Transgender woman
-
ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా బిక్షాటన ..నేడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని..!
మన చుట్టూ తరిచి చూస్తే స్ఫూర్తిని కలిగించే ఎన్నో కథలు మనమందు మెదులుతాయి. అలాంటి ప్రేరణ కలిగించే కథ మైసూరులో చోటు చేసుకుంది. ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా దుర్భరమైన జీవితాన్ని అనుభవించింది. ఆ తర్వాత ఓ చిన్నారిని దత్తత తీసుకుని తల్లిగా అద్భుతమైన అమ్మాయిగా తీర్చిదిద్ది సమాజమే సెల్యూట్ చేసేలా ఎదిగింది. అవమానాలను, అసమానతలకు తట్టుకుని..శక్తిమంతమైన మహిళగా ఎదుగుతూ మరొకరికి మంచి జీవితాన్ని ఇచ్చే మహత్తర కార్యం చేసి శెభాష్ అనిపించుకుంది. ఎవరా ట్రాన్స్ జెండర్ అంటే..ఆ ట్రాన్స్‌జెండర్ పేరు షబనా అక్రం పాషా. దాదాపు రెండు దశాబ్దాల క్రితం బీబీ ఫాతిమాను దత్తత తీసుకుంది. నిజానికి షబనా ట్రాన్స్‌జెండర్‌గా చిన్ననాటి నుంచి ఎన్నో చిత్కారాలు, అవమానాల మధ్య దుర్భరమైన జీవితాన్ని గడిపింది. బతకటం కోసం బిక్షాటన వృత్తిని కూడా చేసింది. అలాంటి షబానా తమలాంటి వాళ్లలో ఉన్న మంచి కోణాన్ని పరిచయం చేసింది. ఒకసారి ఫబానా దగ్గరి బంధువు నలుగురు కూతుళ్లను విడిచిపెట్టేసి పరారయ్యాడు. అయితే షబానా తాను బతుకు ఈడ్చటమే గగనం అన్న పరిస్థితుల్లో ఉండి కూడా ఏ మాత్రం సంకోచించకుండా ఆ నలుగురిని దత్తత తీసుకుంది. వారిని తన పిల్లలుగా పెంచడం ప్రారంభించింది. వారికి తల్లిగా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే దానిపైన దృష్టిపెట్టింది. అలా ఒక్కో పైసా పోగు చేసి బీబీ ఫాతిమా అనే అమ్మాయిని బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించి కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌గా తీర్చిదిద్దింది. ఈ క్రమంలో కూడా షబానా ఎన్నో అవమానాలు ఎదుర్కొక తప్పలేదు. ఎందుకంటే షబానే అనే ట్రాన్స్ జెండర్ కూతురు కాబట్టి ట్రైనింగ్‌లో అందరితో కాకుండా ఫాతిమాకు వేరుగా శిక్షణ ఇచ్చేవారు. అందుకోసం గంటలు తరబడి ఇన్స్టిట్యూట్ వెలుపలే వేచి ఉండాల్సి వచ్చేది. అయినా సరే ఈ తల్లి కూతుళ్ల ద్వయం 'తగ్గేదే లే' అంటూ ఆ అసమానతలు, వివక్షతను దాటి ప్రపంచానికి తామెంటో చూపించారు. శక్తిమంతమైన మహిళలుగా ఎదిగారు. షబానా కష్టం ఫలించి ఫాతిమా రాష్ట్ర, జాతీయ కిక్‌బాక్సర్‌గా రాణించడమే గాక ఏకంగా మొత్తం 23 పతకాలు సాధించింది. ప్రస్తుతం ఫాతిమాకు 20 ఏళ్లు. ఆమె పెంచిన కూతురు విజయంతో ఒక్కసారిగా షబానా ట్రాన్స్‌జెండర్ పేరు ప్రపంచానికి తెలిసేలా మారుమ్రోగింది. ఈ మేరకు షబానా మాట్లాడుతూ.." మా జీవితాలు తరచు వివక్ష, కళకంతో దెబ్బతిన్నాయి. అయినా మేము గొప్ప ప్రేమ, బాధ్యతను విస్మరించం. కేవలం ఈ అమ్మాయిలను దత్తత తీసుకుని తీర్చదిద్ది.. మాలాంటి వాళ్లను మనుషులుగా గుర్తించండి అని చెప్పాలనుకుంటున్నా. అన్ని రకాలుగా బాగున్న వాళ్లకంటే తామలాంటి వాళ్లే ఎంతో ఉదారంగా ఉంటారని చాటి చెప్పాలనుకున్నా అంటూ ఆవేదన చెప్పుకొచ్చింది." షబానా. మనలో చాలామంది ఆడపిల్ల అనగానే భారం అనే భావన నుంచి బయటపడటం లేదు. ఒకరికి మించి ఇద్దరు ఆడపిల్లలు అంటే నోరు బార్లా తెరుస్తారు.. వెంటనే చేతులు దులుపుకునే యత్నం చేస్తారు. కానీ షబానా తన బతకు గడవటమే కష్టంగా ఉన్నా..ఆ అమ్మాయిలను దత్తత తీసుకోవడమే గాక వారికి మంచి జీవితం ఇవ్వాలని తాపత్రయం పడటం అనేది ఎంతో స్ఫూర్తిదాయకం కదూ. (చదవండి: ఫరా ఖాన్ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!) -
'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
తెలుగమ్మాయి శోభిత ధూళిపాల తారాఖన్నాగా నటించిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'. ఈ సిరీస్‌లో శోభిత నటించిన తారా అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. 2019 మార్చి 8న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైందీ సిరీస్. నిత్యా మెహ్రా, జోయా అఖ్తర్, ప్రశాంత్ నాయర్, అలంకృత శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. అద్భుతమైన ట్విస్ట్‌తో మేకర్స్ ఈ సిరీస్‌ను ముగించారు. రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేడ్ ఇన్ హెవెన్ సీజన్-2 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్ 2' ఓటీటీ డేట్ వచ్చేసింది, ఎప్పటినుంచంటే?) అయితే సినీ విమర్శకుల ప్రశంసలు పొందిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'. అయితే సీజన్-2కు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరైన నటి స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది ఆమె. ఇంతకీ ఎవరామె? ఎందుకంత స్పెషల్ అనేది ఓసారి తెలుసుకుందాం. కాగా.. తొలి సీజన్లో ఉన్న శోభిత, అర్జున్, కల్కి కొచ్లిన్, జిమ్ సారబ్, శశాంక్ అరోరా, శివంగి రాస్తోగి సహా తదితరులు సీక్వెల్లోనూ నటించారు. అయితే ఇష్వాక్ సింగ్, త్రినేత్ర వంటి కొత్తముఖాలు కూడా సీక్వెల్లో కనిపిస్తాయి. ఇందులో కొత్తగా త్రినేత్ర ఈ సీజన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనుంది. అసలు త్రినేత్ర ఎవరు? త్రినేత్ర మరెవరో కాదు.. తొలిసారి నటనా రంగ ప్రవేశం చేయబోతున్న కర్ణాటక తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్. ఆమె అసలు పేరు త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు. ఈ వెబ్ సిరీస్‌లో మేడ్ ఇన్ హెవెన్' కంపెనీలో వెడ్డింగ్ ప్లానర్ల బృందంతో కలిసి పనిచేసే మహిళగా ట్రాన్స్-ఉమెన్‌గా కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు ఈవెంట్‌కు హాజరైన ఆమె తన పాత్ర పట్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ పాత్రను మొదట విన్నప్పుడు చేయలేకపోతానని భయమేసిందని తెలిపారు. మేడ్ ఇన్ హెవెన్- 2 ప్రారంభం మాత్రమేనని వెల్లడించింది. తాను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే ఈ పాత్ర కోసం ఆడిషన్ జరిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తాను నటనపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు తెలిపింది. త్రినేత్ర మాట్లాడుతూ..'అప్పట్లో నేను ఇంటర్న్‌షిప్ చేస్తున్నందున ఇది నాకు కొంచెం భయంగా అనిపించింది. కానీ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు సాధించగలనని అనుకున్నా. ఎందుకంటే ఇది ట్రాన్స్-ఉమెన్‌గా నాకు చాలా దగ్గరి పాత్రలా ఉంది. ఈ సిరీస్‌లో చిత్రబృందం తనకు మద్దతుగా నిలిచారని ప్రశంసించింది. వారితో తన అనుబంధం మరిచిపోలేనిది. ఇప్పుడు నాకు ఒక కల నిజమైంది.' అని ఆమె పంచుకుంది. (ఇది చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) View this post on Instagram A post shared by Trinetra (@trintrin) -
ట్రైన్లో పరిచయం.. ట్రాన్స్డెంజర్తో ప్రేమ
-
ట్రైన్లో పరిచయం.. ట్రాన్స్డెంజర్తో ప్రేమ.. ఇలా ఒక్కటయ్యారు
సాక్షి, వరంగల్: ఎన్ని ఆటంకాలు వచ్చినా కల్యాణ సమయ వస్తే ఆగదంటారు పెద్దలు. అలాగే, మనిషి జీవితంలో వివాహం ఎవరితో జరగాలనేది మనిషి పుట్టినప్పుడు నిర్ణయం బడుతుందని పెద్దల నమ్ముతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మహబూబాబాద్ జిల్లాలో వింత వివాహం ఆదర్శంగా జరిగింది. ఓ యువకుడు ట్రాన్స్డెంజర్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరి ప్రేమను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో వివాహం ఘనంగా జరిగింది. వివరాల ప్రకారం.. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) ప్రేమించుకున్నారు. గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే, బానోత్ రాధికకు రైలులో వీరూ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో తమను గుర్తించాలన్నారు. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని జరగాలని కోరుకున్నారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కూడా కల్యాణ లక్ష్మి అందజేయాలని కోరారు. వివాహ తంతులో ట్రాన్స్‌జెండర్ శోభ, రాధిక, దుర్గ, నందు, రవళి పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: లండన్‌లో హైదరాబాద్ యువతి దారుణ హత్య -
నాష్విల్లే స్కూల్లో దురాగతం..మాజీ విద్యార్థి పనే
నాష్విల్లే: అమెరికాలోని నాష్విల్లే క్రిస్టి యన్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల్లో తొమ్మిదేళ్ల ముగ్గురు చిన్నారులతోపాటు స్కూల్ హెడ్ కేథరిన్, ఒక సబ్‌స్టిట్యూట్ టీచర్, కస్టోడియన్ ఒకరు ఉన్నారు. అనంతరం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ల ఆడ్రే ఎలిజబెత్ హేల్ అనే ట్రాన్స్‌జెండర్ మహిళగా గుర్తించారు. కాల్పుల గురించి పోలీసులకు 10.13 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే స్కూల్ వద్దకు చేరుకుని మొదటి అంతస్తులో ఉన్న విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. రెండో అంతస్తులో కాల్పుల శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై హేల్ కాల్పులకు తెగించింది. వెంటనే జరిపిన ఎదురుకాల్పుల్లో హేల్ అక్కడికక్కడే హతమైంది. ఆమె వద్ద ఉన్న రెండు అసాల్ట్ రైఫిళ్లు, ఒక హ్యాండ్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 నిమిషాల్లో ఇదంతా జరిగిపోయింది. ఆమె స్కూల్లోకి కారులో వచ్చినట్లుగా సీసీ ఫుటేజీలో రికార్డయి ఉంది. షూటర్ హేల్ మాజీ విద్యార్థి అని అంటున్న పోలీసులు ప్రస్తుతం ఆమెకు స్కూల్‌తో గానీ స్కూల్ స్టాఫ్‌తో గానీ ఎటువంటి సంబంధాలున్నాయి? ఎవరిపై అయినా విరోధంతో ఈ ఘోరానికి పాల్పడిందా? అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే, కోవెనంట్ స్కూల్‌పై ద్వేష భావం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీస్ చీఫ్ జాన్ డ్రేక్ అన్నారు. మరోచోట కూడా కాల్పులు జరిపేందుకు హేల్ పథకం వేసినట్లు భావిస్తున్నామన్నారు. ఎన్కౌంటర్ ముగిసిన వెంటనే హేల్ ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు రెండు షాట్గన్లు దొరికాయి. ఇంకా స్కూల్‌కు సంబంధించిన మ్యాప్, ఇతర ప్రదేశాల మ్యాప్‌లు, కాల్పులకు ముందు రెక్కీ చేపట్టినట్లు ఆధారాలు దొరికాయి. ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు, అనూహ్య ఘటన జరగబోతోందంటూ కొద్ది నిమిషాలకు ముందే హేల్ తమకు మెసేజీలు పంపినట్లు స్నేహితులు చెబుతున్నారు. దారుణానికి వేదికైన కోవెనంట్ ప్రెస్బిటేరియన్ చర్చి స్కూల్ 2001లో ప్రారంభమైంది. ఇక్కడ ప్రి స్కూల్ నుంచి ఆరో గ్రేడ్ వరకు 200 మంది వరకు చిన్నారులు చదువుకుంటుండగా, 50 మంది సిబ్బంది ఉన్నారు. -
ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీ కన్నుమూత..
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీగా అరుదైన గుర్తింపు పొందిన న్యూజిలాండ్ మాజీ చట్టసభ ప్రతినిధి జార్జినా బెయెర్(65) కన్నుమూశారు. చాలాకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బెయెర్ ఫ్రెండ్ ఒకరు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్‌లో మారుమూల గ్రామంలో జన్మించిన బెయెర్ తొలినాళ్లలో సెక్స్వర్కర్గానూ పనిచేశారు. ఆ తర్వాత నటిగా, డ్రాగ్ క్వీన్‌గా అలరించారు. కార్టర్టన్కు మేయర్‌గానూ ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్ కూడా ఈమే కావడం గమనార్హం. 1999లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు బెయెర్. 2007 వరకు ఎంపీగా కొనసాగారు. ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడిన న్యాయవాదిగానూ బెయెర్ గుర్తింపుపొందారు. సెక్స్‌వర్కర్లపై వివక్షపైనా గళమెత్తి వాళ్లకు అండగా నిలబడ్డారు. వ్యభిచారం నేరంకాదనే చట్టాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే స్వలింగసంపర్కుల వివాహ చట్టం రూపకల్పనలోనూ ఈమెదే కీలకపాత్ర. అయితే 2014లో ఎంపీగా పోటీచేసిన బెయెర్ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడాయి. 2017లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా జరిగింది. గతవారం రోజులుగా బెయెర్ తన స్నేహితులు, సన్నిహితులతోనే గడపినట్లు తెలుస్తోంది. చదవండి: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ -
హిజ్రాపై దాష్టికం.. జట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ..
చెన్నై: హిజ్రాపై దారుణానికి తెగబడ్డ ఇద్దరు యువకులను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ హిజ్రాను పొలంలో చీర చించేసి.., జుట్టు కత్తిరించి.. చిత్రవధ చేస్తూ హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు ట్యూటికోరిన్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 19 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో.. బ్లేడ్‌తో హిజ్రా జుట్టును కోసేసి పొలంలో పడేశారు. ఆమె ముఖం దాడి మూలంగా ఛిద్రమైనట్లు కనిపిస్తోంది. ఆ పక్కనే మరో హిజ్రా ఉండగా.. దాడికి పాల్పడ్డ ఇద్దరు యువకులు ‘‘వీళ్లను చూడండి. ఇంతకాలం మగవాళ్ల నుంచి డబ్బు దోచుకున్నారు. ఇప్పుడు మనమేం చేయాలి? అంతా అయిపోయింది. వీళ్లేం అందంగా కనిపించడం లేదు కదా’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. Couple of trans women attacked by this goons @tnpoliceoffl @CityTirunelveli @TUTICORINPOLICE @sivagangapolice @mducollector @maduraipolice .Break your silence pic.twitter.com/HHwGuTJtI2 — GRACE BANU (@thirunangai) October 12, 2022 మరో వీడియోలో హిజ్రాలు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు వైరల్ అయ్యింది. హిజ్రా హక్కుల ఉద్యమకారిణి గ్రేస్ బాను ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు సౌత్ జోన్ పోలీసులు స్పందించారు. నిందితులను నోవాహ్, విజయ్‌గా నిర్ధారించారు. ఆ ఇద్దరికి వీడియోలో ఉన్న హిజ్రాలు బాగా తెలుసని, వాళ్లలో ఓ జంటకు సంబంధం కూడా ఉందని, కానీ, విడిపోవడంతోనే ఇలా దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. ఇదీ చదవండి: ఈరోజుల్లో ఇంత నిజాయితీగా బతుకుతున్నారా? -
భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి...
Mutilated Body Found In Indore: ఇండోర్‌లోని పోలీసులు పొదలమాటున చిద్రమైన ట్రాన్స్‌జెండర్ మృత దేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసు మిస్టరిని చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం....పోలీసుల గుర్తించిన ఆ ట్రాన్స్‌జెండర్ మృతదేహంలో ఒక భాగం మాత్రమే లభించింది. దీంతో పోలీసుల ఆ పరిసర ప్రాంతాల్లో పీసీఫుటేజ్‌ని పరిశీలించగా.... చనిపోయిన ట్రాన్స్ జెండర్ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్ జోయా కిన్నార్‌గా గుర్తించారు. ఐతే ఈ కేసులో అనుమానితుడు ఖజ్రానాకు చెందిన నూర్‌మహ్మద్‌గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతను విచారణలో చెప్పిన విషాయలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. నిందితుడు విచారణలో అతని భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్ జోయాతో సోషల్ మీడియాలో చాటింగ్ చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత తాను జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించానని చెప్పాడు. ఇంటికి వచ్చాకే జోయా ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందని, దీంతో ఈ విషయమై మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు. ఆ కోపంలో తాను ఆమె గొంతుకోసి చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి, అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి బైపాస్ సమీపంలోని పొదల్లోకి విసిరేసినట్లు తెలిపాడు. మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోనే పెట్టేలో భద్రపరిచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు మిగతా భాగం మృతదేహాన్ని నిందితుడు నూర్‌మహ్మద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి) -
ఎలన్ మస్క్‌పై కోర్టుకెక్కిన కన్నకొడుకు!
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయన కన్నకొడుకు గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్.. కోర్టుకెక్కాడు. అయితే అది ఆస్తి కోసం మాత్రం కాదు. తండ్రి పేరుతో సంబంధం లేకుండా బతకడానికి, ఆయన నీడలో బతకడం ఇష్టం లేక.. అంతకు మించి సొసైటీలో ‘జెండర్’ గుర్తింపు కోసం! ఎలన్ మస్క్ మొదటి భార్య.. కెనడా నటి జస్టిన్ విల్సన్. 2000 సంవత్సరంలో జస్టిన్ను మస్క్ వివాహం చేసుకుని.. ఎనిమిదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఈ ఇద్దరికీ ఆరుగురు సంతానం. తొలి దఫాలో ఐవీఎఫ్ ద్వారా కవలలను కంది జస్టిన్. ఇందులో ఒకడే గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్. ఇక విడాకుల తర్వాత తల్లిదండ్రులు పిల్లల సంరక్షణను సమానం చూస్తున్నారు. అయితే గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్ ‘ట్రాన్స్‌జెండర్’. సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయాడు. వివియన్ జెన్నా విల్సన్‌గా పేరు మార్చుకున్నాడు. తాజాగా.. 18 ఏళ్లు నిండడంతో ఎలన్ మస్క్‌తో తనకు సంబంధాలు వద్దంటూ కోర్టుకు ఎక్కాడు(ఎక్కింది). ‘‘నేను ఇకపై ఏ విధంగా, ఆకారం, రూపం, గుర్తింపులో.. కన్నతండ్రి నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నా. ఆయన గుర్తింపు ఇకపై నాకు అక్కర్లేదు. నా పేరు మార్పిడికి అనుమతించండి. నా లింగమార్పిడికి చట్టబద్ధత ఇవ్వండి’’ అంటూ.. శాంటా మోనికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ఏప్రిల్ నెల చివర్లోనే వివియన్ తన పిటిషన్ దాఖలు చేసింది. కానీ, అందులోని ఆసక్తికర వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. గ్జావియర్ పాత ఫొటో కాలిఫోర్నియాలో ఉంటున్న గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్(వివియన్ జెన్నా విల్సన్).. తన కొత్త పేరుకు అధికారిక గుర్తింపు ఇవ్వడంతో పాటు.. కన్నతండ్రి ఎలన్ మస్క్ గుర్తింపును, ఆయన అందించే సాయాలను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొంది. తండ్రి నీడలో బతకడం ఇష్టం లేదంటూ పిటిషన్లో పేర్కొంది వివియన్. ఇదిలా ఉంటే.. ఆ తండ్రి, ట్రాన్స్‌జెండర్ కూతురు మధ్య గొడవ ఏంటన్నదానిపై స్పష్టత లేదు. ఇరు పక్షాల లాయర్స్ సైతం దీనిపై స్పందించలేదు. మరోవైపు ట్రాన్స్‌జెండర్ హక్కుల విషయంలో రిపబ్లికన్ పార్టీకి మద్దతు ప్రకటించాడు ఎలన్ మస్క్. తాజా చట్టం ప్రకారం.. అమెరికాలో ట్రాన్స్‌జెండర్ హక్కులపై పరిమితులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో.. తండ్రి వైఖరిపై అసంతృప్తితోనే గ్జావియర్ అలియాస్ వివియన్.. ఇలా పిటిషన్ వేసి ఉంటుందని భావిస్తున్నారు. -
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతోనూ ఉంటానన్నాడు.. అయితే..
సాక్షి, మదనపల్లె: ఇంటర్ చదివే రోజుల్లో పరిచయమయ్యాడు.. అమ్మాయిగా మారితే పెళ్లి చేసుకుంటానన్నాడు.. అమ్మాయిగా మారాక ఆరేళ్ల పాటు నాతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. నాకు న్యాయం చేయండి.. అంటూ ఓ ట్రాన్స్‌జెండర్ పోలీసులను ఆశ్రయించింది. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెకు చెందిన స్వీటీ అలియాస్ లోకేష్ మదనపల్లెలో ప్రైవేట్ ఇంటర్ కళాశాలలో చదివేటప్పుడు ములకలచెరువు మండలం పత్తికోటకు చెందిన మహేష్‌తో పరిచయమేర్పడింది. ఇద్దరు ఒకరు విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. చదవండి: (పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే..) ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని లోకేష్‌ను అమ్మాయిగా మారాలని మహేష్ కోరాడు. దీంతో లోకేష్ శస్త్రచికిత్స చేయించుకుని స్వీటీగా మారిపోయాడు. ఇద్దరూ ఆరేళ్లపాటు సహజీవనం చేశారు. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, వంశవృద్ధి కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మహేష్ హేళన చేస్తూ ఇటీవల స్వీటీతో తెగతెంపులకు సిద్ధపడ్డాడు. దీంతో తనను ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు మహేష్‌పై కేసు నమోదుచేసి తనతో పెళ్లి జరిపించాల్సిందిగా రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి స్వీటీ ఫిర్యాదుచేసింది. చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..) ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో స్వీటీ మీడియాతో మాట్లాడుతూ తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రేమాయణానికి సంబంధించి ఆధారాలు తన సెల్ఫోన్లో ఉంటే వాటిని మహేష్ తొలగించాడంది. గతంలో ఓసారి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మహేష్‌పై ఫిర్యాదుచేయగా.. పోలీసుల ముందు పెళ్లి చేసుకుంటానని అంగీకరించి ఆపై మాట మార్చాడని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించే సరికి.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతోనూ ఉంటానని రాజీకి వచ్చాడంది. అయితే తనను కాకుండా మహేష్ వేరొకరిని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని కరాఖండిగా చెప్పడంతో తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వాపోయింది. మహేష్ కోసం మగతనాన్ని త్యాగం చేసిన తనకు అతడితోనే పెళ్లి జరిపించి న్యాయం చేయాల్సిందిగా ప్రాధేయపడింది. చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం') -
హిజ్రాను ప్రేమించి పెళ్లాడిన యువకుడు అనుమానాస్పద మృతి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): హిజ్రాను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూరాజరాజేశ్వరీపేటలో శనివారం చోటుచేసుకుంది. న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన వడ్డీ రమదేవి, రామారావు దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు వడ్డీ ప్రవీణ్‌కుమార్ (26) రెండేళ్ల క్రితం న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన అవ్వ మాధవి అనే హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి తన తల్లిదండ్రుల పక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నారు. వారిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ మళ్లీ సర్దుకొని జీవిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్‌లో తమ బంధువుల ఇంట్లో వేడుక ఉంటే వెళ్లగా హిజ్రా మాధవి శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో తమ కుమారుడు ఉరేసుకొని చనిపొయినట్లు ఫోను చేసి చెప్పింది. దీంతో వారు హూటాహూటిన నగరానికి చేరుకొని తమ కుమారుడి భౌతికకాయాన్ని చూసి కుమిలిపోయారు. తమ కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!! -
తన ఫ్రెండ్ ట్రాన్స్‌జెండర్‌తో ఉపాసన, సోదరి పెళ్లి వేడుకలకు ఆహ్వానం
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భార్యగా, అపోలో అధినత మనవరాలిగా కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ ఉపాసన కామినేని కొణిదెలగా ఆమె తనకంటూ ఓ బ్రాండ్ నేమ్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక ఫిట్నెస్తో పాటు తన వ్యక్తిగత విషయాలు, భర్త రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. చదవండి: ప్రియమణిపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ ఇటీవల సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెండర్ డిస్క్రిమినేషన్పై స్పందిస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్‌జెండర్ అని చెప్పారు. అయితే ఇప్పుడు తన ట్రాన్స్ జెండర్ కమ్యునిటీలో కలిసి తీసుకున్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన సోదరి అనుష్ పాలా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా ఉపాసన ట్రాన్స్ జెండర్ల కమ్యునిటీ సభ్యులను ఇంటికి ఆహ్వానించి వారితో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అనంతరం వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. చదవండి: రాజ‘శేఖర్’ మూవీకి ఓటీటీ షాకింగ్ రేట్స్! ‘ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది మానవత్వం, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి ఒక సరైన అవకాశం. భారతదేశంలోని పురాతనమైన వాటిలో ఇది ఒకటి. అనుష్ పాల్ వివాహ వేడుకలను అప్యాయంగా ప్రారంభించినందుకు లక్ష్మీనారాయణ త్రిపాఠికి ధన్యవాదాలు. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలానేది మీరు ఎల్లప్పుడూ నాకు నేర్పుతారు. హైదరాబాద్‌లోని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సమాజాన్ని నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను. హైదరాబాద్ లోని 6 బదాయి గృహాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం విశేషంగా భావిస్తున్నాం. జీవితం గురించి చెప్పడానికి వారి వద్ద గొప్ప కథలు ఉన్నాయి. ఆ కమ్యూనిటీతో మరింత సన్నిహితంగా సంభాషించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఉపాసన తన పోస్ట్‌లో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
Jogati Manjamma Story: చచ్చిపోదామని విషం తాగాను
-
వారినలా విసిరివేయకండి: చచ్చిపోదామని విషం తాగాను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న జానపద నృత్యకారిణి మంజమ్మ జోగతి. పద్మశ్రీ పొందిన తొలి ట్రాన్స్‌విమెన్. కేవలం జోగప్పలకు పరిమితమైన జోగతి నృత్యాన్ని మరింత విస్తరించాలనేది ఆమె కల. ఈ నేపథ్యంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగానే ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు మంజమ్మ. పదిహేనేళ్లు ఉన్నప్పుడు ట్రాన్స్‌జెండర్‌గా కుటుంబానికి దూరమయ్యారు. ఇంటినుంచి బైటపడి బతుకుదెరువు కోసం వీధుల్లో భిక్షాటన చేయడమే కాదు, ఆమె పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఒకానొక దశలో విషం తాగి చచ్చిపోవాలకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. అయినా 20 మంది తోబుట్టువులతో సహా ఆమె కుటుంబ సభ్యులెవరూ తనను పలకరించేందుకు ఆసుపత్రికి రాలేదని ఆమె వాపోయారు. ఈ అవార్డు ద్వారా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులను గుర్తించి వారికి విద్య, ఉద్యోగాలు అందించేలా ప్రభుత్వాలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం చేయకుండా, మూలకు విసిరి వేయకుండా తనలాంటి ట్రాన్స్‌జెండర్ పిల్లలను ఆదరించాలని ఆమె ఉద్వేగ భరితంగా చెప్పుకొచ్చారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. 1964 ఏప్రిల్ 18న బళ్లారి, కల్లుకాంబ గ్రామంలో హనుమంతయ్య, జయలక్ష్మి దంపతులకు జన్మించిన మంజునాథ్ అలియాస్ మాత మంజమ్మ జోగతి జీవిత విశేషాలపై ఆసక్తికర వీడియో మీకోసం.. -
'నన్ను పావుగా వాడుకోడానికే ఆహ్వానించారు'
మీరు ఇటీవలే ఈమె ఫొటోను మన ‘ఫ్యామిలీ’లో చూసి ఉంటారు. ఈమె కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్ ఉమన్ అని, ఎమ్మెల్యేగా గెలిస్తే మహిళలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈమె అనినట్లు చదివిన జ్ఞాపకం కూడా మీకు ఉండి ఉంటుంది. ఈమె పేరు అనన్యా అలెక్స్. వెంగర్ నియోజకవర్గం నుంచి ‘డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ అభ్యర్థిగా మార్చి 19 న నామినేషన్ వేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు మార్చి 22 కూడా దాటì పోయింది. ఏప్రిల్ 6న పోలింగ్‌కి అన్ని పార్టీల అభ్యర్థులూ ముగింపు ప్రచార కార్యక్రమాల్లో ఉండగా అనన్య అకస్మాత్తుగా.. తను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఏప్రిల్ 3 న ప్రకటించారు!! ఎందుకలా ఈమె అర్ధంతరంగా తన ప్రచార వేదికను, రాజకీయ రంగాన్ని దిగి వెళ్లిపోయారు?! అనన్యా అలెక్స్ ఆఖరి నిముషంలో మనసు మార్చుకోడానికి కారణం ఆ మనసు పడిన ఆవేదన! రాజకీయాల్లోకి వచ్చాక ఈ వేదనలు, ఆవేదనలు ఉంటాయా అనే ప్రశ్న వేసే ముందు ఆమేం చెబుతున్నారో వినవలసిన బాధ్యత ఉంటుంది ఎవరికైనా. అనన్య ఏదో అయిపోదామని పాలిటిక్స్‌లోకి రాలేదు. ఏదో చేద్దామని వచ్చారు. ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారో ఆ ‘డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ (డి.ఎస్.జె.పి.) కూడా నిన్నమొన్నటి పార్టీనే. రాజకీయాల్ని ప్రక్షాళన చేయబోతున్నాం అంటూ 2019లో ఆవిర్భవించిన ఆ పార్టీ ఇప్పుడు తనని తనే ప్రక్షాళన చేసుకోవలసిన అవసరాన్ని తెచ్చుకున్నట్లు అనన్య మాటల వల్ల స్పష్టం అవుతోంది. ‘‘నన్ను ఒక పావుగా వాడుకోడానికి మాత్రమే రాజకీయాల్లోకి ఆహ్వానించారు’’ అంటున్నారు అనన్య. సొంత పార్టీవాళ్లే ఆమెను మానసికంగా వేధిస్తూ, అసభ్యంగా దూషిస్తూ ప్రత్యర్థులపై వ్యక్తిగత దుష్ప్రచారం చెయ్యాలని ఆమెను బలవంత పెడుతున్నారట! ఇప్పుడిక హత్యచేస్తామన్న బెదరింపులు కూడా వస్తున్నాయని ఆమె చెబుతున్నారు. ఎందుకంటే.. చెప్పినట్లు వినడం లేదని! వాళ్లేం చెబుతున్నారంటే.. అనన్యను ఎన్నికల ప్రచారంలో బురఖా వేసుకొమ్మని బలవంతం చేస్తున్నారు. వెంగర్ నియోజకవర్గంలో ముస్లిం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ‘నేనలా చేయలేను’ అన్నారు అనన్య. ఆమె ప్రత్యర్థి, ముస్లిం లీగ్ పార్టీ సీనియర్ నాయకుడు పీకె కున్హలికుట్టి చెడ్డవాడని; మరొక ప్రత్యర్థి, లెఫ్ట్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి పి.జీజీ ఒక తెలివి లేని మనిషి అని ప్రచారం చెయ్యమని ఒత్తిడి తెస్తున్నారు. ‘‘నేనలా చేయలేను’’ అన్నారు అనన్య. అంతే.. ట్రాన్స్ ఉమెన్‌గా ఆమెపై వేధింపులు, లైంగిక హింస మొదలయ్యాయి. పార్టీలోని పైవాళ్లకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అనన్యతో అదే విధంగా, గౌరవం లేకుండా ప్రవర్తించారు! దాంతో మనస్తాపం చెంది, తన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఆఖరి నిముషంలో ప్రచారం నుంచి తప్పుకున్నారు అనన్య. ‘‘నా వ్యక్తిత్వాన్ని చంపేసే ఏ పనినీ నేను చేయలేను’’ అని ఆమె అంటున్నారు. మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం కనబరిచిన అనన్యకు... అభివృద్ధి పనుల గురించి చెప్పకుండా తన ప్రత్యర్థుల వ్యక్తిగత బలహీనతల గురించి మాట్లాడమని పార్టీ ఆదేశించడం ఆగ్రహం తెప్పించింది. కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ రేడియో జాకీ అయిన అనన్య.. జీవితంలోని మంచి చెడుల గురించి రోజూ రేడియో శ్రోతలకు తనదైన ఆకట్టుకునే శైలిలో వినిపిస్తూ ఉంటారు. ‘‘ఇప్పుడు కనుక పార్టీ చెప్పినట్లు చేస్తే ఇప్పటì వరకు నువ్వు సంపాదించుకున్న మంచి పేరుతో పాటు రేడియో జాకీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని సన్నిహితులు చేసిన హెచ్చరికలకు కూడా విలువ ఇచ్చి ఆమె బరి నుంచి బయటికి నడిచారు. అనన్య రేడియో జాకీ మాత్రమే కాదు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, న్యూస్ యాంకర్ కూడా. శుక్రవారం నాడు అర్థంతరంగా ప్రచారాన్ని వదిలేసి వచ్చాక కూడా తన వెంటపడి ఎంత హీనంగా తనను ఎన్ని మాటలు అన్నారో అవన్నీ రాసి తన పార్టీ పెద్దలపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు అనన్య. అంతేకాదు.. మహిళలు, ట్రాన్స్జెండర్లంటే మర్యాద లేని డి.ఎస్.జె.పి.కి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత వేళలంటూ లేకుండా ఆమె చేత ప్రచారం చేయించడంతో అనన్య ఆరోగ్యం క్షీణించింది. కొల్లం జిల్లా పెరుమన్ గ్రామంలో పుట్టి తనకంటూ కేరళ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్న అనన్య పాఠశాల విద్యతోనే చదువు మానేశారు. ఇక ఏ రాజకీయ గొడవలూ లేకుండా, చేస్తున్న ఉద్యోగాలలోనే కొనసాగుతూ ఉన్నత విద్యను పూర్తి చేయాలని ఇప్పుడు ఆశిస్తున్నారు. జెండర్‌కు అతీతంగా చదువు గౌరవాన్ని ఇస్తుందని ఆమె నమ్ముతున్నారు. -
మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ..
ముంబై లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్లో రోజూ రాకపోకలు సాగించే వారికి నత్య పరిచయస్తురాలైన ట్రాన్స్ఉమన్ పూజాశర్మ రేఖ దగ్గర ‘శుభములనివ్వుమమ్మ’ అంటూ దేశ విదేశాల్లోని వారు కూడా నేరుగానో, వీడియో కాల్లోనో దీవెనలు అందుకుంటూ ఉంటారు. నటి రేఖ పోలికలు, కవళికలు ఉంటాయని అంతా అంటుండే పూజ ఎక్కడివారు? మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ.. ఎలా అయ్యారు? మొదట మీరు చీరకట్టులో సినీనటి రేఖ ఎలా ఉంటారో ఊహకు తెచ్చుకోండి. ఒక్క కట్టే కాదు.. రేఖ బొట్టు, రేఖ ధరించే ఆభరణాలు, రేఖ నవ్వు, ఆ మాట తీరు, ఆ హుందాతనం అన్నీ కలిపి సృష్టికి పరిపూర్ణతలా ఎలాగైతే ఉంటాయో సరిగ్గా అలాగే ఉంటారు పూజాశర్మ. రేఖను తీసి రేఖను పెట్టినట్లుగా!! ఇంతకీ ఈ పూజ ఎవరంటే.. ముంబైలో ఉదయం పూట పట్టాల మీదకు వచ్చే లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్ సెలబ్రిటీ. సోషల్ మీడియాలో లక్షా యాభై వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న ‘ఇన్ఫ్లుయెన్సర్’. ఇంత నిండైన మనిషిలోని మిగతా ప్రత్యేకతలన్నీ తెలుసుకున్నాక మాత్రమే ఆమె ట్రాన్స్ ఉమన్ అని చెప్పుకుండే చెప్పుకోవచ్చు పూజ ట్రైన్ డాన్స్ లోకల్ ట్రైన్లో పూజ డాన్స్ చేస్తారు. చక్కటి మాటల్తో మోటివేట్ చేస్తారు. అసలు ఆమెను చూడగానే నమస్కరించేవారు, నమస్కరించాలని అనిపిస్తుంది అనేవారు కూడా ఉన్నారు. ఆఫీసు వేళల కోసం నడిచే ఉమెన్ స్పెషల్ ట్రైన్ వెళ్లిపోయాక.. ప్లాట్‌ఫామ్ మీద పూజ ఒక్కరే నిలబడిపోతారు. ఆ తర్వాత ఆమె పండ్లే అమ్ముతారో, స్త్రీల లోదుస్తులు విక్రయించే దుకాణాలకు కాపలాదారుగా ఉంటారో, బంగారు ఆభరణాల షాపులో సహాయకారిలా ఉంటారో లేక వస్త్ర ఉత్పత్తుల కర్మాగారం ఆఫీస్ ప్యూన్‌గా వెళతారో, అపార్ట్మెంట్లకు ఇస్త్రీ బట్టలనే బట్వాడా చేస్తారో.. అది ఆమెకు దొరికిన పనిని బట్టి ఉంటుంది. ఆమె అనుదిన జీవనయానం ప్రారంభం అయ్యేది మాత్రం మహిళల లోకల్ ట్రెయిన్ ఫస్ట్ ట్రిప్‌లోనే. అది ఆమెకు మనోల్లాసాన్ని మాత్రమే కాదు, గుర్తింపునూ ఇస్తుంది. యాచన ఉండదు. ఇస్తే వద్దనీ అనరు. ఇచ్చేవారు గౌరవం కొద్దీ ఇస్తే, వారి గౌరవం కొద్దీ వద్దనకుండా తీసుకుంటారు పూజ. ‘రేఖలా ఉన్నావు’ అని అందరూ అంటుంటే తనూ రేఖలా రూపాంతరం చెందుతూ వచ్చిన పూజ ముంబై అమ్మాయి కాదు. కలకత్తా నుంచి ముంబై వచ్చిన అమ్మాయి. అమ్మాయి కూడా కాదు. అబ్బాయి. ఆ అబ్బాయి పేరే శర్మ. ఇప్పుడు ముంబైలో చేస్తున్న పనులనే ఆమె కలకత్తా లోనూ చేసేవారు. పురుషుడి దేహాన్ని కలిగి ఉన్న తన స్త్రీ మనసును గేలి చేయడం తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. ముంబై ఆమెను ఆదరించింది. పూజ అందమైన స్వభావం వల్ల, ముంబైకి గ్లామర్ సెన్స్ ఎక్కువ కనుకా బహుశా ఆమెకు ఆదరణ లభించి ఉండాలి. అసలైతే ఆమె డాన్సర్ కాదు. ముంబై లో అంతా తన రూపలావణ్యాలను చూసి రేఖ అనడంతో, రేఖ అవడం కోసం ఆమె డాన్స్ ప్రాక్టీస్ చేశారు. వచ్చే కాస్త డబ్బుతోనే మోడర్న్ డ్రెస్‌లు వేసుకున్నారు. మంచి చీరలను కొనుక్కున్నారు. ముంబైలోని ఒక జాతీయ దినపత్రిక జర్నలిస్టు.. ఇంటర్వ్యూ కు ఆమెను ఒప్పించేందుకు ఆమెతో మాటలు కలుపుతూ ఉన్నప్పుడు అతడితోపాటు వచ్చిన ఫొటోగ్రాఫర్ ఆమెకు తెలియకుండా ఫొటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె గురించిన వివరాలను ఇవ్వడంతో ఒక్కరోజులో పూజ సెలబ్రిటీ అయ్యారు. చాలాకాలం కిందటి సంగతి అది. మార్చి 8 న మహిళా దినోత్సవం రోజు ‘రేఖ’ అనే పేరున ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు వేల ప్రశంసలు వచ్చాయి. ముంబై ఆమెను పూర్తి మహిళగా స్వీకరించింది. రేఖలా పూజా! తర్వాతి నుంచీ పూజే తన వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. బిడ్డల్ని ఎత్తుకుని వచ్చి ఆమె ఆశీస్సులను కోరుతున్న తల్లులు, ప్రారంభోత్సవాలకు ఆమెను ఆహ్వానిస్తున్న వ్యాపారాల యజమానులు, పరీక్షలకు వెళ్లే ముందు బ్లెస్ చేయమని వచ్చి అడిగే విద్యార్థులు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు.. వీళ్లంతా ఉన్న వీడియోలను చూసి విదేశాల నుంచి కూడా ఆమె దీవెనల కోసం అభ్యర్థనలు రావడం మొదలైంది! ఆ సమయంలో కనుక పూజ ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటే.. తన సెల్ఫోన్లోనే వారిని, వారిని పిల్లల్ని దీవించినట్లుగా వారి తలపై చెయ్యి ఉంచుతారు. మరి ఆమెను దేవుడు గానీ, మరెవరు గానీ దీవించలేకపోయారా! ‘‘మనుషులంతా మంచివాళ్లు. దేవుడు శక్తిమంతుడు. ఆ మంచితనం, ఆ శక్తి నన్ను నడిపిస్తున్నాయి. దేనికీ లోటు లేకుండా జీవిస్తున్నాను’’ అంటారు. పేరుకు మాత్రమే ఆమె పూజ కాదు. నిత్యం దైవారాధన చేస్తారు. ఆ తర్వాత ఆమె పొందే శక్తితో ఆమె ప్రయాణించే రైలు నడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది! మనసు లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఒత్తిళ్లతో ప్రయాణిస్తుండే మహిళల్ని ఆ కొద్దిసేపూ పూజ పలకరింపు, పూజ అభినయం సేద తీరుస్తాయి. ‘అసలు ఆమెను చూడగానే మనసుకు ఎక్కడ లేని సత్తువ వచ్చేస్తుంది’ అనేవారూ ఉన్నారు. పూజ పోస్ట్ చేసిన ఒక వీడియోను చూసి.. ‘‘పూజా.. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. బాహ్యంగా, అంతర్లీనంగా కూడా’’ అని ప్రముఖ టీవీ నటి అంకితా లొఖాండే ఇటీవల కామెంట్ పెట్టడం పూజను ఎంతగానో సంతోషపరచిందట. ‘నువ్వు బాగున్నావు’. ‘నువ్వు చేసిన పని బాగుంది’ అనే మాటలు బతుకులోని చేదును తగ్గిస్తాయని పూజ అంటారు. ఆమె బాల్యం ఒక చేదు జ్ఞాపకం. ఆమె వర్తమానం ఆ చేదును మరిపిస్తున్న తియ్యదనం. ఇక్కడ చదవండి: పాలు పోయడానికి వచ్చా.. ఓట్లివ్వండి తన కల కోసం కూలీగా మారింది! -
కర్ణాటకలో తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాది
మైసూరు: సమాజంలో అందరితో సమానంగా జీవించేందుకు అనేక హక్కులు సాధించుకున్న ట్రాన్స్జెండర్లు నైపుణ్యాలు పెంపొందించుకొని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటకలో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. మైసూరులోని జయనగర నివాసి శశికుమార్ అలియాస్ శశి ప్రస్తుతం ఒక సీనియర్ న్యాయవాది వద్ద సహాయకురాలిగా పని చేస్తున్నారు. 14 సంవత్సరాల వరకు యువకుడిగా ఉన్న ఈయన హార్మోన్స్‌లో వచ్చిన మార్పులతో యువతిగా మారాడు. మైసూరులోని అశోకపురంలో ఉన్న సిద్ధార్థ పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివిన శశి, మైసూరులో సైన్స్(పీసీఎంబీ) చదివారు. తర్వాత కువెంపు నగరంలో ఉన్న సోమాని కళాశాలలో ఆర్ట్స్ విభాగంలో శిక్షణ పొందారు. కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో ప్రజా పరిపాలన కోర్సు చదివారు. 2018లో విద్యావర్ధక లా కళాశాలలో చేరి మూడేళ్ల లా కోర్సు పూర్తి చేశారు. చదువంటే ఎంతో ఇష్టం.. శశి మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. ఎంతో మంది అవహేళన చేసినా ఉన్నత విద్య అభ్యసించేందుకు శ్రమించాను. ఫీజులు చెల్లించేందుకు డబ్బు లేక పలువురి ఇళ్లలో పని చేశాను. తోటి విద్యార్థుల వద్ద కూడా అవమానాలు ఎదుర్కొన్నా. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచించుకోవాలని కొందరు ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పంచకర్మ వైద్యురాలు డాక్టర్ జే.రశ్మిరాణి నా ఉన్నత చదువులకు ఫీజులు చెల్లించి ఎంతో సహకారం అందించారు. మున్ముందు న్యాయమూర్తిగా ఎదగాలనేది నా ఆశయం’ అని తెలిపారు. చదవండి: 150 ఏళ్ల అనంతరం తొలి ఉరి.. 40 ఏళ్లలో తొలిసారి దిశ రవి.. ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే ఏమిటి? -
ప్రేమించినవాడితో నటి, ట్రాన్స్‌వుమెన్ పెళ్లి
తిరువనంతపురమ్: నటి, ట్రాన్స్‌వుమెన్ ఎలిజబెత్ హరిని చందన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. కొంతకాలంగా తను గాఢంగా ప్రేమిస్తున్న సునీష్‌ను వేదమంత్రాల సాక్షిగా మనువాడారు. కేరళలోని ఎర్నాకులమ్ బీటీహెచ్ హాల్లో ఈ పెళ్లి తంతు జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సెలబ్రిటీల మేకప్ ఆర్టిస్ట్, ట్రాన్స్‌జెండర్ రెంజు రెంజిమార్ వధువు తల్లి స్థానంలో నిలబడి తంతును పూర్తి చేశారు. ఎలిజబెత్‌ను పెళ్లి కూతురిని చేసే దగ్గర నుంచి అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "తల్లిగా నా బాధ్యతలను పూర్తి చేశాను. నా చేతుల మీదుగా కూతురి పెళ్లి చేశాను. భగవంతుడికి కృతజ్క్షతలు" అని రాసుకొచ్చారు. (చదవండి: ఇంట్లో నా ప్రవర్తన నచ్చలేదు) కాగా కుంబలంగికి చెందిన హరిని చందన 17 ఏళ్ల వయసులో సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారారు. 2017లో కొచ్చిలో జరిగిన ట్రాన్స్‌జెండర్ అందాల పోటీలో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. అనంతరం సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 'దైవత్తింటే మనవట్టి' అనే మలయాళ హిట్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో నటుడు జయసూర్య ముఖ్యపాత్రలో కనిపించారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు) View this post on Instagram A post shared by Renju Renjimar (@renjurenjimar) View this post on Instagram A post shared by Renju Renjimar (@renjurenjimar) -
అక్షయ్ ఔదార్యం.. కోటిన్నర విరాళం
సాక్షి, చెన్నై : సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ట్రాన్స్జెండర్లకు గృహ నిర్మాణం నిమిత్తం రూ. కోటిన్నర నగదును విరాళంగా ప్రకటించారు. ప్రముఖ నటుడు, దర్మకుడు రాఘవ లారెన్స్‌తో కలిసి ఆదివారం చెన్నైలో ట్రాన్స్జెండర్లకు చెక్కును బహుకరించారు. ఈ విషయాన్ని లారెన్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గృహ నిర్మాణం కొరకు ఓ హీరో ఇంత పెద్దమొత్తంలో నగదును విరాళం ప్రకటించడం దేశంలో ఇదే తొలిసారి అని లారెన్స్ పేర్కొన్నారు. కాగా అనాథ పిల్లల కోసం లారెన్స్ ఇదివరకే ఓ ట్రస్ట్‌కు కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రతి ఏటా ఎంతో మందికి నివాసం కల్పిస్తూ.. వారి బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇదిలావుండగా రాఘవ లారెన్స్ దర్మకత్వంలో విడుదలైనలక్ష్మీ బాంబ్ చిత్రంలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో అక్షయ్ నటించి.. మెప్పించిన సంగతి తెలిసిందే. -
ఇలాంటి పెళ్లికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలో..!!
నిన్నటి వాలంటైన్స్ డే మణిగంధన్‌కి, సురేఖకు ప్రత్యేకమైనది. ఈ భార్యాభర్తలకు నిన్న మ్యారేజ్ సర్టిఫికెట్ వచ్చింది! కోయంబత్తూర్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళ్లి ఓ సంతకంపెట్టి, పనిలో పనిగా అక్కడి అధికారులకు ఓ దండం పెట్టి బయటికి వచ్చింది ఈ జంట. రెండేళ్లుగా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారు మణిగంధన్, సురేఖ. సరిగ్గా రెండేళ్ల క్రితం వాలంటైన్స్ రోజునే ఫిబ్రవరి 14న వాళ్ల పెళ్లి జరిగింది. చివరికి ఈ నెల మొదట్లో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీకు సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఎప్పుడొచ్చి తీసుకుంటారు?’’ అని. అచ్చం సినిమాల్లో చూపించినట్లే.. ఆనందంతో ఎగిరి గంతేశారు. వాలంటైన్స్ డే రోజు వచ్చి తీసుకుంటాం సార్ అని చెప్పారు. వెళ్లి తీసుకున్నారు. మణిగంధన్, సురేఖలకు మ్యారేజ్ సర్టిఫికెట్ రావడానికి ఇంత సమయం పట్టడం వెనుక పెద్ద కారణమే ఉంది. మణిగంధన్ అబ్బాయి. సురేఖ అమ్మాయి లాంటి అబ్బాయి. ట్రాన్స్ ఉమన్! ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి.సమాజం కూడా ఒప్పుకుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్లకే ఒప్పుకోడానికి చట్టం అడ్డుపడింది. ఒక పురుషుడికి–స్త్రీకి మధ్య జరిగిన పెళ్లికైతే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వగలం కానీ.. ఇలాంటి పెళ్లికి ఏ సెక్షన్ కింద వివాహ పత్రం ఇవ్వాలో తెలియడం లేదు అనేశారు. ‘‘లేదు, మాకు సర్టిఫికెట్ కావలసిందే’’ అని ఈ దంపతులు పట్టుపట్టారు. చట్టాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి కూడా సిద్ధమైపోయారు. చెన్నై వెళ్లి ఇన్స్పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్) ని కలిశారు. ‘అవకాశం ఉందేమో చూస్తాను’ అని ఐజీ గారు వాళ్లు పంపించి, సిబ్బంది చేత చట్టాల పుస్తకాలు తెప్పించుకున్నారు. 2009 తమిళనాడు రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజస్ యాక్ట్‌లో సన్నటి దారం లాంటి ఆధారం దొరికింఇ. దాన్ని పట్టుకుని.. ఈ ఏడాది జనవరి 28న అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు నోటిఫికేషన్ పంపించారు. ట్రాన్స్‌జెండర్ పెళ్లిళ్లను చట్టబద్దం చేసే ఉత్తర్వు అది. ఆ ఉత్తర్వు కోయంబత్తూరు కూడా చేరింది. అక్కడి అధికారులు వెంటనే మిసెస్ అండ్ మిస్టర్ మణిగంధన్‌కి వర్తమానం పంపారు.. ‘వియ్ ఆర్ రెడీ టు గివ్ యు..’ అని. మొత్తానికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఈ ఆలూమగల చేతికి వచ్చింది. అయినా సర్టిఫికెట్ కోసం ఎందుకు ఇంతగా వీళ్లు పోరాడారు? ‘‘బిడ్డను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలన్నారు. ఇప్పుడు ఉంది. త్వరలో మేము అమ్మానాన్న కాబోతున్నాం’’ అన్నారు మణిగంధన్, సురేఖ.. చిరునవ్వులు చిందిస్తూ. -
వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..! ట్విస్ట్ ఏంటంటే?
సాక్షి, సూర్యాపేట: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు..! అయితే అన్ని ప్రేమకథల్లాగే ఈ స్టోరీలో కూడా వారి పెళ్లికి ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. ఇంతవరకూ స్టోరీ రొటినే. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే..వాళ్లిద్దరూ అబ్బాయిలు. ఔను..ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమ..పెళ్లికి దారి తీసింది. అయితే లింగ మార్పిడి చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు షరతు పెట్టాడు. దీంతో రెండో యువకుడు.. లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. అయితే లాస్ట్‌మినిట్‌లో మొదటి యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడు.. కొలువు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సూర్యాపేటకు చెందిన గుండ్లగాని సాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో దగ్గరైన వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. మహిళగా మారితేనే పెళ్లి చేసుకుంటానని సాయి చెప్పడంతో.. జానయ్య లింగమార్పిడి చేయించుకున్నాడు. తీరా మహిళగా మారిన తర్వాత సాయి పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ పంచాయితీని ఎలా విప్పాలో తెలియక పోలీసులు తలల పట్టుకున్నారు. -
అందుకు ఒప్పుకోలేదని హిజ్రాపై కాల్పులు!
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ట్రాన్స్‌జెండర్ శృంగారానికి అంగీకరించలేదని దుండగులు నడ్డిరోడ్డుపై తుపాకీతో కాల్చేశారు. ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్రచర్చనీయాంశమైంది. లిఫ్ట్ అడిగిన ఓ ట్రాన్స్‌జెండర్‌ను అమ్మాయి అనుకొని పొరపడిన దుండగులు కారెక్కించుకున్నారని, కొంత దూరం వెళ్లాక ఆమెపై లైంగిక దాడికి యత్నించారని పోలీసులు తెలిపారు. ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలిసినా కూడా బలవంతం చేశారని, దీనికి ఆమె అంగీకరించడంతో ఆగ్రహానికి గురై తుపాకీతో కాల్చేసారని సౌతీస్ట్ డీసీపీ బిస్వాల్ పేర్కొన్నారు. అనంతరం కదులుతున్న కారులోంచి నెట్టేశారని చెప్పారు. ‘ఆదివారం తెల్లవారుజామున 12.38 గంటలకు త్రిలోక్‌పురి-బారాపుల్లా రోడ్డుపై ఓ మహిళా తుపాకీ గాయాలతో విలవిలాడుతుందని మాకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న మా పోలీసులు ఆ మహిళలను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరంచి వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేసాం. దుండగుల కోసం గాలింపు చేపట్టాం. సీసీటీవీ ఆధారంగా కారును గుర్తించి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. అతనితో పాటు కారు, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నాం. మా విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మరో నిందితుడిని త్వరలోనే అదుపులో తీసుకుంటాం’ అని బిస్వాల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ ట్రాన్స్‌జెండర్ కోలుకుంటుందని పోలీసులు పేర్కొన్నారు. -
అందాల పోటీల్లో ట్రాన్స్‌జెండర్!
బ్యాంకాంగ్: మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని ఓ ట్రాన్స్‌జెండర్ చరిత్ర సృష్టించింది. స్పెయిన్ బ్యూటీ అయిన ఏంజెలా పోన్స్ అనే 27 ఏళ్ల ట్రాన్స్ జెండర్.. 66 ఏళ్ల చరిత్ర గల విశ్వసుందరీ పోటీల్లో పాల్గొని ఔరా అనిపించింది. ఈ పోటీల్లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్ మహిళగా నిలిచింది. ట్రాన్స్‌జెండర్స్ సమస్యలపై గళమెత్తాడానికి తనకు ఇదే అనువైన వేదిక అనిపించిందని ఈ ట్రాన్స్‌జెండర్ బ్యూటీ పేర్కొంది. ముఖ్యంగా అవయమార్పిడి చేసుకున్న మహిళలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకే పోటీల్లో పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. దేశ సైన్యంలో పనిచేయడానికి ట్రాన్స్‌జెండర్స్ పనికారారంటూ.. వారిపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్ననిర్ణయంపై కూడా ఈ బ్యూటీ మండిపడింది. అవయవ మార్పిడి వల్ల తనకు ఆడతనం రాలేదని, పుట్టకతోనే వచ్చిందని పేర్కొంది. స్పెయిన్‌లోని స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్న ఏంజెలా.. ట్రాన్స్‌జెండర్స్ పిల్లల సమస్యలపై పోరాడుతోంది. ఇక ఈ అందాల పోటీల ఫైనల్స్ సోమవారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాగ్‌లో జరగనున్నాయి. -
చంద్రముఖి వచ్చింది
సాక్షి, సిటీబ్యూరో/ బంజారాహిల్స్ : గోషామహల్ నుంచి బరిలోకి దిగిన బీఎల్ఎఫ్ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ రాజేశ్ అలియాస్ చంద్ర ముఖి బుధవారం రాత్రి 11:30 నిమిషాలకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా సాగుతున్న అదృశ్యం కేసు కొలిక్కి వచ్చింది. చంద్రముఖికి లభిస్తున్న ఆదరణ, ప్రజల మద్ధతు, జాతీయ స్థాయిలో మీడియా నుంచి లభిస్తున్న ప్రచారం ప్రత్యర్థులకు కంటగింపుగా మారిందని, ఈ క్రమంలో ఆమెను పోటీ నుంచి తప్పించేందుకే కిడ్నాప్‌కు పాల్పడి ఉండవచ్చునని బీఎల్‌ఎఫ్‌కు సారథ్యం వహిస్తున్న తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మరోవైపు గురువారం ఉదయం 10.15 గంటల వరకు చంద్రముఖిని హాజరుపర్చాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసుల ముమ్మర గాలింపు చంద్రముఖి అనుమానాస్పద అదృశ్యంపై బంజారాహిల్స్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు గాలింపును ముమ్మరం చేశారు. చంద్రముఖి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తును చేపట్టారు. మరోవైపు అన్ని పోలీస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అనంతపురం వెళ్లిన దర్యాప్తు బృందం.. అనంతపురానికి చెందిన వెంకట్‌యాదవ్ అనే వ్యక్తి నుంచి చంద్రముఖికి ప్రాణహాని ఉన్నట్లు సహచర ట్రాన్స్జెండర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతపురం వెళ్లారు. ఆమెతో సన్నిహితంగా ఉండే హిజ్రాలను సైతంపోలీసులు విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా మంగళవారం ఉదయం 7.05 గంటల ప్రాంతంలో ఆమె ఒంటరిగా మెట్లు దిగి కొద్దిదూరం వరకు తాను ఉన్న వీధిలోకి వెళ్లినట్లు కనిపించింది. తిరిగి 8 గంటల ప్రాంతంలో మరోసారి ఆమె రెడీ అయి ఇంట్లోంచి బయటికి ఒంటరిగానే వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం వల్ల కేసు పురోగతికి కొంత ఆటంకంగా మారినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఆందోళనలో ట్రాన్స్జెండర్లు.. చంద్రముఖి అదృశ్యం నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్లలో అభద్రతాభావం నెలకొంది. బుధవారం ఉదయమే పలువురు ట్రాన్స్జెండర్లు ముషీరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని బీఎల్ఎఫ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రముఖి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గోషామహల్లో ఆమెకు లభిస్తున్న ఆదరణ, జాతీయ స్థాయిలో మీడియా విస్తృత ప్రచారం చూసి ఓర్వలేకనే పోటీ నుంచి తప్పించేందుకు కిడ్నాప్‌నకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రముఖిని బలవంతంగా పోటీలోకి దిగిందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం, చట్ట సభల్లో తమ గొంతు వినిపించాలనే లక్ష్యంతోనే స్వచ్ఛందంగా పోటీకి దిగిందని సామాజిక కార్యకర్త సజయ తెలిపారు. విచారణ ప్రారంభించిన కోర్టు ఆమె తల్లి హైకోర్టులో దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటీషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. జస్టిస్ చౌహాన్, జస్టిస్ సత్యనారాయణమూర్తి ఈ కేసును విచారించారు. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు అదృశ్యం కావడమేంటంటూ వారు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. గురువారం ఉదయం చంద్రముఖిని తమ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించారు. -
హిజ్రాపై ప్రియుడి హత్యాయత్నం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ హిజ్రాతో సహజీవనం చేస్తున్న ప్రియుడు కత్తితో గొంతు కోసి హత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, హిజ్రా అమ్మమ్మ బానోతు జంకు కథనం ప్రకారం... బానోత్ రాధిక అనే హిజ్రాకు, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామ శివారు కొత్తతండాకు చెందిన ధరావత్ సురేష్‌తో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి మహబూబాబాద్ పట్టణంలోని హనుమంతరావు స్థూపం సమీపంలో అద్దె ఇంట్లో ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే డబ్బులు కావాలని సురేష్ కొద్ది నెలలుగా రాధికను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె రూ.లక్ష ఇచ్చింది. ఆతర్వాత కూడా మరో రూ.లక్ష కావాలని వేధింపులకు గురిచేస్తుండటంతో మళ్లీ రూ.లక్ష ఇచ్చింది. ఆతర్వాత మళ్లీ రూ.3లక్షలు కావాలంటూ వారం రోజులుగా వేధిస్తున్నాడు. డబ్బులు లేవని చెబుతుండటంతో బానోత్ రాధికను దూషిస్తూ చితకబాదుతున్నాడు. సురేష్ తల్లి సాలి కూడా మూడు రోజుల క్రితం వచ్చి డబ్బులు ఇవ్వకపోవడంపై దూషించింది. ఈ క్రమంలో సురేష్ హిజ్రా రాధికను వేధిస్తూనే రాత్రి ఆమె అమ్మమ్మ బానోతు జంకు నోట్లో గుడ్డలు కుక్కి ఓ గదిలో పడేశాడు. తర్వాత హిజ్రా రాధికను కత్తితో గొంతుకోసి చంపేందుకు యత్నించాడు. దీంతో ఆమె గొంతుపై, కుడి కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కింట్లో నివసిస్తున్న శ్రావణి, భర్త కమల్ రాగా సురేష్ పరారయ్యాడు. ఈ ఘటనకు ధరావత్ సురేష్, అతడి అన్న నరి, తల్లి సాలీ, తండ్రి వీరన్న కారణమని హిజ్రా రాధిక అమ్మమ్మ బానోత్ జంకు పేర్కొంది. వెంటనే రాధికను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. మానుకోట టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడు సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ ఎస్.రవికుమార్ తెలిపారు.