Sikhs
-
కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత..?
ఒట్టావా: కెనడా-భారత్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. ఈ పరిణామం తర్వాత ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. ఇరు దేశాలు తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. జస్టిన్ ట్రూడో తన రాజకీయ మనుగడ కోసమే ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇంతకీ కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత పెరిగిందనే చర్చ ప్రస్తుతం మొదలైంది. కెనడాలో సిక్కు జనాభా.. 2021 జనాభా లెక్కల ప్రకారం కెనడాలో 3.70 కోట్ల జనాభా ఉంది. ఇందులో 16 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇది కెనడా జనాభాలో దాదాపు 4 శాతం. కెనడా భారతీయ జనాభాలో సిక్కులు 7,70,000 మంది అక్కడ నివసిస్తున్నారు. గత 20 ఏళ్ల నుంచి కెనడాలో సిక్కు జనాభా ఒక్కసారిగా రెండింతలు పెరిగిపోయింది. ఉన్నత విద్య, ఉద్యోగాల పేర పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు. కెనడాపై సిక్కు ప్రభావం.. కెనడాలో అత్యంత ప్రభావశీలంగా అభివృద్ధి చెందుతున్న జాబితాలో సిక్కులు ఉన్నారు. క్రిస్టియన్స్, ముస్లిం, హిందూల తర్వాత సిక్కులు నాలుగో పెద్ద జనసంఖ్య కలిగినవారిగా అవతరించారు. ప్రధానంగా ఒంటారియో, బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. పంజాబీ భాష కెనడాలో మూడో పాపులర్ భాషగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మాణ రంగం, రవాణా, బ్యాంకింగ్ రంగాలలో సిక్కులు కెనడా ఆర్థికాభివద్ధిలో భారీ సహకారం అందిస్తున్నారు. చాలా మంది సిక్కులు హోటల్, రెస్టారెంట్, గ్యాస్ స్టేషన్ల వంటి వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 4.15 లక్షల సిక్కులు శాశ్వత నివాసాన్ని పొందారు. 1980లో కేవలం 35000 మంది మాత్రమే శాశ్వత నివాసాన్ని కలిగి ఉండగా.. ఆ సంఖ్య ఇటీవల కాలంలో అమాంతం పెరిగిపోయింది. రాజకీయంగా.. జస్టిన్ ట్రూడో 2015 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిక్కులకు మరింత ప్రాధాన్యత పెరిగిపోయింది. సిక్కు వర్గం నుంచే కేవలం నలుగురు మంత్రులను నియమించారు. కేంద్ర స్థాయిలో అత్యధిక వాటా ఈ వర్గానికి కేటాయించారు. సిక్కులు కెనడాలోఇంతటి ప్రధాన్యత కలిగిన వర్గంగా అభివృద్ధి చెందడానికి వారి గురద్వారాలే కారణమని నిపుణులు చెబుతారు. సిక్కు ఫండ్స్‌ను గ్రాంట్ల రూపంలో వసూలు చేసి ఎన్నికల కోసం వాటిని ఖర్చు చేస్తున్నారు. కెనడాలోని మొత్తం 388 ఎంపీల్లో 18 మంది ఎంపీలు సిక్కు వర్గానికి చెందినవారు ఉన్నారు. అందులో ఎనిమిది సీట్లు పూర్తిగా సిక్కుల ఆధీనంగా ఉంటాయి. మరో 15 సీట్లలో తమ ప్రభావం చూపుతున్నారు. ఈ కారణంగానే ఏ రాజకీయ పార్టీలు సిక్కులకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
సీఎం జగన్‌తో సిక్కు మత పెద్దలు భేటీ
-
సిక్కు మత పెద్దలకు సీఎం జగన్ కీలక హామీ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో సిక్కు మత పెద్దల విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. - సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్. - గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు విజ్ఞప్తిపై సీఎం జగన్ అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. - గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. - గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు ప్రకటనపై సీఎం జగన్ అంగీకారం తెలిపారు. - వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని స్పష్టం చేశారు. - ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు సహాయం అందిస్తామన్నారు. - వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. - పారిశ్రామికంగా కూడా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో చర్యలు ఉండాలని సీఎం జగన్ సూచించారు. 10 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇది కూడా చదవండి: విద్యార్థుల తరలింపు సీఎం జగన్ కృషి వల్లే సాధ్యమైంది: ముత్యాలరాజు -
పంజాబ్, లక్నో మ్యాచ్‌కు పొంచిఉన్న ముప్పు.. ఏ క్షణమైనా!
ఐపీఎల్ 16వ సీజన్లో శుక్రవారం (ఏప్రిల్ 28) పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు ముప్పు పొంచి ఉంది. వర్షం ముప్పు మాత్రం కాదు. కానీ ప్రస్తుతం అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కూడా ఉంది. విషయంలోకి వెళితే.. పంజాబ్, లక్నో మ్యాచ్‌కు నిహంగ్ సిక్కుల నుంచి ముప్పు పొంచి ఉండడమే దీనికి కారణం. పంజాబ్ కొన్ని రోజులుగా నిహంగ్ సిక్కుల ఆందోళన జరుగుతోంది. జైల్లో ఉన్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ వీళ్లు నిరసన తెలుపుతున్నారు. నిహంగ్ సిక్కుల ఛీఫ్ బాపు సూరత్ సింగ్ ఖల్సా నిరాహార దీక్ష చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన దీక్షలోనే ఉన్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ద్వారా వీళ్లు తమ నిరసన తీవ్రత ఎంతో తెలియజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం అందింది. తమ డిమాండ్లు పంజాబ్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఐపీఎల్ మ్యాచ్ ను అడ్డుకుంటామని కూడా ఇప్పటికే వాళ్లు అక్కడి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు పంజాబ్, లక్నో మ్యాచ్ కు వీళ్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు నిర్వాహకులు భావిస్తున్నారు. ఒకవేళ వీళ్ల నిరసన కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేస్తే.. పంజాబ్, లక్నో జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్లో పంజాబ్ కింగ్స్ ఆరోస్థానంలో ఉంది. ఏడు మ్యాచ్ లలో 4 గెలిచి, 3 ఓడిపోయింది. గత రెండు మ్యాచ్ ల నుంచి శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కాగా ధావన్ నేడు లక్నోతో మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ వారం రోజుల తర్వాత మరో మ్యాచ్ ఆడుతోంది.గుజరాత్ టైటాన్స్‌తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో 4 వికెట్లు పారేసుకొని ఓటమిని కొనితెచ్చుకుంది. పాయింట్ల పట్టికలో లక్నో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. చదవండి: స్వదేశానికి కేకేఆర్ క్రికెటర్.. ఆడింది ఒక్కటే మ్యాచ్! -
అమెరికాలో పోలీసుల అదుపులో 17 మంది ‘వాంటెడ్’ సిక్కులు
వాషింగ్టన్: అమెరికాలో 11 కాల్పుల ఘటనలకు సంబంధించి 17 మంది సిక్కులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ బ్రోకెన్ స్వోర్డ్ పేరుతో 20కి పైగా ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో మెషీన్ గన్, ఏకే–47లు సహా 42 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన మాఫియా సభ్యులని అధికారులు చెప్పారు. వీరు పలు హత్యా ఘటనలకు సంబంధించి భారత్ పంపిన వాంటెడ్ జాబితాలో ఉన్నారన్నారు. హింసాత్మక ఘటనలు, కాల్పులతోపాటు ఐదు హత్యాయత్నం ఘటనలతోనూ వీరికి ప్రమేయం ఉందన్నారు. -
పంజాబ్‌లోనూ మందిర్–మసీదు వివాదం
పటియాలా: మందిర్–మసీదు వివాదం పంజాబ్‌నూ తాకింది. పటియాలా సమీపంలో రాజ్‌పురాలోని గుజ్రన్‌వాలా మొహల్లాలో ఉన్న మసీదు నిజానికి సిక్కులకు చెందిన సరాయి అని స్థానిక హిందూ, సిక్కు సమూహాలు బుధవారం ఆరోపించాయి. ‘‘రెండేళ్ల క్రితం అందులో ఉంటున్న రెండు సిక్కు కుటుంబాలను తరిమేసి ఆక్రమించుకున్నారు. సిక్కు మత, ఆరాధన చిహ్నాలను తొలగించారు. గుమ్మటం నిర్మించి ఆకుపచ్చ రంగు వేసి మసీదుగా మార్చారు’’ అని పేర్కొన్నాయి. దీన్ని ముస్లిం సమూహం ఖండించింది. అది స్వాతంత్య్రానికి ముందునుంచీ మసీదుగానే కొనసాగుతూ వస్తోందని వాదించింది. ఇరు వర్గాలూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హిమాన్షు గుప్తాకు ఫిర్యాదు చేశాయి. రెండు రోజుల్లోగా సాక్ష్యాలు సమర్పించాలని వారికి ఆయన సూచించారు. హర్యానా, యూపీకి చెందిన వాళ్లు ఇబ్బంది పెడుతున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో కట్టడం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి -
హిజాబ్ సెగ: సిక్కు బాలికకు చేదు అనుభవం.. ఎక్కడికి దారితీస్తుంది..?
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక చోట మళ్లీ హిజాబ్ విషయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరులో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అయితే, హిజాబ్ వివాదంపై హైకోర్టు తుది తీర్పు వెల్లడించే వరకు స్కూల్స్, కాలేజీలకు విద్యార్థులు.. హిజాబ్‌లు, శాలువాలు, మతపరమైన జెండాలను ధరించి రావద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గురువారం ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఓ కాలేజీని సందర్శిస్తున్న క్రమంలో కొందరు విద్యార్థినిలు హిజాబ్ ధరించి ఉండటాన్ని గమనించారు. దీంతో వారిని పిలిచి కోర్టు ఆదేశాలను పాటించాలని సూచించారు. అనంతరం బాలికలు కోర్టు తీర్పును సిక్కులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేయడంతో వారు షాకయ్యారు. దీంతో చేసేదేమీ లేక ఓ సిక్కు బాలిక(17) అమృతధారి(బాప్టిజం తీసుకున్న బాలిక) తలపాగాను తొలగించాలని కాలేజీ యాజమాన్యం కోరింది. వెంటనే సదరు కాలేజీ యాజమాన్యం కోర్టు తీర్పును బాలిక తండ్రి దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కాగా, తన కూతురు తలపాగా తొలగించదని ఆయన కాలేజీ యాజయాన్యానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే సిక్కుల తలపాగా గురించి కోర్టు ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో హిజాబ్ వివాదం కాస్తా సిక్కులను తాకడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్ 6న హాజరవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభకు చెందిన ‘శాంతి, సామరస్యం కమిటీ’ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆక్షేపించింది. డిసెంబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు తమ ముందు హాజరై, వివరణ ఇవ్వాలని కంగనాను ఆదేశించినట్లు కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఓ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. సిక్కు మతస్థులను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా కంగన అభివర్ణించినట్లు ఫిర్యాదుదారులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి పోస్టులు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని, ఓ వర్గం ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తాయని రాఘవ్ చద్ధా పేర్కొన్నారు. శాంతి, సామరస్యం కమిటీని ఢిల్లీ అసెంబ్లీ 2020లో ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది. -
అరెస్ట్ చేయడానికి వస్తే ఇంటి దగ్గర నా మూడ్ ఇలా.. కంగనా సంచలన పోస్ట్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. తన తీరు, వివాదస్పద వ్యాఖ్యలతో తరచు ఆమె వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది కంగనా. అంతేకాదు ఆమె పోలీసు కేసు కూడా నమోదైంది. ఇటీవల సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఆనందంలో మునితేలుతుంటే కంగనా వారిపై చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి.. రైతులను ఉద్దేశిస్తూ ఆమె ‘దీన్ని ఖలిస్థానీ ఉద్యమం’ అంటారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఆమెసౌ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై కంగనా స్పందిస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ షేర్ చేసింది. చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని గతంలోని ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘మరొక రోజు మరో ఎఫ్ఐఆర్. ఒకవేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..ఇంటి దగ్గర నా మూడ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా సున్నితమైన రైతుల అంశంలో కంగనా చేసిన కామెంట్లపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న వ్యక్తులకు తనదైన శైలిలో వ్యంగ్యంగా సమాధానమిచ్చింది కంగనా. మరి దీనిపై ఎవరూ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే కంగనా షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక కంగనా తీరుపై ఎప్పటిలాగే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన తీరుపై మండిపడుతున్నారు. చదవండి: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం -
సిక్కులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు.. నటి కంగనాపై కేసు నమోదు
ముంబై: సిక్కులపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై పోలీసు కేసు నమోదైంది. సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై తన పోస్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. చదవండి: నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె -
Kabul Airport Blast: అదృష్టమంటే వీళ్లదే!
జంట పేలుళ్లతో కాబూల్ ఎయిర్పోర్ట్ రక్తసిక్తంగా మారింది. అమెరికా భద్రతా దళాలను టార్గెట్‌గా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె) సంస్థ చేపట్టిన నరమేధంలో అఫ్గన్ పౌరులు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి 160 మంది అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. తాలిబన్ల దురాక్రమణ తర్వాత పెద్ద ఎత్తున్న పౌరులు పారిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీలు, మహిళలు భద్రత విషయంలో భయాందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో అఫ్గన్ సంతతికి చెందిన సుమారు 160 మంది మైనార్టీలు బుధవారం సాయంత్రం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వీళ్లలో 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు ఉన్నారు. అక్కడి నుంచి బయటి దేశాలకు వెళ్లాలన్నది వాళ్ల ఉద్దేశం. అయితే తాలిబన్లు గార్డులు వీళ్లను అడ్డుకున్నారు. సరైన పేపర్లు ఉన్నా.. తమను అడ్డుకున్నారంటూ వాళ్లంతా కాసేపు ధర్నా దిగారు కూడా. ఎంతసేపు ఎదురుచూసినా అనుమతించబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి వాళ్లంతా వెనుదిరిగారు. అయితే వాళ్లు ఏ ప్రదేశంలో అయితే కొద్దిగంటలపాటు ఎదురుచూశారో.. సరిగ్గా అదే ప్రదేశంలో(అబ్బే ఎంట్రన్స్ దగ్గర) ఆత్మాహుతి దాడి జరిగింది. I just had a phone call conversation with S Gurnam Singh, president of Kabul Gurdwara committee who apprised me that today’s #Kabulairport explosion has happened at exactly same place where they were standing yesterday We thank Almighty that such thing didn’t happen yesterday pic.twitter.com/sbCiHaMZGP — Manjinder Singh Sirsa (@mssirsa) August 26, 2021 ‘‘ముందురోజు ఎక్కడైతే మేం ఎదురుచూశామో.. అక్కడే ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని తెలిసి వణికిపోయాం. అదృష్టం బావుండి అక్కడి నుంచి మేం వెళ్లిపోయాం. దాడిని తల్చుకుంటే బాధగా ఉంది. ప్రస్తుతం మా బృందం సురక్షితంగా ఉన్నాం. కార్టే పార్వాన్‌లోని గురుద్వారలో ఆశ్రయం పొందుతున్నాం’’ అని కాబూల్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ గుర్మాన్ సింగ్ తెలిపారు. వాళ్లు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిస్రా సైతం దృవీకరించారు. వీళ్లను సురక్షితంగా దేశం దాటించే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నట్లు బ్రిటన్ విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: అఫ్గన్ ఎకానమీ.. ఘోరమైన సమస్యలు హాట్ న్యూస్: కాబూల్ దాడి.. మూల్యం చెల్లించకతప్పదు -
ఫెడెక్స్ మాజీ ఉద్యోగి ఘాతుకం, నలుగురు భారతీయులు బలి
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలోని ఇండియానాపొలిస్ నగరంలో చోటు చేసుకున్న కాల్పుల్లో చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు ఉండటం విషాదాన్ని నింపింది. ఈ కాల్పుల ఘటనపై విదేశీ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలోని ఇండియానా పోలిస్‌లోని స్థానిక అధికారులకు, సిక్కు సంఘ నాయకులకు భారతదేశం అన్ని విధాలా సహాయం చేస్తుందని వెల్లడించారు. నలుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోవడంపై సిక్కు సంఘం కూడా స్పందించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. అటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 4 గురు సిక్కులతో సహా 8 మందిని బలితీసుకున్న ఈ కాల్పుల సంఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి పోలీసులు వెల్లడించారు. ఎనిమిది మంది మృతుల్లో నలుగురు సిక్కులున్నారని తెలిపారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఇతను ఫెడెక్స్ మాజీ ఉద్యోగి అని పేర్కొన్నారు. (అమెరికాలో మరోసారి భారీ కాల్పులు: దుండగుడి ఆత్మహత్య) ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించిన భారతీయ బాధితుల పేర్లు అమర్ జీత్ జోహాల్ (66) జస్వీందర్ కౌర్ (64) అమర్ జీత్ షెఖాన్ (48) జస్వీందర్ సింగ్ (68) కాగా ఇండియానాపొలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఫెడెక్స్ గిడ్డంగి వద్ద గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రాండన్ స్కాట్‌గా పోలీసులు గుర్తించారు. గత ఏడాది వరకు ఫెడెక్స్ లో పనిచేసిన బ్రాండన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాలడ్పాడని అక్కడి పోలీసు అధికారి క్రెయిగ్ మెక్ కార్ట్ చెప్పారు. అతడు గత ఏడాది వరకు పనిచేశాడని చెప్పారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. Deeply shocked by shooting at FedEx facility in Indianapolis. Victims include persons of Indian American Sikh community. Our Consulate General in Chicago in touch with Mayor & local authorities in Indianapolis as well as community leaders. Will render all possible assistance: EAM pic.twitter.com/ONhvrdLQHD — ANI (@ANI) April 17, 2021 -
లండన్‌లో ముగ్గురు సిక్కుల హత్య
లండన్: ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు సిక్కులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. లండన్‌లోని స్కాట్లాండ్ యార్డ్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 29 ఏళ్ల వయసున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. కత్తుల గాయాల వల్ల వారు మృతిచెందినట్లు చెప్పారు. మృతుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు. -
పాక్‌లో గురుద్వారాపై దాడి.. పలువురి ఖండన
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడిని పలువురు ఖండించారు. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ శనివారం ఢిల్లీలో వందలాది మంది ర్యాలీ చేపట్టారు. సిక్కులకు, సిక్కుల ప్రార్థనా స్థలాలకు పాక్ ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పాక్ రాయబార కార్యాలయం వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించగా చాణక్యపురి పోలీస్‌స్టేషన్ వద్దే వారిని పోలీసులు నిలువరించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే రోడ్డుకిరువైపులా నిలబడి పాక్‌కు, ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిక్కు నేతలు పాక్ రాయబారికి వినతిపత్రం అందజేశారు. ఇలాంటి దాడులు జరక్కుండా పాక్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ కోరారు. పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌ల్లో మత వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు ఆశ్రయం కోరి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం సబబేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ, విశ్వహిందూ పరిషత్ పేర్కొన్నాయి. ఈ ఘటనపై బీజేపీ నేత మీనాక్షి లేఖి, పాక్ మంత్రి ఫవాద్ ట్విట్టర్లో విమర్శలు చేసుకున్నారు. -
500 ఏళ్లనాటి గురుద్వారాను తెరిచిన పాకిస్థాన్
లాహోర్: పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లోగల 500 ఏళ్ల నాటి గురుద్వారా దర్శనానికి సోమవారం నుంచి భారతీయ సిక్కులను అనుమతిస్తున్నట్లు స్థానిక మీడియా ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని బాబే–దే–బెర్ గురుద్వారాలోకి ఇంతకు ముందు భారతీయులకు అనుమతి లేదు. భారత్‌తోపాటు పలు దేశాల్లో నివసిస్తున్న సిక్కులు పంజాబ్‌లోని వివిధ క్షేత్రాలను దర్శించుకునేందుకు వస్తుంటారు. పాకిస్థాన్, యూరప్, కెనడా, అమెరికాలకు చెందిన యాత్రికులకు గురుద్వారాను సందర్శించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. ఇకపై భారతీయ సిక్కులకు కూడా సియాల్కోట్ గురుద్వారాలోకి ప్రవేశం కల్పించాలంటూ.. పంజాబ్ గవర్నర్ ముహమ్మద్ సర్వార్ ప్రావిన్స్ అఖాఫ్ శాఖను ఆదేశించినట్టు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. -
అమెరికాలో కారు ప్రమాదం : ఇద్దరు సిక్కుల మృతి
వాషింగ్టన్: కారు ప్రమాదంలో ఇద్దరు సిక్కు యువకులు మృతిచెందారు. మృతులను ఇండియానా రాష్ట్రానికి చెందిన ధవ్‌నీత్ సింగ్ చల్లా, వరుణ్‌దీప్ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం రాత్రి 2.30 గంటలకు చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుకు కారును ఢీకొట్టారు. వెనక సీటులో ఉన్న మరో వ్యక్తి గుర్జిత్ సింగ్ సంధూ (20)గా గుర్తించారు. -
పాకిస్థాన్‌లో పోటిచేసినా సిద్దూ గెలుస్తాడు!
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన స్నేహితుడైన ఒకప్పటి క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూకు బాసటగా నిలిచారు. పాక్ ప్రధానిగా తన ప్రమాణస్వీకారానికి హాజరైనందుకు సిద్ధూ భారత్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఇమ్రాన్ మాట్లాడారు. ‘ సిద్దూను ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నా ప్రమాణస్వీకారానికి వచ్చి అతను శాంతిని, స్నేహభావాన్ని పెంచాడు. అతను ఇక్కడి పంజాబ్‌లో పోటి చేసినా గెలిచి తీరుతాడు’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు. కర్తాపూర్ కారిడార్ శంకుస్థాపన వేడుకలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భారత్ తరఫున సిద్దూ హాజరైన విషయం తెలిసిందే. సిక్కులు పవిత్రంగా భావించే పాకిస్థాన్‌లోని గురుద్వార దర్బార్, కర్తాపూర్ నుంచి భారత్ గురుదాస్‌పూర్‌లోని డేరాబాబా నానక్ పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేక రహదారి కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దూ.. 70 ఏళ్ల సిక్కుల నిరీక్షణకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెరదించారని ప్రశంసల జల్లు కురిపించారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరై.. పాక్ ఆర్మీ చీఫ్‌ను సిద్ధూ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
70 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఇమ్రాన్!
ఇస్లామాబాద్: సిక్కుల నిరీక్షణకు తెరపడనుంది. సిక్కులు పవిత్రంగా భావించే పాకిస్థాన్‌లోని గురుద్వార దర్బార్, కర్తాపూర్ నుంచి భారత్ గురుదాస్‌పూర్‌లోని డేరాబాబా నానక్ పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేక రహదారి కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం శంకుస్థాపన చేసింది. భారతదేశం విజ్ఞప్తి మేరకు రెండు దేశాలలోని సిక్కు భక్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి అన్నారు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన పంజాబ్ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ మాట్లాడుతూ.. 70 ఏళ్ల నిరీక్షణకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెరదించారని ప్రశంసల జల్లు కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టన్ అమరీందర్ సింగ్ గురుదాస్‌పూర్‌లో ఇక్కడి కారిడార్‌కు మంగళవారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. పాక్‌లో జరిగే శంకుస్థాపన వేడుకకు పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్‌ను పాక్ ఆహ్వానించగా.. సరిహద్దుల్లో తమ జవానులను పాకిస్థాన్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటున్నారంటూ ఆయన పాక్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. సిక్కుల పవిత్ర గురువైన గురునానక్ తన జీవిత చరమాంకంలో కర్తాపూర్‌లో జీవించారు. గురునానక్ 550వ జయంతి నాటికి భారత్-పాక్‌ల మధ్య ఈ కారిడార్ ఏర్పాటు కావాలని చాలా మంది సిక్కులు కోరుకున్నారు. ఈ కారిడార్‌ను ఆరు నెలల్లో పూర్తిచేయాలనుకుంటున్నారు. ఇది పూరైతే సిక్కు భక్తులు ఎటువంటి వీసా లేకుండానే కర్తాపూర్‌ను సందర్శించవచ్చు. -
అఫ్గాన్‌లో సిక్కులు, హిందువులపై దాడి
జలాలాబాద్: అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్ పట్ణణంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించారు. మృతుల్లో 12 మంది సిక్కులు కాగా, ఏడుగురు హిందువులున్నారు. మరో 20 మంది గాయపడ్డారు. నాన్‌ఘర్హర్ ప్రావిన్సు గవర్నర్ కార్యాలయానికి సమీపంలోని మార్కెట్లో దుండగుడు తనని తాను పేల్చేసుకున్నాడు. ఆ సమయంలో గవర్నర్ కార్యాలయంలో అధ్యక్షుడు అష్రాఫ్ గనీ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో మైనారిటీ వర్గాలైన సిక్కులు, హిందువులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా? అన్నదానిపై స్పష్టత రాలేదు. -
షిల్లాంగ్ ఎందుకు మండుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : ‘పంజాబీ బృందం ఇద్దరు ఖాసీ బాలల తలలు నరికారు’ అంటూ గురువారం రాత్రి వాట్సాప్‌లో నకిలీ వార్త ప్రచారం కావడంతో షిల్లాంగ్‌లోని పంజాబీ లైన్ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖాసీ (అగ్రవర్ణ కులం) వర్గానికి చెందిన కొంత మంది యువకులు పంజాబీ లైన్ లేదా స్వీపర్స్ కాలనీ సమీపంలో గుమిగూడారు. అప్పటికే అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ పోలీసులతో ఘర్షణకు దిగారు. గుంపులో నుంచి ఓ యువకుడు ఇనుప రాడ్‌తో కొట్టడంతో పోలీసు సూపరింటెండెంట్ స్టీపెన్ రింజా తీవ్రంగా గాయపడ్డారు. ఆ అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు గోళాలను ప్రయోగించారు. పంజాబీ కాలనీ, పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు, ఆ తర్వాత కర్ఫ్యూ విధించారు. నేటికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాంతో కాలనీని విడిచి దాదాపు 500 మంది దళిత సిక్కులు పిల్లా పాపలతో సమీపంలోని గురుద్వార్‌లో తలదాచుకుంటున్నారు. అక్కడి కమ్యూనిటీ కిచెన్‌లో వంటచేసుకొని అక్కడే కాలం గడుపుతున్నారు. గురవారం ఉదయం జరిగిన ఓ సంఘటన ఇంతటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మేఘాలయ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సును ఎక్కడ పార్క్ చేయాలనే విషయమై బస్సు డ్రైవర్, కొంత మంది పంజాబీ మహిళలకు మధ్య గొడవ జరిగింది. మహిళల తరపున వచ్చిన ఓ పంజాబీ యువకుడు బస్సు డ్రైవర్‌పై, అందులోని ఇద్దరు ప్రయాణికులపై చేయి చేసుకున్నారు. ఈ సంఘటనలో కంటోన్మెంట్ బోర్డు పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు ఆ పంజాబీ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ‘సిక్కు మహిళల పట్ల మాకు ఎలాంటి కాఠిన్యం లేదు. దాడి చేసిన యువకుడి పట్ల ద్వేషమూ లేదు. మా గాయాల చికిత్స కోసం మాకు నాలుగు వేల రూపాయలను నష్టపరిహారంగా కూడా వారు చెల్లించారు’ అంటూ బస్సు డ్రైవర్ స్వయంగా రాజీ పత్రాన్ని రాసిచ్చారు. గురుద్వార్‌లో తలదాచుంటున్న మహిళలు ‘పంజాబీ బృందం ఇద్దరు ఖాసీ బాలల తలలు నరికారు’ అంటూ అదే రోజు రాత్రి వాట్సప్‌లో వచ్చిన ఫేక్ న్యూస్ ఒక్కసారిగా కలకలం రేపింది. శుక్రవారం రాత్రి పంజాబీ కాలనీ పరిసర ప్రాంతాల్లో, ఖాసీలు ఎక్కువగా ఉన్న షిల్లాంగ్ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సైన్యం కవాతు కూడా నిర్వహించింది. తరతరాలుగా తాము పంజాబీ కాలనీలో ప్రశాంతంగా జీవిస్తున్నామని, తాము మరుగుదొడ్లు శుభ్రంచేసే పాకీ పనిని మానేసిన 1980 వ దశకం నుంచే అగ్ర కులానికి చెందిన ఖాసీల దాడులు తమపై ప్రారంభమయ్యాయని పంజాబీ మహిళలు చెబుతున్నారు. తమను ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని స్థానిక పంచాయతీ కౌన్సిల్ సెక్రటరీ గుర్జీత్ సింగ్ ధృవీకరించారు. బ్రీటీషర్ల కాలం నుంచి.. బ్రిటీష్ కాలం నుంచి, దాదాపు 160 సంవత్సరాలుగా పంజాబీ దళితులు ఈ కాలనీలోనే నివసిస్తున్నారు. వీధులను ఊడ్చేందుకు, మరుగు దొడ్లను శుభ్రం చేసేందుకుగాను బ్రిటీషర్లు 1853లో పంజాబీ దళితులను తీసుకొచ్చారు. వారు నివసించేందుకు అప్పటి మిల్లీయం సియెమ్ (మిల్లీయం పాలకుడు) కొంత భూమిని వారికి రాసిచ్చారు. ఆ తర్వాత 1863, డిసెంబర్లో ఇదే నివాస స్థలంపై బ్రిటీష్ ప్రభుత్వానికి, స్థానిక పాలకుడికి, పంజాబీ దళితులకు మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు తామున్నది అతి ఖరీదైన స్థలంగా మారడంతో తమను ఎలాగైనా ఖాళీ చేయించాలని చూస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. గురద్వార్ కమ్యూనిటీ కిచెన్‌లో చపాతీలు చేస్తున్న మహిళలు అక్రమ వలసదారులు.. షిల్లాంగ్‌కు చెందిన ఖాసీలు మాత్రం సిక్కు దళితులను అక్రమ నివాసితులుగానే పరిగణిస్తున్నారు. పంజాబీ కాలనీకి చెందిన కొంత మంది యువకులు నేరాలకు పాల్పడుతున్నారన్నది కూడా అభియోగం. 1980 ప్రాంతంలోనే జిల్లా కమిషనర్ పంజాబీలకు ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులపై మేఘాలయ హైకోర్టు 1986లో స్టే ఇచ్చింది. ఖాసీ విద్యార్థి సంఘం, ఖాసీ ప్రజా సమాఖ్య లాంటి సంస్థలు అప్పుడప్పుడు పంజాబీలను ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా పంజాబీలు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్‌కు పలు సార్లు ఫిర్యాదు చేశారు. భారత పౌరులుగా తాము దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకోవచ్చంటూ హైకోర్టులో కూడా వారు పలు పిటిషన్లు దాఖలు చేశారు. గురుద్వారాలకు, స్థానిక దేవాలయాలకు పట్టాలు మంజూరు చేసిన స్థానిక ప్రభుత్వం వారి ఇళ్ల స్థలాలకు మాత్రం ఇప్పటికీ పట్టాలు మంజూరు చేయలేదు. మల్టీప్లెక్స్ నిర్మానానికి.... మున్సిపాలిటీ అనుమతి లేకుండా విద్యుత్ బోర్డు కూడా దళితులకు విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదు. అది వివాదాస్పద స్థలంగా తమ రికార్డుల్లో నమోదై ఉందని స్థానిక మున్సిపాలిటీ బోర్డు వాదిస్తోంది. ఒకప్పుడు మరుగుదొడ్డు శుభ్రం చేసిన వారికి కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకుండా పోయింది. 2009 రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు వారికి కనీస సౌకర్యాలు సమకూరాయి. బీజేపీ కుట్రతో అధికారంలోకి వచ్చిన జాతీయ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడి నుంచి దళితులను షిల్లాంగ్ శివారులోకి తరలించి అక్కడ మల్టీఫ్లెక్స్ నిర్మించానుకుంటోంది. -
దాడులపై ట్రంప్ జోక్యం చేసుకోవాలి
వైట్ హౌస్ ఎదుట భారత–అమెరికన్ల ర్యాలీ వాషింగ్టన్: భారత సంతతికి చెందినవారు ముఖ్యంగా హిందువులు, సిక్కులు.. అమెరికాలో ఇస్లామోఫోబియా (ముస్లింలంటే భయం), గ్జినోఫో బియా (విదేశీయులంటే భయం) బాధితులవుతున్నారని, విద్వేషపు దాడు లకు బలవుతున్నారని అక్కడి భారత–అమెరికన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకో వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైట్‌హౌస్ ఎదుట శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. వర్జీనియాకు చెందిన కార్పొరేట్ న్యాయవాది వింధ్య అడప మాట్లాడుతూ.. అమెరికాలో విద్వేషపు దాడులకు హిందువులు బలవుతున్నారని, అక్కడి భారత సమాజాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. ద్వేషపూరిత నేరాలపై భారత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. -
'హెల్మెట్ నిబంధనపై మినహాయింపు ఇవ్వండి'
హైదరాబాద్ : ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధన నుంచి సిక్కులకు మినహాయింపు ఇవ్వాలంటూ సిక్కు అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్.. ట్రాఫిక్ చీఫ్ జితేందర్‌ను కోరింది. శుక్రవారం ట్రాఫిక్ కమిషనరేట్‌లో ఆయన్ను కలిసిన అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రతినిధులు ఎస్.జస్పాల్ సింగ్, కొండారెడ్డి, తిరుపతి వర్మ, చింతల కృష్ణ, హర్మేంద్ర సింగ్, గుర్నమ్ సింగ్ ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం సిక్కులకు హెల్మెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందంటూ జితేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా అమలయ్యేలా చూడాలని కోరారు. -
క్షమాపణ కోరిన కెనడా ప్రధాని
ఒట్టావా: సిక్కులపట్ల అనుసరించిన వైఖరికిగాను 102 ఏళ్ల సుదీర్ఘ విరామనంతరం సోమవారం క్షమించమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెవ్ కోరారు. ఒట్టావోలో జరిగిన బైసాఖి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. ఆ రోజుల్లో ఉండే వివక్షపూరిత వలస చట్టాలే కారణమన్నారు. 376 మందిని సిక్కుల్ని వెనక్కి పంపగా.. దురదృష్టవశాత్తు కొమగటమారు షిప్లో 19 మందిని బ్రిటిష్ సైనికులు కాల్చి చంపారు. సిక్కులకు క్షమాపణ చెబుతానని గతేడాది ఎన్నికల ప్రచారంలో జస్టిన్ ట్రుడెవ్ వాగ్దానం చేశారు. గతంలో కెనడా ప్రధానిగా పనిచేసిన స్టీఫెన్ హార్పర్ కూడా సిక్కులకు క్షమాపణ సంగతి తెలిసిందే. -
'ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం'
వాషింగ్టన్: తమపై అమెరికన్లకు అవగాహన కల్పించేందుకు అమెరికాలోని సిక్కులు నడుంకట్టారు. ఆ దేశంలో తమవారిపై జరుగుతున్న హత్యాకాండలు, హింసపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మున్ముందు అలాంటివి జరగకుండా చేసేందుకు భారీ మొత్తంలో ప్రచార కార్యక్రమాలు తలపెట్టారు. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేనంతగా దాదాపు రూ.2,68,00,000(నాలుగు లక్షల డాలర్లు) విరాళాలు పోగేశారు. ఈ మొత్తాన్ని అమెరికా వ్యాప్తంగా పర్యటించి తమ గురించి, అమెరికాలో తమ విశ్వాసాల గురించి, నమ్మకాల గురించి ప్రచారానికి ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాల కోసం అత్యధికంగా 90 వేల డాలర్లే అధిక మొత్తంలో విరాళాలుగా రాగా ఈసారి ఆశ్యర్యపడేలా భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి. నేషనల్ సిక్ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. 'అమెరికాలోని సిక్కులకు ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఘట్టం. గతంలో ఎన్నడూ లేనంతగా తమ గురించి చెప్పుకునే అవకాశం ఈ విరాళాల ద్వారా వచ్చింది. దేశ వ్యాప్తంగా పర్యటించి సిక్కుల విశ్వాసాలు, నమ్మకాల గురించి అమెరికన్లకు వివరించి సిక్కులపై జరుగుతున్న దాడులను పూర్తిగా తగ్గించేస్తాం. సిక్కులు మరింత భద్రంగా ఉండేలా కృషిచేస్తాం' అని ఎన్ఎస్ సీ సభ్యుడు కావాల్ కౌర్ చెప్పారు. -
సోనియాపై కేసు పిటిషన్ కొట్టివేత