Telangana Formation
-
అమరులకు కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేపట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో.. తొలిరోజున సాయంత్రం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొవ్వొత్తితో అమరజ్యోతిని వెలిగించి అమరులకు నివాళి అర్పించారు. అనంతరం అమర జ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీని కేసీఆర్ ప్రారంభించారు. వెయ్యి మందికిపైగా తెలంగాణ కవులు, కళాకారులు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందినవారితోపాటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సుమారు రెండు గంటల పాటు ర్యాలీ కొనసాగింది. అమరులకు నివాళి అర్పిస్తూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. రవీంద్రభారతి, ఆర్బీఐ మీదుగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ‘జోహారులు.. జోహారులు.. అమరులకు జోహారులు.. వీరులకు జోహారులు’అంటూ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి అందరూ అమరులకు నివాళి అర్పించారు. నేడు తెలంగాణ భవన్లో వేడుకలు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9.30కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండాతోపాటు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ‘తెలంగాణ యాది’పేరిట ఉద్యమ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. తర్వాత తెలంగాణ భవన్ పక్కనే ఉన్న కళింగ భవన్లో పార్టీ నేతలతో కలిసి భోజనం చేస్తారు. ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ: కేసీఆర్ ప్రజాస్వామిక వాతావరణంలో, పార్లమెంటరీ పంథాలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ట పర్చుకుంటూ సమర్థవంతంగా పాలన అందించిన గత పదేళ్లలో.. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. అమరుల త్యాగాలను వృధాపోనీయకుండా.. గత పదేళ్ల ప్రగతిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు. -
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు జరిగిన సమావేశానంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జరుపుతున్న ఉత్సవాల్లో సోనియా భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నా రు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. ఈరోజు సోనియాగాం«దీని కలిసి ఆహా్వనించాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త. సోనియా గాంధీ పర్యటన, అవతరణ ఉత్సవాల కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురుచూ స్తున్నాం. రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు సోనియా గాం«దీని సత్కరించడం ద్వారా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ సముచిత గౌరవం ప్రజా పాలనలో చేసుకుంటున్న తొలి ఉత్సవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్ర తి ఒక్కరినీ ఇందులో భాగస్వాముల్ని చేస్తాం. అందరినీ అధికారికంగా ఆహా్వనిస్తున్నాం. వారందరికీ సముచితమైన గౌరవం దక్కుతుంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం..’ అని సీఎం తెలిపారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. సుమారు 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీనికి ముందు తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనులను రేవంత్ పరిశీలించారు. బంగ్లా మొత్తం కలియ తిరిగి అధికారులకు కొన్ని మార్పులు సూచించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం సోమవారం అర్ధరాత్రి కేరళ నుంచి ఢిల్లీకి వచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లారు. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం సంస్కారహీనమని అన్నారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని మోదీ వ్యాఖ్యలను ఆక్షేపించారు. తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని దుయ్యబట్టారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చడం సబబు కాదని అన్నారు. మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు ప్రధాని..? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం ..? తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..? తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు మా… https://t.co/3tNjBJSVOK — KTR (@KTRBRS) September 18, 2023 తెలంగాణపై ఎంత కోపమో.. అప్పర్ భద్ర, పోలవరం, కెన్‌బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు? మేం చేసిన పాపమేందని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి.. ఆదివాసులపై కక్ష సాధిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు. మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తారని దుయ్యబట్టారు. కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా? 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో అని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఊదరగొట్టే బీజేపీకి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని అన్నారు. డిపాజిట్లు కోల్పోవడంలో మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని ఎద్దేవా చేశారు. మోదీ అలా అనలే: కిషన్ రెడ్డి ప్రధాని మోదీ ఎవర్నీ విమర్శించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. సంతోష వాతావరణంలో బీజేపీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును సామరస్యంగా చేయలేకపోయిందని మాత్రమే మోదీ అన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో జరిగిన విషయాలను మాత్రమే మోదీ చెప్పారు.. విభజన బిల్లు సమయంలో పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే చేశారు.. కారం, నీళ్ళు చల్లారు.. తలుపులు మూశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 'ట్విట్టర్ లేకుంటే బ్రతకను, అమెరికాలో ట్విట్టర్ నేర్చుకున్నట్లు, ట్విట్టర్ కోసమే బ్రతుకుతున్నట్లు మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ విమోచన దినానికి, సమైక్యతకు తేడా కేసీఆర్ కు అర్థం కావడం లేదు.. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు ప్రధాని మోదీ మాటలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు' అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. నేతల మధ్య పొలిటికల్ వార్ -
ఎనిమిదేళ్లలో చేసిందీ, చేయాల్సిందీ!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయింది. అరవై ఏళ్లలో రెండు ఉత్తుంగ తరంగాల్లా సాగిన ఉద్యమం ఫలితంగా... ఎట్టకేలకు సకల జనుల కలను సాకారం చేస్తూ ‘తెలంగాణ’ ఆవిర్భవించింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జనం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్కు ఉద్యమపార్టీ హోదాలో అధికారాన్ని కట్టబెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉరికించామని ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదనీ, అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలూ నెరవేర్చలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కన్న కల నిజమయింది! తెలంగాణకు సంబంధించి 2014 జూన్ 2 ఒక చారిత్రాత్మక దినం. ఆ రోజు తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నిర్మాత కె. చంద్రశేఖర్‌రావు స్వప్నం సాకా రమైన రోజు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు! కొత్త రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు. తమ భవిష్యత్తు మీద ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్న రోజు!! ఎనిమిదేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసు కుంటే... తెలంగాణ ప్రజల ఆశలు చాలా వరకు నెరవేరినట్లే అనిపిస్తుంది. ఏవో కొద్ది ప్రాంతాల్లో తప్ప తెలంగాణ అంతటా సాగునీటికీ, తాగునీటికీ ఇబ్బందులు తొలగాయి. ధాన్యం ఉత్పత్తిలో పంజా బ్‌ను పక్కకు నెట్టేసి మనం ముందుకుపోతామని ఏ తెలంగాణ బిడ్డ అయినా అనుకున్నాడా! పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా వేల రూపాయలు అంది స్తారని ఏ రైతైనా ఊహించాడా? రైతు చనిపోతే కుటుంబం వీధినపడే పరిస్థితి నుంచి రూ. 5 లక్షల బీమా సొమ్ముతో ప్రభుత్వమే కుటుంబాన్ని నిల బెడుతుందని అనుకున్నామా? 24 గంటల కరెంటు సరఫరాను ఊహించామా! ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం ప్రభుత్వమే చేస్తుందనీ, మంచినీళ్ల కోసం బిందెలు భుజాన పెట్టుకొని ఫర్లాంగ్ల కొద్దీ నడి చిన ఆడపడుచులకు ఇంటి ముంగిట నల్లా తిప్పు కుంటే నీళ్లు వచ్చే రోజులు వస్తాయనీ భావించారా! గాంధీ, ఉస్మానియా తప్ప.. మరో ఆస్పత్రి దిక్కులేని పరిస్థితుల నుంచీ... ప్రతి ఒక్కరికీ అందు బాటులో ఆస్పత్రి ఉంటుందని కలలోనైనా అను కున్నారా? చదువుకు గతిలేని పరిస్థితుల నుంచి దేశంలోనే అత్యధిక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఏ పండితు డైనా భాష్యం చెప్పాడా? చేనేత కార్మికులకు నూలే ఉరితాడయ్యే దశ నుంచి... ‘బతుకమ్మ చీరల’తో భవిష్యత్తుకు భద్రత లభిస్తుందని ఎవరైనా భరోసా ఇచ్చారా? ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక బక్కాయన అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చేశాడు. ఇందుకు ఆయన ప్లానింగ్, దార్శనికత, ముందుచూపు, విషయ పరిజ్ఞానం, కృషి, పట్టుదలలే కారణం. ఇవే ఆయననూ, తెలం గాణ రాష్ట్రాన్నీ ముందుకు నడిపించాయి. తెలం గాణ అస్తిత్వ, ఆత్మగౌరవాలకు ప్రతీక కేసీఆర్!! – డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ సాధించాల్సింది ఎంతో..! తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అప్పుడే 8 ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్ పనితీరు ఎలా ఉంది? టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా అవ లంబిస్తున్న విధానాలు, చేపట్టిన ప్రాజెక్ట్‌లు, పథ కాలు; పదవుల పంపకాలు, పైరవీలు, పంచాయి తీలు వంటి అనేక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వచ్చిందని అడి గితే... ఆత్మ స్థైర్యం వచ్చిందనీ, ఆత్మ గౌరవం పెరిగిందనీ,‘మాది తెలంగాణ ’ అని సగర్వంగా చెప్పుకునే సాధికారికత సిద్ధించిందనీ చెప్పుకోగలి గిన స్థితిలో ఉన్నాం. మన పండుగలు, మన భాష యాస, మన పాటలు, పాఠాలతో తలెత్తుకొని నిల బడి గెలిచి నిలుస్తోంది తెలంగాణ.. ‘మా నిధులు మాకే’ అన్న కల నిజమైన వాస్తవాన్ని హర్షించ కుండా ఉండలేం. రాష్ట్రం తన నిర్ణయాలను తానే తీసుకుంటూ, తన తప్పుల్ని తానే సరిదిద్దుకుని, తన ముద్రను బలంగా వేస్తూ... జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తున్న నేప థ్యంలో ‘తెలంగాణ నాది’ అని సగర్వంగా చెప్ప కుండా ఉండలేం. అయినా అందుకోవాల్సిన లక్ష్యాలూ, నెరవేర్చాల్సిన ఆకాంక్షలూ ఉన్నాయి. ఆరు దశాబ్దాలుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలకు మరింత చేయూతను అందిం చాల్సిన అవసరం కనబడుతోంది. ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఆంధ్ర హవా పెరిగిపోవడం, రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారే పరిపాలనలో కీలక స్థానాల్లో కొనసాగడం బాధ కల్గించే విషయం. ప్రతి రంగంలో ఇక్కడి భూమి పుత్రులకే అవకాశాలు దక్కేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ఏ రాష్ట్రం పోటీ పడలేని విధంగా కొద్దికాలంలోనే 426 పథ కాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటి స్తోంది. సంతోషమే! కానీ, రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ ప్లీనరీలలో, బహిరంగ సభల్లో; తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో లలో పేర్కొన్న అనేక అంశాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంది. సమర్థ నాయకత్వం సమాజానికి లభించినప్పుడు సక్రమ మైన అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజానికి ప్రశ్నించేతత్వం ఉన్నప్పుడు నాయకత్వం మరిం తగా సమర్థమంతమవుతుంది. అప్పుడే సకల జనుల అభివృద్ధీ సాధ్యమవుతుంది. – సురేష్ కాలేరు, తెలంగాణ ఉద్యోగుల సంఘం సహాధ్యక్షులు, మొబైల్: 98661 74474 అమరవీరుల కుటుంబాల సంగతేమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లయింది. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి అమరులయ్యారు. అయితే రాష్ట్రం సిద్ధించినా అమరుల కుటుంబాల పరిస్థితి ఇంకా మారలేదు అనేది వాస్తవం. దాదాపు 1,200 మంది తెలంగాణ వాదులు మలి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పో యారు. కేసీఆర్ అమరుల కుటుంబాలను ఆదు కుంటామని చెప్తూ మొదటి అసెంబ్లీ సమావేశం లోనే బిల్లు పెట్టారు. ఆ తర్వాత జీఓ నంబర్ 80 విడుదలయింది. దీనిలో అమరుల కుటుంబాల్లో అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వడం, రూ. 10 లక్షలు ధనసహాయం చేయడం, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం, ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల కుటుంబాలకు గృహసముదాయం నిర్మించడం, అలాగే ప్రతి కుటుంబానికీ మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయడం, రాజధాని హైదరాబాద్‌లో పెద్ద స్మారక స్తూపాన్ని నిర్మించడం వంటి విషయాలను ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు 576 మందికి మాత్రమే ఉద్యోగం, పది లక్షల రూపాయల ధన సహాయం లభించింది. మిగతా అమర వీరుల కుటుంబాలకు ఏ ప్రయోజనాలూ అందలేదు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సంద ర్భంగా కేసీఆర్ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చాలని కోరు తున్నాం. అలాగే అమర వీరుల కుటుంబాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనీ, ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన స్మారక నిర్మాణంలో ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి అందులో అమర వీరుల చరిత్రను ఫొటోలతో సహా నిక్షిప్తం చేయాలనీ కోరుతున్నాం. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోనూ అమర వీరుల స్తూపాలను నిర్మిస్తారని ఆశిస్తున్నాం. – నరేశ్ నాయక్ జర్పుల, తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ‘ 85005 85982 -
మోదీకి షాకిచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు..
-
ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. 187వ నిబంధన (సభా హక్కుల ఉల్లంఘన) కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి కలిసి నోటీసులో పేర్కొన్నారు. అదే విధంగా మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కాగా మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన మోదీ, కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును తొందరపడి ఆమోదించిందని వ్యాఖ్యానించారు. ఎలాంటి చర్చ జరపకుండానే ఫిబ్రవరి 2014 రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. అయితే తెలంగాణ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యతిరేకం కాదని చెబుతూనే, లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మైకులు కట్ చేశారని, తలుపులు మూసివేశారని, కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు ప్రయోగించారని ప్రధాని ప్రస్తావించారు. దీని కారణంగా రెండు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ అన్నారు. చదవండి: ‘మోదీ హేట్స్ తెలంగాణ’: రేవంత్‌రెడ్డి -
కాకినాడ తీర్మానం కాకి ఎత్తుకుపోయిందా: మంత్రి కేటీఆర్
-
చంద్రబాబు వల్లే తెలంగాణ సాధ్యమైంది : కాంగ్రెస్ నేత
కంటోన్మెంట్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చొరవతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన శనివారం టీడీపీ, టీజేఎస్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలంగా ఉందని లేఖ ఇవ్వకపోతే తెలంగాణ రాకపోయేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో పాటు దమ్ముంటే బిల్లుపెట్టాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి చేసినందునే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో అప్పటి రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా కీలకపాత్ర పోషించారని, ఆయన నేతృత్వంలో యావత్ తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా పోరాడారన్నారు. ఈ క్రమంలోనే సోనియగాంధీ హృదయం చలించి తెలంగాణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు
నాయకులు, కార్యకర్తలతో ఎంపీ విజయసాయిరెడ్డి నగర పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దిన వేడుకలు సాక్షి,విశాఖపట్నం : పార్టీ కోసం కష్టపడుతున్నవారిని అధిష్టానం గుర్తిస్తుందని, వారికే పెద్దపీట వేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. నగర పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసిన అనంతరం నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ప్రసంగించారు. 2019 ఎన్నికలు పార్టీకి ఎంతో ముఖ్యమని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కొన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా మాట్లాడతాయని, ప్రతిపక్షంలో ఉన్నా.. భవిష్యత్‌తో అధికారం చేపట్టినా వైఎస్సార్ సీపీ మాత్రం ప్రజల శ్రేయస్సుకే పాటుపడుతుందని తెలిపారు. జూలై 8న పార్టీ ప్లీనరీ జరపాలని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని, ఆలోగా జిల్లా స్థాయిలో కమిటీలు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, వాటిని సాధించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆది, సోమవారాల్లో యువజన, మహిళా విభాగాల సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఈ నెల 22న అనకాపల్లి నుంచి భీమిలి వరకూ పాదయాత్ర ప్రారంభిస్తున్నానని మరోసారి ప్రకటించారు. పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి తాను కచ్చితంగా పాల్గొంటానని సభా ముఖంగా చెప్పారు. ఈ వేడుకల్లో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రసాదరాజు, గొల్ల బాబూరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాదరెడ్డి, మొండితోక అరుణ్, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర కార్యదర్శి చల్లా మధుసూదనరెడ్డి, రాష్ట్ర గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, స్టేట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాం బాబా, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్, కోలా గురువులు, తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డి, కర్రి సీతారాం, కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్, పెట్ల ఉమాశంకర గణేష్, రాష్ట్ర సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు, రాష్ట్ర కార్శదర్శులు రొంగలి జగన్నాథం, గురుమూర్తి రెడ్డి, కంపా హనోక్, జాన్ వెస్లీ, రాష్ట్ర బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, పార్టీ నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు రవిరెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఫరూకీ, జిల్లా పార్టీ మహిళాధ్యక్షురాలు ఉషాకిరణ్, ఉత్తరాంధ్ర మహిళా విభాగం ఇన్చార్జి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి వరుదు కళ్యాణి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఫార్మేషన్ (డర్టీ) : మ్యూజిక్ వీడియో అమెరికన్ సింగర్ బేయాన్స్ విడుదల చేసిన సింగిల్ ట్రాక్.. ‘ఫార్మేషన్ (డర్టీ)’. ఇందులో లయబద్ధంగా నాట్యమాడే బేయాన్స్తో పాటు ఆమె కూతురు బ్లూ ఐవీ కార్టన్‌ను కూడా చిన్న సన్నివేశంలో చూడొచ్చు. ప్రకృతి విలయాలు, నేరగ్రస్త మానవ స్వభావాలను థీమ్‌గా తీసుకుని, ‘లేడీస్.. అందరం ఒకటిగా ఫామ్ అవుదాం’ అనే అర్థంలో బేయాన్స్ ఈ పాటను పాడి, చిత్రీకరించారు. ఇందులోని మ్యూజిక్ మన చేత ఆన్ ది స్పాట్ డాన్స్ చేయిస్తుంది. వరద నీటిలో సగం మునిగిపోయి ఉన్న పోలీసు వాహనంపై బేయాన్స్ పడుకుని ఉండడంతో వీడియో మొదలౌతుంది. ‘మై డాడీ అలబామా.. మామా లూసీయానా.. యు మిక్స్ దట్ నీగ్రో విత్ దట్ క్రెయోల్ మేక్ ఎ టాక్సస్ బామా...’ అని బేయాన్స్ పాడుతున్నప్పుడు ఆ బీట్ ‘వ్రూమ్’ అంటూ వీక్షకుల్ని తనతో పాటు ఈడ్చుకుని వెళుతుంది. తప్పక చూడండి. బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్ టీజర్ పోస్టర్లు, ట్రైలర్లు విడుదల అవుతూ ఊరిస్తున్నాయే కానీ.. ‘డాన్ ఆఫ్ ది జస్టిస్’ చిత్రం విడుదలయ్యే సమయం మాత్రం దగ్గరపడడం లేదు. ఈ ఏడాది మార్చి 25న రిలీజ్ కాబోయే ఈ అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ కోసం ప్రేక్షకులు ఇంత ఇదిగా ఎదురు చూడడానికి 2013లో వచ్చిన దీని ప్రీక్వెల్ ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ ఒక కారణం అయితే, పోస్టర్లు, టీజర్లలోని ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఇంకో కారణం. రెండు ప్రధాన క్యామిక్ క్యారెక్టర్లలో ఒకటైన బ్యాట్‌మ్యాన్ పాత్రను బెన్ ఎఫ్లెక్స్, సూపర్‌మ్యాన్ పాత్రను హెన్రీ కావెల్ పోషిస్తున్నారు. మానవాళిని విపత్తు నుండి కాపాడే ప్రయత్నంలో బ్యాట్మ్యాన్కీ, సూపర్మ్యాన్కీ మధ్య జరిగే పోరాటాలు పిల్లల్ని, పెద్దల్ని అలరిస్తాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. అద్దాలు బద్దలవడం, తుపాకులు మోతమోగడం, పిడిగుద్దుల ప్రతిధ్వనులు, వీటన్నిటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ తాజా ట్రైలర్‌లోని ప్రత్యేక ఆకర్షణలు. కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921) : ట్రైలర్ మరో బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ‘కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921)’ సినీ ప్రియుల కోసం సిద్ధం అవుతోంది. మార్చి 18న విడుదల అవుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డెరైక్షన్ షకున్ బాత్రా. నిర్మాత కరణ్ జోహార్. నవ్వులు, కన్నీళ్లు, భావోద్వేగాలతో నడిచే ఈ కథలో కుటుంబ సంబంధాల్లోని సున్నితమైన హాస్యమే ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. చిన్నప్పుడే విడిపోయి ఉంటారు. తొంభై ఏళ్ల తాతగారికి హార్ట్ ఎటాక్ అని తెలిసి తమ చిన్నప్పటి ఇంటికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి అదంతా ఓ ఫ్యామిలీ డ్రామా, కామెడీ డ్రామా. ట్రైలర్‌ను చూస్తూ కూడా మూవీని ఎంజాయ్ చెయ్యొచ్చు! -
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు
-
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు
► ఉత్తర్వులు జారీచేసిన వైద్య ఆరోగ్యశాఖ ► రాష్ట్రంలో వైద్యం చేయాలంటే కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ► ఆస్పత్రుల పర్యవేక్షణ, నకిలీ డాక్టర్ల గుర్తింపు బాధ్యతా కౌన్సిల్‌దే సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పా టైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోప్రపంచంలో ఎక్కడ వైద్య విద్య పూర్తిచేసినా తెలంగాణలో వైద్యం చేయాలంటే ఈ కౌన్సిల్ లో తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రాష్ట్రం విడిపోయినా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లోనే వైద్యులు తమ రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. తాజాగా రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు కావడంతో తెలంగాణ వైద్యులకు వెసులుబాటు కలిగింది. ఇప్పటికే తెలంగాణలో ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నవారంతా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు. మెడికల్ కౌన్సిల్‌కే ఆస్పత్రుల పర్యవేక్షణ బాధ్యత కొత్తగా ఏర్పాటైన మెడికల్ కౌన్సిల్ రాష్ట్రంలో ఆస్పత్రులపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రమాణాలకు విరుద్ధంగా ఆస్పత్రులను నడిపే వారిపై చర్యలు తీసుకునే అధికారం కౌన్సిల్‌కు ఉంటుంది. నకిలీ డాక్టర్లను గుర్తించడం కూడా కౌన్సిల్ బాధ్యతే. కౌన్సిల్లో సభ్యులుగా డాక్టర్ రాజ్ సిద్దార్థ్, డాక్టర్ వి.రాజలింగం, డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఇ.రవీంద్రరెడ్డి, డాక్టర్ జగన్మోహన్రావు, డాక్టర్ బి.రమేష్కుమార్లు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు వైద్య విద్య సంచాలకులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్లు సభ్యులుగా ఉంటారు. -
సంబురాల వేళ..
-
తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్‌దే..
వర్ధన్నపేట టౌన్ : తెలంగాణ ఏర్పాటు కోసం నిరంతరం ఉద్యమించిన వారిని పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని టీ టీడీపీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లాలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి వంటి ఎంతో మంది ఉద్యమకారులకు నేటి వరకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చి వారి వద్ద కేసీఆర్ అందినంత దండుకుని అందలెమెక్కించారన్నారు. టీఆర్ఎస్ సంవత్సర పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కుల, ప్రజ, విద్యార్థి సంఘాలకు సీఎం చేసింది ఏమీ లేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చి మెదక్‌లోని తన ఫాం హౌస్‌కు నీరు అందేలా చేసుకుని వరంగల్ జిల్లాను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని, దళితుడిని సీఎం చేస్తానని, బీసీలను అభివృద్ధి చేస్తానని... జిల్లాలో టెక్స్టైల్ పార్క్‌ను నిర్మిస్తానని హామీలు గుప్పించి.. అన్నీ మరచిపోయూరని విమర్శించారు. జిల్లా కేంద్రంలో మూడు రోజులు మకాం వేసి మురికి వాడల్లో తిరిగి దుర్వాసన వస్తుందంటూ స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు నిర్మిస్తామని మాయ మాటలు చెప్పి.. ప్రజలను బురిడీ కొట్టించి పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. నగరం చుట్టూ రింగు రోడ్డు నిర్మిస్తామని ప్రకటించి.. నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈగ మల్లేశం, నాయకులు తూల్ల కుమారస్వామి, పెంచాల కు మారస్వామి, సిలువేరు కుమారస్వామి, సమ్మిరెడ్డి, తుమ్మల యాకయ్య, చొప్పరి సోమయ్య, నాగెల్లి సురేష్, బొంత కాంతం, చిదురాల ఎల్లగౌడ్ బక్కతట్ల రాజు పాల్గొన్నారు. అరిపిరాలలో ఎర్రబెల్లి వర్సెస్ టీఆర్ఎస్ నాయకులు తొర్రూరు : వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాలలో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. తమ గ్రామానికి ఏమి చేశావని, గతంలో ఇచ్చిన హమీలు ఒక్కటి కుడా అమ లు చేయలేదని, రోడ్డు పనులకు శంకుస్థాపన చేయొద్దంటూ సర్పంచ్ బిక్షపతి, ఉప సర్పంచ్ సధాకర్, నాయకులు చెవిటి సధాకర్తోపాటు మరికొందరు ఎర్రబెల్లితో గొడవకు దిగారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీసులు స్పందించి టీడీపీ, టీఆర్ఎస్ నాయకులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అదనంగా నిధులు తీసుకరావాలే తొర్రూరు: నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూ రైన నిధులను రాకుండా అడ్డుకోవడం మానుకుని, అదనంగా నిధులు తీసుకొచ్చేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మె ల్యే, టీడీపీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికి నిధులు ఇచ్చినట్లే పాలకుర్తికి కుడా రూ. 30 కోట్ల నిధులు కేసీఆర్ మంజూరు చేస్తే అందులో రూ. 25 కోట్లు విడుదల కాకుండా అడ్డుకుంటున్నది నిజం కాదా.. అని ప్రశ్నిం చారు. నియోజకవర్గ ప్రజలపై ప్రేమే ఉంటే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు తీసుకరావాలన్నారు. గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతిని ధులు తనను ప్రశ్నించడం మానుకుని, నియోజకవర్గానికి నిధులు రాకుండా అడ్డు పడుతున్న డిప్యూటీ సీఎంను నిలదీయాలని సూచించారు. -
ఉయ్యాలా.. జంపాలా
వరంగల్ అర్బన్ : కాకతీయుల రాజధానిగా ఎన్నో చరిత్రాత్మక ప్రదేశాలకు నెలవైన ఓరుగల్లు సిగలో మరో నగ చేరనుంది. దశాబ్దాలుగా నానుతున్న భద్రకాళి గుట్ట-పద్మాక్షి గుట్ట రోప్‌వే ప్రతిపాదనలకు అధికారులు దుమ్ము దులిపారు. దీనికి సంబంధించి ఐదేళ్ల క్రితం నాటి ప్రాజెక్టు రిపోర్టులో కొద్దిపాటి మార్పులు చేసి.. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలు ముగియగానే టెండ ర్ల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇదంతా పూర్తరుు రోప్ వే నిర్మాణం జరిగితే వరంగల్ నగర వాసులే కాదు, ఇక్కడకు వచ్చే పర్యాటకులకు అద్భుతమైన అనుభూతి సొంతమవుతుందనే చెప్పాలి. రూ.20 కోట్లతో.. వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలోని గుట్టల మీద నుంచి హన్మకొండలోని పద్మాక్ష్మి గుట్ట వరకు రోప్ వే నిర్మించాలని దశాబ్దం క్రితం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) అధికారులు భావించారు. ఆ తర్వాత ఐదేళ్లకు బీఓటీ పద్ధతిపై కోల్‌కత్తాకు చెందిన దామోదర్ రోప్‌వే కంపెనీకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణరుుంచారు. సెంట్రల్ ఫైనాన్స్ అసిస్ట్ స్కీం కింద ఈ ప్రాజెక్టు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం కేంద్రప్రభుత్వం, 70 శాతం కంపెనీ భరించేలా, ‘అపిట్కో’తో డిజైన్ చేరుుంచేందుకు ఒప్పందాలు జరిగారుు. ఆ తర్వాత సాంకేతిక అడ్డంకులు, తదితర కారణాలతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. కలెక్టర్ చొరవతో.. జిల్లా కలెక్టర్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ వాకాటి కరుణ ‘పద్మాక్షి’ రోప్ వే నిర్మాణానికి తాజాగా చొరవ తీసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో ఈ రోప్ వే నిర్మాణం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చని భావించిన ఆమె ‘కుడా’ వీసీ, బల్దియూ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో చర్చించారు. గతంలో మాదిరిగా కేంద్రప్రభుత్వం, నిర్మాణ కంపెనీల పొత్తు ఉండకుండా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) పద్ధతిలో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఐదేళ్ల క్రితం నాటి ప్రాజెక్టు డిజైన్‌లో చిన్నచిన్న మార్పులు చేరుుంచేందుకు నిపుణులతో చర్చించి ఓ కొలిక్కి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితమే ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు, చేర్పులు చివరి దశకు చేరినా... తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల హడావుడి ఉండడంతో వారం తర్వాత టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. రూ.20 కోట్లు, 1.1 కిలోమీటర్లు భద్రకాళి గుట్ట-పద్మాక్షి గుట్ట రోప్‌వే కోసం సుమారు రూ.20 కోట్లు వ్యయమవుతుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ రోప్‌వేను 1.1 కిలోమీటర్ల దూరంతో నిర్మించనుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతి పెద్ద రోప్‌వేగా నిలవనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, విశాఖపట్నంలో రోప్ వే ఉండగా వీటి దూరం 0.3 నుంచి 0.5 కిలోమీటర్లు మాత్రమే! ఈ మేరకు వరంగల్‌లో 1.1 కిలోమీటర్ల నిడివితో దీన్ని నిర్మించనుండడం విశేషం. అటు హృదయ్.. ఇటు రోప్‌వే.. కేంద్రప్రభుత్వం హృదయ్ పథకం కింద వరంగల్‌ను ఎంపిక చేసి తొలి ఏడాది రూ.41.50 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఇందులో ఇప్పటికే రూ.5 కోట్లు విడుదల కాగా, ఈ నిధులతో భద్రకాళి బండ్‌ను అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. భద్రకాళి బండ్ పటిష్టత, ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యూరుు కూడా! అలాగే, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పూడిక తీసి కట్టను అభివృద్ధి చేసే ప్రారంభమయ్యూరుు. ఆ తర్వాత కట్ట, ఆ పక్కనే పార్క్‌లో రంగురంగుల విద్యుత్ దీపాలు, పిల్లల ఆట వస్తువులు, ఇతర రిక్రియేషన్ పనులు చేపడుతారు. ఇక రోప్ వే కూడా పూర్తరుుతే వరంగల్‌లోని భద్రకాళి ఆలయూనికి వచ్చే భక్తులు, పర్యాటకులు... నగరాన్ని విహంగ వీక్షణం చేస్తూ పద్మాక్ష్మి గుట్టపైకి చేరుకోవచ్చు. తద్వారా ప్రజలకు సరికొత్త అనుభూతి సొంతం కానుందనే చెప్పాలి!! -
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
క్రమబద్ధీకరణకు సర్కారు పచ్చజెండా అయిదేళ్ల సర్వీసు ఉంటేనే అర్హులు విధివిధానాలు ఖరారు చేసిన కమిటీ సీఎంకు నివేదిక సమర్పించిన సీఎస్ హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా ఈ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందుతారని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు అవసరమయ్యే విధివిధానాలను అధ్యయనం చేసేందుకు గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఏడు విభాగాల ముఖ్య కార్యదర్శుల కమిటీ సుదీర్ఘంగా కసరత్తు చేసింది. గత నెలలోనే ఈ కమిటీ తమ నివేదికను సిద్ధం చేసింది. మార్గదర్శకాలన్నింటినీ అందులో పొందుపరిచింది. ఈ కమిటీ నివేదికతో పాటు ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. సీఎం ఆమోదించిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువడతాయని ఆర్థిక శాఖ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కమిటీ సిఫారసు చేసిన నిబంధనల ప్రకారం... రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను ముందుగా రెగ్యులరైజ్ చేస్తారు. రెండో విడతలో అయిదేళ్లు నిండని అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. అయిదేళ్ల పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగానే గుర్తించి.. తర్వాతే రెగ్యులర్ అయ్యే అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ఈ క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించదు. అంటే... నెలనెలా ప్రభుత్వం ఫుల్ టైమ్ స్కేల్ అందుకుంటున్న వారినే ఇందుకు అర్హులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులకు సరిపడే విద్యార్హత, వయసు నిబంధనలున్న అభ్యర్థులకే అవకాశమిస్తారు. ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్య మేరకే ఈ నియామకాలుంటాయి. రిజర్వేషన్లు, రోస్టరు పద్ధతిని సైతం అనుసరిస్తారు. పార్ట్ టైం, డైలీ వేజ్ కార్మికులు సైతం ఈ క్రమబద్ధీకరణ పరిధిలోకి రారు. క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే ప్రభుత్వ సర్వీసు మొదలవుతుందని.. గతంలో పని చేసిన సర్వీసు లెక్కలోకి రాదని కమిటీ నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆర్టీసీ సమ్మె ముగిసిన వెంటనే అందులో పని చేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించారు. దీంతో మిగతా విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు సైతం తమకెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ జెండా.. ప్రజలకు అండ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు రాధాకృష్ణ, గౌతంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో.. కృష్ణలంక : ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారికి అండగా నేనున్నానంటూ పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. 24వ డివిజన్ మలేరియా ఆస్పత్రి సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 3, 4, 14, 15, 16, 17, 18, 22, 24 డివిజన్ల కార్పొరేటర్ల మధ్య ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు. ముందుగా దివంగత మహానేత రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం నియంత ధోరణితో వ్యవహరించటం, ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజలను సమస్యలకు గురిచేయడంతో.. ప్రజలకు అండగా నిలిచేందుకు తమ పార్టీ పుట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా ప్రజలను బాధిస్తోందన్నారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే తెలుగుదేశం పార్టీకీ పడుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చందన సురేష్, సుంకర కిషోర్, తంగిరాల రామిరెడ్డి, తాటిపర్తి కొండారెడ్డి, పులి రమణారెడ్డి, ఆరేళ్ల రాంబాబు, తెంటు రాజేష్, ప్రభుకుమార్, రంగారావు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో.. సత్యనారాయణపురం : వైఎస్సార్ సీపీ జెండా ప్రజలకు అనునిత్యం అండగా ఉంటుందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి అన్నారు. సత్యనారాయణపురం భగత్‌సింగ్ రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండాగా పోరాటాలు చేసేందుకు జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్మిక సోదరులకు 37 రకాల హామీలు ఇచ్చి వాటి ఊసెత్తడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పొరేటర్ ఎం.డి.కరిమున్నీసా, పార్టీ అధికార ప్రతినిధి యాదల శ్రీనివాసరావు, సిటీ సేవాదళ్ కన్వీనర్ కమ్మిలి రత్నకుమార్, నగర, జిల్లా ట్రేడ్‌యూనియన్ అధ్యక్షులు విశ్వనాథ రవి, మాదు శివరామకృష్ణ, ఎస్సీ నాయకులు కాలే పుల్లారావు, డివిజన్ అధ్యక్షులు టెక్యెం కృష్ణారావు, బోను రాజేష్, ఇసరపు రాజు, ఎం.డి.రుహుల్లా, సేతురామ్, బల్లం కిషోర్, ముద్దరబోయిన దుర్గారావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు నారుమంచి నారాయణ, సాంబశివారెడ్డి, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి డీవీబీ సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ ఆటో వర్కర్స్ యూనియన్నగర కార్యదర్శి ఏడుకొండలు పాల్గొన్నారు. -
సోనియా కృషితోనే తెలంగాణ రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: అమరవీరుల త్యాగం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చూపిన చొరవ, చేసిన కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ఏడాది గడిచిన సందర్భంగా శుక్రవారం (ఫిబ్రవరి 20న) గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫాసిస్టు పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, మీడియాను నియంత్రించాలని చూస్తున్నారని విమర్శించారు. జానారెడ్డి మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ గెలుపు ద్వారానే సోనియాకి నిజమైన కృతజ్ఞతలు తెలిపినట్లు అవుతుందన్నారు. డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన తప్పిదాల వల్లే కాంగ్రెస్ ఓడిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, డి.నాగేందర్, సబిత, డి.కె.అరుణ, డి.శ్రీధర్‌బాబు, టి.రా మ్మోహన్‌రెడ్డి, పొన్నంప్రభాకర్, మధుయాష్కీ, సురేష్‌శెట్కర్, ఎస్.రాజయ్య, అంజన్‌కుమార్‌యాదవ్, మల్లురవి తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహాల ఏర్పాటుపై మీ వైఖరి ఏమిటి..?
ఇరు ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజోపయోగ స్థలాలు, రోడ్లపై విగ్రహాల ఏర్పాటు విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన హైకోర్టు, వారిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలో ముక్తినూతలపాడు గ్రామం నుంచి గుడిమిల్లపాడు గ్రామానికి వెళ్లే రోడ్డును ఆక్రమించుకుని, ఓ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎస్.మురళీకృష్ణ 2008లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, దీనిని సోమవారం మరోసారి విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం, విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. -
పెట్రోలు బంకుల మోసాలు...గప్ ‘చిప్’
మళ్లీ ‘చిప్’ బాగోతం బట్టబయలు అటు కొలతలో తరుగు.. ఇటు నాణ్యతలో దగా ఎడాపెడా వినియోగదారులకు టోకరా బంకుల యాజమాన్యాల ఇం‘ధన’ దోపిడీ ఫిర్యాదులొస్తేనే తూ.కొ. శాఖ చర్యలు సాక్షి, సిటీ బ్యూరో: పెట్రోలు బంకుల మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అటు కొలతలో.. ఇటు నాణ్యతలో వినియోగదారులు దగా పడుతూనే ఉన్నారు. పంపింగ్‌లో, మీటర్ రీడింగ్‌లో చేతివాటం చూపడం దగ్గర్నుంచి ఏకంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వరకు మోసాల స్థాయి పెరిగి.. యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఫలితంగా ఇం‘ధన’ రూపేణా గ్రేటర్‌లోని పెట్రోల్, డీజిల్ వినియోగదారుల జేబుకు నిత్యం లక్షల్లో చిల్లుపడుతోంది. బుధవారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ఉప్పల్‌లోని జయలీల ఫిల్లింగ్ స్టేషన్ మోసాల తంతు బట్టబయలైన తీరు మరోసారి వినియోగదారులు ఉలిక్కిపడేలా చేసింది. బంకుల నిర్వాహకులు తమపై సరైన నిఘా, పర్యవేక్షణ లేకపోవడాన్ని సాకుగా తీసుకుని సాఫ్ట్వేర్ చిప్‌లతో మీటర్ రీడింగ్‌లో జంపింగ్‌కు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాల్సిన తూనికల, కొలతల శాఖ అధికారులు.. వినియోగదారుల నుంచి ఫిర్యాదులందితే కానీ కాలు కదపట్లేదు. పోలీసు టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం ఆరు నెలల క్రితం పెట్రోలు బంకుల సాఫ్ట్వేర్ చిప్ మోసాలను బయటపెట్టినా.. తూనికలు కొలతల శాఖ నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టింది. అప్పట్లోనే గట్టి చర్యలు తీసుకుని ఉంటే బుధవారం మరో మోసం బయటపడేది కాదు. బుధవారం నాటి ఘటనలో, ఉప్పల్ జయలీల బంకులో ప్రతి లీటర్‌కు 2.30 ఎంఎల్ మేర కొలతలో తరుగు ఉన్నట్టు తేలింది. అంటే ఈ లెక్కన గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న బంకుల్లో ఏ మేరకు వినియోగదారులు నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. జరిమానాలతో సరి.. బెదరని డీలర్లు పెట్రోలు బంకుల మోసాలపై నమోదవుతున్న కేసులు కేవలం జరిమానాలకే పరిమితవుతున్నాయి. దీంతో బంకుల డీలర్లు బెరుకు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల క్రితం కొన్ని ఫిల్లింగ్ యంత్రాల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక చిప్‌లను రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ, మరికొన్నింటిలో సాక్షాత్తూ ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన రిమోట్‌లోనే మార్పుచేర్పుల ద్వారా ఇంధనం పంపింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు వెలుగుచూసిన ఘటన వినియోగదారులను నివ్వెరపరిచింది. అప్పట్లో ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన ఫిల్లింగ్ మిషన్ మోడల్‌ను తప్పుపట్టి హడావుడి చేసిన అధికారులు ఆపై నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. బంకుల మోసాలపై భారత తూనికలు కొలతల చట్టం-2009 సెక్షన్ 22 కింద కేసులు నమోదు చేసి జరిమానాలతో సరిపెట్టారు. దీంతో బంకు యాజమాన్యాలకు భయం లేకుండాపోయింది. తాజాగా బుధవారం వెలుగుచూసిన ఘటనతో వినియోగదారులు కంగుతిన్నారు. మోసాలు ఇలా... పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలే ఫిల్లింగ్ యంత్రాలను సరఫరా చేస్తాయి. కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఫిల్లింగ్ యంత్రంలో మార్పుచేర్పులతో పాటు రిమోట్ ద్వారా ఆపరేట్‌కు వెసులుబాటు కల్పించాయి దీన్ని ఆసరా చేసుకున్న యాజమాన్యాలు పెట్రోలు, డీజిల్ పంపింగ్ రీడింగ్‌లో జంపింగ్‌లకు పాల్పడుతూ వినియోగదారులకు తూకంలో టోకరా వేస్తున్నాయి కొన్ని కంపెనీల్లో ఫిల్లింగ్ యంత్రాలకు రిమోట్ వెసులుబాటు లేకున్నా.. పంపింగ్ యంత్రాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమర్చి కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు సాధారణంగా ప్రతి ఫిల్లింగ్ యంత్రానికి తూనికలు కొలతల శాఖ సీల్ వేసి ఉంటుంది. బంకుల యాజమాన్యాలు దీన్ని బ్రేక్ చేసి సైతం మోసాల సాఫ్ట్వేర్ చిప్‌లను అమర్చుతున్నారు పెట్రోల్ బంకుల్లోని ఫిల్లింగ్ యంత్రంపై చూస్తే రీడింగ్సవ్యంగానే కనిపిస్తుంది. కానీ, ప్రత్యేక సాఫ్ట్వేర్ చిప్‌లను అమర్చిన కారణంగా ప్రతి వెయ్యి లీటర్లలో 40 లీటర్ల మేర ఇంధనం బంకుల నిర్వాహకులకు ‘ఆదా’ అవుతోంది ఒక్కో బంకులో నిత్యం పది వేల లీటర్ల ఇంధనాన్ని విక్రయిస్తారనుకుంటే, 400 లీటర్ల మేర యాజమాన్యానికి ‘మిగులు’బాటవుతోంది. ఫలితంగా వినియోగదారులు ఎడాపెడా నష్టపోతున్నారు. -
ఆవిర్భావ సందడి
కార్యాలయాల్లో పండగ వాతావరణం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో తెలంగాణ రాష్ర్ట అవతరణ సంబురాలు అంబరాన్నంటాయి. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా అవతరణ వేడుకలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండిఏ, కలెక్టరేట్, ఆర్టీసీ, రవాణా, పౌరసరఫరాలు, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రభుత్వ ఆసుపత్రులు, సీపీడీసీఎల్, విద్యా, రెవెన్యూ, సంక్షేమం తదితర అన్ని కార్యాలయాల్లోనూ అధికారులు, ఉద్యోగులు ఘనంగా కొత్త రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఎగుర వేశారు. ప్రతిరోజు ఫైళ్లు, ప్రభుత్వ పనులు, పౌరసేవలతో రద్దీగా ఉండే కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు, ఉద్యోగులంతా ఒక్కచోట చేరి నూతన రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ కేక్‌లు కట్ చేశారు. ఉద్యోగులు మిఠాయీలు పంచుకొని పరస్పర ఆలింగనాలతో శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. సంతోషంగా రంగులు చల్లుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని ఉద్యోగులు ప్రతిన బూనారు. కార్యాలయాలను అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాలు వెలుగులు విరజిమ్మాయి. తెలంగాణ సంస్కృతిని చాటుతూ మహిళా ఉద్యోగులు బతుకమ్మలు ఆడారు. బోనమెత్తుకున్నారు. మరోవైపు నగరంలోని ప్రధాన కూడళ్లలోనూ రాష్ర్ట అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే మొదలైన వేడుకలు సోమవారం కూడా కొనసాగాయి. టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ వర్ణశోభితమయ్యాయి. వేడుకల్లో అమరుల త్యాగాలను కొనియాడుతూ పాడిన పాటలు, తెలంగాణ ధూంధాంలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్ని చోట్ల ఆటాపాటలతో ప్రజలు కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగువిశ్వవిద్యాలయం సహా పలు విద్యాకేంద్రాల్లోనూ విద్యార్ధులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో... దోమలగూడ: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్బావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర క మిషనర్ డాక్టర్ అశోక్ కేకును కట్ చేసి, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం బోర్డును ఆవిష్కరించారు. సోమవారం ఉదయం కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ లేబర్ కమిషనర్ సూర్యప్రసాదు, మురళీసాగర్, జాయింట్ లేబర్ కమిషనర్ డాక్టర్ గంగాధర్, డిప్యూటీ లేబర్ కమిషనర్లు నరేష్కుమార్, శ్రీనివాసు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు చక్రధర్, శ్యాంసుందర్‌రెడ్డి, కార్మిక శాఖ టీజీఓ అధ్యక్షులు రాజేందర్, ప్రధానకార్యదర్శి పండరీనాథ్, టీఎన్జీవో అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి రాత్రి నుంచే పండుగ
తెలంగాణ రాష్ర్ట అవతరణ వేడుకలను ఏర్పాట్లు పూర్తి జిల్లా కేంద్రంలో అర్థరాత్రి 12 గంటలకు కీర్తి స్థూపం ఆవిష్కరణ ఉత్సవాలకు రాజకీయ పక్షాలు, సకల జనుల సన్నద్ధం తెలంగాణవాదుల్లో ఉత్తేజం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఓరుగల్లు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం అర్ధరాత్రి నూతన రాష్ట్రానికి స్వాగతం పలికేలా కలెక్టర్ బంగ్లా ఎదుట అమరవీరుల కీర్తి స్థూపం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఓ వైపు వేడుకల బాధ్యతలు భుజాలపై మోస్తున్న ఓరుగల్లు సేవాసమితి.. మరో వైపు అధికారిక కార్యక్రమాల నిర్వహణకు మేము సైతం అంటూ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ప్రతి తెలంగాణ బిడ్డా ఎదురుచూస్తున్న వేళ... ఉత్సవాలను పండుగలా జరుపుకునేలా... ప్రతిఒక్కరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వేడుకలకు రూపకల్పన చేసింది. వరంగల్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: అరవై ఏళ్ల కల.. అమరుల ఆశయం.. ప్రజాకాంక్ష అరుున తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావం సాక్షాత్కరించనున్న వేళ సంబరాలు జరుపుకునేందుకు సకల జనులు సన్నద్ధమవుతున్నారు. కోటి కలలతో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, నూతన నాయకత్వంలో ముందడుగు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆది వారం రాత్రి 7 గంటల నుంచి అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఓరుగల్లు సేవా సమితి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధరాత్రి 12.01 గంటలకు కలెక్టర్ బంగ్లా ఎదుట తెలంగాణ కీర్తి స్థూపాన్ని ఆవి ష్కరించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. సమితి అధ్యక్షుడు, కలెక్టర్ జి.కిషన్, ఉద్యోగ జేఏసీ నాయకులతోపాటు అన్ని పక్షాలు పాల్గొననున్నారుు. ఈ కార్యక్రమానికి ముందు హన్మకొండలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులర్పించనున్నారు. పండుగను తలపించేలా కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సేవా సమితి తరఫున రెండు రోజులు, అధికారికంగా వారంపాటు ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్ రూపకల్పన చేశారు. ఈ మేరకు ఎవరి పనులు వారికి అప్పగించారు. సకల జనులు సన్నద్ధం ఆదివారం అర్ధరాత్రి అమరవీరులకు నివాళులర్పించి, తెలంగాణ జెండాను ఆవిష్కరించాలని టీజేఏసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకు ఎక్కడికక్కడ కొవ్వొత్తుల ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలతో ఇంటింటి సంబురం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. రెండో తేదీన టీజేఏసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. జాతీయ జెండాతోపాటు తమతమ పార్టీల జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారుు. నగరం కాంతిమయం ఉత్సవాశోభ ఉట్టిపడేలా నగరంలోని ప్రధాన భవనాలు కలెక్టరేట్, కలెక్టర్ నివాసం, టౌన్‌హాల్, న్యాయస్థానం, ఆర్అండ్బీ భవనంతోపాటు ఇతర భవనాలకు శనివారం సాయంత్రంనుంచి విద్యుత్ దీపాలు అలంకరించారు. ‘కుడా’ అధ్వర్యంలో పార్కులు క్లీన్ చేయించడం, రంగురంగుల పతాకాల ఏర్పాట్లు, రోడ్డు మధ్యలో డివైడర్లకు రంగులు వేయడం వంటి పనులు పూర్తిచేశారు. టీజేఏసీ భాగస్వామ్యం తెలంగాణ ఉత్సవాల్లో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసే ప్రణాళికతో టీజేఏసీ పనిచేస్తోంది. ఉద్యోగులు, కార్మికులు, స్వచ్ఛంద, మహిళా, విద్యార్థి, మేధావి సంఘాలతోపాటు న్యాయవాదులు, డాక్టర్లు ఇతర వర్గాల జేఏసీలన్నీ ఆవిర్భావ ఉత్సవాల్లో నూ తనోత్తేజంతో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ దిశ గా అన్ని సంఘాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. టీ జేఏ సీ పిలుపుమేరకు సోమవారం ఉద్యోగులు తమ తమ కార్యాలయాల్లో అమరవీరులకు నివాళులర్పిం చిన తర్వాతనే విధుల్లో పాల్గొననున్నారు. జిల్లాలో న్యూడెమోక్రసీ ఇతర పక్షాలు తెలంగాణ ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నాయి. గులాబీల్లో అధికార ఉత్తేజం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పార్టీ శ్రేణులను పాల్గొనేలా శ్రద్ధ వహించాలని టీఆర్ఎస్ పార్టీ నేతలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి పిలుపునిచ్చారు. ఆదివారం అర్ధరాత్రి జరిగే ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సోమవారం ఆవిర్భావ దినోత్సవంతోపాటు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తమ నేత కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తున్నందున ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గెలిచిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులకే బాధ్యత అప్పగించారు. ఇప్పటికే అధికారపార్టీగా మారడంతో ఆ పార్టీ దర్పం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. తాజాగా శనివారం తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, కాళోజీ, అమరవీరుల స్థూపాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టారు. కాంగ్రెస్ సైతం... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలోనే కాంగ్రెస్ జిల్లా స్థాయి పార్టీ అనుబంధ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నగర విస్తృతస్థారుు సమావేశం నిర్వహించింది. ప్రతి ఇంటా, ప్రతి గ్రామంలో ఉత్సవాల ను నిర్వహించాలని పిలుపునిచ్చింది. హన్మకొండ చౌరస్తా నుంచి అమరవీరుల స్థూపం మీదుగా కీర్తిస్థూపం వరకు ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఎంజీఎం సెంటర్ లో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేసి... అక్కడి నుంచి ఖిలావరంగల్ తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కాగడాల ప్రదర్శ న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సోనియా వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పరిస్థితిని మరోసారి జనంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నా రు. ఎన్నికల ఓటమి నుంచి బయటపడి ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇదే సరైన సమయం గా భావిస్తోంది. ఇతర రాజకీయ పక్షాలైన బీజేపీ, టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆవిర్భావ ఉత్సవాలపట్ల అంతగా స్పందన కనిపించడంలేదు. కలెక్టర్ బంగ్లా ఎదుట కీర్తి స్థూపం సుబేదారి : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా ఎదుట తెలంగాణ అమరవీరుల కీర్తి స్థూపం సగర్వంగా నిల బడింది. స్థూపాన్ని చెక్కిన శిల్పులతో పాటు మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో రాత్రి 11.27 గంటలకు ఈ స్థూపాన్ని ప్రతిష్టించారు. తొలుత కలెక్టర్ జి.కిషన్ పూజలు చేసి ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాత్రి ఏడు గంట లకు ఈ పనులు ప్రారంభం కాగా... శిల్పులు, సిబ్బంది అత్యంత జాగ్రత్తగా చెమటోడ్చి స్థూపాన్ని వేదికపై నిలబెట్టారు. ఇదిలాఉండగా... స్థూపాన్ని నిలబెడుతున్నారని తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, నగర వాసులు వేల సంఖ్యలో తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాలు కిక్కిరిసి పోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను వడ్డేపల్లి రోడ్డు మీదుగా మళ్లించారు. ఈ సందర్భంగా పలువురు స్థూపం ప్రతిష్ఠా పన పనులను కెమెరాలు, సెల్ఫోన్లలో బంధించారు. నేటి కార్యక్రమాలు రాత్రి 7 గం : కాళోజీ సెంటర్ నుంచి నిట్ వరకు కళాకారులు, వివిధ సంఘాల ర్యాలీ 8 నుంచి 11.30 : కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాలు (కాళోజీ సెంటర్, అదాలత్, ఆర్ట్స్ కాలేజీ, కలెక్టరేట్, నిట్, పెట్రోల్ పంప్ సెంటర్ల వద్ద) 11.30 నుంచి 11.50 : కాళోజీ సెంటర్, నిట్ నుంచి తెలంగాణ అమరవీరుల కీర్తి స్థూపం వరకు పోలీస్ బ్యాండ్ తో రెండు బృందాలతో కొవ్వొత్తుల ర్యాలీ రాత్రి 11.59 : తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి అర్ధరాత్రి 12..01 : కీర్తి స్థూపం ఆవిష్కరణ, ప్రతిజ్ఞ -
ఆవిర్భావ సంబురాల్లో బీజేపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కమలనాథులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఆవిర్భావ సంబరాలు జరపాలని నేతలను పార్టీ ఆదేశించింది. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలపడమే కాకుండా, బిల్లు ఆమోదం తెలిపే వేళ బీజేపీ పూర్తి సహకారాన్ని అందించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తెచ్చిన పార్టీల్లో ఒకటిగా తమకు ప్రజల్లో ఆదరణ ఉంటుందని పార్టీ పెద్దలు భావించారు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఫలితం రావడంతో కంగుతినాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజల్లో ఆదరణ పెంచుకునే దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి అడుగు వేస్తూ తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను వేదికగా మలచుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ అపాయింటెడ్ డే అయిన జూన్ 2వ తేదీ కంటే ముందు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పార్టీ రాష్ర్ట కార్యాలయంలో బాణ సంచా పేల్చి వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలు నాంపల్లి గన్‌పార్కుకు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. అదే సమయంలో జిల్లా ప్రధాన కేంద్రాల్లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు, జిల్లా, మండల కేంద్రాల్లోని పార్టీ కార్యాలయ భవనాలపై జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తారు.బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవహారాల బాధ్యతను తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా హాజరవుతారు. -
పోరుగడ్డ మధిర
మధిర, న్యూస్‌లైన్: పోరాటాల పురిటిగడ్డ మధిర అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. నాటి నుంచి 2009 ఎన్నికల వరకు మధిర నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ ఒకసారి, కాంగ్రెస్ ఏడు సార్లు, సీపీఎం ఐదు సార్లు, టీడీపీ ఒకసారి గెలుపొందాయి. 1952లో తొలిసారి నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 55,400 ఓట్లు ఉండేవి. 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మకంటి సత్యన్నారాయణరావు, తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ పార్టీకి చెందిన ఎస్పీ రావుపై 2,587 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1962 నాటికి నియోజకవర్గ ఓట్లు 61,466కు చేరాయి. ఆ ఎన్నికల్లో 49,792 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దుగ్గినేని వెంకయ్య స్వతంత్ర అభ్యర్థి ఆర్. శంకరయ్యపై 5,456 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967 నాటికి 76,526 ఓట్లు ఉండగా 61,736 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దుగ్గినేని వెంకయ్య, సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై 10,404 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, సీపీఎం మధ్యనే సాగుతుండేది. ఈ సారి కూడా అదేపునరావృతం కావచ్చని విశ్లేషకుల అంచనా. నియోజకవర్గం నుంచి శీలం సిద్దారెడ్డి, బోడేపూడి వెంకటేశ్వరరావు వంటి నేతలు ఘనతికెక్కారు. శీలం సిద్దారెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండగా, బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం శాసనసభ పక్ష నేతగా పలుమార్లు పనిచేశారు. నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థుల వివరాలు... 1972లో దుగ్గినేని వెంకట్రావమ్మ సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. 1978లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి బండారు ప్రసాదరావు జనతాపార్టీకి చెందిన మద్దినేని నర్సింహారావుపై గెలిచారు. 1983లో కాంగ్రెస్‌పార్టీకి చెందిన శీలం సిద్దారెడ్డి సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. 1985లో సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి శీలం సిద్దారెడ్డిపై గెలుపొందారు. 1989లో బోడేపూడి వెంకటేశ్వరరావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శీలం సిద్దారెడ్డిపై విజయం సాధించారు. 1994లో బోడేపూడి వెంకటేశ్వరరావు శీలం సిద్దారెడ్డిపై గెలుపొందారు. శాసన సభ్యునిగా కొనసాగుతూ బోడేపూడి అకాలమృతి చెందారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్య తన సమీప అభ్యర్థి శీలం సిద్దారెడ్డిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ తొలిసారిగా మధిర నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిని బరిలో నిలిపింది. 1999 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్యపై టీడీపీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అప్పట్లో ఎమ్మార్పీఎస్ కూడా పోటీలో ఉంది. 2004 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్య టీడీపీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావుపై 21,443 ఓట్లతో విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మాతో కట్టా వెంకటనర్సయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ కూడా పోటీచేశారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గంలో 1,83,475 ఓట్లు ఉండగా 1,60,002 ఓట్లు పోలయ్యాయి. మధిర నియోజకవర్గ ఎన్నికల చరిత్రలోనే 86.93 శాతం పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధిక ఓట్ల నమోదులో రాష్ట్రంలో రెండోస్థానంలో నియోజకవర్గం నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లోనూ రాజశేఖరరెడ్డి చరిష్మా బాగా పనిచేసింది. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయానికి దోహదపడింది. తన సమీప సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై భట్టి 1417ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న జరగబోయే మధిర అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక రసవత్తరం గా మారనుంది. గత ఎన్నికల్లో విడిగా పోటీచేసి దాదాపు 15వేల ఓట్లు సాధించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. నూతనంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. వైఎస్ఆర్సీపీ, సీపీఎం పొత్తుతో మరోసారి సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నా రు. కాంగ్రెస్, సీపీఐతో జట్టుకట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క మరో పరీక్షకు సిద్ధమయ్యారు. తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థి బొమ్మెర రామ్మూర్తి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పోటీలో ఉన్నారు. గతంలోని రాజకీయ సమీకరణాలకు, నేటి సమీకరణాలకు పూర్తి తేడా కనిపిస్తోంది. దాదాపు పోటీ సీపీఎం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమి మధ్యే ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2008-09 పునర్విభజనకు ముందు మధిర నియోజకవర్గంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్, వైరా, తల్లాడ మండలాలు ఉండేవి. పునర్విభజన తర్వాత మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌కు తోడు చింతకాని, ముదిగొండ మండలాలు వచ్చి చేరాయి. వైరా ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడగా, తల్లాడ సత్తుపల్లి నియోజకవర్గంలో కలిసిపోయింది. -
కేడర్‌ను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ తంటాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేడర్‌ను కాపాడుకోవడానికి నేతలు పొత్తుల ఎత్తుగడ వేస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన లాబీయింగ్‌తో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ‘దేశం’ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్ పార్టీని వీడగా, పలు నియోజకవర్గాల ఇన్చార్జీలు కూడా త్వరలోనే గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని వీడుతున్న ఈ నేతలతో కలిసి కేడర్ కూడా వెళ్లకుండా నిలుపుకునేందుకు టీడీపీ నేతలు పొత్తును ఎత్తుగడగా వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర పడటంలో బీజేపీ తనదైన పాత్రను పోషించింది. ఈ క్రెడిట్ ఉన్న బీజేపీతో పొత్తు ఉంటుందని చెబితే కొందరైనా నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవచ్చనే ఉద్దేశంతోనే ‘దేశం’ నేతలు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే అభిప్రాయం నెలకొంది. బీజేపీ నాయకులు మాత్రం పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలసలను నివారించడానికి.. కార్యకర్తలను మభ్యపెట్టేందుకు టీడీపీ నేతలు పొత్తు అంశాన్ని వాడుకుంటున్నారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. దమ్ముంటే చంద్రబాబుతో పొత్తు విషయమై ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆగని వలసలు.. తెలుగుదేశం పార్టీని వీడిన నగేష్ వెంట కేడర్ వెళ్లకుండా కాపాడుకునేందుకు ఆ పార్టీ నేతలు తంటాలు పడుతున్నారు. సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించి కార్యకర్తలకు సర్దిచెబుతున్నారు. సోమవారం బోథ్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఇచ్చోడలో నిర్వహించారు. బీజేపీతో పొత్తు తప్పకుండా ఉంటుందని, కార్యకర్తలు అధైర్య పడవద్దని ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. కానీ ఈ సమావేశానికి ఒక్క ఇచ్చోడ మండల పార్టీ అధ్యక్షుడు మినహా మిగిలిన ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు హజరుకాలేదు. కాగా పార్టీని వీడిన నగేష్ కూడా గురువారం ఇచ్చోడలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాథోడ్ రమేష్ నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతల్లో సగం మందికి పైగా గురువారం నగేష్ నిర్వహించిన సమావేశానికి హాజరుకావడం గమనార్హం.