surgical strikes
-
ప్రశాంత కశ్మీర్‌కు మార్గం
జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదం, రాళ్లదాడులు, హర్తాళ్లు, సరిహద్దుల్లో అలజడి వగైరాలు లేకుండా ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉదమ్‌పూర్ ర్యాలీలో ఎంతో ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రకటనను బహుశా విపక్షాలు కూడా స్వాగతిస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుల్వామాలో సైనికులపై ఉగ్రవాద దాడి, ఆ వెనువెంటనే పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం సాగించిన సర్జికల్ దాడులు విపక్షాలకు దేశంలో అప్పటివరకూ కొద్దో గొప్పో ఉందనుకున్న అనుకూలతలను ఆవిరిచేశాయి. బీజేపీకి భారీ మెజారిటీని అందించాయి. కనుక ఈసారి అంతా సవ్యంగా ముగియాలని అవి కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఆ మాటెలావున్నా మోదీ చెప్పిన స్థాయిలో ఉగ్రవాదం బెడద సమసిపోయిందనుకోలేము. ఆ ఉదంతాల సంఖ్య గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే అయినా అడపా దడపా వారి ఆగడాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. నిరుడు డిసెంబర్లో పూంచ్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడిన ఉదంతంలో నలుగురు జవాన్లు మరణించటమైనా, మరుసటి నెలలో అదేప్రాంతంలో సైనికులపై జరిగిన దాడి యత్నమైనా, శ్రీనగర్‌లో ఫిబ్రవరిలో ఒక పంజాబీ పౌరుణ్ణి కాల్చిచంపటమైనా మరింత అప్రమత్తత అవసరమన్న సంకేతాలిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయటమైనా, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమైనా అక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాయన్నది వాస్తవం. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. లోక్‌సభ ఎన్నికలకంటే అసెంబ్లీ ఎన్నికలకే జమ్మూ, కశ్మీర్లో ఎప్పుడూ అధిక ప్రాధాన్యత వుండేది. అయితే మారిన పరిస్థితుల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో పట్టు సంపాదిస్తేనే భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం సాధ్యమవుతుందని ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కొత్తగా రంగంలోకొచ్చిన గులాంనబీ పార్టీ డీపీఏపీ భావిస్తున్నాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ పార్లమెంటులో తమ సంఖ్యను పెంచుకోవటానికి ఎంతో కొంత దోహదపడుతుందన్నదృష్టితో వున్నాయి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ది విషాద స్థితి. అంతక్రితం గెల్చుకున్న జమ్మూ, లద్దాఖ్‌లు రెండూ ఆ సార్వత్రిక ఎన్నికల్లో చేజారాయి. ఆ రెండూ బీజేపీ పరమయ్యాయి. కానీ మారిన పరిణామాలు లద్దాఖ్‌లో ఆ పార్టీకి ఆశలు పుట్టిస్తున్నాయి. ఉపాధి లేమి, హిల్ కౌన్సిళ్లను నీరుగార్చటం, పర్యావరణాన్ని దెబ్బతీసేలా సాగుతున్న కార్పొరేట్ సంస్థల భూదాహం లద్దాఖ్ ప్రజానీకానికి ఆగ్రహం కలిగించాయి. దానికితోడు చైనానుంచి ముప్పువుండొచ్చన్న ఆందోళనతో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లద్దాఖ్‌ను చేరుస్తామన్న హామీనుంచి బీజేపీ వెనక్కి తగ్గింది. అలా చేరిస్తే ఆదివాసీ ప్రాంతాలకు కార్యనిర్వాహక, శాసన, న్యాయ, ఆర్థిక రంగాల్లో స్వయం నిర్ణయాధికారం లభిస్తుంది. తమ ప్రాంతాల్లోని అడవులు, నదులు, వ్యవసాయం, గ్రామపాలన, వారసత్వ ఆస్తి, వివాహం, విడాకులు, సంప్రదాయాలు తదితరఅంశాల్లో చట్టాలు చేసుకునే అధికారం వుంటుంది. పొరుగున చైనా వున్న నేపథ్యంలో ఇది సమస్యాత్మకం కావొచ్చని ఆలస్యంగా గ్రహించటంతో బీజేపీకి ఎటూ పాలుబోవటం లేదన్నది వాస్తవం. అక్కడి ఉద్యమాల పర్యవసానంగా లే ప్రాంతంలో ఆధిపత్యంవున్న బుద్ధిస్ట్లకూ, కార్గిల్‌లో పైచేయిగా వున్న ముస్లింవర్గాలకూ మధ్య సంప్రదాయ సరిహద్దులు చెరిగిపోయాయి. ఫలితంగా ఇటీవల జరిగిన 26 స్థానాల హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి రెండు మాత్రమే దక్కాయి. కనుక బీజేపీ సంకల్పం నెరవేరటం అంత సులభం కాదు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు విడివిడిగా పోటీచేస్తున్నాయి. ఇటీవల సమష్టిగా అడుగులేసినట్టు కనబడిన ఈ రెండు పార్టీలూ ఎన్నికలు వచ్చేసరికి దూరం జరిగాయి. గతంలో ఒప్పందాలకు కట్టుబడి వుండటం అలవాటులేని పీడీపీతో పొత్తు అసాధ్యమన్నది నేషనల్ కాన్ఫరెన్స్ వాదన. చిత్రమేమంటే ఎప్పుడూ ‘మరింత స్వయంప్రతిపత్తి’, జమ్మూ, కశ్మీర్లో శాంతి స్థాపన చర్చలు ప్రధాన ఎజెండాగా చేసుకునే ఆ పార్టీలకు మారిన పరిస్థితుల్లో ఆ అంశాల ప్రస్తావనకే అవకాశం లేకుండా పోయింది. డీపీఏపీ ఎత్తుగడలే ఈ పార్టీలను కలవరపరుస్తున్నాయి. ఆజాద్ తాను బలంగావున్న ఉదంపూర్–దోడా నియోజకవర్గాన్ని వదిలి అనంత్‌నాగ్–రాజౌరికి ఆయన వలస రావటం వెనక ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేయాలన్న వ్యూహం వున్నదని వాటి అనుమానం. ఉన్న ఆరు లోక్‌సభ స్థానాలకూ అయిదు దశల్లో పోలింగ్ నిర్వహించటం జమ్మూ, కశ్మీర్ వర్తమాన స్థితికి అద్దం పడుతుంది. అయిదేళ్లుగా నిద్రాణమైనట్టున్న ఈ ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత కదలిక వచ్చింది. ఇప్పుడు లభించే ఓట్ల శాతాన్నిబట్టి భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానం ఏమిటన్నది తేలిపోతుందని బీజేపీ గట్టిగా భావిస్తోంది. మిలిటెంట్ల స్వరం ఈసారి మూగబోయిందన్నది వాస్తవం. అయితే రాష్ట్రంలో హిందూ సీఎంవుండాలన్న బీజేపీ ఆశ నెరవేరాలంటే ఉగ్రవాదాన్ని అణిచేయటం ఒక్కటే చాలదు. అందుకు అభివృద్ధికి బాటలు పరిచి యువతకు ఉపాధి అవకాశాలు పెంచటం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగపరిచే దిశగా చర్యలు తీసుకోవటం, మానవహక్కులకు ప్రాధాన్యతనీయటం తప్పనిసరి. సరిహద్దు ఆవల పాకిస్తాన్, చైనాలు వున్నాయన్న స్పృహతో మెలిగి, సున్నితంగా వ్యవహరించటం నేర్చుకుంటే ఆ ప్రాంత ప్రజల హృదయాలు గెల్చుకోవటం సులభమవుతుంది. -
Javed Akhtar: పాక్ గడ్డపై స్పీచ్‌తో సర్జికల్ స్ట్రైక్
ప్రముఖ సినీ గేయ రచయిత, ఉర్దూ కవి జావేద్ అక్తర్.. తాజాగా పాకిస్తాన్ గడ్డపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. ముంబై 26/11 దాడులకు కారకులైన ఉగ్రవాదులు ఇప్పటికీ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ఈ పరిణామం భారతీయుల గుండెల్లో చేదు నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. దిగ్గజ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ సంస్మరణార్థం కిందటి వారం లాహోర్(పాక్)లో ఓ కార్యక్రమం జరిగింది. దానికి జావేద్ అక్తర్ హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడున్న ఆడియొన్స్‌లో కొందరు ఆయనకు పలు ప్రశ్నలకు సంధించారు. మీరు పాకిస్తాన్‌కు ఎన్నోసార్లు వచ్చారు. మరి మీకు వెనక్కి వెళ్లాక.. మీ ప్రజలకు పాక్ వాళ్లు మంచోళ్లు అని, బాంబులు పేల్చే రకం మాత్రమే కాదు.. పూలమాలతో ప్రేమను కూడా కురిపిస్తారని అక్కడి ప్రజలకు మీరు ఎప్పుడైనా చెప్పారా? అని జావేద్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన.. ఇక్కడి ఎవరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు.ఇరు దేశాల ప్రజల ద్వేషం దేనిని పరిష్కరించదు. ఇక్కడ ఇరు దేశాల మధ్య వాతావరణం ఉత్కంఠభరితంగా మాత్రమే ఉంది. ముంబై ప్రజలమైన మేం.. ఉగ్రవాద దాడులను కళ్లారా చూశాం. దాడికి పాల్పడ్డవాళ్లు ఎక్కడో నార్వే నుంచో, ఈజిప్ట్ నుంచో రాలేదు. వాళ్లు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటప్పుడు భారతీయుల కోపానికి అర్థం ఉంది. దానిపై మీరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు అని కుండబద్ధలు కొట్టారాయన. वाह! शानदार @Javedakhtarjadu बहुत खूब... 👏🙌👏#JavedAkhtarInPakistan pic.twitter.com/snbXKCKmGf — Dr. Syed Rizwan Ahmed (@Dr_RizwanAhmed) February 21, 2023 అంతేకాదు.. పాక్ దిగ్గజాలకు భారతదేశం ఆతిథ్యమిచ్చిన రీతిలో భారతీయ కళాకారులకు పాకిస్తాన్లో స్వాగతం లభించలేదని ఆయన ఎత్తిచూపారు. ఉదాహరణకు.. ఫైజ్ సాబ్ భారత్‌కు వచ్చినప్పుడు ఆయన్ని ప్రముఖ సందర్శకుడిగా భావించింది భారత్. అదంతా అంతటా ప్రసారం అయ్యింది కూడా. అలాగే భారత్‌లో నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్, మెహ్దీ హాసన్‌లకు గౌరవ సూచికంగా పెద్ద ఎత్తున్న వేడుకలను అక్కడ(భారత్) నిర్వహించాం. మరి మీరు(పాక్) లతా మంగేష్కర్ కోసం ఏదైనా వేడుక నిర్వహించగలిగారా? అని నిలదీయడంతో.. అక్కడున్నవాళ్లంతా చప్పళ్లు చరిచారు. Jab main Javed saab ki poetry sunti hoon toh lagta tha yeh kaise Maa Swarsati ji ki in pe itni kripa hai, lekin dekho kuch toh sachchai hoti hai insaan mein tabhi toh khudai hoti hai unke saath mein … Jai Hind @Javedakhtarjadu saab… 🇮🇳 Ghar mein ghuss ke maara .. ha ha 🇮🇳🇮🇳 https://t.co/1di4xtt6QF — Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023 జావేద్ అక్తర్ పాక్ ప్రసంగం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై చాలామంది అభినందనలు కురిపిస్తున్నారు. ఇక జావేద్ అక్తర్ వ్యాఖ్యలు మాటల తుటాలని.. పాక్ గడ్డపై ఆయన చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక జావేద్‌పై ప్రశంసలు గుప్పించిన వాళ్లలో ప్రముఖ నటి కంగనా రౌత్ కూడా ఉన్నారు. -
వాటికీ ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పుల్వామా ఉగ్రదాడి, సర్జిక్ స్ట్రైక్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో పుల్వామ ఉగ్రదాడిలో సుమారు 40 మంది భ్రదతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. "పుల్వామ ఉగ్రవాదానికి కేంద్రం, పైగా అక్కడ ప్రతి కారుని కూడా తనిఖీ చేస్తారు. అలాంటప్పుడూ రాంగ్‌సైడ్ నుంచి వచ్చిన స్కార్పియో కారుని ఎందుకు తనిఖీ చేయలేదు. అప్పుడే కదా ఈ స్కారిపియో కారు భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ని ఢీ కొనడంతో అంతమంది జవాన్లు చనిపోయారు" అంటూ కేంద్రంపై విరుచకుపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సరైనా సమాధానం ఇవ్వలేదన్నారు. అదీగాక పార్లమెంటులో బహిరంగంగా ప్రధాని మోదీ పదేపదే సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడతారంటూ విమర్శించారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌తో ఇంతమందిని చంపాం అని ఏవో ప్రగాల్పాలు చెబుతుంటారని మండిపడ్డారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు సరైనా ఆధారాలను అందించలేకపోయిందంటూ కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ జమ్మూలోని భారత్ జోడోయాత్రలో రాహుల్‌తో కలసి ఈ విషయాలు గురించి మాట్లాడారు. అంతేగాదు 300 కిలోల ఆర్డిఎక్స్ ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, వాస్తవానికి జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో సుమారు18 మంది సైనికులు మరణించారు. దీంతో 2016లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించింది.అయితే కాంగ్రెస్ పార్టీ పుల్వామా దాడి, వైమానిక దాడుల గురించి బీజేపీ కొంతకాలం వరకు ప్రశ్నలు సంధించింది. ఐతే బీజేపీ మన సైన్యాన్నే అనుమానిస్తున్నారా? అని గట్టి కౌంటర్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది. पुलवामा हादसे में आतंकवादी के पास ३०० किलो RDX कहॉं से आई? देवेंद्र सिंह डीएसपी आतंकवादियों के साथ पकड़ा गया लेकिन फिर क्यों छोड़ दिया गया? पाकिस्तान व भारत के प्रधानमंत्री के मैत्री संबंधों पर भी हम जानना चाहते हैं। pic.twitter.com/1wVbJEDPIC — digvijaya singh (@digvijaya_28) January 23, 2023 (చదవండి: వీడియో: అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి: మరోసారి స్పష్టం చేసిన రాహుల్ గాంధీ) -
చైనా, పాక్ భాష
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చైనా వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. అరుణాచల్‌లోని తవాంగ్‌లో భారత జవాన్లను చైనా సైనికులు కొట్టారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ నిరంతరం చైనా, పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉంటారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. శనివారం నడ్డా మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను కాంగ్రెస్ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడులపై గతంలో రాహుల్ సందేహాలు వ్యక్తం చేశారని, ఇవన్నీ చూస్తుంటే ఆయనకున్న దేశభక్తి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలతో సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. పార్టీని ఖర్గే తన నియంత్రణలోకి తీసుకొని రాహుల్‌ని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఆ దేశ భాష రాహుల్ మాట్లాడుతూ ఉంటారని ఆరోపించారు. ఆర్మీపై రాహుల్‌కు నమ్మకం లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. -
ఇమ్రాన్‌ఖాన్‌ను ఆధారాలు కోరవచ్చు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: పాకిస్తాన్‌పై సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సీఎం కేసీఆర్ ఆధారాలు కోరడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలుగా అభినందన్ వర్ధమాన్ పరాక్రమం, సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ఫ్లై జోన్‌ను నిషేధించిన పాకిస్తాన్ చర్యలు సరిపోవా అని నిలదీశారు. ఇవీ చాలకపోతే కేసీఆర్ నేరుగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆధారాలు కోరవచ్చని చురకలంటించారు. కేసీఆర్ బాధ్యతారహితంగా చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన టుక్డే.. టుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్‌తో చేరినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఆయన స్పందనలేని గుణానికి, బాధ్యతారాహిత్యానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విడిగా ఓ ప్రకటనలోనూ ధ్వజమెత్తారు. కేసీఆర్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఈ తీరును వారు ఎన్నటికీ క్షమించరన్నారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: కేంద్ర మంత్రులు ఠాకూర్, గిరిరాజ్ సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. సైనికుల ధీరత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడటం ఆయన మానసిక వైఫల్యాన్ని సూచిస్తోందన్నారు. పాక్ సైనికులపైనే కేసీఆర్‌కు ఎక్కువ నమ్మకం ఉన్నట్లుందని అనురాగ్ పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు కావాలంటే నేరుగా పాక్‌నే కోరాలని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సవాల్ సూచించారు. దేశం క్షమించదు: అసోం సీఎం సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అవమానిస్తే దేశం క్షమించదని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై సైన్యం చూపిన వీడియో ఆధారాలు కేసీఆర్‌కు చాలవా అని ఆయన ప్రశ్నించారు. సైన్యంపై దాడి చేయాలని, దుష్ప్రచారం చేయాలని ఎందుకు తహతహలాడుతున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ సైన్యంపై అవిశ్వాసం చూపరాదని విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. -
‘డియర్ కేసీఆర్ గారూ’.. అంటూనే కౌంటర్
సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ఆధారాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే వ్యవహారం డర్టీ పాలిటిక్స్‌కు తెర తీసింది. రాహుల్ గాంధీకి మద్ధతుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. బీజేపీని, రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను తప్పుబట్టారు. ఈ క్రమంలో ఇవాళ అవతలి నుంచి సీఎం కేసీఆర్‌కు కౌంటర్ పడింది. రాహుల్ లాగే తాను కూడా కేంద్రాన్ని అదే డిమాండ్ చేస్తున్నానని... సర్జికల్ స్ట్రయిక్స్‌కు ఆధారాలు చూపాలని అడుగుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘డియర్ కేసీఆర్ గారూ, మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌కు వీడియోగ్రాఫిక్ సాక్ష్యం. అయినప్పటికీ మీరు మా సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారు. సైనికులను అవమానిస్తున్నారు. మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. మన సైన్యాన్ని అవమానిస్తే నవ భారతదేశం సహించదు అంటూ కూ యాప్‌లో పోస్ట్ చేశాడాయన. Koo App Dear KCR garu, here is the videographic evidence of the surgical strike by our brave army. In spite of this you question the valor of our Armed forces and insult them. Why are you so desperate to attack and malign our Army? New India will not tolerate insults against our Army. View attached media content - Himanta Biswa Sarma (@himantabiswa) 14 Feb 2022 పుల్వామా దాడి వార్షికోత్సవం సందర్భంగా సర్జికల్ స్ట్రయిక్స్ ను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు మళ్లీ మన అమరవీరులను అవమానించాయని హిమంత అంటున్నారు. నెహ్రూ కుటుంబం తమ విధేయతను నిరూపించుకునే ప్రయత్నంలో వారు సైన్యానికి ద్రోహం చేసేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సైన్యం పట్ల తనకు ఎంతో విధేయత ఉందని, జీవితకాలమంతా తనను విమర్శించినా పట్టించుకోబోనని తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీని ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు కావాలని రాహుల్ అడిగారని.. ఆయన(రాహుల్) రాజీవ్ కు పుట్టారనే ఆధారాలను బీజేపీ ఎప్పుడైనా అడిగిందా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు నేతలు.. హిమంతపై నిప్పులు చెరగ్గా.. అందులో కేసీఆర్ కూడా ఉన్నారు. హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సైతం బీజేపీని డిమాండ్ చేశారు కేసీఆర్. -
'సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్‌లో బిపిన్ రావత్ పాత్ర మరువలేం'
సాక్షి, హైదరాబాద్: బిపిన్ రావత్‌లోని కృషి, పట్టుదలే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని రావత్ స్నేహితుడు కల్నల్ పి.వి. దుర్గాప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బిపిన్‌రావత్‌తో 20 ఏళ్ల పాటు కలిసి పనిచేశాను. ఆయన అందరితో కలసిపోయే స్వభావం కలవాడు. మూడు రక్షణ విభాగాలను ఒకే తాటిపై తీసుకురావడంలో బిపిన్ రావత్ పాత్ర మరువలేనిది. రావత్ కుటుంబం మొత్తం దేశానికి సేవ చేసిన వారే. ఇద్దరం కలిసి ఒకే రెజిమెంట్‌లో పనిచేశాం. దేశ సరిహద్దుల సమస్యలను ఎదుర్కొనడంలో వ్యూహాలు రచించేవారు. అనేక కీలకమైన ఆపరేషన్లలో రావత్ ముందుండి నడిపించేవాడు. సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్‌లో రావత్ పాత్ర మరవలేము. రావత్ కుటుంబంతో మాకు మంచి పరిచయం ఉంది. రావత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుందిగల్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చినప్పుడు చివరిసారిగా కలిశాము. రావత్ మరణం దేశానికి తీరని లోటు. వ్యక్తిగతంగా జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుపుతారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు ఉంటాయి' అని కల్నల్ పి.వి. దుర్గాప్రసాద్ అన్నారు చదవండి: (Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు) -
‘చర్చించే రోజులు పోయాయ్, దెబ్బకు దెబ్బ తీస్తాం’.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాశ్మీర్లో పాకిస్తాన్ తమ దాడులను ఆపకపోతే మరిన్ని సర్జికల్ దాడులు చేస్తామని హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. తాము దాడులను సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్ నిరూపించాయి. పాక్ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. గోవాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి వెళ్లిన అమిత్ షా ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో సర్జికల్ స్ట్రైక్ ఓ చారిత్రాత్మక ఘటన. దాని ద్వారా భారత సరిహద్దులను ఎవరూ చెరపాలన్న చూసిన వారికి ఇదే గతి పడుతుందని తెలిసేలా చేశాం. గతంలో చర్చించే వాళ్లం, కానీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసే సమయమని’ షా అన్నారు. కాగా భారత్‌లో ఉరీ, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా 2016 సెప్టెంబర్‌లో పాకిస్తాన్లో భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో అనేక ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. ఉరీ దాడి జరిగిన 11 రోజుల తర్వాత 2016 సెప్టెంబర్ 29 న సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. చదవండి: Birth Day Celebrations : కళ్లు చెదిరే వేడుక..ఇలా కూడా చేస్తారా? -
పాకిస్తాన్లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్
టెహ్రాన్: పాకిస్తాన్ భూభాగంలో మంగళవారం రాత్రి తాము సర్జికైల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జైష్ ఉల్–అదల్ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్ గార్డులను విజయవంతంగా విడిపించామని పేర్కొంది. వారిని సురక్షితంగా ఇరాన్‌కు చేర్చామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్ అయిన జైష్ ఉల్–అదల్ 2018 అక్టోబర్ 16న 12 మంది ఐఆర్జీసీ గార్డులను అపహరించింది. పాక్–ఇరాన్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరు దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి, ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా సర్జికల్ స్ట్రైక్స్‌తో ఇరాన్ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది. ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్–అదల్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తోంది. ఇరాన్‌లోని బలూచ్ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెబుతోంది. -
అభినందన్ నన్ను మెచ్చుకున్నారు: పాక్ వ్యక్తి
ఇస్లామాబాద్: తాను చేసిన టీ తాగి.. భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ తనను ప్రశంసించారని పాకిస్తాన్‌కు చెందిన అన్వర్ అలీ అన్నాడు. రుచికరమైన టీ ఇచ్చినందుకు తనకు ధన్యవాదాలు కూడా తెలిపారని పేర్కొన్నాడు. వైమానిక దాడుల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అభినందన్ నుంచి భారత సైన్యానికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ముఖం నిండా రక్తంతో ఉన్న అభినందన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అంతర్జాతీయంగా.. చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో పాక్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో అభినందన్ టీ తాగుతూ.. కాస్త ప్రశాంతమైన వదనంతో కనిపించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.(పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ) కాగా ఇదంతా జరిగి గురువారం నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరు.. అభినందన్‌కు టీ ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న అన్వర్ అలీతో మాట్లాడాడు. ‘‘శత్రుసైన్యానికి చెందిన పైలట్’’కు మర్యాద చేయడాన్ని ఎలా భావిస్తున్నారని సదరు జర్నలిస్టు అతడి అడుగగా... ‘‘ ఆయన మా అతిథి. టీ తాగి బాగుందని చెప్పారు’’అని పేర్కొన్నాడు. అభినందన్‌కు ఆనాడు అందించిన కప్, సాసర్ను ఈ సందర్భంగా అందరికీ చూపించాడు. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ భూభాగంలో దిగిన ఆయన.. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నిర్వర్తించిన అభినందన్‌ను.. వీరచక్ర శౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. This gentleman Anwar Ali made tea for Indian Air Force Pilot Wing Commander #abhinandan he told me “woh mehman tha” no bad words pic.twitter.com/KNby8Q2XpQ — Hamid Mir (@HamidMirPAK) February 26, 2020 -
సర్జికల్ స్ట్రైక్ 3.0
-
‘ఎన్నికలొస్తే సర్జికల్ స్ట్రైకులొస్తాయ్’
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలొచ్చినప్పుడే.. సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైకులొస్తున్నాయని.. వాస్తవ సమస్యలను మరుగుపరిచేందుకే బీజేపీ సైనికులను అడ్డుపెట్టుకుని ఆటలాడుతోందని కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రసాద్ సింగ్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, హరియాణా ఎన్నికలకు ఒక్కరోజు ముందే ఈ దాడులు బయటకు రావడం వెనుక మతలబేంటని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్జికల్ స్ట్రైక్స్ కనిపించడం మోదీ ప్రభుత్వంలో సర్వసాధారణమైందని ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి మాత్రం భారత సైనికుల ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. సైనికుల ధైర్యాన్ని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. -
‘బాలాకోట్ తర్వాత పాక్ ఆ దుస్సాహసం చేయలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్ ఎన్నడూ వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)ను దాటలేదని ఐఏఎఫ్ చీఫ్ బీరేందర్ సింగ్ ధనోవా పేర్కొన్నారు. భారత వైమానిక దళం తన సైనిక ఆశయం నెరవేర్చడంలో విజయవంతమవగా, పాకిస్తాన్ విఫలమైందని స్పష్టం చేశారు. పాక్ యుద్ధ విమానాలు ఎల్ఓసీని అతిక్రమించలేదని తెలిపారు. మన సైనిక స్ధావరాలపై దాడులు తలపెట్టాలన్న పాకిస్తాన్ కుట్ర ఫలించలేదని చెప్పారు. వారు (పాక్) మన గగనతలంలోకి రాలేదని అదే మన విజయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడం వారి సమస్యని, మన ఆర్థిక వ్యవస్ధకు విమాన ట్రాఫిక్ కీలకమని ఎయిర్‌ఫోర్స్ ఇప్పటివరకూ పౌరవిమాన ట్రాఫిక్‌ను నిలువరించలేదని ఆయన గుర్తుచేశారు. పాక్‌తో ఉద్రిక్తతల ప్రభావం పౌర విమానయానంపై పడకుండా వ్యవహరించామని చెప్పారు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. -
‘సర్జికల్ స్ర్టైక్స్‌తోనే చెక్’
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో ఆకలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, హింసలపై విద్య ద్వారా పోరాడాల్సిన అవసరం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ దురాచారాలను నిర్మూలించేందుకు ఉపాధ్యాయులు, విద్యా శాఖాధికారులు వాటిపై మెరుపు దాడులు చేయాలని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల అధిపతులు, ఉపాధ్యాయులు, తనిఖీ అధికారుల శిక్షణా కార్యక్రమంలో సిసోడియా మాట్లాడుతూ చిన్నారుల్లో సంతోషం నింపడం, వారు సమాజంలో ఇతరుల సంతోషానికి కారణం కావడమే విద్య అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. వార్తాపత్రికల్లో ఎన్నో అంశాలు మనల్ని బాధకు గురిచేస్తాయని, వాటిపై సైన్యం సర్జికల్ స్ర్టైక్స్ చేయలేదని, మీరే ఆ పనిచేయాలని ఉద్భోదించారు. వార్తాపత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కే ఈ దురాచారాలపై ఉపాధ్యాయులు, విద్యా శాఖాధికారలు మెరుపు దాడులు చేయాలని సూచించారు. -
సర్జికల్ స్ట్రైక్స్: బాంబ్ పేల్చిన ఆర్మీ టాప్ కమాండర్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ విషయమై ఆర్మీ నార్తన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రణ్‌బీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉడీ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగానే భారత ఆర్మీ తొలిసారి 2016 సెప్టెంబర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ తొలిసారి తామే నిర్వహించామని బీజేపీ చెప్పుకుంటుండగా... ఆ వాదనను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో భారత ఆర్మీ ఆరుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్టు కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత రాజీవ్ శుక్లా తమ హయాంలో ఎప్పుడెప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో తేదీలతో సహా వెల్లడించారు. తమ హయాంలో సర్జికల్ దాడులు జరిగినా.. వాటి క్రెడిట్ ఎప్పుడూ తీసుకోలేదని, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, వాజపేయి ఈ దాడులపై ఎన్నడూ విలేకరుల సమావేశం నిర్వహించి.. తమదే ఘనత చెప్పుకోలేదని ఆయన బీజేపీని దుయ్యబట్టారు. అయితే, మోదీ హయాంలోనే తొలిసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని ధ్రువీకరిస్తూ ఆర్మీ టాప్ కమాండర్ వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. 2016 సెప్టెంబర్ 18న ఉడీలోని భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపి.. 18మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా పదిరోజుల అనంతరం పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించింది. -
‘బాలాకోట్ వైమానిక దాడుల గురించి తెలియదు’
చంఢీగడ్ : బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బాలాకోట్ ఉగ్రదాడుల గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సన్నీ డియోల్ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సన్నీ డియోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలకోట్లో భారత వాయుసేన జరిపిన వైమానిక దాడుల గురించి తనకు ఎక్కువగా తెలియదన్నారు. అంతేకాక భారత్ - పాక్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు గురించి కూడా తనకు అంతగా అవగాహన లేదన్నారు. కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. దేశానికి సేవ చేయాలని భావిస్తున్నట్లు సన్నీ డియోల్ తెలిపారు. గురుదాస్‌పూర్ నుంచి మీరు విజయం సాధిస్తారా అని ప్రశ్నించగా.. ఏమో.. ప్రస్తుతానికి ఏం చెప్పలేనన్నారు సన్నీ డియోల్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రశంసల వర్షం కురిపించారు సన్నీ డియోల్. గత ఐదేళ్లుగా నరేంద్ర మోదీ దేశానికి చాలా సేవ చేశారని పొగిడారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తాను మోదీ ప్రజాదరణ మీద ఆధారపడనని స్పష్టం చేశారు సన్నీ డియోల్. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే.. తాను కూడా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటానని సన్నీ డియోల్ పేర్కొన్నారు. -
సర్జికల్ దాడులు.. కాంగ్రెస్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ అంశంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. కొన్ని రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. యూపీఏ హయాంలో ఆరు సార్లు సర్జికల్ దాడులు చేశామని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే యూపీఏ హయాంలో ఒక్కసారి కూడా సర్జికల్ దాడులు జరగలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమాధానంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన రోహిత్ చౌదరీ అనే వ్యక్తి 2004 నుంచి 2014 మధ్యలో జరిగిన మెరుపుదాడులకు సంబంధించిన వివరాలు అందించాల్సిందిగా ఆర్టీఐని ఆశ్రయించాడు. ఇందుకు సమాధానంగా కేంద్ర మంత్రిత్వ శాఖ 2004 నుంచి 2014 మధ్యలో ఒక్క సారి కూడా మెరుపు దాడులు జరగలేదని పేర్కొంది. ప్రస్తుతం తమ దగ్గర 2016, సెప్టెంబర్‌లో యూరి సెక్టార్లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. -
‘త్రివిధ దళాలను ఆయన ఆస్తి అనుకుంటున్నారు’
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ హయాంలో కూడా ఆరు సార్లు సర్జికల్ దాడులు చేశామని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను మోదీ ఖండించారు. బహుశా వారు వీడియో గేమ్‌లో సర్జికల్ దాడులు చేసి ఉంటారని మోదీ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండి పడ్డారు. ‘సైన్యం మోదీ తన సొంత ఆస్తి కాదు. కానీ త్రివిధ దళాలలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలను మోదీ తన ఆస్తిగా భావిస్తున్నార’ని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘సర్జికల్ దాడులు చేసింది మోదీ కాదు.. ఆర్మీ. యూపీఏ కూడా సర్జికల్ దాడులు చేసిందంటే మోదీ.. అవి నిజం కావు.. వీడియో గేమ్ అని ఎగతాళి చేశారు. అలా మాట్లాడి ఆయన ఆర్మీని కూడా అవమానించార’ని పేర్కొన్నారు. అంతేకాక ‘జనరల్ విక్రమ్ సింగ్ చెప్పింది నిజం. 2008 - 2014 వరకు యూపీఏ ప్రభుత్వం ఆరు సార్లు సర్జికల్ దాడులు చేసింది. అంతేకాక అవి ఏ రోజున జరిగాయనే వివరాలను కూడా అందజేశాం. అయితే వీటిని మా పార్టీ ఓట్ల కోసం వాడుకోవడం లేద’న్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందన్నారు రాహుల్. మోదీ పెద్ద నోట్లు రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవి ఏమైనవని రాహుల్ ప్రశ్నించారు. ఉద్యోగుల గురించి కానీ, రైతుల గురించి కానీ మోదీ ఏమీ మాట్లాడడం లేదన్నారు. చౌకీదార్ చోర్‌హై అన్న వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పినట్లు రాహుల్ అంగీకరించారు. కానీ ఆ వ్యాఖ్యల పట్ల బీజేపీకి ఎన్నటికి క్షమాపణలు చెప్పబోనన్నారు. చౌకీదార్ చోర్ హై అన్నది కాంగ్రెస్ నినాదంగా పనిచేస్తుందన్నారు. మసూద్ అజర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కానీ గతంలో అతన్ని ఎవరు విడిచి పెట్టారని రాహుల్ ప్రశ్నించారు. -
వారి దాడులు కాగితాలపైనే
జైపూర్/సికార్/హిందౌన్ సిటీ: కాంగ్రెస్ హయాంలో సర్జికల్ దాడులు కేవలం కాగితాలపైనే జరిగాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి వెళ్లి దాడులు జరిపాయన్న ఆ పార్టీ నేతల ప్రకటనలపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. శుక్రవారం ప్రధాని రాజస్తాన్‌లోని జైపూర్, సికార్, హిందౌన్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మా ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లు ప్రకటించగానే కాంగ్రెస్ ఖండించింది. ఆ తర్వాత వ్యతిరేకించింది. ఇప్పుడు నేను కూడా అంటోంది (మీ టూ)’ అని తెలిపారు. ‘యూపీఏ జమానాలో మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు ఆ పార్టీ నేత(రాహుల్) ప్రకటించారు. ఇప్పుడేమో మరొక నేత దానిని ఆరుసార్లకు పెంచారు. ఈ ఎన్నికలు పూర్తయ్యేలోగా ఈ సంఖ్య 600కు చేరుకుంటుంది. కాగితాలపైనే చేసిన ఈ దాడులతో ఫలితమేంటి? కాంగ్రెస్ అబద్ధాలు మాత్రమే చెబుతుంది’ అని అన్నారు. మై ఆప్కా ‘అభినందన్’ కర్తా హూ మీ అందరికీ శుభాకాంక్షలు (మై ఆప్కా ‘అభినందన్’ కర్తా హూ) అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ‘ఇలా అని నేను అనగానే కాంగ్రెస్ వాళ్లు...ఐఏఎఫ్ పైలెట్ అభినందన్ పేరును ప్రస్తావించి ప్రధాని మోదీ నిబంధనావళిని అతిక్రమించారంటూ ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేస్తారు. ఆపై వాళ్ల నేత సుప్రీంకోర్టుకు వెళతారు. దీంతో కోర్టు ఒక వారంలోగా ఈ విషయాన్ని పరిష్కరించండంటూ ఈసీని కోరుతుంది. మోదీ నిబంధనలను ఉల్లంఘించలేదని, ప్రజలకు అభివాదం చేశారని ఈసీ స్పష్టం చేస్తుంది. వెంటనే కాంగ్రెస్ మీడియాను పిలిచి నన్ను విమర్శిస్తుంది’ అని వ్యంగ్యంగా అన్నారు. ‘అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినందుకు సంతోషపడాల్సింది పోయి.. ఎన్నికల సమయంలో ఇలా జరిగినందుకు కాంగ్రెస్ విచారంతో ఉంది. ఐరాస అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్నీ ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. అలా ప్రకటించడానికి ముందుగా మేడమ్(సోనియా గాంధీ), నామ్‌దార్(రాహుల్)లను ఐరాస సంప్రదించాలని కాంగ్రెస్ అనుకుంటోందా’ అని ప్రధాని ప్రశ్నించారు. 125 రోజుల్లో దేశమంతా.. న్యూఢిల్లీ: డిసెంబర్ 25 నుంచి మే 1 మధ్య 125 రోజుల్లో మోదీ దేశం మొత్తాన్నీ చుట్టేశారు. ఆయన వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, ఎన్నికల ప్రచారం కోసం మోదీ ఈ 125 రోజుల్లో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, జామ్‌నగర్ నుంచి సిల్చార్ వరకు దేశం నలుదిక్కులా పర్యటిస్తూ శాస్త్రవేత్తలు, రైతులు తదితరులతో మాట్లాడారని వెబ్సైట్ పేర్కొంది. ప్రజలకు హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని సత్వరమే నెరవేర్చేందుకు కృషి చేశారంది. ప్రధానమంత్రి రైతు గౌరవనిధి తదితర పథకాలను ఉదాహరణలుగా చూపింది. -
మా సర్జికల్ దాడులివీ..
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని వెల్లడించిన కాంగ్రెస్ అందుకు సంబంధించిన జాబితాను బహిర్గతం చేసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టామని, కానీ ఏనాడు వాటిని రాజకీయాల కోసం వినియోగించుకోలేదని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా గురువారం మీడియా సమావేశంలో జాబితాను వెల్లడించారు. 2008 జూన్ 19న పూంచ్‌లోని భట్టల్ సెక్టార్ ప్రాంతంలో, 2011 ఆగస్టు 30–సెప్టెంబర్ 1 తేదీల్లో కేల్లో నీలమ్ నదీ ప్రాంతంలోని శార్దా సెక్టార్లో, 2013 జనవరి 6న సవన్ పత్ర చెక్‌పోస్ట్ వద్ద, 2013 జూలై 27–28 తేదీల్లో నజపిర్ సెక్టార్లో, 2013 ఆగస్టు 6న నీలమ్ లోయ ప్రాంతంలో, మరొకటి 2013 డిసెంబర్ 23న చేపట్టినట్లు తెలిపారు. అలాగే వాజ్‌పేయ్ ప్రభుత్వంలోనూ రెండు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు వెల్లడించారు. 2000 జనవరి 21న నీలమ్ నది ప్రాంతంలోని నదలా ఎన్క్లేవ్, 2003 సెప్టెంబర్ 18న పూంచ్‌లోని బార్హో సెక్టార్లో దాడులు చేసినట్లు తెలిపారు. మన్మోహన్ ఇంటర్వ్యూ తర్వాత... యూపీఏ హయాంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. -
నాయకుల ‘అవాక్కులు’!
నిబంధనలంటే భయభక్తులు లేవు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని లేదా అంటారని బెరుకు లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికల సంఘం వేయి కళ్లతో నిఘా పెట్టి ఉంచుతుందని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే చర్యలు తీసుకునే ప్రమాదమున్నదన్న భీతి అసలే లేదు. ప్రచార సభల్లో వివిధ పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు ప్రజలను దిగ్భ్రాంతిపరుస్తున్నాయి. వీళ్ల నోళ్లకు తాళం వేసేవారెవరూ లేరా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఈ జాబితా లోకెక్కే నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వరసగా రెండు రోజులు వివిధ సభల్లో పాల్గొని చేసిన ప్రకటనలు ఆయన స్థాయిని మాత్రమే కాదు... మన ఎన్నికల సంఘం సమర్థతను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మన సైన్యాన్ని ఆయన ‘మోదీ సేన’గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వృత్తిపరమైన నైపుణ్యంలోనూ, అంకిత భావంలోనూ ప్రపంచంలోనే మన సైన్యానికి పేరుంది. దాన్ని రాజకీయ సంకుచిత చట్రంలో ఇరి కించాలని చూడటం దిగజారుడుతనమే అవుతుంది. తాము వచ్చాకే ఉగ్రవాదులతో కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. కానీ సైన్యం నిర్వహించిన దాడుల్ని సొంత ఖాతాలో వేసుకోవాలని చూడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటి దాడులు గత ప్రభుత్వాల హయాంలో కూడా జరిగాయని లోగడ సైన్యంలో పనిచేసినవారు చెబుతున్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించడానికి ఏ శక్తులైనా ప్రయత్నించినప్పుడు, వారి ఆనుపానులు తెలుసుకుని తగిన వ్యూహాన్ని రూపొందించుకుని దాడులు చేయడం సైన్యానికి సర్వసాధారణం. కానీ దాన్ని మోదీ సేనగా అభివర్ణించి, వారు చేసిన పని తమ ఘనతగా చెప్పుకోవడం అభ్యంతరకం. మన సైన్యం ఫొటోలను వాడుకోవడం, దాని ప్రస్తావన తీసుకురావడం నిబంధనల ఉల్లంఘన కిందికొస్తుందని ఎన్నికల సంఘం గత నెల 17న స్పష్టంగా చెప్పింది. కానీ యోగి ఆదిత్యనాథ్‌కు ఇవేమీ పట్టలేదు. అంతకు ముందురోజు గ్రేటర్ నోయిడాలోని బిసారా(దాద్రి) గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో సైతం ఆయన ఇలాంటి విపరీత వ్యాఖ్యలే చేశారు. బిసారా నాలుగేళ్లక్రితం ఉన్మాద మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన అఖ్లాక్ స్వగ్రామం. ‘ఇక్కడేం జరిగిందో గుర్తులేనిదెవరికి? మన భావోద్వేగాలను అణిచేయడానికి అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం ఎలా ప్రయత్నించిందో మరిచిపోగలమా?’ అంటూ ఆ సభలో ఆయన ప్రసంగించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందో లేదో ఆరా తీయడం... అది జరగకపోతే అందుకు ఉన్న అవరోధాలను తొలగించడం ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. సమాజ్‌వాదీ సర్కారు అణిచేయడానికి ప్రయత్నించిన ఆ భావోద్వేగాలేమిటో యోగి వివరించలేదుగానీ...అఖ్లాక్ కుటుంబానికి జరిగిన అన్యాయమైతే చాలా తీవ్రమైనది. తండ్రిపై ఉన్మాద మూక దాడిచేస్తున్నప్పుడు అఖ్లాక్ చిన్న కుమారుడు అడ్డు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ మూక అతనిపై సైతం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వైద్య చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు. ఆ గ్రామంలో తాము ఏకాకులమని, తమనెవరూ రక్షించబోరని గుర్తించి ఆ కుటుంబం వేరేచోటకు వలసపోయింది. ఆ దాడికి కారకులైనవారిని వెనువెంటనే అరెస్టు చేసి, వారిపై పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించి శిక్షపడేలా చేయాల్సిన సమాజ్‌వాదీ ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైంది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ కేసులోని నిందితులను కాపాడు తున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అవి కేవలం ఆరోపణలు కాదు... నిజాలన్నట్టుగా యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించిన ఆ సభలో అఖ్లాక్ కేసు ప్రధాన నిందితుడు విశాల్ సింగ్ రాణా, మరో 15మంది పాల్గొన్నారు. వారిపై హత్య, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులున్నాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆ కేసులో ఇంకా అభియోగాలే నమోదు కాలేదు. ఇది జరగకపోగా ఎన్నికలసభలో ఆ కేసులోని నిందితులకు మద్దతిచ్చే విధంగా ముఖ్యమంత్రే మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది. ఒకవేళ ఆ కేసులో నిందితులుగా ఉన్నవారు అమాయకులని, అన్యాయంగా కేసులు పెట్టారని అనుకుంటే అసలు నిందితులెవరో ఈపాటికి యోగి సర్కారు వెలికితీయాల్సింది. ఆ సంగతినీ తేల్చకుండా, నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోకుండా ‘ఇక్కడ భావోద్వేగాలు అణిచేయడానికి ప్రయత్నించార’ంటూ మాట్లాడటం వల్ల ఎవరికి ఉప యోగం? మరి కుటుంబ పెద్దను కోల్పోయి, సొంత ఊరును విడిచి దిక్కులేని పక్షుల్లా ఎటో పోవా ల్సివచ్చిన అఖ్లాక్ కుటుంబానికి జరిగిన అన్యాయం మాటేమిటి? ఒక్క యోగి ఆదిత్యనాథ్ మాత్రమే కాదు, రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కావడం అవసరమని భావిస్తున్నారని ఒక సభలో చెప్పారు. గవర్నర్ పదవి రాజ్యాంగపరమైనది. దాన్ని అధిష్టించినవారికి కొన్ని పరిధులు, పరి మితులు ఉంటాయి. ముఖ్యమంత్రిగా, ఎంపీగా సుదీర్ఘకాలం సేవలందించిన కల్యాణ్‌సింగ్‌కు ఈమాత్రం తెలియదనుకోలేము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన స్థాయి దిగజార్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. జనాన్ని బెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నాయకుల వ్యాఖ్యలపై ఫిర్యాదులందినప్పుడు ఎన్నికల సంఘం స్పందించి నోటీసులు జారీ చేస్తోంది. కల్యాణ్‌సింగ్ వ్యాఖ్యల్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దృష్టికి తీసుకురావాలని అది నిర్ణ యించిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే మరింత కఠినమైన చర్యలు తీసు కునేందుకు అవసరమైన అధికారాలను ఎన్నికల సంఘానికి కల్పిస్తే తప్ప వీటిని పూర్తిగా అరి కట్టడం సాధ్యం కాదు. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? పార్టీలన్నీ ఈ విషయంలో కలిసి వస్తాయా? అది జరిగేవరకూ యోగి, కల్యాణ్‌సింగ్, చంద్రబాబు లాంటివారు ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉంటారు. -
భూమి.. ఆకాశం.. అంతరిక్షం
మీరట్/న్యూఢిల్లీ/అఖ్నూర్/డెహ్రాడూన్: శత్రుదేశాలపై భూ, గగనతలం, అంతరిక్షంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం తెగువ చూపిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ఎన్డీయే ప్రభుత్వానికి మరోసారి ఓటేయాలని నిర్ణయించుకున్నారన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్ పరీక్ష విజయవంతం కావడంపై స్పందిస్తూ.. శత్రుదేశాల నుంచి భారత్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు థియేటర్ సెట్‌కు, ఏ–శాట్‌కు తేడా తెలియడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం యూపీ, ఉత్తరాఖండ్, కశ్మీర్లో పర్యటించిన మోదీ, విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలముందు పెడతాం.. భారత్‌ను దొంగదెబ్బ తీస్తున్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు ఎన్డీయే ప్రభుత్వం ధైర్యంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘దమ్మున్న బీజేపీ ప్రభుత్వానికి, కళంకితులైన ప్రతిపక్షాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే మా రిపోర్టు కార్డును ప్రజల ముందు ఉంచడంతో పాటు గత 60 ఏళ్లలో ప్రతిపక్షాలు ఏం చేశాయన్న విషయమై నిలదీస్తాం’ అని వెల్లడించారు. రాçహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్)పై స్పందిస్తూ..‘పేద ప్రజల చేత కనీసం బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించలేనివాళ్లు ఇప్పుడు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోకి నగదును జమచేస్తామని హామీ ఇస్తున్నారు. అంతకంటే వాళ్లేం చేయగలరు?’ అని వ్యాఖ్యానించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో ఇచ్చిన గరీబీ హటావో(పేదరికాన్ని తరిమేద్దాం) నినాదాన్ని తాను చిన్నప్పటి నుంచి వింటున్నాననీ, కానీ దేశంలో పేదరికం తగ్గకపోగా పేదలు నిరుపేదలుగా మారారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే పేదరికం దానంతట అదే అంతమైపోతుందని వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసమే ‘రఫేల్’ ఆలస్యం.. తనపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్లో ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ నేతల ప్రసంగాలను పాకిస్తాన్లో ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కాంగ్రెస్ ప్రతిస్పందన నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. మోదీపై వ్యతిరేకత వీళ్లను గుడ్డివాళ్లను చేసేసింది. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసేవారితో కాంగ్రెస్ జతకడుతోంది. 2008లో ఉగ్రవాది తర్వాత కూడా కాంగ్రెస్ నేతల రక్తం మరగలేదు....’ అని మండిపడ్డారు. అనంతరం ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో మాట్లాడుతూ.. కమీషన్లపై కన్నేసిన కాంగ్రెస్ దేశభద్రతను పణంగా పెట్టి రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలును ఆలస్యం చేసిందని మోదీ ఆరోపించారు. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్ ప్రసుత్తం కోర్టులో నిజాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడన్నారు. ఆరోగ్యానికి మంచిది కాదు.. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–ఆర్ఎల్డీ–బీఎస్పీలు మహాకల్తీ కూటమిగా తయారయ్యాయని విమర్శించారు. ‘ఈ మూడు పార్టీల పేర్లలోని తొలి అక్షరాన్ని తీసుకుంటే సరాబ్(షరాబ్–మద్యం)అని అర్థం వస్తుంది. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ మహాకల్తీ కూటమి పాలనలో ఉగ్రవాదం దేశమంతటా విస్తరించింది. యూపీలో చేతులు కలిపిన ఎస్పీ–బీఎస్పీలు ‘ఒకరి తర్వాత మరొకరం యూపీని దోచేద్దాం’ అనే నినాదంతో వెళ్తున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించారు’ అని ప్రధాని తెలిపారు. బాలాకోట్ ఉగ్రస్థావరంపై దాడికి సంబంధించి సాక్ష్యాలు చూపాలన్న విపక్షాల విమర్శలపై స్పందిస్తూ..‘మనకు సాక్ష్యాలు కావాలా? లేక భారతమాత పుత్రుడు కావాలా? సాక్ష్యాలు చూపాలంటూ ఈ భారతమాత బిడ్డ(మోదీ)ను కొందరు సవాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. సరాబ్, షరాబ్కు తేడా తెలియదా? తమను మద్యంతో పోల్చడంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ప్రధాని మోదీ విద్వేషపు మత్తులో మాట్లాడుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఆయనకు సరాబ్ (ఎండమావి), షరాబ్(మద్యం)కు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను మద్యంతో పోల్చడం ద్వారా మోదీ పేదలను అవమానించారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. ప్రధాని తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలనీ, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా మోదీ తన స్థాయిని దిగజార్చుకున్నారని పేర్కొన్నారు. -
సర్జికల్ స్ట్రయిక్స్.. ఓట్లు కురిపిస్తుందని బీజేపీ ఆశ
రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ చేతిలో ఓటమి.. మందకొడిగా ఆర్థిక వ్యవస్థ.. పతాకస్థాయికి నిరుద్యోగం.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఇలాంటి పరిస్థితిని ఏ పార్టీ కూడా కోరుకోదు. సీన్ కట్ చేస్తే... పుల్వామా ఉగ్రదాడి.. అందుకు ప్రతిగా భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్.. భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చేలా మారిపోయాయా? అయితే.. ఓటర్లను వర్గాలుగా వేరు చేసే ఇలాంటి అంశాలకు రెండువైపులా పదునే అన్నది విశ్లేషకుల అంచనా!! సర్జికల్ స్ట్రైక్స్‌కు కొన్ని రోజుల ముందు ఓ ప్రముఖ దినపత్రిక ఓ సర్వే నిర్వహించింది. అందులో తేలిందేమిటంటే బీజేపీ భవిష్యత్తు ఏమంత గొప్పగా లేదూ అని! గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉంటుందని ఆ పత్రిక అంచనా వేసింది కూడా. అయితే రెండు వారాలు గడిచాయో లేదో.. పుల్వామాదాడి జరగడం.. అందుకు ప్రతిగా భారత వాయుసేన పాకిస్తాన్ లోపలికి చొచ్చుకుపోయి బాలాకోట్‌పై బాంబులు కురిపించడంతో పరిస్థితి మొత్తం తారుమారైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు బాలాకోట్ దాడికి సంబంధించిన రుజువులు కోరడంతో పరిస్థితి బీజేపీకి మరింత అనుకూలంగా మారింది. దశాబ్దాలుగా కశ్మీర్ అంశంపై ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెప్పగలిగిన వాడు మోదీ ఒక్కడే అన్న అభిప్రాయం ఒక వర్గంలో బలపడగా.. ఇవన్నీ గిమ్మిక్కులేనని నమ్మేవాళ్లు ఇంకో వర్గంలో చేరిపోయారు. ఈ రకమైన పోలరైజేషన్ కారణంగా ఓటేసే సమయానికి సామాన్యుడు ఇతర వాటన్నింటినీ పక్కనబెట్టి దేశ భద్రత అంశంవైపే మొగ్గు చూపుతాడని నిపుణులు చెబుతారు. జాతీయవాదం బీజేపీకి అనుకూలం? ప్రతిపక్షాలను దేశద్రోహులుగా చిత్రీకరించి మెజార్టీ ప్రజలను తమకనుకూలంగా తిప్పుకునేందుకు జాతీయ వాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దుల్లో సైనికులు మరణిస్తుంటే మీరు అలా చేస్తారా? ఇలా చేస్తారా? అని తన సోషల్ మీడియా సైన్యంతో ప్రతిపక్షాలపై ఈ జాతీయవాదులు ఓ స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. జాతీయ వాదమన్న అంశాన్ని ముందుంచడం ద్వారా మోదీ ప్రతిపక్షాల కంటే రెండు అడుగులు ముందు ఉన్నారని, మోదీ ప్రసంగాల్లో హిందుత్వం కంటే, జాతీయ వాద భావజాలమే ఎక్కువగా ఉండటం ఈ వ్యూహంలో భాగమే కావచ్చునని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైనిక చర్యలతో నష్టమూ లేకపోలేదు బాలాకోట్ దాడుల వల్ల ఎన్నికల్లో అధికార పార్టీకి లాభం చేకూరడంతోపాటు నష్టం కూడా జరిగే అవకాశముంది. భారతదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఇలాంటి సైనిక చర్యల వల్ల అధికారంలో ఉన్న పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత 1993లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడం.. మరోవైపు గోద్రా మారణకాండ తరువాత 2002లో అసెంబ్లీ రద్దు తరువాత జరిగిన ఎన్నికల్లో మోదీ మళ్లీ విజయం సాధించడం.. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్ల శాతం పెరగడాన్ని చూస్తే.. పోలరైజేషన్ అన్నది ఆ పార్టీకి అనుకూలంగా మారిందని తెలుస్తుంది. అయితే బాబ్రీ ఘటన తరువాతి యూపీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు జట్టుకట్టడం వల్ల బీజేపీ అధికారం కోల్పోయింది. మొత్తమ్మీద ఒక అంశం ఆధారంగా ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోవడం అధికార పార్టీకి లాభమా? నష్టమా అనేది చెప్పడం కష్టం. బాలాకోట్ దాడి ఘటనల తరువాత.. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత జరిగిన రెండు ఒపీనియన్ పోల్స్‌లోనూ భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సంస్థ చేసిన సర్వేలో బీజేపీకి గత ఎన్నికల కంటే దాదాపు 50 సీట్లు తగ్గుతాయని చెప్పడం.. సీవోటర్ ఒపీనియన్ పోల్‌లో 15 సీట్ల తగ్గుదల మాత్రమే నమోదు రావడం ఇక్కడ చెప్పుకోవాలి. -
పాక్‌తో యుద్ధం జరుగుతుందా!
సాక్షి, న్యూఢిల్లీ : 1971 తర్వాత భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా కూడా పాక్‌స్థాన్ భూభాగంలోకి భారత వైమానిక దళాలు చొచ్చుకుపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం నాడు భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తూఖ్వా రాష్ట్రంలోనికి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. ఎదురుదాడికి సిద్ధమైన పాకిస్థాన్ యుద్ధ విమానాలు బుధవారం భారత సరిహద్దులోకి దూసుకురాగా భారత వైమానికి దళం గట్టిగా ప్రతిఘటించి ఓ పాక్ యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. మిగతా పాక్ విమానాలు వెనక్కి తిరిగి పోయాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్ని ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా? అన్న చర్చ పలు వర్గాల్లో మొదలైంది. (‘యుద్ధం వస్తే గట్టిగా నిలబడండి’) ‘2016లో భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. అప్పుడు కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాని ఆ పరిస్థితులు యుద్ధానికి దారితీయలేదు. ఇప్పుడు భారత వైమానిక దళం రెండోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాయి. కాకపోతే ఈసారి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాంబులు కురిపించింది. ఇది ప్రస్తుతానికి ప్రతీకాత్మక దాడి మాత్రమే. దాడి గురించి భారత్ చెప్పే కథనానికి, పాక్ చెప్పే కథనానికి మధ్య ఎంతో వైరుధ్యం ఉంది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని, దాదాపు 350 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చని భారత దళం చెబుతుండగా, భారత విమానాలు ఖాళీ ప్రదేశంలో బాంబులను కురిపించాయని, ఆనవాళ్లు ఇదిగో! అంటూ పాక్ దళం శకలాలను చూపిస్తోంది. ఏదేమైనా పరస్పర దాడులు కొన్ని రోజులు కొనసాగవచ్చు. (సైనికేతర, ముందస్తు దాడి చేశాం) ఇది నాన్ మిలటరీ ప్రీఎంప్టీవ్ దాడులుగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారంటేనే యుద్ధానికి కాలుదువ్వడం కాదనేది అర్థం. తాము పాక్ సైనికులు లేదా పౌరులు లక్ష్యంగా దాడి చేయలేదని, ఉగ్రవాదుల లక్ష్యంగా దాడి చేశామని చెప్పడమే ఈ మాటల ఉద్దేశం. భారత్‌పై ఉగ్రదాడి జరిగినందుకు, మరిన్ని జరుగుతాయని తెల్సినందునే ఈ దాడి జరిపామని కూడా భారత వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సమాజానికి సర్ది చెప్పడం కోసం భారత వర్గాలు ఇలా మాట్లాడుతుండవచ్చు. ఒక్కసారి పాక్ సరిహద్దు రేఖను ఉల్లంఘించి లోపలకి పోయామంటే చాలు, పాక్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లే. దీనిపై ఏ దేశం ఎలా స్పందిస్తుందో భారత్‌కు ప్రస్తుతం అనవసరం. ఏ దేశమైనా తమ రాజకీయాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే స్పందిస్తాయి. 2016లో మొదటిసారి సర్జికల్ స్ట్రైక్స్ భారత వైమానిక దళం జరిపిన తర్వాత సరిహద్దులో పాక్ సైనికుల కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు మరింత పెరగవచ్చు! ఆవేశంతోనే ఉద్రేకంతోనో ఇరు దేశాల్లోని కొంత మంది యుద్ధాన్ని కోరుకోవచ్చు. ఒక్కసారి యుద్ధం మొదలయితే అది పరిమితంగా జరుగుతుందా? పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్నది చెప్పలేం. యుద్ధం అంటే ఇరువర్గాలకు అపార నష్టం. అందుకని ఇరువర్గాల సైనికులు కూడా యుద్ధాన్ని కోరుకోరు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా, లేదా? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. మరి కొన్ని రోజులు గడిస్తే స్పష్టత రావచ్చు!’ (ఢిల్లీలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అభిప్రాయాల సారాంశం ఇది) -
చెల్లెమ్మా.. ఇదిగో ప్రతీకారం!
చెల్లెమ్మా! ఇదిగో ప్రతీకారం నీ సింధూరాన్ని చెరిపిన దుర్మార్గులను పన్నెండవ రోజు వేకువ సింధూరం కనపడకముందే పిండప్రదానానికి ముష్కరుల రక్తప్రదానం చేశాము ఎరుపెక్కిన నీ కన్నీటి కళ్లకు ప్రతీకారంగా ఆకాశాన్ని ఆ దుర్మార్గుల రక్తంతో దిద్దాము నీ గుండెఘోష చల్లారకముందే వెయ్యికిలోల బాంబులు వాళ్ల విషకడుపులో కుక్కాము నువ్వు పోగొట్టుకున్నదానిని తిరిగి తేలేము కానీ ఈ దేశం... నీ దేశం అని.. మేమంతా నీ కుటుంబమని... నువ్వు అనాథవు కావని.. నీ కన్నీరు వృథా కాదని... నీ భర్త త్యాగం వ్యర్థం కాదని... దేశమంతా ఒక్కటై.. నీతో ఒక్కటై గర్జించింది... చెల్లెమ్మా! ఇదిగో ప్రతీకారం! బ్రేవో ఇండియా. – రజనీకాంత్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు పెద్ద సెల్యూట్. జైహింద్. – ప్రభాస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జయహో. – సల్మాన్ ఖాన్ మన దేశం సరైన సమాధానం ఇచ్చింది. ఎయిర్‌ఫోర్స్‌కు నా సెల్యూట్.– ఎన్టీఆర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. జైహింద్ – రామ్‌చరణ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్... మీకు సెల్యూట్ చేస్తున్నాం. దేశం గర్వించే రోజు ఇది.–అఖిల్ అక్కినేని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సెల్యూట్ చేస్తున్నా. – సోనాక్షి సిన్హా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి దేశం యావత్తూ సెల్యూట్ చేస్తోంది.– రకుల్ ప్రీత్ టెర్రరిస్ట్ క్యాంపులను సమూలంగా నాశనం చేసిన మన 12 మంది సైనికులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆ హీరోలను చూసి దేశం గర్విస్తుంది. వారి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను – కమల్‌హాసన్ మా చెంప మీద కొడితే మరో చెంప చూపించబోము. దాని బదులు మీ కాలర్‌ను పట్టుకొని చితకబాదేస్తాం. అందుకే.. మాతో పెట్టుకోవాలంటే మరోసారి ఆలోచించండి. – చేతన్ భగత్ ఉగ్రవాదులను హతమార్చడం అంటే భవిష్యత్‌లో ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడటమే. సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలను భస్మీపటలం చేసిన భారత వైమానిక దళానికి సెల్యూట్ చేస్తున్నా.– ప్రీతీజింతా టెర్రరిస్టు శిబిరాలపై దాడులు చేసిన మన భారతీయ వైమానిక దళ వీరులను చూసి గర్వపడుతున్నా. అందర్ ఘుస్కే మారో (చొచ్చుకెళ్ళి హతమార్చండి) – అక్షయ్ కుమార్ యాద్ రహే నామ్ నమక్ ఔర్ నిషాన్ మర్చిపోవద్దంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కీ, నాయకుడూ సుప్రీం కమాండర్ అయిన ప్రధాని నరేంద్రమోదీకి సెల్యూట్ చేస్తున్నాను. జైహింద్ సర్జికల్ స్ట్రైక్స్ 2, టెర్రరిజాన్ని అంతం చేయాలి.– సెలీనా జైట్లీ భారత వైమానిక సైన్యం నాకు గర్వకారణం. సాహసోపేత చర్యకి సెల్యూట్ చేస్తున్నా. – తమన్నా జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నాను – అభిషేక్ బచన్ భారత సైన్యం మాకు గర్వకారణం. ఇండియా స్టైక్ బ్యాక్. జైహింద్ – సోనూ సూద్ తీవ్రవాదంపై భారత సైన్యం దాడికి హ్యాట్సాఫ్. ప్రతి భారతీయుడూ గర్వపడతారు. – కిదాంబి శ్రీకాంత్ మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ధైర్య సాహసాలు చూపించిన ఫైలెట్స్కు సెల్యూట్. – మహేశ్‌బాబు ‘ద బాయ్స్ హావ్ ప్లేడ్ రియల్లీ వెల్’ (మన వాళ్ళు బ్రçహ్మాండంగా ఆడారు) ‘మీరు (పాక్) మారండి లేదంటే మేమే మారుస్తాం’ – వీరేంద్ర సెహ్వాగ్ మంచితనాన్ని చేతకానితనంగా ఎప్పుడూ ఊహించుకో కూడదు. మన ఎయిర్ ఫోర్స్‌కు సెల్యూట్ చేస్తున్నాను. – సచిన్ టెండుల్కర్ టెర్రరిజానికి అవసరమైన మెసేజ్ పంపింది మన ఎయిర్‌ఫోర్స్. బ్రేవో ఎయిర్ ఫోర్స్. గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై హింద్. – అజింక్యా రెహానే భారత వైమానిక దళ గొప్పతనానికి సెల్యూట్ చేస్తున్నా.– మహమ్మద్ కైఫ్ ఇండియా స్ట్రైక్ బ్యాక్, భారత వైమానిక దళానికి బిగ్ సెల్యూట్.– సైనా నెహ్వల్ ఆçహ్లాదకరమైన శుభోదయం. మన సైన్యం దిటవు గుండెలకు జయహో. – పరేష్ రావెల్ ఇండియా తిరిగి కొట్టింది. తిప్పి కొట్టింది. జై హింద్ ఐఏఎఫ్. – గౌతం గంభీర్ సమయానుకూలంగా స్పందించిన భారతీయ వైమానికదళ ధీరుల సాహసచర్యకు నా సెల్యూట్. – శిఖర్ దావన్ సాహో సర్జికల్ స్ట్రైక్స్... ప్రధాని మోడీకి సెల్యూట్ చేయడం ప్రారంభించడానికి ఇదే మంచి రోజు. – అనుపమ్ ఖేర్ మన ఎయిర్‌ఫోర్స్‌ను చూసి ఎంతో గర్విస్తున్నాను. సెల్యూట్ ఐఏఎఫ్. జైహింద్.– యువరాజ్ సింగ్ మన వైమానిక దళాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను. సెల్యూట్ ఐఏఫ్. జై హింద్. – మాధురీ దీక్షిత్