Toor dal
-
రూ.67కే కందిపప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై కందిపప్పును పంపిణీ చేస్తూ ప్రభుత్వం పేదలకు ఊరటనిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.110కి పైగా ఉండటంతో సామాన్యులపై భారాన్ని తగ్గించేలా ఒక్కో కార్డుదారుడికి కిలో రూ.67కే ప్రభుత్వం అందిస్తోంది. అవసరమైన నిల్వలను కొత్త జిల్లాల వారీగా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో పారదర్శకంగా సరఫరా చేస్తోంది. నెలకు 6,500 టన్నుల వినియోగం రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున పంపిణీ చేసేందుకు నెలకు 14,542 టన్నుల కందిపప్పు అవసరం అవుతుంది. ఐసీడీఎస్ పథకానికి మరో 1,097 టన్నులను వినియోగిస్తున్నారు. సగటున నెలకు రేషన్ దుకాణాల ద్వారా కేవలం 6,000 నుంచి 6,500 టన్నులు మాత్రమే విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మండల నిల్వ కేంద్రాల్లో (ఎంఎల్ఎస్ పాయింట్లు) 1,771 టన్నుల సరుకు అందుబాటులో ఉంది. దీనికితోడు మరో 25 వేల టన్నుల సేకరణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు ఖరారు చేసి సరఫరాకు అనుమతులు ఇచ్చింది. దీంతో మొత్తం 26,770 టన్నులు కందిపప్పు నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ లెక్కన మూడు నెలల పాటు ఎటువంటి అవరోధం లేకుండా సబ్సిడీపై కందిపప్పు అందించనున్నారు. పంచదార కిలో రూ.34 రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అర కిలో ప్యాకెట్ల రూపంలో పంచదారను సబ్సిడీపై అందిస్తోంది. ఒక్కో కార్డుకు గరిష్టంగా కిలో వరకు రూ.34కు ఇస్తుండగా మరో మూడు నెలల వరకు సరఫరాకు అంతరాయం లేకుండా నిల్వలను సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో 4,442 టన్నుల పంచదార నిల్వలు అందుబాటులో ఉండగా.. మరో 15,335 టన్నుల సేకరణకు టెండర్లను ఖరారు చేశారు. ప్రతి నెలా 5,500–6000 టన్నుల వరకు వినియోగం ఉంటోంది. 3 నెలల వరకు ఢోకా లేదు రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మూడు నెలల పాటు సబ్సిడీపై కందిపప్పు, పంచదార అందించేందుకు అవసరమైన నిల్వలను సమకూర్చాం. ఇప్పటికే టెండర్లు పూర్తవగా.. వేగంగా సరుకును సరఫరా అయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. జిల్లాల్లో ఎక్కడైనా అత్యవసరంగా స్టాక్ అవసరమైతే పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేసేలా అధికారులను ఆదేశించాం. దాదాపు అన్ని మండల స్థాయి నిల్వ కేంద్రాలకు సరుకును అందుబాటులో ఉంచాం. వినియోగదారులకు రేషన్ పంపిణీలో జాప్యం జరగనివ్వం. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల శాఖ -
కందులు.. ఆల్‌టైమ్ రికార్డు ధర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కందులు పంటకు గిరాకీ ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో కందులు క్వింటాలుకు రూ.7,200 వరకు ధర లభిస్తోంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు కావడం విశేషం. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కందులుకు ఇంతటి ధర లభించలేదు. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో గత ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన కందులు పంట చెప్పుకోదగినంతగా దిగుబడులు రాకపోవడంతో దిగాలు పడిన రైతులకు మంచి ధర పలుకుతుండడం సంతోషాన్నిస్తోంది. కందులుకు క్వింటాలుకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రూ.ఆరు వేలు కాగా గత నెల వరకు మార్కెట్లో రూ.5,000 నుంచి రూ.5,600 మధ్య ధర కొనసాగింది. ఇప్పుడీ ధర అమాంతం రూ.ఏడు వేలు దాటింది. రైతుల వద్ద నుంచి కందులు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. 5,44,220 ఎకరాల్లో సాగు.. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 5,44,220 ఎకరాల్లో కందుల పంటను రైతులు సాగు చేశారు. సాధారణంగా దీన్ని అంతర పంటగా సాగు చేస్తారు. అంతర పంటగా సాగు చేస్తే ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు, ఒకే పంటగా సాగు చేస్తే 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో దిగుబడులు కాస్త తగ్గాయి. కొన్ని జిల్లాల్లో ఎకరానికి 4–5 క్వింటాళ్లు దిగుబడి రాగా, మరికొన్ని జిల్లాల్లో 3–4 క్వింటాళ్లకు మించి రాలేదు. అదే సమయంలో నాణ్యత కూడా తగ్గింది. గత డిసెంబర్ నుంచి పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ మార్చి రెండో వారం వరకు ఇవి కొనసాగుతాయి. గత డిసెంబర్ 2వ వారం నుంచే మార్కెట్‌కు కందులు వస్తున్నాయి. వచ్చే మే నెల రెండోవారం వరకు కూడా వచ్చే అవకాశముంది. పోటీ పడి కొంటున్నారు.. కందులు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.6 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ నెలాఖరు వరకు కందులుకు మార్కెట్లో పెద్దగా రేటు లేదు. క్వింటాల్ రూ.5,000–5,600 మధ్య ఉండింది. గడిచిన నెల రోజులుగా ఊహించని రీతిలో ధర పెరగడం మొదలైంది. నాణ్యతను బట్టి రూ.6,800 నుంచి రూ.7,200కుపైగా పలుకుతోంది. రాష్ట్రంలో కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు మార్కెట్లకు పెద్ద ఎత్తున కందులు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఇస్తామంటూ వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. ప్రభుత్వ చర్యల వల్లే.. నిజానికి మూడేళ్లుగా కందులుకు మార్కెట్లో సరైన ధర పలకలేదు. అయితే కనీస మద్దతు ధరలు లభించని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఆ మేరకు గతేడాది మార్క్‌ఫెడ్ ద్వారా కందులును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయించింది. గతేడాది మార్కెట్లో కందులుకు రూ.4,500కు మించి ధర పలకలేదు. దాంతో ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,800 చొప్పున కనీస మద్దతు ధరను నిర్ణయించడమేగాక.. 394 కోట్ల రూపాయలు వెచ్చించి 61,772 మెట్రిక్ టన్నుల కందులును మార్క్‌ఫెడ్ ద్వారా గతేడాది కొనుగోలు చేసింది. అంతేగాక ఈ సీజన్లో కందులుకు కనీస మద్దతు ధరను రూ.6 వేలుగా నిర్ణయించి.. అంతకన్నా తక్కువకు విక్రయించవద్దని, ఒకవేళ మార్కెట్లో ధర పెరగకుంటే ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి కొంటుందని రైతులకు అభయమిచ్చింది. ఇది రైతుల్లో భరోసాను నింపగా.. వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి కొంటుండడంతో కందులుకు రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. ధర ఇలా పెరగడం ఇదే తొలిసారి.. నా పొలంలో పూర్తి కంది పంట సాగు చేశా. మొన్నటిదాకా క్వింటాలు ధర రూ.5,600కు మించి పలకలేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.6000గా ప్రకటించింది.. కంగారు పడొద్దు.. మార్కెట్లో రేటు పెరుగుతుంది.. ఒకవేళ పెరగకపోతే కనీస మద్దతు ధరకు కొంటామని అధికారులు చెప్పారు. ఆ మేరకు ఓపిక పట్టాం. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ.7,200 ధర పలుకుతోంది. దిగుబడి తగ్గినా.. ధర పెరగడంతో ఊరట లభించింది. ఈ ధర ఇలాగే ఉంటే రైతుకు గిట్టుబాటవుతుంది. –సి.వలీసాహెబ్, చింతకుంటపల్లి, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే రైతుకు మంచి ధర... ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మార్కెట్లో కందులు, పెసలు ధరలు పెరుగుతున్నాయి. కనీస మద్దతు ధర దక్కని ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. ఈ కారణంగానే వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడుతోంది. ఈ కారణంగానే కందులు క్వింటాలు ధర రూ.7,200కు చేరింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. –పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
కందిపప్పు రాలే..!
నిజామాబాద్, ఇందూరు/మోర్తాడ్: కరోనా ప్యాకేజీలో భాగంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా అందజేస్తున్న కందిపప్పు జూన్ నెలలో అందే పరిస్థితి కనిపించడం లేదు. రెండు, మూడు రోజుల్లో రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభం కానుండగా, స్టాక్ మాత్రం ఇంత వరకు జిల్లాకు చేరుకోలేదు. దీంతో కందిపప్పు పంపిణీపై స్పష్టత కరువైంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు ఆకలితో ఉండకూడదని ఏప్రిల్, మే నెలలో రేషన్ కార్డులో ఉన్న ఒక్కో లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం కోటా కింద తెల్ల రేషన్ కార్డుకు కిలో చొప్పున కందిపప్పును మూడు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఏప్రిల్‌లో కూడా కందిపప్పు ఇవ్వాల్సి ఉండగా, స్టాక్ రావడంలో ఆలస్యం అయ్యింది. దీంతో మే నెలలో ఏప్రిల్ కోటాను లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో 3,90,687 రేషన్ కార్డులుండగా, 12,92,682 మంది లబ్ధిదారులున్నారు. మే నెలలో కార్డుకు కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 390 మెట్రిక్ టన్నులు లబ్దిదారులకు అందజేశారు. ప్రస్తుతం జూన్ నెలలో మే, జూన్లకు సంబంధించి లబ్ధిదారులకు రెండు కిలోల చొప్పున కందిపప్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ స్టాక్ రాలేదు. జిల్లా సివిల్ సప్లై అధికారులు రాష్ట్ర అధికారులను సంప్రదించినా వారు కూడా స్పష్టత ఇవ్వలేదు. దీంతో కందిపప్పు పంపిణీ విషయం ప్రశ్నార్థకంగా మారింది. కందిపప్పుపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదని సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం అభిషేక్‌సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. అయితే, బియ్యం మాత్రం ఇప్పటికే జిల్లాలో దాదాపు సగం రేషన్ దుకాణాలకు చేరుకుంది. గత రెండు నెలలు ఇచ్చినట్లుగానే ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు డీఎస్వో వెంకటేశ్వరరావు తెలిపారు. రూ.1,500 సాయం నిలిపివేత.. కరోనా సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రేషన్ కార్డుకు రూ.1,500 చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయాన్ని జమ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3.90 లక్షల కుటుంబాలరు రూ.58.50 లక్షల వరకు సాయం అందింది. అయితే, జూన్ నెల నుంచి ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. -
పప్పు వచ్చింది..! ఉచితంగా పంపిణీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రేషన్‌కార్డు దారులకు వచ్చేనెలలో కందిపప్పు అంజేయనున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో పేద కుటుంబాలు ఆహారానికి ఇబ్బంది పడొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు బియ్యంతోపాటు అదనంగా కిలో చొప్పున కందిపప్పు కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు సాంత్వన కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌తోపాటు ఈ నెలలోనూ ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున పంపిణీ చేశారు. అలాగే రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందింది. వచ్చేనెలలో బియ్యంతోపాటు కిలో కందిపప్పు కూడా పంపిణీ చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 524 మెట్రిక్ టన్నుల పప్పు జిల్లాలోని 919 రేషన్ దుకాణాలకు చేరుకుంది. రెండు నెలలు ఆలస్యంగా.. వాస్తవంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రేషన్‌కార్డు దారులకు బియ్యంతోపాటు ఉచితంగా కందిపప్పు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే, నాఫెడ్ నుంచి సకాలంలో పప్పు సరఫరా కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ఏప్రిల్, మే నెలల కోటా జిల్లాకు చేరలేదు. జిల్లాకు కేటాయించిన 524 మెట్రిక్ టన్నుల కోటా రెండు నెలల ఆలస్యంగా తాజాగా జిల్లాకు వచ్చింది. ఈ మొత్తాన్ని ఆయా రేషన్ దుకాణాలకు చేరవేశారు. దీన్ని జూన్ నెల కోటాగా యంత్రాంగం పరిగణిస్తున్నట్లు తెలిసింది. అయితే ఏప్రిల్, మే నెలకు సంబంధించిన కోటా తిరిగి వస్తుందా?రాదా? అనే విషయంపై స్పష్టత లేదు. మొత్తం మీద వచ్చేనెలలో జరగనున్న కందిపప్పు పంపిణీతో జిల్లాలోని 5.24 లక్షల కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. -
రేషన్ దుకాణాల్లో నాణ్యతలేని కంది పప్పు
-
కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!
సాక్షి, హైదరాబాద్ : మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. అయితే ఈ లాక్డౌన్లో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని తెలంగాణ ప్రభుత్వం రేషన్ సరుకులను రెట్టింపు చేసింది. బియ్యంతో పాటు ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కొంత మంది రేషన్ దారులకు వరంగా మారింది. నాసిరకమైన కందిపప్పును ప్రజలకు అంటగట్టి నాణ్యమైన కందిపప్పును బయట మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా రామంతపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో రెండు రకాల కందిపప్పును ప్రజలకు అంటగడుతున్నారు. నాసిరకమైన కందిపప్పు అయితే ఈ క్రమంలో ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ రేషన్ షాపులో నాసిరకమైన కందిపప్పును సరఫరా చేస్తుండటంపై ఓ వ్యక్తి ప్రశ్నించగా ఆ రేషన్ దుకాణదారుడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ‘ఇక్కడ నచ్చకుంటె అమరావతికి వెళ్లిపో’ అంటూ జవాబిచ్చాడు. దీంతో ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అయితే ప్రజలకు అందించే రేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడని విషయం తెలిసిందే. నాణ్యమైన సరుకులను ఇంటింటికి అందిస్తూ అక్కడి ప్రజల మన్ననలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొందుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఆ రేషన్ దుకాణదారుడు నచ్చకుంటే అమరావతి వెళ్లమని అన్నారని అక్కడి వారందరూ అనుకుంటున్నారు. ఇక నాసిరకం కందిపప్పుపై రేషన్ దుకాణదారుడిని మీడియా ప్రశ్నించగా ఇదంతా సివిల్ సప్లయి గోడౌన్లలో జరుగుతుందని తమకేమి సంబంధంలేదని అతడు పేర్కొన్నాడు. నాణ్యతగల కంది పప్పు -
పప్పు ఉడ్కలే!
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత కార్డుదారులకు ఈ నెల మొదటి వారంలో ఉచిత కంది పప్పు పంపిణీ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటివరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు కందిపప్పు కోటా సరఫరా జరగలేదని తెలుస్తోంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల ఉచిత బియ్యంతో పాటు అదనంగా కందిపప్పు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మే నెల రేషన్ సరుకుల కోటా కింద ఉచిత బియ్యం, కంది పప్పుతో పాటు గోధుమలు, చక్కెర కోటాలను కేటాయించింది. ఇప్పటికే ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు బియ్యం, గోధుమలు, చక్కెర కోటా సరఫరా జరిగినా.. కందిపప్పు కోటా ఇంకా సరఫరా జరగలేదని డీలర్లు పేర్కొంటున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు ఉచిత కందిపప్పు కోటా కేటాయించినా.. మార్క్‌ఫెడ్ నుంచి పౌర సరఫరాల గోదాములకు కందిపప్పు సరఫరా నత్తకు నడక నేర్పిస్తోంది. పూర్తి స్థాయిలో కంది పప్పు కోటా గోదాములకు చేరే సరికి మరో రెండు మూడు రోజులు పడుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక గోదాముల నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు సరఫరా జరిగి పంపిణీ ప్రారంభమయ్యే సరికి మరి కొంత అలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిలో చొప్పున పంపిణీ.. ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుకు ఉచిత బియ్యంతో పాటు కిలో కంది పప్పు పంపిణీ జరగనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి రూ. 105 నుంచి రూ.120 వరకు పలుకుతోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత పంపిణీ కారణంగా కంది పప్పు కోసం డిమాండ్ అధికంగానే ఉంటోంది. మొదటి వారంలో కంది పంపిణీ సరఫరా లేని కారణంగా లబ్ధిదారులకు కేవలం ఉచిత బియ్యం మాత్రమే పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు కంది పప్పు సరఫరా తర్వాత లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఆహార భద్రత కార్డు దారులు మొదటి వారంలో ఉచిత బియ్యం కోటాను తీసుకున్నా.. ఆ తర్వాత ఉచిత కంది పప్పు కోటాను డ్రా చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కందిపప్పు పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. 16లక్షలకుపైగా కుటుంబాలకు.. గ్రేటర్ పరిధిలో ఆహార భద్రత కార్డు కలిగిన సుమారు 16 లక్షల 930 కుటుంబాలు ఉన్నాయి. గత నెల మాదిరిగానే ఈ నెల కూడా ప్రతి కార్డుదారుల్లోని కుటుంబ సభ్యుడి (యూనిట్)కి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారు. అదనంగా ఈ నెల కార్డుదారుడికి కిలో చొప్పున ఉచితంగా కందిపప్పు అందిస్తారు. సబ్సిడీ ధరపై రెండు కిలోల గోధుమలు పంపిణీ చేస్తారు. మరోవైపు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం గత నెల మాదిరిగానే రూ.1500ను బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. -
ఫ్రీగా కందిపప్పు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రేషన్ షాపుల్లో ఉచితంగా కిలో కందిపప్పు పంపిణీ చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే నెల బియ్యం కోటాతో పాటు పప్పును కూడా అందించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేసిన విషయం విదితమే. తాజాగా వచ్చే నెలలో కిలో చొప్పున కంది పప్పు పంపిణీ చేయనున్నారు. మే నెల మొదటి వారంలో బియ్యంతో పాటు కార్డుకు కిలో చొప్పున పప్పును అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మన జిల్లాకు కందిపప్పు స్టాక్ చేరుకుంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో బస్తాలను నిలువ ఉంచారు. నాలుగైదు రోజుల్లో బియ్యం పంపిణీ ప్రారంభం కానున్న సందర్భంగా లారీల్లో బియ్యం బస్తాలతో పాటు కందిపప్పు బస్తాలను కూడా రేషన్ దుకాణాలను రవాణా చేసే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం తెల్ల రేషన్ కార్డులు 3,90,687 ఉన్నాయి. కార్డుకు కిలో చొప్పున జిల్లాకు 390 మెట్రిక్ టన్నుల కోటా అవసరం అవుతోంది. అయితే లూజ్‌గానే డీలర్లు పప్పును తూకం వేసి ఇవ్వనున్నారు. మొన్నటిలాగే బియ్యం పంపిణీ... మే నెలలో కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకు 16 వేల మెట్రిక్ టన్నుల కోటా అవసరం కానుంది. మొన్నటిలాగే ఇప్పుడు కూడా మే నెల మొదటి వారం నుంచి లబ్ధిదారులకు టోకెన్ పద్ధతిలో బియ్యం ఇవ్వనున్నారు. బియ్యం, కందిపప్పు బస్తాలను రేషన్ దుకాణాలకు తరలించడానికి లారీల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లయ్ అధికారులు వెల్లడించారు. -
ఏపీ: పల్లెల్లో పంటల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో పంటల కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం శనగలు, కందులు, జొన్న, మొక్కజొన్న, పసుపు, అపరాల కొనుగోలుకు మండల స్థాయిలో కేంద్రాలను ఏర్పాటుచేసింది. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు తమ పంటలను ఈ కేంద్రాలకు తరలించడానికి ఇబ్బందిపడే అవకాశాలు ఉండటంతో గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో 786 కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 700 కేంద్రాలను పెట్టగా.. మిగిలినవి రెండు మూడ్రోజుల్లో ఏర్పాటుకానున్నాయి. అంతేకాక.. ► ఈ కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చేసేందుకు రైతుల పేర్లను అధికారులు ముందుగా నమోదు చేసుకోవాలి. ► నిర్ణయించిన సమయం, తేదీల్లోనే రైతులు తమ పంటలను ఈ కేంద్రాలకు తరలించాలి. ► అలాగే, గతంలో రెండు, మూడు ఏజెన్సీలే పంటలను కొనుగోలు చేస్తే.. ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్కారు అనుమతిస్తోంది. మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయం ► రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు 350 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ► 1.50 లక్షల మెట్రిక్ టన్నుల జొన్న కొనుగోలుకు 95 కేంద్రాలను ఏర్పాటుచేసింది. ► శనగలకు 185, కందులకు 140, పసుపుకు 11, అపరాలకు 5 కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ► ఇక క్వింటాల్ మొక్కజొన్నకు రూ.1,760 లు.. క్వింటాల్ జొన్నకు రూ.2,550లను ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ► ఇప్పటి దాకా రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగల్లో 14,500 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్ పౌర సరఫరాల శాఖకు సరఫరా చేస్తోంది. ► పంటను కొనుగోలు చేసే ఏజెన్సీలను వాటి ట్రాక్ రికార్డు ఆధారంగా ఖరారు చేశారు. గ్రామస్థాయిలో ఏర్పాట్లు పూర్తి: రద్యుమ్న, మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గ్రామస్థాయిలో చర్యలు తీసుకున్నాం. వర్షాలవల్ల పంట దెబ్బతినకుండా కొనుగోలు చేసిన పంటలను మండల కేంద్రాల్లోని గోదాములకు తరలిస్తాం. హమాలీల సమస్య లేకుండా వ్యవసాయ కార్మికులను ఏజెన్సీలు వినియోగించుకునే ఏర్పాటు కూడా చేశాం. కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు రైతులు ముందుగానే పేర్లను నమోదు చేసుకోవాలి. కరోనా: రోజుకు వెయ్యి పరీక్షలు! -
రైతులకు ధరల 'శన'గ
గుంటూరు, నరసరావుపేట రూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లోని శనగల కొనుగోలు కేంద్రానికి బుధవారం రైతులు పెద్ద ఎత్తున శనగల నిల్వలను తీసుకొచ్చారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా శనగల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌యార్డ్‌లో ప్రారంభించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ డీసీఎంఎస్ ద్వారా ఈ కొనుగోళ్ల కేంద్రాన్ని నిర్వహిస్తోంది. నరసరావుపేట మండలంతో పాటు ముప్పాళ్ల, సత్తెనపల్లి మండలాలను ఈ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది శనగ పంటను నరసరావుపేట మండలంతో పాటు ముప్పాళ్ల మండలంలో పెద్ద ఎత్తున సాగుచేశారు. మొదటి విడతగా 100 టన్నుల కొనుగోళ్లకు ఈ కేంద్రానికి అనుమతించారు. వారం రోజుల్లోనే 100 టన్నులను రైతులను నుంచి కొనుగోలు చేశారు. రైతుల వద్ద పెద్ద ఎత్తున శనగ నిల్వలు ఉండటంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంబంధిత మంత్రి కురసాల కన్నబాబుతో పాటు జిల్లా అధికారులతో మాట్లాడి మారో 100 టన్నుల కొనుగోలు చేసేవిధంగా అనుమతులు తీసుకొచ్చారు. మార్కెట్లో క్వింటా శనగలు రూ.3 వేల నుంచి రూ.3,500ల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.4,875గా ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.1500 వరకు ఎక్కువ ధర వస్తోంది. దీంతో శనగలను కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రాప్ చేయించుకున్న రైతులు ధృవీకరణ పత్రాలను కొనుగోలు కేంద్రంలోని సిబ్బందికి అందజేస్తే టోకెన్ ఇస్తున్నారు. దీని అధారంగా రైతులు తమ నిల్వలను నిర్ణయించిన తేదీలలో కొనుగోలు కేంద్రంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోజూ దాదాపు 200 క్వింటాళ్ల శనగలను కేంద్రం నుంచి కొనుగోలు చేస్తున్నారు. కేటాయింపులు పెంచాలి నరసరావుపేట, సత్తెనపల్లి రెండు నియోజకవర్గాలకు ఒకటే కొనుగోలు కేంద్రం కావడంతో రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికే ఈ కేంద్రం నుంచి 100 టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. మరో 100 టన్నులు కొనేందుకు రైతులకు టోకెన్లు అందజేశాం. మరో రెండు రోజుల్లో టోకెన్లు పొందిన రైతుల నుంచి కొనుగోళ్లు పూర్తవుతాయి. రైతుల వద్ద ఇంకా శనగ నిల్వలు ఉన్నాయి. కేంద్రానికి కొనుగోళ్లు కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. – ఎస్ఏ హనీఫ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ -
కందులు కొంటాం రండి!
సాక్షి, హైదరాబాద్: కందుల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్క్‌ఫెడ్ ద్వారా అదనంగా 56 వేల మెట్రిక్ టన్నుల కందు లు కొనుగోలు చేయడానికి అనుమతినిస్తూ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు 47,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. మరో 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం స్పందించకపోవడంతో తానే కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం, రాష్ట్రం వాటాలు కలిపి మొత్తం 1,03,500 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోళ్లకు అనుమతి లభించినట్లయింది. ‘కంది.. రంధి’శీర్షికతో ‘సాక్షి’ఈ నెల 21న కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. రూ.381 కోట్లు కేటాయింపు.. అదనపు కందుల కొనుగోలు కోసం అనుమతించాలని కోరుతూ మార్క్‌ఫెడ్ ఎండీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం 2019–20 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర వాటా కింద 56 వేల మెట్రిక్ టన్నుల కంది కొనుగోళ్లను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొక్కజొన్న కొనుగోలు కోసం మంజూరు చేసిన రూ.1,500 కోట్ల రుణా ల్లో మిగిలిన రూ.381 కోట్లను కందుల కొనుగోలుకు వినియోగించుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వాటా కందుల కొనుగోలు సందర్భంగా ఎలాంటి ఆర్థిక నష్టాలు వచ్చినా అంతే మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. కందుల కొనుగోళ్లు నేరుగా రైతుల నుంచే చేపట్టాలని, మధ్య దళారులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆన్లైన్లో పేరు లేకున్నా కొనాల్సిందే.. కంది కొనుగోళ్లకు సంబంధించి సజావుగా సేకరించడానికి తామిచ్చే మార్గదర్శకాలను పాటించాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన వారికి లేఖ రాశారు. వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న ఆన్లైన్ పోర్టల్‌లో కంది రైతుల పేర్లు లేకపోయినా, కందులు కొనాలని ఆయన ఆదేశించారు. నిజమైన రైతులను గుర్తించడానికి జిల్లా స్థాయి ప్రొక్యూర్మెంట్ కమిటీ (డీఎల్‌పీసీ) సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏఈవో, వీఆర్వోలు ఇచ్చే ధ్రువీకరణతో మండల వ్యవసాయాధికారి ధ్రువీకరణ ఉంటేనే ఆయా రైతుల కందులను కొనాలని ఆయన ఆదేశించారు. సేకరణ కేంద్రాల నుంచి 50 కిలోమీటర్ల లోపల గోదాముల్లో నిల్వ చేయాలన్నారు. నిబం ధనల ప్రకారం వ్యవహరించకుంటే కఠిన చర్యలుంటాయని ఆయన వ్యవసాయాధికారులను హెచ్చరించారు. వ్యవసాయ, రెవెన్యూ, సహకార, మార్కెటింగ్, పోలీస్ విభాగాల సమన్వయంతో జిల్లా స్థాయి విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు చేయాలన్నారు. -
కాళ్లు మొక్కుతాం.. కందులు కొనండి
షాద్‌నగర్ టౌన్: కందులను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని.. దళారులతో చేతులు కలిపి దందా నిర్వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ రైతులు ఆరోపించారు. తాము తెచ్చిన కందులను కొనుగోలు చేయమని కొనుగోలు కేంద్రం ఇన్చార్జి నర్సింహారెడ్డి కాళ్లు మొక్కారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ కందులను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట పాత జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. కాగా ఘటనపై విచారణ చేపడతామని ఐపీఎస్ అధికారిణి రితిరాజ్ రైతులకు హామీ ఇచ్చారు. -
పోలీసులు చెప్తే టోకెన్లు ఇస్తారూ.. మేము చెప్తే ఇవ్వరా?
నారాయణపేట: కంది పంటను అమ్మేందుకు కేంద్రానికి వస్తే టోకెన్లు లేవని రైతులను తిప్పిపంపిస్తున్నారని, రైతులు రోడ్డెక్కారని పోలీసులు వస్తే టోకెన్లు ఇస్తున్నారని, మార్కెట్ ప్రతినిధులు, అధికారులు చెబితే ఎందుకివ్వలేదంటూ డీసీఎంఎస్ అధికారులను జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ సురేఖ ప్రశ్నించారు. నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంది కొనుగోలు కేంద్రంలో టోకెన్లు ఇవ్వడంలేదని మరికల్, ధన్వాడ రైతులు జెడ్పీ వైస్ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె నేరుగా మార్కెట్‌యార్డుకు చేరుకుంది. మార్కెట్ కార్యాలయానికి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను పిలిపించి చర్చించారు. ఇప్పటి వరకు తమ ఇచ్చిన కోటా అయిపోయిందని టోకెన్లు ఇవ్వడం కుదరదని తమ అధికారులతో మాట్లాడి ఇస్తామంటూ డీసీఎంఎస్ అధికారులు ఆమెకు వివరించారు. ఫిబ్రవరి 28వరకు కొనుగోలు చేస్తామని ఆపై గడువు పెరుగుతుందో లేదో తమకు తెలియదని సమాధానమిచ్చారు. డీసీఎంఎస్ అధికారులపై సీరియస్.. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన టోకెన్ల వరకు కొనుగోలు చేస్తారు సరే. కానీ ధన్వాడ, మరికల్ రైతుల పరిస్థితి ఏంటని డీసీఎంఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎంతమంది ఆ రోజు వరకు కందులు తీసుకొస్తారో అందరివి కొనాల్సిందేనంటూ పట్టుబట్టారు. అవసరమనుకుంటే ఎమ్మెల్యేతో చెప్పిస్తామని నిర్వాహకులు భరోసానిచ్చారు. ఈ మేరకు గతేడాది ఈ మార్కెట్లో జరిగిన వ్యవహరంతో దాదాపు రూ. 20 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చిందని అందుకే టోకెన్లు ఇచ్చి నిదానంగా కొనుగోలు చేస్తున్నామని, నష్టపోతే ఏవరిస్తారు చెప్పండి అంటూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తపరిచారు. రైతులు, నిర్వాహకులమధ్య వాగ్వాదం కొనుగోలు కేంద్రానికి చెరుకున్న డీసీఎంఎస్ అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ వైస్ చైర్పర్సన్ వెంటనే మార్కెట్ కార్యాలయం నుంచి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. రైతులకు ఇప్పుడు టోకెన్లు ఇస్తే వాళ్లు వెళ్లిపోతారాని లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుందని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు జారీచేయడంతో రైతులు శాంతించారు. -
ఇదో రకం దోపిడీ!
శ్రీకాకుళం, వీరఘట్టం: పథకం ప్రవేశపెట్టడం.. ఊపుగా ప్రచారం చేయడం.. కొనసాగించలేక మధ్యలోనే వదిలేయడం.. అంత వైఫల్యంలోనూ తమ ఆదాయ మార్గాలు వెతుక్కోవడం.. టీడీపీ మార్కు రాజకీయమిది. సర్కారు బడుల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలోనూ టీడీపీ ఇదే ఫార్ములా ఫాలో అయ్యింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు మధ్యాహ్నం వంటకు కందిపప్పును ప్రభుత్వమే సరఫరా చేస్తుందని విద్యా శాఖ గతంలో ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు గత నెల కందిపప్పును సరఫరా చేసింది. నెల గడిచేలోపే అధికార పార్టీ తన అసలు ప్లాన్‌ను అమలు చేసింది. నవంబరు నెల సగం పూర్తయినా ఇంత వరకు పాఠశాలలకు కందిç ³ప్పు సరఫరా కాలేదు. కానీ ఆన్లైన్ నమోదుల్లో మాత్రం అన్ని బడులకు కందిపప్పును ఇచ్చేసినట్లుచూపిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారమే చెల్లింపులు జరుపుతుండడంతో వంట మహిళల కుకింగ్ చార్జీల్లో కోత పెడుతూ.. నెలకు రూ.5.91 లక్షల మొత్తాన్ని కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుస్తున్నారు. అసలు సరుకే పంపిణీ చేయకుండా సర్కారు చెల్లిస్తున్న మొత్తమిది. సరుకు ఇవ్వకుండా.. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికీ 100 గ్రాముల బియ్యం, మసాలా దినుసులకు రూ.4.13 పైసలు చొప్పున అలాగే 6–10వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం, మసాలా ఖర్చులకు రూ.6.18 పైసలు చొప్పున ఈ మహిళలకు విద్యాశాఖ చెల్లిస్తోంది. తాజాగా అక్టోబర్ నుంచి ప్రభుత్వం 1–5వ తరగతి వారికి 20 గ్రాముల కందిపప్పు, అలాగే 6–10వ తరగతి విద్యార్థులకు 30 గ్రాముల కందిపప్పు చొప్పున సరఫరా చేస్తోంది. ఈ సరుకులకు గాను కుక్కింగ్ చార్జీల్లో 1–5వ తరగతి విద్యార్థులకు రూ.1.38 పైసలు, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.2.07 పైసలు కట్ చేస్తోంది. ఇలా జిల్లాలో 2,38,616 మంది విద్యార్థులకు కందిపప్పు సరఫరా పేరిట నెలకు రూ.5,91,848లు కాంట్రాక్టర్లకు ముడుతోంది. సరుకు సరఫరా చేసినా చేయకపోయినా ఈ డబ్బులు ఖాతాలకు జమ అయిపోతున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు మధ్యాహ్న భోజనానికి కందిపప్పు సరఫరా నిలిపివేశారు. స్టాకు లేదంట.... విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపం అధిగమించేందుకు మధ్యాహ్నం భోజనానికి కందిపప్పు సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం కందిపప్పు సరఫరాను మూడు రోజుల ముచ్చటగా ముగించింది. మధ్యాహ్నం వంటలకు సరఫరా చేయాల్సిన కందిపప్పు స్టాకు లేకపోవడంతో ఈనెల కందిపప్పు సరఫరా చేయలేదని కాంట్రాక్టర్ చెబుతున్నారు. అయితే ఈ నెలలో కందిపప్పు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. అలాంటప్పుడు వంట ఏజెన్సీల కుక్కింగ్ చార్జీల్లో కోత కోయడం సబబు కాదని పలువురు వాపోతున్నారు. ఈ విధానాన్ని రద్దు చేసి యథావిధిగా వంట మహిళలకు కందిపప్పు చార్జీలను ప్రభుత్వం చెల్లించాలని ఏజెన్సీ మహిళలు కోరుతున్నారు. ఒక్క నెలే కందిపప్పు ఇచ్చారు ప్రతి రోజు కందిపప్పుతో చారు చేసి మధ్యాహ్నం భోజనంలో వడ్డించాలని చెప్పారు. కానీ కందిపప్పు పేరిట మాకు రావాల్సిన కుకింగ్ చార్జీల్లో కోత వేశారు. ఒక్క నెలతోనే కందిపప్పు సరఫరా నిలిపివేశారు. అడిగితే స్టాకు లేదని చెబుతున్నారు. – దుప్పాడ ఇందు, వంట ఏజెన్సీ మహిళ, వీరఘట్టం కాంట్రాక్టర్లను పెంచడానికే కాంట్రాక్టర్లను పెంచడానికే కందిపప్పు సరఫరాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఆరు బయట ఎండలో పాట్లు పడుతూ వంటలు చేస్తున్న మాకు మాత్రం రూపాయి ఇవ్వడానికి చేయిరాని ఈ ప్రభుత్వం... కాంట్రాక్టర్ల కోసం కందిపప్పును వాళ్లకు అప్పగించారు.– కిల్లారి శ్రీదేవి, వంట ఏజెన్సీ మహిళ, వీరఘట్టం -
పప్పన్నం కొందరికేనా..?
జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చౌక దుకాణాల్లో అందజేస్తున్న కందిపప్పును అరకొరగా ఇస్తూ.. ప్రభుత్వం లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. జిల్లాకు దాదాపు 2వేల టన్నుల కంది అవసరం కాగా.. అందులో నాలుగోవంతు మాత్రమే పంపిణీ చేశారు. ఫలితంగా పప్పన్నం కొందరికేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు కలెక్టరేట్: ప్రతి తెల్ల రేషన్‌కార్డుకు కందిపప్పు అందించి, ఇంటింటా పప్పన్నం తినిపిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. జూలైకు అందించాల్సిన కందిపప్పు చౌక దుకాణాల్లో కానరాకపోవడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో మొత్తం 2,880 చౌకదుకాణలు ఉన్నాయి. వీటిలో 11,07,810 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా ఈ కార్డుదారులకు ప్రభుత్వం ప్రజా పంపిణీ పేరుతో బియ్యం, చక్కెర, రాగులు అందిస్తోంది. వీటితో పాటు జూలై నుంచి ప్రతికార్డుకు 2 కిలోల చొప్పున కందిపప్పు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని కార్డులకు పంపిణీ చేయాలంటే 2,215 టన్నుల మేరకు కందిపప్పు అవసరం ఉంది. అయితే పౌరసరఫరాల శాఖ అధికారులు కేవలం 502 టన్నుల మేరకు మాత్రమే ఎంఎల్ పాయింట్లకు చేరవేశారు. అక్కడి నుంచి ఎంపిక చేసిన కొన్ని దుకాణాలకు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. వీటిలోనూ అధికశాతం కందిపప్పును చంద్రన్న మాల్స్‌కే తరలించడం గమనార్హం. దీంతో చౌక దుకాణాలకు వచ్చే కార్డుదారులందరికీ కంది పప్పు అందడం లేదు. ఆదేశాలు తూచ్.. కందిపప్పును సరఫరా చేసుకునేందుకు డీలర్లు కేజీకి రూ. 39.50 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇంత మొత్తంలో డీలర్లు చెల్లించడం కష్టం అని భావించిన ప్రభుత్వం అప్పుగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఆయితే ఆ ఆదేశాలను జిల్లా అధికారులు బేఖాతర్ చేశారు. డీలర్లకు పూర్తిస్థాయిలో కందిపప్పు సరఫరా చేయలేకపోయారు. జిల్లాకు వచ్చిన 502 టన్నుల కందిపప్పు కేవలం 2.50 లక్షల కార్డుదారులకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన 8.50 లక్షల కార్డుదారులు రిక్తహస్తాలు తప్పడం లేదు. బకాయిల సాకుగా చూపి.. జిల్లాకు వచ్చిన 502 టన్నుల కందిపప్పును కూడా అధికారులు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. డీలర్లు గతంలో తీసుకున్న నిత్యావసర సరుకులకు చెల్లించాల్సిన మొత్తాలు పెండింగ్‌లో ఉండడంతో కందిపంపిణీని నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాత బకాయిలు చెల్లిస్తేనే.. కంది పప్పు అందిస్తామని తేల్చి చెబుతున్నారు. విమర్శల వెల్లువ.. గత ప్రభుత్వ హయాంలో ప్రజాపంపిణీ ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులను అందించేవారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులకు క్రమేణా కోత విధిస్తూ వచ్చింది. ఆఖరుకు చౌకదుకాణాల ద్వారా కార్డుదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. దీనిపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం అరకిలో చక్కెర, ఆతర్వాత రాగులు పంపిణీ చేస్తూ వస్తోంది. ఇక ఈ నెల నుంచి కందిపప్పు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేసింది. అయితే షాపులకు పూర్తిస్థాయిలో పప్పు సరఫరా చేయలేకపోయింది. దీంతో జిల్లా ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. బకాయిలు ఉన్న డీలర్లకు అందించలేదు.. జిల్లాలో ఇప్పటి వరకు 502 టన్నుల మేరకు కందిపప్పును ఎంఎల్ పాయింట్లకు అందించాం. అందులో బకాయిలు ఉన్న డీలర్లను మినహాయించి మిగిలిన వారికి మాత్రమే అందజేశాం. ఎన్ని చౌకదుకాణాలకు ఇవ్వలేదనే పక్కా సమాచారం మా వద్దలేదు.– మంజుభార్గవి,పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ -
కందుల దిగుమతి నిలిపివేయాలి
సాక్షి, హైదరాబాద్ : కందుల దిగుమతి నిలిపివేయా లని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిం చారు. కందులను కేంద్రం ఇతర దేశాలనుంచి దిగు మతి చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కొన్న కందు లను మార్కెట్లోకి పూర్తిగా విడుదల చేశాకే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని ఆయన ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్న వంటి పంటల మద్దతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందన్నారు. రైతుల నుంచి రూ. 5,618 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేసి పూర్తిగా చెల్లింపులు చేసినట్లు మంత్రి చెప్పారు. కందులను రూ.1,427 కోట్లతోకొని, రూ.1,420 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. మిగిలిన రూ.7.33 కోట్లు రెండు రోజుల్లో చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి శనగలు రూ.294 కోట్లతో కొనుగోలు చేస్తే రూ.265 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. మిగిలిన మొత్తాన్ని రెండు రోజుల్లో రైతులకు చెల్లించాలని నాఫెడ్, మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న రూ.629 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేసి, రూ.611 కోట్లు చెల్లింపులు చేశామని తెలిపారు. మిగిలిన రూ.18 కోట్లు రెండు మూడు రోజుల్లో చెల్లించాలన్నారు. జూలై రెండో వారానికి పూర్తిచేయాలి ఎస్సారెస్పీ స్టేజ్–1 పనులను జూలై రెండో వారానికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2 పనులు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితం అందుకునేది ఎస్సారెస్పీ ప్రాజెక్టేనని మంత్రి చెప్పా రు. సీఎం ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు కష్టపడి పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తి ఆయకట్టుకు, ఆయకట్టులోని చివరి పొలాలకు నీరు అందించాలని, ఆ దిశగా ఇంజనీర్లు పని చేయాలన్నారు. ఎస్సారెస్పీ కింద రబీలో ఏప్రిల్, మే నెలలోనూ నీరు ఇవ్వడం వల్ల పనిలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్రిటికల్ వర్క్, స్ట్రక్చర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. కాకతీయ కాలువ పనులు నాణ్యతతో చేయాలన్నారు. షట్టర్స్ పనులు, నాణ్యతను ఈఈలు ఎప్పటికప్పుడు పరిశీలించాల న్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్lతదితరులు పాల్గొన్నారు. -
డీలర్లపై దొంగదెబ్బ
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లను దొంగదెబ్బ తీసింది. బియ్యం సరఫరా కోసం చెల్లించిన సొమ్ము పాత బకాయిల కింద జమచేసుకొని తమను మోసం చేశారని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : గత నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు కందిపప్పు, పచ్చిశనగపప్పు విక్రయించాలని నిర్ణయించింది. పప్పు నాణ్యత లేకపోవడంతో పాటు ప్రైవేటు మార్కెట్లో «ధరకు ఇంచుమించుగా ప్రభుత్వం ఇచ్చే ధర ఉండటంతో రేషన్ డీలర్లు సరుకు తీసుకోవడానికి ఇష్టపడలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుగానే ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేసింది. కందిపప్పు బకాయి వసూలు.... జిల్లాలో మొత్తం 2,235 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. అలానే 12.60 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. గత నెలలో ఒక్కో రేషన్ డీలర్‌కు రెండేసి క్వింటాళ్ల చొప్పున అప్పు మీద కందిపప్పు ఇచ్చారు. వాటి ఖరీదు. రూ.8000. ఈ నెలలో కందిపప్పు విక్రయించిన తరువాత సొమ్ము చెల్లిద్దామని డీలర్లు భావించారు. బియ్యం కోసం డీలర్లు పౌరసరఫరాల శాఖకు సొమ్ము చెల్లిస్తే, వాటిని ప్రభుత్వం కందిపప్పునకు జమ చేసుకుంటోంది. బియ్యానికి తిరిగి సొమ్ము చెల్లిస్తేనే సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. బియ్యానికి కట్టిన సొమ్మును కందిపప్పుకు జమ చేసుకోవడంతో డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో డీలర్‌కు సుమారు 50 నుంచి 80 క్వింటాళ్ల బియ్యం ఆగిపోయాయి. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ ప్రకారం సొమ్ము చెల్లిస్తే తొలుత పాత బకాయికి జమ చేసుకుంటుందని డీలర్లకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు బియ్యం ఆపకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు. జిల్లాలో 4055 క్వింటాళ్ల కందిపప్పు డీలర్లకు సరఫరా.... కందిపప్పు నాణ్యత లేకపోవడంతో పాటు సకాలంలో సరఫరా చేయకపోవడంతో మార్చి నెలలో కేవలం 13 శాతం మాత్రమే విక్రయాలు సాగించారు. ఒక్కో కార్డుకు కిలో కందిపప్పు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా డీలర్లకు అప్పు పై 4055 క్వింటాళ్లను జిల్లా వ్యాప్తంగా అధికారులు పంపిణీ చేశారు. సరఫరా చేసిన మొత్తం సరుకులో కేవలం 13 శాతం డీలర్లు విక్రయించగలిగారు. కందిపప్పు నాణ్యత లేకపోయినా బియ్యంతో పాటే వచ్చి ఉంటే ఏదో విధంగా కార్డుదారులకు డీలర్లు అమ్మేసేవారు. మార్చి 13వ తేదీ తర్వాత పప్పు సరఫరా చేశారు. 15 తరువాత సర్వర్ పనిచేయదు. అందువల్ల చౌకబియ్యాన్ని 90 శాతం మంది పేదలు 10 వ తేదీ లోగానే తీసేసుకుంటారు. డీలర్లకు 13 న కందిపప్పు సరఫరా చేయడంలో విక్రయించలేకపోయారు. నాణ్యత సరిగా లేకపోవడంతో పాటు, ప్రైవేటు మార్కెట్లో కేజీ రూ.55కు లభిస్తుండగా, రేషన్ దుకాణంలో రూ.40కు విక్రయిస్తుండటంతో చాలా మంది పేదలు కందిపప్పు తీసుకోవడానికి ఇష్టపడలేదు. బియ్యం సొమ్ము జమ వాస్తవమే ఈ నెలలో బియ్యానికి చెల్లించిన సొమ్ము గతనెలలో ఇచ్చిన కందిపప్పుకు జమ చేసుకుంటున్నారు. అదేమంటే సాఫ్ట్వేర్ అలా ఉందని అంటున్నారు. బియ్యం సకాలంలో సరఫరా చేయకపోతే పేదలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. మంగళ, బుధవారాల్లో కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్‌ను కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని భావిస్తున్నాం. కందిపప్పు విక్రయించే వరకు ఆ బకాయి వసూలు చేయకుండా ఆపాలి.– ఎం.శ్రీనివాస్,కృష్ణా జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ కార్యదర్శి -
కంది రాదు... కూరలేదు
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు చందంగా మారింది నేడు నిరుపేదల పరిస్థితి. దీంతో వారు నిత్యావసర వస్తువులు సైతం కొనుగొలు చేయలేకపోతున్నారు. ఈ దశలో ప్రభుత్వం చౌకదుకాణాల్లో తెల్ల రేషన్ కార్డులున్న వారందరికీ మార్చి నుంచి కిలో కంది పప్పు ఇస్తామని ప్రకటించింది. కొంత ఊరట లభిస్తుందిలే అని కార్డుదారులు ఆశ పడ్డారు. తీరా రేషన్ షాపుకెళితే కంది రాలేదన్నారు. ఫలితంగా కూర లేక నిరుపేదలు ఇక్కట్లు పడుతున్నారు. చిత్తూరుకలెక్టరేట్: తెల్లరేషన్ కార్డుదారులందరికీ బియ్యంతోపాటు మార్చి నుంచి కందిపప్పు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మార్చి నుంచి అందించాల్సిన కందిపప్పు కానరాలేదు. అలాగే గతంలో అమలు చేసిన రాగుల పంపిణీ పథకం రెండు నెలలకే అటకెక్కింది. ప్రజలు మాత్రం ఈ నెల నుంచి రాగులుతో పాటు కందిపప్పు కూడా అందుతుందని భావించారు. తీరా చౌకదుకాణానికి వెళితే ఆ ఊసే లేదు. జిల్లాలో మొత్తం 11, 07,911 కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులున్నాయి. అందులో అంత్యోదయ కార్డులు 86,811, అన్నపూర్ణ కార్డులు 926 ఉన్నాయి. వీరికి గత ప్రభుత్వ హయాంలో బియ్యంతోపాటు చక్కెర, కిరోసిన్, గోధుమలు, కందిపప్పు తదితరాల నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగేది. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా చౌకదుకాణాల ద్వారా ఇచ్చే నిత్యావసర సరుకులకు మంగళం పాడుతూ వచ్చింది. దీంతో ఆఖరుకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. అయితే రెండు నెలలుగా బియ్యంతోపాటు ప్రతి కార్డు దారునికి రెండు కిలోల రాగులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాగులు తీసుకున్న కార్డు దారులకు కేటాయించిన బియ్యంలో కోత విధించింది. ఈ విధానంతో రెండు నెలలు మాత్రం లబ్ధిదారులకు రాగులను పంపిణీ చేసింది. దీంతోపాటు మార్చి నెల నుంచి కందిపప్పు కూడా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కిలో కందిపప్పు రూ.40 చొప్పున, ఒక్కొ కార్డుకు ఒక కిలో చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం జిల్లాకు మొత్తం 1,100 టన్నుల కందిపప్పును కూడా ఆయా చౌకదుకాణాలకు అందించినట్లు తెలియజేసింది. వచ్చే నెల నుంచి అందిస్తాం కందిపప్పు, రాగులు ఏప్రిల్ నుంచి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాగులు స్టాక్ రానందున అందించలేకపోయాం. కందిపప్పు కూడా ఫిబ్రవరి 28వ తేదీ స్టాక్ వచ్చినందున ఏప్రిల్ నుంచి పంపిణీ చేస్తాం. కందిపప్పు 1,100 టన్నులు, రాగులు 500 టన్నుల మేరకు అందించేలా చర్యలు చేపడుతున్నాం. – జయరాములు, జీఎం, జిల్లా పౌరసరఫరాల శాఖ -
కంది కొనుగోలుకు రూ.600 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంది కొనుగోలు, రైతు బకాయిల చెల్లింపులకు రూ.600 కోట్ల బ్యాంకు రుణం తీసుకోవాలని మార్క్‌ఫెడ్, హాకాలు నిర్ణయించాయి. రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధమవడంతో అందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఫైలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వద్దకు వెళ్లింది. సీఎం ఆమోదం రాగానే రుణానికి వెళ్లాలని మార్క్‌ఫెడ్, హాకాలు భావిస్తున్నాయి. రైతుల నుంచి రూ.762 కోట్ల విలువైన 1.55 లక్షల మెట్రిక్ టన్నుల కంది కొనుగోలు చేసి ఇప్పటివరకు రూ.262 కోట్లే చెల్లించారు. దీంతో బకాయిలు, మున్ముందు కొనుగోలుకు రుణమే మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతు పండించిన కందిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టింది. కందిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలసి కోరారు. సీఎం కేసీఆర్ లేఖతో ఇటీవల ఆరుగురు ఎంపీలు కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిశారు. కానీ స్పందన లేదు. 10 రోజుల క్రితం 1.13 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొంటామని సూత్రప్రాయంగా అంగీకరిస్తూ సమాచారం ఇచ్చిన కేంద్రం.. సీఎం లేఖ తర్వాత సాంకేతిక కారణాలు చూపించి 75,300 మెట్రిక్ టన్నులే కొంటామని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హరీశ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌పాశ్వాన్‌కు లేఖ రాశారు. మరో లక్ష టన్నులు కొనాలని కోరారు. కానీ కేంద్రం నుంచి అనుమతి వస్తుందన్న ఆశ లేకపోవడంతో బ్యాంకు రుణం తీసుకోడానికి సర్కారు సిద్ధమైంది. -
అక్రమంగా కందుల అమ్మకాలు
జడ్చర్ల : రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కందులను ప్రభుత్వ మద్దతు ధరకు సంబంధిత ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఓ కమీషన్ ఏజెంట్‌ను మార్కెట్ యార్డు చైర్పర్సన్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం జడ్చర్ల మార్కెట్ యార్డులో చోటుచేసుకుంది. చైర్పర్సన్ శోభ కథనం ప్రకారం.. జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం హాకా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్వింటాల్‌కు ప్రభుత్వం మద్దతు ధరను రూ.5,450గా నిర్ణయించింది. అయితే బయట మార్కెట్లో రైతులకు ఆ ధరలు దక్కడం లేదు. క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే ధరలు దక్కుతున్నాయి. అయితే కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు తదితర చిల్లర వ్యాపారులు సైతం రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కందులను తిరిగి వారి పేరున హాకా కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డు చైర్పర్సన్ శోభ, పాలక మండల సభ్యులు సదరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి కందుల కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా సహకరించాలని, మధ్య దళారీల ప్రమేయం లేకుండా చూడాలని సూచించారు. రైతు పేరున విక్రయం.. ఈ నేపథ్యంలో విక్రయాలపై దృష్టిసారించి నిత్యం పర్యవేక్షణ పెంచగా శుక్రవారం ఉదయం మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ద్వారా బాదేపల్లి యార్డు కమీషన్ ఏజెంట్ వాసవీ ట్రేడర్స్ సతీష్ 17 బస్తాల కందులను హాకా కేంద్రంలో విక్రయించేందుకు ప్రయత్నించగా రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. సదరు రైతు ఆంజనేయులుకు సంబంధించిన ఫోన్‌ను కూడా స్వాధీనపరుచుకుని అందులో కాల్‌డేటాను పరిశీలించగా రైతు, కమీషన్ ఏజెంట్ మాట్లాడుకున్న సమాచారం ఉందన్నారు. అంతేకాక బైరంపల్లి గ్రామ పరిధిలో ఆంజనేయులు సాగు చేసిన కందిపంటకు వచ్చిన దిగుబడికి ఎక్కడా పొంతన లేదన్నారు. దీంతో కమీషన్ ఏజెంట్ సతీష్ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను మద్దతు ధరకు హాకా కేంద్రంలో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు రుజువయ్యిందన్నారు. వెంటనే ధాన్యాన్ని స్వాధీనపరుచుకుని తహసీల్దార్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక కమీషన్ ఏజెంట్ లైసెన్ రద్దుపరిచి చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ శ్రీశైలం, డైరెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మొగులయ్య, యార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన కంది రైతు
మద్నూర్(జుక్కల్) : కంది రైతులు కన్నెర్ర చేశారు. కంది పంట కొనుగోలు కేంద్రం పునః ప్రారంభిచాలంటు రైతులు రోడెక్కారు. మండలంలోని మేనూర్‌లో జాతీయ రహదారిపై మంగళవారం బీజేపీ నాయకులు, రైతులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మండలంలోని డోంగ్లీ సహకార సంఘంలో గత రెండు రోజుల క్రితం కంది కొనుగోలు కేంద్రం మూసివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డోంగ్లీలో కొనుగోలు కేంద్రం మూసివేస్తున్నామని రైతులు మద్నూర్ మార్కెట్లోని కంది కొనుగోలు కేంద్రానికి పంటను తరలించాలని అధికారులు సూచించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీ రాములు అన్నారు. డోంగ్లీ చుట్టూ పక్కల ప్రాంతాల రైతులు మద్నూర్‌కు పంటను తరలించాలంటే రవాణ ఖర్చులు తడిసిమోపెడవుతాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు వెంటనే డోంగ్లీలో కంది కొనుగోలును ప్రారంభిచాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై మహమ్మద్ సాజిద్, తహసీల్దార్ ధన్వాల్ సంఘటన స్థలానికి చేరుకోని రైతులు, రైతునాయకులతో మాట్లాడారు. త్వరలో ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేౖసామని చెప్పడంతో వారు రాస్తారోకోను విరమించారు. శనగ పంటను తీసుకోవాలి రబీ సీజన్‌కు సంబందించి రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎంపీటీసీ రాములు డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో శనగ క్వింటాలుకు రూ.3400 నుంచి రూ.3600 వరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. కేంద్రప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4400 ప్రకటించిందని ఇక్కడ శనగకొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు క్వింటాల్‌కు వెయ్యి రూపాయాలు నష్టపోతున్నారని పేర్కోన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే మండలంలో అక్రమంగా కందులను రైతుల పేరిట విక్రయించిన దళారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆయనతో పాటు నాయకులు, స్థానిక రైతులు ఉన్నారు. కందులు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జేసీ సత్తయ్య దళారులు అక్రమంగా మహారాష్ట్ర నుంచి కందులను తీసుకచ్చి విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ సత్తయ్య వ్యవసాయాధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనసాగుతున్న కంది కోనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. దళారులు రైతుల వద్ద నుంచి పట్టాపాస్ పుస్తకాలు సేకరించి వారి పేరున కందులు తూకం వేస్తున్నారనే ఆరోపణలు రావడంతో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రతి రోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామానికి చెందిన రైతుల కందులను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయాధికారులు గ్రామాలను ఎంపిక చేసి రైతులకు సమాచారం అందించాలని, రైతులు తమ పట్టాపాసు పుస్తకాలను ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. అక్రమ కంది కొనుగోళ్లపై పూర్తి విచారణ జరుపుతామని, దళారులను ఆరికట్టెందుకు మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ అధికారులను నియమించామన్నారు. భూ ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ సిబ్బంది ఆన్లైన్ పనులను వేగవంతం చేయాలన్నారు. మేనూర్‌లో రైతులు రాస్తారోకో విషయం ప్రస్తావిస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మార్కెట్ యార్డులలోనే కంది కొనుగోలు కేంద్రాలు ఉండాలన్న నిబంధనలతోనే డోంగ్లీ సోసైటీలో కంది కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారని దీనికి రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జేసీతో పాటు తహసీల్దార్ ధన్వాల్, సిబ్బంది ఉన్నారు. -
రూ.120 కే కిలో కందిపప్పు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతుబజారులో ఏర్పాటుచేసిన కందిపప్పు ప్రత్యేక విక్రయ కౌంటర్‌ను శుక్రవారం రైతుబజారు ఈవో స్వప్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు కిలో కందిపప్పు రూ.120 చొప్పున ఒక్కొక్కరికి కిలో కందిపప్పును విక్రయించనున్నట్లు తెలిపారు. -
కందిపప్పు సరఫరాకు టెండర్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు అందజేసే రాయితీ కందిపప్పు సరఫరా కోసం ప్రభుత్వం శుక్రవారం టెండర్లు పిలిచింది. వచ్చే నెల మార్చి వరకు పీడీఎస్ అవసరాలకు సరిపోయేలా 5వేల మెట్రిక్ టన్నులకు పౌర సరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు దిగివచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకున్న ప్రభుత్వం, వారం రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతీ నెలా 5వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం పడుతోంది. లబ్ధిదారునికి కిలో రూ.50 చొప్పున ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుత ధరలు మార్చి తర్వాత మరింత తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో కేవలం ఒక నెల అవసరాల మేర మాత్రమే ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించింది. మార్చి తర్వాత తిరిగి పాత విధానం మేరకు మూడు నెలల అవసరాల కోసం టెండర్లను ఆహ్వానించనుంది. -
తాండూరు కందిపప్పు టేస్టే వేరు..
ఇతర రాష్ట్రాల్లో పండించిన కందులతో తయారు చేసిన కందిపప్పు కన్నా తాండూరు పప్పు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి నేల స్వభావంతో పప్పు రుచికరంగా ఉండడంతో దీనికి అధిక డిమాండ్ ఉంది. ఇక్కడి పప్పు త్వరగా ఉడుకుతుంది. వండిన పప్పు రెండు రోజులైనా పాడవకుండా ఉండడం మరో ప్రత్యేకత. ప్రతి ఏడాది తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు వంద కోట్ల కందుల వ్యాపారం జరుగుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కందులు రవాణా అవుతాయి. తాండూరు కందిపప్పు పేరుతో విక్రయిస్తారు. ఈ ప్రాంతంలో చాలామంది ముద్దపప్పు చేసిన తరువాత తెల్లని వస్త్రంలో ఆరబెడతారు. ఇలా వారం రోజులపాటు ఆరబెట్టిన ముద్దపప్పు పాచిపోదు. ఈ పప్పును జొన్న రొట్టెతోకలిపి ఆరగిస్తారు. - తాండూరు -
కందిపప్పు చోరీ..
ముంబై: పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దొంగలు రూటు మార్చి కిరాణా దుకాణాలను దోచుకుంటున్నారు. ఇటీవల నలాసోపారాలో మూడు దుకాణాల్లో దొంగతనం చేసిన దొంగలు 30 కేజీలు పప్పులను, రూ. వెయ్యి విలువగల డ్రై ఫ్రూట్స్‌ను దోచుకెళ్లారు. అయితే స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల ద్వారా దొంగలు దొరికిపోయారు. పండుగ సందర్భంగా పప్పు ధాన్యాలు, డ్రై ఫూట్స్ ధరలు పెరగడంతో దుకాణాలపై కన్నేసిన దొంగలు అకోలే గ్రామంలోని సిద్ధి వినాయక, సాయి సంతోషీ స్టోర్స్‌లోని సామాగ్రిని అందినంతవరకు ఎత్తుకెళ్లారు. చాకొలెట్లు, బిస్కెట్లు, డబ్బులతోపాటు పప్పు ధాన్యాలను కూడా దొంగలు తమ లిస్టులో వేసుకున్నారు. 'పండుగ సందర్భంగా పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకొచ్చాం. దుకాణం మూసేసిన తర్వాత దొంగలు చొరబడి 30 కేజీల కందిపప్పు, డ్రై ఫ్రూట్స్‌ను ఎత్తుకెళ్లారు' అని సాయి సంతోషి దుకాణం యజమాని రాజ్ గుప్తా చెప్పారు. బిస్కెట్లు, డబ్బు, ఇరత వస్తువులతో పాటు మొత్తం రూ. 20 వేల విలువగల సొత్తును దోచుకెళ్లారు’ అని మరో వ్యాపారి మంగేలాల్ చౌదరి పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.