takeover
-
అనిల్ అంబానీ ఆర్‌క్యాప్ టేకోవర్.. హిందూజాకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌క్యాప్) కొనుగోలు రేసులో హిందుజా గ్రూప్‌నకు వెసులుబాటు లభించింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) తాజాగా హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్ఎల్)లోని కొంతమంది వాటాదారులు చైనా అధీనంలోని హాంకాంగ్ నివాసితులు కావడంతో డిపీఐఐటీ అనుమతి తప్పనిసరి అయ్యింది. కాగా.. సరిహద్దు(చైనా, బంగ్లాదేశ్ తదితర) దేశాల పౌరులు ఎవరైనా దేశీ సంస్థకు యజమాని అయితే.. స్థానికంగా పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. వెరసి ఆర్‌క్యాప్ కొనుగోలుకి మారిషస్ సంస్థ ఐఐహెచ్ఎల్ రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికకు దారి ఏర్పాటుకానుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ భారీ ప్లాన్..ఇప్పటికే రూ. 9,861 కోట్ల విలువైన రిజల్యూషన్ ప్రణాళిక ద్వారా ఐఐహెచ్ఎల్ బిడ్డింగ్‌లో గెలుపొందింది. ఈ ప్రణాళికను 2024 ఫిబ్రవరి 27న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ అనుమతించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రుణదాతల కమిటీ 99.96 శాతం వోటింగ్‌తో మద్దతు పలికింది. దీనిలో భాగంగా డీపీఐఐటీ తాజాగా అనుమతించింది. -
టేకోవర్ స్టోరీ: రతన్.. ఇక టాటా గ్రూప్ పగ్గాలు తీసుకుంటావా?
టాటా గ్రూప్ గౌరవ్ చైర్మన్ రతన్ టాటా అస్తమించారు. 86 ఏళ్ల వయసులో ఆయన లోకాన్ని వీడారు. జేఆర్డీ టాటా 1991 మార్చిలో టాటా గ్రూప్ పగ్గాలను రతన్ టాటాకు అప్పగించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ మరింత పెద్దదైంది. అయితే టాటా గ్రూప్ బాధ్యతలను రతన్ టాటా తీసుకోవాలని జేఆర్డీ టాటా ఎలా కోరారో తెలుసా?టాటా గ్రూప్‌నకు అధినేతగా వ్యవహరించిన ఆయన అసలు టాటా గ్రూప్ పగ్గాలను ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో చేపట్టారో ఒకసారి ఓ షోలో రతన్ టాటా వివరించారు. గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన తర్వాత జేఆర్డీ టాటా తనకు కంపెనీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.“మేము ఒక ఫంక్షన్ కోసం జంషెడ్‌పూర్‌లో ఉన్నాం. నేను వేరే పని మీద స్టుట్‌గార్ట్‌కు వెళ్లవలసి వచ్చింది. నేను తిరిగి వచ్చినప్పుడు ఆయనకు(జేఆర్డీ టాటా) గుండె సమస్య వచ్చిందని, బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఉన్నారని విన్నాను. ఆయన ఒక వారంపాటు అక్కడే ఉన్నారు. నేను రోజూ వెళ్లి చూసొచ్చేవాడిని. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులకు ఆఫీస్‌కి వెళ్లి కలిశాను” అంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది..!"ఆయన్ను(జేఆర్డీ టాటా) ఎప్పుడు కలిసినా 'సరే, ఇంకేంటి?' అని అడిగేవారు. జే (జేఆర్డీ టాటా) నేను నిన్ను రోజూ చూస్తున్నాను. కొత్తగా ఏముంటుంది? అని నేను చెప్పావాడిని. 'సరే, నేను నీకు కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. కూర్చో. జంషెడ్‌పూర్‌లో నాకు జరిగిన సంఘటన (అనారోగ్యం) తర్వాత నేను తప్పుకోవాలనుకుంటున్నాను. (టాటా గ్రూప్ చైర్మన్‌గా) నా స్థానం నువ్వే తీసుకోవాలి' అన్నారు. అదే ప్రతిపాదనను బోర్డుకి తీసుకెళ్లారు(కొన్ని రోజుల తర్వాత)” అని టాటా గుర్తుచేసుకున్నారు. -
ఎక్స్ టేకోవర్: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు,అసలేం జరుగుతోంది?
గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలు కీలక మార్పులకు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అందరూ ఊహించినట్టుగా ఈ టేకోవర్ ఫెయిల్ కావచ్చు కానీ సాధ్యమైనంతవరకు సక్సెస్‌ను ప్రయత్నిస్తున్నామనడం చర్చకు దారి తీసింది. అలాగే ఎక్కువగా సంపాదించాలనుకునే జర్నలిస్టులకు ఎక్స్‌లో ఆఫర్ అంటూ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. ఎవరైతే స్వేచ్ఛగా ఆర్టికల్స్ రాయాలనుకుంటారో ఆ జర్నలిస్టులు డైరెక్ట్ ఎక్స్‌లో పబ్లిష్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది ఇప్పటికే ఇది 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ( అంతేకాదు ఆయా ఆర్టికల్ చదివే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.యూజర్లు చదివే ఆర్టికల్ ని బట్టి ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే మరింత చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా నివేదికల ప్రకారం, ఇప్పుడు ఎక్స్‌లో షేర్ అయిన వార్తల ముఖ్యాంశాలను తొలగించాలని యోచిస్తున్నాడు.తద్వారా ట్వీట్ పరిణామాన్ని తగ్గించి, యూజర్ టైమ్‌లైన్‌లో మరిన్ని ట్వీట్లు సరిపోయేలా చేయడానికే ఈ ఎత్తుగడ అని తెలుస్తోంది. యూజర్ స్క్రీన్‌పై ట్వీట్ ఆక్రమించే నిలువు స్థలాన్నితగ్గించడమే ఈ మార్పు వెనుకకారణమని ఫార్చ్యూన్ నివేదించింది.దీనితో పాటు క్లిక్‌బైట్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని మస్క్ భావిస్తున్నాడట. If you’re a journalist who wants more freedom to write and a higher income, then publish directly on this platform! — Elon Musk (@elonmusk) August 21, 2023 ఎక్స్ (ట్విటర్) టేకోవర్ విఫలం కావచ్చు: మస్క్ ముఖ్యంగా గా బిలియన్ల డాలర్ల ట్విటర్ టేకోవర్ "విఫలం కావచ్చు" అని అంగీకరించడం మరో సంచలన వార్తగా మారింది. ట్విటర్ "బ్లాక్" ఫీచర్‌ను తొలగించే నిర్ణయంపై తాజా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్ననేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత నెలలో మార్క్ జుకర్‌బర్గ్ మెటా ప్రారంభించిన టెక్స్ట్-ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్‌కు పోటీ వెబ్ వెర్షన్‌ను రూపొందించడానికి సిద్ధమైనప్పటికీ ఎక్స్ అనిశ్చిత భవిష్యత్తుపై మస్క్ ఇలా పేర్కొన్నాడు. "చాలామంది ఊహించినట్లుగా తాము విఫలం కావచ్చు, కానీ కనీసం ఒకరిగాఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తాము." అన్నాడు. అలాగే ఆదివారం నాటి పోస్ట్‌లో ."విచారకరమైన నిజం ఏమిటంటే, ప్రస్తుతం గొప్ప "సోషల్ నెట్‌వర్క్‌లు" లేవు అందుకే అలాంటి నొకదానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. The sad truth is that there are no great “social networks” right now. We may fail, as so many have predicted, but we will try our best to make there be at least one. — Elon Musk (@elonmusk) August 19, 2023 hey @elonmusk + @lindayaX … please rethink removing the block feature. as an anti-bullying activist (and target of harassment) i can assure you it’s a critical tool to keep people safe online. - that woman — Monica Lewinsky (she/her) (@MonicaLewinsky) August 19, 2023 కాగా ఇప్పటికే బ్లూటిక్ పేరుతో యూజర్లనుంచి చార్జ్ వసూలు చేస్తున్నారు. అలాగే ఇటివలి కాలంలో పరిచయం చేసిన యాడ్ రెవెన్యూ షేర్ ఫీచర్ కింద వెరిఫైడ్ యూజర్లు మానిటైజేషన్ రూల్స్ ప్రకారం డబ్బు సంపాదించుకునే అవకాశం అందుబాటులో ఉంది. తాజా నిర్ణయంతో స్వేచ్ఛగా రాయాలనుకునే జర్నలిస్టులకు డబ్బులు ఆర్జించే అవకాశాన్ని కల్పించడం విశేషం.అయితే దీనిపై పబ్లిషర్స్నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
జేపీ మోర్గాన్ చేతికి ఫస్ట్ రిపబ్లిక్
న్యూయార్క్: ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లో తలెత్తిన సంక్షోభం మొత్తం వ్యవస్థకు వ్యాపించకుండా చూసేందుకు అమెరికా బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, అసెట్లలో చాలా మటుకు భాగాన్ని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌నకు విక్రయించాయి. అమెరికా చరిత్రలో ఓ భారీ స్థాయి బ్యాంకు విఫలం కావడం ఇది రెండోసారి. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో వాషింగ్టన్ మ్యూచువల్ కుప్పకూలింది. ప్రస్తుత ఫస్ట్ రిపబ్లిక్ తరహాలోనే అప్పట్లో వాషింగ్టన్ మ్యూచువల్‌ను కూడా జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంకే టేకోవర్ చేసింది. సోమవారం నుంచి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 84 శాఖలు .. జేపీమోర్గాన్ చేజ్ బ్యాంక్ బ్రాంచీలుగా పనిచేయడం ప్రారంభమవుతుందని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) వెల్లడించింది. ఏప్రిల్ 13 గణాంకాల ప్రకారం ఫస్ట్ రిపబ్లిక్కు 229 బిలియన్ డాలర్ల అసెట్లు, 104 బిలియన్ డాలర్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. పరిమాణం ప్రకారం అమెరికన్ బ్యాంకుల్లో 14వ స్థానంలో ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సమస్య పరిష్కారానికి డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌పై 20 బిలియన్ డాలర్ల భారం పడగా, ఫస్ట్ రిపబ్లిక్పరంగా మరో 13 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడవచ్చని ఎఫ్‌డీఐసీ అంచనా వేసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు సంక్షోభంలో చిక్కుకున్న ప్రభావంతో మార్చి నుంచి ఫస్ట్ రిపబ్లిక్ సైతం సవాళ్లు ఎదుర్కొంటోంది. తక్కువ వడ్డీ రేట్లకు ఎక్కువగా రుణాలివ్వడం, అధిక శాతం డిపాజిట్లకు బీమా భద్రత లేకపోవడం వంటి అంశాల కారణంగా బ్యాంకుపై డిపాజిటర్లలో నమ్మకం సన్నగిల్లింది. ఫలితంగా బిలియన్ల కొద్దీ డాలర్ల విత్‌డ్రాయల్స్ వెల్లువెత్తాయి. ఒక దశలో ఫస్ట్ రిపబ్లిక్కి సహాయం చేసేందుకు ఇతర బ్యాంకులు కూడా ముందుకు వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత వారాంతంలో భేటీ అయిన అమెరికా నియంత్రణ సంస్థలు పరిష్కార మార్గాన్ని అమలు చేశాయి. -
అటువంటి కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ గ్రాంట్‌తో నడిచే కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగనప్పుడు, ఆస్తుల దుర్వినియోగం జరిగినప్పుడు ఆ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్పు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఎన్బీటీ అండ్ ఎన్వీసీ కాలేజీ యాజమాన్య బాధ్యతలను, ఆస్తులను టేకోవర్ చేస్తూ 2017లో జారీ చేసిన జీవో 17ను హైకోర్టు సమర్ధించింది. ఆ జీవోను సవాలు చేస్తూ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎన్బీటీ అండ్ ఎన్వీసీ కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్ నల్లా రామచంద్ర ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ విద్యా సంస్థ సెక్రటరీ కాలేజీ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో కళాశాలలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది లేని పరిస్థితి నెలకొందని, దీంతో పేద, అణగారిన వర్గాల ప్రజలకు విద్యనందించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోయిందని హైకోర్టు తెలిపింది.ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వమే ఆ కాలేజీని టేకోవర్ చేసిందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఇటీవల తీర్పు వెలువరించారు. కోడెల వల్లే మా కాలేజీకి ఈ దుస్థితి కళాశాలను ప్రభుత్వం టేకోవర్ చేయడాన్ని సవాలు చేస్తూ నల్లా రామచంద్రప్రసాద్ 2017లో దాఖలు చేసిన వ్యాజ్యంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను ప్రతివాదిగా చేర్చి, ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ గంగారావు తుది విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ.. స్థానిక రాజకీయ కారణాలతో అప్పటి స్పీకర్ తమ కాలేజీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నారని, యాజమాన్యంలో చీలికలు తెచ్చారని తెలిపారు. తమ కాలేజీలోని బోధన, బోధనేతర సిబ్బందిని ఇతర కాలేజీలకు బదిలీ చేయించి, కాలేజీలో విద్యార్థులు లేకుండా చేశారన్నారు. అంతిమంగా కాలేజీని నడపలేని స్థితికి కోడెల తీసుకొచ్చారని తెలిపారు. ఆ తరువాత తమ వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే కాలేజీని టేకోవర్ చేస్తూ ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందన్నారు. ఉన్నత విద్యా శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అంతర్గత వివాదాల వల్ల కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగడంలేదని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విచారణ జరిపిన కమిటీ ఆ కాలేజీని టేకోవర్ చేయాలని సిఫారసు చేసిందన్నారు. పిటిషనర్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చి, వివరణ కోరామని తెలిపారు. వివరణను పరిగణనలోకి తీసుకున్న తరువాతే కాలేజీని టేకోవర్ చేస్తూ జీవో ఇచ్చినట్లు తెలిపారు. -
గ్లాండ్ ఫార్మా చేతికి సెనెక్సి: వెయ్యి కోట్ల డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఔషధ రంగ కంపెనీ గ్లాండ్ ఫార్మా భారీ డీల్‌కు తెరలేపింది. యూరప్‌కు చెందిన సెనెక్సి గ్రూప్‌ను గ్లాండ్ ఫార్మా ఇంటర్నేషనల్ కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ రూ.1,015 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టేందుకు కంపెనీకి ఈ డీల్ వీలు కల్పిస్తుంది. థర్డ్-పార్టీ ఫండింగ్‌కు ఎటువంటి ఆధారం లేకుండా అంతర్గత వనరుల ద్వారా లావాదేవీకి నిధులు సమకూరుతాయని గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. కాంట్రాక్ట్ డెవలప్మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అయిన సెనెక్సి గ్రూప్‌నకు ఫ్రాన్స్‌లో మూడు, బెల్జియంలో ఒక ప్లాంటు ఉంది. -
మస్క్ సంచలనం, పరాగ్ అగర్వాల్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను టేకోవర్ చేసిన బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్య మార్పులతో దూసుకుపోతున్నారు. ట్విటర్ తన సొంతమైన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె లాంటి కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ బోర్డును మొత్తం రద్దు చేశారు. డైరెక్టర్ల బోర్డును రద్దు తరువాత ప్రస్తుతం మాస్క్ ఏకైక డైరెక్టర్‌గా కొనగుతున్నారు. అక్టోబర్ 31, సోమవారం సెక్యూరిటీ ఫైలింగ్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ పరిణామంతోమాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఇకపై డైరెక్టర్లుగా ఉండరని.. ఇది వారికి మరో ఎదురుదెబ్బ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: Bank of Baroda కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు -
ఓయో ఖాతాలో డైరక్ట్ బుకర్
కరోనా తగ్గుముఖం పట్టి ప్రపంచ వ్యాప్తంగా విహార యాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో యూరప్‌లో మరింత బాగా పాగా వేసే పనిలో ఉంది ఓయో. యూరప్‌కి చెందిన ట్రావెల్ టెక్ ఫర్మ్ డైరక్ట్ బుకర్ అనే సంస్థను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం ఓయో రూ. 40 కోట్లను వెచ్చించనుంది. డైరెక్ట్ బుకర్ ఓయో ఖాతాలో చేరడం వల్ల యూరప్‌లోని క్రోయేషియాలో కూడా ఓయో రూములు లభించే వెసులుబాటు కలుగుతుంది. యూరప్‌లో సుస్థిర స్థానం సాధించేందుకు ఓయో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బెల్విల్లా, ట్రామ్.. వంటి టెక్ ట్రావెల కంపెనీలు సొంతం చేసుకుంది. వీటి ద్వారా నెదర్లాండ్స్, డెన్మార్క్, బెల్జియం, జర్మనీ, ఆస్త్రియా వంటి దేశాల్లో సర్వీసులు అందిస్తుంది. కొత్త డీల్ ద్వారా క్రోయేషియా కూడా ఈ జాబితాలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 1.40 లక్షల హోం స్టోర్‌ఫ్రంట్స్ సాధించడం తమ లక్ష్యంగా ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ తెలిపారు. చదవండి: ఒకప్పుడు స్టార్టప్‌ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్‌ల రాజ్యం -
సైయంట్ చేతికి సైటెక్
న్యూఢిల్లీ: గ్లోబల్ ప్లాంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసుల సంస్థ సైటెక్‌ను కొనుగోలు చేసినట్లు ఐటీ సేవల హైదరాబాద్ కంపెనీ సైయంట్ తాజాగా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా సుమారు రూ. 800 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా బిజినెస్ ఆఫరింగ్స్‌ను మరింత పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. 1984లో ఏర్పాటైన సైటెక్ అంతర్జాతీయ ప్లాంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సరీ్వసులను అందిస్తోంది. ఎనర్జీ, మైనింగ్, ప్రాసెస్, ఆయిల్ అండ్ గ్యాస్, తయారీ రంగాలలో కస్టమర్లను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఇంజనీరింగ్ సర్వీసులు కంపెనీ చేపట్టిన అతిపెద్ద విదేశీ కొనుగోలుగా ఇది నిలవనున్నట్లు సైయంట్ పేర్కొంది. అంతేకాకుండా సైయంట్ చరిత్రలోనూ ఇది అతిపెద్ద కొనుగోలుగా వెల్లడించింది. ఈ త్రైమాసికంలోనే కొనుగోలు పూర్తికానున్నట్లు తెలియజేసింది. సైటెక్‌కున్న పటిష్ట బ్రాండు విలువ, నిపుణుల శక్తి ప్రధానంగా నార్డిక్ ప్రాంతంలో కంపెనీకి బలాన్ని చేకూర్చగలవని సైయంట్ ఎండీ, సీఈవో బోదనపు కృష్ణ పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో కంపెనీ మరింత విస్తరించగలదని తెలియజేశారు. 2021లో సైటెక్ 8 కోట్ల యూరోల(సుమారు రూ. 660 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించారు. 14,000 మంది నిపుణులతో కార్యకలాపాలు విస్తరించిన సైయంట్.. తమ కస్టమర్లకు కొత్త సర్వీసులను అందించడంతోపాటు, ఉద్యోగులకు మరిన్ని అవకాశాలను కల్పించనున్నట్లు సైటెక్ సీఈవో జొహాన్ వెస్టర్‌మార్క్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మరో భారీ మెరైన్ కంపెనీని టేకోవర్ చేసిన ఆదానీ
ఇండియాలోనే అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ ఖాతాలో మరో కంపెనీ వచ్చి చేరింది. థర్డ్ పార్టీ మెరైన్ సర్వీసులు అందిస్తున్న ఓషియన్ స్పార్కిల్ సంస్థను అదాని గ్రూపుకు చెందిన ఆదానీ హర్బర్ సర్వీసెస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇందు కోసం రూ.1530 కోట్లను అదానీ హర్బర్ సర్వీసెస్ వెచ్చించింది. ఇండియాలో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ 2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించడం తమ లక్ష్యమని ఆదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సీఈవో కరన్ అదానీ తెలిపారు. తాజాగా కుదిరిన డీల్ వల్ల రాబోయే ఐదేళ్లలో ఓషియన్ స్పార్కిల్ లాభాలు రెట్టింపు అవుతాయని వెల్లడించారయన. ఓషియన్ స్పార్కిల్ సంస్థ 1995లో ఏర్పాటైంది. ఇండియాతో పాటు శ్రీలంక, సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్, ఆఫ్రికా దేశాల్లో సేవలు కొనసాగిస్తోంది. ఇండియాలో ఉన్న మేజర్, మైనర్ పోర్టుల్లో ఓషియన్ స్పార్కిల్ పని చేస్తోంది. ఈ కంపెనీలో దేశవ్యాప్తంగా 1800ల మంది పని చేస్తున్నారు. చదవండి: Multibagger Stock: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు! -
ఇక టాటావారి ఎయిరిండియా
న్యూఢిల్లీ: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకూ అందించే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎట్టకేలకు ఎయిరిండియాను సొంతం చేసుకుంది. ప్రభుత్వ సంస్థగా 69 సంవత్సరాలు కొనసాగిన ఎయిరిండియా సొంత గూటికి ఎగిరిపోయింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిరిండియాను టాటా గ్రూపునకు గురువారం అప్పగించింది. టాటాలు ప్రారంభించిన ఎయిరిండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది. 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ మాతృ సంస్థ నిర్వహణలోకి వచ్చింది. ఢిల్లీలోని ఎయిరిండియా కేంద్ర కార్యాలయంలో కంపెనీ అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏడు దశాబ్దాల తదుపరి సొంత గూటికి చేరుకున్న ఎయిరిండియా తిరిగి ప్రపంచస్థాయి దిగ్గజంగా ఆవిర్భవించేందుకు వీలు చిక్కినట్లేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2021 అక్టోబర్‌లో... గతేడాది అక్టోబర్‌లో స్పైస్‌జెట్ కన్సార్షియంతో పోటీపడి ఎయిరిండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్ (టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలసి టేకోవర్ వివరాలు తెలిపారు.. వెనువెంటనే కొత్త డైరెక్టర్ల బోర్డు సమావేశమై యాజమాన్య ఏర్పాటును చేపట్టింది.టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాలేస్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఎయిరిండియాను అప్పగించినట్టు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే మీడియాకు తెలిపారు. ‘‘ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుడుల ఉపసంహరణ లావాదేవీ విజయవంతంగా ముగిసింది. టాటాలు రూ.2,700 కోట్ల నగదు చెల్లించారు. దీనికి అదనంగా ఎయిరిండియాకు సంబంధించి రూ.15,300 కోట్ల రుణభారాన్ని టాటాలు స్వీకరించారు. ఇక నుంచి ఎయిరిండియా యజమాని టాలేస్’’ అని పాండే ప్రకటించారు ఆపై ఓవైపు ప్రభుత్వం, మరోపక్క టాటా గ్రూప్ ఎయిరిండియా బదిలీ పూర్తి అంటూ విడిగా ప్రకటనలు జారీ చేశాయి. దీంతో కోట్లకొద్దీ పన్నుచెల్లింపుదారుల సొమ్ముతో ఏళ్లుగా మూతపడకుండా నడుస్తున్న ఎయిరిండియా ప్రయివేటైజేషన్‌కు శుభం కార్డు పడింది. టాటా గ్రూప్ గూటిలో ఇది మూడో విమానయాన సంస్థకాగా.. ఇప్పటికే భాగస్వామ్యంలో.. విస్తారా, ఎయిరేషియాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఎస్ఐబీ కన్సార్షియం నుంచి రుణం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి టాటా గ్రూపునకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. టర్మ్ రుణంతోపాటు, మూలధన అవసరాలకు కావాల్సిన రుణాన్ని కూడా మంజూరు చేయనుంది. పీఎన్బీ, బీవోబీ, యూనియన్ బ్యాంకు ఈ కన్సార్షియంలో భాగంగా ఉన్నాయి. ‘‘ఎయిరిండియా రుణ భారాన్ని టాటాలకు రీఫైనాన్స్ చేసేందుకు వీలుగా రుణాన్ని మంజూరు చేసేందుకు కూటమిలోని చాలా బ్యాంకులు అంగీకరించాయి’’ అని ఓ బ్యాంకర్ తెలిపారు. టాటా వయా న్యూఢిల్లీ టు టాటా టాటా గ్రూపు వ్యవస్థాపకుడైన జహంగీర్ రతన్జీ దాదాబాయ్ (జేఆర్డీ) టాటా 1932లో ‘టాటా ఎయిర్‌లైన్స్’ను ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ఎయిర్‌లైన్స్. కరాచి, ముంబై మధ్య సర్వీసులు నడిపించింది. తర్వాత జరిగిన పరిణామాలు ఇవి... ► 1946: టాటాసన్స్ ఏవియేషన్ విభాగాన్ని ‘ఎయిరిండియా’గా మార్చారు. ► 1948: ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించడం ద్వారా యూరోప్‌కు సర్వీసులు మొదలుపెట్టింది. ఎయిరిండియా ఇంటర్నేషనల్ అన్నది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, టాటా సన్స్‌కు 25 శాతం ఉంటే, మిగిలినది ప్రభుత్వ వాటాకు కేటాయించారు. ► 1953: ఎయిరిండియా టాటాల చేతి నుంచి జాతికి అంకితమైంది. ప్రభుత్వం జాతీయం చేసింది. ఇక అప్పటి నుంచి దేశంలో ఏకైక సంస్థగా ఎయిరిండియా సాగిపోయింది. ► 1994–95: ఏవియేషన్ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మార్కెట్ వాటా కోసం ప్రైవేటు సంస్థలు చౌక ధరలకు మొగ్గుచూపడంతో, ఎయిరిండియా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది. ప్రైవేటీకరణ కార్యక్రమంలో భాగంగా 2000–01లో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎయిరిండియాలో మైనారిటీ వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. టాటాగ్రూపు–సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉమ్మడిగా ఆసక్తి చూపించాయి. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ► 2017 జూన్: ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ► 2018 మార్చి: ఎయిరిండియాలో 76 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో ప్రభుత్వం నిదానంగా ముందుకు వెళ్లాలనుకుంది. ► 2020 జనవరి: మరో విడత ప్రభుత్వం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విడత నూరు శాతం వాటా విక్రయ ప్రతిపాదన చేసింది. 2019 మార్చి నాటికి సంస్థ అప్పుల భారం రూ.60,074 కోట్లుగా ఉంది. కొనుగోలుదారు రూ.23,285 కోట్ల రుణ భారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ► 2020 అక్టోబర్: ఎయిరిండియా రుణ భారం ఎంత స్వీకరించాలన్నది కొనుగోలుదారుల అభిమతానికి విడిచిపెట్టింది. ► 2020 డిసెంబర్: ఎయిరిండియాకు ఆసక్తి వ్యక్తీకరణలు అందుకున్నట్టు దీపమ్ సెక్రటరీ ప్రకటించారు. ► 2021 ఏప్రిల్: ఎయిరిండియాకు ఆర్థిక బిడ్లను ఆహ్వానించారు. సెప్టెంబర్ 15 చివరి తేదీ. ► 2021 సెప్టెంబర్: ఎయిరిండియాను కొనుగోలు చేసే సంస్థ నష్టాలను క్యారీఫార్వార్డ్ చేసుకుని, భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖ వెసులుబాటు ప్రకటించింది. ► 2021 సెప్టెంబర్: టాటా గ్రూపు, స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నుంచి బిడ్లు వచ్చాయి. ► 2021 అక్టోబర్ 8: రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు బిడ్ విజేతగా నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది. ► 2021 అక్టోబర్ 25: టాటాగ్రూపు, ప్రభుత్వం మధ్య వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ► 2021 జనవరి 27: ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూపు వశమైంది. విమానయానం బలపడుతుంది ఎయిరిండియా కొత్త యజమానులకు శుభాకాంక్షలు. వారి చేతుల్లో ఎయిరిండియా తప్పకుండా వికసిస్తుంది. దేశంలో పౌర విమానయాన రంగం మరింత బలపడుతుంది. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం అనుకున్న వ్యవధిలోపే విజయవంతంగా పూర్తయింది. – జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎయిరిండియా తిరిగి టాటా గ్రూపు కిందకు రావడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎయిరిండియాను ప్రపంచస్థాయి విమానయాన సంస్థ (ఎయిర్‌లైన్స్)గా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఎయిరిండియా ఉద్యోగులు అందరికీ టాటా గ్రూపులోకి సాదర స్వాగతం. మీతో కలసి పనిచేయాలనుకుంటున్నాం. సంస్కరణల పట్ల ప్రధాని మోదీ నిబద్ధత, భారత వ్యవస్థాపక స్ఫూర్తి పట్ల నమ్మకాన్ని గుర్తిస్తున్నాం. ఇదే చారిత్రక మార్పునకు దారి చూపింది. ఏవియేషన్ రంగాన్ని అందుబాటు ధరలకు తీసుకురావాలని, పౌరుల జీవనాన్ని సులభతరం చేయాలన్న ప్రధాని లక్ష్యంతో ఏకీభవిస్తున్నాం. – ఎయిరిండియా ప్రకటన కొత్త అధ్యాయం ప్రారంభం నేడు కొత్త అధ్యాయం మొదలైంది. టాటా గ్రూపు తరఫున నేను ఈ లేఖ రాస్తూ, మీకు (ఎయిరిండియా ఉద్యోగులు) స్వాగతం పలుకుతున్నాను. జాతి మొత్తం మన వైపే చూస్తోంది. మనం కలసికట్టుగా ఏం సాధించగలమన్నది చూడాలి. మన దేశ అవసరాలకు తగ్గట్టు ఎయిర్‌లైన్‌ను నిర్మించడానికి మనం భవిష్యత్తు వైపు చూడాల్సి ఉంది. – ఎన్ చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
హిందాల్కో చేతికి ఏపీలోని కుప్పం ప్లాంటు
న్యూఢిల్లీ: అల్యూమినియం, కాపర్ తయారీలో ఉన్న హిందాల్కో ఇండస్ట్రీస్ తాజాగా నార్వే కంపెనీ హైడ్రోకు చెందిన భారత్‌లోని అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. డీల్ విలువ రూ.247 కోట్లు. వచ్చే త్రైమాసికంలో లావాదేవీ పూర్తి అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం వద్ద ఉన్న హైడ్రోకు చెందిన ప్లాంటు హిందాల్కో చేతికి రానుంది. ఈ కేంద్రం సామర్థ్యం 15,000 టన్నులు. ఈ తయారీ కేంద్రంలో ఆటో, బిల్డింగ్, కన్స్ట్రక్షన్, ఇండస్ట్రియల్ అప్లికేషన్లకు కావాల్సిన ఉత్పత్తులు, పరిష్కారాలను ప్లాంటు అందిస్తోంది. ప్లాంటు చేరికతో హై–ఎండ్ ఎక్స్‌ట్రూజన్స్, ఫ్యాబ్రికేటెడ్ సొల్యూషన్స్ విభాగాల్లో ప్రత్యేక ఉత్పత్తుల తయారీ సామర్థ్యం అధికమవుతుందని హిందాల్కో ఎండీ సతీశ్ పాయ్ తెలిపారు. హిందాల్కోను ఆదిత్యా బిర్లా గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. -
అమ్మకానికి రీబాక్.... ఆడిడాస్ సంచలన నిర్ణయం
స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తుల సంస్థ రీబాక్ అమ్మకానికి వచ్చింది. దాదాపు వందేళ్లకు పైబడి కొనసాగుతున్న ఈ ప్రముఖ బ్రాండ్ యాజమాన్యం మరోసారి మారనుంది. ఇందుకు సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. రీబాక్ బ్రాండ్ తెలియని యూత్, స్పోర్ట్స్ పర్సన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపు నూట ఇరవై ఆరేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పాదరక్షలు, స్పోర్ట్స్ వేర్, ఫిట్నెస్ కేర్‌లో రీబాక్ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏతో రీబాక్కి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ని 2.5 బిలియన్ డాలర్లకు అథెంటిక్ బ్రాండ్స్ గ్రూప్ (ఏబీజీ) సొంతం చేసుకోనుంది. రీబాక్ బ్రాండ్‌ని మరో ప్రముఖ స్పోర్ట్స్ వేర్ సంస్థ అడిడాస్ 2006లో 3.8 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. నైక్‌కి పోటీగా రీబాక్‌ను తీర్చిదిద్దేంకు ప్రయత్నించింది. అయితే ఆడిడాస్ చేతిలోకి వెళ్లిన తర్వాత రీబాక్ వ్యాపారం బాగా దెబ్బతింది. దీంతో ఆడిడాస్లోని ఇన్వెస్టర్లు రీబాక్‌ను అమ్మాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో రీబాక్ బ్రాండ్‌ను వదిలించుకునేందుకు అడిడాస్ సిద్ధమైంది. -
ZOOM : ఇకపై... ఏ లాంగ్వేజైనా ఓకే
వర్చువల్ సమావేశాలు మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా నూతన టెక్నాలజీని జూమ్ అందుబాటులోకి తేబోతుంది. విభిన్న ప్రాంతాలు, వేర్వేరు భాషలకు చెందిన ప్రజలు ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో జూమ్ బిజీగా ఉంది. మరింత సమర్థంగా మాట్లాడుతుండగానే ఒక భాషను అనువైన భాషలోకి తర్జుమా చేసి చెప్పే టెక్నాలజీతో దూసుకుపోతున్న జర్మనీకి చెందిన కైట్స్ సంస్థను జూమ్ టేకోవర్ చేసింది. కైట్స్‌కి సంబంధించిన సాంకేతికతను ఉపయోగించి వర్చువల్ మీటింగ్స్ మరింత సమర్థంగా ఉండేలా చూస్తామంటూ జూమ్ ప్రకటించింది. అంతేకాదు కైట్స్‌కి చెందిన ఇంజనీర్లు మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో మరిన్ని నూతన ఆవిష్కరణలు చేస్తారని, అవి తమ యూజర్లకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయని జూమ్ తెలిపింది. ఇప్పటికే ఉన్నా వర్చువల్ మీటింగ్‌లో విభిన్న భాషలు మాట్లాడేప్పుడు తర్జుమా చేసే ఫీచర్‌ను ఈ ఏడాది ప్రారంభంలో జూమ్ ప్రవేశపెట్టింది. అయితే మీటింగ్ జరిగేప్పుడు ఇతర శబ్ధాలు వినిపించినా, కొన్ని భాషలకు సంబంధించి స్థానిక యాసల్లో మాట్లాడినా, పదాలు పలికేప్పుడు స్పస్టత లోపించినా.... వాటిని అనువదించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో మెరుగైన సంస్థగా ఉన్న కైట్స్‌ని జూమ్ టేకోవర్ చేసింది. చదవండి : Incom Tax : జులై 1 నుంచి కొత్త టీడీఎస్ రూల్స్ -
వేదాంత చేతికి వీడియోకాన్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్‌ను వేలంలో దక్కించుకునేందుకు ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వేసిన రూ. 3,000 కోట్ల బిడ్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్‌లో భాగమైన ట్విన్‌స్టార్ సంస్థ 90 రోజుల్లోగా దాదాపు రూ. 500 కోట్లు, ఆ తర్వాత మిగతా మొత్తాన్ని క్రమంగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో చెల్లించనుంది.ఎన్సీఎల్టీ ఈ మేరకు మౌఖికంగా ఉత్తర్వులు వెలువరించిందని, తీర్పు కాపీ రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కారణం కేజీ బేసిన్ బ్యాంకులకు వీడియోకాన్ ఇండస్ట్రీస్ వడ్డీతో సహా సుమారు రూ. 31,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీడియోకాన్ కొనుగోలు ద్వారా కేజీ బేసిన్‌లోని రవ్వ చమురు క్షేత్రంలో వేదాంతాకు పట్టు చిక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రవ్వ క్షేత్రంలో వీడియోకాన్కున్న 25 శాతం వాటాయే కంపెనీ కొనుగోలుకి ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఉత్తమ్ గాల్వా ఎవరి పరం?
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ చేయడానికి పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మంచి పేరు సాధించిన ఈ కంపెనీ ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. టేకోవర్ బిడ్లకు సంబంధించిన గడువు గత నెల ముగిసింది. ఈ కంపెనీ టేకోవర్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరు రసవత్తరంగా ఉండనున్నది. లోహ దిగ్గజ కంపెనీలు ఈ కంపెనీని టేకోవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. లోహ కుబేరులు–లక్ష్మీ మిట్టల్, జిందాల్ సోదరులు(సజ్జన్, నవీన్ జిందాల్‌లు), వేదాంత కంపెనీ అనిల్ అగర్వాల్ ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ రేసులో ఉన్నారని సమాచారం. 2018లో దివాలా ప్రక్రియ ద్వారా ఈఎస్ఎల్ స్టీల్‌ను వేదాంత కంపెనీ టేకోవర్ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే వేదాంత కంపెనీ టేకోవర్ బిడ్‌ను వేదాంత సమర్పించిందని సమాచారం. ఈ లోహ కుబేరులతో పాటు కోటక్ మహీంద్రాకు చెందిన ఫీనిక్స్అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ) కూడా ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీపై కన్నేసింది. అయితే టేకోవర్ వార్తలపై ఈ సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు... ఉత్తమ్ గాల్వా కంపెనీని రాజేంద్ర మిగ్లాని స్థాపించారు. వాహనాలు, విమానాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమల్లో ఉపయోగించే విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి తొలి ఆర్నెల్లలో రూ.277 కోట్ల ఆదాయంపై రూ.140 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2020 మొదట్లో ఉత్తమ్ గాల్వా స్టీల్స్ కంపెనీ 67 లక్షల డాలర్ల విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఈ కంపెనీపై దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ 2020 మార్చిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో ఒక పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆరు నెలల తర్వాత ఎస్బీఐ పిటీషన్‌ను ఎన్సీఎల్టీ స్వీకరించింది. దివాలా ప్రక్రియను నిర్వహించడానికి కేఎమ్డీఎస్ అండ్ అసోసియేట్స్‌కు చెందిన మిలింద్ కసోద్కర్ను నియమించింది. అగ్ర భాగంలో ఆర్సెలర్ మిట్టల్... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరులో లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకే అధిక అవకాశాలున్నాయని సమాచారం. ఉత్తమ్ గాల్వా కంపెనీకి అత్యధికంగా అప్పులిచ్చింది లక్ష్మీ మిట్టల్ కంపెనీయే. ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.9,742 కోట్లుగా ఉంది. దీంట్లో ఆర్సెలర్ మిట్టల్ సంస్థల(ఆర్సెలర్ మిట్టల్ ఇండియా, ఏఎమ్‌ఎన్‌ఎస్ లగ్జెంబర్గ్) వాటాలే రూ.7,922 కోట్లుగా ఉన్నాయి. రుణదాతలకున్న మొత్తం ఓటింగ్ రైట్స్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 87.2% వాటా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ చెల్లించాల్సిన రుణాలను ఈ సంస్థలను చెల్లించి, ఆ మేరకు అప్పుల్లో వాటాను తీసుకున్నాయి. ఒకప్పు డు ఉత్తమ్ గాల్వాలో ఒక ప్రమోటర్‌గా ఆర్సెలర్ మిట్టల్ ఉండేది. దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి గాను ఉత్తమ్ గాల్వా స్టీల్ నుంచి ఆర్సెలర్ మిట్టల్ వైదొలగింది. ఎస్సార్ స్టీల్‌ను టేకోవర్ చేసి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియాగా పేరు మార్చింది. -
ఇండస్‌ఇండ్‌పై కొటక్ మహీంద్రా కన్ను?!
హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్‌పై ప్రయవేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ దృష్టి సారించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆల్ స్టాక్ డీల్(షేర్ల మార్పిడి) ద్వారా ఒప్పందం కుదుర్చుకునే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. సంయుక్త సంస్థలో ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్లు హిందుజా గ్రూప్ కొంతమేర వాటాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై వ్యాఖ్యలు చేయబోమంటూ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రతినిధి స్పందించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇక మరోపక్క.. ఇవి వట్టి పుకార్లు మాత్రమేనని ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో సుమంత్ కథప్లియా కొట్టిపారేశారు. బ్యాంక్ యాజమాన్యం ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని, ఈ వార్తలు నిరాధారమని వివరించారు. డీల్ జరిగితే.. ఇటీవల ఆస్తుల(రుణ) నాణ్యతపై ఆందోళనలతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు డీలాపడుతూ వస్తోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండస్ఇండ్ షేరు 64 శాతం పతనమైంది. దీంతో బ్యాంక్ మార్కెట్ విలువలో 60 శాతం కోత పడినట్లు నిపుణులు తెలియజేశారు. ఒకవేళ ఇండస్‌ఇండ్‌ను కొటక్ మహీంద్రా బ్యాంక్ టేకోవర్ చేస్తే.. సంయుక్త సంస్థ ప్రయివేట్ రంగంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా ఆవిర్భవించే వీలున్నట్లు వివరించారు. బ్యాంక్ ఆస్తులు 83 శాతం పెరిగే అవకాశమున్నట్లు తెలియజేశారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇంతక్రితం 2014లో ఐఎన్జీ గ్రూప్‌ను 2 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇండస్ఇండ్ ప్రమోటర్లు హిందుజా గ్రూప్‌తో కొటక్ మహీంద్రా గ్రూప్ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. 11.2 బిలియన్ డాలర్ల విలువైన హిందుజా గ్రూప్‌లోని నలుగురు సోదరుల మధ్య విభేధాల నేపథ్యంలో బ్యాంక్ విక్రయానికి చర్చలు ప్రారంభమైనట్లు భావిస్తున్నాయి. హిందుజా సోదరులు ఇండస్‌ఇండ్‌లో వాటా పెంచుకునేందుకు చేసిన ప్రతిపాదనను ఈ ఏడాది జూన్‌లో ఆర్బీఐ తిరస్కరించినట్లు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. షేర్ల తీరిలా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 1,382 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,399 వద్ద గరిష్టాన్ని, రూ. 1,372 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 2.4 శాతం జంప్‌చేసి రూ. 623 వద్ద కదులుతోంది. తొలుత గరిష్టంగా రూ. 633ను అధిగమించగా.. ఒక దశలో రూ. 617 వద్ద కనిష్టాన్ని చేరింది. -
ఇండియా సిమెంట్స్‌పై దమానీ కన్ను
న్యూఢిల్లీ: డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్‌తో రిటైల్ రంగంలో సంచలనం సృష్టించిన ప్రముఖ ఇన్వెస్టరు రాధాకిషన్ దమానీ తాజాగా ఇండియా సిమెంట్స్‌పై దృష్టి సారించారు. కంపెనీని టేకోవర్ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాన షేర్‌హోల్డరు ఎన్ శ్రీనివాసన్‌తో సంప్రతింపులు కూడా జరిపినట్లు సమాచారం. ఇండియా సిమెంట్స్‌లో నియంత్రణ స్థాయి వాటాలు దక్కించుకునేందుకు చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో శ్రీనివాసన్‌కు 29 శాతం వాటాలు ఉన్నాయి. బలవంతపు టేకోవర్ల సమస్య ఎదురుకాకుండా శ్రీనివాసన్ ఇతర ఇన్వెస్టర్ల వైపు కూడా చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బలవంతపు టేకోవర్ కాకుండా మేనేజ్మెంట్లో స్నేహపూర్వక మార్పు జరిగే విధంగానే టేకోవర్ ఉండేట్లు చూస్తానంటూ దమానీ హామీ ఇచ్చినట్లు వివరించాయి. దమానీకి చెందిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించగా, ఇండియా సిమెంట్స్ ఈ సమాచారం సరైనది కాదంటూ పేర్కొంది. క్రమంగా షేర్లు పెంచుకుంటూ.. దమానీ, ఆయన కుటుంబ సభ్యులు ఇండియా సిమెంట్స్‌లో గత కొన్నాళ్లుగా క్రమంగా షేర్లు పెంచుకుంటూ ఉన్నారు. మార్చి 31 నాటికి వారి వాటాలు సుమారు 20 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ డీల్ గానీ సాకారమైన పక్షంలో దమానీ పోర్ట్‌ఫోలియోను మరింత డైవర్సిఫై చేసుకోవడానికి వీలవుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇక అల్ట్రాటెక్ సిమెంట్, లఫార్జ్‌హోల్సిమ్ వంటి పోటీ దిగ్గజాలను ఎదుర్కొనేందుకు ఇండియా సిమెంట్స్‌కు కూడా గట్టి ఇన్వెస్టరు మద్దతు లభించగలదని పేర్కొన్నాయి. 74 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఇండియా సిమెంట్స్‌కు గతేడాది నాటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇండియా సిమెంట్స్ షేర్ రయ్.. టేకోవర్ వార్తలతో బుధవారం ఇండియా సిమెంట్స్ షేరు ధర సుమారు 4.72 శాతం పెరిగి రూ. 131.95 వద్ద క్లోజయ్యింది. మరోవైపు, అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 2,342 వద్ద క్లోజయ్యింది. ఇండియా సిమెంట్స్ షేరు ఈ ఏడాది మార్చి నాటి కనిష్ట స్థాయిల నుంచి 74 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 95 శాతం ఎగిసింది. 2019 సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఇండియా సిమెంట్స్ షేర్లను దమానీ గణనీయంగా కొనడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆయన వాటా 1.3 శాతంగా ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేటప్పటికి 4.73 శాతానికి పెరిగింది. మార్చి క్వార్టర్లో సోదరుడు గోపీకిషన్ శివకిషన్ దమానీతో కలిపి 15.16% వాటాలు కొనుగోలు చేయడంతో ఇది 19.89 శాతానికి చేరింది. -
ఇండియా సిమెంట్స్‌పై డీమార్ట్ కన్ను!
దక్షిణాది దిగ్గజం ఇండియా సిమెంట్స్‌పై రాధాకిషన్ ఎస్ దమానీ కన్నేసినట్లు తెలుస్తోంది. డీమార్ట్ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ అధినేత రాధాకిషన్ దమానీ ఇటీవల ఇండియా సిమెంట్స్‌లో వాటాలు కొంటూ వస్తున్నారు. తాజాగా దమానీ కుటుంబ సభ్యుల వాటా ఇండియా సిమెంట్స్‌లో 19.89 శాతానికి చేరింది. ఈ ఏడాది(2020) మార్చికల్లా ఇండియా సిమెంట్స్‌లో దమానీ కుటింబీకుల వాటా 19.89 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 140 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టానికి చేరింది. తదుపరి కొంతమేర వెనకడుగు వేసింది. ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు 1 శాతం క్షీణించి రూ. 2384 వద్ద కదులుతోంది. 5 శాతం నుంచి నిజానికి రాధాకిషన్ దమానీ 2019 డిసెంబర్‌కల్లా ఇండియా సిమెంట్స్‌లో 4.73 శాతం వాటాను పొందారు. తదుపరి మరింత వాటాను కొనుగోలు చేయడంతో ప్రస్తుతం 10.29 శాతానికి ఎగసింది. మరోవైపు సోదరుడు గోపీకిషన్ దమానీ సైతం ఇండియా సిమెంట్స్‌లో 8.26 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. కాగా.. ఇండియా సిమెంట్స్ కంపెనీలో నియంత్రిత వాటాను సొంతం చేసుకునే యోచనలో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ ఉన్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. గతేడాది(2019-20) క్యూ3లో ఇండియా సిమెంట్స్ స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 5.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అమ్మకాలు రూ. 1316 కోట్ల నుంచి రూ. 1191 కోట్లకు తగ్గాయి. క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించవలసి ఉంది. ఈ నెల 24న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో క్యూ4 ఫలితాలు వెల్లడించనున్నట్లు కంపెనీ బీఎస్ఈకి తెలియజేసింది. 72 శాతం ర్యాలీ ఇండియా సిమెంట్స్ షేరు 2019 ఆగస్ట్ 23న రూ. 68 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి ఇటీవల దమానీ వాటా కొనుగోలు వార్తలతో ర్యాలీ బాట పట్టింది. ఫలితంగా ఇప్పటివరకూ 72 శాతం ర్యాలీ చేసింది. ఇండియా సిమెంట్స్‌ను స్నేహపూర్వకంగా టేకోవర్ చేసే బాటలో కంపెనీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్‌తో రాధాకిషన్ దమానీ చర్చలు కొనసాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే డీమార్ట్ ప్రతినిధి ఒకరు ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించగా.. ఇండియా సిమెంట్స్ ప్రతినిధి తోసిపుచ్చినట్లు మీడియా పేర్కొంది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ఇండియా సిమెంట్స్ కౌంటర్లో ఇప్పటివరకూ 8.52 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇది రెండు వారాల సగటు పరిమాణంకంటే రెండు రెట్లు అధికంకావడం గమనార్హం! -
ఎయిర్ఇండియా దక్కేది వీరికే..?
సాక్షి, న్యూఢిల్లీ : నష్టాలతో సతమతమవుతున్న ఎయిర్ఇండియాలో నూరు శాతం వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం సోమవారం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానిస్తుండటంతో ఎయిర్‌లైన్‌ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎయిర్ఇండియాను కొనుగోలుకు మొగ్గుచూపే బయ్యర్లు ఈ ఏడాది మార్చి 17 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు స్పందించాల్సి ఉంటుంది. ఎయిర్ఇండియాను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్, హిందూజాలు, ఇండిగో, స్పైస్‌జెట్ సహా కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు పోటీ పడవచ్చని భావిస్తున్నారు. మరోవైపు దేశీ విమానయాన సంస్థలతో కలిసి కొన్ని విదేశీ ఎయిర్‌లైన్స్ కూడా సంయుక్త బిడ్ల ద్వారా బిడ్డింగ్ ప్రక్రియలో పాలుపంచుకునే అవకాశం ఉంది. ఎయిర్ఇండియా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితులున్నా ఎయిర్ఇండియాకు విస్తృతంగా ఉన్న దేశీ, విదేశీ నెట్వర్క్..లండన్, దుబాయ్ వంటి కీలక విదేశీ విమానాశ్రయాల్లో ట్రాఫిక్ రైట్స్, స్లాట్లు, సాంకేతిక సిబ్బంది కలిగి ఉండటం, పెద్ద సంఖ్యలో విమానాలు ఉండటంతో కొనుగోలుదారులు టేకోవర్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎయిర్‌లైన్ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తుండటంతో కొనుగోలుదారులు లేవనెత్తే డిమాండ్లను అంగీకరించి విక్రయ ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు పంపుతోందని ఖతార్ ఎయిర్వేస్ ఇండియా మాజీ చీఫ్ రాజన్ మెహ్రా పేర్కొన్నారు. కాగా ఎయిర్ఇండియా ప్రస్తుతం రోజుకు సగటును రూ 20-25 కోట్ల నష్టంతో నడుస్తోంది. చదవండి : బీపీసీఎల్, ఎయిరిండియా విక్రయం -
భారత ఉక్కు రంగంలోకి ‘ఆర్సెలర్’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఎట్టకేలకు భారత ఉక్కు రంగంలోకి అరంగేట్రం చేసింది. రచ్చ గెలిచిన లక్ష్మీనివాస్ మిట్టల్ ఇంట గెలవడానికి చాలా సమయం పట్టింది. చాలా ఏళ్ల సమయం, ప్రయాసల అనంతరం ఆయన ఉక్కు కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ మన దేశంలోకి అడుగిడింది. భారత్‌లో ఉక్కు కంపెనీని ఏర్పాటు చేయాలన్న ఎల్ఎన్ మిట్టల్ కల ఎట్టకేలకు ఎస్సార్ స్టీల్ టేకోవర్ ద్వారా సాకారమయింది. ఈ టేకోవర్ ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యిందని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అతి పెద్ద దివాలా రికవరీ... ఎస్సార్ స్టీల్ కంపెనీని రూ.42,000 కోట్లకు ఆర్సెలర్ మిట్టల్ టేకోవర్ చేయడానికి సుప్రీం కోర్టు గత నెలలోనే ఆమోదం తెలిపింది. దివాలా చట్టం కింద (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్–ఐబీసీ) పరిష్కారమైన అతి పెద్ద రికవరీ ఇదే. నిప్పన్ స్టీల్ కంపెనీతో కలిసి ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ (ఆర్సెలర్ మిట్టల్ /నిప్పన్ స్టీల్ (ఏఎమ్/ఎన్ఎస్ ఇండియా)) ఇకపై ఎస్సార్ స్టీల్‌ను నిర్వహిస్తుంది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ చైర్మన్‌గా అదిత్య మిట్టల్ (ప్రస్తుత ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సీఎఫ్ఓ, ప్రెసిడెంట్ ) వ్యవహరిస్తారు. ఈ జేవీలో ఆర్సెలర్ మిట్టల్‌కు 60 శాతం, నిప్పన్ స్టీల్ కంపెనీకి 40 శాతం చొప్పున వాటాలున్నాయి. లగ్జెంబర్గ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్... భారత్‌లో అడుగిడాలని చాలా ఏళ్ల కిందటే ప్రయత్నాలు ప్రారంభించింది. జార్ఖండ్, ఒడిశాల్లో 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భూ సేకరణ, పర్యావరణ, ఇతర అనేక అవరోధాల కారణంగా ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. -
ఎస్సార్ స్టీల్.. ఆర్సెలర్‌దే!!
న్యూఢిల్లీ: దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌ను ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించి ఆర్సెలర్‌మిట్టల్ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. బిడ్ మొత్తాన్ని ఫైనాన్షియల్ రుణదాతలు (బ్యాంకులు మొదలైనవి), ఆపరేషనల్ రుణదాతలు (సరఫరాదారులు మొదలైన వర్గాలు) సమానంగా పంచుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. బాకీలు రాబట్టుకోవడంలో మొదటి ప్రాధాన్యత ఫైనాన్షియల్ రుణదాతలకే ఉంటుందని, రుణదాతల కమిటీ (సీవోసీ) తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి లేదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణదాతలకు సమాన హోదా ఉండబోదని స్పష్టం చేసింది. 2018 అక్టోబర్ 23న ఆర్సెలర్‌మిట్టల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలంటూ న్యాయస్థానం.. పరిష్కార ప్రణాళికను సీవోసీకి తిప్పిపంపగలదే తప్ప, రుణదాతల కమిటీ తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయాన్ని మార్చజాలదని సుప్రీం కోర్టు తెలిపింది. పరిష్కార ప్రణాళికను రూపొందించేందుకు దివాలా కోడ్‌లో నిర్దేశించిన 330 రోజుల గడువును కూడా సడలించింది. సీవోసీ పరిష్కార ప్రణాళిక అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని సూచించింది. ఎస్సార్స్టీల్ వేలం ద్వారా వచ్చే నిధులను రుణదాతలంతా సమాన నిష్పత్తిలో పంచుకోవాలన్న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను సవాల్ చేస్తూ బ్యాంకులు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేస్తాం: ఆర్సెలర్‌మిట్టల్ సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించిన ఆర్సెలర్‌మిట్టల్.. సాధ్యమైనంత త్వరగా ఎస్సార్ స్టీల్ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, బిడ్ చేసిన ఆర్సెలర్ మిట్టల్, దాని భాగస్వామ్య సంస్థ నిప్పన్ స్టీల్‌కు ఎస్సార్ స్టీల్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థను దక్కించుకుంటున్నాయని పేర్కొంది. బ్యాంకులకు ఊరట.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్, ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ తదితర సంస్థలకు సుప్రీం కోర్టు తీర్పు ఊరటనివ్వనుంది. స్టాన్‌చార్ట్ డీబీఎస్ బ్యాంక్ వంటి ఆపరేషనల్ రుణదాతలకు ప్రాధాన్యం తగ్గనుంది. ఎస్బీఐకు ఎస్సార్ స్టీల్ అత్యధికంగా రూ. 15,430 కోట్లు బాకీ పడింది. రుణదాతల కమిటీ (సీవోసీ) నిర్ణయం ప్రకారం ఎస్సార్ స్టీల్ వేలం ద్వారా వచ్చే నిధుల పంపకాలకు సంబంధించి బ్యాంకుల్లాంటి సెక్యూర్డ్ రుణదాతలు తమకు రావాల్సిన బకాయిల్లో 90% దాకా, రూ. 100 కోట్ల పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్ రుణదాతలు తమకు రావాల్సిన దాంట్లో 20.5% దాకా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని తోసిపుచ్చిన ఎన్సీఎల్ఏటీ.. బ్యాంకులకు 60.7% మేర, రూ. 100 కోట్లు పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్ రుణదాతలు 59.6% దాకా క్లెయిమ్ చేసుకునే వీలు కల్పించింది. దీన్నే సవాలు చేస్తూ బ్యాంకులు.. సుప్రీంను ఆశ్రయించాయి. రెండేళ్ల తర్వాత ఒక కొలిక్కి.. ఎస్సార్ స్టీల్ సంస్థ బ్యాంకులకు, ఇతరత్రా రుణదాతలకు రూ. 54,547 కోట్ల మేర బకాయిపడింది. భారీ డిఫాల్టర్లకు సంబంధించి రెండేళ్ల క్రితం ఆర్బీఐ ప్రకటించిన తొలి జాబితాలోని 12 సంస్థల్లో ఇది కూడా ఉంది. దీంతో బాకీలను రాబట్టుకునేందుకు ఆర్థిక సంస్థలు.. దివాలా స్మృతి (ఐబీసీ) కింద అప్పట్నుంచి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ తర్వాత ఇది అనేక మలుపులు తిరిగింది. దివాలా తీసి, వేలానికి వచ్చిన తమ సంస్థ చేజారిపోకుండా తిరిగి దక్కించుకునేందుకు ప్రమోటర్లయిన రుయా కుటుంబం వివిధ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నించింది. ఆర్సెలర్‌మిట్టల్ ఆఫర్ చేసిన రూ. 42,000 కోట్ల కన్నా ఎక్కువగా రూ. 54,389 కోట్లు కడతాము, వేలాన్ని నిలిపివేయాలంటూ కోరింది. కానీ ఎన్సీఎల్టీ దీన్ని తోసిపుచ్చింది. దివాలా స్మృతికే సవాలుగా నిల్చిన ఈ కేసు ఫలితం .. ఇలాంటి మిగతా కేసులపైనా ప్రభావం చూపనుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేస్తాం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతుండగా, తాజాగా ఆ కంపెనీ ఉద్యోగ సంఘాలు కంపెనీని నడిపించడానికి ముందుకు వచ్చాయి. పైలెట్లు, ఇంజనీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్‌డబ్ల్యూఐపీ, జేఏఎమ్‌ఈవీఏలు ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్‌కు ఒక లేఖ రాశాయి. రూ.7,000 కోట్ల మేర నిధులు సమీకరించగలమని, జెట్‌ను టేకోవర్ చేస్తామని ఆ లేఖలో ఆ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఎస్‌డబ్ల్యూఐపీ(ద సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్)లో 800 మంది, జేఏఎమ్ఈవీఏ(జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్)లో 500 మంది వరకూ సభ్యులున్నారు. కాగా జెట్ టేకోవర్‌కు సంబంధించిన బిడ్లు దాఖలు చేసే గడువు తేదీ దాటిపోయింది. టేకోవర్‌కు అర్హత సాధించే కంపెనీల తుది జాబితా వచ్చే నెల 10న వెల్లడి కావచ్చు. -
ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన ఎల్ అండ్ టీ
బెంగళూరు/న్యూఢిల్లీ: మైండ్ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.980కు (మంగళవారం ముగింపు ధర, రూ.950 కంటే ఇది రూ.30 అధికం) కొనుగోలు చేస్తామని ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ ఓపెన్ ఆఫర్లో భాగంగా 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం ఎల్ అండ్ టీ రూ.5,030 కోట్లు కేటాయించింది. ఈ ఓపెన్ ఆఫర్ మే 14న ఆరంభమై అదే నెల 27న ముగుస్తుంది. అవసరానికి మించి బిడ్లు వస్తే, ఇష్యూ మేనేజర్లతో సంప్రదించి తగిన దామాషా ప్రాతిపదికన బిడ్లను అంగీకరిస్తారు. కాగా ఈ బలవంతపు ఓపెన్ ఆఫర్‌పై కసరత్తు చేయడానికి ఇండిపెండెంట్ డైరెక్టర్లతో కూడిన ఒక ప్యానెల్‌ను మైండ్‌ట్రీ కంపెనీ ఏర్పాటు చేసింది. మరోవైపు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పక్కన బెట్టింది. మైండ్ ట్రీని ఎల్ అండ్ టీ టేకోవర్ చేయడాన్ని మైండ్ ట్రీ వ్యవస్థాపకులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. -
ఆర్సెలర్ మిట్టల్ చేతికి ఎస్సార్ స్టీల్ !
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన ఎస్సార్ స్టీల్ టేకోవర్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమిటొమో మెటల్ కార్పొరేషన్ల కన్సార్షియమ్ ఎస్సార్ స్టీల్ కంపెనీని టేకోవర్ చేయనున్నది. ఎస్సార్ స్టీల్ కంపెనీ 30కు పైగా బ్యాంక్‌లకు రూ.45,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ నడుస్తోంది. ఎస్సార్ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి రష్యాకు చెందిన వీటీబీ గ్రూప్‌కు చెందిన న్యూమెటల్ కంపెనీ కూడా పోటీ పడింది. న్యూమెటల్ కంపెనీ రూ.37,000 కోట్లు ఆఫర్ చేయగా, ఆర్సెలర్ మిట్టల్ కన్సార్షియమ్ రూ.42,000 కోట్లు ఆఫర్ చేసింది. మరోవైపు భూషణ్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు కూడా సీసీఐ ఆమోదం తెలిపింది.