venkatesh
-
ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు
-
ఆ హీరో మూవీతో రమణ గోగుల రీఎంట్రీ
-
గోదారి గట్టు మీద...
హీరో వెంకటేశ్, సంగీత దర్శకుడు రమణ గోగుల కాంబినేషన్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ కుదిరింది. వెంకటేశ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘లక్ష్మి’కి సంగీతం అందించిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్‌ని అందించారు. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘గోదారి గట్టుమీద...’ అంటూ సాగే తొలి పాట త్వరలో రిలీజ్ కానుంది. ‘‘ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్‌తో కాకుండా పెక్యులియర్ వాయిస్‌తో ఈ పాట పాడించాలని అనిల్ రావిపూడి చెప్పారు. దీంతో రమణ గోగులతో పాడించాం. ఆయన ప్రత్యేకమైన వాయిస్‌తో పాడిన ఈ సాంగ్ మూవీకి ఎక్స్ట్రా మ్యాజిక్ యాడ్ చేయడం ఖాయం. త్వరలో ఈ పాటను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, వీకే నరేశ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సమీర్ రెడ్డి. -
నార్నే నితిన్, శివానిల నిశ్చితార్థం (ఫొటోలు)
-
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
కన్ఫ్యూజన్ తీరింది.. వెంకటేష్ కూడా సంక్రాంతికే
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. కొన్నిరోజుల క్రితం డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతోపాటు రిలీజ్ ఎప్పుడనేది కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)రాబోయే సంక్రాంతికి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ఉంది. దీన్ని నిర్మించిన దిల్ రాజు.. వెంకీ 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా ప్రొడ్యూస్ చేశారు. చరణ్ మూవీ వస్తున్నందున వెంకీ మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందని గత కొన్నిరోజులుగా రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిదేం లేదని ఇప్పుడు టైటిల్ పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది.ఇల్లాలు, ప్రియురాలు తరహా కాన్సెప్ట్‌తో వెంకీ కొత్త సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేశ్ మాజీ పోలీస్‌గా కనిపిస్తారు. అతడి భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ప్రియురాలిగా మీనాక్షి చౌదరి నటించారు. భీమ్స్ సంగీతమందించారు. సంక్రాంతి రిలీజ్ అని చెప్పారు గానీ తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. మరి ఇప్పుడు చెప్పినట్లు పండక్కి వస్తారా? చివరి నిమిషంలో ఏమైనా వాయిదా అని చెప్పి షాకిస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?) -
KSR Live Show: విజయమ్మ లేఖ చెల్లుతుందా?.. అడ్వకేట్ చెప్పిన కీలక విషయాలు
-
డబ్బింగ్ స్టార్ట్
హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపిస్తారు.ఈ పోలీసాఫీసర్ భార్యగా ఐశ్వర్యా రాజేష్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. కాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యాయి. ‘‘ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో తొంభై శాతం సినిమా పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే డబ్బింగ్ ఆరంభించాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: అల్లు అర్జున్, వెంకటేశ్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నాని. చిరంజీవి, సుధీర్ బాబు ఆమె కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందించారు. సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విటర్ వేదికగా నోట్ రిలీజ్ చేశారు.అల్లు అర్జున్ తన నోట్లో ప్రస్తావిస్తూ..' సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె ప్రవర్తన చాలా అగౌరవంగా ఉంది. ఇలా మాట్లాడడం మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రాజకీయాల కోసం ఇంతలా దిగజారకూడదు: కొండా సురేఖ కామెంట్స్‌పై మెగాస్టార్)చాలా బాధ కలిగించింది: వెంకటేశ్మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేశ్ స్పందించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల కోసం వాడుకోవడం చాలా బాధ కలిగించిందని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను టార్గెట్ చేయడం దురదృష్టకరమన్నారు. మా సినిమా కుటుంబం పరస్పర గౌరవం, కృషితో వ్యక్తిగత జీవితాల పట్ల అపారమైన అంకితభావంతో నిర్మించబడిందని ట్వీట్ చేశారు. బహిరంగ ప్రసంగంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. వ్యక్తుల జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం వల్ల ఎవరికీ ఉపయోగముండదని.. అది వారికి బాధను మాత్రమే పెంచుతుందన్నారు. ప్రజలకు నాయకత్వం వహించే స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటించాలని నేను కోరుతున్నానని' వెంకటేశ్ పోస్ట్ చేశారు. It deeply saddens me to see a personal situation being used as political ammunition. It is unfortunate that someone in a position of responsibility has chosen to weaponize a private matter for political gain.Our cinema family is built on mutual respect, hard work, and immense…— Venkatesh Daggubati (@VenkyMama) October 3, 2024#FilmIndustryWillNotTolerate pic.twitter.com/sxTOyBZStB— Allu Arjun (@alluarjun) October 3, 2024 -
#IIFAUtsavam2024 : అబుదాబిలో ఘనంగా ఐఫా.. మెరిసిన తారలు (ఫొటోలు)
-
అతిథి ఆన్ సెట్
వెంకటేశ్ సినిమా సెట్స్‌లో సందడి చేశారు బాలకృష్ణ. హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ట్రైయాంగిల్ క్రైమ్ డ్రామా చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే పొల్లాచ్చిలో ఈ సినిమాకు చెందిన ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది.ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. ఈ అతిథి తమ సెట్‌కి రావడంతో యూనిట్ సంబరపడిపోయింది. ఈ సందర్భంగా క్లిక్‌మనిపించిన ఫొటోలను షేర్ చేసింది చిత్రబృందం. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
అమ్మాయిల వీడియోలు లీక్.. బయటకు రాకుండా బెదిరింపు
-
డబుల్ చాన్స్?
హీరోయిన్ త్రిష ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’, తమిళంలో కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’, అజిత్ ‘విడా ముయర్చి’, మలయాళంలో మోహన్‌లాల్ ‘రామ్’... ఇలా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇంకా త్రిషకు మరో రెండు పెద్ద అవకాశాలు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (2007), ‘నమోః వెంకటేశాయ’ (2010), ‘బాడీగార్డ్’ (2012) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్‌తో కలిసి త్రిష మరోసారి నటించనున్నారట. నందు దర్శకత్వంలో వెంకటేశ్ ఓ సినిమా చేయనున్నారని, ఇందులోనే త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ‘వర్షం’ (2004), ‘΄ûర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) సినిమాల్లో ప్రభాస్, త్రిష జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారట. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనే త్రిష హీరోయిన్గా నటిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇక పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవితో కలిసి త్రిష ‘విశ్వంభర’ చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘స్టాలిన్’ (2006) చేశారు. మరి.. పన్నెండేళ్ల తర్వాత వెంకటేశ్‌తో, పదహారేళ్ల తర్వాత ప్రభాస్‌తో నటించే డబుల్ చాన్స్ త్రిషకు దక్కుతుందా? వేచి చూడాలి. -
వెంకటేశ్‌తో మొదటి సినిమా.. ఖుష్బు ఎమోషనల్ పోస్ట్!
కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించింది. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో పాటు దక్షిణాదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. ఇవాళ ఆమె నటించిన మొదటి చిత్రం కలియుగ పాండవులు రిలీజై 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఖుష్బు ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఖుష్బు ట్వీట్లో రాస్తూ..'నా సౌత్ ఇండియా మొదటి సినిమా 14 ఆగస్టు 1986న విడుదలైంది. వెంకటేశ్ పక్కన నటించడం నా అదృష్టం.. ఇప్పటికీ ఆయన నా ఫ్రెండ్‌గా ఉన్నారు. ఈ చిత్ర యూనిట్ అంతా ఒక కుటుంబంలా నన్ను ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. డి రామానాయుడు నిర్మించారు. ఖుష్బు చివరిసారిగా అరణ్మనై-4 చిత్రంలో కనిపించింది. It's been 38 years since my very first south Indian film released. #KaliyugaPandavalu released on 14th August 1986. I am eternally grateful to my dearest @VenkyMama for being the most precious co star & friend till date. @SureshProdns for treating me like a family.… pic.twitter.com/FOwH0wdrpw— KhushbuSundar (@khushsundar) August 14, 2024 -
ఈ స్కామ్ ను జోగి రాజీవ్ పై రుద్దాలని టీడీపీ కుట్ర
-
బాబాయ్- అబ్బాయి క్రేజీ సిరీస్.. సీక్వెల్ వచ్చేస్తోంది!
టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్‌సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గతేడాది రిలీజైన ఈ సిరీస్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ షేర్ చేసింది.రానా నాయుడు.. సీజన్ 2 షూటింగ్ ప్రారంభించినట్లు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి షూటింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే రానా, వెంకటేశ్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే సీజన్ 2 ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు ఆదరణ దక్కడంతోనే సీజన్-2ను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది.కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.Rana Naidu Season 2 is now f̶i̶x̶i̶n̶g̶ filming 🔥#RanaNaiduOnNetflix pic.twitter.com/5Xh5zq8nGU— Netflix India (@NetflixIndia) July 23, 2024 -
ఈ ముగ్గురి మరణం.. మిస్టరీ
సనత్‌నగర్(హైదరాబాద్): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్రూంలో నిర్జీవంగా పడి ఉండటం కలకలం రేపింది. మానసిక స్థితి సరిగా లేని కుమారుడికి స్నానం చేయించేందుకు బాత్రూమ్లోకి వెళ్ళిన భార్యభర్తలు.. కొడుకుతో సహా విగతజీవులుగా మారడం సంచలనం రేకె త్తించింది. అయితే వీరు విద్యుదాఘాతానికి గురయ్యారా? లేక కొడుకు మానసిక పరిస్థితి తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ? అనేది మిస్టరీగా మారింది. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జెక్కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా.. జెక్ కాలనీ నాల్గో వీధిలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఫ్లా్లట్ నంబర్ 204లో ఆర్.వెంకటేష్ (59), భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ (25) నివాసం ఉంటున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని సిగ్నోడ్ ట్రాన్సిస్ట్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. 2004 నుంచి జెక్కాలనీలోనే నివాసముంటున్నారు. కుమారుడు హరికృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో దగ్గరుండి తల్లిదండ్రులే అతని బాగోగులు చూసుకుంటున్నారు. ప్రతిరోజూ వారే కుమారుడికి స్నానం చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ముగ్గురూ బాత్రూంలో మృత్యువాత పడగా, వారి మృతికి కారణం ఏమై ఉంటుందా? అన్నది మిస్టరీగానే ఉంది. బాత్రూమ్లో గ్యాస్ ఆధారిత గీజర్ ఉండటంతో షార్ట్ సర్క్యూట్‌కు ఆస్కారం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడాన్ని బట్టి చూస్తే ముగ్గురూ ఒకేసారి బాత్రూమ్లోకి వెళ్లారని తెలుస్తోంది.ఇలా వెలుగులోకి వచ్చింది..ఇంట్లో పనిచేసే వరలక్ష్మి ఉదయం 11.30 గంటలకు వచ్చి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ముగ్గురూ బయటకు వెళ్ళి ఉంటారేమోనని భావించి యధావిధిగా క్లీన్ చేసి వెళ్ళిపోయింది. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి లేకపోవడంతో అటువైపు ఆమె వెళ్లలేదు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వరలక్ష్మి మళ్ళీ రాగా..పాల ప్యాకెట్, ఉదయం తాను చూసిన ఇతరత్రా వస్తువులు అలాగే ఉండడాన్ని చూసి ఇంకా వారు రాలేదేమోనని వెళ్లిపోయింది. సాయంత్రం 6 గంటలకు తోటి పనిమనిషి విజయలక్ష్మితో కలిసి మళ్లీ వచ్చింది. అయితే అనుమానం వచ్చిన వారికి వాచ్‌మన్ సత్యనారాయణను పిలిచి బాత్రూమ్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా డోర్‌కు అడ్డంగా హరికృష్ణ బట్టలు లేకుండా పడిఉన్నాడు. ఆ పక్కనే వెంకటేష్, మాధవి మృతదేహాలు పడి ఉన్నాయి. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీమ్‌తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జోరు పెంచిన వెంకటేశ్.. మరో మల్టీస్టారర్‌కి రెడీ!
హీరో వెంకటేశ్ మంచి జోరు మీద ఉన్నారు. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ సినిమాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేశ్ చేస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణ ప్రారంభమైంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అలాగే హిట్ ఫిల్మ్ ‘సామజవరగమన’ ఫేమ్ రైటర్ నందు రెడీ చేసిన ఓ కథలో వెంకటేశ్ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు ఇలా ఉండగానే... వెంకటేశ్ మరో కథ విన్నారట. ఇటీవల ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ కథను రెడీ చేశారట వేణు ఉడుగుల. ముగ్గురు హీరోలకు స్కోప్ ఉండే ఈ సినిమాలో మెయిన్ హీరోగా వెంకటేశ్ నటించనున్నారట. ఆల్రెడీ వెంకటేశ్ కథ విన్నారని, వేణు ఉడుగులతో ‘విరాటపర్వం’ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ సంగతలా ఉంచితే... రానా–సాయి పల్లవి కాంబినేషన్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ‘విరాటపర్వం’ మంచి సినిమా అనిపించుకుంది. ఈ చిత్రానికి తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా (క్రిటిక్స్) సాయి పల్లవి అవార్డు అందుకోనుండగా ఇదే సినిమాకి ఉత్తమ సహాయ నటి అవార్డుకి నందితా దాస్ ఎంపికయ్యారు. -
హీరో వెంకటేష్ భార్యగా ‘ఐశ్వర్య రాజేష్’ (ఫొటోలు)
-
వెంకీ సరసన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?
ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్. శైలేశ్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ వెంకీ సరసన మరో హీరోయిన్ కనిపించనుంది. తాజాగా కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్ కథాచిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Welcoming on board, the talented @aishu_dil as the EXcellent Wife in #VenkyAnil3 ❤️Victory @VenkyMama #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna @SVC_official #SVC58 pic.twitter.com/YQy5RlmMDp— Anil Ravipudi (@AnilRavipudi) July 2, 2024 -
వెంకటేశ్- అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమా
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు దర్శకుడు అనిల్‌రావిపూడి ప్రకటించారు.అయితే, తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆయన పూజలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమని దర్శకుడు అన్నారు. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారని ముందే అనిల్ రివీల్ చేశాడు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్టైనర్ మూవీ అని ఆయన అన్నాడు. ఈ నెల 3 నుంచి ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. -
కథ విన్నారా?
హీరో వెంకటేష్ నుంచి మరో కొత్త సినిమా కబురు వినే సమయం ఆసన్నమైందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్‌సిరీస్ నెక్ట్స్ సీజన్స్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు వెంకటేష్. ఈ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమా సెట్స్‌లో ఆయన జాయిన్ అవుతారని తెలుస్తోంది.కాగా ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీకి రైటింగ్ టీమ్‌లో పనిచేసిన నందు అనే వ్యక్తి ఓ కథను వెంకటేష్‌కి వినిపించడంతో, ఆయన సానుకూలంగా స్పందించారట. దీంతో ఈ కథకు తుది మెరుగులు దిద్ది మళ్లీ వెంకటేష్‌కి వినిపించనున్నారట నందు. అన్నీ కుదరితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. -
ముహూర్తం కుదిరింది
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను అధికారికంగా వెల్లడించి, వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి. మరోవైపు ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారట వెంకటేశ్. దీంతో వెంకటేశ్–అనిల్‌ల కాంబినేషన్లోని సినిమా ప్రారంభోత్సవానికి జూలై మొదటివారంలో ముహూర్తం కుదిరిందని తెలిసింది. అదే నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. అలాగే ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్గా నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
గుడి కూల్చేసిన టీడీపీ నేత
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కుందేటివారి వీ«ధి ఎస్టీ కాలనీలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ గుడిని శనివారం రాత్రి తెలుగుదేశం నేత వెంకటేష్ శెట్టి కూల్చేశారు. ఆలయం రెండడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తాన్ని జేసీబీతో కూల్చేయడమేగాక అడ్డుకున్న కాలనీవాసుల్ని బెదిరించారు. కాలనీలో నివసిస్తున్న యానాదులు పాత గంగమ్మ గుడిని తొలగించి నాలుగు నెలల కిందట ఆరడుగుల స్థలంలో కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు.ఈ కాలనీకి ఆనుకుని వ్యాపారి అయిన టీడీపీ నేత వెంకటేష్ శెట్టికి స్థలం ఉంది. ఆ స్థలంలో గుడి కడితే తన స్థలాన్ని ఎవరూ కొనరని, అందువల్ల గుడి కట్టవద్దని అతడు ఆ కాలనీవాసులతో గొడవ పడేవారు. శనివారం మండల సర్వేయర్ హరి సర్వే చేసి, కడుతున్న ఆలయం వ్యాపారి స్థలంలో రెండడుగుల మేర ఉందని మార్క్ వేశారు. ఆ రెండడుగుల స్థలానికి డబ్బు ఇస్తామని, లేదంటే సమయం ఇస్తే ఆ మేర ఆలయం తొలగిస్తామని కాలనీవాసులు వెంకటేష్ శెట్టికి, మండల సర్వేయర్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వెంకటేష్‌శెట్టి జేసీబీతో నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని కూల్చేశారు.అడ్డుకున్న కాలనీవాసులతో మీ నివాసాలు కూడా కూల్చేస్తానంటూ బెదిరించారు. దాతల సాయంతో గుడి నిర్మించుకుంటున్నామని, ఇప్పటికే రూ.2.5 లక్షలు ఖర్చయిందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని కూల్చేసిన వెంకటేష్ శెట్టి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సర్వేయర్ హరిని అడగగా.. వెంకటేష్ స్థలంలో రెండడుగుల మేర ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ విషయమై చర్చించుకుని సామరస్యంగా సర్దుకునే వెసులుబాటు ఉన్నా గుడి మొత్తాన్ని కూల్చేయడం సమంజసం కాదని చెప్పారు. ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు కుందేటివారి వీధి ఎస్టీకాలనీ వాసులు రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు. ఇక్కడ అందరూ రోజువారీ కూలీలే. పైసాపైసా కూడబెట్టి గ్రామదేవత గంగమ్మ ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. ఆపై దాతల సాయంతో కొంత మొత్తాన్ని సేకరించారు. తర్వాత వారే కూలీలుగా ఆలయాన్ని నిరి్మస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యాపారి వెంకటేష్ శెట్టి తన స్థలానికి బేరం కుదరడంలేదన్న సాకుతో ఆలయం మొత్తాన్ని కూల్చేసేందుకు స్కెచ్ వేశారు.సర్వేలో ఆలయం తన స్థలంలోకి రెండడుగుల మేర వచ్చిందన్న సాకుతో మరింత రెచ్చిపోయారు. ఆలయం మొత్తాన్ని రాత్రికిరాత్రే జేసీబీతో కూల్చేశారు. శిథిలాలను ట్రాక్టర్ల ద్వారా రాత్రికిరాత్రే తరలించారు. అడొచ్చినవారిపై చిందులేస్తూ.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో గిరిజనులు చేసేదిలేక ఆలయాన్ని కూల్చేస్తున్నా ఆవేదనగా చూస్తూ ఉండిపోయారు. వెంకటేష్ శెట్టికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండడం వల్లే ఎస్టీలమైన తమపై ప్రతాపం చూపుతున్నాడని వారు మండిపడుతున్నారు. -
కేన్సర్‌ను జయించే టీ పార్టీలు
ముంబైలో విజి వెంకటేశ్ నిర్వహించే టీ పార్టీలకు నలుగురూ ఉత్సాహంగా వస్తారు. కారణం– కొన్ని కబుర్లు నడుస్తాయి. దాంతోపాటు కేన్సర్‌ను నివారించే జీవన విధానం తెలుస్తుంది. కేన్సర్ బాధితులకు అండగా నిలిచే వీలూ దొరుకుతుంది. 71 ఏళ్ల విజి వెంకటేశ్ గత రెండు దశాబ్దాలుగా కేన్సర్‌పై చైతన్యం కలిగిస్తోంది. విజి వేంకటేశ్ కృషి....‘కేన్సర్ అంటే ఇంకా జనంలో భయం పోలేదు. మాట్లాడటానికి జంకుతారు. టీ అందరికీ ఇష్టం. తాగుతూ కబుర్లు చెప్పుకున్నంత సాధారణంగా కేన్సర్ గురించి మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, బాధితులకు చేయదగ్గ సాయాన్ని గుర్తు చేయడం గురించే నేను టీ పార్టీలు– చాయ్ ఫర్ కేన్సర్ నిర్వహిస్తున్నాను’ అని తెలిపారు విజి వెంకటేశ్. ముంబైకి చెందిన 72 ఏళ్ల ఈ సేవా కార్యకర్త దక్షిణ ఆసియాలో కేన్సర్ బాధితుల సహాయానికి పని చేస్తున్న ‘ది మ్యాక్స్ ఫౌండేషన్’కు ప్రధాన బాధ్యతలు నిర్వరిస్తోంది. ‘మేము చాలా హాస్పిటల్స్‌తో మాట్లాడాము. దిగువ ఆదాయ వర్గాల్లో కేన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. ప్రత్యేకంగా ఛారిటబుల్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కాని సమస్య ఏమిటంటే... ఆ పేషెంట్లు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడానికి దారి ఖర్చులు వారి వద్ద ఉండవు. మందులు కొనుక్కోవడానికి, తగిన ΄ûష్టికాహారం తినడానికి వీలుండదు. అలాంటి వారికి సహాయం అందించడమే నా లక్ష్యం. అందుకు టీ పార్టీలకు స్నేహితులను పిలుస్తాను. వారి సహాయం కోరుతాను’ అంది విజి వెంకటేశ్.కార్మికులను చూసి...విజి వెంకటేశ్ ముందు ఒక సాధారణ కార్యకర్తగానే సేవా రంగంలోకి వచ్చింది. ముంబైలోని కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ కోసం నాలుగు చందాలు వసూలు చేసి పెట్టడం ఆమె పని. చిన్న చిన్న వాడల్లోకి వెళ్లి చందాలు అడిగితే వాళ్లు తమ దగ్గర ఉన్నదాంట్లో ఇరవై రూపాయలో, ముప్పై రూపాయలో ఇచ్చేవారు. మరోవైపు వారంతా కార్మికులు కనుక ధూమపానం వల్ల, ఇతర అలవాట్ల వల్ల ఎక్కువగా కేన్సర్ బారిన పడటం విజి గమనించింది. ‘ఒక కేన్సర్ పేషెంట్‌తో టెస్ట్‌లు చేయించుకుని, మందులు తీసుకోవచ్చు కదా అనంటే అతను దాని బదులు నా పిల్లలకు పాలు కొనివ్వగలిగితే నాకు ఎక్కువ సంతోషం అన్నాడు. ఆ జవాబు నన్ను కదిలించింది. ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులకు జీవితాంతం సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను’ అని తెలిపింది విజి.చాయ్ పార్టీ 4 లక్షలువిజి తన టీ పార్టీలకు స్నేహితులను, బంధువులను పిలుస్తుంది. ఆమె సంస్థ, కృషి గురించి విన్న అపరిచితులు కూడా వచ్చి టీ పార్టీలో కూచుంటారు. కేన్సర్ అవగాహన కార్యక్రమం ఉంటుంది. దాంతో పాటు సరదా పాటలు, మాటలు నడుస్తాయి. చివరలో విజి దిగువ ఆదాయ వర్గాల కేన్సర్ బాధితుల కోసం చందాలు కోరుతుంది. ‘ప్రతి టీ పార్టీలో కూడా విశేష స్పందన వస్తుంది. అప్పటికప్పుడు వారికి తోచింది ఇస్తారు. ఒకోసారి 4 లక్షల రూపాయల వరకూ వస్తాయి. అక్కడ ఉన్నవారు వేరే ఫ్రెండ్స్‌కు కాల్ చేసి మరీ డబ్బులు వేయిస్తారు’ అని తెలిపింది విజి.18 వేల మందికివిజి తన సంస్థ ద్వారా ముంబై, మహరాష్ట్రలోని 18 వేల మంది కేన్సర్ బాధితులకు సహాయం అందిస్తోంది. వారి చికిత్సకు, మందులకు, పరీక్షలకు డబ్బు ఏర్పాటు చేస్తుంది. ఒకోసారి కుటుంబ పరిస్థితి కూడా గమనించాల్సి ఉంటుంది. ‘తగిన వైద్యం అందితే చాలామటుకు కేన్సర్ నుంచి బయటపడొచ్చు. ఆ వైద్యం అందే పరిస్థితుల కోసం మనందరం తలా ఒక చేయి వేయాలి’ అందామె.ప్రస్తుతం దేశంలో 30 చోట్ల విజి సంస్థ కోసం టీపార్టీలు జరుగుతున్నాయి. మిగిలినప్రాంతాల్లో కూడా ఇలాంటివి నిర్వహించి నిధులు కేన్సర్ బాధితులకు అందేలా చేయొచ్చు.