telescope
-
ప్రపంచంలోనే పే....ద్ద కెమెరా!
ఏకంగా 3,200 మెగాపిక్సెల్స్. సామర్థ్యం. 5.5 అడుగుల ఎత్తు, ఏకంగా 12.25 అడుగల పొడవుతో పెద్ద సైజు కారును తలపించే పరిమాణం. దాదాపు 2,800 కిలోల బరువు! 320–1,050 ఎన్ఎం వేవ్‌లెంగ్త్ రేంజ్. ఒక్కో ఇమేజ్ కవరేజీ పరిధిలోకి కనీసం 40 పూర్ణ చంద్రులు పట్టేంత ఏరియా! ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా తాలూకు విశేషాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంతకీ ఇది ఎక్కడుందంటారా? చిలీలో రూపుదిద్దుకుంటున్న వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేస్తున్న సరికొత్త టెలిస్కోప్‌లో. రాజధాని శాంటియాగోకు 500 కి.మీ. దూరంలోని సెరో పాచ్న్ పర్వత శిఖరంపై 2015 నుంచీ నిర్మాణంలో ఉన్న ఈ అబ్జర్వేటరీ త్వరలో ప్రారంభం కానుంది. అందులోని ఈ అతి పెద్ద కెమెరా ప్రతి మూడు రోజులకోసారి రాత్రివేళ దాని కంటికి కని్పంచినంత మేరకూ ఆకాశాన్ని ఫొటోల్లో బంధించనుంది. అలా అంతరిక్ష శాస్త్రవేత్తలకు పదేళ్లపాటు రోజుకు కనీసం వెయ్యి చొప్పున ఫొటోలను అందుబాటులోకి తెస్తుంది! అంటే రోజుకు 20 టెరాబైట్ల డేటాను అందజేస్తుంది. ఇది ఒక యూజర్ నెట్‌ఫ్లిక్స్‌లో సగటున మూడేళ్లపాటు చూసే ప్రోగ్సామ్స్, లేదా స్పాటిఫైలో ఏకంగా 50 ఏళ్ల పాటు వినే పాటల డేటాకు సమానం! ఈ క్రమంలో మనకిప్పటిదాకా తెలియని ఏకంగా 1,700 కోట్ల కొత్త నక్షత్రాలను, 2,000 కోట్ల నక్షత్ర మండలాలను ఈ కెమెరా వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు. దీన్ని లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్ఎస్ఎస్టీ) కెమెరాగా పిలుస్తున్నారు. అంతేగాక అంతరిక్షంలో సంభవించే చిన్నా పెద్దా మార్పులకు సంబంధించి ప్రతి రాత్రీ ఏకంగా కోటి అలెర్టులను కూడా ఈ టెలిస్కోప్ పంపనుందట కూడా! ‘‘ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. వెరా రూబిన్ అబ్జర్వేటరీ మున్ముందు మరెన్నో ఘనకార్యాలు చేయనుంది’’ అని ఆ సంస్థ ఆస్ట్రానమిస్టు క్లేర్ హిగ్స్ చెబుతున్నారు. కృష్ణపదార్థం (డార్క్ మ్యా టర్), కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) వంటి పలు మిస్టరీలను ఛేదించడంలో కూడా కీలకపాత్ర పోషించే చాన్సుందన్నారు. ఈ టెలిస్కోప్‌కు 2016లో మరణించిన అమెరికా అంతరిక్ష శాస్త్రజు్ఞడు వెరా రూబిన్ పేరు పెట్టారు. ఇది ఏడాది లోపులో అందుబాటులోకి వస్తుందని అంచనా.– సాక్షి, నేషనల్ డెస్క్ -
SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమయ్యాయి. ఇలా చేశారు... గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది... ► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్‌ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు. ► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది! ► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది. ► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్‌లో ఉన్నాయి. ► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి... గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు. ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది. ఏమిటీ గ్రహశకలాలు... ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట. గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ పేలుడు కథ ఏమిటి?
‘‘సైన్స్... పది కొత్త సమస్యలను సృష్టించిగానీ.. ఒకదానికి పరిష్కారం కనుక్కోదు’’ ప్రఖ్యాత ఇంగ్లీష్ కవి జార్జ్ బెర్నాడ్ షా మాటలివి. సైన్స్ ముందుకు పురోగమిస్తున్న కొద్దీ కొత్త కొత్త సవాళ్లు, సంక్లిష్టమైన సమస్యలు ఎదురవుతూంటాయని చెప్పడం ఆయన ఉద్దేశం. జ్ఞానాన్ని పెంచుకోవడం నిత్యం జరుగుతూనే ఉంటుందని, ఒక సమస్యకు దొరికే పరిష్కారం మరిన్ని కొత్త ప్రశ్నలు, సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని కూడా బెర్నార్డ్ షా అనుకుని ఉంటాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. విశాల విశ్వంలో ఓ మూలన ఓ పే...ద్ధ పేలుడు సంభవించిందట. సుదూర గ్రహాలు, పాలపుంతలు, నక్షత్రాలపై కన్నేసేందుకు అమెరికాకు చెందిన నాసా ప్రయోగించిన టెలిస్కోపు ‘హబుల్’ ఈ పేలుడును గుర్తించింది. ఇందులో పెద్దగా విశేషం ఏమీ లేకపోవచ్చు కానీ.. ఈ పేలుడు జరిగిన ప్రాంతంలో ఏ రకమైన ఖగోళ వస్తువూ లేకపోవడమే శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఏమీ లేని చోట బాంబు పేలుడు జరిగిందన్నమాట. పేలుడు ఎలా జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్న? అంచనాలు తారుమారు... కొన్నేళ్ల క్రితం ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో జరిగే ఓ కొత్త రకం పేలుడు గురించి ప్రకటించారు. లూమినస్ ఫాస్ట్ బ్లూ ఆప్టికల్ ట్రాన్సియట్... క్లుప్తంగా ఎల్ఎఫ్బోట్ అని పిలుస్తారు దీన్ని. పొడవాటి, సంక్లిష్టమైన పేరును కాసేపు మరచిపోండి. ఈ పేలుడులో భాగంగా కొన్ని రోజుల పాటు ప్రకాశవంతమైన నీలి రంగు కనిపిస్తుందని మాత్రమే గుర్తుపెట్టుకుందాం. 2016లో ఇలాంటి పేలుడు ఒకదాన్ని తొలిసారి గుర్తించగా.. ఆ తరువాత దాదాపుగా చూడలేదు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి సమచారంతోనే ఈ పేలుళ్లు ఎలా పుట్టిఉంటాయో అంచనా కట్టేందుకు ప్రయత్నం చేశారు. రకరకాల అంచనాల్లో కోర్-కొలాప్స్ సూపర్ నోవాకు మద్దతు పెరిగింది. ఎక్కువయ్యారు. ఇంధనమంతా ఖర్చయిపోయిన నక్షత్రం పేలిపోతే సూపర్నోవా అంటారని మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే పెరిగిపోయే గురుత్వ శక్తి కారణంగా ఈ నక్షత్రం తాలకూ కోర్ కూడా తనలో తాను కుప్పకూలిపోతే దాన్ని కోర్-కొలాప్స్ సూపర్నోవా అని పిలుస్తారు. కానీ... ఈ ఏడాది ఏప్రిల్ పదిన ఈ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. జ్వికీ ట్రాన్సియంట్ ఫెసిలిటీ (జెడ్‌టీఎఫ్) ఎల్ఎఫ్బోట్ పేలుడును గుర్తించింది. ‘ఏటీ2023ఎఫ్హెచ్ఎన్’ అని నామకరణం చేశారు. ‘ఫించ్’ అని ముద్దుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ప్రకాశవంతమైన నీలి రంగులో కాంతి కనిపించింది. కొన్ని రోజుల తరువాత క్రమేపీ మాయమైంది. ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా 20000 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉన్నట్లు తెలిసింది. అన్నీ సాధారణమే అనుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ... హబుల్ టెలిస్కోపును ఈ పేలుడు సంభవించిన వైపు తిప్పినప్పుడు అసలు విషయం తెలిసింది. ఇది సాధారణ ఎల్ఎఫ్బోట్ కాదని అర్థమైంది. అప్పటివరూ గుర్తించి అన్ని ఎల్ఎఫ్బోట్లు పాలపుంతల్లోపల సంభవించాయి. అది కూడా ఓ నక్షత్రం తయారవుతున్న సమయంలో జరిగాయి ఈ పేలుళ్లు. ఫించ్ మాత్రం పాలపుంతలో లేదు సరికదా.. ఒంటరిగా అలా తేలియాడుతూ ఉందంతే. పైగా దీనికి దగ్గరలో కూడా ఏ పాలపుంత లేదు. సుమారు 15000 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే పాలపుంతలున్నాయి. సూపర్నోవాల్లో నక్షత్రం చాలా వేగంగా అంతరించిపోతుంది. ఏమీ లేని ప్రాంతంలో దీర్ఘకాలం అలా తేలియాడుతూ ఉండేందుకు అవకాశం లేదు. ఏమై ఉండవచ్చబ్బా...? ఏప్రిల్ పదిన గుర్తించి ఎల్ఎఫ్బోట్ కచ్చితంగా మమ్మల్ని ఆశ్చర్యపరిచిందంటారు ఆష్లే క్రైమ్స్. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఈయనే. ఫించ్ ఘటన తరువాత ఎల్ఎఫ్బోట్లు పాలపుంతల్లో మాత్రమే కాకుండా... సూదూరంగానూ సంభవించగలవని స్పష్టమైంది. బహుశా ఓ భారీ కృష్ణ బిలం నక్షత్రం ఒకదాన్ని ముక్కలుగా చీల్చేయడం వల్ల ఈ ఎల్ఎఫ్బోట్ పుట్టి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేస్తున్నారు. లేదా రెండు న్యూట్రాన్ స్టార్లు ఢీకొనడం కూడా కారణమై ఉండవచ్చునని అంటున్నారు. ఈ రెండు న్యూట్రాన్ స్టార్లలో ఒకటి భారీగా అయస్కాంతీకృతమైనందైతే (మాగ్నెటార్ అంటారు) సాధారణ సూపర్నోవా కంటే వంద రెట్లు ఎక్కువ కాంతి వెలువడుతుందని క్రైమ్స్ చెప్పారు. ఈ విషయంపై కచ్చితమైన అంచనా వేయాలంటే మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంటుందని చెప్పారు. అమెరికా, యూరప్, కెనడాలు కలిసికట్టుగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా పరిశీలించినప్పుడు మరికొన్ని క్లూలు దొరికాయి. దగ్గరలోని పాలపుంత ఔటర్ హాలో (ప్రకాశవంతమైన కాంతి ఉండే ప్రాంతం)లోని నక్షత్రాల గుంపు నుంచి వచ్చి ఉండవచ్చునని తెలుస్తోంది. ఇదే నిజమైతే కృష్ణబిలం ఓ నక్షత్రాన్ని చీల్చేయడం వల్ల ఎల్ఎఫ్బోట్ ఏర్పడిందన్న సిద్ధాంతానికి బలం చేకూరుతుంది. పరిశోధన వివరాలు రాయల్ అస్ట్రనామికల్ సొసైటీ జర్నల్ ‘మంత్లీ నోటీసెస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. హైలైట్స్.... ఏమిటి?.... శూన్యంలో వినూత్నమైన పేలుడు! ఎప్పుడు?... ఈ ఏడాది ఏప్రిల్ పదవ తేదీ తొలిసారి గుర్తించారు! ఎలా?.... నాసా ప్రయోగించిన హబుల్ టెలిస్కోపు ద్వారా... ఎందుకు జరిగిందీ పేలుడు?.... స్పష్టంగా తెలియదు! తెలుసుకునే ప్రయత్నంలోనే శాస్త్రవేత్తలున్నారు.! -
Giant Magellan Telescope: పేద్ద టెలిస్కోప్
ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి జీవులమేనా? లేక ఇతర గ్రహాల్లోనో, లేదంటే విశ్వాంతరాల్లో సుదూరాల్లోనో మరెక్కడైనా జీవముందా? ఉంటే వాళ్లు మనలాంటి ప్రాణులేనా? మనిషిని ఎంతోకాలంగా వెంటాడుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే ప్రయత్నాలకు మరోసారి తెర లేచింది. ఇందుకోసం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆప్టికల్ టెలీస్కోప్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది..! ఏమిటీ జీఏంటీ? విశ్వంలో సుదూరంలో ఉన్న నక్షత్రాలు తదితరాల రసాయన విశ్లేషణ ద్వారా వాటి లోగుట్టును కనిపెట్టేందుకు అత్యధిక సామర్థ్యంతో కూడిన ఈ టెలీస్కోప్ నాసా ఆధ్వర్యంలో సిద్ధమవుతోంది... జయింట్ మగలాన్ టెలీస్కోప్ (జీఏంటీ) ► దీని ఉపరితలం వైశాల్యమే ఏకంగా 368 చదరపు మీటర్లు! ► జీఏంటీకు ఏడు అతి పెద్ద పట్టకాల సమూహాన్ని బిగిస్తున్నారు. వీటి పొడవు 24.5 మీటర్లు. ► వీటిలో కీలకమైన చివరి, ఏడో ప్రాథమిక పట్టకం పాలిషింగ్ పని చివర్లో ఉందిప్పుడు. జీవం ఉనికిని గుర్తించడంలో కీలకం... సుదూరాల్లోని గ్రహాలు, శకలాలు తదితర గోళాల్లో ఉపరితలాలను ముందెన్నడూ లేనంత స్పష్టంగా పరిశీలించేందుకు జీఏంటీ తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ముఖ్యంగా భూమి మాదిరిగానే వాటిమీద పర్వతమయ ప్రాంతాలు ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తద్వారా వాటిమీద జీవం ఉనికి తాలూకు జాడ కూడా చిక్కుతుంది‘ అని వారు అంటున్నారు. 20 టన్నుల ఆప్టికల్ గ్లాస్! ► జీఏంటీ తాలూకు పట్టకాల తయారీ పని అరిజోనా యూనివర్సిటీలోని రిచర్డ్ ఎఫ్.కారిస్ మిర్రర్ ల్యాబ్‌లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ► ఇందుకోసం ఏకంగా 20 టన్నుల అత్యంత శుద్ధమైన ఆప్టికల్ గ్లాస్‌ను వాడుతున్నారు. ► దాన్ని 1,185 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తున్నారు. ► ఈ గ్లాస్ కరిగిన కొద్దీ బయటి కొసవైపు కుంభాకారపు పట్టకంగా రూపుదాలుస్తుంది. ► తర్వాత దాన్ని 3 నెలల పాటు చల్లబరుస్తారు. ► అనంతరం పాలిíÙంగ్ చేస్తారు. ► చివరగా ఏడు అద్దాలనూ కలగలిపి ఒకే పెద్ద పట్టకంగా బిగిస్తారు. ► అప్పుడిక ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక టెలీస్కోప్లన్నింటి కంటే జీఏంటీ కనీసం 4 రెట్లు హెచ్చు రిజల్యూషన్, 200 రెట్లు అధిక సున్నితత్వంతో పనిచేసే టెలిస్కోప్‌గా మారుతుంది. ► జేమ్స్వెబ్తో సహా ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న ఏ టెలీస్కోప్‌కూ ఇంత పెద్ద పట్టకం లేదు. అయితే ఇన్ ఫ్రారెడ్ కాంతిలో విశ్వాన్ని పరిశీలించే శక్తి ఇప్పుడు తయారవుతున్న జీఏంటీతో సహా ఏ టెలీస్కోప్‌కూ లేదు. ఆ సామర్థ్యం ఇప్పటిదాకా జేమ్స్ వెబ్ కు మాత్రమే సొంతం. ► జీఏంటీ పొడవు 39 మీటర్లు. దీని తయారీకి 2,100 టన్నుల స్టీలు వాడుతున్నారు! కొసమెరుపు: ఈ జీఏంటీ టెలీస్కోప్ పూర్తిగా తయారై అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఆరేళ్లన్నా పట్టొచ్చట. అంటే, దశాబ్దాంతం దాకా వేచి చూడాల్సిందే! నేషనల్ డెస్క్, సాక్షి -
అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ..
అంతరిక్షంలో నక్షత్రాలన్నీ సమూహాలు (గెలాక్సీలు)గా.. అక్కడో గుంపు, ఇక్కడో గుంపు అన్నట్టుగా ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలకు ఒకచోట మాత్రం ఏదో గీత గీసినట్టుగా నక్షత్రాల వరుస కనిపించింది. అదేదో పదులు, వందల్లో కాదు.. లక్షల నక్షత్రాలు అలా లైన్ కట్టాయి. అదేమిటా అని చూస్తే నోరెళ్లబెట్టేసంగతి బయటపడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ నక్షత్రాల లైన్ ఏమిటని చూసి.. సాధారణంగా ప్రతి నక్షత్ర సమూహం (గెలాక్సీ) మధ్యలో పెద్ద బ్లాక్‌హోల్ ఉంటుంది. దాని చుట్టూరానే నక్షత్రాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. నక్షత్రాలు కూడా గుంపుగా ఉంటాయి. కానీ ఇటీవల హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాల్లో.. నక్షత్రాలు ఒక గీతలా వరుసగా ఉండటం, అదీ ఓ చిన్న గెలాక్సీ దగ్గర మొదలై కోట్ల కిలోమీటర్ల పొడవునా కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. చిత్రాల్లో అదేదో ‘పొరపాటు (ఎర్రర్)’ కావొచ్చని తొలుత భావించారు. కానీ యేల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ వాన్ డొక్కుమ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధన చేసి.. ఆ నక్షత్రాల వరుస ముందు ఓ ప్రకాశవంతమైన వస్తువును గుర్తించింది. క్షుణ్నంగా పరిశీలించి అది కృష్ణబిలం అని తేల్చింది. గెలాక్సీ నుంచి తప్పించుకుని.. ఓ పెద్ద కృష్ణబిలం తన గెలాక్సీ నుంచి తప్పించుకుని, అమిత వేగంతో ప్రయాణిస్తూ.. దారిలో ఈ నక్షత్రాల పుట్టుకకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు, మూడు గెలాక్సీలు ఢీకొన్న క్రమంలో.. ఒక గెలాక్సీ నుంచి విసిరేసినట్టుగా ఈ కృష్ణబిలం బయటికి వచ్చి ఉంటుందని అంచనా వేశారు. దాని పరిమాణం మన సూర్యుడి కంటే రెండు కోట్ల రెట్లు పెద్దగా ఉందని.. అది గంటకు సుమారు 58 లక్షల కిలోమీటర్ల అమిత వేగంతో ప్రయాణిస్తోందని గుర్తించారు. నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి? విశ్వం ఏర్పడే క్రమంలో గెలాక్సీలతోపాటు వాటి మధ్యలో అక్కడక్కడా విడిగా వాయువులు, ఇతర ఖగోళ పదార్థాలు ఉండిపోయాయని శాస్త్రవేత్త పీటర్ వాన్ చెప్పారు. ఈ కృష్ణబిలం ప్రయాణిస్తున్న క్రమంలో దాని ఆకర్షణ శక్తి వల్ల వాయువులు, ఖగోళ పదార్థాలు ఒక్కచోటికి చేరుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కృష్ణబిలం వెనుక ఏర్పడే అతిశీతల పరిస్థితితో.. అవి సంకోచించి నక్షత్రాలు జన్మిస్తున్నాయని వివరించారు. విశ్వంలో ఇలాంటి దానిని గుర్తించడం ఇదే మొదటిసారని తెలిపారు. దీని గుట్టు తేల్చేందుకు త్వరలో ప్రఖ్యాత జేమ్స్‌వెబ్ టెలిస్కోప్‌తో పరిశీలించనున్నామని వెల్లడించారు. ఏమిటీ కృష్ణ బిలం? అతిపెద్ద నక్షత్రాలు వేలకోట్ల ఏళ్లపాటు మండిపోయి, ఇంధనం ఖాళీ అయ్యాక.. వాటిలోని పదార్థమంతా కుచించుకుపోయి ‘కృష్ణబిలం’గా మారుతాయి. వీటి గురుత్వాకర్షణ శక్తి చాలా తీవ్రంగా ఉండి.. సమీపంలోకి వచ్చే అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి. కాంతి కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోవడంతో.. నేరుగా కనబడవు. అందుకే కృష్ణబిలం (బ్లాక్‌హోల్స్) అని పిలుస్తారు. -
బృహస్పతి... ఉపగ్రహాల రాజు.. డజను చంద్రుల గుర్తింపు
కేప్ కెనవెరాల్ (యూఎస్): సౌరకుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం (బృహస్పతి) చుట్టూ మరో 12 ఉపగ్రహాలను సైంటిస్టులు కనిపెట్టారు. దీంతో దాని ఉపగ్రహాల సంఖ్య ఏకంగా 92కు పెరిగింది. తద్వారా 83 ఉపగ్రహాలున్న శని గ్రహాన్ని వెనక్కు నెట్టి సౌరమండలంలో అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహంగా నిలిచింది. హవాయి, చిలిల్లోని టెలిస్కోప్‌ల సాయంతో 2021, 2022ల్లోనే గురు గ్రహపు కొత్త ఉపగ్రహాలను గుర్తించినా ఇంతకాలం పాటు నిశితంగా గమనించిన వాటి ఉనికిని తాజాగా నిర్ధారించారు. ఏకంగా 92 ఉపగ్రహాలతో గురు గ్రహం ఓ మినీ సౌరకుటుంబంగా భాసిల్లుతోందని వీటిని కనిపెట్టిన సైంటిస్టు స్కాట్ షెపర్డ్ చమత్కరించారు. ‘‘అయితే ఇవన్నీ బుల్లి ఉపగ్రహాలే. ఒక్కోటీ కేవలం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉన్నాయి’’ అని వివరించారు. పూర్తి వాయుమయమైన గురు గ్రహాన్ని, మంచుతో కూడిన దాని అతి పెద్ద ఉపగ్రహాలను అధ్యయనం చేసేందుకు ఏప్రిల్‌లో ఒక అంతరిక్ష నౌకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపనుంది. వీటిలో యూరోపా క్లిపర్ అనే ఉపగ్రహం ఉపరితలంపై పేరుకున్న అపారమైన మంచు కింద భారీ సముద్రం దాగుందని నాసా భావిస్తోంది. దాని అధ్యయనం కోసం 2024లో యూరోపా క్లిపర్ మిషన్‌ను ప్లాన్ చేస్తోంది. అది వాసయోగ్యమేనా అన్న అంశాన్ని పరిశోధించనుంది. బృహస్పతి, శని చుట్టూ ఉన్న భారీ ఉపగ్రహాలు బహుశా పరస్పరం ఢీకొని ఉంటాయని, ఇన్నేసి బుల్లి ఉపగ్రహాలుగా విడిపోయాయని షెపర్డ్ పేర్కొన్నారు. ‘‘యురేనస్, నెప్ట్యూన్లదీ ఇదే పరిస్థితి. కానీ అవి మరీ సుదూరాల్లో ఉన్న కారణంగా వాటి ఉపగ్రహాలను గుర్తించడం చాలా కష్టం’’ అని వివరించారు. యురేనస్‌కు 27, నెప్ట్యూన్‌కు 14, అంగారకునికి రెండు ఉపగ్రహాలున్నాయి. బుధ, శుక్ర గ్రహాలకు ఒక్కటి కూడా లేదు. -
పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్..
వాషింగ్టన్: భూమికి 218 కాంతి సంవత్సరాల దూరంలోని లైరా అనే పాలపుంతలో ఓ ఎర్రని మరుగుజ్జు తార చుట్టూ పరిభ్రమిస్తున్న కెప్లర్–138సి, కెప్లర్–138డి అనే రెండు గ్రహాలను సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇందులో వింతేముందంటారా? పరిమాణంలో భూమి కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవైన ఇవి రెండూ దాదాపుగా నీటితో నిండి ఉన్నాయట! నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ వీటి ఉనికిని బయట పెట్టింది. వాటిపై ఉన్న పదార్థం శిలల కంటే తేలికగా, హైడ్రోజన్, హీలియం కంటే భారంగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. కనుక అది కచ్చితంగా నీరే అయి ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. విశ్వంలో ఇలాంటి నీటి గ్రహాల ఉనికి వెలుగులోకి రావడం ఇదే తొలిసారి! దీనికి సంబంధించి నేచర్ ఆ్రస్టానమీ జర్నల్‌లో లోతైన అధ్యయనం పబ్లిషైంది. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
అరుదైన అంతరిక్ష దృగ్విషయం.. గుర్తించిన ‘గ్రోత్’.. టీడీఈ అంటే తెలుసా?
అంతరిక్షంలో రగడ జరుగుతోంది! మరణిస్తున్న ఓ తారను అతి భారీ కృష్ణ బిలమొకటి శరవేగంగా కబళించేస్తోంది. ఈ ఘర్షణ వల్ల చెలరేగుతున్న కాంతి పుంజాలు సుదూరాల దాకా కనువిందు చేస్తున్నాయి. ఈ అరుదైన అంతరిక్ష దృగ్విషయాన్ని ఉత్తరాఖండ్‌లోని సరస్వతి పర్వత శిఖరంపై ఉన్న టెలిస్కోప్ ‘గ్రోత్’ గుర్తించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్, ఐఐటీ బాంబే సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇది భారత తొలి పూర్తిస్థాయి రొబోటిక్ ఆప్టికల్ రీసెర్చ్ టెలిస్కోప్. ‘‘అంత్య దశలో ఉన్న ఆ నక్షత్రాన్ని భారీ కృష్ణబిలం అనంతమైన ఆకర్షణ శక్తితో తనలోకి లాగేసుకుంటోంది. దాంతో నక్షత్రం ఊహాతీత వేగంతో దానికేసి సాగుతోంది. వీటిని టైడల్ డిస్రప్షన్ ఈవెంట్స్ (టీడీఈ) అంటారు’’ అని ఐఐటీ బాంబే ఆస్ట్రో ఫిజిసిస్ట్ వరుణ్ భలేరావ్ వివరించారు. ఈ అంతరిక్ష రగడకు కేంద్రం మనకు 850 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట! ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. -
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే?
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు అమెరికా ఇంజనీర్లు. ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ లేబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఎల్ఎస్ఎస్టీ డిజిటల్ కెమెరా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ అన్ని భాగాలను అమర్చారు. ఆపరేట్ చేసి ఫోటోలు తీసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఎల్ఎస్ఎస్టీ కెమెరా అంటే? ఎల్ఎస్ఎస్టీ అంటే 'లార్జెస్ట్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్' డిజిటల్ కెమెరా. ఉత్తర చీలిలోని 2,682 మీటర్ల ఎత్తయిన పర్వతం సెర్రో పచోన్ అంచున 2023లో ఏఫ్రిల్‌లో దీన్ని అమర్చనున్నారు. భూమిపై పరిశోధలనకు ఈ ప్రాంతం అత్యంత అనువైంది. జెమినీ సౌత్, సౌథర్న్ ఆస్ట్రోఫిజికల్ రీసెర్చ్ టెలిస్కోప్‌లు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ డిజిటల్ కెమెరాలోని సెన్సార్లు అత్యాధునిక ఐఫోన్ 14 ప్రోతో పోల్చితే చాలా రెట్లు అధికం. దీని ఓవరాల్ రిజొల్యూషన్ 3.2 గిగాపెక్సెల్స్ లేదా 3200 మెగా పిక్సెళ్లు. అంటే 266 ఐఫోన్ 14ప్రో ఫోన్లతో ఇది సమానం. ఈ కెమెరాతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్‌గా చూడవచ్చు. ఇది చిన్న కారు సైజు పరిమాణం, మూడు టన్నుల బరువుంటుంది. చదవండి: బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు! -
దెబ్బ తిన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. నాసా ఆందోళన
వాషింగ్టన్ డీసీ: అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా.. అదే సమయంలో కీలకంగానూ మారింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన టెలిస్కోప్‌గా దీనికి ఒక పేరు ముద్రపడింది. అంతెందుకు అంతరిక్ష శూన్యంలో ఆరు నెలల కాలం పూర్తి చేసుకుని.. అద్భుతమైన చిత్రాలను విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా ఓ నివేదిక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా National Aeronautics and Space Administration ను ఆందోళనకు గురి చేస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దెబ్బ తిందని.. రాబోయే రోజుల్లో అది టెలిస్కోప్ పని తీరుపై ప్రభావం చూపనుందన్నది ఆ నివేదిక సారాంశం. కమీషనింగ్ ఫేజ్‌లో టెలిస్కోప్ పని తీరును పరిశీలించిన సైంటిస్టుల బృందం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. ప్రస్తుతం, అనిశ్చితి యొక్క అతిపెద్ద మూలం సూక్ష్మ ఉల్కలతో దీర్ఘకాలిక ప్రభావాలు ప్రాధమిక అద్దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. మే 22వ తేదీన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాథమిక అద్దం, ఆరు మైక్రోమెటీరియోరైట్స్(సూక్ష్మ ఉల్కలు) కారణంగా దెబ్బ తింది. చివరి ఉల్క ఢీకొట్టడంతోనే టెలిస్కోప్ అద్దం దెబ్బతిందని సైంటిస్టులు స్పష్టం చేశారు. ప్రభావం చిన్నదిగానే చూపిస్తున్నప్పటికీ.. అది రాబోయే రోజుల్లో ఎంత మేర నష్టం చేకూరుస్తుందన్న విషయంపై ఇప్పుడే ఒక అంచనాకి రాలేమని సదరు సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అబ్జర్వేటరీ ప్రభావం ఎంతవరకు ఉందో చూపించే చిత్రాన్ని శాస్త్రవేత్తలు విడుదల చేశారు. అదే సమయంలో డ్యామేజ్ గురించి స్పందించిన జేమ్స్ వెబ్ రూపకర్తలు.. టెలిస్కోప్ అద్దాలు, సన్‌షీల్డ్(టెన్నిస్ కోర్టు సైజులో ఉంటుంది)లు ఉల్కల దెబ్బతో నెమ్మదిగా పని చేయడం ఆపేస్తాయని తేల్చడంపై నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ సమస్యను వీలైనంత త్వరగతిన పరిష్కరించాలనే ఆలోచనలో ఉంది నాసా. ఇదిలా ఉంటే హబుల్ టెలిస్కోప్ తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్‌గా పేరు దక్కించుకుంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నాసా NASA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(CSA)ల సహకారంతో సుమారు 10 బిలియన్ల డాలర్లు వెచ్చించి తయారు చేయించింది. ఈ టెలిస్కోప్ మిర్రర్స్ చాలా చాలా భారీ సైజులో ఉంటాయి. డిసెంబర్ 25, 2021లో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించగా.. ఫిబ్రవరి నుంచి భూమికి 1.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో L2 పాయింట్ వద్ద ఇది కక్ష్యలో భ్రమిస్తూ ఫొటోలు తీస్తోంది. వెబ్ యొక్క అద్దం అంతరిక్షంలో తీవ్ర వేగంతో ఎగురుతున్న దుమ్ము-పరిమాణ కణాలతో బాంబు దాడిని తట్టుకునేలా రూపొందించబడిందని నాసా గతంలో ప్రకటించుకుంది. కానీ, ఇప్పుడు చిన్న చిన్న ఉల్కల దాడిలో దెబ్బ తింటుండడం ఆసక్తికరంగా మారింది. -
తారల తళుక్కులను చూసేద్దాం!
సాక్షి, అమరావతి: కాంతి కాలుష్యానికి (లైట్ల వెలుతురు పెద్దగా లేని ప్రాంతం) దూరంగా చీకటి ఆకాశంలో టెలీస్కోప్‌ల సాయంతో నక్షత్రాలను వీక్షించడమే ఆస్ట్రో పర్యాటకం. ఇది ఎత్తైన కొండలు, దట్టమైన కోనలు, హిమ పర్వతాల ప్రాంతాల్లో సాంకేతికతతో కూడిన ఎకో టూరిజంగా ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇందులో పర్యాటకులు స్పష్టమైన రాత్రి ఆకాశాన్ని అన్వేషిస్తూ (నైట్ స్కై టూరిజం) గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఖగోళ వస్తువులు, ఉల్కాపాతాలను వీక్షించవచ్చు. ఆస్ట్రో–ఫొటోగ్రఫీ నేర్చుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు సైతం ఆకాశంపై పరిశోధనలకు రాత్రి శిఖరాగ్ర ప్రదేశాల్లోనే ఎంచుకొంటారు. ఉపాధి వనరుగా.. ఆస్ట్రో టూరిజం స్థానిక వర్గాలకు బలమైన ఆర్థిక, సామాజిక ఉపాధి వనరుగా మారుతోంది. లద్ధాఖ్‌లో స్థానిక మహిళలకు ఆస్ట్రో టూరిజంలో టెలిస్కోప్‌ల వినియోగంలో శిక్షణ పొంది నక్షత్రాలు, నక్షత్ర రాశులను గుర్తించడంలో పర్యాటకులకు గైడులుగా వ్యవహరిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆస్ట్రో–స్టే పేరిట స్థానిక గృహాల్లోనే పర్యాటకులకు బస కల్పించి ఉపాధి పొందుతున్నారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌ల్లో ఖగోళ పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టుల కోసం గుడిసెలు ఏర్పాటు చేస్తూ.. భోజనాలు అందిస్తూ..సంగీత కచేరీలతో అలరిస్తూ సంపాదిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని బెనిటల్ ఆస్ట్రో గ్రామంగా మారింది. ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘ఆస్ట్రో విలేజ్ పార్టీలు’ పెడుతున్నారు. దేశంలో ఇలా.. దేశంలో తొలి సారిగా రాజస్థాన్ ప్రభుత్వం మొత్తం 33 జిల్లాల్లో ఆస్ట్రో టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి జిల్లాలో టెలిస్కోప్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో కూడా ఆస్ట్రో టూరిజం కోసం కేంద్రాన్ని నిర్వహిస్తోంది. రాజధాని జైపూర్‌లోనే 4 నక్షత్ర వీక్షణ కేంద్రాలను పెట్టింది. ఇప్పటికే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పుదుచ్చేరి, కర్ణాటకలోని విరాజ్‌పేట, మడికేరి, గోవా, కేరళలోని మున్నార్‌లో ఆస్ట్రో ఫోటోగ్రఫీ సెషన్లు, ప్లానెటరీ పెరేడ్, ‘మెస్సియర్ మారథాన్’ పేరుతో చీకటి ఆకాశాన్ని వీక్షించేందుకు మొబైల్ అబ్జర్వేటరీలు నడుస్తున్నాయి. తమిళనాడులో తక్కువ జనసాంద్రత కలిగిన ఏలగిరి కొండలు, ఊటీకి ఖగోళ పర్యాటకం పెరుగుతోంది. లద్ధాఖ్‌కు ప్రత్యేక గుర్తింపు! ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో లద్ధాఖ్లోని హన్లే గ్రామం ఒకటి. ఈ ప్రాంతాన్నే ఇటీవల మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్‌గా ప్రకటించారు. ఇది శీతల ఎడారి ప్రాంతం కావడంతో ఏడాది పొడవునా పొడి వాతావరణంతో ఆకాశంలో పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే పరిశోధనల కోసం రాత్రిపూట ఆకాశాన్ని కాంతి కాలుష్య కారకాల నుంచి పరిరక్షించే దిశగా ప్రత్యేక బృందం కృషి చేస్తోంది. -
‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు
సాక్షి, అమరావతి: టెలిస్కోపిక్ బిల్లింగ్ ద్వారా తక్కువ భారం పడుతుందని గృహ విద్యుత్ వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఆదివారం ఆయన వెబినార్ ద్వారా సమీక్షించారు. ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మాజనార్దన్ రెడ్డి, కె.సంతోష్ రావు, డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, కె.ముథుపాండియన్, జి.చంద్రశేఖరరాజు ఇందులో పాల్గొన్నారు. టెలిస్కోపిక్ బిల్లింగ్‌కు సంబంధించిన వివరాలతో కరపత్రాలను విద్యుత్తు బిల్లులతో వినియోగదారులకు అందజేయాలని ఇంధన శాఖ కార్యదర్శి సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. నూతన టెలిస్కోపిక్ విధానంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది. దీనివల్ల మొత్తం వినియోగానికి ఒకే స్లాబ్‌లో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్లు వాడితే తొలి 30 యూనిట్లకు యూనిట్ రూ.1.90 చొప్పున, తర్వాత 45 యూనిట్లకు యూనిట్ రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్ రూ.4.50, అనంతరం 100 యూనిట్లకు యూనిట్ రూ.6, చివరి 25 యూనిట్లకు యూనిట్ రూ.8.75 చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఏపీఈఆర్సీ కొత్త విద్యుత్తు టారిఫ్ ప్రకటించింది. 1.91 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంలో డిస్కమ్‌లకు ఊరట కల్పించేలా కొత్త టారిఫ్ ఉంది. రాష్ట్రంలో 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వారికి యూనిట్ రూ.3.11 చార్జీ పడుతుంది. ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కర్ణాటక, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో 100 యూనిట్లలోపు వాడే వినియోగదారులు యూనిట్ రూ.8.26, రూ.8.33, రూ.7.74, రూ.7.20, రూ.6.19, రూ.6.61, రూ.6.10 చొప్పున చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో 1.44 కోట్ల (95%) మంది 225 యూనిట్లలోపు వినియోగించే కేటగిరీలోనే ఉన్నారు. 225 యూనిట్లలోపు వినియోగించే వారి నుంచి డిస్కంలు సగటు ధర కంటే తక్కువగానే చార్జీలు వసూలు చేస్తున్నాయి. మూడు డిస్కంలకు మొత్తం సర్వీసు చార్జీ రూ.6.82 నుంచి రూ.6.98కి పెరిగినా వినియోగదారుల నుంచి తక్కువగానే వసూలు చేస్తున్నాం. జిల్లాల విభజన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పట్టణీకరణతో విద్యుత్తు డిమాండ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: పోలీస్ ఉద్యోగాల కోసం... యువతకు ఉచిత శిక్షణ) -
గమ్యస్థానం చేరిన జేమ్స్‌వెబ్ టెలిస్కోప్
మెల్బోర్న్: మానవాళి ప్రతిష్టాత్మకంగా భావించే జేమ్స్ వెబ్ టెలిస్కోపు తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొంది. భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్2 పాయింట్ (లాంగ్రేజియన్ 2 పాయింట్)ను చేరినట్లు నాసా వర్గాలు తెలిపాయి. ఎల్2 పాయింట్ భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ పాయింట్లో ఇకపై వెబ్ టెలిస్కోప్ పరిభ్రమణ జరుపుతుంది. నెల రోజుల క్రితం ఈ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపారు. విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా దీని నిర్మాణం జరిగింది. 2022 జూలై నుంచి టెలిస్కోపు నుంచి రీడింగ్స్ భూమికి రావడం ఆరంభమవుతుంది. ఈలోపు టెలిస్కోపు తనను తాను కక్ష్యలో సర్దుబాటు చేసుకోవడం, దర్పణాలు సమలేఖణం(అలైన్మెంట్) చెందడం వంటి పను లు పూర్తి చేయాల్సిఉంది. లక్ష్యాన్ని చేరడానికి ఒక రోజు ముందే టెలిస్కోప్‌లోని 18 దర్పణాలు పూరి ్తగా తెరుచుకోవడం విజయవంతంగా జరిగింది. దాదాపు 1000 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. -
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగంలో మరో సంచలనం!
నాసా సైంటిస్ట్‌ల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ శనివారంతో తన రెండు వారాల విస్తరణ దశను పూర్తి చేసింది. కాస్మిక్ చరిత్రలోని ప్రతి దశను అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చివరి మిర్రర్ ప్యానెల్‌ను ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా లాస్ట్ వింగ్ డిప్లాయ్ పూర్తి చేసింది అంటూ నాసా ట్వీట్ చేసింది. అయితే ఈ ప్రయోగం సత్ఫలితాల్ని అందించడంతో నాసా కేంద్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా కాన్ఫిగరేషన్ సమయంలో తలెత్తిన సమస్యను నాసా సైంటిస్ట్‌లు చాకిచక్యంగా వ్యవహరించి..గండం నుంచి గట్టెక్కించడంపై ప్రముఖలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Congratulations, @NASAWebb! You are fully deployed! 🥳 Stay tuned over the coming months as the space telescope reaches its destination of Lagrange point 2 and prepares to #UnfoldTheUniverse: pic.twitter.com/qg6jmVRCsH — NASA (@NASA) January 8, 2022 కాగా డిసెంబర్ 25 శనివారం నాసా ప్రపంచంలోనే భారీ, అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం నిర్వహించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్లో దీన్ని నింగిలోకి పంపారు. విశ్వ ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాల గుట్టును, ఖగోళ ప్రపంచం రహస్యాలను తెలుసుకునేలా భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించిన అనంతరం టెలిస్కోపు నిర్దేశిత స్థానానికి చేరుకుంటుంది. ఈ మొత్తం దూరం పయనించేందుకు సుమారు నెల రోజుల సమయం పడుతుండగా, ఈ ప్రయోగం కీలక దశ విజయవంతమైందని నాసా ట్వీట్ చేసింది. చదవండి: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం విజయవంతం..!విశ్వం పుట్టుక.. గుట్టు వీడేనా! -
నేడు ఖగోళ అద్భుతం.. దూసుకెళ్లనున్న భారీ గ్రహశకలం
Asteroid 2016 AJ193 Speed To Earth: ‘భూమి వైపుగా దూసుకొస్తున్న గ్రహశకలాలు..’ చాలామంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ, అంతరిక్ష పరిశోధకులకు మాత్రం ఇదో ఆసక్తికరమైన అంశం. కారణం.. విశ్వం ఆవిర్భావానికి, డైనోసార్ల శకం ముగియడానికి, గ్రహాల ఏర్పాటుకు, విశ్వంలోని ఎన్నో పరిణామాలకు ఆస్టరాయిడ్లతోనే ముడిపడి ఉందన్న థియరీకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఏ గ్రహశకలం ఎలాంటి ముప్పు తెస్తుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడం వల్ల.. దూసుకొచ్చే ప్రతీదాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడింది శాస్త్రవేత్తలకు. ఈ తరుణంలో.. భూమ్మీదకు వేగంగా దూసుకొస్తున్న ఓ ఆస్టరాయిడ్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. 2016 ఏజే193గా పేరు పెట్టిన ఓ ఆస్టరాయిడ్.. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. నాసా అంచనాల ప్రకారం.. ఆగష్టు 21న(అంటే ఇవాళే) అది భూమికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. సుమారు కిలోమీటర్న్నర వెడల్పు ఉన్న శకలం.. అత్యంత ప్రమాదకరమైన శకలంగా నాసా గుర్తించింది. ఇది భూమిని ఢీకొడితే మాత్రం కచ్చితంగా భారీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కానీ, ఈసారికి ఆ అవకాశాలు లేవని సైంటిస్టులు స్పష్టం చేశారు. చదవండి: వందేళ్ల తర్వాత బెన్నూ ముప్పు! భూమికి దూరంగా (భూమి-చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి తొమ్మిది రెట్లు దూరంగా) ఈ శకలం వెళ్లనుంది. ఈ లెక్కన భూమికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయితే ఈ ఖగోళ అద్భుతాన్ని టెలిస్కోప్‌ల ద్వారా వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2063లో మరోసారి ఇది భూమికి దగ్గరగా రానుందని అంచనా వేస్తున్నారు. ఇక సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తుంటారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్‌ను గుర్తించిన నాసా.. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా గుర్తించింది. -
ఐఐటీ–హైదరాబాద్‌లో భారీ టెలిస్కోప్
సాక్షి, సంగారెడ్డి: ఖగోళ కార్యకలాపాలపై పరిశోధనలకు శ్రీకారం చుట్టేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ కీలక ముందడుగు వేసింది. క్యాంపస్‌లో భారీ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టీ) స్థాపక డైరెక్టర్ డాక్టర్ బీఎన్ సురేశ్ సోమవారం టెలిస్కోప్‌ను ప్రారంభించారు. ఈ టెలిస్కోప్‌లో 165 మి.మీ. ఫోకల్ లెంగ్త్‌తో 355 మి.మీ (ఐఐటీ కాన్పూర్ తర్వాత రెండోది) ఆప్టికల్ వ్యాసం కలిగిన భారీ లెన్స్ ఉంటుందని సోమవారం ఐఐటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై చిన్న క్రేటర్లు, శని గ్రహ వలయాలు, ఉల్కాపాతం వంటి చిత్రాలను నమోదు చేసేందుకు వినియోగించొచ్చని పేర్కొంది. ఖగోళంపై అధ్యయనం చేసేందుకు విద్యార్థులకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడుతుందని హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ మూర్తి పేర్కొన్నారు. స్టార్ గేజింగ్ శిక్షణ కార్యక్రమాలు, ఖగోళ చిత్రాలు తదితరాలపై అవగాహన పెంచుకోవచ్చని చెప్పారు. కాగా, ఐఐటీ హైదరాబాద్ ఆ్రస్టానమీ క్లబ్ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు కూడా ప్రయోజనాలు పొందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో భౌతికశాస్త్ర విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ముయూఖ్‌పహారి పాల్గొన్నారు. -
హబుల్ టెలిస్కోప్ స్థానంలో మరో కొత్త టెలిస్కోప్..!
విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్‌తో సుదూరాన ఉన్న ఇతర గ్రహల, గెలక్సీల పరిశోదనల కోసం శాస్త్రవేత్తలకు ముప్పై సంవత్సరాలుగా హబుల్ తన సేవలను అందిస్తోనే ఉంది. కాగా తాజాగా టెలిస్కోప్‌లో నెలకొన్న సాంకేతిక లోపంతో పలు పరిశోధనలకు ఆటంకం ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం హబుల్ టెలిస్కోప్ పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటున్నామని నాసా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. హబుల్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా) హబుల్ టెలిస్కోప్‌ను మొట్టమొదటి సారిగా 1990 ఏప్రిల్ 25న స్పేస్ షటిల్ డిస్కవరీ నిర్మించారు. సుమారు 13.4 బిలియన్ల కాంతి సంవత్పరాల దూరంలోఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలపై పరిశోధనలను చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. హబుల్ స్థానంలో మరో టెలిస్కోప్..! సుదీర్ఘ సర్వీస్‌ను అందించిన హబుల్ టెలిస్కోప్ స్ధానంలో మరో టెలిస్కోప్‌ను లాంచ్ చేయాలని నాసా భావిస్తోంది. తరచూ హబుల్ టెలిస్కోప్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను హబుల్ స్థానంలో రానుంది. అందుకు సంబంధించిన ప్రయోగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31 న జరిపే అవకాశాలు ఉన్నాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా) చదవండి: ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..! -
మృత నక్షత్రాల్లో ఘోస్ట్ పార్టికిల్ ఆనవాళ్లు..!
వాషింగ్టన్: అణు నిర్మాణం తెలిసిన వాళ్లకు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటికన్నా సూక్ష్మమైనవి, కీలకమైనవి పలు అణువుల్లో ఉంటాయని ఆధునిక భౌతిక శాస్త్రం వెల్లడిస్తోంది. ఇలాంటి సూక్ష్మాతిసూక్ష్మ అణువులలో చాలావాటి ఉనికిని గుర్తించడం కూడా జరిగింది. అయితే చాలా దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలకు అర్థం కాకుండా దాగుడుమూతలు ఆడుతున్న ఒక పార్టికిల్ కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. ఈ అంతుచిక్కని పార్టికిల్‌కు సైంటిస్టులు ముద్దుగా ‘ఘోస్ట్ పార్టికిల్’ అని పేరు పెట్టుకున్నారు. దీని శాస్త్రీయ నామం ‘యాక్జియాన్’. తాజాగా ఈ పార్టికిల్ ఆనవాళ్లు డెడ్ స్టార్స్(మృత నక్షత్రాలు) వెలువరించే ఎక్స్‌రే కిరణాల్లో కనిపించాయి. అమెరికాకు చెందిన చంద్ర టెలిస్కోప్ ద్వారా ఈ ఎక్స్‌రేలను గుర్తించారు. వీటి ఉనికి స్పష్టంగా బయటపడితే విశ్వ రహస్యాల్లో కొన్ని కీలకమైనవాటి గుట్టు బయటపడుతుందని సైంటిస్టులు సంబరపడుతున్నారు. ముఖ్యంగా ‘డార్క్ మ్యాటర్’ గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు. తాజా పరిశోధన వివరాలు ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో పబ్లిష్ అయ్యాయి. మిన్నిసోటా యూనివర్సిటీకి చెందిన రేమండ్ కో అభిప్రాయం ప్రకారం ’’ యాక్జియాన్స్ ఉనికి గుర్తించడం ఫిజిక్స్‌లో అతిపెద్ద ఘటనల్లో ఒకటి. ఇప్పటివరకు ఇవి ఉన్నాయని మాత్రమే నమ్ముతున్నాం. తొలిసారి వీటి ఉనికి స్పష్టంగా డెడ్స్టార్స్ నుంచి విడుదలయ్యే ఎక్స్‌రేల్లో కనిపించింది. మ్యాగ్నిఫిసెంట్ సెవెన్గా పిలిచే న్యూట్రాన్ స్టార్స్ నుంచి రావాల్సిన మోతాదుకు మించి ఎక్స్‌రే ఉద్ఘాటన గుర్తించారు. ఈ అదనపు ఎక్స్‌రేలు సదరు నక్షత్ర కోర్ భాగంలో ఉన్న యాక్జియాన్స్ వల్ల వచ్చాయని చెప్పవచ్చు’’ అని వివరించారు. న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఢీకొన్నప్పుడు ఈ యాక్జియాన్లు విడుదలవుతాయి. అనంతరం నక్షత్రం నుంచి వెలికి వచ్చినప్పుడు లైట్ పార్టికిల్స్గా మారి ఎక్స్‌రేల రూపంలో బహిర్గతమవుతాయని తాజాగా ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయితే సాధారణ లైట్ పార్టికిల్స్ కన్నా యాక్జియాన్లలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. వీటిని 1970ల్లో తొలిసారి ప్రతిపాదించారు. ఇవి ఉన్నాయని నిరూపితమవుతే డార్క్‌మ్యాటర్ కూడా ఉన్నట్లేనని సైంటిస్టులు భావిస్తున్నారు. -
‘సుశాంత్ నాకు చంద్రుడిని చూపించాడు’
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎక్కడైనా.. ఎప్పుడైనా పాటపాడుతూ అందుకనుగుణంగా డ్యాన్స్ చేసేవాడని.. ప్రతిరోజూ చాలా హుషారుగా ఉండేవాడని అంటున్నారు హీరోయిన్ శ్రద్ధాకపూర్. ‘చిచోరే’లో తన సహనటుడైన సుశాంత్‌తో ఉన్న జ్ఞాపకాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సుశాంత్ మానవత్వం, తెలివి, జీవితంపై ఆసక్తిగల వ్యక్తి అని ఆమె గుర్తుచేసుకున్నారు. అంతేకాక టెలిస్కోప్ నుంచి సుశాంత్ తనకు చందమామను చూపించాడని.. ఆ అనుభవాన్ని ఎప్పటికి మర్చిపోలేనన్నారు శ్రద్ధ. ఈ క్రమంలో ‘ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ, ఇది చాలా కష్టంగా అనిపిస్తున్నది. అంతా శూన్యంలా తోస్తోంది.. సుశాంత్.. డియర్ సుశ్..’ అంటూ శ్రద్ధ వ్యాఖ్యానించారు. 2019లో విడుదలైన చిచోరే సినిమాలో శ్రద్ధాకపూర్, సుశాంత్ సరసన నటించిన సంగతి తెలిసిందే. (బాలీవుడ్ బంధుప్రీతిపై వైరల్ వీడియో) కాగా, సినిమా షూటింగ్ అప్పుడు సుశాంత్‌ను తాను సెట్లో గమనిస్తుండేదానినని, అతడితో మాట్లాడేందుకు ఇష్టపడేదానినని శ్రద్ధా కపూర్ గుర్తుచేసుకున్నారు. తాము ఎక్కువగా విశ్వం, లైఫ్ ఫిలాసఫీల గురించి చర్చించుకునేవాళ్లమని ఆమె తెలిపారు. అతనితో ఉన్నంతసేపు గమ్మత్తైన ప్రదేశంలో ఉన్నట్లు అనిపించేదన్నారు. పని విషయంలో సుశాంత్ ఎంతో అంకితభావం ప్రదర్శించేవాడని తెలిపారు. తనతో పాటు తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడని గుర్తు చేసుకున్నారు. ఒకసారి ‘చిచోరే’ టీమ్ అంతా సుశాంత్ ఇంటికి వెళ్లారని.. అక్కడి ప్రకృతి సౌందర్యానికి తాము ఫిదా అయ్యామన్నారు. సుశాంత్ తనకు తానే సాటి అని తెలిపారు. మెసేజ్‌తో పాటు చిచోరే షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోని, విన్సెంట్ వాన్ గోహ్ ‘స్టారి నైట్’ ఫోటోతో కలిపి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. శ్రద్ధా కపూర్ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram Been trying to accept what has happened and coming to terms with it is very difficult. There is a huge void... Sushant...! Dearest Sush...! Full of humility, intelligence, curiosity about life, seeing beauty in everything, everywhere! He danced to his own tune! I always looked forward to seeing him on set, wondering what captivating interaction we would have next! Apart from being a wonderful co-actor who put his heart and soul in to his work, he was at his core, an amazing person. He cared for people and wanted to see them happy. His kind smile, the conversations we had at shoot about the Cosmos, different philosophies, the moments we spent together, were filled with magical wonderment! During a lovely musical and poetry filled get together at his home (he loved music and poetry), he showed me the moon from his telescope and I was so speechless that I could see it’s exquisite beauty up close!! He wanted to share that feeling! Our Chhichhore gang went to his beautiful home in Pavna, where we were awestruck together with the peace and calm of the nature around us - he loved nature! He saw things through a kaleidoscopic lens and wanted to share that with everyone around him. He was mesmerized by the simplest things and would muse on them in a genius way...! He was truly, One of a kind... I’ll miss you.. dearest Sush.. Shine on... ✨💜 A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Jun 18, 2020 at 3:56am PDT -
గ్రహాంతర అన్వేషణ సాధనం
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ అపెర్చర్ రేడియో టెలిస్కోప్. చైనాలోని గుయిఝౌలో ఏర్పాటు చేశారు దీనిని. దీని వ్యాసం ఐదువందల మీటర్లు. అందుకే దీనిని ‘ఫైవ్హండ్రడ్ మీటర్ స్ఫెరికల్ టెలిస్కోప్’ (ఫాస్ట్) అని కూడా పిలుచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. అయితే, రేడియో తరంగాల అంతరాయాలు ఏర్పడటంతో, వాటిని తొలగించేందుకు దీని పనిని శాస్త్రవేత్తలు నిలిపివేశారు. (పాపం కుక్కతో అంట్లు తోమిస్తున్నారు) సాంకేతిక ఇబ్బందులు తొలగిన తర్వాత తిరిగి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పని చేయనుంది. గ్రహాంతర అన్వేషణలో ఇది మిగిలిన టెలిస్కోప్‌ల కంటే అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సుదూర ప్రాంతాల నుంచి నేరోబ్యాండ్ సిగ్నల్స్ అందుతున్నాయని, బహుశ అవి గ్రహాంతరవాసులకు చెందినవే కావచ్చని భావిస్తున్నామని ఈ టెలిస్కోప్ ప్రాజెక్టులో కీలక ప్రాత పోషించిన బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఝాంగ్ టోంగ్జీ చెబుతున్నారు. (బీజింగ్‌లో మళ్లీ కరోనా కాటు) -
భారీ విస్పోటనం.. అంతుచిక్కని సిగ్నల్స్!
ఒట్టావా: ఖగోళశాస్త్ర అధ్యయనంలో అంతు చిక్కని మరో మిస్టరీ. భారీ విస్పోటనం తాలుకూ సంకేతాలను కెనడాకు చెందిన ఓ రేడియో టెలిస్కోప్ గుర్తించింది. దీంతో గ్రహాంతరవాసుల ఉనికి అంశం మళ్లీ తెరపైకి రాగా, ఆ రహస్యాన్ని చేధించే పనిలో సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఫాస్ట్ రేడియో బరస్ట్(ఎఫ్ఆర్బీ).. విశ్వంలో సంభవించే అత్యంత శక్తివంతమైన పేలుళ్లకు ఫాస్ట్ రేడియో బరస్ట్‌గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. 2007లో తొలిసారిగా శాస్త్రవేత్తలు ఎఫ్ఆర్బీని గుర్తించారు. గత పదేళ్లలో 30కిపైగా ఎఫ్ఆర్బీలు నమోదు అయ్యాయి. తాజాగా జూలై 25న ఎఫ్ఆర్బీకి సంబంధించిన సిగ్నల్స్‌ను కెనడియన్ హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్(CHIME) గుర్తించించింది. 2 మిల్లీసెకండ్స్ నిడివి, 700 మెగా హెడ్జ్(ఆలోపే) ఫ్రీక్వెన్సీతో సిగ్నల్స్‌ను టెలిస్కోప్ రికార్డు చేసింది. ఈ ఎఫ్ఆర్బీకి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ.. న్యూట్రన్ నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ పేలుళ్లు, ఏలియన్స్.. వీటిలో ఏదో ఒకటి ఆ విస్పోటనానికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇది సంభవించినప్పటికీ అత్యంత శక్తివంతమైంది కావటంతోనే ఇంత దూరం ప్రయాణించగలిగిందని అంటున్నారు. మరుగుజ్జు పాలపుంత.. ఏలియన్స్ జాడకు సంబంధించి అధ్యయనానికి ఈ ఎఫ్ఆర్బీ కీలకంగా మారే అవకాశం ఉందన్నది వారి వాదన. -
ఐన్‌స్టీన్ సిద్ధాంతమే నిజం..!
వాషింగ్టన్: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రతికూల సంద ర్భాల్లో కూడా నిజమేనని నిరూపితమైందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం బరువుతో సంబంధం లేకుండా విశ్వంలోని ఏ వస్తువైనా ఒకే సమయంలో కిందకు పడిపోతుంది. అయి తే ఐన్‌స్టీన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే సిద్ధాంతా లు మాత్రం తక్కువ బరువున్న వాటితో పోలిస్తే.. అధిక గురుత్వాకర్షణ శక్తి ఉండే న్యూట్రాన్ స్టార్ కిందకు పడే సమయాల్లో తేడా లుంటాయని పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు ఐన్‌స్టీన్ సిద్ధాంతమే మరోసారి నిజమని నిరూపితమైనట్లు అమెరికాలోని గ్రీన్‌బ్యాంక్ అబ్జర్వేటరీ పరిశోధకులు చెప్పారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ భూమికి 4,200 కాంతి సంవత్సరా ల దూరంలో ఉన్న ట్రిపుల్ స్టార్ సిస్టమ్‌ను 2011లో కనుగొంది. ఈ వ్యవస్థలో న్యూట్రాన్ నక్షత్రం, రెండు మరుగుజ్జు నక్షత్రాలున్నాయి. ఈ న్యూట్రాన్ స్టార్ కన్నా లోపలి తెలుపు రంగు మరుగుజ్జు నక్షత్రం తక్కువ బరువుతో ఉంది. ఇతర పరిశోధకుల సిద్ధాంతా లే నిజమైతే.. న్యూట్రాన్ స్టార్, లోపలి తెలుపు రంగు నక్షత్రం వేర్వేరు సమయాల్లో కిందకు పడిపోవాల్సి ఉందని, కానీ అలా జరగలేదని చెప్పారు. -
కొత్త గ్రహం పుట్టింది..!!
బెర్లిన్ : అప్పుడే జన్మించిన కొత్త గ్రహా ఫొటోను యూరోపియన్ సదర్న్ అడ్జర్వేటరీ విడుదల చేసింది. కొన్ని యువ నక్షత్రాల నుంచి వెలువడిన వాయువులు, దుమ్ముధూలి కణాలతో ఈ గ్రహం ఏర్పడినట్లు జర్మనీలోని హీడెల్ బర్గ్‌లో గల మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ పరిశోధకులు వెల్లడించారు. సుదూరంలో ఉన్న గ్రహాల ఫొటోలను తీయగలిగే అతి పెద్ద టెలిస్కోప్ అయిన స్పియర్ (స్పెక్ట్రో-పొలరీమెట్రిక్ హై కాంట్రాస్ట్ ఎక్సోప్లానెట్ రిసెర్చ్)ను ఉపయోగించి భూమికి 370 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ కొత్త గ్రహం ఫొటోను తీయగలిగారు. ఈ గ్రహానికి పీడీఎస్ 70 అని నామకరణం చేశారు. సౌరవ్యవస్థలోనే అత్యధిక వేడి ఈ గ్రహంపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహాన్ని గురించి మరిన్ని వివరాలు సేకరించే పరిశోధనలు జరుగుతున్నాయి. -
వందేళ్లనాటి టెలీస్కోప్..విక్రయానికి యత్నం
సాక్షి, సిటీబ్యూరో: వందేళ్ల నాటి వస్తువేదైనా పురాతన వస్తువుల జాబితాలోకి చేరిపోతుంది. జాతి సంపదగా పరిగణించే వీటిని కలిగి ఉండాలన్నా, అమ్మాలన్నా, కొనాలన్నా ప్రత్యేక అనుమతులు అవసరం. ఇవేవీ లేకుండా 102 ఏళ్ల నాటి టెలిస్కోప్‌ను విక్రయించడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తుల్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని జ్యోతినగర్‌కు చెందిన షేక్ దస్తగిరి కేటీపీఎస్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేసి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడు. కేటీపీఎస్‌లో తనతో పాటు పని చేసిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన మనీష్ విక్టోరియన్ మెరైన్ టెలిస్కోప్‌ను తీసుకువచ్చాడు. 1915లో లండన్‌కు చెందిన డబ్ల్యూ.ఓట్వే అండ్ కంపెనీ తయారు చేసినట్లు ముద్రించి ఉన్న దీన్ని దస్తగిరి వద్ద తాకట్టు పెట్టిన మనీష్ కొంత మొత్తం తీసుకున్నారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో టెలిస్కోప్ దస్తగిరి వద్దే ఉండిపోయింది. ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతడు ఆ టెలిస్కోప్‌ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించాడు. కమీషన్ తీసుకుని విక్రయించడానికి తన స్నేహితులు కె.అజయ్, మహ్మద్ ఖలీల్‌లను సంప్రదించాడు. మంగళవారం ఈ ముగ్గురూ టెలిస్కోప్‌తో చంద్రాయణగుట్ట ప్రాంతంలో సంచరిస్తూ ఖరీదు చేసే వారి కోసం ప్రయత్నిస్తున్నారని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ముగ్గురినీ అరెస్టు చేసి టెలిస్కోప్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. -
గ్రహాంతరవాసుల పిలుపు అందిందా?
రష్యా : గ్రహాంతర వాసుల అన్వేషణలో మానవుడు కీలకమైన అడుగు వేశాడా.. భూమికి 95 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఓ గ్రహం నుంచి బలమైన సంకేతం అందిందా.. అంటే అవుననే అంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు. ఈ సంకేతాన్ని బుద్ధి జీవులు పంపిందని చెప్పలేకున్నా.. మరిన్ని పరిశోధనలకు ఎంతో దోహదపడుతుందని పేర్కొంటున్నారు. గతేడాది రష్యాలోని జెలెన్‌చుక్ స్క్యా ప్రాంతంలో ఉన్న రతన్ 600 రేడియో టెలిస్కోప్ ఈ సంకేతాన్ని గుర్తించింది. ‘హెచ్డీ 164595’ పేరుతో ఉన్న ఓ గ్రహ వ్యవస్థ వైపు నుంచి ఈ సంకేతం అందిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహ వ్యవస్థలో ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలున్నాయని ఇప్పటికే గుర్తించారు. సంకేతం శక్తిని బట్టి సాంకేతికంగా మనకన్నా ఎంతో ముందున్న నాగరికతకు చెందిన వారి నుంచి వెలువడి ఉండొచ్చని భావిస్తున్నారు. సైనికులు ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీలో దాదాపు 11 గిగాహెడ్జ్ల సామర్థ్యంతో అందిన ఈ సంకేతం ఏంటి.. ఇది గ్రహాంతర వాసుల నుంచే వచ్చిందని ఎలాంటి పరిశోధనల ద్వారా నిర్ధారించుకోవచ్చనే అంశాలపై వచ్చే నెలలో మెక్సికోలో జరిగే 67వ అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సమావేశాల్లో చర్చించనున్నారు.