shepherd
-
రూ. 20 కోట్ల శునకం!!
మియాపూర్: సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్‌లు.. బడా ఫంక్షన్లలో ప్రదర్శనలు.. ఎక్కడికెళ్లినా విస్తృత మీడియా కవరేజీ.. సెల్ఫీల కోసం ఎగబడే ప్రజలు.. ఇవన్నీ ఏ ప్రముఖుడి లైఫ్ స్టైల్‌ను తెలియజేసే వర్ణన అనుకుంటున్నారా? కానే కాదు.. దేశంలోనే అత్యంత ఖరీదైన, భారత్‌లో అరుదుగా పెంచే కకేషియన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ శునకం అనుభవిస్తున్న విలాస జీవితం తాలూకు ఉదాహరణలు. దీని ఖరీదు రూ. వేలు, రూ. లక్షలు కూడా కాదు.. అక్షరాలా రూ. 20 కోట్లు!! కాడబామ్ హేడర్ అనే ఈ శునకం శనివారం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సందడి చేసింది. దీన్ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ ఈ శునకాన్ని రూ. 20 కోట్లుపెట్టి ఈ ఏడాది జనవరిలో నగరానికి చెందిన ఓ డాగ్ బ్రీడర్ నుంచి కొనుగోలు చేశారు. తాజాగా నగరంలో పెట్ షో నిమిత్తం దీన్ని బెంగళూరు నుంచి తీసుకురాగా అది మార్గమధ్యలో కాస్త అలసటకు గురైంది. దీంతో మియాపూర్ మదీనాగూడలోని విశ్వాస్ పెట్ క్లినిక్‌లో దీనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో తన శునకం పాల్గొని ఇప్పటివరకు 32 పతకాలు సాధించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతోపాటు సినిమాల్లోనూ నటించిందని వివరించారు. దీనితోపాటు రూ. 10 కోట్ల విలువచేసే టిబెటన్ మాస్టిఫ్, రూ. 8 కోట్ల విలువచేసే అలాస్కన్ మాలమ్యూట్ జాతి శునకాలు తన వద్ద ఉన్నాయన్నారు. మూడేళ్ల వయసున్న కాడబామ్ హేడర్ రోజుకు 3 కేజీల చికెన్‌ను ఆహారంగా తీసుకుంటుందని... ఈ కుక్క కోసం నెలకు రూ. 3 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం..
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఇంకా నెలల సమయం ఉన్నప్పటికీ.. ఆయా ప్రాంఛైజీలు మాత్రం తమ సన్నాహకాలను మొదలు పెట్టేశాయి. ఐపీఎల్ 2024 సీజన్‌కి సంబంధించిన ట్రేడింగ్ విండో నవంబర్ 1న ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడింగ్ రూపంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ. 50లక్షల బేస్ ఫ్రైస్‌కు అతడితో ముంబై ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ఐపీఎల్లో ఇప్పటివరకు షెపర్డ్ కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా ఐపీఎల్-2024కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 12న దుబాయ్ వేదికగా జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నవంబర్ 15లోపు ప్రాంఛైజీలు రిటైన్, విడుదల చేయాలనుకుంటున్న ఆటగాళ్ల జాబితాలను సమర్పించాలి. "ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ట్రేడింగ్ విండోలో భాగంగా రొమారియో షెపర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జి) నుంచి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది అంటూ" ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్ తర్వాత బెన్ స్టోక్స్‌కు సర్జరీ.. ఏమైందంటే? 🚨 DEAL DONE: Mumbai Indians get the first transfer from Lucknow super giants of INR 50 Lakhs. Romario Shepherd will play for Mumbai Indians in IPL 2024.#IPL2024 #IPLpic.twitter.com/ERFNazE3Z7 — Haroon 🏏🌠 (@HaroonM33120350) November 3, 2023 -
మెక్సికోకు 'కుక్కపిల్ల'ను గిఫ్ట్‌గా ఇచ్చిన టర్కీ!..అదే ఎందుకంటే?..
మెక్సికోకు టర్కీ మూడు నెలల వయసున్న జర్మనీ షెపర్డ్ కుక్కపిల్లను ఇచ్చించి. ఈ మేరకు మెక్సికో సైన్యం బుధవారం టర్కీ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆ కుక్క పిల్లను స్వాగతించింది. అసలు టర్కీ ఎందుకు ఆ కుక్కపిల్లనే గిఫ్ట్‌గా ఇచ్చిందంటే..ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయతాండవానికి వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు మెక్సికో రెస్క్యూ డాగ్‌లతో మోహరించింది. ఆ టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రొటీయో అనే జర్మన్ షెషర్డ్ జాతికి చెందిన కుక్క చాలా చురుకుగా సేవలందించింది. ఐతే అది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది. ఈ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క భూకంపాలు, ప్రకృతి వైపరిత్యాలకు గురయ్యే ప్రదేశంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఆయా ప్రదేశంలోని శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి ఆచూకిని కనిపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. దీంతో టర్కీ ఆ జాతికి చెందిని మూడు నెలల వయసున్న కుక్క పిల్లను విధి నిర్వహణలో ప్రాణాలొదిలేసిన కుక్క పిల్లకు బదులుగా మెక్కికోకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ కుక్కపిల్లకు 'ఆర్కాదాస్గా' నామకరణం ఈ కుక్కపిల్లకు మెక్కికో సైన్యం స్వాగతం పలకడమే గాక ఆర్కాదాస్ అని పేరుపెట్టింది. టర్కిష్‌లో ఆర్కాదాస్ అంటే స్నేహితుడు అని అర్థం. మృతి చెందిన ప్రోటియోని సంరక్షించిన ట్రెయినరే ఆర్కాదాస్కి కూడా శిక్షణ ఇస్తారని మెక్సికో సైన్యం తెలిపింది. ఈ మేరకు సదరు కుక్కపిల్ల గ్రీన్‌కలర్ సైనిక యూనిఫాం ధరించి బుధవారం మెక్సికో సైనిక స్థావరంలో జరుగుతున్న అధికారిక వేడుకలో పాల్గొంది. సరిగ్గా మెక్కికో జాతీయ గీతం స్పీకర్ల నుంచి వస్తుండగా.. ఒక్కసారిగా ఆ కుక్కపిల్ల ఉద్వేగభరితంగా మొరిగి తన విశ్వాసాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో మెక్కికో రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్కాదాస్ తరుఫున ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్లో.."నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించిన మెక్సికోకు చెందిన స్నేహితులకు ధన్యవాదాలు. రెస్క్యూ డాగ్‌గా ఉండేందుకు నావంతుగా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ". అని పేర్కొంది రక్షణ శాఖ. కాగా, టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో మరణించిన ప్రోటీయో కుక్కుకు మెక్కికో ఘనంగా సైనిక అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించింది. (చదవండి: మరో ఆప్షన్ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!) -
20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): రూ.20 కోట్లకు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాదీ నుంచి ఖరీదైన పెట్‌ను సొంతం చేసుకున్నాడంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తవం. రష్యాకు చెందిన ‘కొకేషియన్ షెపర్డ్’ అనే జాతికి చెందిన కుక్క కోసం హైదరాబాద్‌కు చెందిన కన్స్ట్రక్టర్ బెంగళూరులోని ‘ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసొసియేషన్’ ప్రెసిడెంట్, పెట్ యజమానైన సతీష్ కెడబామ్స్‌ను సంప్రదించాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ పెట్‌కు రూ.20కోట్లు ఇస్తానంటూ యజమానికి ఆఫర్ ఇచ్చాడు. తాను ఈ ఆఫర్‌ను నిరాకరించానని, ఈ పెట్‌ను రూ.100కోట్లు ఇచ్చినా అమ్మేది లేదంటూ ఆయన ‘సాక్షి’కి చెప్పారు. రూ.20కోట్లకు తాను కొన్నానంటూ వచ్చిన కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. ‘రష్యాకు చెందిన ఈ కొకేషియన్ షెపర్డ్ జాతి శునకం వయసు ఏడాదిన్నర్ర, బరువు 100కేజీలు. ఇది దక్షిణ రష్యాలోని ఆర్మేనియా, అజర్బైజాన్, జార్జియాలతోపాటు టర్కీలో కూడా లభిస్తుంది. చూడటానికిది ఆడ సింహం మాదిరిగా ఉంటుంది. ఈ జాతికి చెందిన శునకం మనదేశంలో దొరికినప్పటికీ రష్యాలో ఉన్న మాదిరిగా ఉండదు. ‘కెడబామ్స్ హైడర్’ అని ముద్దుగా పిలిచే ఈ శునకం త్రివేండ్రంలో జరిగిన ‘కెనల్ క్లబ్ కాంపిటీషన్’లో 32 మెడల్స్‌ను సొంతం చేసుకుని ది బెస్ట్ డాగ్‌గా నిలిచింది’ అని కెడబామ్స్ చెప్పారు. చదవండి: (ఒకేసారి బండి, ఈటల ప్రసంగం.. సాంకేతిక లోపమా? కావాలనే చేశారా?) -
కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!
మద్దిపాడు: గొర్రెల కాపరికి తన జీవాలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే కదా! తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం, చింతగుంట గ్రామానికి చెందిన కురమయ్య సుమారు వెయ్యి గొర్రెల మందకు కాపరి. అన్ని జీవాలకు మేత కావాలి కదా! అందుకే వాటిని మేపుకుంటూ ప్రస్తుతం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి, గుండ్లాపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. ఇతనితో పాటు మరో ముగ్గురు కూడా మందకు రక్షణగా ఉంటారు. ఇంత పెద్ద సమూహంలో పిల్లలు పుట్టడం సహజమే. అయితే అవి నడవలేవు కాబట్టి వాటి కోసం బాడుగ వాహనం కావాలి. అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కురమయ్యకు ఓ ఐడియా వచ్చింది. చిలకలూరిపేటలో ఓ ఆటోమొబైల్ గ్యారేజీకి వెళ్లి 38వేల రూపాయలు ఖర్చు చేసి ఇనుప గ్రిల్స్‌తో ట్రాలీ తయారు చేయించాడు. దానిని తన ద్విచక్రవాహనానికి అమర్చడంతో ట్రాలీ వాహనంలా మారిపోయింది. ప్రస్తుతం 60 మేక పిల్లలను ఎంత దూరమైనా సులువుగా తీసుకువెళుతున్నామని దీనివలన ఖర్చు తగ్గిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
TS: పరిహారం కోసం వెళ్లిన పోశన్నకు షాక్
క్రైమ్: ఉన్నట్లుండి ఇంటి బయట కొట్టంలో ఉన్న గొర్రెలు మాయమైపోతూ వచ్చాయి. చివరకు ఓ కొండచిలువ వాటిని మింగేసిందని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి. నష్టపరిహారం కోరుతూ అతను ఫారెస్ట్ అధికారులను సంప్రదించాడు. అయితే ఉల్టా అతని మీదే కేసు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో షాక్ తిన్నాడు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావాల్ గ్రామానికి చెందిన పోశన్న.. ఇంటి ఆవరణలోనే సాదుకుంటున్న నాలుగు గొర్రెలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వారం రోజుల్లో ఆ నాలుగు ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతూ వచ్చాయి. ఈ క్రమంలో దొంగల పనిగా భావించిన ఆ కుటుంబం ఒక కన్నేసింది. అయితే.. అక్టోబర్ 30వ తేదీన పోశన్న భార్య ఇల్లు ఊడుస్తున్న టైంలో ఇంటి ఫెన్సింగ్‌లో ఓ భారీ కొండచిలువ చిక్కుకుని కనిపించింది. దీంతో గొర్రెలను మింగింది కొండచిలువనేనని నిర్ధారించుకుని.. కోపంతో ఊరి జనం సాయంతో దానిని గొడ్డళ్లతో నరికి చంపేశాడు పోశన్న. గొర్రెలు బతికే ఉంటాయన్న ఆశతో దాని కడుపు చీల్చి చూశాడు. అయితే.. అందులో గొర్రెల మృతదేహాలు కనిపించాయి. దీంతో పోశన్న అటవీ అధికారులను నష్టపరిహారం కోసం సంప్రదించాడు. అయితే.. నష్టపరిహారానికి బదులు.. కొండచిలువను చంపిన నేరానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో పోశన్న కంగుతిన్నాడు. -
పులిని చంపేసి మేకలను కాపాడిన కాపరి
డెహ్రాడూన్: తనకు జీవనోపాధి కల్పిస్తున్న వాటిని కాపాడుకునేందుకు ఓ యువకుడు ఏకంగా పులితో పోరాడాడు. దాడి చేసేందుకు వస్తున్న వ్యాఘ్రాన్ని ఏమాత్రం బెరుకు లేకుండా పోరాడి చివరకు అంతమొందించాడు. అతడి సాహసం.. తెగువను గ్రామస్తులు మెచ్చుకున్నారు. అయితే పులిని హతమార్చడంతో కేసుల బారిన పడే అవకాశం ఉంది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పితోర్గడ్ జిల్లా నైని గ్రామానికి చెందిన మేకల కాపరి నరేశ్ సింగ్. మేకలను మేపుతూ జీవిస్తున్నాడు. చదవండి: సినిమాను మించిన మర్డర్.. మూడు హత్యలతో వరంగల్ ఉలిక్కి రోజు మాదిరిగా బుధవారం మేకలను మేత కోసం అడవి బాట పట్టాడు. మేత మేస్తున్న మేకల మందలో అలజడి మొదలైంది. ప్రాణభయంతో మేకలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఏమైందా అని వెళ్లి చూడగా చిరుత పులి ప్రత్యక్షమైంది. తన మేకలను కాపాడుకునేందుకు నరేశ్ విశ్వ ప్రయత్నాలు చేశాడు. బెదిరించాడు.. వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్న నరేశ్పైకి పులి దూసుకొచ్చింది. తన మీదకు దాడి చేసేందుకు వచ్చిన పులిపై కొడవలితో ఒక్క వేటు వేశాడు. అతడి దెబ్బకు పులి నేలకొరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పులి కళేబరాన్ని పరిశీలించారు. అయితే పులిని హతమార్చడం వాస్తవంగా నేరం. కాకపోతే ఆత్మరక్షణ కోసం చంపడంతో నరేశ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే నరేశ్ తెగువను గ్రామస్తులు అభినందించారు. తమకు పొంచి ఉన్న పులి ముప్పును తప్పించాడని ప్రశంసించారు. చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు.. జీతం అడిగితే పోలీస్ కేసు! -
మానేరు వాగులో 25 గంటల నిరీక్షణ
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు వాగు వరదలో గొర్రెలకాపరి చిక్కుకుని 25 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చుట్టూ వరద రావడంతో ఎటూ వెళ్లలేక రాత్రంతా గొర్రెలతోపాటు ఉన్నాడు. ఇతని కోసం వెళ్లిన మరో ఐదుగురు కూడా వరదలో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారులు వీరిని బోటుసాయంతో ఒడ్డుకు చేర్చారు. వివరాలు... సిరిసిల్లలోని సాయినగర్‌కు చెందిన మొగిలి చంద్రమౌళి(58) గొర్రెలకాపరి. తనకున్న గొర్రెలు, మేకలను మేపేందుకు సోమవారం ఉదయం మానేరు మధ్యలో ద్వీపంలా ఉండే ప్రాం తానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వాగులో వరద ఉధృతి పెరగడంతో రెండు గొర్రెలు కొట్టుకుపోయాయి. దీంతో తెల్లవార్లు అతను వాగు మధ్యలో ఉండిపోయాడు. ఈ విషయాన్ని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. సిరిసిల్ల పట్టణం సాయినగర్కే చెందిన కె.రాజు(26), కె.అప్పారావు(22), ఎస్.విజయ్ (21), కె.రాజు(22), విజయ్(26) మంగళవారం ఉదయం చంద్రమౌళిని కాపాడేందుకు మానేరువాగు దాటి వెళ్లారు. తిరిగి వస్తుండగా వరద ఎక్కువకావడంతో వారూ వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని, గొర్రెలను ఒడ్డుకు చేర్చారు. మానేరులో కొట్టుకుపోయిన బస్సు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట వెళ్లే దారిలో మానేరు వాగు వరదలో సోమవారం చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం కొట్టుకుపోయింది. ప్రయాణికులం తా సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. కాగా, మానేరు నది వరద పరిస్థితి, గేట్లు ఎత్తే విష యం పశువుల కాపర్లు, జాలర్లకు తెలిసిపోయేలా, వారిని అప్రమత్తం చేసేలా సిరిసిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పశువుల కాపర్లు, జాలర్లతో పాటు వీపీవోలు, వీఆర్ఏ, వీఆర్వోలు ఉంటారు. -
గెయిల్ ఒమ్వెట్; శ్వేతజాతిలో వికసించిన నల్ల వజ్రం
కులం, జెండర్ అధ్యయనాలపై అత్యంత గొప్ప పండితులలో ఒకరైన గెయిల్ ఒమ్వెట్ మహారాష్ట్రలోని కెసెగావ్ గ్రామంలో ఆగస్ట్ 25 తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. ఈ అమెరికన్ సంతతి భారతీయ పరిశోధకురాలు, సామాజిక శాస్త్రవేత్త గత అయిదు దశాబ్దాలకు పైగా దళిత, ఓబీసీ, ఆదివాసీల సమస్యలపై తన రచనలకు గాను ప్రపంచఖ్యాతి పొందారు. గెయిల్ ఒమ్వెట్ అమెరికన్ చర్మంలో ఒదిగిన దళిత మహిళ. రచనా క్షేత్రంలో, పోరాట రంగంలో ఉంటున్న మాలాంటి అనేక మందికి సిద్ధాంతాలపై రాజీపడకుండా, ప్రమాణాలు పలుచబారకుండా ఎలా రచనలు చేయాలో ఆమె నేర్పారు. ఇవాళ ఆమె మన మధ్య లేరు కానీ, తను రాసిన పుస్తకాలు, వ్యాసాలు, ప్రసంగాల ద్వారా, అసమానత్వానికి వ్యతిరేకంగా మేం సాగిస్తున్న పోరాటంలో ఆమె మాతో ఎప్పటికీ కలిసే ఉంటారు. 1980ల ప్రారంభంలో ఒక యువ విద్యావిషయక కార్యకర్తగా నేను ఆమెను పుణే సెమినార్లో తొలిసారిగా కలిశాను. మహారాష్ట్ర కులాల పొందిక, సామాజిక ఉద్యమాలు, రాజకీయాల చరిత్ర వంటి అంశాలపై ఆమెకున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాను. భారతదేశంలోని దిగువ కులాల గురించి ఇంత పరితాపం, ఆసక్తి ఉన్న విదేశీయులను నేను అంతవరకు తెలుసుకుని ఉండలేదు. ఆ సెమినార్లో పాల్గొన్నవారందరూ సత్యశోధక్ ఉద్యమం, అంబేడ్కర్ ఆందోళనలు, రచనలపై అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె వివరణను తీసుకోవాలని ప్రయత్నించారు. ఒక మార్క్సిస్టు విద్యాధిక కార్యకర్తగా నేను ఆ శ్వేత మహిళలోని అపార జ్ఞానాన్ని, కులం, మహిళా విముక్తికి చెందిన ప్రతి అంశంపై ఆమె అవగాహనను చూసి ఆశ్చర్యపోయాను. ఆ సమయంలో దళిత, ఓబీసీ ఉద్యమాల కంటే ఫెమినిస్టు ఉద్యమమే బాగా ప్రచారంలో ఉండేది. ఈ రెండింటి గురించి ఒమ్వెట్ సమాన స్థాయిలో మాకు సమాచారం పంపేవారు. ఆ తర్వాత ఆమె దిగువ తరగతి శూద్ర/ఓబీసీ కుటుంబంలో కోడలిగా మారి ఒక గ్రామంలో నివసించారు. అమెరికానుంచి వచ్చి పూలే, అంబేడ్కర్ రచనలతో ప్రభావితురాలై, భారత్‌లోని అస్పృశ్యులు, ఆదివాసీల విముక్తి కోసం బోధన చేసి, వారిని సంఘటితపర్చి, ఆందోళనల్లో పాల్గొన్న ఈ గొప్ప మహిళ రచనలను అప్పటినుంచే చదవసాగాను. అది అంధకార గృహం నుంచి విరిసిన సరి కొత్త కాంతిపుంజం. తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ఆమె దేశ, విదేశాల్లోని వేలాది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. అమెరికా నుంచి విద్యార్థిగా వచ్చి 1970లలో భారత్‌లో నివాసమేర్పర్చుకున్న ఒమ్వెట్ కుల అధ్యయనాలపై గొప్ప ప్రతిభ ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆమె మార్క్సిస్టు పండితుడు, కార్యకర్త భరత్ పటాంకర్‌ను వివాహమాడారు. కులాన్ని, మహాత్మా పూలే ఉద్యమాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా నుంచి ఆమె పీహెచ్డీ విద్యార్థినిగా వచ్చారు. భారతదేశంలో కులం, అస్పృశ్యతా వ్యవస్థను చూసి ఆమె కదిలిపోయారు. పీడిత కులాల విముక్తిపై కృషి చేయడానికి ఈ దేశంలోనే స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. భారతదేశంలో దళిత, ఆదివాసీ, ఓబీసీ చైతన్యానికి రూపురేఖలు దిద్దడానికి ఆమె చేసిన దోహదం అసమానమైనదని చెప్పాలి. అమెరికాలోని మినియాపోలిస్‌లో జన్మించిన ఒమ్వెట్ యూసీ బర్క్లీ వర్సిటీలో చదివారు. 1973లో అదే వర్సిటీ నుంచి పీహెచ్.డి పొందారు. ఈ క్రమంలోనే ఆమె సామ్రాజ్యవాద వ్యతిరేకిగా మారిపోయారు. జాతీయవాదం అనేది పుట్టుక ద్వారా ఏర్పడదని నిరూపించడానికి ఆమె భారత్‌లో నివాసం ఏర్పర్చుకున్నారు. ఆమె అసాధారణ రచయిత, పలు పుస్తకాలు రచించారు. ఆమె థీసిస్ ప్రపంచానికి మహాత్మా పూలే సత్యశోధక్ ఉద్యమం గురించి ప్రపంచానికి తెలిపింది. ఆమె రాసిన విశిష్ట రచన ‘దళిత్స్ అండ్ డెమొక్రాటిక్ రివల్యూషన్’ భారత దేశంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ, ప్రపంచంలోని దక్షిణాసియా స్టడీ సెంటర్లలోనూ ప్రతి యువ విద్యార్థికీ, విద్యార్థినికీ కరదీపికగా మారిపోయింది. పరిశోధకులు కులం, అంటరానితనం సమస్యపై అవగాహనకు, ఆమె పుస్తకాలు చదివారు. గెయిల్ ఒమ్వెట్ పుణేలోని పూలే ఇంటికి వచ్చి కొత్త కాంతి ప్రసరించేంతవరకు, 1898 మహమ్మారికి బలైన సావిత్రీబాయి పూలే మరణం వరకు భారతీయ పండితులు వీరిద్దరి గురించి తెలుసుకోలేదు. స్వయంగా రంగం మీద ఉండి అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. జీవితకాలం ఆమె చేసిన కృషి, కలిగిం చిన స్ఫూర్తికి గాను శూద్ర, ఓబీసీ, దళిత, ఆదివాసీ ఉద్యమాలు ఆమెకు రుణపడి ఉంటాయి. అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యంతో భారతదేశం వచ్చిన ఒమ్వెట్ తన రంగును మార్చుకోలేకపోయారు కానీ, భారతీయ దళిత మహిళగా మారేందుకు అవసరమైన ప్రతి అంశాన్ని ఆమె పాటించారు. ఆమె సమర్పించిన పరిశోధనా సిద్ధాంతం పేరు ‘కల్చరల్ రిపోల్ట్ ఇన్ ఎ కలోనియల్ సొసైటీ: ది నాన్ బ్రాహ్మన్ మూవ్మెంట్ ఇన్ వెస్టర్న్ ఇండియా, 1870–1930.’ దీన్ని తర్వాత పుస్తకంగా ప్రచురించారు. గెయిల్ తన కెరీర్‌ని మార్క్సిస్టుగా ప్రారంభించారు. భారతీయ కుల వ్యవస్థను అధ్యయనం చేయడానికి ఆమె మార్క్సిస్టుగా కొనసాగి సోషలిస్టు భావాలను, మార్క్సిస్టు వైధానికతను అట్టిపెట్టుకున్నారు. అదే సమయంలో అంబేడ్కరైట్‌గా కూడా ఆమె పరివర్తన చెందారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒమ్వెట్ దంపతులు చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అనేక రంగాలపై ఆమె రచనలు చేశారు. బుద్ధిజంపై, మహిళలపై ఆమె రాసిన రచనలు కులంపై ఆమె రాసిన రచనల్లాగే సుపరిచితం. గత నలభై ఏళ్లుగా ఆమె భర్త భరత్ పటాంకర్, ఏకైక కుమార్తె ప్రాచీ పటాంకర్‌తో కలిసి దళిత, ఓబీసీ, ఆదివాసీ, మహిళా విముక్తి ఉద్యమాలలో సుదీర్ఘకాలం ఆమెతో కలిసి పని చేసిన మేమంతా ఆమె జీవితాన్ని, కృషిని భారతీయులుగా గర్విస్తూ వేడుకలు జరుపుకుంటాము. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
‘ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది’
బెంగళూరు: దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ సత్య ప్రధాన్ తన ట్విట్టర్లో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఎన్డీఆర్ఎఫ్ సభ్యుల మధ్య ఓ గొర్రెల కాపరి, అతడి పెంపుడు కుక్క కూర్చొని ఉన్నాయి. కరోనాను దృష్టిలో పెట్టుకుని వీరంతా చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి ఉన్నారు. ‘భారీ వరదలతో కృష్ణానది పొంగిపొర్లుతోంది. ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు ఈ గొర్రెల కాపారిని కాపాడారు. వరదల కారణంగా ఈ కుర్రాడు తన గొర్రెలను వదిలేసి వచ్చాడు. కానీ పెంపుడు కుక్కను మాత్రం తనతో పాటు తీసుకొచ్చాడు’ అంటూ సత్య ప్రధాన్ ట్వీట్ చేశారు. (కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి...) ✅This image will stay etched in my memories ✅This shepherd boy was rescued by @NDRFHQ from raging waters of Krishna ✅He was sad to leave many sheep behind ✅But had presence of mind to bring the dog so sheep graze freely & dog is fed by him ✅Happy to have helped the boy🙏🏻 pic.twitter.com/VLgvMZdjKv — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) August 9, 2020 అంతేకాక ‘ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే.. ‘గొర్రెలు ఎక్కడైనా స్వేచ్ఛగా మేస్తాయి. కానీ కుక్క అలా కాదు. దానికి నేనే భోజనం పెట్టాలి. అందుకే దాన్ని నా వెంట తీసుకొచ్చాను. గొర్రెలను వదిలేసినందుకు బాధగా ఉంది. కానీ అవి ఎలాగైనా బతుకుతాయనే నమ్మకంతోనే కుక్కను తీసుకొచ్చాను’ అన్నాడు. క్లిష్ట సమయంలో ఈ గొర్రెల కాపరి అద్భుతమైన సమయస్ఫూర్తి చూపాడు. ఈ సంఘటన, ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి’ అంటూ సత్య ప్రధాన్ ఈ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అంతేకాక ‘కష్టాలు వచ్చినప్పుడు మనిషిలోని పోరాట పటిమ, కరుణ వెల్లడవుతాయి. మనిషి నమ్మకానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిస్తుంది’ అన్నారు సత్య ప్రధాన్. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాల వల్ల తీరప్రాంత జిల్లాలు, కొన్ని ఉత్తర జిల్లాలు, కొడగు జిల్లా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. (ముంబైని ముంచెత్తిన వర్షాలు) వర్షం పరిమాణం కొంత వరకు తగ్గింది.. కాని పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. కొడగు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. -
రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!
మినెస్క్: ఆడి కారులో తిరగాలన్న కోరికను ఓ పశువుల కాపరి వినూత్న ఆలోచనతో తీర్చుకున్నారు. జీవితంలో ఏనాటికైనా ఆడి కారు కొనాలని, అందులో తిరగాలనుకున్నది యూరప్‌లోని బెలారస్‌కు చెందిన అలెక్సీ చిరకాల వాంఛ. అయితే, ఆడి కారు కొనే స్థోమత లేకపోవడం, ఒకవేళ అప్పోసప్పో చేసి దానిని కొనుగోలు చేసినా గొర్రెలు, ఆవులకు కాపరిగా దాన్ని తీసుకుని వెళ్ళలేడు. దాంతో ఆయనకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. పనిచేయని ఓ ఆడి కారును కొనుగోలు చేసి, దాని ఇంజిన్ భాగాన్ని తొలగించి గుర్రపు బండిగా మార్చేశాడు అలెక్సీ. గుర్రం కారును లాగుతుంటే ఆయన ఎంచక్కా అందులో గొర్రెలు, ఆవులు కాసేందుకు వెళ్తున్నాడు. పెట్రోల్ ఖర్చు భారం కూడా లేదు. పశువుల కాపరిగా పనులు చేసుకోవడంతోపాటు, ఆడి కారు కమ్ గుర్రపు బక్కీలో ఆయన షికార్లకు సైతం వెళుతూ మురిసిపోతున్నాడు. అలెక్సీ ఆడికారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
కాపరికి కరోనా.. గొర్రెలు, మేకలు ఐసోలేషన్‌కి!
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని ఓ గొర్రెల కాపరికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతని వద్ద ఉన్న సుమారు 50 గొర్రెలు, మేకలను ఐసోలేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గొల్లరహట్టి తాలూకాలోని గోడెకెరె గ్రామంలో చోటుచేసుకుంది. కాపరికి చెందిన మేకలు, గొర్రెలు శ్వాసకోశ సమస్య కలిగి ఉన్నాయని గమనించిన గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పశుసంవర్ధక శాఖలోని ఓ అధికారి తెలిపారు. (తెలంగాణలో కొత్తగా 945 కరోనా కేసులు) అదే విధంగా గోడెకెరె గ్రామ ప్రజలు తమ గ్రామంలో నెలకొన్న కరోనా భయాందోళనలపై సమగ్రంగా విచారణ జరపాలని కర్ణాటక న్యాయశాఖ మంత్రి మధుస్వామి, తుముకూరు జిల్లా కమిషనర్ కె. రాకేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రజల విజ్ఞప్తిపై మంత్రి స్పందించారు. గ్రామంలోని పరిస్థితులను తెలుసుకోవాలని పశుసంవర్ధక విభాగాన్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన వైద్యులు.. పలు పరీక్షలు నిర్వహించి.. మేకలు ప్లేగు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అని పిలువబడే పెస్టే డెస్ పెటిట్స్ రూమినెంట్స్(పీపీఆర్)తో బాధపడుతున్నాయని తెలిపారు. ఇక జంతువుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. ఇక మేకలు, గొర్రెలు కరోనాకు గురి కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ ప్లేగు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ ఇతర జంతువులకు కూడా వ్యాప్తిస్తుందని గొర్రెలు, మేకలను నిర్భంధించినట్లు అధికారులు తెలిపారు.(తమిళనాడు మంత్రికి కరోనా పాజిటివ్) -
‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడి పేరు నిన్న దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. తన ప్రాంతంలో నీటి ఎద్దడి తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించిన ఆ వృద్ధుడిని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో అభినందించారు. ఆ వివరాలు.. మాండ్య, దసనదొడ్డి ప్రాంతానికి చెందిన కామె గౌడ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమ ప్రాంతంలో నీటి ఎద్దడిని తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించి పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ సామన్య గొర్రెల కాపరికి ఇది చాలా పెద్ద విషయమే. దాంతో ఇది కాస్తా ప్రధాని దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో నిన్నటి ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో నరేంద్ర మోదీ కామె గౌడను ప్రశంసించారు. దీనిపై సదరు వృద్ధుడు స్పందిస్తూ.. ‘నిన్నటి కార్యక్రమంలో ప్రధాని కరోనా వైరస్ గురించి జనాలను హెచ్చరించారు.. సరిహద్దు వివాదం గురించి మాట్లాడారు. ఇన్ని ముఖ్యమైన అంశాల మధ్య ఆయన నా పేరును ప్రస్తావించి.. అభినందించారు. నా జీవితానికి ఇంతకంటే పెద్ద సంతోషం ఏం ఉంటుంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రాంతంలో చెరువులు తవ్వించి.. నీటి సమస్యను తీర్చడంతో ఆ ప్రాంత ప్రజలు కామె గౌడను ‘కేరె’(చెరువుల)గౌడ అని గౌరవంగా పిల్చుకుంటున్నారు. (స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి) నిన్నటి ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్ తగిన సమాధానం చెప్పిందని తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్‌కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
పశువుల కాపరిపై పులి పంజా
సాక్షి, కోటపల్లి(చెన్నూర్) : మండలంలోని అటవీ ప్రాంతంలో మళ్లీ పులి కదలికలు మొదలయ్యాయి. పులి ఈసారి ఒక అడుగు ముందుకేసి పశువుల కాపరిపై దాడి చేసి గాయపర్చిన ఘటన కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కోటపల్లి మండలంలోని బమన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా వెంకటయ్య రోజు లాగానే శుక్రవారం నక్కలపల్లి బమన్‌పల్లి అటవీప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లాడు. పశువులపై ఒక్కసారిగా పులి దాడి చేయబోయే క్రమంలో ప్రతిఘటించడంతో కాపరి కాలుపై పంజా విసిరింది. దీంతో అతనికి కాలికి పెద్ద గాయమైంది. వెంటనే వెంకటయ్య పులిని దగ్గరలోని కట్టలతో బెదిరించినట్లు చేయడంతో పులి అక్కడినుంచి వెళ్లిపోయింది. గ్రామసమీపంలోకి వచ్చి అరుపులు పెట్టడంతో గ్రామస్తులు వచ్చి ప్రథమచికిత్స నిర్వహించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీవో రాజారావు, ఎఫ్ఆర్వో రవికుమార్, డిప్యూటీ రేంజర్ దయాకర్ బాధితుడిని పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా పులి పాదముద్రలను గుర్తించి ప్లగ్మార్క్ చేసి దాడిచేసింది ఏ1 పులిగా గుర్తించారు. బాధితుడిని మెరుగైన వైద్యంకోసం చెన్నూర్ అస్పత్రికి తరలించారు. భయాందోళనలో స్థానికులు గత డిసెంబర్లో పంగిడిసోమారం అటవీప్రాంతంలో ఏడు ఆవులపై దాడి చేసి హతమార్చిన పులి మళ్లీ కాపరిపై దాడిచేయడంతో గ్రామస్తులు, భయాందోళనలు చెందుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం అడవిలో సంచరిస్తున్న పులి గ్రామాల సమీపంలోకి వస్తుండటంతో పులికి ప్రమాదం పొంచి ఉంది. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమరుస్తుండడంతో అటవీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వేటను సంపూర్ణంగా నిలిపివేయకుంటే పులికి ప్రమాదం ఉంది. -
పశువుల కాపరిపై పులి పంజా
కోటపల్లి (చెన్నూర్): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం పశువుల కాపరిపై పులి దాడి చేసింది. బమన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా వెంకటయ్య రోజు లాగానే నక్కలపల్లి అటవీ ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లాడు. ఒక్కసారిగా పశువులపై పులి దాడి చేయబోయే క్రమంలో ప్రతిఘటించడంతో అతనిపై పంజా విసిరింది. దీంతో వెంకటయ్య గాయపడ్డాడు. అతి కష్టం మీద గ్రామ సమీపంలోకి వచ్చి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యుడు ప్రథమ చికిత్స అందించాడు. మెరుగైన వైద్యం కోసం చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీవో రాజారావు, ఎఫ్ఆర్వో రవికుమార్, డిప్యూటీ రేంజర్ దయాకర్ బాధితుడిని పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. పులి పాదముద్రలను చూసారు. దాడి చేసింది పులి అని గుర్తించారు. -
ఎస్ఐ, గొర్రెల కాపరి బాహాబాహీ
సాక్షి, ఆలూరు: ఎస్ఐ, గొర్రెల కాపరి పరస్పరం దాడి చేసుకున్న సంఘటన ఆలూరు మండలంలోని గోనేహాలు–మనేకుర్తి గ్రామాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హాలహర్వి మండల ఎస్ఐ బాలనరసింహులు పని నిమిత్తం ఆదోని పట్టణానికి బైక్‌పై బయలుదేరారు. మనేకుర్తి–గోనేహాలు సమీపంలో రోడ్డుపై గొర్రెలు అడ్డొచ్చాయి. వాటిని పక్కకు తోలాలని కాపరి బీరప్పను దూషించారు. ఆయన మఫ్టీలో ఉండడంతో ఎస్ఐగా గుర్తించలేని గొర్రెల కాపరి కాస్త కటువుగానే మాట్లాడాడు. ‘నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? అవి మూగజీవాలు.. పక్కకు జరగాలని వాటికి తెలియద’ని అన్నాడు.దీంతో ఎస్ఐ.. గొర్రెల కాపరి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అతను కూడా ఎదురుదాడికి దిగాడు. సంఘటన తరువాత ఎస్ఐ ఆలూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గొర్రెల కాపరి కోసం గాలిస్తున్నారు. -
పశువుల కాపరి ఆర్తనాదాలు; కాపాడిన ఫైర్ సిబ్బంది
సాక్షి, కాకినాడ : వాగులో కొట్టుకుపోతున్న పశువుల కాపరిని ఫైర్ సిబ్బంది కాపాడిన ఘటన ప్రత్తిపాడు మండలం లంపకలోప వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాచపల్లికి చెందిన కొల్లు వీరబాబు పశువుల మేత కోసం సుద్దగడ్డ వాగు దగ్గరకు వచ్చాడు. ఈ నేపథ్యంలో పశువుల మేత తీస్తుండగా ఒక్కసారిగా కాలు జారి వాగులో పడిపోయాడు. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వీరబాబు చెట్ల కొమ్మలను పట్టుకొని సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. దీన్ని గమనించిన అక్కడి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పశువుల కాపరిని బయటకు తీశారు. -
అడ్డొస్తాడని అంతమొందించారు
రాజోళి (అలంపూర్): వివాహేతర సంబంధమే ఓ అమాయకుడి హత్యకు దారితీసింది. మాటలతో కలిసిన పరిచయం, ఫోన్లో సంభాషణ, ఆపై నేరుగా కలుసుకోవడం.. అనంతరం అడ్డుగా వస్తాడనే ఉద్దేశంతో ప్రియురాలి భర్తను అంతమొందించేలా చేసింది. డీఎస్పీ షాకీర్‌హుస్సేన్ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దతాండ్రపాడుకు చెందిన మిషేక్(28) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రోజూలాగానే ఈ నెల పదో తేదీన సొంత పనిమీద బయటకు వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో మిషేక్ అన్న అశోక్ రాజోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామంలోని ఇద్దరు యువకులు బోయ లక్ష్మన్న(22), బోయ మధు(20)లపై అనుమానాలు వ్యక్తం కాగా వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అయిజ మండలం వెంకటాపురం వద్ద వారిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజోళి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వివాహేతర సంబంధం.. గ్రామంలో ఆటో నడుపుతూ ఫిల్టర్ నీటిని సరఫరా చేసే బోయ లక్ష్మన్నకు మిషేక్ భార్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనకు, తన ప్రియురాలికి మిషేక్ ఎప్పుడైనా అడ్డేనని భావించిన బోయ లక్ష్మన్న అతన్ని అడ్డు తొలగించేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న గొర్రెలకు కాపలాగా వెళ్లిన మిషేక్ తనతోపాటు ఉండే మిగతా వారికి భోజనం తీసుకువచ్చేందుకు చింతల్ క్యాంపు పరిసరాల నుంచి గ్రామంలోకి వచ్చి వెళ్తుండగా.. సీతారామయ్య తోట దగ్గర అతని కోసం ముందుగా వ్యూహం రచించుకుని సిద్ధంగా ఉన్న బోయ లక్ష్మన్న, బోయ మధు టవల్‌తో మిషేక్‌కు ఊపిరి ఆడకుండా టవల్‌తో మెడకు గట్టిగా బిగించారు. అనంతరం అతని ఛాతి, ముఖంపై బలంగా మోదడంతో ఊపిరి అందక మృతిచెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి తనగల శివారులో గల తుమ్మిళ్ల లిఫ్టు పైపులో పడేశారు. పైపులైన్ లోతు ఎక్కువగా ఉండటం, నాలుగు రోజులుగా మృతదేహం అందులోనే ఉండటంతో నల్లబడిపోయింది. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల రైతులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు మిషేక్ మృతదేహంగా నిర్ధారించారు. ఈ విషయమై నిందితులు తెలిపిన వివరాల మేరకు మిషేక్ భార్యపై కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి ఛేదించిన శాంతినగర్ సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, రాజోళి ఎస్ఐ శ్రీనివాస్, శిక్షణ ఎస్ఐ శ్రీహరిలను ఆయన అభినందించారు. -
ఆవుల కాపరి దారుణహత్య
సాక్షి, గడివేముల/ కర్నూలు: మండల పరిధిలోని ఎల్కే తండాలో ఓ ఆవుల కాపరి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పిన్నాపురం గ్రామానికి చెందిన బోయ మీదివేముల వెంకటేశ్వర్లు కుమారుడు ఎం.వెంకటకృష్ణ(21 ఎల్‌కె తండాకు చెందిన స్వామినాయక్ వద్ద ఆవుల కాపరిగా ఉన్నాడు. గురువారం వెంకటకృష్ణ సొంత పని నిమిత్తం గని గ్రామంలోని పెదనాన్న ఇంటికి వెళ్లాడు. అక్కడున్న వెంకటస్వామిని అదే రోజు రాత్రి స్వామినాయక్ ఎల్‌కె తండాకు తీసుకొచ్చాడు. రాత్రి ఏం జరిగిందో ఏమో? తెల్లవారుజామున ఆవుల దొడ్డి వద్ద మంచంపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చిరంజీవి, పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కర్నూలు నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. పోలీస్ జాగిలం స్వామి నాయక్ ఇంటి వద్దకు వెళ్లి, వెనక్కు వచ్చింది. దీంతో స్వామినాయక్ సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మేకల కాపరి దారుణహత్య
సాక్షి, తుగ్గలి(కర్నూలు) : మేకల కాపరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మేకలను ఎత్తుకెళ్లిన ఘటన తుగ్గలి మండలం బోడబండ పుణ్యక్షేత్రం సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి సోదరుడు స్వామినాయక్ తెలిపిన వివరాలు.. సూర్యతండాకు చెందిన రమావత్ రామునాయక్(50) వ్యవసాయంతో పాటు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తనకున్న 25 మేకలను మేపేందుకు గురువారం అడవులకు వెళ్లాడు. మధ్యాహ్నం కుంట వద్ద భార్య దేవమ్మ తెచ్చిన భోజనాన్ని తిని, తిరిగి మేకలను తోలుకుని వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భార్య, కుమారులు, తండా వాసులు బోడబండ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనపడలేదు. చీకటి కావడంతో చేసేదేమీ లేదక రాత్రి జొన్నగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. శుక్రవారం తెల్లవారు జామునే మళ్లీ వెతికేందుకు వెళ్లిన తండావాసులకు ఓ గుట్టలో రాళ్ల మధ్య తలపై తీవ్రగాయాలతో విగత జీవిగా పడిఉన్న రామునాయక్ మృతదేహం కంట పడింది. మేకలు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించక పోవడంతో దొంగల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి చేరే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కట్టెతో తలపై కొట్టి చంపి మేకలు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. రూ.2 లక్షలు కూడా చేయని వాటి కోసం ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టారని కుటుంబ సభ్యులు, తండావాసులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్నిపరిశీలించిన డోన్ డీఎస్పీ.. మేకల కాపరి హత్య విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా, పత్తికొండ సీఐ సోమశేఖరరెడ్డి, జొన్నగిరి ఎస్ఐ విజయకుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మేకల కోసం దొంగలు ఈ దారుణానికి ఒడిగట్టారా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఇది రెండో ఘటన.. ఆరేళ్ల క్రితం మండలంలోని పి.కొత్తూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయ ఎనుముల పుల్లన్న కుమారుడు సురేంద్ర(12) దారుణ హత్యకు గురయ్యారు. సురేంద్ర పక్క గ్రామంలోని హుసేనాపురానికి గొర్రెల యజమాని వద్ద గొర్రెలు మేపేందుకు జీతం ఉన్నాడు.రోళ్లపాడు అటవీ ప్రాంతంలో కొండపై గొర్రెలు మేపుతుండగా దొంగలు కాపరి తలపై బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేసి గొర్రెలు ఎత్తుకెళ్లారు. మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. -
గొర్రె పిల్లను కాపాడబోయి కాపరి మృతి
సాక్షి, అల్గునూర్(మానకొండూర్) : ఉపాధి పొందు తున్న గొర్రెను కాపాడబోయి గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయిన ఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో బుధవారం చోటు చేసుకుంది. రామకృష్ణకాలనీ పంచాయతీ పరిధిలోని చర్లపల్లికి చెందిన ఆవుల రాజయ్య(45) గొర్రెలు పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీలాగే బుధవారం ఉదయం గొర్రెలను మేపెందుకు గ్రామశివారుకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఓ గొర్రెపిల్ల మేత కోసం సమీపంలోని బావిదగ్గరకు వెళ్లి.. అందులోనే పడిపోయింది. గమనించిన రాజయ్య వెంటనే తన కొడుకులకు ఫోన్ చేయగా.. వారు తాడు తీసుకొచ్చారు. తాడుసాయంతో బావిలోకి దిగిన రాజయ్య మొదట గొర్రెపిల్లను పైకి పంపించాడు. తర్వాత అదే తాడుసాయంతో పైకి వస్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. తాడును నడుముకు కట్టుకోవడంతో బావిలోనే తిరుగుతూ బావి అంచులకు తాకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. బావిలో నీళ్లు లేకపోవడం కూడా గాయాల తీవ్రతకు కారణమయ్యాయి. బావిలో పడ్డ తండ్రిని ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో వెంటనే గ్రామస్తులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. బావిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రిని కాపాడాలంటూ తనయులిద్దరూ బతిమిలాడుతూ రోదించడం కలచివేసింది. గ్రామస్తులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు నెలల క్రితం విద్యుదాఘాతం ఆరు నెలల క్రితం రాజయ్యకు చెందిన 18 గొర్రెలు విద్యుదాఘాతంతో మృతిచెందాయి. ఆ సమయంలోనే రాజయ్యకు సైతం కరెంట్‌షాక్ రాగా త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఆరు నెలల తర్వాత ఉపాధి పొందుతున్న గొర్రెలను కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకోవడం గ్రామస్తులను కలచివేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గొర్రెల కాపరిపై లిక్విడ్‌తో గుర్తు తెలియని వ్యక్తుల దాడి
రఘునాథపల్లి : గొర్రెలు మేపుతున్న ఓ కాపరిపై గుర్తు తెలియని వ్యక్తులు లిక్విడ్ చల్లి హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని అశ్వరావుపల్లి శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అశ్వరావుపల్లి శివారులోని వ్యవసాయ పొలాల వద్ద గ్రామానికి చెందిన గాజుల రాజు అనే గొర్రెల కాపరి గొర్రెలు మేపుతున్నాడు. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ వెంట ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చుకున్న లిక్విడ్ (ద్రావకం) చల్లారు. నెత్తికి రుమాలు చుట్టుకోవడంతో లిక్విడ్ మొఖంపై ఎక్కువగా పడలేదు. కళ్లలో పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పాటు రాజు గొంతు నులిమేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించగా కొద్ది దూరంలో ఉన్న వేరొక గొర్ల కాపరి గుర్తించి అరవడంతో ఆగంతకులు పారిపోయారు. గాయాలతో రోదిస్తున్న రాజును స్థానికులు జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రంజిత్‌రావు ఆసుపత్రికి చేరుకొని బాధితుడి నుంచి వివరాలు సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు. పట్టపగలే అఘాయిత్యం.. గొర్రెలు మేపుతున్న రాజుపై పట్టపగలే అఘాయిత్యానికి పాల్పడటం గ్రామంలో కలకలం రేపింది. కొద్ది దూరంలో ద్విచక్రవాహనం నిలిపిన దుండగులు కాలినడకన రాజు వద్దకు చేరుకున్నారు. దుండగులు వెంట తెచ్చుకున్న లిక్విడ్ యాసిడ్‌గా బావించారా ..? చల్లిన వెంటనే ఒంటిపై గాయాలు కాకపోవడంతో గొంతు నులిపి హత్యచేసేందుకు యత్నించడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు గ్రామస్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. రాజుకు తొమ్మిది సంవత్సరాల క్రితం అలేరు మండలానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య ఏర్పడిన వివాదాలు, పలు కారణాలతో రెండేళ్ల క్రితం దూరమయ్యారు. ఆరు నెలల క్రితం అదే మండలంలోని కొలనుపాకకు చెందిన జ్యోతితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతో దాడి జరిగిందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడిపై చల్లింది యాసిడా ..? ఇతర ఏ లిక్విడ్ అన్నది ఆరా తీస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్‌రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజును ఎంపీపీ దాసరి అనిత పరామర్శించారు. -
వడదెబ్బతో ఇద్దరి మృతి
శ్రీరంగాపురం/అమ్రాబాద్ (అచ్చంపేట): వడదెబ్బ కారణంగా బుధవారం ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల పరిధిలోని జానంపేటకు చెందిన హనుమన్న గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. జిల్లాలో పశు గ్రాసం కొరత ఏర్పడటంతో గొర్రెల మందతో ఏపీలోని కర్నూలు జిల్లా ఎదురూరు వెళ్లాడు. అక్కడే కొద్దిరోజులుగా ఉంటున్న ఆయనకు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తాకడంతో మృతి చెందాడు. మరో సంఘటనలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ (బీకే) గ్రామానికి చెందిన బొంత బాలయ్య(55) వేరుశనగ చేను కాపలాకు వెళ్లగా వడదెబ్బ తగలడంతో పొలంలోనే అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందాడు. పక్క పొలాల్లోని రైతులు సాయంత్రం ఈ విషయాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. -
అడవిలో మేకల కాపరి మృతి
భీమ్‌గల్(బాల్కొండ): మండలంలోని పిప్రి గ్రా మ శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం గామాని కి చెందిన మేకల కాపరి సంపంగి ఎల్లయ్య(40) మృతి చెందాడు. ఎల్లయ్య ఉదయం మేకలను కా యడానికి గ్రామ శివారులోని అడవికి వెళ్లాడు. సా యంత్రమైనా ఇంటికి రాకపోయే సరికి అతని భా ర్య ఎల్లయ్యను వెతుకు తూ అడవిలోకి వెళ్లింది. దా యి చెరువు సమీపం లోని బూరుగు చెట్టు వద్ద ఎల్ల య్య మృతదేహం కనిపించింది. మృతదేహంపై తీవ్రమైన గాయాలున్నాయి. శరీరాన్ని క్రూరృమృగాలు పీక్కుతి న్న ఆనవాళ్లున్నాయి. దీంతో ఆమె విషయం గ్రా మస్తులకు తెలిపింది. ఎస్సై సుఖేందర్ రెడ్డి, అ టవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ అతీక్, బీట్ ఆఫీసర్ ముజాహిద్ అహ్మద్‌లు ఘటనా స్థలానికి వెళ్లి వి చారణ జరిపారు. చిరుత లేదా ఎలుగు బంటి చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అనంతపురంలో అమానుషం
► మర్మాంగంపై కొట్టి.. నాలుకను కొడవలితో కోశాడు ► గొర్రెలు పోగొట్టాడని బాలునిపై యజమాని చిత్రహింసలు ► బాలుడి పరిస్థితి చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు ఆ బాలునికి పట్టుమని పదిహేనేళ్లు లేవు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతన్ని బాల కార్మికుడిగా మార్చేశాయి. చిన్నప్పటి నుంచి పడుతున్న కష్టాలు చూసి.. కసి పెంచుకున్న ఆ కుర్రాడు పట్టుదలతో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులతో పాసయ్యాడు. పైచదువులకు వెళ్దామంటే పైసల్లేక గొర్రెల కాపరిగా మారిపోయాడు. ఐదు నెలలుగా కష్టపడి తన తండ్రి చేసిన అప్పులో సగం తీర్చేశాడు. మిగిలిన సగం డబ్బులు అమ్మానాన్నలు తెచ్చి బిడ్డను తీసుకెళ్దామని వస్తే ఆ బాలుడ్ని పంపేందుకు యజమాని అంగీకరించలేదు. పిల్లోడిపై తన ప్రతాపం చూపాడు. మర్మాంగాలపై కొట్టి గాయపరిచాడు. నాలుక తెగ్గోసేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు మాటలు రాక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ధర్మవరం : అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన గొర్రెలు మేపే బాలుడి పట్ల అతని యజమాని అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. తనవద్ద పనికి ఉంటున్న సమయంలో గొర్రెలు పోగొట్టాడనే నెపంతో బాలుడిని గదిలో నిర్బంధించి మర్మాంగంపై కొట్టి.. కర్రతో చావబాది, నాలుకపై కొడవలితో గాట్లు పెట్టి కిరాతకంగా వ్యవహరించాడు. బాధితుడి తల్లిదండ్రులు నాగమ్మ, ముత్యాలప్ప కథనం మేరకు.. మేడాపురానికి చెందిన చెందిన మల్లి అనే వ్యక్తి వద్ద ముత్యాలప్ప రూ.30 వేలు అప్పుతీసుకున్నాడు. ఆ అప్పు తీర్చడానికి తమ కుమారుడు ఆదినారాయణ (16) చదువు మాన్పించి మల్లి వద్ద గొర్రెలు మేపేందుకు పెట్టాడు. ఆ బాలుడు గత ఏడాది పదో తరగతిలో 8.5 పాయింట్లతో పాసయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాలుడు ఐదు నెలలపాటు గొర్రెలను మేపాడు. దీంతో అప్పులో రూ. 15 వేలు పోగా, మిగతా నగదును ఆ బాలుడి తల్లిదండ్రులు శనివారం యజమానికి చెల్లించారు. తమ కుమారుడిని వదిలిపెట్టాలని కోరగా.. ఐదు గొర్రెలు పోగొట్టినందున మరికొన్ని రోజులు తమ వద్దే పనిలో ఉంచుకుంటామని యజమాని చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులు వెనక్కి వచ్చారు. వారు వెళ్లిన తర్వాత యజమాని శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గదిలో బాలుడిని బందించి విచక్షణా రహితంగా కొట్టాడు. ఆదివారం సాయంత్రం ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాడు. కుమారుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రాత్రి ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడు ఆదినారాయణ కాళ్లు, చేతులు వాపులు రావడంతోపాటు నాలుకపై కొడవలి గాట్లు పడటంతో మాట్లాడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. బాలుని తల్లిదండ్రుల నుంచి ధర్మవరం పట్టణ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి చెన్నేకొత్తపల్లి పోలీసులకు సమాచారాన్ని అందించారు.