uttarapradesh
-
500 ఏళ్ల తరువాత అయోధ్యలో వైభవంగా దీపావళి
-
శుభవార్త.. హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్ లేదు
భారతదేశంలో పలు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే డీజిల్ కార్ల ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేశాయి. ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ వాహనాల వినియోగాన్ని కూడా అక్కడి ప్రభుత్వం నిషేదించింది. దీనికి ప్రధాన కారణం పర్యావరణ హితమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం ప్రకారం, రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.యూపీ ప్రభత్వం తీసుకున్న నిర్ణయంతో మారుతి సుజుకి, టయోటా వంటి సంస్థలు బాగా లాభపడే అవకాశం ఉంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించలేదు, కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం. ఇప్పటికే మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లు ఉత్తమ అమాంకాలను పొందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీటి సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.ప్రస్తుతం గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ధర యూపీలో సుమారు రూ. 1.80 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎంచుకున్న వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కస్టమర్ లాభంపొందవచ్చు. హైబ్రిడ్ కార్ల మీద రోడ్ ట్యాక్ రద్దుకు సంబంధించిన కీలక ప్రకటన కేవలం యూపీ ప్రభుత్వం మాత్రమే ప్రకటించింది. ఈ నిరయాన్ని మరిన్ని రాష్ట్రాలు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రోడ్లమీద హైబ్రిడ్ వాహనాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. -
రీల్ చేస్తుండగా తిరగబడిన ట్రాక్టర్.. యువకుడు మృతి
‘రీల్స్ చెయ్యాలి... సోషల్ మీడియాలో పెట్టాలి.. అందరూ చూడాలి.. లెక్కలేనన్ని వ్యూస్, లైక్స్ రావాలి’.. ఇదే చాలామంది యువతీ యువకుల మనసులలో బలంగా ఉన్న కోరిక. అయితే ఈ తాపత్రయంలోనే కొందరు యువతీయువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన నీరజ్ అనే రీల్స్ చేస్తుంటాడు. ఇదే మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ్మత్ నగర్‌కు చెందిన నీరజ్ డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. తాజాగా అతను ఒక ట్రాక్టర్‌ను మరో ట్రాక్టర్‌కు కట్టి లాగే స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్యాసాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.ఈ ఫీట్ చేస్తుండగా నీరజ్ కూర్చున్న ట్రాక్టర్‌లోని ముందు భాగం అతనిపైకి తిరగబడింది. దీంతో నీరజ్ ట్రాక్టర్ రెండు భాగాల మధ్య ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడ జనం తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు.కేసు పోలీసులు దర్యాప్తులో ఉంది. -
కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుంది. యూపీలో ఆయన పర్యటనకు శనివారం రెండో రోజు. రాహుల్ ఈ ప్రయాణం ప్రారంభించి 35 రోజులైంది. యూపీ చేరుకున్న రాహుల్ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారణాసిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ఈ ప్రయాణంలో ఎన్నడూ ద్వేషాన్ని చూడలేదని, యాత్రలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన వారు కూడా వెంట వచ్చారన్నారు. వారు తనతో చక్కగా మాట్లాడారన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే దేశం పట్ల ప్రకటించే నిజమైన భక్తి అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ద్వేషం, భయాందోళనకర వాతావరణం నెలకొని ఉందన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి వారణాసితో విడదీయరాని అనుబంధం ఉంది. పండిట్ నెహ్రూ 1910 నుండి 1950 వరకు అనేకసార్లు కాశీని సందర్శించారు. ప్రధాని అయ్యాక కూడా వారణాసికి వచ్చారు. ఇందిరా గాంధీ కూడా వారణాసిలో రాజకీయ, మతపరమైన పర్యటనలు చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన తండ్రి పండిట్ మోతీలాల్ నెహ్రూతో కలిసి 1910లో మొదటిసారి కాశీకి వచ్చారు. ఆ తర్వాత 1921లో కాశీ విద్యాపీఠం స్థాపనకు హాజరయ్యారు. ఆ తర్వాత నెహ్రూ 1942, 1946లోనూ కాశీని సందర్శించారు. స్వాతంత్య్రానంతరం 1950, 1952లో పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో కాశీకి వచ్చారు. 1980 మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జరిపిన వారణాసి పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిందని చెబుతుంటారు. ఆరోజున ఇందిర సభ 1979, డిసెబర్ 31న రాత్రి 8 గంటలకు జరిగాల్సి ఉండగా, ఆమె జనవరి 1980, జనవరి ఒకటిన ఉదయం 10 గంటలకు 14 గంటలు ఆలస్యంగా వచ్చారు. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ జనం ఆమెను చూసేందుకు, ఆమె మాటల వినేందుకు ఎంతో ఆసక్తి చూపారు. #WATCH | Varanasi, UP: During the Bharat Jodo Nyay Yatra, Congress MP Rahul Gandhi says, "During the entire 'yatra' I never saw hatred. Even BJP and RSS people came in the yatra, and as soon as they came to us, they would speak to us nicely... This country strengthens only when… pic.twitter.com/GYCKQHQUZ7 — ANI (@ANI) February 17, 2024 -
దివ్యాంగునిపై పోలీసుల దారుణం.. నీళ్లు అడిగాడని.. వీడియో వైరల్..
లక్నో: దివ్యాంగునిపై ఇద్దరు పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. నీళ్లు అడిగినందుకు అర్థరాత్రి అతనిపై విరుచుకుపడ్డారు. దివ్యాంగుడని కూడా చూడకుండా అతన్ని విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముడు చక్రాల బండిలో కూర్చున్న వ్యక్తి పేరు సచిన్ సింగ్. 2016లో రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. స్థానికంగా సిమ్‌లు అమ్మతుంటాడు. ఓ రెస్టారెంట్లో సప్లయర్‌లా కూడా పనిచేస్తాడు. శనివారం రాత్రి పని ముగించుకుని వస్తుండగా.. అతనికి ఓ తాబేలు కనిపించింది. దాన్ని పట్టుకుని స్థానికంగా ఉన్న చెరువులో వదిలి వస్తుండగా.. పోలీసులు ఎదురైనట్లు చెప్పారు. చేతి కడుకోవడానికి నీళ్లు అడిగిన క్రమంలో పోలీసులు ఫైరనట్లు వెల్లడించారు. In UP's Deoria, a purported video of a specially-abled man on a tricycle being assaulted by two men identified as Prantiya Rakshak Dal (PRD) jawans has surfaced on social media. pic.twitter.com/grJgsp195G — Piyush Rai (@Benarasiyaa) July 30, 2023 చేతికి తాబేలు వాసన కారణంగానే తాను నీళ్లు అడినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. విచక్షణా రహితంగా తలపై కొట్టారని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్థానిక ఎస్పీ సంకల్ప్ శర్మ స్పందించారు. ఆ ఇద్దరు పోలీసులను రాజేంద్ర మని, అభిషేక్ సింగ్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారు ప్రాంతీయ రక్షక్ దళానికి చెందినవారిగా గుర్తించారు. విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. -
KSR కామెంట్ : తెలంగాణ లో యూపీ తరహా పాలన తెస్తామంటున్న కమలం
-
బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై.. రోజుల వ్యవధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఔట్
BJP MLA Mukesh Verma Quits Party: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేల నిష్క్రమణల పరంపర కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన మర్నాడే ధారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత మళ్లీ మరో ఓబీసీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ గురువారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడిన కులాలను విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలను పట్టించుకోలేదని, ప్రజాప్రతినిధులను అగౌరవపరిచిందని వర్మ ఆరోపించారు. అంతేకాదు ఆయన ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను అణగారిన వర్గాల నాయకుడిగా తన రాజీనామలేఖలో పేర్కొన్నారు. అయితే వర్మ తాను ఏ పార్టీలోకి వెళ్తున్నదీ చెప్పలేదు. ఈ మేరకు రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడటం ఆ పార్టీకి షాక్‌కి గురిచేసే అంశమే! (చదవండి: బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు) -
‘అధికారంలోకి వస్తే.. విద్యుత్ ఉచితంగా ఇస్తాం’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దూకుడు పెంచారు. అందులో భాగంగానే సామాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామరని తెలిపారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల డొమెస్టిక్ విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఇప్పటికే రైతులకు వ్యవసాయంలో ఇబ్బంది కలగకుండా ఉచితం విద్యుత్ అదిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలవలేదని, అది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. వలస కార్మికులు వందల కీలోమీటర్లు రోడ్లపై నడుస్తూ రాష్ట్రానికి చేరుకున్నారని, వారికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులను నమోదు చేస్తోందని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అఖిలేష్ యాదవ్ సంతాపం వ్యక్తంచేశారు. -
దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర
భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినందుకు గుర్తుగా ప్రతి ఏడాది నవంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఉత్తరాఖండ్‌వాసులు ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ దినోత్సవాన్నిఉత్తరాఖండ్ డే లేదా ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే లేదా ఉత్తరాఖండ్ దివాస్‌గా జరుపుకుంటున్నారు ఉత్తరాఖండ్ దివాస్ చరిత్ర: భారత రాజ్యాంగం 1950 సంవత్సరంలో ఆమోదించబడిన తరువాత యునైటెడ్ ప్రావిన్సులు ఉత్తరప్రదేశ్‌గా మారాయి. ఇది ఆ తరువాత భారతదేశ రాష్ట్రంగా మారింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసుల అంచనాలను అందుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది గానీ సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులకు సరైన జీవనోపాధి అవకాశాలను అందించడం కోసమే ఉత్తరాఖండ్ క్రాంతి దళం ఏర్పడింది. అంతేకాదు అక్టోబర్ 2,1994న హింసాత్మక ఉద్యమం కారణంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ దళంలోని వ్యక్తులను విజయవంతంగా నియంత్రించలేకపోయారు. ఆ తర్వాత చివరకు చాలా సుదీర్ఘ కాల పోరాటం తర్వాత ఉత్తరాఖండ్ వంబర్ 9, 2000న ఉత్తరాంచల్‌గా ఏర్పడింది. ఈ మేరకు ఉత్తరాంచల్ రాష్ట్రం కాస్త జనవరి1, 2007న ఉత్తరాఖండ్గా మారింది. పైగా 2020 మార్చిలో గైర్‌సైన్‌ని ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా పిలిచారు. అలాగే ఉత్తరాఖండ్ శీతాకాల రాజధానిగా డెహ్రాడూన్‌ని పిలుస్తారు. ఈ రాష్ట్రాన్ని దేవతల భూమి లేదా "దేవభూమి" అభివర్ణిస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నాలుగు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటివి క్షేత్రాలు కొలువుదీరి ఉండటమే. ఈ మేరకు ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను కలిపి చోటా చార్ ధామ్ అని పిలుస్తారు. పైగా భక్తులు ఈ ఉత్తరాఖండ్ యాత్రను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. ఏవిధంగా జరుపకుంటారంటే: ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్ర ప్రజల ధైర్యసాహసాలను లేదా వారి ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి వెలికతీసి మంచి అవార్డులతో సత్కరించడం ద్వారా ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 2016వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉత్తరాఖండ్ రత్న అవార్డును ఏర్పాటు చేసి తమ రాష్ట్రంలో ధైర్యసాహసాలకు చూపిన చాలా మందికి ఈ అవార్డును అందించారు. 2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్‌ను కూడా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. 2018లో,ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య 18వ వార్షిక రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించారు. అయితే 2019లో ఈ వేడుక దాదాపు ఒక వారం పాటు జరిగింది. కానీ 2020వ సంవత్సరంలో మాత్రం 20వ వార్షిక రాష్ట్ర స్థాపన దినోత్సవ వేడుకలను కరోనా మహమ్మారికి ముందే ప్రారంభించారు. -
Zika Virus: కాన్పుర్‌లో 25 జికా వైరస్ కేసులు నమోదు
-
వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి
ఉత్తరప్రదేశ్: సినిమాల్లో మాదిరి నిజ జీవితం అన్ని జరగవు. అయితే కొన్ని సంఘటనలు చూస్తే సినిమాల్లో మాదిరిగా చేస్తున్నారో లేక వాటిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్నారో కూడా తెలియదు. కానీ కాన్పూర్‌కి చెందిన పంకజ్ అనే వ్యక్తి 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాల్లో హీరో మాదిరిగా చేశాడు. (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....గుర్గామ్‌లోని ఓ ప్రైమేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తికి ఈ ఏడాది మేలో కోమల్ అనే ఆమెతో వివాహం అయ్యింది. అయితే పంకజ్ భార్య కోమల్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతనితో మాట్లాడకుండా దూరంగానే ఉండేది. అంతేకాక తనతోనే కాక ఇంట్లో వాళ్ల ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉండేది. చివరికి అతను కోమలిని ఎంతో ప్రయత్నించి అడగగా ఆమె తాను పింటూ అనే వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పింది. దీంతో పంకజ్ తన అత్తమామలకు ఈ విషయాన్నితెలియజేశాడు. అయితే పంకజ్ అత్తమామలు కోమల్‌కు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఆమె అంగీకరించ లేదు. ఆ తర్వాత ఈ విషయం గృహ హింస నిరోధక విభాగం, ఆశాజ్యోతి సెంటర్‌కు చేరుకుంది. వారు పంకజ్కి అతని భార్య కోమల్, పింటూ, వారి బంధవులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కోమల పింటూనే వివాహం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకోవడంతో చివరికి పంకజ్ వారి వివాహానికి అంగీకరించాడు. ఈ మేరకు పంకజ్ దగ్గరుండి మరీ లాయర్ సమక్షంలో తన భార్య ప్రేమించిన పింటూతో ఘనంగా వివాహం జరింపించాడు. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
వరద చుట్టిముట్టినా.. ఒంటి చేత్తో ముగ్గురు గర్భిణీలకు సాయం
మీర్జాపూర్: సాయం చేయాలంటే డబ్బు ఉండవలసిన అవసరం లేదు సహాయం చేయాలనే మంచి మనస్సు ఉంటే చాలంటారు. ప్రతి దానికి డబ్బు అవసరం లేదు. చాలా మంది అవయవాలు సక్రమంగా ఉన్నా తమ ప్రాణాలకు తెగించి విపత్కర సమయంలో పక్కవాళ్లను కాపాడటానికి ముందుకు రారు. కానీ ఒకతను ఒక చేయి లేదు పైగా వరద ఉదృతి అయినా లక్ష్య పెట్టక ముగ్గురు గర్భిణిలను ఆస్పత్రికి తరలించడానికి సాయం చేశాడు. (చదవండి: తాను విసిరేస్తోంది రాయి కాదు 20 కోట్లు ఖరీదు చేసే డైమండ్) వివరాల్లోకెళ్లితే....ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగంగా నది ఒడ్డున ఉన్న కునియా గ్రామాన్ని ఇటీవల కురిసిన వర్షాలకి వరద నీరు చుట్టిముట్టింది. దీంతో ఆ గ్రామంలో ఉంటున్న సుమ, శ్యామ అనే గర్భిణులకు ప్రసవ వేదనతో బాధపడుతున్నారు. వరదల కారణంగా ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేక దిక్కుతోచని స్థితితో ఉండిపోయారు. అదే గ్రామనికి చెందిన రామ్‌నరేష్ ఒక ప్రమాదంలో ఒక చేతిని కోల్పోయినప్పటికీ వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. పైగా ఆ ముంపు ప్రాంతం న ట్రాక్టర్ ట్రాలీలో ఆ గర్భిణీలను మంచాలపై పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించాడు. అంతేకాదు ఆస్పత్రికి తరలించే మార్గంలో తన ట్రాక్టర్ పూర్తిగా నీటితో నిండిపోయినప్పటికీ తన ఒంటి చేత్తోనే డ్రైవ్ చేసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ మరుసటి రోజు గోమతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించి సాయం చేశాడు. అయితే ఆ ముగ్గురు మహిళల్లో ఇద్దరికి మగ బిడ్డలు ఒక్కరికి ఆడపిల్లక పుట్టడమే కాక వారు సురక్షితంగా ఉన్నారు. ఈ మేరకు ఆ గ్రామ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ సౌరభ్ భట్ అత్యవసర సమయంలో ఆ ముగ్గురు మహిళలకు సహాయం చేసినందుకు నరేష్‌ని అభినందిచటమే కాక అతన్ని సత్కరించమని అధికారులను ఆదేశించారు. (చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!) -
ట్విటర్ ఎండీకి లీగల్ నోటీసులు.. వారం గడువు
-
స్కోడా వోక్స్‌వ్యాగన్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డీజిల్ కారులో ఉద్గార నిబంధనలను తారుమారు చేసేందుకు మోసపూరిత పరికారాన్ని (చీట్ డివైజ్) కంపెనీ ఏర్పాటు చేసిందంటూ ఉత్తరప్రదేశ్‌లో ఓ వినియోగదారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా కోరుకున్న ఫలితం దక్కలేదు. వాహనాల్లో చీట్ డివైజ్‌ల ఏర్పాటుపై కచ్చితంగా విచారణ జరగాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేవేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో విచారణ ఎందుకు కొనసాగించరాదంటూ ఈ నెల 4న విచారణలో భాగంగా ప్రశ్నించిన ధర్మాసనం.. తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ‘చీట్’ లేదా ‘డిఫీట్ డివైజ్’ అన్నది సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఓ పరికరం. దీన్ని ఆటో ఇంజన్లలో అమర్చడం ద్వారా కాలుష్యం విడుదల పరీక్షల ఫలితాలను తారుమారు చేయగలదు. ఈ విషయంలో అంతర్జాతీయంగా వోక్స్వ్యాగన్ కొన్నేళ్ల క్రితం ఆరోపణలను కూడా ఎదుర్కొన్నది. ఈ కేసులో స్కోడా వోక్స్వ్యాగన్ రూ.671.34 కోట్ల పరిహారం చెల్లించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. -
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం, మూడేళ్ల చిన్నారిపై...
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లకీంపూర్లో గురువారం ఉదయం మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. బుధవారం కనిపించకుండా పోయిన చిన్నారి శవమై కనిపించింది. పాపకు పోస్ట్‌మార్టం నిర్వహించగా తనపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పాప తండ్రి మాట్లాడుతూ తనపై పగతోనే ఇలా చేశారని ఆరోపించారు. గత 20 రోజులలో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు మూడు చోటుచేసుకున్నాయి. ఒక పదిహేడేళ్ల అమ్మాయి స్కాలర్షిప్ కోసం వెళ్లగా ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె ఊరికి 200 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగింది. దీనికి ముందు పదమూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతుండటంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు యోగీ ఆదిత్య సర్కార్‌పై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని మండిపడుతున్నారు. దీంతో మహిళలు, పిల్లల భద్రతపై సీనియర్ పోలీసు ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసింది. చదవండి: తల్లి, సోదరుడ్ని కాల్చి చంపిన బాలిక -
డాక్టర్ యోగిత హత్య కేసు నిందితుడు అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) హత్య కేసులో అనుమానితుడిగా గుర్తించిన ఒక వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగంలో యోగిత గౌతమ్ వైద్యురాలిగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె సీనియర్ డాక్టర్ అయిన ఒక వ్యక్తి యోగితను పెళ్లి చేసుకుంటానని సంవత్సరం నుంచి వేధిస్తున్నాడని ఆమె తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి యోగిత సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గురువారం అతనిని అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి యోగిత కనిపించపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె హత్యకు గురయినట్లు తెలిసింది. యోగిత మృతదేహం బమ్రోలి అహిర్ ప్రాంతంలో లభ్యమయ్యింది. ఆమె తలపై బలమైన రాడ్‌తో కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. आगरा के एसएन मेडिकल कॉलेज में एक महिला डॉक्टर के अपहरण एवं हत्या की घटना दुखद है. भाजपा के राज में प्रदेश की नारी न तो शहरों में सुरक्षित है, न बस्ती, न गाँव में. प्रतीत होता है कि अब उप्र में अपराध ही सत्ताधीश बन गया है. pic.twitter.com/c4yBN5jQf4 — Akhilesh Yadav (@yadavakhilesh) August 20, 2020 ఈ విషయంలో పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా యోగితతో ఏడు సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నట్లు చెప్పాడని, మరింత లోతుగా దర్యాప్తు చేయగా నిందితుడు పోలిక లేని సమాధానాలు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ డాక్టర్ యోగిత గౌతమ్ హత్య పట్ల విచారం వ్యకం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పట్టణాలలో, నగరాలలో , చివరికి పల్లెల్లో కూడా మహిళలకు రక్షణ లేకండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటేనే క్రైమ్ ఉత్తరప్రదేశ్‌ని పాలిస్తున్నట్లు అర్థమవుతుంది అంటూ ట్వీట్ చేశారు. చదవండి: వైద్య విద్యార్థిని కిడ్నాప్, దారుణ హత్య -
నడిరోడ్డులో జర్నలిస్ట్‌పై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. తన మేనకోడలిని వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల తరువాతే ఇలా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న విక్రమ్ జోషిని ఘజియాబాద్‌లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు . విక్రమ్ జోషి, సోమవారం రాత్రి తన కుమార్తెతో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేశారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చదవండి: నెల క్రితం వివాహం.. వధువు మృతి విక్రమ్‌జోషి మేనకోడలితో కొంతమంది అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో వారిపై విక్రమ్ పోలీసు స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో తమ మేనకోడలిని ఏడిపించిన దుండగులే ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారాని విక్రమ్ జోషి సోదరుడు తెలిపాడు. కాల్పుల్లో విక్రమ్ జోషి తలకు బులెట్ తగిలింది. వెంటనే అతనిని ఘజియాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి ఇంత వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని విక్రమ్‌జోషి సోదరుడు తెలిపాడు. దీనిపై స్పందించిన పోలీసులు విజయ్‌నగర్‌లో జర్నలిస్ట్‌పై కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందినట్లు సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. దవండి: అత్తింటి వేధింపులకు వివాహిత బలి -
ఔరాయ ప్రమాదానికి కారణం వారే: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన ఔరాయ ప్రమాదంపై బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. యూపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆమె మండిపడ్డారు. వారి వల్లే ఔరాయ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయ వద్ద కొంత మంది వలసకూలీలు రాజస్థాన్ నుంచి గోరఖ్‌పూర్ ట్రక్‌లో వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ట్రక్ ఢీ కొని 24 మంది మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి) ఈ విషయం పై మాయావతి శనివారం మీడియాతో మాట్లాడుతూ ...‘రాష్ట్రంలోకి వచ్చే, వెళ్లే వారికి సంబంధించి అన్ని బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఈ విషయాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది’ అని ఆమె ఆరోపించారు. దీనికి కారణమైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని కూడా మాయవతి కోరారు. దీంతోపాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలవాలని విన్నవించారు. అదేవిధంగా వలసకూలీలు ఎవరూ కాలినడకన రావొద్దని, రైల్వే స్టేషన్లకు వెళ్లి తమను ఇంటికి పంపే ఏర్పాట్లు చేయమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రభుత్వం పేదలందరికి రక్షణ కల్పించాలని, ఆహారం అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయాలని సూచించారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి పేదలకు సహాయాన్ని అందించాలని కోరారు. ('తినడానికి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు') -
‘ఆ విషయం కాదు ముందు దీని సంగతి చూడండి’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నకిలీ పీపీఈ కిట్ల పంపిణీ కలకలం రేపుతోంది. యూపీలోని మెడికల్ కాలేజీలకు, డాక్టర్లకు పంపిన పీపీఈ కిట్లు నకిలివి అంటూ రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర జనరల్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. తరువాత ఆ విషయం బహిర్గతమైంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం యోగీ ఆదిత్యనాధ్ సర్కార్‌ను నిలదీశారు. నకిలీ పీపీఈ కిట్ల స్కామ్ వ్యవహారంలో ఎవరు ఉన్నారో తెలుసుకొని వారిని శిక్షించాలని కోరారు. కరోనా యుద్దంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లని, వారికి నకిలీ కిట్లను సరఫరా చేస్తూ వైద్యుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు. వైద్యుల భద్రత విషయంలో రాజీపడకూడదని సూచించారు. (చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వాడొద్దు : ఐసీఎంఆర్) यूपी के कई सारे मेडिकल कालेजों में खराब PPE किट दी गई थीं। ये तो अच्छा हुआ सही समय पर वो पकड़ में आ गईं तो वापस हो गईं और हमारे योद्धा डाक्टरों की सुरक्षा से खिलवाड़ नहीं हुआ। लेकिन हैरानी की बात ये है कि यूपी सरकार को ये घोटाला परेशान नहीं कर रहा है बल्कि .. 1/2 pic.twitter.com/ef4PHpE1lb — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 27, 2020 యోగి సర్కారు మాత్రం నకిలీ కిట్ల వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు అనే విషయం తెలుసుకోవడం కంటే ముఖ్యంగా ఈ విషయం ఎవరి వల్ల బయటకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. మొదటి అసలు విషయం ఎలా బయటకి వచ్చి అని తెలుసుకోవడం పక్కన పెట్టి నకిలీ కిట్ల స్కామ్ వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలని కోరారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడం ద్వారా మంచి జరిగిందని లేకపోతే దీనిని మరుగున పడేసేవారని ప్రియాంక ఆరోపించింది. దీనికి సంబంధించిన విషయాలను ప్రియాంక తన ట్విటర్ ఖాతాలో హిందీలో పేర్కొన్నారు. (ల్యాబ్‌లు పెరిగినా టెస్ట్‌ల సంఖ్య పరిమితం..) ..ये परेशान कर रहा है कि खराब किट की खबर बाहर कैसे आ गई। ये तो अच्छा हुआ कि खबर बाहर आ गई वरना खराब किट का मामला पकड़ा ही नहीं जाता और ऐसे ही रफा-दफा हो जाता। क्या दोषियों पर कार्यवाही होगी? 2/2 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 27, 2020 -
ఆరని మంటలు
లక్నో/న్యూఢిల్లీ: ‘దిశ’ ఘటనపై దేశవ్యాప్తంగా జనాగ్రహం వెల్లువెత్తుతున్నా నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. కోర్టు కేసుకు హాజరయ్యేందుకు వెళ్తున్న అత్యాచార బాధితురాలిని సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై గురువారం వేకువజామున దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అగ్నికీలలు దహించి వేస్తుండగానే రక్షించాలంటూ ఆమె దాదాపు కిలోమీటరు దూరం పరుగులు పెట్టారు. చివరకు బాధితురాలే 112 నంబర్‌కు పోలీసులకూ ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసిన తర్వాతే అంబులెన్స్ ఘటనాస్థలానికి చేరుకొంది. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను ప్రభుత్వం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించింది. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు..ఏడాది క్రితం ఆమెను రేప్ చేసి, అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై వచ్చిన వ్యక్తి కావడం గమనార్హం. బాధితురాలి పరిస్థితి విషమం బాధితురాలిని మొదట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, తర్వాత జిల్లా ఆస్పత్రికి, ఉదయం పదింటికి లక్నో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ అశుతోష్ దుబే చెప్పారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం యూపీ ప్రభుత్వం ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించింది. ఆమెను సత్వరమే ఆస్పత్రిలో చేర్పించేందుకు వీలుగా అధికారులు లక్నో ఆస్పత్రి– అమౌసీ ఎయిర్‌పోర్టు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు– సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మార్గాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. గత ఏడాది డిసెంబర్లో తనపై జరిగిన అత్యాచారం కేసులో రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దయాశంకర్ ఎదుట బాధితురాలు వాంగ్మూలమిచ్చారు. 4.30 గంటలపుడు తన ఇంటి దగ్గర్లోని గౌరా మలుపు వద్ద హరిశంకర్ త్రివేది, రామ్‌కిశోర్ త్రివేది, ఉమేష్ బాజ్‌పాయ్, శివం త్రివేది, శుభం త్రివేదిలు పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు పేర్కొన్నారు. వీరిలో శివం, శుభం 2018 డిసెంబర్లో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఆరోపించగా ఈ ఏడాది మార్చిలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా మరొకరు నవంబర్ 25న బెయిల్‌పై బయటకు వచ్చారు. ఘటనాస్థలి వద్ద ఆధారాల సేకరణ ఖండించిన రాజ్యసభ ఉన్నావ్ రేప్ బాధితురాలిపై జరిగిన దాడి ఘటన రాజ్యసభలో దుమారం రేపింది. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఘటనను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య ఖండించారు. ‘యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా సరైన చర్యలుతీసుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న హింసకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక అందించాలని, బాధితురాలికి సరైన వైద్యం అందించాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నంపై 12వేల మంది ట్విట్టర్లో ఆగ్రహం వెలిబుచ్చారు. రేపిస్ట్లు బెయిలుపై దర్జాగా తిరగడాన్ని కొందరు తప్పుబట్టారు. ►యూపీలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని కేంద్ర హోంమంత్రి, యూపీ సీఎం నిన్న అబద్ధమాడారు. నిత్యం ఇలాంటి ఘటనలను చూస్తుండటం ఆగ్రహం తెప్పిస్తోంది. – ట్విట్టర్లో ప్రియాంకా గాంధీ -
వైరల్: ఇంగ్లిష్ రెండు లైన్లు చదవలేని టీచర్
లక్నో: కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో కళ్లకు కట్టే ఉదంతం ఇది. ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే దారుల్లో కొలువు కొట్టేసిందో తెలియదు గానీ.. ఆ ఇంగ్లిష్ టీచర్ ఇంగ్లిష్ పాఠ్య పుస్తకంలోని కనీసం రెండు లైన్లు కూడా సరిగా చదవలేక అడ్డంగా దొరికిపోయింది. తనిఖీకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా సికందర్పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ పాండే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఓ తరగతి గదిలో ఇంగ్లిష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలి బోధన తేడాగా ఉండడంతో ఆమెకు ఇంగ్లిష్ పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. ఆమె పిల్లలకంటే దారుణంగా చదవడం మొదలెట్టింది. దీంతో వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఉపాధ్యాయురాలితో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు మెజిస్ట్రేట్‌కు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పిల్లల భవిష్యత్తు ఇలాంటి వారి చేతుల్లో పెడితే వారి భవిష్యత్తు ఏంటి అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించడంతో వారు కూడా చేసేదేమీ లేక మిన్నుకుండిపోయారు. -
అదృష్టం తలుపు తడితే... దురదృష్టం దూసుకొచ్చింది..
ఉత్తరప్రదేశ్: అదృష్టం తలుపు తడితే... దురదృష్టం దూసుకు వచ్చిందంటే ఇదేనేమో..! ఉత్తరప్రదేశ్‌లో ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్న వ్యక్తికి ఏకంగా రూ. 25లక్షల విలువ చేసే ఆభరణాలు దొరికాయి. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్లు...నిధి దొరికిందని సంబరపడేలోపే విషయం కాస్త పోలీసుల దాకా వెళ్లడంతో సదరు వ్యక్తి నుంచి పోలీసులు ఆ నిధిని స్వాధీనం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. కాగా వందేళ్ల క్రితానికి చెందినవిగా భావిస్తున్న 650 గ్రాముల బంగారం, 4.53 కిలోల వెండి ఆభరణాలుగా గుర్తించారు. హార్డోయి ఎస్పీ అలోక్ ప్రియదర్శి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆ వస్తువులకు పురావస్తు ప్రాముఖ్యత ఉన్నందున వాటిని సదరు వ్యక్తి నుంచి స్వాధీన పరుచుకున్నట్లు చెప్పారు. ఆభరణాలకు సంబంధించి ఎవరి వద్ద ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేవని నిర్ధారించారు. పరిసర ప్రాంతాల్లో ఈ విషయం వ్యాపించడంతో చాలా మంది ఆ నిధిని పొందడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆభరణాలను కనుగొన్న వ్యక్తి మొదట ఈ సంఘటనను గూర్చి చెప్పడానికి నిరాకరించినా, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో వాటి గురించి తెలియజేశాడు. ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్-1878, ప్రకారం తవ్వకాలలో బయటపడిన ఏవైనా ఆభరణాలు లేదా ఖరీదైన వస్తువులను చట్టబద్ధంగా ‘నిధి’ అని పిలుస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం, ఆ నిధి దొరికిన వ్యక్తి రెవెన్యూ అధికారికి తెలియజేయాలి. విచారణ అనంతరం చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం, ఆ నిధి ఎవరికి సంబంధించింది కాదని పోలీసులు నిర్ధారిస్తే ఆ నిధిని కనుగొన్న వ్యక్తి వాటిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. -
మహ్మద్ ఘోరి V/S ఫక్కర్ రామాయని@17..
సాక్షి, ఉత్తరప్రదేశ్: అతని పేరు.. ఫక్కర్ రామాయని. వయసు 73 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ మధురలోని గాల్టేశ్వర్ ఆలయ ప్రధాన పూజారి అయిన ఈయన 17వ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇంతవరకు ఎనిమిది లోక్‌సభ, ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ స్వామీజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు మరోసారి మథుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రారంభం రోజునే ఆయన భక్తులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇన్ని ఎన్నికల్లో ఓడిపోయినా తాను నిరాశ పడటం లేదని, ఓటర్లు ఎప్పటికైనా తనను గుర్తిస్తారన్న నమ్మకం ఉందని అంటున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రామాయని రెండు అంశాల మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఒకటయితే, యమునా నదిని కాలుష్యరహితం చేయడం రెండోది. రామాయణాన్ని కంఠతా పట్టేసిన ఈయనకు పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, అందువల్ల ప్రచారానికి కారు ఉపయోగిస్తున్నానని ఆయన చెబుతున్నారు. కారు, ఎన్నికల ఖర్చు కూడా ఆయన భక్తులే భరిస్తున్నారట. ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా రామాయని ముందుగా యమునా నదికి హారతి పట్టి ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 18న మధురలో పోలింగు జరగనుంది. -
అదృష్టం
ఉత్తరప్రదేశ్‌లోని మథుర స్టేషన్లో రైలు వెళ్తున్న సమయంలో పొరపాటున తల్లి ఒడిలోంచి జారి ట్రాక్‌కు, రైల్వే ప్లాట్‌ఫామ్‌కు మధ్యనున్న చిన్నపాటి గ్యాప్‌లో పడి ఓ చిన్నారి ప్రాణాలు దక్కించుకున్న దృశ్యమిది. -
యూపీలో టైం బాంబ్ కలకలం
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఇస్మాయిల్గంజ్లో టైంబాంబ్ కలకలం రేగింది. రెవెన్యూ అధికారి రవీంద్రవర్మ ఇంటి ముందు గురువారం ఉదయం ఓ ప్యాకెట్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో టైం బాంబు అని తేలడంతో బాంబు స్వ్కాడ్ సాయంతో బాంబును నిర్వీర్యం చేయడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు.