Vaibhav
-
ఓటీటీకి సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, నందితాశ్వేత జంటగా నటించిన చిత్రం రణం. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో రణం అరమ్ థవరేల్ పేరుతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆద్యంతం ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.15 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఓ సిరియల్ కిల్లర్ చేసిన హత్యలను చేధించే కథాంశంతో ఈ సినిమాను దర్శకుడు షరీఫ్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు రాబోతోంది. ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఓవర్సీస్ ఆడియన్స్ కోసం టెంట్కోట్టాలోనూ స్ట్రీమింగ్కు రానుంది. దాదాపు థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రంలో ఓ స్కెచ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఈ సినిమాలో నందితా శ్వేత నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మరో హీరోయిన్ తాన్యా హోప్ ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపించింది. వీళ్లంతా కలిసి సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నారా? లేదా అన్నదే కథ. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. Vaibhav’s #Ranam will be streaming from Apr 19 on AMAZON PRIME. pic.twitter.com/cHXxx2331L — Christopher Kanagaraj (@Chrissuccess) April 17, 2024 -
హార్దిక్ పాండ్యా సోదరుడి అరెస్ట్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు వైభవ్ పాండ్యా అరెస్టైనట్లు సమాచారం. పాండ్యా సోదరులను మోసం చేసిన కారణంగా ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీ ద్వారా దాదాపు రూ. 4.3 కోట్ల నిధులు మళ్లించిన నేపథ్యంలో వైభవ్ పాండ్యాపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు 37 ఏళ్ల వైభవ్ పాండ్యా సవతి సోదరుడు. వీరితో కలిసి అతడు 2021లో పాలిమర్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఇందుకోసం హార్దిక్, కృనాల్ మూలధనం కింద ఒక్కొక్కరు 40 శాతం.... వైభవ్ తన వంతు వాటాగా 20 శాతం ఇచ్చాడు. అయితే, సోదరులకు తెలియకుండా మరో సంస్థను మొదలుపెట్టిన వైభవ్.. పాత వ్యాపారంలోని నిధులను మళ్లించాడు. హార్దిక్, కృనాల్లకు తెలియకుండా ఫోర్జరీ ద్వారా రూ. 4.3 కోట్లు తన సొంత వ్యాపారానికి వాడుకున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కాగా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా భారీ మొత్తం వెనుకేయగా.. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న కృనాల్ ఈసారి రూ. 8.25 కోట్లు అందుకున్నాడు. ఇక ఈ సీజన్లో హార్దిక్ సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి గెలిచింది. మరోవైపు.. కృనాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో నాలుగింట మూడు విజయాలతో టాప్-3లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌కు చెందిన హార్దిక్ పాండ్యాకు కృనాల్ తోబుట్టువు కాగా.. వైభవ్ పాండ్యా, గౌరవ్ పాండ్యా అనే మరో ఇద్దరు సవతి సోదరులు కూడా ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్ -
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్‌ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్‌పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్‌కు లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్‌ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
G.O.A.T Movie: నా పాత్ర ఏంటో తెలియకుండా నటిస్తున్నా
వైభవ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రణం అరం తవరేల్. తాన్య హోప్, నందిత శ్వేత, సరస్వతీ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా షరీఫ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలాజీ చాయాగ్రహణం, అరోల్ కరోలి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం గురించి నటుడు వైభవ్ మాట్లాడుతూ.. రణం అరం తవరేల్ చిత్రం తనకు చాలా ప్రత్యేకం అన్నారు. ఇది తాను నటించిన 25వ చిత్రం అని చెప్పారు. ఇది ఇంతకుముందు నటించిన వాటికంటే కొత్త నేపథ్యంలో రూపొందిన కథా చిత్రమని పేర్కొన్నారు. కొత్త దర్శకుడైనా చిత్రాన్ని చాలా బాగా తెరపై ఆవిష్కరించారన్నారు. రణం అరం తవరేల్ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందనిన్నారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నటుడు వైభవ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇందులో తన తన పాత్ర ఏమిటో కూడా తెలియకుండా నటిస్తున్నానని చెప్పారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ప్రతి చిత్రంలోనూ తాను ఏదో ఒక పాత్రలో కనిపిస్తానన్నారు. అదే విధంగా ఇంతకుముందు అజిత్ హీరోగా నటించిన చిత్రంలో తాను నటించానని, ఇప్పుడు విజయ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. చదవండి: రాత్రి అయితే చాలు వాళ్ల ఫోన్ కాల్స్‌తో భయమేస్తుంది.. కిరణ్ రాథోడ్ ఆవేదన -
అతుల్య రవి కొత్త సినిమా.. యాడ్ ఫిలిం డైరెక్టర్‌తో..
నటుడు వైభవ్, నటి అతుల్య రవి జంటగా నటిస్తున్న నూతన చిత్రం విజయదశమి సందర్భంగా బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. డా.మనోజ్ బెనో నేతృత్వంలో బీటీజీ యూనివర్శల్ పతాకంపై బాజీ బాలచంద్రన్ నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా విక్రమ్ రాజేశ్వర్, అరుణ్కేశవ్ ద్వయం దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వీరిలో విక్రమ్ రాజేశ్వర్ 80కి పైగా యాడ్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన సీనియర్ దర్శకుడు కె. రాజేశ్వర్ వారసుడు కూడా. కాగా ఈ చిత్ర వివరాలను దర్శకులు తెలుపుతూ ఇంకా ఈ సినిమాకు ఎటువంటి పేరు నిర్ణయించలేదన్నారు. ఈ మూవీ పూర్తి వినోదాత్మకంగా, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందన్నారు. ఇందులో నటుడు ఆనంద్‌రాజ్, నాన్ కడవుల్ రాజేంద్రన్, జాన్ విజయ్, రెడిన్ కింగ్‌స్టీ, సునిల్‌రెడ్డి, ఇళవరసు, పీఎల్.తేనప్పన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. దీనికి డీ.ఇమాన్ సంగీతాన్ని, టిజోటోనీ, సురేశ్ ఏ.ప్రసాద్ ఛాయాగ్రహణను అందిస్తున్నారని చెప్పారు. కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. చదవండి: భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే? -
నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్
నటి వాణిభోజన్ కోలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకుంటోంది. ఊటీకి చెందిన ఈ బ్యూటీ చదువు పూర్తి అయిన తర్వాత చెన్నైలో మకాం పెట్టేసింది. ఎయిర్హోస్టర్గా జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆపై బుల్లితెర అక్కడినుంచి వెండితెరకు పరిచయం అయిన నటి వాణి భోజన్. ఇంత చరిత్ర కలిగిన మూడు పదుల ఈ బ్యూటీ సినిమాల్లో ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఆదిలోనే తమిళం, తెలుగు భాషల్లో నటించేస్తోంది. ప్రస్తుతం తెలుగులో క్రేజీ నటుడు విజయ్‌దేవరకొండకు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళంలో వైభవ్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. ఎస్జీ.ఛార్లెస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో పాటు తెలుగు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో వాణిభోజన్‌ను మరో తమిళ చిత్ర అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. విశేషం ఏమిటంటే ఇది హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం అట. నవ దర్శకుడు నిరోజన్ తెరకెక్కించనున్నారు. ఇందులో 90 ఎంఎల్ చిత్రం ఫేమ్ బొమ్ము లక్ష్మీ మరో పాత్రను పోషించనుందట. దీన్ని నటుడు అరుణ్ పాండియన్ తన ఏఅండ్‌పీ గ్రూప్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా నటి వాణిభోజన్ ఇటీవల ఒక అవకాశాన్ని చేజార్చుకుని వార్తల్లోకి ఎక్కింది. అయితే మరిన్ని కొత్త చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు ఈ బ్యూటీ చెబుతోంది. -
మరో సినీ వారసుడు పరిచయం..
సినిమా: కోలీవుడ్‌కు మరో సినీ వారసుడు పరిచయం అవతున్నారు. నటుడు వైభవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ తెలుగు దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడైన వైభవ్ కోలీవుడ్‌లో యువ హీరోగా తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన అన్నయ్య సునిల్ నటుడిగా పరిచయం అవుతుండడం అదీ విలన్‌గా రంగప్రవేశం చేయడం విశేషం. నటుడు విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం సీతకాది. «బాలాజి ధరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సీతకాది డిసెంబర్ 20న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రముఖ నటీనటులను పరిచయం చేసే కార్యక్రమానికి చిత్ర వర్గాలు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా చిత్ర విలన్ గురించిన వివరాలను దర్శకుడు తెలుపుతూ వినోదంతో పాటు, భావోద్రేకాలతో కూడిన ఈ చిత్ర హీరో విజయ్‌సేతుపతి గురించి ఇప్పటికే పలు విషయాలను తెలియజేశామన్నారు. ఆయన ఇందులో పలుగెటప్ల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నారని చెప్పారు. మరో ముఖ్యపాత్ర విలన్ అని. ఈ పాత్రకు ఇప్పటి వరకూ పరిచయం కాని నటుడి నటన కొత్తగా ఉంటుందన్నారు. నటుడు వైభవ్ అన్నయ్య సునిల్‌ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయన పాత్ర చాలా వినూత్నంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ పాత్రకు నటుడిని ఎంపిక చేయడం సవాల్‌గా మారిందన్నారు. చిత్ర కథకు కథనాన్ని తయారు చేసుకున్నప్పుడే మామూలుగా ఉండరాదని విభిన్నంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇందులో నటించడానికి చాలా మంది ప్రముఖ నటులను సంప్రదించామని, వారికి పాత్ర నచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా నటించలేకపోయారని అన్నారు. అలా ఒక పుట్టినరోజు వేడుకలో సునీల్‌ను చూసి తన చిత్రానికి విలన్ తనేనని నిర్ణయించుకున్నానన్నారు. ఆయన నటించడానికి ముందు సంకోచించినా, చివరికి అంగీకరించినట్లు తెలిపారు. అందుకు సునీల్ చాలా శిక్షణ తీసుకున్నాడని చెప్పారు. ఇందులో హీరో విజయ్‌సేతపతి పాత్రకు తగ్గని విధంగా విలన్ పాత్రకు మంచి పేరు వస్తుందని దర్శకుడు బాలాజి ధరణీధరన్ అన్నారు. -
వైభవ్ కోరి...
‘అర్జున్ రెడ్డి, అత్తారింటికి దారేది, ఆర్ఎక్స్ 100’ తర్వాత మరో తెలుగు సినిమా తమిళంలోకి ఎగుమతి కానుంది. 2017లో రిలీజ్ అయిన ‘నిన్ను కోరి’ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో వైభవ్. దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ అనే సంగతి గుర్తుండే ఉంటుంది. ‘గొడవ’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తమిళంలో బిజీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. శివా నిర్వాణ దర్శకత్వంలో నాని, ఆది పినిశెట్టి, నివేథా ముఖ్య పాత్రల్లో కనిపించిన చిత్రం ‘నిన్ను కోరి’. తెలుగులో నాని పోషించిన క్యారెక్టర్‌ను తమిళంలో వైభవ్ చేస్తున్నారు. ఆది పినిశెట్టి, నివేథా పాత్రలను ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఈ రీమేక్‌ను కాస్మో కిరణ్ నిర్మించనున్నారు. ఇంకా దర్శకుడు ఎంపిక పూర్తి కాలేదు. -
కామెడీ దెయ్యం చిత్రంగా కాటేరి
తమిళసినిమా: మా కాటేరి కామెడీ దెయ్యం కథా చిత్రంగా ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు డీకే. ఈయన ఇంతకు ముందు యామిరుక్కు భయమేన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైభవ్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా వరలక్ష్మిశరత్‌కుమార్, ఆద్మిక, మనాలి రాథోడ్ నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. పొన్నంబళం, కరుణాకరన్, రవిమరియ, జాన్‌విజయ్, కుట్టిగోపి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఎంఎస్.ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు డీకే తెలుపుతూ కాటేరి అంటే అందరూ రక్తం తాగే దెయ్యం అనుకుంటున్నారని, పూర్వ మనుషులు, ముత్తాతలు అని కూడా అర్థం ఉందన్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజాను కలిసి ఈ చిత్ర ఒన్లైన్ కథను చెప్పానన్నారు. ఆయకు నచ్చడంతో పాటు కాటేరి అనే టైటిల్ ఈ కథకు బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇందులో నటిస్తున్న నలుగురు హీరోయిన్లలో కాస్త స్వార్థం కలిగిన అమ్మాయిగా సోనం బాజ్వా, మనోతత్వ వైద్యురాలిగా ఆద్మిక నటిస్తున్నారని, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, మానాలి రాథోడ్‌లు 1960 కాలానికి చెందిన పోర్షన్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్పారు. తన గత చిత్రం యామిర్కు భయమేన్ చిత్రంలో పాపులర్ అయిన పన్ని మూంజి వాయన్ లాంటి పాత్ర ఈ చిత్రంలోనూ చోటు చేసుకుంటుందన్నారు. కాటేరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, పిల్లలను అలరిస్తుందని చెప్పారు. తమ కాటేరి కామెడీ దెయ్యం కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు డీకే పేర్కొన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఓవియ ఎందుకు లేదు?
తమిళసినిమా: కాటేరి చిత్రంలో నటి ఓవియ ఎందుకు నటించడంలేదు. ఆమెను తప్పించారా? తనే వైదొలగిందా? కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. తామిరుక్క భయమే వంటి సక్సెస్ఫుల్ చిత్రం ఫేమ్ డీకే తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాటేరి. వైభవ్ హీరోగా నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ కథా చిత్రంలో మొదట హన్సిక నటించనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఓవియ పేరును వెల్లడించారు. చివరకు నటి వరలక్ష్మీ, సోనంబాజ్వా వచ్చి చేరారు. ఇలాఉండగా నటి ఓవియ కాటేరి నుంచి తొలగించబడిందా? తనే వైదొలగిందా? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తరువాత ఓవియ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌తో కాంచన–3 చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు మరో తమిళ చిత్రం, ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. కాటేరి చిత్ర నిర్మాత కేఇ.జ్ఞానవేల్‌రాజా బిగ్‌బాస్ గేమ్ షో ప్రారంభానికి ముందు నటి ఓవియను ఎంపిక చేశారట. అప్పుడు ఆమె పారితోషికం రూ.10 లక్షల లోపే. అయితే బిగ్‌బాస్ షోతో అనూహ్య క్రేజ్ రావడంతో ఓవియ రూ.50లక్షలు పారితోషికం కావలంటూ డిమాండ్ చేశారట. దీంతో నిర్మాతను పక్కన పెట్టి, కథలో కొన్ని మార్పులు చేసి నటి వరలక్ష్మీ, సోనంబాజ్వాలను ఎంపిక చేసినట్లు వారి వెర్సన్. అయితే పారితోషికం తనకు పెద్ద విషయం కాదని, కాటేరి చిత్రంలో తాను మాత్రమే కథానాయకినని చెప్పి, ఆ తరువాత మరో ఇద్దరిని చేర్చడంతోనే ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ఓవియ చెబుతున్నారు. -
కాట్టేరికి టాటానా?
తమిళసినిమా: కాట్టేరి చిత్రానికి నటి హన్సిక టాటా చెప్పిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ ముంబై బ్యూటీ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అయ్యిపోయింది. ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేస్తున్న గులేభాకావళి చిత్రం ఒకటి. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. అధర్వకు జంటగా ఒక చిత్రం చేస్తోంది. శాన్ ఆంథోని దర్శకుడు. కాగా వైభవ్ కథానాయకుడిగా డీకే. దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న కాట్టేరి చిత్రంలో నటించడానికి హన్సిక అంగీకరించింది. ఇది హర్రర్ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం. కథ కూడా విని నటించడానికి ఓకే చెప్పిన ఈ భామ తాజాగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. హన్సిక కొత్త సంవత్సరంలో మరో భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతుండడంతో కాట్టేరి చిత్రానికి టాటా చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో ముందుగా నటి ఓవియ న టించనుందనే ప్రచారం జరిగింది. ఈ తరువాత ఆమె అవకాశాన్ని హన్సిక కొట్టేసిందన్నారు. తాజాగా ఈ బ్యూటీ కూడా వైదొలిగిందనే ప్రచారం హోరెత్తుతోంది. కాల్షీట్స్ సమస్య కారణంగానే కాట్టేరికి సారీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. హన్సిక ఐదేళ్లుగా న్యూఇయర్‌ను తన స్నేహితులతో కలిసి న్యూ యార్క్‌లో ఎంజాయ్ చేస్తూ వస్తోంది. ఈ సారి ఆ టూర్‌ను కూడా రద్దు చేసుకుందట. చేతి నిండా చిత్రాలుండడంతో హన్సిక ఈ ఏడాది హ్యేపీ న్యూ ఇయర్‌ను ముంబైలోనే తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోనుందట. -
మెర్సల్ ముందు ఎంతనుకుంటే...
సాక్షి, చెన్నై : ఓవైపు విజయ్ లాంటి బిగ్ స్టార్ సినిమా రిలీజ్. ఆ సమయంలో ఓ చిన్న సినిమా కూడా విడుదలకు సిద్ధమయ్యింది. అంతే సినిమా హీరో, దర్శకుడు మొత్తం చిత్ర యూనిట్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పడేశారు. తమ హీరో కలెక్షన్ల సునామీలో కొట్టుకుపోతారంటూ కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన దర్శకుడు రత్న కుమార్ తాను విజయ్‌కి పెద్ద ఫ్యాన్‌నని ప్రకటించుకున్నా.. పట్టించుకోలేదు. అయినా ధైర్యం చేసి సినిమాను విడుదల చేశారు. తొలి మూడు రోజులు థియేటర్ వైపు చూసే వారే కరువయ్యారు. కట్ చేస్తే... మెయ్యాద మాన్ ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. ఈ దీపావళికి విజయ్ మెర్సల్తోపాటు మెయ్యాద మాన్ కూడా విడుదలైంది. సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డి తనయుడు వైభవ్ ఇందులో హీరోగా కనిపించాడు. ఓ స్టేజీషో సింగర్ ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రంలో ఇదయం మురళి(హృదయం మురళి) పాత్రలో వైభవ్ నటించాడు. మంచి ప్రేమకథకు దానికితోడు పాటలు(ముఖ్యంగా తంగచ్చి పాట) ఆకట్టుకోవటంతో నెమ్మదిగా మౌత్ టాక్ ద్వారా సినిమా పుంజుకుంది. ప్రస్తుతం చెన్నైతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా మెయ్యాద మాన్కు థియేటర్లను పెంచేశారు. మెర్సల్ ఉండగానే పోటీపడి మరీ కలెక్షన్లు కుమ్ముకుంటున్న ఈ చిన్న చిత్రం ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను కూడా అందించటం మొదలుపెట్టేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక చిత్ర సక్సెస్ గురించి వైభవ్ స్పందిస్తూ.. విజయ్ సినిమా రిలీజ్ తో టెన్షన్ పడ్డామని.. ఆ సినిమా ముందు తామెంత అనుకున్నామని.. అయినా కంటెంట్ పై నమ్మకంతో ధైర్యం చేసినట్లు వైభవ్ చెప్పాడు. మెర్సల్ సినిమా రిలీజ్, ఇదయదళపతి ఫ్యాన్స్ నుంచి బెదిరింపుల గురించి వైభవ్ ప్రస్తావిస్తూ.. తాను అజిత్ కు పెద్ద ఫ్యాన్ అయినప్పటికీ విజయ్ను కూడా ఆరాధిస్తానని, ఈ విషయాన్ని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతిని వైభవ్ గుర్తు చేశాడు. అన్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ చిత్రం చూసి ప్రశంసలు కురిపించటం విశేషం. -
నిపుణన్ సక్సెస్ మీట్
తమిళసినిమా: దక్షిణాదిలో యాక్షన్ కింగ్‌గా ముద్ర వేసుకుని కథానాయకుడిగా 150 చిత్రాల మైలురాయి చేరుకున్న నటుడు అర్జున్. నటుడిగానే కాకుండా, నిర్మాత, దర్శకుడిగానూ సత్తా చాటుకున్న ఈయన తాజాగా నటించిన నిపుణన్ చిత్రం 150వ చిత్రంగా నమోదు చేసుకుంది. ఇందులో అర్జున్‌తో పాటు ప్రసన్న, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, వైభవ్, కృష్ట వంటి యువ నటీనటులు నటించారు. అరుణ్‌వైద్యనాథన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం గతవారం తెరపైకి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్‌వైద్యనాథన్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర కథను తయారు చేసుకున్నప్పుడే మంచి చిత్రం అవుతుందనే నమ్మకం కలిగిందన్నారు. నటుడు అర్జున్ 150వ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కళాకారులు, సాంకేతిక వర్గం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాత ఉమేష్ మాట్లాడుతూ చిత్రం చూసిన పత్రికల వారి అభిప్రాయం, ప్రేక్షకుల అభిప్రాయం ఒకటే కావడంతోనే ఈ నిపుణన్ ఇంత విజయం సాధించిందని పేర్కొన్నారు. చిత్ర హీరో అర్జున్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు అరుణ్‌వైద్యనాథన్ నిపుణన్ చిత్ర స్క్రిప్ట్‌ను చెప్పిన విధంగానే తెరకెక్కించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కథాకారులకు, అదే విధంగా తన 150 చిత్రాలకు పనిచేసిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఇకపై కూడా నటుడిగా కొనసాగాలనుకుంటున్నానని, నిపుణన్ లాంటి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నానని అర్జున్ పేర్కొన్నారు. అదే విధంగా దర్శకుడిగా ప్రముఖ హీరోలతో పనిచేయాలని కోరుకుంటున్నానని, అలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. కాగా ప్రస్తుతం ఈయన తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా సొల్లివిడవా అనే పేరుతో ఒక యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో తాను ఒక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు అర్జున్ వెల్లడించారు. -
చరణ్ సినిమాలో మరో యువ హీరో
ధృవ సినిమాతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ చిత్రంలో చరణ్ న్యూ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడట. త్వరలోనే షూటింగ్ ప్రారంభ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రామ్ చరణ్, సమంతలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మరో యువ హీరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో గొడవ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైభవ్ తరువాత కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ యంగ్ హీరో రామ్ చరణ్ సినిమాలోనూ కీ రోల్లో నటించనున్నాడు. మెగా కుటుంబంతో సన్నిహిత సంబందాలున్న సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడే వైభవ్. అందుకే రామ్ చరణ్ సినిమాలో క్యారెక్టర్ అనగానే కథ కూడా అడగకుండానే ఓకే చేశాడట ఈ యంగ్ హీరో. -
తమిళం బాగా మాట్లాడే వారికి అవకాశాల్లేవ్
తమిళ భాష చక్కగా మాట్లాడే వారికి ఇక్కడ అవకాశాలు ఇవ్వడం లేదని నటి ఐశ్వర్య రాజేశ్ వాపోయారు. ఈమె కథానాయకిగా నటించిన తాజా చిత్రం హలో నాన్ పేయ్ పేచురేన్. నటుడు వైభవ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అవ్నీ మూవీస్ పతాకంపై దర్శకుడు సుందర్.సి నిర్మించారు. నవ దర్శకుడు భాస్కర్ పరిచయం అవుతున్న ఆ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎప్రిల్ ఒకటో తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ ఆదివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలో గల ఫోర్ఫ్రేమ్స్ ప్రివ్యూ థియేటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందు లో పాల్గొన్న నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తమిళ భాష తెలి సిన నటీమణులకు తమిళ చిత్రాల్లో అవకాశాలు కల్పించడంలేదన్నారు. అలాంటిది తమిళ భాషను బాగా ఉచ్చరించగలగడం వల్లే తనకి ఈ చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చినట్లు దర్శకుడు చెప్పారని, ఇది తాను గర్వంగా భావిస్తున్నట్లు పేర్కోన్నారు. ఇక హలో నాన్ పేయ్ పేచురేన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇది మంచి కాలక్షేప కథాచిత్రం అని తెలిపారు. ఇందులో తాను నటుడు వీటీవీ.గణేష్‌కు చెల్లెలిగా నటించానని చెప్పారు. తానింత వరకూ డాన్స్ సరిగా చేసిన సందర్భాలు లేవని అలాంటిది ఈ చిత్రంలో శవంపై ఎక్కి డాన్స్ చేశానని అన్నారు. ఈ శవ డాన్స్‌కు మంచిపేరు వస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో తనకు జంటగా నటుడు వైభవ్ నటించారని, తమ జంట స్పెషల్‌గా ఉంటుందన్నారు. ఇందులో తాము ఆడే శవ డాన్స్ చాలా లోకల్‌గా ఉంటుందని ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. నటుడు వైభవ్ మాట్లాడుతూ తానీ చిత్రంలో పిక్‌పాకెటర్‌గా నటించానని చెప్పారు. దర్శకుడు కొత్త వారైనా తాను అనుకున్నది తెరపై ఆవిష్కరించారని, అదే విధంగా తనకు కావలసింది వచ్చే వరకూ వదిలేవారు కారని అన్నారు. ఒక సన్నివేశంలో ఒక సంభాషణను తాను సరిగా ఉచ్చరించలేకపోవడంతో దాన్ని 30 సార్లు చిత్రీకరించారని తెలిపారు. అదే రోజు సెట్‌కు వచ్చిన సుందర్.సి అది చూసి అయ్య బాబోయ్ అంటూ పారిపోయారని తెలిపారు.చిత్రంలో శవ డాన్స్‌ను చాలా కష్టపడి చేశాననీ వైభవ్ చెప్పారు. ఈ చిత్రంలో నటి ఓవియ, కరుణాకరన్, వీటీవీ.గణేష్, సింగమ్పులి, సింగపూర్ దీపన్ ముఖ్య పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ విపిన్ సంగీతాన్ని అందించారు. -
పందుల దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలో పందుల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం ఉదయం పట్టణంలోని సెగిడి వీధిలో సోదరులైన మొకర హర్షవర్దన్ (8), మొకర వైభవ్ (7) ఇంటి సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లగా... పందులు దాడి చేశాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు అవగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
'పాండవుల్లో ఒకడు' ఆడియో
-
'పాండవుల్లో ఒకడు' స్టిల్స్
-
ఒట్టు తీసి గట్టు మీద పెట్టి..!
పెళ్లి చేసుకుంటే తమ మధ్య ఉన్న స్నేహం చెడిపోతుందన్న ఉద్దేశంతో అయిదుగురు స్నేహితులు పెళ్లి జోలికి వెళ్లకూడదని ఒట్టు వేసుకుంటారు. వాళ్లల్లో ఓ యువకుడు ఒట్టు తీసి గట్టు మీద పెడతాడు. ఆ తర్వాత ఏమవుతుందన్న కథాంశంతో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కప్పల్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో వైభవ్, సోనమ్బజ్వా జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో దర్శకుడు మారుతి తెలుగులో విడుదల చేయనున్నారు. నటరాజన్ శంకరన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హీరో నాని ఆవిష్కరించి, సీడిని సీని యర్ దర్శకుడు కోదండరామిరెడ్డికి అంద జేశారు. ‘అల్లరి’ నరేశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజేశ్ పులి, సహనిర్మాతలు కృష్ణ సతీశ్, నల్లిపూడి రాంజీ తదితరులు పాల్గొన్నారు. -
కుష్బు చిత్రంలో వైభవ్
గెలుపు ప్రభావం ఏమిటన్నది యువ నటుడు వైభవ్‌కు బాగా అనుభవమైంది. విజయం అవకాశాల్ని ఆనందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రస్తుతం ఇవన్నీ కలిపిన జోష్‌లో ఉన్నారు నటుడు వైభవ్. మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూసిన ఈయనకు కప్పల్ చిత్రం దాన్ని అనూహ్యంగానే అందించింది. ఇంకా చెప్పేదేముంది పెద్ద పెద్ద సంస్థలో నటించే అవకాశాలు వైభవ్‌ను వరిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ నుంచి ఈ యువ నటుడికి పిలుపొచ్చింది. ఆయన నిర్మించనున్న చిత్రంలో వైభవ్ హీరో. ఈ చిత్రానికి ఎస్ ఎస్ స్టాన్లీ దర్శకుడు. అంతేకాదు అరణ్మణై వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విజయన్ ఐ మీడియా సంస్థ ఈయనతో చిత్రం చేయడానికి ముందుకొచ్చింది. మరో లక్కీఛాన్స్ ఏమిటంటే కుష్బు తన అల్కి సినీ మాక్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలోను వైభవే నాయకుడు. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని వైభవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ తాను దర్శకుల నటుడిని అన్నారు. నటుడిగా పేరు తెచ్చుకోవాలని చాలాకాలంగా శ్రమిస్తున్నానన్నారు. ఇప్పటి ఎదుగుదల చాలా సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. -
జీవితానికి దగ్గరగా...
వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని నిర్మిస్తున్న చిత్రం ‘ధనాధన్’. ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర సహాయ దర్శకునిగా చేసిన శ్రీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్. ఇందులో సాఫ్ట్వేర్ కుర్రాడిగా వైభవ్ నటించారు. నిజజీవితానికి దగ్గరగా ఉన్న కథతో ఈ చిత్రం సాగుతుంది. వైభవ్ నటన, రమ్యా నంబీసన్ అందచందాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కోట శ్రీనివాసరావు పాత్ర హైలైట్. ఇందులో ఉన్న ఐదు పాటలకు తమన్ అద్భుతమైన స్వరాలందించారు. అతి త్వరలో పాటలు విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శివపార్వతి, కెమెరా: ఎ.ఎమ్. ఎడ్విన్ సాకె. -
ధనాధన్ మూవీ స్టిల్స్
-
గుడ్డిగా సంతకం చేశా
యువ తెలుగు నటుడు వైభవ్ తమిళం, తెలుగు భాషల్లో హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, వైభవ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు. బ్రహ్మన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీకి తమిళంలో ఇది రెండో చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్ర తెలుగు వెర్షన్‌కు ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి శిష్యుడు జగదీష్ తమిళం వెర్షన్‌కు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ శిష్యుడు రాజు గణపతి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం ఒక స్నేహితుడి ద్వారా వచ్చిందని లావణ్య తెలిపారు. అయితే కథ విన్న వెంటనే నటించడానికి ఒప్పంద పత్రంపై గుడ్డిగా సంతకం చేసేశానని చెప్పారు. హీరో ఎవరు? ఇత్యాది వివరాల గురించి ఒక్కమాట కూడా అడగలేదన్నారు. కథ తనను అంతగా ఇంప్రెస్ చేసిందని పేర్కొన్నారు. తనది చిత్రంలో చాలా ఛాలెంజింగ్ పాత్ర అని చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ పాత్రలో నటించడానికి నెర్వెస్తోపాటు చాలా ఎగ్జైట్గాను ఉందని లావణ్య అంటున్నారు. ఈ చిత్రం తనను బిజీ హీరోయిన్ను చేస్తుందనే విశ్వాసాన్ని ఈ బ్యూటీ వ్యక్తం చేస్తున్నారు. -
అందాల రాక్షసితో వైభవ్
వైభవ్ హీరోగా ఓ చిత్రం మొదలైంది. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయిక. దర్శకుడు రాజమౌళి దగ్గర ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన జగదీశ్ తలశిల దర్శకునిగా పరిచయమవుతున్నారు. మయూఖ క్రియే షన్స్ పతాకంపై సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు దృశ్యానికి కీరవాణి కెమెరా స్విచాన్ చేయగా, రాజమౌళి క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 20 నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: జలదంకి సుధాకర్, కెమెరా: ఈశ్వర్ యొల్లు మహంతి, సంగీతం: కీరవాణి. -
సినిమా రివ్యూ: అనామిక
నటీనటులు: నయనతార, హర్షవర్ధన్ రాణే, వైభవ్, పశుపతి, నరేశ్ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ కెమెరా: విజయ్ సి. కుమార్ పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: కీరవాణి దర్శకత్వం: శేఖర్ కమ్ముల ప్లస్ పాయింట్స్: నయనతార క్లైమాక్స్ కెమెరా మైనస్ పాయింట్స్: తొలిభాగం ఫీల్ లేకపోవడం థ్రిల్లర్ సినిమాకు తగ్గ స్క్రీన్ ప్లే లేకపోవడం యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల తన టేస్ట్ కు దూరంగా బాలీవుడ్ లో విజయవంతమైన 'కహానీ' చిత్రాన్ని రీమేక్ గా 'అనామిక' చిత్రాన్ని రూపొందించారు. కహానీ చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్న విద్యాబాలన్ పాత్రను తెలుగు, తమిళంలో నయనతార పోషించింది. కహానీ చిత్రానికి కొన్ని మార్పులు వేసి రూపొందించిన అనామిక చిత్రం మే 1 తేది గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించిన 'కహానీ' చిత్రం మాదిరిగానే అనామిక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథ గురించి తెలుసుకుందాం! కథ: అమెరికాలో అనామిక (నయనతార) ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫేషనల్. తప్పిపోయిన తన భర్త అజయ్ శాస్త్రి (హర్షవర్ధన్ రాణే) ఆచూకీ తెలుసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్న అనామిక పాతబస్తీలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. అయితే అజయ్ శాస్త్రి కిడ్నాప్ గురయ్యాడనే విషయాన్ని అనామిక తెలుసుకుంటుంది. తన భర్తను ఆచూకీ తెలుసుకోవడానికి అనామిక కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు అజయ్ శాస్త్రిని కలుసుకుందా? అజయ్ శాస్త్రిని కలుసుకున్నఅనామిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే ప్రశ్నలకు జవాబే ఈ చిత్రం. నటీనటుల పెర్పార్మెన్స్: అనామికగా నయనతార పాత్రే ఈ చిత్రంలో కీలకం. కెరీర్ లో నయనతార మరో విభిన్నమైన పాత్రను పోషించారు. తనకు అందివచ్చిన అనామిక పాత్రను పోషించడంలో నయన సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. తన భర్త కోసం వెతుక్కుంటూ వచ్చి, ఇబ్బందులకు గురయ్యే మహిళపై సానుభూతి సహజంగానే ఉంటుంది. అయితే ఆ సానుభూతిని ప్రేక్షకుల్లో నయనతార కలిగించలేకపోయింది. ఓవరాల్ గా నయనతార మంచి ఫెర్ఫార్మెన్స్ నే అందించింది. కథలో బాగంగా వచ్చే ఇన్స్ పెక్టర్ సారధి (వైభవ్ రెడ్డి), హోంమంత్రి (నరేశ్), దర్యాప్తు అధికారి (పశుపతి) లాంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. వారి పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. హర్షవర్ధన్ పాత్ర గురించి చెప్పుకోవాల్సినంతగా లేదు. సాంకేతిక నిపుణుల పనితీరు: థ్రిలర్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోరు కు అత్యంత ప్రాదాన్యత ఉంటుంది. నటీనటుల ఎమోషన్స్, పరిస్థితులను తగినట్టుగా కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు 'అనామిక'కు అదనపు ఆకర్షణగా నిలిచింది. పాటలు ఈ చిత్రంలో ఎక్కువ స్కోప్ లేకపోవడంతో ఒకటి, రెండింటితో సరిపెట్టారు. ఎడిటింగ్ పై దర్శకులు మరింత దృష్టి పెట్టాల్సిందనిపించింది. విజయ్ కుమార్ పనితీరు బాగుంది. ఇక 'కహానీ' రీమేక్ అనగానే అనేక రకాలైన పోలికలు ఉండటం సహాజం. కహానీలో విద్యాబాలన్ గర్బవతి. గర్భవతిగా ఉన్న ఓ యువతి భర్త కోసం వెతుక్కుంటూ వచ్చిందనే కథలోనే సానుభూతి క్రియేట్ అవుతుంది. అయితే ఓ యువతి కష్టాల్లో ఉందనే అంశమే ఆ పాత్రపై సానుభూతి కలిగిస్తుందనే భావనతో నయనతారను ప్రెగ్నెంట్ గా చూపించకూడదని శేఖర్ కమ్ముల నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్యాబాలన్ పాత్రపై కలిగే సానుభూతిని తెరమీద అనామిక పాత్రకు కల్పించడంలో దర్శకులు కొంత సఫలం కాలేదనే చెప్పవచ్చు. తొలిభాగం కథను చాలా నెమ్మదిగా నడిపించిన శేఖర్ కమ్ముల.. క్లైమాక్స్ లో విజృంభించాడనే చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాలో ఉండే పక్కా స్క్రీన్ ప్లే, ఇంట్రస్ట్ కలిగించే సన్నివేశాలు.. ఏం జరుగబోతుందనే టెన్సన్ ను కలిగించడంలో దర్శకుడు కొంత తడబాటుకు గురయ్యాడు. కొన్ని పాత్రల విషయంలో అనేక సందేహాలను రేకేత్తించారు. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకునే బాధ్యతను దర్శకుడు ప్రేక్షకుడికే వదిలివేయడం ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా, కహానీ రేంజ్ లో సానుభూతి సంపాదించుకోలేకపోయినా... అనామిక ఓ మోస్తారుగా ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు. ట్యాగ్: అనామిక 'స్పీచ్ లెస్'