syed mushtaq ali trophy
-
సచిన్ కొడుకుకు చుక్కలు చూపించారు? వేలంలో ఎవరైనా కొంటారా?
ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్.. టీ20ల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ-2024 ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. అతడి బౌలింగ్‌ను ముంబై బ్యాటర్లు ఊతికారేశారు. ముఖ్యంగా ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే అర్జున్ను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన జూనియర్ టెండూల్కర్.. 12.00 ఏకానమీతో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. కనీసం ఒక్క వికెట్ కూడా అర్జున్ సాధించలేకపోయాడు.అర్జున్ అమ్ముడుపోతాడా?ఈ క్రమంలో నవంబర్ 24, 25వ తేదీల్లో జరిగే ఐపీఎల్-2025 మెగా వేలంలో అర్జున్ అస్సలు అమ్ముడు పోతాడా అన్నది ప్రశ్నర్ధాకంగా మారింది. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్-2023, 2024 సీజనల్లో ముంబై ఇండియన్స్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు సీజన్లలో మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. కేవలం మూడు వికెట్లు మాత్రమే సాధించగలిగాడు.దీంతో ఈసారి అతడిని ముంబై కూడా కొనుగోలు చేసే సూచనలు కన్పించడం లేదు. ఈ వేలంలో రూ. 30 లక్షల కనీస ధరగా నమోదు చేసుకున్న అర్జున్.. ఈసారి అమ్ముడుపోకపోయినా ఆశ్చర్యపోన్కర్లేదు.శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. ఇక ఈ మ్యాచ్‌లో గోవాపై 26 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(130) సెంచరీతో మెరిశాడు. అనంతరం లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీ.. బౌలర్లకు చుక్కలు
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఒక్క రోజు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ అద్భుత శతకంతో సత్తాచాటాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై సారథిగా బరిలోకి దిగిన అయ్యర్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 57 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 130 పరుగులుచేశాడు. శ్రేయస్‌తోపాటు పృథ్వీషా(33), ములానీ(41) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు కూడా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఫలితంగా 26 పరుగుల తేడాతో గోవా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.వేలంలో కాసుల వర్షం కురవనుందా?కాగా అయ్యర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న వేలంలో అయ్యర్‌పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. కాగా మెగా వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ అయ్యర్‌ను వేలంలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
దేశవాళీ ధనాధన్‌కు అంతా సిద్ధం
న్యూఢిల్లీ: దేశవాళీ ధనాధన్ మెరుపుల ‘షో’కు రంగం సిద్ధమైంది. సాధారణంగా ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీని నిర్వహిస్తారు. దీంతో ప్లేయర్లకు ఫ్రాంచైజీలను ఆకర్షించే అవకాశం లభించేది. కానీ ఈసారి వేలానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ టి20 టోర్నీ శనివారం నుంచి దేశంలోని వివిధ నగరాల్లో (హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, రాజ్‌కోట్, ఇండోర్, ముంబై) జరగనుంది. ఠాకూర్ తిలక్ వర్మ సారథ్యంలో హైదరాబాద్ జట్టు ఈ టోర్నీలో పోటీపడనుంది. రాజ్‌కోట్‌లో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో మేఘాలయ జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది. ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25న జరిగే గ్రూప్ ‘ఇ’ తొలి లీగ్ మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టుతో ఆంధ్ర పోటీపడుతుంది. డిసెంబర్ 15వ తేదీన జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 38 జట్లను ఐదు గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్‌గా పంజాబ్ జట్టు ఉంది. బరిలో స్టార్ క్రికెటర్లు... భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్), శ్రేయస్ అయ్యర్ (ముంబై), యుజువేంద్ర చహల్ (హరియాణా) తదితరులతో పాటు దేశవాళీ స్టార్లు అభిషేక్ పొరెల్ (బెంగాల్), షారుక్ ఖాన్ (తమిళనాడు), అభినవ్ మనోహర్ (కర్ణాటక), మానవ్ సుతార్ (రాజస్తాన్), కరుణ్ నాయర్ (విదర్భ), కృనాల్ పాండ్యా (బరోడా), దీపక్ హుడా (రాజస్తాన్) ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరిపించడానికి ‘సై’ అంటున్నారు. ఇందులో ఒక్క హార్దిక్ పాండ్యానే రిటెయిన్ ప్లేయర్ కాగా మిగతా వారంతా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోవాలని... తమపై కోట్ల రూపాయాలు కురవాలని గంపెడాశలతో ఉన్నారు. వేలాన్ని పక్కన బెడితే ముస్తాక్ అలీ టోర్నీలో ఏటికేడు పోటీ పెరుగుతోంది. ఆటగాళ్లు తమ సత్తా చాటుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్నాక రంజీ బరిలో దిగిన వెటరన్ సీమర్ షమీ మధ్యప్రదేశ్‌పై నిప్పులు చెరిగాడు. 7 వికెట్లతో అదరగొట్టిన 34 ఏళ్ల సీమర్ తనలో ఇంకా పేస్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్‌లో జరుగుతున్న బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయినా... ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో పేస్ షమీ ఆడే అవకాశాల్ని తోసిపుచ్చలేం. ఈ టి20 టోర్నీలోనూ ఫిట్నెస్ నిరూపించుకుంటే ఆసీస్ ఫ్లయిట్ ఎక్కడం దాదాపు ఖాయమవుతుంది. ఏ గ్రూప్‌లో ఎవరంటే... గ్రూప్ ‘ఎ’: హైదరాబాద్, మధ్యప్రదేశ్, బెంగాల్, మేఘాలయ, పంజాబ్, మిజోరం, బిహార్, రాజస్తాన్. గ్రూప్ ‘బి’: బరోడా, సిక్కిం, గుజరాత్, సౌరాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, త్రిపుర. గ్రూప్ ‘సి: హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, మణిపూర్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్. గ్రూప్ ‘డి’: ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అస్సాం, విదర్భ, రైల్వేస్, ఒడిశా, చండీగఢ్. గ్రూప్ ‘ఇ’: ఆంధ్ర, నాగాలాండ్, కేరళ, ముంబై, గోవా, సర్వీసెస్, మహారాష్ట్ర. -
మహారాష్ట్ర కెప్టెన్‌గా రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 కోసం మహారాష్ట్ర జట్టును నిన్న (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువకుల మేళవింపుగా ఉంది. అంకిత్ బవానే, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ చౌదరీ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నారు. నిఖిల్ నాయక్, ధన్‌రాజ్ షిండే వికెట్కీపర్లుగా ఎంపికయ్యారు. రాజవర్ధన్ హంగర్గేకర్, ప్రశాంత్ సోలంకి బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉంటారు.ఈ టోర్నీలో మహారాష్ట్ర గ్రూప్-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేరళ, ముంబై, ఆంధ్రప్రదేశ్, గోవా, సర్వీసెస్, నాగాలండ్ లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆనుంది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సేన నాగాలాండ్‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర గతేడాది నాకౌట్ దశకు చేరలేకపోయింది. ఈసారి పటిష్ట జట్టు ఉండటంతో పాటు రుతురాజ్ సారథ్యం తోడవ్వడంతో మహారాష్ట్ర టైటిల్‌పై కన్నేసింది.కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఈసారి రసవత్తరంగా మారనుంది. ఈ ఎడిషన్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు జట్లను ముందుండి నడిపించనున్నారు. మహారాష్ట్రకు రుతురాజ్ సారథ్యం వహిస్తుండగా.. ముంబైకు శ్రేయస్ అయ్యర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు భువనేశ్వర్ కుమార్, కేరళకు సంజూ శాంసన్, బరోడాకు కృనాల్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్) లాంటి టీమిండియా స్టార్లు కూడా పాల్గొననున్నారు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 135 మ్యాచ్‌లు జరుగనున్నాయి.మహారాష్ట్ర జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అంకిత్ బవానే, అర్షిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్‌కీపర్), ధన్‌రాజ్ షిండే (వికెట్‌కీపర్), దివ్యాంగ్ హింగనేకర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అథర్వ కాలే, సిద్ధార్థ్ మాత్రే, సత్యజీత్ బచ్చవ్, రాజవర్ధన్ హంగర్గేకర్, అజీమ్ కాజీ, రుషబ్ రాథోడ్, సన్నీ పండిట్ -
Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ తన అన్న కృనాల్ పాండ్యా సారథ్యంలో బరోడా జట్టుకు ఆడనున్నాడు. తొలుత ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో హార్దిక్ పేరు లేదు. అయితే హార్దిక్ స్వయంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి కనబర్చాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాలీ క్రికెట్లో ఆడతానని హార్దిక్ బీసీసీఐకి చెప్పాడట. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ హార్దిక్‌ను తమ జట్టులో చేర్చుకుంది. సహజంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి 18 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. తాజాగా హార్దిక్ చేరికతో బరోడా టీమ్ సంఖ్య 18కి పెరిగింది. ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో బరోడాతో పాటు తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం, త్రిపుర జట్లు ఉన్నాయి. హార్దిక్ త్వరలో ఇండోర్‌లో జరిగే ట్రైనింగ్ క్యాంప్‌లో బరోడా జట్టుతో జాయిన్ అవుతాడు. బరోడా తమ టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం (నవంబర్ 23) జరుగుతుంది.కాగా, హార్దిక్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ 59 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.ముంబై ట్రైనింగ్ క్యాంప్లోన కనిపించిన హార్దిక్హార్దిక్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే నవీ ముంబైలోని ఏర్పాటు చేసిన ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ సెషన్స్‌లో కనపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.బరోడా జట్టుకు బూస్టప్హార్దిక్ చేరికతో బరోడా జట్టు బలపడింది. ఈ టోర్నీలో ఆ జట్టు విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. హార్దిక్ ఎనిమిదేళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొంటున్నాడు. -
కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్
దేశవాలీ క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టును ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ జట్టులో టీమిండియా ఆటగాళ్లు రింకూ సింగ్, నితీశ్ రాణా, పియూశ్ చావ్లా, శివమ్ మావికి చోటు దక్కింది. ఈ జట్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సోదరుడు కార్తికేయ జైస్వాల్ కూడా ఉన్నాడు. ఈ టోర్నీలో భువీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) మాధవ్ కౌశిక్ వ్యవహరిస్తాడు.టోర్నీ విషయానికొస్తే.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024-25 నవంబర్ 23 నుంచి మొదలవుతుంది. 38 జట్లు పాల్గొనే ఈ టోర్నీ దేశంలోని 12 వేర్వేరు వేదికలపై జరుగనుంది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో యూపీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మణిపూర్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్ జట్లు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆడనుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో యూపీ ఢిల్లీని ఢీకొట్టనుంది.కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ విషయానికొస్తే.. భువీకి ఐపీఎల్లో కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. భువీ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారధిగా వ్యవహరించాడు. భువీ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీని నాయకత్వం వహించాడు. ఇందులో ఆరెంజ్ ఆర్మీ రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ఆరింట ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టు..భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), మాధవ్ కౌశిక్ (వైస్ కెప్టెన్), కరణ్ శర్మ, రింకూ సింగ్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, స్వస్తిక్ చికార, ప్రియమ్ గార్గ్, ఆర్యన్ జుయల్, పియూశ్ చావ్లా, విప్రాజ్ నిగమ్, కార్తికేయ జైస్వాల్, శివమ్ శఱ్మ, యవ్ దయాల్, మొహిసిన్ ఖాన్, ఆకిబ్ ఖాన్, శివమ్ మావి, వినీత్ పన్వర్ -
SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు
దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం ఆదివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రంజీ ట్రోపీలో ముంబై జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేతో పాటు... ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి రంజీ జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సాధించాలనుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత రంజీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజా సీజన్లో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీ ఉంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా–‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనుశ్ కోటియాన్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, సిద్ధేశ్ లాడ్, యువ ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్యా రహానే, సిద్ధేశ్ లాడ్, సూర్యాన్ష్ షెడ్గె, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుశ్ కోటియాన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, రోస్టన్ డియాస్, జునేద్ ఖాన్.చదవండి: కోహ్లిపై ఒత్తిడి పెంచండి! -
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా పంజాబ్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023 విజేతగా పంజాబ్ జట్టు నిలిచింది. సోమవారం మొహాలీ వేదికగా జరిగిన ఫైనల్లో బరోడాను ఓడించిన పంజాబ్.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేయగల్గింది. బరోడా బ్యాటర్లలో అభిమన్యు సింగ్(61), కెప్టెన్ కృనాల్ పాండ్యా(45) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో అదరగొట్టగా.. కౌల్, బ్రార్, మార్కండే తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో అన్మోల్ప్రీత్ సింగ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు చేశాడు. అతడితో పాటు వాదేరా(61) పరుగులతో ఆఖరిలో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, సోపారియా, సేథ్ చెరో వికెట్ పడగొట్టారు. -
ముంబైకు చుక్కెదురు
ముల్లన్పూర్ (చండీగఢ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా జట్టు మూడు వికెట్ల తేడాతో ముంబైను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. శివమ్ దూబే (36 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సర్భరాజ్ ఖాన్ (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం బరోడా జట్టు 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి నెగ్గింది. విష్ణు సోలంకి (30 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బరోడా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై, ఢిల్లీ 39 పరుగుల తేడాతో విదర్భ జట్టుపై, కేరళ జట్టుపై అస్సాం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నాయి. -
మరీ అంత అతి పనికిరాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి! పరాగ్‌పై ట్రోల్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం బెంగాల్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీతో మార్క్‌ను అందుకున్నాడు. అస్సాం విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా టోర్నీలో ఇది పరాగ్‌కు 7వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో పరాగ్ 490 పరుగులు చేశాడు. తన కెరీర్లోనే భీకర ఫామ్‌లో ఉన్న పరాగ్‌పై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మరోవైపు విమర్శల వర్షం కురుస్తోంది. ఏం జరిగిందంటే? బెంగాల్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగానే పరాగ్ తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే అతడి సెలబ్రేషన్స్ శృతి మించాయి. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను పరాగ్ అవమానపరిచాడు. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ వైపూ చూస్తూ.. "నేనే అందరికంటే తోపు, నన్నే అపేవారు ఇక్కడ లేరంటూ" సైగలు చేశాడు. దీంతో పరాగ్విమర్శకులకు మరోసారి తోవనిచ్చాడు.. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే చాలా సార్లు పరాగ్ ట్రోల్స్‌కు గురైన సంగతి తెలిసిందే. ఓవరాక్షన్ స్టార్ అంటూ అభిమానులు ఓ ట్యాగ్ కూడా ఇచ్చేసారు. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం Celebration by Riyan Parag after his 7th consecutive 50 in T20 Cricket.pic.twitter.com/Z6PitN1XYc — Riyan Parag FC (@riyanparagfc_) October 31, 2023 Riyan Parag celebration myan 😭😭😭. He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭 Proper Chad pic.twitter.com/Gd8fbECfM7 — HS27 (@Royal_HaRRa) October 31, 2023 -
హ్యాట్రిక్ వికెట్లు తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్, ముంబై ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం మిజోరాంతో జరిగిన మ్యాచ్‌లో దేశ్‌పాండే హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. మిజోరాం బ్యాటర్లు వికాష్ కుమార్, జెహూ ఆండర్సన్, జోసెఫ్ లాల్థాన్ఖుమాను ఔట్ చేసిన దేశ్‌పాండే.. హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన తుషార్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 15 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మిజోరాం ముంబై బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో దేశ్‌పాండేతో పాటు రాయ్స్టన్ డయాస్, మోహిత్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 77 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(46 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చదవండి: World Cup 2023: మరీ ఇంత బద్దకమా? క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్.. వీడియో వైరల్ -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. ముంబైకి ఊహించని షాక్
Syed Mushtaq Ali Trophy 2023- Hyderabad won by 23 runs: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు సంచలనం సృష్టించింది. రహానే సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టును తిలక్ వర్మ కెప్టెన్సీలోని హైదరాబాద్ జట్టు 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది ఐదో విజయం. జైపూర్‌లో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (46 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (26 బంతుల్లో 37; 4 ఫోర్లు), చందన్ సహని (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (6), రోహిత్ రాయుడు (8) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. అనంతరం 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసి ఓడిపోయింది. మీడియం పేసర్ రవితేజ 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... తిలక్ వర్మ 2 వికెట్లు తీసి ముంబై జట్టును దెబ్బ కొట్టారు. ప్రస్తుతం ముంబై, హైదరాబాద్, బరోడా జట్లు 20 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
చెలరేగిన భువనేశ్వర్ కుమార్.. 9 బంతుల్లో 5 వికెట్లు
జాతీయ జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువీ నిప్పలు చేరుగుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 5వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసిన భువనేశ్వర్ కేవలం 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు ఓవర్లలో వికెట్లు సాధించికపోయిన భువీ.. డెత్ ఓవర్లలో 9 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక.. భువీ దాటికి 156 పరుగులకు ఆలౌటైంది. భువీతో పాటు యశ్ దయాల్ రెండు వికెట్లు సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో గోస్వామి(77), నితీష్ రానా(40) పరుగులతో రాణించారు. చదవండి: World Cup 2023: ఓటమి బాధతో బాబర్ ఏడ్చాడు.. తప్పు అతనొక్కడిదే కాదు: పాకిస్తాన్ లెజెండ్ -
రుత్‌రాజ్ విధ్వంసకర శతకం.. కేవలం 51 బంతుల్లోనే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో టీమిండియా ఓపెనర్, మహారాష్ట్ర ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో రుత్‌రాజ్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 51 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 102 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. గైక్వాడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 178 పరుగుల టార్గెట్‌ను మహారాష్ట్ర.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. గైక్వాడ్‌తో పాటు కెప్టెన్ కేదార్ జాదవ్(42) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. విదర్భ బ్యాటర్లలో ధ్రువ్ షోరే(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహారాష్ట్ర బౌలర్లలో సత్యజిత్ బాచావ్ 4 వికెట్లు పడగొట్టగా.. సొలాంకి రెండు, దాదే, ఖాజీ, జాదవ్ తలా వికెట్ సాధించారు. చదవండి: WC 2023: నాకు మరీ ఎక్కువ రెస్ట్ ఇచ్చేశారు.. సెలక్టర్లపై సెంచరీ ‘హీరో’ విసుర్లు -
వరల్డ్‌కప్‌కు మిస్సయ్యాడు.. కానీ అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 27 బంతుల్లోనే
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమైన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రిలిమనరీ జట్టులో సభ్యునిగా ఉన్న అక్షర్.. టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. వరల్డ్‌కప్‌కు దూరమైన అక్షర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ప్రస్తుతం జరగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ జట్టు తరుపున అక్షర్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 234 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(112) సెంచరీతో చెలరేగాడు. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
తిలక్ వర్మ సెంచరీ వృథా
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి దూసుకెళ్తున్న హైదరాబాద్‌కు తొలి పరాజయం ఎదురైంది. బరోడా జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ సెంచరీతో అలరించాడు. అనంతరం బరోడా జట్టు 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బరోడా జట్టును కెపె్టన్ కృనాల్ పాండ్యా (36 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), విష్ణు సోలంకి (37 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీలతో గెలిపించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 70 బంతుల్లో 138 పరుగులు జోడించడం విశేషం. -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బరోడా బౌలర్లకు తిలక్ చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 69 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తిలక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 271 పరుగులతో.. టాప్-2 రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
ఆంధ్రను గెలిపించిన భరత్, అశ్విన్
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. గుజరాత్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 19.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఆర్య దేశాయ్ (35 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లు స్టీఫెన్ (3/25), కావూరి సాయితేజ (2/45), కేవీ శశికాంత్ (2/22), మనీశ్ (2/47) గుజరాత్ జట్టును దెబ్బ తీశారు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెపె్టన్ కోన శ్రీకర్‌భరత్ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అశి్వన్ హెబ్బర్ (36 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక విహారి (16 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (13 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆంధ్ర జట్టును విజయతీరానికి చేర్చారు. నేడు జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మణిపూర్ జట్టుతో ఆంధ్ర ఆడుతుంది. -
హైదరాబాద్‌కు నాలుగో విజయం
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మిజోరం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోరీ్నలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మిజోరం సరిగ్గా 20 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. అగ్ని చోప్రా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోసెఫ్ లాథన్‌కుమా (20 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లు రవితేజ (3/30), సీవీ మిలింద్ (2/18), చింతల రక్షణ్ రెడ్డి (2/20) మిజోరం జట్టును కట్టడి చేశారు. 115 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 15.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ రాయుడు (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ తిలక్ వర్మ (24 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. నేడు జరిగే తదుపరి మ్యాచ్‌లో బరోడా జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది. -
హడలెత్తించిన రవితేజ
జైపూర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌తో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్ జట్టును హైదరాబాద్ మీడియం పేసర్ టి.రవితేజ హడలెత్తించాడు. రవితేజ కేవలం 13 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. సీవీ మిలింద్ (2/16), తనయ్ త్యాగరాజన్ (2/16) కూడా రాణించడంతో ఛత్తీస్‌గఢ్ 19.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. శశాంక్ సింగ్ (47 బంతుల్లో 51; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం హైదరాబాద్ 16 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్ అగర్వాల్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ రాయుడు (10 బంతుల్లో 14; 2 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (13 బంతుల్లో 11; 1 ఫోర్), చందన్ సహని (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (33 బంతుల్లో 25 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లో 21న మిజోరం జట్టుతో ఆడుతుంది. -
షేక్ రషీద్ అజేయ శతకం
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి విజయం నమోదు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 145 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. షేక్ రషీద్ (54 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అరుణాచల్ బౌలర్లపై విరుచుకుపడి అజేయ సెంచరీ చేశాడు. హనుమ విహారి (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. రికీ భుయ్ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు), కరణ్ షిండే (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి ఓడిపోయింది. ఆంధ్ర జట్టు బౌలర్లలో స్టీఫెన్ (3/10), కేవీ శశికాంత్ (2/2) రాణించారు. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 21న గుజరాత్‌తో ఆడుతుంది. -
ఆంధ్ర ఆటగాడి వీరోచిత పోరాటం.. భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టుడు
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో భాగంగా పంజాబ్‌తో నిన్న (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రికీ భుయ్ వీరోచితంగా పోరాడాడు. భారీ లక్ష్య ఛేదనలో భుయ్ అజేయ శతకంతో (52 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరిశాడు. అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. అభిషేక్ శర్మ (51 బంతుల్లో 112; 9 ఫోర్లు, 9 సిక్సర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (26 బంతుల్లో 87; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోర్ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆంధ్రప్రదేశ్.. పంజాబ్ బౌలర్లు హర్‌ప్రీత్ బ్రార్ (4-1-18-3), సిద్దార్థ్ కౌల్ (2/40), అర్షదీప్ సింగ్ (1/37), ప్రేరిత్ దత్తా (1/25) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్ (104 నాటౌట్) ఒక్కడే ఒంటిపోరాటం చేసి శతక్కొట్టగా.. అశ్విన్ హెబ్బర్ (17), త్రిపురన విజయ్ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
SMAT 2023: అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో చెలరేగిన కేకేఆర్ బౌలర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ సుయాశ్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో ఢిల్లీ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుయాశ్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్తో పాటు ఇషాంత్ శర్మ (4-0-29-2), హర్షిత్ రాణా (4-0-22-2) కూడా రాణించడంతో ఢిల్లీ టీమ్ మధ్యప్రదేశ్‌ను 115 పరుగులకు (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఒక్కరు కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. సుయాశ్.. మధ్యప్రదేశ్ పతనాన్ని శాసించాడు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్ (2), రజత్ పాటిదార్ (7) నిరాశపర్చగా.. శుభమ్ శర్మ (10), సాగర్ సోలంకి (13), రాకేశ్ ఠాకూర్ (15), రాహుల్ బాథమ్ (32), అర్షద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ విజయం దిశగా సాగుతుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (22), అనూజ్ రావత్ (23), యశ్ ధుల్ (0) ఔట్ కాగా.. అయుశ్ బదోని (20), హిమ్మత్ సింగ్ (9) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఢిల్లీ బౌలర్ సుయాశ్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన సుయాశ్ 8.23 సగటున 10 వికెట్లు పడగొట్టాడు. -
హైదరాబాద్‌ను గెలిపించిన తిలక్ వర్మ.. వరుసగా రెండో మ్యాచ్‌లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో టీమిండియా అప్ కమింగ్ ఆటగాడు తిలక్ వర్మ (హైదరాబాద్ కెప్టెన్) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో నిన్న జరిగిన మ్యాచ్‌లో (మేఘాలయ) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (31 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన తిలక్.. జమ్ము అండ్ కశ్మీర్‌తో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‌లోనూ అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇవాల్టి మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న తిలక్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జమ్ము అండ్ కశ్మీర్.. శుభమ్ పుండిర్ (58) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, మిలింద్, చింట్ల రక్షణ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి ఓ వికెట్ దక్కించకున్నాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్.. తిలక్ వర్మతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా తలో చేయి వేయడంతో 18.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. తన్మయ్ అగర్వాల్ (20), రోహిత్ రాయుడు (38), రాహుల్ సింగ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి రాణించారు. జమ్ము అండ్ కశ్మీర్ బౌలర్లలో యుద్ద్‌వీర్ సింగ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. -
రఫ్ఫాడించిన రహానే.. విధ్వంసం సృష్టించిన రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తొలి రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల హవా కొనసాగింది. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అజింక్య రహానే (ముంబై కెప్టెన్), బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) చెలరేగిపోయారు. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో రహానే 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేయగా.. బెంగాల్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు సీఎస్కే బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలు సాధించి, తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. బెంగాల్-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. రుతురాజ్, కేదార్ జాదవ్ (40 నాటౌట్) రాణించడంతో మహారాష్ట్ర 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై-హర్యానా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. భారత బౌలర్ హర్షల్ పటేల్ ఈ మ్యాచ్‌లో హర్యానా ఓపెనర్‌గా బరిలోకి దిగి 38 పరుగులు చేశాడు. హర్యానా ఇన్నింగ్స్‌లో అంకిత్ (36), నిషాంత్ సంధు (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లు తనుశ్ కోటియన్ (3-0-19-3), మోహిత్ అవస్తి (3-0-15-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే, శివమ్ దూబే (26 నాటౌట్) రాణించడంతో 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) మూడు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఔటయ్యాడు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్, అన్షుల్ తలో వికెట్ పడగొట్టారు.