TRS Government
-
ఎక్కడికక్కడే బీజేపీ నేతలు అరెస్ట్.. కిషన్ రెడ్డి స్పందన ఇదే..
Kishan Reddy.. సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణలో రాజకీయ సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ ఆందోళనలు, దీక్ష నేపథ్యంలో బండి సంజయ్ సహా కొందరు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బీజేపీ నేతల అరెస్ట్‌లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారు. విష ప్రచారం చేయడం, అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎం కార్యాలయమే స్వయంగా టీఆర్ఎస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులను రెచ్చగొట్టి.. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వినాశకాలే.. విపరీత బుద్ధి అన్నట్టుగా.. త్వరలోనే కేసీఆర్ కుటుంబ, ప్రజా వ్యతిరేక పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలుగుతుంది. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారు’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. వరుస అరెస్టులపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం 5-6 గంటల వరకు అన్ని మండలాల్లో పార్టీ ఆఫీసుల వద్ద నిరసనలు తెలపాలని నిర్ణయించింది. నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు.. ఉప్పుగల్, కూనూర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ ఫ్లెక్సీలకు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు. ఇది కూడా చదవండి: మేము తలుచుకుంటే బీజేపీ నేతలు మిగులుతారా.. తలసాని మాస్ వార్నింగ్ -
మునుగోడులో సర్పంచ్‌లకు ఫోన్లు చేస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి ఫైర్
Munugode Politics.. మునుగోడు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడాక్కాయి. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. నా రాజీనామా తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నా రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు. అందరు సర్పంచ్‌లకు ఫోన్లు చేస్తున్నారు. నా రాజీనామాతోనే ఫండ్స్ రిలీజ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రభుత్వం నిధులను అడ్డుకుంటోంది. ప్రభుత్వం వివక్షతో ప్రవర్తిస్తోంది. మొన్నటి వరకు మునుగోడుపై మాట్లాడితే సీఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ, నా రాజీనామా తర్వాత సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు కేటాయించలేదు. కానీ.. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. -
వచ్చేది కాంగ్రెస్సే.. నాదే నాయకత్వం
వికారాబాద్, పరిగి: ‘కేసీఆర్ పుర్రెలో పురుగు తిరిగింది.. ఎన్నికలకు పోవాలనుకుంటుండు.. డిసెంబర్లోనే ఎన్నికల నగారా మోగుతుంది. మరో 11 నెలల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి నేనే నాయకత్వం వహిస్తా..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం పరిగిలో జరిగిన కార్యక్రమంలో, ఏఐసీసీ డేటా అనలిటిక్స్ విభాగం చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తితో కలిసి కార్యకర్తలకు రేవంత్ పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్లే, కాంగ్రెస్ సభ్యత్వం ఉన్నోళ్లే ప్రభుత్వ సం క్షేమ పథకాలు పొందటంలో ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ఉద్యమకారులు, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తాం గాంధీ కుటుంబాన్ని చూస్తే మోదీకి తడిసిపోతుందని, అం దుకే పాత కేసులు తిరగదోడి ఈడీ ద్వారా సోనియా, రాహుల్‌లకు నోటీసులు ఇప్పిస్తున్నారని రేవంత్ విమర్శిం చారు. గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తామని, బీజేపీని బట్టలూడదీసి కొడతామన్నారు. సోనియా, రాహుల్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈడీ నోటీసులకు నిరసనగా ఈ నెల 13న సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. డిజిటల్ కార్డులు పరిగిలోనే మొదలు సోనియా, రాహుల్‌ల తర్వాత పరిగిలోనే మొదటగా డిజిటల్ కార్డులు అందజేస్తున్నామని రేవంత్ తెలిపారు. కార్డు ఉన్నవారికి రూ. 2 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ఉపయోగాలున్నాయని స్పష్టం చేశారు. పరిగిలో 50 వేల మెజార్టీతో రామ్మోహన్‌రెడ్డి గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ‘పేదలకు భూములు ఎవరు పంచారు? ఇంది రమ్మ ఇళ్లు ఎవరిచ్చారు? మొదట రుణమాఫీ చేసిందెవరు? ఆరోగ్యశ్రీ ఎవరు తెచ్చారు? బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా...?’ అంటూ గుర్తు చేశారు. డిజిటల్ కార్డుతో ఢిల్లీ నుంచే పర్యవేక్షణ డిజిటల్ కార్డు ద్వారా పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచే ప్రతి కార్యకర్తను చూస్తుందని ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. కార్యకర్త పనితీరును కూడా దీనిద్వారా అంచనా వేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య పాలకులది నేరపూరిత నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: సమైక్య పాలకుల నేరపూరిత నిర్లక్ష్యం వల్లే నీటి పారుదల రంగానికి పూర్తిగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఇన్నాళ్లూ పరాయి పాలకుల చేతిలో పరాదీనమైన తెలంగాణ ఇప్పుడు బంగారు తునక అని అభివర్ణించారు. టీటీడీపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన ఎల్.రమణ, శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. నా లైన్ ఎవరూ మార్చలేరు ‘రాష్ట్రం వస్తుందని ముందు నుంచే మేము బలంగా నమ్మాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము చేసిన పనుల గురించి డబ్బా కొట్టు కోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మేము చేపట్టిన ఎజెండాతో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో మేము విఫలమైతే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మునుపే పునర్నిర్మాణంపై బాగా ఆలోచించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయ డం ద్వారానే శాంతి సాధ్యమవుతుందని భావించాం. అందులో భాగంగానే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగం బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. మీ దీవెనలు, అండదండలు, సహకారం ఉన్నన్ని రోజులు ప్రపంచంలో ఎవరూ నా లైన్ మార్చలేరు. నేను కలగన్న తెలంగాణను వంద శాతం చేరుకుంటా.. ’అని కేసీఆర్ స్పష్టం చేశారు. చేనేతకు చేయూత: ‘చేనేత రంగం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన కార్యక్రమాలు కొంత ఉపశమనం ఇస్తున్నాయి. తాజాగా రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు కూడా బీమా పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించాం. ఒకటి రెండు నెలల్లో ఈ కార్యక్రమం ఆచరణలోకి వస్తుంది. ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకున్నాం. సూరత్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికుల నైపుణ్యాన్ని స్థానికంగా వాడుకుని ఉపాధి కల్పించేందుకు ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్’ఏర్పాటు చేశాం. ఇక్కడ ఏర్పాటయ్యే భారీ స్పిన్నింగ్ మిల్లుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించా. చేనేత కార్మికులు కూడా పాత పద్ధతిలో కాకుండా వినూత్నంగా పని చేయడాన్ని అలవరుచుకోవాలి. చేనేత రంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది..’అని సీఎం పేర్కొన్నారు. -
నిజామాబాద్ ‘ఎమ్మెల్సీ’గా కవిత నామినేషన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలసి కలెక్టరేట్‌కు చేరుకున్న కవిత.. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డికి అందజేశారు. ఉదయం హైదరాబాద్‌లోని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఆమె జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ చేరుకుని అత్తమామలు, భర్త అనీల్‌రావు ఆశ్వీరాదం తీసుకున్న అనంతరం నామినేషన్ వేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత మళ్లీ రావడంతో అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన కవితకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు మొత్తం 824 ఉండగా, ఇందులో 550 పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కవిత విజయం ఖాయంగా కనిపిస్తోంది. -
వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు లేరు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు ఒక్కరు కూడా లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని హైకోర్టు వివరణ కోరింది. రాష్ట్ర వినియోగదారుల ఫోరం 12 జిల్లాల్లోని వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న 24 మంది మహిళా సభ్యుల పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కరీంనగర్ వినియోగదారుల మండలి అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. ఫోరాల్లో మహిళా సభ్యుల నియామకాల భర్తీ విషయంపై వివరణ ఇవ్వాలని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. -
అప్పుడు లేని మాంద్యం ఇప్పుడెలా?
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కింద ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో లేని మాంద్యం ఇప్పుడెలా వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సైతం బడ్జెట్లో ఎక్కడా మాంద్యం గురించి ప్రస్తావించలేదని తెలిపారు. కానీ ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం 15 నెలల నుంచి మాంద్యం ఉందని చెప్పి బడ్జెట్‌కు కోత పెట్టారని విమర్శించారు. ఆదివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు 30 శాతం తగ్గాయని చెబుతున్నారని, కానీ మాంద్యానికి ఇది ప్రామాణికం కాదని తెలిపారు. రెవెన్యూ మిగులు ఉన్న సమయంలో రాష్ట్ర బడ్జెట్ ఎలా తగ్గిందో చెప్పాలన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో కీలకమైన విద్యా శాఖకు 24 శాతం, వైద్యానికి 25 శాతం, గ్రామీణాభివృద్ధికి 32 శాతం తక్కువగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం చూసే చేరాం: ఎమ్మెల్యే గండ్ర టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుల సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని, రైతు బంధుతో రైతుల్లో ధీమా పెంచారని తెలిపా రు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోందని, దాన్ని చూసే 12 మంది కాంగ్రెస్ సభ్యులం టీఆర్ఎస్లో చేరామన్నారు. -
ఎవరిపై కేసు పెట్టాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు పెట్టారని, అదే జ్వరాలతో ప్రజలు చని పోతుంటే ఎవరిపై కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ హాల్ బయట ఆయన మాట్లాడుతూ.. అధికారులను బ్లీచింగ్ పౌడర్ వేయమంటే డబ్బులు లేవంటున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయలేని పరిస్థితుల్లో ఈ సర్కార్ ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఓనర్ల పంచాయితీపై స్పందిస్తూ ఈటల జెండా ఓనర్లం అనడంలో తప్పులేదన్నారు. గతంలో బతుకుదెరువు కోసం తాను కూడా టీఆర్ఎస్లోకి వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చారు. -
ఎంఐఎంను ప్రతిపక్షంగా ఎలా గుర్తిస్తారు ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. సోమవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బడ్జెట్, యురియ, ప్రజారోగ్యం, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్, నిరుద్యోగ భృతి, ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వ తీరును పలువురు నేతలు ప్రస్తావించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం, ఎరువుల కొరతపై రాష్ట్ర్ర ప్రభుత్వాన్నిఎండగట్టాలని సీఎల్పీ నిర్ణయించింది. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా ఎలా గుర్తిస్తారంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీలు అని చెప్పారు కదా..ప్రెండ్లీ పార్టీలు అధికార, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయా అని ప్రశ్నలు సంధించారు. ఈ అంశంపై స్పీకర్‌కు లేఖ రాయాలని సీఎల్పీ నిర్ణయించింది. -
బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యం లో బుధవారం ఢిల్లీ వెళ్లిన నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మురళీధర్‌రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. లక్ష్మణ్ పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనపై పోరాడే సత్తా ఒక్క బీజేపీకే ఉందని, రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనేందుకు నేతల వరుస చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఓర్వలేక తప్పుడు కేసులు: లక్ష్మణ్ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి బీజేపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి కేంద్ర ప్రభుత్వంపై నెపంనెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. యూరియా డిమాండ్‌ను అంచనా వేయ డంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, వ్యవసా య ప్రణాళిక లేకపోవడంతో కరీంనగర్, నిజామా బాద్‌లో రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కాగా, టీడీపీని వీడి బీజేపీలో చేరే ముందు చంద్రబాబుతో మాట్లాడినట్టు రేవూరి తెలిపారు. రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో ప్రజల కలలు నెరవేరడం లేదన్నారు. -
40 శాతం మందికి రైతు బంధు అందలేదు
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకంలో తీవ్ర జాప్యం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మంది రైతులకు రైతు బంధు నిధులు అందలేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆ రైతులకు రావాల్సిన నిధులను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. కొరత వల్ల రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు యూరియాను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది: బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జుమ్మెరాత్ బజార్లో రాణి అవంతి విగ్రహ ఏర్పాటుపై బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై లాఠీచార్జ్ విధించారు. ఈ సంఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రామచంద్ర రావు అడిషినల్ డీజీపీ జితేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో రాణి అవంతి భాయి విగ్రహాలు అనేకం ఉన్నాయని, పోలీసులు కావాలనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దాడి చేశారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్ఐఎమ్తో దోస్తీ కట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుడా రాష్ట్రంలో బీజేపీని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యూమెరాత్ బజార్లో 2009 లోనే రాణి అవంతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, గడిచిన పది సంవత్సరాలలో మూడు సార్లు విగ్రహాన్ని మార్చారని మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నందుకు రేపు గోషామహల్ నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని రామచంద్ర రావు స్పష్టం చేశారు. -
ఓడినా నైతిక విజయం నాదే: కొండా
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల నుంచి ఎంపీగా ఓడినా నైతిక విజయం తనదేనని కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో చివరి వరకు గెలుపు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినప్పటికీ, పట్టణ ఓటర్లను ప్రత్యర్థులు కొనుగోలు చేయడంతో తాను ఓడిపోయానని వివరించారు. శక్రవారం ఆయన గాంధీభవన్‌లో ఎమ్మెల్యే పైల ట్ రోహిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీసులు, అధికారులను తన స్వలాభం కోసం వాడుకుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి నానా ఇబ్బందుల కు గురిచేసిందని ఆరోపించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నేతలని లక్ష్యంగా చేసుకున్నారని, సమావేశాలకు అనుమతులివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రాజకీయంగా తనను పూర్తిగా అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకుందని, నేతలు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. -
టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు : మంత్రి జగదీశ్ రెడ్డి
సాక్షి, పెన్‌పహాడ్ (సూర్యాపేట) : నాలుగున్నరేళ్ల పాలనలో మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు గ్రామాలకు వెళ్తున్న తమకు, టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, అనంతారం, పొట్లపహాడ్, దూపహాడ్, లింగాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి భయపడిపోయిన ప్రతిపక్షాలు ప్రజాకూటమి పేరుతో జతకట్టాయన్నారు. ప్రజాదరణ ముందు ఈ కూటమి మట్టికొట్టుకుపోనుందని ఎద్దేవా చేశారు. మాకు అధికారమే ముఖ్యం కాదని.. అభివృద్ధే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లాం.. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగని అభివృద్ధి, ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని తెలిపారు. 14ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్తోనే మన బతుకులు మారతాయన్నారు. రైతులు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలయ్యారని వ్యవసాయం బతికిస్తేనే ఊర్లు బాగుంటాయని ఉద్దేశంతో రూ.లక్ష రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని సోనియా, మోదీ రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు. తెలంగాణను దోచుకోవడానికి రెండు ఆంధ్రా పార్టీలు పగటి దొంగలుగా వస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌కు రూ.500కోట్ల ఇచ్చి చంద్రబాబునాయుడు చేతిలో తోలు బొమ్మలుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఎస్సార్ఎస్పీ కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకునేందుకు 35ఉత్తరాలు రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్లే అన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు రాకుండా కాంగ్రెస్ నాయకులే అడ్డుపడ్డారన్నారు. అనంతరం అనంతారం, సింగారెడ్డిపాలెం గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీపీ భుక్యా పద్మ, ఒంటెద్దు నర్సింహారెడ్డి, నెమ్మాది భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్, మిర్యాల వెంకటేశ్వర్లు, పుట్ట రేణుకాశ్రీనివాస్‌గౌడ్, దంతాల వాణివెంకన్న, మామిడి అంజయ్య, చిట్టెపు నారాయణరెడ్డి, పొదిల నాగార్జున, సామ వెంకటరెడ్డి, పేర్ల శ్రీధర్, మున్నా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
రైతుబంధుకు యూఎన్వో గుర్తింపు
సాక్షి,బాన్సువాడ: రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంట్‌ను 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామని చెప్పారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించామని అన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం భారీగా గోదాములు నిర్మించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమాతో ధీమా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందని పోచారం అన్నారు. తమ వెనక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు. -
రూ. 1600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
సాక్షి,అర్వపల్లి: గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ హయాంలో నాలుగేళ్లలో రూ. 1600 కోట్లతో జరిగిందని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు దావుల వీరప్రసాద్ చెప్పారు. తుంగతుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ గెలుపు కోసం గురువారం సీతారాంపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కిశోర్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందెల అర్వపల్లి, రాసాల సైదులు, బందెల వెంకన్న, చిత్రాల వీరయ్య, బందెల శశికాంత్, కుర్రె రమేశ్, ఎ. భద్రయ్య, బైరబోయిన రామలింగయ్య, పెద్దయ్య, కె. శ్రీకాంత్, జి. రామ్మూర్తి, ఎస్. వెంకన్న, ఎ. వెంకన్న, కె. భిక్షం, ఎ. సంతు, ఎ. ప్రవీణ్, పి. శ్రీను, ఎ. లింగయ్య, వీరమల్లు, ఎ. సంతు, దావుల లింగయ్య, కె. నాగరాజు, పి. ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం తుంగతుర్తి : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూసపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత గాదరి కిశోర్కుమాదే అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కారుగుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వెంకటనారాయణ, జలేందర్, రాములు, సంతోష్, భిక్షం, వెంకన్న, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్సెంటేజీలకే ప్రాధాన్యమిచ్చారు
సాక్షి,చౌటుప్పల్ : టీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపిస్తే మునుగోడును ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రతి పనిలో కమీషన్లు, పర్సంటేజీలకే ప్రాధాన్యత ఇచ్చారని బీజేపీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన వందమంది యువకులు, మహిళలు గురువారం మనోహర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సమావేశంలో మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగేండ్ల టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందన్నారు.నియోజకవర్గాన్ని పూర్తి అవినీతిమయంగామార్చార్చారని ఆరోపించారు. తనకు ఎలాంటి పదవి లేకున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రూర్బన్ పథకం కింద చౌటుప్పల్ మండలానికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించానని పేర్కొన్నారు. మార్పు కోసం కమలం పువ్వు గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు అరిగె రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దోనూరి వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, ఎస్సీమోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉబ్బు భిక్షపతి, వైస్ ఎంపీపీ కాయితి రమేష్, నాయకులు రామనగోని శంకర్, పాలకూర్ల జంగయ్య, కంచర్ల గోవర్థన్‌రెడ్డి, అరిగె లింగస్వామి, నారెడ్డి అంజిరెడ్డి, ఊడుగు వెంకటేశం, యాదయ్య, మల్లికార్జున్, అరిగె వీరాస్వామి, తమ్మకొండ శ్రీశైలం, శివకుమార్, కట్ట కృష్ణ, రాదారపు సత్తయ్య, పబ్బు వంశీ, లక్ష్మణ్, బత్తుల జనార్దన్, చీరకూరి వెంకటేశం, ఇట్టగోని మహేష్, రాజు, ఆలె నాగరాజు, బలిగె శ్రీను, పాల్గొన్నారు. -
చిందు కళాకారులకు అండగా టీఆర్ఎస్
సాక్షి,హుస్నాబాద్: కళామతల్లిని నమ్ముకొని కళాకారుల వృత్తితో జీవిస్తున్న చిందు కళాకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని వీఎల్ రెడ్డి గార్డెన్లో చిందు కళాకారుల ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మాట్లాడుతూ సినిమాలు, సీరియల్స్ వల్ల చిందు కళాకారులకు ఆదరణ తక్కువైందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వచ్చిన తర్వాతనే చిందు, యక్షగానంతో పాటు అన్ని కళాకారులకు అండగా నిలిచి వారి బాగోగులను చూస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అద్యక్షుడు వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ఇంచార్జీ కాసర్ల అశోక్‌బాబు, పట్టణ అద్యక్షుడు అన్వర్ పాష, చిందు కళాకారుల సంఘం జిల్లా అద్యక్షుడు గడ్డం నాగరాజు, కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, ఇంద్రాల సారయ్య, నాయకులు మేకల వీరన్న యాదవ్, చిట్టి గోపాల్‌రెడ్డి, క్రాంతిరెడ్డి, గడ్డం మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారాస్త్రంగా పునరుజ్జీవం
మోర్తాడ్(బాల్కొండ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పూర్తయిన తరువాత కలిగే ప్రయోజనాలను వివరి స్తూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కదులుతోంది. పునరుజ్జీవన పథకానికి కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలను రైతులకు తెలియజేప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అ భ్యర్థులు రైతులను, యువ నాయకులను కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు స్టడీ టూర్ కోసం ఆదివారం పంపించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భా గంలో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్ర భుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మించడంతో వరద నీటికి అడ్డుకట్ట పడింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందు వరద నీరు గోదావరి నదిలోకి చేరి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఆశిం చిన విధంగానే పెరిగేది. బాబ్లీ ప్రా జెక్టు నిర్మాణం తరువాత వరదలు అధికంగా వస్తేనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి నీరు తరలివస్తోంది. ఈ నేథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పునరుజ్జీవన పథకానికి శ్రీకా రం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువను ఉపయోగించుకుని రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని మళ్లించడానికి పునరుజ్జీవన పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. రూ.1,064 కోట్ల వ్యయంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే పునరుజ్జీవన పథ కం పనులు సాగుతున్నాయి. ముప్కాల్ వద్ద పంప్‌హౌజ్ నిర్మాణం పనులు సా గుతుండగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కూడా వేగంగానే కొనసాగుతున్నాయని స్టడీ టూర్‌కు వెళ్లిన నియోజకవర్గం రైతులు, యువకులు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేది ఇలా... కాళేశ్వరం పరిసరాల్లో భారీ వర్షం కురిస్తే అనేక టీఎంసీల నీరు గోదావరి నది ద్వారా సముద్రంపాలవుతుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో దాదాపు వెయ్యి టీఎంసీల నీరు సముద్రం పాలైన సందర్భాలు ఉన్నాయి. ఆనీటిని సద్వినియోగం చేసుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కాళేశ్వరం నుంచి అన్నారం, సుందిల్లల వద్ద నిర్మించిన పంప్‌హౌజ్‌ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అక్కడి నుంచి మిడ్‌మానేర్ డ్యామ్‌కు ఎగువ భాగంలో ఉన్న వరద కాలువలోకి నీటిని వదులుతారు. వరద కాలువలోకి చేరిన నీరు 40 మీటర్ల ఎత్తున ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకో టీఎంసీ చొప్పున నీటిని మళ్లించాలని డిజైనింగ్ చేశారు. అయితే ఆశించిన విధంగా నీటిని తరలించడానికి వీలు ఉంటే రోజుకు ఒక టీఎంసీ కాకుండా రెండు టీఎంసీల నీటిని తరలించవచ్చని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. వరద కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా రూ.500 కోట్ల ఆదా... కాళేశ్వరం నీటిని మిడ్‌మానేరు నుంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అక్కడి నుంచి హల్దీవాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు తరలించాలని ముందుగా నిర్ణయించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును నింపిన తరువాత మంజీర నదిలోకి మిగులు జలాలను విడిచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించాలని ప్రతిపాదించారు. ఇలా చేయడం వల్ల రోజుకు అర టీఎంసీ నీటిని మాత్రమే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించవచ్చు. ఈ విధానం వల్ల ఒక ఏడాదికి రూ.600 కోట్ల విద్యుత్ బిల్లును ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే వరద కాలువ ద్వారా రివర్స్‌పంపింగ్ చేయడం వల్ల రోజుకు ఒకటి నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించడమే కాకుండా రూ.100 కోట్ల విద్యుత్ బిల్లును మాత్రమే ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖలో పని చేసిన ఒక రిటైర్డ్ ఇంజినీర్ ఇచ్చిన సలహా ప్రకారం తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చొరవ చూపడంతో సీఎం కేసీఆర్ వరద కాలువ రివర్స్ పంపింగ్‌కు ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరద కాలువ, కాకతీయ కాలువలలో నిరంతరం నీరు... పునరుజ్జీవన పథకం పూర్తి అయితే వరద కాలువ, కాకతీయ కాలువలలో నిరంతరం నీటిని ప్రవహించేలా చేసే అవకాశం ఉంది. వరద కాలువ రివర్స్ పంపింగ్ కోసం వినియోగించడం వల్ల ఈ కాలువలో నీరు ఉంటుంది. అలాగే కాకతీయ కాలువ ద్వారా దిగువ భాగానికి నీటిని విడుదల చేయనుండటంతో నిరంతరం నీరు నిలువ ఉండే అవకాశం ఉంటుంది. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి మించి జరుగుతుంది. రెండు కాలువల్లో నీరు నిలిచి ఉంటే చెరువులను నింపుకోవడంతో పాటు, పంపు సెట్ల ద్వారా పంట పొలాలకు సాగునీటిని తరలించడానికి అవకాశం ఉంది. వరద కాలువలో నీరు నిలువ ఉంటే కాలువకు సిమెంట్ లైనింగ్ లేక పోవడంతో భూగర్భ జలాలు ఎంతో వృద్ధి చెందుతాయని రైతులు భావిస్తున్నారు. వరద కాలువకు ఎడమవైపున ఏర్పాటు చేసిన తూమ్‌లు ఆరు మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ తూమ్ గేట్లను ఇంకా కిందికి దించితే తక్కువ సమయంలోనే చెరువులను నింపడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వరద కాలువలో నీటిని నిలువ ఉంచడం వల్ల బాల్కొండ నియోజకవర్గంలోని మరో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి అవకాశం కలుగుతుంది. ఒక్క పునరుజ్జీవన పథకం పూర్తి జరిగితే ఎన్నో ప్రయోజనాలను రైతులకు అందించవచ్చని టీఆర్ఎస్ నాయకులు తమ ప్రచారంలో వివరించాలని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎంతో మేలు... కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి జరిగితే ఎంతో మేలు కలుగనుంది. ఈ రోజు రైతులం ప్రాజెక్టును సందర్శించాం. కాళేశ్వరం నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరితే రైతులకు మూడు పంటలకు సాగునీరు అందుతుంది. ఎంతో విలువైన పంటలను పండించడానికి అవకాశం ఉంది. – కౌడ భూమన్న, రైతు, తొర్తి మాకు అవగాహన కలిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించడం వల్ల వరద కాలువ రివర్స్ పంపింగ్‌పై అవగాహన కలిగింది. వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి నీటిని ప్రాజెక్టుకు తరలిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రాజకీయాలు ముఖ్యం కాదు. ప్రజలకు సాగునీరు అందడం ముఖ్యమని గుర్తించాలి. – తక్కూరి సతీష్, మోర్తాడ్ సాగునీటి సమస్యలు తీరనున్నాయి వరద కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరితే సాగునీటి సమస్యలు ఎన్నో తీరనున్నాయి. రైతుల కష్టాలు తీరి నాణ్యమైన పంటలను పండించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి అందరు తెలుసుకోవాలి. – భోగ సుమన్, చౌట్పల్లి -
టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ప్రజలు టీఆర్ఎస్ను తిడుతున్నారని, మోదీకి ఉన్న ఆదరణను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో 18 వేల ఉద్యోగాలే ఇచ్చిందని, ఉద్యోగాల భర్తీలో విఫలమైం దని విమర్శించారు. నిరుద్యోగులు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశముందని, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలన్నారు. టీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు ఉండదన్నారు. కొత్త జోన్లను ఆమోదించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ‘జోనల్’ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్ రాష్ట్రంలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జోనల్ వ్యవస్థ ఆమోద ప్రక్రియను సత్వరమే పరిష్కరించి, తెలంగాణ పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతను చాటుకున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో నియామకాలు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ, ఇతర అనుమతులు ఇవ్వడంలో, సంక్షేమ పథకాలకు నిధులలివ్వడంలో ప్రధాని రాష్ట్రానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
నర్సంపేట రూరల్: ప్రజా సమస్యలపై తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నా రు. భూముల క్రమబద్ధీకరణ, సాదాబైనామా తదితర కార్యక్రమాలతో భూములపై హక్కులను కల్పించి, నేడు కాలరాసేందుకు ప్రభుత్వం యత్ని స్తోందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాస్‌పుస్తకాల్లో 90శాతం ఏదో ఒక తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించ డం లేదన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట చేపడుతున్న ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. టీజేఎస్ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి అన్ని స్థాయిల్లో కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. టీజేఎస్ రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్, చాపబాబు, బొనగాని రవీందర్, షేక్‌జావీద్, బొట్ల పవన్, భూక్యగోపాల్నాయక్, అంగోతు వినోద్, మామిండ్ల ఐలయ్య, బుల్లెట్ వెంకన్న, నందగిరి రజనీకాంత్, బందెల సదానందం, గుంటి సంజీవ, రాజశేఖర్, జాఫర్, యాకుబ్, హనుమంత్, లక్ష్మయ్య, శివ, అనిల్ పాల్గొన్నారు. పెద్దకోర్పోలు గ్రామంలో... నెక్కొండ(నర్సంపేట): టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ జన సమితి పార్టీ పోరా డుతోందని ఆ పార్టీ అధినేత ప్రోఫెసర్ కోదండరాం అన్నారు. చైతన్యయాత్రలో భాగంగా నెక్కొం డ మండలం పెద్దకోర్పోలు గ్రామంలో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలను మరిచిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. 60 ఏళ్లలో రూ.63వేల కోట్ల అప్పు ఉంటే.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అప్పులను రెట్టింపు చేశారని అన్నారు. భూ ప్రక్షాళనతో సమస్యలు పరిష్కారం కాకపోగా రైతులకు కొత్త చిక్కులు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. టీజేఎస్ సోమవారం చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అంబటి శ్రీనివాస్, వరంగల్ కన్వీనర్ బోనగాల రవీందర్, వెంకన్న, వినోద్‌నాయక్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం -
52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అసమర్థత కారణంగానే బీసీలకు రిజర్వేషన్లు దక్కటం లేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించటంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేసీఆర్ అనటం బట్ట కాల్చి మీదెయ్యటమేనని, ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని వెంటనే సవరించి బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. ‘నేను అన్యాయం చేస్తా కోర్టులు కూడా న్యాయం చెయ్యొద్దు అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. 1999లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే పెట్టడం ఎలా న్యాయం అవుతుంది? కుల గణన చేయకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? తెలంగాణలో 52 శాతం బీసీలు ఉన్నారని సమగ్ర సర్వేలో మీరే చెప్పి ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు చాలని ఎలా అంటారు? మిగిలిన 18 శాతం వారికి అక్కర్లేదా?’ అని శ్రవణ్ ప్రశ్నించారు. కోర్టులో మీ వ్యవహారాన్ని తప్పుబడుతున్న సందర్భంగానైనా కళ్లు తెరవాలని సూచించారు. సీఎం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత బీసీ సంఘాల మీద ఉందని అభిప్రాయపడ్డారు. 52 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు ఉందని, ఇదే విషయాన్ని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనేక వేదికల మీద ప్రకటించారని తెలిపారు. కోర్టుకు కులాల వెనుకబాటుతనం గురించి సరిగా వివరిస్తే న్యాయం చేయెద్దని అంటారా అని ప్రశ్నించారు. బీసీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఉద్యమంలో.. రాష్ట్రం వస్తే అస్తిత్వం వస్తాదని పోరాడిన చిన్న చిన్న కులాలకు రిజర్వేషన్లు అక్కర్లేదా అని ప్రశ్నించారు. రాజకీయ అంటరానితనం అనుభవిస్తున్న తాను ఈ కేసు వేసినట్టు తెలిపారు. -
వైఎస్సార్‌ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి,కొత్తపల్లి (కరీంనగర్) : నిరుపేద ముస్లింలకు ఉద్యోగ, విద్య అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ల అమలులో వైఎస్ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ సూచించారు. కొత్తపల్లి(హెచ్) మండలం చింతకుంట, శాంతినగర్ మసీదుల్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్న 12 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేవలం దుస్తులు, విందులతో సంతృప్తిపరిస్తే ముస్లింల పేదరికం పోదని, ఓటు బ్యాంకుగా వినియోగించుకోకుండా వారికి ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ అహ్మద్ బేగ్, పట్టణ కార్యదర్శి సుంకరి సునీల్‌కుమార్, నాయకుడు ఎండీ సర్ఫోద్దీన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఆర్థిక దోపిడీ గంగాధర(చొప్పదండి) : రాష్ట్రంలో అవసరం లేని నియామకాలు చేస్తూ రూ.లక్షల వేతనాలు, మంత్రి హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ ప్రతినిధులు, సలహాదారులున్నా.. రాజకీయ పునరావాసం కల్పించడానికి నియామకాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో ఇరువురు ప్రభుత్వ ప్రతినిధులుండగా.. వారికే ఎలాంటి పనులు లేకున్నా మరో వ్యక్తి జగన్నాథంను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనులు మానుకొని ఇలాంటి నియామకాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని అన్నారు. -
వెలుగుల వేడుక
-
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ పాలన
కాజీపేట : ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు కొనసాగడం వల్లే తెలంగాణ జన సమితి ఆవిర్భావం జరిగిందని వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అంబటి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో సీమాంధ్ర నాయకులతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజా వ్యతిరేకతో కూడిన కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అస్పష్టమైన విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. జిల్లా కోఆర్డినేటర్ బోట్ల భిక్షపతి మాట్లాడుతూ ఆదివారం ఎర్రగట్టు గుట్ట కింద ఉన్న బాలాజీ ఫంక్షన్హాల్లో నిర్వహించే రాజ కీయ శిక్షణ తరగతులను విజయవంతం చే యాలన్నారు. రాజేంద్రప్రసాద్, రాజేందర్, పులి సత్యం, తిరునహరి శేషు, శ్యాంసుందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ఛత్రపతిశివాజీ, డా.కృష్ణ, శ్రావణ్, శ్రీకాంత్, శివ పాల్గొన్నారు.