sick
-
ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్లై, తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు అధికారులు తరలించారు. అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కవిత గైనిక్ సమస్యలు, వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆమె తిహార్ జైలులో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరిగ్ నేరారోపణలతో సీబీఐ, ఈడీ కేసుల్లో మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు.ఇక గతంలోనూ ఒకసారి కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. -
ఫ్రీగా వచ్చిందని డిటర్జంట్ తినడంతో..
తైవాన్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాలు పోయే పరిస్థితిని కల్పిస్తుందని ఈ ఉదంతం తెలియజేస్తోంది. తైవాన్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన లాండ్రీ డిటర్జంట్‌ను ముగ్గురు వ్యక్తులు పొరపాటున తిన్నారు. ఆ తర్వాత వారు అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరారు. సకాలంలో చికిత్స అందడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తైవాన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచితంగా లాండ్రీ డిటర్జెంట్ పంపిణీ చేశారు. దీనిని మిఠాయిగా బావించి, తిన్నవారు అనారోగ్యం పాలయ్యారు. సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం బాధితుల్లో ఒకరు తాను డిటర్జంట్‌ను పొరపాటున మిఠాయిగా భావించానని అన్నారు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన డిటర్జెంట్ ప్యాక్‌పై బట్టలు ఉతకడానికి అని స్పష్టంగా రాసి ఉంది. అలాగే ఒక్కో ప్యాకెట్‌పై దీనితో ఎనిమిది కిలోల వరకు దుస్తులను ఉతకవచ్చని రాసి ఉంది. ప్రచార సమయంలో జాతీయవాద ప్రచార కార్యాలయం సుమారు 4,60,000 ప్యాకెట్లను పంపిణీ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఘటన తర్వాత సెంట్రల్ తైవాన్‌లోని ఎన్నికల ప్రచార కార్యాలయ ప్రతినిధి క్షమాపణలు చెప్పారు. ఇకపై ఇలాంటి మెటీరియల్‌ను ప్రజలకు పంపిణీ చేయబోమని కార్యాలయ చీఫ్ ఒక వీడియో ద్వారా తెలిపారు. ఇది మిఠాయి కాదని, లాండ్రీ డిటర్జెంట్ అని కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కాగా ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరు వృద్ధులున్నారని వార్తా సంస్థ తెలిపింది. చికిత్స అనంతరం వారిద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
జైపూర్: రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయన జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అనారోగ్యానికి గురైన ప్రవీణ్ గుప్తా ఆస్పత్రిలో చేరి హెల్త్ చెకప్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. పూర్తి వైద్య పరీక్షల కోసం ఆయన్ను ఐసీయూకి తరలించినట్లు అని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ గుప్తా రాష్ట్ర ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేశారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 స్థానాల్లో నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అస్వస్థకు గురవడం అధికార యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. -
ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
సాధారణంగా ఉద్యోగులు లాంగ్ వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అవకాశం దొరికితే అలా బయట తిరిగిరావాలని చాలామంది తపన పడుతుంటారు. ఆగస్టు 15 ఈసారి మంగళవారం నాడువచ్చింది.(ఆరోజు ప్రభుత్వ అధికారిక సెలవుదినం). దానికి ముందురోజు అంటే సోమవారం(ఆగస్టు 14). దేశంలోని చాలామంది ఉద్యోగులకు ఆరోజు జ్వరం(సెలవు కోసం) వస్తుందట. లేదా తమ ఇంటిలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా శుభకార్యాలు ఉన్నాయంటూ సెలవు కోరుతున్నారు. When your sick leave for Monday is actually approved 🤭 #LongWeekend | #Fan pic.twitter.com/79Jw2yx0CD — Yash Raj Films (@yrf) August 11, 2023 సోమవారం ఒక్కరోజు గనుక సెలవు లభిస్తే, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో జనం సెలవు కోసం ఎటువంటి కారణాలు చెబుతున్నారో తెలియజేస్తున్నారు. అవి ఎంతో ఫన్నీగా ఉంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇది కూడా చదవండి: ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం! Leaving office on #Friday knowing it’s a long weekend 🚀 pic.twitter.com/OWD8Rn9pfH — Hemaang (@JrSehgal) August 11, 2023 People returning to offices on 16th August after the long weekend: pic.twitter.com/WaQDHXCcjf — Kanika Choudhary (@DalRotiForLife) August 9, 2023 Every employee planning for 14 August sick leave 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/kkiLRG56US — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) August 11, 2023 Managers permit sick leave on 14 August...😁😁😀😀 pic.twitter.com/uz3XOc3Jn7 — Gramin Banker 🏦 (@bankarBabu) August 5, 2023 *me applying 14 august sick leave* manager: pic.twitter.com/6DxW7sntpp — oh well (@highondhaniya) August 8, 2023 -
కన్నీటి గాథ: నొప్పి భరించలేకపోతున్నా! కాలు తీసేయండి మహా ప్రభో!
టైలా పేజ్ అనే యువతి తన దీనగాథను సోషల్ మీడియా ప్లాట్ఫారం ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. బాధను భరించలేక తన కాలును తీసేయండంటూ వైద్యులను పలు విధాల ప్రాధేయపడిన ఉదంతాన్ని ఆమె షేర్ చేసింది. ఆమెకు భరించలేనంతగా కాలి నొప్పిరావడంతో దానిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన ఫుట్‌బాల్ కోచ్.. న్యూయార్క్ పోస్ట్‌లో వెలువడిన ఒక రిపోర్టు ప్రకారం బ్రిటన్‌కు చెందిన టైలా పేజ్‌కు అపెండిక్స్ తొలగించినప్పటి నుంచి కాలి నొప్పిని ఎదుర్కొంటోంది. అంతకుమందు ఆమె ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసింది. ఆమెకు కాలినొప్పి ఎంతగా ఉండేందంటే ఆ నొప్పితో ఆమె నిరంతరం ఏడుస్తూనే ఉండేది. నొప్పిని భరించలేకపోతున్నానంటూ కనిపించిన అందరితోనూ చెప్పుకుని రోదించేది. కాలు త్రీవంగా ప్రభావితం టైలా 2016లో కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన పడింది. ఈ సమయంలో ఆమె భరించలేనంత నొప్పిని అనుభవించింది. ఈ వ్యాధి సాధారణంగా కాలు లేదా చేయిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ కుంగదీస్తుంది. దీనిని ‘సూసైడ్ డీసీజ్’ అని కూడా అంటారు. ఈ నొప్పి సాధారణంగా ఏదైనా గాయం అయిన తర్వాత, సర్జరీ లేదా స్ట్రోక్, గుండెపోటు వచ్చిన తరువాత మొదలవుతుంది.ఈ నొప్పి కారణంగా టైలా ఏ పనీ చేయలేకపోయేది. ‘కాలి నొప్పి భరించడం అసాధ్యంగా మారింది’ తన అనుభవాన్ని వివరించిన ఆమె.. ‘ఒకానొక సమయంలో కాలును కదపడం కష్టంగా మారింది. విపరీతంగా నొప్పి వచ్చేది. చల్లని గాలి తాకినా, కాలు నీటిలో పెట్టినా భరించలేనంత నొప్పి పుట్టేది. కుర్చీలో కూర్చోలేకపోయేదానిని. స్కూలులో కొద్దిసేపు ఉండి వచ్చేసేదానిని’ అని తెలిపింది. భరించలేని నొప్పి కారణంగా ఆమె స్నానం చేయలేకపోయేది. దుస్తులు స్వయంగా ధరించలేకపోయేది. మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడటంతో మానసికంగా కుంగిపోయింది. తల్లి ఓదార్పుతో.. ఆ సమయంలో ఆమె తల్లి తన కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ఒకనాడు టైలా ఇక తాను ఆ కాలుతో జీవించలేనని అభిప్రాయపడింది. తన శరీరం నుంచి ఆ కాలిని తొలగించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. ‘చేతులు ఎత్తి వేడుకుంటున్నాను.. నా కాలు తీసేయండి’.. అని వైద్యులను శతవిధాల వేడుకుంది. 2019లో ఆమెకు ఆపరేషన్‌చేసి, కాలిని తొలగించారు. అప్పుడామె ఎంతో సంతోషించింది. ఇకపై భరించలేనంత నొప్పి ఎదుర్కోవాల్సిన అవసరం లేదని సంబరపడింది. ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్.. -
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత
ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ ఇప్పుడు కూతురి కోసం దర్శకుడిగా మారి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రంగుల ప్రపంచం సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడపుతున్నారు. చదవండి: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్ డేట్ ఫిక్స్ ఈ క్రమంలో అస్వస్థతకు గురై ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సెలైన్‌తో హాస్పిటల్ బెడ్‌పై తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వీరాజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. డైరెక్టర్‌గా తొలిసారి సినిమా తీస్తున్నాను. ఆసుపత్రిలో ఉన్నా సినిమా గురించి ఆలోచిస్తున్నానుకొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే! -
ఇదొక జబ్బులా ఉంది! స్కూల్లో కాల్పుల ఘటనపై జోబైడెన్ ఫైర్
అమెరికాలో నాషెవల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమింటరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జోబైడెన్ సీరియస్ అయ్యారు. దీన్ని ఒక జబ్బుగా అభివర్ణించారు. తుపాకీ సంస్కృతికి అడుకట్టే వేసేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది. ఈ మేరకు బైడెన్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉమెన్స్ బిజినెస్ సమ్మిట్‌లో మాట్లాడుతూ..ఈ తుపాకీ సంస్కృతిపై మండిపడుతూ.. ఇది ఒక జబ్బుగా పరిణమిస్తోంది. ఇది ఎందుకు జరిగింది, కారణాలేంటి అనేదానిపై వాస్తవాలను సేకరిస్తున్నాం. ఈ ఘటన చాలా హృదయవిదారకంగా ఉంది. ఒక కుటుంబానికి పీడకలగా మారింది ఈ ఘటన. ఈ తుపాకీ సంస్కృతి మన కమ్యూనిటీలను, సమాజాన్ని చీల్చివేయడమే గాక దేశాన్ని విభజించి కూల్చేస్తోంది. అందువల్ల సాధ్యమైనంత త్వరిగతిన తుపాకీ హింసను అరికట్టేలా ఆయధాల నిషేధాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌కి పిలుపునిచ్చారు. అలాగే మన పాఠశాలలను జైళ్లుగా మారకుండా మరింత కృషి చేయాలని చెప్పారు. ఈ ఘటనపై నిమిషాల వ్యవధిలోనే స్పందించి ప్రమాదాన్ని త్వరతగతిన నియంత్రించినందుకు పోలీసులను అభినందించారు బైడెన్. కాగా, ఈ కాల్పుల వద్ద రెండు ఏకే 47 పిస్టల్‌ను స్వాధీనం చేసుకోవడమే గాక ఈ ఘటనకు పాల్పడిన ఆడ్రీ హేలా అనే మహిళను అక్కడికక్కడే కాల్చి చంపారు పోలీసులు. (చదవండి: ‘రాహుల్ గాంధీ’ వ్యవహారంపై స్పందించిన అమెరికా) -
నేనున్నానని.. మీకేం కాదని.. సీఎం జగన్ తక్షణ సాయం..
సాక్షి, అనకాపల్లి జిల్లా: మానవత్వాన్ని చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. గురువారం యలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి.. వారికి అవసరమైన సాయం చేశారు. కొండమంచిలి వాణి యలమంచిలి కుమ్మరివీధికి చెందిన కొండమంచిలి వాణి అనే బాలికకు చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు వినపడడం లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి వాణి అమ్మమ్మ విన్నవించుకున్నారు. దీంతో తక్షణ సహాయానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. కలగా శివాజి ఎస్. రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కలగా శివాజి మోటర్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందాడు. ఆ తర్వాత క్రమేపి ఇతర అవయవాలు పని చేయకపోవడంతో వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్థిక స్ధోమత లేదని సీఎంకి శివాజి కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. తక్షణ సహాయానికి సీఎం హమీ ఇచ్చారు. చదవండి: Andhra Pradesh: మళ్లీ ఉద్యోగాల జోష్ ముఖ్యమంత్రి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ షెట్టి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్ష చొప్పున బాధితులు ఇద్దరికీ మంజూరు చేశారు. ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్నికృష్ణ స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్‌కు పంపించినట్లు సమాచారం. ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి! -
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత
కోల్‌కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో గురువారం హైవేల శంకుస్థాపనకు వెళ్లిన గడ్కరీ.. దగాపూర్ మైదానం వేదికపై ఉండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు. కేంద్ర మంత్రిని విశ్రాంతి కోసం పక్కనన్న గ్రీన్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. సిలిగురి నుంచి డాక్టర్‌ను పిలిపించారు. ఈ మేరకు ఆయనను పరీక్షించిన వైద్యులు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గినట్టు తెలిపారు. వైద్యుల సూచనతో సెలైన్ ఎక్కించారు. డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని కారులో తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం రాజు బిస్తా నివాసానికి చేరుకుంది. కాగా రూ. 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వెళ్లారు. ఈలోపే సిలిగురిలో అస్వస్థతకు లోనయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గడ్కరీ దల్ఖోలాకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ రద్దు అయినట్లు తెలుస్తోంది. సిలిగురి నుండి అయన నేరుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. చదవండి: తొలిసారిగా.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్ -
కౌటాల కస్తూర్బా స్కూల్లో 15 మందికి అస్వస్థత
కౌటాల (సిర్పూర్): కుమురంభీం జిల్లా కౌటాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 15 మంది విద్యార్థినులు అస్వస్థత బారినపడ్డారు. గురువారం సాయంత్రమే కొందరు విద్యార్థులు వాంతులు, తలనొప్పి, జ్వరం బారినపడ్డారు. శుక్రవారం నాటికి ఇలా అనారోగ్యానికి గురైనవారి సంఖ్య మరింత పెరిగింది. దీంతో 15 మందిని అంబులెన్స్‌లో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంగా ఉన్న నలుగురికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని.. మిగతా వారిని హాస్టల్‌కు తిరిగి పంపిస్తున్నామని వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది విద్యాలయానికి వెళ్లి.. విద్యార్థులందరి నుంచి రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. చదవండి: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ -
పానీపూరి తిని 100 మందికి అస్వస్థత!
కోల్‌కతా: పానీపూరి అంటే చాలా మంది ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ తింటారు. వీధుల్లో పానీపూరి బండి కనిపించిందంటే చాలు.. నోట్లో నీళ్లురూతాయి. అయితే, అదే పానీపూరి 100 మందికిపైగా ప్రాణాల మీదకు తెచ్చింది. స్ట్రీట్ స్టాల్లో పానీపూరి తిని మూడు గ్రామాల్లో 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సుగంధ గ్రామపంచాయతీ పరిధి డొగచియాలో ఓ వీధి బండి వద్ద బుధవారం చాలా మంది పానీపూరి తిన్నారు. వారిలో దాదాపు అందరు సాయంత్రానికి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా వైద్యులు అనుమానిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ఔషధాలు అందించారు. పలువురు తీవ్రంగా ప్రభావితమైన క్రమంలో ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అస్వస్థతకు గురైన వారిలో డొగచియా, బహిర్ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇదీ చదవండి: Actress Kamya Punjabi: పానీపూరి మైకంలో లక్ష రూపాయలు మరిచిపోయిన నటి.. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, నిర్మల్/ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి యాభై మందికి పైగా విద్యార్థులు బాధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. వాళ్లకు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫుడ్ పాయిజన్ అంటూ వచ్చిన కథనాలను బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు తోసిపుచ్చారు. అవి సీజనల్ రోగాలని ప్రకటించారు. అస్వస్థతతో ఆరుగురే ఆస్పత్రిలో చేరారని, వాళ్లకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని ట్రిపుల్ ఐటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత పేర్కొన్నారు. చదవండి: ప్లీజ్.. తప్పించండి: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ! -
నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత
-
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమంచర్లలో ‘జగనన్న మాట-గడపగడపకూ కోటంరెడ్డి బాటలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అరుంధతీ వాడలో సహపంక్తి భోజనం చేసిన అయన అలసటకు గురయ్యారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకొన్న కోటంరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: ఎంపీ జీవీఎల్ నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులు చెన్నైకి రెఫర్ చేసారు. సమాచారం అందుకొన్న మంత్రి కాకాణి ఆసుపత్రికి చేరుకుని కోటంరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితిపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి కోటంరెడ్డిని తరలించారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరా తీశారు. ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్‌రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
హృదయ విదారక ఘటన: దారిలోనే 'పసి'వాడిన బతుకు
చింతూరు : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలుడిని ఆటోలో ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో మృతిచెందగా ఆ మృతదేహాన్ని ఆటోడ్రైవర్ రోడ్డుపైనే దించేసి వెళ్లిపోయాడు. నడిరోడ్డుపై ఆ చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు అల్లాడారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి దారిన పోయే ఆటోలను, వాహనాలను ఆపినా ఎవరూ కరుణ చూపలేదు. చింతూరు మండలం ఏజీకొడేరు వద్ద బుధవారం జరిగిన హృదయ విదారక ఘటన వివరాలివి. వీఆర్‌పురం మండలం కుంజవారిగూడెంకు చెందిన సోడె సుబ్బారావు, బుచ్చమ్మల కొడుకు హరికృష్ణారెడ్డి(9) అంతుచిక్కని వ్యాధితో వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడిని చికిత్స నిమిత్తం చింతూరులోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా అనారోగ్యం తగ్గక పోవడంతో బుధవారం వీఆర్‌పురం మండలంలోని ఓ నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన నాటువైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు తిరిగి బాలుడిని ఆటోలో ఎక్కించుకుని స్వగ్రామం తీసుకెళుతుండగా చింతూరు మండలం ఏజీకొడేరు వద్దకు రాగానే మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మృతిచెందాడు. దీంతో సదరు ఆటోడ్రైవర్ బాలుడి మృతదేహంతో పాటు తల్లిదండ్రులను అక్కడే బస్‌షెల్టర్ వద్ద రహదారిపై ఎండలో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాలుడి మృతదేహంతో రహదారిపై రోదిస్తూనే మృతదేహాన్ని తరలించేందుకు అదే రహదారిలో వస్తున్న ఆటోలను ఆపేందుకు ప్రయత్నించగా ఎవరూ ఆపలేదని తల్లిదండ్రులు తెలిపారు. దీనిని గమనించిన స్థానికులు మృతదేహాన్ని పక్కనే వున్న బస్‌షెల్టర్‌లోకి తరలించి తల్లిదండ్రులను ఓదార్చారు. రెండు గంటలపాటు నిరీక్షణ అనంతరం సోడె జోగారావు అనే ఉపాధ్యాయుడు స్పందించి ఎట్టకేలకు ఓ ఆటోను ఆపి బాలుడి మృతదేహంతో పాటు తల్లిదండ్రులను వారి స్వగ్రామానికి తరలించారు. (చదవండి: రాచబాటల్లో రయ్ రయ్!) -
అడుగులో అడుగై.. అమ్మలా తానై
గడివేముల: వారిద్దరూ భార్యాభర్తలు..కష్టసుఖాల్లో తోడునీడగా ఉన్నారు. ఉన్నట్టుండి వారి జీవితంలో ఒక ఉపద్రవం వచ్చి పడింది. అనారోగ్యంతో భర్త అచేతన స్థితిలోకి వెళ్లారు. దీంతో భార్య అమ్మలా మారారు. భర్తకు అన్ని సపర్యలు చేస్తున్నారు. ఆకలేస్తే అన్నం తినిపిస్తున్నారు. బాధ వస్తే ఓదార్చుతున్నారు. కన్నీళ్లు వస్తే తుడుస్తున్నారు. ఏదైనా ప్రదేశాన్ని చూడాలనిపిస్తే కారులో తీసుకెళ్తున్నారు. చదవండి: పరీక్ష ఫలితాల వెల్లడిలో జేఎన్టీయూ(ఏ) కొత్త ఒరవడి తన భుజం సాయంతో భర్తను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాలిన్యం లేని ఆమె మంచితనం...భర్త మనసు తెలిసి మసలుకునే లాలిత్యం ఆదర్శంగా నిలిచాయి. అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తున్న ఈ రోజుల్లో భర్తకు అమ్మలా సేవలు చేస్తున్న గడిగరేవుల జిల్లా పరిషత్ హైసూ్కల్ ప్రధానోపాధ్యాయురాలు వసుంధరా దేవి స్ఫూర్తిగా నిలిచారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన అరవింద పంచరత్నంతో కర్నూలుకు చెందిన ఈమెకు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. పంచరత్నం గ్రామంలో వ్యవసాయం చేసేవారు. విమలా వసుంధరాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేసేవారు. వీరు నంద్యాలలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె డాక్టర్‌గా, మరో కుమార్తె, కుమారుడు బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారికి పెళ్లిళ్లు సైతం అయ్యాయి. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో మధుమేహ వ్యాధితో పంచరత్నం కాళ్లు చేతులు చచ్చుబడి నడవలేని స్థితిలోకి వెళ్లారు. షుగర్ వ్యాధి తీవ్రత అధికం కావడంతో ఆయన ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి నడవలేని స్థితిలో ఉన్న భర్తకు విమలా వసుంధరాదేవి అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు షుగర్ స్థాయిని పరీక్షిస్తూ..సమయానికి మాత్రలు ఇస్తున్నారు. తనతో పాటు కారులో పాఠశాలకు తీసుకెళ్లి, మధ్యాహ్న సమయంలో గోరుముద్దలు తినిపిస్తూ చిన్నపిల్లాడిలా భర్తను చూసుకుంటున్నారు. కుమారుడు, కుమార్తెలు దూర ప్రాంతంలో ఉన్నారని, భర్తకు సపర్యలు చేయడంలో తాను ఆనందాన్ని వెతుక్కుంటున్నానని విమలా వసుంధరాదేవి తెలిపారు. -
హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆ వార్తలపై క్లారిటీ..
Samantha Falls Sick And Tested In Private Hospital: స్టార్ హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకొని వెళ్లింది. గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన సమంత ప్రస్తుతం జర్వం, జలుబుతో బాధపడుతోంది. దీంతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంది. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. అయితే సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆమె మేనేజర్ మహేంద్ర స్పందించారు. సామ్ ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థత కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని పేర్కొన్నారు. -
భోజనం వికటించి 230 మందికి అస్వస్థత
జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ పంచాయతీ పరిధిలోని దాజీనగర్‌లో భోజనం వికటించి దాదాపు 230 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం గ్రామంలో గురుపూజ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికోసం శుక్రవారం రాత్రి నుంచే వంటలు ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు కొనసాగాయి. అయితే అర్ధరాత్రి నుంచి గ్రామస్తులకు వాంతులు కావడంతో 47 మందిని జిల్లా కేంద్రం లోని రిమ్స్‌కు తరలించి చికిత్స చేయించారు. మిగతావారికి గ్రామంలోనే చికిత్స అందించారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత
సాక్షి, విజయవాడ: నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి హైబీపీ రావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు శ్రీధర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తర్వాత మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు కోటంరెడ్డిని పరామర్శించారు. -
భోజనం వికటించి 62 మందికి అస్వస్థత
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులోని నాగారం ప్రాంతంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ కళాశాలలో భోజనం వికటించి 62 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. సిబ్బంది వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తు తం వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కలెక్టర్ రామ్మోహన్రావు ఆదివారం విద్యార్థినులను పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన.. భోజనం శాంపిల్స్ సేకరించాలని అధికారులకు సూచించారు. సాయంత్రం విద్యార్థినులను డిశ్చార్జి చేశారు. -
ఏఎన్ఎం నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం!
సాక్షి, చీరాల (ప్రకాశం): ఓ ఏఎన్ఎం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారుల ప్రాణం మీదకు వచ్చింది. జ్వరానికి వాడాల్సిన టాబ్లెట్లు కాకుండా షుగర్వ్యాధికి వాడే మందులు వేయడంతో ఆ చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారులు కోలుకున్నారు. కొద్ది సమయం మించితే నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసేవి. ఈ సంఘటన శనివారం చీరాల మండలం విజయనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగర్ కాలనీకి చెందిన 45 రోజుల చిన్నారులు డి.బాబు, తేళ్ల బాబు, తేళ్ల పాప, రేణుమళ్ల పాపలకు శనివారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఐటీవీ వ్యాక్సిన్లు (పోలియో రాకుండా రోటావైరస్, పెంటాలెవల్) ఇంజెక్షన్లు ఏఎన్ఎం భాగ్యలక్ష్మి వేశారు. ఈ వ్యాక్సిన్లు వేసినప్పుడు సహజంగా చిన్నారులకు జ్వరం వస్తుంది. జ్వరం తగ్గేందుకు ప్రతి చిన్నారికి పారాసెట్మాల్ టాబ్లెట్ ఇవ్వాలి. ఏఎన్ఎం అజాగ్రత్తతో జ్వరం తగ్గేందుకు ఇచ్చే బిళ్లలు (టాబ్లెట్)లకు బదులు మెట్ఫార్విన్ (షుగర్ బిళ్లలు) చిన్నారుల తల్లిదండ్రులకు ఏఎన్ఎం అందించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవి మింగించారు. నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 45 రోజుల చిన్నారులు అస్వస్థతతకు గురి కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఏఎన్ఎంను కలిశారు. పొరపాటున జ్వరం బిళ్లలకు బదులు షుగర్ మాత్రలు అందించానని చెప్పడంతో వెంటనే నలుగురు శిశువులను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు చిన్న పిల్లల వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. నలుగురు శిశువులు నిద్రలోకి వెళ్తే చేతికి అందేవారు కారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేట్ వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు చిన్నారులకు హుటాహుటిన ప్రథమ చికిత్సతో పాటు పొట్టలోకి పైపు పంపించి మందు బిళ్లలు బయటకు రప్పించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అటు చిన్నారుల తల్లిదండ్రులు ఇటు వైద్యశాఖ అధికారులు ఉపశమనం పొందారు. రెండు గంటల ఆలస్యమైతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని వారు చెప్పడం అందరిని కలచివేసింది. ఏఎన్ఎం అజాగ్రత్తగా వ్యవహరించి చిన్న పిల్లల వైద్య సేవలపై నిర్లక్ష్య ధోరణితో వ్యహరించడంతో ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని శిశువుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు శిశువులను పరామర్శించి ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు అందించేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 45 రోజులున్న శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి తెలిపారు. ఏఎన్ఎంపై చర్యలు చిన్నారులకు వ్యాక్సిన్లు వేసి జ్వరం టాబ్లెట్లకు బదులు షుగర్ టాబెట్లు ఇచ్చిన ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చార్జి మెమో ఇచ్చాం. సంఘటనను డీఎం అండ్ హెచ్‌వోకు వివరించా. జిల్లా ఉన్నతాధికారులు ఏఎన్ఎంపై చర్యలు తీసుకుంటారు. - శ్రీదేవి, పీహెచ్సీ వైద్యురాలు -
ఈ–సిగరెట్లు.. అనారోగ్యం వంద రెట్లు
చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా వచ్చే అవకాశం పాఠశాలలు, కాలేజీ యువతే లక్ష్యంగా విక్రయాలు ఒక్కో ఈ–సిగరెట్ ఖరీదు రూ. 3 వేల నుంచి రూ. 30 వేలు 13 రాష్ట్రాల్లో నిషేధం... తెలంగాణలోనూ నిషేధించే అవకాశం చూడడానికి స్టైలిష్‌గా ఉంటుంది... తాగితే మాంచి అనుభూతినిస్తుంది... సాధారణ సిగరెట్ కంటే ఆకర్షిస్తుంది. పైగా వివిధ రకాల పండ్ల సువాసన వెదజల్లుతుంది. అదే ఈ–సిగరెట్. ఇప్పుడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీ యువకులు ముఖ్యంగా టీనేజర్లు దీనికి ఆకర్షితులవుతున్నారు. చివరకు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఉండటంతో టీనేజర్లు ఎగబడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా పొగ బయటకు రాదు. కాబట్టి తాగే వారిని గుర్తించడమూ అంత సులువుకాదు. విచిత్రమేంటంటే దశాబ్ద కాలంగా టీనేజీ పిల్లల్లో సిగరెట్లు తాగడం గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఈ–సిగరెట్లు వచ్చి వారిని నాశనం చేస్తు న్నాయి. దాని వల్ల వచ్చే ప్రమాదాలు తెలియకపోవడంతో స్టైల్ కోసం తాగుతున్నారు. సాధారణ సిగరెట్లతో ఎంతటి దుష్ప్రభావాలున్నాయో, అంతకుమించి ఈ–సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక అధ్యయన పత్రాన్ని అవి తయారు చేశాయి. ఆ వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందజేశాయి. ప్రపంచంలో ఈ–సిగరెట్లను 36 దేశాలు నిషేధించాయి. మన దేశంలో పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, జార్ఖండ్ రాష్ట్రాలు నిషేధిం చాయి. తెలంగాణలోనూ నిషేధించాలని వైద్య, ఆరోగ్యశాఖకు ఈ సంస్థలు ఇటీవల విన్నవించాయి. – సాక్షి, హైదరాబాద్ ఎలా పని చేస్తుంది? ఈ–సిగరెట్టు బ్యాటరీతో పనిచేస్తుంది. నికోటిన్‌తో ఉండే ద్రవ పదార్థాన్ని మండించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు దోమలను పారదోలేందుకు కొన్ని రకాల లిక్విడ్ మందును మనం ఎలా విద్యు త్తో వాడతామో అలాగే ఇది కూడా పనిచేస్తుంది. అందులో ద్రావణం మండి ఆవిరి కలుగ జేస్తుంది. తద్వారా అది ఒకరకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ–సిగరెట్లకు అనేక పేర్లున్నాయి. ఈ–సిగ్స్, ఈ–హుక్కాస్, వేప్ పెన్స్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ అని కూడా అంటారు. చూడడానికి ఇవి పెన్నుల మాదిరిగా కూడా ఉంటాయి. ఈ–సిగరెట్ల ఖరీదు ఏకంగా రూ. 3 వేల నుంచి రూ. 30 వేల వరకు మన దేశంలో విక్రయిస్తున్నారు. అయితే పెన్ను రీఫిల్ మార్చినట్లుగా అనేక సార్లు దీన్ని మార్చుకోవచ్చు. ఒకసారి రూ. 30 వేలు పెట్టి కొంటే, దాంట్లో ద్రవ పదార్థం అయిపోయినప్పుడల్లా రూ. 700 నుంచి రూ. వెయ్యి వరకు పెట్టి రీఫిల్ చేసుకోవచ్చు. అలా వంద నుంచి రెండొందలసార్ల వరకు మార్చుకునే వెసులు బాటుంది. ఇండియాలో దీనికి ఎంత మంది బానిసలయ్యారన్న దానిపై ఇంకా స్పష్టమైన డేటా లేదు. కానీ అమెరికాలో మూడు శాతం మంది పెద్దవాళ్లు ఈ–సిగరెట్లు తాగుతున్నారు. 15% మంది దాన్ని కొత్తగా ప్రయత్నించారని అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోనూ టీనేజర్లు దీని బారిన పడినట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి. కేన్సర్‌కు దారితీస్తుంది... సాధారణ సిగరెట్లలో పొగాకును మండిస్తారు. దానిద్వారా కార్బన్ మోనాౖMð్సడ్ తదితర రసాయనాలు మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. ఈ–సిగరెట్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన బెంజిన్, ఇథైలిన్ ఆౖMð్సడ్, ఎక్రిలమైడ్ వంటి రసాయనాలు వెలువడతాయి. వాటిని పీల్చుతారు. అంతేగాక టాక్సిక్ మెటల్స్ను కూడా పీల్చుతారు. ఈ–సిగరెట్లలో ఉండే కాయిల్స్ ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. వీటిని పీల్చడం ద్వారా కేన్సర్, నాడీ మండల వ్యవస్థ ధ్వంసం కావడం తదితర దుష్పరిణామాలు తలెత్తుతాయి. అలాగే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి. హైబీపీ తలెత్తడం, ఒక్కోసారి కోమాలోకి వెళ్లి చనిపోవడం జరుగుతుంది. తక్కువ డోస్ ఈ–సిగరెట్లు తాగితే వాంతులు, కడుపునొప్పి తదితరాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు.. ఈ–సిగరెట్లలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. మెదడుపై అది ప్రభావం చూపుతుంది. గర్భిణీలు తాగితే మరింత ప్రమాదం. సాధారణ సిగరెట్లను మానేయడానికి ఈ–సిగరెట్లు ఉపయోగపడతాయన్న ప్రచారాన్ని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఎక్కడా అలా జరగకపోగా, మరింతగా బానిసలవుతున్నారు. ఈ–సిగరెట్లలో ఉండే బ్యాటరీలు ఒక్కోసారి పేలి పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ–సిగరెట్లు తయారు చేసే ప్రధాన బ్రాండ్లు అన్నీ కూడా పొగాకు కంపెనీలే కావడం గమనార్హం. టీనేజీ పిల్లలను ఈ–సిగరెట్లు ఆకర్షించడానికి ప్రధాన కారణం... వివిధ రకాల ప్లేవర్లలో (రుచులు లేదా సువాసన) అందుబాటులో ఉండటం, ఉన్నతమైన టెక్నాలజీతో తయారు కావడం, పైగా దీనివల్ల సాధారణ సిగరెట్ల కంటే ప్రమాదం తక్కువన్న ప్రచారం ఉండటం. రాష్ట్రంలోనూ నిషేధించాలి ఈ–సిగరెట్లను నిషేధించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఇటీవల విన్నవించాం. దేశంలో వివిధ రాష్ట్రాలు నిషేధించాయని, తెలంగాణ లోనూ వీటిని నిషేధించేలా నిర్ణయం తీసుకోవాలని కోరాం. పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. – నాగ శిరీష, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి -
పలు విమానాలు రద్దు :కంపెనీ వివరణ
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశీయ రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరిన్ని కష్టాలు తప్పడంలేదు. అనూహ్యంగా విమానాలను రద్దు చేసిన విమర్శల పాలైన జెట్ ఎయిర్వేస్ మరోసాకి 14 విమానాలను రద్దు చేసింది. పైలట్ సెలవు కారణంగా దేశీయంగా వివిధ ప్రదేశాలకు ఈ విమానాలను రద్దు చేయడం కలకలం రేపింది. గత కొన్నినెలలుగా సిబ్బందికి ముఖ్యంగా పైలట్లకు వేతనాలను సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో విధులకు హాజరు కాలేకపోతున్నామంటూ వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో సుమారు 14 సర్వీసులను సంస్థ ఆదివారం రద్దు చేసింది. అనూహ్యంగా విమానాలను రద్దు చేయడంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. దీంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. జీతం, ఇతర బకాయిలు చెల్లింపుల వ్యవహారంలో జెట్ ఎయిర్వేస్ వైఖరిపై జాతీయ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్)కు ఫైలట్లు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం సాకుగా చూపిన పైలట్లు భారీ సంఖ్యలో విధులకు గైర్హాజయ్యారు. అలాగే ఈ పరిస్థితుల్లో పనిచేయలేమంటూ సంస్థ ఛైర్మన్ నరేష్‌గోయల్‌కు లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ వివరణ మరోవైపు దీనిపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దుకు పైలట్ల నిరసన కారణం కాదని వివరణ ఇచ్చింది. ఊహించని కార్యాచరణ పరిస్థితి మూలంగా విమానాలను రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. అయితే ఎన్ని సర్వీసులను రద్దు చేసిందీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అక్టోబరు, నవంబరు నెలల్లో సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించకపోయినా, సెప్టెంబర్‌లో పాక్షికంగా చెల్లించింది జెట్. అంతర్జాతీయ సర్వీసుల్లో కోత ఇది ఇలా వుంటే ఖర్చులను తగ్గించునే క్రమంలో అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న సర్వీసుల్లో వారానికి కొన్నింటిపై కోత పెట్టనుంది. ముఖ్యంగా తొమ్మిది గల్ఫ్ మార్గాల్లో నడిపే విమాన సర్వీసులను తగ్గించనుంది. దేశీయంగా వివిధ నగరాలనుంచి మస్కట్, దోహా, అబుదాభి, దుబాయ్‌కి వెళ్లే విమానాల్లో వారానికి దాదాపు 40విమానాలను రద్దు చేయనుంది. అయితే వివిధ నగరాలనుంచి సింగపూర్, ఖట్మాండు, బ్యాంకాక్ సహా ఇతర గ్లోబల్ రూట్లలో డిసెంబరు 1నుంచి డైరెక్టు విమానాలను పరిచయం చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
గోవాకు త్వరలో కొత్త సీఎం?
పణజి: ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు అధికార బీజేపీ కేంద్ర పరిశీలక బృందం ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకుంది. సీఎం పారికర్ తీవ్ర అనారోగ్యంతో శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు సీఎంగా మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రానికి రావడం గమనార్హం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్ సంతోష్, రామ్ లాల్, రాష్ట్ర ఇన్చార్జి విజయ్ పురాణిక్‌లతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో పాటు, స్వతం త్ర అభ్యర్థుల మనో గతం తెలుసుకుంటుం దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో బీజేపీ 14, సంకీర్ణంలోని జీఎఫ్‌పీ, ఎంజీపీలకు ముగ్గురు సభ్యుల బలం ఉండగా ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.కాంగ్రెస్‌కు 16, ఎన్సీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.‘మా ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ము లాట మొదలైంది. అయితే, అధికారం చేపట్టాలనే ఆదుర్దా మాకు లేదు’ అని గోవా కాంగ్రెస్ కార్యదర్శి చెల్లకుమార్ తెలిపారు.