Sharing
-
Maharashtra: మహాయుతి సీట్ల సద్దుబాటు ఫార్ములా ఇదే..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. సీట్ల సద్దుబాటుకు సంబంధించి మహాయుతి (బీజేపీ, శివసేన, ఎస్సీపీల కూటిమి)లో రాజకీయ గందరగోళం నెలకొన్నదనే వార్తలు వస్తున్న తరుణంలో మరో ఆస్తకికర పరిణామం చోటుచేసుకుంది.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సద్దుబాటు ఫార్ములాను ఆగస్టు 15 నాటికి మహాయుతి ఖరారు చేయనుంది. కూటమిలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన స్థానాలలోనే తిరిగి పోటీ చేసేలా ఫార్ములా రూపొందించనున్నట్లు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.ఈ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్పందిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో బీజేపీ వారైనా, షిండే లేదా అజిత్ పవార్ వర్గం వారైనా వారి మనోభావాలను గౌరవిస్తామన్నారు. అయితే అక్కడక్కడ ఒకటి లేదా రెండు సీట్ల కేటాయింపులలో తేడా ఉండవచ్చన్నారు. పొత్తు విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య చర్చలు జరగాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారన్నారు. -
జార్ఖండ్‌లో కొలిక్కిరాని ఇండియా కూటమి సీట్ల కేటాయింపు
త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అయితే జార్ఖండ్‌లో ఎన్‌న్డీఏ కూటమి సీట్ల కేటాయింపు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రతిపక్ష పార్టీ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దాని మిత్రపక్షాలు కూడా ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే ఇండియా కూటమిలో సీట్ల కేటాయింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రెండు సీట్ల విషయంలో చిక్కుముడి పడిందని సమాచారం. సీట్ల కేటాయింపు విషయంలో ఆర్జేడీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాలము సీటు ఆర్జేడీకి ఖరారుకాగా, చత్రా సీటు కోసం ఆర్జేడీ కూడా పట్టుపడుతోంది. మంత్రి సత్యానంద్ భోక్తా ఈ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఈ సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఆర్జేడీ సీట్ల కేటాయింపులో ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆయన బీహార్ సమీకరణల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో జార్ఖండ్‌లో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతోంది. లోహర్దగా సీటు కోసం అటు జేఎంఎం, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. జేఎంఎం నుంచి చమ్రా లిండా ఈ సీటు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు హజారీబాగ్ స్థానంలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఎవరూ దొరకలేదు. -
డిస్నీ+ హాట్‌స్టార్ యూజర్లకు షాక్! నవంబర్ 1 నుంచే..
నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) కూడా తమ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పాస్వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలియజేస్తూ సబ్‌స్క్రైబర్ ఒప్పందానికి సంబంధించిన అప్డేట్లను కెనడాలోని సబ్స్క్రైబర్లకు ఈ-మెయిల్ చేసింది. ది వెర్జ్ కథనం ప్రకారం.. అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్‌పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కఠిన ఆంక్షలను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి దాని వెబ్‌సైట్‌లోని హెల్ప్ సెంటర్‌ను కూడా అప్డేట్ చేసింది. యూజర్లు నిబంధనలను ఉల్లంఘించి పాస్వర్డ్ షేర్ చేయకుండా వారి అకౌంట్లను పర్యవేక్షించనుంది. కెనడియన్ సబ్‌స్క్రైబర్ ఒప్పందంలో "అకౌంట్ షేరింగ్"పై కొత్త నిబంధనను చేసింది. అందులో సబ్స్క్రయిబ్ అయిన యూజర్ల ఖాతాలను పర్యవేక్షిస్తామని కంపెనీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, సబ్‌స్క్రిప్షన్‌ను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పాస్వర్డ్ షేరింగ్ ఆంక్షలు కెనడాలో 2023 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. భారత్‌తో సహా ఇతర దేశాల్లో కూడా ఈ ఆంక్షలను అమలు చేయాలని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భావిస్తోంది. -
ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు
Uber Group Rides feature క్యాబ్‌సేవల సంస్థ ఉబెర్ తనయూజర్ల కోసంకొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. 'గ్రూప్ రైడ్స్' అనే కొత్త ఫీచర్‌ను (ఆగస్టు 22న) ఇండియాలో ప్రారంభించింది. దీని ప్రకారం ఒకే చోటుకు వెళ్లాల్సిన వేరు వేరు స్థానాల్లో ఉన్న యూజర్లకు ప్రయోజనం లభించనుంది. దీని ద్వారా గరిష్టంగా మరో ముగ్గురు వ్యక్తులతో ట్రిప్ షేరింగ్ ఆప్షన్ కల్పిస్తోంది. అంతేకాదు ఈ ఫీచర్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడనుందని ఉబెర్ వెల్లడించింది. గ్రూప్ రైడ్స్ ఫీచర్ ఈ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్‌ను ఉపయోగించే రైడర్లు తమ ఛార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. (ఖచ్చితమైన తగ్గింపు వారు ఎంత మంది వ్యక్తులతో ఛార్జీలను పంచుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.) తమ ట్రిప్ వివరాలను మెసేజింగ్ యాప్‌ల ద్వారా పోస్ట్ చేయడం ద్వారా రైడ్ కోసం స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. వీరు ట్రిప్‌లో చేరిన తర్వాత వారి స్వంత పికప్ స్థానాలను యాడ్ చేయవచ్చు. ఆ స్థానాలు రైడ్ రూట్లో అప్డేట్ చేసుకోవచ్చని ఉబెర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, మరింత డబ్బు ఆదాతో పాటు, ఇబ్బంది లేని ప్రయాణాన్నిఅందించేలా ఈ ఫీచర్ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తుందని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ తెలిపారు. తద్వారా రోడ్డుపై వాహనాలను తగ్గించే అవకాశం రైడర్లకు కలుగుతుందన్నారు. ఈ ఫీచర్ ఎలా వాడాలి? ఉబర్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి 'Services' ట్యాబ్‌ను ఎంచుకొని అందులో 'Group Rides' పై క్లిక్ చేయాలి. ఇక్కడ పికప్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నిర్దేశిత రైడర్లను (స్నేహితులను) ఎంచుకొని రైడ్‌లో జాయిన్ అవ్వమని వాట్సాప్ లింక్ సెండ్ చేస్తే చాలు. యాడ్ అయిన లొకేషన్ వివరాలు రైడ్‌లో యాడ్ అవ్వడంతోపాటు, ఈ సమాచారం డ్రైవర్‌కు కూడా అందుతుంది. -
‘ఎక్స్’ లో లక్షల్లో ఆదాయం: పండగ చేసుకుంటున్న కంటెంట్ క్రియేటర్లు
Twitter Ad-Revenue Sharing భారతీయ కంటెంట్ క్రియేటర్లు కూడా ఎక్స్(ట్విటర్) ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ట్విటర్ బాస్ ఎలాన్ మాస్క్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పండగ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. యాడ్-రెవన్యూ షేర్ ఫీచర్‌పై ట్వీపుల్ ప్రశంసలు కురిపిస్తున్నారు. (మోటో జీ14: ఫీచర్లు అదుర్స్! ధర తెలిస్తే వదిలిపెట్టరు!) ఇంప్రెషన్ల వల్ల సుమారు 2.1 లక్షలు సంపాదించానంటూ @గబ్బర్‌సింగ్ హ్యాండిల్ యూజర్ అభిషేక్ అస్థానా, స్క్రీన్ షాట్‌ను పంచుకున్నారు. ''బ్లూ టిక్ కే పైసే వసూల్'' అంటూ కమెంట్ చేశారు. ట్విటర్ స్ట్రాటజీ చాలా సింపుల్. ఈ వ్యూహంతో భారీగా సంపాదించిన ఇన్ఫ్లుయెన్సర్లే బ్లూ టిక్ సేల్స్‌మెన్‌గా మారతారు.. ఇదే నిజమైన ఆదాయ వనరు అని పేర్కొన్నారు. 'మైథున్' అనే వినియోగదారు తన బ్యాంక్ ఖాతాలో రూ. 3,51,000 జమ అయ్యాయంటూ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. 455.75 డాలర్లు వచ్చాయి. గత 3 నెలల్లో దాదాపు 17మిలియన్ల ఇంప్రెషన్లు, 25కే ఫాలోవర్లు ఉన్నారంటూ మరొక యూజర్ తెలిపారు. బెంచ్‌మార్క్ సాధించాలంటే ఏం కావాలో తెలిపారు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) కాగా ఎంపిక చేసిన కంటెంట్ సృష్టికర్తలు వారి ప్రత్యుత్తరాలలో వచ్చేప్రకటనల నుండి వచ్చే ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఎక్స్ ప్రకటనల రాబడి భాగస్వామ్యానికి అర్హత పొందాలంటే, వెరిఫైడ్ క్రియేటర్లు గత 3 నెలల్లో వారి పోస్ట్‌లపై కనీసం 5 మిలియన్ ఇంప్రెషన్లు కలిగి ఉండాలి. వెరిఫైడ్ క్రియేటర్లకు వారి కంటెంట్ రిప్లై సెక్షన్లో యాడ్స్ వస్తాయని ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి పేమెంట్ల కోసం 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 41.2 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. (ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: మహీంద్ర థార్‌పై బంపర్ ఆఫర్) Blue tick ke paise vasool pic.twitter.com/pVrX5hTYWo — Gabbar (@GabbbarSingh) August 8, 2023 $455.75 is pretty good. If you want to benchmark, I have roughly ~17M impressions in last 3 months and ~25k followers. pic.twitter.com/3eknXeIEhP — Ravi Handa (@ravihanda) August 8, 2023 Twitter 𝕏 Ad Revenue sharing eligibility criteria. Requirements - 15 Million+ Tweet impressions for the last 3 months, earlier 5 Million+ impressions for the last 3 months. - Twitter Blue subscription or Verified Organisations subscription. - Minimum 500 followers. - Minimum… pic.twitter.com/2Wb2ntoQa3 — Abhishek Yadav (@yabhishekhd) August 8, 2023 -
నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్‌స్టార్ - అదే జరిగితే..
Disney Hotstar Limit Account Sharing: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్‌ను ముగించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో 'డిస్నీ+ హాట్‌స్టార్' (Disney+ Hotstar) కూడా ఇదే బాటలో పయనించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, డిస్నీ+ హాట్‌స్టార్ దాని ప్రీమియం వినియోగదారులలో పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వినియోగదారులు కేవలం నాలుగు పరికరాల నుంచి మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని అమలు చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అమలులోకి వస్తే స్ట్రీమింగ్ దిగ్గజం పాస్వర్డ్ షేరింగ్ వినియోగదారులకు కష్టతరమవుతుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానానికి నెట్‌ఫ్లిక్స్ మంగళం పాడింది. ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాల్లో ఇది అమలులో ఉంది. ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం డిస్నీ+ హాట్‌స్టార్ ద్వారా గరిష్టంగా 10 పరికరాలలో లాగిన్లను అనుమతిస్తుంది. కానీ దీనికి త్వరలోనే స్వస్తి చెప్పనుంది. కొత్త రూల్స్ ఈ ఏడాది చివరి నాటికి అమలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!) కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారులు సొంత సభ్యత్వాన్ని పొందాల్సి ఉండవచ్చు. అయితే రానున్న కొత్త మార్పులు చౌకైన ప్లాన్లకు కూడా వర్తిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన డిస్నీ+ హాట్‌స్టార్ 2022 మార్చి నుంచి 2023 మార్చి వరకు 38 శాతం వీక్షకులను కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుస్కోవడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సిందే. -
Delhi: బైక్ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్!
రైడ్ షేరింగ్ సంస్థలకు సుప్రీం కోర్ట్ భారీ షాకిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించే వరకు ఢిల్లీలో ద్విచక్రవాహనాలు నడపకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30 నాటికి టూవీలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను నడిపేలా నూతన విధానాన్ని తీసుకువస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అప్పటి వరకు దేశ రాజధానిలో టూవీలర్ ట్యాక్సీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ రైడ్ షేరింగ్ సంస్థల్ని ఉద్దేశిస్తూ కీలక నోటీసులు జారీ చేసింది. అందులో వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. [BREAKING] Supreme Court stays bike taxi operations of Rapido, Uber in DelhiRead more here: https://t.co/NdU2GfNFWI pic.twitter.com/FCcmpELJif— Bar & Bench (@barandbench) June 12, 2023 అంతేకాదు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థలకు మొదటి నేరం కింద రూ. 5,000, రెండవసారి తప్పు చేస్తే రూ. 10,000 జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని రవాణా శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు రైడింగ్ సర్వీసులు అందించే వాహన యజమాని (డ్రైవర్) డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు రద్దు అవుతుందని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైడ్ షేరింగ్ సంస్థకు షోకాజు నోటీసులు అందించింది. ఆ నోటీసులపై స్పందించిన సదరు సంస్థ తమకు అందిన నోటీసులు వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైడ్ షేరింగ్ టూ వీలర్ వాహనాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వడం రైడ్ షేరింగ్ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. చదవండి👉 యాపిల్ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
వర్చువల్ మీటింగ్.. స్క్రీన్‌పై చెడ్డీలు..
కొన్ని ఐటీ సంస్థల్లో ఇప్పటికీ వర్క్ ఫ్రం హొమ్ నడుస్తోంది. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే హాయిగా పనిచేసుకుంటున్నారు. అయితే పని వేళల్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ సంఘటన గురించి తెలుసుకుంటే అర్థమౌతుంది. ఢిల్లీకి చెందిన అమన్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇంటి నుంచి పని చేస్తున్న అతను వర్క్ టైమ్‌లో బాక్సర్ల కోసం ఆన్లైన్ షాపింగ్ చేశాడు. ఇందు కోసం తన బ్రౌజర్లోని ఒక ట్యాబ్‌లో ఈ-కామర్స్ సైట్‌ను ఓపెన్ చేశాడు. అయితే వర్చువల్ ఆఫీస్ మీటింగ్ సమయంలో తన స్క్రీన్‌ను షేర్ చేయమని అడిగినప్పుడు, అతను అనుకోకుండా షాపింగ్ పేజీకి సంబంధించిన ట్యాబ్‌ను షేర్ చేశాడు. ఇంతలో దురదృష్టవశాత్తూ స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. ఇంకేముంది అతని ఆన్లైన్ చెడ్డీల షాపింగ్ పేజీని అందరూ చూసేశారు. అతను ఆ స్క్రీన్ మార్చడానికి వీలు లేకుండా పోయింది. ఆ వర్చువల్ ఆఫీస్ మీటింగ్‌లో పాల్గొన్న అతని సహోద్యోగులు స్క్రీన్ మార్చరా నాయనా అంటూ ఎన్ని ఇన్కాల్ మెసేజ్‌లు పెట్టినా లాభం లేకోపోయింది పాపం. వర్క్ టైమ్‌లో జరిగిన ఈ పొరపాటు గురించి అమన్ సరదాగా ట్విటర్లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన సహోద్యోగుల నుంచి వచ్చిన సందేశాల స్క్రీన్షాట్లను షేర్ చేశాడు. వర్క్టైమ్లో ఆన్లైన్ షాపింగ్ వంటి ఇతర వ్యాపకాలు పెట్టుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాడు. guys pls pray for me 😭 pic.twitter.com/da5md2O4FC — Aman (@AmanHasNoName_2) June 1, 2023 ఇదీ చదవండి: హెచ్‌సీఎల్‌కు షాక్! కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే.. -
భారీగా తగ్గిన నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చేజారిపోతున్న సబ్స్కైబర్ల సంఖ్యను పెంచేలా 30 కి పైగా దేశాల్లో సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. ఈజిప్ట్, యెమెన్,జోర్డాన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా,స్లోవేనియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, వెనుజెలా, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్స్క్రిప్షన్ ఫీజును భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే తగ్గించిన దేశాల్లో భారత్ లేకపోవడం గమనార్హం. ఓటీటీ దిగ్గజం గత కొంత కాలంగా పాస్వర్డ్ షేరింగ్‌పై సర్ ఛార్జీలు వసూలు చేస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సబ్స్క్రిప్షన్ చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో యూజర్లను తిరిగి రాబట్టుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, సబ్ సహారన్ ఆఫ్రికా , మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా, సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్ , ఏసియా పసిఫిక్ లాంటి రీజియన్స్‌లో 20 నుంచి 60 శాతం వరకు ఛార్జీలను తగ్గించింది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రతి నెలా బేసిక్ ప్లాన్‌ను కొత్తగా వచ్చే యూజర్లకు, ఇప్పటికే వినియోగిస్తున్న యూజర్లు 28 మలేసియన్ రింగిట్స్‌కే అదిస్తున్నట్లు ట్వీట్ చేయగా.. ఇండియన్ కరెన్సీలో రూ.653 చెల్లించాల్సి ఉంది. కాగా, గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ బేసిక్ ధర 35 మలేసియన్ రింగిట్స్ ఉండేది. -
మోదీపై డాక్యుమెంటరీ.. దెబ్బకు ఆ లింక్‌లు బ్లాక్
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. బీబీసీ తీసిన డాక్యుమెంటరీలను షేర్ చేసే పలు యూట్యూబ్ వీడియోలను, ట్విటర్లోని ట్వీట్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార మత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సంబంధిత యూట్యూబ్ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌ని కేంద్రం ఆదేశించింది. ఐటీ నిబంధనల ప్రకారం.. విశేషాధికారాలను ఉపయోగించి సమాచార ప్రసార కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఐతే యూట్యూబ్, ట్విట్టర్ రెండూ ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. బీబీసీ భారత్‌లోకి డాక్యుమెంటెరీని అందుబాటులోకి తీసుకురానప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు భారత్ వ్యతిరేక ఎజెండాను ప్రచారం చేయడానికి అప్లోడ్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే మళ్లీ తన ఫ్లాట్‌ఫామ్‌లో ఈ వీడియోలను అప్లోడ్ చేస్తే బ్లాక్ చేయమని యూట్యూబ్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాదు ఇతర ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో లింక్‌ను కలిగి ఉన్న ట్వీట్లను కూడా గుర్తించి బ్లాక్ చేయమని అదేశించినట్లు పేర్కొన్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నత ప్రభుత్వాధికారులు ఈ డాక్యుమెంటరీని పరిశీలించి.. దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా, భారత సుప్రీం కోర్టు అధికారం విశ్వసనీయతపై దుష్ప్రచారం చేసేలా, పైగా.. వివిధ భారతీయ వర్గాల మధ్య విభేదాలను కలిగించేలా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం ఫైర్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఉందని, విదేశాలతో భారత్‌కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని కేద్రం అభిప్రాయపడింది. ఇంతకు ముందు బీబీసీ నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా, యూకే నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ గురించి వ్యతిరేకంగా రెండు భాగాల సిరీస్‌ను ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీపై దుమారం రేగడంతో.. ఎపిసోడ్ లింక్‌లను తొలగించమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: మోదీపై డాక్యుమెంటరీలో ఏముంది? రిషి సునాక్ ఎలా రియాక్ట్ అయ్యారు? -
కస్టమర్స్‌కి షాక్ ఇవ్వబోతున్న నెట్‌ఫ్లిక్స్
-
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. త్వరలో పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఫలితాల్లో స్ట్రీమింగ్ దిగ్గజం ఆదాయ పరంగా భారీ నష్టాలను చవిచూసింది. కానీ సబ్స్క్రిప్షన్ సంఖ్య భారీగా పెరిగింది. అందుకు పాస్వర్డ్ షేరింగ్ కారణమని పేర్కొంది. ఇప్పుడు కంపెనీ తన త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అదనపు ఛార్జీల నిబంధన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాన్నట్లు స్పష్టం చేసింది. అకౌంట్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. “అకౌంట్ షేరింగ్‌ను మానిటైజ్ చేసేందుకు ఆలోచనాత్మకమైన విధానాన్ని ప్రారంభించాము. 2023 ప్రారంభంలో దీన్ని మరింత విస్తృతంగా ప్రారంభిస్తాం. వినియోగదారుల అభిప్రాయాన్ని విన్న తర్వాత నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో లేని చైనా,రష్యా మినాహాయించి మిగిలిన దేశాల్లో పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు రుసుమును విధిస్తాం’’ అని తెలిపింది. వినియోగదారులు పాస్వర్డ్ షేరింగ్‌పై ఎంత ఛార్జీలు వసూలు చేస్తుందనే అంశంపై నెట్‌ఫ్లిక్స్ స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ పలు నివేదికల ప్రకారం.. 3 డాలర్ల నుంచి 4 డాలర్ల మధ్యలో ఉండే అవకాశం ఉండనుంది. చదవండి👉 ఓలా సీఈవో భవిష్ అగర్వాల్‌పై సంచలన ఆరోపణలు! -
కొంచెం ఇష్టం..కొంచెం కష్టం,యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ షాక్!
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు భారీ షాకివ్వనుంది. ప్రస్తుతం మూడు దేశాల్లో మాత్రమే పాస్వర్డ్ షేరింగ్‌పై నెట్ ఫ్లిక్స్ అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అన్నీ దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్‌పై డబ్బులు వసూలు చేయాలని భావిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..చీలీ, కోస్టరికా,పెరులో నెట్‌ఫ్లిక్స్ వినియోగించే యూజర్లు వారి అకౌంట్ క్రెడియన్షియల్స్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలంటే.. అందుకు అదనంగా 2.99డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సర్ ఛార్జీలను మిగిలిన దేశాల్లో సైతం వసూలు చేయనుంది. ఈ ఏడాది విడుదలైన మొదటి త్రైమాసికంలో(జనవరి,ఫిబ్రవరి, మార్చి) 200,000 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రానున్న నెలల్లో మరో 2మిలియన్ల మంది సబ్స్క్రిప్షన్లను కోల్పోవచ్చని అంచనా వేసింది. కాబట్టే మార్కెట్ విలువ నుండి సుమారు $55 బిలియన్ల ఆదాయం తగ్గిపోయింది. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం గతనెల క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో వాటాదారులకు రాసిన లేఖలో సుమారు 100 మిలియన్ల మంది యూజర్లు పాస్‌వర్డ్‌ను షేరింగ్ చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అందుకే సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్‌పై సర్ ఛార్జీలను వసూలు చేయనుంది.అదే జరిగితే సబ్స్క్రిప్షన్ సంఖ్య తగ్గిపోతుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి విరుగుడుగా సబ్స్క్రిప్షన్ ఛార్జీలు తగ్గించి..ఈ ఏడాది (2022) చివరి నాటికి పాస్వర్డ్ షేర్‌పై సర్ చార్జీలను విధించాలని చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే సబ్‌స్క్రిప్షన్‌ను కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు షేర్ చేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 ఆ కక్కుర్తితో వందల కోట్ల హాంఫట్,నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులారా బుద్ధొచ్చింది! -
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్, యూజర్లకు ఇక పండగే
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్డేట్తో ముందుకు వచ్చింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లో హైక్వాలిటీ వీడియోల్ని సెండ్చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. వాస్తవానికి వాట్సాప్ నుంచి మరో వాట్సాప్‌కు కేవలం 16ఎంబీ వీడియోను మాత్రమే షేర్ చేసే సదుపాయం ఉంది. దీనివల్ల వినియోగదారులు వీడియో క్వాలిటీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాట్సాప్ ద్వారా హై క్వాలిటీ వీడియోల్ని సెండ్ చేయలేకపోతున్నామని, అందుకోసం ఫీచర్‌ను తీసుకొని రావాలంటూ వాట్సాప్ యాజమాన్యానికి పెద్ద ఎత్తున మెయిల్స్ పెట్టారు. దీంతో వాట్సాప్ యాజమాన్యం ఇకపై హై క్వాలిటీ వీడియోల్ని సెండ్ చేసేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేసింది. వీ బీటా ఇన్ఫోరిపోర్ట్ ప్రకారం.. వీడియో అప్లోడ్ క్వాలిటీ పేరుతో ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.14.6 ఫీచర్‌పై వర్క్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత హైక్వాలిటీ వీడియోల్ని షేర్ చేసే అవకాశం ఉంది. "ఆటో, బెస్ట్ క్వాలిటీ, డేటా సర్వర్" పేరుతో మూడు ఆప్షన్లను యాడ్ చేయనుంది. ఆటో: ఆప్షన్ ద్వారా వీడియో క్వాలిటీ తగ్గకుండా సైజును మాత్రమే తగ్గించి సెండ్ చేసేందుకు వీలుంది బెస్ట్ క్వాలిటీ : ఈ ఆప్షన్ ద్వారా హై రెజెల్యూషన్ వీడియోల్ని షేర్ చేసుకోవచ్చు. డేటా సేవర్ : ఈ ఆప్షన్ ద్వారా ఇంటర్ నెట్ హై బ్యాండ్ విత్ లేకపోయినా వీడియోను కంప్రెస్ చేసి సెండ్ చేసుకోవచ్చు. బ్యాండ విత్ లేకుండా వీడియోను కంప్రెస్ చేస్తే క్వాలిటీ మిస్ అవుతుందనే డౌట్ రావచ్చు.కానీ డేటా సేవర్ ఆప్షన్ వీడియో క్వాలిటీ తగ్గకుండా కంప్రెస్ చేయడంపై దృష్టిసారిస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ పై వర్క్చేస్తుండగా, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. చదవండి: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్, యూజర్లకు ఇక పండగే -
Corona Vaccine: కోవాగ్జిన్ ఫార్ములా బదిలీకి ఓకే
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్ బయోటెక్ అంగీకరించింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడి రాష్ట్రాల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో కోవిడ్ 19 టీకాల లభ్యతను గణనీయంగా పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అందుకు వీలుగా ‘న్యూ లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్ట్రాటెజీ’ని రూపొందించినట్లు స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ సాంకేతిక బదిలీకి సంబంధించి ద్వైపాక్షిక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఫార్మా సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ‘ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్), భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఐబీసీఒఎల్), అలాగే, ముంబైకి చెందిన హాఫ్కిన్స్ బయోఫార్మా.. ‘కోవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థతో టీకా సాంకేతికత బదిలీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందాల వెనుక భారత ప్రభుత్వ కృషి ఉందని తెలిపింది. మరోవైపు, ఈ మూడు సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోందని వెల్లడించింది. ఐఐఎల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి, బీఐబీసీఓఎల్, హాఫ్కిన్స్ ఈ సంవత్సరం నవంబర్ నుంచి కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని తెలిపింది. ఈ మూడు సంస్థలే కాకుండా, మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీ జరిగి, పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి సాధ్యమయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించింది. ఈ దిశగా సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోందని పేర్కొంది. కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీకి, లైసెన్సుల జారీకి సంబంధించి జాప్యం జరుగుతోందన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సంబంధిత వార్తా కథనాలు, ట్వీట్లు అవాస్తవాలని స్పష్టం చేసింది. టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ఇతర ఫార్మా కంపెనీలకు కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి వీలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. నేరుగా దిగుమతికీ వెసులుబాటు విదేశాల్లో రూపొందిన, విదేశాల్లో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ 19 టీకాలను భారత్‌లో వినియోగించేందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రారంభించామని తెలిపింది. అమెరికా, యూరోప్, జపాన్ తదితర దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన.. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చిన వ్యాక్సిన్లను భారత్‌లో వెంటనే వినియోగించేందుకు వీలుగా నూతన పాలసీని రూపొందించామని తెలిపింది. తక్షణమే వినియోగించుకునే వీలున్న విదేశీ టీకాలను కేంద్ర ప్రభుత్వం ద్వారానే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా సమకూర్చుకునే వీలు కూడా కల్పించామని పేర్కొంది. విదేశీ ఉత్పత్తిదారులకు భారత్‌లో ప్రవేశించేందుకు ఆసక్తి కలిగేలా ధరల విధానంలోనూ ఈ కొత్త పాలసీలో మార్పులు చేశామని వెల్లడించింది. మరోవైపు, మోడెర్నా, ఫైజర్ తదితర విదేశీ టీకా ఉత్పత్తిదారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని వెల్లడించింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని దరఖాస్తు చేసుకోవాలని వారిని కోరుతోందని తెలిపింది. మరోవైపు, కోవిడ్ టీకాలకు మేథో హక్కుల మినహాయింపు కోసం భారత్ సహా పలు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపింది. 3ఫార్మా కంపెనీలకూ ఆహ్వానం కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయాలనుకునే ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. తద్వారా టీకాల ఉత్పత్తి పెరిగి, దేశీయంగా వాటి లభ్యత మెరుగుపడుతుందన్నారు. భారత బయోటెక్‌తో అవి ఒప్పందం కుదుర్చుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఇతర ఫార్మా కంపెనీలతో సాంకేతికత బదిలీకి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందన్నారు. ‘ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ప్రతినిధులతో చర్చించాం. వారు సంతోషంగా స్వాగతించారు’ అని పాల్ తెలిపారు. ‘‘అయితే, ఈ వ్యాక్సిన్‌ను లైవ్ వైరస్‌ను ఇనాక్టివ్ చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ‘బీఎస్ఎల్3’ ల్యాబొరేటరీల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫార్మా కంపెనీల్లో ఇవి లేవు’’ అని వివరించారు. -
రాసిస్తేనే మద్దతిస్తాం..
సాక్షి ముంబై: మరాఠా రాజకీయం వేడెక్కుతోంది. సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు బిగించింది. ముఖ్యమంత్రి పదవి ఆదిత్య ఠాక్రేకు ఇవ్వడంతోపాటు మంత్రి పదవుల్లో సమాన వాటా కల్పిస్తామంటూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ బీజేపీపై ఒత్తిడి తెస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో శనివారం తన నివాసం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలంతా రెండున్నరేళ్లు ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రి పదవుల్లో సమాన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, యువసేన చీఫ్, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే(29)కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో లిఖిత పూర్వకంగా బీజేపీ హామీ ఇచ్చేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపారు’అని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సమాన వాటా ఇస్తామంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకు ఇచ్చిన హామీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టారన్నారు. బీజేపీ, శివసేన హిందుత్వకు కట్టుబడి ఉన్నాయని, అందుకే ప్రత్యామ్నాయాలున్నా వాటిపై ఆసక్తి లేదని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారని సర్నాయక్ తెలిపారు. సీఎం పదవి మాదే: బీజేపీ ఇన్చార్జి సరోజ్ పాండే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీదేనని బీజేపీ మహారాష్ట్ర ఇన్చార్జి సరోజ్ పాండే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఊహించిన దానికంటే 17 సీట్లు తగ్గినా 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. మిత్రపక్షమైన శివసేనకు కూడా ఏడు సీట్లు తగ్గి, 56 సీట్లు గెలుచుకుందని తెలిపారు. దీపావళి తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్‌తో సీఎం ఫడ్నవిస్ చర్చలు జరుపుతారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావుసాహెచ్ దన్వే వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఈ నెల 30న సమావేశమై శాసనసభా పక్షం నేతను ఎన్నుకోనున్నారు. సీఎం ఫడ్నవిస్ స్వతంత్రులు, చిన్న పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మేం ప్రతిపక్షంలోనే: పవార్ ప్రభుత్వం ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ మద్దతిస్తుందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘మేం ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును పాటిస్తాం’అని పేర్కొన్నారు. ‘ప్రతిపక్షంగా ఉండాలనే ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలనుకుంటే శివసేననే ముందుగా స్పందించాలి’అని కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెత్తివార్ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని అధికా రం నుంచి తప్పించేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని మాజీ సీఎంలు చవాన్, పృథ్వీరాజ్ తెలిపారు. -
వాట్సాప్ కొత్త అప్డేట్
వాట్సాప్ కొత్త ఫీచర్లతో కస్టమర్లకు ఎప్పటికపుడు రిఫ్రెష్ చేస్తుంది. తాజాగా వాట్సాప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్బుక్లో షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటిని ఇకపై ‘షేర్ టు ఫేస్బుక్ స్టోరీ’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఫేస్బుక్ స్టోరీలుగా మార్చవచ్చు. స్టేటస్ అప్డేట్ తర్వాత.. కుడివైపు వుంటే.. మూడు చుక్కలను క్లిక్ చేస్తే.. ‘షేర్ టు ఫేస్బుక్ స్టోరీ’ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ స్టేటస్ ఆటోమెటిక్‌గా ఫేస్బుక్ స్టోరీలో షేర్ అవుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు అన్ని వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్బుక్లో నేరుగా ఎలా షేర్ చేయాలంటే.. ♦ వాట్సాప్‌లోని స్టేటస్ లోకి వెళ్లండి ♦ వాట్సాప్ స్టేటస్ చిత్రం లేదా వీడియోను అప్లోడ్ చేయండి. ♦ ఇది పూర్తయ్యాక కుడివైపున ఉన్న మూడు చుక్కల్ని క్లిక్ చేసి షేర్ టు ఫేస్బుక్ స్టోరి అనే ఆప్షన్‌ను ఎంచుకుని పబ్లిష్ చేయాలి. బోనస్: మ్యూట్' స్టేటస్‌కు సంబంధించి కూడా అప్డేట్ తీసుకు రానుంది. మ్యూట్ చేసిన వ్యక్తుల షేరింగ్ పూర్తిగా కనిపించకుండా చేసే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ఆండ్రాయిడ్, తాజా బీటా వెర్షన్ వినియోగదారులు తమ కాంటాక్ట్స్ లోని వారి స్టేటస్‌ను మ్యూట్ చేసుకునే అవకాశం ఉన్నసంగతి తెలిసిందే. అయితే మ్యూట్ చేసిన తరువాత కూడా ఆయా వ్యక్తుల స్టేటస్లు హైలెట్ కాకుండా బూడిద రంగులో మనకి కనిపిస్తూనే వుంటాయి. ఇకపై ఇలా కనిపించకుండా చేయాలని వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. -
మగాళ్లు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు..
ప్రపంచంలో ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లే ఎక్కువ ఒంటరితనంతో బాధ పడుతున్నారు. ఇటీవల జరిపిన ఓ సర్వేలో బ్రిటన్ విషయంలో కూడా ఇదే రుజువైంది. అక్కడ ప్రతి ఐదుగురిలో ఒక పురుషుడు ఒంటరితనంతో బాధ పడుతున్నారు. సన్నిహిత మిత్రులు ఒక్కరు కూడా లేరని 18 శాతం మంది, మంచి మిత్రులే లేరని 32 శాతం మంది చెప్పగా, 12 శాతం మహిళలు సన్నిహిత మిత్రులు లేరని, 24 శాతం మంది మహిళలు మంచి మిత్రులు లేరని ‘యూగౌ’ జరిపిన సర్వేలో తెలిపారు. పిల్లల స్కూళ్లకు వెళ్లినప్పుడో, వారి కోసం క్రీడా క్లబ్బులు, మైదానాలకు వెళ్లినప్పుడు ఇతర పిల్లల తల్లులు తమకు ఎక్కువగా స్నేహితులు అవుతున్నారని తేలింది. ఈ విషయంలో తండ్రులకు ఎక్కువగా స్నేహితులు కావడం లేదు. కారణం వారు తరుచుగా పిల్లల కోసం స్కూళ్లకుగానీ స్పోర్ట్స్ క్లబ్బులకుగానీ వెళ్లకపోవడం. మగవాళ్లకు ఎక్కువగా ఆఫీసుల్లోనే స్నేహితులు అవుతున్నారు. అందుకనే వారిలో ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాత ఒంటరితనంతో బాధపడాల్సి వస్తోంది. సమాజంలో పురుషులకన్నా మహిళలనే సోషల్ నెట్వర్క్ ఎక్కువగా ఉంటుందని, వారు జీవితాంతం కొత్తవారిని స్నేహం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, అదే మగవాళ్లలో లేదని, వారితో మనకేం పనిలే అనుకోవడం అందుకు కారణమని బ్రిటన్‌లో ఒంటరితనాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్న పరిశోధనా సంస్థ డైరెక్టర్ రాబిన్ హెవింగ్స్ విశ్లేషించారు. పైగా మహిళలు సొంత విషయాలు మిత్రులు, కుటుంబాలతో పంచుకోవడానికి ఎక్కువ చొరవ చూపుతారని, అదే మగవాడు ఒంటరితనంతో బాధ పడుతున్న విషయాన్ని మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడరని, అలా పంచుకోవడం ఆత్మ న్యూన్యతా భావంగా భావించడమేనని హెమింగ్స్ వివరించారు. కొత్త వారిని పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం కూడా మగవాళ్లలో తక్కువ. అలాంటి ఉత్సాహం ఉన్న వాళ్లు కేవలం 18 శాతం మాత్రమేనని తేలింది. ఒంటరితనంతో బాధపడడం వల్ల జీవితం మీద విరక్తి పుడుతుంది. అది పెరిగితే బతుకు భారం అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఆ తీవ్రమైన చర్యకు కూడా పాల్పడతారు. అందుకని పురుషుల్లో ఒంటరితనం పోవాలంటే పాత మిత్రులతో స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలి. అందుకు నేడు సోషల్ మీడియా ఎంతగానో తోడ్పడుతుంది. ఉదయం పూట వాకింగ్ అలవాటు చేసుకొని అలా వచ్చేవారితో స్నేహం చేసుకోవాలి. లేదా పెంపుడు కుక్కలను అలా తిప్పడానికి తీసుకెళ్లినప్పుడు తోటి వాళ్లతో స్నేహం చేయాలి. వ్యాయామం లేదా ఇతర కాలక్షేప క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా స్నేహాన్ని పెంచుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లో లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అన్నింటికన్నా ముందు ఇరుగు, పొరుగు వారితో స్నేహం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. -
ఎస్పీ, బీఎస్పీ.. చెరో 38
లక్నో/న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు కూటమిగా బరిలోకి దిగాలని గతంలో బద్ధశత్రువులైన బీఎస్పీ, ఎస్పీ పార్టీలు శనివారం నిర్ణయించుకున్నారు. శనివారం లక్నోలో∙మీడియా సమావేశంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ చీఫ్ మాయావతి ఈ విషయం ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలు చెరో 38 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి ఉంచుతాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా సొంత నియోజకవర్గాలు అమేథీ, రాయ్‌బరేలీల్లో తమ అభ్యర్థులు బరిలో ఉండరని వీరు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీలు పోటీ చేయగా మిగిలిన మరో రెండు సీట్లను చిన్న పార్టీలకు వదిలివేస్తున్నట్లు ప్రకటించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ 71 సీట్లు, అప్నా దళ్ రెండు చోట్ల గెలిచాయి. ఎస్పీకి 5, కాంగ్రెస్‌కు 2 స్థానాలు దక్కగా బీఎస్పీ ఒక్కటీ కూడా గెలవలేదు. వారిద్దరికీ నిద్ర కరువే 1995లో తనపై ఎస్పీ కార్యకర్తలు చేసిన దాడిని మనసులో ఉంచుకోనని, జాతి ప్రయోజనాల కోసం, బీజేపీ విధానాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం అప్పట్లో జరిగిన ఆ ఘటనను పట్టించుకోనని మాయావతి స్పష్టం చేశారు. తమ కూటమి ఏర్పాటుతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఇకపై నిద్ర కరవవుతుందన్నారు. ‘మాది సహజ కూటమి. మా బంధం లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు యూపీ అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతుంది. ఇది రాజకీయ విప్లవం’ అని ప్రకటించారు. ‘ఈవీఎం దుర్వినియోగం, రామ మందిరం అంశం వంటివి లేకుంటే బీజేపీని ఓడిస్తాం’ అని తెలిపారు. అందుకే కాంగ్రెస్‌ను కలుపుకోలేదు కూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోకపోవడంపై మాయావతి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగం, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయి. రక్షణ రంగ ఒప్పందాల్లో భారీ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. గతంలో కాంగ్రెస్‌తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సమయంలో మాకు ఎలాంటి లాభం కలగలేదు. మా పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయి. కానీ, ఆ పార్టీ ఓట్లు మా అభ్యర్థులకు పడలేదు. మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తుతో మాకు ప్రయోజనం ఉండదు. కానీ, ఎస్పీ– బీఎస్పీ బంధంతో ఓట్ల బదిలీ పక్కాగా జరుగుతుంది’ అని వివరించారు. నాకూ అవమానమే: అఖిలేశ్ మాయావతి ప్రధానమంత్రి అభ్యర్థి అయితే మద్దతిస్తారా అన్న ప్రశ్నకు అఖిలేశ్ సూటిగా సమాధానం ఇవ్వకుండా ‘నేను ఎవరికి మద్దతిస్తానో మీకు తెలుసు’ అని అన్నారు. గతంలో యూపీ పలువురు ప్రధానమంత్రి అభ్యర్థులను దేశానికి అందించింది. మరోసారి అలాగే జరిగితే చాలా సంతోషం అని అన్నారు. మాయావతికి తగు గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా తమ పార్టీ శ్రేణులకు అఖిలేశ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘మాయావతిని గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే. ఆమెకు అవమానం నాకూ అవమానమే. బీజేపీ నేతలు కానీ మరెవరైనా కానీ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితే, అది నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే భావించాలి’ అని అన్నారు. 1995లో మాయావతిపై జరిగిన ఎస్పీ కార్యకర్తల దాడిని దృష్టిలో ఉంచుకుని తమ శ్రేణులకు ఆయన ఈ వార్నింగ్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ‘సహనంతో ఉండి బీఎస్పీ కార్యకర్తలతో సోదరభావంతో మెలగండి’ అని ఎస్పీ కార్యకర్తలను అఖిలేష్ కోరారు. ఈ కూటమి ఏర్పాటును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు స్వాగతించారు. 1995లో ఏం జరిగింది? 1993లో బీజేపీని నిలువరించేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 167 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. నేతల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల నేపథ్యంలో 1995లో ఓ సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ నేత మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో బీజేపీ నేత ఒకరు ఆమెను కాపాడారు. అనంతర పరిణామాలతో బీజేపీతో చేతులు కలిపి బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎస్పీతో మాయావతి సంబంధాలు తెంచుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ ఎస్పీకి మాయావతి స్నేహ హస్తం చాశారు. మొత్తం స్థానాల్లో పోటీ చేస్తాం: రాహుల్ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అన్ని చోట్ల నుంచి అభ్యర్థులను బరిలో ఉంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్‌కు చోటు కల్పించకపోవడంపై దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన స్పందించారు. ‘ఎస్పీ, బీఎస్పీ పార్టీల నేతలపై నాకు ఎనలేని గౌరవం ఉంది. నచ్చిన విధంగా వ్యవహరించే స్వేచ్ఛ వారికుంది. ఆ రెండు పార్టీలు రాజకీయ నిర్ణయం తీసుకున్నాయి. యూపీలో పార్టీని బలోపేతం చేసుకోవడం మా బాధ్యత. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ కూటమి అస్తిత్వం కోసమే తప్ప, దేశం కోసమో, లేక ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసమో కాదని బీజేపీ విమర్శించింది. ఎస్పీ– బీఎస్పీ మైత్రిని అవినీతి– గూండాయిజం కూటమిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఎద్దేవా చేశారు. -
రపేల్ డీల్‌లో రిలయన్స్ భాగస్వామ్యంపై డిసో ఏపియేషన్ క్లారిటీ
-
ఫ్యామిలీ ఆల్బమ్
సోషల్ మీడియా ఒక తక్షణ ‘షేరింగ్’ సాధనం అయ్యాక.. వ్యక్తిగతమైన భావోద్వేగాలు బహిరంగ ప్రదర్శనలు అవుతున్నాయి. క్షణాల్లో సగటులు సెలబ్రిటీల్లా, సెలబ్రిటీలు సగటుల్లా మారిపోతున్నారు. నాన్న ప్రేమను చూపించడు. అమ్మ ప్రేమను దాచుకోదు. ఇది మన సంస్కృతి. మన పద్ధతి. మన పెద్దరికం. నాన్నకు ప్రేమ లేకుండా ఉంటుందా! ఉంటుంది. లోపలెక్కడో ఉంటుంది. బయటికి రాదు. బుగ్గ గిల్లదు. ముద్దు పెట్టుకోదు. హగ్ చేసుకోదు. గొంతెక్కి తొక్కనివ్వదు. ఈ గోములు, గారాలు మనకు ఊహ తెలియనప్పుడేమైనా చేసి ఉంటాడేమో నాన్న! పెద్దవుతున్నప్పుడు లిమిట్స్‌లో పెట్టేస్తాడు. లిమిట్స్‌లో పెడతాడా? లిమిట్స్‌లో ఉంటాడా? రెండూ కాదు. ప్రేమను లిమిట్ చేసేస్తాడు. ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్’ ఉండదు. ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ అఫెక్షన్’ ఉండదు. ముద్దూ మురిపాలకు రేషన్. రేషనైనా నెలనెలా దొరుకుతుంది. నాన్న.. తన దగ్గరకు రానివ్వడమే మహద్భాగ్యం. నాన్న తన భుజాన్ని ఎక్కనివ్వడమే ఎవరెస్టు విజయం. డెబ్బయ్యా రేళ్లకోసారి మాత్రమే సంభవించే విశ్వాంతరాళ అద్భుతాల్లాంటివివి! దూరం నుంచి ‘ఊ’ అని గంభీరంగా అనే మాటొక్కటే ఆయన కనబరిచే ప్రేమ! ‘నాన్నా.. మా స్కూల్లో’.. ‘ఊ’; నాన్నా క్లాస్‌లో.. ‘ఊ’; ‘నాన్నా.. క్రికెట్లో నేను’.. ‘ఊ’! నాన్నెందుకు ఇంత సీరియస్? సీరియస్ కాదు. అమ్మలా బయట పడడు. అమ్మలా ఆకాశానికి ఎత్తేయడు. అమ్మలా ముద్ద కలిపి నోట్లో పెట్టడు. అమ్మలా వీపు మీద ఎక్కించుకోడు. జ్వరం వస్తే అమ్మలా రాత్రంతా దగ్గరే కూర్చోడు. అన్నీ దూరం నుంచే చేస్తుంటాడు! పేపర్ చదువుతూనో, ఇంటికి తెచ్చుకున్న ఆఫీస్ వర్క్ చేసుకుంటూనో అన్నీ గమనిస్తూనే ఉంటాడు. అమ్మ ఆకాశానికి ఎత్తేసినప్పుడు ఆకాశం తలకు తగలదు కదా అని చూస్తుంటాడు. అమ్మ ముద్ద కలిపి పెడుతున్నప్పుడు మూతి, ముఖం తిప్పుకుంటున్న బిడ్డ ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకుంటాడు. అమ్మ వీపు మీద నుంచి కిందికి దూకేటప్పుడు ఏ టీపాయ్ ఎడ్జికైనా కొట్టుకుంటాడేమోనని ఓ కన్నేసి ఉంచుతాడు. జ్వరం వస్తే ఎందుకొచ్చిందీ, ఏం తిన్నదీ, ఎక్కడ నీళ్లు తాగిందీ ఆలోచిస్తాడు. పాత ప్రిస్క్రిప్షన్లు, మెడికల్ రిపోర్టులు తీసి చూస్తుంటాడు. ఇంతవరకే! ఇవి దాటి నాన్న ప్రేమ బయటికి వచ్చేయదు. అమ్మయినా, ఇంత ముద్దు చేస్తుంది కదా.. బయటివాళ్ల ముందు మాత్రం నాన్నలాగే మారిపోతుంది. నాన్న.. మనసులో అమ్మయిపోయినట్లే, అమ్మ నలుగురిలో నాన్నయిపోతుంది! మహాస్ట్రిక్ట్. గంభీరం. ఇది మన సంప్రదాయం. ఇదే అమ్మానాన్నలు మనల్ని పెంచిన విధానం. ఇప్పుడు మరీ అంత స్ట్రిక్ట్ యాక్షన్ ఏం లేదు. అమ్మైనా, నాన్నైనా బాహాటంగా పిల్లలపై ప్రేమను చూపించడం, ప్రేమను చూపించుకోవడం మామూలు విషయమైపోయింది. ముద్దుల్నైనా, మురిపాల గుద్దుల్నైనా పదిమందితో ‘షేర్’ చేసుకుంటున్నారు. ఎవరికీ తెలియని సామాన్యులు షేర్ చేసుకుంటున్నట్లే.. అందరికీ తెలిసిన సెలబ్రిటీలూ పిల్లలపై తమ ప్రేమ విశ్వవీక్షితం కావాలనుకుంటున్నారు. ఫ్యామిలీ అఫెక్షన్‌ని విశ్వవ్యాప్తం చెయ్యాలనుకుంటున్నారు. తప్పేం లేదు. అందరం మనుషులమే. అన్నీ హ్యూమన్ ఎమోషన్సే. అయితే ఈ పర్సనల్ అఫెక్షన్ కొన్నిసార్లు పబ్లిక్ డిస్కషన్ అవుతోంది. సెలబ్రిటీల విషయంలోనైతే ‘ట్రోలింగ్’ కూడా జరుగుతోంది. సోషల్ మీడియా.. షేరింగ్‌కి ఒక తక్షణ సాధనం అయ్యాక.. క్షణాల్లో సగటులు సెలబ్రిటీల్లా, సెలబ్రిటీలు సగటుల్లా మారిపోతున్నారు. ఎవరెలా మారినా పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. అది మారకుండా ఉండాలి. హద్దు అనేది ఒకటి ఉంటుంది. అది మీరకుండా ఉండాలి. అది ఎంతో స్వచ్ఛమైన తల్లిదండ్రుల ప్రేమే అయినా. ఆ ప్రేమపై నెట్లో మనం చేసే కామెంట్లైనా. - మాధవ్ శింగరాజు -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికారా ఐతే ఇది షేర్ చెయ్యండి
సాక్షి, సిటీబ్యూరో: ‘నాకు థాంక్స్ చెప్పొద్దు. అవకాశం వచ్చినప్పుడు మీరు ఓ ముగ్గురికి సహాయం చెయ్యండి. వారిలో ఒక్కొక్కరినీ మరో ముగ్గురి చొప్పున చెయ్యమని చెప్పండి’.. స్టాలిన్ సినిమాలో తన వద్ద సాయం పొందిన వారితో చిరంజీవి చెప్పే డైలాగ్ ఇది.. ‘మాకు సారీ చెప్పవద్దు. మరోసారి ఇలాంటి పొరపాటు చెయ్యకండి. ఈ షార్ట్‌ఫిల్మ్‌లను కనీసం మూడు గ్రూపుల్లో షేర్ చెయ్యండి. అందులోని వారినీ అలానే చెయ్యమనండి’.. కౌన్సెలింగ్‌కు హాజరైన ఉల్లంఘనులతో టీటీఐ అధికారులు చెబుతున్న మాట ఇది. నగర ట్రాఫిక్ విభాగం ఆధీనంలోని గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ) అధికారులు మంగళవారం నుంచి ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనలపై ఉల్లంఘనులతో పాటు సోషల్ మీడియాల్లోని సభ్యులకు అవగాహన కలిగేలా షేరింగ్ విధానం ప్రారంభించారు. సిగ్నల్ జంపింగ్ చేయవద్దని, హెల్మెట్ వినియోగించమంటూ ఇటీవల రూపొందించిన షార్ట్ఫిల్మస్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఉల్లంఘనుల్నే ప్రచారకర్తలుగా వినియోగించుకుంటున్నారు. ఆ రెండింటిపై లఘు చిత్రాలు... ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనలను ప్రధానంగా మూడు కేటగిరీలుగా పరిగణిస్తారు. వాహనచోదకుడికి ప్రాణహాని కలిగించేవి, ఎదుటి వ్యక్తికి ముప్పుగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేవి. సిగ్నల్ జంపింగ్ ఉల్లంఘన అత్యంత ప్రమాదకరమైన మూడో కేటగిరీ కిందికు వస్తుంది. దీని వల్ల అనేక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్ సైతం ఏర్పడి ఎన్నో పని గంటలు, ఇంధనం వృథా అవుతున్నాయి. దీంతో పాటు నగరంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడుతున్న, క్షతగాత్రులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉంటున్నారు. హెల్మెట్ వినియోగించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ట్రాఫిక్ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిం చేందుకు రెండు షార్ట్‌ఫిల్మ్స్ రూపొందించారు. ఇప్పటి వరకు పరిమితంగా... సెలబ్రిటీలతో సందేశం ఇప్పిస్తేనే ప్రజలకు హత్తుకుంటుందనే ఉద్దేశంతో టాలీవుడ్ తారలు లావణ్య త్రిపాఠి, నేహ శెట్టి, ఆకాష్ పూరిలతో ఈ ఫిల్మŠస్ రూపొందించారు. ఈ లఘు చిత్రాలను ట్రాఫిక్ విభాగం చీఫ్ అనిల్ కుమార్ గత శుక్రవారం ఆవిష్కరించారు. సోమవారం వరకు ఈ రెండు చిత్రాలు ట్రాఫిక్ పోలీసుల అధికారిక ఫేస్బుక్, వెబ్‌సైట్స్‌తో పాటు యూ ట్యూబ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంచారు. అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసే చోట వీటిని ప్రదర్శించనున్నారు. సినిమా హాళ్లల్లో ప్రదర్శింపజేయడానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఇవి ఎక్కువ సంఖ్యలో వాహనచోదకులకు చేరట్లేదని భావించిన అధికారులు వీటిని విస్తృతంగా సోషల్ మీడియాలోకి తీసుకువెళ్లడం ద్వారా నగర వాసులు... ప్రధానంగా యువతకు దగ్గర చేయవచ్చని నిర్ణయించారు. తీవ్రమైన ఉల్లంఘనుల ఫోన్లకు.. మంగళవారం నుంచి ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టారు. మద్యం తాగి వాహనాలు నడపటం, లైసెన్స్ లేకు ండా వాహనాలు నడపటం, మైనర్ డ్రైవింగ్ తదితర తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న వెంటనే జరిమానా విధించి పంపేయరు. వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకునే అధికారులు టీటీఐలో కౌన్సిలింగ్, న్యాయస్థానంలో హాజరు, శిక్ష తదితరాలు పూర్తయిన తర్వాతే వాహనాలను రిలీజ్ చేస్తారు. వీరు టీటీఐలో కౌన్సిలింగ్‌కు వచ్చినప్పుడు అక్కడి అధికారులు ఈ షార్ట్‌ఫిల్మŠస్ ప్రదర్శిస్తున్నారు. సెషన్ ముగిసిన తర్వాత వారిలో స్మార్ట్‌ఫోన్స్ ఉన్న వారి వాట్సాప్‌కు ఈ రెండు లఘు చిత్రాలను షేర్ చేస్తున్నారు. ప్రతి ఉల్లంఘనుడు కనీసం మూడు గ్రూపుల్లో ఇవి షేర్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. స్వచ్ఛందంగా అంగీకరిస్తేనే రహదారి భద్రతలో అత్యంత కీలకమైన ఎడ్యుకేషన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిబంధనలపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన రెండు షార్ట్‌ఫిల్స్ ను ఉల్లంఘనులకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాం. వారు మరో మూడు గ్రూపుల్లోకి పంపేలా ప్రోత్సహిస్తున్నాం. ఆ గ్రూపుల్లోని సభ్యులతోనూ ఇలానే షేర్ చేయించేలా కోరమని చెబుతున్నాం. ఇదంతా ఉల్లంఘనులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే మాత్రమే చేస్తున్నాం. ఎవరైనా తాము ఎవరికీ షేర్ చేయమనో, అసలు తమకే షేర్ చెయ్యవద్దనో కోరితే వీటిని పంపడం లేదు. – టీటీఐ అధికారులు -
ఫేస్బుక్ షేర్: వివాదంలో ప్రముఖ నటుడు
సాక్షి, చెన్నై: మహిళా జర్నలిస్టు పట్ల తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అనుచిత చర్య వివాదం ఇంకా ముగియకుండానే రాష్ట్రానికి చెందిన నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ (సత్తనాతపురం వరదరాజ శేఖర్) చిక్కుల్లో పడ్డారు. మహిళా పాత్రికేయులపై అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఓ బీజేపీ అభిమాని ఫేస్బుక్ పోస్ట్‌ను షేర్ చేసి మరో వివాదానికి తెర తీశారు. ‘మదురై యూనివర్సిటీ, గవర్నర్ అండ్ ది వర్జిన్ చీక్స్ ఆఫ్ ఎ గర్ల్’ అనే పేరుతో తిరుమలై.ఎస్ అనే ఫేస్బుక్ యూజర్ ఈ పోస్ట్ పెట్టాడు. మహిళా జర్నలిస్టులపై చాలా అవమానకరమైన పదజాలంతో విరుచుకుపడిన ఫేస్బుక్ పోస్ట్‌ను బీజేపీ నేత షేర్ చేశారు. విశ్వవిద్యాలయాల కన్నా ఎక్కువ లైంగిక వేధింపులు మీడియా సంస్థల్లో ఉన్నాయని ఆ పోస్ట్‌లో ఆరోపించాడు. అంతేకాదు మీడియా పెద్దలతో పడుకోకుండా..ఏ మహిళ రిపోర్టర్ లేదా న్యూస్ రీడర్ కాలేదంటూ రెచ్చిపోయాడు. దీంతోపాటు తమిళనాడు మొత్తం మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. మీడియా మొత్తం నేరస్థులు, రాస్కల్స్, బ్లాక్‌మెయిలర్ల చేతిలో చిక్కి తిరోగమన మార్గంలో ఉందని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన శేఖర్ తానా పోస్ట్‌ను పూర్తిగా చదవకుండానే పోస్ట్ చేశాననీ, ఎవర్నీ కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ శేఖర్ వివరణ ఇచ్చుకున్నారు. అమెరికాకు వెళ్ళినప్పుడు మోదీ అభిమానిగా తిరుమలై తనకు పరిచయమయ్యాడని చెప్పారు. ఇపుడు ఆ పోస్ట్‌ను తొలగించాలనుకున్నా.. ఫేస్బుక్ బ్లాక్ చేయడంతో అది సాధ్యం కావడంలేదని చెప్పొకొచ్చారు. (ప్రస్తుతం ఈ పోస్ట్ డిలీట్ అయింది) కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పాత్రికేయులపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు, తాజాగా శేఖర్ చర్యకు నిరసనగా మహిళా జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రముఖులు చెన్నైలోని బీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగనున్నారు. -
వాట్సాప్‌లో కూడా లైవ్ లొకేషన్ షేరింగ్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అద్భుతమైన ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ సరికొత్త ఫీచర్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. అదే లైవ్ లొకేషన్ షేరింగ్ సదుపాయం. వాట్సాప్ అధికారిక బ్లాగ్ ప్రకారం, రాబోయే వారాలలో ఆండ్రాయిడ్, ఐఓ ఎస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. గూగుల్ మ్యాప్స్ లాంటి వివిధ వేదికలపై ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ, వాట్సాప్ తాజా ఫీచర్ వినియోగదారులను భారీగా ఆకర్షించగలదని భావిస్తున్నారు. నెలవారీ 1.3 బిలియన్ యాక్టివ్ యూజర్లతో దూసుకుపోతున్న వాట్సాప్ తాజా ఫీచర్లు ప్రపంచవ్యాప్త నవీకరణగా నిలవనుంది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు తమ లైవ్ లొకేషన్‌ను అవతలి వాట్సాప్ యూజర్లకు, అలాగే వాట్సాప్ గ్రూప్‌నకు కూడా షేర్ చేయవచ్చు. 15 నిమిషాలు నాన్‌స్టాప్‌గా లైవ్ లో ఉండవచ్చు. ఇలా గరిష్టంగా సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు లైవ్‌ను ఎంచుకోవచ్చు. ఈ లైవ్ లొకేషన్‌ను షేరింగ్ తో యూజర్లు ఎక్కడ ఉన్నారో వారి ఫ్రెండ్స్‌కు, కుటుంబ సభ్యులకు సులభంగా తెలిసిపోతుంది. అలాగే గ్రూపులకు సంబంధించి లైవ్లొకేషన్ను ఎంచుకున్న గ్రూపు సభ్యుల లొకేషన్స్ ఒకే మ్యాప్‌లో దర్శనమిస్తాయి. ఎంతసేపు లైవ్ లో ఉండాలనేది యూజర్ నిర్ణయించుకోవచ్చు. మరోవైపు అబద్ధం చెప్పే యూజర్లు ఈ కొత్త ఫీచర్‌కు దూరంగా ఉండాల్సిందే. చాట్ బాక్స్ ప్రక్కన పేపర్ క్లిప్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. అలాగే వినియోగదారుల గోప్యతపై కూడా వాట్సాప్ భారీ భరోసా కూడా ఇస్తోంది. కాగా ఇదే ఫీచర్ స్నాప్ చాట్ ఈ ఏడ్డాది సమ్మర్లో లాంచ్ చేసింది. అలాగే గూగుల్ మాప్స్, ఫైండ్ మా ఫ్రెండ్స్ యాప్ ద్వారా యాపిల్ కూడా లైవ్ లోకేషన్ సౌలభ్యాన్ని అందిస్తోంది. అలాగే వాట్సాప్ యూజర్ ఫోన్‌నెంబర్ మార్చిన ప్రతిసారీ .. నెంబర్ షేరింగ్ ఇబ్బంది లేకుండా ఒక నోటిఫికేషన్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ నోటిఫికేషన్ద్వారా యూజర్ మొబైల్ నంబర్ చేంజ్ చేశాడని వారికి తెలుస్తుంది. ఇక దీంతోపాటు త్వరలో అందించనున్న అప్డేట్ ద్వారా వాట్సాప్ యాప్ సైజ్‌ను కూడా భారీగా తగ్గించనుందట. -
ఉబర్.. బస్ రైడ్ షేరింగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : క్యాబ్ అగ్రిగేటర్‌గా ఉన్న ఉబర్ టెక్నాలజీస్ కొద్ది రోజుల్లో భారత్‌లో ఉబర్ ఎవ్రీథింగ్ పేరు తో నూతన సర్వీసులను ప్రారంభించనుంది. రైడ్ షేరింగ్ విభాగంలో బస్‌లు, మినీ వ్యాన్ల సేవలను పరిచయం చేయనుంది. క్యాబ్ షేరింగ్ మాదిరిగానే బస్‌లు, మినీ వ్యాన్లలో కస్టమర్లు ప్రయాణించొచ్చు. ఒక చోట నుంచి ఒకచోటుకు నిర్దేశిత మొత్తాన్ని కంపెనీ వసూలు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టనున్న ఈ సేవలను బెంగళూరులోని ఉబర్ సాంకేతిక కేంద్రం పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది.