్రలలో నటించారు ►బేతాళుడిగా బాలీవుడ్ స్టేజ్ యాక్టర్ సజ్జన్‌లాల్ పురోహిత్ నటించారు. సజ్జన్ ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలోనూ నటించారు ►తర్వాతి కాలంలో వచ్చిన బేతాళుడి యానిమేటెడ్ మూవీస్‌కి, ధారావాహికలకు 80ల కాలం నాటి ‘విక్రమ్ ఔర్ బేతాల్’ సీరియలే స్ఫూర్తి. -
పీఠ ముడి
అధికార పీఠం చేసిన అవమానానికిఅతడు శపథం చేసి సిగముడి వీడాడు.ఆ అధికారాన్ని అంతం చేశాకే తిరిగి సిగముడి కట్టాడు.అతడు పట్టు పడితే వీడని మొండివాడు.శపథం నెరవేరే వరకుమరలని జగమొండివాడు.అందుకే అతడిది చాణక్య శపథంగా వాసికెక్కింది.ఆ ‘పీఠ’ ముడి గురించే ఈ సీరియల్. సూక్ష్మబుద్ధి గల చాణక్యుడు తన రాజకీయ చతురతతో దిగ్గజాలతో ఢీకొని అనుకున్నది సాధించాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ చదువు విలువ తెలిసి, తక్షశిల విశ్వవిద్యాలయంలో ప్రతిభను కనబరచి అపారమేధస్సుతో భరతజాతి గుండెల్లో అమరుడై నిలిచాడు. అతనే చాణక్యుడు. కౌటిల్యుడిగా అర్థశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని, భౌతిక, మానసిక తత్వశాస్త్రాలను ఔపోసన పట్టి ప్రపంచానికి అందించాడు. ఇతని కథను దేశ ప్రజలకు దర్శనీయం చేసిన బుల్లితెర చారిత్రక కథనాలను అందించడంలో మరో మైలురాయిని తన ఖాతాలో జమ చేసుకుంది. ద్వివేది శపథం కౌరవసభ మధ్యలో అందరిముందు తనకు జరిగిన అవమానానికి ప్రతిగా కౌరవుల రక్తంతో తన కురులను తడిపేవరకు వాటిని ముడివేయనని ప్రతిజ్ఞ చేస్తుంది మహాభారతంలో ద్రౌపది. పాటలీపుత్ర సభలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా నందరాజులను రాజ్యహీనులను చేస్తానని, అప్పటివరకు తన శిఖ కురులను ముడివేయనని శపథం చేస్తాడు చాణక్యుడు. మొదటి సంఘటన ద్వాపర యుగంలో జరిగింది. రెండవది కలియుగంలో జరిగింది. రెండూ చారిత్రక ఘట్టాలే. రెండింటి నుంచీ నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో. తొమ్మిదేళ్లపాటు చాణక్యుడి అర్థశాస్త్రంతో సహా 180 పుస్తకాలను చదివి, అర్ధం చేసుకొన్న దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది తనకు తానే శపథం చేసుకున్నాడు ‘ఎలాగైనా సరే ఈ రాజనీతిజ్ఞుడిని బుల్లితెర మీద ఆవిష్కరింపజేయాలి’ అని. అప్పటికే వాడుకలో ఉన్న చారిత్రక కథ చాణక్యుడిది. ఒక పేద బ్రాహ్మణుడు అంచెలంచెలుగా ఎదిగి, తన సూక్ష్మబుద్ధితో ప్రత్యర్థులను మట్టికరిపించిన విధానాన్ని చూపాలనుకున్నాడు. అతనికున్న అపారమేధాశక్తిని దేశప్రజల కళ్లకు కట్టాలనుకున్నాడు. చాణక్యుడి జీవితం గురించి పరిశోధన చే శాడు. ‘జాతీయ స్పృహ కలిగిన మొట్టమొదటి వ్యక్తి’గా చాణక్యుడిని అభివర్ణించాడు ద్వివేది. 1988లోనే పైలట్ ఎపిసోడ్‌ను దూరదర్శన్‌కి సబ్మిట్ చేశారు ద్వివేది. అయితే, బిఆర్ చోప్రా మహాభారత్ పట్ల వారు ఆసక్తిగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ తెరమీద రక్తి కట్టించడానికి మరో మూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1991 సెప్టెంబరులో ప్రసార మైన ‘చాణక్య’ ఆగస్టు 1992 వరకు మొత్తం 47 ఎపిసోడ్లలో ప్రసారమైంది. మొత్తం మూడు పార్టులు.. వాటిలో... 1. మగధ రాజ్యాన్ని పాలిస్తున్న చంద్రగుప్తుడు ధననందుడి కుమారుడు. ఇతని రాజ్య విశేషాలను ఈ భాగంలో చూపారు. 2. నందుల పాలనపై చాణక్యుడి సాయంతో చంద్రగుప్తుడు ఎదురుదాడి చేసి, గెలవడం.. ఈ భాగంలో చూడచ్చు. 3.అలెగ్జాండర్ ఉత్తరభారత దేశాన్ని ముట్టడి చేసే సమయంలో చంద్రగుప్త నాయకత్వంలో చాణక్యుని రాజనీతి చతురతతో వారిని తిప్పికొట్టడం చూస్తాం. రాజకీయ చతురతతో కూడిన ఈ మూడు భాగాలను ప్రముఖంగా ఫ్రేమ్ వర్క్ చేసుకోవడానికి చాణక్యుడి యుద్ధకౌశలం పట్ల ముగ్ధుడవడమే కారణం అంటారు దర్శకుడు ద్వివేది. కథ ఇదీ.. ‘పాటలీపుత్రాన్ని మహాపద్మనందుడు తన ఎనిమిది మంది కుమారుల సాయంతో పాలించేవాడు. మహాపద్మనందునికి ఇళ, ముర అని ఇద్దరు రాణులు. ఇళకు ఎనిమిది మంది కొడుకులు, మురకు చంద్రగుప్తుడు ఒక్కడే కొడుకు. ఈ ఎనిమిది మంది నందులు తమ తమ్ముడైన చంద్రగుప్తుని చంపడానికి ఎన్నో దురాలోచనలు చేసేవారు. ఒకరోజు పేదవాడిగా కనిపించే చాణక్యుడు నందరాజుల సభకు వచ్చి, అక్కడి ఉన్నతాసనంపై కూర్చున్నాడు. పేదవాడనే కారణంతో నందులు అతన్ని తిరస్కారభావంతో చూసి, సింహాసనం నుండి కిందకు లాగి పడేస్తారు. నందుల రాక్షసమంత్రి ఇది సరైనది కాదని వారికి నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోతుంది. తనను అవమానించిన నందులపై ఆగ్రహించిన చాణక్యుడు ‘ అందరి మధ్య ఇలా అవమానించారు. మిమ్మల్ని కూడా ఇలాగే సింహాసనం నుండి లాగి, మీ తలలను నరికి గానీ ఈ జుట్టు ముడి వేయను’ అని శపథం చేసి అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు. నందుల తమ్ముడు చంద్రగుప్తుడు రహస్యంగా చాణక్యుడిని కలుస్తాడు. మొదటి ప్రతిజ్ఞ నందుల నాశనం అయితే, రెండవ ప్రతిజ్ఞ నందరాజ్యానికి చంద్రగుప్తుని రాజుని చేయడం అంటాడు చాణక్యుడు. ఆ తర్వాత తన రాజకీయ చతురతతో నందులను యుద్ధంలో ఓడించి, వారిని చంపి తన తలవెంట్రుకలను ముడుస్తాడు. ముందు అనుకున్న విధంగా చంద్రగుప్తుణ్ణి రాజును చేశాడు. ఈ విధంగా రెండు ప్రతిజ్ఞలను నెరవేర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా అనేక దండయాత్రలు తన ఆధ్వర్యంలో జరిపి, పాటలీపుత్రాన్ని మగధ రాజ్యంగా విస్తరింపజేసి చంద్రగుప్తుడిని చక్రవర్తిగా ప్రకటించాడు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి చెందిన చాణక్యుడు రాజనీతి శాస్త్రంతోపాటు అర్థశాస్త్రాన్ని రచించాడు. భౌతిక, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణుడు. తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పాడు. ప్రకాష్ ద్వివేది ద్విపాత్రాభినయం ∙చాణక్యుడిగా దర్శకుడైన ప్రకాష్ ద్వివేది తన నట విశ్వరూపం చూపడం ఇందులో విశేషంగా చెప్పుకోవచ్చు. చాణక్యుడిగా, చంద్రగుప్తుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ∙చాణక్య సీరియల్ ‘ఇండియన్ టెలివిజన్‌కి ఒక మైలురాయి’ అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబడిన ఈ సీరియల్ ఐదు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. సీరియల్ ప్రామాణికత, నటీనటుల నటనను దేశమంతా విస్తృతంగా ప్రశంసించింది ∙ప్రముఖ దర్శకుడు శ్యామ్‌బెనెగల్ కూడా ఈ సీరియల్‌కి తన సహకారాన్ని అందించారు ∙చాణక్య సీరియల్కన్నా ముందు ద్వివేది స్టేజీ యాక్టర్‌గా కొనసాగేవారు. -
కంటే కలలే కనాలి
మధ్యతరగతి జీవితానికి జీతం సరిపోదు.అయితే అరకొరా... ఇల్లాలి కొరకొరా.వనరులు పెంచుకోవాలంటే స్టార్స్ కనిపిస్తాయి.ఇక పెంచుకోదగ్గది... అలా పెంచుకునే వీలైనది ఒక్కటే ఒకటి... ఆశ.చుట్టూ కష్టాలు కనపడుతుంటే ఏం ఆశించగలం?అందుకే ఒక కునుకు తీయండి. ఒక కల కనండి. 1990ల కాలం అంటే అప్పటికి ఇందిరా గాంధీ చనిపోయింది. రాజీవ్‌గాంధీ ఓడిపోయాడు. వి.పి.సింగ్, అతని తర్వాత చంద్రశేఖర్... వీరి పాలనలో దేశం ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి గురించి చర్చలు జరుగుతున్నాయి. కాని అవకాశాలు ఎక్కడా లేవు. సంపద లేదు. సామాన్యుడు సూపర్‌స్టార్ అవడానికి వీలయ్యే పరిస్థితులు లేవు. సగటు మగాడి జీవితం జానా బెత్తెడుగా ఉంది. ఏదో ఒక పని చేయడం, భార్యాపిల్లలను పోషించుకోవడం, రాత్రిళ్లు ముడుచుకుని పడుకోవడం... పెద్ద పెద్ద కలలు కనేందుకు కూడా ఎవరూ సాహసం చేయని పరిస్థితి (దేశంలో 2000 సంవత్సరం తర్వాత ఆర్థిక సరళీకరణల ఫలితంగా ధనం అందుబాటులోకి రావడం, సాఫ్ట్వేర్ రంగం ఊపందుకోవడం, ఆ తర్వాతి కాలంలో అబ్దుల్ కలామ్ లాంటి వాళ్లు వచ్చి కలలు కనండి అని పిలుపు ఇవ్వడం మనకు తెలుసు. కాని 1990ల నాటికి కలలు కనడం కూడా ఖరీదైన వ్యవహారమే).ఇటువంటి సమయంలో దూరదర్శన్‌లో వచ్చిన ‘ముంగేరిలాల్ కే హసీన్ సప్నే’ సీరియల్ జనం తమ కష్టాలను కాసేపు నవ్వుకుని మర్చిపోయే వీలు కల్పించినట్టే చాలామంది సామాన్యులను మీకు కష్టాలు చుట్టుముడితే కళ్లు మూసుకొని కలల్లోకి వెళ్లండి... అక్కడైనా వాటిని తీర్చుకుని సేద తీరండి అని చెప్పింది.ఈ సీరియల్ ‘ముంగేరిలాల్’గా చేసిన రఘువీర్ యాదవ్ ట్రిపుల్ ఎం.ఏ చేశాడు. కాని ఉద్యోగం రాదు. అతడికి పిల్లనిచ్చిన మావ ఢిల్లీలో రికమండేషన్ చేసి ఏదో ప్రయివేటు కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంచుతాడు. ఇంట్లో భార్య, మామగారూ... ఆఫీసులో సాటి క్లర్కు, ఎప్పుడూ మేకప్ సరి చేసుకుంటూ పని ఎగ్గొట్టే లేడీ టైపిస్టూ, అవసరం లేకపోయినా చిందులు తొక్కే బాసు... వీరి మధ్య ముంగేరిలాల్ జీవితం మొదలవుతుంది.ముంగేరిలాల్ (అంటే ఇది మనవైపు సుబ్బయ్య వంటి ఒక కామన్ నేమ్) దుర్బలుడు. బలహీనంగా ఉంటాడు. భౌతికంగా కూడా అతడు హీరోగా జనం కళ్లకు ఆనడు. కాని అతడికి అదృష్టవశాత్తు ఒక జబ్బు ఉంది. నిలబడి కాని, పడుకుని కాని, ఆఫీసులో కాని, ఇంట్లో కాని అప్పటికప్పుడు కలల్లోకి వెళ్లిపోతాడు. ఆ క్షణంలో అతడి కుడి కన్ను, కుడి భుజం అదురుతాయి. ఆ తర్వాత కలలో క్షణాల్లో ప్రవేశిస్తాడు. ఆ కలల్లో తన నిజ జీవిత పాత్రలే మరో విధంగా తారసపడుతుంటాయి. ఆ పాత్రల మీద అతడు ఆధిపత్యం చెలాయిస్తుంటాడు.ఉదాహరణకు ఒక ఎపిసోడ్లో అతడి భార్య అతడితో సాయంత్రం ఊరిలోని కళాక్షేత్రంలో లతా మంగేశ్కర్ కచేరీ ఉందని దానికి వెళ్లే భాగ్యం తమకు లేదని వాపోతుంది. వెంటనే ముంగేరిలాల్ కలలోకి వెళ్లిపోతాడు. ఆ కలలో ముంగేరిలాల్ తన అసిస్టెంట్‌తో (నిజ జీవితంలో ఆఫీసులో టైపిస్ట్) కూచుని ఉంటాడు. హాల్ కిటకిటలాడుతుంటుంది. కాని లతా మంగేష్కర్‌కు ఏదో అవాంతరం వచ్చి కచేరీకి రాదు. నిర్వహాకుడు అంటే నిజ జీవితంలో ముంగేరిలాల్కు బాస్‌గా ఉన్న వ్యక్తి చాలా హైరానా పడుతుంటాడు. లతా రాకపోతే ప్రేక్షకులు పందిరి పీకి ఇల్లు కడతారని హడలిపోతాడు. ఇంతలో ఎవరో ఆ నిర్వాహకుడికి ఒక వార్త చెబుతారు. ప్రేక్షకుల్లో ముంగేరిలాల్ అనే మహా గానపండితుడు ఉన్నాడని ఆయన లతా మంగేష్కర్ కంటే గొప్పవాడని ఆయనను గనక బతిమిలాడుకుంటే ఆయన పాడితే గట్టెక్కేస్తామని చెబుతారు. అంతే. నిర్వాహకుడు వెళ్లి ముంగేరిలాల్ కాళ్ల మీద పడతాడు. ముంగేరిలాల్కు ఇది మొహమాటంగా ఉంటుంది. అరె.. నాకేదో నాలుగు ముక్కలు వస్తే ఏంటి మీరిలా ఇబ్బంది పెడతారు అన్నట్టుగా చూస్తాడు. కాని చివరకు స్టేజీ ఎక్కి అసిస్టెంట్‌తో కలిసి అద్భుతంగా పాటలు పాడి చప్పట్ల మోత మోగిస్తాడు. అలా ఇంట్లో ఉండే ముంగేరిలాల్ ఆ ఫంక్షన్ చుట్టి వస్తాడు.ముంగేరిలాల్ ఎపిసోడ్స్ అన్నీ ఇలాగే సాగుతాయి. ఒక ఎపిసోడ్లో నేరస్తులను పట్టుకుని పోలీసుగా, ఇంకో ఎపిసోడ్లో సరిహద్దులో శతృవుతో పోరాడే సిపాయిగా, ఇంకో ఎపిసోడ్లో కష్టమైన ఆపరేషన్‌ను అవలీలగా చేసి పారేసే డాక్టర్‌గా, మరో ఎపిసోడ్లో ఐశ్వర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. ఏ కలలో ఏ అవతారం ఎత్తినా అతడు చేసేది మాత్రం మంచి. పొందేది కూడా మంచి. మంచి కోరుకుంటూ కలలు కనడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిదే అని ఈ సీరియల్ చెబుతుంది. నిజ జీవితంలో నిస్పృహ కొంచెమైనా తీర్చుకోండి అని పిలుపు ఇస్తుంది.‘ముంగేరిలాల్ కే హసీన్ సప్నే’ 1990లో 13 ఎపిసోడ్లు ప్రసారం అయ్యింది. పెద్ద హిట్ అయ్యింది. ఇంట్లో పిల్లలూ పెద్దలూ హాయిగా ఆ సీరియల్‌ను చూశారు. ఆ పరంపర మన జానపదంలో కూడా ఉండటం వల్ల సులభంగా కనెక్ట్ అయ్యారు. పంచతంత్రంలో ఒక కుమ్మరి తాను మధ్యాహ్నం కునుకు తీస్తూ వందల కుండలు తయారు చేసి ఐశ్వర్యవంతుడు అయినట్టుగా భావించి కాలు తాటించి ఉన్న ఒక్క కుండనూ పగల గొట్టుకుంటాడు. అయితే అది పగటి కలలు చేటు అని చెప్పే కథ. ఇక్కడ మాత్రం పగటి కలలు పాజిటివ్ ఎనర్జీకి ఉపయోగపడతాయి అని చెప్పే కథ.రఘువీర్ యాదవ్ హీరోగా చేసిన తొలి సీరియల్ ఇది. ఈ సీరియల్‌తో అతడు దేశానికంతా పరిచయం అయ్యాడు. దీనికి ముందు ‘సలామ్ బాంబే’ సినిమాలో అతడు నటించినా జన సామాన్యానికి చేరువైంది ముంగేరిలాల్ తోనే.ఇక ఈ ఎపిసోడ్స్‌కు దర్శకత్వం వహించింది నేటి ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘గంగాజల్’, ‘రాజనీతి’, ‘అపహరణ్’ వంటి భారీ రాజకీయ చిత్రాలు తీసే ప్రకాష్ ఝా తన కెరీర్ ప్రారంభంలో ఒక మధ్యతరగతి జీవనాన్ని సున్నిత హాస్యంతో తీయడం మంచి జ్ఞాపకం అనుకోవాలి. మన దగ్గర పూరీ జగన్నాథ్ కూడా తొలి రోజుల్లో సరదా సీరియల్స్ దూరదర్శన్ కోసం తీశాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.1990లలో మధ్యతరగతి సంతోషాలను, చిన్నపాటి సంఘర్షణలను, ఒకరిలో మరొకరి పట్ల ఉండే ఆత్మీయతను ఆర్తిని సీరియల్స్‌గా తీసేవారు. ఇవాళ టీవీలో మధ్యతరగతి అనేది ఒకటి కనిపించకుండా పోయింది. అందరూ ఖరీదైన చీరలు నగలు పెట్టుకుని, మగవారైతే జుబ్బాలు దిగవిడుచుకుని కుట్రలు చేయడం ఎలా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. వంట గదిలో మొగుడూ పెళ్లాల చిర్రుబుర్రులు, పిల్లల స్కూళ్ల ఎంపిక దగ్గర చర్చోపచర్చలు, అయినవారి పెళ్లి కానుక విషయంలో ఒకరితో మరొకరు పడే పేచీలు, ఇంట్లో పెద్దవారు ఉంటే వారితో పిల్లలు పడే గారాలు, ఆఫీసులో కలీగ్స్‌తో చిన్నపాటి స్నేహాలూ స్పర్థలూ ఇవి లేకుండా పోయాయి.జాతీయ చానళ్లలో లేవు.ప్రాంతీయ చానళ్లలో కూడా లేవు.అందుకే అందమైన మధ్యతరగతి జీవితం ఒక కలలా మిగిలింది.మనం కూడా పగలో, రాత్రో ఒక కల గని ముంగేరిలాల్ వలే ఆ జీవితాన్ని దర్శించి ఆనందిద్దాం. ఊరట చెందుదాం. ►ముంగేరిలాల్ ఎపిసోడ్స్ అన్నీ ఇలాగే సాగుతాయి. ఒక ఎపిసోడ్లో నేరస్తులను పట్టుకుని పోలీసుగా, ఇంకో ఎపిసోడ్లో సరిహద్దులో శతృవుతో పోరాడే సిపాయిగా, ఇంకో ఎపిసోడ్లో కష్టమైన ఆపరేషన్‌ను అవలీలగా చేసి పారేసే డాక్టర్‌గా, మరో ఎపిసోడ్లో ఐశ్వర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. ఏ కలలో ఏ అవతారం ఎత్తినా అతడు చేసేది మాత్రం మంచి. -
కవాతు దర్శన్
దేశానికి సైనికుడిని చూపిన సీరియల్ అది. సైనిక శిబిరాలలో జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టిన కథ అది. కొత్తగా సైన్యంలో చేరిన జవాన్ల శిక్షణ ఈ సీరియల్లోనే జనం చూశారు. వారు నవ్వితే నవ్వారు వారు కవాతు చేస్తే ఉత్సాహపరిచారు దూరదర్శన్ తొలి సైనిక సీరియల్ ‘ఫౌజి’ విశేషాలివి.. అది ఇండియన్ ఆర్మీ. సైనికుల కవాతు, కమాండోల కఠోర శిక్షణ, వైమానికదళ విన్యాసాలు, యుద్ధ ట్యాంకుల మోతలు.. చూసే కళ్లల్లో స్థైర్యాన్ని, గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. ఆ ఆర్మీ ట్రెయినింగ్ స్కూల్‌కి కొత్తగా ఎనిమిది మంది కమాండోలు సెలక్టయ్యారు. వీరంతా సైన్యాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలి. అందుకే ఆ ఎనిమిది మందికి సుశిక్షితులైన ఆఫీసర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా సమయాన్ని కేటాయించారు. రన్నింగ్, రేసింగ్, కరాటే, బాక్సింగ్, జంపింగ్, షూటింగ్, క్లైంబింగ్.. వంటివెన్నో అత్యంత కఠినమైన ప్రక్రియలతో శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో యుద్ధవిమానాల నుంచి నేర్పుగా బయటపడటం, ప్యారాచూట్లను ఉపయోగించడంతోపాటు గన్షూట్స్, స్మోక్బాంబ్స్.. వంటివి శిక్షణలో భాగం చేశారు. ఎనిమిది మంది ప్రతీచోటా తమ ప్రతిభను చూపుతూనే ఉన్నారు. యుద్ధ సమయంలో ఎదురయ్యే సమస్యను ఎలా సవాల్‌గా ఎదుర్కోవాలో వివరిస్తున్నారు ఆఫీసర్లు. ఇదంతా బుల్లితెర పై చూస్తున్నవారికి కొత్తగా ఉంది. దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉండే ఆర్మీ వాతావరణం ఇంట్లో కూర్చోబెట్టి ప్రతి పౌరుడికి పాఠం చెబుతున్నట్టుగా ఉంది. అప్పటి వరకు హీరో హీరోయిన్ల డాన్సులు, కుటుంబ డ్రామాలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, పౌరాణిక కథలతో నిండిపోయిన చిన్నతెర ‘ఫౌజి’ పేరుతో సైనికులు వచ్చి కవాతు చేయడం ఆసక్తిదాయకమైంది. 1989 జనవరిలో ప్రసారమైన ఫౌజీ దేశభక్తికి సంబంధించిన అంశంగా ముందు ఎవరూ అనుకోలేదు. ఒక యదార్థ సెటప్ చిన్న తెరమీద అనుకోకుండానే సెట్ అవ్వడం అంతటా చర్చనీయాంశమైంది. కమాండోలు... కఠోర శిక్షణ ఎనిమిది మంది కమాండో టీమ్‌లో లెఫ్టినెంట్ అభిమన్యుది ప్రధాన పాత్ర. అభిమన్యుతో పాటు మరో ముగ్గురు కమాండోలు తమ తమ కాలేజీలలో ఒక్కో క్రీడలో ఛాంపియన్స్మని ఆఫీసర్స్‌తో గర్వంగా చెప్పుకుంటారు. అయితే, మేజర్ విక్రమ్రాయ్తో తలపడలేక వాళ్లు ఓడిపోవడంతో గిల్టీగా పీలవుతారు. విక్రమ్‌రాయ్ మాట్లాడుతూ– ‘మీరు క్రీడా మైదానంలో ఆడినవి ఆటలు మాత్రమే. ఇక్కడ ఇది పోరాటం. ప్రతీ క్షణం సవాలే’ అని హెచ్చరిస్తాడు. టీమ్ అంతా రాత్రుళ్లు కూర్చొని ఆ రోజు జరిగిన కఠిన శిక్షణ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శిక్షణను తట్టుకోలేక ఆర్మీ నుంచి పారిపోతే బాగుండు అనే ఆలోచన కూడా వారిలో వస్తుంది. కానీ, ఆ మరుక్షణమే తాము దేశరక్షణ కోసం ఏ విధంగా ఆర్మీలో చేరామో గుర్తుకు తెచ్చుకుని తర్వాతి పరీక్షకు సిద్ధం అవుతుంటారు. మేజర్ విక్రమ్‌రాయ్–అభిమన్యురాయ్ పేర్లకు దగ్గర పోలిక ఉందని టీమ్ సభ్యులు అంటే ‘విక్రమ్‌రాయ్ మా పెద్దన్న’ అని అభిమన్యు చెప్పడంతో అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియని టీమ్ ఆశ్చర్యపోతుంది. నిజానికి లెఫ్టినెంట్ అభిమన్యురాయ్ గతంలో చాలా సరదా సరదాగా గడిపే ప్లే బోయ్ తరహాకి చెందిన వాడై ఉంటాడు. కమాండో స్కూల్ నుంచి ఆర్మీలో చేరి కఠినశిక్షణలతో దేశరక్షణలో భాగస్తుడు అవుతాడు. ఆర్మీలో ఒంటరిగా ఉన్న సందర్భాల్లో అభిమన్యుకి పదే పదే ఇల్లు గుర్తుకు వస్తుంటుంది. తండ్రితో ఆడిన చెస్, తను గెలవడం కోసం తండ్రి ఓడిపోయిన విధానం, చిన్నతనంలో అన్నదమ్ములు చేసిన అల్లరిని గుర్తుకు తెచ్చుకుంటుంటాడు. అభిమన్యు పాత్ర ద్వారా ఆర్మీలో ఉన్న మిగతా జవాన్ల మానసిక స్థితి కళ్లకు కడుతుంది. సైనికుల ప్రేమలు – పెళ్ళిళ్లు కరకుగా ఉండే సైనికుల గుండెల్లో మృదువైన ప్రేమ హృదయాలూ ఉన్నాయని ఈ షో ద్వారా చూపించారు దర్శకులు. రోజంతా శిక్షణ సమయంలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఒక దగ్గర చేరే ఈ టీమ్‌కి క్యాంటిన్, చెట్లు, తమ గదులు ప్రధాన ప్లేసులై ఉంటాయి. కాస్త వీలు చిక్కితే సరదా కబుర్లతో ఒకరినొకరు కామెంట్ చేసుకునే ఈ టీమ్‌లోని మెంబర్స్ ప్రేమకు సంబంధించిన విషయాలను తరచూ చర్చిస్తుంటారు. వరుణ్ అనే కమాండో క్యాంటీన్ ఓనర్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అభిమన్యురాయ్ ఆర్మీ డాక్టర్ మధు రాథోడ్‌ని ప్రేమిస్తాడు. మేజర్ విక్రమ్రాయ్కి జర్నలిస్ట్ కిరణ్ పరిచయం అవుతుంది. లెఫ్టినెంట్ కల్యాణ్‌సింగ్ సాహసాల గురించి జర్నలిస్ట్ కిరణ్‌కి విక్రమ్‌రాయ్ చెబుతుంటాడు. కల్యాణ్‌సింగ్ చనిపోవడం గురించి అతని కుటుంబానికి ఆ వార్త చేరవేసే పరిస్థితి తనకు ఎంత బాధాకరమైందో చెబుతూనే తాను తిరిగి వచ్చే సమయంలో కళ్యాణ్‌సింగ్ కొడుకు చేసిన సెల్యూట్ గురించి గొప్పగా వివరిస్తాడు. ఒకానొక సందర్భంలో జర్నలిస్ట్ కిరణ్‌కి యాక్సిడెంట్ అవడంతో అభిమన్యు రక్తదానం చేసి ఆమెని కాపాడతాడు. పదమూడు ఎపిసోడ్లు ఉన్న ఈ సీరియల్లో పది ఎపిసోడ్ల వరకు కమాండోల మధ్య ఉండే స్నేహం, ఇన్‌స్ట్రక్టర్స్‌తో రిలేషన్షిప్, ప్రేమలను చూపుతుంది. సైనికుల అంతరంగాలను అతి దగ్గరగా పరిశీలిస్తున్నట్టు ఉంటుంది ఈ సీరియల్. యుద్ధ సమయం పదకొండవ ఎపిసోడ్లో శిక్షణ తీసుకున్న ఈ కమాండోలను స్పెషల్ వార్ మిషన్కి సెలక్ట్ చేస్తారు ఆఫీసర్లు. ఈ మిషన్‌లో పాల్గొన్న ఎనిమిది మందిలో ముగ్గురు కమాండోలు చనిపోతారు. లెఫ్టినెంట్ అభిమన్యు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరుతాడు. మరణించిన వారికి భారత ప్రభుత్వం జోహార్లు అర్పిస్తుంది. కోలుకున్న అభిమన్యు అతని స్నేహ బృందం తిరిగి డ్యూటీలో చేరడంతో సీరియల్ ముగుస్తుంది. మొదటిసారి మిల్ట్రీ శిక్షణ ఇండియన్ ఆర్మీ కమాండోల శిక్షణ కథే ఫౌజి. డిఫెన్స్ అకాడమీ మిలటరీ శిక్షణ ఇస్తున్న విధానాన్ని మొదటి సారి కళ్లకు కట్టింది బుల్లితెర. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ఆర్కే శర్మ రాసుకున్న కథ ఇది. ఆర్మీ ఆఫీసర్ అయినప్పటికీ అతని అభిరుచి కథలు, నాటకాలు రాయడం. ఇండియన్ ఆర్మీలో ఏం జరుగుతుందో, వారి జీవన విధానం ఎలా ఉంటుందో బయటవారికి తెలియజెప్పాలన్న తపనతో రాసుకున్న నోట్‌ను అతను కథగా డెవలప్ చేసుకున్నాడు. తను ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి ఆ కథను టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ కథ పూర్తిగా యధార్థ సంఘటనల ఆధారంగానే రూపొందించడంతో విశేష ఆదరణ పొందింది. ఇండియన్ ఆర్మీలో బాంబే శాపర్స్ టీమ్‌కి అత్యున్నత ఆఫీసర్‌గా నియమింపబడిన కల్నల్ సంజయ్బెనర్జీ కథను స్ఫూర్తిగా తీసుకొని లెఫ్టినెంట్ అభిమన్యురాయ్ పాత్రను అందంగా మలిచారు శర్మ.ఇప్పటికీ ఈ తరహా సీరియల్ బుల్లితెర మీద రాలేదు. అంటే మూడు దశాబ్దాల క్రితమే ప్రేక్షకుల నాడిని పట్టుకోవడానికి టీవీ ఓ కొత్త ఎఫర్ట్ పెట్టిందని చెప్పవచ్చు. ∙కమాండోల లిస్ట్‌లో షారూఖ్ ఖాన్‌తో పాటు ప్రముఖ దర్శకుడు/నటుడు విక్రమ్చోప్రా, బాలీవుడ్ నటుడు విశ్వజీత్ ప్రధాన్ లూ ఉన్నారు. ∙లాయ్ మెండోన్సా ఈ సీరియల్‌కి సంగీతాన్నందించారు. ∙1995లో ఫౌజి పేరుతో హిందీ సినిమా వచ్చింది. దీని దర్శకుడు లారెన్స్ డి–సౌజ, నటులు ధర్మేంద్ర, రాజ్‌బబ్బర్, కిరణ్‌కుమార్‌లు. షారూఖ్ ఖాన్ ∙ఈ సీరియల్లో లెఫ్టినెంట్ అభిమన్యురాయ్ పాత్రను షారూఖ్ ఖాన్ పోషించారు. అక్కడి నుంచి సర్కస్ వైపుగా మరో అడుగు వేసి అటు నుంచి బిగ్‌స్క్రీన్‌ను ఆక్యుపై చేశారు. టీవీ షో డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆర్కే కపూర్ ఆడిషన్ టెస్టుల ద్వారా షారూఖ్‌ని ఎంపిక చేశారట. ఈ ఎంపికకు ముందు షారూఖ్‌కి ఫిజికల్, స్టామీనా టెస్టులు కూడా చేశారట. షారూఖ్ లీడ్ రోల్ అయినప్పటికీ మొదటి–చివరి ఎపిసోడ్లలో మాత్రమే అతని పాత్ర ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కమాండోలలో ఒకడిగా కనిపిస్తారు. ∙ఫౌజీ కన్నా ముందు ‘దిల్ దారియా’లో 1988లో షారూఖ్ ప్రధాన పాత్రతో షూటింగ్ మొదలైంది. అదే టైమ్‌లో గ్రామీణ నేప«థ్యం ఉన్న ‘కేవల్’ అనే సీరియల్లోనూ షారూఖ్ నటించారు. అయితే ‘ఫౌజి’ సీరియల్ షారూఖ్‌ని నిలబెట్టింది. 90ల కాలం యంగ్‌స్టర్స్‌ని తన వైపుకు తిప్పుకునేలా చేసింది ఈ సీరియల్. తర్వాత షారూఖ్ బాలీవుడ్ కింగ్ అయ్యారు. – నిర్మలారెడ్డి -
మన ఊరి కథలు
అల్లరి గడుగ్గాయి స్వామి. వాడికో ముఠా. అందమైన స్కూలు. పారే ఏరు. అమాయకమైన ఊరు. పాతకాలపు కమ్మని జ్ఞాపకాలు.‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ సాహిత్యంలో ఎంత ఆదరణ పొందాయో‘మాల్గుడి డేస్’ సీరియల్‌గా దూరదర్శన్‌లో అంతే అభిమానం పొందాయి.ఇటువంటి అందమైన కథలు మళ్లీ రాలేదు. అందుకే నేటికీ వీటిని చూస్తూ ఉంటారు. బహుశా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇవి ప్రతి ఊరి కథలు. ‘అనగనగా ఒక ఊరు.. ఆ ఊళ్లో..’ అంటూ బామ్మ తన మనవలకు కథ చెబుతూ ఉంటుంది. ఆ కథ ఎక్కడిదో.. ఎలా తన ఊహల్లో రూపుదిద్దుకుందో ఆ బామ్మకే తెలుసు. ఆమే దానికి స్క్రీన్ ప్లే డైరెక్టర్. ఆ కథ వింటున్న పిల్లలకు అందులోని ఊరు, ఆ వాతావరణం, పాత్రలు ఊహల్లో తిరుగుతూ ఉండగా కళ్లు విప్పార్చుకొని ‘ఊ’ కొడుతూ వింటుంటారు. అలా కథా శ్రవణం చేసే బామ్మలు ఇప్పుడైతే లేకపోవచ్చు గాని ‘మాల్గుడి డేస్’ మాత్రం నేటికీ సజీవంగా ఉన్నాయి. టీవీ సీరీస్ రూపంలో నాటి రోజులను ఇంకా తలుపుకు తెస్తూనే ఉన్నాయి. 80ల కాలం నాటి పిల్లలను ‘మాల్గుడీ డేస్’తో తన ముందు తిష్టవేసుక్కూర్చునేలా చేసింది బుల్లిపెట్టె. రెండేళ్ల వయసు పిల్లలనుంచి నూట రెండేళ్ల బామ్మల వరకు ఆ మాల్గుడి వీధుల్లో ఏడాది పాటు సంబరంగా తిరిగారు. ఎండాకాలం వచ్చిందంటే అమ్మమ్మ ఊరు అందం.. మూటగట్టి తెచ్చిన మామిడిపండ్ల రుచి ఎంత గొప్పగా ఉంటాయో ‘మాల్గుడి డేస్’ కథలు అంత మధురంగా ఉంటాయి. ఆర్.కె.నారాయణ్ ఊహల్లో రూపుదిద్దుకున్న ఆ అందమైన పట్టణాన్ని కన్నడ దర్శకుడు, నటుడు శంకర్‌నాగ్ చిన్నతెర మీద ఆవిష్కరించాడు. మొత్తం 54 ఎపిసోడ్ల ప్రాజెక్ట్. అత్యంతసాహసమైన ప్రక్రియ. ఆర్కేనారాయణ్ ఊహల్లో దూరి ఒక్కో కథ ఆత్మను పట్టి అలవోకగా దృశ్యంగా మలచిన తీరు ఇప్పటికీ అబ్బురపరుస్తుంటుంది. మాస్టర్ మంజునాథ్, గిరీష్కర్నాడ్, అనంత్నాగ్లను మూడు దశాబ్దాలైనా ఇప్పటికీ మరవలేరు నాటి జనం. అప్పటి వరకు హిందీ సీరియల్స్‌లో ఉత్తరాదివారే అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సీరియల్‌తో దక్షిణభారత ప్రతిభనూ దేశమంతా గుర్తించింది. మనలోనే మాల్గుడి మాల్గుడి అనేది నారాయణ్ ఊహల నుంచి పుట్టిన ఊరు. అలాంటి ఊరునూ, అందులోని వీధులనూ, కనిపించే జనాన్ని ఈ దేశంలో ఎక్కడైనా చూడచ్చు. ఆ పాత్రలతో మనకూ పరిచయముంటుంది. బహుశ అవి మనమే అయ్యుంటాం. మన కుటుంబంలోని వారే అయ్యుంటారు. మన ఊళ్లో, మన వాడలోని వారే అయ్యుంటారు. అందుకే అందరూ ఈ కథల్లో లీనమయ్యారు. ఆ పాత్రల్లో తమని తాము చూసుకున్నారు. ప్రతీపాత్ర ఏదో çసమస్యతో బాధపడుతూ ఉంటుంది. తనకు తానే పరిష్కరించుకుంటుంది. కొన్నిసార్లు రాజీపడుతుంది. మరికొన్నిసార్లు సమాధానపడుతుంది. మాల్గుడి డేస్లోని ఊరు ప్రపంచంలోని పాఠకులను ఎంత ప్రభావితం చేసిందంటే షికాగో యూనివర్శిటీ ప్రెస్ ఒక సాహిత్య పత్రాన్ని చిత్రించి, భారతదేశ చిత్రపటంలో మాల్గుడిని కూడా చూపించిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్.కె.నారాయణ్ తన పుస్తకంలో రాసుకున్నారు. మాల్గుడి ప్లేస్ కోసం చాలా మంది వెతికారు. కొందరు తమిళనాడులోని కోయంబత్తూరు కావొచ్చునని, కర్ణాటకలోని లాల్గుడియే మాల్గుడి అని మరికొందరు అనుకునేవారు. కథల పందిరి ఎనిమిదేళ్ల స్వామి ఉదయాన్నే మేల్కొవడంతోనే మొదటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ కథ అది. బుద్ధిగా ప్రార్ధన చేసి, స్కూల్‌కి వెళతాడు. అక్కడ టీచర్ భగవంతుడి గురించి చెప్పే విషయాల్లో టీచర్‌తో ఎదురు మాట్లాడతాడు. దాంతో టీచర్ బెత్తం పుచ్చుకుని దులిపేస్తాడు. టీచర్ దండించిన విధానం గురించి తండ్రికి చెబుతాడు స్వామి. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని హెడ్మాస్టర్కి ఉత్తరం రాస్తే దాన్ని తానే స్వయంగా తీసుకెళ్లి ఇస్తాడు స్వామి. ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే తనకే ముందుగా చెప్పమంటాడు హెడ్మాస్టర్. భయం లేకుండా ఎదగడం ఎంత ముఖ్యమో స్వామి పాత్ర ద్వారా మన కళ్లకు కట్టిస్తారు రచయిత. స్నేహితులతో కలిసి ఆడిన బొంగరాల ఆట, నీళ్లలో వదిలేసిన కాగితపు పడవలు, బ్రిటిషర్ల హయాంలో ఉండే ఆజమాయిషీ.. ఈ ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఆ తర్వాతి ఎపిసోడ్లలో స్వామి అతని స్నేహితులు, కుటుంబం, బామ్మతో ముచ్చట్లు, స్వతంత్ర పోరాటం.. పోలీసుల దాడి ఘటనలు చూస్తాం. స్వామి స్నేహితుడి కారణంగా అడవివైపుగా వెళ్లి తప్పిపోయి, తిరిగి ఇల్లు చే రుతాడు. అయితే, ఏ స్నేహితుడి వల్ల అయితే తను తప్పిపోయాడో అతనే మాల్గుడి నుంచి దూరమైనప్పుడు చాలా బాధపడతాడు స్వామి. ఇలా ఎనిమిది ఎపిసోడ్స్ వరకు స్వామి అండ్ ఫ్రెండ్స్ మాల్గుడి డేస్‌ను ఆక్యుపై చేశారు. ఆ తర్వాతి 13 ఎపిసోడ్స్ అనంత్‌నాగ్ మాల్లుడి డేస్‌లో అంతటా తానై కనిపిస్తారు. ది వెండర్ ఆఫ్ స్వీట్స్, ది వాచ్‌మ్యాన్, మిస్సింగ్ నెక్లెస్, గేట్మెన్ గిప్ట్స్, ఎ హీరో, ఎ విల్లింగ్ స్లేవ్, గోల్డ్ బెల్ట్, నిత్య, ది ఎడ్జ్, సాల్ట్ అండ్ సాడస్ట్, ఆస్ట్రాలజర్స్ డే, నైబర్స్ హెల్ప్, ది హోర్డ్, ది మిస్సింగ్ మెయిల్, డాక్టర్స్ వరల్డ్, లీలాస్ ఫ్రెండ్.. వంటి కథలు మాల్గుడి డేస్‌లో చూడొచ్చు. మాల్గుడి స్వామి ఈ పేరు తలుచుకోగానే బాలనటుడు మంజునాథ్ కళ్లముందు దర్శనమిస్తాడు. అప్పటివరకు కన్నడ సినిమా ప్రేక్షకులకు మాత్రమే ఈ బాల నటుడు పరిచయం. మాల్గుడి డేస్ సీరియల్‌తో అతను దేశంలో అందరికీ సుపరిచితుడయ్యాడు. (ఆ తర్వాత స్వాతికిరణం సినిమాలోనూ కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు) అంతేకాదు, మంజునాథ్ గొంతు, నటన ప్రపంచంలోని మాల్గుడి వీక్షకులందరినీ కట్టిపడేసింది. ఈ సీరియల్‌తో మంజునాథ్ అరడజను అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. దాంతోబాటు స్వామి, అతని స్నేహితుల వస్త్రధారణ కూడా అప్పటి రోజులకు తగినట్టుగా చక్కగా అమరింది. ఈ సీరియల్ గురించి మంజునాథ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతీ రోజూ స్కూల్‌కి వెళుతున్నట్టే ఉండేది. ఈ సీరియల్ పెద్ద హిట్ కావడంతో ఒక హోటల్లో పార్టీని ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. మిస్టర్ ఆర్కే నారాయణ్ అక్కడకు వచ్చారు. అక్కడున్నంత సేపు నాతో ఉన్నారు. నాతో మాట్లాడుతూ ‘మంజూ, నా ఊహల్లో స్వామిని కళ్లముందుకు తీసుకొచ్చావు’ అన్నారు. అది నా జీవితంలో అతి పెద్ద కాంప్లిమెంట్. దీనిని ఎప్పటికీ మర్చిపోలేను’ అన్నారు. మాల్గుడి డేస్ సీరియల్ హిందీతో పాటు ఇంగ్లిష్‌లోనూ వచ్చింది. ఆ విధంగా ప్రపంచ వీక్షకుల మన్ననలూ పొందింది. మీ పిల్లలు కథ చెప్పమని అడుగుతున్నారా.. పిల్లలకు కథ ఎలా చెప్పాలనే ఆలోచన మీకే వచ్చిందా అయితే.. ఆలస్యం చేయకుండా ‘మాల్లుడి డేస్’ టీవీ సీరిస్‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ మాల్గుడి వీధుల్లో విహరించాల్సిందే. ‘మాల్గుడి డేస్’ స్వామి అండ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్లో స్వామిగా మాస్టర్ మంజునాథ్, స్నేహబృందం దాదాపు వందేళ్ల ఏళ్ల క్రితం మద్రాసులో జన్మించిన ఆర్కే నారాయణ్ 1943లో ‘మాల్లుడి డేస్’ పేరుతో కథల పుస్తకం రాశారు. 1982లో ఈ పుస్తకం పునర్ముద్రణ పొందింది. ఈ పుస్తకం పేరుతోనే 1987 మార్చ్ 18న రాత్రి 8:30గంటలకు దూరదర్శన్ సీరియల్‌గా ప్రసారమైంది. ప్రతి బుధవారం వచ్చే ఈ సీరియల్ మొత్తం 54 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. కన్నడ సినిమా డైరెక్టర్, నటుడు శంకర్‌నాగ్ 39 ఎపిసోడ్లుడైరెక్ట్ చేయగా ఆ తర్వాత సినీ దర్శకురాలు కవితా లంకేష్ 15 ఎపిసోడ్లు తీశారు. సీరియల్‌కి సంగీతాన్ని అందించింది కర్ణాటక సంగీత విద్వాంసుడు ఎల్.వైద్యనాథన్. ∙ఆర్.కె.నారాయణ్ సోదరుడు ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఈ కథలకు స్కెచ్ ఆర్టిస్ట్.ఈ సీరియల్‌కి ప్రొడ్యూసర్లు టి.ఎస్.నరసింహన్, ప్రధాన నటుడు అనంత్నాగ్లు. ∙హిందీ భాషలో వచ్చిన ఈ సీరీస్‌లో చాలా వరకు కర్ణాటక షిమోగా జిల్లాలోని అగుంబే గ్రామంలో షూట్ చేశారు. కొన్ని ఎపిసోడ్లు బెంగళూరు, దేవరాయనదుర్గాలో తీశారు. మాస్టర్ మంజునాథ్, శంకర్‌నాగ్, గిరీష్ కర్నాడ్, అనంత్నాగ్లు ఈ సీరియల్‌తో దేశమంతా పరిచయం అయ్యారు. 2018లో కన్నడ మాల్గుడి డేస్ తెలుగులో అల్ట్రా టీవీలో ప్రసారమైంది. – ఎన్.ఆర్ -
అగ్నిసాక్షిగా ఐశ్వర్యం
కన్నడ బుల్లితెర మీద వెలుగుతూ తమిళంలో తన దైన ముద్ర వేసుకున్న ఐశ్వర్య తెలుగు చిన్న తెరమీదా గుర్తింపు తెచ్చుకుంటున్న నటి. స్టార్ మాటీవీ ‘అగ్నిసాక్షి’ సీరియల్లోని ‘గౌరి’ పాత్రలో అందంగా ఇమిడిపోయిన ఐశ్వర్య చెబుతున్న విషయాలు.. తెలుగు ‘అగ్నిసాక్షి’ సీరియల్ కన్నడలో ‘సర్వమంగళ మాంగల్యే’పేరుతో వస్తుంది. ఈ రెండు సీరియల్స్‌లో ‘గౌరి’ పాత్ర నాదే. ఏడాదిన్నరగా ఈ సీరియల్స్‌లో నటిస్తున్నా. గౌరి పాత్రకు న్యాయం చేస్తున్నాను అని చాలా హ్యాపీగా ఉంది. గౌరీ–శంకర్ల రొమాన్స్ సీన్లు కూడా ఇందులో ఉంటాయి. భైరవి అల్లరిపిల్ల అనిపించుకుంటూనే ఏదైనా ఒక విషయం తన దృష్టికి వచ్చిందంటే వదిలేయని తత్వం గలదానిగా ఉంటుంది. అల్లరితో పాటు నేర్పు కూడా ఉంటుంది. ఉమన్ ఎంపవర్మెంట్ గురించి ఈ సీరియల్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఈ క్యారెక్టర్ నుంచి చాలా నేర్చుకున్నాను. నాటకం నుంచి టీవీకి ఉండేది బెంగుళూరు. బాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. అమ్మ పుష్పాంజలి హౌజ్‌వైఫ్. మా అమ్మ వల్లే ఈ ఫీల్డ్కి వచ్చాను. నాన్నగారు అశ్వనికుమార్ అడ్వకేట్. అమ్మనాన్నలకు ఒక్కతే కూతురును. టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒకసారి థియేటర్ క్లాస్‌కి వెళ్లాను. అంతకుముందు నాకు ఈ ఫీల్డ్ అంటే ఐడియా లేదు. అయితే, టీవీలో సీరియల్స్ చూసేదాన్ని. అందులోని క్యారెక్టర్స్‌ని ఇమిటేట్ చేస్తుండేదాన్ని. థియేటర్ ఆర్ట్స్ వల్ల కన్నడ సీరియల్ ‘అనురూప’లో అవకాశం వచ్చింది.’ తర్వాత రెండు కన్నడ సినిమాలోనూ నటించాను. ‘గిరిజా కళ్యాణ్’ అర్క మీడియాలో చేయడంతో ఇటు తెలుగుకు పరిచయం అయ్యాను. తప్పులే మాట్లాడా! ఇక్కడ భాష రాక మొదట్లో మాట్లాడడం కష్టం అనిపించేది. కానీ, త్వరగానే నేర్చేసుకున్నాను. భాష రాదు అనుకుంటే అస్సలు రాదు. తప్పులైనా పర్వాలేదు ఇక్కడ వాళ్లే కరెక్ట్ చేస్తారు అని మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా తెలుగు నేర్చేసుకున్నా. తమిళ సీరియల్ చేసినప్పుడు అక్కడ తమిళ్ నేర్చుకున్నాను. మంచి ప్లాట్ ఫామ్ ఇక్కడి ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తుంటారు. ‘అగ్నిసాక్షి’లోని గౌరి క్యారెక్టర్ గురించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. మంచి ప్లాట్‌ఫామ్ దొరికింది. చక్కగా ఉపయోగించుకోవాలని అనుకుంటాను. బిజినెస్ మేనేజ్మెంట్ చదివినప్పటికీ వ్యాపార ఆలోచనలేవీ లేవు. నా భవిష్యత్తు టీవీ ఇండస్ట్రీనే. సపోర్ట్ చేస్తే చాలు మన ప్రతి అడుగు దేవుడే డిసైడ్ చేస్తాడు అని నమ్ముతాను. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజిస్తాను. నాకు కాబోయే భర్తలో నా ప్రొఫెషన్ని సపోర్ట్ చేయడంతో పాటు ఇది ఎందుకు చేశావు అనకుండా ఉంటే చాలు అనుకుంటున్నాను. ఖాళీ సమయం దొరికితే షాపింగ్‌లో దూరిపోతాను. బట్టలను కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకాస్త ఖాళీ దొరికితే నిద్ర పోతాను. స్పష్టత ముఖ్యం ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే ‘ఎవరి ద్వారా వస్తున్నాం’ అనే స్పష్టత ఉండాలి. ఏం వర్క్ చేస్తున్నారో ఆ పని మాత్రమే చూసుకోవాలి. వర్క్‌లో ఎంత ఇన్వాల్వ్ అయి చేస్తామో అది అంతగా భవిష్యత్తుకు పనికి వస్తుంది. ముఖ్యంగా పొగరు చూపించకుండా ఉంటే ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ ఒక వారం, బెంగుళూరులో ఒక వారం సీరియల్ ప్రాజెక్ట్స్‌లో పాల్గొంటూ ఉంటాను. నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. -
గడియారం శ్రీరామ అంది
సకల సద్గుణాల వల్ల రాముడు దేవుడయ్యాడు ప్రతి గుణం ఒక రామాయణం నలుగురిని నడిపించేది రామాయణం అందరినీ చూసేలా చేసింది అందరినీ నడిపించింది రామానందసాగర్ రామాయణం బుల్లితెరపై ప్రత్యక్షమైన ఇంటింటా రామాయణం. టైమ్ మిషన్‌లో మూడు దశాబ్దాల వెనక్కి వెళితే ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఓ అందమైన దృశ్యం కళ్లకు కడుతుంది. టీవీ ఉన్న ప్రతి ఇల్లు నిండుకుండలా కనిపిస్తుంది. భక్తిగా చేతులు జోడించి టీవీ తెరకు కళ్లప్పగించే జతల జతల కళ్లు రామరసాన్ని గ్రోలుతూ పారవశ్యం చెందుతుండటం చూస్తాం. ఆ అద్భుతాన్ని చవి చూపినవాడు రామానంద్ సాగర్. 78 ఎపిసోడ్లలో రామాయణాన్ని దృశ్యీకరించిన బుల్లితెర వాల్మీకి ఇతడు. జనవరి 25, 1987లో ప్రారంభమైన ఈ సీరియల్ జులై 31, 1988 వరకు వచ్చింది. అప్పట్లో ఈ సీరియల్ టీవీలో ఓ విప్లవం. ఈ సీరియల్ వచ్చే సమయంలో ప్రజారవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోయేవి. రైళ్లు, బస్సులు, ఇంటర్ సిటీ ట్రక్కులు.. జనం లేక వెలవెలబోయేవి. ఊళ్లలో సమూహాలుగా టీవీసెట్స్ ముందు చేరిపోయేవారు. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించేవారు. పువ్వులు జల్లి నీరాజనాలు పలికేవారు. నిజానికి ఇది ఒక కార్యక్రమమే. కానీ పిల్లా జెల్లాతో కలిసి కుటుంబం అంతా ఈ సిరియల్‌ని వీక్షించింది. సీరియల్ పూర్తయ్యాక సత్యమే పలకాలనే వాగ్డానాలు చేసుకునేవారు. పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునేవారు. రామాయణంతో టీవీ అలా ప్రతి ఒక్కరినీ కథలో లీనమయ్యేలా చేస్తూ విద్యాభ్యాసం చేయించింది. అఫ్కోర్స్ అప్పటికి ఇప్పటిలా వందల చానెల్స్ లేవు. కానీ, రామాయణం ఇంకా జీవించడానికి తాను కూడా ఉడతసాయం చేశానని బుల్లితెర ఒళ్లంతా కళ్లు చేసుకొని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటుంది. పాలసంద్రం నుంచి పట్టాభిషేకం వరకుసీరియల్ స్టార్ట్ అవడమే..పాల సముద్రం మీద శేష శయనుడైన నారాయణుడు, భర్త పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి.. బ్రహ్మాది దేవతలంతా .. ‘శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం..’ అంటూ స్తుతిస్తున్న సన్నివేశంతో రామాయణం మొదలవుతుంది. యోగనిద్రలో ఉన్న నారాయణుడు కనులు తెరిచి విషయం ఏంటని అడుగుతాడు. రావణాసురుడి ఆగడాలకు అంతులేదు. అధర్మమే అంతటా పరిఢవిల్లుతోంది. పాప నాశనం చేసి, ధర్మసంస్థాపన చేయండి.. అని వేడుకుంటారు. తాను ఇచ్చిన వరాలను దుర్వినియోగం చేస్తున్న రావణాసురుడిని నిలువరించాల్సిన అత్యావశ్యకం వచ్చిందని చెపుతాడు శివుడు. సత్యమే గెలుస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యచంద్రులు ఉండేంతవరకు ఆ ధర్మం అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటారు. రావణుడి అహంకారాన్ని మట్టుపెట్టేందుకు తాను జన్మిస్తానని వరమిస్తాడు నారాయణుడు. సత్యమేవ జయతే అంటారు దేవగణం. అక్కడి నుంచి రాముడు పుట్టడం,విద్యాభ్యాసం, వివాహం, వనవాసం మీదుగా కథ నడుస్తూ సీతాదేవి అపహరణ, రావణాసుర సంహారం, తిరిగి అయోధ్యనగర ప్రవేశం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. ఈ సీరియల్ మొత్తానికి కీలక పాత్రధారులు దశరథుడు, అతని ముగ్గురు భార్యలు, వీరితో పాటు దుష్టవనితగా పేరొందిన మంధర మొదటి ఎపిసోడ్‌లోనే కనిపిస్తారు. యజ్ఞం చేయగా వచ్చిన పాయసాన్ని దశరథుని ముగ్గురు రాణులు సేవిస్తారు. విష్ణువు రాముడిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంఖుచక్రాలు భరత, శత్రుఘ్నులుగా జన్మిస్తారు. ఇక రెండవ ఎపిసోడ్లో రామలక్ష్మణ, భరత శత్రుఘ్నుల విద్యాభ్యాసం గురుకులంలో జరుగుతుంది. అక్కడే పెరిగి పెద్దవుతారు. అక్కడితో సీరియల్‌ని భక్తిగా చూసే ప్రేక్షకుల హృదయాలు రామ రామ అంటూ రామ జపం చేస్తూ కథలో లీనమయ్యాయి. బుల్లితెర వాల్మీకి ప్రయాణం రామానంద్ సాగర్ దాదాపు వందేళ్ల క్రితం కశ్మీరీ ధనిక కుటుంబంలో పుట్టారు. రచయితగా ఎన్నో మారుపేర్లతో రచనలు చేశాడు. ఒకానొక సమయంలో ముంబయ్‌కి అతని కుటుంబం వలస వచ్చింది. సినిమా మీద వ్యామోహంతో పృథ్వీ థియేటర్లో పృథ్వీరాజ్ కపూర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. 1950లో సాగర్ ఆర్ట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీని నిర్మించాడు. కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు అతని ప్రొడక్షన్ నుండి వచ్చాయి. ఆ తర్వాత అతని దశ, దిశ మార్చింది మాత్రం బుల్లితెరనే. అంతకాలం అతనొక విద్యార్థి. రామాయణంతో అతనిలోని మేధావి ప్రపంచానికి కనిపించాడు. తనలో సాంకేతికæ పరిజ్ఞానం ఏ మాత్రం లేదని చెప్పుకునే రామానంద సాగర్ రామాయణాన్ని బుల్లితెర మీద చూపించడంలో మాత్రం అపార ప్రతిభను కనబరిచాడని విమర్శకుల మెప్పును పొందారు. పట్టాభిషేకం తర్వాత...? రామానంద్ సాగర్ వాల్మీకి రామాయణ్, తులసీదాస్ రామచరిత మానస్‌లను తన సీరియల్‌కి మూలకథగా ఎంచుకున్నాడు. రామరాజ్య స్థాపనకు ముందు అంటే రాముడు పట్టాభిషేకం వరకు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రామాయణాలలో సీతను రాముడు వదిలేయడం, లవకుశుల చాప్టర్లను ఇందులో తీసుకోలేదు. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్‌సాగర్ మాట్లాడుతూ– ‘చాలామంది రచయితలు రాముడు సీతను వదిలేసినట్టు రాశారు. ‘కానీ, నా రాముడు అలా కాదు’ అనేవాడు నాన్న. ఆ తర్వాత ప్రత్యేకంగా లవ–కుశ సీరియల్ తీయాలనుకున్నాడు. కానీ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది’ అని చెప్పారు. పౌరాణికాలకు దారిచూపిన సీరియల్ రామాయణం తర్వాత సాగర్ ఇండస్ట్రీ నుంచి శ్రీ కృష్ణ, లవ్ ఔర్ కుష్, అలిఫ్ లైలా.. వంటి సీరియల్స్ వచ్చాయి. అంతేకాదు, రామాయణ్ ప్రేరణతో పౌరాణిక ఇతివృత్తంతో సీరియల్స్ రూపొందించడానికి టీవీ ఒక మాధ్యమంగా సాగింది. లెక్కలేనన్ని పౌరాణిక సీరియల్స్ ఆ తర్వాతి కాలంలో బుల్లితెరమీద బొమ్మకట్టాయి. ఆ తర్వాత వచ్చిన రామాయణాలకు రామానంద్ సాగర్ రామాయణమే పెద్ద బాలశిక్ష అయ్యింది. అలాగే, సాగర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నుంచి 2008లో మరో రామాయణం వచ్చింది. ఆ తర్వాత 2015లో మరో రామాయణ్ సీరియల్ టీవీలో వచ్చింది. అయితే, 1986లో తీసిన రామాయణ్ 2015లో వచ్చిన రామాయణ్ సీరియల్‌ను చూస్తే రూపకల్పనలో ఎన్నో తేడాలు కనిపిస్తాయి. పూజలందుకున్న నటీనటులు రామాయణ్ సీరియల్లో రామ పాత్రధారి ‘అరుణ్ గోవిల్’ రూపం, వాయిస్ ఆ సీరియల్‌కే పెద్ద ఎస్సెట్‌గా మారింది. చూపులకు ప్రశాంతంగా కనిపిస్తూ వీనులకు విందు చేసే రాముడి పాత్రధారి పలుకులు విన్న వారి కళ్లు ఆర్ధ్రమయ్యేవి. ఆ తర్వాత అతను ఎక్కడకు వెళ్లిన ప్రజలు అరుణ్‌గోవిల్‌ను రాముడిగా కొలిచారు. సీత క్యారెక్టర్ గురించి మాటల్లో చెప్పలేం. వాల్మీకి రామాయణంలోని సీత తమ నట్టింటికే నడిచి వచ్చిందన్నంత తన్మయత్వం చెందారు ప్రేక్షకులు. ఇప్పటివరకు వచ్చిన సీత క్యారెక్టర్లలో ఎవరు ది బెస్ట్ అని కళ్లు మూసుకొని వెతికితే ‘దీపికా చిఖాలియా’ రూపమే నిలుస్తుంది. ఈ సీరియల్లోని కొన్ని ఎపిసోడ్స్ చూస్తే ఆమె కళ్లతో పలికించిన భావాలు ప్రేక్షకుల మనసు నుంచి చెదిరిపోవు. ఆమె ఒక అందమైన మహారాణి మాత్రమే కాదు తన తండ్రితోపాటు ప్రతి ఒక్కరికీ సాయం చేసే స్వభావం కలదిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత చెప్పుకోదగిన పాత్ర హనుమాన్. ఇప్పటిదాకా వచ్చిన రామాయణ్ సీరిస్‌లలో హనుమాన్ పాత్రధారులను గమనిస్తే సాగర్ రామాయణ్‌లో హనుమాన్‌గా నటించిన ‘దారాసింగ్’ అపరమేధావిలా కనిపిస్తాడు. హనుమాన్ అంటే దారాసింగ్ మాత్రమే అనేలా మెప్పించాడు. ఇక రాముడికి దీటైనది రావణాసురుడి పాత్ర. సీరియళ్లు, సినిమాలలో చాలామంది రావణాసురుడి పాత్ర పోషించారు. వారంతా మంచి నటులే. అయితే, ‘అరవింద్ త్రివేది’ రావణుడి పాత్రకోసమే పుట్టాడేమో అనిపించేలా ఉంటుంది. ఒక సీరియల్లోని నటీనటులు రాజకీయంగా ఎదగడం అనేది రామాయణం నుంచే మొదలైంది. అరుణ్‌గోవిల్‌ను మొదట బిజెపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నాయి. దీపికా చిఖాలియా (సీత), అరవింద్ త్రివేది(రావణుడు) ఇద్దరూ ఎంపీలుగా ఓ వెలుగు వెలిగారు. రామాయణం విన్నా, కన్నా జన్మ తరిస్తుందని చెబుతారు పెద్దలు. అలా రామాయణం తీసి జన్మ చరితార్ధం చేసుకున్నది రామానంద్‌సాగర్ అయితే, ఆ ధారావాహికను కన్నులారా వీక్షించిన ప్రతి గుండే చరితార్థమే అయ్యింది. రంగుల రామాయణం రామానంద్‌సాగర్ బుల్లితెరకు రామాయణం ఇస్తే దానికి ఊపిరిలూదినవారు కంపోజర్ రవీందర్ జైన్. ఆ తర్వాత చెప్పుకోదగినవి కాస్ట్యూమ్ కలర్స్. దేశ ప్రజలకు అప్పుడప్పుడే కలర్ టెలివిజన్ చేరువవుతోంది. ఈ చిన్న తెరమీద గులాబీ, ఎరుపురంగులతో షోని బ్లాస్ట్ చేశాడు దర్శకుడు. ఇండియన్ టీవీలో మొట్టమొదటి బ్లాక్‌బస్టర్, అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌరాణిక షోగా రామాయణం వరల్డ్ లిమ్కా బుక్ రికార్డ్స్‌లో చోటు చేసుకుంది. -
కదిలించిన పునాది
ఇటుక పునాది మీద ఇల్లు నిలబడుతుంది. అనుబంధం పునాది మీద కుటుంబం నిలబడుతుంది.కాని పునాది కదిలే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు గెలిచేది ఎవరు? నిలిచేది ఎవరు? భారత్, పాక్ విభజన తర్వాత లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఒక కుటుంబ కథే బునియాద్. బునియాద్ అంటే పునాది అని అర్థం. అందరి మనసులనూ కదిలించిన పునాది ఈ సీరియల్. లైవ్ షో బిగ్‌బాస్ సీజన్స్, అతీంద్రియ శక్తులతో సాగే నాగిని వంటి సీరియల్స్‌ను ఆవిష్కరించే టీవీ గురించి ఈ రోజుల్లో ఇంతే తెలుసు మనకు. కానీ, టీవీకి స్వర్ణయుగం అనిపించే కాలం ఒకటుంది. అవి దూరదర్శన్ వచ్చిన తొలినాటి రోజులు. ఇండియన్ టెలివిజన్‌లో రెండవ సీరియల్ అడుగుపెట్టిన ‘బునియాద్’ అతి కొద్ది కాలంలోనే తన సత్తా ఏంటో చూపింది. అప్పుడప్పుడే దూరదర్శన్ అడ్వరై్టజింగ్ కంపెనీలకు టైమ్ స్లాట్లను అమ్ముతోంది. సంపన్న కుటుంబాలు టీవీ సెట్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. మధ్యతరగతి వర్గం టీవీని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఆ రెండు వర్గాలని ఆకట్టుకునేలా రిచ్ స్టోరీస్ ప్లానింగ్ దూరదర్శన్‌లో జరుగుతోంది. ఆ క్రమంలో ఇండియన్ ఆడియన్స్ నాడిని పట్టుకున్నారు దర్శకుడు రమేష్ సిప్పి. దేశీయ మూలాల్లోకి వెళ్లాడు. మనసు తడిని కళ్లలో చూపించే బలమైన కుటుంబాన్ని పట్టుకున్నాడు. ‘బునియాద్’ పేరుతో ఠీవిగా ముందుకొచ్చాడు. గుండె గుండెలో ఇది మేమే అనిపించాడు. ఇది మాదే అనిపించాడు. జ్యోతి స్వరూప్ తన దర్శకత్వ ప్రతిభనూ జత కలిపారు. కథలోకి వస్తే... ఇండియా – పాకిస్థాన్ విడిపోకముందు అంతా ఒకే దేశం. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒకే కుటుంబంగా జీవించారు. విడిపోయాక.. ఏమైంది? ఇదే కథ. అందుకే విడిపోకముందు.. (1916 నుంచి 1978 )తర్వాత పరిస్థితులను ఈ సీరియల్లో చూపించారు. అప్పటికి దేశమంతటా నాటకాలంటే విపరీతమైన పిచ్చి ఉంది. ఆ పిచ్చిని ‘బునియాద్’ తన వైపు తిప్పుకుంది. దీంతో నాటకం తెర తీయడానికే తీవ్రమైన కృషి చేయాల్సి వచ్చింది. బునియాద్ ఒక స్టోరీ కాదు సీరియల్ మొదలవడమే 1915 నాటి పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక అందమైన కుటుంబం... స్వాతంత్య్రానంతరం జరిగిన పరిణామాలను కళ్లకు కడుతుంది. దేశవిభజన ఆ అందమైన కుటుంబాలను ఎలా ఛిద్రం చేసిందో చిత్రిస్తుంది. లాహోర్ నుంచి అనేక మలుపులు తిరుగుతూ కథ 1986లో ఢిల్లీ చేరుతుంది. అక్కడ శరణార్థ శిబిరాలలో తలదాచుకున్న వారి కష్టాలను పరామర్శిస్తుంది. నిజానికి బునియాద్ కొన్ని కుటుంబాల కథల సమాహారం. అయినా ప్రధానంగా మాస్టర్ హవేలీరామ్, లాజోజీ (అలోక్‌నాథ్, అనితా కన్వర్)ల కుటుంబం చుట్టూతా తిరుగుతుంటుంది. హవేలీరామ్, లజోజీ దంపతులకు ముగ్గురు కొడుకులు భూషణ్, రోషన్, సత్బీర్. హవేలీరామ్ భార్య లాజోజి. తల్లి, తండ్రి, అన్న–వదిన, పిల్లలతో తన పూర్వీకుల కాలం నుంచి వుంటున్న ఇంట్లో సంతోషంగా జీవిస్తుంటాడు. హవేలీ రామ్‌ది ఏం జరిగినా అంతా మనమంచికే అనుకునే తత్త్వం. కుల మతాలకు అతీతంగా ఉంటాడు. రాజకీయాలంటే మాత్రం ఆసక్తి చూపుతుంటాడు. స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొంటాడు. ఇరుగుపొరుగుతోనూ, దేశంతోనూ వివిధ బంధాల మధ్య అల్లుకున్న అనుబంధాలెన్నో ఆ కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉంటాయి. చీకూచింతా లేకుండా హాయిగా జీవించే చక్కటి కుటుంబం దేశ విభజన సుడిగుండంలో చిక్కుకుని ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని అగచాట్ల పాలవుతుందో ఈ సీరియల్ చూపిస్తుంది. స్వతంత్రం వచ్చింది. దేశమంతటా వేడుకలు. ప్రతి మదిలో ఆనందోత్సాహాలు. స్వేచ్ఛాతరంగాలు అంతటా ప్రవహిస్తున్నాయి. అలాంటి సమయంలో దేశ విభజన అనివార్యమైంది. కుటుంబరక్షణ వ్యవస్థలో ఆనందంగా గడిపే హవేలీరామ్ సాదా సీదా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జీవితకాలపు బాధలకు లోనయ్యేలా చేసింది. ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో కుటుంబం విచ్చిన్నం అవడం, పూర్వీకులంతా నివసించిన ఇంటిని వదిలి శరణార్ధుల శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎదరవుతుంది. హవేలీరామ్ పాత్రను ఈ కథ కోసం తీర్చినట్టు అనిపించదు. మనమే ఆ పరిస్థితుల్లో ఉండి, కుటుంబాన్ని కోల్పోయి పడే బాధను అనుభవిస్తున్నట్టు ఉంటుంది. హిందూ–ముస్లిమ్ సమానత్వం కోసం ఆరాటపడే విధానం కళ్లకు కడుతుంది. భారతీయ సగటు తల్లికి ప్రతీకగా లాజోజి అత్యంత సాధారణంగా ఉంటుంది. కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆమె ఆ తర్వాతి కాలంలో ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకొని పెంచుకునేంత పరిస్థితికి చేరుతుంది. ఈ కథలో కంటతడిపెట్టించే మరో కథనం వీరన్వలిది. హవేలిరామ్ చెల్లెలు ఈమె. లాహోర్‌లో గడిపిన మధుర క్షణాలు, వృషభన్‌తో ప్రేమకు ప్రతిఫలంగా పుట్టిన కన్న కొడుకును అక్రమసంతానంగా భావించిన సమాజాన్ని తట్టుకోలేని విధానం, పిరికి ప్రేమికుల భావోద్వేగాలు కంటతడిపెట్టిస్తాయి. బాబ్లీజీగా పేరు మార్చుకొన్నప్పటికీ తన బిడ్డను సింగిల్ పేరెంట్‌గా పెంచే ధైర్యం ఉండదు. కష్టపడి పనిచేయడంలో వచ్చే సంపాదన కన్నా గ్లామరస్‌గా ఉంటూ, డబ్బు సులువుగా వచ్చే క్యాబరే డ్యాన్సర్‌గా వృత్తిని ఎంచుకుంటుంది. ఒక కుటుంబం నుంచి మరికొన్ని కుటుంబాలను కలుపుతూ కథలు కథలుగా బునియాద్ సాగుతుంది. ప్రతి కుటుంబానికీ అందులోని కథ చేరువయ్యేలా పక్కా స్క్రిప్ట్‌ను ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. ఒకరకంగా చెప్పాలంటే మహాభారత్‌లో కౌరవులు–పాండవుల మధ్య నడిచిన కథలా అదే సమయంలో వారి చుట్టూతా ఉన్న లెక్కలేనన్ని కుటుంబకథలు వచ్చి చేరినట్టుగా బునియాద్ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ సీరియల్లోని ప్రతి పాత్రా నటించినట్లు కాకుండా సజీవ చిత్రణమే అన్నంత సహజంగా అనిపిస్తుంది. కొన్ని మూలాలు బునియాద్ సీరియల్ 105 ఎపిసోడ్లుగా దూరదర్శన్‌లో 1986 నుంచి 1987 వరకు వారానికి రెండుసార్లు (మంగళ, శనివారాల్లో) ఏడాది పాటు ప్రసారమయ్యింది ∙బునియాద్ సీరియల్ ప్రసారమైన 27 ఏళ్ల తర్వాత ‘బునియాద్ రిటర్న్’పేరుతో జులై 25, 2013లో ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు సహారా ఒన్, 8:30కు దూరదర్శన్‌లో ప్రసారం చేశారు ∙ఈ సీరియల్లో నటించిన నటీనటులు చాలావరకు అంతకుముందు పేరొందిన డ్రామా ఆర్టిస్టులు ∙మన ఇళ్లలో మామూలుగా మాట్లాడుకునే సాధారణ వాడుక భాషను ఈ సీరియల్ ద్వారా తీసుకువచ్చారు ∙ఈ సీరియల్ దర్శకులు రమేష్ సిప్పి బిగ్ స్క్రీన్ మీద.. షోలే, షాన్, సాగర్.. వంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగారు. -
ఆమే నా గాడ్ మదర్
సస్పెన్స్ కథనంతో, అనూహ్యమైన మలుపులతో రక్తి కట్టించే విధంగా సీరియల్‌ని ముందుకు నడిపించడంలో మంజులానాయుడు స్టైలే వేరు. దూరదర్శన్‌లో సీరియల్స్ కొత్తగా వస్తున్న రోజులవి. అక్కడ మొదలైన ప్రయాణం తెలుగులో కమర్షియల్ చానెల్స్ మొదలయ్యాక ఊపందుకుంది. ‘రుతురాగాలు’ తెలుగు టీవీ సీరియల్స్‌ని మలుపు తిప్పిన సీరియల్. కస్తూరి, మొగలిరేకులు .. ఇలా ఎన్నో సెన్సేషల్ టీవీ సీరియల్స్ ఆమె చేతిలో రూపుదిద్దుకున్నాయి. టీఆర్పి రేటింగ్స్‌ని పరిగెత్తించే సత్తా గల ఆమే మంజునాయుడు. సీరియల్స్ సక్సెస్ గురించి... నాది, బిందు(చెల్లెలు)ది వేవ్‌లెంగ్త్ బాగుంటుంది. మంచే చూపించాలి అనుకునేవారం. దానివల్లే మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. వారంలో ఒకరోజు స్టోరీ చర్చకోసం అని పెట్టుకునేవాళ్లం. 2 గంటల్లో స్టోరీ డిస్కషన్ ఉండేది. దాంతో రాబోయే వారం స్టోరీ లైన్ వచ్చేసేది మీరు సీరియల్స్ తీసేనాటికి ఇప్పటికీ ఓవరాల్ సీరియల్స్ వ్యూ.. (నవ్వుతూ) ఇప్పటి కంటెంట్‌లో చాలా మార్పులు వచ్చాయి. చూసేవాళ్లంతా చెబుతుంటారు ఆ తేడా. ఆ విషవలయం అనేది ఎప్పుడు బ్రేక్ అవుతుందో చెప్పలేం. ప్రేక్షకులు ఏమంటారంటే.. ‘మీరు తీస్తున్నారు కాబట్టి మేం చూస్తున్నాం’ అంటారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఏమంటారంటే.. ‘ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి మేం తీస్తున్నాం’ అంటున్నారు. సీరియల్స్ అయినా ఇతర కార్యక్రమాలైనా ప్రేక్షకుల స్పృహ తప్పనిసరి. ఇంట్లో పిల్లలు ఏం చూస్తున్నారు? వాటి వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం.. అనే ఆలోచన ప్రేక్షకుల్లోనే ఉండాలి. అలాగే సీరియల్స్ తీసే దర్శక నిర్మాతలకూ సామాజిక బాధ్యత ఉండాలి. సీరియల్స్ డౌన్ ట్రెండ్ ఇప్పుడు చాలా ఎక్కువ. ఆధునికతకు, మెచ్యూరిటీకి చాలా తేడా ఉంది. ఇది ఒక్కరిదే లోపం అనలేం అందరూ ఆలోచించాల్సిన విషయం. వీటన్నింటి నడుమ ఎన్నో మంచి సీరియల్స్ కూడా వచ్చాయి. వస్తున్నాయి. నేనలాంటి ఔట్ఫోకస్ ఉన్న సీరియల్సే తీసాను. కక్షలు, మోసాలు అన్నింటా ఉంటాయి. అయితే, ఏం చూపుతున్నాం అనేది కూడా దర్శకుడికి చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా డిప్రెసివ్ సినారియో నడుస్తుంది. యంగ్‌జనరేషన్ ఇష్టపడేవి.. ఇప్పటి యంగ్ జనరేషన్లో హానెస్టీ ఉంటుంది. ప్రతీ థాట్‌లో ఓపెన్‌నెస్‌ని బాగా ఇష్టపడుతున్నారు. మాటలు, చేతలు, ధైర్యంగా ఇష్టాయిష్టాలు చెప్పుకోవడం.. ఇలా ప్రతీది ఓపెన్‌గా కనిపిస్తున్నారు. అది మంచికో చెడుకో అనేది మళ్ళీ క్వెశ్చన్స్ వేసుకోవాల్సిందే. నా విషయానికి వస్తే చిన్న వయసులోనే ఈ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. 18 ఏళ్లకే నాకు పెళ్లయింది. అప్పుడు ఇంటర్మీడియేట్ మాత్రమే. రిజల్ట్ వచ్చాక ఇంట్లో ఇంకా చదువుకోవాలన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా పెద్ద కొడుకు పుట్టాడు. కాలేజీలో ఉన్నప్పుడు డ్రామాలు కూడా వేసేదాన్ని. మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసేవారు. మా వారు దూరదర్శన్‌లో వర్క్ చేసేవారు. చిత్రలహరికి టైటిల్స్ రాయమన్నారు. బొమ్మలేసే అలవాటు ఉండటం వల్ల ఆ వర్క్ తీసుకున్నాను. అలా టీవీలో నా వర్క్ డాక్యుమెంట్స్‌కి చేయడం వరకు వెళ్లింది. డిగ్రీ పూర్తయ్యాక అక్కడ చేయాల్సిన ప్రాజెక్ట్స్ మరికొన్ని కనిపించాయి. అలా నేచరల్‌గా టీవీ సీరియల్ వర్క్‌లోకి ఎంటరయ్యాను. ముందు తక్కువ ఎపిసోడ్స్ ఉన్న సీరియల్స్ చేశాను. తర్వాత 26 ఎపిసోడ్స్, 50 ఎపిసోడ్స్, వంద, వెయ్యి... అలా పెద్ద సీరియల్స్ వరకు వెళ్లాం. ఏ సీరియల్ బాగా ఇష్టం? సీరియల్ ఆఫ్ స్క్రీన్‌లో గ్రేట్ మూమెంట్స్.. రుతురాగాలు బాగా ఇష్టమైన సీరియల్. అలా స్మూత్‌గా వెళ్లిపోయింది కథ. ప్రతీ సీరియల్ ఎండ్ మూమెంట్ అనేసరికి చాలా బాధనిపించేది. యూనిట్లో అంతా ఏడుపులతో గందరగోళంగా ఉండేది. స్టోరీతోనూ, ఆ పాత్రలు, వర్క్ చేసే ప్రతి ఒక్కరి మధ్యా ఒక బంధం ఉండేది. రేపటి నుంచి ఇక కలవం అనుకుంటే చాలా బాధగా ఉండేది. ప్రేక్షకులతో ఉండే ఒక బాండ్ కూడా అక్కడితో ఎండ్ అవుతుంది. కానీ, ఎన్నాళ్లో అలా సాగదీయలేం కదా! సీరియల్స్ ద్వారా జనాలకు ఇచ్చే సందేశం మెసేజ్ ఇవ్వడానికి సీరియల్, సినిమాను మించిన సాధనం లేదు. సీరియల్ ద్వారా అరగంట ఆడియన్స్ టైమ్ మనచేతిలో ఉందంటే చెప్పే విషయం పట్ల చాలా క్లారిటీ ఉండాలి. సొసైటీని డీ జనరేట్ కానివ్వకూడదు. మంచి–చెడు చెప్పగలగాలి. సృష్టించే క్యారెక్టర్‌కి విలువలు ఉండాలి. కథలో సస్పెన్స్ ఉండాలి. వాటితో పాటే క్యార్టెక్టర్తో ప్రేక్షకుడికి ఒక బంధం ఏర్పడాలి. ఆగమనం సీరియల్ నుంచి కెరటాల దాక మోరల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, సెల్ఫ్ డిఫెన్స్, ఇండివిడ్యువాలిటీ గురించి చెప్పాం. ఈ ఆలోచన కూడా ఏదో పనిగట్టుకొని రాదు. అది మన మైండ్‌లో నేచురల్‌గా చేరిపోతుంది. నటీ నటుల ఎంపిక... ఈ ఫేస్ అయితే ఈ క్యారెక్టర్‌కి కరెక్ట అనుకుంటాం. కొన్ని ఆర్టిస్ట్‌ను బట్టి మార్పులు చేసుకుంటాం. కొంతమంది బాడీలాంగ్వేజెస్ ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. వాళ్లని బట్టి కూడా కొత్త కథలు పుట్టుకువస్తాయి. నటీనటుల్లో ‘నటించగలం’ అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. కొత్తకథ అనుకున్నప్పుడు ఆర్టిస్టుల గురించి అనౌన్స్ చేస్తాం. లాంగ్ సీరియల్స్‌ని కొనసాగించడం చాలా కష్టం అనుకుంటారు. కానీ, చాలా సింపుల్. తక్కువ మందితో ముందే అనుకున్న కథనంతో సీన్ నడిపించేస్తాం. కొంతమంది వెళ్లి వెనక వంట కూడా చేసేస్తుంటారు. ప్రతిరోజూ ఒక పిక్నిక్లా ఉంటుంది. తెలుగు సీరియల్స్ – ఫారిన్స్ సీరియల్స్‌కి తేడా! ఇంగ్లిష్ సీరియల్స్ కల్చర్ చాలా భిన్నంగా ఉంటుంది. ‘శాంటాబార్బరా, బోల్డ్ అండ్ బ్యూటీఫుల్..’ వంటివి అలా కొనసాగుతూనే ఉంటాయి. వాటిలో ఉండే పాత్రలు అక్కడి కల్చర్‌కి అనుగుణంగా ఉంటాయి. అక్కడి బంధాలు కూడా వాళ్లు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే డబ్బు ఫ్లో కూడా వారికి సపోర్టింగ్‌గా ఉంటుంది. సీరియల్స్‌కి తీసుకున్న కథలు ? సీరియల్స్ తీయాలని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మేం అనుకున్నాం.. ‘మనమే రాసేద్దాం’ అని. కామన్‌ఫ్రెండ్స్ కొందరు యుద్ధనపూడి సులోచనారాణిగారిని కలవమన్నారు. దాంతో ఆవిడ పుస్తకాలు ఇచ్చి ఏం కావాలో సెలక్ట్ చేసుకోమన్నారు. అలా ‘ఆగమనం’ చేశాం. నాటినుంచి కథ అంటే ఆవిడ దగ్గరకు పరిగెత్తేదాన్ని. ఆమే నా గాడ్ మదర్. ఆ తర్వాతి సీరియల్స్నీ ఆమెతో చర్చించాను. ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి..? కథ, పాత్రల గురించి ముందు నేను కన్విన్స్ అవ్వాలి. అందుకే ఏడాది పాటు బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు నవలలు చదువుతున్నాను. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథనాలను ఇష్టపడుతున్నాను. వచ్చే అక్టోబర్ వరకు పుస్తకాలతోనే నా కాలక్షేపం. పోలిక లేకుండా మనసు పెట్టి చేస్తే ఎవ్వరైనా తమ వృత్తిలో సక్సెస్ అవుతారు. – నిర్మలారెడ్డి -
రిలయన్స్ మరో సంచలనం : షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్
న్యూఢిల్లీ : ఇప్పటికే టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించి బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో తన పాగా వేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో వినూత్న ఆవిష్కరణకు తెరతీస్తుంది. సొంతంగా ప్రొడక్షన్ హౌజ్‌ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా షార్ట్‌ఫిల్మ్స్, సీరియల్స్‌ను నిర్మించాలని ఆర్ఐఎల్ భావిస్తోంది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్ కేవలం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందించనుందట. కేవలం రిలయన్స్ జియో సబ్స్క్రైబర్స్ మాత్రమే వెబ్ సీరిస్‌లో వీటిని వీక్షించవచ్చని తెలిసింది. టెలికాం మార్కెట్లో పోటీని తట్టుకుని అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రకటించింది. దీంతో తనకున్న 215 మిలియన్ వైర్లెస్ యూజర్ బేస్‌కు మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి వైర్డ్ బ్రాడ్‌బాండ్ సర్వీసులను ప్రారంభించాలనే లక్ష్యంతో కంపెనీ వుంది. జియో సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే కంటెంట్ అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వచ్చే 6 నెలల్లో కొన్ని వెబ్‌సిరీస్‌లను రిలీజ్ చేసే అంచనాతో ఉన్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. టారిఫ్‌లు భారీగా తగ్గడంతో మొబైల్ డేటా వినియోగం అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వీడియో స్ట్రీమింగ్ సర్వీసులైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియాలను వీక్షించే సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ ప్లాట్‌ఫామ్‌లపై పలు షోలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. దీంతో సొంత ప్రొడక్షన్ హౌజ్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. దీని కోసం రిలయన్స్ కంటెంట్ క్రియేటర్స్, స్క్రిప్‌రైటర్స్‌ను నియమించుకుంది. ఈ ప్రక్రియలోనే రిలయన్స్ అతిపెద్ద ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించబోతుందని ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. ఎరోస్ గ్రూప్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతి దేశ్ పాండేను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన మీడియా, ఎంటర్టైన్మెంట్కు అధిపతిగా నియమించుకుందని తెలిసింది. తాజాగా 20 నుంచి 25 మంది క్రియేటివ్ వ్యక్తులు కూడా బోర్డులో జాయిన్ అయ్యారు. మీడియా ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ విజ్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్‌తో జియో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. రిలయన్స్ త్వరలో కంటెంట్ ఆఫరింగ్ కోసం మరికొన్ని టేకోవర్లు చేసే యోచనలో ఉందని తెలిసింది.