Tammineni Sitaram
-
హోం మంత్రి కాదు మైకుల మంత్రి: సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం: వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. సోమవారం(అక్టోబర్ 28)శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సీదిరి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. పలాసలో మైనర్ బాలికలపై టీడీపీ నేతలు అత్యాచారం చేశారు. నిందితులను టీడీపీ నాయకులు వెనకేసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశారు. టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించలేకపోయారు. లాఅండ్ఆర్డర్ కంట్రోల్లో పెట్టడంలో హోం మంత్రి విఫలమయ్యారు. హోం మంత్రి అనిత మైక్‌ల మంత్రిగా మారారు.చంద్రబాబు అసమర్థత వల్ల పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. కాశీబుగ్గలో దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేస్తాం’అని సీదిరి హెచ్చరించారు.ఇదీ చదవండి: విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు -
బాబు పై తమ్మినేని పంచులే పంచులు
-
తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత చంద్రబాబుదే : తమ్మినేని
శ్రీకాకుళం : తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శుక్రవారం ఆమదాల వలస పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు...మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోం. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ మంత్రి పదవి రాలేదని ఫస్ట్ రేషన్ తో బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతల మీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. సూపర్ సిక్స్ పథకం ఏమో తెలియదు కానీ సూపర్ సిక్స్ బీరు ప్రవేశపెట్టడం చూశాం. తల్లికి వందనం పోయి నాన్నకు ఇంధనం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు భయబ్రాంతులకు గురవుతున్నారు’ అని సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తమ్మినేని సీతారాం మండిపడ్డారు. -
‘గుడ్ బుక్ రాస్తాం.. అండగా ఉంటాం’
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం, రాష్ట్ర వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా సీదిరి అప్పల రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ‘‘భవిష్యత్తు అంతా వైఎస్సార్సీపీ పార్టీదే. కూటమి పాలనలో పధకాలన్నీ కొట్టుకుపోయాయి. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని అన్నారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. ‘‘పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. పార్టీ అధికారంలో లేనప్పుడు బరువు మోయడమే అసలైన పని. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా జగన్ పనిచేయమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం. 4 నెలలో ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. నేను ఆముదాలవలసలోనే ఉంటా.. ప్రజల కోసమే పనిచేస్తా. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ అన్ని ఆగిపోయాయి. నిత్యవసరాలు ఆకాశానంటుతున్నాయి. ధరల కంట్రోల్‌కి బడ్జెట్లోనే మేం నిధులు ఇచ్చేవాళ్లం. నాలుగు నెలలో రూ. 30 వేల కోట్లు అప్పుచేశారు. మెడికల్ సీట్లు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాయడం ఎంత దారుణం?. పేదల విద్యార్దులకు సీట్లు రాకుండా చేయడానికే కదా. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వరద సహాయం పేరుతో అక్రమాలు చేశారు’’ అని అన్నారు.అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ, ‘‘ కార్యకర్తలు కసితో పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు మాయమాటలు చేబుతూనే వస్తున్నారు. బిర్యాని వస్తుందని పలావు పెట్టే వారిని ఓడించారు. ఇప్పుడు పలావు, బిర్యానీ రెండూ లేవు. వంద రోజుల్లో ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. గుడ్ బుక్ రాస్తాం.. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాడటం మొదలు పెడతాం’’ అని పేర్కొన్నారు. -
ఎంపీకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితేంటి?: తమ్మినేని
సాక్షి,అమరావతి : టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సాఆర్సీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో టీడీపీ దాడులు దౌర్జన్యాలు పాల్పడుతోంది... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది... రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా పుల్ స్టాప్ పెట్టాలని లేదా చంద్రబాబు ?. చంద్రబాబు అనుకూల మీడియాతో ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఎన్నికల టైం నుంచి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అసత్య ప్రచారం చేస్తుంది. 55 రోజుల్లో చంద్రబాబు రోజుల్లో టీడీపీ పాలన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఐదేళ్లలో 2 లక్షల 71 వేల కోట్ల నగదు నేరుగా పేదలకు మా ప్రభుత్వం డీబీటీ ద్వారా అందించింది.7.8 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఖజానాలో ఉంది. కానీ చంద్రబాబు ప్రజలను తప్పుడు లెక్కలు చెపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారు. అందుకు ఎల్లోమీడియా వంతపాడడం విడ్డూరంగా ఉందని” మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దుయ్యబట్టారు. -
అధికారంలోకి రాగానే నరకం చూపిస్తున్నారు
-
ఎన్నికల ఫలితాలపై తమ్మినేని రియాక్షన్
-
బస్సు యాత్ర జనసంద్రాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయాడు
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే చర్యలు: స్పీకర్ తమ్మినేని
-
AP: 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి శాసన సభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్‌కుమార్ (విశాఖ దక్షిణ), కరణం బలరాం (చీరాల), మద్దాల గిరి (గుంటూరు వెస్ట్), వల్లభనేని వంశి (గన్నవరం)పై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు ఎమ్మెల్యేలను విచారించారు. ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు. పార్టీల విప్‌లు చేసిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేలు ఇచి్చన వివరణలను క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్.. ఆ 8 మంది సభ్యులు పార్టీ ఫిరాయించినట్టు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్
-
ఏపీ ఎమ్మెల్యేల ‘అనర్హత’పై ఉత్కంఠ
-
AP: ఫిరాయింపులపై ఇక స్పీకర్‌దే నిర్ణయం!
ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ విచారణకు మళ్ళీ డుమ్మా కొట్టిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 గంటల వరకు సమయం ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు మరికొంత సమయం కావాలంటూ స్పీకర్‌కు లెటర్ రాసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు సిద్దమైన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం అనర్హత పిటిషన్లపై ఏ క్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల ‘అనర్హత’పై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు ‘తుది’ నోటీసులు అందుకున్న ఆయా సభ్యులు ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాము విచారణకు హాజరు కాలేమని వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు బదులు పంపినట్లు తెలుస్తోంది. నోటీసుల ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నాం తొలుత టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయింపుల విచారణ ఉంది. అయితే.. విచారణకు హాజరుకాలేమంటూ ఆనం రామనారాయణరెడ్డి బదులు పంపినట్లు తెలుస్తోంది. తమ అనర్హత పిటిషన్‌కు సంబంధించి.. పిటిషనర్ సమర్పించిన వీడియో ఆధారాలు ఒరిజినల్ అని నిరూపించాల్సిన అవసరం ఉందంటూ పాత పాటే పాడారు వాళ్లు. తాము మాట్లాడిన వీడియోలకు సంబంధించి ఆయా సంస్థల సర్టిఫైడ్ కాపీలు కావాలని స్పీకర్‌ను ఆనం కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాము విచారణకు రాలేమని ఆయన బదులు పంపారు. అలాగే.. మేకపాటి, శ్రీదేవి కూడా మరింత సమయం కావాలని కోరినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నుంచి నెగ్గి.. టీడీపీలోకి పార్టీ ఫిరాయించారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు పార్టీ ఫిరాయించారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన వీళ్లపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. వీళ్లతో పాటు టీడీపీ తరఫు నుంచి కూడా అనర్హత ఫిర్యాదు నమోదు అయ్యింది. .. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. వాళ్లపై నమోదు అయిన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్, మండలి చైర్మన్లు ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తూ వచ్చారు. అయితే వీళ్లలో కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. మూడుసార్లు నోటీసులు ఇస్తే.. రకరకాల కారణాలతో వాళ్లు విచారణకు గైర్హాజరు అవుతూ వస్తున్నారు. సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఇవాళ (19వ తేదీన) విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. స్పీకర్ కార్యాలయంలో వీళ్ల విచారణ జరగాల్సి ఉంది. అలాగే.. అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్(మండలి) సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం.ఒకవేళ.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ ఇదివరకే నోటీసుల్లో స్పీకర్, చైర్మన్లు స్పష్టం చేశారు. దీంతో రాలేమంటూ లేఖ పంపిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉండనుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంకోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. వీళ్లను కూడా ఇవాళే విచారణకు రావాల్సిందిగా స్పీకర్, మండలి చైర్మన్లు నోటీసులు పంపించారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్ ! హాజరు కాకుంటే..
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు
-
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు
అమరావతి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12 న విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీరికి తాజాగా నోటీసులు జారీ చేసిన స్పీకర్.. ఈనెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. -
ప్రతిపక్షాల ప్రవర్తన బాధించింది
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్షాల ప్రవర్తన తనను బాధించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న 15వ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిపక్షాల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. గురువారం సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు సభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులను నిర్వహించానని, కానీ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని ఐదేళ్లపాటు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తన విధులను కర్తవ్యదీక్షతో నిర్వర్తించానని, అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా తొలిసారి సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, మహిళా సభ్యులను మాట్లాడించడానికి ప్రోత్సహించినట్లు తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ద్వారా సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేశానన్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు బిల్లు, మహిళా రక్షణకు ఉద్దేశించిన దిశ బిల్లు వంటి అనేక కీలక బిల్లులు ఆమోదం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. కానీ, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తమ పరిధిని దాటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రతిష్టాత్మక వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించారన్నారు. సభలో భిన్న వాదనలు ముఖ్యమని, అయితే పరిధి దాటి స్పీకర్ పోడియం మీదకు వచ్చి కాగితాలు, ఫైళ్లు విసిరారని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, గౌరవ ప్రదమైన స్పీకర్ స్థాయిని, శాసనసభ స్థాయిని తగ్గించడమేనని తమ్మినేని అన్నారు. సభను హుందాతనంగా నడపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించిన కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్ కార్యాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 15వ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు 10 గంటల రెండు నిమిషాలు జరిగాయని, ఇందులో 9 బిల్లులను ఆమోదించగా, 20మంది సభ్యులు మాట్లాడినట్లు తెలిపారు. ఫిబ్రవరి 8 నాటికి సభలో వైఎస్సార్సీపీకి 151 మంది, టీడీపీకి 22 మంది, జనసేనకు ఒకరు చొప్పున సభ్యులు ఉన్నారని, ఒక స్థానం ఖాళీగా ఉందని స్పీకర్ వెల్లడిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చివరి రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరులో ఎటువంటి మార్పులేదు. సభ మొదలైన మరుక్షణం నుంచే కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. సభ ప్రారంభమైన వెంటనే పథకం ప్రకారం గొడవ చేసి వెళ్లిపోయారు. కేవలం సభలో 15 నిమిషాలు మాత్రమే టీడీపీ సభ్యులు సభలో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై గురువారం సభలో చర్చ నిర్వహించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా సభ ప్రారంభమైన వెంటనే జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధంపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి వెళ్లారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, అశోక్, రామకృష్ణలు స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టారు. మరోవైపు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, చినరాజప్ప తదితరులు స్పీకర్ పోడియం ముందు నిలుచుని, పోడియాన్ని తడుతూ ఆందోళనకు దిగారు. వారి ఆందోళన మధ్యే సభా కార్యకలాపాలను కొనసాగిస్తూ స్పీకర్ మాట్లాడుతుండగా... ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ స్పీకర్ మైక్‌లో వినిపించేలా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు, వాడకం మితిమీరిపోయిందంటూ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల తీరును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పుబట్టారు. సభలో జరుగుతున్న బిజినెస్‌కు విరుద్ధంగా వాయిదా తీర్మానాలకు డిమాండ్ చేసి ఆందోళనకు దిగడమేమిటని ప్రశి్నంచారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒకసారి పోలీస్ రికార్డులను పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులు రాలేదు. రెండు బిల్లులకు ఆమోదం ఏపీ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2024, ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు–2024ను శాసనసభ ఆమోదించింది. విద్యుత్ సుంకం బిల్లును ఆ ర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలో ప్రవేశపెట్టారు. -
బడ్జెట్ ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates.. ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా ►9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చాం. హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు. నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచిపనైనా జరిగిందా?. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే. మాది సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్సీ రవీంద్రబాబు ప్రతీ సంక్షేమ పథకం ప్రజల మేలు కోసమే అమలు చేశాం మా ప్రభుత్వానికి పబ్లిసిటీ ముఖ్యం కాదు.. ప్రజలకి మేలు జరగడం ముఖ్యం రాష్ట్రానికి కోవిడ్ సమయంలో రావాల్సిన ఆదాయం రాలేదు రెండేళ్ల కోవిడ్ సమయంలో రెండు లక్షల కోట్ల రూపాయిల ఆదాయం తగ్గిపోయింది గడిచిన నాలుగన్నరేళ్ల పాలనలో 4.60 లక్షల కోట్లు ప్రజలకి నేరుగా అందించాం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల ఖాతాలలోకి నిధులు జమ చేశాం మా ప్రభుత్వం వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చింది ప్రతీజిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేకే ఉక్రెయిన్ లాంటి సుదూర దేశాలకి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది ఆర్ధిక ఇబ్బందులు ఉన్న్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదు ►శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ముందు వ్యక్తిగతంగా హాజరైన వంశీకృష్ణ యాదవ్. న్యాయవాదులతో కలిసి చైర్మన్ ముందు హాజరు మూడు బిల్లులకి శాసనమండలి ఆమోదం ఆర్జేయూకేటీ విశ్వ విద్యాలయ సవరణ బిల్లు, ఏపీ అసైన్ భూముల సవరణ బిల్లు, ప్రభుత్వ సేవలలో నియామకాల క్రమబద్దీకరణ, సిబ్బంది తీరు, వేతనవ్యవస్ధ హేతుబద్దీకరణ సవరణ బిల్లులకి శాసన మండలి ఆమోదం శాసన మండలి పదినిమిషాలు వాయిదా పెద్దల సభలోనూ మారని టీడీపీ సభ్యుల తీరు చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన, నినాదాలు చైర్మన్ వారించినా వినిపించుకోని టీడీపీ ఎమ్మెల్సీలు సభకు అంతరాయం కలిగించవద్దని చైర్మన్ విజ్ణప్తి పట్టించుకోకుండా టీడీపీ ఎమ్మెల్సీల నినాదాలు దీంతో, శాసన మండలి వాయిదా అంతకముందు జాబ్ క్యాలెండర్, దిశ, మద్యపాన నిషేదంపై ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన మండలి చైర్మన్ ►సభలో టీడీపీ సభ్యుల నినాదాలు, సభా కార్యక్రమాలకు అడ్డుకునే యత్నం ►కాసేపు శాసనసభ వాయిదా ►అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన సీఎం జగన్ ►ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపిన అసెంబ్లీ ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం ►అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్ ►ఈరోజు కూడా స్పీకర్ ఛాంబర్ వద్దకు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లి నినాదాలు చేసిన టీడీపీ నేతలు ►టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీరియస్ ►టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని. ►నేడు ఏపీ అసెంబ్లీలో చివరి రోజు(నాలుగో రోజు) బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించనుంది. ►ఎన్నికల నేపథ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలుపునుంది. ►అలాగే, నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే వారికి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై విచారణ జరుగనుంది. ►పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై విచారణ. వ్యక్తిగతంగా విచారించనున్న శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్‌లకు నోటీసులు ఇచ్చారు. -
అసెంబ్లీలో టీడీపీ రగడ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను అడ్డుకుని రాద్ధాంతం చేశారు. ఇతర సభ్యులు ఎవరూ ప్రసంగించకుండా స్పీకర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎంతకీ వారి తీరులో మార్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి రామకృష్ణ చౌదరి (అనపర్తి), అలికిరి జగదీష్ (గుత్తి), పరకాల కాళికాంబ (నరసాపురం) అకాల మృతికి శాసన సభ సంతాపం ప్రకటించింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఇంతలో టీడీపీ సభ్యులు నిత్యావసర ధరలపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చ పూర్తయ్యాక మాట్లాడదామని స్పీకర్ చెప్పారు. ఇందుకు టీడీపీ సభ్యులు అంగీకరించలేదు. ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని సహా 15 మంది స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అచ్చెన్న వెల్‌లో ఉండగా, మిగతా సభ్యులు పోడియం పైకి ఎక్కి స్పీకర్ కురీ్చని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా బిల్లు పత్రాలను చింపి స్పీకర్‌పై చల్లి రగడ సృష్టించారు. స్పీకర్ వారిని ఎంతగా వారించినా పద్ధతి మార్చుకోకపోవడంతో 48 నిమిషాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి ఉదయం 10.34 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఈసారి విజిల్స్ తీసుకొచ్చి స్పీకర్ చెవుల్లో ఊదడం ప్రారంభించారు. ఇది సరికాదని, స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారించినా పట్టించుకోలేదు. వెలగపూడి రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించి స్పీకర్ వద్దనున్న బెల్‌ను అదే పనిగా మోగించడం ప్రారంభించారు. సభలో ఇతర సభ్యులు మాట్లాడేది ఏదీ వినబడకుండా, స్పీకర్ చెప్పేది సభ్యులకు వినిపించకుండా టీడీపీ సభ్యులు నానా రగడా సృష్టించారు. దీంతో మార్షల్స్ స్పీకర్ తమ్మినేనికి రక్షణగా నిలబడ్డారు. ఎంత వారించినా వినకపోవడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బ్రేక్ తర్వాత టీడీపీ సభ్యలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. -
గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదం
-
AP Assembly: టీడీపీ సభ్యుల రచ్చ.. సభ నుంచి సస్పెండ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు మళ్లీ ఓవరాక్షన్ చేశారు. దీంతో, టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోలేదు. ప్రతీసారి చేసిన విధంగానే ఈసారి కూడా అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. రెడ్‌లైన్ దాడి స్పీకర్ తమ్మినేని పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. సభ జరుగుతుండా విజిల్స్ వేస్తూ అరాచకం సృష్టించారు. అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధులనే స్పృహ మరిచిపోయి టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్‌పై విసిరారు. స్పీకర్ తమ్మినేని పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. స్పీకర్‌ను అవమానపరిచేలా నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
గుంటూరు, సాక్షి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారాయన. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ స్పీకర్ కార్యాలయం నుంచి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ నోటీసులకు స్పందించాలని స్పీకర్ కార్యాలయం కోరింది. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ అయిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజులకు నోటీసులు పంపించారు. ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి విచారణ చేయనున్నారు స్పీకర్ తమ్మినేని. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్న తర్వాతే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ వారిని కోరిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించిన మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై సోమవారం స్పీకర్ తమ్మినేని విచారణ జరిపారు. అయితే ఇందులో స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ క్రమంలో వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మూడుసార్లు టైం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు కూడా. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. -
గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్!
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం తర్వాత తొలిసారి స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాను స్పీకర్‌గా ఆమోదించడంలో రాజకీయ కుట్ర ఏముందని తమ్మినేని ప్రశ్నించారు. గడువు తర్వాతే నిర్ణయం.. గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను నాకు ఎప్పుడో ఇచ్చారు. పైగా స్పీకర్ ఫార్మాట్లోనే ఆయనే ఇచ్చారు. ఎమ్మెల్యేగా తప్పుకుంటానని తెలిపారు. లేఖ ఇవ్వగానే ఆమోదించడం సరికాదని వేచిచూశాం. మనసు మార్చుకుంటాడన్న మానవతా దృక్పథంతో ఇప్పటివరకు ఆగాను. ఇప్పుడు స్పీకర్‌గా నా పదవీకాలం ముగుస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇన్నాళ్లు అవకాశం ఇచ్చినా నిర్ణయాన్ని మార్చుకోలేని ఇప్పుడెలా మార్చుకుంటాడని భావించాను. పదవీ కాలం సమీపిస్తుండడంతో రాజీనామాను ఆమోదించాను. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అమ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి.. ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు ఏదైనా భిన్నంగా ఆలోచిస్తే.. కోర్టుల ద్వారా ముందుకు వెళ్లొచ్చు. రాజీనామా ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం అనేది సరికాదు. చట్టసభల విషయంలో నియమ నిబంధనలను పాటించాలి. ఒక వేళ గంటా శ్రీనివాసరావు ఓటుతోనే అధికార పార్టీ రాజ్యసభ సీట్లు ఆధారపడిలేవు కదా. వైఎస్సార్సీపీ రాజ్యసభ సీటు కోల్పోతుంది అని ప్రచారం చేస్తున్న విషయమే కరెక్టయితే అందరికీ నోటీసులు ఎందుకు ఇస్తాం? ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇచ్చాను. వారంలోపు అన్ని పిటిషన్లు క్లియర్ చేస్తాం. స్పీకర్ లేఖలు.. ఒక పార్టీ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరుకునపడ్డారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఇప్పటికే అనర్హతా వేటు ఎదుర్కొంటున్నారు. వీరిపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో స్పీకర్ వీరికి నోటీసులిచ్చారు. ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కావాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది. వారంలో ఏం జరగనుంది? స్పీకర్‌గా తన పదవీ కాలం సమీపిస్తుండడంతో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై వారంలోగా నిర్ణయం తీసుకుంటానని తమ్మినేని ప్రకటించడం తెలుగుదేశంలో గుబులు రేపుతోంది. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన నలుగురిని వెంటనే లాగేసుకున్న చంద్రబాబు.. తాజాగా జరుగుతున్న పరిణామాలపై గుంభనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురికి తెలుగుదేశం టికెట్ ఇచ్చి పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. పక్కపార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. 2014-19 మధ్య ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బోలెడు డబ్బు గుమ్మరించి లాగేసుకున్న చంద్రబాబుకు ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టారు ఓటర్లు. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. అనర్హతా పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకుని వేటు వేస్తే.. ఈ నలుగురు కూడా పోటీ చేసేందుకు అర్హతా కోల్పేయే అవకాశం ఉంది. అది స్పీకర్ విశిష్టాధికారం అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్ నిర్ణయం. స్పీకర్ వ్యవస్థ పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. గంటా రాజీనామాను ఆమోదించాలన్నది స్పీకర్ నిర్ణయం. ఎప్పుడు ఆమోదించాలో అన్నది కూడా ఆయన నిర్ణయమే. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు YSRCP గెలుస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తుందనుకుంటారు? అసలు టీడీపీకి తగినంత సంఖ్యాబలమే లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.