Shilpa Reddy
-
వావ్, వావ్..యానివర్సరీ వీక్ అంటే ఇలా, మంచు పూల జల్లుల్లోన (ఫోటోలు)
-
జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష విధించాలని అధ్యక్షురాలు శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు.కాగా, షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల అంశంపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి తాజాగా స్పందించారు. ఈ క్రమంలో శిల్పారెడ్డి మాట్లాడుతూ.. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష పడాలి. మతం మారాలని ఒత్తిడి చేయడం లవ్ జిహాద్‌కు సంబంధించిన కేసు. వేధింపుల కేసులో జానీని ఇంకా అరెస్ట్ చేయకపోవడం దారుణం. జానీని వెంటనే అరెస్ట్ చేయాలి’ అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తుపై వేగం పెంచారు. తాజాగా బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అలాగే, ఆమెకు వైద్య పరీక్షలు కూడా ముగిశాయి. ఈ కేసులో మరిన్ని వివరాల సేకరించేందుకు పోలీసులు.. నేడు బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు.ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు! -
టీడీపీ బండారు వ్యాఖ్యలపై శిల్ప రెడ్డి ఫైర్..!
-
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటుడు సామ్రాట్ భార్య
నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇంతకుముందు హర్షితా రెడ్డి అనే యువతితో సామ్రాట్‌కు వివాహం జరిగింది. అయితే విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. 2020లో కాకినాడకు చెందిన అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయితో సామ్రాట్‌కు రెండో విహాహం జరిగింది. ఆగస్టు 15న సామ్రాట్ భార్య లిఖిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇండిపెండెన్స్ రోజును ఇలా సెలబ్రేట్ చేసుకోవడం డిఫరెంట్ ఫీలింగ్ అంటూ సామ్రాట్ తన కూతురితో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సామ్రాట్ దంపతులకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Samrat Reddy (@samratreddy) -
మామయ్య చెప్పిన ఆ మాట మనసులో నాటుకుపోయింది: వైఎస్ భారతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పల్లె వాతావరణం ఉట్టిపడేలా వినూత్న ఆకృతిలో ఈ గోశాలను నిర్మించారు. తాజాగా సీఎం జగన్ సతీమణి భారతిని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి.. గోశాలలో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్మాణం.. అదే విధంగా ఆమె వ్యక్తిగత విషయాల గురించి శిల్ప అడిగి తెలుసుకున్నారు. గోశాల నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని, తన చూపును తిప్పుకోలేకపోతున్నానని శిల్పారెడ్డి అన్నారు. నిర్మాణమంతా చాలా సంప్రదాయబద్దంగా కనిపిస్తోందని, ఇందుకు ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారని అడిగారు. ఇందుకు భారతి స్పందిస్తూ.. ‘గోశాలను ఏ విధంగా నిర్మించాలనే విషయంలో ఎక్కువ వివరాలు ఇవ్వలేదు. అయితే నిర్మాణంలో ఎక్కువగా కృత్రిమ మెటీరియల్‌ను వాడొద్దని, వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండే వస్తువులను ఉపయోగించాలని’ మాత్రమే సూచించినట్లు తెలిపారు. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం గురించి మాట్లాడుతూ.. ‘బొప్పాయి మొక్కను మొదట కుండీలో పెంచి ఆ తర్వాత పెరట్లో నాటాము. అలాగే మొక్కజొన్నను కూడా కుండీలలో పెంచాము. ఇంకా ఇంట్లో వండుకునేందుకు వీలుగా పాలకూర, మెంతి కూర కూడా పెంచాము. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనేది తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా అని పేర్కొన్నారు. ఇంట్లోనే కొన్ని కూరగాయలు, ఆకు కూరలు పెంచుకోవడం, బయట ఫుడ్ తగ్గించి స్వయంగా వండుకొని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలమ’ని అన్నారు. ‘నా చిన్నతనంలో మా అమ్మ ఏం చేసేదంటే రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు, పాలు వేసి కలిపి పెట్టేది. పొద్దునకల్లా అది పెరుగన్నంగా మారేది. నాకు తెలిసి అమ్మ ఇప్పటికీ అదే చేస్తుంది. మా మామయ్య (దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి) చెట్లను పెంచేవారు. చాలామంది అది చూసి ఏదైనా పంట వేయకుండా ఇలా ఎందుకు చెట్లను పెంచుతున్నారని అడిగేవారు. ఆయన ఒక్కటే చెప్పేవారు.. ఇది భవిష్యత్తు కోసం నేను పెడుతున్న పెట్టుబడి అనేవాళ్లు. ఆ మాట నా మనసులో నాటుకుపోయింది’ అని వైఎస్ భారతి చెప్పుకొచ్చారు. మరిన్ని వివరాల కోసం కింది ఇంటర్వ్యూని చూడండి. -
స్విమ్‌సూట్‌లో కనిపించిన సమంత.. గోవాలో చిల్లింగ్
Samantha Goa Trip With Friends Ahead Of New Year, Pics Goes Viral: స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం రూటు మార్చిన సమంత సినిమాల విషయంలో మరింత దూకుడు పెంచింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. దీంతో ఏమాత్రం సమయం దొరికినా వెకేషన్‌కు పయనమవుతుంది. తాజాగా యశోద షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్ గోవాకి చెక్కేసింది. తన బెస్ట్‌ఫ్రెండ్ శిల్పారెడ్డి సహా మరో ఫ్రెండ్‌తో కలిసి గోవా టూర్‌ని ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను #goayoubeauty అనే ట్యాగ్ లైన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఇటీవలె ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా అంటూ హాట్ పర్ఫార్మెన్స్తో హెడ్‌లైన్స్‌లో నిలిచిన సామ్ తాజాగా బికినీలో స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ప్రస్తుతం సమంత రాజ్-డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ప్రత్యేక హెలికాప్టర్లో సమంత తీర్థయాత్రలు..ఫోటోలు వైరల్
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుసగా విహార యాత్రలు చేస్తున్నారు. ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో డెహ్రాడూన్ వెళ్లిన సమంత.. తాజాగా హిమాలయాల సమీపంలో ఉన్న పవిత్ర దైవ క్షేత్రాలను దర్శించుకున్నారు. యమునోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. అందులో భాగంగా ఆమె ప్రత్యేక హెలికాప్టర్లో ఛార్ ధామ్ యాత్ర చేశారు. తాజాగా ఆమె ఆధ్యాత్మిక యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక హెలికాప్టర్ ముందు దిగిన ఫోటోని ఆమె సోషల్ మీడియా షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఇక సినిమా విషయాలకొస్తే.. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. మరోవైపు షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రంలోనూ సమంత హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సమంత
-
చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్
Samantha Char Dham Yatra: సమంత చార్ధామ్ యాత్ర ముగిసింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో ఆ బాధలోంచి బయటపడేందుకు ఇలా తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్ తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమంత పోస్టుకు కామెంట్ చేసిన వెంకటేశ్ కూతురు ఇక యమునోత్రి నుంచి మొదలైన చార్ధామ్ యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. అక్కడి ఎన్నో విశేషాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అక్కడ స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం గంగా ఆరతిలో పాలుపంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక చార్ ధామ్ యాత్ర అద్భుతంగా సాగిందని సామ్ పేర్కొంది. చదవండి: కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్ -
ముగిసిన సమంత చార్ ధామ్ యాత్ర..ఫోటోలు వైరల్
-
నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత
Samantha Char Dham Yatra: స్నేహితురాలితో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లిన సమంత ట్రిప్ ముగిసింది. యమునోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. 1968నాటి మహేశ్ యోగి ఆశ్రమానికి సైతం వెళ్లిన సమంత అక్కడి విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి సమంత తీర్థయాత్రలు..ఫోటోలు వైరల్ ఇక చార్ధామ్ యాత్ర గురించి సమంత ఓ పోస్టును షేర్ చేస్తూ.. 'మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గదామమైన హిమాలయాలను సందర్శించాలని అనుకున్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నేను ఏది అయితే ఆశించానో అది జరిగింది. నా హృదయంలో హిమాలయాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది' అని తెలిపింది. సామ్ పోస్టుకు వెంకటేశ్ కూతురు ఆశ్రిత సైతం స్పందించింది. బాలీవుడ్ నటి కంగనా కూడా వావ్ అంటూ కామెంట్ చేసింది. కాగా నాగ చైతన్యతో విడాకుల అనంతరం తీవ్ర మనోవేదనలో ఉన్న సమంత మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలను సందర్శిస్తున్నట్లు సమాచారం. గతాన్ని మర్చిపోయి త్వరలోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్‌పై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తుంది. సమా్ నటించిన శాకుంతలం, కాతువాకుల రెండు కాధల్ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. చదవండి: యూట్యూబ్ ఛానల్స్‌పై సమంత కేసు.. తీర్పు వాయిదా 'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత
Samantha Spiritual Trip With friend Shilpa Reddy: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సామ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తన బెస్ట్‌ఫ్రెండ్, డిజైనర్ శిల్పారెడ్డితో కలసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంది. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను శిల్పారెడ్డి తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేసుకుంది. చార్ధామ్ యాత్ర.. బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంటూ సామ్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది. నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సామ్ మానసికంగా కుంగిపోయినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. ఆ బాధలోంచి బయట పడేందుకు సమంత ఎక్కువగా తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తుంది. View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) -
గోవాలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. స్నేహితురాలితో చెట్టాపట్టాల్
-
కరోనాను జయించిన శిల్పారెడ్డి
-
కరోనా భయం వద్దు.. ఈ వీడియో చూడండి
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున అక్కినేని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. కరోనా సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే మానసికంగా, శారీరకంగా, దృఢంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన ఆయుధమని వివరించారు. మోడల్, న్యూట్రిషనిస్ట్, ఫ్యాషన్ డిజైనర్, తన స్నేహితురాలు శిల్పారెడ్డి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారని, అయితే వారు కరోనా విజయవంతంగా జయించారని వెల్లడించారు. ఈ క్రమంలో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత, చికిత్స సమయంలో తాము ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నామో వివరిస్తూ శిల్పారెడ్డి ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోను నాగార్జున తన ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా ఆమె చెప్పిన ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా వినండి అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. (సమంత స్నేహితురాలికి కరోనా) ఇక ఆ వీడియోలో తమకు కరోనా సోకడానికి గల కారణాలను శిల్పారెడ్డి వివరించారు. తనకు, తన భర్తకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదన్నారు. కాస్త అస్వస్థతకు లోనవ్వడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. తగిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం, డైట్ పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని వివరించారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలిపారు. అదే విధంగా ప్రతిరోజు తప్పక వ్యాయామం చేయాలని. ప్రాణాయామం చేయడం తప్పనిసరి అని తెలిపారు. నటుడు సామ్రాట్ సోదరి అయిన శిల్పారెడ్డి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంతకు మంచి స్నేహితురాలు. అంతేకాకుండా అక్కినేని కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ క్రమంలో శిల్పారెడ్డికి, ఆమె భర్తకు కరోనా అని తేలడంతో ఆమె అభిమానులతో పాటు అక్కినేని అభిమానులు కూడా కలవరానికి గురయ్యారు. (రాజాసింగ్ డ్రైవర్లు, గన్మెన్లకు పాజిటివ్) As the cases of #COVID__19 increase in the world,The only weapon right now seems to be being healthy in mind & body.Our dear friend #Shilpareddy and her husband experienced the virus and came out of it shining!!👍💐 Listen to her experience..inspiring!!🙏 https://t.co/mqRmuLQYlM — Nagarjuna Akkineni (@iamnagarjuna) June 25, 2020 View this post on Instagram Every day drill that we did to keep our bodies Prepared and enhance immunity .. -1000 mg - C vitamin -40- 50 mg – zinc(For good protection) -One probiotic capsule -Check your D vitamin levels and maintain what a needed - Get some sunlight -Hydrate yourself well -Drink only warm water or room temperature water with some mint leaves or Tulsi With a pinch of turmeric .Helps you wash down your throat frequently. -You can also have warm turmeric shots With two pinches of pepper -Avoid cold beverages and anything with ice Keep your nose and throat clean. -Take steam twice a day Morning after you wake up and before sleeping .Breathe through your nose 20- 25 times, Breathe through your mouth 20-25 times .. -Indulge in some physical activity(Available on YouTube for beginners ) -Spend 10 minutes for breathing exercises (pranayama)Plenty simple ones available on YouTube -Meditate with a guided meditation tape(Best is to start with ISHA KRIYA ( Available on YouTube in different languages) Or CHIT SHAKTHI meditations on YouTube - it is tried and tested by me .. but the choice is yours) - practice SIMHA KRIYA- (you tube) very Simple three-minute process Twice a day which will enhance your lung capacity . -Sanitise your hands regularly and wash them regularly With soap , wear mask , social distancing ( these v all know ) -Eat clean light home-made food Which is easy on the system -Avoid sugary food Completely or as much as you can -Sleep early wake up early -Make sure your body clock is in sync with the sun -It is a good idea to take a flu shot since the weather has changed. I checked with my doctor and he gave us a go ahead to take flu shots to avoid panic even when you get a common cold or cough - (INFLUVAC) Inactivated influenza vaccine by - Abbot India lent -There are different doses for adults and children Its a good idea to get the influenza shot if you have elders at home but again you must consider checking with your family doctor ..Since every case is different.. -There is a natural concoctions that helps prepare u r body * -5 bulbs garlic -7 or 8 cloves -15 Tulsi leaves (OR 20 Basil leaves) -1 Teaspoon Ajwain -5 mint leaves -10 black pepper .boil A post shared by SHILPA REDDY (@shilpareddy.official) on Jun 22, 2020 at 3:21am PDT -
నటుడు సామ్రాట్ సోదరికి కరోనా
సాక్షి, హైదరాబాద్: శిల్పా రెడ్డి.. సామాన్యులకు పెద్దగా పరిచయం లేకున్నా.. ఫ్యాషన్ ప్రియులు, సినీ అభిమానులు ఆమె పేరు వింటే టక్కున గుర్తుపడతారు. నటి కీర్తిరెడ్డి (అర్జున్ చిత్రంలో మహేష్ బాబు సోదరి), నటుడు సామ్రాట్ల సోదరి శిల్పా రెడ్డి. అయితే మోడల్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు వారాల క్రితం ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఐదు రోజులకు తనకు, తన భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆమె వెల్లడించారు. అయితే తమలో కరోనా లక్షణాలేవి కనిపించలేదని పేర్కొన్నారు. పాజిటివ్‌గా తేలడంతో భర్త, ఆమె ఇంట్లోనే క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుక్నుట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం శిల్పారెడ్డి ఓ వీడియో షేర్ చేశారు. ఎవరికైనా.. ఎప్పుడైనా కరోనా సోకవచ్చని.. దాని గురించి టెన్షన్ పడకుండా.. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలని తెలిపారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఆమె పలు సూచనలు చేశారు. ఆ వివరాలు.. ప్రతి ఒక్కరు రోజు ఆహారం ద్వారా కానీ.. టాబెట్ల రూపంలో కాని 1000 మిల్లిగ్రాముల సీ విటమిన్.. 100 మిల్లిగ్రాముల జింక్ (రాత్రి) ఒక ప్రోబయోటిక్ క్యాప్సూల్ తీసుకోవాలని తెలిపారు. శరీరానికి అవసరమైన డీ విటమిన్ సరిగ్గా అందుతుంది లేనిది చెక్ చేసుకోవాలన్నారు. ఉదయం శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని, శరీరాన్ని తేమగా ఉంచడం కోసం తగినన్ని నీళ్లు తాగాలని తెలిపారు. అలానే గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రత ఉన్న నీటిలో కొన్ని పుదీనా ఆకులు లేదా తులసితో పాటు ఒక చిటికెడు పసుపు కలుపుకుని గొంతును తరచుగా పుక్కిలించాలన్నారు. దాంతో పాటు రెండు మిరియాలు నూరి.. చిటికెడు పసుపు కలిపి చేసిన ఉండలను ప్రతి రోజు రెండు తీసుకోవాలన్నారు. చల్లని పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. తరచుగా ముక్కు, గొంతును శుభ్రపర్చుకోవాలన్నారు.(అక్కడ కరోనా 20 ఏళ్లపాటు జీవించి ఉండగలదు!) ప్రతి రోజు మేల్కొన్న తర్వాత, నిద్రపోయే ముందు రెండుసార్లు ఆవిరి తీసుకోవాలని శిల్పారెడ్డి తెలిపారు. ముక్కు ద్వారా 20- 25 సార్లు, నోటి ద్వారా 20-25 సార్లు శ్వాస తీసుకోవాలన్నారు. ప్రతిరోజు తప్పక వ్యాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం తప్పనిసరి అన్నారు. ఉదయాన్నే చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే మేలన్నారు. చేతులను సబ్బుతో క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలన్నారు. ఇంటిలో తయారయిన తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిదన్నారు. ఆహారంలో చక్కెరను పూర్తిగా లేదా మీకు వీలైనంత వరకు మానుకుంటే మంచిదన్నారు. సూర్యుడితో పాటు మన దిన చర్య సాగాలని తెలిపారు. ప్రస్తుతం వాతావరణం మారినందున ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది అన్నారు. దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఆందోళన పడకుండా డాక్టర్ని సంప్రదించి ఫ్లూ షాట్లు తీసుకోవచ్చన్నారు. పెద్దలు, పిల్లలకు వేర్వేరు మోతాదులో డాక్టర్ సిఫారసు మేరకు వాడవచ్చని తెలిపారు.(రూ.350కే కరోనా పరీక్షలు!) అలానే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటం కోసం 5 వెల్లుల్లి రెబ్బలు 7 లేదా 8 లవంగాలు 15 తులసి ఆకులు 1 టీస్పూన్ అజ్వైన్ 5 పుదీనా ఆకులు 10 నల్ల మిరియాలు తీసుకుని చూర్ణం చేసి 6 కప్పుల నీటికి కలపి.. 3 కప్పుల నీరు మిగిలేవరకు మరగబెట్టాలి. ప్రతిరోజూ ఈ నీటిని కొద్దిగా తీసుకోవాలని తెలిపారు. View this post on Instagram Please share the info if you find this useful. Every day drill that you must start doing to keep your body Prepared and to an extent boost immunity .. -1000 mg - C vitamin - -100 mg - zinc -(at night ) -One probiotic capsule -Check your D vitamin levels and maintain the Need a number - Get some sunlight on your body . -Hydrate yourself well -Drink only warm water or room temperature water with some mint leaves or Tulsi With a pinch of turmeric .Helps you wash down your throat frequently. -You can also have warm turmeric shots With two pinches of pepper -Avoid cold beverages and anything with ice Keep your nose and throat clean. -Take steam twice a day Morning after you wake up and before sleeping .Breathe through your nose 20- 25 times, Breathe through your mouth 20-25 times .. -Indulge in some physical activity(Available on YouTube for beginners ) -Spend 10 minutes for breathing exercises (pranayama)Plenty simple ones available on YouTube -Meditate with a guided meditation tape(Best is to start with ISHA KRIYA ( Available on YouTube in different languages) Or CHIT SHAKTHI meditations on YouTube - it is tried and tested by me .. but the choice is yours) -Sanitise your hands regularly and wash them regularly With soap -Eat clean light home-made food Which is easy on the system -Avoid sugary food Completely or as much as you can -Sleep early wake up early -Make sure your body clock is in sync with the sun -It is a good idea to take a flu shot since the weather has changed. I checked with my doctor and he gave us a go ahead to take flu shots to avoid panic even when you get a common cold or cough - (INFLUVAC) Inactivated influenza vaccine by - Abbot India lent -There are different doses for adults and children I strongly recommend to get the influenza shot if you have elders at home but again you must consider checking with your family doctor. -There is a natural concoctions that you can have. *Preventing Coronavirus* -5 bulbs garlic -7 or 8 cloves -15 Tulsi leaves (OR 20 Basil leaves) -1 Teaspoon Ajwain -5 mint leaves -10 black pepper Crush all above and add 6 cups of water. Boil down to 3 cups. After Every day drill that you must start doing to keep you A post shared by SHILPA REDDY (@shilpareddy.official) on Jun 21, 2020 at 8:27pm PDT -
ఫిట్నెస్ ఛాలెంజ్: వాహ్.. నాగ్
ప్రస్తుతం దేశం మొత్తం ఫిట్నెస్ ఛాలెంజ్ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు... అంతా ఒకరికొకరు సవాళ్లు విసిరుకుంటూ వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లోని ప్రముఖులు కూడా క్యూ కట్టేశారు. స్టార్ హీరో ఎన్టీఆర్.. చెర్రీ, మహేష్, కొరటాల శివ, రాజమౌళి, కళ్యాణ్ రామ్ తదితరులకు ఛాలెంజ్ విసరటం చూశాం. ఇప్పుడు సీనియర్ హీరో నాగ్ వంతు వచ్చింది. తనయుడు అఖిల్ విసిరిన ఛాలెంజ్‌కు నాగార్జున అక్కినేని స్పందించారు. ఈ ఉదయం జిమ్‌లో చేసిన ఎక్సర్సైజ్లకు వీడియో ఒకదానిని పోస్ట్ చేశాడు. వెయిట్ లిఫ్టింగ్‌కు సంబంధించిన వర్కవుట్ల కోసం బాగానే కష్టపడ్డాడు. ఇవన్నీ చూస్తుంటే 58 ఏళ్ల వయసులోనూ నాగ్ ఫిట్‌గా ఉండటంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అన్నట్లు ఇంతకీ నాగ్ ఎవరికి ఛాలెంజ్ విసిరాడో తెలుసా? నేచురల్ స్టార్ నాని, హీరో కార్తీ, శిల్పారెడ్డిలకు. ఆ వీడియో చూసిన అభిమానులంతా ‘వాహ్ నాగ్’ అంటున్నారు. మరోవైపు వర్మ దర్శకత్వంలో నాగ్ నటించిన నటించిన ఆఫీసర్ చిత్రం నేడు విడుదల కాగా, నానితో చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇవికాకుండా కోలీవుడ్ హీరో ధనుష్ డైరెక్షన్లో ఓ చిత్రం ఉండబోతున్నట్లు నాగ్ ప్రకటించాడు కూడా. Here we go @AkhilAkkineni8 my reply for #HumFitToIndiaFit challenge..I challenge @NameisNani @Karthi_Offl @shilpareddy217 to post there fitness videos. 👉My exercise regime today lower body heavy for strength and upper body light for recovery👍 pic.twitter.com/nsgmym0M4n — Nagarjuna Akkineni (@iamnagarjuna) 1 June 2018 -
ఫిట్నెస్ ఛాలెంజ్‌లో హీరో నాగ్
-
ఫిక్కీ ఫ్లో
-
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
బెంగళూరు: సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్తను, తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోలార్ జిల్లా శ్రీనివాసపురాలో శనివారం రాత్రి ఈ హత్య జరిగింది. తన కజిన్ వాసుదేవతో ప్రేమాయణం సాగిస్తున్న శిల్పారెడ్డి, అతనితో పారిపోయి విదేశాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంది. దీంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనుకుని పథకం వేసింది. భర్త కేశవరెడ్డికి పళ్లరసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి,అనంతరం పదునైన ఆయుధంతో దాడిచేసి చంపేసింది. తర్వాత ప్రియుడు వాసుదేవ సహాయంతో మృతదేహాన్ని సమీపంలోని నదిలో పడేసింది. తర్వాత ఏమీ తెలియనట్టుగా భర్త సోదరుడు తిరుమలకి ఫోన్ చేసి కేశవరెడ్డి క్షేమ సమాచారాల గురించి ఆరా తీసింది. సాధారణంగా ఎప్పడూ తనకు ఫోన్ చేయని వదిన ఫోన్ చేయడంతో మరిదికి అనుమానం తలెత్తింది. దీనికితోడు ఆమె అసాధారణ ప్రవర్తనతో అనుమానం మరింత బలపడింది. ఈ విషయాన్ని పోలీసుల చెవిన వేద్దామనకున్నాడు. ఈలోపు ఆదివారం నదిలో శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడి ఐడీ కార్డు, ఇతర వస్తువుల ఆధారంగా మృతుడిని కేశవరెడ్డిగా తేల్చారు. అటు అనుమానాస్పద మరణం, ఇటు మృతుని సోదరుడు ఇచ్చిన సమాచారం.. ఈ నేపథ్యంలో కేశవరెడ్డిది హత్యగా అనుమానించిన పోలీసులు శిల్పారెడ్డి సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన తర్వాత ఆమెను తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం తెలిసింది. తమ విచారణలో శిల్ప తాను చేసిన నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, గురువారం శిల్పను అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ హత్యా నేరంలో శిల్ప తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నట్టు వారు గుర్తించారు. -
వివక్షను నిలదీయండి
స్టార్ హిమక్రీమ్: రకరకాల హిమక్రీమ్స్తో సిటీవాసుల మనసుదోచుకున్న మాగ్నమ్ కంపెనీ మాస్టర్ క్లాస్ 2.0 పేరుతో మరోఫ్లేవర్ను తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ హిమక్రీమ్ను జూబ్లీహిల్స్‌లోని ఎన్-డిస్ట్రిక్ట్‌లో సోమవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మోడల్ శిల్పారెడ్డి, ఆమె సోదరుడు సామ్రాట్‌రెడ్డి, విదేశీ చెఫ్‌లు జేనీస్ వాంగ్, ఫ్రిట్జ్ స్టార్మ్ పాల్గొన్నారు. పురాణాల కాలం నుంచి నవీన యుగం వరకూ ఆడవాళ్లు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి ఆడపిల్లకు దినదిన గండంగానే గడుస్తోంది. ఆడపిల్లగా పుట్టినందుకు కన్నవారి చిన్నచూపును భరిస్తున్నారు. చదువుకునే రోజుల్లో.. ఉద్యోగపర్వంలో.. ఎందరో మహిళలు కీచకపర్వాలు చూస్తూనే ఉన్నారు. మన దేశంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై హబ్సిగూడలోని ఐఐసీటీ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, నటి, నర్తకి మల్లికా సారాభాయ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాట ల్లోనే.. ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి ఎవరో ఒకరి అదుపాజ్ఞల్లో బతకాల్సి వస్తోంది. చరిత్ర పుటలు తిరగేస్తే.. ఆడపిల్లకు పుట్టిన నాటి నుంచి ఆంక్షలే. ఉన్నన్ని రోజులు పుట్టింట్లో కుక్కిన పేనులా పడుండాలి. పెద్దయ్యాక పెళ్లి అని ఒక్క రోజులో ఆమె జీవితాన్ని మార్చేసేవారు. కాలం మారినా.. పరిస్థితులు మాత్రం ఇంకా అలాగే ఉంటున్నాయి. కూతురును పెంచే తల్లిదండ్రులు.. ఎప్పటికైనా ఆడపిల్ల.. ‘ఆడ’పిల్లే అంటూ పరాయి చేస్తున్నారు. తీరా పెళ్లయ్యాక అత్తారింట్లో పరాయి ఇంటి నుంచి వచ్చిన మనిషిలాగే చూస్తున్నారు తప్ప.. సొంత మనిషన్న గుర్తింపు ఇవ్వడం లేదు. మరి ‘ఆమె’కు సొంత ఇళ్లంటూ లేనట్టేనా? తక్షణ మార్పు అవసరం పేరుకే కర్మభూమి.. ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు వింటుంటే వనితాలోకం ఇదేం ఖర్మ అని రోదిస్తోంది. అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న వారిని సమాజం ఏం చేయగలుగుతోంది..? 20 ఏళ్ల కిందట రాజస్థాన్‌లో ఓ సంఘటన.. ఓ ఏడేళ్ల బాలికపై ఆమె తాతయ్యే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం బయటపడ్డాక.. చీము నెత్తురు లేని ఆ మనిషి ‘మా ఇంట్లో పండును మేం తినకుండా వేరేవారికి ఇవ్వాలా’ అని అన్నాడు. ఇలాంటి దారుణాలు ఎన్నో మన దేశంలో ఎప్పట్నుంచో జరుగుతున్నాయి. కఠినమైన చట్టాలు రూపొందించడం కాదు.. వాటిని పక్కాగా అమలు చేసినపుడే ఇలాంటి అకృత్యాలు తగ్గుతాయి. ఆడపిల్లల విషయంలో సామాజిక దృక్పథం తక్షణం మారాల్సిన పరిస్థితులున్నాయి. ఆడపిల్లలపై వివక్ష చూపకుండా పెంచండి. ఎవరైనా అలా వివక్ష చూపిస్తే పిల్లలూ! మీరు తప్పక నిలదీయండి. ఈ తరం తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తున్నారు. చాలా మంచి విషయం. అయితే మీ పిల్లలను స్కూల్, ట్యూషన్, ర్యాంకులకు మాత్రమే పరిమితం చేయకుండా వారికి ఇతిహాసాలు, తత్త్వశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదివేలా ప్రోత్సహించండి. అవి వారిలో మానసిక బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. - నిఖితా నెల్లుట్ల -
చేనేతకు శిల్పకళ
టాప్ మోడల్‌గా పేరు తెచ్చుకున్నాక అదే గొప్ప అనుకొని అక్కడితో విశ్రాంతి తీసుకుంటారు చాలామంది. కానీ, ఆమె అలా కాదు. పెళ్లయిన తర్వాతా ‘మిసెస్ ఇండియా’ కిరీటం దక్కించుకున్నారు. ప్రసిద్ధ మోడల్స్ ఎందరో కింగ్‌ఫిషర్ క్యాలెండర్లో స్థానం పొందడం కలగా భావిస్తారు. ఆ కలను ఆమె నిజం చేసుకున్నారు. పట్టుబట్టి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అయ్యారు. నృత్యకారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఫ్యాషన్ డిజైనర్‌గా ఈఫిల్ టవర్‌పై తెలుగు చేనేత వైభవాన్ని చాటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రత్యేకతను సాధిస్తూ తనను తాను మలచుకోవడం శిల్పారెడ్డి ఘనత. సౌందర్య ‘శిల్ప’ సూత్రాలు.. ► మన శరీరానికి ఏది నప్పుతుందో తెలుసుకోవాలంటే మన శరీరం మనకే తెలిపే భాషను అర్థం చేసుకోవాలి. దానిని బట్టి సౌకర్యంగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. ► ఎక్కువ డబ్బు ఖర్చుపెడితేనే ఫ్యాషనబుల్‌గా ఉండగలం అని చాలా మంది అనుకుంటారు. ఇది చాలా పెద్ద అపోహ. శరీరాకృతి, వ్యక్తిత్వాన్ని బట్టి తయారవడం ఈ రోజుల్లో తప్పనిసరి. ► అన్నీ బ్రాండెడ్ దుస్తులే వేసుకోవాలనుకోకూడదు. అలా వేసుకోవడమూ సరైనది కాదు. ఇండియన్-వెస్ట్రన్ స్టైల్స్‌ని మిళితం చేస్తూ చాలా రకాలుగా ధరించవచ్చు. అప్పుడే స్టైల్‌గా కనబడతారు. ► నడుము కింది భాగం పెద్దగా ఉంటే పై టాప్ మోకాళ్ల కిందవరకు ధరించడం, ఛాతీ పరిమాణం పెద్దగా ఉంటే హై నెక్స్ జోలికి వెళ్లకపోవడం.. వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ► మనవారి చర్మ రంగుకు ఎరుపు, నారింజ, పచ్చ.. ముదురు రంగులూ బాగా నప్పుతాయి. వీటిలో అన్ని షేడ్స్నూ ఎంచుకోవచ్చు. ► అలంకరణలో రంగురంగుల పూసల ఆభరణాలు ఇటీవల కాలంలో ముందువరసలో ఉన్నాయి. పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. హైదరాబాద్‌లోని పేజ్ 3 పీపుల్ జాబితాలో ముందువరసలో ఉండే శిల్పారెడ్డి సోషలైట్గానూ గుర్తింపు పొందారు. గృహిణిగా, తల్లిగా, సాధికారత గల మహిళగా శిల్పారెడ్డి చెప్పే మాట - ‘‘మహిళ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. నేను డిజైన్ చేసిన దుస్తుల్లో ఆమె మరింత ఉన్నతంగా కనిపించాలి’ అని. అందుకే మహిళను ఆత్మవిశ్వాసంతో చూపే బ్లేజర్స్ అంటే చాలా ఇష్టమని చెప్పే ఈ మోడల్ ఇటీవల తెలుగుదనపు చేనేతను ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ైపై మెరిపించారు. అక్కడ జరిగిన ఫ్యాషన్ షోలో తను డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించారు. దాని వెనక దాగున్న తన కృషిని తెలియజేశారు. ప్యారిస్ అనుభవాలు... ‘‘వివిధ దేశాలకు చెందిన పది మంది ప్రసిద్ధ డిజైనర్లు ప్యారిస్ ఫ్యాషన్ షోలో తమ వస్త్ర వైవిధ్యాలను ప్రదర్శించారు. అందులో మన దేశం తరపున నేను ఒక్కదాన్నే పాల్గొన్నాను. మన దేశ సంస్కృతి, వారసత్వ వైభవం అక్కడ ప్రదర్శించే అవకాశం నాకు రావడం చాలా గర్వంగా అనిపించింది. మన చేనేతకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న మట్కా ఫ్యాబ్రిక్ ప్యారిస్‌లో హొయలు పోవడం, అందరి నుండి ప్రశంసలు అందుకోవడం ఓ గొప్ప అనుభూతి. ఇండియా అనగానే గొప్పదైన మన చేనేత ప్రపంచ దేశాల ప్రజల మదిలో తప్పక మెదులుతుంది. ఈఫిల్ ఫ్యాషన్ షో అవకాశం రాగానే ముందుగా ఎలాంటి తరహా డిజైన్లు బాగుంటాయని చాలా శోధించాను. ఈఫిల్ టవర్ ఐరన్‌తో నిర్మించిన అతిపెద్ద కట్టడం. దానికి తగ్గట్టుగా ఒక వారసత్వ అంశాన్ని జోడించాలి. అలాగే ప్రస్తుతకాలానికి ఏది బాగా నప్పుతుందో చూడాలి. ఆ విధంగా తెలంగాణ చేనేతకారుల్లో రూపుదిద్దుకునే మట్కా ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నాను. దానికి కొంత రస్టిక్ గోల్డ్ ఎలిమెంట్స్ జోడించాను. ప్యారిస్‌లో పూర్తి చలికాలం కావడంతో దుస్తులకు ఫుల్ స్లీవ్స్ జత చేశాను’’ అంటూ తను డిజైన్ చేసిన దుస్తుల గురించి, ప్రశంసల గురించి ఆనందంగా వివరించారు శిల్పారెడ్డి. చేనేత.. ఇప్పుడంతా యువతదే! ‘‘ఫ్యాషన్ అనగానే చాలా మంది గ్లామర్ మాత్రమే అని అపోహపడుతుంటారు. అలా కానే కాదు. మన నేల గొప్పతనాన్ని చాటే వేదిక ఫ్యాషన్. మనదైన కళను ముందు తరాలకు అందజేసేది ఫ్యాషన్. చేనేత దుస్తులు వయసు పైబడినవారు మాత్రమే ధరించేది అని నిన్న మొన్నటి వరకు భావించేవారందరూ. కానీ, నేడు యువతరం ఫ్యాషన్ అంతా చేనేత చుట్టూనే ఉంది. మనదైన ఫ్యాబ్రిక్‌తో యువతరం మెచ్చే ఎన్నో డిజైన్లు సృష్టించవచ్చు. అదే నేను చేసింది. ప్యారిస్‌లో జరిగిన ఫ్యాషన్ షో కోసం మొత్తం 16 డ్రెస్సులు సృష్టించాను. వాటిని అక్కడి వరకు తీసుకెళ్లి, అక్కడి మోడల్స్ చేత ధరింపజేసి, వేదిక మీద ప్రదర్శించాను. వాటిని తయారు చేయడానికి 2 నెలలకు పైగా సమయం పట్టింది. ఇంటి బాధ్యతలు చూస్తూనే అంకితభావంతో డిజైన్స్ సృష్టించాను’’ అంటూ ఇష్టంగా చేసిన శ్రమను, చేనేత చుట్టూ అల్లుకుపోయిన జీవితాల గురించి ప్రస్తావించారు ఈ ఫ్యాషన్ డిజైనర్! డిజైన్లలో మనదైన ముద్ర ‘‘ఫ్యాషన్ పరిశ్రమలో సృజనాత్మకతకే పెద్ద పీట. అలాగే డిజైనర్‌కి మంచి నెట్వర్క్ ఉండాలి. దానికి తోడు తాము సృష్టించే డిజైన్లకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఎలిమెంట్‌ను, మనదైన వారసత్వ అంశాన్ని జోడించాలి. అప్పుడే డిజైనర్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందగలరు’’ అంటూ ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టేవారికి సూచనలు ఇచ్చారు శిల్పారెడ్డి. ‘‘నేడు ఎంతోమంది డిజైనర్స్ ఉన్నారు. ఇంకా ఎంతో మంది కొత్త డిజైనర్లు పుట్టుకువస్తున్నారు. వీరంతా ఇప్పుడు మన కాటన్స్ని యువతరం ఫ్యాబ్రిక్‌గా కీర్తిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. పాశ్చాత్య దుస్తులకే మనదైన కాటన్ని జత చేస్తే ఖరీదులోనూ అందరికీ అందుబాటులోకి తీసుకురాగలరు. ఇందుకు కొంత సృజనాత్మకత చూపాలి’’ అంటారు ఆమె. మట్కా డిజైన్స్‌తో విదేశాలలోనూ అదరగొట్టిన శిల్పారెడ్డి తదుపరి తన డ్రెస్ డిజైన్లను ఖాదీ, సిల్క్‌తో రూపుకట్టడానికి సిద్ధమవుతున్నారు. చేనేత పట్ల తనకున్న అభిమానం గురించి తెలియజేస్తూ - ‘‘గతంలోనూ ఎక్కువగా చందేరి, అన్బ్లీచ్డ్ కాటన్‌తో దుస్తులను డిజైన్ చేశాను. చేనేత దుస్తులకు ఎక్కడికెళ్లినా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీని గురించి ఒక కథ చెప్పినట్టుగా ఎక్కడైనా పరిచయం చేయవచ్చు. చేనేతకారులకు చేయూతనివ్వడానికి ఇదో మంచి అవకాశం...’ అని తెలియజేశారు. నూటికి నూరు శాతం అంకితభావం.. ఒకటి సాధించామని అంతటితో ఆగిపోతే ప్రయాణంలో మజా ఉండదు అంటారు శిల్పారెడ్డి. మోడల్‌గానూ, ఫిట్నెస్ ఎక్స్పర్ట్గానూ పేరున్న ఆమె నాలుగేళ్ల క్రితం నగరంలో ‘శిల్పారెడ్డి డిజైనర్ స్టూడియో’ ప్రారంభించారు. ఇంతేకాదు పోషకాహార నిపుణురాలిగానూ వ్యవహరిస్తున్నారు. వ్యాయామాలు, ఇంటిపనులు, డిజైనింగ్ పనులు .. మల్టీ టాస్కింగ్‌గా ఇన్ని పనులను చేయడంలో కృషిని తెలియజేస్తూ.. ‘‘నాకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని పెంచుకుంటూ వెళ్లడం ఇష్టం. పెందరాళే నిద్రలేస్తాను. రాత్రి పదిలోపు నాకున్న బాధ్యతలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. మా బాబుకు నాలుగేళ్లు. వాడితోనూ తగినంత సమయం గడిపేలా ప్లాన్ చేసుకుంటాను. ఏడాదిలో రెండు ట్రిప్‌లు మా వారితోనూ, మరో రెండు ట్రిప్‌లు ఫ్యామిలీ మొత్తం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. తల్లిగా, ఇల్లాలిగా.. ఎక్కడా లోపం రానివ్వను. ఏ పని చేసినా నూటికి నూరు శాతం అంకితభావంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అంటూ నవ్వుతూ వివరించారు ఈ ఎనర్జిటిక్ ఉమన్. - నిర్మలారెడ్డి -
ఈఫిల్‌పై సిటీ బ్యూటీ
ప్రపంచపు వింతపై సిటీ డిజైన్లు ప్రకాశించాయి. ఫ్యాషన్ హెవెన్‌లో హైదరాబాద్ హ్యాట్సాఫ్ అనిపించుకుంది. గత నెల 31 అర్ధరాత్రి ఈఫిల్ టవర్ ఫస్ట్ డెక్‌పై నిర్వహించిన జె-ఆటమ్ ఫ్యాషన్ షోలో నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అద్భుతమైన కలెక్షన్లను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అటు డిజైనర్‌గా, ఇటు మోడల్‌గానూ టవర్‌పై పవర్ చాటిన శిల్ప... ఈ ఘనత సాధించిన తొలి సౌతిండియన్ డిజైనర్‌గా నిలిచారు. స్థానిక మల్కా బ్రాండ్ ఫ్యాబ్రిక్‌ను వినియోగించి ఆమె ఆవిష్కరించిన ఆటమ్/వింటర్ కలెక్షన్ 2014... ఆహూతులను ఆకట్టుకుంది. ‘ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్’ అని శిల్ప ‘సిటీ ప్లస్’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. - ఎస్.సత్యబాబు -
దుబాయ్‌లో శిల్పారెడ్డి ‘షో’
నగరానికి చెందిన టాప్ మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి.. దుబాయ్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో తనదైన డిజైన్లతో ఆకట్టుకున్నారు. దుబాయ్‌లోని జమైరాహ్ ఎమిరేట్స్ టవర్స్ వేదికగా మినిస్ట్రీ ఆఫ్ ఈవెంట్స్, డ్రీమ్ అడ్వర్టయిజింగ్, జడ్ హౌజ్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఇండియా ఫ్యాషన్ వీక్‌లో కళ్లు చెదిరే కలెక్షన్నుపదర్శించి అభినందనలు అందుకున్నారు. షాహిద్ కపూర్, బిపాసాబసు, సోహాఅలీఖాన్, విక్రమ్ ఫడ్నిస్, జయామిశ్రా, అర్చనా కొచ్చర్ తదితర ముంబై సినీ, ఫ్యాషన్ రంగ ప్రముఖులు తళుక్కుమన్న ఈ షోలో నగరం నుంచి కేవలం శిల్పారెడ్డి మాత్రమే పాల్గొన్నారు. కాటన్, చందేరీ, సిల్క్ ఫ్యాబ్రిక్స్‌ను తీసుకుని ‘గోల్డ్ ఫ్రాగ్నెన్స్ ఆఫ్ ది రాఫిమైన్’ పేరుతో ఆమె అందించిన కలెక్షన్.. అతిథులకు భారతీయ ఫ్యాషన్‌లో వైవిధ్యాన్ని రుచి చూపింది. గోల్డ్-రెడ్ సౌతిండియన్ ధోవతి, టెంపుల్ జువెలరీ ధరించి ర్యాంప్ వాక్ చేసిన శిల్పారెడ్డి వావ్ అనిపించారు. ‘దుబాయ్ షోలో భారతీయ ఫ్యాషన్స్‌ను ప్రదర్శించడం ఓ చక్కని అనుభవం. నా కలెక్షన్‌కు అక్కడి ఫ్యాషన్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింద’ని శిల్పారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. -ఎస్బీ -
షగ్ర్... వెచ్చని హగ్
‘ఏమో నాకేం తెల్సు?’ అని భుజాలు ఎగరేయడం... ‘షగ్ర్ ర. ‘చలి బాగా ఎక్కువైంది కదండీ’ అన్నప్పుడుఎవరైనా ‘షగ్ర్ చేశారనుకోండి... ఏమిటర్థం? ఏముందీ... వాళ్లు షగ్ర్ వేసుకుని ఉన్నారని! షగ్ర్ వేసుకున్నమ్మకు చలి తెలిస్తే కదా. స్టెయిల్‌గా ఎన్నిసార్లయినా భుజాలు ఎగరేస్తుంది! షగ్క్రీ, స్వెటర్కీ తేడా అదే! స్వెటర్ స్వెటర్లా ఉంటుంది. షగ్ర్ స్టెయిలిష్ స్వెటర్లా ఉంటుంది. ఈ వింటర్‌కి మీ ఒంటిపైకి ఓ షగ్‌న్రు తెచ్చుకోండి. అప్పుడు చలి మిమ్మల్ని కాదు... మీరే చలిని హగ్ చేసుకోవచ్చు. చలి అదరగొడుతోంది. తట్టు కునేందుకు స్వెటర్ ధరించడం మామూలే! అయితే స్వెటర్ వల్ల ఏ డ్రెస్ వేసుకున్నా ఓ స్టైల్ అంటూ ఉండదు. మరెలా? షగ్ర్ ఉంది కదా!! స్టైల్‌గా కనిపించేలా చేస్తూనే వెచ్చదనాన్ని కలిగించే ఉలెన్ షగ్ర్ ఎన్నో రంగుల్లో, డిజైన్లలో మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇవి భుజాలను మాత్రమే కవర్ చేస్తూ, ఛాతి భాగంలో ఓపెన్‌గా ఉంచుతాయి. వీటిల్లో కొన్ని... బటన్సతో ఉంటాయి. అయితే ఇవి ఎవరికి నప్పుతాయి? వీటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు కూడా తెలుసుకుంటే స్టైల్‌ని మరింత అదరగొట్టచ్చు. చలిని హాయిగా హగ్ చేసుకోవచ్చు. ర్యాంప్ స్టైల్: షగ్ర్ పూర్తిగా పాశ్చాత్య తరహాకు చెందినది. తొలినాళ్లలో నవవధువు ధరించే గౌన్ పై అందంగా చేతులకు, ఛాతీ భాగంలో డిజైన్‌గా ఒదిగిఉండేది. తర్వాత క్రమంగా ర్యాంప్‌ల మీద రకరకాల డ్రెస్‌లపై హొయలుగా స్థిరపడింది. అలా అన్ని దేశాలకూ స్టైల్‌గా వ్యాపించింది. చిన్నపాటి బ్లేజర్లా అనిపించే షగ్ర్ అన్నిరకాల మెటీరియల్లోనూ లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఇవి టీనేజర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఏ కాలమైనా! పొడవుగానూ, పొట్టిగానూ ఉండే షగ్ర్ ఏ కాలమైనా ఏ ఫ్యాబ్రిక్లలోనైనా లభిస్తాయి. ఔట్‌లుక్‌ను స్టైల్‌గా మార్చుతుండటంతో యంగ్‌స్టర్స్‌కి షగ్ర్ అభిమానురాలైంది. పొడవుగా ఉండే టీనేజర్స్‌కి బాగా నప్పుతాయి. వేసుకున్న డ్రెస్ ఫిట్‌గా ఉండాలి. ఆ పైన వదులుగా ఉండే ఉలెన్ షగ్ర్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. అందుకు శరీరాకృతి కూడా ఫిట్‌గా ఉండాలి. యాక్సెసరీస్: మ్యాచింగ్ బ్యాంగిల్స్, చైన్, బ్యాగ్.. ఇలా ఇతర అలంకరణ వస్తువుల్లాగే షగ్‌న్రు ఒక యాక్సెసరీగా వాడుతున్నారు. చలికాలానికి తట్టుకునే విధంగా అయితే లెదర్, ఉలెన్ మెటీరియల్ షగ్ర్ ఎంచుకుంటే రెండు విధాలా మేలు. పాశ్చాత్యం: ఇండియన్ వేర్ కాదు కాబట్టి కట్స్ మనలా చూసుకోవాలి. ర్యాంప్ షోలను గమనిస్తే శారీస్ పైన షగ్ర్ వాడడం చూస్తుంటాం. తమ డిజైన్స్‌కి ఒక స్టేటస్ సింబల్‌గా చూపించడానికి షగ్ర్ వాడతారు. అలాగని ట్రెడిషనల్ డ్రెస్‌ల పైన షగ్ర్ నప్పదు. పూర్తి వెస్ట్రన్వేర్కు మాత్రమే షగ్ర్ మ్యాచ్ అవుతుంది. స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండే యంగ్‌స్టర్స్ షగ్స్న్రు హ్యాపీగా ధరించవచ్చు. రంగులు: ముదురురంగులు, డస్టీ, శాండ్, కామిల్, మడ్... కలర్స్ చలికాలానికి బాగా నప్పుతాయి. శుభ్రత: షగ్ర్ లిక్విడ్ డిటర్జెంట్ సోప్ కలిపిన నీటిలో నానబెట్టి, చేతులతో మాత్రమే శుభ్రపరచాలి. శుభ్రం చేయడానికి బ్లీచ్, బ్రష్, వాషింగ్ మెషీన్ వంటివి ఉపయోగించకూడదు. నీరు పోవడానికి గట్టిగా పిండకూడదు. ఉలెన్ దారాలు వదులయ్యే అవకాశం ఉంది. అలాగే ఎండలో ఆరవేయకూడదు. ఐరన్ చేయకూడదు. ఫ్యాబ్రిక్, డిజైన్, నాణ్యత, బ్రాండ్స బట్టి షగ్ర్స వందల రూపాయల నుంచి వేల రూపాయల్లో ధర పలుకుతోంది. టు ఇన్ వన్ లా ఉపయోగపడే షగ్ర్ మీ వార్డరోబ్లో ఉందా! శిల్పారెడ్డి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ నిర్వహణ: నిర్మలారెడ్డి