Southampton Test
-
WTC Final: ‘ఒక్క గంట ఆట, ఇమేజ్ మొత్తం డ్యామేజ్’
ముంబై: తుది సమరంలో గెలిస్తేనే అది అసలైన విజయమని, మిగతా ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా ఏం ఉపయోగం లేదని ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపై విశ్లేషిస్తూ ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డే నాడు ఒక్క సెషన్ టీమిండియా కొంపముంచిందని ఆయన పేర్కొన్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ హోదా కోసం కోహ్లీ సేన రెండేళ్లుగా పడిన కష్టం, సాధించిన విజయాలు ఆ ఒక్క సెషన్‌తో కనుమరుగయ్యాయని వెల్లడించాడు. గెలిచిన ట్రోఫీల ఆధారంగానే జట్లు, కెప్టెన్ల పేరు ప్రఖ్యాతులు చరిత్రలో నిలబడుతాయని, అంతిమ యుద్ధం గెలవకపోతే ఎంత మందిని ఓడించినా లాభం లేదని వ్యాఖ్యానించాడు. రిజర్వ్‌డే రోజు ఎలాగైనా ఫలితం సాధించాలనే అత్యుత్సాహంతో టీమిండియా ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. ఆఖరి రోజు తొలి సెషన్లో జాగ్రత్తగా ఆడాలని నిపుణులు హెచ్చరించినప్పటికీ.. కోహ్లీ, పుజారాలు అలక్ష్యంగా వికెట్ పారేసుకోవడంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టుకోల్పోయిందని, గత ఐదేళ్లుగా టెస్ట్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న టీమిండియా కేవలం ఒక్క గంట ఆటతో ఆ ఇమేజ్ మొత్తాన్ని నాశనం చేసుకుందని పేర్కొన్నాడు. కాగా, రిజర్వ్‌డే రోజు కోహ్లీ, పుజారా ఔటయ్యాక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 32 పరుగుల ఆధిక్యాన్ని మినహాయిస్తే న్యూజిలాండ్ లక్ష్యం 138 పరుగులకు చేరింది. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ (52), టేలర్ (47) అద్భుతంగా పోరాడి తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. చదవండి: Michael Vaughan: ‘అలా అయితే భారత్‌ను ఓడించడం కష్టమే’ -
కెప్టెన్ కోహ్లీని ఘోరంగా అవమానించిన కివీస్ వెబ్సైట్
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి తల్లడిల్లిపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో ఘోర అవమానం జరిగింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యాక, అతనిపై ముప్పేట దాడి మొదలైంది. ఇంటా బయటా అన్న తేడా లేకుండా మాజీ క్రికెటర్లు, అభిమానులు అతని కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత అటతీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇలా విమర్శిస్తున్న వారు టీమిండియా అభిమానులో లేక మాజీ క్రికెటర్లో అయితే అది వేరే విషయం. వారి విమర్శలకు, ఆరోపణలకు ఓ అర్ధం ఉంది. View this post on Instagram A post shared by The ACC (@theaccnz) కానీ, న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ వెబ్సైట్ TheAccNZ ఓ పోస్టులో టీమిండియా సారధిని ఘోరంగా అవమానించడం ప్రస్తుతం టీమిండియా అభిమానులను కలచి వేస్తుంది. ముఖ్యంగా కోహ్లీ అభిమానులకు ఈ విషయం అస్సలు మింగుడుపడడం లేదు. కోహ్లీని అవమానకర రీతిలో చూపించిన ఆ వెబ్‌సైట్‌పై నిప్పులు చెరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌కు చెందిన సదరు వెబ్సైట్, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలయ్యాక ఓ ఫోటోను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఒక మహిళ.. బెల్ట్ తో ఓ మనిషిని పట్టుకుని ఉంటుంది. ఆ మహిళను కైల్ జేమీసన్తో పోలస్తూ.. ఆ మనిషిని కోహ్లీతో పోల్చింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు ముఖ్యంగా కోహ్లీ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ వెబ్‌సైట్‌ను టార్గెట్ చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ రెండుసార్లూ జేమీసన్ బౌలింగ్‌లోనే ఔటవడంతో ఆ వెబ్సైట్ ఈ నీచానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. కోహ్లీని అవమానించినందుకు గాను ఆ వెబ్‌సైట్‌తో పాటు న్యూజిలాండ్ మొత్తాన్ని చీల్చిచెండాతున్నారు. కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ని అవమానించడం తగదని కొందరు హెచ్చరిస్తుంటే, కొందరేమో వ్యక్తిగత దూషణలకు దిగారు. టీమిండియా అభిమానులు తలచుకుంటే ఆ వెబ్‌సైట్‌కు నామారూపాలు లేకుండా చేస్తారని వార్నింగ్ ఇస్తున్నారు. మరికొందరైతే ఇలాంటి చర్యల వల్ల న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఉన్న మంచి ఇమేజ్ మసకబారుతుందని కామెంట్ చేస్తున్నారు. ఇంకొంత మంది ఫ్యాన్స్.. జేమీసన్‌ను మహిళతో పోల్చుకుని తమను తామే దిగజార్చుకున్నారని కౌంటర్ వేస్తున్నారు. చదవండి: ‘పంత్ ఆ గీతను ఉల్లంఘించాడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే’ -
‘పంత్ ఆ గీతను ఉల్లంఘించాడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే’
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపై భారత మాజీ క్రికెటర్లు ముప్పేట దాడి మొదలుపెట్టారు. ఒకొక్కరూ ఒకొక్క క్రికెటర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు చురకలంటించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ, పుజారా ఔటైన సమయంలో పరిస్థితులు (పిచ్, వాతావరణం) వేరుగా ఉన్నాయని, కానీ పంత్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయానికి పరిస్థితులు చక్కబడ్డాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పంత్ ఘోరంగా విఫలమయ్యాడని విమర్శలు ఎక్కు పెట్టాడు. ఆఖరి రోజు తొలి 10 ఓవర్లలో పిచ్ అనూహ్యంగా స్పందిస్తుందని తెలిసి కూడా కోహ్లీ, పుజారాలు నిర్లక్ష్యం వహిస్తే, పంత్ పిచ్ నిర్జీవంగా మారాక కూడా వికెట్ పారేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టాడు. అప్పటికే ఒకటి, రెండు సార్లు లైఫ్‌లు లభించినా.. పంత్ తేరుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతంలో చాలా సందర్భాల్లో పంత్ ఇంతకంటే చాలా మెరుగ్గా ఆడాడని, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆఖరి రోజు ఆటలో మాత్రం తేలిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వదలక పోతే వేటు తప్పదని హెచ్చరించాడు. నిర్లక్ష్యానికి, అజాగ్రత్తకు మధ్య ఓ సన్నని గీత ఉంటుందని, పంత్.. దానిని ఉల్లంఘించాడని మొట్టికాయలు వేశాడు. ఎన్ని సార్లు చెప్పినా నిర్లక్ష్యపు షాట్లు ఆడి వికెట్ పారేసుకుంటున్నాడని, ఇకనైనా మేలుకోకపోతే గతంలో చాలా మంది స్టార్ క్రికెటర్లకు పట్టిన గతే అతని కూడా పడుతుందని హెచ్చరించాడు. చక్కటి డిఫెన్స్‌తోపాటు వైవిధ్యమైన షాట్లు కొట్టగల నైపుణ్యం ఉన్నప్పటికీ.. షాట్ సెలక్షన్ విషయంలో తప్పులు చేస్తూనే ఉన్నాడని పేర్కొన్నాడు. చదవండి: WTC 2021-23: టీమిండియా షెడ్యూల్ ఖరారు.. ఇంగ్లండ్ సిరీస్‌తో షురూ -
‘జడ్డూను అలా ఎలా తీసుకుంటారు’.. మంజ్రేకర్ వ్యంగ్యాస్త్రాలు
ముంబై: టీమిండియా టాప్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. తాజాగా ముగిసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో జడేజా దారుణంగా విఫలం కావడంతో అతనిపై విమర్శనాస్త్రాలు సంధించాడు. మ్యాచ్‌కు ముందు పరిస్థితుల దృష్ట్యా జడేజాను ఆల్‌రౌండర్ కోటాలో కాకుండా బ్యాట్స్‌మెన్ స్థానం కోసం ఎంపిక చేశారని, కానీ టీమిండియా యాజమాన్యం చేసిన ఆ ప్రయోగంతో టీమిండియా నిండా మునిగిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌ను బ్యాట్స్‌మెన్ కోటాలో ఎలా తీసుకుంటారని జడేజాను ఉద్దేశించి విమర్శించాడు. తుది జట్టు ఎంపిక సమయానికి వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అటువంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్‌ను కాకుండా జడేజాను ఆడించడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఆకాశం మేఘావృతమై, వర్షం వల్ల మ్యాచ్ ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమైనా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం చర్చనీయాంశమని పేర్కొన్నాడు. పిచ్ పొడిగా ఉండి, స్పిన్ అయ్యే ఛాన్స్ ఉంటే అశ్విన్‌తో పాటు జడేజాను తీసుకోవడంలో అర్థం ఉందని, కానీ ఆ పరిస్థితులు ఏకోశానా లేనప్పటికీ జడేజాను ఎంపిక చేయడం అర్ధరహితమని వెల్లడించాడు. ఈ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తుందని అన్నాడు. జడేజాను బ్యాట్స్‌మెన్ కోటాలో జట్టులోకి తీసుకోవాల్సి వస్తే.. అతని కంటే మెరుగైన, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి వైపు మొగ్గు చూపాల్సిందని అభిప్రాయపడ్డాడు. జడేజా స్థానంలో విహరిని తీసుకుని ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని, ఒత్తిడి సమయాల్లో జడేజా కంటే విహారి చాలా బెటర్ అని, ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైందని పేర్కొన్నాడు. జడేజా బ్యాట్స్‌మెనా.. లేక బౌలరా అన్న విషయం జట్టు యాజామన్యమే తేల్చుకోలేని పరిస్థితిలో ఉందని ఆరోపించాడు. ఈ విషయంలో టీమిండియా వ్యవహరిస్తున్న తీరుకు తాను వ్యతిరేకమని తెలిపాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్లో జడేజా.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి.. తొలి ఇన్నింగ్స్‌లో 15, రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే ఐసీసీ ఇటీవల విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జడ్డూ.. ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. చదవండి: WTC Final: సోనూ భాయ్.. విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపండి ప్లీజ్..! -
WTC Final: టీమిండియా ఓటమికి ఆ ఇద్దరే కారణం: టెండూల్కర్
ముంబై: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి గల కారణాలను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు. ప్రపంచపు తొలి టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించిన న్యూజిలాండ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. కోహ్లీ సేన ఓటమికి గల కారణాన్ని తెలియజేశాడు. రిజర్వ్ డే ఆటలో 10 బంతుల వ్యవధిలోనే కెప్టెన్ కోహ్లీ, పుజారాల వికెట్లు కోల్పోవడం భారత ఓటమికి ప్రధాన కారణమని ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డాడు. ఆ ఇద్దరు బాధ్యతాయుతంగా ఆడి ఉంటే భారత్ కనీసం డ్రాతోనైనా గట్టెక్కేదని, టీమిండియా ఓటమికి వారిద్దరే పరోక్షంగా కారకులయ్యారని తెలిపాడు. చివరి రోజు తొలి 10 ఓవర్ల ఆట చాలా కీలకమని తాను చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించాడు. Congrats @BLACKCAPS on winning the #WTC21. You were the superior team.#TeamIndia will be disappointed with their performance. As I had mentioned the first 10 overs will be crucial & 🇮🇳 lost both Kohli & Pujara in the space of 10 balls & that put a lot of pressure on the team. pic.twitter.com/YVwnRGJXXr — Sachin Tendulkar (@sachin_rt) June 23, 2021 10 బంతుల వ్యవధిలో కోహ్లీ, పుజారాల వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు తీవ్ర ఒత్తిడికి లోనైందని సచిన్ ట్వీట్ చేశాడు. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 64/2తో రిజర్వ్ డే ఆట కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్ (41) టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బ కొట్టాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 45.5 ఓవర్లలో 2 వికెట్లక నష్టానికి 140 పరుగులు చేసి, టెస్ట్ ఫార్యాట్‌లో జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో విలియమ్సన్ సారధ్యంలోని బ్లాక్ క్యాప్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుండగా, టీమిండియాపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: అక్కడ కోహ్లీ సేన తర్వాత మాకే ఎక్కువ క్రేజ్.. -
WTC Final: ఇండియాలో కోహ్లీ సేన తర్వాత మాకే క్రేజ్ ఎక్కువ..
సౌథాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీ సేనపై గెలుపు ఓ ప్రత్యేక అనుభూతి అని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. టీమిండియాపై గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించాడు. భారతీయులకు కోహ్లీ సేన తర్వాత తామంటేనే ఎక్కువ క్రేజ్ అని చెప్పుకొచ్చాడు. క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ తొలిసారిగా ఓ ప్రపంచ టైటిల్‌ను గెలవడం చాలా ప్రత్యేకమని, ఈ గెలుపు కోసం 22 మంది ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చాలా కష్ట పడ్డారని తెలిపాడు. "బిట్స్ అండ్ పీసస్" క్రికెటర్లుగా చెప్పుకునే తమ ఆటగాళ్లు ఈ గెలుపుకు నిజమైన అర్హులని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా ఆయన న్యూజిలాండ్ క్రికెటర్లకు వచ్చిన "నైస్ గైస్" అన్న బిరుదుపై కూడా స్పందించాడు. ఈ బిరుదును క్రికెట్ ప్రేమికులు మా ఆన్ ఫీల్డ్ ప్రవర్తనకు ఇచ్చిన కాంప్లిమెంట్‌గా భావిస్తామని తెలిపాడు. ఇన్నేళ్లేగా ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించకపోవడంపై మాట్లాడుతూ.. 2015, 2019 ప్రపంచ కప్ ఫైనల్లలో తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని, అయినప్పటికీ ఓటమిపాలవ్వడం చాలా బాధించిందని పేర్కొన్నాడు. అయితే టెస్ట్ ఫార్మాట్లో తాము ఛాంపియన్లమన్న అనుభూతి ఆ బాధలన్నింటినీ అధిగమించేలా చేసిందని అన్నాడు. ఈ గెలుపు తమకు శిఖర సమానమే అయినప్పటికీ.. ఇంతకంటే సాధించాల్సింది చాలా ఉందని వెల్లడించాడు. ఓవరాల్‌గా చక్కటి క్రీడా స్పూర్తి, పోటీతత్వంతో కూడిన క్రికెట్ ఆడామని చెప్పుకొచ్చాడు. చదవండి: WTC Final: అందుకే పంత్ మైదానాన్ని వీడాడు.. -
WTC Final: కోహ్లి, విలియమ్సన్ ఆత్మీయ ఆలింగనం
సౌథాంప్టన్: ఐసీసీ ప్రష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్ జట్టు టీమిండియాను ఓడించి కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కివీస్ కెప్టెన్ విలిమమ్సన్‌ను అభినందిస్తూ భారత జట్టు కోహ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2008 నుంచే ఇద్దరు మధ్య మంచి సంబంధాలున్నాయి. 2008 అండర్-19 వరల్డ్ కప్ సెమిఫైనల్ లో న్యూజిలాండ్, భారత్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ కు కోహ్లి, న్యూజిలాండ్‌కు విలియమ్సన్ సారథ్యం వహించారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇక ఆరో రోజు మొదటి సెషన్ నుంచే భారత్‌పై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయించింది. క్రమం తప్పకుండ వికెట్లు తీయడంలో న్యూజిలాండ్ బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె వంటి వారంతా బ్యాటింగ్‌లో విఫలం కావడంతో రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ 170 పరుగులకు ఆలౌటైంది. ఫైనల్ రిజర్వ్ డే రోజున రెండో ఇన్నింగ్స్‌లో 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ ఛేదనలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ కీలకమైన పాత్ర పోషించారు. చదవండి: WTC Final: వేలు విరిగింది..అయినా క్యాచ్‌లు పట్టాడు -
WTC Final: అందుకే పంత్ మైదానాన్ని వీడాడు..
న్యూఢిలీ: డబ్ల్యూటీసీ ఫైనల్ ఆఖరి రోజు ఆట ఉత్కంఠగా సాగుతున్న సమయంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నపళంగా మైదానం వీడి వెళ్లిపోవడంపై పలు రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. 139 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టుని కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ విజయతీరాలకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో టీమిండియా.. వికెట్ కీపర్‌ని మార్చడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పంత్ స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వచ్చి నాలుగు ఓవర్ల పాటు కీపింగ్ చేశాడు. దీంతో పంత్‌కు ఏమైంది..?, సాహా ఎందుకు కీపింగ్ చేస్తున్నాడు..? అని తెలుసుకునేందుకు అభిమానులు, నెటిజన్లు తెగ ఆరాటపడ్డారు. ఈ నేపథ్యంలో పంత్ మైదానం వీడడానికి గల కారణాన్ని ఐపీఎల్ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ వెల్లడించింది. ఆ సమయంలో పంత్ ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో అతని స్థానంలో సాహా కీపింగ్ చేశాడని డీసీ ట్వీట్ చేసింది. కాగా, ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గి విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు 16 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 87 లక్షలు)తో పాటు ఐసీసీ గద (ట్రోఫీ) లభించగా, రన్నరప్ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. చదవండి: WeWantANewCaptain: సమయం ఆసన్నమైంది కోహ్లీ.. దిగిపో -
WTC Final: కివీస్ ఈ పాటికే గెలవాల్సింది..
సౌథాంప్టన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడే వాన్.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి కోహ్లీ సేనపై ట్విటర్ వేదికగా విషం చిమ్మాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్‌లో కాకుండా మరో చోట జరిగి ఉంటే, ఈ పాటికే న్యూజిలాండ్ విజేతగా నిలిచేదని ట్వీట్ చేశాడు. వాన్.. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేమీ కాదు. భారత ఆస్ట్రేలియా పర్యటన నుంచి తాజా డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌ను టార్గె్ట్ చేస్తూ వస్తున్నాడు. అయితే, ఈసారి అభిమానులు కూడా తమదైన శైలిలో వాన్‌కు చురకలంటించారు. If this #worldtestchampionshipfinal been played up north they wouldn’t have missed a minutes play … #Justsaying #INDvsNZ !! NZ would have been champions by now … 😜 — Michael Vaughan (@MichaelVaughan) June 22, 2021 ఇంగ్లండ్ జట్టులా భారత్ అడ్డదారిలో ప్రపంచకప్ గెలవలేదని రివర్స్ కౌంటరిచ్చారు. అంపైర్ తప్పుడు నిర్ణయాలు, బౌండరీ కౌంట్ వంటి అడ్డదారులతో ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిందని గుర్తు చేస్తున్నారు. విలువ తక్కువ పనులు, క్రీడా స్పూర్తి దెబ్బతీసేలా భారత జట్టు ఎప్పుడూ వ్యవహరించలేదని, నలుగురు తలెత్తుకునేలా ఆడిందని ఫైరయ్యారు. భారత జట్టు విజయాలను వాన్ ఏ మాత్రం ఓర్వలేకపోతున్నాడని, అసలు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రావడమే అతనికి ఇష్టం లేదని కామెంట్ చేస్తున్నారు. కాగా, గతంలో భారత్, ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా కూడా వాన్ ఇలానే పేలాడు. స్పిన్ పిచ్‌లు రెడీ చేశారని గగ్గోలు పెట్టాడు. pic.twitter.com/Pn29A9wJsU — Dev Patel (@dev_patel19) June 22, 2021 . pic.twitter.com/JtYXvuQ0E0 — Aayush Arora (Night Owl) (@VIRAT_X_ABD) June 22, 2021 ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఊహించినట్లుగానే మ్యాచ్ ఆరో రోజుకు(రిజర్వ్ డే) చేరింది. 32 పరుగుల ఆధిక్యంతో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. ఆరంభంలోనే మూడు కీలకమైన వికెట్లు(కోహ్లీ, పుజారా, రహానే) కోల్పోయినప్పటికీ.. పంత్(34), జడేజా(13) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. లంచ్ విరామం తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 142 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం టీమిండియా 110 పరుగుల ఆధిక్యంలో ఉంది. కివీస్ బౌలర్లు సౌథీ, జేమీసన్ తలో రెండు వికెట్లు, బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ICC Rankings: టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లిన జడేజా -
WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా న్యూజిలాండ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 249 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 139 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కివీస్ జట్టు భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గెలుపు దిశగా పయనిస్తున్న కివీస్.. 139 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్.. ఆతరువాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తుంది. కెప్టెన్ విలియమ్సన్(22), రాస్ టేలర్(30) ఆచితూచి ఆడుతున్నారు. కివీస్ గెలుపునకు మరో 47 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో మరో 8 వికెట్లు ఉన్నాయి. ఆఖరి రోజు ఆటలో మరో 18 ఓవర్లు మిగిలి ఉన్నాయి.భారత బౌలర్లలో అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి. రెండో వికెట్ కోల్పోయిన కివీస్.. కాన్వే(19) ఔట్ టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ కివీస్‌ను ముప్పతిప్పలు పెడుతున్నాడు. 33 పరుగుల వద్ద లాథమ్ వికెట్ పడగొట్టిన యాష్.. 44 పరుగుల వద్ద కివీస్ నయా సంచలనం డెవాన్ కాన్వేను(19) పెవిలియన్ బాట పట్టించాడు. కివీస్ గెలవాటంటే మరో 95 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లుండగా, మరో 35 ఓవర్ల ఆట మిగిలి ఉంది. తొలి వికెట్ కోల్పోయిన కివీస్.. లాథమ్(9) స్టంప్ అవుట్ 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు.. 33 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ టామ్ లాథమ్(2).. అశ్విన్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. పంత్ అద్భుతంగా బంతిని అందుకుని వికెట్లకు గిరాటు వేయడంతో కివీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. కాన్వే(14), విలియమ్సన్(0) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ గెలవాలంటే మరో 109 పరుగులు చేయాలి. టీమిండియా 170 ఆలౌట్.. కివీస్ టార్గెట్ 139 170 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. సౌథీ బౌలింగ్‌లో లాథమ్ క్యాచ్ అందుకోవడంతో బుమ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్.. కివీస్ ముందు 139 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్ 3, జేమీసన్ 2, వాగ్నర్ ఓ వికెట్ పడగొట్టారు. టీమిండియా తొమ్మిదో వికెట్ డౌన్.. షమీ(13) ఔట్ 170 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో లాథమ్ క్యాచ్ అందుకోవడంతో షమీ 13 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 138 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో ఇషాంత్, బుమ్రా ఉన్నారు. టెయిలెండర్లపై బౌల్ట్ ప్రతాపం.. అశ్విన్(7) ఔట్ 156 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కూడా కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి యాష్(7) వెనుదిరిగాడు. దీంతో ఒకే స్కోర్ వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా టెయిలెండర్లపై బౌల్ట్ ప్రతాపం చూపుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 124 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో షమీ, ఇషాంత్ ఉన్నారు. పంత్(41) ఔట్..124 పరుగుల ఆధిక్యంలో టీమిండియా భారత జట్టు ఆఖరి ఆశా కిరణం రిషబ్ పంత్ 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ వెనుదిరిగాడు. దీంతో 156 పరుగుల స్కోర్ వద్ద భారత్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 124 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో అశ్విన్(7), షమీ(0) ఉన్నారు. టీమిండియా ఆరో వికెట్ డౌన్, జడేజా(16) ఔట్ 142 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటివరకు ఓపికగా ఆడిన జడేజా వాగ్నర్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 110 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో పంత్(34), అశ్విన్(0) ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా, రహానే(15) ఔట్ బౌల్ట్ బౌలింగ్‌లో బౌండరీ బాది జోరుమీదున్నట్లు కనిపించిన రహానే 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. లెగ్ గ్లాన్స్ చేసే ప్రయత్నంలో వాట్లింగ్ చేతికి చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 109 పరుగుల స్కోర్ వద్ద టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 77 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రిషబ్ పంత్(21), జడేజా(0) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, సౌథీ చెరో రెండు వికెట్లు, బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాంప్టన్: ఆరో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్మెన్లు కోహ్లీ(13), పుజారా(15)లు పరుగు వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. వీరిద్దరిని కైల్ జేమీసన్ బోల్తా కొట్టించాడు. కోహ్లీ వికెట్ కీపర్ వాట్లింగ్‌కు క్యాచ్ అందించి ఔట్ కాగా, పుజారా.. రాస్ టేలర్ చేతికి చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. కైల్ జేమిసన్ మరో సారి తన బౌలింగ్ లైన్‌తో టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే దిశగా సాగేట్టు కనిపిస్తున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీని జేమిసనే ఔట్ చేయడం విశేషం. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం టీమిండియా 40 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రహానే, పంత్ క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, సౌథీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. -
నెటిజన్లకు దొరికిపోయిన బుమ్రా.. ఇలా ఐతే ఎలా?
సౌథాంప్టన్: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. పేలవ ప్రదర్శనతో నిరాశపరచడమే కాకుండా మరో తప్పిదాన్ని చేసి నెటిజన్ల చేతిలో బలయ్యాడు. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఈ టీమిండియా పేస్ దళపతి.. ఇది చాలదన్నట్లుగా ఐదో రోజు ఆటలో మరో పెద్ద పొరపాటు చేశాడు. ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా తయారు చేయించిన జెర్సీని కాకుండా రెగ్యులర్ టీమిండియా జెర్సీతో ఆయన బరిలోకి దిగి ఒక ఓవర్ మొత్తం అదే జెర్సీతో బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న బుమ్రా.. ఓవర్ల మధ్యలో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి కొత్త జెర్సీ వేసుకొని బరిలోకి దిగాడు. కాగా, ఐసీసీ ఈవెంట్లకు ఆటగాళ్ల జెర్సీలపై దేశం పేరు తప్పనిసరిగా మధ్యలో ఉంటుంది. స్పాన్సర్ పేరు స్లీవ్స్‌పై ముద్రించుకునేందుకు వారికి అనుమతి ఉంటుంది. అయితే, బుమ్రా వేసుకున్న జెర్సీ మధ్యలో భారత్ స్పాన్సర్ పేరు ఉంది. ఇది గమనించని బుమ్రా పొరపాటున రెగ్యులర్ టీమిండియా జెర్సీను ధరించడం సోషల్ మీడియాలో వైరలయ్యింది. నెటిజన్లు బుమ్రాను ఓ ఆటాడుకుంటున్నారు. అయ్యో బుమ్రా.. ఇలా ఐతే ఎలా..? ఏ జెర్సీ వేసుకోవాలో కూడా తెలియదా అంటూ తెగ ట్రోల్ చేశారు. మరికరైతే.. బుమ్రా ఇది పెద్ద బ్లండర్ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఐదో రోజు భారత్ 32 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. ముందే ప్రకటించిన విధంగా రిజర్వు డే(ఆరో రోజు) ఆట కొనసాగనుంది. రిజర్వు డే మొత్తం గరిష్ఠ వ్యవధి కనీసం 330 నిమిషాలు లేదా 83 ఓవర్లుగా ఉంటుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఆఖర్లో మరో గంట అదనపు సమయం ఉంటుంది. దీంతో మొత్తంగా ఆఖరి రోజు 93 ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రీజ్‌లో పుజారా(12), కోహ్లీ(8) ఉన్నారు. చదవండి: సౌథాంప్టన్: షమీ విశ్వరూపం.. మళ్లీ రిపీటయ్యేనా? -
WTC Final: ఆడతారా...ఓడతారా!
వర్షం సమస్య లేకపోతే రోజంతా అందుబాటులో ఉన్న మొత్తం ఓవర్లు 98... మరో 18 వికెట్లు పడితే గానీ విజేత ఎవరో తేలదు... ప్రస్తుతం భారత్ ఆధిక్యం 32 పరుగులు మాత్రమే. ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఎంత లక్ష్యం నిర్దేశిస్తే కివీస్‌కు సవాల్ విసరవచ్చో... దూకుడుగా ఆడి పరుగులు సాధించాలో, కుప్పకూలిపోకుండా వికెట్లు కాపాడుకోవాలో అర్థం కాని సంకట స్థితిలో టీమిండియా నిలిచింది. అదే న్యూజిలాండ్ మాత్రం ఆత్మవిశ్వాసంతో చివరి రోజున వికెట్ల వేటకు సిద్ధంగా ఉంది. లక్ష్యం కష్టసాధ్యంగా మారితే మ్యాచ్‌ను కాపాడుకునే అవకాశం కూడా ఆ జట్టుకు ఉంది. ఈ నేపథ్యంలో తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చివరి రోజు ఆట ఎలా సాగుతుందనేది ఆసక్తికరం. సౌతాంప్టన్: డబ్ల్యూటీసీ ఫైనల్ ఊహించినట్లుగానే ఆరో రోజుకు చేరింది. ‘రిజర్వ్ డే’ కారణంగా మ్యాచ్‌లో ఇంకా జీవం మిగిలి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం కోల్పోయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులు ముందంజలో నిలిచి మ్యాచ్ ఐదో రోజును ముగించింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నా రు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు. పేసర్ల జోరు తొలి సెషన్లో కివీస్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్, రాస్ టేలర్ (11) అతి జాగ్రత్తగా ఆడారు. మొదటి గంటలో 13 ఓవర్లలో ఆ జట్టు 16 పరుగులు మాత్రమే చేసింది. అయితే పేసర్లు చెలరేగి లంచ్‌లోపు మూడు వికెట్లు తీయడంతో భారత్ పైచేయి సాధించింది. షమీ బౌలింగ్‌లో గిల్ అద్భుత క్యాచ్‌కు టేలర్ వెనుదిరగ్గా, ఇషాంత్ బౌలింగ్‌లో నికోల్స్ (7) స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. వాట్లింగ్ (1)ను మరో చక్కటి బంతితో షమీ బౌల్డ్ చేశాడు. రెండో సెషన్లో గ్రాండ్‌హోమ్ (13) కూడా షమీ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోగా... మరో ఎండ్‌లో విలియమ్సన్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. 32 పరుగుల వద్ద అతనికి కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. షమీ బౌలింగ్‌లో ఎల్బీ కోసం అప్పీల్ చేసిన భారత్ రివ్యూ కోరింది. అయితే వెంట్రుకవాసి తేడాతో ‘అంపైర్ కాల్’ ద్వారా అతను బయటపడ్డాడు. షమీ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో దూకుడుగా ఆడబోయిన జేమీసన్ (21) అదే ఓవర్లో వెనుదిరగ్గా... కివీస్‌కు ఆధిక్యం లభించగానే ఇషాంత్ బౌలింగ్‌లో పేలవ షాట్‌కు విలియమ్సన్ వెనుదిరిగాడు. అయితే చివర్లో సౌతీ (46 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటం తో కివీస్ మెరుగ్గా ఇన్నింగ్స్‌ను ముగించగలిగింది. చివరి 4 వికెట్లకు ఆ జట్టు 77 రన్స్ జోడించింది. రాణించిన సౌతీ రెండో ఇన్నింగ్స్‌లో కూడా కివీస్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రోహిత్, గిల్ వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. అయితే తొలి ఇన్నింగ్స్ లోటును పూరించక ముందే గిల్‌ను సౌతీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రోహిత్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడి కుదురుకుంటున్న దశలో స్వయంకృతంతో వెనుదిరిగాడు. సౌతీ బంతి సరిగా అంచనా వేయలేక బ్యాట్ ఎత్తేసిన అతను ఎల్బీగా వెనుదిరిగాడు. అతను రివ్యూ కోరే ప్రయత్నం కూడా చేయలేదు. అనంతరం మరో 19 బంతులు ఎదుర్కొన్న కోహ్లి, పుజారా ప్రమాదం లేకుండా జాగ్రత్తపడ్డారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 217; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 30; కాన్వే (సి) షమీ (బి) ఇషాంత్ 54; విలియమ్సన్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 49; టేలర్ (సి) గిల్ (బి) షమీ 11; నికోల్స్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 7; వాట్లింగ్ (బి) షమీ 1; గ్రాండ్‌హోమ్ (ఎల్బీ) (బి) షమీ 13; జేమీసన్ (సి) బుమ్రా (బి) షమీ 21; సౌతీ (బి) జడేజా 30; వాగ్నర్ (సి) రహానే (బి) అశ్విన్ 0; బౌల్ట్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (99.2 ఓవర్లలో ఆలౌట్) 249 వికెట్ల పతనం: 1–70, 2–101, 3–117, 4–134, 5–135, 6–162, 7–192, 8–221, 9–234, 10–249. బౌలింగ్: ఇషాంత్ 25–9–48–3, బుమ్రా 26–9–57–0, షమీ 26–8–76–4, అశ్విన్ 15–5–28–2, జడేజా 7.2–2–20–1. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) సౌతీ 30; గిల్ (ఎల్బీ) (బి) సౌతీ 8; పుజారా (బ్యాటింగ్) 12; కోహ్లి (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (30 ఓవర్లలో 2 వికెట్లకు) 64 వికెట్ల పతనం: 1–24, 2–51. బౌలింగ్: సౌతీ 9–3–17–2 , బౌల్ట్ 8–1–20–0, జేమీసన్ 10–4–15–0, వాగ్నర్ 3–0–8–0. -
సౌథాంప్టన్: షమీ విశ్వరూపం.. మళ్లీ రిపీటయ్యేనా?
సౌథాంప్టన్: సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజు (2019, జూన్ 22), సౌథాంప్టన్ వేదికగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ విశ్వరూపం ప్రదర్శించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో లాలా.. హ్యాట్రిక్ సాధించి, మెగా ఈవెంట్లో ఈ అరుదైన ఘనత సాధించిన రెండో భారతీయ పేసర్‌గా చరిత్రకెక్కాడు. కాగా, ఆ అరుదైన ఫీట్‌ను మరోసారి రిపీట్ చేసే అవకాశం షమీకి మళ్లీ వచ్చిందని టీమిండియా అభిమానులు అంటున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించారు.135 పరుగులకే న్యూజిలాండ్ సగం వికెట్లను పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట జరగాల్సి ఉన్న నేపథ్యంలో లాలా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాలని అభిమానులు ఆశిస్తున్నారు. లాలా.. మరో హ్యాట్రిక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, సౌథాంప్టన్ వేదికగా అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో షమీ హ్యాట్రిక్ సాధించడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన అఫ్ఘన్‌కు శుభారంభం లభించింది. ఆఫ్ఘన్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా, షమీ చేతికి కెప్టెన్ కోహ్లీ బంతినిచ్చాడు. అప్పటికే మహమ్మద్ నబీ ఒంటిరి పోరాటం చేస్తూ.. మాంచి ఊపుమీదున్నాడు. తొలి బంతిని నబీ ఫోర్ బాది భారత శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ఆ మరుసటి బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా అతను క్రీజ్‌ను వదల్లేదు. నాలుగు బంతుల్లో 12 పరుగులుగా సమీకరణం మారిన నేపథ్యంలో షమీ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వరుస బంతుల్లో నబీ, అఫ్తాబ్ అలామ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లను అవుట్ చేసి టీమిండియాకు అపురూపమైన విజయాన్ని అందించాడు. దీంతో ప్రపంచకప్‌లో చేతన్ శర్మ తరువాత హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. చదవండి: కౌంటీ క్రికెట్ చరిత్రలో దారుణమైన గణాంకాలు నమోదు -
WTC Final Day 5: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..గిల్(8) ఔట్
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..గిల్(8) ఔట్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(8)ను సౌథీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. దీంతో టీమిండియా 24 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 8 పరుగులు వెనుకపడి ఉంది. ఐదో రోజు ఇంకా 29 ఓవర్ల ఆట మిగిలి ఉంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా న్యూజిలాండ్‌ను 249 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(5), శభ్‌మన్ గిల్(2) ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 పరుగులు స్కోర్ చేసింది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. ఐదో రోజు ఇంకా 35 ఓవర్ల ఆట మిగిలి ఉంది. న్యూజిలాండ్ 249 ఆలౌట్.. 32 పరుగుల స్వల్ప ఆధిక్యం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. సౌథీని(30) జడేజా క్లీన్ బౌల్డ్ చేయడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో ఆ జట్టుకు 32 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3, అశ్విన్ 2,జడేజా ఓ వికెట్ పడగొట్టారు. కాగా, అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఐదో రోజు ఆటలో మరో 40.4 ఓవర్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. వాగ్నర్ డకౌట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన కివీస్ కివీస్ టెయింలెండర్ నీల్ వాగ్నర్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్ బౌలింగ్‌లో రహానే స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో వాగ్నర్ సున్నా పరుగలుకే ఔటయ్యాడు. దీంతో 234 పరుగుల వద్ద కివీస్ తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్ ప్రస్తుతం 17 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో సౌథీ(23), బౌల్ట్(0) ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదో రోజు ఆటలో ఇంకా 43 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఎనిమిదో వికెట్ కోల్పోయిన కివీస్.. డేంజరెస్ విలియమ్సన్(49) ఔట్ టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(49)ను.. భారత పేసర్ ఇషాంత్ శర్మ ఎట్టకేలకు దొరకబుచ్చుకున్నాడు. అర్ధసెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉండగా థర్డ్ మెన్ దిశగా షాట్ ఆడబోయి టీమిండియా కెప్టెన్ కోహ్లీకి చేతికి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ 221 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో టిమ్ సౌథీ(10), నీల్ వాగ్నర్(0) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 4 పరుగుల తొలి ఇన్నింగ్స్‌తో కొనసాగుతుంది. టీమిండియా బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. షమీ ఆన్ ఫైర్.. ఏడో వికెట్ కోల్పోయిన కివీస్ సౌథాంప్టన్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి చెలరేగుతున్నాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఇదే వేదికగా ఆఫ్ఘనిస్తాన్పై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఆయన.. సరిగ్గా రెండేళ్ల తర్వాత(జూన్ 22) మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నాడు పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాభవం నుంచి కాపాడిన లాలా.. నేడు కివీస్‌పై భారత ఆధిపత్యం దిశగా తీసుకెళుక్తన్నాడు. ఐదో రోజు ఆటలో నాలుగు వికెట్లు(4/55) పడగొట్టి తన ప్రతాపం చూపుతున్న షమీ.. ప్రమాదకరంగా మారుతున్న జేమీసన్(16 బంతుల్లో 21; సిక్స్) పెవిలియన్‌కు పంపి కివీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. ప్రస్తుతం క్రీజ్‌లో విలియమ్సన్(37), సౌథీ(0) ఉన్నారు. 87 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కివీస్ ప్రస్తుతానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన కివీస్..గ్రాండ్‌హోమ్(13) ఔట్ ఐదో రోజు ఆటలో పేసర్ షమీ కివీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. తొలి సెషన్లో టేలర్(11), వాట్లింగ్(1) వికెట్లు పడగొట్టిన షమీ.. లంచ్ తర్వాత గ్రాండ్‌హోమ్(13) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. దీంతో కివీస్ 162 పరుగలుకే 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో విలియమ్సన్(28), కైల్ జేమీసన్ ఉన్నారు. ప్రస్తుతం కివీస్ భారత్ కంటే 55 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో షమీ 3, ఇషాంత్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. సౌథాంప్టన్: వర్షం కారణంగా గంట ఆలస్యంగా ప్రారంభమైన ఐదో రోజు ఆటలో టీమిండియా పేసర్లు ఇరగదీస్తున్నారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సీనియర్ ఆటగాడు రాస్ టేలర్(11)ను షమీ బోల్తా కొట్టించగా, 70వ ఓవర్లో హెన్రీ నికోల్స్(7)ను ఇషాంత్ పెవిలియన్‌కు సాగనంపాడు. ఆమరుసటి ఓవర్లోనే షమీ కివీస్‌కు మరోషాకిచ్చాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వాట్లింగ్(1)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 135 పరుగులకే కివీస్ సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్(217)కు చేరుకోవాలంటే కివీస్ ఇంకా 82 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కేన్ విలియమ్సన్(19), గ్రాండ్‌హోమ్(0) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ 2, షమీ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, వర్షం అంతరాయం లేకుండా మ్యాచ్ సజావుగా సాగితే, ఫలితం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. నేడు, రేపు(రిజర్వ్ డే) కలుపుకుని మరో 150 ఓవర్ల ఆట సాధ్యపడితే తప్పక ఫలితాన్ని ఆశించవచ్చన్నది వారి అభిప్రాయం. కాగా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ వరుణుడి ఆటంకం కారణంగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలి రోజు, నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దు కాగా, ఐదో రోజు ఆటపై కూడా సందేహాలు నెలకొని ఉన్న సమయంలో. వరుణుడు శాంతించడంతో ఐదో రోజు ఆట మొదలైంది. మంగళవారం కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఐదో రోజు ఆటలో 98 ఓవర్ల వేయాల్సి ఉండగా, వరుణుడి అంతరాయం కారణంగా 7 ఓవర్లు కోత విధించారు. దీంతో ఈ రోజు మొత్తం 91 ఓవర్ల మ్యాచ్ జరగాల్సి ఉంది. చదవండి: విజేతను చూడలేం..రిజర్వ్ డే కలుపుకున్నా కష్టమే! -
టీమిండియా ప్రాక్టీస్ అదుర్స్.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి
లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత టెస్ట్ జట్టు ఈ నెల 18 నుండి ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)ఫైనల్నేపథ్యంలో ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇంగ్లండ్ గడ్డపై కాలు మోపాక మూడు రోజులు కఠిన క్వారంటైన్లో గడిపిన భారత జట్టు.. తొలిసారి ఓ బృందంగా సాధనచేసింది. దాదాపు నాలుగు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్ సెషన్ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఈ పర్యటనలో ఇదే మా తొలి గ్రూప్ ప్రాక్టీస్, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు' అంటూ క్యాప్షన్ జోడించింది. We have had our first group training session and the intensity was high 🔥#TeamIndia's 🇮🇳 preparations are on in full swing for the #WTC21 Final 🙌 pic.twitter.com/MkHwh5wAYp — BCCI (@BCCI) June 10, 2021 కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు టీమిండియాకు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లంతా నెట్ సెషన్లోనే తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారాలు సాధనలో మునిగిపోయారు. అందరూ నెట్ సెషన్లో చమటోడ్చారు. కోహ్లీ బ్యాట్ లేకుండా కెమెరాకు పోజులివ్వగా.. రోహిత్ భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. గిల్, పంత్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ సాధన చేశారు. ఇక బౌలర్లు సిరాజ్, అశ్విన్, బుమ్రా, ఇషాంత్, షమీలు హుషారుగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. డ్యూక్ బంతులతో సాధన చేస్తూ ఊహించని స్వింగ్‌ను రాబడుతూ.. సంతోషంలో మునిగితేలారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2021 వాయిదా పడిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం ముంబైలో రెండు వారాలు క్వారంటైన్లో గడిపారు. అనంతరం జూన్ 3న భారత బృందం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు చేరుకుంది. అక్కడ ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆతర్వాత మూడు రోజుల పాటు ఒక్కో ఆటగాడు మాత్రమే సాధన చేశారు. గురువారం నుంచే భారత బృందం కలిసికట్టుగా సాధన మొదలుపెట్టింది. కాగా, ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే డబ్యూటీసీ ఫైనల్లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. సుదీర్ఘ విరామానంతరం తిరిగి ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధవన్ పేరు ఖరారు..? -
చారిత్రక మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి
లండన్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ప్రారంభంకానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు 4000 మంది ప్రేక్షకులకు అనుమతివ్వాలని హాంప్షైర్కౌంటీ క్లబ్నిర్ణయించింది. కరోనా దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల్ని అనుమతిస్తారా లేదో అన్న సందేహాల నేపథ్యంలో హాంప్‌షైర్ కౌంటీ అధ్యక్షుడు రాడ్ బ్రన్స్ గ్రోవ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ మ్యాచ్ కోసం ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం టికెట్లు రిజర్వ్ చేయగా, మిగిలిన 2000 టికెట్లను అమ్మకానికి ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కావడంతో ఈ మ్యాచ్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టికెట్లకు డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే, యూకేలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. హాంప్‌షైర్ వేదికగా నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభంకానుండగా, ఈ మ్యాచ్‌కు1500 మంది ప్రేక్షకులను అనుమతించారు. 2019 సెప్టెంబర్ తర్వాత మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించడం ఇదే తొలిసారి. కాగా, భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో డబ్యూటీసీ ఫైనల్‌తో పాటు ఆతిధ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు బయల్దేరనుంది. చదవండి: టీమిండియాకు ఆడేందుకు 50 మందికి పైగా రెడీగా ఉన్నారు.. -
రాహుల్.. శరం ఉందా?
సౌతాంప్టన్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడకుండా డకౌట్ కావాడన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అభిమానుల ఆగ్రహానికి అవకాశం ఇచ్చింది కూడా కేఎల్ రాహలే. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే రాహుల్.. టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ పుట్టిన రోజున (సెప్టెంబర్ 2న) అత్యంత నిజాయితీగా, ఆత్మీయంగా ఉండే వ్యక్తి జట్టులో ఉన్నారంటే అది ఇషాంతే. హ్యాపిబర్త్డే’ అని విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. అదే రోజు గెలవాల్సిన మూడో టెస్ట్‌ను భారత్ ఓడిపోయింది. ఈ ఓటమికి పూర్తిగా బ్యాట్స్‌మన్ వైఫల్యమే కారణం. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు పోరాడిన మిగతా బ్యాట్స్‌మన్ విఫలమవ్వడం.. ముఖ్యంగా ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు మంచి శుభారంభం అందకపోవడంతో గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. దీంతో సిరీస్‌ను కూడా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమయంలో రాహుల్ ట్వీట్ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లైంది. అంతే విదేశాల్లో తన చెత్త ప్రదర్శనను ప్రస్తావిస్తూ ట్రోల్ చేయసాగారు. ‘రాహుల్.. ఉపఖండం బయట ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో నీవు చేసిన పరుగులు మొత్తం 171. యావరేజ్ 13’ అని తన చెత్త ప్రదర్శనను ఒకరు గుర్తు చేశారు. ఇంకొకరు ‘ ఈ పరిస్థితుల్లో ట్వీట్ చేయడానికి సిగ్గు, శరం ఉండాలి’ అని ఘాటుగా కామెంట్ చేశారు. మరొకరు అతనికి శరం లేదని, అందుకే మంచి క్రికెటర్ అయినా బ్యాటింగ్ చేయకుండా మోడలింగ్ చేస్తుండు’ అని మండిపడ్డారు. Sharam bhi nahi aa rha hai haarne k baad tweet kar rha..sirf virat bharoshe hai team — LOKESH (@Lokesh_Aamirian) 2 September 2018 -
నాలుగో టెస్టులో భారత్ పరాజయం
-
సిరీస్ సమర్పయామి
మళ్లీ అదే నిరాశాజనక ప్రదర్శన. మరోసారి అదే తరహా పరాభవం. చివరి ఇన్నింగ్స్‌లో స్వల్ప లక్ష్యాలను కూడా ఛేదించడంలో తమ బలహీనతను బయట పెట్టుకుంటూ భారత్ నాలుగో టెస్టులోనూ తలవంచింది. ఒక్కసారి కోహ్లి ఔటైతే ఇక తమ వల్ల కాదన్నట్లుగా ఇతర బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేయడంతో మరో ఓటమి మన ఖాతాలో చేరింది. అచ్చు తొలి టెస్టు ఫలితాన్ని తలపించిన పరాజయంతో మరో టెస్టు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ చేతిలో భారత్ 1–3తో సిరీస్ కోల్పోయింది. ఒక దశలో భారత్ స్కోరు 123/3... కానీ 61 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు ఫట్... కోహ్లి, రహానే 101 పరుగుల భాగస్వామ్యం ఆశలు రేకెత్తించినా మ్యాచ్ గెలిపించలేకపోయింది. అగ్రశ్రేణి స్పిన్నర్‌గా గుర్తింపు ఉన్న అశ్విన్ విఫలమైన చోటనే ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ మొయిన్ అలీ మన పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అతను ఈసారి 4 కీలక వికెట్లతో భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఫలితంగా సిరీస్‌లో రెండోసారి చేరువగా వచ్చి కూడా భారత్‌కు విజయం దూరమైంది. సౌతాంప్టన్: ఇంగ్లండ్ గడ్డపై ఈసారి టెస్టు సిరీస్ గెలవగల సత్తా ఉన్న జట్టుగా కనిపించిన భారత్ అంచనాలను అందుకోలేకపోయింది. మన బౌలర్లు మెరుగైన అవకాశాలు సృష్టించినా... బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌లో పోరాటం ముగించింది. ఇక్కడి రోజ్ బౌల్ మైదానంలో నాలుగో రోజే ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 60 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 69.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (130 బంతుల్లో 58; 4 ఫోర్లు), అజింక్య రహానే (159 బంతుల్లో 51; 1 ఫోర్) అర్ధ సెంచరీలు సాధించినా ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారత్‌కు నిరాశ తప్పలేదు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొయిన్ అలీ (4/71) చెలరేగగా... అండర్సన్, స్టోక్స్ చెరో 2 వికెట్లతో అండగా నిలిచారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 260/8తో ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 11 పరుగులు మాత్రమే జోడించి 271 పరుగులకు ఆలౌటైంది. తాజా ఫలితంతో 5 టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3–1తో సొంతం చేసుకుంది. ఈ నెల 7 నుంచి ఓవల్ మైదానంలో చివరి టెస్టు జరుగుతుంది. శతక భాగస్వామ్యం... పిచ్ పరిస్థితి, గత రికార్డును బట్టి చూస్తే కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు నిరాశాజనకమైన ఆరంభం లభించింది. బ్రాడ్ అద్భుత బంతితో రాహుల్ (0)ను క్లీన్ బౌల్డ్ చేయగా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పుజారా (5)ను అండర్సన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అతని తర్వాతి ఓవర్లోనే ధావన్ (17) కూడా వెనుదిరగడంతో భారత్ స్కోరు 22/3 వద్ద నిలిచింది. ఈ స్థితిలో జట్టును కోహ్లి, రహానే ఆదుకునే ప్రయత్నం చేశారు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లికి వివాదాస్పద రీతిలో అదృష్టం కలిసొచ్చింది. అలీ బౌలింగ్‌లో ఎల్బీకి అప్పీల్ చేసిన ఇంగ్లండ్ అంపైర్ స్పందించకపోవడంతో రివ్యూ కోరింది. బ్యాట్ తగిలిందని చెబుతూ థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. అయితే రీప్లేలో కోహ్లి ఔటైనట్లుగా కనిపించింది. 15 పరుగుల వద్ద కూడా ఇంగ్లండ్ కోహ్లి ఎల్బీ కోసం రివ్యూ కోరినా ఫలితం భారత్‌కు అనుకూలంగానే వచ్చింది. ఈ దశలో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ కలిసి సమర్థంగా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్నారు. అటు పేస్, ఇటు స్పిన్‌తో ఇంగ్లండ్ ఎంతగా ప్రయత్నించినా వీరిద్దరు పొరపాటుకు అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో కోహ్లి 114 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. దాంతో భారత్ సునాయాసంగా గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. మొయిన్ అలీ జోరు... టీ విరామానికి ముందు భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అలీ బంతిని ఆడబోయిన కోహ్లి, షార్ట్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. బ్యాట్‌కు బంతి తగల్లేదనే ఉద్దేశంతో కోహ్లి రివ్యూ కోరినా రీప్లేలో ఔట్‌గానే తేలింది. అంతే... ఆ తర్వాత భారత్ పతనం ఏ దశలోనూ ఆగలేదు. హార్దిక్ పాండ్యా (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (18; 2 ఫోర్లు, 1 సిక్స్) తనకు తెలిసిన రీతిలో దూకుడుగా ఆడబోయి వెనుదిరిగాడు. అలీ వేసిన చక్కటి బంతికి రహానే కూడా ఎల్బీడబ్లు్య కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (36 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిగా పోరాడే ప్రయత్నం చేసినా ఏమాత్రం లాభం లేకపోయింది. తొలి రోజు జట్టు స్కోరు 86/6 వద్ద బ్యాటింగ్‌కు దిగి అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో పాటు విరాట్ కోహ్లి వికెట్ కూడా తీసి మ్యాచ్ గతిని మార్చిన ఆల్‌రౌండర్ స్యామ్ కరన్... అశ్విన్‌ను ఆఖరి వికెట్‌గా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 246; భారత్ తొలి ఇన్నింగ్స్ 273; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 271; భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) స్టోక్స్ (బి) అండర్సన్ 17; రాహుల్ (బి) బ్రాడ్ 0; పుజారా (ఎల్బీ) (బి) అండర్సన్ 5; కోహ్లి (సి) కుక్ (బి) అలీ 58; రహానే (ఎల్బీ) (బి) అలీ 51; పాండ్యా (సి) రూట్ (బి) స్టోక్స్ 0; పంత్ (సి) కుక్ (బి) అలీ 18; అశ్విన్ (ఎల్బీ) (బి) కరన్ 25; ఇషాంత్ (ఎల్బీ) (బి) స్టోక్స్ 0; షమీ (సి) అండర్సన్ (బి) అలీ 8; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్) 184. వికెట్ల పతనం: 1–4; 2–17; 3–22; 4–123; 5–127; 6–150; 7–153; 8–154; 9–163; 10–184. బౌలింగ్: అండర్సన్ 11–2–33–2; బ్రాడ్ 10–2–23–1; మొయిన్ అలీ 26–3–71–4; స్టోక్స్ 12–3–34–2; కరన్ 3.4–2–1–1; రషీద్ 7–3–21–0. -
తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
సౌతాంప్టన్: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఒక దశలో ఇంగ్లండ్ 86 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ, సామ్ క్యూరన్ ఏడో వికెటుకు 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో మొయిన్ అలీ వెనుదిరగడంతో ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో సామ్ క్యూరన్(78), మొయిన్ అలీ(40) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా, అశ్విన్, ఇషాంత్ శర్మ, షమీలు తలో రెండు వికెట్లు తీశారు. హార్ధిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. -
నాలుగో టెస్టు: భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన
-
ఇంగ్లండ్‌కు చుక్కలు చూపెడుతున్న భారత బౌలర్లు
సౌంతాప్టన్ : మూడో టెస్టులో విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా నాలుగో టెస్టులోనూ తన సత్తా చాటుతోంది. టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనలతో ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న షమీ, ఇషాంత్, బుమ్రాలను ఎదుర్కొని నిలబడిన బెన్ స్టోక్స్ (23) వికెట్ కోల్పోయాడు. 34 ఓవర్లో షమీ వేసిన అద్భుతమైన బంతికి స్టోక్స్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో షమీ ఖాతాలో రెండు వికెట్లు చేరాయి. మొయిన్ అలీ (20), సామ్ క్యూరన్ (22) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు 43 ఓవర్లకు 124/6 గా ఉంది. ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (21)ను మహ్మద్ షమీ పెవిలియన్ పంపాడు. దీంతో జట్టు స్కోరు 69 పరుగుల వద్ద ఇంగ్లండ్ అయిదో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 27 ఓవర్లు ముగిసే సమయానికి 69/5 గా కొనసాగుతోంది. బెన్ స్టోక్స్ (16), మొయిన్ అలీ (0) క్రీజులో ఉన్నారు. 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన షార్ట్‌లెంగ్త్ బంతిని అనవరంగా ఆడిన అలిస్టర్ కుక్ థర్డ్ స్లిప్‌లో విరాట్ కోహ్లీకి సులభమైన క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయే సమయానికి ఇంగ్లండ్ జట్టు స్కోరు 36 పరుగులు మాత్రమే. కాగా, సమష్టిగా రాణిస్తున్న టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు పడగొట్టడం మంచి పరిణామం. బుమ్రా మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అద్భుత బంతితో బెయిర్ స్టో (6)ను బోల్తా కొట్టించాడు. అతను కొట్టిన బంతిని స్క్వేర్‌లో ఉన్న రిషభ్ పంత్ క్యాచ్ పట్టడంతో జట్టు స్కోరు 12 ఓవర్లకు 28 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. నెమ్మదిగా సాగుతున్న ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మరో అలజడి మొదలైంది. జో రూట్ (4)ను ఇషాంత్ ఎల్బీగా వెనక్కుపంపాడు. అప్పటికీ ఇంగ్లండ్ స్కోరు 7 ఓవర్లకు 17 పరుగులు మాత్రమే. రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెన్ జెన్నింగ్స్(0) ను జీస్ప్రీత్ బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఒక పరుగుకే ఇంగ్లండ్ ఓపెనర్ వికెట్‌ను కోల్పోయింది. -
హడలగొట్టిన అలీ; బెంబేలెత్తిన భారత్
సౌతాంప్టన్: ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలయింది. 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటైంది. పోరాడకుండానే ప్రత్యర్థి ముందు తలవంచింది. రహానే(52) మినహా ఆటగాళ్లు చేతులెత్తేడయంతో ధోని సేనకు భంగపాటు తప్పలేదు. టాప్ బ్యాట్స్‌మెన్ అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు రెండు టెస్టుల్లో ఆపద్భాందవ పాత్ర పోషించిన టెయిలెండర్లు నిలబకలేపోవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. రోహిత్ శర్మ(6), ధోని(6), జడేజా(15) విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ మొయిన్ అలీ తన పదునైన బౌలింగ్ తో భారత ఆటగాళ్లను హడలగొట్టాడు. 6 వికెట్లు కూల్చి భారత పతనాన్ని శాసించాడు. ఆండర్సన్ 2 వికెట్లు తీశాడు. రూట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1తో ఇంగ్లండ్ సమం చేసింది. -
మూడో టెస్టు: ఓటమి అంచున భారత్
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత్‌కు ఓటమి గండం పొంచి వుంది. మ్యాచ్ నాలుగో రోజు బుధవారం 445 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లకు 112 పరుగులు చేసింది. భారత్ ఇంకా 333 పరుగులు వెనుకబడివుండగా, చేతిలో ఆరు వికెట్లున్నాయి. రహానె, రోహిత్ క్రీజులో ఉన్నారు. మురళీ విజయ్, ధవన్, పుజారా, కోహ్లీ అవుటయ్యారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసి, 445 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కుక్(70 నాటౌట్), రూట్(56) అర్థసెంచరీలతో రాణించడంతో ఇంగ్లీషు జట్టు వేగంగా పరుగులు సాధించింది.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 569/7 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 330 పరుగులకు ఆలౌటైంది. -
టీమిండియా టార్గెట్ 445 పరుగులు
సౌతాంప్టన్: మూడో టెస్టులో భారత్ కు ఇంగ్లండ్ 445 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కుక్(70 నాటౌట్), రూట్(56) అర్థసెంచరీలతో రాణించడంతో ఇంగ్లీషు జట్టు వేగంగా పరుగులు సాధించింది. టీ విరామ సమయానికి 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రాబ్సన్ 13, బాలన్స్ 38, బెల్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 569/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 330 పరుగులకు ఆలౌటైంది.