temple
-
తిరుమల శ్రీవారి దర్శనం: చాలా సంతోషం అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ
-
ధర్మపురిని దర్శిస్తే... యమపురి ఉండదట !
ధర్మపురి: ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంగణంలోనే యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి యమధర్మరాజు విగ్రహం దేశంలోనే అరుదైనదిగా చెబుతుంటారు. భక్తులు ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే శ్రీలక్ష్మీనృసింహ, వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. యమధర్మరాజు భరణి జన్మనక్షత్రం సందర్భంగా ప్రతి నెలా ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం, హారతి, మంత్రపుష్పం తదితర పూజలు చేస్తారు. ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా యమ ద్వితీయ వేడుకలు నిర్వహిస్తారు. యమ ద్వితీయ రోజు యమధర్మరాజు నరక ద్వారాలను మూసివేసి తన సోదరి అయిన యమి ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. నరక ద్వారాలు మూసిన సందర్భంగా ఆరోజు మృతిచెందిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. యమధర్మరాజు ఆలయంలో ఆయుష్షు హోమం ఇదీ ఆలయ ప్రాశస్త్యం పూర్వం యముడు తాను చేసిన పాపాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. మనస్సుకు శాంతి కావాలని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. చివరగా నృసింహస్వామిని దర్శించుకునేందుకు ధర్మపురికి చేరుకున్నాడు. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి.. నృసింహుడిని శరణు వేడుకుంటాడు. స్వామి అనుగ్రహం లభించి పాప విముక్తుడయ్యాడు. నృసింహుని కృపతో ఆలయంలో దక్షిణ దిశలో వెలిశాడు. ముందు భక్తులు తనను దర్శించుకున్న తర్వాతే నృసింహుడిని దర్శించుకునేలా వరం పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాగా యముడు గోదావరి నదిలో స్నానం ఆచరించిన చోట యమగుండాలు అనే పేరు వచ్చింది. క్రీ.శ 850– 928 నాటి ఆలయం ధర్మవర్మ అనే రాజు పాలించినందుకు ధర్మపురికి ఆ పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ.శ. 850– 928 నాటి కంటే ముందునుంచే ఉన్నా.. క్రీ.శ. 1422–1436 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. అనంతరం 17వ శతాబ్దంలో నృసింహ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు చరిత్ర చెబుతోంది.మా ఇలవేల్పు లక్ష్మీనృసింహుడు ధర్మపురి లక్ష్మీనృసింహుడు మా ఇంటి ఇలవేల్పు. స్వామివారి దర్శనం కోసం వస్తూనే ఉంటాం. ఇక్కడున్న యమ ధర్మరాజును దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని మా నమ్మకం. – భారతి, భక్తురాలు, కరీంనగర్యముని దర్శనం కోసం వస్తాం ధర్మపురిలోని యమ ధర్మరాజు దర్శనం కోసం వస్తుంటాం. దేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని అంటుంటారు. అందుకే ఏటా యమున్ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో వస్తాం. – సాహితి, భక్తురాలు, మంచిర్యాలఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ధర్మపురిలోని యమధర్మరాజు ఆలయాన్ని దేశంలోనే అరుదైనదిగా భావిస్తారు. అందుకే యముడు, లక్ష్మీనృసింహుని దర్శనం కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. – శ్రీనివాస్, ధర్మపురి ఆలయ ఈవో -
కందినంది : అరుదైన నక్షత్రాకారపు కట్టడం, తనివి తీరని అద్భుతం
అతి పురాతనమైన పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నంది కంది గ్రామంలో ఉంది. స్వయంగా శ్రీరాముడు ఈ రామలింగేశ్వర లింగాన్ని ప్రతిష్టించినట్లు చెప్పుకుంటారు. తర్వాత 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ఈ మహాలింగాన్ని గుర్తించి రామలింగేశ్వర ఆలయంగా నక్షత్ర ఆకారంలో గుడిని కట్టడం మరో విశిష్టత. ఇక్కడ 6 శాసనాలు ఉన్నాయి. ఒక్కొక్క శాసనం ఒక్కొక్క విశిష్టత. ఈ ఆరు శాసనాలలో ఆరు రంధ్రాలు ఉండడం విశేషం. ఈ 6 రంధ్రాల నుండి సూర్యుని కిరణాలు రామలింగేశ్వరునిపై పడడం మరో విశిష్టత. రెండవది, ఈ గుడి గర్భగుడి ఆకారం నక్షత్రం ఆకారంలో ఉండడం మరో విశేషం. ఇక్కడ గజ స్తంభాలు కళ్యాణ చాళుక్యుల శిల్ప కళకు నిదర్శనం. ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలోరామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సంగారెడ్డి నుంచి 15 కి.మీ., మెదక్ నుండి 60 కి.మీ ల దూరంలో ఉన్న నంది కంది ఒక చిన్న గ్రామం నక్షత్ర ఆకారంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది.11వ శతాబ్దంలో వీర చాళుక్యుల ఆధ్వర్యంలో నిర్మించబడిన నందికందిలోని రామలింగేశ్వర దేవాలయం ప్రత్యేకించి దాని ప్రత్యేక ఆకృతికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రతి స్తంభం అద్భుతమైన శిల్పకళతో కనువిందు చేస్తుంది. సెంట్రల్ హాల్ లేదా నవరంగలోని నాలుగు అలంకార స్తంభాలు దాని అత్యుత్తమ నమూనాలలో ఒకటి. బ్రహ్మ, విష్ణు, శివ, నరసింహ, వరాహ, నటరాజ, దేవి మహిషాసుర మర్దిని, సరస్వతి, గజలక్ష్మి వంటి దేవతల రూపాలు స్తంభాల ముఖభాగం, పక్క గోడలను అలంకరించాయి.గర్భగృహంలో ఆలయ ప్రధాన దైవాలైన రామలింగేశ్వర స్వామి లింగరూపం లో కొలువై ఉండగా,పార్వతీ దేవి విగ్రహం అందమైన నల్ల రాతిపై చెక్కబడి ఉంటుంది. ఇతర శిల్పాలలో అప్సరసలు, దిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తి, దర్పణ యోధుల శిల్పాలు ఉన్నాయి. ఆలయంలో రామలింగేశ్వరునికి అభిముఖంగా నల్లరాతితో చెక్కి ఉన్న భారీ నంది విగ్రహం మూల విరాట్టులతో పోటీ పడుతున్నదా అన్నంత అందంగా... అద్భుతంగా... ఆకర్షణీయంగా ఉంటుంది. రామలింగేశ్వర దేవాలయం శిల్పకళా వైభవానికి ఒక ప్రత్యేక నమూనా. దాని అద్భుతమైన శిల్పం చాళుక్యుల శకం నాటి హస్తకళల గురించి చెబుతుంది. చాళుక్య రాజుల నుంచి సంక్రమించిన సంస్కృతి, వారసత్వాన్ని అనుభవించాలనుకుంటే ఈ ఆలయాన్ని మిస్ చేయకూడదు.సుసంపన్నమైన చారిత్రిక ప్రాముఖ్యత, అద్భుతమైన చెక్కడం వల్ల రామలింగేశ్వర దేవాలయం తెలంగాణలోని పురాతన దేవాలయాల జాబితాలో ఉండాలి.ఆలయ వేళలు..ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7:00 వరకుఎక్కడ బస చేయాలి?∙సంగారెడ్డి, సమీప పట్టణం, కొన్ని మంచి వసతి ఎంపికలను అందిస్తుంది. శ్రీ చంద్ర ఫార్మ్స్ – రిసార్ట్స్ న్యూ గ్రాండ్ హోటల్ లాడ్జ్ కొన్ని ప్రసిద్ధ ఎంపికలు.∙అంతేకాకుండా, హైదరాబాద్‌కు చాలా దగ్గరగా ఉండటంతో, పర్యాటకులు హైదరాబాద్ నుంచి డే ట్రిప్‌లలో సంగారెడ్డికి కూడా ప్రయాణించవచ్చు.ఇంకా ఏమేం చూడవచ్చంటే..?మెదక్ కోట, పోచారం ఆనకట్ట రిజర్వాయర్, పోచారం వన్య ప్రాణుల అభయారణ్యం, కోటిలింగేశ్వర ఆలయం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, పురావస్తు మ్యూజియం, కొండాపూర్. కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలికి నిదర్శనం నంది కంది ఆలయం. ఇది క్రీ.శ 1014లో విక్రమాదిత్యుని హయాంలో నిర్మించబడి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయం విలక్షణమైన లక్షణాలలో ఒకటి దాని ప్రవేశ తోరణం, తోరణం అని పిలువబడే ఏడు విలోమ తామర నమూనాలతో అలంకృతమై ఉంటుంది. కమలాల మధ్య ఉన్న ఈ ఖాళీలు ఉదయపు సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి. లోపలి గర్భగుడిలోని శివలింగాన్ని ప్రకాశవంతం చేస్తాయి, ప్రతి అంతరం ఒక ఋతువును సూచిస్తుంది. ఈ ఆలయం బ్రహ్మ, విష్ణు, శివుడు, నరసింహ వంటి హిందూ దేవతలతో ΄ాటు వరాహ, నటరాజ, దేవి మహిషాసురమర్దిని, సరస్వతి, గజలక్ష్మితో సహా క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడింది. ఈ బొమ్మలు నాలుగు కేంద్ర స్తంభాలలో చెక్కబడ్డాయి, ఇవి ఆలయ మండపం లేదా నవరంగాన్ని ఏర్పరుస్తాయి. అదనంగా, ఈ ఆలయంలో దిశాత్మక సంరక్షకులు, సొగసైన బొమ్మలు, పౌరాణిక జీవుల శిల్పాలు ఉన్నాయి. గర్భగుడి నక్షత్రం ఆకారంలో...శిఖరం పద్మాకారంలో రూ పొందించడబడి ఉంటాయి. ఈ నిర్మాణ అంశాలు, కళాకృతుల కలయిక పురాతన హస్తకళ మతపరమైన కళలపై ఆసక్తి ఉన్నవారికి అపూర్వమైన, అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. -
Canada: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు
ఒట్టావా: కెనడాలోని హిందూ దేవాలయంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా బ్రాంప్టన్ త్రివేణి కమ్యూనిటీ సెంటర్ నవంబర్ 17న ఇండియన్ కాన్సులేట్ నిర్వహించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఖలిస్థానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ సెంటర్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంతతికి చెందిన హిందువులు, సిక్కులకు లైఫ్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.బ్రాంప్టన్ త్రివేణి ఆలయానికి బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని, హిందూ సమాజానికి భద్రత కల్పించాలని కమ్యూనిటీ సెంటర్ పీల్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రద్దు చేసినందుకు సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామని, కెనడియన్లు ఇక్కడి దేవాలయాలను సందర్శించడం అసురక్షితమని భావిస్తున్నామని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. Chief of Police with the Peel Regional Police in Canada, Nishan Duraiappah writes to Brampton Triveni Mandir & Community Centre, requesting them to consider rescheduling the upcoming Consular Camp at the Brampton Triveni Mandir & Community Centre on November 17, 2024."We…— ANI (@ANI) November 12, 2024నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలోని కాన్సులర్ క్యాంపుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఇది హింసకు దారితీసింది. ఈ ఉదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కెనడా అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా గత ఏడాది రెండు దేశాల సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు -
KPHB: ఆలయంలో విషాదం
కేపీహెచ్‌బీకాలనీ: గుడిలో ప్రదక్షిణలు చేయటానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెనొప్పితో మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 1లో అమ్మ హాస్టల్లో కానంపల్లి విష్ణువర్ధన్(31) ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇతర భక్తులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా అంతలోనే మృతి చెందాడు. విషయాన్ని ఆయన సోదరి హేమలతకి ఫోన్ ద్వారా తెలియచేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యాదాద్రి పేరు మార్పు..రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
-
‘ట్రంప్ కృష్ణ’ : తెలంగాణాలో ట్రంప్ ఆలయంలో పూజలు, సంబరాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయ ఢంకా మోగించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అనేక దేశాధినేతలు ట్రంప్‌కు అభినందనలు తెలియజేశారు. అయితే తెలంగాణాలోని ఒక పల్లె ప్రజలు మాత్రం ఇంకో అడుగు ముందుకేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కొంతమంది ట్రంప్ అభిమానులు ట్రంప్ గుడిలో ఏకంగా పూజలు చేశారు. ట్రంప్‌కు గుడి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. అదే మరి విశేషం. 2020లోనే ట్రంప్ కోసం గుడి కట్టి విగ్రహం నెలకొల్పాడో వీరాభిమాని. ఆయనే కొన్నె గ్రామానికి బుస్స కృష్ణ. రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ. ట్రంప్‌ను మరోసారి అధ్యక్షుడిగా చూడాలని కలలు గనేవాడట. ట్రంప్ కోసం ఏకంగా ఉపవాస దీక్షలు చేసేవాడట. అయితే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ, 2020 అక్టోబరు 11న కన్నుమూశాడు.అంతేకాదు 2019లో కృష్ణ పెట్టిన ట్వీట్‌కు ట్రంప్ స్పందించడం మరో విశేషం.‘‘మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది.. అని కృష్ణ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీంతో కృష్ణ చాలా సంబరపడి పోయాడట. ట్రంప్ టీ షర్టులనే ధరించేవాడట. అలాగే తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించి పెట్టుకునేవాడు. అందుకు కృష్ణ గ్రామస్తుల హృదయాల్లో ‘ట్రంప్ కృష్ణ’గా ముద్ర వేసుకున్నాడు.Villagers in Telangana Celebrate Trump’s Re-Election by Worshipping His Statue in a Temple built for himIn a unique celebration, villagers in Konne, Jangaon district in Telangana, marked Donald Trump’s re-election as U.S. president by honoring Bussa Krishna’s devotion to the… pic.twitter.com/k1sS5bOPAQ— Sudhakar Udumula (@sudhakarudumula) November 7, 2024 తాజా ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడుగా విజయం సాధించడంతో గ్రామస్తులు తమ ‘ట్రంప్ కృష్ణ’ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడు కదా అని భావించారు. ఆయన లేని లోటు తీర్చేందుకా అన్నట్టుగా కృష్ణ మిత్రులు కొంతమంది బుధవారం ట్రంప్ విగ్రహం వద్ద పూలమాల వేసి సంబరాలు నిర్వహించారు. కొబ్బరికాయలు, ధూప దీప నైవేద్యాలు, సమర్పించి వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
తీర్థాన్ని ఎలా తీసుకోవాలి? ఇతర నియమాలు
గుడికి వెళ్తే ప్రసాదం తీసుకున్నా లేకున్నా తీర్థం తప్పకుండా తీసుకుంటాం. పూజారిగారు మరేదో వ్యాపకంలో ఉన్నా అడిగి మరీ తీసుకుంటాం. తీర్థం అంత అమూల్యమైంది, శ్రేష్ఠమైంది.తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేతిని గోకర్ణంలా (ఆవు చెవి ఆకృతి) పెట్టాలి. అంటే చేతిని డిప్పలా ముడిచి, చూపుడు వేలును బొటనవేలుకు ఆనించాలి. అంతే తప్ప ఒక చేయి, లేదా రెండు చేతులను దోసిళ్ళలా పట్టకూడదు.ఉద్ధరణితో మూడుసార్లు తీర్థం పోసిన తర్వాత కళ్ళకు అద్దుకుని తాగాలి. తీర్థం తాగేటప్పుడు నిలబడకూడదు. కూర్చుని మాత్రమే సేవించాలి. తీర్థం తీసుకునేటప్పుడు జుర్రిన శబ్దం రాకూడదు.మనసులో దేవుని స్మరించుకుంటూ నిశ్శబ్దంగా సేవించాలి.కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలుఅన్నం తింటున్నప్పుడు అన్నాన్ని, ఆ అన్నం పెట్టువారిని తిట్టటం, దుర్భాషలాడటం చేయరాదు. ఏడుస్తూ తినడం, గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదుఒడిలో కంచం, పళ్ళెం పెట్టుకుని అన్నం తినరాదు. భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనటం, గేలిచేయటం నష్టదాయకం. భోజనానంతరం ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవారికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు. -
కెనడాలో ఆలయంపై దాడి.. భారత్ తీవ్ర ఆందోళన
ఢిల్లీ: కెనడాలో ఆలయంపై దాడి జరిగిన నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రత గురించి కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడాలో భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్‌లోని ఒక హిందూ దేవాలయంలో జరిగిన సంఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.‘‘ఉగ్రవాదులు, వేర్పాటువాదులు చేస్తున్న హింసాత్మక చర్యలను ఖండిస్తున్నాం. అన్ని ప్రార్థనా స్థలాలకు తగినంత రక్షణ ఉండేలా చూడాలని కెనడాకు పిలుపునిచ్చింది. హింసకు పాల్పడే వారిపై విచారణ జరుగుతుందని కూడా మేం భావిస్తున్నాం. భారత ప్రభుత్వం.. కెనడా దేశంలో భారత పౌరుల భద్రత, భద్రత గురించి తీవ్ర ఆందోళనగా ఉంది. భారతీయ, కెనడియన్ పౌరులకు కాన్సులర్ సేవలను అందించే చర్యలు కొనసాగుతున్నాయి. ఆలయం లోపల సహాయక చర్యలకు శిబిరం నిర్వహించాం’’అని తెలిపారు.చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి -
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్‌ధామ్‌గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్‌ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కొండపై నుంచి జారిపడటంతో
బెంగళూరు: కర్ణాటకలోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా.. చిక్కమగళూరులోని దేవీరమ్మ కొండపై ఉన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తోపులాట జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడంతో, కొండలపై జారి పడి పలువురికి గాయాలయ్యాయి. మల్లెనహళ్లిలోని దేవీరమ్మ కొండపై ఉన్న గుడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. సందర్శకుల భద్రత కోసం జిల్లా యంత్రాంగం, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ.. భారీ వర్షాల కారణంగా కొండలు తడిగా మారాయని వెల్లడించారు. ఆలయం నుంచి తిరిగి వస్తుండగా పడిపోవడంతో దాదాపు 12మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారని, వారందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.కాగా దీపావళి సందర్భంగా ఏడాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ఇది దేవిరమ్మ అనే కొండపై మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. బాబాబుడంగిరిలోని మాణిక్యధార, అరిసినగుప్పె మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. నరక చతుర్దశికి ముందు దేవీరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. -
కేరళ నీలేశ్వరం ఆలయం సమీపంలో బాణాసంచా పేలుడు..
-
గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు
తిరువనంతపురం:కేరళలోని ఓ గుడిలో వేడుకల సందర్భంగా బాణసంచాకు ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. కాసర్గోడ్ నీలేశ్వరంలోని వీరర్కవు గుడిలో కాళియట్లం ఉత్సవాల్లో సోమవారం(అక్టోబర్ 28) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 150 మంది దాకా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.గాయపడ్డవారిని కాసర్గోడ్, కన్నూర్, మంగళూరులలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. గుడిలో బాణసంచా నిల్వ చేసిన గదికి మంటలంటుకోవడం భారీ అగ్ని ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రమాదస్థలాన్ని సందర్శించారు. బాణసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలోనే వాటిని కాల్చాలన్న నిబంధనను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కలెక్టర్ చెప్పారు. #Kasargod Firecracker room caught fire at veerakaav temple https://t.co/3tqCteOJXf pic.twitter.com/4TU0dkLZOb— 𝖆𝖓𝖚𝖕 (@anupr3) October 28, 2024 ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం -
దేశంలోని ప్రముఖ మహాలక్ష్మి ఆలయాలు
దీపావళి నాడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున భక్తులు మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రముఖ మహాలక్ష్మీదేవి ఆలయాలున్నాయి. వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డెన్ టెంపుల్ (తమిళనాడు)తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని మహాలక్ష్మి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని ‘గోల్డెన్ టెంపుల్’ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా పేరొందింది. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయం చెన్నైకి 145 కిలోమీటర్ల దూరంలో పాలార్ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దీపావళి నాడు వేలాది మంది భక్తులు ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి తరలివస్తుంటారు.మహాలక్ష్మి ఆలయం (ముంబై)ఈ ఆలయం మహారాష్ట్రలోని ముంబైలో గల బి. దేశాయ్ మార్గ్‌లో ఉంది. ముంబై మహాలక్ష్మి దేవాలయంగా ఈ ఆలయం పేరొందింది. బ్రిటీష్ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఛత్రపతి శివాజీకి కలలో లక్ష్మీదేవి కనిపించి, ఈ ఆలయాన్ని నిర్మింపజేసిందని చెబుతారు. ఈ మహాలక్ష్మి ఆలయ గర్భగుడిలో మహాలక్ష్మి, మహాకాళి మహాసరస్వతి విగ్రహాలు కనిపిస్తాయి.మహాలక్ష్మి ఆలయం (కొల్హాపూర్)మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల మహాలక్ష్మి ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో చాళుక్య పాలకుడు కర్ణదేవుడు నిర్మించాడు. షిల్హర్ యాదవ్ దీనిని తొమ్మదవ శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆలయ ప్రధాన గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తయిన మహాలక్ష్మి దేవి విగ్రహం దర్శనమిస్తుంది. ఇది దాదాపు 40 కిలోల బరువు ఉంటుంది. ఈ లక్ష్మీదేవి విగ్రహం సుమారు 7 వేల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు.లక్ష్మీనారాయణ దేవాలయం (ఢిల్లీ)ఢిల్లీలోని ప్రధాన దేవాలయాలలో లక్ష్మీనారాయణ దేవాలయం ఒకటి. ఈ ఆలయాన్ని 1622లో వీర్‌సింగ్ దేవ్ నిర్మించాడు. 1793లో పృథ్వీ సింగ్ ఆలయాన్ని పునరుద్ధరించాడు. అనంతరం బిర్లా కుటుంబం ఈ ఆలయాన్ని 1938లో విస్తరించి, పునరుద్ధరించింది. అందుకే ఈ ఆలయాన్ని బిర్లా టెంపుల్ అని పిలుస్తారు.మహాలక్ష్మి ఆలయం (ఇండోర్)మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గల మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఇండోర్ నడిబొడ్డున ఉన్న రాజ్వాడలో నిర్మించారు. ఈ ఆలయాన్ని 1832లో మల్హర్రావు (II) నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో మూడు అంతస్తులు ఉన్నాయి. అయితే 1933లో అగ్నిప్రమాదం కారణంగా ఆలయం ధ్వంసమైంది. 1942లో ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు తరలివస్తుంటారు.అష్టలక్ష్మి దేవాలయం (చెన్నై)తమిళానడులోని చెన్నైలోని ఇలియట్ బీచ్ సమీపంలో అష్టలక్ష్మి ఆలయం ఉంది. ఈ ఆలయం నాలుగు అంతస్తులలో నిర్మితమయ్యింది. లక్ష్మీదేవి ఎనిమిది రూపాల విగ్రహాలను ఈ ఆలయంలో సందర్శించవచ్చు. ఆలయంలోని రెండవ అంతస్తులో లక్ష్మీ దేవి, విష్ణువు విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.ఇది కూడా చదవండి: దీపావళికి ముందే గ్యాస్ ఛాంబర్లా రాజధాని -
Dream Wedding Destination ఇక్కడ పెళ్లి జరగాలంటే అదృష్టం ఉండాలి!
హరహర మహదేవ శంభో అంటూ చార్ధామ్ యాత్రలో పరవశించిపోతారు భక్తులు. ఈ మార్గంలో చాలా తక్కువ మందికి తెలిసిన మరో విశిష్టమైన ఆలయం కూడా ఉంది. అదే త్రియుగినారాయణ దేవాలయం. ఇది చాలామందికి డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా. దీని గురించి విశేషాలు తెలుసుకుందాం రండి.ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది సుందరమైన గ్రామంలో కొలువు తీర ఉన్నది త్రియుగినారాయణ ఆలయం.దీని విష్ణువు అని భావిస్తున్నారు. ఇది ఎత్తు సముద్ర మట్టానికి 1,980 మీటర్లు (6,500 అడుగుల ఎత్తులో ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూడముచ్చటగా ఉండే పవిత్ర వైష్ణవ దేవాలయం. చార్ధామ్ ప్రదేశాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది కూడా. ఈ ఆలయంలో స్వామివారి నుండి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు, గర్వాల్ హిమాలయాల ఉత్కంఠ భరితమైన దృశ్యాలను వీక్షించవచ్చు. త్రియుగినారాయణ ఆలయం వెనుకున్న కథ ఏమిటి?మూడు యుగాలుగా లేదా "త్రియుగం"గా ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రం ఇది. పార్వతి దేవి , శివుడు వివాహం చేసుకున్న ప్రదేశంగా ఇది ప్రతీతి. ఇక్కడ విష్ణువు ముందు శివపార్వతుల కళ్యాణం జరిగిందట. అందుకే వారి గౌరవార్థం త్రియుగి నారాయణ్ ఆలయం నిర్మించారని చెబుతారు.శ్రీ మహావిష్ణువు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా, తల్లిగా విష్ణుమూర్తి వ్యవహరిస్తే, బ్రహ్మ దేవుడు వివాహంలో పూజారి పాత్రను పోషించాడట. హోమగుండం, బ్రహ్మశిలపార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన హోమగుండం మూడు యుగాలుగా నిర్విరామంగా వెలుగుతోంది. ఈ ఆలయం ముందు పవిత్రమైన అగ్ని అనంతంగా వెలుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని అఖండ ధుని ఆలయం అని కూడా పిలుస్తారు పెళ్లి చేసుకునే జంటలు ఏడడుగులు వేసి (సాత్ ఫేర్)పవిత్ర బంధంతో ఏకమవ్వాలని ఎదురు చూస్తారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కావాలని మొక్కుకుంటారట. ఇక్కడ కలపను నైవేద్యంగా సమర్పించి, విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు. త్రియుగినారాయణ ఆలయంలో బ్రహ్మ శిల ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇదే శివపార్వతుల కళ్యాణానికి వేదిక. దేవాలంయంలోకి అడుగు పెట్టగానే విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి వెండి విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు.దేవతలు వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైన,గౌరవప్రదమైన ప్రదేశంలో వివాహం చేసుకోవాలని ఎవరు కోరుకోరు? దేశ విదేశాలకు చెందిన జంటలు ఇక్కడ ఏడు అడుగులువేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతారు. అలాగే కొత్త జంటలు, వేలాదిమంది భక్తులు, పర్యాటకులు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించి విష్ణువు ఆశీర్వాదం పొందుతారు. కేదార్‌నాథ్‌కు సుమారు 25 కి.మీ.దూరం. అలాగే రుద్రప్రయాగ నుండి 70 కిలోమీటర్ల దూరం. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. -
కేదారేశ్వరుని సేవలో కన్నప్ప టీమ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించారు. కన్నప్పలో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్ నటులు కనిపించనున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్లో పాన్ ఇండియాలో విడుదల చేయడానికి కన్నప్ప టీమ్ సన్నాహాలు చేస్తోంది.తాజాగా కన్నప్ప టీమ్ ఆలయాల సందర్శనకు బయలుదేరింది. మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివుని భక్తుడైన కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని కేదారాశ్వరుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే కన్నప్ప టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధి వ్యూస్ సాధించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.Seeking blessings for an epic tale! @ivishnumanchu and team #Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ@themohanbabu @mukeshvachan @arpitranka_30 @24FramesFactory @avaentofficial @KannappaMovie #TeluguFilmNagar pic.twitter.com/nHwehDTfO7— Telugu FilmNagar (@telugufilmnagar) October 25, 2024 -
సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:సర్వేజన సుఖీనోభవ అన్నది తమ సిద్ధాంతమని,తమ సంస్థల పట్ల సీఎం రేవంత్ ద్వేషబావంతో ఉన్నారని బీజేపీ సీనియర్‌నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం(అక్టోబర్22) ఈటల మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం పేరుతో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తున్నారు.కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి,కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారు.శవాల మీద రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. గుడిపై దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక ఓట్ల రాజకీయం కోసం శాంతియుత ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ ఉన్నాయని,రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతోంది.టెర్రరిస్టులు ఎవరు ? రెచ్చగొట్టేవారు ఎవరు ? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలి.హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది. హిందూ కార్యకర్తల అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్న.చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేము’అని ఈటల హెచ్చరించారు.ఇదీ చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ -
సికింద్రాబాద్‌లో టెన్షన్.. టెన్షన్
రాంగోపాల్‌పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవా లయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచ్చిన సికింద్రాబాద్ బంద్ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపైకి చెప్పు లు, రాళ్లు, కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో నలుగురు యువ కులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగింది. అలాగే ఆందోళనకారులు విసిరిన రాళ్లతో కొంత మంది పోలీసులకు స్వల్ప గాయా లయ్యాయి. ఈ నెల 14న కుమ్మరిగూడ ముత్యా లమ్మ దేవాలయంలో ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ శనివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవా లయం వద్ద నుంచి వేలాది మంది హిందువులు ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఆందోళనకా రులు నినాదాలతో హోరెత్తించారు. కొంతమంది మోండా మార్కెట్ వైపు, మరికొంత మంది కవాడిగూడ వైపు ర్యాలీగా వెళ్లారు. మోండా, ఆల్ఫా హోటల్ మీదుగా ముత్యాలమ్మ దేవాలయం వద్దకు ఆందోళన కారు లు చేరుకున్నారు. వేలాదిమంది ర్యాలీలో పాల్గొ నడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవాల యం పక్కనే మరో వర్గానికి చెందిన ప్రార్థన మందిరం కూడా ఉంది. ఆందోళనకారులు ఆ వైపు వెళ్లేందుకు వస్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకు న్నారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయి చెప్పులు, రాళ్లు, వాటర్ బాటిళ్లు విసరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆలయాల రక్షణలో కాంగ్రెస్ విఫలం: ఛుగ్సాక్షి, న్యూఢిల్లీ: హిందూ దేవాలయాలను రక్షించడంలో, భక్తుల మనోభావాలను గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ మండిపడ్డారు. శనివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు.కేంద్ర మంత్రుల పరామర్శ కంటోన్మెంట్: లాఠీచార్జిలో గాయపడిన పికెట్‌కు చెందిన గుడిపల్లి వెంకట్‌ను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించేందుకు వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని స్థానిక బీజేపీ నేతలకు సూచించారు. -
జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
ముత్యాలమ్మ గుడి ఘటన.. కేటీఆర్ కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోందని, దాడికి పాల్పడ్డ అక్రమార్కులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం(అక్టోబర్ 14) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘ఇలాంటి తెలివితక్కువ చర్యలు మన నగరం యొక్క సహనశీలతకు మచ్చ. గడిచిన నెలరోజులుగా శాంతిభద్రతలు దిగజారుతున్నాయని,దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేటీఆర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉద్రిక్తత -
విహంగ విహారం : నైనితాల్ కేబుల్ కారు, బోట్ షికారు!
నైనితాల్... ఎనభైల నాటి సినిమాల్లో చూసిన ప్రదేశం. కథానుగుణంగా కొన్ని సీన్లను ఇక్కడ చిత్రీకరించేవారు. పాత్రలన్నీ మంకీ క్యాప్, ఉలెన్ స్వెటర్, ఫుల్ షూస్, షాల్‌తో ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పకనే చెప్పే దృశ్యాలుండేవి. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఢిల్లీ నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది. ఆధ్యాత్మికతకు, అడ్వెంచర్‌కి, ప్రశాంతంగా గడపడానికి, నేచర్‌ను ప్రేమించేవారికి అందరికీ, అన్ని వయసుల వారికీ అనువైన టూరిస్ట్ ప్రదేశం ఇది. అయితే పెద్దవాళ్లు మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లడం బాగుంటుంది. హనీమూన్ కపుల్‌కి ఈ నెల మంచి సమయం. రెండు వేల మీటర్ల ఎత్తులో కుమావ్ పర్వత శ్రేణుల్లో ఉంది నైనితాల్. చుట్టూ హిమాలయ పర్వతాలు, దట్టమైన పచ్చని వృక్షాల మధ్య ఓ సరస్సు. పచ్చదనం మధ్యలో ఉండడం వల్లనేమో నీరు కూడా పచ్చలరాశిని తలపిస్తుంది. పౌరాణిక కథల ప్రకారం సతీదేవి కన్ను పడిన ప్రదేశం ఇదని చెబుతారు. ఈ సరస్సు పరిసరాల్లో ఉండే భీమ్తాల్, సాత్తాల్, నౌకుచియాల్తాల్లకు కూడా పౌరాణిక కథనాలున్నాయి. మనదేశంలో హిల్ స్టేషన్లను ఎక్స్ప్లోర్ చేసింది బ్రిటిషర్లే. చల్లని ప్రదేశాలను వేసవి విడుదులుగా డెవలప్ చేశారు వాళ్లు. దాంతో ఇక్కడ బ్రిటిష్ బంగ్లాల మధ్య విహరిస్తుంటే యూరప్‌ను తలపిస్తుంది. నైనితాల్‌లో బోట్ షికార్‌తో΄పాటు యాచింగ్, పెడలింగ్ చేయవచ్చు. ఇంకా గుడారాల్లో క్యాంపింగ్, పర్వతాల మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, పారా గ్లైడింగ్ చేయవచ్చు. ఏ అడ్వెంచర్ చేసినా చేయకపోయినా కేబుల్ కార్ మాత్రం ఎక్కాల్సిందే. కేబుల్ కార్లో వెళ్తూ తెల్లటి మంచు శిఖరాలను పై నుంచి చూడవచ్చు. -
Bangladesh: ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన కాళీమాత కిరీటం చోరీ
బంగ్లాదేశ్‌లోని అమ్మవారి ఆలయంలో కాళీదేవి కిరీటం చోరికి గురవ్వడం కలకలం రేపుతోంది. సత్కిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా చోరికి గురైన ఆ కాళేదేవి కిరీటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు. ఈ కిరీటాన్ని వెండితో తయారు చేయగా.. బంగారు పూత పూశారు. అయితే ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో దొంగతనం చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది.గురువారం రాత్రి ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం పోయినట్లుగా గుర్తించారు.ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనిస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్పందించిన భారత్ఈ పరిణామంపై భారత్ స్పందించింది. ఆలయంలో కాళీమాత కిరీటం దొంగతనంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దొంగిలించిన కిరీటాన్ని తిరిగి పొందాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఢాకాలోని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆలయంలోనికి చెప్పులతో వచ్చిన అధికారి సస్పెండ్
మీర్జాపూర్: యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడి వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (వ్యవసాయం)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.ఆలయంలో పాదరక్షలు ధరించిన ఏడీఓను చూసిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఆలయంలో ఏడీఓ బూట్లు ధరించి ఉండడం చూసిన ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మెజిస్ట్రేట్ సదరు ఏడీఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సమాచార శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలోని వివరాల ప్రకారం విద్యవాసిని ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.ఆలయంలో అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ఏడీఏ ప్రతీక్ కుమార్ సింగ్ షూష్‌తో సహా ఆలయంలోనికి ప్రవేశించారు. ఇది కలకలం సృష్టించింది. జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ ఆదేశాల మేరకు ప్రతీక్ కుమార్ సింగ్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా మాట్లాడుతూ చెప్పులు ధరించి, గుడి మెట్లు ఎక్కుతున్న అధికారిని చూసి, తాను ఆలయంలో నుంచి బయటకు పంపించివేశానని తెలిపారు. ఇది కూడా చదవండి: దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు -
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
బుర్హాన్పూర్: మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు.శరన్నవరాత్రులలో రేణుకా మాత ఆలయ సమీపంలో ప్రతీయేటా జాతర నిర్వహిస్తారు. ఈ జాతర 9 రోజుల పాటు ప్రతీరోజూ ఉదయం 5:00 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఆలయంలో అమ్మవారికి మూడుసార్లు హారతి నిర్వహిస్తారు. నవరాత్రులలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలువుతుంది. రేణుకా మాత ఆలయ పూజారి జై శుక్లా మాట్లాడుతూ తమ కుటుంబం ఏడు తరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నదన్నారు. ఈ ఆలయం సుమారు వెయ్యేళ్లనాటిదని, పెళ్లికానివారు రేణుకామాతను దర్శించుకుంటే వారికి త్వరగా వివాహమవుతుందనే నమ్మకం స్థానికుల్లో ఉన్నదన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని పలు జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ! -
పురాతన శైలపుత్రి ఆలయానికి భక్తుల క్యూ
వారణాసి: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో తొలి రోజున శైలపుత్రి రూపాన్ని పూజిస్తారు.శివుని నగరంగా పేర్కొనే వారణాసిలో శైలపుత్రి అమ్మవారి పురాతన ఆలయం ఉంది. నవరాత్రుల తొలిరోజున ఈ ఆలయంలో ఎంతో ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ పురాతన ఆలయం వారణాసి సిటీ స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉంది. ఈ శైలపుత్రి ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు.ఆలయ పూజారి మీడియాకు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథను తెలిపారు. శైలపుత్రి అమ్మవారు శైలరాజు ఇంట్లో జన్మించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, శైలపుత్రి ఎంతో ప్రతిభావంతురాలవుతుందని తెలిపారట. శైలపుత్రికి చిన్నప్పటి నుంచే మహాశివునిపై ఇష్టం ఏర్పడింది. ఆమె పెరిగి పెద్దయ్యాక కాశీకి చేరుకుని, శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసింది. కుమార్తె కోసం వెదుకుతూ కాశీ చేరుకున్న శైలరాజు కూడా తపస్సు ప్రారంభించాడని చెబుతారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో శైలపుత్రితో పాటు ఆమె తండ్రి శైలరాజు ఆలయాలు నిర్మితమయ్యాయి. శైలపుత్రి ఆలయంలో మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి