shekar guptha
-
సంక్షోభాల పరిష్కర్త ఎక్కడ?
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ విజయదశమి నాడు నాగ్‌పూర్‌లో చేసిన ప్రసంగంలో దత్తోపంత్ తెంగడిని గురునానక్, మహాత్మాగాంధీలతో సమస్థాయినిచ్చి ప్రస్తావించారు. తెంగడి ఎవరో కాదు. వాజ్‌పేయి ఆరేళ్ల పదవీకాలంలో ఆయన ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన బలమైన ఆరెస్సెస్ నేత. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై తెంగడి నాడే ధ్వజమెత్తారు. కానీ నేడు నరేంద్రమోదీ వాజ్‌పేయి కంటే మించిన వేగంతో ప్రైవేటీకరణకు, పీఎస్‌యూల వేగంవైపుగా అడుగులేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనం చెందుతున్న తరుణంలో ఈ సంక్షోభం నుంచి ఉత్తమంగా దేశాన్ని, మనల్నీ గట్టెక్కించే తరహా సిద్ధాంతాన్ని ఇంకా కనుగొనవలసి ఉంది. తెంగడి వారసుడిగా స్వదేశీని బలంగా ప్రస్తావిస్తున్న భాగవత్.. మోదీతో తలపడతారా అన్నది ప్రశ్నార్థకమే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత, సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఆరెస్సెస్ విజయదశమి ఉత్సవాల్లో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగానికి సాధారణంగానే ప్రాచుర్యం ఉంటుంది. కానీ బీజేపీ రెండో దఫా కూడా భారీ మెజారిటీ సాధించి అధికారంలో ఉంటున్నప్పుడు ఆయన చేసే ప్రసంగానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. పైగా ఆరెస్సెస్ కీలక వ్యవహారాలుగా భావిస్తున్నవాటిని ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నప్పుడు ఆయన ప్రసంగానికి ఎంతో ప్రాధాన్యముంటుంది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్యలో రామమందిరం వీటిలో కొన్ని. దశాబ్దకాలంగా ఆరెస్సెస్ అధినేతగా ఉంటున్న మోహన్ భాగవత్ మూకదాడుల సమస్య, హిందూ ఎవరు అనే ప్రశ్నకు నిర్వచనం ఇవ్వడం, భారతీయుడు ఎవరు వంటి అంశాలను తడిమినందున ఈ సంవత్సరం విజయ దశమి ప్రసంగంతో మరింతగా వార్తల్లోకి ఎక్కారు. వీటిపై ఆయన వాదనలు వివాదాస్పదమైనవి, అందుకే అవి మరీ ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో ఒక ముఖ్య అంశంపై ఆయన సుదీర్ఘంగా నొక్కి చెప్పిన అంశం మరుగున పడిపోయింది. ఆయన చేసిన ఆ 63 నిమిషాల ప్రసంగంలోని కొన్ని భాగాలను మీరు విన్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన ప్రసంగ వీడియోలోని తొలి నిమిషం, తర్వాత 28 నుంచి 42 నిమిషాల వరకు గల ప్రసంగ పాఠంలో తనదైన ఆర్థిక తత్వశాస్త్రాన్ని మీరు చూడవచ్చు. వీడియో ప్రారంభ క్షణాల్లోనే కీలకమైన అంశం ఉంది. ఇద్దరు ప్రముఖ, సుప్రసిద్ధ భారతీయుల వార్షికోత్సవాలను పేర్కొంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అవి గురునానక్ 550 జయంతి, మహాత్మాగాంధీ 150వ జయంతి. ఆరెస్సెస్–బీజేపీ వ్యవస్థకు అవతల ఉన్నవారికి లేదా భారత రాజకీయాలను సన్నిహితంగా అధ్యయనం చేస్తూ అనుసరిస్తూ ఉన్నవారికి భాగవత్ పేర్కొన్న మూడో ప్రముఖ వ్యక్తి అయిన దత్తోపంత్ తెంగడి గురించి తెలుసంటే నేను నమ్మలేను. దత్తోపంత్ శత జయంతి త్వరలో అంటే నవంబర్ 10న ప్రారంభమవుతుందని భాగవత్ పేర్కొన్నారు. ఈ పేరు పెద్దగా పరిచితమైన పేరు కాదు. పైగా గురు నానక్, గాంధీల తరహా లీగ్‌లో ఆయన లేరు. కానీ ఈ ఇద్దరి పక్కన ఆయన్ను ప్రస్తావించాల్సినంత ప్రాముఖ్యత మాత్రం ఆయనకుంది. ఆ వీడియోలో ఆ 14 నిమిషాల్లోని రెండో భాగాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఆయన ప్రస్తావన అప్రాధాన్యమైనది కాదని, మాటవరుసకు చెప్పింది కాదని అర్థమవుతుంది. నాగ్‌పూర్‌కు ఏమంత దూరంలో లేని వార్ధాలో 1920లో జన్మించిన తెంగడి ఆధునిక (స్వాతంత్య్రానంతర) ఆరెస్సెస్ వ్యవస్థాపక నిర్మాతల్లో ఒకరు. ఆరెస్సెస్ రెండు రాజకీయ అవతారాలైన భారతీయ జన సంఘ్, భారతీయ జనతా పార్టీ రెండింటి భావజాలానికి కూడా ఆయనను ప్రతినిధిగా చెప్పవచ్చు. అర్థశాస్త్రం ఆయనకు ఇష్టమైన అంశం. ప్రత్యేకించి భారత్ తన ఆర్థిక వ్యవస్థ తలుపులను తెరిచి వేసిన గత 30 ఏళ్లలో మరే ఇతర దృక్పథాల కంటే ఆయన ఆలోచనాధారే ఆరెస్సెస్ ఆర్థిక ప్రపంచ దృక్పథాన్ని నిర్వచించింది. తెంగడి, అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి ప్రయాణించారు. ఇద్దరూ కలిసి 1955లో భారతీయ మజ్దూర్ సంఘ్‌ని భోపాల్‌లో నెలకొల్పారు. కానీ, వాజ్‌పేయి ఆరేళ్ల పాలనలో వీరిరువురు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఆర్థిక వ్యవస్థకు వచ్చేసరికి ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, దిగుమతి సుంకాల తగ్గింపు, ఎఫ్‌డీఐలకు తలుపులు తెరవడం వంటి అంశాల్లో వాజ్‌పేయి తీసుకున్న ప్రతినిర్ణయాన్నీ తెంగడి వ్యతిరేకించారు. ఒక దశలో ఆయన యశ్వంత్ సిన్హాను మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ ఇదే సిన్హా తర్వాత ఆర్థిక మంత్రిగా సంస్కరణలను ముందుకు తీసుకుపోయారు. తెంగడి డిమాండును వాజ్‌పేయి సంవత్సరం పాటు ప్రతిఘటించారు కానీ తర్వాత వెనక్కు తగ్గారు. ఆరెస్సెస్‌లో తెంగడికి చాలా బలం ఉండేది. ఆయ నకు అరుణ్ శౌరీ అంటే కూడా గిట్టేది కాదు. సుప్రీంకోర్టు ఒక తీర్పులో పాత సోషలిస్టు ఆలోచనలను ఎత్తిపట్టినప్పుడు తెంగడి నిజంగానే పండగ చేసుకున్నారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా అమ్మదలిచినప్పుడు పార్లమెంటరీ ఆమోదం పొందాలని సుప్రీంకోర్టు అప్పట్లో చెప్పింది. వాజ్‌పేయి ప్రభుత్వం రెండు అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ను పక్కన పెట్టినప్పుడే ఇది జరిగిందని మనం గుర్తించాలి. తెంగడిది ఒంటరి వాణి కాదు. ఆయన తొలి బిడ్డ అయిన భారతీయ మజ్జూర్ సంఘ్ వాజ్‌పేయి సంస్కరణల శకాన్ని వామపక్షాలు, కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ కంటే గట్టిగా నిరసించింది. ఈలోగా ఆయన మరోరెండు శక్తివంతమైన ప్రెషర్ గ్రూప్‌లను ఏర్పర్చారు. ఒకటి, 1979లో రైతుల కోసం స్థాపించిన భారతీయ కిసాన్ సంగ్. మరొకటి 1991లో స్థాపించిన స్వదేశీ జాగరణ్ మంచ్. ఈ సంస్థ ఇవాళ మనకు బాగా పరిచయమే. 1991 అంటేనే నాటిప్రధాని పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ భారీ సంస్కరణలు ప్రారంభించిన సంవత్సరం అని గుర్తుండే ఉంటుంది. వెనువెంటనే స్వదేశీ జాగరణ్ మంచ్ డంకెల్ డ్రాఫ్ట్‌తో మొదలైన వాణిజ్య ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ స్వరాన్ని నిర్మించడం మొదలెట్టింది. వాజ్‌పేయి హయాం ముగిసేనాటికి ఇరువురి సంబంధాలు స్పష్టంగా దిగజారిపోయాయి. ఏదైనా కొత్త భావనను ప్రస్తావించదల్చినప్పుడల్లా, వాజ్‌పేయి ఇప్పుడు తెంగడిని ఆపేదెవరు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించేవారు. అంత తీవ్రమైన పోరు కొనసాగినప్పటికీ వాజ్‌పేయి బీటీ పత్తి విత్తనాలకు అనుమతి మంజూరు చేశేసారు. 2004లో ఇరువురి మధ్య పోరాటం ముగిసింది. ఆ ఏడు మే నెలలో వాజ్‌పేయి అధికారం కోల్పోయారు. అక్టోబర్ 14న తెంగడి కన్ను మూశారు. బహుశా వామపక్షాల నియంత్రణలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ప్రయివేటీకరణను తుంగలో తొక్కుతుందని, తాను కోరుకుంటున్న సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందన్న విశ్వా సంతోటే తెంగడి నిష్క్రమించి ఉంటారు. ఆర్థిక వ్యవస్థపై భాగవత్ 14 నిమిషాల వార్షిక ప్రసంగం గురించి ఇప్పుడు కాస్త మెరుగుగానే అర్థం చేసుకోగలం కూడా. భాగవత్ ప్రసంగం సారాంశం ఇంది. ఆర్థిక సంక్షోభం ఉంది కానీ దానికి మరీ ఎక్కువ విలువ ఇవ్వవద్దు. వృద్ధికి జీడీపీనే కొలబద్ద కాదు. అవినీతిపై కొరడా ఝళిపించండి కానీ అమాయకులను బలి చేయవద్దు. మనం స్వదేశీని నమ్ముతాం. అలాగని మనం ప్రపంచం నుంచి వేరుగా ఉండలేం. వాణిజ్యం గ్లోబల్ కావచ్చు కానీ మనం తయారు చేయలేని, మనకు అవసరమైన సరుకులను మాత్రమే కొనాలి. భారతీయ గోజాతి నుంచి వృద్ధి చేసిన బ్రెజిల్ హైబ్రిడ్ గోవు వీర్యాన్ని మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి? స్వదేశీ వీర్యాన్నే ఉపయోగించండి. ఇదీ భగవతి ప్రసంగ సారం. తర్వాత ఆయన ఎగుమతులు మంచివని, దిగుమతులు చెడ్డవని కూడా మాట్లాడారు. భాగవత్ మాట్లాడిన మాటల సారాంశం మొత్తంగా ప్రామాణికమైన తెంగడినమిక్స్ (తెంగడి ప్రతిపాదించిన ఆర్థిక శాస్త్రం)లో భాగమే. 2008 తర్వాత తీవ్రస్థాయిలో కొనసాగుతున్న భారతీయ ఆర్థిక పతనంతో మోదీ ప్రభుత్వం సాగిస్తున్న సమరాలు, ప్రభుత్వ తాజా నిర్ణయాలు, చేసిన వాగ్దానాలతో భాగవత్ ప్రసంగం విభేదిం చింది. మోదీ ప్రభుత్వం కూడా అనేక రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానించింది. ప్రత్యేకించి అమెరికాతో పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. వాణిజ్య ఒప్పందాలు, పీఎస్‌యూల అమ్మకాలను స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యతిరేకించింది. కానీ, ప్రతి రంగంలోనూ మోదీ ప్రభుత్వం భాగవత్ ప్రసంగానికి వ్యతిరేక దశలోనే చర్యలు తీసుకుంది. వాజ్‌పేయికి నవ్వు తెప్పించి ఉండేది, తెంగడికి కోపం తెప్పించి ఉండేది ఇదే కదా. వాజ్‌పేయి 2003లో చేయలేకపోయిన దాన్ని మోదీ ఇప్పుడు సులభంగా చేస్తూ అతిపెద్ద చమురు సంస్థ అయిన బీపీసీఎల్‌ను అమ్మకానికి పెట్టేశారు. స్వదేశీ ఆర్థికశాస్త్రాన్ని అంత వివరంగా ముందుకు తీసుకురావడం ద్వారా భాగవత్ కేంద్రప్రభుత్వంతో తలపడటానికి ఆసక్తి చూపుతున్నారని మనం చెప్పలేం. వాజ్‌పేయి, మోదీ మధ్య అధికారానికి సంబంధించిన వ్యత్యాసాల రీత్యా ఇది సాధ్యపడదేమో కానీ అసాధ్యం కాకపోవచ్చు కూడా. మన ఆశ ఏమిటంటే.. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనం చెందుతున్న తరుణంలో ఈ సంక్షోభం నుంచి ఉత్తమంగా దేశాన్ని, మనల్నీ గట్టెక్కించే తరహా సిద్ధాంతాన్ని ఇంకా కనుగొనవలసి ఉందన్నదే. శేఖర్‌గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
వైఎస్ జగన్ పాదయాత్రపై పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి: చారిత్రాత్మక ‘ప్రజాసంకల్పయాత్ర’ పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్, ది ప్రింట్ ఎడిటర్ చీఫ్ పద్మభూషణ్ శేఖర్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కారం చేశారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేయబడింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఎమెస్కో సంస్థ ప్రచురించింది. 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను దీనిలో పొందుపరిచారు. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు, శేఖర్‌గుప్తా, రామచంద్రమూర్తి, వైఎస్సార్సీపీ నేతలు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం: సీఎం వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 3648 కి,మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని అన్నారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు.. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలను, వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వైఎస్సార్‌తో తనక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరముందన్నారు. కార్యక్రమంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. తన నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవంలో పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందిచడం గొప్ప విషయమన్నారు. -
మధ్యతరగతిపై ‘మైనారిటీ’ ప్రేమ!
భారతీయ పాలకవర్గాలు సంపన్నులనుంచి అధిక పన్నులు రాబట్టి పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తుంటారన్నది సాధారణ అభిప్రాయం. ప్రధాని మోదీ కూడా ఆ కోవకు చెందినవారే అని చాలామంది భావిస్తూండవచ్చు కానీ 2014 నుంచి 2019 దాకా మధ్యతరగతి ముక్కుపిండి వసూలు చేసిన పన్ను రాబడుల నుంచే పేదవర్గాలకు దాదాపు రూ. 11 లక్షల కోట్ల నగదును మోదీ ప్రభుత్వం పంపిణీ చేసిందని గణాంకాల అంచనా. ఇలా తాయిలాలు అందించడం ద్వారా మోదీ పేదల ఓట్లను కొల్లగొట్టారు. మధ్యతరగతినుంచి పన్నుల రూపంలో గుంజుతున్నప్పటికీ, వారిని హిందూత్వ భ్రమల్లో ముంచెత్తి తమవైపుకు తిప్పుకున్నారు. ముస్లింలకు ఏ మేలూ చేయకున్నా లౌకికవాద పార్టీలు వారితో మొన్నటివరకూ ఆటాడుకున్నట్లుగానే, మధ్యతరగతితో మోదీ ప్రభుత్వం ప్రస్తుతం ఆటాడుకుంటోంది. నరేంద్రమోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో పొందుపర్చిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, సంవత్సరానికి 2 కోట్ల రూపాయలకు మించి సంపాదన కలిగిన సంపన్నులపై పన్నురేట్లను మరింత పెంచడమే. సంవత్సరానికి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయమున్న అతి ధనవంతులపై పన్ను మరింతగా పెంచారు. అంటే అత్యధిక పన్నురేటు ఇప్పుడు 42.3 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన పన్ను రేట్లను చూస్తుంటే ’సంపన్నులను పీల్చి పిండేయండి’ అనే ఇందిరా గాంధీ పాలనా శైలికి సరైన ఉదాహరణగా కనబడుతుంది. నాలాంటి విశ్లేషకులలో చాలామందికి ఇదే అభిప్రాయం కలగవచ్చు కానీ కాషాయ రాజకీయాలలో పూర్తిగా మునిగితేలుతున్న వారి దృష్టి మరొక రకంగా ఉండవచ్చు. 1977లో అత్యవసర పరిస్థితి ముగిసిన అనంతరం రాజ్యాంగంలో పొందుపరిచిన సోషలిజం సూత్రాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా పూర్తిగా కట్టుబడిందనటానికి తాజా బడ్జెట్ చక్కటి రుజువుగా నిలుస్తోందని వీరు ప్రశంసల వర్షం కురిపించవచ్చు. అయితే భారతదేశ చరిత్రలోనే అత్యంత మితవాద ప్రభుత్వ పాలనకు నరేంద్రమోదీ రెండో దఫా నాయకత్వం వహిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. అయితే ఈ రెండు అభిప్రాయాలూ తప్పే. ఎందుకంటే మోదీ ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తున్నది నిజానికి సంపన్నవర్గాలను కాదు. మొదటినుంచి తన పట్ల అత్యంత విశ్వాసం ప్రదర్శిస్తున్న, తనకు బలమైన ఓటుబ్యాంకుగా నిలబడుతూ వస్తున్న భారతీయ మధ్యతరగతి ప్రజల మూలుగులను మోదీ ప్రభుత్వం పీల్చివేస్తోంది. ఇప్పుడు మనం వేయవలసిన ప్రశ్న ఏమిటంటే, అపరిమిత విశ్వాసాన్ని ఈ తరగతి ప్రజలు తనపై చూపుతున్న కారణంగానే వారిపట్ల ప్రభుత్వం ఇలాంటి చిన్నచూపును ప్రదర్శిస్తోందా? మరోవైపున గడచిన అయిదు సంవత్సరాలలో, జాతీయ సంపదను పేదలకు పంచిపెట్టడంలో, బదిలీ చేయడంలో మోదీ ప్రభుత్వం బహుశా అసాధారణమైన, అద్భుతమైన పాత్రను పోషిస్తూ వచ్చింది. గృహ నిర్మాణం, టాయిలెట్లు, వంటగ్యాస్, ముద్రా రుణాలు వగైరా జనరంజక పథకాలకోసం కేంద్ర ప్రభుత్వం ఈ అయిదేళ్లలో 9 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలను నిరుపేదలకు పంపిణీ చేసిందనడంలో సందేహమే లేదు. పేదలకు జాతీయ సంపదను పంపిణీ చేయడంలో కేంద్రం ఎంత విజయం సాధించిందంటే రెండో దఫా ఎన్నికల్లో మోదీ అసాధారణ మెజారిటీతో, విజయగర్వంతో అధికారంలోకి వచ్చారు. అయితే పేదలకు పంచిపెట్టిన ఇంత భారీ డబ్బు ఎక్కడినుంచి వచ్చినట్లు? సాధారణంగానే ఇదంతా సంపన్నవర్గాల నుంచి పన్నుల రూపంలో కేంద్రప్రభుత్వం వసూలు చేసిందే అని మనందరికీ సహజంగానే అనిపించవచ్చు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. ఒకవైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోతున్నా, కేంద్రప్రభుత్వం వినియోగదారులకు దాని ప్రయోజనాన్ని అందించడానికి బదులుగా చమురుపై పన్నులను పదేపదే పెంచుతూ పోయి లాభాన్ని మొత్తంగా తన జేబులో వేసుకుంది. చమురు అమ్మకాల ద్వారా సాధించిన భారీ లాభంలో ఎక్కువ శాతం వాహనదారులైన మధ్యతరగతి ప్రజలనుంచే వచ్చిందన్నది వాస్తవం. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ఇలా ముగించవచ్చు. జాతీయ సంపదను అసాధారణంగా పంపిణీ చేయడంలో పేదలు లబ్ధి పొంది ఉండవచ్చు కానీ ఇదంతా దేశంలో మధ్యతరగతికి చెందిన అన్ని సెక్షన్లనూ పిండగా వచ్చిందే అని చెప్పాలి. పేదలకు పంచి పెట్టిన ఈ 11 లక్షల కోట్ల రూపాయల డబ్బులో కొంచెం కూడా సంపన్నులనుంచి రాలేదు. మధ్యతరగతిని పిండి వసూలు చేసిన ఈ డబ్బు పంపకం తోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం పేదల ఓట్లను భారీస్థాయిలో కొనగలిగింది. పెద్దపెద్ద నగరాల నుంచి నగరీకరణ చెందిన రాష్ట్రాల వరకు.. మధ్యతరగతి ప్రజలు కూడా భారీ స్థాయిలో ఈసారి బీజేపీకే ఓటు వేశారని అర్థమవుతుంది. దేశంలో అతివేగంగా పట్టణీకరణకు గురైన రాష్ట్రం హరియాణా. భారత్‌లోని అత్యంత సంపన్నులు ఈ రాష్ట్రంలోని నగరాల్లో ఉండగా అత్యంత నిరుపేదలు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. 2014 ఎన్నికల వరకు బీజేపీ ఈ రాష్ట్రంలో కనీస మాత్రం ఓట్లను మాత్రమే పొందగలిగింది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో దాని ఓటు ఇక్కడ 58 శాతానికి అమాంతంగా పెరిగింది. మోదీ పాలనా తీరుకు ఇదొక ముఖ్యమైన రాజకీయ ఉదాహరణ. ఆయన ప్రధానంగా మధ్యతరగతి ప్రజలనుంచి పన్నులను రాబట్టి వాటిని దిగువ తరగతికి పంచిపెట్టారు. అయినప్పటికీ ఈ రెండు వర్గాల ప్రజలూ సమాన స్థాయిలో మోదీకి ఓట్లు గుద్దేశారు. 2014 కంటే 2019 నాటికి మధ్యతరగతి మోదీకి అత్యంత విశ్వసనీయమైన ఓటు బ్యాంకుగా ఆవిర్భవించింది. దాని ఫలితాన్ని వారు చాలా సంతోషంగా చెల్లిస్తున్నారు కూడా. ఇప్పుడు తాజా బడ్జెట్కేసి చూద్దాం. ఇప్పుడు సైతం సంపన్నులనుంచి తాము పన్నులను రాబడుతున్నట్లు సూచనా మాత్రంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సంపన్నవర్గాలు దీనిపట్ల ఏమాత్రం ఆందోళన చెందుతున్నట్లు లేదు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం సాధించిన 6,351 మంది వ్యక్తులు పన్నులు చెల్లించారు. వీరి సగటు ఆదాయం రూ.13 కోట్లు. కానీ ప్రభుత్వానికి వీరివల్ల వచ్చిన అదనపు రాబడి ఎంతో తెలుసా? కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒక సంవత్సరం టి20 క్రికెట్ పోటీల నిర్వహణలో ఆర్జిస్తున్న రాబడి కంటే ఇదేమంత ఎక్కువ కాదు. సంపన్నుల నుంచి ప్రభుత్వం అధిక పన్నులను రాబడుతున్నట్లు పేదలు భావిస్తూ సంతోషం పొందుతున్నట్లు కనిపించవచ్చు కానీ మరోవైపున సంపన్న వర్గాలు తమపై పన్ను విధింపులను ఏమాత్రం లెక్క చేయకుండానే ఎలెక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడంలో పోటీపడుతున్నారు. తమ ఆనందం కోసం, చౌకబారు వినోదాల కోసం పేదలు సులువుగా మోసపోతారు. కానీ, వాస్తవానికి అపహాస్యం పాలయ్యేది మధ్యతరగతివారే. ఎందుకంటే, 2014–19 మధ్య కాలంలో పేదలకు అందే సంక్షేమాలకు సహకారం అందించింది వారు మాత్రమే. అటువంటివారికి పెట్రోలు, డీజిల్‌పై అదనపు పన్నులు విధించడం ద్వారా ఆర్థికమంత్రి మంచి బహుమానమే ఇచ్చారు. ఇక వీరు ముడి చమురు ధరలు తగ్గడం కోసం ఊపిరి బిగపట్టి ఎదురు చూడాల్సిందే. వీటితోపాటు ధనవంతులను కాకుండా మధ్యతరగతివారిని బాదే మరిన్ని విధానాలు కూడా ఉన్నాయి. మోదీ హయాంలో ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభం పన్నును ప్రవేశపెట్టారు. డివిడెండ్ల పంపిణీ పన్ను పెరిగింది. ఏడాదికి పది లక్షల రూపాయలకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి డివిడెండ్లపై అదనపు పన్ను విధించారు. రూ.50లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఆదాయం ఉన్నవారి ఆదాయాలపై సర్ చార్జ్ విధించారు. మధ్యతరగతికి ఉన్న సబ్సిడీలను తగ్గించడంతోపాటు వంట గ్యాస్ వంటి వాటిపై ఉన్న సబ్బిడీలను తొలగించారు. ఇటువంటి నాన్ మెరిట్ సబ్సిడీలను తొలగించడాన్ని మనం స్వాగతించాల్సిందే. కానీ, పన్నులు కడుతున్నదెవరనేది గుర్తించాలి. మధ్యతరగతిని ఈవిధంగా పెంచుకుంటూ పోవడం ద్వారా మోదీ, బీజేపీ వారి వివేచనతో సరిగ్గా ఆడుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాల ద్వారా కాకుండా వారి మనోభావాలను సంతృప్తిపరచడం ద్వారా అది తన విధేయతను ప్రదర్శిస్తోంది. అందుకే మరింత బలంగా భారతీయతను హిందుత్వగా నిర్వచిస్తోంది. దీనికి ముస్లిం వ్యతిరేకత తోడవుతోంది. వారిలో చాలామంది ఇప్పటికీ మూకదాడుల పట్ల అభ్యంతరాలు చూపుతున్నా, ముస్లింలు మంత్రివర్గంలో, ప్రభుత్వ ఉన్నత పదవుల్లో, పార్లమెంటులో గణనీయంగా తగ్గిపోవడంపట్ల సంతోషంగానే ఉన్నారు. తమ బడ్జెట్ ఉపన్యాసాల్లో బీజేపీ ఆర్థిక మంత్రులు ఎన్నిసార్లు మధ్యతరగతిని ప్రస్తావించారో చెబుతూ నా సహోద్యోగి, రాజకీయ వ్యవహారాల సంపాదకుడు డీకే సింగ్ ఆశ్చర్యకరమైన అంశాలను బయటపెట్టారు. సాధారణంగా, అవి సగటున ఐదుసార్లు. అయితే, పీయూష్ గోయెల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా 13సార్లుకు పెరిగింది. సరే, అది ఎన్నికల సందర్భం అనుకోండి. ప్రస్తుతం నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆ సంఖ్య మూడుకు పడిపోయింది. ఫిబ్రవరిలో చేసిన తన ఉపన్యాసంలో పీయూష్ గోయెల్ మధ్యతరగతివారికి ఇచ్చిన హామీలన్నింటినీ ఆమె మర్చిపోయారు. ప్రామాణిక మినహాయింపు పెంచడం, మూలం వద్ద పన్ను మినహాయింపు, పన్ను శ్లాబ్‌ల్లో రాయితీలు అన్నిటినీ నిర్మల విస్మరించారు. పేదలు కృతజ్ఞతతో ఓటు వేసినప్పుడు మధ్యతరగతివారు తమపై అపారమైన ప్రేమాభినాలతో ఓటువేస్తున్నప్పటికీ వారి గురించి ఇక ఆలోచించాల్సిన అవసరమేముంది? దశాబ్దాలుగా భారత దేశంలో ముస్లిం మైనారిటీ వర్గంతో మన లౌకికవాద పార్టీలు ఈవిధంగానే ఆటాడుకున్నాయి. బీజేపీ, ఆరెస్సెస్ పట్ల భయంతో ముస్లింలు తమకు ఓటు వేస్తారని వారికి తెలుసు. అందుకే ముస్లింలకు ఏదైనా చేయాల్సిన అవసరం వారికి కనిపించలేదు. ప్రతిఫలంగా వారి ఓట్లన్నీ పడిపోతాయి. అటువంటి బలవత్తర కారణంతోనే ఇప్పుడు మెజార్టీ మధ్యతరగతి అంతా తమకు ఓటు వేస్తోందని బీజేపీకి అర్థమైపోయింది. మనం ఇప్పుడు వారిని ‘మోదీ ముస్లింలు’ అని పిలవడానికి కారణం అదే. వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ప్రధాని అంత అజేయుడా?
ప్రధాని మోదీ అజేయుడు అనే భావన ఇప్పుడు రాజ్యమేలుతున్నట్లుంది. పేదప్రజలతో మోదీ కుదుర్చుకున్న సామాజిక బంధం, చేష్టలుడిగిన ప్రతిపక్షమే దీనికి కారణం. సంక్షేమతత్వం, జాతీయ భద్రతపై స్థిరమైన వాదం, మోదీపై అవధులు మీరిన వ్యక్తిగత ఆరాధన కేంద్రంగా సాగిన తాజా రాజకీయ క్రీడలో కాంగ్రెస్‌ని మట్టికరిపించామని మోదీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఓటమైనా, గెలుపైనా రాజకీయాలలో పాఠాలు నేర్చుకోవడానికి తక్షణ సాక్ష్యాలే మంచి మార్గాలు. మోదీ ఇప్పుడు తిరుగులేని విజేత కావచ్చు. కానీ, తాను అవతార పురుషుడేమీ కాదు. 2014లో మోదీ అఖండ విజయం సాధించిన తరువాత ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ 67 స్థానాలు సాధించారు. అందుకు కారణం అప్పుడు ఆప్‌కు ఉన్న గొప్ప ఆలోచనే. అటువంటి రాజకీయ మార్పిడి జరగాలంటే కీలకమైన శస్త్ర చికిత్స అవసరం, హోమియోపతితో కుదరదు. మన క్రికెట్ జట్టు కిట్ రంగుపై కూడా పరస్పరం పోట్లాడుకునేంతగా మన సమాజం నిలువుగా చీలిపోయి ఉన్న కాలంలో కూడా నరేంద్ర మోదీ అభిమానులు, విమర్శకులు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉంటున్నారు. అదేమిటంటే, ప్రధాని నరేంద్రమోదీ అజేయుడు. ఇప్పుడే కాదు, సమీప భవిష్యత్తులో కూడా. వచ్చే పాతికేళ్ల వరకు తమ అధికారం చెక్కుచెదరదని మోదీ అభిమానుల భావన. 1952–1989 మధ్యకాలంలో కాంగ్రెస్ పాలనకు సమానంగా బీజేపీ పాలన ఉండబోతోందన్నది వీరి అభిప్రాయం. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనకు 1977–79లో మాత్రమే తాత్కాలికంగా విరామం ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం భారత్ లౌకిక వామపక్షంగా కొనసాగినట్లే దేశగతిని మార్చే అలాంటి అవకాశమే ఇప్పుడు తమకు వచ్చిందని జాతీయ మితవాదులు చెబుతున్నారు. పాత సామాజిక–రాజకీయ సమీకరణాలు ప్రత్యేకించి కఠినతరమైన లౌకికవాదం ఎంత బలహీనమై చేవకోల్పోతూ వచ్చాయో కేవలం ఐదేళ్ల తమ పాలనలోనే జాతీయ మితవాద పక్షం నిరూపించేసింది. పైగా లౌకికవాదాన్ని, సంక్షేమవాదాన్ని పాత వామపక్షం నుంచి లాక్కుని, పేద ప్రజలు తమకు ఓట్లు వేసే విధంగా మరింత సమర్థంగా వాటిని మలుచుకోవడం ఎంత సులభమో మితవాద పక్షం చేసి చూపించింది. పదేపదే మెజారిటీ సాధించటంతో తమ సైద్ధాంతిక లక్ష్యసాధనను 2015 నాటికే అంటే మోదీ మూడో దఫా పాలన ప్రారంభం నాటికే పరిపూర్తి చేయగలగమని మితవాద పక్షం భావిస్తోంది. తాము విశ్వసిస్తున్న హిందూ రాష్ట్ర బావనకు అనుగుణంగా భారత్‌ను పూర్తిగా మార్చాలనే తమ లక్ష్యాన్ని వచ్చే ఆరేళ్లలో సాధించేస్తామని వీరి నమ్మిక. ఆనాటికి ఆరెస్సెస్‌ను స్థాపించి సరిగ్గా వందేళ్లవుతుంది కూడా. గతంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ సాధించిన విధంగా భారతీయ పేద ప్రజానీకంతో తాము ఒక సామాజిక బంధాన్ని ఏర్పర్చుకున్నామని మోదీ అభిమానులు ఇప్పుడు నమ్ముతున్నారు. హిందూ జాతీయవాదం దన్నుతో కాకుండా సంక్షేమవాదం, జాతీయ భద్రతపట్ల ఉద్వేగం, మితిమీరిన వ్యక్తిగత ఆరాధన ద్వారా తాము కాంగ్రెస్ పనిపట్టామని వీరి భావన. వాస్తవానికి ఇవి కాంగ్రెస్ సొంత లక్షణాలు. వీటిని తామే ఇప్పుడు ఉత్తమంగా సాధిస్తున్నట్లు వీరు భావి స్తున్నారు. తమకు ఓటు వేయనందుకు ఓటర్ల పట్ల ప్రతిపక్షం ప్రదర్శిస్తున్న ఆవేశం, ఆగ్రహంలోంచి ప్రస్తుతం దాని మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. మోదీ గెలిచారు కానీ భారత్ ఓడిపోయిందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ఇక కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇతరుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఉదాహరణకు, కర్ణాటకు సీఎం కుమారస్వామి రాష్ట్రంలో ఉద్యోగాలు కోరుకుంటున్న వారిపై విరుచుకుపడ్డారు. ‘మీరు మోదీకి ఓటు వేశారు కదా.. మీకు కావలసిన ఉద్యోగాలకోసం మోదీనే అడగండి’. ఇది దివాళాతనానికి సరైన సంకేతం. మరోవైపున మాయావతి తన ఓటమికి తనతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్ యాదవే కారణమని ఆరోపించారు. బీఎస్పీ అధినేత ఇప్పుడు చాలా భయాందోళనల్లో మునిగి ఉంటున్నారు. మమతా బెనర్జీ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే మరి. అన్నీ ముగిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఫ్రంట్‌లో భాగమై తనతో చేతులు కలపడానికి రావలసిందిగా మమత కాంగ్రెస్, వామపక్షాలకు పిలుపునివ్వడం నైతికంగా దివాళాకోరుతునానికి సరైన నిదర్శనం. దీంతో మమతా ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదనే అభిప్రాయానికి వచ్చేసినట్లు అందరికీ తెలిసిపోయింది. ఇక వామపక్షం, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్ వంటివారిని లెక్కపెట్టవలసిన అవసరం లేదు. మోదీని జయించడం అసాధ్యం అనే మానసిక స్థితిలో ప్రతిపక్షం కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి వనరుల వినియోగంలో 95:5 ఆధిక్యతను సాధించడంలో, సంస్థలపై, మీడియాపై పూర్తి పట్టును సాధించడంలో మోదీ అసాధారణ స్థాయికి చేరుకున్నారు. చారిత్రకంగా రాజీవ్ గాంధీ అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇలాగే ఉంటూ వస్తోంది. తనను తిరస్కరించిన ప్రజల పట్ల ఆ పార్టీ ఎంత ఉద్రేకంతో, ఘర్షణాత్మకంగా వ్యవహరిస్తోందంటే, అదే ప్రజల వద్దకు వెళ్లి తనను ఎందుకు తిరస్కరించారు అని అడగటానికి కూడా అది ధైర్యం చేయడం లేదు. ఓటర్లు తమ పట్ల ప్రదర్శించిన ఈ ‘మూర్ఖత్వం’ పట్ల కాంగ్రెస్ చాలా ఆగ్రహంతో ఉంది. ‘ఓకే మిత్రులారా, మీరు మమ్మల్ని కోరుకోవడం లేదు కాబట్టి కృతజ్ఞత లేని మీలాంటి వారి అవసరం మాకూ లేదు’. తన కంచుకోట అమేధీలో అనూహ్యంగా పరాజయం పాలైన రాహుల్ గాంధీ ఐదువారాల తర్వాత కూడా ఆ నియోజకవర్గానికి తన ముఖం చూపించడానికి ఇష్టపడడం లేదంటేనే ఇంతకు మించిన భుస్వామి తరహా ఆగ్రహం మరొకటి ఉండబోదు. రాజకీయంగా తాము మళ్లీ పుంజుకుంటాం అని సవాలు విసిరే శక్తి ప్రతిపక్షంలో పూర్తిగా నశించిపోయింది. దాని స్థానంలో ప్రతిఘటన అనే అమూర్త భావన ప్రస్తుతం ముందుపీఠిలో ఉన్నట్లుంది. మోదీని ఇప్పట్లో ఓడించడం అసాధ్యమని ఆయన మద్దతుదారులు, వ్యతిరేకులు భావిస్తుండటం సరైనదే అయినట్లయితే, దీనికి తొలి బాధితులుగా మిగిలేది మనలాంటి రాజ కీయ వ్యాఖ్యాతలే. వాస్తవం ఏదంటే రాజకీయాలు సుదీర్ఘకాలం స్తంభిం చిపోవు లేక నిస్తబ్దతలో కూరుకుపోయి ఉండవు. అది చాలావరకు చక్రీయంగానే ఉంటుంది. అయితే ఆ చక్రం కింది నుంచి పైకి పైనుంచి కిందికి స్థానం మార్చుకోవడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. నెహ్రూ– గాంధీ వంశపరిపాలన కాలంలోనూ జరిగింది ఇదే కదా. విజయాన్ని లేక పరాజయాన్ని చాలా త్వరగా ప్రకటించుకునే స్వీయ విధ్వంసకత్వానికి సంబంధించిన అనేక ఉదాహరణలకు ప్రజాస్వామిక వ్యవస్థలు సాక్షీభూతాలుగా నిలిచి ఉన్నాయి. కానీ వీటిలోనూ ఓటమిని అంత సులువుగా అంగీకరించని వారు చాలా మంది ఉన్నారు. వారు పరాజయానికి సంబంధించిన షాక్‌ను తట్టుకుని ఓటములనుంచి గుణపాఠాలు నేర్చుకుని తమ సహనంతో తమనుతాము పునర్నిర్మించుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఒకవైపు, అడ్వాణీ–వాజ్‌పేయిల నేతృత్వంలో బీజేపీ సాధించిన విజయాలు ఒకవైపు దీనికి చక్కటి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఇందిరాగాంధీ ఘోరపరాజయం అనంతరం కేవలం రెండున్నరేళ్ల కాలంలో తననుతాను పునర్నిర్మించుకోగలిగింది. ఆమె చాలా స్వల్ప కాలంలోనే, ఓటమి కలిగించిన షాక్ నుంచి కోలుకున్నారు. జాతీయ భద్రత విషయంలో జనతా ప్రభుత్వం బలహీనతను పసిగట్టిన వెంటనే దానిపై ఆమె దాడి ప్రారంభించి విజయం సాధించారు. కాబట్టే 1980 ఎన్నికల్లో భారతీయ జనసంఘ్‌తో కలిసిన జనతా పార్టీ అవమానకరమైన రీతిలో ఓటమికి గురికాగా, ఇందిరాగాంధీ అద్భుత విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చారు. అలాగే 1980లో పరాజయం పాలైన తమ శ్రేణులను వాజ్‌పేయి, అడ్వాణీలు సంఘటితం చేసి భారతీయ జనతా పార్టీగా నూతనపార్టీని పునర్నిర్మించారు. కానీ నాలుగేళ్ల వ్యవధిలో అంటే 1984 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ప్రభంజనం ముందు కొట్టుకుపోయి రెండే రెండు పార్లమెంటు స్థానాలతో మిగిలిపోయారు. కానీ, అడ్వాణీ, వాజ్‌పేయి తలలు వేలాడేయలేదు. తమ బలహీనతలను తెలుసుకునే వినయంతో తలలు దించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు రాజీవ్ 414 స్థానాలు గెలుచుకున్న సంగతి గుర్తు చేసుకోండి. మోదీ ఇప్పటికీ 303 స్థానాలు మాత్రమే గెలుచుకున్నారు. మూడేళ్లు తిరిగేసరికల్లా అదే ప్రతిపక్షం రాజీవ్ చేష్టలుడిగే స్థితికి చేర్చింది. అందుకు రాజీవ్ తప్పులు కూడా సహాయపడ్డాయి. కానీ, ప్రతిపక్షం.. ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్ లోపల, వెలుపల చక్కగా పనిచేసింది. కాంగ్రెస్ లోని అసమ్మతివాదులతో, ఇతర ప్రతిపక్ష నేతలను కూడగట్టడంతోపాటు కార్యకర్తలతో కలిసి పనిచేసింది. అప్పుడే బోఫోర్స్, ఇతర కుంభకోణాలపై మీడియా హోరెత్తించింది. కాంగ్రెస్, సోషలిస్టులకు అవకాశం లేకుండా రామమందిరం, హిందూత్వ నినాదంలను చేపట్టడమే 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి అసలు కారణం. మీరు దీనిని వ్యతిరేకించొచ్చు. కానీ, ప్రత్యామ్నాయంగా ఒక గొప్ప ఆలోచన కావాలి. 35 ఏళ్లు పట్టినప్పటికీ గతంలో కాంగ్రెస్ మాదిరిగానే ఇప్పుడు బీజేపీ బలంగా నిలబడింది. ఓటమి అయినా గెలుపైనా రాజకీయాలలో పాఠాలు నేర్చుకోవడానికి తక్షణ సాక్ష్యాలే మంచి మార్గాలు. మోదీ ఇప్పుడు తిరుగులేని విజేత కావచ్చు. కానీ, తానూ మనిషే–అవతారపురుషుడేమీ కాదు. 2014లో మోదీ భారీ విజయం సాధించిన తరువాత ఢిల్లీలో కేజ్రీవాల్ 67 స్థానాలు సాధించారు. అప్పడు ఆప్‌కు ఉన్న గొప్ప ఆలోచనే కారణం. అటువంటి రాజకీయ మార్పిడి జరగాలంటే కీలకమైన శస్త్ర చికిత్స అవసరం, హోమియోపతితో కుదరదు. ప్రస్తుతం క్రికెట్ సీజన్ నడుస్తోంది కాబట్టి మోదీ గురించి అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఒక విశ్లేషణను మీకు గుర్తు చేస్తా. వివియన్ రిచర్డ్స్ బౌలర్లపై చిన్నచూపుతో బ్యాటింగ్ చేయడానికి ఎలా వస్తాడో, మోదీ కూడా శాంతంగా పార్లమెంట్‌లోకి అడుగుపెడతారు. రిచర్డ్స్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లండ్ క్రికెట్ బృందం ఒక పరిష్కారాన్ని కనుగొంది. దగ్గరగా, రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. అతడు ఎలాగైనా కొట్టనీ, ఆ బంతిని అడ్డుకోవడమే. అతడికి విసుగొచ్చి తప్పుచేసే వరకూ అదే ఎత్తుగడ అనుసరించింది. అంతులేని సహనం, ఆత్మరక్షణ, ఎదుటివారు తప్పు చేసే వరకూ ఎదురు చూడటం ఒక ఎత్తుగడ. అందుకు మొదట కావలసినది తెలివితేటలకంటే ధైర్యమూ, దృఢచిత్తమే. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మండల్, మందిర్‌లకు చెల్లుచీటీ!
గత మూడుదశాబ్దాలలో మండల్ ప్రాతిపదికన ఏర్పడుతూ వచ్చిన ఓటు బ్యాంకులను విచ్ఛిన్నపర్చిన క్రమంలోనే నరేంద్రమోదీ పూర్తి మెజారిటీ సాధించిన భారతదేశ ప్రప్రథమ ఓబీసీ ప్రధానిగా చరిత్రకెక్కారు. అటు మండల్, ఇటు మందిర్ రెండింటినుంచి మోదీ రాజదండాన్ని కైవశం చేసుకున్నారు. అడ్వాణీ, ఆయన తరం ఊహించని స్థితికి బీజేపీని మోదీ, షా తీసుకొచ్చారు. ఓబీసీలను, దళితులను చేరుకోవడంలో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, ములాయం ఓటు బ్యాంకులోకి చొరబడి, వారిని జాతవ, యాదవ కులాలకే పరిమితం చేశారు. ఇప్పటికే ఆ పార్టీకి హిందూ జాతీయ అగ్రకుల ఓటు బ్యాంకు ఉండటంతో, అదనంగా చేరిన కులాల సంఖ్య అనూహ్యమైన శక్తినిచ్చింది. మండల్, మందిర్ శకం ముగిసింది. కొత్త రాజకీయాలను ఎవరు ఎలా నిర్మించాలనేది ఇప్పుడు ప్రశ్న. సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయింది. నూతన శకం ప్రారంభమైంది కూడా. నెహ్రూ–గాంధీ రాజవంశం పతనమైందని, నరేంద్రమోదీ వికాసదశ మొదలైందని, ఇదే నేటి ఏకైక నూతన శకమని నిర్దిష్టంగా మనం చర్చించబోవడం లేదు. భారత్‌లో విస్పష్టమైన రాజకీయ పరివర్తనను అర్థం చేసుకోవడానికి అలాంటి చర్చ సంకుచిత అర్థాన్నే అందిస్తుంది. మనం ఇప్పుడు మండల్–మందిర్ రాజకీయాలకు ముగింపు పలుకుతూ మోదీ శకాన్ని ఆవిష్కరించబోతున్నాం. రాజీవ్ గాంధీ హయాంలో 1984లో లోక్‌సభలో రెండు స్థానాలకు కుంచించుకుపోయిన బీజేపీ తర్వాత 1989లో తిరిగి పుంజుకునే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. రాజీవ్ విశ్వసనీయుడు, నాటి రక్షణ మంత్రి వీపీ సింగ్ తిరుగుబాటు చేశారు. రాజీవ్ స్థానంలో ఒక సహజనేతను కూర్చోబెట్టడానికి వీపీ సింగ్ ప్రయత్నించారు కానీ బీజేపీ మద్ధతు లేకుండా వీపీసింగ్ దాన్ని సాకారం చేసుకోలేకపోయారు. ఆనాడు బీజేపీ అతి సమర్థనేత అయిన ఎల్కే అడ్వాణీ అధికారాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పైగా బీజేపీ స్వయంగా అధికారంలోకి రావాలన్నదే ఆయన ఆకాంక్ష. దీని కోసం ఆరోజు కీలక సమస్యతో ముడిపడిన అజెండా బీజేపీకి అవసరమైంది. అదేమిటంటే అవినీతిపరుడైన రాజీవ్‌ని ఓడించడం. దాంట్లో భాగంగానే హిందూ పునరుద్ధరణతో కూడిన దూకుడు జాతీయవాదాన్ని మిళితం చేస్తూ అడ్వాణీ అయోధ్య సమస్యను ఎంచుకున్నారు. ఇది అడ్వాణీ మందిర్ సిద్ధాంతమైంది. రాజీవ్ ప్రాభవాన్ని తగ్గించి ప్రతిపక్షం బలపడటంలో అద్వాణీ సహకరించారు. హిందీ ప్రాబల్యప్రాంతంలోనే అధికంగా 143 ఎంపీ స్థానాలను గెలుచుకున్న జనతాదళ్ అధినేత వీపీసింగ్ నూతనంగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కూటమి తరపున ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 272 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌కి జనతాదళ్ సాధించిన సీట్లు చాలా తక్కువే. అందుకే దానికి రెండు అనూహ్య శక్తుల మద్దతు అవసరమైంది. అవి వామపక్షాలు, బీజేపీ. అయితే భావజాలపరంగా పూర్తి విరుధ్దమైన శక్తులు రెండూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం ఐక్యం కావడం అదే తొలిసారి కాదు. చివరిసారీ కాదు. జనతాదళ్ దాని చిన్న చిన్న కూటమి పార్టీలు సాధించిన స్థానాల్లో అధికభాగం పాత సోషలిస్టులు, కాంగ్రెస్ తిరుగుబాటుదారుల నుంచి వచ్చాయి. సాధారణంగా వీరికి బీజేపీ అంటే ఏహ్యభావం. ప్రత్యేకించి వీపీ సింగ్ మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేసి కశ్మీర్ రాజకీయ నేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్‌ను కశ్మీర్ వేర్పాటువాదులు అపహరించి డబ్బుకోసం బెదిరించినప్పుడు కేంద్రప్రభుత్వం చేష్టలుడిగిపోయిన నేపథ్యంలో కశ్మీర్లో కొత్త రకం తీవ్రవాదంతో వ్యవహరించే అంశంపై అధికార పక్షంలో పరస్పర విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో వీపీ సింగ్, అయన వెన్నంటి నిలిచిన సోషలిస్టు, లోహియా వర్గాలకు చెందిన మేధోవర్గం ఆనాటి రాజకీయ కలయిక నిలకడతో కూడుకున్నది కాదని గ్రహించింది. అందుకే బీజీపీ, కాంగ్రెస్ రెండింటినీ వ్యతిరేకిస్తూ నూతన రాజకీయాలను ఆవిష్కరించే అంశంపై అది కృషి చేసింది. ఈ క్రమంలోనే అప్పటికి పదేళ్ల క్రితమే ఓబీసీలకు రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ మండల్ కమిషన్ సమర్పించిన నివేదికను ముందుకు తీసుకొచ్చి, దాన్ని వక్రరీతిలో అమలు చేశారు. అప్పటికే షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ఇస్తున్న 22.5 శాతం రిజర్వేషన్ల పట్ల కుపితులై ఉన్న అగ్రవర్ణాలు వీపీ సింగ్‌పై యుద్ధం ప్రకటిం చాయి. దీంతో దేశవ్యాప్తంగా హింసాత్మక చర్యలు పెచ్చరిల్లాయి. సామాజిక అశాంతి నేపథ్యంలో 159 మంది అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు ప్రయత్నించారు. వీరిలో 63 మంది దురదృష్టవశాత్తూ చనిపోయారు. హిందూ జనాభాలో ఒక కుల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో వీపీ సింగ్ ఆయన సోషలిస్టు మిత్రులు సరికొత్త ఓబీసీ ఓటు బ్యాంకును నిర్మించుకున్నారు. దేశజనాభాను హిందూ–ముస్లి ప్రాతిపదికన విభజించాలని ప్రయత్నిస్తున్న అడ్వాణీకి ఈ పరిణామం హిందూ ఓటును విభజించే కార్యక్రమంగా భీతి కలిగించింది. ఈ నేపథ్యంలోనే వీపీ సింగ్ మండల్ వ్యూహాన్ని అడ్వానీ మందిర్ రాజకీయాలు ఢీకొన్నాయి. ఆనాటి నుంచి మండల్ వర్సెస్ మందిర్ రాజకీయాలు భారత రాజకీయాలను నిర్వచిస్తూ ఘర్షణలను రేపెట్టాయి. కులాల మధ్య విభజన ద్వారా మత విశ్వాసం ద్వారా దేశాన్ని మీరు ఐక్యం చేయగలరా అనే ప్రశ్న తలెత్తింది. మతవిశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను ఐక్యం చేయడం అనేది సాధ్యపడినప్పుడు బీజేపీ తరచుగా కాకున్నా, అధికారంలోకి వచ్చింది. కానీ చాలావారకు హిందీ ప్రాబల్య ప్రాంతంలోని పాతతరం నేతలు తమ సొంత కులాలకు చెందిన ఓటు బ్యాంకులను నిర్మించుకోవడం ద్వారా బలపడుతూ వచ్చారు. ఈ క్రమంలో దళితులను తమవైపునకు తిప్పుకోవడం ద్వారా కాన్షీరామ్, మాయావతి కులరాజకీయాల్లో మిళతమయ్యారు. ఈ కులబృందాల శక్తిని ముస్లిలు హెచ్చించేవారు. ఈ రెండింటి కలయికతో వారు హిందీ ప్రాబల్యప్రాంతంలో బీజేపీని తరచుగా ఓడించేవారు. బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చూసేందుకు వీళ్లు కాంగ్రెస్‌తో అవాంఛిత పొత్తులను కూడా పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మొత్తం క్రమానికి 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రకటించిన తీర్పు మంగళవాక్యం పలికింది. మండల్‌పై మందిర్ విజయం సాధించిందని చెబితే అది అసలు విషయాన్ని పక్కనబెట్టినట్లే అవుతుంది. మోదీ, అమిత్ షాల హయాంలో మండల్ రాజకీయాలు తలొంచేశాయి. గత మూడుదశాబ్దాలలో మండల్ ప్రాతిపదికన ఓటు బ్యాంకులను విచ్ఛిన్నపర్చిన నేపథ్యంలోనే నరేంద్రమోదీ భారతదేశ పూర్తి మెజారిటీ సాధించిన ప్రప్రథమ ఓబీసీ ప్రధానిగా చరిత్రకెక్కారు. అటు మండల్, ఇటు మందిర్ రెండింటినుంచి మోదీ రాజ దండాన్ని కైవశం చేసుకున్నారు. భౌగోళిక రాజకీయాల వ్యూహం ప్రకారం చూస్తే ఇది భూకంపం మాత్రమే కాదు. ఒక భూఖండం పూర్తిగా స్థానం మార్చుకున్న స్థాయికి ఇది సూచిక. ఇదెలా సాధ్యమైంది? దీని పర్యవసానాలేమిటి? ఇది భారత రాజకీయాల్లో కొత్త శకాన్ని ఎలా ఆవిష్కరించనుంది? ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి సాయంత్రం పార్టీ కార్యకర్తల ముందు నరేంద్రమోదీ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని చూడండి. మోదీ రెండు అంశాలను ప్రస్తావించారు. భారత్‌లో ఇప్పుడు రెండు కులాలే ఉన్నాయని మోదీ చెప్పారు. పేదలు, ఆ పేదలకు సహకరించే వనరులను సృష్టించగలిగిన సమర్థులు ఒక అంశం. రెండు. సెక్యులర్ ముసుగు ధరించిన వారు పరాజయం పాలయ్యారు. అంటే కులం ప్రాతిపదికన హిందువులను విభజిస్తూ, వారిని ముస్లిం ఓటర్లతో మిళితం చేస్తూ అధికారంలోకి వచ్చే నేతల శకం ముగిసిపోయిందన్నదే మోదీ ప్రసంగం ఇస్తున్న రాజకీయ సందేశం. ఈ సరికొత్త పరిణామాన్ని సాధ్యం చేసిన ఏకైక కారణం మోదీనే. ప్రతిపక్షాన్ని అవమానించాల్సిన పనిలేదు. ఒక భావజాలంతో లేక ఒక పార్టీతో మీరు తలపడుతున్నప్పుడు ఎన్నికల ముందస్తు పొత్తులు పనిచేస్తాయి. కానీ ఒక మూర్తిమత్వంతో ప్రత్యేకించి నేటి మోదీ, 1971 నాటి ఇందిరా గాంధీ వంటి ప్రజారంజక నేతలతో తలపడుతున్నప్పుడు ఇలాంటి పొత్తులు ఏమాత్రం పనిచేయవు. అడ్వాణీ, ఆయన తరం ఊహించని స్థితికి బీజేపీని మోదీ, షా తీసుకొచ్చారు. మోదీ, షాలు ఓబీసీలను, దళితులను చేరుకోవడంలో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, ములాయం ఓటు బ్యాంకులోకి చొరబడి, వారిని జాతవ, యాదవ కులాలకే పరిమితం చేశారు. మిగిలినవారంతా బీజేపీ వైపే ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి హిందూ జాతీయ అగ్రకుల ఓటు బ్యాంకు ఉండటంతో, అదనంగా చేరిన కులాల సంఖ్య అనూహ్యమైన శక్తినిచ్చింది. బీజేపీయేతర ఓబీసీ నాయకుడైన నితీష్ కుమార్‌కు బీహార్ అప్పగించారు. శక్తివంతమైన దళిత వర్గానికి చెందిన రామ్ విలాస్ పాశ్వాన్‌కు కూడా చోటు కల్పించారు. రెండు దశాబ్దాలుగా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచిన మండల్ వ్యవహారాన్ని 2019లో తుంగలో తొక్కేశారు. ఇప్పుడు మోదీకి తన స్వంత వ్యూహ రచన చేసుకునే అవకాశం దక్కింది. ఎందుకంటే, ఇప్పటికే అగ్రవర్ణ అభిమానం ఆయనకు అయాచితంగా లభించింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో అనేకమంది ఓబీసీ, దళిత నాయకుల మద్దతు పొందారు. బీహార్‌లో ఆయన ఇప్పటికే బలమైన యాదవ్ నేతల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంజయ్ పాశ్వాన్ లాంటి వారు యూపీలోనూ ప్రముఖంగా ఉన్నారు. దీంతో దేశంలో రాజకీయాలు అంతరించినట్టు భావించనక్కర్లేదు. మండల్, మందిర్ శకం ముగిసినట్టే అని మాత్రమే దీనర్థం. కొత్త రాజకీయ అంశాలను కనుగొనడమే మోదీ తర్వాత సవాల్. ఏ విశ్వాసమైతే ఐక్యం చేసిందో దాన్ని కులం మరోసారి విడగొడుతుందని కొందరు ఇంకా ఆశపెట్టుకుంటున్నారు. కొన ఊపిరితో ఉన్న ఆ ఆలోచన 2014లోనే చచ్చిపోయింది. ఏమైనా మిగిలివుంటే ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. కొత్త రాజకీయాలను ఎలా నిర్మించాలి? ఎవరు? ఎన్నికల ఫలితాల్లో ఒక స్థాయి కిందకు చూస్తే బీజేపీకి కనిపించే 303 స్థానాల కింద కాంగ్రెస్‌కు ఎదురుగా కనిపించే 52 అనే రెండు సంఖ్యలు ముఖ్యమైనవి. 2014లో 17.1కోట్ల మేరకు ఉన్న బీజేపీ ఓట్లు ఇప్పుడు 22.6కు పెరిగాయి. 10.69 కోట్ల నుంచి 11.86 కోట్లకు కాంగ్రెస్ ఓట్లు పెరిగాయి. పెరుగుతున్న ఓట్లు, ఇతర స్థానిక శక్తులు జాతీయ పార్టీలకు అండగా నిలబడుతున్నాయి. అందుకే మనం కాంగ్రెస్ పార్టీని తీసుకున్నంత తేలికగా, మోదీ, షాలు తీసుకోరు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
అ‘ప్రజ్ఞా’వాచాలత్వం!
గత అయిదేళ్లకాలంలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలకు ప్రత్యర్థులు కూడా చేయలేకపోయిన భంగపాటును సొంత పార్టీకి చెందిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ దిగ్విజయంగా కలిగించారు. గాంధీ హంతకుడు దేశభక్తిపరుడు అంటూ ఆమె చేసిన పదప్రయోగం మోదీ, అమిత్ షాలను వారి ప్రజాజీవితం మొత్తంలో ఏ రకంగానూ సమర్థించుకోలేని స్థితిలోకి నెట్టివేసింది. గాంధీ హత్యానంతరం ఆ ఘటన కారకులనుంచి దూరం తొలిగిన బీజేపీ మాతృసంస్థ, సైద్ధాంతిక శక్తి అయిన ఆరెస్సెస్ సైతం గత ఏడు దశాబ్దాల్లో గాంధీని విమర్శించే సాహసం చేయలేదు. బీజేపీకి ఓట్లు రాబట్టే సమర్థత విషయంలో, లేక పార్టీ నైతిక ధృతిని పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుందని భావించిన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ దానికి భిన్నంగా తన ప్రధానమంత్రి, పార్టీ అధినేత దూకుడును ఘోరంగా దెబ్బతీశారు. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ సాధించిన ఒక విజ యాన్ని మాత్రం మనం గుర్తించాల్సి ఉంది. నరేంద్రమోదీ, అమిత్ షాల విషయంలో ఎవరూ చేయలేని పని ఆమె చేసిపడేశారు. అదేమిటంటే ఒక్కసారిగా వాళ్లను ఆత్మరక్షణలో పడేశారు. అంతేకాకుండా తన పార్టీ అగ్రనాయకత్వం నిజంగా ద్వేషించే మరో పనిని కూడా చేయడంలో ఆమె విజయం పొందారు. పతాక శీర్షికలను నిర్ణయించే వారి శక్తిని కోల్పోయేలా చేశారామె. గత అయిదేళ్లుగా పత్రికల్లో పతాక శీర్షికలను మార్చడంలో, తమకు అనుకూలంగా నియంత్రించడంలో తమ వ్యూహాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న బీజేపీ, తాము కోరుకోని రీతిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి వచ్చింది. నరేంద్రమోదీ, అమిత్ షాలు తమ ప్రజా జీవితంలో మొట్టమొదటిసారిగా ఏరకంగానూ సమర్థించుకోలేని వ్యవహారంలో చిక్కుకున్నారు. గాంధీ, నాథూరాం గాడ్సేల వ్యవహారంపై తాజాగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్ లేవనెత్తిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే, బీజేపీ ఐటీ సెల్ విభాగాధిపతి అమిత్ మాలవీయతో పాటు బీజేపీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాపీ అనుయాయులు వెనువెంటనే ఆమెకు సమర్ధనగా ముందుకురికారు. కానీ వారి ప్రయత్నాలన్నీ వమ్మయిపోయాయి. గత అయిదేళ్లుగా వ్యక్తులపై లేక సామాజికవర్గంపై బీజేపీకి చెందిన వ్యక్తి ఎలాంటి అసందర్భోచితమైన దాడికి తలపెట్టినా సరే వారిని కాపాడటానికి లేక వారిపై ఆరోపణలను తోసిపుచ్చడానికి ఆ పార్టీ శరవేగంగా పావులు కదపడాన్ని మనందరం చూస్తూ వచ్చాం. కానీ మహాత్మా గాంధీ విషయంలో మాత్రం బీజేపీ ఇలాంటి సాహసాలకు పూనుకోలేదు. పార్టీకి చెందిన కొందరు గాంధీ తప్పులు, దేశ విభజన సమయంలో ఆయన పాత్ర వంటి అంశాలపై తమ తమ డ్రాయింగ్ రూమ్‌లలో, గోష్టులలో లేక శాఖా సమావేశాల్లో మాత్రమే వ్యాఖ్యానించి ఉండవచ్చు కానీ బహిరంగంగా మాత్రం వారెవ్వరూ గాంధీపై వేలెత్తి చూపిన పాపాన పోలేదు. గాంధీ హత్యానంతరం ఆ ఘటన కారకులనుంచి దూరం తొలిగిన బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ సైతం గత ఏడు దశాబ్దాల్లో గాంధీని విమర్శించే సాహసం చేయలేదు. కానీ, కాషాయాంబరధారి అయిన అభ్యర్థి, ఉగ్రవాద కేసులో ముద్దాయిగా ఉన్న హిందూత్వ మూర్తి ఇప్పుడు గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా పిలుస్తోంది. జాతిపితగా మీరు ప్రశంసించిన వ్యక్తి వారసత్వాన్ని మీరు బోనులో నిలబెట్టకూడదు. ఆయన 150వ జయంతి సందర్భంగా ఆ పని అసలు చేయకూడదు. కానీ బీజేపీకి ఓట్లు రాబట్టడంలో, లేక పార్టీ నైతిక ధృతిని పెంచడంలో మంచి పాత్ర పోషిస్తుందని భావిం చిన ప్రజ్ఞా ఠాకూర్ దానికి భిన్నంగా తన ప్రధాని, పార్టీ అధినేత దూకుడును ఘోరంగా దెబ్బతీశారు. స్వయానా సాధ్వి ప్రజ్ఞను ఉద్దేశపూర్వకంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వారే కాబట్టి మోదీ–షా ద్వయం ఆమె చేసిన నిర్వాకానికి నిరుత్తరులైపోయారు. కాషాయ ఉగ్రవాదం అనే పదబంధాన్ని సృష్టించి హిందువులకు హాని తలపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచారానికి వ్యతిరేకంగా తమ పార్టీ తలపెట్టిన సత్యాగ్రహమే సాధ్వీ ప్రజ్ఞ రాజకీయ ప్రవేశమంటూ మోదీతో కలిసి అమిత్ షా తాజాగా నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరించారు. ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఒకటి. సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ నుంచి దూరంగా జరగడం మోదీ–షాల పార్టీకి ఇప్పుడు అసాధ్యం అనడానికి కారణం ఉంది. ఎందుకంటే ఈ ద్వయం దూకుడుతో తీసుకొచ్చిన స్వయం ఎంపిక ఆమె. రెండు, పై రాజకీయ ప్రకటనను వివరించడానికి అమిత్ షా గాంధీ ట్రేడ్ మార్క్ అయిన సత్యాగ్రహ భావనను ఉపయోగించారు. గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా ప్రశంసించిన వ్యక్తిని సమర్థించడానికి అదే గాంధీ మానవజాతికి బహుకరించిన విశిష్టమైన అహింసా పోరాటాన్ని మీరు అరువుతెచ్చుకుంటున్నప్పుడు మీరు ఎటువైపు వెళుతున్నారో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. సరైన కారణాలతో కూడా ఎన్నడూ తప్పు పనులకు పాల్పడవద్దన్నది జీవితంలో కానీ రాజకీయాల్లో కానీ సత్ప్రమాణ సూత్రం. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను బీజేపీ వివాదాల్లోకి లాగడం గురించి మనకు తెలుసు. హిందూ ఉగ్రవాదంపై తీవ్రాతితీవ్రంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో అగ్రగణ్యుడు దిగ్విజయ్ సింగ్. న్యూఢిల్లీలో బాట్లా హౌస్ వద్ద జరిగిన ఎన్కౌంటర్ గురించి, మోహన్ చంద్ శర్మ అనే పోలీసు అధికారి ధీరోదాత్త త్యాగం గురించి దిగ్విజయ్ వ్యంగ్యంగా ప్రకటనలు చేశారు. అది చాలదన్నట్లుగా 26/11 అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా దాన్ని ఆరెస్సెస్ కుట్రగా కూడా అభివర్ణించారు. బీజేపీ ఉద్దేశం ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణకు గురై అరెస్టైన హిందూ రాడికల్ కార్యకర్తలు దిగ్విజయ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకోవలసి ఉండింది. కానీ గత నెల చివరలో ప్రజ్ఞ్నా ఠాకూర్ తొలిసారిగా పతాక శీర్షికల్లోకి వచ్చి హేమంత్ కర్కరేని, ఆయన కుటుంబాన్ని తాను శపించిన కారణంగానే అతడు చనిపోయాడని ప్రకటించారు. (హేమంత్ కర్కరే చనిపోయిన ఆరేళ్లకు ప్రత్యేకించి సెప్టెంబర్ 29న మాలెగావ్ బాంబు దాడి వార్షికోత్సవం రోజునే హేమంత్ కర్కరే భార్య కూడా మరణించారని మనం గుర్తించాలి). తర్వాత బాబ్రీమసీదును కూలగొట్టడానికి తాను స్వయంగా ఆ మసీదుపైకి ఎక్కానని సాధ్వీ ప్రజ్ఞా ప్రకటించారు. ఈ రెండు సందర్భాల్లోనూ బీజేపీ సత్వరం స్పందించి నష్టనివారణ చర్యలకు పూనుకొంది. సాధ్విని మౌనవ్రతం పాటించాల్సిందిగా ఆదేశించడమే కాకుండా మోహన్ చంద్ శర్మపై గతంలో అదేరకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది కూడా. కానీ ఇప్పుడు గాడ్సేని ప్రశంసించడానికి సాహసించిన సాధ్వీని కాపాడే అవకాశమే బీజేపీకి లేకుండా పోయింది. 1989 నుంచి, బీజేపీ నిదానంగానే అయినా, నియంత్రిత విధానంలో ముందుకెళ్లే వ్యూహాన్ని అవలంబిస్తూ వచ్చింది. అద్వాణీ తలపెట్టిన అయోధ్య ఉద్యమం ప్రారంభ దినాల నుంచి మొదలుకుని ఆ పార్టీ మరింత దూకుడు చర్యలకు తావిస్తూ పోయింది. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు, నేతలను అది పక్కనబెడుతూ వచ్చింది కూడా. సాధ్వి రితంబర, ప్రవీణ తొగాడియా, వినయ్ కతియార్ వంటి వారిని గుర్తుంచుకోండి. అదేసమయంలో ఉమా భారతి, సాక్షి మహరాజ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి (రంజాదే, హరాంజాదే ఫేమ్), యోగి ఆదిత్యనాథ్ వంటి మిలిటెంట్ స్వభావం కలిగిన వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకొచ్చింది. ఇది మూడు దశాబ్దాలుగా పనిచేస్తోంది. కానీ, తెలివిగా సాగింది. మనలో కొందరం దీన్ని ముందే ఊహించాం. దాద్రిలో గోరక్షకులు అక్లాక్‌ను చంపిన వెంటనే నేను నా జాతి హితం కాలమ్‌లో రాసిన ‘మూక సంస్కృతి ప్రధాన స్రవంతి’ వ్యాసాన్ని పరిశీలించవచ్చు. ప్రజ్ఞా కేవలం ఓ తాజా ఉదాహరణ మాత్రమే, చాలా అవమానకరమైన ఉదాహరణ. ఇదేదో పొరపాటున జరిగిందని కూడా అనుకోలేం. ఇది ఉద్దేశపూర్వకంగా, బాగా ఆలోచించి చేసిన పని అని పార్టీ అధ్యక్షుడే స్వయంగా మనకు చెప్పాడు. ఇది పూర్తిగా దురభిప్రాయంతో కూడిన తెలివితక్కువ ప్రకటన. భారత జాతీయత ఎదిగిన తీరుపై తప్పుడు అవగాహన నుంచి అది వెలువడింది. భారత దేశాన్ని ఐకమత్యంగా ఉంచుతున్నది ప్రాథమికంగా హిందూయిజమే (హిందూత్వ) అనే తప్పుడు అవగాహనలో ఇదంతా ఉంది. తర్వాత ఆ హిందూయిజం, హిందూత్వ అనేవి ఒకే మతం, ఒకే ప్రజ, ఒకే భాష, ఒకే జాతి అనే ఆర్ఎస్ఎస్ స్థాయికి కుదించుకుపోయాయి. ఈ ఎన్నికల్లో మోదీ మెజారిటీ సాధించినప్పటికీ నాలుగు దక్షిణాది రాష్ట్రాలు(ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ)లోని 103 స్థానాలకు గాను కనీసం రెండు స్థానాలు గెలుచుకునే పరిస్థితి కూడా లేదని మోదీ గుర్తుంచుకోవాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా హిందూయిజాన్ని వ్యాపింపజేసి దాన్ని ఇరుసుగా మార్చుకున్నారు. స్వేచ్ఛాయుత రాష్ట్రాల స్ఫూర్తికి ఇది విరుద్ధం. ఒక మతం నుంచి ఒకే దృక్పథం, ఒకే ఆలోచనా విధానం, ఒకే గ్రంథం నుంచి ఒకే దార్శనికత ఏర్పడే అవకాశం లేదు. అందువల్లే మన దేశం ఐకమత్యంగా ఉండటమే కాదు, ప్రతి దశాబ్దానికీ మరిత బలమైనదిగా, సురక్షితమైనదిగా ఎదుగుతోంది. అదే సమయంలో ఒకే సిద్ధాంతం కలిగిన పాక్ ముక్కలవు తోంది. వైవిధ్యతతో కూడిన సౌఖ్యం భారత్ ఆధునిక ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కానుక. ప్రపంచంలో మరెక్కడా వేర్వేరు సంస్కృతులు సంయమనంతో లేవు. విభిన్నతకు భారత్ ఒక బ్రాండ్ అయితే, స్విస్ తత్వవేత్త కార్ల్ జంగ్ అన్నట్టు దాని మూల బిందువు మహాత్మా గాంధీ. నెహ్రూ విధానాలతో పోరాడటం, వాటిపై బురద చల్లడం, దూషిం చటం సులభమే. ఇప్పటికే కొందరు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హంతకులను కూడా హీరోలుగా పిలవడం మొదలెట్టారు. కానీ మహా త్మాగాంధీని ముస్లింలను బుజ్జగించే రాజకీయాల సంస్థాపకుడిగా భావించే అత్యంత హిందూ మత ఛాందసవాదులకు కూడా గాంధీని లక్ష్యంగా చేసుకోవడం అంటే ఆత్మహత్యా సదృశంగానే కనిపించేది. అందుకే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ని ఎన్నటికీ క్షమించబోనని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలో నిజాయితీ ఉండవచ్చు. వచ్చే గురువారం ఎన్నికల కౌంటింగులో ఆమె ఓడిపోవాలని మోదీ ప్రార్థించవచ్చు. లేక గాంధీ పేరుతో గత అయిదేళ్లుగా ప్రమాణం చేస్తూవచ్చిన పార్టీకి ఆ గాంధీ హంతకుడినే హీరోగా ప్రశంసిస్తున్న వ్యక్తిని అదే పార్టీలో కొనసాగించడం కలవరపెట్టవచ్చు కూడా. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
బలహీనతలతో హస్తం బేజారు!
కేంద్రంలో నూతన ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామనే ప్రకటన చేయడానికి కూడా ధైర్యం లేని కాంగ్రెస్ పార్టీ 2014లో సాధించిన 44 లోక్‌సభ స్థానాలకు మూడురెట్లు అంటే 132 స్థానాలను సాధించి మోదీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని కలలు కంటోంది. వాస్తవానికి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో వంద సీట్లు సాధించడానికి కూడా కొట్టుమిట్టులాడుతోందన్నది వాస్తవం. నిర్ణయాత్మకంగా ఉండటంలో, అనిశ్చితినుంచి బయటపడటంలో దాని వైఫల్యమే ఆ పార్టీని మరింత దుస్థితిలోకి నెడుతోంది. దీర్ఘకాలంలోనే కాదు స్వల్ప కాలంలో కూడా కాంగ్రెస్ కోలుకునే అవకాశాలు కొరవడుతుండటమే మోదీ, అమిత్ షాల బలంగా మారడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ ఎన్ని స్థానాలపై గురిపెట్టిందో తాజాగా సూచించారు. 2014లో సాధించినదానికి మూడు రెట్ల సీట్లను కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ ఎన్నికల్లో తాము సీట్లు సాధిస్తే నరేంద్రమోదీ రెండో దఫా ప్రధాని కాకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. అయితే బీజేపీ కంటే కాంగ్రెస్ మద్దతుదారులే ఆయన ప్రకటనపట్ల పెదవి విరిచేయడం గమనార్హం. కేంద్రంలో నూతన ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామనే ప్రకటన చేయడానికి కూడా కాంగ్రెస్‌కు ధైర్యం లేదు. పైగా అది ఎన్నికల ప్రచారం మధ్యలోనే ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. పైగా గత ఎన్నికల్లో సాధించిన 44 సీట్లకు బదులుగా మూడు రెట్లు అధిక స్థానాలు ఈ ఎన్నికల్లో వచ్చినట్లయితే అప్పటికీ కాంగ్రెస్ మొత్తం సీట్లు 132కి మాత్రమే చేరుకుంటాయి. అంటే కాంగ్రెస్ తనను తానుగా 132 స్థానాలకు పరిమితం చేసుకుంటోంది. వాస్తవానికి 100 స్థానాలు సాధించడానికే అది కొట్టుమిట్టాడుతోంది. కాంగ్రెస్ తీసుకొస్తున్న ఈ వాదన వాస్తవరీత్యా సరైందే కావచ్చు కానీ రాజకీయంగా లోపభూయిష్టమైంది. నేడు బీజేపీ 200 స్థానాలకు చేరుకుంటే, తప్పకుండా తదుపరి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పర్చగలదు. అలా జరగకూడదంటే బీజేపీని 200కు తక్కువ స్థానాలకే పరి మితం చేయాలి. 2019లో బీజేపీ, కాంగ్రెస్ అవకాశాలను పరిశీ లిద్దాం. బీజేపీ ప్రత్యేకించి మోదీ–షాల కనీస లక్ష్యం 200 స్థానాలు. తమకు అన్ని సీట్లు మాత్రమే వస్తే తమ ప్రత్యర్థి కాంగ్రెస్‌కి కేవలం వంద సీట్లు మాత్రమే వచ్చేలా బీజేపీ పథకం రచిస్తుంది. కాంగ్రెస్ ఒకవేళ వందకు పైబడిన స్థానాలకు చేరుకోగలిగితే తమకు 200కు లోబడిన స్థానాలు మాత్రమే రావచ్చని బీజేపీ అంచనా వేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ వందకు మించి సాధించే ప్రతి సీటు కూడా మోదీ–షాల బీజేపీని 200 స్థానాల దిగువకు నెట్టేసే ప్రమాదాన్ని సృష్టిస్తుంది. కానీ కాంగ్రెస్ 100కి మించిన స్థానాలు సాధించగలుగుతుందని నేనయితే చెప్పడం లేదు. 100 సీట్లు మాత్రమే సాధించినా ఆ పార్టీ కాస్త ఊపిరి పీల్చుతున్నట్లే అవుతుంది మరి. కమల్‌నాథ్ చెబుతున్నట్లు కాంగ్రెస్ 132 స్థానాలు సాధించినట్లయితే మోదీ రెండో దఫా అధికారంలోకి రాకుండా అది అఢ్డుకునే అవకాశం ఉంది. 2004లో అంతకుమించి 12 స్థానాలు అధికంగా సాధించినందుకే యూపీయే–1 ప్రభుత్వం ఉనికిలోకి రాగలిగింది. అయితే ఈసారి కాంగ్రెస్ ఆ సంఖ్యను చేరగలుగుతుందని నేను చెప్పను. నా అంచనా కాంగ్రెస్‌కు 132 స్థానాలు కూడా రావనే. 2014 ఎన్నికల్లో ఇరు పార్టీలు సాధించిన స్థానాలను సమీక్షిద్దాం. బీజేపీ సాధించిన 282 స్థానాల్లో 167 స్థానాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. మరోమాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన కారణంగానే మోదీ ప్రభంజనం సృష్టించగలిగారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ గతంలో సాధించిన 204 స్థానాల నుంచి 44 స్థానాలకు ఘోరపతనం చెందింది. దాదాపుగా 2014లో కాంగ్రెస్ తన ప్రత్యర్థి బీజేపీముందు సాగిలపడిపోయింది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బీజేపీ 38 స్థానాలు కొల్లగొట్టింది. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలకు చేరుకోవాలంటే బీజేపీ గతంలో సాధించిన 60 స్థానాలను అది కైవసం చేసుకోవాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమికి బీజేపీ చాలా సీట్లు కోల్పోనున్నట్లు అంచనా వేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ 60 స్థానాలను బీజేపీ నుంచి లాక్కోవడం అంటే అది నిర్ణయాత్మకమైన మలుపుకు దారి తీస్తుంది. అయితే ఇది కూడా జరుగుతుందని నేనయితే భావించడం లేదు. వంద స్థానాల మార్కును చేరుకోవడం ఎంత సుదూర లక్ష్యమో అర్థం చేసుకోవాలంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 ఎంపీ స్థానాలు ఎక్కడినుంచి వచ్చాయో పరిశీలించాల్సిందే. దేశంలోని 16 రాష్ట్రాలనుంచి కాంగ్రెస్ 44 స్థానాలను సాధించగలిగింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ డబుల్ ఫిగర్‌ని అంటే కచ్చితంగా 10 స్థానాలను సాధించింది. ఇక కేరళలో ఆ పార్టీ ఏడు స్థానాలను కైవశం చేసుకుంది. ఈ 17 సీట్లను మినహాయిస్తే, మిగిలిన 27 స్థానాలు ఆ పార్టీకి 14 రాష్ట్రాలనుంచి వచ్చాయి. అంటే ఒక్కో రాష్ట్రం నుంచి 1, 2, 3 సీట్లు వచ్చాయి. ఇవి సైతం అభ్యర్థి వ్యక్తిగత బలంపై ఆధారపడి మాత్రమే వచ్చాయి. ఇక బీజేపీతో పోటీలో కాంగ్రెస్‌కి రెండో స్థానం కట్టబెట్టిన 167 సీట్లను చూస్తే 14 సీట్లలో బీజేపీ కంటే 10 శాతం తక్కువ ఓట్లను కాంగ్రెస్ సాధించగలిగింది. ఇక 10 నుంచి 15 శాతం ఓట్లతేడాతో కాంగ్రెస్ ఓడిపోయిన స్థానాలు 6. మిగతా స్థానాల్లో ఇరుపార్టీల మధ్య 75 శాతం అంతరం ఉండటం గమనార్హం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 శాతం ఓట్లను అదనంగా పొందగలిగిందంటే అది బీజేపీ సాధించిన నాటి ఘనవిజయాన్ని సరిగ్గా తలకిందులు చేయడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో సాధించిన సీట్లను ఈ కోణంలోంచి విశ్లేషిద్దాం. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సాధించిన విజయ 2014 ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సరిగ్గా తలకిందులు చేసిపడేసింది. కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో ఓటర్ల పునాదిని తనకు అనుకూలంగా కాంగ్రెస్ ఆకర్షించగలదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వంద సీట్ల మాజిక్‌ను సాధించాలంటే ఈ మూడు రాష్ట్రాల్లో అది కనీసం 30 లోక్‌సభ స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది. చత్తీస్‌గఢ్‌లో దాని మెజారిటీని గమనిస్తే ఇక్కడినుంచే అది అధిక స్థానాలు సాధించే అవకాశముంది. కానీ అదేసమయంలో మధ్యప్రదేశ్, రాజస్తా న్ల నుంచి కాంగ్రెస్ 25 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని భావించడం మితిమీరిన ఆశావాదం కిందికే వస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి అనుకూల లేదా వ్యతిరేక ఓటు అనేది రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ప్రతిబింబించలేదు. ఎన్నికల మధ్యలో పరిస్థితి ఇది. ఎన్నికల ప్రచారం ఇంకా తీవ్రం కావలసి ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఈ రెండు పార్టీలకూ కీలకమే కావచ్చు కానీ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే సమస్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహా రాష్ట్ర, జార్ఖండ్, అస్సామ్ తదితర రాష్ట్రాల్లోనే ప్రధానంగా నిర్ణయం కానుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రాల్లోనే నేరుగా 150 స్థానాల్లో తలపడుతున్నాయి. తమను అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని మోదీ, అమిత్‌షాలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థిగా లేని రాష్ట్రాల్లో కూడా మోదీ తన దాడిని కాంగ్రెస్‌పైనే ఎందుకు కేంద్రీకరిస్తున్నారు అనే ప్రశ్నకు ఇదే సమాధానం. ప్రత్యర్ధులు బీజేపీని 200 కంటే స్థానాలకే పరిమితం చేయాలని ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్‌కి 100 కంటే తక్కువ స్థానాలే వచ్చేలా చూడటం మోదీకి చాలా ప్రధానమైన ఆంశంగా ఉంటోంది. 2014లో కాంగ్రెస్ సాధించిన మొత్తం సీట్లకు మూడు రెట్లు అంటే 132 స్థానాలు సాధిస్తే మోదీని మళ్లీ ప్రభుత్వం ఏర్పర్చకుండా అడ్డుకోవచ్చు అన్నట్లయితే, ఇది మూడునెలలకు వెనుకటి పరిస్థితిని తలపించవచ్చు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఆ లక్ష్యాన్ని చేరుకోగల స్థితిలో ఉందా? ఈ నిర్ణయాత్మక స్థాయిని చేరుకోగలిగేందుకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా తనను తాను బలపర్చుకోగలిగిందా? అవిభక్త పంజాబ్‌లో తిరుగులేని ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్ ప్రయాణం మధ్యలో తమ కారు ఉన్నట్లుండి ఆగిపోయిన సందర్భాన్ని ఆనాటి రాజకీయ పరిస్థితికి అన్వయిస్తూ చెప్పిన మాటలను 1980లలో హర్యానా వృద్ధ నేత దేవీ లాల్ ఒక సందర్భంలో విలేకరులతో ముచ్చటిస్తూ గుర్తు చేశారు. దేవీలాల్ అప్పట్లే ఖైరాన్కి రాజకీయ సలహాదారుగా ఉండేవారు. ‘‘చూడు చౌదరీ.. ఇప్పుడు మన కారుకు ఉన్నట్లుండి బ్రేకులు పడిన చందంగానే జవహర్లాల్ నెహ్రూకు కూడా బ్రేకులు పడవచ్చు. మీరు కుడివైపుకు అయినా వెళ్లండి, లేక ఎడమవైపుకైనా వెళ్లండి కానీ అనిశ్చితితో, నిర్ణయ రాహిత్యంతో ఉన్నవారు ఎవరూ మనుగడ సాధించలేరు’’ అని ఖైరాన్ చెప్పారట. నెహ్రూ వంశంలో మూడో తరం నేతృత్వంలో నడుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్‌కి కూడా దీన్నే ఆపాదించండి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలతో విడిపోయింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమైంది. మమతా బెనర్జీతో, కేసీఆర్‌తో, నవీన్ పట్నాయక్‌తో కలిసే అవకాశాలు దాదాపుగా లేవు. పైగా ఉమ్మడి ప్రయోజనాల లక్ష్యంతో కర్ణాటకలో జేడీ(ఎస్) పార్టీ అభ్యర్థులను బలపర్చడానికి తన బలగాలను మొత్తంగా కేంద్రీకరించాల్సిన దుస్థితి. వీటన్నింటికి పరాకాష్టగా ప్రియాంక గాంధీని వారణాసి నుంచి మోదీకి పోటీగా నిలబెట్టాలా వద్దా అనే సంశయంలో కాలం గడుపుతూ అంతిమంగా ఆమెను అక్కడి నుంచి బరిలోకి దింపరాదని తేల్చడం... రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎలా కనిపిస్తోందో చూశారా? కారు హెడ్ లైట్ల వెలుగులో చిక్కి కుందేలు చేష్టలుడిగిపోయిన స్థితే కదా. ప్రస్తుత ఎన్నికలను పక్కనబెట్టి చూస్తే భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించవలసి ఉంది. ఎందుకంటే క్రికెట్లో మాదిరే, రాజకీయాల్లో కూడా రెండో ఇన్నింగ్స్‌ను బాగా ఆడాలని కోరుకుంటూ మొదటి ఇన్నింగ్స్‌ను మనకు మనమే ధ్వంసం చేసుకోకూడదు. మన్మోహన్ సింగ్ గతంలో చేసిన ఒక వ్యాఖ్యనుంచి కాంగ్రెస్ పాఠం నేర్చుకోవలసి ఉంది. పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా మన్మోహన్ సింగ్ సుప్రసిద్ధ ఆర్థికవేత్త కీన్స్ మాటల్ని గుర్తుచేశారు. ‘‘దీర్ఘకాలంలో మనమంతా చస్తాం’’. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే స్వల్ప కాలంలోనూ పెనుప్రమాదం కాచుకుని ఉన్నట్లే ఉంది. వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta శేఖర్ గుప్తా -
గెలుపు గుర్రాలే కీలకం
ఏ రాజకీయ పార్టీకైనా సరే.. ఎన్నికల్లో గెలవడం అనే ఒకే ఒక లక్ష్య ప్రకటన ఉంటుంది. గెలిస్తే అపారమైన రివార్డులు లభిస్తాయి. ఓడిపోతే దారుణంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కూడా. కానీ, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రాహుల్ కోటరీలో ప్రతిభావంతులు ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీ ఎన్నికల్లో పార్టీని గెలిపించే సామర్థ్యం లేదు. మరోవైపున కాంగ్రెస్ గత ప్రభుత్వాల విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుని ముందుకు సాగిపోతున్న మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడటంలో రాహుల్ పార్టీ ఏమేరకు విజయం సాధిస్తుందనేదే గడ్డు ప్రశ్న. పైగా సెల్ఫ్ గోల్ వేసుకోవడం నుంచి బయటపడకపోతే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే. సార్వత్రిక ఎన్నికల తొలి దశ ఓటింగ్ జరగడానికి రెండు వారాల సమయం మాత్రమే ఉన్న స్థితిలో కాంగ్రెస్ సమర సన్నాహం స్థితీ గతి ఏమిటి? దాని సేనాధిపతులూ, సైనికుల్లో ఉత్సాహం ఏ మేరకు ఉంటోంది? మోదీ ప్రభుత్వం అత్యంత అవినీతికరమైనదనీ, అసమర్థమైనదనీ, ప్రజలను విడదీస్తోందని, దేశచరిత్రలోనే అది అత్యంత విధ్వం సకరమైనదని కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ చెబుతుండటం మనకు తెలుసు. కానీ ఈ ఆరోపణలను రుజువు చేయడానికి తాను ఎలా సంసిద్ధమవుతున్నదీ ఆ పార్టీ చెప్పడం లేదు. ఈ వేసవిలో ప్రతి ఓటరుకు ముఖ్యమైన కీలక సమస్యలైన ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, జాతీయవాదం, సామాజిక ఐకమత్య సాధన వంటి అంశాలపై దాని వైఖరి ఎలా ఉంటోంది? ఈ సందర్భంలో నన్ను మరొక ప్రశ్న సంధించనివ్వండి. కాంగ్రెస్ ఈరోజు ఏ స్థితిలో ఉంటోందని మీరు భావిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా అది జీవన్మరణ యుద్ధంవైపు సాగుతోందా? లేక తన పని తాను చేసుకుపోతూ ఆ పని తనకుతానుగా ప్రపంచ వ్యవహారాలను మెరుగుపరుస్తుందని ఆశిస్తూ ఉండే ఎన్జీఓలాగా ఉండబోతోందా? ఇలా ప్రశ్నిస్తే పలువురు కాంగ్రెస్ అభిమానులు ఆగ్రహపడవచ్చు. కానీ వారు తమ ఆగ్రహాన్ని మరోవైపునకు మరల్చాల్సి ఉంది. గత అయిదేళ్లుగా మీ ప్రత్యర్థి మిమ్మల్ని దాదాపుగా చాపచుట్టేశాడు. పైగా చివరి దెబ్బ తీయడానికి గొడ్డలిని వాడిగా సానబెట్టుకుంటున్నాడు. ఇలాంటి స్థితిలో కాంగ్రెస్ మళ్లీ పేలవ ప్రదర్శనే చేసినట్లయితే, ఇప్పటికే నిరాశా నిస్పృహలకు లోనై, నైతిక ధృతిని కోల్పోయి ఉన్న దాని సభ్యులు చాలామంది పార్టీకి దూరమవుతారు. కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చిన రెండు ముఖ్యమైన రాష్ట్రాలు కర్ణాటక (సంకీర్ణం), మధ్యప్రదేశ్ చేజారే అవకాశం కూడా ఉంది. రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మనుగడ సాగించాలంటే అదృష్టాన్ని నమ్ముకోవలసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా ఉండబోతోంది? ఇది ఎప్పటిలాగే పాత పార్టీ నిర్మాణంతోనే ఉండవచ్చు. లేక ఎన్నికల్లో ఎన్నడూ విజయం సాధించలేని, ఎన్నికల్లో అసలు పోటీ చేయలేని కొత్త తరహా స్వయం ప్రకటిత కౌటిల్యులు, మాకియవెల్లీలు, స్వయం ప్రకటిత మహామేధావులతో అది నిండిపోవచ్చు. లేక తమ బాధ్యతలను కూడా వారు కోల్పోవచ్చు. ఏ రాజకీయ పార్టీకైనా సరే ఒకే ఒక లక్ష్య ప్రకటన ఉంటుంది. అదేమిటంటే ఎన్నికల్లో గెలవడం. దీనికి తీవ్రమైన కృషి, నిబద్ధత అవసరం. గెలిస్తే అపారమైన రివార్డులు లభిస్తాయి. ఓడిపోతే దారుణంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కూడా. ఈ పరిస్థితిని ఒక్క మాటలో చెవ్పవచ్చు: జవాబుదారీతనం. చివరకు కాంగ్రెస్‌కు లభించబోయేది ఇదే అని మీరు భావిస్తున్నారా? మీ సమాధానం కాదు అయినట్లయితే, ఆ పార్టీ ఎన్జీవో లాగా ఎందుకు కనిపిస్తోందన్నది నేను వివరిస్తాను. ఎన్జీవోలు కూడా తీవ్రంగా శ్రమిస్తాయి. కానీ వారి లక్ష్యాలు, దృష్టికోణం సీజ న్ను బట్టి లేదా వాటి మార్కెట్ అవకాశాలను బట్టి మారిపోతుంటాయి. గడచిన కొన్నేళ్లుగా కాంగ్రెస్ మరింత ఫ్యూడల్ తత్వంతోనూ, తక్కువ ప్రతిభాతత్వంతో తయారైంది. ఆ పార్టీలో చాలా తక్కువమంది మాత్రమే సమరశీలతను, ఎలక్టోరల్ సామర్థ్యతను కలిగి ఉంటున్నారు. గాంధీలతో సహా దాని పాత రాజవంశం మునిగిపోతున్న దాని ప్యూడల్ కోటలను నిలిపి ఉంచలేకపోతోంది. తమ తమ ప్రాబల్య ప్రాంతాల్లో వీరు పార్టీని విస్తరించలేకపోతున్నారు. పైగా కొత్తగా పస్తున్న ప్రతిభకు వీరు చోటు కేటాయించలేకపోతున్నారు. ఈ పార్టీలో ఉన్న యువ, అద్భుత వ్యాఖ్యాతలు, ప్రతినిధులు చాలా గొప్పవారే. కానీ వీరెవరూ ఎన్నికల పోరాటం చేయలేరు. తమ ప్రతిభలను, సంపదలను ఎన్నికల్లో పణంగా పెట్టలేరు. పైగా వేసవి ఎండను ఎదుర్కోలేరు. దేశం మొత్తం మీద దేనికైనా సిద్ధంగా ఉండే 50 మంది కాంగ్రెస్ నేతల జాబితా తయారు చేయండి మరి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోని అసంబద్ధతను, వైపరీత్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలం. తద్భిన్నంగా చెంచాలు, భజనపరులు పార్టీలో అనేక విపత్తులను తట్టుకుని నిలబడుతుంటారు. మోహన్ ప్రకాష్ అనే వ్యక్తి గురించి మీకు గుర్తుండకపోవచ్చు. ఇతను పాత సోషలిస్టు రాహుల్ గాంధీలా వెలిగిపోయాడు. ఒకదాని వెనుక ఒకటిగా కీలక రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను ఈయనకే కట్టబెడుతూ వచ్చారు. వాటిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూడా ఉన్నాయని గుర్తించాలి. తన బాధ్యతలతో ఈయన చాలా ప్రముఖుడైపోయారు. పార్టీ నాయకత్వానికి ఇష్టుడిగా కూడా మారారు. మొదట్లో ఈయన రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ జయప్రకాష్ నారాయణ్‌గా కూడా వర్ణిస్తూ వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే అతడి గురించి ఒక విషయం మీరు చెప్పవచ్చు. అదేమంటే అతడు నిలకడగా ఉండేవాడు. వైఫల్యాల్లో మాత్రమే అని చేర్చుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలను అతడి గురించి అడగండి. అమీర్‌ఖాన్‌ని 3 ఇడియట్స్ నుంచి ఒక చరణాన్ని మీకు పాడి వినిపిస్తారు. కహాన్ సే ఆయా థా వో, కహాన్ గయా ఉసే ధూన్ధో.. (అతడు ఎక్కడినుంచి వచ్చాడు, ఇప్పుడు అతడిని మనం ఎక్కడ కనుగొనగలం!) అయితే అతడొక్కడే కాదు. రాహుల్ గాంధీ చిరకాల ఇష్టుడు సీపీ జోషీని చూడండి. తాను ముట్టిందల్లా మట్టి అయిపోయంది. తాజా ఉదంతంగా ఈశాన్య భారత్‌లో అతడి వ్యవహారాల గురించి చెప్పవచ్చు. రాహుల్ గాంధీ ఏ టీమ్‌ని ఎలా పిలవచ్చనే అలోచనను నా సహోద్యోగి, ది ప్రింట్ పొలిటికల్ ఎడిటర్ డి.కె. సింగ్ కలిగించారు. అదొక పరాజితుల స్వర్గం. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయినప్పటికీ రాజ్ బబ్బర్ యూపీసీసీ చీఫ్‌గా కొనసాగుతూనే ఉంటారు. అశోక్ తన్వార్ అనే రాహుల్ యువ దళిత్ స్టార్ విషయం చూడండి. హర్యానాలో గత లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపోయినప్పటికీ హర్యానా కాంగ్రెస్ చీఫ్‌గా తన్వార్ కొనసాగుతూనే ఉన్నారు. హర్యానాలో పార్టీ మీడియా చీఫ్ రణదీప్ సింగ్ సుర్జీవాలా ఇటీవలి ఉప ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఇక మధ్యప్రదేశ్‌లో ఒక్కసారి కూడా పోటీ చేయని దీపక్ బబారియా ఆ రాష్ట్ర పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఇక ఆనంద్ శర్మ, జైరామ్ రమేష్ గురించి చెప్పపని లేదు. ప్రస్తుతం రాహుల్ జట్టులోని కీలకమైన సలహాదారులు అత్యంత చురుకైన, ఉన్నత విద్యావంతులు. విశ్వసనీయ సలహాదారు కనిష్కా సింగ్, సమర్థుడైన ట్వీట్ రచయిత నిఖిల్ అల్వా, మాజీ ఉన్నతోద్యోగి కె. రాజు, దళిత శాస్త్రజ్ఞుడు ప్రవీణ్ చక్రవర్తి, సైద్ధాంతిక వ్యవహారాల శిక్షకుడు సచిన్ రావ్, మాజీ బ్యాంకర్ అలంకార్ సవాయ్, సోషల్ మీడియా హెడ్ దివ్యస్పందన తదితరులను చూడండి. వీరిలో ఉమ్మడి లక్షణం మీరు చూడగలరా? దివ్యస్పందన తప్పితే మిగతా వారెవరూ రాజకీయనేతలు కారు. ఈ నవరత్నాలలో తరచుగా దర్శనమిస్తుండే సందీప్ సింగ్ జేఎన్‌యూకి చెందిన మాజీ కార్యకర్త, అతివాద వామపక్ష విద్యార్థి సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకుడు. ఇతడు రాహుల్ ఉపన్యాసాలను రాసి ఇస్తుంటారు. ప్రధాన కార్యదర్శులు, కోర్ గ్రూప్, రాహుల్ కీలక సలహాదారుల విషయానికి వస్తే పిడికెడుమందికే రాజ కీయ అవగాహన ఉంది. వీరిలో కీలకమైన అహ్మద్ పటేల్ పక్కకు తప్పుకున్నారు. అమిత్ షాతో తలపడగలిగే ధైర్యం, ఎత్తులు తెలిసిన ఏకైక కాంగ్రెస్ నేత ఆయన అని మర్చిపోకూడదు. ఎన్నికల సంఘంతో అర్ధరాత్రి వరకూ తలపడి షా స్వంత రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాన్ని ఆయన చేజిక్కించుకున్నారు. గతంలో మనం చెప్పుకున్న మూడు కీలక అంశాల్లో కాంగ్రెస్ పార్టీ దృక్పథం కనీసం మనకు తెలుసు. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవ సాయ సంక్షోభంపై అది దాడిని కొనసాగిస్తూనే ఉంటుంది. అయితే, ఈ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో మనం చెప్పలేం. జాతీయత, భద్రత, ఉగ్రవాదంపై పోరు, విదేశాంగ విధానంపై శామ్ పిట్రోడా కలుగజేసుకునే వరకూ కాంగ్రెస్ మొద్దు నిద్దర పోయింది. మిరాజ్‌లు, సుఖోయ్‌లతో సహా వారు పోరాడుతున్న ప్రతి ఆయుధ వ్యవస్థా తమ ప్రభుత్వాల హయాల్లోనే కొనుగోలు చేసిన వాస్తవాలను కాంగ్రెస్ వారు చెప్పలేరు. మరోవైపు, సులువుగా దొరికిపోయే అంశాలను రాహుల్‌తో చెప్పిస్తున్నారు. ఈ మిరాజ్‌లను తయారు చేసినది హాల్ అనడం అటు వంటిదే. హాల్ ఎప్పుడూ మిరాజ్‌ని తయారు చేయలేదు. దస్సాల్ట్ వాటిని రూపొందించింది. ఇప్పుడు మనం వాడుతున్న వాటిని 1982లో రాహుల్ నానమ్మ తెప్పించినవే. బాస్ చేసిన దాన్ని రీట్వీట్ చేయడం కంటే, రాజకీయాలకు చాలా కఠోర పరిశ్రమ అవసరం. మూడో అంశం సామాజిక సంబంధాలకు ఉండాల్సిన సహనశీలతపై బాగానే మాట్లాడు తున్నారు. కానీ, శబరిమల, ట్రిపుల్ తలాక్, రామ మందిరంపై బీజేపీ అభిప్రాయాలనే మీరూ కలిగివుంటే, మీ ప్రత్యేకత ఏముంది? టి.ఎన్.నైనన్ తన వారాంతపు సమీక్షలో యూపీఏ ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన విజయాలను పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి, మౌలిక వసతులపై ఖర్చు చేయడం, ఆధార్ వంటివి ఇందులో ఉన్నాయని అంటూ కాంగ్రెస్ వీటి గురించి ఎందుకు మాట్లాడదని ప్రశ్నించాడు. వీటన్నిటినీ తానే సొంతం చేసుకోవడంతో పాటు భారత్‌లో కనబడుతున్న ఏ మంచైనా తన ఐదేళ్ల పాలనలోనే వచ్చినట్టు మోదీ చెప్పుకుంటున్నారు. వీటన్నిటినీ కాంగ్రెస్ ఎదుర్కో వలసి ఉంది. ఆ పని చేయకపోతే అది ఒక రాజకీయ పార్టీయా లేక ఎన్జీవోనా అని మీరు అడగవచ్చు. ఎన్జీఓలు కూడా ప్రభుత్వ వ్యతిరేక తతోనే ఉంటాయని భావిస్తుంటారు. దశాబ్దంపాటూ మీరూ ప్రభు త్వంలో ఉన్నారు కదా. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
బెడిసికొడుతున్న మన దౌత్యం
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ యూఎన్ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. చైనా ప్రభుత్వ నియంత్రణలోని మీడియా భారత్‌ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్ ఆ దేశం పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. భవిష్యత్తు పరిణామాలను ముందే అంచనా వేసి వ్యవహరించడంలో చైనా ముందంజలో ఉండగా, వరుస తప్పిదాలతో మోదీ ప్రభుత్వం వెనుకబడిపోయింది. మోదీ విదేశీ విధానంలో కొనసాగుతున్న అయిదు తప్పులు భారత్‌కు సరైన దౌత్య ఫలితాలను అందకుండా చేస్తున్నాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ఉండేదీ, ప్రబలమైనదీ ఏమిటి? భయమా లేక ప్రేమా? ఈ ప్రశ్నకు మీరు మనస్తత్వ నిపుణుడిని సమాధానం అడగాల్సి ఉంది. మరోవైపున రాజకీయ కాలమిస్టు ఏం చేయగలడు కఠిన వాస్తవాలను సేకరించడం తప్ప, కల్పన నుంచి, ప్రచారార్భాటం నుంచి వాటిని వేరుచేయడం తప్ప. వాటి ఆధారంగా ముఖ్యమైన వాదనను ప్రేరేపించడం తప్ప. ఈ వారం ప్రారంభంలో, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకోవడం ద్వారా భారత్‌ను తీవ్రంగా చికాకుపెట్టింది. ఐరాస ప్రయత్నాన్ని చైనా నాలుగోసారి అడ్డుకోవడమే కాదు. చైనా ప్రభుత్వ, కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్‌ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. కమ్యూనిస్టు పార్టీ యాజమాన్యంలోని ‘గ్లోబల్ టైమ్స్’ వ్యాఖ్యాత మరీ మోటుగా భారత్ గురించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహావేశంతో ఉన్న చిత్రాలను చూపిస్తూ నరేంద్రమోదీ ప్రస్తుత పరిస్థితిని తన రాజకీయ ప్రచారానికి వాడుకుం టున్నారని ఆరోపిస్తూ చివరగా ఘోరంగా అవమానిస్తూ ఆ వ్యాఖ్యాత తన వ్యాఖ్యానాన్ని ముగించారు. అదేమిటంటే.. చైనా భారత్ మిత్రురాలే తప్ప దాని జాతీయవాదానికి బందీ కాదు. చైనా ప్రభుత్వం దాని అధికార పార్టీ వాణి ద్వారా తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటింపజేస్తూ, తన దృష్టిలో భారత్‌కి, ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న స్థానమేంటో చూపించిందనడంలో సందేహమే లేదు. ఈ వ్యాఖ్యానం ద్వారా చైనా తన ఊహాన్ భేటీ స్ఫూర్తిని పునర్నిర్వచించింది. మీ దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మీ భూభాగంలో నా సైనిక దళాలు బైఠాయించనట్లయితే, మన మధ్య ఒప్పందాన్ని నేను గౌరవిస్తాను. ఇతరత్రా సందర్భాల్లో మాత్రం పాత నిబంధనలు వర్తిస్తాయి అన్నదే దీనర్థం. చైనా దురహంకార వైఖరిలో కొట్టొచ్చినట్లుగా రెండు స్పందనలు కనబడుతున్నాయి. అవేమిటంటే వాటి స్వరం, వక్కాణింపులే. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్ ‘ఒక దేశం’ పట్ల తన అసంతృప్తిని అలా వ్యక్తపరిచింది. కానీ అమెరికాకు అలాంటి తటాపటాయింపులు ఏమీ లేవు. భారత్ పిరికి ప్రకటన కంటే ఎంతో నిష్కర్షగా, తీవ్రంగా అమెరికన్లు చైనాను పేరెత్తి మరీ విమర్శించారు. భారత్ తన కండపుష్టిని ఇప్పటికీ కోల్పోలేదు. కానీ, ఇప్పుడు అది మరింత జాగ్రత్తగా తన మాటలను, చేతలను ఎంపిక చేసుకుంటోంది. 2019 మార్చి నెలలో అంటే ఎన్నికలకు 2 నెలల ముందు భారత్ తన పట్ల శత్రుపూరితంగా వ్యవహరిస్తున్న చైనా పట్ల అధైర్యంతో వ్యవహరిస్తోంది. అదే సమయంలో ట్రంప్ పాలనలోని స్నేహపూర్వకమైన అమెరికాతో మాత్రం పూర్తి స్వదేశీ వాణిజ్య యుద్ధాన్ని భారత్ ప్రారంభి స్తోంది. మనం చైనా అంటే భయపడుతున్నాం. అదే సమయంలో మన తరఫున మాట్లాడుతున్న దేశంతో పోట్లాడుతున్నాం. మోదీ విదేశీ విధాన సూత్రంలో కొనసాగుతున్న అయిదు తప్పులను మనం ఇక్కడ చూద్దాం. 1. మన వ్యూహాత్మక కూటములను మనం పెద్ద హృదయంతో అభినందించడంలో మన వైఫల్యం: వ్యూహాత్మకంగా ట్రంప్ పాలనలోని అమెరికా మనకు ఎంతో బలిష్టమైన పొత్తుదారు, మిత్రురాలు కూడా. కానీ ట్రంప్‌తో మొదలుకుని అమెరికా పాలనా విభాగంలోని ఉన్నత స్థానాల్లో భారత్ గురించి ఒక అలక్ష్యంలాంటిది ఏర్పడిపోయింది. ట్రంప్‌ను దూకుడు పిల్లాడిగా తోసిపుచ్చడానికి భారత్ తొందరపడుతోంది కానీ అలా ప్రకటించేంత సత్తా మనకుందా? హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్‌పై భారత సుంకాల విషయంలో ట్రంప్ దూకుడు చూసి మీరు నవ్వుకోవచ్చు కానీ స్వదేశంలో వాణిజ్యం విషయంలో భారత్ అమలుచేస్తున్న స్వీయ రక్షణ వైఖరిని ట్రంప్ కూడా తప్పుబడుతున్నారు. దిగుమతి చేసుకుంటున్న ఔషధాలు, వైద్య పరికరాల ధరలను బాగా తగ్గించివేయడం నైతికంగా, రాజకీయపరంగా మంచి నిర్ణయమే. కానీ ఆకస్మికంగా ధరల నియంత్రణ, దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ మీరు ఇలాంటి చర్యలను అమలు చేయగలరా? భారతీయ ఇ–కామర్స్‌లో, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల్లో చైనా పెట్టుబడులను స్వాగతిస్తూనే తమ అమెజాన్, వాల్‌మార్ట్‌లపై యుద్ధం ప్రకటిస్తున్న భారత్.. అమెరికన్లకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. పుల్వామా ఘటన తర్వాత అమెరికా భారత్ పక్షాన నిలిచిన తీరు విశ్వసనీయమైనదే కాగా మరోవైపున మోదీ, ట్రంప్ మధ్య సంబంధాలు, వ్యక్తిగత బంధం విషయంలో అవరోధాలున్నాయి. 2017 నవంబర్ నుంచి వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరగడం లేదు.2018 నవంబర్‌లో బ్యూనోస్ ఎయిర్స్లో జీ–20 దేశాల సదస్సు సందర్భంగా ఇరువురి మధ్య భేటీ కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనకు అనుకూలమైన అంశాలను పరిష్కరించకపోతే ట్రంప్ కనీసం ఫోటోలకు, గంభీరమైన ఫోజులకు సమయం వెచ్చించడానికి కూడా ట్రంప్ ఇష్టపడే రకం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్యపరంగా అమెరికాకు కాస్త అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంవల్ల భారత్ కొంపేమీ మునిగిపోదు కదా! అయినా ట్రంప్ ఏమంత పెద్దకోరికలు కోరారనీ. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికన్ సైన్యాలు పడుతున్న పాట్లు పడమని మనల్ని ట్రంప్ కోరడం లేదు. అలాగే రష్యన్ తయారీ ఎస్–400 క్షిపణి వ్యవస్థలను భారత్ కోరవద్దని ట్రంప్ ఒత్తిడి చేయడం లేదు. పైగా ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవును మూసివేయవలసిందిగా కూడా తను కోరడం లేదు. కొన్ని రకాల సుంకాలపై, వాణిజ్యంపై కాస్త మినహాయింపులను తాను కోరుకుంటున్నారు. తెలివైన నాయకులు ప్రత్యేకించి మిత్రులతో జరపాల్సి వచ్చిన ఘర్షణలను తెలివిగా ఎంచుకుని పరిష్కరించుకుంటారు. ట్రంప్‌తో స్వదేశీ వాణిజ్య యుద్ధరంగాన్ని ప్రారంభించడం ద్వారా మోదీ పెద్దతప్పు చేశారు. 2. అహంకారపూరితమైన అగ్రరాజ్యాలతో ఏకపక్ష బుజ్జగింపు విధానం పనిచేస్తుందన్న తప్పు లెక్క: ఈ అంశాన్ని ఇలా చూద్దాం. అమెరికాతో 60 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య మిగులును ఆస్వాదిస్తూనే భారత్ మరోవైపున అమెరికాతో వాణిజ్య సంబంధాలను ప్రతిష్టంభనలోకి నెట్టివేసింది. కానీ చైనాతో మనకు 60 బిలియన్ డాలర్ల లోటు వ్యాపారం ఉంటున్నప్పటికీ ఆ దేశానికి పూర్తిగా అనుమతులు ఇచ్చేస్తున్నాం. చైనా సరకులకు, పెట్టుబడులకు విస్తృతంగా మన మార్కెట్లను తెరవడం వెనుక, భారత్ పట్ల చైనా వ్యూహాత్మక విధానాన్ని మెత్తపర్చే ఆలోచన ఉందేమో. కానీ మనమనుకున్నట్లు ఏమీ జరగలేదు. రెండేళ్ల క్రితం చైనీయులు డోక్లామ్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్లు పంపిస్తున్న సందేశం కూడా మోటుగానే ఉంటోంది. మీరు ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంలో మేము డోక్లామ్ లేక చుమార్ ఘటనలను పునరావృతం కానివ్వకూడదనుంటే థాంక్యూ అనే నోట్‌ను మాకు పంపిం చండి. అమెరికా నుంచి అన్నీ వదులుకోవాలని మోదీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే, చైనానుంచి అన్నీ తీసుకో అనే విధానాన్ని చేపడుతోంది. ఒక దేశాన్ని తక్కువగా చూడటం మరోదేశం ముందు భయంతో సాగిలబడటం అనే విధానమే ఇది. 3. వ్యక్తిగతీకరించిన విదేశీ విధానం పట్ల వ్యామోహం: మోదీకి ప్రజాకర్షణ మిన్న. కానీ వృత్తినైపుణ్యంతో కూడిన దౌత్యానికి సన్నద్ధమవడానికి, దాన్ని కొనసాగించడానికి ప్రజాకర్షణ మాత్రమే సరిపోదు. దీనికి అంతర్గత చర్చ, సంప్రదింపుల ద్వారా విధానాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర నేతల వ్యక్తిగత శైలి, వైఖరులు కూడా వ్యత్యాసంతో ఉంటాయి. మోదీ మంత్రిమండలి కంటే మరింత ప్రతిభావంతంగా పనిచేసే వ్యవస్థను జిన్‌పింగ్ నిర్మించుకున్నారు. మోదీ చైనా అధ్యక్షుడితో తొలిసారి నెరిపిన ప్రేమతో కూడిన భేటీ ప్రయోజనాలు కలిగించలేదని ఇప్పుడు తేలిపోయింది. తర్వాత గ్జియాన్, ఊహాన్ ఇతర చోట్ల కూడా ఇదే కొనసాగింది. మన రిపబ్లిక్ డేకి ట్రంప్‌ను ఆహ్వానించడంలో, నవాజ్ షరీఫ్‌తో విఫల కౌగిలింతలో వేసిన తప్పటడుగులు మనం సరైన హోంవర్క్ చేయలేదని తేల్చేసింది. 4. తప్పు అంచనాలతో మూల్యం: రాజకీయాలు, దౌత్యం, యుద్ధం, క్రీడలు, జూదం అన్నింట్లో సరైన అంచనా చాలా విలువైనది. ఇక్కడే మోదీ తప్పు చేశారు. ఎన్నికలకు ముందుగా మోదీ మరొక దాడికి దిగబోతున్నట్లుగా చైనాకు తెలుసు. పాకిస్తాన్‌పై దాడి చేసి వెనువెంటనే విజయం సాధించామని మోర విరుచుకున్నట్లుగా చైనాతో మోదీ వ్యవహరించలేరని చైనా నేతలకు తెలుసు. సరైన అంచనా వేయడమే చైనీ యులు చేసే మొదటిపని. 5. దేశీయ రాజకీయాలతో విదేశీ విధానాన్ని మిళితం చేయడం: మోదీ స్వదేశంలో ప్రతిష్ట పెంచుకోవడం కోసం తరచుగా తన విదేశీ విధానాన్ని, సదస్సులను ఉపయోగించుకుంటూ ఉంటారు. సరిగ్గా దీన్నే చైనీయులు మొదటగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎన్నికల సీజన్లో మరొక దాడి జరగొచ్చన్న భారతీయ భయాందోళన చైనాకు తెలుసు. అందుకే ఊహాన్‌లో తమనుంచి భారత్‌కు హామీ ఇచ్చారు కానీ తమ ఆంక్షల ప్రకారమే ఇచ్చారు. చైనా వాణిజ్య ఆధిపత్యం పెరుగుతోంది. అరుణాచల్, పాకిస్తాన్ వ్యవహారాల్లో వారి దృక్పథం మరింత కఠినంగా మారింది. కానీ భారత్ మాత్రం చైనా పేరు కూడా ఎత్తడానికి సాహసించకుండా మసూద్ అజర్ విషయంలో నంగినంగిగా నిరసన తెలుపతోంది దీనివల్లే భారత్ ఎక్కడుండాలో అక్కడే చైనా ఉంచగలుగుతుంది. మొత్తంమీద చూస్తే ఇది మోదీ అయిదేళ్ల పాలనపై విదేశీ విధాన సమతుల్యతా పత్రం కాదు. ఇది మోదీ తీవ్ర తప్పిదాలు, వాటి పర్యవసానాల చిట్టా మాత్రమే. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
యుద్ధ వాగాడంబరం ప్రమాదకరం
ప్రతీకారం తీర్చుకోవడమనే భావన ఒక తెలివితక్కువ వ్యూహాత్మక భావోద్వేగం మాత్రమే. ప్రతీకారం మూర్ఖుల వాంఛ కాగా వివేకవంతులు చర్చకు, సంయమనానికి ప్రాధాన్యత ఇస్తారు. భారత్, పాక్ ఇరుదేశాల ప్రజల భావోద్వేగాలు సరేసరి. ప్రధాని సైతం బహిరంగ సభలో భారీ జనసందోహం మధ్య తన ఛాతీని గట్టిగా తడుతూ తన విధి తనను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎక్కువగా వేచి ఉండకుండా చేస్తోందని ప్రకటించడం పరిణతికీ, వివేచనకు చిహ్నం కాదు. యుద్ధోన్మాద రాజకీయాలకు సైనిక బలగాలను బలి తీసుకోవడం ఏమంత తెలివైన పని కాదు. ‘కిత్నే ఆద్మీ థీహై’ (అక్కడ ఎంతమంది శత్రువులున్నారు) అంటూ హిందీ సినిమాల్లో అతి భయంకరుడు, అదే సమయంలో ఆరాధనీయుడైన విలన్ గబ్బర్ సింగ్ మత్తులో ఊగుతున్న తన అనుచరులను ప్రశ్నించాడు. 1975లో రమేష్ సిప్పీ తీసిన క్లాసిక్ సినిమా షోలే లోనిదీ దృశ్యం. రెండు వారాల క్రితం భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన ఆ ‘90 గంటల యుద్ధం’ నేపథ్యంలో ఆ సినిమాలోని సంభాషణను మళ్లీ ఉపయోగిస్తున్నాను. లేదా, ఫిబ్రవరి 27 పరిణామాల అనంతరం మన రాజకీయ వ్యూహ ప్రక్రియ గబ్బర్‌సింగ్ తత్వంలోకి అడుగుపెడుతుండంలోని అవివేకాన్ని వర్ణించడానికి ఆ డైలాగ్‌ను వర్ణిస్తున్నాను. పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడుల సంచలనం సద్దుమణిగిన తర్వాత కూడా, ఇప్పుడు మూడు ప్రశ్నలు మిగిలే ఉన్నాయి: మన బాంబులు/క్షిపణులు జైషే శిబిరాలపై దాడి చేశాయా లేదా? దాడి చేసి ఉంటే అవి ఎంతమందిని చంపాయి (అందుకే ఎంతమంది శత్రువులు ఉన్నారు అని ప్రశ్న)? మూడో ప్రశ్న. భారతీయ యుద్ధ విమానం పాకిస్తాన్‌కి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిందా లేదా? ఈ ప్రాథమిక అంశాన్ని ఇది విస్మరిస్తోంది. పైన లేవనెత్తిన మూడు ప్రశ్నలూ ప్రతీకార మానసికధోరణినే ప్రతిబింబిస్తున్నాయి. మన దేశం పరిమాణం, శక్తి, మనపై ఉన్న బాధ్యత రీత్యా చూస్తే ఇలాంటి ధోరణి నిజంగా దురదృష్టకరమైనది. అందుకే ఈ తత్వాన్ని గబ్బర్‌సింగ్ తత్వం అని పిలుస్తున్నాం. చివరకు మన ప్రధాని నరేంద్రమోదీ సైతం బహిరంగ సభలో భారీ జనసందోహం మధ్య తన ఛాతీని గట్టిగా తడుతూ తన విధి తనను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎక్కువగా వేచి ఉండకుండా చేస్తోందని ప్రకటించడం ద్వారా ఈ గబ్బర్‌సింగ్ తత్వానికి మరింత ఆజ్యం పోశారు. ఇది భారత వ్యూహాత్మక ప్రతిస్పందన ప్రమాదకరమైన రాజకీయీకరణకు స్పష్టమైన సంకేతం. ఇక రెండో అంశం. పాకిస్తాన్‌ని నిరోధించడానికి మీరు చేసినది సరిపోదన్న భావనకు ఇది స్పష్టమైన అంగీకారం. వైమానిక దాడిపై మన ప్రచారార్భాటాన్ని నేను మరీ ఎక్కువగా విమర్శిస్తూండవచ్చు కానీ వాగాడంబరం కూడా మీ అవకాశాలను పరిమితం చేయవచ్చని మర్చిపోవద్దు. మరోవైపున, ఈ సాహసోపేతమైన వైమానిక దాడులు ఇరుదేశాల మధ్య యుద్ద నియంత్రణకు తోడ్పడలేదని మన ప్రధాని భావిస్తున్నట్లయితే, మన ఉపఖండం ఎదుర్కోబోయే తాజా పరిస్థితి భారత్ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగానే ఉండవచ్చు. ఉగ్రవాదం–ప్రతీకారం–మళ్లీ ఉగ్రవాద పురోగతి, దాన్ని మళ్లీ దెబ్బతీయడం అనే క్రమం రెండడుగులు ముందుకు నడుస్తున్నట్లు కనిపించవచ్చు కానీ ఆధీన రేఖ పొడవునా దశాబ్దాలుగా వృధాగా సాగుతున్న రక్తపాత చర్యల కంటే ఇదేమంత భిన్నమైనది కాదు. తేడా అల్లా ఏమిటంటే గతంలోవలే చిన్న ఆయుధాలు, మోర్టార్లు, స్నైపర్ రైఫిల్స్, కమాండో–కత్తులు ఉపయోగించడానికి బదులుగా ఇప్పుడు యుద్ధ విమానాలు, మారణాయుధాలను ఉపయోగించడమే. రక్షణరంగ మేధావులకు, తరుణ వయస్కులకు ఇది సాహసకృత్యంగా కనిపించవచ్చు. దురదృష్టవశాత్తూ ఇది మనకు ఓటమి కాకపోవచ్చు కానీ మన వ్యూహా త్మక ప్రయోజనాలతో రాజీపడుతోంది. అనుకూలాంశాలను ముందుగా వెలికి తీద్దాం. గతంలో పార్లమెంట్‌పై దాడి, ముంబైలో ఉగ్రవాదుల నరమేధం వంటివి పుల్వామా దాడి కంటే భీకరంగా సాగి రెచ్చిగొట్టినా భారత్ ప్రతీకార చర్యలకు దిగలేదు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ భారత్ ఇలాగే స్పందిస్తుందని అందరూ అంచనా వేసేవారు. ప్రపంచం కూడా విసుగెత్తిపోయింది. అందుకే ప్రత్యక్ష ప్రతీకారం ఇప్పుడు తార్కిక ఎంపిక అయిపోయింది. ప్రత్యేకించి బాలాకోట్‌పై వైమానికి దాడులు పాకిస్తాన్‌కు మూడు ముఖ్యమైన సందేశాలను పంపాయి. ఒకటి.. సహనంతో కూడిన పలు ఘటనల తర్వాత, పుల్వామాలో ఉగ్రవాదుల మతిహీన చర్యకు ప్రతిచర్యగా పాకిస్తాన్ భూభాగంలోనికి దూసుకొచ్చి భారత్ దాడి చేయగలదని స్పష్టమైంది. ఈ కోణంలో 1990 తర్వాత పాకిస్తాన్ చూపుతున్న అణ్వాయుధ బూచి గాలికెగిరిపోయింది. ఉగ్రవాదం ముగియలేదు కానీ, పాకిస్తాన్ ఈ కొత్త వాస్తవాన్ని పరిగణించాల్సిన పరిస్థితిని చవిచూస్తోంది. రెండు.. అలాంటి ప్రతీకారాన్ని తీసుకునే శక్తి, రహస్య సైనిక చర్యల గోప్యతను నిర్వహించే సామర్థ్యం భారత్‌కు ఉంది. ఇక మూడోది.. భారత్‌కు ప్రతీకార దాడులు చేసే హక్కు ఉందని ప్రపంచంలోని కీలకశక్తులు ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. తదనుగుణంగా భారత్ కూడా తన వైపునుంచి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మనం ఆటను ఇలా ముగించాం. కాని దీనిలోని ప్రతికూలాంశాలను కూడా మనం పరిగణించాలి. ఇక్కడ సైతం మూడు ఉదాహరణలు ఉన్నాయి. దాడులు, ప్రతిదాడులు, భారత్ స్పందన అనేవి ఇరుదేశాల మధ్య సాంప్రదాయిక అసమానత్వం అనుకున్నంత బలంగా లేదని తేల్చిపడేశాయి. టెక్నాలజీ, ఆయుధాలు, సమర్థత వంటి అంశాల్లో ఈ రెండు పక్షాలూ కొన్ని సందర్భాల్లో తప్పితే దాదాపు సమాన స్థితిలో ఉంటున్నాయి. కానీ యుద్ధం చాలాకాలం కొనసాగినట్లయితే, భారత్ సులభంగా పాకిస్తాన్‌ను అధిగమించగలదు. క్లుప్తంగా చెప్పాలంటే భారత్ పాకిస్తాన్‌పై సాంప్రదాయకమైన ఆధిక్యతను కలిగి ఉంది. కాని ఆ దేశాన్ని కఠినంగా దండించే పరిస్థితి భారత్‌కు లేదు. కాందహార్ హైజాక్ ఘటనలో లాగే భారతీయ ప్రజాభిప్రాయం ఒక బలహీనమైన లింకుగా మళ్లీ నిరూపితమైంది. పాకిస్తాన్ కస్టడీలో ఒక భారత యుద్ధ ఖైదీ ఉన్నంతమాత్రానే అటు ఇటో తేల్చుకునే యుద్ధం చేయాల్సిందే అంటూ ప్రజలు ఉన్మాదంతో ఊగిపోయారు. గగనంలో సంకులయుద్ధం జరిగిన సాయంత్రానికి ‘అభినందన్‌ని వెనక్కు తీసుకురండి’ స్థానంలో ‘పాకిస్తాన్‌ని శిక్షించండి లేక నలిపివేయండి’ వంటి హ్యాష్‌టాగ్‌లు ట్విట్టర్లో వెల్లువెత్తాయి. ఉడీ తరహా సినిమాల్లో ప్రదర్శితమయ్యే ‘స్వదేశాభిమాన యుద్ధోన్మాదం’ తలకెక్కిన భారతీయ ప్రజారాశులు నిజమైన యుద్ధంలో ఇరుదేశాలూ లేక ఇరుపక్షాలూ నష్టపోతాయనే వాస్తవాన్ని విస్మరించాయి. కొన్నిసార్లు మనమే ఎదురుదెబ్బ తినొచ్చు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రస్తుత సంక్షోభం ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా పాకిస్తాన్ పట్ల కాస్త సహనంతో, తక్కువ దండనాత్మక దృష్టితో కొత్త దృక్పథంతో వ్యవహరించాల్సి ఉందనే పాఠాన్ని భారత్‌కు నేర్పింది. కాబట్టి భారతీయ నాయకులు ఏదైనా విజయాన్ని సాధించడంపై మొదటగా దృష్టి పెట్టి తర్వాతే భావోద్వేగానికి స్థానం కల్పించాలి. ప్రస్తుత సంక్షోభం తాలూకూ పరిణామాలు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే సంభవిస్తాయి. చరిత్ర విరామాన్ని కోరుకోదు. అలాగే పాకిస్తాన్ వైఖరిని సులభంగా సంస్కరించడం కష్టం. వాస్తవానికి ఇది కొత్త ప్రమాణం అయితే పాకిస్తాన్, అంతర్జాతీయ సమాజం కూడా దాన్ని ఉపయోగించుకుంటాయి. నేను దాడి చేస్తాను, దానికి మీరు ప్రతిదాడి చేస్తారు, తర్వాత నేను ప్రతీకారానికి దిగుతాను. ఇద్దరం ఏదో ఒక అంశాన్ని పట్టుకుని ఘనంగా ఇంటికి వెళతాం. దీంతో తమ తమ జాతీయ సైన్యాలను ప్రేమిస్తూనే, పెద్దగా విశ్వసించని ఇరుదేశాల ప్రజల ముందూ విజయాన్ని ప్రకటించుకుని మురిసిపోతాం. అందుకే యుద్ధం అంటే ఏమిటో ప్రభుత్వం తన ప్రజలకు అర్థం చేయిం చగలగాలి. గగనయుద్ధంలో పూర్తి నియంత్రణ సాధించే అమెరికన్ యుద్ధ, డ్రోన్ దాడుల వీడియో దృశ్యాలు చూసి మనలో చాలా మందిమి మతిపోగొట్టుకున్నాం. లేక ఉడీ సినిమాల్లో చూపించేటటువంటి మూర్ఖపు యుద్ధ సన్నివేశాలను బాగా తలకెక్కించుకున్నాం. కానీ వాస్తవంగా జరిగే యుద్ధం చిన్నపిల్లల టాయ్ షాపులోకి అడుగెట్టడమంత సులభం కాదు. మన సైనికులు సన్నీ డయోల్ లేక విక్కీ కౌశల్ వంటి అసమానధీరులు కావచ్చు కానీ అదే సమయంలో పాకిస్తానీ సైనికులు జానీ వాకర్ తరహా వంటివారు కాదు. వారు కూడా యుద్ధంలో భీకరంగా పోరాడే తత్వం కలవారే. వారు కూడా తమ మాతృభూమి పుత్రులే. భారత వృత్తిగత సైనికులు పాక్ సైనికులను తేలిగ్గా చూడటం లేదు. అందుకే వారు నిజమైన యుద్ధాల్లో గెలుస్తున్నారు. కానీ ప్రజల మనస్సుల్లో ఈ వాస్తవ చిత్రణను చొప్పించాల్సిన బాధ్యత మన నేతలపైనే ఉంది. కాని తమ యుద్ధోన్మాద రాజకీయాలకు సైనిక బలగాలను బలి తీసుకోవడం ఏమంత తెలివైన పని కాదు. చివరగా యుద్ధం కంటే యుద్ధాన్ని నివారించే, నిరోధించే తరహా వ్యూహం ఉన్నతమైనది. మన వ్యూహం పాకిస్తాన్‌ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. కాకుంటే ఇరుదేశాలూ సరికొత్త ఉప–అణు నిరోధకతకు సన్నద్ధం కావాలి. నీవు నిరంతర ఘర్షణాత్మక యుద్ధంలో ఓడిపోతావని భారత్ పాకిస్తాన్‌కు చెప్పగలగాలి. సైనిక ఘర్షణల్లో నీవు గెలవవచ్చు కానీ ఆర్థికంగా నీకే ఎక్కువ నష్టం సంభవిస్తుందని పాక్ కూడా భారత్‌కు చెప్పగలగాలి. కాబట్టి ఇరుదేశాలకు ఒకే దారి ఉంది. మొత్తం జీడీపీలో రక్షణ బడ్జెట్‌ని 2 శాతానికే పరిమితం చేయాలి. అంటే ప్రస్తుతం ఇరుదేశాలు వెచ్చిస్తున్న రక్షణ రంగ బడ్జెట్లో ఇది 25 శాతం మాత్రమే. అలాగే సైనిక బలగాలను సంస్కరించాలి. సాంప్రదాయికమైన, నిర్ణయాత్మకమైన దండనా చర్యలకు వారిని సన్నద్ధం చేయాలి. ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న 12 బిలియన్ డాలర్ల రుణ భారం వారిని తిరిగి ఆలోచింపజేస్తుంది. ప్రపంచంలోనే ఉత్తమమైన సైన్యాలు ఒకప్పుడు అతిశక్తివంతంగానూ, ఆధిపత్యంతోనూ ఉండేవే. వాటిని మనం ఇంతవరకు ఉపయోగించుకోలేదు. భారత్ అలాంటి ఉత్తమ సైన్యాల్లో ఒకటి కావచ్చు కూడా. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
జనం నాడి ఏం చెబుతోంది?
ఎన్టీయే కూటమి ఎంపీ సీట్ల సంఖ్య తగ్గనున్నట్లు ఓపీనియన్ పోల్స్ చెబుతున్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీజేపీకే వస్తాయని, పైగా కేంద్ర ప్రభుత్వంపై అసమ్మతి ఉన్నప్పటికీ మోదీ వ్యక్తిగత ప్రజాదరణ, చరిష్మా చెక్కుచెదరలేదని జనాభిప్రాయం. కాంగ్రెస్ సొంతంగా, మిత్రపక్షాల దన్నుతో అధికారం చేపట్టే పరిస్థితీ కనబడలేదు. ఈ రెండు కూటములకు భిన్నంగా ఇతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చే పరిస్థితి కూడా లేదు. ప్రజల నాడి వ్యక్తిగతంగా మోదీ వైపే మొగ్గు చూపుతున్న ఈ నేపథ్యంలో మోదీ తిరిగి ప్రధాని కాగల అవకాశం ఒక్క మాయావతి ద్వారానే సాధ్యం. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ప్రత్యర్థి శిబిరం నుంచి బుజ్జగించో, బతిమాలో లాగేయవలసిన ముఖ్య పార్శ్వంలో ఆమె ఉన్నారు. పైగా, తొలిసారి ఓటు వేయబోతున్న పదమూడు కోట్లమంది యువ ఓటర్లు మోదీకి పెట్టని కోటలాగా ఉన్నారు. జర్నలిస్టులు ఎన్నికల ఫలితాలను అంచనా వేసినప్పుడు సాధారణంగా ఆ అంచనాలు తప్పుతుంటాయనేది అందరూ ఆమోదించే వాస్తవమే. పైగా పాత్రికేయులందరూ ఒకేవిధమైన అభిప్రాయం వెల్లడించినప్పుడు కచ్చితంగా దానికి వ్యతిరేక ఫలితాలు రావడం తప్పనిసరిగా జరుగుతుంటుంది. ఒపీనియన్ పోల్స్ కూడా ప్రమాదకరమైనవే కానీ, మన జర్నలిస్టుల కంటే అవి మెరుగైనవేనని చెప్పాలి. అయితే ఒపీనియన్ పోల్స్ కూడా ఒకే రకమైన ఫలితంపై ఆమోదం తెలిపినప్పుడు ఏం జరుగుతుంది? ఇది పలు ఒపీనియన్ పోల్స్ వెలువడుతున్న వారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, దేశంలో హంగ్ పార్లమెంట్ తప్పదనీ, బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, కాంగ్రెస్ తర్వాతి స్థానంలో నిలిచినా, బీజేపీ సాధించే స్థానాల్లో సగం మాత్రమే సాధిస్తుందని, దీంతో మళ్లీ నిజమైన సంకీర్ణ ప్రభుత్వం తప్పదని ఒపీనియన్ పోల్స్ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. రాజకీయాల్లో ఏదీ స్థిరంగా ఉండిపోదు. అయినప్పటికీ, మనం కొన్ని ముఖ్యమైన ధోరణులను పసిగట్టగలం. ఆ పోల్స్ నుంచి విస్తృత స్థాయి నిర్ధారణలను జాగ్రత్తగా చేయగలం. 1. కొట్టొచ్చినట్లు కనిపించే సూచిక ఏదంటే, 2014లో సాధించిన మెజారిటీ బీజేపీకి రానప్పటికీ, ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత ప్రజాదరణ నేటికీ చెక్కుచెదరలేదు. పైగా 2014లో బీజేపీ సాధించిన 31 శాతం ఓట్లతో పోలిస్తే ఇప్పుడు ఒక్క శాతం మాత్రమే తగ్గిపోనున్నట్లు ఇండియా టుడే పోల్ సర్వే సూచిస్తోంది. ఇది నిజంగానే గుర్తించదగిన విషయం. మోదీ ఒరిజినల్ ఓటర్లలో గణనీయంగానే అసంతృప్తి ఉంటున్నప్పటికీ, 1996 తర్వాత పుట్టి, లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓట్లు వేయబోతున్న 13 కోట్లమంది ఓటర్లు మోదీపై వ్యక్తం చేస్తున్న తిరుగులేని ఆరాధన ద్వారా ఆ అసంతృప్తిని పూరించుకోవచ్చు. మోదీపట్ల అసంతృప్తి చెందుతున్న ఆయన అసలైన ఓటర్లకు, ఈ సరికొత్త ఓటర్లకు మధ్య ఉన్న తేడా ఏమిటంటే ఈ కొత్త ఓటర్లు జాబ్ మార్కెట్లో ఉద్యోగాలు పొందని స్థితికి ఇంకా వెళ్లలేదు. ఈ 13 కోట్ల మంది ఓటర్లు మోదీ శక్తి, ప్రజాకర్షణ పట్ల ఇప్పటికీ మంత్రముగ్ధులవుతూనే ఉన్నారు. అలాగే స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా వంటి మోదీ పథకాలతో పాటు, అవినీతిపై యుద్ధం, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరుగుతుండటం వంటి అంశాలపై జరుగుతున్న విస్తృత ప్రచారాన్ని వీరు విశ్వసిస్తూనే ఉన్నారు. మోదీకి వ్యతిరేకంగా బలమైన ప్రచార కథనాలు కానీ, లేదా నిరుద్యోగుల తీవ్ర నిరాశా నిస్పృహలు కానీ వీరి దృష్టిలో ఇప్పటికీ పడటం లేదు. 2. 2017 జనవరిలో పెద్దనోట్ల రద్దు తర్వాత మోదీని శిఖరస్థాయిలో నిలి పిన పోల్ సర్వే తర్వాత నిర్వహించిన పోల్ సర్వే నంబర్లను పోల్చి చూసినట్లయితే బీజేపీ పట్ల సానుకూలత తగ్గుముఖం పట్టినట్లు స్పష్టంగానే అర్థమవుతుంది. క్రమక్రమంగా అది క్షీణిస్తూ గత రెండేళ్లలో మూడింట ఒక భాగం సీట్లను బీజేపీ కోల్పోతున్నట్లు వ్యక్తమైంది. ఇలాగే కొనసాగితే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్య మరో 25 నుంచి 40 స్థానాల వరకు క్షీణించిపోతుందని తార్కికంగానే అంచనా వేయవచ్చు. మరి ఈ పరిణామాన్ని నరేంద్రమోదీ అడ్డుకుని పార్టీకి మళ్లీ పూర్వ వైభవంవైపు తీసుకుపోగలరా? భారతీయ ప్రజాభిప్రాయాన్ని దాని వైవిధ్యత, సంక్లిష్టతల సమేతంగా దర్శించినట్లయితే, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని బోధపడుతుంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రక్రియ మొదట్లో కాస్త నిదానంగానే సాగవచ్చు కానీ, ఒక్కసారి అది తన లక్ష్యం వైపు ప్రయాణించిందంటే దాని గమ్యాన్ని ఎవరూ మార్చలేరు. దాన్ని వెనక్కు మళ్లించడం దాదాపు అసాధ్యమే అవుతుంది. నరేంద్రమోదీకి ఈ విషయం బాగా తెలుసు కూడా. పొంచి ఉన్న ప్రమాదం పొడసూపుతోంది కాబట్టే, మోదీ శిబిరం మౌలికమైన, నమ్మశక్యం కాని స్థాయిలో ప్రజాకర్షక చర్యలకు సన్నద్ధమవుతోంది. అగ్రకులాల్లోని ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు, అన్ని ప్రైవేట్ సంస్థల్లో కోటాల నుంచి మొదలుకుని అవినీతిపరులు, పలుకుబడి గలవారిపై చివరి క్షణంలో సీబీఐ దాడులకు రంగం సిద్ధం చేయడం వీటిలో కొన్ని మాత్రమే. వచ్చేవారం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్లో మరికొన్ని తాయిలాలు ఉంటాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 180 కంటే తక్కువ సీట్లు వచ్చాయంటే ప్రభుత్వ అవకాశాలకు తెరపడినట్లేనని నరేంద్రమోదీ, అమిత్ షాలకు తెలుసు. రూపొందుతున్న ప్రజాభిప్రాయం అనే ఈ నిర్నిరోధక శక్తి గమనాన్ని వచ్చే 100 రోజుల కాలంలో వీరిద్దరూ మార్చగలిగినట్లయితే అది అసాధారణ విజయమే అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని దూకుడుతనంతో కూడిన మౌలిక ప్రకటనలు తప్పకుండా వస్తాయి. బీజేపీ రక్షణ పంక్తి ఏదంటే ఏమాత్రం చెక్కుచెదరని ఆలోచనలతో కూడిన 13 కోట్లమంది తొలిసారి ఓటేయబోతున్న ఓటర్లు మాత్రమే. 3. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మినహా మిగిలిన దేశమంతటా బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఎంపీ స్థానాలు ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. దీనికి భిన్నంగా ఉత్తరప్రదేశ్‌లో మాత్రం బీజేపీ ఈసారి 45 నుంచి 55 ఎంపీ స్థానాలను కోల్పోతున్నట్లు పలు ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తగి లిన ఎదురుదెబ్బలను చూస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఈసారి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం కాకున్నా, బీజేపీ ఇక్కడ సాధించే స్థానాల విషయంలో ఊగిసలాట తప్పదనిపిస్తోంది. ఉత్తర భారతంలో బీజేపీకి కలిగే నష్టాల్లో కొన్నింటిని తూర్పు, ఈశాన్య భారత్‌లో పూడ్చుకోవచ్చన్నది తీసిపారేయలేం. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీజేపీని మెజారిటీకి దూరం చేసే బలమైన కారణాల్లో ఒకటి కాబోతోంది. ఈ పరిణామాన్ని వెనక్కు తిప్పే యుక్తిని బీజేపీ కనుగొనగలదా? 4. మరోవైపున కాంగ్రెస్ పార్టీ పునరుత్థానం చెందుతోంది. దాని పునాదిపై ఈ పార్టీ సాధించే శాతాన్ని పోలిస్తే, బీజేపీ పొందనున్న నష్టాల కంటే పెను లాభం కాంగ్రెస్‌కి సిద్ధించనుంది. తేడా ఏమిటంటే, కాంగ్రెస్ పునాది బలహీనంగా ఉంది. కాబట్టే దాని బలం 200 శాతం మేరకు పెరిగినప్పటికీ అది కాంగ్రెస్‌కు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 140 స్థానాలలోపే తీసుకురానుంది. ప్రస్తుత ఒపీనియన్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌కు 100 సీట్లు మాత్రమే రానున్నాయి. నరేంద్రమోదీ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చలేరని భావించినప్పటికీ, కాంగ్రెస్ పరిస్థితిలో గణనీయంగా మార్పు వస్తుందని చెప్పలేం. మోదీ అధికారంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ పెట్టుకునే ఉత్తమమైన ఆశాభావం ఏదంటే ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినటువంటి దేశం నడిగడ్డలోని మూడు కీలక రాష్ట్రాల్లో వీలైనన్ని ఎంపీ సీట్లను అధికంగా సాధించడమే. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే అది సాధించాల్సిన ప్రధాన సంఖ్య 150. తను సాధించే మొత్తం సీట్లను ఈ స్థాయికి పెంచుకోవడం లేదా నరేంద్రమోదీకి వచ్చే స్థానాలను అంతకన్నా తగ్గించడం. ఇవి రెండూ కాకుండా మూడో మార్గం ఏదంటే యూపీఏ శిబిరాన్ని మరింతగా విçస్తృతపర్చి, మరిన్ని ప్రాంతీయ లేక కుల ప్రాతిపదికన ఉన్న పార్టీలను తనవైపు ఆకర్షించడమే. అయితే ఈ పరిస్థితుల్లో ఈ మూడు అంశాలు కూడా అసంభావ్యమే అనిపిస్తుంది. కానీ భారత రాజకీయాల్లో మోదీ చుట్టూ తిరిగే ఏక ధ్రువం లాంటి స్థితికి బదులుగా ప్రధాని పదవికి దగ్గరయ్యేందుకు రెండో ధ్రువం మళ్లీ వెనక్కు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. 5. గతవారం ‘జాతిహితం’లో మనం ప్రస్తుత భారత రాజకీయాల్లో ఒకటి, రెండు ఫ్రంట్లనే కాకుండా ఏర్పడనున్న మూడు, నాలుగు, ఐదో ఫ్రంట్లను గురించి కూడా చర్చించుకున్నాం. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటితో పొత్తులేని పార్టీలకు, వాటి నేతలకు 150 పార్లమెంటు స్థానాలు వచ్చాయంటే గొప్ప రాజీమార్గంలో తామే ప్రధానిగా ఉండాలనే ఆశాభావం చాలామందికి కలిగే అవకాశం కూడా ఉంది కానీ ఇది అంత సాధ్యమైన పని కాకపోవచ్చు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలలో ఏ ఒక్క పార్టీకీ సొంతంగా 50 కాదు కదా 40 ఎంపీ స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలూ 272 మ్యాజిక్ సంఖ్యను చేరుకోలేకపోయినప్పుడు మాత్రమే ఇతర పార్టీల మధ్య అలాంటి భారీ బేరసారాలకు తావు ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఇటీవలి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఈ మే నెలలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపించడం లేదు. అంతిమ పొత్తులు మీరు ఎవరితో పొత్తు కలుపుతారు లేక ఎవరితో పొత్తుకు సిద్ధం కారు అనే అంశంపైనే ఆధారపడి ఉంటాయి. వామపక్షాలు, సమాజ్‌వాది పార్టీ ఎన్నటికీ ఎన్డీయేతో కలవబోవని మనందరికీ తెలుసు. అలాగే అకాలీలు, శివసేన ఎట్టిపరిస్థితుల్లోనూ యూపీఏలో భాగం కావు. ఈ పరిస్థితుల్లో గతంలో మొండివైఖరి లేకుండా కాస్త పట్టువిడుపులు ప్రదర్శించినవారిని చూద్దాం. మమతా బెనర్జీ గతంలో రెండు కూటముల్లోనూ ఉండేవారు. కానీ పశ్చిమబెంగాల్లో ఆమె ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఆధిక్యత వల్ల ఆమె ఎన్డీయే వైపు వెళ్లలేరు. 6. ఇప్పుడు ఇక మాయావతి దగ్గరకు వద్దాం. మోదీ రెండో దఫా అధికారంలోకి రాలేకపోయినట్లయితే మన రాజకీయాల్లో విశిష్టమైన అధికారం చలాయిస్తున్న మాయావతే అందుకు ప్రధాన కారణం అవుతారు. ఆమె గతంలో బీజేపీతో సంతోషంగా గడిపారు. లెఫ్ట్, రైట్ వాదాల మధ్య ఆమె పూర్తిగా భావజాలేతర స్థానంలో ఉన్నారు. మనువాద వ్యతిరేకతే ఆమె ఏకైక భావజాలం అయితే, ఎన్డీయే, యూపీఏ రెండూ ఆమె దృష్టిలో సమానంగా దుష్టశక్తులవుతాయి. అయితే ఆ విషాన్ని ఆమె ఈ రెండింటిలో ఏ పాత్రలోనుంచి అయినా స్వీకరించగలరు. తాము రెండో దఫా అధికారంలోకి రావాలంటే కీలకమైన కార్డు మాయావతి ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్‌లోనే ఉందని మోదీ, షాలకు స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు లేక ఆ తర్వాత తమ ప్రత్యర్థి శిబిరం నుంచి బుజ్జగించో, బతిమాలో, బెదిరించో లాగేయవలసిన ముఖ్య పార్శ్వంలో ఆమె ఉన్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ వెన్నులో గొడ్డలి దిగే పరిస్ధితిని ఊహించలేం కానీ అలాంటి పరిస్థితి సంభవించదని మీరు ఎన్నడూ తోసిపుచ్చలేరు. ముగించాలంటే, మోదీ వ్యక్తిగత ప్రజాదరణ, వోట్ బ్యాంక్ చెక్కుచెదరలేదు కానీ ప్రజాభిప్రాయం మాత్రం ప్రతికూలంగా ఉంది. యూపీలో ఏర్బడిన ఘటబంధన్ మోదీ రెండో దఫా పాలనకు ప్రమాదకారిగా మారుతోంది. కాంగ్రెస్ పురోగమిస్తోంది కానీ అధికారంలోకి వచ్చేంతగా కాదు. 15 లేక అంతకు ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించే ఏ పార్టీ అయినా ఇప్పుడు కింగ్ మేకర్ కాగలదు. కానీ అవి ఎన్నడూ కింగ్ కాలేవు. ఈ పార్టీలకు నూరు స్థానాలు వచ్చిన పక్షంలో అవి ఏ విజేతవైపుకైనా మళ్లవచ్చు. ప్రత్యేకించి మాయావతిని నిశితంగా గమనించాల్సి ఉంటుంది. - శేఖర్ గుప్తా ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మౌనముని మాటల ముత్యాలు
2018 చివరలో, మరొక ఎన్నికల సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్న సమయంలో మన్మోహన్ సింగ్ గురించి కథనాలు రాస్తామని ఎన్నడైనా ఊహించామా? అయన ఇప్పుడు ‘మౌన మోహన్’ కాదు. ఆయన ఇప్పుడు మాట్లాడతారు. చాలా తక్కువగానే కావచ్చు కానీ చాలా పరిణతితో మాట్లాడతారు. యథాప్రకారంగానే ఆయన ఒకటి రెండు వాక్యాలు మాట్లాడతారు. కానీ దేశం మొత్తంగా ఆయన చెప్పేది వినడానికి, స్పందించడానికి సిద్ధమవుతోంది. తక్కువగా మాట్లాడినా ప్రెస్ ప్రశ్నలకు జవాబిచ్చే మన్మోహన్‌కి ఎక్కువగా మాట్లాడుతూ ప్రశ్నలకు జవాబివ్వని ప్రధాని మోదీకి ఉన్న వ్యత్యాసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం విశేషం. జర్నలిస్టులు, విశ్లేషకుల్లో చాలమంది డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజకీయ సంస్మరణ గురించి అయిదేళ్ల క్రితమే రాసేశారు. కొంతమందయితే 2010లో యూపీఏ–2 పతనం ప్రారంభమైన తొలిదినాల్లోనే ఆ పని చేశారు. యూపీఏ–2 ఆటో–ఇమ్యూన్ అనే వ్యాధికి బలైందంటూ నేను కూడా అప్పట్లో పదేపదే రాశాను. మానవ శరీరం తనకు తానే నష్టం కలిగించుకుని తన్ను తాను పరిసమాప్తి చేసుకునేటట్లుగా, కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రభుత్వాన్ని ధ్వంసం చేస్తోందని, మన్మోహన్ సింగ్ అతిత్వరలోనే విస్మృత గర్భంలో కలిసిపోతాడని రాశాను. మనం కాస్త నిజాయితీగా ఉందాం: 2018 చివరలో, మరొక ఎన్నికల సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్న సమయంలో మన్మోహన్ సింగ్ గురించి కథనాలు రాస్తామని మనలో ఎవరమైనా ఊహించామా? అది కూడా గతంపై వ్యామోహంతో సంవత్సరం చివరలో రాయడం కాదు.. ప్రధానిగానో, ఆర్థిక మంత్రిగానో కాకుండా, అనుకోకుండా రాజకీయ జీవితంలోకి ప్రవేశించి అనూహ్యంగా ఎదిగిన వ్యక్తి గురించి మళ్లీ మననం చేసుకుంటున్నాం. ఈ వారం మొదట్లో తన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఇలాగే చెప్పారు. అయన ఇప్పుడు ఏమాత్రం ‘మౌన మోహన్’ కాదు. ఆయన ఇప్పుడు మాట్లాడతారు. చాలా తక్కువగానే కావచ్చు కానీ చాలా పరిణతితో మాట్లాడతారు. యధాప్రకారంగానే ఆయన ఒకటి రెండు వాక్యాలు మాట్లాడతారు. కానీ దేశం మొత్తంగా ఆయన చెప్పేది వినడానికి, స్పందించడానికి సిద్ధమవుతోంది. కానీ తన రెండో దఫా పదవీకాలంలో దేశం ఆయన మాటలను వినలేదు. కానీ ఇప్పుడు ఆయన లాంఛనంగా చేసే ప్రసంగం కూడా వైరల్ అవుతోంది. అది తన ప్రసంగం పూర్తి పాఠం కావచ్చు, నిపుణుడైన రిపోర్టర్ కుదించి పంపిన వార్త కావచ్చు.. ఆయన ఏం చెప్పినా ఇప్పుడు అది వైరల్. కావాలంటే సోషల్ మీడియాలో ట్రెండ్స్‌ని తనిఖీ చేసుకోండి. ఆయన ఇప్పటికీ తన పార్టీకి ఎలెక్షన్ ప్రచారకర్తగా పెద్దగా తోడ్పడింది ఏమీ లేదు. కానీ పార్లమెంట్లో, బయటా తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యంత విలువైన వాణిగా ఉంటున్నారు. ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ చేసిన రాజీనామా ప్రకటనపై ఆయన చేసిన క్లుప్తమైనదే కానీ అత్యంత సునిశితమైన, మర్యాదతో కూడిన వ్యాఖ్య ప్రభావం చూడండి లేక ఈ వారం మొదట్లో తన ఆరు సంపుటాల ఆవిష్కరణ సందర్భంగా చేసిన వ్యాఖ్యను గమనించండి. తనను సింహం తోలు కప్పుకున్న భీరువులాగా కనిపించి ఉండవచ్చు కానీ తాను సైలెంట్ ప్రైం మినిస్టర్‌గా లేనని చెప్పారు. పైగా ప్రెస్ అడిగే ప్రశ్నలకు తాను ఏనాడూ భయపడింది లేదని చెప్పారు. ఇది అత్యంత నైపుణ్యంతో ఎక్కుపెట్టిన రాజకీయ చణుకు. గురి పెట్టింది ఒక చోట అయితే తగిలింది మరొక చోట అనే వైఖరికి ఇది నమూనా. ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేయడానికి తనకున్న బలహీనతను ఉపయోగించడం అన్నమాట. ఆ వాక్యం సారాంశం ఏమిటంటే, నేను ఎక్కువగా మాట్లాడలేను కానీ ప్రశ్నలకు జవాబిస్తాను. మోదీ చాలా మాట్లాడతారు కానీ ప్రశ్నలనుంచి దాక్కుంటారు. ఆయన మాట్లాడిన పదిమాటలపై వ్యాఖ్యానం చేయడానికి నాకు దాదాపు వంద పదాలు అవసరమయ్యాయి. ఈరకంగా రంగమీదికి తిరిగి రావడం అనేది 86 ఏళ్ల వృద్ధుడికి చెడువిషయం కాదు. అందులోనూ ఆయన జీవితకాలం కెరీర్ పొలిటీషియన్ కాదు. తనలోని మోదీని ఉన్నట్లుండి కనుగొని గొప్ప వక్తగా మారిన నేత కాదాయన. కాని తాను చేసిందల్లా తక్కువగా మాట్లాడటం, పదాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆయనకు ఇదే శైలి వుంటూ వచ్చింది. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హర్షద్ మెహతా రూపంలో స్టాక్ మార్కెట్‌ను తొలి కుంభకోణం తాకినప్పుడు పార్లమెంటుకు సింపుల్‌గా తాను చెప్పిందేమిటో తెలుసా. ‘స్టాక్‌మార్కెట్ కోసం నా నిద్రను నేను పాడుచేసుకోను’. కానీ అణు ఒప్పందంపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు గురుగోవింద్ సింగ్ చెప్పిన పంక్తులను అద్భుతంగా వాడుకున్నారు. ‘‘నన్ను ఆశీర్వదించు శివా, నా తుది విజయం సాధించేవరకు పోరాడటానికి నాకు తప్పకుండా శక్తికావాలి’’. తర్వాత ఏదో ఒకరోజు నీవు ప్రధానిగా అవుతావు అంటూ తన జ్యోతిష్కుడు చెప్పిన మాటలను పట్టుకుని జీవితం సాగిస్తున్న అడ్వాణీని ఆయన హేళన చేశారు. 2009లో తన పార్టీకి అధిక స్థానాలను సంపాదించి అధికారంలోకి వచ్చారు. ఆయన బలహీనుడు, పిరికి నేత కాబట్టి జనం సానుభూతితో ఆయనకు ఓటేయలేదు. అయన అంతకుముందే తన ప్రభుత్వాన్ని పణంగా పెట్టి వామపక్షాలకు ఎదురు నిల్చారు. భారత్ వ్యూహాత్మకంగా సంపూర్ణంగా మారాలన్న తాత్విక విశ్వాసానికి మద్దతుగా ఆయన నిలబడ్డారు. అణుఒప్పందం ద్వారా భారత్ నిజంగా దిగుమతి చేసుకున్నది అమెరికాను పూర్తిగా కౌగలించుకోవడమే. నిర్ణాయక క్షణంలో దృఢంగా నిలబడినందుకు ఆయనకు రివార్డు లభించింది మరి. ఆ వెంటనే జరిగిందేమిటి? ప్రధానిగా తనను కించపరిచినప్పుడు, తన కార్యాలయ గౌరవానికి భంగం కలిగించినందుకు ఆయన రాజీ నామా చేయకపోవడం ద్వారా తనను, అభిమానులను కూడా దెబ్బతీసినంత పనిచేశారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో సీబీఏ ప్రశ్నలకు జవాబు చెప్పవలసి వచ్చింది. మోదీ సైతం పార్లమెంటులో మన్మోహన్ని తీవ్రంగా పరహసించారు. తాను పరిశుద్ధంగా ఉన్నానంటూనే తన చేతిమీదుగానే అవినీతిని అనుమతించిన పరిస్థితిని రెయిన్ కోటులోపల షోయర్ కింద నిలబడటంగా మోదీ పోల్చి చెప్పారు. అంతవరకు ఆయన ఒక సాఫ్ట్ టార్గెట్‌గా కనిపించేవారు. కానీ, ఆ తర్వాత మారిందేమిటి? ఈ జీవితంలోకి ఆయన్ని తిరిగి తీసుకొచ్చిందేమిటి? బహుశా 2016 శీతాకాలంలో పెద్దనోట్ల రద్దే కావచ్చు. అప్పుడు కూడా మన్మోహన్ క్లుప్తంగానే మాట్లాడాడు కానీ తన స్వభావానికి విరుద్ధంగా కత్తివాదరలాంటి చిరస్మరణీయ పంక్తిని సంధిం చారు. ‘‘సంఘటిత లూటీ, వ్యవస్థీకృత దోపిడీ.’’ ఆయన తన పార్టీకి ఎంత విలువను తీసుకొస్తున్నారో తొలిసారిగా ఆయన పార్టీ గుర్తించిన క్షణమది. పెద్దనోట్ల రద్దు పరిణామాలు ఆయనకు కొట్టిన పిండే, ఎందుకంటే ఆయన రంగం ఆర్థిక శాస్త్రం. అప్పటికే పెద్దనోట్ల రద్దుపై ప్రపంచ ప్రముఖ ఆర్థిక వేత్తలు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. భారత్‌లో మన్మోహన్ సింగ్ విమర్శను చాలా సీరియస్‌గా పరి గణించారు. తర్వాత ఆర్థిక వ్యవస్థ కుంగిపోవడం మొదలు కాగానే ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు నష్ట నివారణలో భాగంగా డేటాను, గణాంకాలను తారుమారు చేయడం ప్రారంభమైంది. ఒకరకమైన సంక్షోభ భావన అలుముకుంటున్నప్పుడు మన్మోహన్ వాడిన పదాలు భవిష్యసూచకంగా కనిపించసాగాయి. రాజకీయాలు అనబడే సంతలో ఏ ఉత్పత్తికైనా సరే పోల్చి చూపడం తప్పనిసరి. మన్మోహన్ని జాతి మళ్లీ సీరియస్‌గా స్వీకరింజడానికి ఒక కారణం ఏదంటే ఈ చేదురాజకీయాల్లో డిగ్నిటీకి, గౌరవానికి ప్రీమియం విలువ ఉంటూ వస్తోంది. సోనియాగాంధీని నరేంద్ర మోదీ అద్దెకోసం చూస్తున్న వితంతువుగా వర్ణించినప్పుడు, వాచ్‌మన్ లేక ప్రధాని ఒక దొంగ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినప్పుడు, మన్మోహన్ తన విమర్శలో కూడా సభ్యతను పాటించారు. గతంలో నా వాక్ ది టాక్ ఇంటర్వ్యూలో పీవీ నరసింహారావును ప్రశ్నిస్తూ ఆకర్షణ శక్తి లేనప్పటికీ, వక్త కానప్పటికీ, రాజకీయ బలం లేనప్పటికీ మిమ్మల్ని ఎందుకు ముందుపీఠికి తీసుకొచ్చారు అని అడిగాను. ‘‘నేను సాంత్వనను, ఓదార్పును తీసుకొచ్చాను’’ అన్నారాయన. మన్మో హన్ రాజకీయ మార్గదర్శకుడిగా తన పార్టీకి అలాంటి సాంత్వనను తీసుకొచ్చినందుకు ఆయన సంతోషపడే ఉంటారు. కానీ ఈ ఇద్దరు ప్రధానమంత్రుల పదవీవిరమణ అనంతర జీవితాల్లో చాల పెద్ద వ్యత్యాసం ఉంది. పదవి కోల్పోగానే పీవీవల్ల ఇక ఏ ఉపయోగం లేదని కాంగ్రెస్ భావించింది. పైగా పార్టీకి ముస్లిం ఓటును దూరం చేసినందుకు పీవీని పక్కనపెట్టింది. అన్ని కేసుల్లోంచి విముక్తి పొందినవాడిగా, ఒంటరిగానే చనిపోయారు. పీవీకి మల్లే మన్మోహన్ సింగ్‌ను కూడా కాంగ్రెస్ డంప్ చేసేది.కానీ మూడు విషయాలు పరిస్థితులను భిన్నంగా మల్చాయి. ఒకటి గాంధీ ప్యామిలీ ఆయన పట్ల చూపించిన వ్యక్తిగత అభిమానం. రెండోది, అత్యంత నైతికాధికారంతో పెద్దనోట్ల రద్దుపై మన్మోహన్ చేసిన ప్రారంభ ప్రకటన ప్రభావాన్ని వారు గుర్తించారు. మూడు తన హయాంలో వెల్లువెత్తిన అన్ని కుంభకోణాలు వీగిపోతుండటం. నమ్రతా మూర్తి అయిన మన్మోహన్ సింగ్ ఆధునిక చరిత్రలో భారత్‌కు గొప్ప సంపదను సృష్టించి పెట్టారు. 1991 నుంటి డేటా మొత్తాన్ని పరిశీలించండి. ఆయన సంపద పోగు పెట్టలేదు. సంపద సృష్టి పట్ల ఆయనకు దురభిమానం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలమైన స్ఫూర్తితో పునరుద్ధరించిన తొలి ప్రధాని ఆయన. పురోగతి తప్పనిసరిగా అసమానతలను సృష్టిస్తుందని గ్రహించే మేధస్సు కూడా ఆయనకుంది. అలాంటప్పుడే రాజ్యం జోక్యం చేసుకుని సంపదను తిరిగి పంపిణీ చేయాల్సి ఉంటుందని, పేదలను మార్కెట్ల దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టకూడదని కూడా తనకు తెలుసు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అధికారం కోల్పోయాక ఇక నష్టపోయేది ఏమీ లేని స్థితిలో ఆధునిక, సంస్కరించబడిన ఆర్థిక వ్యవస్థ గురించి రాహల్ గాంధీకి మన్మోహన్ ట్యూషన్ చెబుతారా? అయితే రాహుల్ ఈ దఫా మన్మోహన్ చెప్పేది ఎంతవరకు వింటారనేది మనం గమనించాల్సిన అవసరముంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఇద్దరి నుంచి రాహుల్ తీవ్ర వ్యతిరేకత!
మన్మోహన్సింగ్ తన హయాంలో ‘దేశ వనరులపై తొలి హక్కుదారులు మైనారిటీలే’ అని చెప్పిన మాట కాంగ్రెస్‌పార్టీని ఈనాటికీ వెంటాడుతూనే ఉంది. యూపీఏ మొత్తం మీద హిందూ జాతీయవాద ఆవరణాన్ని మోదీ నేతృత్వంలోని బీజేపీ కోసం వదిలివేసింది. రాహుల్ గాంధీ తన మతాన్ని కాంగ్రెస్ రాజకీయాలతో దుస్సాహసికంగా కలగాపులగం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆయన గెలవచ్చు లేక పరాజయం చెందవచ్చు కానీ, ఈ సరికొత్త చక్రవ్యూహం నుంచి రాహుల్ వెనుదిరగలేరు. పైగా ఒక కాలు ఇక్కడ, మరో కాలు అక్కడ అనే ఆటను రాహుల్ ప్రదర్శిస్తున్నట్లయితే, అది 1989లో తన తండ్రి రాజీవ్ గాంధీని ఎక్కడికి తీసుకెళ్లిందో తప్పక తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ సనాతన హిందువుగా, అగ్రశ్రేణి బ్రాహ్మణుడిగా తనను తాను నూతనంగా ఆవిష్కరించుకుంటున్న తీరు ఆయన సైద్ధాంతిక ప్రత్యర్థులను కలవరపర్చింది. అదేసమయంలో ఆయన స్నేహితులను ఆగ్రహంలో ముంచెత్తింది. ఇద్దరి నుంచి రాహుల్ తీవ్ర వ్యతిరేకతనే ఎదుర్కొన్నారు. ఈ సందర్భంలో ఆయన అత్యంత సాహసోపేతమైన, చురుకైన రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టేశారు. రాహుల్ ఎత్తుగడతో బీజేపీ ఎంత చికాకు పడిందంటే, తాను జంధ్యం ధరిస్తున్న బ్రాహ్మణుడినని రాహుల్ చేసిన ప్రకటనకు సాక్ష్యాధారంగా ఆయన గోత్రం ఏమిటో తెలుసుకోవాలని మొదటగా ప్రయత్నించింది. రాహుల్ గోత్రం ఏదో వెల్లడయినప్పటికీ బీజేపీ కుదుటపడలేదు. ఇప్పుడు తన శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిని ముగ్గులోకి దింపింది. తరతరాలుగా బ్రాహ్మణ గోత్రం ఎలా ప్రయాణిస్తూ వచ్చిందనే లోతైన సాంకేతిక అంశాలను ఈయన ప్రస్తుతం లేవనెత్తారు. భారతదేశ అతిపెద్ద లౌకికవాద పార్టీగా తనను తాను అభివర్ణించుకునే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రదర్శించిన రాజకీయ దుస్సాహసిక తత్వం ఏం సాధించిపెట్టిందో చూద్దాం. ఇటీవలివరకు రాహుల్ అసలు హిందువా లేక క్రిస్టియన్ మతానికి దగ్గరివాడా అనే చర్చే ప్రధానంగా సాగుతూ వచ్చింది. తర్వాత రాహుల్ బ్రాహ్మణుడేనా అనే చర్చకు మళ్లింది. ఇప్పుడైతే రాహుల్ గాంధీ దత్తాత్రేయ గోత్రం నుంచి వచ్చిన కశ్మీరీ కౌల్ బ్రాహ్మణుడేనా అనే అంశంపై చర్చ సాగుతోంది. జాతీయ రాజకీయాల్లో మతం, కులం, గోత్రం ఇప్పుడు కేంద్రబిందువుగా మారి నందున ఈ పరిణామాన్ని పురోగతిగానే చెప్పాలి. ఇది విలువల గొలుసుకట్టులో ఒక ముందంజే మరి. దీన్నంతటినీ రాహుల్ ఒక పథకం ప్రకారం చేస్తూ వచ్చారా లేక గుజరాత్ ఎన్నికల సమయంలో అక్కడున్న కొన్ని దేవాలయాలను సందర్శించిన తర్వాత అనుద్దేశపూర్వక పర్యవసానాల సూత్రం తన పాత్రను ఇక్కడ చేపట్టిందా అనేది మనకు తెలీదు. మీరు రాహుల్/కాంగ్రెస్ మద్దతుదారు అయితే, మీరు ఈ సందర్భంగా ‘రాజకీయ మహా యుక్తి’ అనే వ్యక్తీకరణను ఉపయోగిస్తారు. ఇది వాస్తవానికి మోదీ–షా మద్దతుదారులు కాపీ రైట్ తీసుకున్న వ్యక్తీకరణ. మీరు బీజేపీ మద్దతుదారు అయితే, రాహుల్ ఏమాత్రం సురక్షితం కాని రాజకీయ ప్రస్థానంలోకి నిర్లక్షపూరితంగా ప్రయాణిస్తున్నారని చెప్పవచ్చు. అంటే తన ఈ చర్యద్వారా హిందూ ఓటును పొందలేరు, మరోవైపున సెక్యులర్ ఓటును ప్రత్యేకించి ముస్లిం ఓటును పొందలేరు అని వీరి ఉద్దేశం. దేశ కేంద్రభాగంలో వాడే హిందీలో వారు ఇలా చెబుతారు: ‘‘దువిధా మైన్ దోనో గటే, మయా మిలీ న రామ్’’ (నా గందరగోళంలో నేను రెండింటినీ కోల్పోయాను: అవేమిటంటే ప్రాపంచిక సంతోషాలు, దేవుడు) నేను దీన్ని మరోలా వర్ణిస్తాను. కానీ కాస్సేపటి తర్వాతే మరి. ఈ వివాదంపై తాజాగా, ప్రత్యేకించి చక్కటి వాదనతో సాగిన చర్చకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో సుహాస్ పాల్షికర్ వ్యాసం తావిచ్చింది. రాహుల్ తాను నిజంగా అస్తికుడినే అని ప్రదర్శించుకోవాలంటే తన నానమ్మ ఇందిరాగాంధీ చేసినట్లుగా అన్ని మతాల ప్రదేశాలను ఆయన దర్శించలేడా అని సుహాస్ ప్రశ్నించారు. ఈ అభిప్రాయాన్నే స్వీకరిస్తూ నెహ్రూ, మహాత్మాగాంధీ జీవిత చిత్రకారుడు రామచంద్ర గుహ రాశారు. ‘రాహుల్ గాంధీ నీతిబాహ్యమైన ఆలయాల సందర్శన తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్న పార్టీ అత్యుత్తమ సంప్రదాయాలకు పచ్చి ద్రోహం చేయడమే అవుతుంది. గాంధీ, నెహ్రూ ఇద్దరూ మెజారిటీని అనుసరించడం అనే ఈ సిగ్గుమాలిన చర్యను చూసి తీవ్రంగా బాధపడేవాళ్లు.‘ ది ప్రింట్ వెబ్సైట్లో ప్రగతిశీల రచయిత, మేధావి దిలీప్ మండల్ రాస్తూ, వారసత్వ హక్కు ద్వారా బ్రాహ్మణులకు దక్కుతున్న 30 రకాల సౌకర్యాల జాబితాను పేర్కొంటూ అందుకే రాహుల్ దానికి ఆకర్షితుడయ్యాడని వ్యంగ్యంగా రాశారు. ఇక వామపక్షాల వద్దకు వస్తే వారి విమర్శ మరింత కర్కశంగా ఉంటుంది. వీరి వాదనల్లో కొన్నింటిని ప్రస్తావించనివ్వండి. రాహుల్‌పై మధ్యేవాదుల ఆరోపణ ఏమిటంటే ఆయన కపటత్వ ధోరణే. రాజకీయాల్లో కపటత్వం ఎప్పటినుంచి చెల్లుబాటు అవుతూ వచ్చినట్లు? కానీ, అది రాజకీయాల్లో తప్పనిసరి సాధనం. కపటత్వంతో లేని ఒక్కరంటే ఒక్క రాజకీయవాదిని చూపించండి మరి. అలాంటివాళ్లను నేను పరాజితుడిగానే చూపిస్తాను. నా వృత్తిలో తొలి సంవత్సరాల్లో భారతీయ రాజకీయాల గురించి తెలుసుకుంటున్నప్పుడు నాటి హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాను తన, తన కుటుంబ జీవన శైలి గురించి ప్రశ్నిస్తూ, వారు పేదరైతు గురించి మాట్లాడతామని చెప్పడం కపటత్వం కాదా అని అడిగాను. దానికి ఆయన ఒకటే చెప్పారు. ‘భాయి సాబ్, హమ్ రాజ్‌నీతి కర్నే ఆయే హై, యా తీర్థయాత్రా పే‘ (మేం రాజకీయాలు చేస్తున్నామా లేక తీర్థయాత్రలా)? ఇది పూర్తిగా మతపరమైన దేశం. అన్ని భారీ ఎన్నికల్లోనూ భారతీయుల్లో 99 శాతం మంది తాము ఆస్తికులమే అని చెబుతుంటారు. మన దేశంలో నాస్తికుల సంఖ్య మన నోటా ఓటర్లతో పోలిస్తే కూడా అతి చిన్న విభాగంగా మాత్రమే ఉంటుంది. ఇక్కడ దేవుడికి వ్యతిరేకంగా ఎవరూ ఓటెయ్యరు. నెహ్రూ తన ఆజ్ఞేయతా వాదాన్ని (దేవుడు ఉన్నాడో లేదో తేల్చిచెప్పలేమనే వాదం) చివరివరకూ నిలుపుకున్నారు. ఎందుకంటే అవి స్వాతంత్య్రోద్యమ ప్రభావంతో గడిచిన రోజులు. పైగా ఆయన నెహ్రూ మరి. ఆయన కుమార్తె మాత్రం త్వరగా దాన్ని సరి దిద్దారు. మందిర్ అన్నా, సాధువులు అన్నా, పూజలన్నా ఆమె ఎన్నడూ సిగ్గుపడలేదు. పైగా ఆమె ధరించే రుద్రాక్ష మాల గురించి చెప్పపనిలేదు. కాంగ్రెస్ పార్టీని 2014 ఎన్నికల్లో 44 స్థానాలకు మాత్రమే పరి మితం చేసిన బీజేపీ హిందూయిజంపై గుత్తాధిపత్యం ప్రకటించుకున్న ప్రస్తుత సమయంలో, తన నానమ్మ వదిలివెళ్లిన జంధ్యాన్ని తాను స్వీకరించాలని రాహుల్ భావిస్తున్నట్లయితే, అదే నిజమైన చురుకైన రాజ కీయం అవుతుంది. మీ దేవుళ్లను మీ ప్రత్యర్థికి ఎందుకు అప్పగిస్తారు? దాన్ని మీరు నీతిబాహ్యమైన చర్య అని పిలవచ్చు. నిజమైన నీతివంతమైన రాజకీయవాదిని, అంటే మర్యాదా పురుషోత్తముడిని కనుగొనడానికి మీకు స్వాగతం చెబుతున్నాను. కానీ నేనయితే అలాంటి వారిని ఇంకా చూడలేదు. ప్రస్తుతం రాజీలు కొనసాగుతాయి. ట్రిపుల్ తలాక్‌ను సంరక్షిస్తున్న రాహుల్ పార్టీ రామాలయంపై మాత్రం మౌనం పాటిస్తుంది. శబరిమలపై ఆర్ఎస్ఎస్ వైఖరి కూడా ఇదే. మధ్యప్రదేశ్‌లో దాని ఆవు, ఆవు మూత్రం చుట్టూ తిరిగిన మేనిఫెస్టోను ఒకసారి తనిఖీ చేయండి. రాహుల్‌పై ఉదారవాదుల అసమ్మతిని అర్థం చేసుకోవచ్చు. కానీ నెహ్రూ యుగం నాటి కరడుగట్టిన లౌకికవాదంతో రాహుల్ రాజకీయాల్లో మనుగడ సాధించలేరు. లౌకికవాదం దన్నుతో రాహుల్ ఇప్పుడు జేఎన్‌యూతోపాటు ఎక్కడా గెలుపొందలేరు. పైగా ఆధునిక భారత చరిత్రలో అత్యంత ప్రముఖ పరాజితుడిగా మిగిలిపోతారు కూడా. పైగా, తన నానమ్మ మార్గంలోకి వెనుదిరిగినట్లయితే, విశ్వాసంపై, జాతీయవాదంపై బీజేపీ గుత్తాధిపత్యాన్ని రాహుల్ తోసిపుచ్చడానికి వీలు కలుగుతుంది కూడా. నెహ్రూ తన వెనుక వదిలి వెళ్లిన భారత్‌కి పూర్తి భిన్నమైన ఇండియాలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఈ వారం ప్రాంరంభంలో ప్రముఖ న్యాయశాస్త్రవేత్త ఫాలి నారిమన్ రాజ్యాంగ దినోత్సవం ప్రసంగంలో దీన్నే అద్బుతంగా వివరించారు. రాజ్యాంగ పండితుడు గ్రాన్విల్లె ఆస్టిన్ సూక్తిని ప్రస్తావిస్తూ ఆయన ఇలా చెప్పారు. ‘మన రాజ్యాంగంలోని మూడు చిక్కులను ఆస్టిన్ చూశారు. జాతీయ ఐక్యత, సమగ్రతను పరిరక్షించి విస్తరించడం, ప్రజాస్వామ్య సంస్థలను నెలకొల్పడం, సామాజిక సంస్కరణలను పెంచిపోషించడం. ఇవన్నీ కలిసి ఒక అతుకులేని అల్లికను ఏర్పర్చాయి. కానీ లోతుగా పరికిస్తే, మరొక శక్తిమంతమైన నాలుగో చిక్కు కూడా ఉంది. అదేమిటంటే సంస్కృతి. మతాన్ని, సాంప్రదాయాన్ని పొదవుకున్న ఆ సంస్కృతి చట్రంలో కాంగ్రెస్, యూపీఏ, సోనియా, దాదాపు వామపక్ష స్వభావంతో కూడిన ఆమె ఎన్ఏసీ మొత్తంగా దారితప్పిపోయాయి. వారు ఏకాకులైపోయినట్లు కనిపిస్తున్నారు. కత్తివాదరలాంటి, ఆజ్ఞేయతావాదానికి సమీపంలో ఉన్నటువంటి అలాంటి లౌకికవాద స్థాయిని ఆమోదించడానికి భారత్ ఇప్పుడు సిద్ధంగా లేదు. మన్మోహన్సింగ్ ఆ రోజుల్లో, ‘దేశ వనరులపై తొలి హక్కుదారులు మైనారిటీలే’ అని చెప్పిన మాట కాంగ్రెస్‌పార్టీని ఈనాటికీ వెంటాడుతూనే ఉంది. యూపీఏ మొత్తం మీద హిందూ జాతీ యవాద ఆవరణాన్ని మోదీ నేతృత్వంలోని బీజేపీ కోసం వదిలివేసింది. రాహుల్ తీసుకున్న ఈ ఆకస్మిక మార్పు తాత్విక పరిపూర్ణత, గాఢతా పరీక్షలో బహుశా విఫలం కావచ్చు కానీ అపరిచితమైన రిస్కును ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న రాజకీయాల్లో ఇదొక ఆసక్తికరమైన పరిణామం. తనకు పరిచయం కాని పిచ్‌మీద రాహుల్ దుస్సాహసికంగా అడుగు మోపారు. రాహుల్‌ని సరిగ్గా తాము కోరుకున్న చోటే పట్టుకున్నామని బీజేపీ/ఆర్ఎస్ఎస్లో చాలామంది భావిస్తున్నారు. రాహుల్ గురించిన మరొక వర్ణనకు ప్రాధాన్యమివ్వాలని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అది ఇక్కడే ఉంది. ఇది రాజకీయ చక్రవ్యూహంలోకి నడవడం లాంటిదే. దీంట్లో రాహుల్ గెలవచ్చు లేక చిత్తుగా ఓడిపోవచ్చు. కానీ తాను ఈ వ్యూహంలోంచి మాత్రం వెనుదిరగలేరు. పైగా ఒక కాలు ఇక్కడ, మరో కాలు అక్కడ అనే ఆటను రాహుల్ ప్రదర్శిస్తున్నట్లయితే, అది 1989లో తన తండ్రి రాజీవ్ గాంధీని ఎక్కడికి తీసుకెళ్లిందో ఆయన తప్పక తెలుసుకోవాలి. - శేఖర్ గుప్తా ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
విలువలు మరచి పొత్తుల వెంపర్లాట
తెలుగుదేశం పార్టీకీ కాంగ్రెస్ పార్టీకి మధ్య ముసిముసినవ్వులతో కూడిన ఫొటోలు, అనంతరం పొత్తు ప్రకటనలు దేన్ని సూచిస్తున్నాయి? 2013లో తన కుమారుడిని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతోనే సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించారంటూ చంద్రబాబు నిందించారు. కానీ అదే రాహుల్‌ని చంద్రబాబు ఇప్పుడు చిరునవ్వుతో కౌగిలించుకుంటున్నారు. భయపెడుతున్న ఉమ్మడి శత్రువు కంటే మిమ్మల్ని ఐక్యపర్చేది మరొకటి ఉండదు మరి. బీజేపీని 2019 ఎన్నికల్లో ఓడించాలంటే బలమైన నాయకుల దన్నుతో స్థానిక పోరాటాలు చేపట్టాల్సి ఉందన్న గ్రహింపు బలపడుతోంది. ఈ పొత్తుల వెంపర్లాటలో పార్టీల సైద్ధాంతిక విలువలు గాల్లో కలిసిపోవడమే విషాదం. విదూషక యువరాజు, కాపలాదారే దొంగ వంటి పరస్పర ఆరోపణలతో మన రాజ కీయ ప్రసంగాలు హోరెత్తుతూ మనకు చీదర కలిగిస్తున్న సమయంలోనే, అరుదైనదే అయినప్పటికీ ఊహించదగిన పరస్పర ఉల్లాస, ఉత్సాహాల సంరంభం దేశ రాజకీయ భూమికపై చోటు చేసుకుంది. ఇక్కడే నిజమైన రాజకీయ క్రీడ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీకీ కాంగ్రెస్ పార్టీకి మధ్య ముసిముసినవ్వులతో కూడిన ఫొటోలు, అనంతరం పొత్తు ప్రకటనలు దీనికి సంబంధించి ఒక ఉదాహరణ మాత్రమే. బద్ధశత్రువులు కౌగలించుకుంటున్నారు. పాత స్నేహితులు వెదుకులాట మొదలెట్టి కొత్త పొత్తులకోసం చూస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణం భాగస్వాముల కోసం వెతుకుతున్న విడివిడి వ్యక్తులు కూడిన బార్లాగా కనిపిస్తున్నట్లయితే, 2019 ఎన్నికలు ఎలా జరుగనున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక శక్తివంతుడైన ప్రత్యేకించి మెజారిటీని సాధించి ఉన్న నాయకుడు ఎన్నడూ (లేక ఇంతవరకు) తన పోటీదారు చేతిలో పరాజయం పొందలేదని భారత రాజకీయ చరిత్ర మీకు తెలుపుతుంది. అలాంటి నాయకుడు మాత్రమే తనను తాను ఓడించగల శక్తిని కలిగి ఉంటాడు. లేదా 1977లో ఇందిరాగాంధీ ఉదంతాన్ని బట్టి ‘నాయకురాలు’ అని చెప్పవచ్చు. ఇందిరాగాంధీకి సమ ఉజ్జీని చూసి ప్రజలు అప్పట్లో ఓటు వేయలేదు. దక్షిణాదిని మినహాయిస్తే, అత్యవసర పరిస్థితిలో జరిగిన దారుణాలకు గాను ఆమెను శిక్షించాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఇందిరకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇందిరాగాంధీ 1977లో తనను తాను ఓడించుకుని ఉన్నట్లయితే, 1989లో రాజీవ్ గాంధీ కూడా అదే పనిచేశారు. దేశంలోని కీలక భూభాగంలో వీపీ సింగ్ రాజీవ్ వ్యతిరేక ప్రచారం సాగించినప్పటికీ, ఆయన ప్రధానమంత్రి పదవికి స్పష్టమైన అభ్యర్థిగా ఎన్నడూ కనిపించలేదు. పైగా రాజీవ్‌కి ఆయన ప్రతి జోడు కాడు కూడా. షాబానో కేసు నుంచి బోఫోర్స్ వరకు తర్వాత అయోధ్య సమస్య వరకు రాజీవ్ అడుగడుగునా వేస్తూ వచ్చిన తప్పటడుగులే కాంగ్రెస్ పార్టీకి నిబద్ధులై ఉన్న ఓటు బ్యాంకులను ఆగ్రహంలో ముంచెత్తాయి. మెజారిటీ లేకపోయినప్పటికీ అటల్ బిహారీ వాజ్‌పేయి 2004లో జనరంజక నాయకుడిగా ఉండేవారు. ఆయనకు వ్యతిరేకంగా సమ్మిళితమైన ప్రతిపక్షం కూడా లేదు. తన ప్రధాని పదవికి పోటీదారు కూడా లేడు. అయితే ముందస్తు ఎన్నికలు, భారత్ వెలిగిపోతోంది వంటి అతిశయ ప్రకటనలు, కీలకమైన పొత్తుదార్లను పోగొట్టుకుని కొత్త వారిని సంపాదించుకోవడం (ఉదాహరణకు చంద్రబాబు నాయుడు) వంటి చర్యలతో విజయం తమదేనంటూ చాలాముందుగా ప్రకటించుకున్న ఆయన పార్టీ అహంకారం కారణంగానే వాజ్‌పేయి అధికారం కోల్పోయారు. ప్రధానంగా 2002లో గుజరాత్ మతఘర్షణల పట్ల దృఢంగా వ్యవహరించడంలో ఆయన అసమర్థత కూడా నాటి పరాజయానికి దారితీసింది. ఆ కోణంలో చూస్తే వాజ్‌పేయి కూడా తన్ను తాను ఓడిం చుకున్నారు. ప్రత్యామ్నాయమే లేదు అన్న అంశం ఒక దృఢమైన వాస్తవంగా ఉన్నప్పటికీ అది మాత్రమే సరిపోదని 1977–2004 మధ్య కాలంలో జరిగిన ఈ మూడు ఎన్నికలు (ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాజ్‌పేయి) మనకు బోధిస్తున్నాయి. ప్రత్యామ్నాయం కనిపించనప్పటికీ కొన్ని సందర్భాల్లో శక్తివంతమైన నాయకుడిని, నాయకురాలిని పడగొట్టాలని నిర్ణయించుకోవడంలో భారతీయ ఓటరులో కనిపించిన ఈ విశిష్టమైన ఉన్మాద ప్రకోపితానంద స్వభావం ఏమిటి? ప్రభుత్వాలు రెండో దశలో కూడా గెలిచిన సందర్భాలను, ఇటీవలి దశాబ్దాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు కూడా రెండుసార్లు వరుసగా గెలిచిన సందర్భాలు (1999లో వాజ్‌పేయి, 2009లో మన్మోహన్ సింగ్) ఉన్నందున, బలమైన నాయకులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగానే ఓడిపోయారని విశ్లేషించలేం. పాలనపై అసంతృప్తి చెందినప్పటికీ మరో ప్రత్యామ్నాయం లేదన్నకారణంతోనే ఓటర్లు కొన్నిప్రభుత్వాలకు వరుస విజయాలను కట్టబెట్టి ఉండవచ్చు. కాని ఓటర్లు ఆగ్రహం చెందినట్లయితే, తదుపరి అధికారంలోకి ఎవరు వస్తారు అనేదాంతో పనిలేకుండా ప్రభుత్వ వ్యతిరేకతను ఓటింగ్ సమయంలో ప్రదర్శించాలని భావిస్తుంటారు. ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్న అంశం ఏమిటంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అలాంటి స్థితిలోకి వచ్చేసిందా? అన్నదే. అందుబాటులో ఉన్న ప్రజాభిప్రాయ పోల్ డేటాను పరిశీలిద్దాం. ఇండియా టుడే నేతృత్వంలో జరుగుతున్న హేతుబద్ధమైన సీరియల్ పోల్ సర్వేలు ఒక సాధారణ ధోరణిని సూచిస్తున్నాయి: మోదీ ప్రభుత్వంపై ప్రజాదరణ స్థిరంగా పతనమవుతోంది. 1977లో, 1989లో లేక 2004లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బలపడిన క్రమం ఇప్పుడు చోటుచేసుకుందని తేల్చిచెప్పలేం. మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చే అవకాశమే ఉంది. అయితే మెజారిటీ లేనిస్థితిలోనే బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా మరొకరిని ముందుకు తేవడం అనేది (అది రాహుల్ కావొచ్చు లేక మాయావతి కావొచ్చు) తనంతట తానుగా మోదీని ఓడించలేదు. పైగా అది ఆయన విజయానికి హామీనిస్తుంది. అలాంటి ఎంపికను మోదీ అధ్యక్ష పదవికి ఎన్నికలో మాదిరిగా ఎకాఎకీ పోరాటంగా మార్చేస్తారు కూడా. ప్రత్యక్ష పోరాటంలో మోదీని ఢీకొనడానికి ఏ ప్రతిపక్ష నాయకుడూ ఇంకా సిద్ధంగా లేరు. దాంతోపాటుగా మహాఘటబంధన్ అనేది ఎప్పటిమాదిరే ఒక భ్రమగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక నాయకుడు లేకుండా మహాఘటబంధనాన్ని మీరు ఏర్పర్చలేరు. మోదీని ఓడించడానికి ఇక్కడ రెండు మార్గాలున్నాయి. 2008–09లో యూపీఏ వలే, మోదీ ప్రజాదరణ పెరగకపోగా, మెల్లమెల్లగా తగ్గిపోతోంది. ఈ ప్రజా అసమ్మతిని ప్రతిపక్షం వచ్చే ఆరునెలల్లో ప్రజాగ్రహంగా మార్చగలదా? అది సాద్యపడవచ్చు, కానీ అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. రాజీవ్ గాంధీలాగే మోదీ ప్రభుత్వ స్పందనలో కొన్ని తప్పిదాలు కనపడుతున్నప్పటికీ రఫేల్ కుంభకోణం ఇంకా బోఫోర్స్‌లా రూపుదిద్దుకోలేదు. దేశంలో రైతుల సమస్య, చమురు ధరల సమస్య ఉన్నాయి కానీ, ప్రత్యేకించి ఆహార ధరలకు సంబంధించి హేతుబద్ధమైన ద్రవ్యోల్బణం వీటిని అడ్డుకుంటోంది. ఈ పరిస్థితిని ప్రజాగ్రహం ప్రతిబింబించే ఎన్నికగా రూపొందించడానికి ఒక జయప్రకాష్ నారాయణ్ లేక ఒక వీపీ సింగ్ ఇప్పుడు లేరు. రాహుల్ గాంధీ ఆ స్థాయిని ఇంకా సాధించలేదు. అనిల్ అంబానీతో బేజీపీ సంబంధంపై, దాని కార్పొరేట్ పక్షపాత ప్రచారంపై రాహుల్ ఆరోపణ ఇప్పటికీ సముచిత మార్గాన్ని కనుగొనడం లేదు. అదే కార్పొరేట్లతో ప్రత్యేకించి అంబానీలతో కాంగ్రెస్ పార్టీ అదే విధమైన సాన్నిహిత్యబంధానికి కలిగి ఉందన్నది తెలిసిందే. ప్రతిపక్ష సైన్యానికి సంబంధించిన ఒక సేనాధిపతిని ముందుపెట్టుకుని మోదీతో ఒక జాతీయ ఎన్నికల్లో తలపడకూడదు. పైగా సైద్ధాంతిక వైరుధ్యాలను తోసిపుచ్చుతున్న ప్రజాభిప్రాయ ప్రాధాన్యత కలిగిన బలమైన స్థానిక నాయకులు, పరిమిత స్థానిక పొత్తులతో కూడిన అనేక చిన్న, రాష్ట్రస్థాయి సమరాల్లో మోదీతో తలపడాలి. శిరోమణి అకాళీదళ్తోపాటుగా టీడీపీ భారత్‌లో కాంగ్రెస్ పట్ల బద్ధ వ్యతిరేకత కలిగిన ప్రాంతీయపార్టీ. 2013లో తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించారంటూ చంద్రబాబు నిందించారు. కానీ అదే రాహుల్‌ని ఇప్పుడు చంద్రబాబు చిరునవ్వుతో కౌగిలించుకుంటున్నారు. భయపెడుతున్న ఉమ్మడి శత్రువు కంటే మిమ్మల్ని ఐక్యపర్చేది మరొకటి ఉండదు మరి. ఆంధ్ర–తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీగా లేదు. కానీ 42 ఏంపీ స్థానాలు కలిగిన ఈ రెండు రాష్ట్రాల్లో పొత్తు లేకుంటే బీజేపీ దెబ్బతింటుంది. ఈ పరిస్థితిలో ఏపీ వర్సెస్ బీజేపీలాగా కాకుండా మోదీ వర్సెస్ రాహుల్‌గా మార్చడం బీజేపీకి కష్టమైన పనే. తమిళనాడులో బీజేపీకి ఇప్పటికీ సానుకూలత లేదు. ఎందుకంటే ప్రజాదరణ కోల్పోయిన ఏఐడీఎంకే అక్కడ బీజేపీ ఏకైక మిత్రురాలు. కాబట్టి ప్రాంతీయ కూట మికి తదుపరి రంగం తమిళనాడులోనే ఉండవచ్చు. బీజేపీ ఇక్కడ ఏఐడీఎంకేని తిరస్కరించి డీఎంకేతో పొత్తును గెల్చుకోవడాన్ని కూడా మీరు తోసిపుచ్చలేరు. టీడీపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ వంటి శాశ్వత శత్రువులే కలిసిపోతున్నప్పుడు, డీఎంకే, బీజేపీ మధ్య పొత్తును ఆపలేం కూడా. అలా జరగకపోతే, బీజేపీని అనేక చిన్న, రాష్ట్ర స్థాయి సమరాల్లో ఎదుర్కోవాలనే కాంగ్రెస్/ప్రతిపక్ష వ్యూహం ఒకడుగు ముందుకేస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు ఈ కూటముల్లో గరిష్ట ప్రయోజనాన్ని చూస్తున్నాయి. హరియాణా, చత్తీస్‌ఘర్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలున్నాయి. పంజాబ్‌లో ఇప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ అకాలీదళ్గా తప్ప కాంగ్రెస్ వర్సెస్ మోదీలాగా పరిస్థితులు పరిణమించలేదు. ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్, ఆప్ మధ్య ఒడంబడిక కుదురుతుందా? దానికి అవకాశంలేదు. కానీ టీడీపీ, కాంగ్రెస్ పొత్తు కుదిరిన తర్వాత అలా జరగదని ఎవరు చెప్పగలరు? రాజకీయాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహాఘటబంధన్ ఉండకపోవచ్చు కానీ రాష్ట్ర స్థాయిల్లో అనేక కూటములు ఏర్పడవచ్చు. ఈవిధంగానే జనరంజకమైన స్థానిక నేతల సాయంతో బీజేపీని చిన్న చిన్న సమరాల్లో ప్రతిపక్షం ఎదుర్కోవచ్చు. ప్రతిపక్షానికి ఉన్న ఈ సౌలభ్యతను తోసిపుచ్చి రాహుల్‌తో అధ్యక్షపాలన తరహా పోటీకి దిగడమే మోదీ–షా వ్యూహం. 2019 ఇలాగే రూపొందనుంది. - శేఖర్ గుప్తా ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
రాఫెల్ మరో బోఫోర్స్ కానుందా?
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగిస్తున్న ప్రచారానికి అనేక పరిమితులున్నాయి. ఇక్కడ పాలకపక్షానికి వ్యతిరేకంగా పోరు సలుపుతూ, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించడానికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి నాయకుడు లేరు. సింగ్ తెలివితేటలపై, సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ, ఆయన విషయం వివరించే విధానం ఆయన చెప్పే విషయంపై ప్రజలకు నమ్మకం కుదిరేలా చేసింది. బోఫోర్స్ వ్యవహారంలో మాదిరిగా కుంభకోణం జరిగిందనడానికి కొద్దిపాటి సాక్ష్యాధారాలు కూడా రాఫెల్ వివాదంలో కనపడటం లేదు. దీనిపై వివరణాత్మక కథనాలుగానీ, నినాదం గానీ ఇంకా వినిపించడం లేదు. రాఫెల్ వ్యవహారం నరేంద్రమోదీ పాలిటి బోఫోర్స్‌లా మారిందని ఆయనను తీవ్రంగా విమర్శించేవారు సైతం చెప్పడం లేదు. కానీ, తాము ఆ పనిలో ఉన్నామనీ, కొన్ని నెలల క్రితం వరకూ అజేయుడిగా కనిపించిన ప్రధానిని ఓడించడానికి బ్రహ్మాస్త్రంగా పనిచేసే శక్తి దీనికి ఉందని వారంటున్నారు. అయితే వెల్లడిస్తున్న విషయాల్లో పదునైన అంశాలేవీ లేవు. మొదటిది, గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి రాఫెల్ అంటే ఏమిటో తెలియదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం 21 శాతం మందికే రాఫెల్ అంటే ఏమిటో తెలుసని ఇటీవలి ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలింది. దీనికి మా జర్నలిస్టులనే నిందించాలి. రెండోది, జనం నమ్మేరీతిలో ప్రతిపక్షాల సందేశాన్ని ఓటర్ల వద్దకు తీసుకెళ్లే వీపీ సింగ్ వంటి నైతిక బలమున్న నేత ఇప్పుడు లేడు. బోఫోర్స్‌తో పాటు ఇంకా అనేక ఇతర కుంభకోణాల నీడలు వెంటాడుతున్న కారణంగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీS ఈ పనిచేయడానికి సరిపోరు. ప్రతిపక్షాలు, ప్రధానంగా రాహుల్‌గాంధీ రాఫెల్ వివా దాన్ని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా చేయాలని నిర్ణయించారు. కేంద్రంలో పాలక కూటమి అవినీతి, ఆశ్రిత పెట్టుబడి దారీ పోకడలు వంటి విషయాలు దీనికి అవి జోడిస్తాయి. అనేక సొంత కంపెనీలు నష్టాలతో నడుస్తున్న అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామికవేత్తకు మోదీ అడ్డగోలుగా మేలు చేయగలిగితే, విజయవంతంగా కంపెనీలు నడిపే బడా వ్యాపారవేత్తలకు ఆయన ఎందుకు సాయం చేయడు? అనే వాదనను అవి ముందుకు తెస్తాయి. ఆరోపణలన్నీ రాఫెల్ చుట్టూనే! గతంలో వ్యాపారులకు మేలు చేస్తున్నారనే సందేశం ఇవ్వడానికి ‘‘సూట్ బూట్ సర్కార్’’ అనే నినాదం ఇచ్చిన కాంగ్రెస్ తన ఆరోపణలకు రాఫెల్ చుట్టూ నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించడానికి, పార్లమెంటును కుదిపేసే కథనాలు తీసుకు రావడానికి బోఫోర్స్ కుంభకోణం రోజుల్లో మాదిరిగా రామ్‌నాథ్ గోయెంకా నాయకత్వంలో నడిచిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి మీడియా సంస్థ లేదని ప్రతిపక్షాలు బాధపడుతున్నాయి. వాటికున్నదల్లా మచ్చలేని వ్యక్తి గత ప్రతిష్ట ఉన్న ఇద్దరు అరుణ్‌శౌరీ, ప్రశాంత్ భూషణ్ మాత్రమే. ఈ అశ్వమేధ యాగం ముందు నిలపడానికి తగిన అశ్వం రాహుల్ కాదు. అవినీతి విషయమై ఇంకా బీజేపీ లోపల ఏ పెద్ద నాయకుడూ తిరుగుబాటు చేయలేదు. ఒక్కసారి మన రాజకీయ చరిత్ర పరిశీలిద్దాం. 1977లో విధేయుడైన జగ్జీవన్ రామ్ ఇందిరాగాంధీపై, 1988–89లో నమ్మకస్తుడైన వీపీ సింగ్ రాజీవ్‌గాంధీపై చేసిన తిరుగుబాట్లే ఈ రెండు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను మార్చేశాయి. తల్లీకొడుకుల ఓటమికి కారణ మయ్యాయి. మరో వీపీ సింగ్‌ను ఆశించడమా! ఇప్పుడు మరో వీపీ సింగ్‌ను ఆశించడం వాస్తవ విరుద్ధమే అవుతుంది. ఎందుకంటే, వీపీ సింగ్‌కు అవినీతి అంటని గొప్ప నిజాయితీపరుడిగా పేరుండ డమేగాక, ఆయన కేంద్ర కేబినెట్లో కీలకమైన (రక్షణ శాఖ) మంత్రి పదవిని త్యాగం చేశారు. రెండోది, ఆయన నరేంద్రమోదీ లేదా వాజ్‌పేయీ లాగా గొప్ప వక్త కాదు. కాని, 30 ఏళ్ల క్రితమే దేశంలో కేంద్రస్థానమైన హిందీ ప్రాంతాల్లో సంక్లిష్టమైన ఆయుధాల కొనుగోలు ఒప్పందంలో జరిగిన కుంభ కోణాన్ని సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా ఆయన విడమరచి చెప్పగలిగారు. అంతటి గొప్ప మాంత్రికుడాయన. కుంభకోణాల వెల్లువలో రాజీవ్ గాంధీ ప్రతిష్ట తగ్గడం మొదలవ్వగానే 1987లో వీపీ సింగ్ మంత్రి పదవికి, పార్లమెంటుకు రాజీనామా చేశారు. అలహాబాద్ ఉప ఎన్నికలో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. బోఫోర్స్ కుంభకోణంలో ముడుపుల ఆరోపణలకు సంబంధించి అప్పుడే అమితాబ్ బచ్చన్ ఈ సీటుకు రాజీనామా చేయడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. వాతావరణం వీపీ సింగ్‌కు అనుకూలంగానే ఉంది. కానీ, ఆయన బోఫోర్స్‌ను ఎన్నికల అంశంగా చేయలేరని ఆయన మిత్రులు, శత్రువులు కూడా నమ్మారు. తమకు సంబంధం లేని క్లిష్టతరమైన విషయంపై పేద గ్రామీణులు ఎలా స్పందించగలరని వారు అనుకున్నారు. సింగ్ చక్కటి పద్ధతిలో ప్రచారం చేసి గెలిచారు. మోటర్‌సైకిల్‌పై వెనుక సీట్లో కూర్చుని మండు వేసవిలో ఆయన ప్రచారం చేశారు. నేడు సామాజిక కార్యకర్త, రాజకీయ నేత యోగేంద్ర యాదవ్ మాదిరిగా మెడ చుట్టూ తువ్వాలు(గమ్చా) చుట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ, ఓ మామూలు ప్రశ్న అడిగే వారు. రాజీవ్‌గాంధీ మీ ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు తెలుసా? అనే ప్రశ్న సంధించేవారు. తర్వాత వెంటనే తన కుర్తా జేబు నుంచి అగ్గిపెట్టె తీసి పట్టుకునే వారు. ‘‘చూడండి, ఇది అగ్గిపెట్టె. మీ బీడీ లేదా హుక్కా లేదా మీ పొయ్యికి నిప్పు అంటించడానికి ఆరణాలు (25 పైసలు) పెట్టి అగ్గిపెట్టె కొంటారు. కాని, ఆరణాల్లో నాలుగోవంతు ప్రభుత్వానికి పన్ను రూపంలో పోతుంది. ఈ సొమ్ముతో ప్రభుత్వం మీకు స్కూళ్లు, ఆస్పత్రులు, రోడ్లు, కాలవలు నిర్మించడమే గాక, మీ సైన్యానికి తుపాకులు కొనుగోలు చేస్తుంది. ఇది మీ సొమ్ము. దీంట్లో కొంత ఎవరైనా దొంగిలిస్తే–అదీ సైన్యానికి తుపాకులు కొనేటప్పుడు ఆ పని చేస్తే–మీ ఇంట్లో దొంగలు పడినట్టు కాదా?’’ ఇలా వీపీ సింగ్ జనానికి బోఫోర్స్ గురించి వివరించేవారు. వాస్తవానికి కుంభకోణం వివరాలు, అంకెలతో కూడిన వివరాల కన్నా సింగ్ ప్రజలకు దీని గురించి కథలా చెప్పిన విధానమే బాగా పని చేసింది. ‘‘తనకు ముడుపులు ఏమీ చెల్లించలేదంటూ బోఫోర్స్ కంపెనీ తనకు సర్టిఫికెట్ ఇచ్చిందని రాజీవ్‌గాంధీ చెబుతున్నారు. ఇది ఎలా ఉందంటే, తాను మానసికంగా అంతా బాగానే ఉన్నానంటూ మానసిక రోగుల ఆస్పత్రి తనకు సర్టిఫికెట్ ఇచ్చిందని, మీకు కూడా ఇలాంటి పత్రం లేకుంటే మీరు మానసికంగా బాగున్నట్టు ఎలా భావించాలని ఓ పిచ్చివాడు చెబుతూ దాన్ని చూపిస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంది’’ అని వీపీ సింగ్ తన ప్రసంగాల్లో వివరించేవారు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్‌గాంధీ ఒక్కరే లంచాలు తీసుకున్నారని ప్రజలను నమ్మించడానికి ఇలా మరో కథ చెప్పేవారు. ‘ఓ సర్కస్‌లో ఓ సింహం, ఆబోతు, పిల్లి ఒకే చోట దగ్గర దగ్గరగా ఉండేవి. ఓ రాత్రి ఎవరో ఈ జంతువుల బోనులన్నీ తెరిచారు. మరుసటి ఉదయం గుర్రం, ఆబోతు మృతదేహాలను సర్కస్ యజమాని చూశారు. వాటిని ఎవరు తిన్నారో మీకేమైనా అను మానాలున్నాయా? సింహమా? పిల్లా? బోఫోర్స్‌లో అంత పెద్ద మొత్తంలో సొమ్ము తినేశారంటే, చిన్న పిల్లి వంటి జంతువు తిని ఉంటుందా? సింహం సైజులో ఉండే దొంగ రాజీవ్ మాత్రమే ఆ పనిచేయగలరు’’ అంటూ వీపీ సింగ్ చేసిన వాదనలు జనంలోకి వెళ్లి పోయాయి. అంతే కాదు, చిరునవ్వుతో ఉన్న రాజీవ్ బొమ్మతో కూడిన కాంగ్రెస్ హోర్డింగులను ఆయన చూపిస్తూ విసిరే మాటల తూటాలు కూడా బాగా పనిచేశాయి. ‘‘రాజీవ్ ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థంకావడం లేదు. ఆయన మోసంపైనా? మన అమాయకత్వంపైనా? లేదా స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాచిన సొమ్మును చూసుకునా? నేనైతే మీకు కాలవలు, గొట్టపు బావులు తెస్తానని వాగ్దానం చేయలేను. కానీ, మీ సంపదను దోచుకుంటున్న వారికి అడ్డుకట్ట మాత్రం వేయగలను’’ అంటూ ప్రజలను సింగ్ ఆకట్టుకునేవారు. సింగ్ తెలివితేటలపై, సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ, ఆయన విషయం వివరించే విధానం ఆయన చెప్పే విషయంపై ప్రజలకు నమ్మకం కుదిరేలా చేసింది. ఇప్పటి కాంగ్రెస్‌లో ఇలా విషయం జనానికి వివరించగల నేతలు కరువయ్యారు. నేడు ప్రతిపక్షాలకు వీపీ సింగ్ వంటి నాయకుడు లేడు. అలాగే, రాఫెల్ కూడా బోఫోర్స్ అంతటి శక్తిమంతమైన విషయం కాదు. బోఫోర్స్‌కూ, రాఫెల్‌కూ ఎంతో తేడా బోఫోర్స్‌కూ, రాఫెల్‌కూ మధ్య ఎంతో తేడా ఉంది. బోఫోర్స్ శతఘ్ని నాణ్యతపై భిన్నాభిప్రాయాలున్నాయిగాని, రాఫెల్ అత్యుత్తమ యుద్ధవిమానమని అందరూ అంగీకరిస్తారు. కాంగ్రెస్ దీన్ని ఎంపిక చేయడమే దీనికి కారణం. ముందుగా అనుకున్నట్టు 126కు బదులు మోదీ సర్కారు 36 విమానాలు మాత్రమే కొనుగోలు చేయడంపైనే ఆరోపణ. ‘బోఫోర్స్ మొదటి శతఘ్నిని భారత సైనికులు పేల్చినప్పుడు అది వెనక్కి పేలడంతో మనవాళ్లే పలువురు మరణించారు’ అని వీపీ సింగ్ అప్పట్లో చెప్పగలిగారు. ఇప్పుడు రాఫెల్ విమానం గురించి ఇలా ఎవరూ మాట్లాడలేరు. జర్నలిస్ట్ టీఎన్ నైనన్ చెప్పినట్టు రెండో విషయం ఏమంటే, బోఫోర్స్ కుంభకోణంలో మాదిరిగా ఆరోపణలకు అనుకూల మైన సాక్ష్యాధారాలేవీ ఇంతవరకు బయటకు రాలేదు. బోఫోర్స్ ముడుపులు లంచాలు భారతీ యులకు సంబంధమున్న మూడు స్విస్ బ్యాంక్ అకౌంట్లకు జమ అయ్యాయని స్వీడన్ జాతీయ ఆడిటర్ దర్యాప్తులో తేలింది. కానీ, రాఫెల్ విమానాల తయారీలో భారతీయ పార్టనర్ కంపెనీని భారత ప్రభుత్వమే సూచించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన ప్రకటన స్వీడిష్ ఆడిటర్ చెప్పిన విషయానికి ఏమాత్రం సాటిరాదు. రక్షణ ఆయుధాల ఉత్పత్తిలో అనుభవం లేని కార్పొరేట్ సంస్థకు ఎలా రాఫెల్ విమాన తయారీలో భాగస్వామ్యం కల్పిస్తారని మాత్రమే అందరూ అడుగు తున్నారు. తమకు నచ్చినవారిపై పక్షపాతం చూపించే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం చెడ్డదేగాని నరేంద్ర మోదీ ఓటర్లను ఆయనకు వ్యతిరేకంగా తిప్పడానికి ఈ ఒక్క ప్రశ్న మాత్రమే సరిపోతుందా? ఇదే రాఫెల్ వ్యతిరేక ప్రచారానికి ఉన్న పరిమితి. గతంలో వీపీ సింగ్ బోఫోర్స్ వ్యవహారంపై అద్భుత రీతిలో పోరాడారు. ‘‘వీపీ సింగ్కా ఏక్ సవాల్, పైసా ఖాయా కౌన్ దలాల్? (సొమ్ము ఎవరో తినేశారు. ఆ బ్రోకర్ ఎవరన్నదే వీపీ సింగ్ ప్రశ్న)’’ అంటూ ఆయన ఇచ్చిన నినాదం సూటిగా దేశ ప్రజల్లో నాటు కుంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ప్రతిభను దూరం పెట్టిన ప్రతిష్ట
జాతి హితం తమకు అవసరమైన, తాము నమ్ముతున్న గొప్ప వ్యక్తులు బయటివారిలో కాకుండా తమ పార్టీలోనే ఉన్నారని నరేంద్రమోదీ, అమిత్ షాలు ప్రగాఢంగా విశ్వసించినట్లు కనబడుతోంది. కాని వారి వద్ద ఉన్న గొప్పతనం అనే మూలధనం పరిమితమైనదే. మోదీ ప్రభుత్వంలోని మేధో పెట్టుబడి మూడో సంవత్సరానికే ఆవిరైపోయింది. ఇందిరాగాంధీ కూడా ప్రభుత్వాన్ని తన కార్యాలయం నుంచే నిర్వహించారు. కానీ తన చుట్టూ ఉన్న ప్రతిభావంతుల గురించి ఆమె నిశితంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకునేవారు. నరేంద్ర మోదీ అనే జననేతకున్న ప్రతిష్ట మాత్రమే యావత్ దేశ సమస్యలను పరిష్కరించలేదని మూడేళ్లలోపే తేలిపోయింది. మూడు ప్రశ్నలతో ప్రారంభిస్తాను. నరేంద్ర మోదీ సర్కారు సమర్థు లకు వ్యతిరేకమా? 70 ఏళ్ల పానలో ఇది ప్రతిభా పాటవాలున్న వారిని అత్యంత తీవ్రంగా వ్యతిరేకించే ప్రభుత్వమా? ఈ అంశం నిజంగా మోదీకి, బీజేపీకి, ఓటర్లకు పట్టదా? మొదటి రెండు ప్రశ్నలకూ జవాబు అవుననే చెప్పాలి. మూడో ప్రశ్నకు సమాధానం చర్చించాకే తేలుతుంది. మొదట కేబినెట్ సంగతి చూద్దాం. ఇందులో అనుభవం లేనివారే ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నం దున వాజ్‌పేయి మంత్రివర్గం సహచరుల్లో అత్యధి కులు వృద్ధులనే సాకుతో వారిని బీజేపీ ‘మార్గదర్శక మండల్’కే పరిమితం చేశారు. రాజ్‌నాథ్‌సింగ్, అరు ణ్జైట్లీ, సుష్మాస్వరాజ్, అనంత్‌కుమార్ వంటి యువ నేతలను మోదీ మంత్రివర్గంలో చేర్చుకున్నారు. మౌలిక సదుపాయాల నిర్మాణంలో సొంత రాష్ట్రంలో అనుభవం ఉన్న నితిన్ గడ్కరీకి స్థానం లభించింది. అలాగే, పూర్తిస్థాయి కేబినెట్లో నాలుగైదు కీలక శాఖలు నిర్వహించే స్థాయికి ఎదిగిన పీయూష్ గోయల్ కూడా మోదీ కేబినెట్ సభ్యుడే. 70 మంది సభ్యులున్న మోదీ కేబినెట్లో ఇంతకు మించి చెప్పు కోదగ్గవారెవరూ లేరు. మిత్రులను అడగకుండా మిగి లినవారి పేర్లు చెప్పడం కష్టం. మోదీ సర్కారు ఐదో ఏట అడుగుపెట్టినప్పటి నుంచీ నేను జర్నలిజం విద్యార్థుల నుంచి బ్లూచిప్ కంపెనీల సీఈఓల వరకూ భిన్న వర్గాలవారితో మాట్లాడుతూ, ‘మన దేశ వ్యవసాయ మంత్రి పేరు చెప్పగలరా?’ అనే ప్రశ్న అడిగేవాణ్ని. జవాబు తమకు తెలుసని చేతులెత్తినవారు లేరు. ఒక వేళ రాధామోహన్‌సింగ్ పేరు చెబితే ఆయన ఎవరనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే, ఆయన నేతృత్వంలో వ్యవసాయరంగంలో వృద్ధి శరద్‌పవార్ నాయక త్వాన యూపీఏ హయాం నాటి వృద్ధిలో కేవలం సగమే ఉన్నప్పుడు.. ఆయన ఎవరైతే ఏం? అను కోవాల్సి ఉంటుంది. ఐదేళ్లలో వ్యవసాయాదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ 2017 హామీ నిజం కావాలంటే హరిత విప్లవం వంటిది అవసరం. కాని, ఇండియాలో సైన్స్‌ను, వ్యవసాయ పరిశోధనను పూర్తిగా కాదనుకోవడమేగాక వాటిని అనుమానంతో చూడడం దిగ్భాంతి కలిగించే విషయం. ఇప్పుడు ఈ రంగంలో దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వ్యవ సాయ ప్రయోగశాలల నుంచి శాస్త్రవేత్తలు విదేశాలకు వలసపోయే ప్రమాదం లేకపోలేదు. ఆవు పేడ, మూత్రం, వైదిక సేంద్రియ వ్యవసాయ పద్ధతులు గొప్పవని ఇప్పుడు ‘గుర్తించడం’ వల్ల ప్రయోజనం లేదు. దేశంలో సస్య విప్లవం సాధించాలనుకున్న ప్పుడు ఇందిరాగాంధీ సామర్ధ్యం, ప్రతిభాపాటవా లున్న సి.సుబ్రమణ్యంను వ్యవసాయమంత్రిగా నియమించారు. మరి రెండో హరిత విప్లవం సాధిం చడానికి నేటి సర్కారు ఎవరికి బాధ్యత అప్ప గించింది? ఇతర రంగాలకు అద్దంపట్టే వ్యవసాయ శాఖ! ఇతర రంగాల పరిస్థితికి వ్యవసాయ మంత్రిత్వశాఖ చక్కగా అద్దంపడుతోంది. ఆరోగ్యం, రసాయనా లు–ఎరువులు, భారీ పరిశ్రమలు, సైన్స్, టెక్నాలజీ, సామాజికS న్యాయం, చిన్నతరహా పరిశ్రమల శాఖల మంత్రుల పేర్లు చెప్పాలని నేను కలుసుకున్నవారిని ప్రశ్నించాను. సమాధానం లేదు. మన దేశ చరిత్రలో అత్యంత అనామక కేబినెట్ ఇదేననడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని సామర్థ్యం, నైపుణ్యం ఉన్న నేతలతో తన కేబినెట్‌ను నింపి ఉండాల్సింది. ప్రధాని కార్యాలయం నుంచే పాలనకు, అమలుకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి కాబట్టి అంతా మోదీ చేతిలోనే ఉంది. ప్రధాని దగ్గర సమర్థులు, అంకితభావమున్న ఉన్నతాధికారులున్నారు. అయితే, వారి ఆలోచనల అమలుకు సృజనాత్మకత ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానమంత్రి అత్యంత ప్రతిభావంతుడే. ఆయన చెప్పినట్టు దేశంలోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. అయితే, ఓ ఖండమంత ఉన్న భారీ దేశంలో ఎంతటి గొప్ప నాయకుడైనా ఆలోచనంతా ఒక్కడే చేయలేడు. ప్రధానికి సలహాలివ్వడానికి ఇంతకు ముందే ఉన్న బృందాలన్నింటినీ రద్దుచేయడం లేదా వాటి ప్రాధాన్యం తగ్గించడం కాకతాళీయం కాదు. నేడు జాతీయ భద్రతా సలహా మండలి(ఎన్ఎస్యేబీ)లో ఐదుగురే సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా పనిచేసు కుంటున్నారు. గతంలో అణుశక్తి సిద్ధాంతం సహా అనేక జాతీయ విధానాలను రూపొందించే అత్యంత శక్తిమంతమైన సంస్థగా ఇది పనిచేసేది. రక్షణరంగ నిపుణులు, ప్రజాహిత మేధావులు వంటి విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రముఖులతో ఇది పని చేసేది. అటల్‌బిహారీ వాజ్‌పేయి, బ్రజేష్ మిశ్రా నాయకత్వాన ఎన్ఎస్ఏబీ ఎంతో సాధించింది. ప్రస్తుతం ఇది జాతీయ భద్రతా సలహాదారుకు సమా చారమందించే సలహాసంఘంగా మారిపోయింది. ప్రధానికి, కేంద్ర కేబినెట్‌కు సలహాలిచ్చే రెండు శాస్త్ర సలహా మండళ్ల పనితీరు కూడా అంతంత మాత్రమే. నిరంతర కృషి జరగడం లేదు. మోదీ ప్రభుత్వం తన ప్రధాన శాస్త్ర సలహాదారును తన ఐదో ఏడాది చివర్లో నియమించింది. ఈ పదవిలో అగ్రశ్రేణి శాస్త్ర వేత్తను నియమించినా గాని, ఆ పదవి స్థాయిని సహా యమంత్రి నుంచి కార్యదర్శి హోదాకు తగ్గించేసింది. ఈ పదవికి ఏపీజే అబ్దుల్ కలాం వారసునిగా ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త ఆర్.చిదంబరం వచ్చినప్పుడు దీని స్థాయిని కేబినెట్ మంత్రి హోదా నుంచి తగ్గించారు. గతంలో కేబినెట్ శాస్త్ర సలహా మండలి భారతరత్న ప్రొ.సీఎన్ఆర్ రావు నాయకత్వంలో నడిచేది. ఇప్పు డిది దాదాపు లేనట్టే. నాలుగేళ్లలో ముగ్గురు ఆర్థికవేత్తలు అవుట్! మోదీ ప్రభుత్వం తన నాలుగేళ్లలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన తన నలుగురు ఆర్థికవేత్తల్లో ముగ్గురిని కోల్పోయింది. వారు: రఘురామ్‌రాజన్, అరవింద్ పన్గడియా, అరవింద్ సుబ్రమణ్యన్. నాలుగో ఆర్థిక వేత్త ప్రస్తుత రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇప్పుడు తన సంస్థాగత స్వాతంత్య్రం, వృత్తిపరమైన గౌరవం కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతు న్నారు. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) విష యంలో ప్రభుత్వం చెప్పినట్టు విని తన బాధ్యత విస్మరించారనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ కుంటి నడకతో ముందుకు సాగడంతో ప్రధాని ఆర్థిక సలహా మండ లిని ఆర్బాటంగా పునరుద్ధరించింది. అయితే, ఏం జరుగుతోందో తెలుసా? మండలితో సమావేశం కావడం లేదు. ప్రభుత్వంలో అంతర్భాగమైన ఇద్దరు అధిపతులతోనే ఆయన భేటీ అవుతున్నారు. వారు: ఆర్థిక శాస్త్రవేత్త బిబేక్ దేబ్రాయ్, మాజీ ఐఏఎస్ అధికారి, వ్యయ విభాగం కార్యదర్శి రతన్ వాటాల్. ఈ సలహా మండలిలోని మిగిలిన నలుగురు పేరు గొప్పేగాని ప్రయోజనం లేకుండా కొనసాగుతు న్నారు. ప్రధాని పరిశీలనకు అత్యధిక నివేదికలను రూపొందించేది దేబ్రాయ్, వాటాల్ మాత్రమే. కనీసం ఈ నివేదికల ప్రతులను కూడా మిగిలిన నలుగురికి చూపిస్తారా? అంటే నాకు అనుమానమే. ఈ ప్రభుత్వంలో లోపలివారికే ప్రాధాన్యం. బయటి వారి పాత్ర అలంకారప్రాయమే. ఇదంతా చూస్తే పాండిత్యమంటే సర్కారుకున్న చీకాకు స్పష్టమౌ తోంది. కిందటేడాది ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘కష్టపడి పనిచేస్తే హార్వర్డ్ను అధిగ మించవచ్చు’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను బట్టి ఈ విషయం అర్థమయింది. మొదట విపరీ తంగా కష్టపడితేనే ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూని వర్సిటీ(అమెరికా)లో సీటు లభిస్తుంది. భిన్నాభిప్రా యాలకు చోటు కల్పించేలా ప్రభుత్వం ఉంటే– గొప్ప విద్యాసంస్థలైన హార్వర్డ్, ఎంఐటీ, యేల్, జేఎన్‌యూ లోని అత్యుత్తుమ ప్రతిభావంతులను పిలిచి పద వులు ఇవ్వవచ్చు. అరవింద్ సుబ్రమణ్యన్ తన పదవి నుంచి వెళ్లిపోగానే ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)పదవిలో నియామకానికి కనీస అర్హతల్లో ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు చేయడం ఆశ్చ ర్యం కలిగించడం లేదు. కొత్త సీఈఏకు ఆర్థికశా స్త్రంలో డాక్టరేట్ అవసరం లేదు. కేవలం ‘కష్టపడి పనిచేసినట్టు’ సాక్ష్యాధారాలు చూపిస్తే చాలను కుంటాను. వాజ్‌పేయి నేతృత్వంలోని మునుపటి ఎన్డీఏ మంత్రివర్గం బీజేపీ అనుకూల ధోరణితో లేదని నరేంద్రమోదీ, అమిత్ షా ఇద్దరూ బలంగా విశ్వ సించారు. ఇప్పుడు తమకు మెజారిటీ ఉంది కాబట్టి బయటి వ్యక్తులకు ఎవరికీ చోటు ఇవ్వడానికి వీరు సిద్ధపడలేదు. వాళ్లకు ఏ విశిష్ట ప్రతిభలు ఉన్నప్పటికీ బయటివారికి చోటు ఇవ్వలేదు. ఇది మన మూడో ప్రశ్నను మళ్లీ చర్చకు తీసు కొస్తుంది. ఇదంతా ఓటరుకు పట్టదా? మంచి నేతలు గొప్ప మనస్సు కలిగి ఉంటారు. కానీ గొప్ప నేతలు విశాల హృదయాలను కలిగి ఉంటారు. ఇందిరా గాంధీ కూడా తన ప్రభుత్వాన్ని తన కార్యాలయం నుంచే నిర్వహించారు. కానీ తన చుట్టూ ఉన్న ప్రతి భావంతుల గురించి ఆమె ఆలోచించేవారు. తమకు అవసరమైన, తాము నమ్ముతున్న గొప్ప వ్యక్తులు తమ పార్టీలోనే ఉన్నారని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ప్రగాఢంగా విశ్వసించినట్లు కనబడుతోంది. కాని వారి వద్ద ఉన్న గొప్పతనం అనే మూలధనం పరిమితమైనదే. మోదీ ప్రభుత్వంలో మేధో పెట్టుబడి మూడో సంవత్సరానికే ఆవిరైపో యింది. వైద్య విద్యా సంస్కరణ ముసాయిదా రూపొందించడానికి నీతి అయోగ్ నాలుగేళ్ల సుదీర్ఘ సమయం తీసుకుంది. అలాగే ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు గనులను అమ్మే ప్రక్రియకు కూడా సుదీర్ఘ కాలం పట్టింది. ఈ ఆలస్యానికి పేలవమైన హోమ్ వర్క్, తీవ్ర మానసిక ఒత్తిడే కారణం.కీలక రంగాల్లో స్తబ్దత, క్షీణిస్తున్న ప్రతిష్ఠ, అసహనం వంటి రూపాల్లో మోదీ ప్రభుత్వం ప్రస్తుతం పడుతున్న ప్రసవవేదనను చూస్తుంటే, జర్నలిస్టులు అడిగే హేతుబద్దమైన ప్రశ్నలకుకూడా వారిని మందలించని, బెదిరించని కేబినెట్ మంత్రిని బహుశా నేను చూడలేదనే చెప్పాలి. అందుకే మోదీ ప్రభుత్వం రెండో దఫా కూడా సులువుగా అధికారం లోకి వస్తుందని ఏడాది క్రితం ఉన్న జనాభిప్రాయం ఇప్పుడు పెద్ద సందిగ్ధావస్థలో చిక్కుకున్నట్లుంది. వ్యాసకర్త ఖర్ గుప్తా ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
హిందుత్వపై సరికొత్త సమరం
దేశం అంటే జేఎన్‌యూను దాటి విస్తరించిన ప్రాంతమనీ, ఏ రాజకీయపక్షం కూడా మతానికి దూరంగా ఉండి దేవుళ్లందరినీ రాజకీయ ప్రత్యర్థులకు వదిలివేయదనే తెలివైన అవగాహన రాహుల్‌గాంధీని నడిపిస్తోంది. తమకు పోటీగా భక్తిశ్రద్ధలున్న హిందువుగా కనిపించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు బీజేపీని కంగారుపెడుతు న్నాయి. అందుకే, రాహుల్ మానససరోవర్ యాత్ర ఫొటోలపై అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది. హిందువులుగా తమ మతంపై తమకున్న గుత్తాధిపత్యాన్ని రాహుల్ తాజా యాత్రలతో దెబ్బతీస్తారని బీజేపీ ఊహించలేదు. హిందువులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ కొంత మేరకు బీజేపీ మార్గంలోనే పయనించడం కొత్త పరిణామం. పరమశివుడి దయ కోసం కైలాస్ మానస సరోవర్ వెళ్లిన రాహుల్ గాంధీ పాలకపక్షంలో గుబులు పుట్టించగలిగారు. ప్రతిపక్ష నాయకులకు ఇంతకన్నా ఏం కావాలి? నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుని తీర్థయాత్రపై బీజేపీ నేతలు సక్రమంగా అలోచించి ‘ఎంత గొప్ప ఐడియా వచ్చింది, మీకు! భోలేనాథుడు(శివుడు) మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ ప్రత్యర్థుల కోసం కూడా మీరు శివుడ్ని ప్రార్థించండి’ అని స్పందించి ఉంటే బావుం డేది. శివుడు కూడా బీజేపీని మెచ్చుకునేవాడు. బీజేపీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. లోక్‌సభలో కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఆరు రెట్ల బలం ఎక్కువున్నా కాషాయపక్షంలో ఆత్మవిశ్వాసం ఆ స్థాయిలో కనిపిం చడం లేదు. రాహుల్ పంపిస్తున్న యాత్ర ఫొటోలు నిజమైనవా, కావా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ట్విటర్ వ్యాఖ్యలతో వివాదాల మంటలు సృష్టించే కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఈ వివాదం రేపారు. ఊతకర్రతో దిగిన రాహుల్ ఫొటోలు ఫొటో షాప్ ద్వారా తయారుచేసినవని, ఆ చిత్రంలో రాహుల్ వెనుక నీడ లేదంటే ఫొటో నిజం కాదని ఆయన చెప్పారు. రాహుల్ ఎంత తెలివిగా యాత్ర వెళితే, బీజేపీ అంత తెలివి తక్కువగా కైలాస యాత్రపై వ్యాఖ్యానించింది. బీజేపీకి నెహ్రూపై ఎంత వ్యతిరేకత ఉందంటే, దేవుని ఉనికిపై తేల్చి చెప్పలేని ఆయన అజ్ఞేయవాదమే ఆయన వారసులను కూడా నడిపిస్తోందనే పిచ్చి నమ్మకం దాన్ని పీడి స్తోంది. ఇందిరాగాంధీ, రాజీవ్, ఇద్దరూ ఆస్తికులు గానే వ్యవహరించారు. వీరిద్దరూ లౌకికమార్గంలో పయనించారంటే వారు తమ ‘వంశ’ స్థాపకుడు నెహ్రూలా దేవునిపై విశ్వాసం లేనివారని అనుకో వడం తెలివితక్కువతనమే. ఇందిర మెడలో రుద్రాక్ష మాల ఉండేది. ఆలయాలు, బాబాలు, తాంత్రికులను దర్శించడం ఆమెకు అలవాటే. రాజీవ్‌గాంధీ తాను ప్రధానిగా ఉండగా అయోధ్యలో రాముడి గుడి తలుపులు తీయించారు. ఇక్కడ నిర్మించే ఆలయానికి భూమిపూజకు అనుమతించారు. గెలిస్తే రామరాజ్యం తెస్తానంటూ 1989 లోక్‌సభ ఎన్నికల ప్రచారం అయోధ్య నుంచే ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన పదేళ్ల యూపీఏ పాలనపై నరేం ద్రమోదీ–అమిత్‌షా నడిపే బీజేపీలో కొంత గందర గోళం ఉంది. మొదటి ఐదేళ్లూ వామపక్షాల మద్ద తుతో మన్మోహన్సింగ్ సర్కారు నడవడం బీజేపీ అవగాహనలో లోపానికి కారణం. మధ్యేవాద, లెఫ్ట్ పార్టీలపై ఆధారపడి నడవడం వల్ల ఈ ప్రభుత్వం మతపరమైన ఎలాంటి ప్రదర్శన లేకుండా సాగింది. అయితే, అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందాన్ని సమర్థిస్తూ దూకుడుగా మన్మోహన్ జవాబిస్తూ, గురు గోవింద్‌సింగ్ పంజాబీలోకి తర్జుమా చేసిన చండీ ప్రార్థన గురించి తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. యుద్ధానికి వెళ్లే ముందు చండీ మాత ‘నేనెప్పుడూ మంచి చేసేలా, నేను శత్రువుతో తలపడినప్పుడు గెలి చేవరకూ పోరాడేలా నన్ను ఆశీర్వదించండి’ అంటూ శివుడిని కోరుతూ చేసిన ప్రార్థనను మన్మోహన్ పార్ల మెంటులో గుర్తుచేశారు. లౌకికత్వంపై బీజేపీకి అవగాహన ఎంత? నెహ్రూ పాటించిన పకడ్బందీ లౌకికవాదాన్ని కాంగ్రెస్ ఎప్పుడో వదిలేసింది. కానీ, కాంగ్రెస్ దాన్నే పట్టుకు వేళ్లాడుతోందనే పొరపాటు అవగాహన బీజేపీకి ఉంది. ఇందిర హయాం నుంచీ కాంగ్రెస్ అన్ని మతాలవారిని ఏక కాలంలో ఆకట్టుకునే విధా నాలు బాహాటంగా అనుసరించింది. అంటే, హిందు వులకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తూనే, మైనారిటీల పక్షాన గట్టిగా నిలబడుతున్నట్టు ప్రకటించు కుంది. దీన్నే బీజేపీ మైనారిటీలను బుజ్జగించడంగా విమర్శిస్తోంది. అయితే, రాహుల్ మరి కొన్ని అడు గులు ముందుకేసి తాను ‘జంధ్యం వేసుకున్న హిందు వు’గా జనం ముందుకొచ్చారు. వాస్తవానికి దేవుని నమ్మే మనలో చాలా మంది జంధ్యాలు ధరించరు. తెల్ల బట్టలతో ఆలయాలకు వెళ్లరు. రాహుల్ మాత్రం ముందే గొప్ప ప్రచారంతో టిబెట్‌లోని మానస సరోవర్కు తీర్థయాత్ర స్థాయిలో వెళ్లారు. అయితే, ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరూ ప్రదర్శించని విధంగా రాహుల్ తాను హిందువుననే విషయాన్ని చాలా దూకుడుగా ప్రదర్శించుకుంటున్నారు. బీజేపీ తీవ్రవాద హిందుత్వకు విరుగుడుగా ఆయన సుతి మెత్తని హిందుత్వ మార్గంలో పయనిస్తున్నారు. కర డుగట్టిన లౌకిక వామపక్షవాదుల్లో రాహుల్‌కు కొత్తగా మద్దతుదారులైనవారు మాత్రం ఈ పరిణామాలు దిగమింగుకోలేకపోతున్నారు. కానీ దేశం అంటే జేఎన్‌యూను దాటి విస్తరించిన ప్రాంతమనీ, ఏ రాజకీయపక్షం కూడా మతానికి దూరంగా ఉండి దేవుళ్లందరినీ రాజకీయ ప్రత్యర్థులకు వదిలివేయదనే తెలివైన అవగాహన రాహుల్‌గాంధీని నడిపిస్తోంది. తమకు పోటీగా భక్తిశ్రద్ధలున్న హిందువుగా కనిపించ డానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు బీజేపీని కంగా రుపెడుతున్నాయి. అందుకే, ఇటీవల దేవాలయాలు దర్శించినప్పుడు దేవుని విగ్రహాల ముందు హిందువులా సరిగా మోకాళ్లపై కూర్చోలేదంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. రాహుల్ మానససరోవర్ యాత్ర ఫోటోలపై అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది. హిందువులుగా తమ మతంపై తమకున్న గుత్తాధిపత్యాన్ని రాహుల్ తాజా యాత్రలతో దెబ్బ తీస్తారని బీజేపీ ఊహించలేదు. మొత్తంమీద హిందువులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ కొంత మేరకు బీజేపీ మార్గంలోనే పయనించడం కొత్త పరిణామం. ఐదుగురి అరెస్టుపై అనూహ్య స్పందన! మావోయిస్టులతో సంబంధాలున్నాయనే సాకుతో ఇటీవల బీజేపీ సర్కారు అరెస్టు చేసిన ఐదుగురు ప్రముఖులకు రాహుల్ సూచనతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మద్దతు, సానుభూతి ప్రకటించింది. కేంద్ర సర్కారు అరెస్టు చేసిన హక్కుల నేతలు, ‘పట్టణ నక్సల్స్’గా ముద్రవేసినవారికి రాహుల్ వెంటనే మద్దతు ప్రకటించారు. ఈ విషయంపై పార్టీ వేదికల్లో ఎక్కడా చర్చించలేదు. కాంగ్రెస్ రాజకీయ ఆలోచనలో మార్పునకు ఇదో సంకేతం. పైన చెప్పిన ఐదుగురు ప్రముఖుల్లో నలుగురిని ఆయన యూపీఏ ప్రభుత్వమే అరెస్టు చేసి, వేధించింది. వారిలో ఒకరు ఆరేళ్లు, మరొకరు ఏడేళ్లు జైల్లో గడిపారు. చట్టవ్యతి రేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఊపా) సహా అనేక నల్ల చట్టాల కింద వారిపై యూపీఏ ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసి జైళ్లో పెట్టింది. సాయుధ నక్సలైట్లను, వారికి సానుభూతిపరులుగా ఉండే మేధావులను కాంగ్రెస్ ప్రభుత్వం వేటాడింది. అణచి వేసింది. మావోయిస్టు నేత కోబాడ్ గాంధీని, ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ అధ్యాపకుడు జీఎన్ సాయిబాబాను ఆయన యూపీఏ సర్కారు అరెస్టు చేసి, వారు అప్పటినుంచీ జైళ్లలో మగ్గిపోయేలా చర్యలు తీసుకుంది. రాహుల్ సొంత ప్రభుత్వానికి చెందిన రహస్య పోలీసు సంస్థలు ఇద్దరు ప్రముఖ మావోయిస్టు నేతలు చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్), మల్లోజుల కోటేశ్వరరావు(కిషన్‌జీ)లను ఎన్కౌంటర్ల పేరుతో దారుణంగా చంపించాయి. మరి ఇప్పుడు రాహుల్ నక్సల్స్ విషయంలో తన వైఖరి మార్చుకుంటున్నారా? వామపక్ష తీవ్రవాదం (నక్సలైట్లు) దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పు అని 2006లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. వామపక్షాల మద్దతుపై యూపీఏ ఆధారప డిన మొదటి ఐదేళ్లలో ఇదంతా జరిగింది. వామపక్షాలను, వామపక్ష తీవ్రవాదాన్ని వేరు చేసి మన్మోహన్ చాలా తెలివిగానే మాట్లాడారు. అంటే, ఈ వైఖరికి భిన్నంగా రాహుల్ భావిస్తున్నారని అనుకోవచ్చా? నక్సల్స్ విషయంలో కాస్త మెత్తగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా, ఆయన యూపీఏ ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా నడిచే అవకాశాలు లేవు. అయితే, అప్పట్లో ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు మావోస్టుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నప్పుడు అప్పటి కేంద్రమంత్రి పి.చిదంబరం కఠిన వైఖరి అవలంబించకుండా రాహుల్ తల్లి సోనియా ద్వారా ప్రయత్నించారనే ప్రచారం ఉంది. 1971 యుద్ధం, స్వర్ణాలయంలో ఆపరేషన్ బ్లూస్లార్ తర్వాత ఈ రాష్ట్రంలోని చింతల్నార్‌లోనే భద్రతాదళాలు ఎక్కువమందిని నష్టపోయాయి. చిదంబరం ఆదేశాలతో బస్తర్‌లో భద్రతాదళాలు నక్సలైట్లపై భారీ స్థాయిలో పోరు ప్రారంభించగానే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయసింగ్ కేంద్ర సర్కారు అను సరిస్తున్న ఈ విధానం ‘ఒంటి కన్ను’దని దుయ్య బట్టారు. అప్పుడే ఒడిశాలో మావోయిస్టు్టలు అపహ రించిన ఓ ఐఏఎస్ అధికారిని విడుదల చేయించడానికి ప్రభుత్వం ఓ కీలక నక్సల్ నేత భార్యను విడుదల చేయించింది. సోనియా అధ్యక్షతన నడిచిన ఎన్ఏసీ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి హర్ష మందర్ నడుపుతున్న ఓ ఎన్జీఓ సంస్థకు ఈ నక్సల్ భార్య అధిపతిగా ఉన్నారు. అలాగే, ఛత్తీస్‌గఢ్ పోలీసులు రాజద్రోహ నేరం మోపిన పిల్లల వైద్యుడు బినాయక్ సేన్‌ను కోర్టు దోషిగా తేల్చాక బెయిలుపై విడుదలవగానే అప్పటి ప్రణాళికా సంఘంలోని ఆరోగ్యకమిటీ సభ్యునిగా ఆయనను తీసుకున్నారు. మారనున్న బీజేపీ ఎన్నికల వ్యూహం! 2017 డిసెంబర్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన బీజేపీ అనుభవం దృష్ట్యా ప్రధానంగా ఆర్థికరంగంలో తమ సర్కారు పనితీరు ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోరాడకూడ దని మోదీ–షా ద్వయం నిర్ణయించుకున్నట్టు తెలు స్తోంది. వారు ప్రజలకు తమ హిందుత్వ, అవినీతి వ్యతిరేక పోరాటం, తీవ్ర జాతీయవాదం–ఈ మూడు అంశాలకూ సమ ప్రాధాన్యం ఇచ్చి పార్లమెంటు ఎన్ని కల్లో విజయానికి ప్రయత్నిస్తారు. బీజేపీ హిందు త్వకు పోటీగా రాహుల్ తన తరహా హిందూత్వతో ప్రయోగాలు ప్రారంభించారు. జాతీయభద్రత విష యంలో మెతకగా వ్యవహరిస్తే భారత ప్రజలు సహించరు. సాయుధ నక్సల్ ఉద్యమానికి జనం పల్చగా ఉన్న కొన్ని మారుమూల జిల్లాల్లో తప్ప ఇంకెక్కడా మద్దతు లేదు. హిందుత్వ, జాతీయ వాదాలను పరిమిత స్థాయిలో ఆచరిస్తే కాంగ్రెసే నష్ట పోతుంది. రాహుల్ తన పంథా మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని స్వయంగా అందించినట్టే అవుతుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
నిప్పుతో చెలగాటం ప్రమాదకరం!
‘వికాస్’ వాగ్దానంతో చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే అయినప్పుడు ‘జాతీయవాదం’ పేరుతో ప్రజలను చీల్చి ఓట్లు సంపాదించడమే అత్యంత ఆకర్షణీయంగా బీజేపీకి కనిపించడం సహజమే. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి ఇది చక్కటి మార్గం. 2019 ఎన్నికల వరకూ అస్సాం ‘మంటలు’ ఆరిపోకుండా బీజేపీ చూసు కుంటుంది. ఈ క్రమంలో బీజేపీ లక్షలాది మందిని ‘చొరబాటుదారుల’నే ముద్ర వేస్తుంది. అంటే, దేశంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలందరికీ ఈ మాట వర్తించేలా చూస్తుంది. ‘లౌకిక’ ప్రతిపక్షాలను ఈ బెంగాలీ ముస్లింలను సమర్థించేలా చేయడమే బీజేపీ వ్యూహం. 2019 ఎన్నికల్లో బీజేపీకి అస్సాం సమస్య కీలకమౌతుంది. అయితే, ఇది చివరికి హిందువులకు కూడా హాని చేసే విషపూరిత అంశంగా మారే ప్రమాదం లేకపోలేదు. 35 ఏళ్ల క్రితం అస్సాంలోని నెల్లీ మారణకాండ ఇంకా గుర్తుంది. అస్సాంలో విదేశీయులను గుర్తించడానికి రూపొందించిన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్నా ర్సీ)పై రేగుతున్న చర్చ సందర్భంగా బ్రహ్మపుత్రా నది ఉత్తర తీరంలోని ఖోయిరాబారీ, గోహ్పూర్, సిపాజార్ వంటి ప్రాంతాల్లో ఏం జరిగిందీ మరవ కూడదు. 1983లో బ్రహ్మపుత్రా లోయలో జరిగిన ఘర్షణల్లో దాదాపు ఏడు వేల మంది మరణించారు. పైన చెప్పిన మూడుచోట్ల దాదాపు హిందువులే ప్రాణాలు పోగొ ట్టుకున్నారు. అదీ సాటి హిందువుల చేతుల్లోనే వారు హతులయ్యారు. అస్సాంలో ‘విదేశీ పౌరుల’ (ముస్లింలని భావించాలి)పైనే జనంలో కోపముంటే హిందువులను హిందువులే ఎందుకు చంపుకుంటున్నారు? ఈశాన్య భారతంలోని అనేక విషయాల మాదిరిగానే ఇది కూడా సంక్లిష్ట సమస్య. ఇక్కడ దాడిచేసే హిందువులు అస్సామీ మాట్లాడే వారైతే మారణకాండల్లో చనిపోయేది బెంగాలీలు. ఇద్దరూ ఒక మతానికి చెందినవారే అయినా రెండు వర్గాల మధ్య భాష, జాతిపరమైన విద్వేషాలు విషపూరితంగా మారాయి. అలాకాకుండా నెల్లి వంటి ప్రదేశాల్లో బెంగాలీ ముస్లింలను అస్సామీ హిందు వులు చంపారు. బీజేపీ, మంచి జరుగుతుందని ఆశించిన సుప్రీంకోర్టు ఈ పాత విద్వేషాలను మళ్లీ రగిలేలా చేస్తున్నాయి. 40 లక్షల మందికి దొరకని చోటు! ఎన్నార్సీ తుది ముసాయిదాలో 40 లక్షల మంది ప్రజల పేర్లు లేవు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇది తాత్కాలిక తొలి జాబితా అన్నారు. పేర్లు లేని లక్షలాది మంది ప్రజలను ‘చొరబాటుదారులు’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్లమెంటులో అభి వర్ణించారు. ఈ 40 లక్షల మందిలో మూడో వంతు హిందువులేనని అస్సాం ఆర్థిక మంత్రి (వాస్తవానికి ఈయనే నిజమైన ముఖ్యమంత్రి) హిమంతా బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ సమస్యకు పరిష్కారంగా బీజేపీ కొత్త పౌరసత్వ బిల్లు రూపొందించింది. దీని ప్రకారం పొరుగు దేశాలకు చెందిన హిందువులు, సిక్కులు వంటి భారత మతాలకు చెందినవారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించారు. ఒకవేళ ఈ బిల్లు చట్టమైనా ‘భూమిపుత్రులైన’ అస్సా మీలు దీనిపై ఎలా స్పందిస్తారు? ఈ స్థానిక అస్సా మీలకు తమ ప్రాంతంలో హిందువులైనా, ముస్లిం లైనా బెంగాలీలతో కలిసి జీవించడం అసలేమాత్రం ఇష్టం లేదు. 1983లో రెండు వర్గాల బెంగాలీలను వారు ఊచకోతకోశారు. కొత్త పౌరసత్వ బిల్లును ఇప్పటికే మాజీ సీఎం, ప్రస్తుత బీజేపీ సంకీర్ణ సర్కారు భాగస్వామి ఏజీపీ నేత ప్రఫుల్లకుమార్ మహంతా వ్యతిరేకిస్తున్నారు. చివరకు పౌరుల జాబి తాలో చోటు దక్కనివారు ఈ 40 లక్షల మందిలో ఐదు లక్షల మందికి మించకపోవచ్చని అంచనా. పౌరసత్వానికి సాక్ష్యంగా చూపించడానికి గ్రామ పంచాయతీలు జారీచేసే పత్రాలు చెల్లవని గువా హటీ హైకోర్టు నిర్ణయించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టు ఉత్తర్వును తిరస్కరించింది. అంతే గాక, ఈ పంచాయతీలు ఇచ్చే ధ్రువీకరణపత్రాలు చెల్లుబాటు కావడానికి వాటిని ఏ పద్ధతిలో జారీ చేయాలో కూడా నిర్ణయించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు బాధ్యత అప్పగించింది. ఈ గందరగోళం మధ్య ఎన్నార్సీ ముసాయిదా జాబితా రూపొందిం చారు. మారిన పద్ధతిలో పంచాయతీలు జారీచేసే ధ్రువీకరణ పత్రా లన్నీ చెల్లుబాటయితే ‘విదేశీయు లు’గా తేలే జనం దాదాపు ఉండరనే చెప్పవచ్చు. ఇలా జరగడం బీజేపీకి ఇష్టం లేదు. అస్సాం ఒప్పందమే ఆధారం! విదేశీయులను తేల్చే ప్రక్రియ విషయంలో 1985 నాటి రాజీవ్‌గాంధీ, ఆసు/ఆల్ అస్సాం గణ సంగ్రామ పరిషత్ శాంతి ఒప్పందం స్ఫూర్తితో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అస్సాం పౌరు లెవరో తేల్చడానికి రాష్ట్రంలో 1971 మార్చి 25 నాటికి ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుని ఎన్నార్సీ రూపొందించాలని కోరింది. అంటే, ఈ తేదీకి ముందు ఇండియాలోకి వచ్చినవారెవరైనా చట్టబద్ధ మైన పౌరుల కిందే లెక్క. 1971 మార్చి 26న అవ తరించిన బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రహ్మాన్, ప్రధాని ఇందిరాగాంధీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అప్పటికి ఇండియాలోకి ప్రవేశిం చిన కోటికి మందికి పైగా బంగ్లా శరణార్థులను వెనక్కి తీసుకోవడానికి బంగ్లాదేశ్ అంగీకరించింది. ఈ ఒప్పందం ఆధారంగా 1971 మార్చి 25 అనే తేదీని పౌరసత్వానికి గీటురాయిగా నిర్ణయించారు. ఈ శరణార్థుల్లో దాదాపు 80 శాతం మంది హిందు వులే. కాని, హిందువులైనా, ముస్లింలైనా ఈ బంగ్లా శరణార్థులందరూ వెనక్కి పోవాలనే ఇందిరాగాంధీ కోరుకున్నారు. 33 ఏళ్ల తర్వాత విదేశీయుల సమ స్యకు పరిష్కారంగా అస్సాం ఉద్యమకారులతో ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ 1985లో ఒప్పందం చేసుకుని, ఈ ప్రాతిపదికన ఎన్నార్సీ రూపొందిస్తామని వాగ్దా నం చేశారు. అనేక కారణాల వల్ల ఎన్నార్సీ ఇంత వరకు తయారు కాలేదు. రెండు తరాల జనం పుట్టి పెద్దయ్యాక ఇప్పుడు విదేశీయులంటూ వారిని ఎలా బయటకు పంపాలి లేదా వారి ఓటు హక్కు రద్దు చేయాలి? ఇది జరగని పనని బీజేపీకి కూడా తెలుసు. అమిత్‌షా ప్రసంగం ఏమి సూచిస్తోంది? ఇందులో రాజకీయమేమీ లేదని బీజేపీ నేతలెవరైనా అంటే, అమిత్‌షా ప్రసంగం వినలేదా? అని వారిని నిలదీయవచ్చు. 2019 ఎన్నికల ప్రచారానికి పునాది వేసినందుకు ఆయనకు పూర్తి మార్కులు ఇవ్వవచ్చు. ఆయన ప్రసంగం అంత సూటిగా, పారదర్శకంగా ఉంది. ‘వికాస్’ వాగ్దానంతో చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే అయినప్పుడు ‘జాతీయవాదం’ పేరుతో ప్రజలను చీల్చి ఓట్లు సంపాదించడమే అత్యంత ఆకర్షణీయంగా బీజేపీకి కనిపించడం సహ జమే. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడా నికి ఇది చక్కటి మార్గం. ఎన్నిక వరకూ అస్సాం ‘మంటలు’ ఆరిపోకుండా బీజేపీ చూసుకుంటుంది. ఈ క్రమంలో బీజేపీ లక్షలాది మందిని ‘చొరబాటు దారుల’నే ముద్ర వేస్తుంది. అంటే, దేశంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలందరికీ ఈ మాట వర్తించేలా చూస్తుంది. ‘లౌకిక’ ప్రతిపక్షాలను ఈ బెంగాలీ ముస్లింలను సమర్థించేలా చేయటమే బీజేపీ వ్యూహం. ఈ ప్రతిపక్షాలు ముస్లిం అనుకూలమేగాక, జాతివ్యతిరేక మనే భావం ప్రజల్లో కలుగుతుందనేది బీజేపీ అంచనా. ముస్లింలకు అనుకూలమా లేదా వ్యతిరేకమా అనేది 2019 పార్ల మెంటు ఎన్నికల్లో ప్రధానాంశం అయితే బీజేపీకే విజయం సొంతమౌ తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ‘జాతీయవాదుల’ను బీజేపీకి అనుకూలంగా మలచుకోవడానికి అస్సాం ‘విదేశీయుల’ సమస్య అమిత్‌షా చేతిలో పదునైన ఆయుధంలా మారింది. దేశంలో ఎన్నికల రాజకీ యాలు అమిత్‌షాకు, బీజేపీకి తెలిసినంతగా మరెవ రికీ తెలియవు. అయితే, బీజేపీకి అస్సాం గురించి తెలుసా? ఏళ్లు వెనక్కిపోయి, నేను గువాహటీ నగ రంలోని నందన్ హోటల్లో బసచేసిన ఓ చిన్న గది గురించి చెప్పాలి. ఈ రూమ్‌కు వచ్చిన నలుగురు అతిథులు శక్తిమంతులే కాదు మర్యాదస్తులు కూడా. అక్కడ పరిస్థితులు వారిని ఆందోళనకు గురిచేశాయి. వారి నాయకుడు కేఎస్ సుద ర్శన్. అప్పుడాయన ఆరెస్సెస్ బౌద్ధిక్ ప్రముఖ్ (మేధో విభాగం అధిపతి). తర్వాత ఆయన ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ (అధి పతి) అయ్యారు. 35 ఏళ్ల క్రితం ఫిబ్రవరి నెలలో అస్సాంలో అంతమంది బెంగాలీ హిందువులు ఎలా మారణకాండ బారినపడ్డారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే వీరు అప్పట్లో నన్ను కలిశారు. ముస్లిం చొరబాటుదారులకు, హిందూ శరణార్థులకు మధ్య ఉన్న తేడాను ఈ అస్సామీయులు ఎందుకు గుర్తించలేకపోయారు? ఖొయిరాబారిలో వారు ఇంతమంది హిందువులను ఎలా చంపగలిగారు అని సుదర్శన్ నన్ను ప్రశ్నిం చారు. అస్సాంలోని జాతి, భాషాపరమైన సంక్లిష్టతలే ఈ మారణకాండను ఇంత పాశవికంగా కొనసాగించారని నేను ఆయనకు వివరించాను. కానీ హిందువులకు రక్షణ లేకపోయింది కదా అని సుదర్శన్ వాపోయారు. ఆ తర్వాత ఆరెస్సెస్ అస్సామీ ఆందోళనకారులను పున చైతన్యపరిచేందుకు సహనంతో కూడిన ప్రచారాన్ని చేపట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను రాసిన ‘రైటింగ్స్ ఆన్ ది వాల్‘ రచన వారి విజయానికి అద్దం పట్టింది. ఇప్పుడు అస్సాంలో బీజేపీ అంటే మాజీ ఏఏఎస్యు, ఏజీపీ సంస్థల నుంచి పరివర్తన చెందిన కార్యకర్తలు, నేతలు మాత్రమే. చివరకు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన సహ మంత్రులు కూడా వీరిలో భాగమే కావడం గమనార్హం. కానీ 1983లో వారి యవ్వనప్రాయంలో చేసినట్లుగానే, ఎన్ఆర్సీపై ఆర్ఎస్ఎస్/బీజేపీ పెట్టే షరతులను పాటించేందుకు వీరు తలొగ్గుతారా? ఆ షరతులేమిటి అంటే బెంగాలీ ముస్లింలను లక్ష్యంగా చేసుకోండి, హిందువులను కౌగలించుకోండి. 2019 సార్వత్రిక ఎన్నికలలో అస్సాంను తన కీలకాంశంగా ఉపయోగించుకోవాలని బీజేపీ దాదాపుగా నిర్ణయిం చుకుంది. రాజకీయ లబ్ధికోసం ఆర్ధిక నష్టాన్ని పణంగా పెట్టడం అనేది ఒక అంశం కాగా, సంక్షుభిత అస్సాలో పాత జ్వాలలను మళ్లీ రగుల్కొల్పడం అనేది మరొక అంశం. పరిస్థితులు ప్రశాంతంగా ఉంటే ఇది సంభవమే కానీ అశాంతి చెలరేగిందంటే మాత్రం ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు, బెంగాలీలకు వ్యతిరేకంగా అస్సామీయులు, హిందూ లేక ముస్లింలు, హిందువుకు వ్యతిరేకంగా హిందువు, ముస్లింకు వ్యతిరేకంగా ముస్లిం ఇలా పెను విద్వేషం రకరకాల రూపాలుగా తయారయ్యే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఈ సందేశాల పరమార్థం ఏమిటి?
కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలో శివసేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు. రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. కానీ శివసేన ఎన్డీఏ నుంచి బయట పడితే చాలు రాహుల్ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్జీ’ అని రాహుల్ ఇచ్చిన సందేశా నికి కారణమిదే. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి. భారత రాజకీయాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఇక్కడ శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరు. కేవలం మారే స్వార్థ ప్రయోజనాలే కనిపి స్తుంటాయి. ఈ రాజకీయ పొత్తులు, అవి ముగిసి పోవడం–ఇవన్నీ కొన్ని లెక్కల ప్రకారం సాగుతుం టాయి. ఉత్తరాదిన వీటినే హిందీలో ‘జోడ్–తోడ్ రాజినీతి’ (కలయికలు–చీలికల రాజకీయం) అని పిలుస్తారు. అయితే, ఈ తరహా రాజకీయాలు ప్రస్తుతం మారిపోతున్నాయి. నేను రాజకీయ విలే కరిగా ఉన్న రోజుల్లో భారత రాజకీయాల్లో గొప్ప గురువులుగా పేరొందిన ముగ్గురు నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఎల్.కె.ఆడ్వాణీ, దివంగత సీతారాం కేసరీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అదృష్టం నాకు దక్కింది. ఇండియాలో రాజకీయాధికారం ఎలా నడు స్తుందనే విషయంలో విభిన్న అంశాలకు సంబం ధించి ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ‘స్పెషలిస్ట్ ప్రొఫెసరే’. దేశంలో మొత్తం రాజకీయ శాస్త్రంలో అత్యంత నిష్ణాతుడైన అధ్యాపకుడు∙ప్రణబ్‌దా అని నేనంటే ఆయనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని భావిస్తాను. 1980ల చివరి నుంచీ ఆడ్వాణీ తన పార్టీ బీజేపీని బలోపేతం చేసే పని ప్రారంభించారు. 1984లో రెండు సీట్లు గెలిచిన ఈ పార్టీని 1989లో 85 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునే స్థాయికి, 1998లో అధికారంలోకి వచ్చే స్థితికి ఆయన తీసు కెళ్లారు. అనేక పార్టీలతో పొత్తుల ద్వారా సంకీర్ణ కూటమి నిర్మాణంతో విజయం సాధించవచ్చని ఆయన చెబుతారు. ‘‘మేం జాతి వ్యతిరేకమని భావించే పార్టీలు ఐదు ఉన్నాయి. వీటిని మిన హాయిస్తే మరెవరితోనైనా పొత్తుకు మేం సిద్ధమే’’ అని ఆయన అంటారు. ఆడ్వాణీ దృష్టిలో ఈ ఐదు ‘అంటరాని’ పార్టీలు–కాంగ్రెస్, వామపక్షాలు, ములాయం నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), లాలూ నడిపే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), ముస్లింలీగ్(ఇలాంటి తరహా పార్టీలైన ఒవైసీల ఎంఐఎం, అస్సాం అజ్మల్ పార్టీ ఏఐయూడీఎఫ్ సహా). బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మినహా వేరే దారి లేని శివసేన, శిరోమణి అకాలీదళ్, ఒక దశలో టీడీపీ ఆ పార్టీ పంచన చేరాయి. వీటిలో మొదటి రెండు పార్టీలూ తమ రాజకీయాలకు, అధికారం సాధించడానికి మతమే కీలకం కావడం వల్ల కాషా యపక్షంతో జతకట్టాయి. కాంగ్రెసే తన ఏకైక ప్రత్యర్థి కావడంతో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఆడ్వాణీ రూపుదిద్దిన సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉన్న మొదటి మిశ్రమ సర్కారు. అప్పటి వరకూ సీనియర్ నేత జార్జి ఫెర్నాండెజ్ ‘అత్తగారి దేశంలో (ఇటలీ–సోనియా మాతృదేశం) సంకీర్ణ ప్రభుత్వాలు లక్షణంగా నడుస్తున్నప్పుడు ఇండి యాలో ఇవి ఎందుకు పనిచేయవు?’ అని గతంలో అన్నప్పుడల్లా జనం భయపడేవారు. తర్వాత ఆ ‘కూతురు’ (సోనియా) నిర్మించిన రెండు సంకీర్ణాలు పూర్తి కాలం పదేళ్లు అధికారంలో కొనసాగాయి. ‘సంకీర్ణ పరిస్థితులు’ పెద్దగా మారనే లేదు! ప్రధాన జాతీయపక్షాలు ఎప్పటికీ పొత్తు పెట్టుకోని పార్టీలు ఉన్నాయి. అలాగే, వేరే దారి లేక ప్రధాన పక్షాలతో చేతులు కలిపే పార్టీలూ ఉన్నాయి. రెండో తరహా పార్టీల్లో శరద్ పవార్ నేతృత్వంలోని నేషన లిస్ట్ కాంగ్రెస్‌పార్టీ(ఎన్సీపీ) మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం కోసం సిద్ధాంతాలు వదులుకునే రాజకీయపక్షాలకు 75 నుంచి 150 లోక్‌సభ సీట్లు వస్తుంటాయి. అందుకే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజా రిటీకి అవసరమైన 272 సీట్లు ఎలా గెలవాలనే విష యానికి బదులు 160 వరకూ సీట్లు దక్కించుకునే ఇలాంటి పార్టీలపై చర్చ ఎక్కువవుతోంది. 2014 పార్లమెంటు ఎన్నికల ముందునాటి స్థితికి మళ్లీ దేశం చేరుకుంటోందని పరిస్థితులు సూచిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవ కాశం లేదు. ఏ పార్టీకీ 272 సీట్లు రాని 1989 తర్వాత పరిస్థితికి చేరుకుంటున్నాం. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేకు ట్విటర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ‘‘శ్రీ ఉద్ధవ్ ఠాక్రేజీ, జన్మ దిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో ఆనం దంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను,’’ అని సందేశం పంపడంలో పరమార్థం ఏమిటి? మనసులో ఓ మాట, పైకో మాట రాజకీయ నేతలకు సహజమే. రాజకీయ ప్రత్యర్థికి పుట్టినరోజు లేదా పండగ శుభా కాంక్షలు చెప్పడం సర్వసాధారణం. అలాగే, తన బద్ధ రాజకీయ ప్రత్యర్థి దగ్గరకు వెళ్లి ఓ బడా నేత కావ లించుకోవడం చూసి మనం ఆశ్చర్యపడాల్సినది కూడా ఏమీ లేదు. కాని, ఉద్ధవ్‌కు రాహుల్ సందేశం విషయంలో మనం కొంత ఆలోచించక తప్పదు. కాంగ్రెస్ అధ్యక్షుడెవరూ బహిరంగంగా ఎవరికీ శుభా కాంక్షలు తెలిపిన సందర్భాలు లేవు. సైద్ధాంతికంగా పూర్తిగా అసహ్యించుకోవాల్సిన విలువలు పాటించే పార్టీ నేతకు దేశ ప్రజలందరూ చూసేలా ట్విటర్లో ఇలా గ్రీటింగ్స్ చెప్పడం వింతే మరి. కాంగ్రెస్‌కు బీజేపీ కన్నా శివసేన మరింత అంటరాని పార్టీగా ఉండాలని రెండు పార్టీల నేపథ్యం చెబుతోంది. అదీ గాక, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట మిలో ముఖ్య భాగస్వామ్య పక్షం శివసేన. శివసేన అధినేతకు దగ్గరవడానికి రాహుల్ ఇప్పుడిలా బహిరంగ ‘ప్రేమలేఖ’తో ప్రయత్నిం చడం మూడు విషయాలను సూచిస్తోంది. ఒకటి, బీజేపీ– శివసేన మధ్య సంబందాలు దెబ్బతినడం ఆయన గమనించారు. రెండోది, 2019 ఎన్నికల్లో తన వ్యూహంపై మరింత స్పష్టత ఇచ్చారు. నేను కాకున్నా ఫరవాలేదు గాని, మోదీకి బదులు ఎవరు ప్రధానిగా అయినా అభ్యంతరం లేదనే విషయం మరోసారి తేల్చి చెప్పారు. ఇక మూడోది, 2019లో దేశంలో సంకీర్ణయుగం మళ్లీ ఆరంభమైతే, రాజకీయ పక్షాల మధ్య పొత్తులు ఆడ్వాణీ చెప్పిన రీతిలో ఉండవనేది రాహుల్ అభిప్రాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వ్యూహంపై స్పష్టతనిచ్చిన రాహుల్ శత్రువు శత్రువు మిత్రుడనేది పాత మాట. నీ శత్రువు సన్నిహిత మిత్రునికి దగ్గరవడానికి నీవు సిద్ధంగా ఉన్నావంటే దేశ రాజకీయాల్లో ఇది కొత్త పంథాకు సంకేతంగా కనిపిస్తోంది. బాగా బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలంటే సిద్ధాంతాలు పక్కనపెట్టి, కొత్త పోకడలకు తెరతీయవచ్చనే తెలివి రాహుల్‌కు వచ్చి నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్న కారణంగా ఎవరు దేశాన్ని పరిపాలిస్తారనే విషయం మళ్లీ చర్చకు వస్తోంది. లోక్‌సభ ఎన్నికలను నేను తరచు తొమ్మిది సెట్ల టెన్నిస్ మ్యాచ్‌తో పోల్చేవాడిని. ఎవరు ఐదు సెట్లు గెలుస్తారో వారే విజేత. భారత పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. వచ్చే ఎన్ని కల్లో ‘తొమ్మిది సెట్లు’గా చెప్పే రాష్ట్రాలు ఏవంటే– ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, కర్ణా టక, కేరళ. ఇవి పెద్దవి కావడంతో 9 రాష్ట్రాల జాబి తాలో చేర్చాను. అంతేకాదు, ఈ రాష్ట్రాల్లో మార్పు అనేది సాధ్యమౌతుంది. అందుకే, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌ను చేర్చలేదు. ఈ 9 రాష్ట్రాల్లోని మొత్తం లోక్‌సభ సీట్లు 342. వీటిలోని ఐదు రాష్ట్రాల్లో గెలిచే సంకీర్ణ కూటమికి దగ్గరదగ్గర 200 వరకూ సీట్లు దక్కే అవకాశముంది. లేకున్నా 160కి పైగానే స్థానాలు తప్పక లభిస్తాయి. అందుకే 2014 వరకూ 272 సీట్ల గెలుపుకున్న ప్రాధాన్యం ఇక 160 సీట్ల కైవసం చేసుకోవడానికి లభిస్తుందని అనుకోవచ్చు. యూపీలో బీజేపీకి సగంపైగా సీట్లు గల్లంతే! మోదీ–అమిత్‌షా నాయకత్వంలోని బీజేపీని కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా చూడ టమే అత్యంత ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తరప్ర దేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తే బీజేపీకి ఘన విజయం దక్కదు. 2014లో గెలిచిన 73 సీట్లలో సగం కూడా గెలవడం కష్టం. అప్నాదళ్ వంటి చిన్న మిత్రపక్షాలు సైతం బీజేపీతో కలిసి ఉంటాయా? అంటే చెప్పడం కష్టం. అలాగే, కిందటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణాలో బీజేపీ బలం బాగా తగ్గుతుంది. ఈ నష్టాలను తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలవడం ద్వారా భర్తీ చేసు కోవాలని బీజేపీ అనుకుంటోంది. కాబట్టి, యూపీ తర్వాత అత్యధిక ఎంపీలను పంపే అంటే 48 లోక్‌సభ సీట్లున్న మహారాష్ట్రలో బలం నిలబెట్టుకోవడమే బీజేపీ అతి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. మహా రాష్ట్రలో శివసేన సాయం లేకుండా ఒంటరి పోరుతో విజయం సాధించడం గురించి అమిత్ షా తన పార్టీ శ్రేణులను సమీకరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే, శివసేన లేకుండా బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోలేదనే విషయం ఆయనకు తెలుసు. రాహుల్కీ ఈ వాస్తవం తెలుసు. 2019 లోక్ సభ ఎన్నికలు నేను పైన చెప్పినట్టు 9 సెట్ల టెన్నిస్ మ్యాచ్‌లా మారితే, మహారాష్ట్రలో బీజేపీ (ఎన్డీఏ) గెల వకుండా రాహుల్ సాధ్యమైనంత కృషిచే యాలి. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలో శివ సేన చేరుతుందని నమ్మే అమాయకులెవరూ లేరు. రాహుల్‌కు ఆ అవసరం కూడా లేదు. శివసేన ఎన్డీఏ నుంచి బయటపడితే చాలు రాహుల్ లక్ష్యం నెరవేరుతుంది. లోపాయికారి ఎన్నికల సర్దుబాట్లు కాంగ్రెస్, పవార్‌కు కొట్టిన పిండి. ‘హ్యాపీ బర్త్‌డే, ఉద్ధవ్జీ’ అని రాహుల్ ఇచ్చిన సందేశానికి కారణమిదే. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మోదీ ప్రసం గిస్తూ, ఇదే తరహాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ‘వికాస్ పురుష్’ అంటూ ఆయనపై ప్రశం సలు కురిపించారు. ప్రాంతీయపక్షాలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలా మోదీ కేసీఆర్‌కు, రాహుల్ ఉద్ధవ్‌కు దగ్గరవడానికి ప్రయత్నిçస్తూ మాట్లాడటాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారనేది ముందే చెప్పడం కుదరదు. ఈ విషయాన్ని అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
రాహుల్ ఆలింగనం వెనుక సందేశం ఇదే!
మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్ సందేశంగా అర్థమౌతోంది. కర్ణాటకలో తన జూనియర్ భాగస్వామి అయిన జేడీఎస్‌కు వెంటనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాహుల్ తన పార్టీ సంప్రదాయానికి, ఆధిపత్య పోకడలకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్ సందేశంగా అర్థమౌతోంది. ఆయుధాలు లేని ద్వంద్వ యుద్ధాల్లో ఇలా ముందుకు సాగవచ్చేమోగాని, దయాదాక్షిణ్యాలు లేని రాజకీయాల్లో ఇలాంటి పోరు ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చ అనేక ప్రశ్న లకు జవాబిచ్చింది. 2019 ఎన్నికలను ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్య క్షుడు రాహుల్‌గాంధీ మధ్య పోరుగా బీజేపీ చిత్రించడాన్ని ప్రతిపక్షాలు అనుమతిస్తాయా లేక రాష్ట్రానికో తీరున కాషాయపక్షంతో అవి తలపడ తాయా? రాహుల్‌ను చూసి బీజేపీ భయపడాలా? ఆయనను పాలకపక్ష మెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. మోదీతో తలపడే పట్టుదల, దూకుడు తనకున్నాయని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోదీ వ్యతిరేక పోరు తన నాయకత్వంలోనే సాగుతుందని రాహుల్ చెప్పకనే చెప్పారు. ‘పెద్దలు’ గంభీర ప్రసంగాలతో నీతులు చెప్పే రాజకీయ ప్రపంచంలో రాహుల్ తన అనూహ్య ప్రవర్తనతో కొంత పప్పూలా కనపడడం వల్ల నష్టమేమీ లేదు. భారత ఓటర్లలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువతకు సీనియర్ నేతల నీతిబోధలు విసుగుపుట్టిస్తాయి. కాబట్టి రాహుల్ పోకడ వారికి బాగానే ఉంటుంది. ఇప్పటి వరకూ తనను సవాలు చేసే నేత లేకుండా ముందుకు పోతున్న మోదీకి పోటీగా రాజకీయ గోదాలో రాహు ల్ను ప్రత్యర్థిగా నిలబెట్టారు. కాంగ్రెస్ కోరుకున్నది సరిగ్గా ఇదే. సభలో రాహుల్ ప్రదర్శించిన దూకుడు, స్పష్టత చూసి కాంగ్రెస్ వాదులే ఆశ్చర్యపోయారు. ప్రధానిపై పదునైన విమర్శలతో, మధ్యమధ్యలో పాలకపక్ష నేతలను ‘డరో మత్’ (భయపడకండి) అంటూ తనకంటే అన్ని విధాల బలవంతుడైన తన ప్రత్యర్థితో తలపడడం ద్వారా రాహుల్ చాలా పెద్ద ‘రిస్క్’ తీసుకున్నారు. శ్రోతలను ఉర్రూతలూగించే వాగ్ధాటి, అతి ఆడంబరంగా కనిపించే ఆలింగనాల విషయంలో ఆరితేరిన మోదీతో పోటీకి దిగడం రాహుల్ ధైర్యానికి అద్దంపట్టింది. ఆయుధాలు లేని ద్వంద్వ యుద్ధాల్లో ఇలా ముందుకు సాగవచ్చేమోగాని, దయాదాక్షి ణ్యాలు లేని రాజకీయాల్లో ఇలాంటి పోరు ఆత్మహత్యాసదృశమే. రాజకీయాలను కుస్తీ, ద్వంద్వయుద్ధం వంటి ఆయుధాలు అవసరం లేని క్రీడగా భావిస్తే.. మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇందులో బాగా ఆరితేరారనేది అందరికీ తెలిసిన సత్యం. రాహుల్ వంటి ప్రతిపక్ష నేతలు ఈ క్రీడల్లో ఇంకా విద్యార్థులేనని చెప్పాల్సి ఉంటుంది. లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రసంగంతో మీడి యాలో ప్రధాన శీర్షికలతో ప్రచారం సంపాదించాలంటే కీలక సందర్భం కోసం నాయకులు పోరాటయోధుల మాదిరిగా ఎదురు చూస్తారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, అనూహ్య ఆలింగ నంతో మోదీతో ప్రత్యక్షంగా తలపడడం ద్వారా రాహుల్ తన 14 ఏళ్ల రాజకీయ జీవితంలో అతి పెద్ద సాహసం చేశారు. ఈ ప్రత్యక్ష పోరులో మోదీని ‘నాకౌట్’ చేయలేకపోయినా రాహుల్ కొన్ని పాయింట్లు తన ఖాతాలో వేసుకోగలిగారు. కానీ, పార్లమెంటరీ చర్చల్లో మెరుపులు మెరిపించి కొన్ని ‘పాయింట్లు’ సాధించడం వల్ల రాజకీయ వాస్తవాలు మారవు. రాహుల్ ఎంత గొంతు చించు కుని మాట్లాడి, మోదీని కౌగిలించుకున్నా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం 325– 125 ఓట్ల తేడాతో వీగిపోయింది. మోదీకి జనం విశ్వసించదగిన పోటీదారుగా ఎదగాలంటే రాహుల్ ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఇంతవరకూ ఆయన ఏ రాష్ట్ర ఎన్నిక ల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించింది లేదు. ఆయన పార్టీ ఒకటిన్నర రాష్ట్రాల్లో (కర్ణాటకలో సగం) పరిపాలన సాగిస్తోంది. అవసరమై నన్ని నిధులు లేక కాంగ్రెస్ అల్లాడుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలయ్యే నాటికి ఆయన పార్టీ నేతలు, వారి కుటుం బసభ్యులు ‘అవినీతి’ ఆరోపణలపై వేసిన కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితులున్నాయి. 2019 ఎన్నికల్లో పోటీచేయడం అంటే కాంగ్రెస్ తన మొదటి ఇన్నింగ్స్ సీట్ల లోటుతో (అంటే లోక్‌సభలో మెజారిటీకి అవసర మైన 270కి పైగా సీట్ల నుంచి ఇప్పటి 44 తీసేస్తే వచ్చే సంఖ్య 230) రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ లోటు భర్తీ కావడానికి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎలాంటి ‘ప్రభం జనం’ కనిపించడం లేదు. ఈ లెక్కన రాహుల్ రాజకీయ క్షేత్రంలో నిజంగా ఎదిగారా? అనేది ప్రధానాంశం కాదు. ఆయన ఇంకా ఎదగలేదు. గమ్యం చేరుకోవడానికి ఇంకా చాలా దూరం పరుగులు తీయాల్సి ఉంది. ఆయన కేవలం నేతగా అవతరిం చారు. టీవీ చానళ్ల మాటల్లో చెప్పాలంటే ఆయన ఇప్పటి పరిస్థితు లకు తగినట్టు పైకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. రాజకీయాలు, ప్రజాసేవపై ఆయనకున్న అంకితభావం, దృష్టిపై గతంలో అను మానాలుండేవి. తరచూ దేశం నుంచి అదృశ్యమౌతూ విదేశాల్లో చక్కగా గడపడానికి పోవడం వంటి చర్యలతో ఆధారపడదగిన నేత కాదనే ఇమేజ్‌ని ఆయనే సృష్టించుకున్నారు. ఆయనకు ఈ విషయం చెప్పే ధైర్యం పార్టీ నేతలకు లేదు. కానీ, కాంగ్రెస్ చుక్కాని లేని నావలా మారిందని, తమ నాయకుడు నిజంగా పూర్తి కాలం పనిచేసే అధ్యక్షుడు కాదనే దిగులుతో కుమిలిపోయే వారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు రాహుల్‌పై ఇలాంటి అభిప్రాయాలు తొలగించడానికి ఎంతవరకు తోడ్పడతాయో? రాహుల్ తన తల్లి సోనియా కంటే చాలా భిన్నమైన శైలిగల నాయకుడినని నిరూపించుకున్నారు. ఇప్పటి వరకూ ఏబీ వాజ్ పేయి తర్వాతి బీజేపీని సోనియా, ఆమె పార్టీ ద్వేషంతో, ధిక్కా రంతో చూస్తూనే ఉన్నాయి. మోదీని అంటరాని నేతగా పరిగణిస్తు న్నాయి. సహజంగానే రాజకీయ పోరుకు ముందుకు దూకే స్వభావమున్న మోదీ కాంగ్రెస్ ధోరణిని తనకు అనుకూలంగా మార్చు కున్నారు. పదేళ్ల క్రితం మోదీని ‘మృత్య్ కా సౌదాగర్’ (మృత్యు బేహారి–మరణాలతో వ్యాపారం చేసే నేత) అని సోనియా వర్ణిం చారు. మోదీ అదే దారిలో ఈ తల్లీకొడుకులను జెర్సీ ఆవు, దూడ అంటూ అభివర్ణించారు. ఇప్పుడేమో మోదీ దగ్గరకు పోయి కౌగ లించుకున్న రాహుల్ ప్రధానిని ప్రేమిస్తున్నానని చెప్పారు. కానీ, రాజకీయాల్లో వ్యంగ్యం అనేది ప్రత్యర్థిని అంటరానివాడిగా చూడటం కన్నా తక్కువ బాధకలిగిస్తుంది. అలాగే, కర్ణాటకలో తన జూనియర్ భాగస్వామి అయిన జేడీఎస్‌కు వెంటనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాహుల్ తన పార్టీ సంప్రదాయానికి, ఆధి పత్య పోకడలకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్ సందేశంగా అర్థమౌతోంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కశ్మీర్లో హక్కుల హననం
కశ్మీర్లో రాజకీయాలకు విశ్వసనీయత లేకుండా పోయింది. ప్రజలు ప్రభుత్వానికి దూరమయ్యారు. మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ ఒత్తిడులు పెరుగు తున్నాయి. పాక్ తెగింపు ఎక్కువైంది. జాతీయ రాజకీయాల్లో ఏకాభిప్రాయం లేదు. గతంలో పాశ్చాత్య మానవ హక్కుల సంఘాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఇండియాలో అందరూ కశ్మీర్‌పై ఏకమయ్యారు. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందానికి ఉన్న విలువపై అప్పటి అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాబిన్ రాఫేల్ చేసిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేసింది. మళ్లీ ఇప్పుడు బాధ్యతారహితమైన ఐరాస నివేదిక అలాంటి పని చేసింది. కశ్మీర్‌పై ఐక్యరాజ్యస మితి మానవ హక్కుల మండలి నివేదిక అంతా తప్పుల తడకే. దీనిలో వాస్తవాలు, రూపకల్పనలో పద్ధతులు, లక్ష్యాలపై చర్చించడం శుద్ధ దండగ. కశ్మీర్ రాజకీయ పరిస్థితిపై రాసిన విషయాలు పూర్తిగా లోపభూయిష్టమైనవి. ఈ నివేదిక పాకి స్తాన్‌ను గాని, ఇండియాను గాని తప్పుబడుతోందా? అంటే ఏ మాత్రం లేదని చెప్పవచ్చు. రెండు దేశాలూ కశ్మీర్‌ను తోబుట్టువుల ఆస్తి తగాదాలా చూస్తు న్నాయి. ఇక్కడ సీమాంతర ఉగ్రవాదంపై పోరాడు తున్నానని ఇండియా భావిస్తూ మానవహక్కులకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. కశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు తాను నిధులు, ఆయుధాలు సరఫరాచేస్తున్నట్టు తెలిపే మరో ఐరాస నివేదిక వచ్చినా పాక్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. న్యాయం కోసం నైతిక పోరాటం చేస్తున్నానని పాక్ భావిస్తోంది. కశ్మీర్లో చిచ్చుకు ఆజ్యం పోస్తున్న కారణంగా ‘జిహాద్ యూనివర్సిటీ’ వంటి ముద్రలను తనకు గౌరవసూచకమైన బిరు దులుగా ఈ దేశం పరిగణిస్తోంది. ఏదేమైనా రెండు దేశాలూ కశ్మీర్ కోసం చివరిదాకా పోరాడతాయి. అర్ధంపర్ధం లేని ఈ ఐరాస నివేదిక నివేదికలోని విషయాల గురించి మాత్రం ఇవి పట్టించుకోవు. ఈ నివేదిక కశ్మీర్ ప్రజలకు మేలు చేస్తుందనే అంచనాల కారణంగా దీన్ని నేను బుర్ర తక్కువ మనుషులు రూపొందించిందని అంటున్నాను. ఈ నివేదిక వల్ల ఇండియా దూకుడు మరింత పెరుగు తుంది. అలాగే, పాకిస్థాన్ కూడా ఎక్కువ సంఖ్యలో కశ్మీరీలను, తాను పంపించే యువకులను జిహాదీ లుగా మార్చి కశ్మీర్ చిచ్చు పెరిగేలా చేస్తుంది. ఎప్ప టికైనా భారత్‌ను ఈ పద్ధతుల ద్వారానే కశ్మీర్ నుంచి వైదొలగేలా చేయగలనని పాక్ నమ్ముతోంది. 1990ల నాటి ప్రమాదకర పరిస్థితుల్లో కశ్మీర్ అనేక దురదృష్టకర పరిణామాల ఫలితంగా కశ్మీర్ 1990ల నాటి ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంది. ఈ కల్లోల రాష్ట్రంలో మానవ హక్కుల పరిస్థితి నానా టికి దిగజారుతుందంటూ ఐరాస, పాశ్చాత్య దేశాల మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు ఇండియాపై విపరీతంగా ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ విష యంలో భారత్ మరింత బలహీనంగా కనిపిస్తోంది. మరి ఈ సంస్థల నివేదికలపై ఇండియా ఎలా స్పంది స్తోంది? పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రాంతాల న్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెబుతూ భారత పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదిం చింది. గతంలో ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్ పేయి, అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో కలిసి వెళ్లిన ద్వైపాక్షిక భారత ప్రతినిధి బృందం జెనీవా సమావేశంలో చారి త్రక విజయం సాధించింది. భారత తీర్మానం ఆమో దానికి మానవ హక్కులకు పెద్దగా విలువ ఇవ్వని చైనా, ఇరాన్‌తో ఇండియా చేతులు కలపాల్సి వచ్చింది. ఈ ఐరాస నివేదిక వల్ల కూడా ఇలాంటి అనేక దేశాలు ఏకమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఐరాస మానవహక్కుల మండలి నివేదికను భారత భారత విదేశాంగశాఖ అధికారికంగా ఖండిస్తూ ప్రకటన చేసే లోపే ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలు కుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీవీ చానళ్లలో మాట్లాడారు. రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారీ హత్యతో ఈ నివేదికలోని దుర్మార్గమైన అంశాలను పరిశీలించే అవకాశం లేకుండాపోయింది. దృష్టి అంతా బుఖారీ హత్యపైకి మళ్లింది. రెండు దేశాలూ ఉద్దేశపూర్వకంగానే ఒకేలా వ్యవహరిస్తు న్నాయి. కశ్మీర్‌పై యుద్ధం ప్రకటించడానికి బదులు కశ్మీరీల స్వయం నిర్ణయాధికారాన్ని పరిశీలించాలన్న ఐరాస చేసిన సూచనను భారత్ గట్టిగా పట్టించు కోలేదు. అలాగే, స్వయం నిర్ణయాధికారం ప్రజలకు ఇస్తే ఇది చివరికి కశ్మీర్ స్వాతంత్య్రానికి దారి తీస్తుందనే భయం పాకిస్థాన్‌కు ఉంది. అందుకు పాక్ ఎన్నటికీ అంగీకరించదు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం కశ్మీర్‌ను పూర్తిగా ద్వైపాక్షి సమస్యగా ప్రకటించినప్పటి నుంచి ఐరాస కశ్మీరీల స్వయం నిర్ణయాధికారం లేదా ప్లెబి సైట్(జనాభిప్రాయ సేకరణ) గురించి మాట్లాడ లేదు. పాకిస్థాన్ అప్పుడప్పుడూ ఈ విషయాలను లేవనెత్తినాగాని లాహోర్, ఇస్లామాబాద్ లేదా షర్మెల్ షేక్‌లో ఇండియాతో కలిసి చేసిన సంయుక్త ప్రకట నల్లోగాని, ద్వైపాక్షిక ఒప్పందాల్లోగాని ఈ అంశీలపై పట్టుబట్టలేదు. కశ్మీర్ వివాదాన్ని రెండు దేశాలే పరిష్కరించుకోవాలని మాత్రమే ప్రకటించాయి. 1989–94 మధ్య ఐదేళ్ల కాలంలో కశ్మీర్ తీవ్రవాదం అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కశ్మీర్లో కనిపి స్తోందా? అనే విషయం మనం చర్చించాల్సి ఉంది. కశ్మీర్లో రాజకీయాలకు విశ్వసనీయత లేకుండా పోయింది. ప్రజలు ప్రభుత్వానికి దూరమయ్యారు. మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ ఒత్తిడులు పెరుగుతున్నాయి. పాక్ తెగింపు ఎక్కువైంది. జాతీయ రాజకీయాల్లో ఏకాభిప్రాయం లేదు. గతంలో పాశ్చాత్య మానవ హక్కుల సంఘాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఇండియాలో అందరూ కశ్మీర్‌పై ఏకమయ్యారు. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందానికి ఉన్న విలు వపై అప్పటి అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాబిన్ రాఫేల్ చేసిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేసింది. మళ్లీ ఇప్పుడు బాధ్యతా రహితమైన ఐరాస నివేదిక అలాంటి పని చేసింది. ఎందుకు ఈ స్థితికి చేరుకున్నాం? గతంలో ఐరాస, పాశ్చాత్య దేశాలు పదేపదే పనికి మాలిన, రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా ఇండియా తట్టుకుంది. మళ్లీ అదే స్థితికి ఎందుకు చేరుకున్నామో మనం ఆలోచించుకోవాలి. మనం కూడా అలాంటి తప్పులే చేయడం దీనికి కారణం. ఇండియాలో రాజకీయ, సైద్ధాంతిక వాతావరణం మారుతున్న క్రమంలో 1989లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కశ్మీర్లో కల్లోలం మొదలైంది. ఈ మైనారిటీ సర్కారుకు బయటి నుంచి వామపక్షాలు, బీజేపీ మద్దతు ఇచ్చిన విష యం తెలిసిందే. కశ్మీర్లో బలప్రయోగంతో ‘గట్టి’ వైఖరి అవలంబించాలని బీజేపీ కోరింది. ఫలితంగా, బీజేపీ చెప్పినట్టే కశ్మీరీ తీవ్రవాదులను అణచివేయ డానికి జగ్మోహన్ను గవర్నర్‌గా పంపించారు. అయితే, వామపక్షాల మద్దతుపై ఆధారపడిన కార ణంగా కేంద్రం ముస్లింలకు అనుకూల ధోరణిని కూడా అనుసరించింది. అదీగాక కశ్మీర్‌కే చెందిన ముఫ్తీ మహ్మద్ సయీద్ కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. దీనికితోడు కశ్మీరీలంటే ప్రేమ ప్రదర్శించే జార్జి ఫెర్నాండెజ్‌కు కశ్మీరీ వ్యవహరాల శాఖను కూడా అప్పగించారు. ఈ పరిస్థితుల్లో కశ్మీర్లో ఓ అధికార కేంద్రం దూకుడుగా ప్రవర్తిస్తే, రెండోది ప్రజలకు ఊరట కలి గించే రీతిలో వ్యవహరించేది. హోంమంత్రి సయీద్ ఎటు ఉంటారో ఊహకుందని విషయం కాదు. తీవ్ర వాదులు కశ్మీర్ లోయ నుంచి దుర్మార్గమైన రీతిలో కశ్మీరీ పండితులను ఊచకోతకోశారు. తీవ్రవాదం పాక్ భూభాగం నుంచి విస్తరించింది. తర్వాత కశ్మీర్ సమస్యపై పూర్తి అవగాహన ఉన్న పీవీ నరసింహా రావు అధికారంలోకి వచ్చాక సాయుధ దళాలకు అపరిమిత వనరులు, స్వేచ్ఛ కల్పించి, తీవ్రవాదాన్ని అణచివేయడానికి పూర్తి అధికారం ఇచ్చారు. రాష్ట్ర మానవ హక్కుల చరిత్రలో ఇది అత్యంత భయనక దశగా చెప్పవచ్చు. ఇంటరాగేషన్ పేరుతో దారుణాలకు పాల్పడ్డారు. సాధారణ ప్రజలపై జరి పిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. బిజ్బెహరాలో కాల్పుల ఘటన, కునాన్ పోష్‌పోరాలో సామూహిక బలాత్కారాల ఆరోపణలు– ఇవన్నీ ఈ కాలంలోనే కశ్మీర్‌ను అత లాకుతలం చేశాయి. అప్పుడే చరారే షరీఫ్ సంక్షోభం తలెత్తింది. కశ్మీర్ చరిత్రలో ‘హైదర్’ దశ! కశ్మీర్ చరిత్రలో ఈ కాలాన్నే నేటి తరం ప్రజలు హైదర్ దశగా గుర్తుంచుకుంటారు. కశ్మీర్ సమస్యపై ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ నిర్మించిన చిత్రమే హైదర్. 1996లో పీవీ సర్కారు పాలన ముగిసే నాటికి తీవ్రవాదాన్ని చాలా వరకు అణచివేశారు. అయితే, కశ్మీరీల మనోభావాలు బాగా దెబ్బదిన్నాయి. వీపీ సింగ్ ప్రభుత్వం మతిమాలిన పోకడలకు ఇండియా ఇంత భారీ మూల్యం చెల్లిం చాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే గందరగోళ పరిస్థితి మనకు కనిపిస్తోంది. తేడా ఏమంటే– అప్పట్లో వీపీ సింగ్ మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం ఏ రోజుకారోజు నెట్టుకుంటూ నడిచింది. నేటి బలమైన జాతీయవాద ప్రభుత్వానికి పార్లమెంటులో మంచి మెజారిటీ ఉంది. ఇంత తేడా ఉన్నా ప్రస్తుత బీజేపీ సర్కారు ఏం చేసింది? పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలను, కశ్మీర్ లోయను జమ్మూ ప్రాంతాన్ని కలపడానికి పీడీపీతో బీజేపీ చేతులు కలిపింది. కాని, ఆచరణలో తన ఉద్దేశాలు, లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించలేక పోయింది. ఏక కాలంలో బలప్రయోగం, ప్రజలను ఊరడించే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఒకే ప్రభు త్వంలో జగ్మోహన్, జార్జి ఫెర్నాండెజ్ పనిచేస్తున్న ట్టుగా వ్యవహారం కనిపిస్తోంది. అయితే, కశ్మీర్ వ్యవహారంలో లేనిదల్లా›మానవ హక్కుల సంఘాల ఒత్తిడి, కశ్మీర్ భారత్‌లో విలీనంపై రాబిన్ రాఫేల్ వంటి మంత్రులు పశ్నించడమే. ఇప్పుడు అనాలో చితమైన ఐరాస మానవ హక్కుల మండలి నివేదిక కారణంగా ఈ లోటు కూడా తీరిపోయింది. కశ్మీర్ కల్లోలం మళ్లీ 1993 నాటి పరిస్థితికి చేరుకుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఒంటరి స్వేచ్ఛ నిలబడదు
ప్రస్తుత మీడియా గతంలో కంటే ఎక్కువగా చీలిపోయి ఉంది. మీడియా ఒక మర్యాద పూర్వక ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి దాని తాత్వికతలలో, సిద్ధాంతాలలో, అభిప్రాయాలలో భేదాలు ఉన్నాయి. అయితే ఇవాళ వేదికల ప్రాతిపదికగా కూడా మీడియా చీలిపోయింది. ఈ చీలికలు ఇంకా పెరిగితే మరింత తీవ్రమైన దెబ్బ తినక తప్పదు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిబంధనావళి కలిగి ఉన్నాయి కానీ, డిజిటల్ మీడియాకు అలాంటి నిబంధనలు లేవంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని సారాంశం గమనించండి! గడచిన అర్థ శతాబ్దకాలంలో చూస్తే భారతదేశ చరిత్రలో శక్తిమంతులైన ముగ్గురు ప్రధానమంత్రులు కనిపిస్తారు. ఈ ముగ్గురికీ కూడా పూర్తి ఆధిక్యం ఉంది. వారివి స్థిరమైన ప్రభుత్వాలు. వీరిలో మొదటి ప్రధాని ఇందిరాగాంధీ. మార్చి, 1971లో జరిగిన ఎన్నికలలో ఆమె, ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్ (ఐ) విపక్షాలను తుడిచి పెట్టడం కనిపిస్తుంది. తరువాత రాజీవ్ గాంధీ, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 1984లో ఘన విజయం సాధించారు. మనకున్న శక్తిమంతుడైన ఆ మూడో ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఐదేళ్ల పాలన ఇప్పుడు చివరి సంవత్సరంలోకి ప్రవేశించబోతోంది కూడా. అయితే స్పష్టత కోసం 1980–84 ఇందిర పాలనను ఇందులో చేర్చడం లేదు. అప్పుడు హత్యకు గురికావడంతో ఆమె పదవీకాలం అర్థాంతరంగా ముగిసిపోయింది. తరచి చూస్తే ఈ మూడు ప్రభుత్వాల నడుమ ఒక సారూప్యతను మీరు కనుగొనగలరు. ఇందుకోసం ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ వంటి ఒక ఆధారం కూడా నన్ను ఇవ్వనివ్వండి. ఈ ముగ్గురు ప్రధానులు కూడా తమ తమ ఐదేళ్ల పాలన ఆఖరి సంవత్సరాలలో ఏం చేయడానికి ప్రయత్నించారో ఆలోచించండి! ఇప్పటికీ ఊహించడం దగ్గరే ఉన్నారా? అయితే మరొక ఆధారం ఇస్తున్నాను– పత్రికా రచయిత మాదిరిగా ఆలోచించండి! వాస్తవాలు ఇక్కడున్నాయి. ఈ ముగ్గురు ప్రధానులు కూడా తమ తమ పాలన చివరి ఏడాదిలో మీడియా స్వేచ్ఛను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఇందిరాగాంధీ ఐదేళ్ల పాలనలోని సరిగ్గా చివరి సంవత్సరంలోనే అత్యవసర పరిస్థితి ప్రకటించి, పత్రికల మీద సెన్సార్ నిబంధనలను విధించారు (ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తరువాత, అందుకు తనకు తాను ఇచ్చుకునే కానుక అన్నట్టు పార్లమెంట్ కాలపరిమితిని ఒక సంవత్సరం, అంటే ఆరేళ్లకు పొడిగించుకున్నారు). స్వార్థ ప్రయోజనాలూ భారత్‌ను అస్థిరం చేయాలన్న కుట్ర కలిగిన ‘విదేశీ హస్తం’ కనుసన్నలలో మెలగుతున్న పత్రికారంగం (అప్పటికి ఈ రంగాన్ని ఎవరూ మీడియా అని పిలిచేవారు కాదు) ప్రతికూలతను, విద్వేషాన్ని వెదజల్లుతున్నదని ఇందిర వాదన. ఏవో కొన్ని తప్ప పత్రికలన్నీ దారికొచ్చేశాయి. దారికి రాని పత్రికల వారు జైళ్లకు వెళ్లవలసి వచ్చింది. ఆయా సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. రాజీవ్ కూడా అంతే. తన ఐదేళ్ల పాలన తుది అంకంలో అంటే 1987–88 సంవత్సరంలో సదరు పరువు నష్టం బిల్లు తీసుకువచ్చారు. బొఫోర్స్ కుంభకోణం, జైల్‌సింగ్ సవాలు, వీపీ సింగ్ తిరుగుబాటు వంటి వాటితో సతమతమవుతున్న రాజీవ్ కూడా సహజంగా పత్రికారంగాన్ని తప్పుపట్టారు. ఆ బిల్లు అసలు లక్షణాలు ఏమిటో గ్రహించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఒక ఆంగ్లపత్రికను – ఇండియన్ ఎక్స్‌ప్రెస్–ఏకాకిని చేసి ‘శిక్షించేందుకు’ దాని మీద వందలాది దొంగకేసులు నమోదు చేయించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ‘నకిలీ వార్త’ మీద పోరాటం పేరుతో ప్రధానస్రవంతి మీడియా మీద దాడిని కొనసాగించే యత్నం చేస్తున్నది. అయితే ప్రధాని జోక్యంతో అలాంటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు నాటకీయంగాను, అంతే సంతోషంతోను తప్పుల తడక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు. అలా ప్రకటించినప్పటికీ మోదీ ప్రభుత్వం ఆ పని ఇంకా చేయవలసి ఉందన్నదే నిజం. పైగా ఒక ఆధారం ఇస్తున్నట్టుగానే ఆ ఉపసంహరణ ప్రకటన వెలువడింది. ఎలాగంటే డిజిటల్ మీడియాకు నియమావళిని రూపొందించడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అందులో ఉంది. ఈ వాదన ఎలా ఉందంటే, పత్రిక, ప్రసార రంగాలకు వాటి నిబంధనావళి వాటికి ఉంది (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ). ఎటొచ్చీ ఇబ్బందికరంగా ఉన్న డిజిటల్ మీడియాకే ఇలాంటి వ్యవస్థ ఏదీ లేదు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఆ మీడియాను పనిచేయడానికి అనుమతించరాదు. పత్రికారంగ పూర్వపు నిబంధనలలో ‘మూడు ఉదాహరణల నిబంధన’ ఒకటి. మూడింటిని ఒకేసారి స్పృశిస్తే అవి ఒకే విషయాన్ని బోధపరుస్తాయి. ఏక ఖండంగా ఉన్న దారంలా కనిపిస్తాయి. కాబట్టి, శక్తిమంతమైన ప్రభుత్వాలు చివరి అంకంలో ప్రవేశించనప్పుడు వాటికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే వారిని చెడ్డవార్తల సంగతి చూసేటట్టు చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటేæ, అది వేరే చర్చ. వారి ఆకస్మిక పతనాన్ని వారే నమ్మలేకపోవడం, లేదా మరోసారి ప్రభుత్వంలోకి రావడం గురించి ఉన్న అభద్రతా భావం చెడువార్తలను ప్రచురిస్తున్నాయంటూ పత్రికలను తప్పు పట్టేట్టు చేస్తాయి కాబోలు. 1975 ఆరంభం నాటి పరిస్థితి ఏమిటో మనకి తెలుసు. 20 శాతానికి మించిన ద్రవ్యోల్బణంతో, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంతో ఇందిరాగాంధీ పతనావస్థకు చేరుకున్నారు. అయినా పత్రికలను అదుపు చేయాలన్న ప్రయత్నంలో చాలావరకు విజయం సాధించారు. ఎందుకంటే చాలా పత్రికలు తలొగ్గాయి. అయితే పత్రికల మీద విధించిన సెన్సార్ నిబంధనల కారణంగా ప్రజలు శిక్షించడం వల్లనే ఇందిర ఓటమి పాలయ్యారని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించడమనే ఘోర తప్పిదానికి ఆమె పాల్పడకుండా ఉండి ఉంటే, అత్యవసర పరిస్థితి కాలం నాటి ‘క్రమశిక్షణ’ చాలా ప్రాచుర్యంలో ఉండేది. కానీ ఆమె శత్రువులు అధికారంలోకి రావడంతో ఆమె జైలుకు వెళ్లారు. ఒక సాంఘిక ఒప్పందం అక్కడ ఆవిర్భవించింది. ఆ మేరకు సెన్సార్ నిబంధనలలోని క్రూరత్వాన్ని ప్రజలు గ్రహించి పత్రికా స్వేచ్ఛకు పూచీ పడ్డారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి నిర్దిష్టమైన చట్టాలు లేని దేశంలో ఇలాంటì మలుపు పెద్ద పరిణామం. ఆ మేరకు పత్రికా రంగాన్ని అదుపులో పెట్టాలన్న ఇందిర ఆలోచన పూర్తిగా బెడిసికొట్టింది. రాజీవ్‌గాంధీ కూడా తన తప్పిదాలను పత్రికల మీదకు నెట్టివేసి, వాటిని శిక్షించాలని ప్రయత్నించారు. ఆయన కూడా అందులో విఫలమైనారు. ఆయన తల్లికి జరిగినట్టే ఆయన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దేశంలో ప్రముఖ పత్రికా సంపాదకులు, ఆఖరికి యజమానలు వారి వారి స్పర్థలను, వైరుథ్యాలను కూడా పక్కన పెట్టి ప్లకార్డులు పట్టుకుని జనపథ్ రోడ్డులో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇలాంటి సంఘీభావం అత్యవసర పరిస్థితి కాలంలో ఎప్పుడూ కనిపించలేదు. రాజీవ్ వెనక్కి తగ్గారు. మీడియా గొంతు నొక్కే ఉద్దేశంతో ఆ రెండు ప్రభుత్వాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు చివరికి మీడియా స్వేచ్ఛను బలోపేతం చేస్తూ ముగిశాయి. ఇలాంటి ప్రయత్నం పునరావృతమవుతుందా? అలాగే ఇలాంటి ప్రయత్నం మూడోసారి చేసి విజయం సాధించగలిగినంత బలంగా ప్రభుత్వం ఉందా? బీజేపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలన చివరి దశకు చేరుకోవడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే అవి ఇంతకు ముందు చెప్పిన ఆ రెండు ప్రభుత్వాలు ఉనికి కోసం ఎదుర్కొన్న సవాళ్ల వంటివి కావు. 1975, 1988 కాలంతో పోల్చి చూస్తే ఇప్పుడు భారతీయ మీడియా ఎంతో బలంగా ఉంది. ఎంతో పెద్దది, శక్తిమంతమైనది, వైవిధ్యభరితమైనది. అలా Vó గతంలోని ఆ రెండు సందర్భాలను బట్టి చూస్తే ప్రస్తుత మీడియాకు రెండు బలమైన ప్రతికూలాంశాలు కూడా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న ఆ సామాజిక ఒప్పందం ఇప్పుడు గందరగోళంలో పడింది. ఈ సంగతి నేను గతంలో చాలాసార్లు చెప్పాను కూడా(https://theprint.in/opinion/fake-news-order-we the-indian-media-have-ignored-warning-bells/46741/).. మరొకటి– ప్రస్తుత మీడియా గతంలో కంటే ఎక్కువగా చీలిపోయి ఉంది. మీడియా ఒక మర్యాద పూర్వక ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి దాని తాత్వికతలలో, సిద్ధాంతాలలో, అభిప్రాయాలలో భేదాలు ఉన్నాయి. అయితే ఇవాళ వేదికల ప్రాతిపదికగా కూడా మీడియా చీలిపోయింది. ఈ చీలికలు ఇంకా పెరిగితే మరింత తీవ్రమైన దెబ్బ తినక తప్పదు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిబంధనావళి కలిగి ఉన్నాయి కానీ, డిజిటల్ మీడియాకు అలాంటి నిబంధనలు లేవంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని సారాంశం గమనించండి! విస్తారంగా ఉన్న మీడియాను చీలికలు పేలికలు చేయడమే దీని వెనుక ఉన్న లక్ష్యం. ఇందులోని సాధ్యాసాధ్యాలు కూడా చర్చనీయాంశమే. అయితే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, డిజిటల్ మీడియా ఈ మూడు కూడా నడుపుతున్న పెద్ద మీడియా సంస్థలు దీనితో తమకేమీ ప్రమాదం ఉండదని ఆలోచిస్తాయి. ఎందుకంటే, దాని నుంచి రక్షించే తమవైన వ్యవస్థలు ఉన్నాయని వారి నమ్మకం. అంటే అచ్చమైన డిజిటల్ మీడియా సంస్థలు వాటి బాధలు అవి పడాలి. చాలా కాలం నుంచి నడుస్తున్న మీడియా సంస్థలకు కూడా ఈ చర్య నచ్చుతుంది. ఎందుకంటే, అచ్చమైన డిజిటల్ మీడియా పాత మీడియా సంస్థలని అవినీతి నిలయాలనీ, అసమర్థమైనవనీ విమర్శిస్తూ ఉంటాయి. మరోవైపు ఇంటర్నెట్ను అదుపు చేయడం ఎవరి వల్లా కాదనీ, ఏ ప్రభుత్వం కూడా అదుపు చేయలేదనీ కొత్త డిజిటల్ మీడియా అధిపతుల నమ్మకం. అది నిజం కాదు. ఇంటర్నెట్ అనేది సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థ ఏమీ కాదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యమం, ఆఖరికి ఎంతో లోతైన ఉదారవాద వ్యవస్థలు కూడా ఇంటర్నెట్ను అదుపు చేయడానికే మొగ్గుతున్నాయి. నిజంగా అదే జరిగితే, ఒంటిరిగా పోరాడడం నీ వల్ల కాదు. కాబట్టి అప్పుడు మళ్లీ సంప్రదాయ మీడియా మద్దతు అవసరమవుతుంది. అందుచేత దానిని తక్కువ అంచనా వేయడం మంచిదికాదు. తీర్పులు ఇవ్వడం సరికాదు. కథువా (జమ్మూకశ్మీర్), ఉన్నవ్ (యూపీ) వంటి అన్యాయపు కేసులు ఈ వారంలోనే చోటు చేసుకున్నాయి. ఈ రెండు చోట్ల కూడా పాలక వ్యవస్థ అహంకారపూరిత ధోరణి కారణంగా న్యాయం దిగ్బంధనమైంది. లైంగిక అత్యాచారం కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మీద కేసు కూడా నమోదు కాలేదు. కానీ మీడియా నిర్వహించిన కృషి వల్ల ఈ అన్యాయం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు సాగుతోంది. స్వేచ్ఛను కాపాడుకోవాలంటే మనమంతా కలసి పోరాడవలసిందే. లేదంటే చీలికలు పేలికలైపోయి కునారిల్లిపోవడానికి సిద్ధంగా ఉండడమే. నీ విరోధులు స్వేచ్ఛను కాపాడగలిగినప్పుడే నీ స్వేచ్ఛను నీవు కాపాడుకోగలుగుతావు. స్వేచ్ఛ చీలికలు పేలికలై పోకూడదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
అధికార పార్టీ బాస్ ఆవిర్భావం
జాతిహితం కామరాజ్ తర్వాత ఇన్నేళ్లకు అమిత్ షా నిజంగా శక్తివంతుడైన అధికార పార్టీ నేతగా ఆవిర్భవించారు. అలా అని ఆయన ప్రధాని మాటను కాదన్నదిగానీ, ఆయనపై ఏదైనా నిర్ణయాన్ని రుద్దిందిగానీ లేదు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, శక్తివంతమైన శాఖల, సంస్థల అధిపతులు సైతం అధికారం ఇప్పుడు ప్రధాని కార్యాలయంతో పాటూ మరో చోట కూడా ఉన్నదని గుర్తిస్తున్నారు. తదనుగుణంగా సర్దుబాటు అవుతున్నారు. తాజా మంత్రివర్గ పునర్వ్యవïస్థీకరణ ఈ కొత్త ‘సాధారణ స్థితి’ని మరోసారి రూఢి చేస్తుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నివాసంలోని ముందు హాలు అతి తక్కువ వస్తువులు, అలంకారాలతో పాత తరం రాజకీయవేత్తల ఇంటిలా ఉంటుంది. ఆయన తనకు ఇష్టమైన మధ్య సోఫాలో కూచుని సందర్శకులతో మాట్లాడుతుంటారు. ఆ హాలు గొడకు ఒకవైపున ఉన్న చాణక్యుడు లేదా కౌటిల్యుని చిత్రం మరో వైపున ఉన్న సావర్కర్ చిత్రం సందర్శకుల కంట పడకుండా ఉండవు. షా రాజకీయాలను నిర్ణయించేది ఆయనకు ఆరాధ్యనీయులైన ఆ ఇద్దరే. వారిలో కౌటిల్యుడు ఆయన రాజకీయ చతురతకు, సావర్కర్ ఆయన హిందుత్వ జాతీయవాద భావజాలానికి నిర్దేశకులు. అయితే షా, ఆ గోడకు మరొకరి చిత్రాన్ని కూడా తగిలించవచ్చు. అది కూడా వారిద్దరి మధ్య అయితేనే ఉత్తమం. ఆయన పక్కా కాంగ్రెస్ వారే కావచ్చు. రాజకీయ, ప్రభుత్వ అధికారం, తాత్వికమైన ప్రేరణ ఇప్పటికే ఆ ఇద్దరి నుంచీ ఆయనకు సంక్రమించినవి, కాకపోతే ఆయన రాజకీయ శైలి, ఆయన తన సొంత పార్టీపై నెరపుతున్న అధికారం దివంగత కాంగ్రెస్ అధ్యక్షునిగా (1963–67) కే కామరాజ్ ఉచ్ఛదశలో ఉన్న కాలాన్ని గుర్తు చేస్తాయి. కామరాజ్ తర్వాత మరెన్నడూ మంత్రులంతా ఇలా అధికార పార్టీ అధ్యక్షుని కార్యాలయంలో చేరి, తమ స్వీయ సాఫల్యాల, ఫలితాల నివేదికను చదివి వినిపించడం లేదా పార్టీ పనికి అంకితం కావడం కోసం రాజీనామాలు చేయడం జరగలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న ప్రస్తుత తరుణంలో ఆ నాటకం నేడు ప్రదర్శితమవుతోంది. 1963–67లో కామరాజ్ అధ్యక్షునిగా తొలి దఫా బాధ్యతలు నెరపిన తర్వాత మళ్లీ ఎన్నడూ పూర్తి కాలపు పార్టీ అధ్యక్షుడు ఇంత అధికారాన్ని నెరపి ఉండలేదు. స్పష్టత కోసం మనం పూర్తికాలపు పార్టీ అధ్యక్షుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం అని గుర్తుచేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రధాన మంత్రులే పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు లేదా పార్టీ అధ్యక్షులే పరిమిత అధికారాలు గల ప్రధానిని ‘నియమించేవారు’. దేవ్‌కాంత్ బారువా, చంద్రశేఖర్ (జనతా), వాజపేయి హయాంలో పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారూ పరిమితమైన అధికారాలను మాత్రమే కలిగి ఉండేవారు. కాబట్టి వారు కామరాజ్, అమిత్‌షాల కోవకు చెందినవారు కారు. అమిత్ షా అధికారం తీరే వారు నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి అమిత్ షా కారణం కాదు కాబట్టి, ఆయనకున్న అధికారం మరింత విశిష్టమైనది. పైగా అందుకు విరుద్ధమైనదే జరిగింది. 2014 ఎన్నికల ప్రచార సారధిగా మోదీనే అమిత్ షాను ఎంపిక చేశారు. మీరు ఎంత కష్టపడైనా వెదకండి, వైద్య రోగనిర్ధారణవేత్తలు అనేట్టుగా అత్యంత ఉన్నత స్థాయి అనుమానంతో చూసినా గానీ, ఒక సమస్యపై ఆయన, ప్రధానికి విరుద్ధ వైఖరిని తీసుకున్నారనడానికి ఎలాంటి ఆధారాలూ దొరకవు. ప్రధాని మాటను తోసిపుచ్చడం లేదా ఏదైనా నిర్ణయాన్ని ఆయనపై రుద్దడం జరిగిన దాఖలాలు ఇప్పటివరకైతే లేవు. బీజేపీ, ఉత్తరప్రదేశ్ ఎన్నికల సారధ్య బాధ్యతలను అమిత్ షాకు అప్పగించిన సందర్భంగా నేను 2013 జూలై 13 నాటి నా జనహితంలో ‘‘వాళ్లు ఏం వింటున్నారు, చదువుతున్నారు, యోచిస్తున్నారు ఇలా చేయడానికి?’’ అని ప్రశ్నించాను. నేను తప్పని రుజువయిందనడం నిస్సందేహం. యూపీలోని 80 సీట్లలో 73 స్థానాలను ఆయన సాధించిపెట్టారు. బీజేపీ మరో మారు అటల్ బిహారీ వాజ్‌పేయి తరహా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కోరుకుంటోందని నేను అప్పట్లో భావించాను. పార్టీ వైఖరి ప్రస్తుత మధ్యేవాద స్థితిని తలకిందులు చేయని మృదువైన హిందుత్వతో, సమ్మిళిత వైఖరిని అవలంబిస్తున్నదని అనుకున్నాను. నేను ఆధారపడ్డ ఆ ప్రమేయం తప్పని తర్వాత అర్థమైంది. ఆ విశ్వాసమే నిజమై ఉంటే నిజంగానే ఉత్తరప్రదేశ్‌కు షాను ఎంపిక చేయడం తప్పే అయి ఉండేది. కానీ నేను అలా ఊహించి తెలివితక్కువతనం ప్రదర్శించానని రుజువైంది. ఆ తర్వాతి రాజకీయాలు, నా ప్రమేయం ఎలా తప్పు అనేదాన్ని మరిం తగా ప్రబలంగా తెలియజేశాయి. వాజ్‌పేయి ముద్ర గల మరో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి బదులుగా, మోదీ–షాలు ఎలాంటి సంజాయిషీలూ అవసరంలేని బీజేపీ–ఆర్ఎస్ఎస్ల ‘‘నిజమైన’’ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృష్టితో ఉన్నారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో చాలా కీలక శాఖలు ఆర్ఎస్ఎస్కు చెందని వారి చేతుల్లో ఉండటం వల్ల ఆ ప్రభుత్వం ఎంత మాత్రమూ బీజేపీ ప్రభుత్వం కాదనే అవగాహన కూడా ఉండేది. అది జార్జ్ ఫెర్నాండెజ్ వంటి కీలక మిత్రులకు రక్షణ శాఖను అప్పగించడానికే పరిమితం కాలేదు. జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా, రంగరాజన్ కుమార మంగళమ్, అరుణ్‌శౌరి వంటి వారిని కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీల సొంత భావజాలాన్ని గలిగిన వారుగా పరిగణించే వారు కారు. భావజాల పరిశుద్ధతకే పట్టం వాజ్‌పేయి ప్రభుత్వాన్ని నేడు తమ భావజాలాన్ని గలిగిన, తమ పార్టీకి చెందిన నిజమైన ప్రభుత్వంగా చూడటం లేదు. నేటి ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధమైన కొసకు చెందినది. భావజాలపరమైన పరిశుద్ధతను ముందు షరతుగా చేయడం వలన ప్రభుత్వ విధులను నిర్వహించడానికి తగిన నైపుణ్యాలు కొరవడ్డాయి. అలాంటి వారికోసం ఇప్పుడిక ఎంత మాత్రమూ బయటివారిని అన్వేషించడం మానేశారు. పరిపూర్ణమైన భావజాల పరిశుద్ధతను కలిగినవారికి లేదా దశాబ్దాల తరబడి పార్టీకి సేవ చేసిన వారికి మాత్రమే అధికారాన్ని అప్పగిçస్తున్నారు. ఆ పనిని అమిత్ షా ఏ మాత్రం కనికరం లేకుండా ముందుకు తీసుకుపోతున్నారు. ఆ అర్థంలో చూస్తే నేటి బీజేపీ/ఎన్డీఏ ప్రభుత్వం మునుపటి దానికి పూర్తిగా భిన్నమైనది. ఇప్పుడు బీజేపీ తనంతట తానుగా మెజారిటీని కలిగి ఉండటమే ఈ తేడాకు కారణం నిజమే. కానీ ఎల్కే అద్వానీకి లేదా ఢిల్లీకి బాగా పరిచితులైన బీజేపీ పాత తరం నేతలు మరెవరిౖకైనా ఇలాంటి మెజారిటీని అందించినంత మాత్రాన... ఇలా ఏ మాత్రం గజిబిజి లేని, భావజాలపరమైన నిబద్ధతగలిగిన ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగి ఉండేవారని కచ్చితంగా చెప్పలేం. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లను, విశ్వాసంగల యువ నేతలను... వారు రాజకీయంగా అంత పలుకుబడిగల వారు కాకున్నా మోదీ.. హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర మ¬ఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. అటు పిమ్మట అమిత్ షా, తను ఎంపిక చేసిన వారితో ముందుకు వచ్చారు. గుజరాత్లో విజయ్ రుపానీని, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను, భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేశారు. తొలుత షా ఎంపిక చేసిన వారి పేర్లను పార్టీకి కూడా తెలియకుండా రహస్యంగా ఉంచారు. 1963 గాంధీ జయంతి రోజున కామరాజ్ తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ పనికి పునరంకితం అవుతానంటూ రాజకీయ కల్లోలాన్ని రేకెత్తించారు. ఆయనను అనుసరించి ఆరుగురు కేబినెట్ మంత్రులు, ఐదుగురు ముఖ్యమంత్రులు కూడా రాజీనామాలు చేశారు. దీంతో మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్ వంటి వారు సైతం అధికారంపై ఆశలను వదులుకోçక తప్పలేదు. కామరాజ్ చేపట్టినది అత్యంత క్రూరమైన పార్టీ అంతర్గత ప్రక్షాళన. కామరాజ్ ప్లాన్‌గా అది పేరు మోసేసరికి, ఆయన ఇంకా పార్టీ అధ్యక్షుడు సైతం కారు. అదంతా జ్ఞాపకాల మరపున పడిపోయింది. కానీ అది స్టాలినిస్టు ప్రమాణాలలో సాగిన సుదీర్ఘ ప్రక్షాళన. కాకపోతే అది రక్తపాతరహితంగా, ‘‘స్వచ్ఛందంగా’’జరిగినది. అది రాజకీయ వ్యంగ్య చిత్రకారులను, వ్యంగ్య రచయితలను చాలా కాలంపాటూ తలమునకలయ్యేట్టు చేసింది. అప్పటికే క్షీణ దశలో ఉన్న నెహ్రూను ఇది బాగా ప్రభావితుడ్ని చేసింది. దీంతో ఆయన కామరాజ్‌ను పార్టీ అధ్యక్షుడ్ని చేయాలని కోరారు. నెహ్రూ మరణం తర్వాత, ప్రధాని కావాలని బలంగా ఆశలు పెంచుకున్న మొరార్జీదేశాయ్ ఆశలను వమ్ము చేసి... మొదట లాల్ బహదూర్ శాస్త్రి, ఆ తర్వాత ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారాలకు హామీని కల్పించారు. 1963–67 మధ్య కాలంలోని ఆ అత్యంత శక్తివంతుడైన కాంగ్రెస్ నేత అనుగ్రహం కోసం అంతా వెంటపడేవారు. ‘‘పార్కలామ్’’(చూద్దాం) అనే తమిళ మాట అప్పటి నుంచే భారత రాజకీయ పదజాలంలో చేరింది. కామరాజ్ తరహా ప్రక్షాళన అమిత్ షాకు కూడా అలాంటి ఇష్టమైన మాట ఏదైనా ఉందేమో మనకు ఇంకా తెలియదు. కానీ, కామరాజ్ రాజకీయ శైలికి సంబంధించిన అన్ని అంశాలూ ఆయనలో ఉన్నాయి. ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చిన ప్రధాని తప్ప, మంత్రులంతా ఆయన ముందు వరుస తీరుతారు. ఆయన వారితో ‘‘స్వచ్ఛందంగా’’రాజీనామాలు సమర్పించి, పార్టీ పనికి పునరంకితం కావాలంటారు. వారంతా నవ్వు ముఖాలతోనే బయటకు వస్తారు. తమ హృద యం ఛిద్రమైనా విధేయమైన పార్టీ కార్యకర్తలమని చెప్పుకుంటారు. 2024 వరకు మోదీ–షా నాయకత్వమే కొనసాగుతుందని, కాలం గడిచే కొద్దీ వారి బలం మరింత పెంపొందుతుందని భావిస్తారు. షా తమ పార్టీ పనిని చూసి ఎప్పటికో ఒకప్పటికి తిరిగి వెనక్కు పిలుస్తారనే ఆశతో వారు ఉంటారు. ఒక అర్ధ శతాబ్ది పాటూ, కేంద్రంలో నిజమైన అధికార పార్టీ అధ్యక్షుడు ఉండటం మనం చూడలేదు. అందుకు తగ్గట్టు సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది. అమిత్ షా ఇతర గణనీయమైన మార్పులను కూడా తెచ్చారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు ఇప్పుడు బీజేపీ పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. ప్రధాని సైతం అక్కడికి వచ్చి ఆ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రధాన మంత్రికి అనువుగా ఉండటం కోసం ఇలాంటి సమావేశాలను ప్రధాని నివాసంలో జరపడం స్థిరపడ్డ రివాజు. కేంద్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రులు, చివరకు అత్యంత శక్తివంతమైన శాఖల, సంస్థల అధిపతులు సైతం ఇప్పుడు అధికారం ప్రధాని కార్యాలయంతో పాటుగా మరో చోట కూడా ఉన్నదని గుర్తిస్తున్నారు. తదనుగుణంగా వారు సర్దుబాటు అవుతున్నారు. ఈ మంత్రివర్గ పునర్వ్యవïస్థీకరణ ఈ కొత్త సాధారణ స్థితిని మరోసారి రూఢి చేస్తుంది. వ్యాసకర్త దప్రింట్ వ్యవస్థాపకుడు, ఎడిటర్–ఇన్–చీఫ్ (https://theprint.in) శేఖర్ గుప్తా -
మధ్యేవాదమే నేటి మార్గం
ఫ్రాన్స్ అధ్యక్షునిగా మాక్రాన్ ఘనవిజయం, ట్రంప్ వైఫల్యాల రేటింగ్‌లు, ఏంజెలా మర్కెల్ సంఘటితపడటం, బ్రెగ్జిట్ పట్ల విచారం వంటివి అన్నీ... చాలా ఎక్కువ భాగం మధ్యస్త ప్రాంతాన్ని ఖాళీగా వదిలేశారని రుజువు చేస్తాయి. మనం, భారత ఉదారవా దులం మన బుర్రలను తెరవాలి. సమాజం, ఆర్థిక వ్యవస్థపట్ల ఉదారంగా, రాజ్యాంగ బద్ధత, జాతీయ భద్రత పట్ల రాజీలేకుండా, ఉగ్రవాదానికి లేదా మావోయిస్టు హింసకు ‘‘మూల–కారణాల’’ సమర్థనను ఆమోదించకుండా ఉండే భావనను నిర్మించాలి. కెనడా యువ ప్రధాన మంత్రి, ప్రపంచస్థాయి ప్రముఖ ఉదారవాద నేత అయిన జస్టిన్ ట్రూడో, ‘‘హైఫనేటెడ్ ఉదారవాది’’అనే పదాన్ని మొదటిసారిగా ప్రాచుర్యంలోకి తెచ్చారు (ఉదారవాదులలోని వామపక్ష–ఉదారవాది, మితవాద–ఉదారవాది, మధ్యేవాద–ఉదారవాది వంటి బృందాలు తమ ప్రత్యేక గుర్తింపుకోసం ఉదారవాది అనే పదానికి ముందు సదరు విశేషణాన్ని చేరుస్తూ హైఫన్ లేదా అడ్డ గీతను వాడుతుంటారు. వారిని ఉద్దేశించే ట్రూడో హైఫనేటెడ్ ఉదారవాది అనే పదబంధాన్ని ప్రయోగించారు). ఆయన దాన్ని పలు పక్షాలుగా, చీలిపోయి ఉన్న తమ పార్టీ వారినందరినీ ఒక్కటి చేయాలనే పరిమితార్థంలోనే వాడినా అది విస్తృతంగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. కనీసం మన దేశీయ పరిస్థితుల నేపథ్యంలోనైనా డీౖహైఫనేటెడ్ లిబరలిజం (హైఫన్లు లేని లేక ముందు చేర్పులు లేని ఉదారవాదం) అనే భావనకు కర్తృత్వం నాదేనని చెప్పుకుంటాను. అన్నిటినీ ఆహ్వానించే విశాల దృష్టితో భావాలను, ప్రజలను చూడటం ఉదారవాదమైనట్టయితే... ఈ ముందు చేర్పుల విధేయతలతో కూడా అది మనగలుగుతుందా? వామపక్షవాదం, మితవాదం అనేవి మాత్రమే ఎంచుకోవడానికి ఉన్న రెండు స్థూల విభాగాలు. ఇక ‘‘మధ్యస్తం’’అనేది సోమరి, నిర్ణయరాహిత్య వాదుల కోసం కేటాయించిన స్థానం. మన దేశంలో అది న్రెçహూ మృదు సామ్యవాదం నుంచి, ఇందిర ముదురు గులాబీ రంగు నుంచి (అది దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాషాయ గులాబీరంగులాంటి ఒకరకం ముదురు రంగు, నేడు అస్తిత్వంలో ఉన్న లాంటిదే) పుట్టుకొచ్చిన ఉదారవాదం కావచ్చు. ఇరుపక్షాల పరీక్షలూ గట్టెక్కలేం లేదా వంద రకాల నుంచి దేన్నయినా ఎంచుకోవచ్చు. వామపక్షం నుంచి ప్రారంభిద్దాం. జనరల్ రావత్, జనరల్ డయ్యర్‌కు ‘‘ప్రతిధ్వని’’అని కనిపెట్టిన సామాజిక శాస్త్రవేత్త్త పార్థా ఛటర్జీనే తీసుకుందాం. ఆ వ్యాఖ్య చేసిన తర్వాత ఆయన మన ఈశాన్యంలోని ఆదివాసి రాష్ట్రాలు, కశ్మీర్ వలసవాద వారసత్వంగా సంక్రమించినవని నొక్కి చెప్పారు. తద్వారా మన నిబద్ధతను అత్యున్నత స్థాయి పరీక్షకు నిలబెట్టారు. రిపబ్లిక్‌ను రాజ్యాంగం ఎలా నిర్వచించిందనే దానితో నిమిత్తంలేదు... పార్థా ఛటర్జీ వాదన ప్రకారం ఈశాన్యం బ్రిటిష్ వారు జయించినది, కశ్మీర్ మన సొంత సైన్యమే జయించినది. లేదంటే పూర్తి మితవాద పక్షానికి తిరిగి, దేవాలయాలలో దళితుల సమానత్వం కోసం పోరాడే ఆర్ఎస్ఎస్కు చెందిన తరుణ్ విజయ్‌నే తీసుకోండి. ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ ఒక మేఘాలయ ఆదివాసిని జాతివివక్షతో అవమానపరచినందుకుగానూ, దాని లైసెన్స్‌ను రద్దుచేసి, దాన్ని ఈశాన్య ప్రాంత సాంస్కృతిక కేంద్రంగా మార్చాలని ఆయన కోరారు. ఆయన సొంత భావజాలం అవే జాతులకు వాటి సాధారణ ఆహారాన్ని (ఈశాన్య ఆదివాసులకు గొడ్డు మాంసం) నిరాకరించడానికి, ఆ గొడ్డు మాంసంపై ఆధారపడ్డ తోళ్లు, పాదరక్షల తయారీ జీవనాధారాన్ని దళితులకు నిరాకరిం^è డానికి అనాగరికమైన ఉద్యమం సాగించడంలో మునిగి ఉన్నా ఫర్వాలేదు. మరింత సమకాలీనమైన ఉదాహరణను చూపాలంటే, జంతర్ మంతర్ నిరసనకు మీరు వెళ్లారా, లేదా? లేక #NotInMyName అనే హ్యాష్‌ట్యాగ్‌ను ప్రయోగించారా లేదా? అనేదాన్ని బట్టి కూడా మీపై తీర్పు చెప్పవచ్చు. ఈ రెండు పరీక్షలలోనూ ఈ రచయిత విఫలమౌతాడు. మన భుజాల మీద ముద్రలు ఉంటాయి. ముద్ర బరువు ఎక్కువయ్యే కొద్దీ ఆ భారమూ ఎక్కువవుతుంది. దీంతో అన్నిటినీ ఆహ్వానించే విశాల దృక్ప«థాన్ని నిలుపుకోవడం మరింత కష్టమౌతుంది. లేదా మీరు ఒకవేళ దాన్ని నిలుపుకుంటే, ఇబ్బందికరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాలి. ‘‘మీరు అదే పనిగా ఆ ççపక్షానికి, ఈ పక్షానికి మారుతుంటారు ఏమిటి? మీది ఏ పక్షమో నిర్ణయించుకోలేరా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారుగా ఉంటారు ఎందుకు? లేదా మరింత సముచితమైనది, తూలనాడేదైన హిందీ నానుడిని ప్రయోగిస్తే.. అన్నం కంచంలోని వంకాయ ముక్కలా ఉంటారెందుకు?’’(ఒక స్థానంలో నిలకడగా ఉండరెందుకు అని). గొడ్డుమాంసం వివాదంపై కొట్టి చంపుతున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన భావజాలాన్ని ఖండించాక మీరు... ఎయిర్ ఇండియాను అమ్మేయడానికి చర్యలు చేపట్టినందుకు ఆయనను సంస్కర్తగా ప్రశంసించారనుకోండి. అప్పుడు వామపక్షం మిమ్మల్ని అమ్ముడు పోయారు అనడాన్ని వినాల్సి వస్తుంది. ఇక మితవాద పక్షానికి వస్తే, కొన్ని పరిమితులున్నా కశ్మీర్‌పై భారత పక్షం వాదనను బలంగా సమర్థించిన చరిత్ర మీకు ఉన్నా... ఒక ఆర్మీ మేజర్ మానవ కవచాన్ని వాడటాన్ని ఖండించడంతోనే వారి దాడి మొదలవుతుంది. మీరు భారత పక్షాన ఉండి, భారత సైన్యం పక్షాన లేకుండటం ఎలా సాధ్యం? లేదంటే, రావత్/డయ్యర్ పోలికను అందరి దృష్టిని ఆకట్టుకోవడం కోసం అర్థరహితంగా తెచ్చిన పోలిక అన్నందుకు మీరు మధ్యేపక్షం నుంచి దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విద్వద్వేత్త ఎంత లబ్ధప్రతిష్టులో తెలిసి కూడా ఆ మాట అనడానికి నీకు ఎంత ధైర్యం? ప్రశ్నించడమే ఉదారవాద సారం ఈ మూడు గ్రూపుల ప్రశ్నలకూ సమాధానాలు సరళమైనవే. రెండు తప్పులు ఒక ఒప్పు కానట్టుగానే, ఓ డజను తప్పులైనాసరే ఒక ఒప్పు ఉన్నదని అంగీకరించ నిరాకరించేలా చేయలేదు. రెండు, మీరు మీ దేశానికి, సైన్యానికి మద్దతు తెలుపుతున్నారంటే దాని అర్థం.. రాజ్యాంగపరంగా చట్టవిరుద్ధమైన, సైనికంగా అనైతికమైన చర్యకు పాల్పడ్డ ఒక సైనికాధికారికి మరో ఆలోచనే లేకుండా మద్దతు తెలపడమని అర్థం కాదు. మూడు, ప్రతిష్టలకు వాస్తవాలతో సంబంధం ఏముంది? ఒక మేధావి ప్రతిష్ట, ఇతరుల (వారు తక్కువవారే, నిజమే) నోళ్లను నొక్కేయడానికి సమర్థన అయ్యేట్టయితే అది ఉదారవాద చర్య కాదు. అయినా మీరు దాన్ని ఉదారవాదమనే అనొచ్చు, కాకపోతే దానికి ముందు మీ నిర్వచనానికి తగ్గట్టుగా ఓ ముందు చేర్పు మాటను (హైఫన్‌తో వచ్చేది) కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ అంశాలపై ప్రపంచవ్యాప్తంగానే చాలా రాశారు, చర్చించారు. ట్రంప్ ఉత్థానం, బ్రెగ్జిట్, లీ పెన్ భయమూ, వీటితోపాటూ వారి ప్రత్యర్థి పక్షం మరింతగా రాడికలైజ్ కావడమూ జరిగాయి. »ñ ర్నీ శాండర్స్ డెమోక్రాట్లు, జెర్మీ కార్బిన్ లేబర్ పక్షీయులు అలాంటి వారే. ఇక దీనికి సమాంతరంగా మోదీ, షాల బీజేపీ మరింత కరడుగట్టిన కాషాయ జాతీయవాదం వైపుకు మారడం, దాని ప్రత్యర్థులు మరింత సునిశితమైన, అతి ఉదారవాదానికి (హైపర్–లిబరలిజం) మారడం జరిగాయి. అందువలన ఒక పక్షం, ‘‘భారత్ తేరే తుక్డా..’’ (భారత్ ముక్క చెక్కలు అవుతుంది) అంటూ నినాదాలు చేసినందుకు జేఎన్‌యూ విద్యార్థులను లాకప్‌లో పడేస్తే, మరో పక్షం క్యాంపస్‌లోకి వచ్చిపడుతుంది. ఫలితం మొదటి పక్షం గెలుస్తుంది. వారితో విభేదించడంలాగే నినాదాలు చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించే వ్యక్తి స్వేచ్ఛలలో విశ్వాసం ఉన్న నష్టపోయేది ఉదారవాద భారతీయుడే. మన రిపబ్లిక్కు, దాని రాజ్యాంగాలు చెక్కుచెదరకుండా ఉంటేనే ఈ స్వేచ్ఛలకు అత్యుత్తమ పరిరక్షణ లభిస్తుంది. పైగా, ఆ రెండిటి పరిరక్షణకు రాజ్యం బలప్రయోగానికి దిగడం న్యాయమైనది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ రాజ్యం నైతిక బాధ్యత కూడా. అందువల్లనే బుర్హాన్ వనీని హతమార్చడంలాగే, ఒక మావోయిస్టు స్థావరాన్ని నిర్మూలించడాన్ని (గత ఏడాది ఒడిశాలో) కూడా ప్రశంసించాలి. అలాగే నినాదాలు చేసినందుకు రాజద్రోహ చట్టాన్ని ప్రయోగించడంలాగే, ఒక సాధారణ కశ్మీరీ పౌరుడిని మానన కవచంగా వాడుకోవడాన్ని కూడా ప్రశ్నించాలి. మధ్యస్త ప్రాంతం విజయానికి కీలకం ఉదారవాద శకం అంతం కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఈ మధ్య పలు ప్రముఖ రచనలు వెలువడ్డాయి. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత దాదాపు పాతిక ప్రజాస్వామ్యలు విఫలమయ్యాయి. టర్కీ ఆ దిశగానే సాగుతోంది. అమెరికన్ మీడియా సిద్ధాంతవేత్త డగ్లస్ రస్కాప్ దీనికంతటికీ కారణం మన కాలపు అసహనమేనని నిర్ధారించారు. దృష్టంతా స్వల్పకాలికమైన వాటిపైనే ఉండగా... ప్రారంభం, మధ్య, చివర అనే సాంప్రదాయక కథనాలు కుప్పకూలుతున్నాయి. అయితే అది ధ్యానాన్ని బోధించే గురువులు చెబుతున్నట్టుగా సాగడం లేదు. ఫలితం, కందకాల యుద్ధాలన్నిటిలోలాగే రెండు ప్రత్యర్థి పక్షాల నడుమ సువిశాలమైన మధ్యస్త ప్రాంతం మిగిలింది. కందకాలను వీడి బయటకొచ్చే ధైర్యమే మీకుంటే ఈ మధ్యస్త ప్రాంతం ఎంత ఉపయోగకరమైనది కాగలదో ఎమాన్యుయెల్ మాక్రన్ ఘన విజయం మనకు చూపింది. మీరు ఎన్నికల్లో గెలవాలంటే మధ్యస్త స్థానానికి చేరాలి. మాక్రాన్ గెలుపు, ట్రంప్ వైఫల్యాల రేటింగ్‌లు, ఏంజెలా మర్కెల్ సంఘటితపడటం, బ్రెగ్జిట్ పట్ల విచారం వంటివి అన్నీ... మహా సోమరిగా చాలా ఎక్కువ భాగం మధ్యస్త ప్రాంతాన్ని వదిలిపెట్టేశారని రుజువు చేస్తాయి. మార్కాన్ మన పదకోశానికి రాడికల్ మధ్యేవాదం, బలమైన మధ్యస్తపక్షం అనేదాన్ని చేర్చారు. విజ్ఞత ఒక్కోసారి అనుకోని చోట లభిస్తుంటుంది. అన్‌బాక్స్ జిందగీ (జీవితాన్ని తెరవండి)అంటూ స్నాప్‌డీల్‌కు ట్యాగ్‌లైన్ రాసిచ్చిన కాపీరైటర్ బుర్రలోనూ కనిపించిందది. మనం, భారత ఉదారవాదులం మన బుర్రలను తెరుచుకోవాలి. సమాజంపట్ల, ఆర్థిక వ్యవస్థపట్ల ఉదారంగా ఉండే, రాజ్యాంగబద్ధతపట్ల, జాతీయ భద్రత పట్ల రాజీలేకుండా ఉండే, ఉగ్రవాదానికి లేదా మావోయిస్టు హింసకు ‘‘మూల–కారణాల’’ సమర్థనను ఆమోదించకుండే భావనను నిర్మించాలి. అప్పుడు మీకు జంతర్ మంతర్ లేదా హేష్ట్యాగ్లతో దేన్నో లేదా ఏ పక్షాన్నో రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హైఫన్లను విడిచేసిన ఉదారవాదులకు నాదో సూచన: వామపక్షం నన్ను మితవాది అని భావిస్తుంది. మితవాద పక్షం నన్ను వామపక్షంగా భావిస్తుంది. కాబట్టి ఇద్దరూ నన్ను బంతాట ఆడేసుకుంటున్నారు. శేఖర్ గుప్తా Twitter@ShekarGupta -
కొత్త మార్పు... నేటి ఓటరు తీర్పు
జాతిహితం మతంలాగే జాతీయవాదం కూడా మానవుల అత్యంత పాత భావోద్వేగాలకు సంబంధించినది. దాన్ని గమనించిన నేతలకు తాజా ఉదాహరణ ట్రంప్. గొప్ప జనాకర్షణశక్తి ఉండి, సొంత పార్టీకి చెందిన నియమాలను సైతం కాదని, తన సొంత నియమాలతో ఆధిపత్య తత్వం గల వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉంటే ఎదురే లేని శక్తి అవుతారు. పాత రాజకీయాలతో, నేతలతో విసుగెత్తి, తిరుగుబాటు చేస్తున్న ఓటరుకు కావాల్సిన మార్పు సరిగ్గా అలా తిరుగుబాటు చేసే, అధికార వ్యవస్థకు బయటి నేతమాత్రమే. డొనాల్డ్ ట్రంప్ విజయానికి సంబంధించి వ్యాఖ్యాతలంతా ఒక్క అంశంపై ఏకీభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వామపక్షాలనూ, వాటితోపాటే అందరికీ ఆమోదనీయమైనవిగా విశ్వసించిన ఎన్నో ఉదారవాద భావాలనూ తుడి చిపెట్టేసి రాజకీయ మితవాదం తిరిగి అధికారంలోకి వస్తున్న ధోరణి కనిపిస్తోంది. దానికి అనుగుణమైన పరిణామమే ఇది కూడా అని అంతా అంగీకరిస్తున్నారు. అమెరికాలో అయితే స్వేచ్ఛాయుత మార్కెట్లు, వాణిజ్యం, విదేశీయుల వలసలను అనుమతించడమూ, యూరప్‌లోనైతే జాతీయవాద క్షీణత వంటివి అలాంటి ఉదారవాద భావాలుగా ఉండేవి. ఇక మన భారతదేశంలో నైతే మతం పూర్తిగా వ్యక్తిగత విషయమనీ, ఒకసారి అధికారంలోకి వచ్చాక ప్రతి నేతా ప్రతి మతాన్ని తనదిగా చేసుకునే మాట్లాడేవారు, బహిరంగ చర్చలో అదే రాజకీయంగా సరైనదిగా నిర్వచించేవారు. ప్రపంచవ్యాప్తంగా ఓటర్లంతా ఇప్పుడు కోరుకుంటున్నది సరిగ్గా వీటిలో మార్పునే. ఉదారవాదానికి ఎదురు గాలేనా? అయితే ఈ మార్పు సరళరేఖ మాదిరిగా సంభవిస్తున్నదేమీ కాదు. భారత్, బ్రిటన్, అమెరికా, అర్జెంటినా, బ్రెజిల్‌లలో వచ్చిన మార్పు ఈ మితవాద వెల్లువకు అనుగుణమైనదే. ఈ ధోరణి త్వరలోనే ఇటలీ, ఫ్రాన్స్లనూ మింగే యవచ్చు. చావెజ్ వారసుని పాలనలోని వెనిజులాలో ద్రవ్యోల్బణం త్వర లోనే నాలుగంకెల స్థాయికి చేరవచ్చు. దీనికి వ్యతిరేకంగా సాగుతున్న తిరుగు బాటుతో అక్కడా బహుశా ఇదే మార్పు జరగవచ్చు. దక్షిణ, లాటిన్ అమెరికా దేశాల్లో చాలా వరకు ఇప్పటికే వామపక్షం నుంచి మితవాదానికి మరలాయి. కొలంబియాలోని మితవాద ప్రభుత్వం తగినంత మితవాద వైఖరిని ప్రదర్శించడం లేదని భావించిన ఓటర్లు... అది ఎఫ్ఏఆర్సీ (వామ పక్ష) గెరిల్లాలతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ప్రజాభిప్రాయ సేకరణలో తిరస్కరిం చారు. ఇక జపాన్‌లో ప్రధాని షింజో అబే, ఆసియా పశ్చిమ అంచునున్న టర్కీలో అధ్యక్షుడు ఎర్డోగాన్‌ల జనాదరణ పెరుగుతూనే ఉంది. మితవాద వెల్లువ పాత వామపక్షాలనే కాదు, నిజానికి మధ్యేవాద మితవాదులను సైతం తుడిచిపెట్టేస్తోంది. అయితే, అత్యంత వామపక్ష ఉదారవాద ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడాలో, వామపక్షవాదిగా భావించే అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె ఫిలిప్పీన్స్‌లో బలపడుతుండటాన్ని ఎలా వివరించగలం? అలాగే దక్షిణ కొరియాలోని మితవాద పాలనకు వ్యతిరేకంగా అసంతృప్తి, ధిక్కా రమూ పెరుగుతుండటాన్నీ, ప్రశ్నింపరానిదిగా భావించే యూరప్ వ్యాప్తమైన ఈయూ ధోరణిని ధిక్కరిస్తున్న సోషలిస్టు ప్రధాని అలెక్సి సిప్రా స్కు గ్రీస్‌లో జనాదరణ పెరుగుతుండటాన్నీ ఎలా అర్థం చేసుకోగలం? ప్రపంచం తీరును పరిశీలించాక, ఇక ఇప్పుడు 2014 తర్వాత ఈ ధోరణి భారత్‌లో ఎలా పనిచేసిందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. 2014 సార్వ త్రిక ఎన్నికల తదుపరి వెంటనే జరిగిన ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, హరి యాణ, జార్ఖండ్‌లలో గెలుపొందడం ఆ ధోరణిని రూఢి చేసింది. కానీ ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలలో ఏం జరిగింది? బీజేపీ (లేదా భారత మితవాదం) ఢిల్లీ, బిహార్లలో గెలవగలమని అనుకుంది కానీ తుడిచిపెట్టుకుపోయింది. ఇక మిగతా రెండు రాష్ట్రాల్లో అది ఎలాంటి ప్రభా వాన్ని చూపలేకపోయింది, కనీసం పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఓట్లను సైతం తిరిగి తెచ్చుకోలేకపోయింది. బెంగాల్లో చాలా సందర్భాల్లో సీపీఎం కంటే వామçపక్ష వైఖరిని తీసుకునే మమత నేతృత్వం లోని టీఎమ్సీ విజయం సాధించింది. ఇక కేరళలో బీజేపీ అసలు లెక్కలోకే రాలేదు. మధ్యేవాద వామ పక్షంగా భావించే కాంగ్రెస్ (యూడీఎఫ్) కూడా గెలవలేదు, నిజమైన కమ్యూ నిస్టులు గెలిచారు. ఇవన్నీ చూశాక మనం ఎక్కడ తేలుతాం? నిజం చెప్పాలంటే ఇవన్నీ చూడటం మనల్ని కలగా పులగం అయ్యేలా చేసేస్తుంది, గందరగోళపరుస్తుంది. ఇంతకూ ఓటరు తనకు ఏమి కావాలని చెబుతున్నట్టు? మార్పు. అయితే అది పాత కాలపు, పాత అర్థంలో అధి కారంలో ఉన్న వారిని గద్దె దించడమా? లేదా? అనే క్లిష్టమైన గుంజాటనగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం కాదు. అదే అయితే, ప్రత్యామ్నాయంగా వామపక్షం బలపడటం కనబడని బ్రిటన్, కొలంబియాలలో మితవాద ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణలలో ఎందుకు ఓడిపోయినట్టు? ఇది ఎదురేలేని మితవాద పురోగతే అయితే దీని ఒరవడిని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఎలా అడ్డుకోగలుగుతుంది? పంజాబ్‌లో కూడా అదే పని చేస్తానని ఆ పార్టీ ఎలా భయపెట్టగలుగుతుంది? గోవా, గుజరాత్‌లకు సైతం ఆ భయం ఎందుకు వ్యాపిస్తుంది? ఇవన్నీ ఓటర్లు చీలిపోయి,విధేయమైన ఓటు బ్యాంకు లుగా గట్టిపడ్డ సువ్యవస్థాపితమైన పాత పార్టీల చరిత్ర ఉన్న రాష్ట్రాలే. అదే విధంగా ట్రంప్ రిపబ్లికన్ పార్టీని హైజాక్ చేయడంలో సఫలమై... తన పార్టీ యంత్రాంగమే గెలిచే ఆశేలేదనీ, డెమోక్రాట్లు అధికారంలోకి రావడం ఖాయ మనీ భావిస్తుండగా ఎలా గెలుపొందగలిగారు? ప్రభుత్వం మారితే చాలదు అందువలన సుపరిచితమైన భావజాల వ్యవస్థలను దాటి సమాధానాలను వెదకాలని మనం ఉబలాటపడవచ్చు. అన్నిట్లోకీ మొదటగా ఓటర్లు మార్పును కోరుకునేది కేవలం ప్రభుత్వం మారడం కోసం కాదు, సువ్యవ స్థాపితమైన భావాలలో, ఆదర్శాలలో, ఆలోచనా ప్రక్రియలలో మార్పును. అది మితవాదం వైపునకా, వామపక్షం వైపునకా? లేదా అది దిశగా మరిం తగా మొగ్గడమా? అనే దానితో వారికి నిమిత్తం లేదు. బహుశా మూడు కారణాల వల్ల ఓటర్లు మొత్తంగా ప్రణాళికలోనే మార్పును కోరుకుంటు న్నారు. ఒకటి, ఓటరు కొన్ని అపాయాలను ఎదుర్కునేటంత, ఏదైనా సాహ సోపేతమైనదాన్ని చేసేటంత ఆత్మవిశ్వాసం తనకు ఉన్నట్టు భావించడం. రెండు, పావు శతాబ్ద కాలపు వృద్ధి, గ్లోబలైజేషన్, హైపర్ కనెక్టివిటీ (అత్యు న్నత స్థాయి సమాచార సంబంధాలు) సర్వత్రా ఓటరు ఆకాంక్షల స్థాయిలను పెంచాయి. చిన్న పట్టణాలు లేదా గ్రామాల వారు తాము అసూయతో చూసే వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలకు వలస పోవాలని మాత్రమే ఆకాంక్షిం చడం లేదు. తామున్న చోటికే ఆ వేగవంతమైన వృద్ధి రావాలని కోరుకుంటు న్నారు. చివరిగా, నా దృష్టిలో అత్యంత ముఖ్యమైనది...వారు పాత రాజకీ యాలతో విసుగెత్తి పోయారు. కొత్త దానికి, కొత్త భావాలకు, కొత్త నేతలకు అవకాశం ఇచ్చి చూద్దామని అనుకుంటున్నారు. అయినాగానీ కొన్ని పాత, సమసిపోతున్న భావోద్వేగాలను పునరుద్ధరించాలని కూడా భావిస్తున్నారు. వీటన్నిటిలోకీ అత్యంత ప్రబలమైనది జాతీయవాదం. పావు శతాబ్ద కాలపు గ్లోబలైజేషన్ ప్రభావానికి అత్యంత సుస్పష్టమైన ఉదాహరణను చూద్దాం. భావజాల విభజన రేఖకు రెండువైపులా ఉన్న ఉదార విభాగాలూ కీర్తించిన గ్లోబలైజేషన్ వల్ల జాతీయవాదం వెలవెల పోతుండటంతో యూరో పియన్ ఫుట్‌బాల్ క్రీడలో క్లబ్ జట్ల పట్ల విధేయత జాతీయ జట్ల పట్ల విధేయ తను అధిగమించిపోయింది. అయితే మతంలాగే జాతీయవాదం కూడా మాననజాతికి చెందిన అత్యంత పాత భావోద్వేగాలకు చెందినది. పాత జ్ఞాపకాల పట్ల మక్కువ దానికి తిరిగి సత్తువను సమకూరుస్తుంది. స్మార్ట్ (తెలివైన)lనేతలు దాన్ని గమనించారు. అలాంటి వారికి తాజా ఉదాహరణ ట్రంప్. అత్యంత జనాకర్షణ శక్తి గలిగి, సువ్యవస్థాపితమైన నియమాలను, అవి తన సొంత పార్టీకి చెందినవే అయినాగానీ వాటిని ధిక్కరించి, తన సొంత నియమాలను అనుసరించే, ఆధిపత్యతత్వాన్ని Sప్రదర్శించే తత్వంగల వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉంటే ఎదురే లేని శక్తి అవుతారు. పాత రాజకీ యాలతో, నేతలతో విసుగెత్తిపోయి, తిరుగుబాటు చేస్తున్న ఓటరుకు కావా ల్సిన మార్పు సరిగ్గా అలా తిరుగుబాటు చేసే నేత, అధికార వ్యవస్థకు బయటి వ్యక్తిమాత్రమే. భారత్‌లోనూ ఇదే గాలి 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా నేను ఇది, సరికొత్త, యవ్వనోత్సాహం నిండిన, మీకు నేను రుణపడి ఉన్నదేమీ లేదని భావించే భావజాలానంతర కాలపు ఓటరు తీర్పు అని రాశాను. దీనికి ప్రతి వాదనా ఉంది. మన ఓటర్లు మొట్టమొదటిసారిగా మితవాదపక్షం తనంతట తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా తీర్పునిచ్చాక కూడా ఇంకా మీరిలా ఎలా అనగలరు? అంటే దానికి చెప్పగల సమాధానం... బహుశా భారత్ ఓటు వేసినది భావజాలపరమైన మార్పునకు కాదు. కాంగ్రెస్ పార్టీ నిరాశా పూరి తంగా పెంచిపోషిస్తున్న పేదరికవాదానికి, పాలక కుటుంబం తాము ప్రత్య క్షంగా పాలన సాగించకుండా, తాము నియమించిన వ్యక్తిని పనిచేయ నీయ కుండా అధికారాన్ని నెరపుతూ ప్రదర్శిస్తున్న కపటత్వానికి వ్యతిరేకంగా ఓటరు చేసిన తిరుగుబాటు ఇది. గోసంరక్షకులకు, పాకిస్తాన్‌తో వ్యూహాత్మక సంయమనానికి స్వస్తి పలకడానికి లేదా మూడు తలాక్‌లకు వ్యతిరేకంగా ఆ సమయంలో ఎవరూ ఓటు చేయలేదు. ఇవేవీ ఆనాటి బీజేపీ అజెండాలో లేవు. నాటి తీర్పు ఓటరు తిరుగుబాటనే నా వాదనకు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆధారాలు కనబడుతున్నాయి. భారత్ వంటి దేశాలలోని యువత గతం గురించిన ఫిర్యాదులలో వేళ్లూనుకున్న రాజకీయాలను చెత్తబుట్టలో పారేసి, ఆకాంక్షాభరితమైన భవిత దిశగా సాగిపోతున్నారు. ఇది, ప్రజలు పాత విధేయతలను బద్ధలుకొట్టి బయ పడుతున్న పరిణామాన్ని వివరిస్తుంది. వృద్ధాప్యంలో పడుతున్న జనాభాగల అభివృద్ధిచెందిన దేశాల సమస్య ఇందుకు విరుద్ధమైనది: గ్లోబలైజేషన్, వృద్ధి వల్ల కోల్పోయినదిగా కనిపిస్తున్న దానికి, తమకు దక్కాల్సిన ఫలాలలో అతి పెద్ద భాగం ‘‘అయోగ్యులు, తప్పుడు’’వారైన ప్రజలకు, ప్రత్యేకించి వలస వచ్చిన విదేశీయులకు పోతుండటానికి సంబంధించినది. రెండు సందర్భాలలోనూ ప్రతిస్పందన ఒకటే... విప్లవాత్మక మార్పు, పాత అధికార వ్యవస్థ నుంచి దుర్గం«ధాన్ని వెలువరించే ప్రతిదాని పట్లా ధిక్కారం. ఇందువల్లనే మోదీ ఇంతకు ముందెన్నడూ ఎరుగని రీతిలో బీజేపీని శాసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లను కేజ్రీవాల్ వాక్యూమ్ క్లీనర్‌తో తుడిచి పెట్టేస్తున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ పాలక వ్యవస్థను డెమోక్రటిక్ అభ్యర్థి కంటే కూడా ఎక్కువగా ట్రంప్ చిత్తు చేయడాన్ని చూసి బహుశా ఆయన ఓటర్లు మరింత ఎక్కువగా పులకరించిపోయి ఉంటారు. twitter@shekargupta శేఖర్ గుప్తా