Smartphone market
-
స్మార్ట్‌ఫోన్స్ జోరు.. టాప్ 10 బ్రాండ్స్ ఇవే..
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ సరఫరా వరుసగా అయిదో త్రైమాసికంలో కూడా పెరిగింది. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో సుమారు 6 శాతం వృద్ధి చెంది 4.6 కోట్లకు చేరింది. 72 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీల హవా కొనసాగింది.16 శాతం షేర్‌తో వివో అగ్రస్థానంలో ఉండగా, టాప్ 10 బ్రాండ్స్‌లో ఐకూ అత్యధిక వృద్ధి సాధించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా, శాంసంగ్ వాటా 12.3 శాతంగా ఉంది. వివో వాటా 13.9 శాతం నుంచి 15.8 శాతానికి పెరిగింది.అందుబాటు ధరలోని వై సిరీస్‌తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన టీ3, వీ40 సిరీస్‌ల దన్నుతో వరుసగా మూడో త్రైమాసికంలో కూడా వివో అగ్రస్థానంలో నిల్చింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఒప్పో 13.9 శాతం, రియల్మీ 11.5 శాతం, షావోమీ 11.4 శాతం, పోకో 5.8 శాతం, మోటరోలా 5.7 శాతం, ఐకూ 4.2 శాతం, వన్‌ప్లస్ 3.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. యాపిల్ అత్యధికంగా 40 లక్షల యూనిట్లు సరఫరా చేసింది. మిగతా విశేషాలు.. » రూ. 50,000 నుంచి రూ. 68,000 వరకు ధర శ్రేణి ఉండే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా 86 శాతం వృద్ధి చెందింది. మొత్తం సరఫరా 2 శాతం నుంచి సుమారు 4 శాతానికి పెరిగింది. ఐఫోన్ 15/13/14, గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 12 ప్రధాన మోడల్స్‌గా నిల్చాయి. ఈ విభాగంలో యాపిల్ వాటా 71 శాతానికి పెరగ్గా శాంసంగ్ వాటా 30 శాతం నుంచి 19 శాతానికి పడిపోయింది.» రూ. 16,000 నుంచి రూ. 35,000 ధర శ్రేణిలోని ఎంట్రీ–ప్రీమియం సెగ్మెంట్ 42 శాతం వృద్ధి సాధించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల సరఫరాలో 28%వాటాను దక్కించుకు ంది. ఒప్పో గణనీయంగా పెరగ్గా శాంసంగ్, వివోల మార్కెట్ వాటా తగ్గింది. ఈ విభాగంలో ఈ మూడింటి వాటా 53 %గా ఉంది. » 5జీ స్మార్ట్ఫోన్ల సరఫరా 57% నుంచి 83%కి పెరిగింది. అదే సమయంలో సగటు విక్రయ ధర (ఏఎస్పీ) 20% తగ్గింది. 5జీ సెగ్మెంట్లో మాస్ బడ్జెట్ విభాగం (రూ. 8,000–రూ. 16,000 వరకు ధర) దాదాపు రెట్టింపై 50 శాతానికి చేరింది. షావోమీ రెడ్మీ 13సీ, యాపిల్ ఐఫోన్ 15, ఒప్పో కే12ఎక్స్, వివో టీ3ఎక్స్.. వై28 మోడల్స్ మూడో త్రైమాసికంలో అత్యధికంగా సరఫరా అయ్యాయి. -
షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన షావోమీ 14 సిరీస్ ను మార్కెట్ కు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 7న షావోమీ 14తో పాటు షావోమీ 14 ప్రో, షావోమీ 14 ఆల్ట్రా సహా షావోమీ 14 సిరీస్ ఫోన్లలో తొలుత షావోమీ 14 ఫోన్ మాత్రమే భారత్ మార్కెట్ లో విడుదల చేయనుంది. కాగా, ఈ సిరీస్ ఫోన్లను షావోమీ ఇప్పటికే చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఇప్పుడు గ్లోబుల్ మార్కెట్ లో ఆవిష్కరించనుంది. షియోమీ 14 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.36 అంగుళాల 1.5 కే ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. షావోమీ 14 120హెచ్ జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 1.5కే ఎల్ టీ పీ ఓ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్‌తో పాటు స్టీరియో స్పీకర్లతో కూడిన డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. హ్యాండ్సెట్ 90డబ్ల్యూ వైర్డ్ హైపర్‌ఛార్జ్, 50డబ్ల్యూ వైర్లెస్ టర్బో ఛార్జ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్‌ను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో సున్నా నుండి 50కి ఛార్జ్ చేస్తుందని షావోమీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో లైకా కో-ఇంజినీర్డ్ కెమెరా సెటప్ ఉంటది. ఓఐఎస్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా సైతం యూజర్లను అలరిస్తుంది. షియోమీ 14 ఫోన్ 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్, స్నో మౌంటేన్ పింక్ వేరియంట్స్ కలర్స్ లో రానున్న ఈ ఫోన్ ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండొచ్చునని అంచనా -
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ కింగ్ ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత స్మార్ట్‌ఫోన్స్ విపణిలో శామ్సంగ్ హవా కొనసాగుతోంది. 2023లో 18 శాతం వాటాతో శామ్సంగ్ అగ్రస్థానంలో నిలిచినట్టు పరిశోధన కంపెనీ సైబర్‌మీడియా రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. గతేడాది 16 శాతం వాటాతో వివో రెండవ స్థానంలో, 13 శాతం వాటాతో వన్‌ప్లస్ మూడవ స్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే గతేడాది భారత స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్ 19 శాతం వృద్ధి చెందింది. 5జీ మోడళ్ల వాటా ఏకంగా 65 శాతానికి ఎగబాకింది. 5జీ స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2023లో 122% వృద్ధి సాధించడం విశేషం. ఫీచర్ ఫోన్లకూ గిరాకీ.. రూ.7–25 వేల ధర శ్రేణిలో 5జీ మోడళ్ల వాటా 58 శాతంగా ఉంది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 47 శాతం నమోదైంది. రూ.25,000లకుపైగా ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్స్ విభాగం గతేడాది 71 శాతం ఎగబాకింది. రూ.50,000పైగా విలువైన సూపర్ ప్రీమియం మోడళ్ల విక్రయాలు 65 శాతం పెరిగాయి. 2022తో పోలిస్తే ఫీచర్ ఫోన్ల విభాగంలో అమ్మకాలు గతేడాది 52 శాతం అధికం అయ్యాయి. 4జీ ఫీచర్ ఫోన్లు ఈ దూకుడుకు కారణం అయ్యాయి. 2జీ ఫీచర్ ఫోన్స్ 12 శాతం క్షీణించాయి. రిలయన్స్ జియో 38 శాతం వాటాతో ఫీచర్ ఫోన్స్ విభాగంలో ముందు వరుసలో ఉంది. ఐటెల్ 23 శాతం, లావా 15 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నాల్గవ త్రైమాసికంలో.. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ 29 శాతం దూసుకెళ్లింది. 19 శాతం వాటాతో షావొమీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. శామ్సంగ్ 18.9 శాతం, వివో 16, రియల్మీ 12, ఒప్పో 8, యాపిల్ 6 శాతం వాటా దక్కించుకున్నాయి. 2023 యాపిల్ అమ్మకాల్లో ఐఫోన్–15 సిరీస్ 50 శాతంపైగా వాటా చేజిక్కించుకుంది. ఇక 2024లో స్మార్ట్ఫోన్ల విపణి దేశవ్యాప్తంగా 7–8 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. 5జీ మోడళ్ల అమ్మకాలు 40 శాతం పెరిగే ఆస్కారం ఉంది. 4జీ ఫీచర్ ఫోన్స్ 10 శాతం దూసుకెళ్లవచ్చు. -
స్మార్ట్‌ఫోన్స్ ఆదాయాల్లో యాపిల్ టాప్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో గతేడాది (2023) అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తొలిసారిగా ఆదాయాలపరంగా అగ్రస్థానం దక్కించుకుంది. అమ్మకాల పరిమాణంపరంగా శాంసంగ్ నంబర్‌వన్‌గా ఉంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నెలవారీ స్మార్ట్‌ఫోన్ ట్రాకర్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023లో భారత్‌లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ..దాదాపు అంతక్రితం ఏడాది స్థాయిలోనే 15.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి. కొరియన్ దిగ్గజం శాంసంగ్, చైనా మొబైల్స్ తయారీ సంస్థలు వివో, ఒప్పో తమ మార్కెట్ వాటాలను పెంచుకోగలిగాయి. భారత్‌పై ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా యాపిల్‌కి కలిసి వస్తోందని కౌంటర్‌పాయింట్ తమ నివేదికలో తెలిపింది. స్థూల ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా గతేడాది ప్రథమార్ధం సవాళ్లతో గడిచిందని, డిమాండ్ పడిపోయి, నిల్వలు పెరిగిపోయాయని పేర్కొంది. 5జీ అప్గ్రేడ్లు, పండుగ సీజన్ అమ్మకాలు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం తదితర అంశాల ఊతంతో ద్వితీయార్ధంలో మార్కెట్ క్రమంగా కోలుకోవడం మొదలుపెట్టిందని వివరించింది. మొత్తం ఫోన్ల మార్కెట్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 52 శాతం దాటిందని, వార్షిక ప్రాతిపదికన 66 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. మరోవైపు, 2023 నాలుగో త్రైమాసికంలో దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 25 శాతం వృద్ధి చెందినట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. మరిన్ని విశేషాలు.. ► స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు ప్రీమియం ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 2023లో రూ. 30,000 పైన రేటు ఉన్న ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల అమ్మకాలు 64 శాతం పెరిగాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ స్కీములు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి ఫైనాన్స్ మీదే కొన్నారు. ► ప్రీమియం సెగ్మెంట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు మరింతగా ఆదరణ పెరగవచ్చు. వాటి అమ్మకాలు 2024లో 10 లక్షలు దాటవచ్చని అంచనా. ► స్మార్ట్ఫోన్లలో ఆడియో–వీడియోపరంగా డాల్బీ అటా్మస్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు మరింతగా పెరగవచ్చు. -
ఐఫోన్ల విక్రయాలు కొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల విపణిలో యాపిల్ కొత్త రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలంలో 25 లక్షల యూనిట్లకుపైగా ఐఫోన్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 34 శాతం అధికంగా సాధించడం విశేషం. ఒక త్రైమాసికంలో భారత్‌లో కంపెనీ ఖాతాలో ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఖరీదైన మోడళ్లకు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెపె్టంబర్ త్రైమాసికంలో భారత్‌లో 17.2 శాతం వాటాతో శామ్సంగ్ తొలి స్థానంలో నిలిచింది. నాలుగు త్రైమాసికాలుగా శామ్సంగ్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ బుధవారం వెల్లడించింది. ఏ, ఎం సిరీస్ ఫోన్లు ఇందుకు దోహదం చేసిందని తెలిపింది. ఇక 16.6 శాతం వాటాతో షావొమీ రెండవ స్థానం ఆక్రమించింది. రూ.30–45 వేల ధరల శ్రేణి విభాగంలో వన్‌ప్లస్ 29 శాతం వాటాతో సత్తా చాటుతోంది. ఫోల్డబుల్ మోడళ్లకు.. ప్రీమియం విభాగం, 5జీ లక్ష్యంగా కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. రూ.45,000 ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ప్రతి త్రైమాసికంలోనూ పెరుగుతూ వస్తోంది. సెప్టెంబర్ క్వార్టర్లో అల్ట్రా ప్రీమియం మోడళ్ల అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 44 శాతం దూసుకెళ్లాయి. సులభ వాయిదాలు, ఇతర ప్రోత్సాహకాలు, నూతన టెక్నాలజీవైపు కస్టమర్ల మొగ్గు ఇందుకు దోహదం చేశాయి. ఫోల్డబుల్ మోడళ్లకు డిమాండ్ దూసుకెళ్తోంది. ఈ విభాగంలోకి కంపెనీలు క్రమంగా ప్రవేశిస్తున్నాయి. అన్ని బ్రాండ్ల అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా ఏకంగా 53 శాతానికి ఎగబాకింది. 10–15 వేల ధరల శ్రేణిలో ఎక్కువ మోడళ్లను కంపెనీలు ప్రవేశపెట్టాయి. వీటిలో 5జీ మోడళ్ల వాటా ఏడాదిలో 7 నుంచి 35 శాతానికి చేరింది. ఆసక్తికర విషయం ఏమంటే 5జీ, అధిక ర్యామ్ (8జీబీ) వంటి కీలక ఫీచర్లు రూ.10,000లోపు సరసమైన స్మార్ట్ఫోన్లకు విస్తరించాయి. -
వన్‌ప్లస్ నుంచి మడత ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో దీని ధర ఎంతంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో ఆధిపత్య చెలాయిస్తున్న శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వన్ ప్లస్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఈ నెల 19న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 ఫోన్‌కు వన్ ప్లస్ గట్టి పోటీదారుగా నిలుస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌లో ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ధర ఎంతంటే భారత మార్కెట్ లో విడుదల కానున్న వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,41,490 (1699 డాలర్లు) ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే వన్ ప్లస్ ఓపెన్ 7.8 అంగుళాల ఓపెన్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, కవర్ డిస్ ప్లే 6.3 అంగుళాలు, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సౌకర్యం ఉండనుంది. -
స్మార్ట్ఫోన్ల మార్కెట్ డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు (తయారీ సంస్థల నుంచి రిటైలర్లకు సరఫరా) 3.1 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 19 శాతం తగ్గాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. రూ. 30,000 లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు గణనీయంగా పడిపోగా, ప్రీమియం.. అల్ట్రా ప్రీమియం కేటగిరీ ఫోన్లు 60–66 శాతం ఎగిశాయి. డిమాండ్ తగ్గుదల, 2022 నుంచి నిల్వ లు పెరిగిపోవడం, వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతుండటం, మార్కెట్ నిరాశావహంగా కనిపిస్తుండటం తదితర అంశాలు క్యూ1లో విక్రయాలు మందగించడానికి కారణమైనట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. దీనితో షిప్మెంట్ల తగ్గుదల వరుసగా మూడో త్రైమాసికంలోనూ కొనసాగగా, క్యూ1లో అత్యధికంగా క్షీణత నమోదైనట్లు వివరించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లలో 5జీ ఫోన్ల వాటా ఏకంగా 43 శాతానికి చేరింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటాతో వరుసగా రెండో త్రైమాసికంలోనూ శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది. టాప్ 5జీ బ్రాండ్‌గా కూడా కొనసాగుతోంది. ఏ సిరీస్ 5జీ ఫోన్లు ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాయి. మొత్తం షిప్మెంట్లలో వీటి వాటా 50 శాతం దాకా నమోదైంది. ఎస్23 సిరీస్ ఆవిష్కరణతో మార్చి క్వార్టర్లో శాంసంగ్ అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్ (ధర రూ. 45,000 పైగా) 247 శాతం వృద్ధి చెందింది. ► యాపిల్ షిప్మెంట్లు 50 శాతం పెరగ్గా మార్కెట్ వాటా 6 శాతంగా నమోదైంది. మొత్తం ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 30,000 స్థాయి) 36 శాతం, అల్ట్రా–ప్రీమియం సెగ్మెంట్లో 62 శాతం వాటా దక్కించుకుంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి కొత్తగా ఫైనాన్స్ స్కీమును ప్రారంభించడం, లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ను ఆఫ్‌లైన్‌లోను గణనీయంగా ప్రమోట్ చేస్తుండటం ఇందుకు దోహదపడింది. ► మార్చి త్రైమాసికంలో షిప్మెంట్లు 3 శాతం క్షీణించినప్పటికీ 17 శాతం మార్కెట్ వాటాతో వివో రెండో స్థానంలో కొనసాగుతోంది. షావో మీ షిప్ మెంట్లు 44 శాతం పడిపోగా, 16 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. ► వన్‌ప్లస్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. క్యూ1లో 72 శాతం వృద్ధి చెందింది. ► స్థానిక బ్రాండ్లలో రూ. 10,000 లోపు ఫోన్ల సెగ్మెంట్లో లావా మెరుగ్గా రాణించింది. 29 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదుగుతున్న మూడో బ్రాండ్‌గా నిల్చింది. ► రూ. 20,000 – 30,000 ధర పలికే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు 33 శాతం క్షీణించగా, రూ. 10,000 – 20,000 సెగ్మెంట్ 34 శాతం తగ్గింది. ఇక రూ. 10,000 లోపు ఫోన్లు 9 శాతం క్షీణత నమోదు చేశాయి. ► వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రమోషనల్ ఆఫర్లు నడిచే సమయంలో డిమాండ్ గణనీయంగా ఉంటోంది. రిపబ్లిక్ డే సమయంలో డిమాండ్ బాగా కనిపించింది. అయి తే సేల్స్ వ్యవధి ముగిసిపోగానే భారీగా పడిపోయింది. విక్రేతలు ప్రస్తుతం కొత్త మోడల్స్‌ను తెచ్చిపెట్టుకోవడం కంటే ఉన్న నిల్వలను వదిలించుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ► 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. వినియోగదారులు అప్‌గ్రేడ్ అవుతుండటంతో 5జీ ఫోన్ల అమ్మకాలు వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లో 43 శాతం వాటాను దక్కించుకున్నాయి. ► రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. 5జీకి అప్‌గ్రేడేషన్ వేగవంతం అవుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, పండుగల సీజన్ మొదలైన వాటి కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో అమ్మకాలు పుంజుకుంటాయని అంచనా. -
సరికొత్త రికార్డ్స్.. 24 గంటల్లో 1.4 లక్షల ఫోన్ల బుకింగ్స్!
దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సత్తా చాటుతోంది. ఆ సంస్థకు చెందిన గెలాక్సీ ఎస్ 23 ఫోన్లు ప్రీ బుకింగ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కరోజులోనే రూ.1400 కోట్ల విలువైన 1.4 లక్షల యూనిట్ల ప్రీమియం ఫోన్లను కొనుగోలు దారులు బుక్ చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. శాంసంగ్ ఫిబ్రవరి 1న గెలాక్సీ ఎస్ 23 సిరీస్‌లోని ‘గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా’ అనే మూడు వేరియంట్లు మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగనున్న ప్రీ బుకింగ్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. రెండు రెట్లు పెరిగి ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లాన్ మాట్లాడుతూ.. గతంలో తాము విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 కంటే రెండు రెట్లు పెరిగి సగటున ఫోన్ ధర సుమారు లక్ష రూపాయలు ఉన్న ఈ ఫోన్లు 24 గంటల్లో 1.4 లక్షల యూనిట్లు ప్రీ బుకింగ్స్ జరిగినట్లు చెప్పారు. ఫిబ్రవరి 23 ప్రీబుకింగ్ కొనసాగింపు ఇక ఈ ఫోన్ల ప్రీ బుకింగ్స్ ఫిబ్రవరి 23వరకు కొనసాగుతాయని చెప్పిన పుల్లాన్ .. శాంసంగ్ ఎస్ 23 సిరీస్ ధరలు రూ.75 వేల నుంచి రూ.1.55లక్షల వరకు ఉన్నాయని అన్నారు. భారత్‌లో తయారీ.. ఎక్కడంటే దేశీయ మార్కెట్లో విడుదలైన శాంసంగ్ ఎస్ 23 ప్రీమియం ఫోన్లు నోయిడా ప్లాంట్‌లో తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇక గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లను మాత్రం వియాత్నం మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారు చేసి.. దిగుమతి అనంతరం భారత్‌లో అమ్మకాలు జరిపినట్లు వెల్లడించారు. -
బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ధర ఎంతంటే!
స్మార్ట్ ఫోన్ యూజర్లను పెంచుకునేందుకు ఇటీవల ప్రముఖ సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఫీచర్ ఫోన్ల తయారీని నిలిపివేసింది. వాటి స్థానంలో బడ్జెట్ ధరల్లో కొనుగోలు దారులకు స్మార్ట్ఫోన్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో రీజనబుల్ ప్రైస్‌తో రోజు దేశీయ మార్కెట్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫోన్ స్పెసిఫికేషన్లు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 జున్ 22 (ఈరోజు మధ్యాహ్నం) భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఫోన్ విడుదలతో గెలాక్సీ ఎఫ్13 ఫీచర్లు సైతం రివిల్ అయ్యాయి.6000 ఏఎంహెచ్ బ్యాటరీ, 5000ఏఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో విడుదలైన ఈ ఫోన్ రెడ్ మీ10 ప్రైమ్, రియల్ మీ నార్జ్ 50ఏ ప్రైమ్, పోకో ఎంపీ3 5జీ ఫోన్లకు కాంపిటీటర్‌గా మారనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోన్ 1080*2,408 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే,4జీబీ ర్యామ్‌తో ఎక్సినోస్ 850 ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5మెగా పిక్సెల్ అల్ట్రావైడ్‌తో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,128జీబీ నుంచి 1టెరా బైట్ వరకు ఇంట్రనల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 ఫోన్ ధర 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టాంగ్ వేరియంట్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫోన్ విడుదలైంది. ఇక ఈ ఫోన్ 4జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ మోడల్ ధర రూ.12,999 ఉండగా నైట్ స్కై గ్రీన్, సన్‌రైజ్ కూపర్, వాటర్ ఫాల్ బ్లూ కలర్లలో లభ్యం కానుండగా.. జూన్ 29నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్‌తో పాటు పలు రిటైల్ స్టోర్లలో లభ్యం కానుంది. గంటలో ఫోన్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కేలా 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. దీంతో పాటు 8జీబీ ర్యామ్‌ను అందిస్తుండగా..దాని కెపాసిటీని పెంచేందుకు ర్యామ్ ప్లస్ టెక్నాలజీని అందిస్తుంది. తద్వారా ఎక్కువ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా ఫోన్ డెడ్ అవ్వకుండా ఈజీగా హ్యాండిల్ చేసుకునే సదుపాయం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 పై ఆఫర్లు బుధవారం విడుదలైన ఈ ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు గూగుల్ నెస్ట్ మినీ, నెస్ట్ హబ్‌లను తక్కువ ధరకే పొంద వచ్చు. చదవండి👉శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే! -
నథింగ్ ఫోన్.. మేడిన్ ఇండియా
న్యూఢిల్లీ: భారత్‌లో విక్రయించే ప్రతి స్మార్ట్‌ఫోన్‌ను స్థానికంగా తయారు చేయనున్నట్టు టెక్నాలజీ కంపెనీ నథింగ్ ప్రకటించింది. ఆడియో ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ సంస్థ స్మార్ట్ఫోన్ల వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్టు ఈ ఏడాది మార్చిలో వెల్లడించింది. తమిళనాడులో స్మార్ట్ఫోన్లు ఉత్పత్తి కానున్నాయి. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌పై సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధిలో నథింగ్ నిమగ్నమైంది. తొలి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) జూలై 12న భారత్‌లో ఆవిష్కరించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పే స్థాపించిన నథింగ్లో గూగుల్ పెట్టుబడి చేసింది. చదవండి: స్టార్టప్‌లకు రైల్వే నిధుల మద్దతు -
భారత్‌కు శాంసంగ్ భారీ షాక్! ఇకపై ఆ ప్రొడక్ట్‌లు ఉండవట!
ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారత్‌కు భారీ షాకిచ్చింది. ఇకపై ఫీచర్ ఫోన్లను ఇండియాలో అమ్మకూడదని నిర్ణయించింది. అయితే స్మార్ట్ ఫోన్ సేల్స్‌ను కొనసాగించనుంది. శాంసంగ్ ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో దేశీయంగా ప్రీమియం,సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ ఎత్తున అమ్మకాలు జరిపింది. అయినా భారత్‌లో ఫీచర్‌ఫోన్ అమ్మకూడదనే నిర్ణయం ఇతర ఫోన్ తయారీ సంస్థల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏదైనా ఇకపై భారత్‌లో శాంసంగ్‌కు చెందిన ఫీచర్ ఫోన్లు కనుమరుగు కానున్నాయి. రూ.15వేల లోపు ఫోన్లే సౌత్ కొరియా దిగ్గజం ఫీచర్ ఫోన్ అమ్మకాలు వద్దనుకున్నా..బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను అమ్మనుంది. ఇందుకోసం శాంసంగ్ మరో రెండు సంస్థలతో సహకారంతో పీఎల్ఐ స్కీం కింద రూ.15వేల లోపు ఉన్న ఫోన్లను తయారు చేయనుంది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.10వేల నుంచి రూ.20 వేల మధ్య ఉన్న ఫోన్ల డిమాండ్ పెరగనుంది. షిప్మెంట్ తగ్గింది ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో భారత్‌లో శాంసంగ్ ఫీచర్ ఫోన్ షిప్మెంట్ తగ్గి 39 శాతంతో సరిపెట్టుకుంది. సప్లయ్ చైన్ సమస్యలు, అధిక రిటైల్ ద్రవ్యోల్బణం కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఫీచర్ ఫోన్ షిప్ మెంట్లో ప్రథమ స్థానంలో ఉన్న శాంసంగ్ కేవలం 12శాతంతో మూడో స్థానానికి పడిపోయింది. శాంసంగ్ సరికొత్త రికార్డ్‌లు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సత్తా చాటింది. ఆ సంస్థ దేశీయంగా విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 22 సిరీస్ ఫోన్ అమ్మకాలతో నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థగా పేరు సంపాదించింది. సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు సైతం 81శాతం అమ్మకాలతో యూజర్లను ఆకట్టుకున్నాయి. ప్రీమియం టూ సూపర్ ప్రీమియం ప్రీమియం సెగ్మెంట్లో అంటే ధర రూ.30వేలకు పైగా ఉన్న స్మార్ట్ ఫోన్లు 38శాతంతో అమ్ముడుపోయాయి. మార్చిలో ధర లక్షకు పైగా ఉన్న గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో 81శాతంతో అమ్మకాలు జరిపినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. చదవండి👉గుడ్‌న్యూస్: అదిరిపోయే డిస్కౌంట్లు, ఐఫోన్ 13పై బంపరాఫర్లు! -
సెకండ్ హ్యాండ్ అంటే మజాక్ కాదు!
దేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్ ఊహించని వేగంతో విస్తరిస్తోంది. కన్సల్టింగ్ ఫర్మ్ రెడ్‌సీర్ అంచనా ప్రకారం ఆర్థిక సంవత్సరం 26 నాటికి దేశీయంగా సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్ విలువ ఏకంగా 10 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోనుంది. ఇక ఫోన్లతో పాటు మొత్తం ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి సెకండ్ హ్యాండ్ మార్కెట్ విలువ 16 శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 11 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను చేరుకుంటుందని అంచనా. వాడేసిన ఫోన్లను రిఫర్బిష్డ్ చేసి రీకామర్స్ పేరుతో పలు సైట్లు విక్రయిస్తున్నాయి. అందుబాటు ధరలో ఫోన్లు వస్తుండటంతో వీటిని కొనేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. 2021 లెక్కల ప్రకారం ఫస్ట్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విలువ ఇండియాలో 15 బిలియన్ డాలర్లు ఉంది. ఇదే సమయంలో సెకండ్ హ్యాండ్ మార్కెట్ విలువ కూడా భారీగానే ఉంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య దేశంలో 55 కోట్లపైకి చేరుకుంది. రీకామర్స్ రంగం దినదినాభివృద్ధి చెందుతున్న పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని రెడ్‌సీర్ చెబుతోంది. అందులో ముఖ్యమైనవి సెకండ్ హ్యాండ్ ఫోన్ల నాణ్యత కాగా కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి తీసుకునే సమయం రెండోవదిగా నిలుస్తోంది. వీటితో పాటు ధరల నిర్ణయించే విషయంలో కూడా పారదర్శకత ఉండటం లేదు. ఈ నాణ్యత, ధరల విషయంలో మెరుగుపడితే సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. చదవండి: సస్పెన్స్‌తో చంపేశారు, ఆ సీక్రెట్‌ను రివిల్ చేసిన సుందర్ పిచాయ్! -
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం..భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ,ఎలక్ట్రిక్ కార్ల ధరలు?!
Smartphones And Laptops Become More Expensive: రష్యా - ఉక్రెయిన్ ల యుద్ధం ఇతర ప్రపంచ దేశాలపై వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌లు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా పెరగన్నాయని ఆర్ధిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ -డీజిల్ ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగనున్నాయని వెలుగులోకి వస్తున్న రిపోర్ట్‌లతో ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. తాజాగా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల ధరలు పెరుగుతుండడం సామాన్యులపై మరింత భారం పడనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లకు అవసరమైన చిప్సెట్ల కొరత తీవ్రంగా ఉండనుంది. ఎందుకంటే? పలు నివేదికల ప్రకారం..ఉక్రెయిన్ యూఎస్‌కు 90శాతం సెమీకండక్టర్ గ్రేడ్ నియాన్‌ను, సెమీకండక్టర్లను తయారు చేసేందుకు ఉపయోగించే అరుదైన లోహం పల్లాడియంను రష్యా అమెరికాకు 35శాతం ఉత్పత్తి చేస్తుంది. అత్యంత ఖరీదైన పల్లాడియం లోహం రష్యాలో లభ్యం కావడంతో.. యుద్ధం కారణంగా రష్యా పల్లాడియం ధరల్ని పెంచే అవకాశం ఉంది. ప్రపంచ చిప్సెట్ సరఫరాలో రష్యా వాటా 45 శాతం. ఉక్రెయిన్, రష్యా నుండి నియాన్, పల్లాడియం సరఫరా ఆ ప్రభావం సెమీకండక్టర్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదే విషయంపై జపాన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉత్పత్తుల సరఫరా తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో యుద్ధం మరింత సంక్షోభం తలెత్తుతుందని జపాన్ చిప్ తయారీదారు తెలిపారు. -
10కోట్ల స్మార్ట్ ఫోన్లే టార్గెట్! ట్రూకాలర్ కీలక నిర్ణయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ యాప్ సైతం ప్రీలోడ్ కానుంది. ఇప్పటి వరకు కస్టమర్లు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. భారత్, ఇండోనేషియా, మలేషియా, లాటిన్ అమెరికా దేశాల్లో కొత్తగా విడుదలయ్యే ఫోన్లలో ఈ సౌకర్యం ఉంటుందని కంపెనీ సోమవారం ప్రకటించింది. రెండేళ్లలో 10 కోట్ల స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ ప్రీలోడెడ్ యాప్‌గా ఉండాలన్నది లక్ష్యమని వివరించింది. ఇందుకోసం మొబైల్స్ తయారీలో ఉన్న ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 22 కోట్ల మంది ట్రూకాలర్ వాడుతున్నారు. -
దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..!
మనదేశంలో స్మార్ట్ ఫోన్ మూడో త్రైమాసిక (జులై,ఆగస్ట్, సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రముఖ ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ ఫలితాలు కేక పెట్టించాయి.యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్‌ను మార్కెట్లో విడుదల చేసినా షావోమీని అధిగమించలేకపోయింది. కానీ ఈ త్రైమాసికంలో యాపిల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా పేరు సంపాదించుకుంది. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ఏమంటోంది.. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం.. మూడవ త్రైమాసికంలో మొత్తం భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 52 మిలియన్ యూనిట్లను దాటాయి. అయితే ఈ ఫలితాల్లో రెడ్మీ 9, రెడ్మీ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతో 22 శాతం వాటాతో షావోమీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షిప్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. 19శాతం షిప్‌మెంట్‌తో శాంసంగ్ భారత్‌లో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఇక ఈ నివేదిక ప్రకారం నార్డ్ సిరీస్ 3 మిలియన్ యూనిట్లు భారత్‌లో డెలివరీ అయినట్లు తేలింది. ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన ఫోన్ క్యూ3 భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లపై కౌంటర్‌పాయింట్ నివేదికలో షావోమీ, శాంసంగ్, వివో, రియల్మీ, ఒప్పో ఫోన్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. షావోమీ 22శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్ఫోన్లు రెడ్మీ9, రెడ్మీ9 పవర్, రెడ్మీ నోట్ 10, రెడ్మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా అగ్రస్థానంలో ఉంది. కొత్తగా విడుదలై.. ఆకట్టుకుంటున్న ఫోన్లు ఇవే భారతదేశంలో 19 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండవ స్థానంలో ఉంది. రూ.10,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉన్న ఫోన్ అమ్మకాల మార్కెట్ వాటా 25 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం42, శాంసంగ్ గెలాక్సీ ఎం 52, శాంసంగ్ గెలాక్సీ ఏ 22, శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ మోడళ్లు 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ బ్రాండ్లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. కొత్తగా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లో భారత స్మార్ట్ ఫోన్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది. క్యూ3లో వివో షేర్ ఎంతంటే క్యూ3 2021లో 15 శాతం మార్కెట్ షేర్‌తో వివో 3వ స్థానంలో నిలిచింది. రియల్మీ 14 శాతం మార్కెట్ వాటా, ఒప్పో10 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో నిలిచాయి. ఆపిల్ మూడవ త్రైమాసికంలో సంవత్సరానికి 212 శాతం వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ అని కౌంటర్ పాయింట్ పేర్కొంది. క్యూ3 55 శాతం వృద్ధిని నమోదు చేయడంతో వన్ ప్లస్ నార్డ్ సిరీస్‌కు భారతదేశంలో మంచి ఆదరణ లభించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. కొత్తగా ప్రారంభించిన వన్ ప్లస్ నార్డ్2, నార్డ్ సీఈ 5జీలు వన్ ప్లస్ మార్కెట్లో రాణించడానికి కారణమైనట్లు వెల్లడించింది. క్యూ3 లో మొదటిసారిగా 5G స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 10 మిలియన్ల మార్కును అధిగమించాయని నివేదికలో చెప్పింది. వివో 5జీలో టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా చెప్పబడింది. శామ్సంగ్, వన్‌ప్లస్, రియల్మీ 5జీ ఫోన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా వై33ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. ధర రూ.17,990 ఉంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్సెల్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఫన్‌టచ్ ఓఎస్ 11.1, బిల్ట్ ఇన్ బ్లూలైట్ ఫిల్టర్, 8 జీబీ ర్యామ్, 4 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సూపర్ నైట్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. చదవండి : ఈ టెక్నాలజీని ఒకేసారి ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా ఉంటాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అంచనా వేస్తోంది. విక్రయాలు 14 శాతం అధికమై 17.3 కోట్ల యూనిట్లకు చేరతాయని వెల్లడించింది. జూలై–డిసెంబరు కాలంలోనే 10 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. కోవిడ్–19 పరిమితులు ఎత్తివేసిన తర్వాత జూన్ మొదలుకుని కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంది. ఆగస్ట్–నవంబర్ మధ్య అమ్మకాల హవా ఉంటుంది. చైనా తర్వాత స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి వినియోగదార్లు అప్‌గ్రేడ్ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. ఇక కొన్నేళ్లలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 20 కోట్ల మార్కును దాటనుంది. 2019లో దేశంలో 15.8 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. గతేడాది స్వల్పంగా 4 శాతం తగ్గి 15.2 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంచనాలను మించి..: సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ అంచనాలను మించి మార్కెట్ వేగంగా పుంజుకుంది. 2021 జనవరి–జూన్ కాలంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. కోవిడ్ కేసులు నియంత్రణలో ఉండి, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కస్టమర్లలో సెంటిమెంట్ బలపడుతుందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. కాగా, 2020లో 5జీ మోడళ్ల వాటా కేవలం 3 శాతమే. ఈ ఏడాది ఇది 19 శాతం వాటాతో 3.2 కోట్ల యూనిట్లను తాకనుంది. 5జీ చిప్సెట్ చవక కావడం, స్మార్ట్ఫోన్ల ధర తగ్గడంతో ఈ విభాగంలో అమ్మకాలు దూసుకెళ్లనున్నాయి. ఎంట్రీ లెవెల్లో సగటు ధర ఏడాదిలో 40 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ.15,000లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' -
మనదేశంలో ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ కాలంలో 3.4 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 86 శాతం వృద్ధి నమోదైంది. షావొమీ 29.2 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలిచింది. శామ్సంగ్, వివో, రియల్మీ, ఒప్పో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర క్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతం అధికమై రూ.13,700లకు చేరింది. ధరల పెరుగుదల, 5జీ మోడళ్ల రాకతో సగటు విక్రయ ధర రానున్న త్రైమాసికాల్లో దూసుకెళ్లనుంది. 2020తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో వృద్ధి 9 శాతంలోపే ఉంటుందని ఐడీసీ అంచనా వేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు, సరఫరా అడ్డంకులు, పెరుగుతున్న విడిభాగాల ధరలు, ద్రవ్యోల్బణం ఇందుకు కారణమని వెల్లడించింది. వినియోగదార్లు ఫీచర్ ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవడం, తక్కువ, మధ్యస్థాయి ఫోన్లు వాడుతున్నవారు మెరుగైన స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు, 5జీ మోడళ్ల వెల్లువతో 2022లో మార్కెట్ తిరిగి పుంజుకుంటుందని వివరించింది. ఇక 5జీ మోడళ్ల అమ్మకం విషయంలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. చైనా, యూఎస్, జపాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో 50 లక్షల 5జీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 5జీ మోడల్ సగటు విక్రయ ధర రూ.30,500 నమోదైంది. ఈ ఏడాది చివరినాటికి రూ.15,000లోపు ధర గల మోడళ్లు వెల్లువెత్తుతాయని ఐడీసీ అంచనా వేస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే, అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా. -
5జీ స్మార్ట్‌ఫోన్ రూ.10,000 లోపే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరోసారి వేడెక్కనుంది. 3జీ, 4జీ మొబైల్స్ విషయంలో చైనా కంపెనీల దూకుడుతో హేమాహేమీ బ్రాండ్లు కనుమరుగైన సంగతి తెలిసిందే. ఇప్పుడు 5జీ స్మార్ట్ఫోన్ల వంతు రాబోతోంది. ఈ విభాగంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్న రియల్మీ రూ.10,000 లోపు ధరలో మోడళ్లను తీసుకురానున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది ఇవి భారత్‌లో సాకారమవుతాయని రియల్మీ వైస్ ప్రెసిడెంట్, ఇండియా, యూరప్ సీఈవో మాధవ్ సేథ్ 5జీ సమ్మిట్ సందర్భంగా వెల్లడించారు. క్రమంగా రూ.7,000 ధరలోనూ మోడళ్లను తీసుకొస్తామని పేర్కొన్నారు. మూడేళ్లలో 10 కోట్ల మంది కస్టమర్లకు చవక 5జీ స్మార్ట్ఫోన్లను అందించాలన్నది సంస్థ లక్ష్యం. పరిశోధనకు రూ.2,100 కోట్లు.. అంతర్జాతీయంగా 5జీ పరిశోధన, అభివృద్ధికై రూ.2,100 కోట్లకుపైగా వెచ్చించనున్నట్టు మాధవ్ వెల్లడించారు. భారత్ సహా వివిధ దేశాల్లో ఏడు ఆర్అండ్డీ సెంటర్లను ఈ ఏడాది నెలకొల్పనున్నట్టు తెలిపారు. 90 శాతం పరిశోధన బృందం ఈ విభాగంపైనే ఫోకస్ చేసిందన్నారు. ‘10–15 మార్కెట్లలో 5జీ నెట్వర్క్ పైలట్ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకుంటాం. మూడు నాలుగేళ్లలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ అభివృద్ధి రెండవ శకంలోకి అడుగుపెడుతుంది. ఆ సమయానికి ఉపకరణాలు చవకగా లభిస్తాయి. తొలి శకంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ అధిక ధరల్లో లభించే ఫ్లాగ్షిప్ మోడళ్లకే పరిమితమయ్యాయి. 5జీ శ్రేణిని విస్తరిస్తాం. గతేడాది 22 దేశాల్లో 14 రకాల 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టాం. మొత్తం మోడళ్లలో వీటి వాటా 40 శాతం. 2022 నాటికి 5జీ మోడళ్లు 20 దాటతాయి. తద్వారా వీటి వాటా 70 శాతానికి చేరుకుంటుంది’ అని వివరించారు. టెలికం కంపెనీలకు బూస్ట్.. నెట్వర్క్ అందుబాటులో లేనప్పటికీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయి. 5జీ సేవలు త్వరితగతిన ప్రవేశపెట్టేందుకు టెలికం కంపెనీలకు ఈ అంశం బూస్ట్‌నిస్తుందని క్వాల్కామ్ ఇండియా, సార్క్ వైస్ ప్రెసిడెంట్ రాజెన్ వగాదియా తెలిపారు. 5జీ నెట్వర్క్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చే సమయానికి అధిక మొత్తంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ దర్శనమిస్తాయని అన్నారు. ఆధునిక తరం సాంకేతిక పరిజ్ఞానం మెరుగైన గేమింగ్, కెమెరా అనుభూతి ఇస్తాయని కస్టమర్లకు అవగాహన ఉందన్నారు. -
5జీ స్మార్ట్‌ఫోన్ కావాలంటున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ రంగంలో భారత్‌లో 5జీ మోడళ్లకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ పరిశోధన ప్రకారం.. దేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణించే అంశాలలో 5జీ ఒకటని 83 శాతం మంది తెలిపారు. ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వాడుతున్న అయిదుగురిలో ముగ్గురు తదుపరి తరం సాంకేతికతకు అప్‌గ్రేడ్ అవ్వాలని చూస్తున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఒప్పో బ్రాండ్‌ను 81 శాతం మంది ఇష్టపడితే, శామ్సంగ్ వైపు 79 శాతం మంది మొగ్గుచూపారు. భారత్‌తోపాటు చైనా, పశ్చిమ యూరప్‌లో ఈ సర్వే చేపట్టారు. 18–35 ఏళ్ల వయసున్న వారు పాలుపంచుకున్నారు. భారత్ నుంచి 3,000 మంది, చైనా 1,000, పశ్చిమ యూరప్‌కు చెందిన 1,000 మంది ఇందులో పాల్గొన్నారు. (చదవండి: బడ్జెట్లో మోటో 5జీ ఫోన్) 5జీ సేవలు అందుబాటులో ఉన్నచోట నాణ్యమైన వీడియో కాల్స్, వేగంగా డౌన్లోడ్స్, అల్ట్రా హై డెఫినిషన్ వీడియోలను వీక్షిస్తున్నారు. కస్టమర్ల సంతృప్తి 80 శాతముంది. వీడియో కంటెంట్ పెరుగుదలకు, వినియోగానికి ఈ టెక్నాలజీ దోహదం చేస్తోంది. చైనాలో హువావే బ్రాండ్‌కు 91% మంది, యాపిల్‌కు 58% మొగ్గుచూపారు. పశ్చిమ యూరప్‌లో శామ్సంగ్కు 88%, హువావే బ్రాండ్‌కు 65% సై అన్నారు. చిప్సెట్ సంస్థలు 5జీ పైనే పెట్టుబడులు చేస్తున్నాయి. -
స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల భారీ పతనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఏప్రిల్-జూన్ కాలంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు భారీగా పడిపోయాయి. ప్రధానంగా చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి, దక్షిణకొరియా సంస్థ శాంసంగ్ అనూహ్య పతనాన్ని చవిచూశాయి. కెనాలిస్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో 48శాతం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు క్షీణించాయి. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 17.3 మిలియన్ స్మార్ట్ఫోన్లు మాత్రమే ఎగుమతయ్యాయి. అంతకుముందు సంవత్సరంలో ఎగుమతులు 33 మిలియన్లు యూనిట్లుగా ఉంది. ఈ ప్రభావం టాప్10 బ్రాండ్లలో ఒకటైన ఆపిల్‌పై తక్కువగానూ, శాంసంగ్ ఎక్కువగానూ ప్రభావితమైందని నివేదిక పేర్కొంది. అయితే మార్కెట్ లీడర్ షావోమి ఎగుమతులు భారీగా క్షీణించినప్పటికీ, తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. శాంసంగ్ మార్కెట్ వాటా 60 శాతం పడిపోయింది. అంతకుముందు 22.1శాతం నుంచి ప్రస్తుతం 16.8 శాతానికి క్షీణించింది. వియత్నాం వెలుపల తన అతిపెద్ద ఉత్పాదక కర్మాగారం మూసివేయడం ఈ త్రైమాసికంలో పెద్ద దెబ్బ అని శాంసంగ్ వెల్లడించింది. షావోమి మార్కెట్ వాటా 48 శాతం క్షీణతతో 30.9 శాతానికి చేరింది. గత ఏడాది ఇది 31.3 శాతంగా ఉంది. వివో ఎగుమతులు కూడా 36 శాతం పడిపోయాయి. అయితే దాని మార్కెట్ వాటా అంతకు ముందు సంవత్సరం 17.5 శాతం నుండి 21.3 శాతానికి పెరిగింది. రియల్‌మిని అధిగమించి ఒప్పో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. ఒప్పో ఎగుమతులు 27 శాతం తగ్గాయి. రియల్మీ ఎగుమతులు 35 శాతం పడిపోగా, ఆపిల్ ఎగుమతులు 20 శాతం క్షీణతను నమోదు చేశాయి. లాక్డౌన్ సడలింపుల తరువాత డిమాండ్ స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, దేశీయ స్టార్ట్‌ఫోన్ మార్కెట్ ఇంకా ఇబ్బందుల్లోనే ఉందని కెనాలిస్ ఎనలిస్ట్ మధుమితా చౌదరి తెలిపారు. లాక్డౌన్, ఉత్పత్తి ప్లాంట్లు మూత, సిబ్బంది కొరతతో స్మార్ట్‌ఫోన్ సంస్థలు కష్టాలు పడుతున్నాయని దీనికి తోడు తయారీ కొత్త నిబంధనలు కూడా ప్రభావితం చేశాయన్నారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ షావోమి, ఒప్పో, వివో, రియల్‌మిపై ప్రభావం తక్కువగా ఉంటుందని మరో విశ్లేషకుడు అద్వైత్ మార్దికర్ వ్యాఖ్యానించారు. ఎందుకటే ధరల విషయంలో శాంసంగ్, నోకియా, ఆపిల్ పోటీ ఇవ్వలేకపోతున్నాయన్నారు. -
అయిదేళ్లలో 10 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి భారత్‌లో రికార్డు అమ్మకాలను సొంతం చేసుకుంది. గత ఐదేళ్లలో భారతదేశంలో 10 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్లను షిప్పింగ్ చేశామని షావోమి శుక్రవారం ప్రకటించింది. ఆరంభంనుంచి లక్షలాది ఎంఐఫ్యాన్స్ నుంచి తమకు లభిస్తున్న ఆదరణకు ఇది నిదర్శనమని కంపెనీ వ్యాఖ్యానించింది. తమకంటే ముందు మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నా తాము సాధించిన ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించలేకపోయామని షావోమి ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. ఇందుకు తమ వినియోగదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ సాధించిన ఈ ఘనతను ఉద్యోగులతో పంచుకున్నారు. అంతేకాదు తమ టీమ్ అంతా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్న వీడియోను ఒకదాన్ని ట్విటర్ లో షేర్ చేశారు. క్యూ 3 2014 - జూలై 2019 మధ్య 100 మిలియన్ల మైలురాయిని షావోమి సాధించినట్లు అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. ముఖ్యంగా రెడ్మి ఎ, రెడ్మి నోట్ సిరీస్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రెండు స్మార్ట్ఫోన్లుగా నిలిచాయని పేర్కొంది. షావోమి వరుసగా ఎనిమిది త్రైమాసికాలలో భారతదేశంలో అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఐడీసీ ప్రకారం 2019 క్యూ 2 లో 28.3 శాతం మార్కెట్ వాటాను కలిగి వుంది. 2019 క్యూ 2లోరెడ్‌మి 6 ఎ, రెడ్మి నోట్ 7 ప్రో అత్యధికంగా అమ్ముడైన రెండు స్మార్ట్ఫోన్లుగా నిలిచాయి. 100 Million smartphones in 5 years! 💯 Fastest brand to reach 100M mark! 🥳 Thank you all for your love & support 🙏 Watch our amazing @XiaomiIndia team video here: https://t.co/eVrLj0JueZ RT with #100MillionXiaomi & #XiaomiIndia hashtags (tag me!) & win 100 #Xiaomi goodies.😀 https://t.co/oYubBj3x48 pic.twitter.com/jLOKb3GAHt — #MiFan Manu Kumar Jain (@manukumarjain) September 6, 2019 -
దేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ‘స్విచ్ ఆఫ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీకు గుర్తుందా.. దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు రూ.5 వేలలోపే స్మార్ట్ఫోన్లను అందించి భారత్‌లో సంచలనం సృష్టించాయి. ధరల పరంగా, ఫీచర్లతో దిగ్గజ బ్రాండ్లకు వణుకు పుట్టించాయి. ఒకానొక దశలో మొత్తం మార్కెట్లో దేశీయ బ్రాండ్లదే సింహభాగం. ఇదంతా గతం. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దేశీయ బ్రాండ్లు కనుమరుగయ్యాయి. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అనూహ్యంగా విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు రిటైల్ స్టోర్లలో ఎంత కాదన్నా 30కిపైగా బ్రాండ్ల ఫోన్లు లభించేవి. ఇప్పుడీ సంఖ్య 10లోపే పరిమితం అయిందంటే అతిశయోక్తి కాదు. అది కూడా పరాయి దేశానికి చెందిన బ్రాండ్లే ఉంటున్నాయి. దేశీయ మొబైల్ బ్రాండ్స్ చాలామటుకు యాక్సెసరీస్ వ్యాపారంలో భవిష్యత్‌ను వెతుక్కుంటున్నాయి. ఇదీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) లెక్కల ప్రకారం భారత్‌లో 2018లో 14.23 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 14.5 శాతం అధికం. ఇప్పటి వరకు దేశంలో ఈ స్థాయి అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. ఇక ఫీచర్ ఫోన్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ 8.8 కోట్లకు చేరుకున్నాయి. స్మార్ట్‌ఫోన్స్ యూనిట్ల పరంగా 2018లో షావొమీ(28.9 శాతం), శామ్సంగ్(22.4), వివో(14.2), ఒప్పో(7.2 శాతం) వాటాను దక్కించుకున్నాయని ఐడీసీ చెబుతోంది. వన్‌ప్లస్, లెనోవో, మోటో, హానర్, నోకియా తదితర బ్రాండ్లు వీటితో పోటీపడుతున్నాయి. రెనో పేరుతో ఒప్పో, ఐక్యూ పేరుతో వివో సబ్ బ్రాండ్లను భారత్‌లో పరిచయం చేయబోతున్నాయి. పోకో సబ్ బ్రాండ్‌ను షావొమీ, రియల్మీ సబ్ బ్రాండ్‌ను ఒప్పో ఇప్పటికే రంగంలోకి దింపాయి. 2019లో స్మార్ట్‌ఫోన్ విపణి వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని శామ్సంగ్ ఇండియా జీఎం ఆదిత్య బబ్బర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సంఖ్యా పరంగా మార్కెట్ పెద్దది అవడం, అప్‌గ్రేడ్ సైకిల్ మందగించడం ఇందుకు కారణమని చెప్పారు. ఎందుకిలా జరిగిందంటే.. గతంలో రూ.6 వేలలోపు స్మార్ట్ఫోన్ల హవా ఉండేది. ఇప్పుడు వీటి అమ్మకాలు 70 శాతంపైగా పడిపోయాయి. 2017 వరకు రూ.10 వేల లోపు విభాగంలో దేశీ బ్రాండ్లు తమ సత్తా చాటాయి. ఇప్పుడు శామ్సంగ్ సహా విదేశీ దిగ్గజ కంపెనీలు ఈ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో మోడళ్లను తీసుకు రావడంతో మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆన్లైన్లో ఎక్స్‌క్లూజివ్ మోడళ్లతోనూ ఈ కంపెనీలు క్రమంగా సేల్స్ పెంచుకున్నాయి. ఇక్కడ ఇంకో విషయమేమంటే రూ.15 వేలలోపు శ్రేణిలో సేల్స్ 60 శాతం ఉంటున్నాయి. కారణాలేవైనా భారత స్మార్ట్‌ఫోన్ విపణి నుంచి ప్రీమియం బ్రాండ్లు అయిన హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రీ, సోనీ తప్పుకున్నాయి. భారత్‌లో ఆపిల్‌కు ఆదరణ తగ్గకపోవడం విశేషం. శామ్సంగ్ దక్షిణ కొరియా కంపెనీ కాగా, మిగిలిన టాప్–3 కంపెనీలు చైనాకు చెందినవి. తమ స్టోర్లలో ప్రస్తుతం డిమాండ్ ఉన్న 8–10 విదేశీ బ్రాండ్ల మోడళ్లు మాత్రమే అమ్మకానికి ఉంచినట్టు హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ చెప్పారు. -
షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీక్
చైనా మొబైల్ మేకర్ షావోమి మరో స్మార్ట్‌ఫొన్ తీసుకురానుంది. తొలిసారి వాటర్ డ్రాప్ నాచ్‌తో ఎంఐ ప్లే పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది. అయిదే విడుదలకు ముందే ఈ డివైస్ ఫీచర్లు, ప్రత్యేకతలు నెట్లో లీక్ అయ్యాయి. ఎంఐ ప్లే సిరీస్‌లో మొదటిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. షావోమి దీనికి సంబంధించిన టీజర్‌ను వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేసింది. దీని ధర వివరాలను ప్రకటించకపోయినప్పటికీ 3, 4, 6జీబీ వెర్షన్స్‌లో బ్లూ, రెడ్, బ్లాక్, వైట్, రోజ్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. ధర సుమారు రూ..19,900 గా ఉండనుందని అంచనా. షావోమి ఎంఐ ప్లే ఫీచర్లు 5.84 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 3/4/6 జీబీ ర్యామ్ 32/64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 12 +12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. -
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రారాజు ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షావోమి తానే కింగ్‌నంటూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) డేటా ప్రకారం వరుసగా నాల్గవసారి కూడా తన అత్యున్నత స్థానాన్ని నిలబెట్టుకుంది. 2018 రెండవ త్రైమాసికంలో దేశంలో 29.7 శాతం వాటాతో ఈ ఘనతను దక్కించుకుంది. 107.6 శాతం వృద్ధితో కోటి స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విక్రయించింది. అలాగే ఆన్లైన్ మార్కెట్లో కూడా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సెగ్మెంట్లో షావోమి 55.6 శాతం వాటా కైవసం చేసుకుంది. ఆన్లైన్ మార్కెట్లో వరుసగా ఏడవ క్వార్టర్లో ఈ ఘనతను సాధించింది. ఈ క్వార్టర్లో రెడ్ మీ 5ఏ, రెడ్ మి నోట్ ప్రో, రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 డివైస్ల టాప్ విక్రయాలతో ఈ రికార్డును దక్కించుకుంది. అయితే శాంసంగ్ మాత్రం రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. 23 శాతం మార్కెట్ షేర్‌తో 80 లక్షల స్మార్ట్ఫోన్లను షిప్మెంట్ చేసింది. ఐడిసి ప్రకారం, భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 20శాతం వృద్ధిని సాధించింది. 4.2 మిలియన్ల యూనిట్లు, 12.6 శాతంతో వివో మూడవ స్థానానంలో నిలిచింది. కాగా భారత మార్కెట్లోకి మొత్తం 33.5 మిలియన్ యూనిట్లు వచ్చాయి బలమైన ఉత్పత్తులతో ఆన్లైన్ బ్రాండ్ విక్రయాలు, ప్రత్యేకమైన లాంచింగ్‌ల ద్వారా ఈ వృద్ది సాధించినట్టు ఐడీసి వ్యాఖ్యానించింది. 2018లో చిన్న సంస్థలతో పోలిస్తే టాప్ 5 బ్రాండ్స్ 79 శాతం విక్రయాలు సాధించాయని ఐడీసీ ఇండియా అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి పేర్కొన్నారు.