V Vijaysai Reddy
-
కాంగ్రెస్, రాహుల్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు..
సాక్షి, తాడేపల్లి: కాంగ్రెస్ పార్టీపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, ఇటీవలి కాలంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హస్తం పార్టీని వీడిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రేపు మాపో బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. తాజాగా ట్విట్టర్లో..‘కాంగ్రెస్ పార్టీలో నాయకుల కొరత ఎక్కువగా ఉంది. రేపు రాహుల్ గాంధీ కూడా బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాంగ్రెస్ తన పునాదిని, అగ్రనేతలను కూడా కోల్పోయింది. ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్లే దేశమంతటా ఈ పరిస్థితి ఏర్పడింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. With this rate of erosion of leaders from the Congress Party, I won’t be shocked if tomorrow I get to know that Rahul Gandhi is joining the BJP too. Congress has lost its base and even its top leaders now. Their betrayal of AP started this downfall that expanded to the whole… — Vijayasai Reddy V (@VSReddy_MP) February 22, 2024 -
చంద్రబాబుపై తొమ్మిది క్రిమినల్ కేసులు.. ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అవినీతికి, వెన్నుపోటుకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో వెన్నుపోట్లు అనేవి చంద్రబాబుతోనే మొదలయ్యాయని స్పష్టం చేశారు. బాబుపై 9 క్రిమినల్ కేసులు.. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యసభలో మాట్లాడుతూ.. అంతులేని అవినీతి, కుంభకోణాలు, వెన్నుపోట్లకు కేరాఫ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ చంద్రబాబు పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. అడ్డూఅదుపూ లేకుండా అవినీతి, స్కామ్‌లకు పాల్పడి చంద్రబాబు ఈరోజున 6 లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. తనపై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిడ్‌లో పేర్కొనడాన్నిబట్టి ఆయన క్రిమినల్ నేపథ్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. రాజకీయాలలో వెన్నుపోట్లు అనేవి చంద్రబాబుతోనే మొదలయ్యాయి. టీడీపితో పొత్తు పెట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ మన ప్రజాస్వామ్యం దుస్థితి. స్కిల్ స్కామ్ సూత్రధారి చంద్రబాబే.. అలాంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పాల్పడిన కోట్లాది రూపాయల స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సీఐడి ఆయను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రాధమిక ఆధారాలు ఉన్నట్లుగా నిర్ధారించకున్న తర్వాతే కోర్టు చంద్రబాబుకు జుడిషియల్ కస్టడీ విధించింది. దీనిపై ఒకవైపు న్యాయప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు చంద్రబాబు అరెస్టుపై అఖిలపక్ష సమావేశంలో టీడీపీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో యాగీ చేయడానికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంట్ 75 ఏళ్ళ ప్రస్థానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ టీడీపీ పార్లమెంట్ సభ్యుల అనుచిత చర్యలకు సమాధానంగానే ఈరోజు చంద్రబాబు అవినీతి కుంభకోణాలు, నేర చరిత్ర గురించి సభలో ప్రస్తావించాల్సి వస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్.. ఈ 75 ఏళ్ళ పార్లమెంటరీ ప్రస్థానం దేశ ప్రజల పోరాటాలు, విజయాలు, ఆకాంక్షలకు అద్దం పడుతోందని అన్నారు. అయితే, 1976లో అత్యంత వివాదాస్పదమైన 42వ రాజ్యాంగ సవరణతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంధకారంలోకి నెట్టిందని అన్నారు. ఇదో అంధకార సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సవరణ ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించి దేశంలో కల్లోలం సృష్టించింది. తదనంతరం ఏర్పడ్డ కాంగ్రెసేతర ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణను రద్దు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీని అలాగే కొనసాగించేందుకు చట్టాలను తీసుకువచ్చేదని అన్నారు. తదుపరి ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యల కారణంగానే ఈ రోజున మనం ఇక్కడ ఉండగలిగాం. ప్రజాస్వామ్యం మళ్ళీ పరిఢవిల్లిందని అన్నారు. విభజనతో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఏ ప్రభుత్వం అంతులేని అవినీతి, ఆశ్రితపక్షపాతం, విధాన నిర్ణయాల్లో నిస్సహాయత కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుబడిపోయిందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసిన తీరని అన్యాయం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంట్‌ను దుర్వినియోగం చేస్తూ యుపిఏ ప్రభుత్వం ఎలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిందో వివరించాలి. ఒకవైపు విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపిలు పెద్ద ఎత్తున సభలో నిరసనకు దిగినప్పటికీ పట్టించుకోకుండా అశాస్త్రీయంగా, నిర్హేతుకంగా కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లును ఆమోదించింది. అన్యాయంగా ఏపీ విభజన.. ఇందుకోసం లోక్‌సభ తలుపులు మూసేశారు. సభా కార్యక్రమాల లైవ్ టెలికాస్ట్‌ను నిలిపివేశారు. విభజన బిల్లుపై ఓటింగ్ జరగాలని పట్టుబట్టిన ఆంధ్రప్రదేశ్ ఎంపిలను అన్యాయంగా సస్పెండ్ చేశారు. ప్రభుత్వాలు రావచ్చు. పోవచ్చు. అయితే విభజన బిల్లు ఆమోదం సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై ఉందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 75 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు అధికారంలో ఉంది. కాంగ్రెస్ కాకుండా మరే ఇతర పార్టీ అధికారంలో ఉన్నా భారత్ ఇప్పటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరేది. కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఇదే. గత పదేళ్ళలో కాంగ్రెసేతర పార్టీ అధికారంలో ఉంటే దేశం ఏ విధంగా పురోగమిస్తోందో మన కళ్ళ ముందే చూడవచ్చని అన్నారు. జనాభాకు తగ్గట్టుగా బిసిలకు రిజర్వేషన్లు... దేశ 50 శాతంపైగా ఉన్న వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా విద్య, ఉపాధిలో సమాన అవకాశాల కోసం, సామాజిక, ఆర్థిక పురోగతి కోసం బిసిలు అలమటిస్తున్నారని అన్నారు. దేశంలో బిసి జనాభాను కచ్చితంగా లెక్కించి వారి సామాజిక, ఆర్థిక వికాసం కోసం కుల గణన చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఇలాంటి కుల గణన స్వాతంత్రం రాక మునుపు ఎప్పుడో 1931లో నిర్వహించారని ఆ తర్వాత అలాంటి ప్రక్రియను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తొలిరోజు నుంచి చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్ట సభలలో ప్రవేశించే అవకాశం లభించడం లేదు. దేశంలోని రాష్ట్ర అసెంబ్లీలలో 8 శాతం మాత్రమే మహిళలు ప్రాతినిధ్యం వహిస్తుంటే, లోక్ సభలో వారి ప్రాతినిధ్యం 15 శాతానికి పరిమితమైందని అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా బిల్లును ప్రవేశపెట్టాలని శ్రీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశంలో 25 నుంచి 40 ఏళ్ళ వయస్సుగల యువ ఎంపీల ప్రాతినిధ్యం తొలి లోక్ సభలో 26 శాతం ఉంటే ప్రస్తుతం అది 12 శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. యువతకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా దేశంలో మార్పులకు నాంది పలకాలని ఆయన కోరారు. ఇక పార్లమెంట్ పని విధానం గురించి ప్రస్తావిస్తూ 1950లో ఏడాదికి సగటున 120 రోజులు జరిగే పార్లమెంట్ సమావేశాలు గత పదేళ్ళ కాలంలో 70 రోజులకు కుదించుకుపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. 2022లో అమెరికన్ కాంగ్రెస్ 158 రోజులు, బ్రిటిష్ పార్లమెంట్ 137 రోజులు, కెనడా పార్లమెంట్ 96 రోజులపాటు సమావేశం అయితే మన పార్లమెంట్ కేవలం 70 రోజులు మాత్రమే సమావేశమైందని, పార్లమెంట్ సమావేశాల కాలాన్ని పొడిగించి అర్ధవంతమైన చర్చల ద్వారా శాసన నిర్మాణం సాగించి ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి దోహదం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుకు ఎంపీ విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్.. మైండ్ బ్లాంక్!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందలకోట్లు కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. ఇది కూడా పెద్ద స్కామేనా అని అంటరాని ఎద్దేవా చేశారు. కాగా, చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’ అని ఎదురు దాడికి దిగుతాడు. వేచి చూడండి!’ అని కామెంట్స్ చేశారు. అమరావతిలో షెడ్లలాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశావంటే చంద్రబాబు గారూ...ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమో. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి! — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 అలాగే, ‘అమరావతిలో షెడ్లలాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశావంటే చంద్రబాబు గారూ.. ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమో. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి!’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 ఆయన మానసికస్థితి ఇంకా దిగజారింది. QR కోడ్ సృష్టికర్త తానేనట! 1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్‌ను కనిపెట్టారు. దాన్నీ తన ఖాతాలో వేసేసుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి బాబు గారూ, మాకూ తేలికవుతుంది. ఆయన మానసికస్థితి ఇంకా దిగజారింది. QR కోడ్ సృష్టికర్త తానేనట! 1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్ ను కనిపెట్టారు. దాన్నీ తన ఖాతాలో వేసేసుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి బాబు గారూ, మాకూ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 దీన్ని తీసుకొచ్చా.. దాన్ని కనిపెట్టా, అది నేనే-ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాదు. పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు గారు. 'ఇదిగో ఈ సంక్షేమ పథకం నేను ప్రవేశపెట్టిందే. ఈ ప్రాజెక్టుకు నేనే పునాదివేసి పూర్తిచేశా' అని చూపించండి? నయా పెత్తందారీ వర్గాన్ని సృష్టించి మీ వాళ్లను ఉద్దరించడం కాదు. దీన్ని తీసుకొచ్చా...దాన్ని కనిపెట్టా, అది నేనే - ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాదు. పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు గారు. 'ఇదిగో ఈ సంక్షేమ పథకం నేను ప్రవేశపెట్టిందే. ఈ ప్రాజెక్టుకు నేనే పునాదివేసి పూర్తిచేశా' అని చూపించండి? నయా పెత్తందారీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 అధికారం ఉంటే ప్రజలకు సేవచేసి మంచి పనులతో చరిత్రలో నాలుగు కాలాలు నిలిచిపోవచ్చని రాజకీయాల్లో ఉన్నవారు ఆశపడతారు. చంద్రబాబు అండ్ కంపెనీకి మాత్రం అధికారం ఉంటే యధేచ్ఛగా దోచుకోవడమే తెలుసు. అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో ఉండాలి. బాబుగారి ఆలోచన దీని చుట్టే తిరుగుతుంది. అంటూ కౌంటరిచ్చారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ -
‘బాబుకు ముట్టిన 118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి’
సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక, ఐటీ నోటీసులపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు అక్రమాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి..‘అమరావతి అనేది అతిపెద్ద స్కాం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు గారికి ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడు. CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉంది’ అని స్పష్టం చేశారు. ‘అమరావతి’ అనేది అతిపెద్ద స్కాం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు గారికి ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడు. CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 2, 2023 ఇది కూడా చదవండి: చంద్రబాబు గురించి ఢిల్లీ పెద్దలకు అంతా తెలుసు: కారుమూరి వ్యాఖ్యలు -
బలంగా ముందుకు సాగుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ
గ్లోబలైజేషన్ ప్రక్రియతో ప్రపంచం ‘కుగ్రామం’గా మారిపోతున్న తరుణంలో అమెరికా ఆర్థికవ్యవస్థ ఆరోగ్యమే అన్ని దేశాలకూ దిక్సూచి అవుతోంది. అట్లాంటిక్ మహాసముద్రానికి ఆవల ఉన్న ఈ అత్యంత ధనిక దేశం ఆర్థికస్థితి ఇప్పుడు బాగుందనే వార్త ప్రపంచ దేశాలకు ఉత్సాహాన్నిస్తోంది. 2023 రెండో క్వార్టర్లో అమెరికా ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంది. పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చన్న ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అంచనాలు తప్పని రుజువయ్యాయి. అమెరికా ఆర్థిక ప్రగతి బలపడుతోందన్న అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం చెప్పిన మాటలకు తాజా గణాంకాలు తోడయ్యాయి. ఈ ఏడాది రెండో క్వార్టర్ కాలంలో (ఏప్రిల్, మే, జూన్) అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2.4 శాతం చొప్పున పెరిగిందని గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది తమ దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకునేది లేదని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఆర్థికవేత్తలు, అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ ఈ మధ్యనే చేసిన ప్రకటనలు నిజమయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో అర్హతలున్నవారికి ఉద్యోగాలు వస్తున్నాయి. వాస్తవానికి కొత్త ఉద్యోగాలు, ఉద్యోగ ఖాళీలన్నీ నింపడానికి తగినంత మంది అమెరికాలో దొరకడం లేదట. ఈ పరిస్థితి నిరుద్యోగ సమస్య బాగా తగ్గిపోయింది. ఆర్థికపరమైన ఆటుపోట్లు తట్టుకుని ముందుకు సాగే ‘లాఘవం’ నేడు అమెరికా ఆర్థికవ్యవస్థలో కనిపిస్తోందని ప్రసిద్ధ అకౌంటింగ్ సంస్థ ఆర్.ఎస్.ఎం ప్రధాన ఆర్థికవేత్త జో బ్రూస్యులస్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అందరి అంచనాలకు భిన్నంగా అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగడం ప్రపంచానికి శుభసూచకమే. ఈ ఏడాది రెండో క్వార్టర్లో– ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి దర్పణంలా పనిచేసే జీడీపీలో 1.5% వృద్ధిరేటు కనిపిస్తుందని ప్రఖ్యాత ఆర్థిక వ్యవహారాల మీడియా సంస్థలు బ్లూంబర్గ్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూ చేసిన ఆర్థికవేత్తలు అంచనావేశారు. కాని, అంతకు మించి (2.4%) జీడీపీ రేటు ఉండడం అమెరికా పాలకపక్షానికి, ప్రజలకు ఆనందన్ని ఇస్తోంది. ఆర్థికమాంద్యం ఉందడని ఫెడ్ ప్రకటించాక రెండో క్వార్టర్ జీడీపీపై అంచనా ఈ ఏడాది అమెరికా ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొనే అవకాశం లేదని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా వాణిజ్య శాఖ రెండో క్వార్టర్ జీడీపీ అంచనా వివరాలు వెల్లడించింది. మరో ఆసక్తికర విషయం ఏమంటే వడ్డీ రేట్లను (25 బేసిక్ పాయింట్లు) ఫెడ్ బుధవారం పెంచింది. 2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచడం ఇది 11వ సారి. గడచిన 20 ఏళ్లలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను ఇంత ఎక్కువగా పెంచడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో వినియోగదారులు గతంతో పోల్చితే కాస్త ఎక్కువ ఖర్చుచేయడం, మొత్తం ఆర్థికవ్యవస్థలోకి వచ్చిన పెట్టుబడులు, రాష్ట్ర, స్థానిక, ఫెడరల్ స్థాయిల్లో ప్రభుత్వాల వ్యయం అమెరికా జీడీపీ పెరగడానికి దోహదం చేశాయని బ్యూరో ఆఫ్ ఇకనామిక్ ఎనాలిసిస్ అభిప్రాయపడింది. అన్ని ఉద్యోగ ఖాళీల భర్తీకి అవసరమైనంత మంది అందుబాటులో లేకపోవడం దేశంలో వేతనాలు పెరగడానికి దారితీసింది. జూన్ మాసంలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు మూడు శాతానికి చేరుకుంది. అయితే, 2021 మార్చి నుంచి చూస్తే ఇదే అత్యల్పమని ఈ నెలలో ప్రభుత్వం ప్రకటించింది. అనేక కారణాల వల్ల 2023 ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం పరిస్థితి మెరుగవుతుందని గోల్డ్ మన్ శాక్స్ రీసెర్చ్ సంస్థలో ప్రధాన అమెరికా ఆర్థికవేత్త డేవిడ్ మెరికిల్ చెప్పారు. అనుకున్నదానికంటే మెరుగైన రీతిలో అమెరికా ఆర్థికవ్యవస్థ పయనించడంతో దేశంలోని వినియోగదారులు, వ్యాపారులేగాక అక్కడ చదువుకుంటున్న లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగాలు ఆశించే సాంకేతిక నైపుణ్యాలున్న విదేశీ యువకులు సంతోషపడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక రైలింజనులా ముందుకు నడిపించే స్థితిలో అమెరికా ఆర్థిక ప్రగతి ప్రస్తుతం ఉంది. ప్రపంచీకరణ పూర్తవుతున్న దశలో అమెరికా ఆరోగ్యమే ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలకూ మహద్భాగ్యంగా ఇప్పటికీ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు -
ప్రజాశీస్సుల కోసం గడప గడపకూ..
సాక్షి, అమరావతి: మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనంతో పాటు ప్రతిపక్షం, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ప్రజలకు వివరించి.. వారి ఆశీర్వాదం తీసుకునే గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులపాటు పర్యటించి.. ప్రతి ఇంటి గడపకూ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు వెళ్లనున్నారు. ఆ ఇంటి సభ్యులకు మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనాన్ని, సంక్షేమాభివృద్ధి పథకాలకు మారీచుల్లా అడ్డుపడుతున్న దుష్టచతుష్టయం (టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5) తీరును వివరించి.. తమకు తోడుగా ఉండాలని కోరనున్నారు. మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాన్ని సాధించింది. అధికారం చేపట్టిన మూడేళ్లలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా.. ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా.. డీబీటీ (నగదు బదిలీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1,38,894 కోట్లు జమ చేశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో.. ఆర్థిక ఇబ్బందుల్లో.. నిరుపేద లబ్ధిదారులకు ఆర్థిక సమస్యలు లేకుండా చేశారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. ఇళ్లు లేని 31 లక్షలకుపైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి.. గృహాలను నిర్మిస్తున్నారు. ఏకంగా 17,005 ఊళ్ల (వైఎస్సార్ జగనన్న కాలనీలు)ను కట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని పరిశీలకులు చెబుతున్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్‌కు దీటుగా ఆధునికీకరిస్తున్నారు. రహదారులను అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు వీటన్నింటినీ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించడంతో పాటు.. ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరిస్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను ఆ కుటుంబానికి అందించి, ఆశీర్వదించాలని కోరనున్నారు. దుష్టచతుష్టయంపై యుద్ధం సంస్కరణల ద్వారా పరిపాలనలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి.. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం కోసం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే సంక్షేమ పథకాల నుంచి పరిపాలన వికేంద్రీకరణ వరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు మారీచుల్లా అడ్డుపడుతున్నారు. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుండటం చూసి కడుపు మంటతో ఇళ్లు, ఇంగ్లిష్ మీడియం.. తదితర పథకాలు, కార్యక్రమాలపై కోర్టుల్లో కేసులు వేయించారు. బ్యాంకుల ద్వారా నిధులు అందకుండా చేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోజూస్తున్నారు. ఒక బలమైన దురుద్దేశంతో విస్తృతంగా దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జ్‌లు వీటన్నింటి గురించి కూడా ప్రజలకు వివరించి, తమను ఆశీర్వదించాలని, తమకు తోడుగా నిలవాలని కోరనున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 80 సచివాలయాలు ఉంటాయి. నెలలో 20 రోజులు గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం సాగుతుంది. అంటే.. ఈ కార్యక్రమం పూర్తవడానికి 8 నుంచి 9 నెలల సమయం పడుతుంది. పార్టీ బలోపేతమే లక్ష్యం ప్రజలతో మరింతగా మమేకమవడానికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత నెల 27న నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి.. విజయవంతం చేసే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులకు అప్పగించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయం చేయనున్నారు. రోజూ ఈ కార్యక్రమాన్ని సమీక్షించే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తల కో–ఆర్డినేటర్, వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డికి సీఎం అప్పగించారు. ఈ కార్యక్రమ తీరుతెన్నులను తాను కూడా క్రమం తప్పకుండా సమీక్షిస్తానని స్పష్టం చేశారు. సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమం ముగిసేలోపే.. బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలకు స్థానం కల్పించనున్నారు. తద్వారా బూత్ స్థాయి నుంచే పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆఖండ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే క్రియాశీలకం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
‘ఇమేజ్ పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబు’
సాక్షి, అమరావతి: ఇమేజ్ పెంచుకోవడానికి అడ్డదారులుండవని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వల వేస్తే పడలేదు. ఇప్పుడు సోనూ సూద్‌కు గాలం వేశాడు. నిస్వార్థ సేవా కార్యక్రమాలతో ఆయన సంపాదించుకున్న మంచి పేరులో ఎంతో కొంత కొట్టేయొచ్చన్నది బాబు ప్లాన్. త్వరలోనే వీళ్ల సంగతి ఆయనకు తెలియకపోదు. ఇమేజి పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబూ’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అదే విధంగా ‘ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోకపోతే ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆక్రోశం ఎందుకో? నిమ్మాడ నుంచి కరకట్ట కొంప వరకు రీసౌండ్ ఎందుకు వస్తోంది?. పచ్చ మీడియా విషపు రాతలు ఎందుకు రాస్తోంది?. విశాఖపై రాయలసీమ రౌడీల కన్ను అంటూ విషం చిమ్మిన మీడియా. ఆక్రమణలు తొలగిస్తుంటే కక్ష సాధింపు అంటోంది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో సూటిగా ప్రశ్నించారు. చదవండి: వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ వాహనమిత్ర అమలు: సీఎం జగన్ -
‘చంద్రబాబు అండ్ కో కుల రాజకీయాలపై దృష్టిపెట్టింది’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చంద్రబాబుపై శనివారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రజలు, ప్రభుత్వం కరోనాతో పోరాడుతుంటే చంద్రబాబు అండ్ కో కుల రాజకీయాలపై దృష్టిపెట్టిందని ధ్వజమెత్తారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతిపక్ష నేత జూమ్‌లో కుల కలం రేపుతున్నాడని మండిపడ్డారు. రోజుకు నాలుగైదు గంటలు కులాలు, మతాల పేరుతో చిచ్చుపెట్టే చర్చలు జరుపుతున్నాడని అన్నారు. బాబు ఆలోచనలు సొంత పార్టీ వాళ్లకీ అంతుబట్టనంత లోతుగా ఉంటాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘50 ఇళ్లకో కార్యకర్తను నియమిస్తాడట, కామెడీ ఏమిటంటే, వాళ్లను మాలోకం లీడ్ చేస్తాడట. ఏ ఇంట్లో పప్పు వండాలో ఆరా తీయించడానికా కొడుక్కి పెత్తనం అని జనం నవ్వుకుంటున్నారు’అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చదవండి: చంద్రబాబు జూమ్ పార్టీ అధ్యక్షుడు: మంత్రి అనిల్ -
‘పాపం.. ఆయనను ఎవరూ ఏం అనొద్దు’
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చంద్రబాబుపై శనివారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు స్క్రిజోఫీనియా ముదిరిపోయిందని వ్యాఖ్యానించారు. అల్జీమర్స్ ఆఖరి దశలోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు నాయుడు తనను తాను పూర్తిగా మర్చిపోయాడు.. ఇప్పుడు తాను జడ్జ్ పాత్రలో ఊహించుకుంటున్నాడు. ఆ క్యారెక్టర్ లో తీర్పు కూడా ఇచ్చాడు. పాపం..ఎవ్వరు ఏం అనొద్దు’అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏపీ భవన్లో సోమవారం భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నేత్వత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బెల్లాన చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగయ్య, సత్యవతి, భరత్, పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీకృష్ణ దేవరాయలు, ఎన్వీవీ సత్యనారాయణ, అయోధ్య రామిరెడ్డి తదితులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారిద్దరిని హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించిన విషయం విదితమే. కాగా కాకినాడ ఎంపీ వంగ గీత సైతం ఇటీవలే మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. -
కరోనా పరీక్షల వైద్య పరికరాల కోసం 10 లక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అరికట్టే పోరాటంలో భాగంగా అందుకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు కోసం వైఎస్సార్సీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఎంపీ ల్యాడ్స్ (ఎంపీ స్థానిక అభివృద్ధి నిధుల పథకం) నుంచి విశాఖపట్నం జిల్లాకు రూ. 10 లక్షలు విడుదల చేశారు. నిధుల విడుదలకు సిఫార్సు చేస్తూ ఆయన విశాఖ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కరోనా అనుమానిత వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతను దూరం నుంచే పరీక్షించేందుకు అవసరమైన ఇన్ఫ్రా-రెడ్ థర్మోమీటర్లు, కరోనా వైరస్ బారిన పడకుండా వైద్య సిబ్బంది సమర్ధవంతంగా తమ విధులు నిర్వర్తించేందుకు అవసరమయ్యే పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు వంటి ప్రాంతాల్లో దూరంగా నిలబడి ప్రయాణీకుల శరీర ఉష్టోగ్రతను పరీక్షించే థర్మల్ ఇమేజి స్కానర్లు లేదా కెమేరాలు, కరోనా టెస్టింగ్ కిట్లు, ఐసోలేషన్, క్వారంటైన్ వార్డులలో వినియోగించే ఐసీయూ వెంటిలేటర్లు, వైద్య సిబ్బందికి అవసరమైన మాస్క్‌లు, గ్లోవ్‌లు, శానిటైజర్లతోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదించిన ఇతర వైద్య పరికరాల కొనుగోలు కోసం ఈ నిధులను మంజూరు చేస్తున్నట్లుగా ఆయన తన లేఖలో తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అసాధరణ చర్యలలో భాగంగా కరోనా పరీక్షల కోసం తగినన్ని వైద్య పరికరాలతో సిద్ధంగా ఉండాలన్న ఉద్ధేశంతో వాటి కొనుగోలు కోసం ఎంపీ నిధులను వినియోగించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ కేంద్ర స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ శ్రీ విజయసాయి రెడ్డికి లేఖ రాసింది. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ విశాఖ జిల్లాలో కరోనా పరీక్షల కోసం వైద్య పరికరాల కొనుగోలుకు తన ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు లేఖ రాశారు. -
‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ ఇది బాబు నైజం
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘'అంగిట బెల్లం ఆత్మలో విషం’ అనేది చంద్రబాబు నైజాన్నివర్ణించడానికే పుట్టింది. పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు.చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు. తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశారు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘అణగారిన వర్గాల పట్ల బాబు ద్వేషం మరోసారి బైటపడింది. వారిని వోట్ బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలుకు సీఎం జగన్ గారు నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించారు’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. -
అది రోటీన్ డ్రామా : విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. వారు ఆస్తులు ప్రకటించడం కొత్తేమికాదని..ఇది రోటీన్ డ్రామా అని విమర్శించారు. ప్రకటనలో బినామీ ఆస్తులు, సీక్రెట్ ఆకౌంట్ల గురించి బాబు, లోకేష్ ప్రస్తావించలేదని మండిపడ్డారు. వీటిపై విచారణ జరిగితే అన్నీ వెలుగు చూస్తాయని చెప్పారు. వాస్తవానికి ఈ తండ్రీకొడుకులే ఏపీతో పాటు దేశ పరిస్థితికి అతిపెద్ద జవాబుదారీలని పేర్కొన్నారు. ( చదవండి : అది మామూలు విషయమా: విజయసాయిరెడ్డి) The basic fact is that both @ncbn and his son are the biggest liability to the state of AP and the country. The assets declared today is a routine drama since their undeclared, benami, siphoned and secret bank accounts are never declared and investigated. — Vijayasai Reddy V (@VSReddy_MP) February 20, 2020 -
అదే సీఎం జగన్ ఆశయం : విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలోని ప్రతి పౌరుడు మూడు మొక్కలు నాటాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకే ప్రగతి భారతి పౌండేషన్ ప్రారంభించామని వెల్లడించారు. కాలుష్యాన్ని అరికట్టాలిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. ఏపీని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆరు కోట్ల మంది మొక్కలు నాటాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని, దానికి ప్రతి పౌరుడు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం అందమైన నగరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత నగర పౌరులదే అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారాలన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. విశాఖ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, 1926లో తొలి విశ్యవిద్యాలయం (ఆంధ్రా యూనివర్శిటీ) ఇక్కడే ఏర్పడిందని గుర్తు చేశారు. దేశంలోనే తొమ్మిదవ పెద్ద నగరంగా ఉన్న విశాఖను ప్రకృతి, పర్యావరణానికి కేరాఫ్‌గా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అది తప్పకుండా అమలు అవుతుంది విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా సీఎం జగన్ ప్రకటించారని, అది తప్పకుండా అమలు అవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కొందరు అడ్డంకులు సృష్టించినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఎవరు అడ్డొచ్చినా మూడు రాజధానుల ప్రతిపాదన ఆగదని చెప్పారు. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమో కాదో తనకు తెలియదన్నారు. భూములు పోతాయనే భయంతో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, సుజనా కలిసి ఎన్ని కుట్రలు చేసినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవతరించి తీరుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
14 నెలల జైలు జీవితం.. సీఎం చొరవతో విముక్తి
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్రానికి చెందిన 20 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది. ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకారుల విడుదలకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 1 నెలల పాటు పాకిస్తాన్ చెరలో ఉన్న 20 మంది మత్స్యకారులు సోమవారం విడుదలయ్యారు. ఈరోజు మధ్యాహ్నం వారు వాఘా సరిహద్దు గుండా స్వదేశానికి చేరుకోనున్నారు. గుజరాత్ తీర ప్రాంతం నుంచి చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి జైలు పాలైన సంగతి తెలిసిందే. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్ దృష్టికి మత్స్యకార కుటుంబాలు తమ సమస్యను తీసుకురాగా.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఆ పనిని వైఎస్సార్సీపీ ఎంపీల బృందానికి అప్పగించారు. (చదవండి : ఆంధ్రా జాలర్ల విడుదలకు పాక్ అంగీకారం) ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపింది. భారత్ విఙ్ఞప్తి మేరకు మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ అంగీకరించింది. నేడు వాఘా సరిహద్దు వద్ద 20 మత్స్యకారులను పాకిస్తాన్ భారత్‌కు అప్పగించనుంది. మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చేందుకు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అక్కడికి బయల్దేరి వెళ్లారు. వైద్య పరీక్షలు, అధికారిక లాంఛనాల అనంతరం దౌత్య అధికారులు మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, అధికారులకు మత్స్యకారులను అప్పగించనున్నారు. రేపు ఉదయం వారంతా ఢిల్లీకి చేరుకుంటారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. మత్స్యకారులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక సంక్రాంతి నేపథ్యంలో తమవారు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటుండటంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. (చదవండి ఐ సీఎం జగన్ చొరవతోనే మత్స్యకారుల విడుదల) ►పాకిస్తాన్ విడుదల చేసిన ఆంధ్రా జాలర్ల జాబితా.. ఎస్.కిశోర్ , తండ్రి అప్పారావు నికరందాస్ ధనరాజ్, తండ్రి అప్పన్న గరమత్తి, తండ్రి రాముడు ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు ఎస్. అప్పారావు, తండ్రి రాములు జి. రామారావు, తండ్రి అప్పన్న బాడి అప్పన్న, తండ్రి అప్పారావు ఎం. గురువులు, తండ్రి సతియా నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్ వి. శామ్యూల్, తండ్రి కన్నాలు కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి కందా మణి, తండ్రి అప్పారావు కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు కేశం రాజు, తండ్రి అమ్మోరు భైరవుడు, తండ్రి కొర్లయ్య సన్యాసిరావు, తండ్రి మీసేను సుమంత్ తండ్రి ప్రదీప్ -
‘ఫ్లాప్ సినిమాలో పవన్ ద్విపాత్రాభినయం’
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా ఉందన్నారు. నిజ జీవితంలో ఆయన పోషిస్తోన్న పాత్ర ఫ్లాప్ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘ఒక సినిమాలో హీరోగా, మరో మూవీలో విలన్ గా నటిస్తే ఎవరికీ అభ్యంతరముండదు. కానీ ఒకే సినిమాలో ఆ నటుడు కథానాయకుడిగా, విలన్ గా నటిస్తే ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయుడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. మరో ట్విట్లో దిశ ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తన కుటుంబ సభ్యులైతే ఒకలా.. పరాయి ఆడపిల్ల అయితే మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘రేప్ చేస్తే ఉరి తీస్తారా? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని ‘తీర్పు’ చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి. తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నారు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెబుతుండడం దురదృష్టకరం’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. -
పవనిజం అంటే ఇదేనేమో!
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటనపై పవన్ స్పందించిన తీరును తనదైన శైలిలో ఖండించారు. ‘రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా?’ అని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై పవన్ స్పందిస్తూ.. వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పేర్కొన్నారు. అత్యంత కిరాతకంగా, అమానుషంగా షాద్‌నగర్ శివార్లలో దిశను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబుక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘గంటలోపే పచ్చ దొంగల క్షుద్ర దాడి’
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. పేద వాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన బియ్యం అందించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇచ్చారంటూ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గంటలోపలే పచ్చ పార్టీ దొంగలు క్షుద్ర దాడి మొదలెట్టారని విమర్శించారు. ‘మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. పచ్చపార్టీ దొంగలు ఆ బియ్యం బస్తాలలో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంటలోపలే క్షుద్రదాడి మొదలు పెట్టారు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను వినియోగించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 100శాతం నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. -
‘వీళ్లకంటే దావూద్ గ్యాంగ్ చాలా నయం’
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. కోడెల కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై విజయసాయి రెడ్డి ట్విటర్లో స్పందించారు. 'ప్రాధేయపడితే బందిపోట్లన్నా కొన్ని వస్తువులు వదిలి పోతారు. కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని కుటుంబాలను పోషించుకునే వారిని, రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదు. రూ.15 లక్షల కంటే తక్కువ ఇస్తామంటే ముట్టనే ముట్టరంట. ముంబై దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం అంటున్నారు. వ్యక్తిగత కక్షలతో జరుగుతున్న దాడులను కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు అంటగట్టడం టీడీపీ దివాళాకోరుతనానికి నిదర్శనం. హింస, ఉన్మాద రాజకీయాలకు ఆ పార్టీ పెట్టింది పేరు. మా కార్యకర్తలను 400 మందిని పొట్టన పెట్టుకుంది. జగన్ గారు దీనిపై అప్పట్లోనే గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చదవండి : కోడెల బండారం బట్టబయలు -
చంద్రబాబు మరో యూటర్న్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల షాక్ నుంచి తేరుకోకముందే చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారంటూ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఎన్నికల షాక్ నుంచి తేరుకోకముందే చంద్రబాబు మరో యూటర్న్. ఇకపై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏలో కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. అర్థమవుతోంది గదా.. మోదీ, అమిత్ షాకు మోకరిల్లే ప్రయత్నం అని. ముగ్గురు ఎంపీలతో ఆయన ఎన్ని యూటర్న్లు తీసుకున్నా పట్టించుకునే వారుండరు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ తమ నాయకుడి సౌకర్యాలు, ఇబ్బందుల గురించి ఆందోళనకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. ‘విమానాశ్రయంలో భద్రతా నియమాలు ఎవరైనా పాటించాల్సిందే. ప్రజలు ఛీకొట్టిన తరువాత కూడా ఇంకా సీఎంగానే కొనసాగుతున్నట్టు ఆయన భ్రమపడటం, మీరు భజన చేయడం ఎబ్బెట్టుగా లేదా’ అంటూ మరో ట్వీట్లో ఎద్దేవా చేశారు. వెన్నుపోటు, నయవంచన, అక్రమాలతో సీఎం అయిన చంద్రబాబు 14 ఏళ్లపాటు తన కుటుంబం, తనవాళ్ల కోసమే పనిచేశారని, ఆయనేదో స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడైనట్టుగా కొందరు ఉన్మాదులు ఊగిపోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబే అందరినీ అవమానాలకు గురిచేసి హేళనగా చూశారని గుర్తు చేశారు. ‘సీఎంగా ఉన్నప్పటి ప్రభుత్వ మర్యాదలు, మినహాయింపులు ఇంకా కొనసాగాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనకు వాతలు పెట్టిన ప్రజలకు ఇవన్నీ ప్రాముఖ్యత లేని అంశాలుగా కనిపిస్తున్నాయి. యువ ముఖ్యమంత్రి తమ పట్ల కనబరుస్తున్న శ్రద్ధ, తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో కొత్త ఆశలు నింపాయి’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
‘ప్రస్తుతం 13 జిల్లాలు.. 25 కాబోతున్నాయి’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి.. త్వరలో 25 జిల్లాలు కాబోతున్నాయని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తెలిపారు. గురువారం వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘పాదయాత్ర సమయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు..వాటిని నేరవేర్చేందుకు చాలా కృషి చేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు..ఆ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని వివరించారు. వాలంటీర్ల నియామకం గురించి ఆలోచన చేశాం.. ప్రజలకు సేవ చేస్తున్నామన్న భావనతో ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించి తిరిగి 2024లో అధికారంలోకి రావాలని కార్యకర్తలకు హితబోధ చేశారు. గ్రామ వాలంటీర్లుగా చేయాలకునేవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోందని, ఇందులో కూడా ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని ఉపదేశించారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇటీవల కాలంలో తగ్గిపోయాయని అందరూ అభిప్రాయపడుతున్నారు..అయితే , కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తున్నాం.. కొత్త కార్యాలయం ఏర్పాటు జరుగుతోంది.. త్వరలోనే పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేస్తామని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం సేవ చేసే వారందరికీ సముచిత స్థానం దక్కుతుందని మీకు మాటిస్తున్నానని తెలిపారు. పార్టీ కార్యాలయంలో శని, ఆది వారాలలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. చదవండి: కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు -
పోలింగ్ అధికారిని ప్రద్యుమ్న బెదిరించారు
సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిన తీరుపై ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తాము ఫిర్యాదు చేసినా నిజాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టిన కలెక్టర్ ప్రద్యుమ్నపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. టీడీపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు ఆర్వోను కూడా కౌంటింగ్ విధుల నుంచి తప్పించాలని విన్నవించింది. గురువారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆటంకాలు సృష్టించేలా అధికార టీడీపీ కుట్రలు పన్నిందని ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈమేరకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బుట్టా రేణుక, పి.రవీంద్రబాబు, అవంతి శ్రీనివాసరావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో కూడిన బృందం శనివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలతో సమావేశమై పలు వినతిపత్రాలు ఇచ్చింది. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన పేషీలో పనిచేసిన అధికారిని చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా నియమించి ఆయన ద్వారా చంద్రగిరిలో చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారో వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరించారు... ‘ఎన్నికలు పూర్తయిన మర్నాడే ఏప్రిల్ 12వతేదీన ఈవీఎంలన్నీ సీల్ చేసే రోజు మా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరిలో రిగ్గింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఎన్నికల అధికారులతో ముఖ్యంగా కలెక్టర్ ప్రద్యుమ్నతో కుమ్మక్కై దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశాం. కొందరు వచ్చినా సిరా చుక్క వేసి పంపించేశారు. అందరి ఓట్లనూ టీడీపీకి చెందిన వ్యక్తి వేశారని ఫిర్యాదులో నివేదించాం. ఏడు పోలింగ్ బూత్‌ల్లో ఇలాగే చేశారని ఫిర్యాదు ఇచ్చాం. అయితే పోలింగ్ ఆఫీసర్‌ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న బెదిరించారు. పోలింగ్ ఆఫీసర్‌ను ప్రాణాలు తీస్తామని బెదిరించి రిగ్గింగ్ జరగలేదని రాయించారు. సీసీ ఫుటేజీని పరిశీలించాలని మేం కోరినా కలెక్టర్ పట్టించుకోలేదు. మా వినతిని తిరస్కరించి రిగ్గింగ్ జరగలేదని నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. వీడియో ఫుటేజీలు చూశాక ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇంత దుర్మార్గం ఎక్కడా జరిగి ఉండదని భావిస్తూ రీ పోలింగ్‌కు ఆదేశించారు. గతంలో కూడా... ఈ ఎన్నికల్లోనే కాదు.. 2014 ఎన్నికల్లో కూడా ఈ ఐదు బూత్‌ల్లో మొత్తం పోలైన ఓట్లు తెలుగుదేశానికే వచ్చాయి. ఏ ఒక్క ఓటూ ఇతర పార్టీకి పడలేదు. కలెక్టర్ ప్రద్యుమ్న లాలూచీ పడి రేపు కౌంటింగ్ రోజు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రమాదం ఉందని, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై చర్యలు తీసుకోవాలని కోరాం. వీవీ ప్యాట్ల స్లిప్పులపై స్పష్టత కోరాం... కౌంటింగ్‌కు సంబంధించి కూడా ఈసీకి పలు విన్నపాలు చేశాం. పోలింగ్ ప్రారంభానికి ముందు 50 ఓట్లకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలన్నీ క్లియర్ చేశాక వీవీ ప్యాట్ల స్లిప్పులను క్లియర్ చేయని పక్షంలో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్క ఎక్కువగా వస్తుంది. ఈవీఎంలలో తక్కువ ఓట్లు వస్తాయి. దీనిమీద స్పష్టత ఇవ్వాలని ఈసీనికోరాం. రాప్తాడు ఆర్వోను తప్పించాలి... అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఉన్న ప్రాజెక్టు డైరెక్టర్ మంత్రి సునీతమ్మకు తొత్తులా వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్ విధుల నుంచి ఆమెను తొలగించాలని కోరాం. టీడీపీ అసాంఘిక శక్తులకు, గూండాలు, రౌడీలకు శిక్షణ ఇచ్చి పోలింగ్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించింది. అధికార పార్టీకి ఓట్లు తక్కువగా వచ్చే చోట శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని వారికి స్పష్టంగా ఆదేశాలున్నాయి. ఈ విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తెచ్చాం. ఈసీ దృష్టికి డూప్లికేట్ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో విద్యార్థులను, అంగన్వాడీలు, ఆశా వర్కర్లను పోలింగ్ ఏజెంట్లకు సహాయకులుగా ఇచ్చారు. బహుశా విద్యార్థులను వినియోగించడం చరిత్రలో మొదటిసారి. పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. కానీ వీరి ఓట్లు అటు వారి పోలింగ్ స్టేషన్లలోనూ ఇటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా పడ్డాయి. ఇలా డూప్లికేట్ ఓటింగ్ జరిగిన విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తెచ్చాం. కౌంటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులనే కాకుండా అదనంగా కేంద్ర బలగాలను పంపి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరాం. ప్రద్యుమ్నకు అక్రమాలన్నీ తెలుసు.. పశ్చిమ బెంగాల్లో కార్యదర్శిని బదిలీ చేశారు కానీ ఏపీలో సీఎస్ లేఖ రాసినా చర్యలు తీసుకోలేదంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను ప్రస్తావించగా ‘చంద్రగిరిలో ఐదు పోలింగ్ బూత్‌లను ఆక్రమించి ఒకే వ్యక్తి అందరి ఓట్లను రిగ్గింగ్ చేసినందువల్లే రీపోలింగ్‌కు ఆదేశించారు. సీసీ ఫుటేజీలో ఒకే వ్యక్తి బటన్ నొక్కుతున్న విషయాన్ని ఈసీ గుర్తించింది. నిజానికి మేం ఏడు పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేశాం. కానీ ఈసీ ఐదు పోలింగ్ బూత్‌లలో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్నకు లై డిటెక్టర్‌తో పరీక్ష నిర్వహిస్తే చంద్రగిరిలో జరిగిన పోలింగ్ అక్రమాలన్నీ బయటకు వస్తాయి. సీఎస్‌కు ఫిర్యాదు కాపీ పంపితే తప్పేముంది? సీఎస్‌కు ఫిర్యాదు చేయడంపైనా విమర్శలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు పేర్కొనగా ‘ఏ ఫిర్యాదునైనా సీఈవోకు, సీఎస్‌కు ఇస్తాం. సీఎస్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మేం పంపే ప్రతి ఫిర్యాదునూ ఆయనకు ఒక కాపీ పంపిస్తున్నాం. ఇందులో తప్పులేదు. వీరంతా ఎన్నికల సంఘం పరిధిలోకే వస్తారు..’ అని బదులిచ్చారు. మా పార్టీ పాత్రపై జగన్ నిర్ణయిస్తారు ‘దేశ రాజకీయాల్లో వైఎస్సార్ సీపీ పాత్ర ఏమిటన్నది ఎన్నికల ఫలితాల తర్వాత .. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు..’ అని విజయసాయిరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎం రమేశ్ వ్యాఖ్యలపై స్పందించాలాసీఎం రమేశ్ ? కేంద్ర హోంశాఖలో ఓ అధికారి వైఎస్సార్సీపీ తరపున లాబీయింగ్ చేసి రీ పోలింగ్‌కు ఆదేశించేలా చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆరోపణలు చేయటాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘సీఎం రమేష్ లాంటి క్యారెక్టర్ లేని వ్యక్తి ఆరోపణలు చేస్తే దానిపై నేను స్పందించాలా? ఆయన గత చరిత్ర అందరికీ తెలుసు. క్యారెక్టర్ గురించి మీకు తెలుసు. ఆయన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు..’ అని వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈసీ వ్యవహారాలపై దర్యాప్తు చేయిస్తామని టీడీపీ ఎంపీ రమేశ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా ‘ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ. సీఎం రమేష్ లాంటి బుర్ర లేని వ్యక్తి దానిపై ఇన్వెస్టిగేషన్ చేయిస్తామనడం హాస్యాస్పదం..’ అని పేర్కొన్నారు. దళితులంటే బాబుకు చిన్నచూపు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే టీడీపీ నేతలు దళితులను ఓటేయకుండా చేశారు. సీఎం చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు మీరు కూడా చూశారు. ఎవరైనా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా? అంటూ చంద్రబాబు గతంలో దళితులను కించపరిచేలా మాట్లాడారు. ఓట్లేయకుండా చంద్రబాబు దళిత ద్రోహిలా వ్యవహరిస్తున్నారు. దళితులను హింసించిన వ్యక్తి చింతమనేని ప్రభాకర్. టీడీపీలో చాలా మంది నేతలు దళితులను చిన్నచూపు చూస్తున్నారు. అధికారులను బెదిరించారు: మేకపాటి ‘చంద్రగిరిలోని ఐదు పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడిన తీరుపై ఎన్నికలు జరిగిన మరుసటి రోజే మేం ఈసీకి ఫిర్యాదు చేసినా అధికారులను భయపెట్టి ఏమీ జరగలేదని నివేదిక ఇచ్చారు. వీడియో ఫుటేజీలు చూశాక ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించింది. అధికారానికి బానిసగా మారిన సీఎం చంద్రబాబు ఎలాగైనా గెలవాలని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం’ అని మేకపాటి వెల్లడించారు. -
సమాచార కమిషనర్లుగా టీడీపీ కార్యకర్తలా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజా నియామక ప్రతిపాదనపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి (జీపీఎం, ఏఆర్)లకు వేర్వేరుగా ఆయన శుక్రవారం లేఖలు రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని స్పష్టం చేశారు. లేఖలో ఏం రాశారంటే.. చట్టం చెబుతున్నదేమిటి? చేసిందేంటి? ‘సమాచార కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారిలో ఒకరు విజయవాడకు చెందిన హోటల్ వ్యాపారి ఐలాపురం రాజా కాగా మరొకరు విద్యా శాఖ మంత్రి ప్రైవేట్ కార్యదర్శి, గ్రామాధికారుల సంఘం నాయకుడైన ఇ.శ్రీరామమూర్తి. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు. ఆర్టీఐ చట్టం (2005) సెక్షన్ 15 ప్రకారం నియామకాలన్నీ సమాచార కమిషన్ నిబంధనావళి ప్రకారమే జరగాలి. చట్టంలోని 5వ సబ్‌సెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యే వ్యక్తులు ప్రజా జీవనంలో ప్రముఖులై ఉండాలి. న్యాయ, శాస్త్ర, సాంకేతిక, సేవా, యాజమాన్యం (మేనేజ్మెంట్), జర్నలిజం, మాస్ మీడియా, ప్రభుత్వ, పరిపాలనా రంగాలలో విస్తృత పరిజ్ఞానం, అనుభవజ్ఞులై ఉండాలని చట్టం చెబుతోంది. సబ్ సెక్షన్–6 ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లు ఎంపీలుగా లేదా ఎమ్మెల్యేలుగా ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉండకూడదు. లాభసాటి పదవులు నిర్వహించి ఉండకూడదు. ఏదైనా వ్యాపారంలో ఉండకూడదని 6వ సబ్ సెక్షన్ స్పష్టం చేస్తోంది. పై నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఇద్దరూ సమాచార కమిషనర్లుగా అనర్హులు. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వీరిద్దర్నీ ఎలా ప్రతిపాదించింది? ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రి, సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ (ప్రతిపక్ష నాయకుడు గైర్హాజరయినపుడు)తో కూడిన కమిటీ వీరి పేర్లకు అనుమతి ఇచ్చింది? వీరిలో ఐలాపురం రాజా పేరును గవర్నర్ ఆమోదించినట్టు, ఇ.శ్రీరామమూర్తి పేరుకు అభ్యంతరం తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన రాలేరని తెలిసి కూడా కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లోపించింది. రాజకీయ దురుద్దేశపూర్వకంగా జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చేవరకు ఆపండి ఆర్టీఐ కమిషనర్లను నియమించకుండా నాలుగేళ్లు వేచి చూసిన ప్రభుత్వం ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్న సమయంలో హడావుడిగా నియమించాల్సిన అవసరం ఏమిటి? వీరి పేర్లను గవర్నర్ ఆమోదం కోసం పంపే ముందు ఎన్నికల కమిషన్ అనుమతి పొంది ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నాం. ఏ పరిస్థితుల్లో గవర్నర్ ఇలా వ్యవహరించారో తెలియడం లేదు. రాష్ట్ర సమాచార కమిషన్‌లో రాజకీయపరమైన నియామకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. 2017లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆరుగురిని సమాచార కమిషనర్లుగా నియమించినప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసి లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో నియామకాలకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఈ నియామకాలను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి సాధ్యమైనంత త్వరలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం’ -
ఒక సామాజిక వర్గానికే అందలమా?
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ పథకం ప్రకారం సామాజిక వర్గమే ప్రాతిపదికగా 37 మందికి డీఎస్పీలుగా అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చారని, పోస్టింగ్‌లు కట్టబెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఒక లేఖ రాశారు. అక్రమ పదోన్నతులు, పోస్టింగ్‌లపై తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పద్ధతి శృతి మించింది విశ్వసనీయ సమాచారం ప్రకారం గవర్నర్‌కు విజయసాయిరెడ్డి రాసిన లేఖలోని పలు అంశాలివీ.. ‘‘వందలాది కులాలు, అనేక మతాల సమ్మేళనంగా భారతీయ సమాజం వేల సంవత్సరాలుగా వర్థిల్లుతోంది. ఇలాంటి సమాజంలో ప్రతి కులానికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి కులమూ సమాజ అభ్యున్నతికి ఎంతో తోడ్పాటు అందించింది. అధికారంలో ఉన్న వ్యక్తులు అన్ని కులాలు నావే, అందరూ నా వారే అన్న భావనతో పరిపాలన చేయాలని ప్రజలంతా ఆశిస్తారు. ఇలాంటి పరిస్థితి లేనప్పుడు సామాజిక న్యాయం జరగడం లేదని వారు ఆందోళన చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక సామాజిక వర్గం వారికి మాత్రమే మేలు చేసేవిగా ఉన్నాయన్న అంశం గత ఐదేళ్లలో పలు సందర్భాల్లో మా పార్టీ దృష్టికి వచ్చినా.. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం భావ్యం కాదన్న అభిప్రాయంతోనే మా పార్టీ ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చింది. ఇకపై కూడా ఇదే మా విధానం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వందలాది కులాలకు ప్రతినిధిగా సాగించిన పరిపాలనే నేటికీ మాకు ఆదర్శం. అయితే, చంద్రబాబు పద్ధతి మాత్రం శృతి మించిపోయింది. పోలీసు పోస్టింగ్‌ల్లో, డీఎస్పీ పదోన్నతుల్లో ఒక సామాజిక వర్గాన్నే చంద్రబాబు పరిగణనలోకి తీసుకోవడంపై ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు నా మనసులో అనేక భావాలున్నాయి. సమాజంలో సమతౌల్యం నెలకొల్పాలి నిజానికి ఆ సామాజిక వర్గానికి చెందిన చాలామంది దశాబ్దాలుగా వ్యక్తిగతంగా నాకు అత్యంత సన్నిహితులు, ఆప్త మిత్రులు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధిలో, చలనచిత్ర రంగం అభివృద్ధిలో ఆ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉన్నతమైనది. ఆ కులం పట్ల నాకు ఏమాత్రం అగౌరవం లేదు. శత్రుత్వం అంతకన్నా లేదు. అయితే, అధికారుల పోస్టింగ్‌ల్లో, ప్రత్యేకించి పోలీసు పోస్టింగ్‌ల్లో చంద్రబాబు ఒక సామాజిక వర్గం వారిని మాత్రమే ఎంపిక చేసి, వారిని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మనుషులుగా వాడుకోవాలని ప్రయత్నించడమే ఈ మొత్తం వివాదానికి కారణం. చంద్రబాబు చేష్టలు ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలిగిస్తుండడమే కాకుండా సామాజిక అసమతౌల్యానికి దారితీసి ఒక కులంపై వ్యతిరేకతను పెంచేవిగా ఉన్నాయి. కాబట్టి సమాజంలో సమతౌల్యాన్ని నెలకొల్పడానికి వీలుగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ ఉత్తరం రాస్తున్నాను. నా దృష్టికి వచ్చిన అంశాలను ఉన్నతులైన గవర్నర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను. వీటిపై విచారణ జరిపిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను. విజయసాయిరెడ్డి లేఖలోని ముఖ్యాంశాలు - జీవో నెంబరు 54 ప్రకారం 2014లో ఇచ్చిన డీఎస్పీ ప్రమోషన్లు తప్పుల తడకలని అప్పటి డీజీపీ హైకోర్టులో ఒప్పుకున్నా, చంద్రబాబు సర్కారు 2019 ఎన్నికలకు ముందు అందులో కొందరికి ప్రత్యేకంగా పోస్టింగ్‌లు ఇవ్వడం ద్వారా వల్లమాలిన ప్రేమ చూపింది. - చిత్తూరుకు చెందిన డీఎస్పీ కేశప్పను (చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి పదోన్నతులు కల్పించారు. - అనంతపురం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామ్‌కుమార్, చంద్రబాబు అధికార నివాసం దగ్గర విధులు నిర్వహించే అమరనాథ నాయుడులవి పోలీసు ప్రమోషన్లు కావు. అవి కచ్చితంగా అడ్డదారి పొలిటికల్ ప్రమోషన్లే. - రాష్ట్రంలోని ఐదు రేంజ్‌ల్లో ఉన్న డీఎస్పీ కింది ర్యాంకు పోలీసు ప్రమోషన్లలో సీఎం కార్యాలయం(సీఎంవో) జోక్యంతో అడ్డదార్లే రాజ మార్గాలయ్యాయి. - ఎస్సై, సీఐలుగా పదోన్నతుల్లో కూడా సీనియారిటీని క్రమబద్ధంగా పాటించకుండా తన వారికి బాబు మార్కు ప్రమోషన్లు ఇచ్చుకున్నారు. - పదోన్నతుల్లో పాటించాల్సిన రొటేషన్ రూల్సును కూడా ఆ 37 మంది విషయంలో అడ్డగోలుగా ఉల్లంఘించారు. - ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేసేందుకు అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఈ కుల ప్రమోషన్లు, పోస్టింగ్‌ల పథకానికి రూపకల్పన చేశారు. - నిబంధనలు పాటించకుండా ఘట్టమనేని శ్రీనివాస్‌కు హడావిడిగా ప్రమోషన్ ఇచ్చి, గుంటూరు రేంజ్ ఎన్నికల ఇంటెలిజెన్స్ బాధ్యతలు అప్పగించడం ఇందుకు ఒక ఉదాహరణ. - బాబు సామాజిక వర్గానికి చెందిన పోలీసు ఉన్నతాధికారుల అండదండలతో గుంటూరు రేంజ్‌కి చెందిన వారికి ఇచ్చిన ప్రమోషన్లపై చివరకు ఏలూరు రేంజ్ పోలీసులు నేరుగా సచివాలయానికి వచ్చి, ఈ దుర్మార్గాలను ఆపాలని డిమాండ్ చేశారంటే బాబు కులపిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. - సీనియారిటీని తేల్చి, ప్రమోషన్లలో లోపాలను సరిదిద్దడానికి కేబినెట్ సబ్ కమిటీ వేయాలని, న్యాయం చేయాలని ఏలూరు రేంజ్ అధికారులు అడుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం తన వారు, కానివారు అంటూ పోలీసు ప్రమోషన్లు, పోస్టింగ్‌ల్లో తన దుర్మార్గాన్ని కొనసాగించింది. - చంద్రబాబు తన కులం అధారంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఈ పోస్టింగ్‌లు ఇచ్చారన్న అంశంపై వెంటనే విచారణకు ఆదేశించాలని కోరుతున్నా. - విచారణలో తప్పులు రుజువైతే వెంటనే ఈ పదోన్నతులు, పోస్టింగ్‌లను రద్దు చేయాలి. అక్రమంగా పదోన్నతులు, పోస్టింగ్‌లు పొందినవారిని డిమోట్ చేయాలి. ఇంతటి దుర్మార్గానికి పథకం వేసిన వారిని, అమలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు. కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. -
బాబుతో సంబంధం లేకుండానే తుపాను సహాయక చర్యలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సంబంధం లేకుండానే ఫొని తుపాను సహాయక పనులు జరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగంపై ఎల్లో మీడియా బురదజల్లే వార్తలను కుమ్మరిస్తోందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘శ్రీకాకుళం జిల్లా శిబిరాల్లో ఉన్న ప్రజలకు భోజన వసతి సరిగా లేదని గొట్టాలు పెట్టి గోల చేస్తున్నారు.. టీడీపీ కార్యకర్తలతో తిట్టిస్తున్నారు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. హెరిటేజ్ కంపెనీలో ఇలాగే జీతాలు పెంచుతారా? రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా జీతభత్యాలను ముఖ్యమంత్రి ఒక్కసారిగా పెంచడంపై విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారు. ‘జీతభత్యాలను రూ.50 వేల నుంచి రెండు లక్షలకు పెంచడం నీతి మాలిన చర్యకాదా.. చంద్రబాబూ? ఏప్రిల్ 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో బకాయిలు రూ.24 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. మీ హెరిటేజ్ కంపెనీలో అయితే ఇలా 200 శాతం పెంచుతారా?’ అని విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. అధికారులను బెదిరించేందుకే! ‘అధికారులను బెదిరించడానికి, కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘనవిజయం అని గంతులేస్తున్నారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్‌ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించకుండానే పోటీకి దింపారు. ఈవీఎంలపై పోరాటం ఎంతవరకొచ్చిందో?’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.