vijayanagaram distirict
-
టీడీపీలో ప్రకంపనలు.. కిమిడి నాగార్జున రాజీనామా
సాక్షి, విజయనగరం జిల్లా: చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు కేటాయించడంపై విజయనగరం టీడీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. చీపురుపల్లి టికెట్ రాకపోవడం పట్ల మనస్తాపం చెందిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేశారు. పెద్ద నాన్న కళావెంకట్రావుకి సహకరించేది లేదని ప్రకటించారు. చీపురుపల్లి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కరపత్రాలు, పోస్టర్లను కార్యకర్తలు దహనం చేశారు. బాబు, లోకేష్ అచ్చెన్నాయుడు మోసగాళ్లంటూ నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళా వెంకట్రావుకు సహకరించేది లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. -
ఏడో రోజు వైఎస్సార్సీపీ బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ యాత్ర ఏడో రోజు శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది. సత్యసాయి జిల్లా: ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మవరం టౌన్ పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీ జరపనున్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు సంగడిగుంట వైఎస్సార్ విగ్రహం నుంచి బీఆర్ స్టేడియం మీదుగా మాయాబజార్ వరకు యాత్ర కొనసాగనుంది. మాయాబజార్ మెయిన్ రోడుపై 3:30 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, నేతలు జంగా కృష్ణమూర్తి, వంగపండు ఉష, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, తదితరులు హాజరుకానున్నారు. విజయనగర జిల్లా: ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శృంగవరపుకోటలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మేరుగ నాగార్జున తదితరులు హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటలకు అలమండలో కళ్యాణ మండపం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. 11:20 కి జగనన్న కాలనీ, గ్రామ సచివాలయం సందర్శించనున్నారు. అనంతరం కొత్తవలస మీదుగా ఎస్.కోట వరకు బైకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 3:30 గంటలకు ఎస్.కోట దేవి జంక్షన్లో బహిరంగ సభ జరగనుంది. చదవండి: సంపూర్ణ సాధికారత -
రామతీర్థంలో కొలువుకు సీతారాములు సిద్ధం
తిరుపతి ఎడ్యుకేషన్: ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేయాలని విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులు టీటీడీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాలను శిల్పులు తయారు చేశారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలను పీఠంతో కలిపి వేర్వేరుగా కృష్ణశిల రాతితో వీటిని మలిచారు. శుక్రవారం ఈ విగ్రహాలను విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులకు అప్పగించనున్నారు. శిల్పారామం అభివృద్ధికి రూ. 9.50 కోట్లు సాక్షి, అమరావతి: పులివెందులలో ఉన్న శిల్పారామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గురువారం రూ.9.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 11 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన శిల్పారామం పార్కు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధితో పనులతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించేందుకుగాను నిధులు విడుదల చేసింది. -
ఆ ధాన్యం సంగతేంటి!
విజయనగరం గంటస్తంభం: ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరగాలి... ప్రతి గింజకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, మిల్లర్లు, అధికారుల వైఫల్యం వల్ల రబీ ధాన్యం బిల్లులు సకాలంలో అందక రైతులు ఆందో ళన చెందుతున్నారు. దీనిపై మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని బిల్లులు చెల్లింపునకు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. మిల్లుల్లో ధాన్యం ఉన్నా... రబీలో కొనుగోలు చేసినట్లు అధికారులు చూపుతు న్న ధాన్యం, సీఎంఆర్ విషయం పక్కన పెడితే మిల్లుల్లో ఉన్న రైతుల ధాన్యంపై సమస్య తలెత్తింది. జిల్లాలో అనేక మంది రైతులకు చెందిన 5,400 మెట్రిక్ టన్నులు ధాన్యం మిల్లుల్లో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వీటిని నమోదు చేసి మిల్లులకు పంపించారు. మిల్లర్లు మాత్రం వాటిని తీసుకున్నట్లు చూపడం లేదు. దీంతో ఆయా రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.8.81 కోట్లు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం అక్కడ సిబ్బంది నమోదు చేసి మిల్లుల కు పంపించాలి. మిల్లర్లు వాటిని తీసుకున్నట్టు ఆన్లైన్లో ఓకే చేస్తే రైతులకు బిల్లులు రెండు రోజుల్లో పడిపోతాయి. 25 మిల్లుల్లో సమస్య రబీలో కొనుగోలు చేసిన ధాన్యం జిల్లాలోని 77 మిల్లులకు తరలించారు. ఇందులో 52 మిల్లులకు తరలించిన ధాన్యం మిల్లర్లు తీసుకున్నట్టు చూపడంతో బిల్లులు కూడా రైతుల ఖాతాల్లో పడిపోయాయి. కానీ 25 మిల్లులకు తరలించిన 5,400 మెట్రిక్ టన్నుల ధాన్యం పెండింగ్‌లోనే ఉన్నాయి. మిల్లర్లు వాటిని తీసుకున్న చూపడంలేదు. ఆ మిల్లర్లు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ మేరకు ఇప్పటికే వారికి ధాన్యం ఇచ్చారు. వాటిని మరపట్టి ఇస్తే మిగతా ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంది. అయితే, ఇప్పటికే ఆయా మిల్లర్లు 5వేల మెట్రిక్ టన్నులు ధాన్యానికి సంబంధించి బియ్యం ఇవ్వాల్సి ఉంది. కొత్తగా ఈధాన్యం తీసుకోలేని పరిస్థితి. అయితే, అదనంగా బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఆమేరకు 1:4 నిష్పత్తిలో ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆపని కూడా మిల్లర్లు చేయడం లేదు. దీంతో ఆ మిల్లులకు చేరినా మిల్లర్లు ఓకే చేయకపోవడంతో బిల్లుల చెల్లింపు జరగని పరిస్థితి తలెత్తింది. మంత్రి దృష్టికి సమస్య ధాన్యం బిల్లుల చెల్లింపు విషయంలో అధికారులు వైఫల్యం కూడా ఉంది. బ్యాంకు గ్యారంటీ పరిశీలించకుండా మిల్లులకు అంతకుమించి ధాన్యం పంపించారు. వాస్తవానికి కొనుగోలు పక్రియ లోటుపాట్లపై జాగ్రత్త వహించాల్సిన అధికారులు.. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై భారం పడేసి చోద్యం చూశారు. దీంతో మిల్లులకు ధాన్యం చేరి అక్కడ మూడు నాలుగు నెలలుగా మూలుగుతున్నా రైతులకు మాత్రం బిల్లులు అందలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయం చివరకు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన అధికారులను పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో ఇటీవల విజెలెన్స్ ఎస్పీ జిల్లాకు వచ్చి మిల్లర్లు, అధికారులతో సమావేశం పెట్టి వెళ్లారు. మిల్లుల్లో ఉన్న 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి బిల్లులు చెల్లించాలంటే వాటిని స్వీకరించాలని, ఇందుకు గతంలో ఇచ్చిన ధాన్యానికి పెండింగ్‌లో సీఎంఆర్ ఇవ్వాలని, లేకుంటే అదనపు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు స్పందించిన మిల్లర్లు పెండింగ్ సీఎంఆర్ వెంటనే ఇచ్చి మిల్లుల్లో ఉన్న ధాన్యం ఆన్లైన్లో ఓకే చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లయింది. సమస్య పరిష్కరిస్తాం.. మిల్లర్లు వద్ద ఇంకా 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నాయి. బ్యాంకు గ్యారంటీ లేక వారు ఓకే చేయలే దు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు సమన్వయ సమావేశం ఇటీవల జరిగింది. పాత కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వేగంగా ఇచ్చి ఈ ధాన్యం తీసుకుంటామని మిల్లర్లు హామీ ఇచ్చారు. సమస్య తొందరలోనే పరిష్కారమవుతుంది. రైతుల కు ఇబ్బందులు లేకుండా చేస్తాం. – వరకుమార్, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల సంస్థ -
వంగపండు కుటుంబానికి మంత్రులు పరామర్శ
సాక్షి, పార్వతీపురం: ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని మంత్రులు ఆదివారం పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. వంగపండు ప్రసాదరావు కుమార్తె ఉష, కుమారుడు దుష్యంత్, భార్య విజయలక్ష్మిలకు ముఖ్యమంత్రి తరపున మంత్రులు సంతాపం తెలిపారు. వంగపండు మృతి ఉత్తరాంధ్ర లోని పేదలు, అట్టడుగు వర్గాల వారికి లోటని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండు అని పేర్కొన్నారు. వంగపండు ప్రసాదరావు భౌతికంగా లేకపోయినా ఆయన పాట, మాట ఈ పుడమి వున్నంత కాలం చిరస్థాయిగా నిలిచి వుంటాయని మంత్రి పేర్ని నాని అన్నారు. అట్టడుగు వర్గాల, గిరిజనుల గొంతుక గా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి వాటి పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి వంగపండు ప్రసాదరావు అని మంత్రి కొడాలి నాని తెలిపారు. -
ఆచూకీలేని టీడీపీ నేతలు..
కష్టం వస్తే కాపాడతారనే నమ్మకాన్ని... తమకు ఏ నష్టం రానివ్వరనే భరోసాని... ఆపదొస్తే అండగా ఉంటారనే ధైర్యాన్ని...ఇచ్చేవాడే అసలు సిసలైన నాయకుడు. అలాంటి నాయకులు జిల్లా టీడీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తరుణంలోనూ వారి ఆచూకీ లేదు. నేతల తీరుతో స్వపార్టీ కార్యకర్తలు సైతం దిక్కుతోచక, జనానికి ముఖం చూపించలేక చెల్లాచెదురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లా రాజకీయాలు ప్రత్యేకమనే చెప్పాలి. ఇక్కడ అధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంటుందనేది వాస్తవం. అయితే ఆ కుటుంబాల్లోని వారు ప్రజలను పాలించే విధానాన్ని బట్టి ప్రజాదరణ పొందడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి..తరతరాలుగా జిల్లా ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలతో నిమిత్తం లేకుండా కొన్ని కుటుంబాల వారికే పట్టంగడుతూ వస్తున్నారు. అదే రాజకుటుంబం. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, కురుపాం ప్రాంతాల్లోని ఈ రాజకుటుంబాల సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పదవులు పొంది, అనుభవించారు. ముఖ్యంగా వీరిలో అధిక శాతం మంది టీడీపీలోనే ఉన్నారు. ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజ్యం సంక్షోభంలో ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు రాజ్యాన్ని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రాజుపై ఉంటుంది. కానీ జిల్లా రాజులు మాత్రం పేరుకే రాజులు తప్ప, రాచబిడ్డకు ఉండాల్సిన లక్షణాలేవీ వారిలో కనిపించడం లేదని ఎంతోమంది విమర్శలు చేస్తున్నా వారిచెవికి ఎక్కడం లేదు. చెవులుండీ వినలేని, కళ్లుండీ చూడలేని వారి అసమర్థతే వారి పతనానికి కారణమయ్యింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని తెచ్చిపెట్టింది. ఓటమితో నేతల కనుమరుగు.. ఎన్నికల అనంతరం జిల్లాలో టీడీపీ దాదాపు చతికిలపడింది. తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను, విజయనగరం ఎంపీ స్థానంతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్నప్పుడే జిల్లా టీడీపీకి చావుదెబ్బతగిలింది. అయితే ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓడిపోయినంత మా త్రాన ప్రజలను, కార్యకర్తలను పూర్తిగా టీడీపీ నేతలు విస్మరించడం వారి స్వార్థానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నాయకులెవరూ ఈ అపవాదును తుడిచే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఫలితంగా జిల్లాలో టీడీపీని జనం పూర్తిగా మర్చిపోతున్నారు. టీడీపీనే నమ్ముకున్న సామాన్య కార్యకర్తల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారికి నాయకుడు లేడు. ప్రజల్లో పార్టీకి ఆదరణ లేదు. మరోవైపు కరోనా కష్టాలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మిగిలిన కొద్దిమంది టీడీపీకి దూరంగా ఉంటున్నారు. విపత్తువేళా జనానికి దూరంగా... ఇక కరోనా సమయంలోనైనా టీడీపీ నేతల్లో మార్పు వచ్చిందా అంటే అదీలేదు. గతంలో అనేకసార్లు తమకు పదవులు కట్టబెట్టిన ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకుందామనే ఆలోచన ఆ పార్టీ నాయకులకు రాలేదు. నెలల తరబడి లాక్ డౌన్ అమలు జరుగుతున్న వేళ వ్యాపారాలు లేక, పనులు దొరక్క, ఉపాధి కరువై బతుకు బరువై అనేక ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలను ఆదుకునే ఒక్క కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టలేదు. పైగా తమ సొంత ప్రాబల్యం కోసం మాత్రమే పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడారు. ఆస్తి కోసం అస్తిత్వం కోసం మాత్రమే అప్పుడప్పుడూ తళుక్కున మెరిశారు. ఆ చర్యలవల్ల వారి ప్రతిష్ఠను మరింతగా దిగజార్చుకున్నారు. అధిష్టానం ఆదేశించినపుడు తప్పనిసరై నోరువిప్పుతున్నారు. అది కూడా చేయలేని కొందరు పత్రికా ప్రకటనలతో సరిపెడుతున్నారు. జిల్లాలో ఒకరిద్దరిని మినహా ప్రజలు టీడీపీ నాయకులను చూసి కొన్ని నెలలవుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. టీడీపీ హయాంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కనీసం జనం కోసం ఒక్క సాయం కూడా చేయడం లేదు. కానీ ఇంకా ప్రజలను అమాయకులుగా భావించి వారిని నమ్మించడం కోసం అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై వాట్సప్‌లలో విమర్శలు చేస్తున్నారు. సొంతపార్టీ నాయకులు చనిపోతేనే సంతాపం తెలపనివారు, ఆ కుటుంబానికి సానుభూతి తెలపడానికి ఒక్కమాట మాట్లాడనివారు ఇక జనాన్ని ఏం పట్టించుకుంటారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జనానికి అండగా... వైఎస్సార్సీపీ కరోనాకు భయపడో లేక పదవులు ఇవ్వని ప్రజలను ఎందుకు పట్టించుకోవాలనో తెలియదుగానీ టీడీపీ నాయకులు మాత్రం పూర్తిగా కనుమరుగైపోయినా... తమ నాయకుడిని, తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను వైఎస్సార్సీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వారితో పాటే కరోనాతో పోరాడుతూ, తాము ఆ మహమ్మారి బారిన పడుతున్మామని తెలిసినా ప్రజాసేవ చేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే ఒకటి రెండు రోజులు లేదా మహా అయితే వారం, పదిరోజులకు మించి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కరోనా అలాకాదు. నెలల తరబడి తిష్టవేసుకుని కూర్చుంది. అయినప్పటికీ ప్రారంభం నుంచి ప్రజల కోసం నిత్యం ఏదో ఒక సాయం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ప్రజల్లో ఆదరణను పెంచుకున్న ఆ నాయకులు ఇప్పుడు ప్రజల ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారు. -
మూఢనమ్మకాలకు మరో ప్రాణం బలి
ప్రపంచం అంతా శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో దూసుకుపోతుంటే మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం నేటికీ మూఢనమ్మకాలను వీడడం లేదు. చిల్లంగి, దెయ్యం పట్టింది వంటి మూఢనమ్మకాలను గిరిజనులు నమ్ముతూనే ఉన్నారు. ఫలితంగా వారి అనుమానాలు హత్యకు దారి తీస్తున్నాయి. తాజాగా గుమ్మలక్ష్మీపురం మండలంలో చిల్లంగి పేరిట జరిగిన హత్యే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో మూఢనమ్మకానికి మరో ప్రాణం బలైంది. చిల్లంగి నెపంతో ఓ గిరిజనుడిని అతికిరాతకంగా రాళ్లతో కొట్టి చంపిన సంఘటన మండలంలో చోటు చేసుకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఎలి్వన్‌పేట సీఐ రమేష్‌కుమార్ విలేకరులకు బుధవారం వివరాలు వెల్లడించారు. మండలంలోని నెల్లికెక్కువ పంచాయతీ కొండకూనేరు గ్రామానికి చెందిన పల్లెరిక ప్రసాద్(23) అనే యువకుడు అనారోగ్యంతో ఈ నెల 11న మృతి చెందాడు. యువకుడి కుటుంబ సభ్యులు అదే రోజు అంత్యక్రియలు గ్రామంలో జరిపారు. అయితే ప్రసాద్ చిల్లంగి పెట్టడం వల్లే చనిపోయాడని, చిల్లంగి పెట్టింది అదే గ్రామానికి చెందిన పల్లెరుక మిన్నారావు అలియాస్ బారికి(46) అని కుటుంబ సభ్యులు అనుమానించారు. బారికిని ఎలాగైన మట్టుబెట్టాలని భావించిన ప్రసాద్ కుటుంబీకులు అదే రోజు మధ్యాహ్నం బారికి ఇంటికి వెళ్లి ప్రసాద్ మృతదేహం దహనమైందో..లేదో చూసి వద్దామని మాయమాటలు చెప్పి శ్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ రాళ్లతో అతి కిరాతకంగా కొట్టి చంపారు. అనంతరం బారికి మృతదేహాన్ని ప్రసాద్ అంత్యక్రియలు జరిగిన చోటే నిప్పు పెట్టి ఖననం చేసి ఇంటికొచ్చేశారు. తరువాత గ్రామంలో బారికి కనిపించకపోవడంతో పక్క గ్రామమైన డొంగరికెక్కువ గ్రామంలో నివసిస్తున్న బారికి మేనల్లుడు మండంగి వెంకటరావు పరిసర గ్రామాల్లో వెదికాడు. దీన్ని గమనించిన ప్రసాద్ బంధువు వెంకటరావు ఈ నెల 21న కొండకూనేరు గ్రామానికి పిలిపించి ప్రసాద్‌ను చిల్లంగి పెట్టి చంపినందునే బారికిని తాము చంపేశామని వెల్లడించారు. దీన్ని వివాదం చేయొద్దని పరిష్కరించుకుందామని వెంకటరావుతో మాట్లాడగా అందుకు నిరాకరించిన ఆయన ఎలి్వన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.నారాయణరావు ఆధ్వర్యంలో హెచ్‌సీ ఎన్.నాగేశ్వరరావు ఇతర సిబ్బంది గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. అనుమానితులైన 17 మందిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. కొండకూనేరులో బారికి ఒంటిరిగా జీవిస్తుండడంతో సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే 26న ఇదే మండలంలో డుమ్మంగి పంచాయతీ టెంకసింగి గ్రామంలో చిల్లంగి నెపంతో జరిగిన హత్యను మరువక ముందే మళ్లీ అటువంటి సంఘటనే పునరావృతం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
రోజంతా ప్రజాసేవకే..
-
బీఎస్–6 వాహనాలతో కాలుష్యానికి చెక్
పార్వతీపురం: భారతస్టాండర్ట్కు సంక్షిప్త రూపమే బీఎస్. వాహనం నుంచి వెలువడే వాయు ఉద్గారాలను అనుసరించి ఈ స్థాయిని నిర్ణయిస్తారు. 2010 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన బీఎస్–3 వాహనాలు 2017 మార్చి 31 వ తేదీ వరకు విస్తరించాయి. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–4 వాహన శ్రేణి అందుబాటులోకి వచ్చింది. వాహన కాలుష్యాన్ని తగ్గించే దిశగా తాజాగా బీఎస్–6 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మేలుకుంటే మంచిది... ఆర్థిక మందగమనం ప్రమాద హెచ్చరికలు వినిపిస్తున్నా కొత్త వాహనాల క్రయ విక్రయాలు బాగానే సాగుతున్నాయి. జిల్లాలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల వినియోగం అధికంగానే ఉంది. ఈ వాహనాల నుంచి వెలువడే పొగ పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే బీఎస్–4 (భారత్ స్టాండర్డ్) వాహనాల రిజిస్టేషన్ నిలిపివేసే చర్యలు చేపట్టింది. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే బీఎస్–4 వాహనాలను రిజిస్టేషన్ చేస్తారు. ఆ తర్వాత రిజి్రస్టేషన్ చేసే అవకాశాలు లేవని రవాణా శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే రిజి్రస్టేషన్ చేయనున్నారు. బీఎస్–4 వాహనాల్లో వాయు కాలుష్య కారకాలు ఉన్నాయని భావిస్తూ వాటిని తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బీఎస్–6 వాహనాలకు అనుమతి ఇచ్చింది. మోటారు కంపెనీలు కూడా బీఎస్–6 వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు లేకుంటే సీజ్.... ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్–4 వాహనాల రిజిస్టేషన్ నిలిపివేస్తున్న నేపథ్యంలో కొనుగోలుదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాహ నం కొనే సమయంలో అది ఏ ప్రమాణాలతో కూడిన వాహనమో పరిశీలించి తీసుకుంటే మేలు. ఇతర వ్యక్తు ల నుంచి వాహనాలు కొనే సమయంలో సంబంధిత పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలి. పొరపాటున మార్చి తర్వాత బీఎస్–4 వాహనాలు కొత్తవి తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్–4 వాహనాలను రిజిస్ట్రేషన్ లే కుండా రోడ్లప తిప్పితే రవాణా శాఖ అధికారులు సీజ్ చేస్తారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్నా అదే పరిస్థితి. ఆఫర్ల వల.... మార్చి 31లోగా వాహనాల డీ లర్లు బీఎస్–4 వాహనాలను తప్పనిసరిగా విక్రయించాలి. లేదంటే తమ బంధువులు, ఇ తరుల పేరుతో రిజిస్ట్రేషన్ చే సుకోవాలి. లేదంటే వాటిని విక్రయించే అవకాశం లేదు. దీంతో లాభాలు లేకున్నాసరే తమ వద్ద ఉన్న బీఎస్ –4 వాహనాలను వదిలించుకునేందుకు రూ.10 వేలు నుంచి రూ.15వేల వ రకు ఆఫర్లు ఇస్తూ కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు. శాశ్వత రిజిస్ట్రేషన్ తప్పనిసరి బీఎస్–4 వాహనాలు తప్పనిరిగా ఈ నెలాఖరులోగా శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే వాహనాలు సీజ్ చేస్తాం. గడువు దాటితే షోరూమ్‌లో ఉన్న వాహనాలు కూడా బయట తిరిగే అవకాశం ఉండదు. డీలర్లకు ఇప్పటికే సూచనలిచ్చాం. వాహనదారులు ఈ విషయమై అవగాహన పెంపొందించుకోవాలి. కాలుష్య కారకాలను తగ్గించేందుకే ప్రభుత్వం బీఎస్–6 వాహనాల అమ్మకానికి ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో బీఎస్–7, బీఎస్–8 వాహనాలుకూడా వచ్చే అవకాశం ఉంది. – ఎంవీఐ గంగాధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, పార్వతీపురం ఆఫర్లు వచ్చి అమ్ముతున్నాం... లాభాల లేక చాలా రోజులైంది. ప్రస్తుతం బీఎస్–4 వాహనాలను ప్రత్యేక ఆఫర్లతో అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. బీఎస్–4 వాహనాలు ఇప్పటికే సాంకేతికంగా ఆదరణ పొందాయి. మరింత కాలుష్య నివారణకు బీఎస్–6 వాహనాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వినియోగదారులపై వాహన రేట్లు కొంతమేర అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. కార్బరేటర్ లేకుండా కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే షోరూంలలో మాత్రమే బాగుచేసుకోవాల్సిన పరిస్థితి వినియోగదారులకు ఉంటుందే తప్ప ఇతరత్రా అవకాశం ఉండదు. ఏది ఏమైనా బీఎస్–6 వాహనాలతో కాలుష్య నివారణతో పాటు వాతావరణ సమతుల్యత కొంతమేర మెరుగుపడి భావితరాలకు ఉపయుక్తం కాగలదు. – శ్రీనివాసరావు, టీవీఎస్ షోరూం యజమాని, పార్వతీపురం -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి..
మెంటాడ: మెంటాడ మండలంలో వైఎస్సార్ సీపీకి మరింత ఆదరణ లభిస్తోంది. మండలంలోని చల్లపేటలో మాజీ సర్పంచ్‌లు జి.భాగ్యలక్ష్మి, తాడ్డి అరుణ, మాజీ ఎంపీటీసీ జి.సత్యశ్రీనివాసరావు, మెంటాడ పీఏసీఎస్ అధ్యక్షుడు తాడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ చప్ప సూర్య కుమారి, తాడ్డి తనూష, విశ్రాంత ఉపాధ్యాయులు చప్ప సూర్యం, తాడ్డి గోవిందరావు, మిత్తిరెడ్డి గోపాలం తో పాటు సుమారు 200 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యలు పార్టీ కండువాలు కప్పి వారిని సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. జేకే నిధులు మంజూరయ్యాయని ఆండ్ర హైలెవెల్ కెనాల్ పూర్తి చేసి ఏన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 17 గ్రామాల రైతులకు చెందిన 4100 ఎకరాలకు అదనపు సాగునీరు అందిస్తామని రైతులు అడిగిన ప్రశ్నకు ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అప్పలనరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ రెడ్డి సన్యాసినాయుడు, యువజన అధ్యక్షుడు రాయిపిల్లి రామారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వడ్డి చిన్నారావు, సాలూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సిరిపురపు నాగమణి, సాలూరు నియోజకవర్గం నాయకులు దండి శ్రీను, సువ్వాడ రమణ, హేమంత్, మాజీ ఎంపీపీలు శొంఠ్యాణ సింహాచలం, కొర్రాయి కళావతి, ఏఎంసీ మాజీ చైర్మన్ పొరిపిరెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. -
జగమంత సంబరం
సాక్షి ప్రతినిధి విజయనగరం: ఇంటి బిడ్డ పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకుంటామో.. అంతకుమించిన సంబరంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను జిల్లా ప్రజలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి బొబ్బిలి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ప్రారంభించి జిల్లాలోని 444 మంది నేతన్నలకు ఒక్కొక్కరికీ రూ.24వేలు చొప్పున రూ.1,06,56,000 అందజేశారు. బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. పుష్పశ్రీవాణి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే శంబంగి, జిల్లాకలెక్టర్ హరిజవహర్‌లాల్ తదితరులకు అందజేశారు. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ముఖ్య అతిధిగా పుష్పశ్రీవాణి, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కేక్ కట్ చేశారు. ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి స్వయంగా రక్తదానం చేశారు. పార్వతీపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్‌చేశారు. సాయంత్రం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షత వహించగా ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, విశ్వాసరాయి కళావతి, చెట్టి ఫల్గుణ, మాజీ ఎంపీ బొత్సఝాన్సీలక్ష్మి కేక్ కట్ చేసి సీఎం పుట్టినరోజు వేడుకలు జరిపారు. విజయనగరంలో మెగా రక్తదాన శిబిరం విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. మెగా బ్లడ్ క్యాంప్ ఆర్గనైజింగ్ చైర్మన్ సంగంరెడ్డి బంగారునాయుడు, కో చైర్మన్లు అల్లు చాణుక్య, జి.ఈశ్వర్ కౌశిక్‌ల నేతత్వంలో 356 యూనిట్ల రక్తాన్ని వివిధ రక్తనిధి కేంద్రాల వైద్యులు సేకరించారు. వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నగరంలోని హెలి్పంగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసిన అనంతరం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెలి్పంగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ అధ్యక్షురాలు దవడ మీన, కార్యదర్శి స్రవంతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు పిళ్ళా విజయకుమార్, కాళ్ల గౌరీ శంకర్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్ స్థానిక సత్య కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఘోషాస్పత్రి, పూల్‌బాగ్‌లోని ద్వారకామయి అంధుల పాఠశాలలో రోగులకు, విద్యార్థులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అన్నదానంలో రాజన్నదొర సాలూరు పట్టణంలోని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర స్వగృహంలో కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీహెచ్సీలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సాలూరు పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అన్నదానం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వి రమణరాజు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సతీమణి బెల్లాన శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్సార్ బీమా చెక్కులను లబి్ధదారులకు అందజేశారు. విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున చేరి సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డెంకాడలో దుప్పట్ల పంపిణీ నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడలో నిర్వహించిన సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా పేదలకు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు దుప్పట్లు పంపిణీ చేశారు. పూసపాటిరేగలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గజపతినగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య స్థానిక సామాజిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలోని దేవీ జంక్షన్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో సహా పలువురు నాయకులు పూలమాలలువేసి నివాళులరి్పంచారు. అనంతరం ఎస్‌కోట ప్రభుత్వాస్పత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. గురుదేవా చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో వికలాంగులకు ట్రై సైకిళ్లు, కృత్రిమ పరికరాలను అందజేశారు. దిశ చట్టం తేవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎల్కోటలో క్షీరాభిõÙకం నిర్వహించారు. -
కూతురిపై ప్రేమతో... ఆమె పోస్టే విరుద్ధం..
వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూచున్నా... విందు భోజనం అన్నది సామెత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని... అవకాశాన్ని ఆసరాగా మలచుకుని... నిబంధనలు పక్కన పెట్టి... ప్రభుత్వ సూచనలు బేఖాతరు చేస్తూ వ్యవహరించిన జిల్లా పూర్వ వైద్యారోగ్యశాఖాధికారి ఇప్పుడు విచారణను ఎదుర్కొనాల్సి వస్తోంది. అర్హతలేకుండా అడ్డగోలుగా డిప్యుటేషన్ వేసి... సొంత కూతురినే స్థాయికి మించి అందలాన్ని ఎక్కించి... ఇప్పుడు చిక్కుల్లో పడాల్సి వచ్చింది. మొదటినుంచీ విమర్శలకు తావిచ్చిన ఈ వ్యవహారం తాజాగా మళ్లీ చర్చనీయాంశమైంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా గతంలో పనిచేసిన డాక్టర్ విజయలక్ష్మి గిరిజన ప్రాంత పీహెచ్సీ అయిన తోణాంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న తన కుమార్తెను తీసుకువచ్చి విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా నియమించారు. కుమార్తెపై ఉన్న ప్రేమతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా ఆమె తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు అప్పట్లోలోనే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను నివ్వెరపోయేలా చేశాయి. అప్పట్లో ఆమె వ్యవహరించిన విధానంపై తాజాగా విచారణ మొదలైంది. అన్ని డిప్యూటేషన్లూ రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంకా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం కొనసాగుతున్నాయి. అందులోనూ గిరిజన ప్రాంతం నుంచి విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వేసిన డిప్యుటేషన్ కూడ ఇంకా రద్దు చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఆమె పోస్టే విరుద్ధం.. పూర్వ డీఎంహెచ్ఓ పోస్టును గత తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టింది. సివిల్ సర్జన్ స్పెషలిస్టును డీఎంహెచ్‌ఓగా నియమించాలి. కాని డిప్యూటీ సివిల్సర్జన్కు డీఎంహెచ్ఓ పోస్టు ను కట్టబెట్టారు. సివిల్ సర్జన్ స్పెషలిస్టులున్నప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారం నియామకం చేపట్టింది. ఇటీవల ఆమెను పాత స్థానంలోకి పంపించి, విజయనగరం జిల్లాకు వేరే అధికారిణిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు.. జిల్లా ఇన్చార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేసిన డాక్టర్ విజయలక్ష్మి ఇష్టానుసారంగా వ్యవహరించి, పలు అవకతవకలకు పాల్పడ్డారని మెడికల్ హెల్త్, ఎంప్లాయిస్ యూనియన్ నేతలు, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు హెల్త్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 29 వ తేదిన విచారణ జరగనుంది. ఉద్యోగ నియామకాలతో పాటు, డిప్యూటేషన్లు, ఫర్నిచర్ కొనుగోలు, కరపత్రాల ముద్రణ వంటి అనేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. పీహెచ్సీ నుంచి ఎంహెచ్‌ఓగా... సాలూరు మండలం తోణాం పీహెచ్సీ వైద్యురాలిగా ఉన్న తన కుమార్తె ప్రణీతను డిప్యూటేషన్‌పై విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వేశారు. ఈ వ్యవహారం అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. అయినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హోదాలో ఉన్న ఆమెను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేదు. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతంలో ఉన్న వైద్యులను మైదాన ప్రాంతానికి డిప్యూటేషన్ వేయకూడదు. అవసరం అనుకుంటే మైదాన ప్రాంతంలో ఉన్నవారినే గిరిజన ప్రాంతానికి డిప్యూటేషన్ వేయవచ్చు. కాని అవేవీ విజయలక్ష్మి పట్టించుకోలేదు. మరో విషయం ఏంటంటే... నిజానికి ప్రణీత తొలుత తాత్కాలిక ఉద్యోగినిగానే వైద్యారోగ్యశాఖలో ప్రవేశించారు. అనతి కాలంలోనే తల్లి అండతో తన ఉద్యోగాన్ని పదిలం చేసుకున్నారు. తోణాం పీహెచ్‌సీకి ఇన్చార్జ్ వైద్యులే దిక్కు.. 24 గంటలూ పనిచేయాల్సిన తోణాం పీహెచ్‌సీకి ఇప్పుడు ఇన్చార్జ్ వైద్యుడే దిక్కుయ్యారు. ఒక వైద్యురాలు ప్రసూతి సెలవులో వెళ్లారు. అక్కడి నుంచి డిప్యూటేషన్‌పై మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వచ్చిన ప్రణీత ఇంకా మున్సిపాలిటీలోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం మాట పెడచెవిన.. గిరిజన ప్రాంతాల్లో వైద్యులుగా, ఫార్మసిస్టులుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా ఏళ్లతరబడి దాదాపు 50 మంది వరకు పనిచేస్తున్నారు. మైదాన ప్రాంతాలకు రావడానికి వారు చాలా ప్రయత్నాలు చేశారు. నిబంధనలు అంగీకరించక అక్కడే పనిచేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారే తలుచుకోవడంతో అసాధ్యం కాస్తా సుసాధ్యం అయ్యింది. కుమార్తె మైదాన ప్రాంతానికి చేరింది. మరోవైపు డిప్యూటేషన్లు అన్నీ రద్దు చేయమని ప్రభుత్వం చెప్పినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన్ పరిషత్తుల్లో ఇంకా డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సైతం కొందరు అధికారులు తమ స్వార్ధం కోసం పెడచెవిన పెడుతున్నారు. విచారణ చేపడతాం.. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న విషయం తెలియదు. నేను వచ్చి కొద్ది రోజులే అయ్యింది. ఫైల్ తెప్పించుకుని విచారణ చేస్తాం. డిప్యూటేషన్ పైనే కొనసాగుతున్నట్లయితే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎస్.వి.రమణకుమారి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, విజయనగరం -
బస్సెళ్లిపోయి.. పదేళ్లు.!
సాక్షి, ప్రతినిధి విజయనగరం: జిల్లాలో సుమారు 154 గ్రామాల ప్రజలు ఆర్టీసీ సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యాలయాలకు వెళ్లాలన్నా.. కార్యాలయాలకు చేరుకోవాలన్నా.. మార్కెట్‌కు బయలుదేరాలన్నా.. ఆపద సమయంలో ఆస్పత్రికి వెళ్లాలన్నా ఆటోలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి. అవి కూడా సాయంత్రం 5 గంటలతో సరి. అందుకే.. పొద్దుపోతే చాలు ఆ గ్రామాల ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు ఆతృతపడతారు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ఆర్టీసీ విఫలమవుతోందని, వ్యాపార దృక్పథంతో ఆదాయం వచ్చే మార్గాల్లోనే బస్సు లు నడువుతోందని ఆ ప్రాంతాల ప్రజల వాదన. ఆదాయం లేకపోతే ఆపేస్తారు.. జిల్లాలో 24 లక్షలకుపైగా జనాభా ఉండగా వీటిలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. వీరికి రవాణా సేవల అందించడానికి ఆర్టీసీ సంస్థ జిల్లాలోని నాలుగు డిపోల ద్వారా 226 పల్లెవెలుగు బస్సులతో మాత్రమే సర్వీసులు నిర్వహిస్తోంది. వీటిలో 80 అద్దె బస్సులు ఉన్నాయి. జిల్లాలోని 1,545 గ్రామాల్లో 704 గ్రామాలకు పక్కా రహదారులు ఉన్నా వాటిలోని 650 గ్రామాలను కలిపే ‘పల్లెవెలుగు’ సర్వీసులను మాత్రమే ప్రస్తుతం నడుపుతోంది. జిల్లాలో రోడ్డు సౌకర్యం ఉన్న దాదాపు 154 గ్రామాలకు ఆర్టీసీ సేవలను అందించడం లేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్నామని చెబుతున్న 650 పల్లెవెలుగు సర్వీసులలో 60 రూట్ల సర్వీసులను ఎప్పటికప్పుడు రద్దు చేస్తుండడంతో ఆ ప్రాంతాల ప్రజలకు ఆర్టీసీ సేవలు దూరమవుతున్నాయి. రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని బస్సులు నడపడం లేదని చెబుతూ వచ్చిన ఆర్టీసీ అధికారులు ఇప్పుడు లాభాలు రావడం లేదన్న కారణం చూపుతున్నారు. 93 పల్లె వెలుగుల్లో గ్రామాలకు వెళ్లేవి 10 మాత్రమే.. విజయనగరం డిపో పరిధిలో 144 బస్సులతో 42 రూట్లలో 146 సర్వీసులను ఆర్టీసీ సేవలను అందిస్తోంది. వీటిలో 59 బస్సులు వరకు అద్దెప్రాతిపదికన నడుస్తున్నాయి. 30 ఎక్స్‌ప్రెస్, 18 డీలెక్స్, 3 సూపర్ లగ్జరీ సర్వీసులు అంతర రాష్ట్ర, అంతర్ జిల్లాల ప్రధాన రోడ్లలో ప్రయాణికులు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సేవలందిస్తున్నాయి. మిగిలినవి దాదాపు 93 వరకు పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామాలకు వెళ్లకుండా వీటిని కూడా ప్రధాన రహదారుల పట్టణాలకు పరిమితం చేస్తున్నారు. పట్టణానికి ఆనుకొని ఉన్న కొన్ని మండలాల్లోని వసంత, పెంటసీతారాంపురం, గోవిందపురం, కోనాడ వంటి కొన్ని గ్రామాలకు వెళ్లే 10 బస్సులు మినహా మిగిలిన 83 పల్లె వెలుగులు సర్వీసలన్నీ ఆదాయాన్నిచ్చే పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, రాజాం, ఎస్.కోట వంటి దూరప్రాంతాలకు పంపుతున్నారు. దీంతో డిపో పరిధిలోని 80 శాతం గ్రామాలకు ఆర్టీసీ సేవలు అందడం లేదు. విద్యార్థులు, ఉద్యోగులకు ఆటోలే దిక్కు: పాఠశాల, కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం బడిబస్సు పేరుతో ప్రధాన పట్టణాలను కలిపే సర్వీసులు 10 బస్సులు జిల్లాలో నడుస్తున్నా యి. గ్రామాలకు తిరిగే బస్సులను రద్దు చేసి.. వాటి స్థానంలో బడి బస్సులు వేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా విద్యార్థి బస్సుపాసు తీసుకునే వారు 40 వేలకు పైడా ఉండగా కేవలం 10 బస్సులు మాత్రమే నిర్వహిస్తున్నారు. పైగా ఈ బస్సులు సైతం సమయపాలన పాటించడం లేదని, ఇతర ప్రయాణికులను కూడా ఎక్కించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపాం రోడ్లు పక్కాగా ఉన్నా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కొన్ని గ్రామాల సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. ఆరునెలలుగా సర్వీసులను రద్దు చేయలేదు. ఆటోలు, ఇతర ప్రై వేటు వాహనాలు గ్రామాలకు అక్రమ రాకపోకలు ఎక్కువయ్యాయి. వాటిని నిరోధిస్తే ఆర్టీసీకి ఆధరణను పెంచుకోవచ్చు. ఉన్న బస్సుల కంటే అధనంగా రూట్లకు అనుమతులు కోసం ఎప్పటికప్పుడు ఏడాదికోసారి ప్రతిపాదనలు పంపుతాం. – ఏ.అప్పలరాజు, ఆర్ఎం, ఆర్టీసీ నెక్ రీజయన్ -
టీడీపీకి ప్రశ్నించే అర్హత లేదు:ఎమ్మెల్యే కోలగట్ల
సాక్షి, విజయనగరం: టీడీపీని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో ఆ పార్టీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం విజయనగరంలో మీడియా సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికార పార్టీపై ఆరోపణలు చేయడం ద్వారా తన ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిగ్గుపడాల్సింది పోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇసుకను సాకుగా చూపి టీడీపీ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ‘ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తుందని.. కానీ టీడీపీకికి ప్రశ్నించే అర్హత లేదని’ దుయ్యబట్టారు. విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిందని.. జిల్లాలో టీడీపీకి పాలించే అర్హత లేదని ప్రజలు స్పష్టంగా చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
వడ్డీ పిండేస్తున్నారు..
గరివిడి: జిల్లాలో వడ్డీ వ్యాపారులు కాలసర్పాలుగా మారి బుసలు కొడుతున్నారు. అత్యవసరంగా నగదు అవసరమై వచ్చిన వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వడ్డీ మీద వడ్డీ వేస్తూ వారి శ్రమను జలగల్లా పీల్చుకుంటున్నారు. బారువడ్డీ, చక్రవడ్డీ అంటూ అసలు కన్నా వడ్డీయే ఎక్కువగా లాగేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరండంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని కొందరు వడ్డీ వ్యాపారులు పోలీస్ స్టేషన్లలో పోలీసులతోనే పంచాయితీలు చేయిస్తూ బాకీలు వసూలు చేసుకుంటున్నారు. పట్టణాల్లో అయితే ఈ వడ్డీ వ్యాపారం అధికంగానే నిర్వహిస్తున్నారు. కొంతమంది పెత్తందార్ల సపోర్ట్‌తో ఈ వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. వడ్డీ వ్యాపారం మూడు ప్రామిసరీ నోట్లు..ఆరు ఖాళీ చెక్కులు అన్న చందంగా విచ్చలవిడిగా సాగుతోంది. కోర్టు కేసుల పేరిట వేధింపులు.. అప్పు కోసం తమ వద్దకు వచ్చేవారి నుంచి వడ్డీ వ్యాపారులు బ్యాంక్ ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డులు తీసుకుని ఖాళీ ప్రాంశరీ నోట్ల మీద సంతకాలు చేయించుకుంటున్నారు. డబ్బు ఇచ్చే సమయంలో రూ. 100కు రూ. 10 నుంచి రూ.20 తగ్గించి మిగిలిన డబ్బును అప్పుగా ఇస్తున్నారు. వడ్డీ మాత్రం వంద రూపాయలకు వసూలు చేస్తున్నారు. కొంతమంది నిస్సహాయులు భవనాలు, భూములు, నగలు, ఇళ్లను తనఖా పెడుతున్నారు. వారు వడ్డీ చెల్లించడంలో ఆలస్యమైతే వడ్డీ వ్యాపారులు ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. రుణ గ్రహీత వడ్డీ చెల్లించడం ఆలస్యమైనా.. వడ్డీ అధికమని ప్రశ్నించినా.. వారి ఇచ్చిన ఖాళీ చెక్కులు, ప్రాంశరీ నోట్ల ఆధారంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. నూటికి తొంబై శాతం మంది వడ్డీ వ్యాపారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవు. ఇటీవల అవినీతి శాఖాధికారులు పలువురు అధికారులను పట్టుకుంటున్న సందర్భాల్లో కూడా అధిక మొత్తంలో ప్రాంశరీ నోట్లు దొరకడం విశేషం. బాధ్యతాయుతమైన అధికారులు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఏసీబీ దాడుల వల్ల తెలిసింది. వడ్డీ వసూలు చేసేది ఇలా.. రూ. లక్ష తీసుకుంటే నాలుగు నుంచి పది రూపాయల వరకూ వడ్డీ వసూలు చేస్తారు. నెల నెలా కొంత మొత్తాన్ని అసలు కింద జమచేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. రుణ గ్రహీత నెల నెలా అసల కింద సొమ్ము జమ చేస్తున్నా వడ్డీ మాత్రం చివరి నెల వరకూ రూ. లక్షకే వసూలు చేస్తారు. ఈ లెక్కన రుణ గ్రహీత తీసుకున్న సొమ్ముతో సమానంగా వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. కఠిన చర్యలు.. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేయకూడదు. ఎవరినీ వేధింపులకు గురి చేయకూడదు. అధిక వడ్డీ, వేధింపులపై బాధితులు ఫిర్యాదు చేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు. – కె. కృష్ణ ప్రసాద్, ఎస్సై, గరివిడి -
అమ్మఒడికి శ్రీకారం
విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జనగన్న అమ్మఒడి’ పథకం అమలుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చిన షెడ్యూల్ వివరాలు, ప్రధానోపాధ్యాయులు నిర్వహించాల్సిన అంశాలను డీఈఓ జి.నాగమణి సోమవారం విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధి విధానాలను వివరించారు. పథకానికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతను నిర్ధారిస్తారు. అర్హులందరికే ఈ పథకం అందేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్సార్ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే పథకం అమలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అమ్మ ఒడి జిల్లా స్థాయి షెడ్యూల్ ఇలా... -పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరిశీలించాలి. ఈ నెల 19వ తేదీలోగా ధ్రువీకరించాలి. -ఇతర పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో ఉన్న విద్యార్ధులను తిరిగి నమోదు చేసుకోవాలి. -గుర్తించిన జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకునికి ఈ నెల 20న పంపించి 25న నోటీసు బోర్డులో పెట్టాలి. అప్డేట్ అయిన చైల్డ్ ఇన్ఫో డేటా రాష్ట్ర స్థాయిలో ఏపీ ఆన్లైన్ ద్వారా ఏపీసీఎఫ్ఎస్ఎస్కు అందజేస్తారు. -ఏపీ ఆన్‌లైన్‌కు అందిన చైల్డ్ ఇన్ఫో రేషన్ కార్డుల జాబితా మరియు ప్రజాసాధికార సర్వే సమాచారంతో పోల్చి అమ్మ ఒడికి అర్హులైన తల్లులు/సంరక్షకుల సమాచారాన్ని నిర్ధారించి ఈ నెల 21న ఏపీసీఎఫ్ఎస్ఎస్ ద్వారా ప్రకటిస్తారు. -ఏపీసీఎఫ్ఎస్ఎస్ ద్వారా ప్రధానోపాధ్యాయులకు లాగెన్ ఐడీ మరియు పాస్వర్డ్ కేటాయిస్తారు. ∙కొత్తగా అర్హతలను జోడించడానికి అవసరమైన మూడు ఫార్మేట్స్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ విడుదల చేస్తుంది. -వాటిలో ఫార్మేట్–1 తెల్ల రేషన్ కార్డు కలిగిన తల్లులు, సంరక్షకుల వివరాలతో కూడి ఉన్న విద్యార్థుల జాబితా ఉంటుంది. ఇందులో సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి లోపాలు ఉన్నట్లయితే సరిదిద్ది గ్రామ సచివాలయ లాగిన్‌లో ఈ నెల 24లోపు క్రోడీకరించాలి. -ఫార్మేట్–1ను గ్రామ సచివాలయంలోని విద్య సంక్షేమ సహాయకుడు ప్రధానోపాధ్యాయుల నుంచి అందిన సమాచారాన్ని నోటీస్ బోర్డులో ప్రకటించాలి. అభ్యంతరాలపై గ్రామస్థులకు మూడు రోజులు గడువు ఇవ్వాలి. -ఫార్మేట్–2 తెల్లరేషన్ కార్డు లేని తల్లులు, సంరక్షకుల వివరాలతో కూడిన విద్యార్థుల జాబితా ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు పరిశీలించి గ్రామ సచివాలయం లాగిన్‌కు ఈ నెల 24వ తేదీలోగా పంపాలి. -ఫార్మేట్–3 ఆధార్ నంబర్/ఈఐడీ నంబర్ లేని విద్యార్థుల జాబితా సేకరించడం కోసం ఉపయోగించాలి. ప్రధానోపాధ్యాయుల ద్వారా అందిన ఫార్మేట్–2, ఫార్మేట్–3వ లను విద్య సంక్షేమ, సహాయకునికి గ్రామవలంటీర్లు అందజేయాలి. -గ్రామ వలంటీర్లు ఆ సమాచారాన్ని కుటుంబాలకు వివరించి... సమాచారంలో లేని తల్లుల పేర్లు, రేషన్ కార్డు వివరాలు ఆధార్ కార్డు నంబర్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ వివరాలు సేకరించాలి. కుటుంబాలు అర్హత కలిగిన వారు అవునో కాదో ఆరు అంచెల పరిశీలన ద్వారా ధ్రువీకరించుకోవాలి. సమాచార సేకరణ గ్రామ వలంటీర్ల ద్వారా ఈ నెల 25 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు చేపట్టాలి. -సేకరించిన సమాచారాన్ని తిరిగి ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. ఆ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు ఏపీసీఎఫ్ఎస్ఎస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. -ముసాయిదా జాబితా సిద్ధం చేసేటప్పటికీ 75 శాతం హాజరు ఉన్నది లేనిదీ పరిశీలించాలి. 75 శాతం హాజరు లెక్క కట్టేటప్పుడు వీలైనంత విద్యార్థి పక్షంగా ఉండాలి. -వచ్చేనెల 9వ తేదీన గ్రామ సచివాలయంలో జాబితా ప్రకటించాలి. అభ్యంతరాలపై గ్రామస్తులకు వచ్చే నెల 13 వరకు గడువు ఇవ్వాలి.వచ్చేనెల 15 నుంచి 18వ తేదీ లోగా గ్రామసభలో జాబితాను ప్రకటించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. -ఆమోదించిన జాబితా వచ్చేనెల 20వ తేదీ నాటికి ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారికి అదే నెల 23వ తేదీలోగా అందజేయాలి. ∙ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేసినప్పుడు పేరెంట్స్ కమిటీని తప్పకుండా సంప్రదించాలి. జిల్లా స్థాయిలో హెల్త్‌లైన్ సెంటర్: ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం అర్హులను క్రోడీకిరించే ప్రక్రియలో ఎలాంటి సందేహాలు వచ్చినా ప్రధానోపాధ్యాయు లు సంప్రదించుకోవడానికి జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్ సెంటర్‌ని ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు సందేహాలను సత్వరమే నివృత్తి చేసుకోవడానికి ఫోన్: 9440011576, 8008686988 నంబర్లను సంప్రదించాలి. – జి.నాగమణి, డీఈఓ -
తట్టుకోలేక తగువు..!
అధికారంలో ఉన్నన్నాళ్లూ వారు చెప్పిందే వేదం. వారి మాటే శాసనం. అధికార బలంతో అక్రమాలు, అవినీతికి అలవాటు పడ్డారు. ప్రజాధనాన్ని లూటీ చేశారు. వీరికి ఓటు రూపంలో జనం బుద్ధి చెప్పారు. అయినా వారిలో మార్పు రాలేదు. నాటి జులుంనే నేడూ ప్రదర్శిస్తున్నారు. ప్రశాంతమైన పల్లెల్లో తగువుల చిచ్చురేపుతున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై తెగబడుతున్నారు. తిరిగి కేసుల్లో ఇరికిస్తున్నారు. సభ్యసమాజం ఛీత్కరిస్తున్నా వారి నైజం మారకపోవడం, శాంత్రిభత్రలకు విఘాతం కల్పించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నాటి నుంచి జిల్లాలో టీడీపీ శ్రేణులు అవమానభారంతో అనవసర తగవులకు దిగుతున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ కార్యకర్తను హత్యచేశారు. తాజాగా చీపురుపల్లి, గజపతినగరం, సాలూరు నియోజక వర్గాల్లో వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. తిరిగి వారిపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తప్పుడు కేసులు పెట్టారు. దీనికోసం పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. టీడీపీ పెద్దల డైరెక్షన్లోనే ఈ తతంగమంతా సాగుతోంది. గ్రామ స్థాయిలో ఘర్షణలు సృష్టించి, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం వల్లనే ప్రశాంత వాతావరణం కరువైందనే భావాన్ని ప్రజల్లో కలిగించాలన్న లక్ష్యంతో గొడవలు సృష్టిస్తున్నారు. ఇరువర్గాలపైనా కేసులు నమోదయ్యేలా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జనాన్ని వెంటాడుతున్న దాడుల భయం.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాచిపెంట మండలంలోని పి.కోనవలస, మోసూరు గ్రామాల్లో ఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. పి.కోనవలసలో జరిగిన ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త కరణం రాజు కుటుంబం దెబ్బలతో తప్పించుకున్నారు. మోసూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త గండిపల్లి తవుడును టీడీపీ వర్గీయుడు హతమార్చారు. ఈ కేసు విచారణలో ఉంది. మెం టాడ మండలంలోని తమ్మిరాజుపేటలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయుకులు దాడిచేసి గాయపరిచారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రెండువర్గాల వారూ గాయాలపాలయ్యారు. పైపెచ్చు ముగ్గురు బాధితులపై ఆండ్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఇరువర్గాలపైనా కేసు నమోదు చేసి ఇరువర్గాలకు చెందిన 30 మందిపై బైండోవర్ నమోదు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. మెరకముడిదాం మండలం భగీరథపురంలో అక్టోబర్ 30వ తేదీన కంచెమ్మతల్లి జాతర సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా జరిగిన వివాదంలో టీడీపీ నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకులపై చేసిన దాడిలో వైఎస్సార్ సీపీకి చెందిన గేదెల తిరుపతి గాయపడ్డాడు. దీంతో ఇరువర్గాల వారు తోపులాటకు దిగారు. దీంతో ఇరుగువర్గాలను చెదరగొట్టిన బుదరాయవలస పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలైన గేదెల తిరుపతి, గేదెల రాము, జమ్ముకృష్ణ, చిట్టిజన, చందక రాము, గేదెల రామ్మోహనరావులపైన, టీడీపీ నాయకులైన పల్లి లక్ష్మణ, పల్లి సింహాచలం, పల్లి చిన్నంనాయుడు, పల్లి గౌరినాయుడు, చిట్టిరాములపై 354–బి,324, 509, 323, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. గజపతినగరంలో వైఎస్సార్ సీపీ నాయకులు కొండపల్లి కొండలరావుపై తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు భూ వివాదాన్ని సృష్టించి గంట్యాడ పోలీసు స్టేషన్లో కొద్దిరోజుల కిందట ఫిర్యాదు చేశారు. కుట్రలెన్ని చేసినా ప్రజల నుంచి దూరం చేయలేరు.. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూసి టీడీపీ వారు తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలవడం, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తుండడంతో ఓర్వలేకపోతున్నారు. గొడవలను సృష్టిస్తున్నారు. నాయకులు వెనుకను ఉంటూ కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారు. తిరిగి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపైనే పోలీస్ కేసులు పెడుతున్నారు. వారెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో మాకు, మా పార్టీకి ఉన్న ఆదరణను ఏ మాత్రం తగ్గించలేరు. ప్రజల కోసం ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించడమే ధ్యేయంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సహనంతో పని చేస్తున్నారు. ఖాళీగా కూర్చున్న, టీడీపీ వారితో అనవసర గొడవలు పెట్టుకునేంత తీరిక, సమయం మాకులేవు. కావాలని రెచ్చగొడితే మాత్రం వారిపై చట్టపరంగా ముందుకు వెళతాం. –మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త -
అయ్యో.. పాపం పసిపాప..
సాక్షి, బొబ్బిలి: పట్టణంలోని పోలవానివలస సమీపంలోని ఓ కాలువలో గురువారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఓ ఆడపిల్ల మృతదేహం తేలియాడుతుండడం కలకలం సృష్టించింది. ఎవరో ఇక్కడకు సంచిలో తీసుకువచ్చి బిడ్డను కాలువలో విసిరేసి సంచి పక్కన పడేసి తేలిగ్గా వెళ్లిపోయింది. దీంతో ఆ పసికందు నీటిలో కొట్టుకుంటూ ఊపిరాడక మృతి చెందింది. దీంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. ఎవరికి ఏ కష్టం వచ్చిందో చిన్నారిని ఇలా కాలువలో పడేశారని వాపోయారు. ఒకటి,రెండు రోజుల్లోనే..! కాలువలో తేలియాడుతున్న ఆడబిడ్డను చూసిన వారు ఒకటి, రెండు రోజుల్లోపే జన్మించి ఉంటుందని చెబుతున్నారు. మృతదేహం ఉబ్బకపోవడాన్ని బట్టి పుట్టిన వెంటనే కాలువలో పడేసి వెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్లిప్పు ఆధారమవుతుందా..? శిశువు బొడ్డును కత్తిరించినపుడు ఆస్పత్రుల్లో క్లిప్ పెడతారు. సెప్టిక్ కాకుండా, గాలి వెళ్లకుండా భద్రత కోసం పెట్టిన క్లిప్పుతోనే బిడ్డను నీటిలో పడేసి వెళ్లిపోయిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడా క్లిప్పు ఆధారంగా కేసు దర్యాప్తు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీని ఆధారంగా ఆస్పత్రులను పరిశీలించి ఆ కర్కశ తల్లిదండ్రులను పట్టుకుని శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించిన పోలీస్, ఐసీడీఎస్ సిబ్బంది.. బొబ్బిలి ఐసీడీఎస్ కార్యాలయాల ఎదురుగానే ఆడ శిశువును కాలువలో పడేశారని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మా పరిధిలో బాలింతలు లేరని ఐసీడీఎస్ సిబ్బంది అంటుండగా.. కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. వదిలిపెట్టం.. ఇది హేయమయిన సంఘటన.. చిన్నారిని కాలువలో విసిరేసిన ఎవ్వరైనా వదిలి పెట్టేదిలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచారిస్తాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – వి. ప్రసాదరావు, ఎస్సై, బొబ్బిలి -
స్తంభం ఎక్కేద్దాం... కొలువు కొట్టేద్దాం..
సాక్షి, విజయనగరం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొలువుల జాతర కొనసాగుతోంది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న గ్రామ సచివాలయాల వ్యవస్థలో విద్యుత్ శాఖ తరఫున సేవలందించే జూనియర్ లైన్మెన్ల నియామక ప్రక్రియ నిఘా నీడలో మంగళవా రం ప్రారంభమైంది. విజయనగరం దాసన్నపేట విద్యుత్ భవనం ప్రాంగణంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ వై.విష్ణు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎంపికల్లో మొదటి రోజు 92 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 528 పోస్టుల భర్తీకి నిర్వహిస్తోన్న ఎంపికలకు 1575 మందికి విద్యుత్ శాఖ అధికారులు కాల్ లెటర్లు పంపించారు. ఇందులో మొదటి రోజు 316 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా... 224 మంది మాత్ర మే హాజరయ్యారు. ఎంపికలకు వచ్చిన అభ్యర్థులకు ముందుగా పది, ఐటీఐ, ఇతర అర్హత ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. అనంతరం 8 మీటర్ల విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడిం గ్, సైక్లింగ్ అంశాల్లో అభ్యర్థి వ్యక్తిగతల సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. 5 బ్యాచ్‌లుగా నిర్వహించిన ఎంపికల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసు బందో బస్తు నియమించారు. ఈ ఎంపికల్లో అధిక సంఖ్యలో అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనలో వెనుదిరగగా.. మరికొందరు స్తంభం ఎక్కడంలో విఫలమయ్యారు. పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలన్న సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయగా... విశాఖ కార్పొరేట్ కార్యాలయానికి చెందిన ఏపీఈపీడీసీఎల్ సీజీఎం పీవీ సత్యనారాయణ, డీజీఎం విజయకుమారిలు దగ్గరుండి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అలవాటు లేకుండానే స్తంభం ఎక్కి... విద్యుత్ భవనం ఆవరణలో నిర్వహించిన జూనియర్లైన్మన్ ఎంపికల కోసం విద్యుత్ శాఖ అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఎంపికల్లో కీలకమైన స్తంభం ఎక్కడంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందుస్తు భధ్రతాచర్యలు చేపట్టారు. స్తంభం దిగువ భాగంలో రెండు అడుగుల ఎత్తులో ఇసుక, రంపం పొట్టు వేయడంతో పాటు అభ్యర్థి జారి పడిపోతే పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేశారు. అభ్యర్థి స్తంభం మధ్యలోనే ఉండిపోతే కిందకు దించేందుకు నిచ్చెనెలు సిద్ధం చేశారు. ఈప్రక్రియను ఐదుగురు డివిజన్‌స్థాయి ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే, చాలా మంది అభ్యర్థులు ఉద్యోగం ఆశతో తమకు అలవాటు లేకుండానే స్తంభం ఎక్కి పాట్లు పడ్డారు. టెస్ట్ కోసం పోల్ ఎక్కిన దుర్గా ప్రసాద్ అనే అభ్యర్థి కాలు జారీ పోల్ మీద నుంచి కింద పడిపోయాడు. సుమారు 8 మీటర్ల ఉండే పోల్ ను అభ్యర్థులు ఎక్కాల్సి ఉంటుంది. అదే క్రమంలో పోల్ ఎక్కుతున్న నెల్లిమర్ల జరజాపుపేటకు చెందిన దుర్గా ప్రసాద్ 6 మీటర్ల ఎత్తులో వెళ్లేసరికి ఒక్కసారిగా చేతులు జారీ కింద పడిపోయాడు. నడుముకి గాయమైంది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు అభ్యర్థిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. స్తంభం ఎక్కడం వచ్చి ఉండాలి.. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో 528 జేఎల్ఎం పోస్టుల నియామకాలకు సంబంధించి నిర్వహిస్తోన్న ఎంపికల్లో అభ్యర్థులకు తప్పనిసరిగా స్తంభం ఎక్కడం వచ్చి ఉండాలి. సామర్థ్యం లేనివారు ఎంపికలకు హాజరుకాకపోవడం మంచిది. కోరుండి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. ఐదురోజుల పాటు జరిగే ఎంపికలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం. వీడియో చిత్రీకరణ జరుగుతుంది. కార్పొరేట్ కార్యాలయం నుంచి వచ్చిన ఉన్నతాధికారులు ఎంపికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బుధవారం నుంచి ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుంది. – యాగంటి విష్ణు, ఎస్ఈ -
ఆశల పల్లకి
విజయనగరం... మొదటినుంచీ వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన జిల్లా. గత ప్రభుత్వ హయాంలో ఆ ముద్ర కాస్తా మరింత ఎక్కువైంది. ఇక్కడి అభివృద్ధిని పూర్తిగా పడకేయించారు. విభజన హామీలతో జిల్లాకు రావాల్సిన అవకాశాలను వదిలేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం విడుదలైన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేశారు. తాజాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అసలు అభివృద్ధి అంటే ఏమిటో జిల్లావాసులు తెలుసుకుంటున్నారు. ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు జిల్లాకు చెందిన మంత్రులతోపాటు... ఇన్చార్జి మంత్రి శుక్రవారం రానున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పూర్తిగా వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథాన పయనింపజేయడానికి పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండగా కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సింది గా అధికారులను ఆదేశించారు. మంత్రులు సైతం జిల్లాను ప్రత్యేకంగా చూస్తున్నారు. జిల్లాలోని సమస్యల్ని పరి ష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాల్సి ఉం ది. ఈ క్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించనున్న సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలపై జిల్లావాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. విజయనగరం రోడ్ల విస్తరణ అస్తవ్యస్తం.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరిట టీడీపీ పాలకవర్గం హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 50 కోట్లతో 15 రోడ్లు విస్తరించేందుకు ప్రతిపాదించింది. అందులో నాలుగు మార్గాల్లో మాత్రమే శతశాతం పనులు పూర్తికాగా మరో నాలుగు రోడ్లలో పనులు చివ రి దశలో ఉన్నాయి. మిగిలిన మార్గాల్లో విస్తరణకోసం భవనాలు తొలగించి వదిలివేయటం తో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. దీనివల్ల నగర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పలు రహదారుల్లో నష్టపోయిన బాధితులకు ఇచ్చిన పరిహారంలో టీడీపీ పాలకవర్గం వివక్ష చూపించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్‌మిల్లులు మూతపడి నాలు గేళ్లవుతున్నా నాటి పాలకులు పట్టించుకోకపోవడంతో సుమారు 12వేల కార్మిక కుంటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. నీటి పథకాలున్నా... ఆయకట్టుకు అవస్థలే... బొబ్బిలి నియోజకవర్గంలో వీఆర్ఎస్ అదనపు ఆయకట్టు ద్వారా 5వేల ఎకరాలకు సాగునీరందించాలని తలపెట్టిన పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే విడిచిపెట్టేశారు. పాత ఆయకట్టులోని కాలువలను మరమ్మతు చేయకపోవడం, పూడికలు తీయకపోవడం వల్ల రైతులు శ్రమదానం చేసుకోవాల్సి వస్తోంది. గ్రోత్‌సెంటర్‌లో 1240 ఎకరాల ఏపీఐఐసీ భూములను కంపెనీలు ఏర్పాటు చేస్తామని రైతుల వద్ద అతి చౌకగా కొనుగోలు చేసినవారు ఇప్పుడు వాటి చుట్టూ ప్రహారీ నిర్మించి స్థలాలను సొంతం చేసుకున్నారు తప్ప పరిశ్రమలు మాత్రం ఏర్పాటు చేయలేదు. రోగాల జోన్‌గా సాలూరు.. సాలూరు ప్రాంతంలో ఆరోగ్యపరంగా రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది జిల్లాలోనే అధికంగా 28 డెంగీ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. అనధికారికంగా వందకు పైగా డెంగీ కేసులుండవచ్చు. గురుకులాల్లో నేటికీ విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, యూనిఫాం రాలేదు. గురుకులాలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. వెంగళరాయ సాగర్ అక్విడెక్టు, ఆండ్ర, వెంగళరాయిసాగర్, పెద్దగెడ్డ ఆధునికీకరణ, పెద్దగెడ్డ ఎడమకాలువ పనులు చేయాల్సి ఉంది. గిరిశిఖర గ్రామాల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలి. చీపురుపల్లిలో ఇందిరమ్మ సుజలధార పథకం పైప్లైన్లు శిథిలమయ్యాయి. దీనివల్ల నిత్యం లీకులతో పట్టణానికి సక్రమంగా సాగునీరు అందడం లేదు. రహదారుల్లేని గిరిజన ప్రాంతాలు.. కురుపాం నియోజకవర్గంలో ప్రధానంగా రహదారి సౌకర్యాలు వేధిస్తున్నాయి. కొన్ని గిరిశిఖర గ్రామాలకు రోడ్డు ఫార్మేషన్ పనులు చేపట్టినప్పటికీ, మెటల్, తారు రోడ్డు వంటి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేశారు. పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద నిర్మించిన జంఝావతి ప్రాజెక్టు లక్ష్యం నేటికీ పూర్తికాలేదు. ఒడిశాతో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత మహానేత 2006లో రూ.5కోట్లతో రబ్బర్ డ్యాం ద్వారా తాత్కాలికంగా నీటిపారుదల సౌకర్యం కల్పించారు. కానీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. ముఖ్యంగా పూర్ణపాడు–లాబేస్ వంతెన నిర్మాణం జరిగితే కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, గుమలక్ష్మిపురం మండలాల ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది. కష్టాల్లో భీమసింగి.. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం కష్టాల్లో ఉంది. దీనిని ఆధునికీకరణ చేసి, రైతులకు భరోసా కల్పించాల్సి ఉంది. శాసనాపల్లి–పెదవేమలి, అలమండ–జె.డి.వలస మధ్య వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఎస్.కోట, వేపాడ మండలాల పరిధిలోని గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాల్లో చేర్చాలన్న డిమాండ్ ఉంది. చిలకలగెడ్డ ఆనకట్ట నిర్మించడం ద్వారా 2000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వస్తుంది. రైవాడ జలాశయం నుంచి అదనపు ఆయకట్టు 2000 ఎకరాలకు నీరందించే ప్రతిపాదన అమలుకోసం ఎదురు చూస్తోంది. చుట్టూ ప్రాజెక్టులున్నా... సాగు సున్నా... పార్వతీపురానికి సమీపంలోనే జంఝావతి, వరహాల గెడ్డ ఉన్నప్పటికీ సాగునీరు అందక నిత్యం అక్కడ కరువు తాండవిస్తోంది. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో నిత్యం ఎప్పుడు బురదనీరే సరఫరా అవుతోంది. గజపతినగరం నియోజకవర్గానికి సాగునీటి కొరత వేధిస్తోంది. తాగు నీటికి సైతం మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. నెల్లిమర్ల పట్టణాన్ని తాగునీటి సమస్య పట్టిపీడిస్తోంది. పట్టణ జనాభాకు సరిపడినన్ని పథకాలు లేకపోవడం స్టోరేజీ ట్యాంకులు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇబ్బంది కలుగుతోంది. రామతీర్థం, సారిపల్లి గ్రామాలకు సంబంధించిన తాగునీటి పథకాలు చంపావతి నదిలో ఉన్నాయి. నదిలో భూగర్బ జలాలు గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పంచాయితీలకు కూడా తాగునీటి సమస్య ఏర్పడింది. -
అయ్యో..పాపం పసికందు..!
సాక్షి, గజపతినగరం రూరల్: ఏ తల్లి కన్నదో ఆ బిడ్డను. నవమాసాలు మోసి... ప్రసవవేదన అనుభవించి... చివరకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ వారికి బరువైందో... మృతశిశువును కన్నదో... పుట్టిన బిడ్డ ఊపిరాగిందో... లేక ఏ ప్రబుద్ధుడి మోసానికి బలై అన్యాయంగా తల్లిగా మారిందో... కానీ ఓ మగబిడ్డను నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన కాలువలో పడేశారు. నీటిలో తేలియాడితూ పసికందు మృతదేహం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద చిన్న పాటిగా ఉన్న లోతట్టు ప్రాంతంలోని నీటిలో తేలియాడుతున్న ఆ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి మధుపాడ వీఆర్ఓ దాసరి అప్పలరాజుకు సమాచారం అందించారు. ఆయన గజపతినగరం పోలీస్ స్టేషన్‌కు తెలియజేయడంతో సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సన్యాసినాయుడు అక్కడకు చేరుకొని మృతశిశువును పరిశీలించారు. అనంతరం ఆ మృతశిశువును శవపంచనామాకోసం తరలించారు. అయితే ఆ బిడ్డ మృతి చెంది మూడు లేదా నాలుగు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా ఆస్పత్రిలో పరిశీలించిన గజపతినగరం సూపరింటెండెంట్ డాక్టర్ అరుణా దేవి తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. -
రాఖీ కట్టేందుకు వచ్చి...
సాక్షి, పాచిపెంట(సాలూరు): సోదరుడికి రాఖీ కట్టేందుకు అత్తవారింటి నుంచి రాష్ట్రం దాటి వచ్చిన చెల్లెలు అన్న వద్దే అనారోగ్యంతో మృత్యు కౌగిలికి చేరుకుంది. మృతురాలి తోటికోడలు దమయంతి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రం కల్హండి జిల్లా ముఖీగుండికు చెందిన సిల్ పార్వతి (32) తన అన్న గణేష్‌కు రాఖీ కట్టేందుకు సాలూరు పట్టణంలోని బోను మహంతివీధికి ఈ నెల 14న వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఈ నెల 16, 21 తేదీలలో సాలూరు పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతిని విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి ఈ నెల 24న తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మృతి చెందింది. వైరల్ ఫీవర్, డెంగీతో మరణించిందని దయయంతి, మృతురాలి సోదరుడు గణేష్ తెలిపారు. మృతురాలికి భర్త పవిత్రో, పిల్లలు హుస్సేన్, వైష్ణవి ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు మాట్లాడుతూ, పార్వతి మృతికి సంబంధించి వైద్యుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటామని చెప్పారు. బిడ్డకు సైతం.. మృతురాలు పార్వతి కుమారుడు హుస్సేన్ (3) సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పార్వతి మృతదేహాన్ని ఆదివారం ఖననం చేసి హుస్సేన్‌ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు డెంగీ అనుమానిత కేసులు.. ఈ క్రమంలో సాలూరు సీహెచ్‌సీ నుంచి ఆరు డెంగీ అనుమానిత కేసులను విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి దిలీప్‌కుమార్ అన్నారు. సాలూరు పట్టణానికి చెందిన ఎస్.రమాదేవి, హుస్సేన్, పాచిపెంట, సాలూరు మండలాలకు చెందిన జి.రాధ, బి.శ్యామల, యు.సీతారాం, యు.పైడిరాజులను కేంద్రాస్పత్రికి పంపించామన్నారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
కరెంటు కాల్చేస్తున్నారు...
వర్షాకాలం వచ్చేసి అప్పుడే రెండు నెలలవుతోంది. వాతావరణం చల్ల బడి విద్యుత్ వినియోగం తగ్గాలి. కానీ జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. వాతావరణం ఏమాత్రం చల్లబడలేదు. వేసవి పరిస్థితులే కొనసాగుతున్నాయి. దీనివల్ల ఏసీలు... కూలర్లు... వంటివి ఏమాత్రం ఆగట్లేదు. ఫలితంగా విద్యుత్ వినియోగం భారీగానే పెరుగుతోంది. దీనికి తోడు ఆశించిన వర్షాలు లేక వ్యవసాయానికి తప్పనిసరిగా మోటార్లు అధిక సంఖ్యలో వినియోగించడం కూడా మరో కారణం. మొత్తమ్మీద విద్యుత్‌ను హద్దు... పద్దు లేకుండా వాడకంవల్ల కొరత ఏర్పడే ప్రమాదమూ లేకపోలేదు. విజయనగరం మున్సిపాలిటీ: ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగుతోంది. అరకొర వర్షాలతో వాతావరణం నేటికీ చల్లబడలేదు. ఆగస్టులోనూ వేడిమి వేసవిని తలపిస్తోంది. ఉదయం 10 గంటల నుం చి ఎండతో వేడి గాలులు వీస్తున్నాయి. పగలూ, రాత్రీ తేడా లేకుండా అసాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఉక్కపోత ప్రభావంతో కూలర్లు, ఏసీల వినియోగం నేటికీ తగ్గలేదు. దీనివల్ల విద్యుత్తుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అధికారిక లెక్కల ప్రకారం చెప్పాలంటే రోజుకు జిల్లా వాసులు 72 లక్షల యూనిట్లకుపైగా విద్యుత్‌ను విని యోగించేస్తున్నారు. ఈ ఏడాది మండు వేసవి లో 63 లక్షల నుంచి 65 లక్షల యూనిట్లు విద్యుత్వినియోగం కాగా... వర్షాకాలంలో తగ్గుముఖం పట్టాల్సిన వినియోగం అందుకు భిన్నంగా మరో 7 లక్షల యూనిట్లకు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే. మరో వైపు ఆశించిన వర్షాలు లేక వ్యవసాయ విద్యుత్ సర్వీసుల నుంచి డిమాండ్ పెరగటం వల్లే ఇంత మొత్తంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు.. జిల్లాలో ఏటా జూన్, జూలై నెలల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. వాతావరణం చల్లబడి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పడిపోయేవి. ఈ ఏడాది కనిష్ఠంగా 26 డిగ్రీలు, గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోవుతోంది. జూలై నెలలో గరిష్టంగా 37 నుంచి 38 డిగ్రీలు కూ డా నమోదవడం విశేషం. ఉక్కపోత వాతావరణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అం దువల్ల ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. గృహ, వాణిజ్యావసరాల విద్యుత్తు వినియోగం భారీగా నమోదవుతోం ది. వర్షాలు లేక వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. జిల్లాలో ప్రస్తుతం కూరగాయలు, ఉద్యాన పంటలు, కొన్ని ప్రాం తాల్లో నారుమడులు, ఇతర వ్యవసాయ అవసరాలకు కొంతమేర విద్యుత్తు వినియోగిస్తున్నా రు. వ్యవసాయ విద్యుత్తు వాడకం మరో నాలు గు రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మరింత ఒత్తిడి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్.. ప్రస్తుతం జిల్లాలో విద్యుత్తు డిమాండ్ అసాధారణంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 16వ తేదీన 72లక్షల 60వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారు. జిల్లాలో ఉన్న 6.30 లక్షల విద్యుత్ సర్వీసులు ఏపీఈపీడీసీఎల్ సంస్థ మాత్రం 60లక్షల 36 వేల యూనిట్లను మాత్రమే రోజు వారీగా కేటాయిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఉన్న కేటాయింపులకన్నా హెచ్చుగా 12లక్షల 24వేల యూనిట్లను వినియోగించేస్తున్నారన్నమాట. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగించటం ఈ ఏడాదేనన్న అంచనా వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలు, మరల రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో ఎక్కువగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్ కన్నా ఎక్కువ మొత్తంలో కేటాయింపులు ఉండటంతో ఇబ్బందులు ఉం డవన్న ధీమా అధికారుల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో విద్యుత్ సరఫరాకు సంబంధించి మాచ్‌ఖండ్, సీలేరు, సింహాచలం, వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాలు లేవని నిరంతరాయ సరఫరా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. అనధికారిక కోతలు...? విద్యుత్తు అసాధారణ డిమాండ్, వర్షాలు లేకపోవడంతో జిల్లాలో అనధికారిక కోతలు అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. నగరం, జిల్లాలోని పట్టణాల పరిధిలో కొంతమేర నయమే అయినా పల్లె ప్రాంతాల కు విద్యుత్తు సరఫరా చేసే పలు ఉపకేంద్రాల పరిధిలో గంటల తరబడి విద్యుత్తు నిలిపివేస్తున్నారని తెలుస్తోంది. వినియోగం గణనీయంగా పెరిగింది.. జిల్లాలో పొడి వాతావరణం కారణంగా గృహ, వాణిజ్య విద్యుత్తు వినియోగం భారీ గా పెరిగింది. సరఫరాకు ఎలాంటి అంతరాయాలు లేవు. వినియోగం భారీగా నమోదయ్యే ఉపకేంద్రాల సామర్థ్యం పెంచాం. ఎక్కడైనా సరఫరాకు అంతరాయం కలిగి నా వెంటనే పునరుద్ధరిస్తున్నాం. ప్రతి ఒక్క రు కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు వాడుతున్నారు. వినియోగదారులు కోరే డిమాండ్ ను ఎదర్కొనగలిగే సామర్ధ్యం ఉంది. అయి తే వినియోగదారులు అవసరం లేని సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పొదుపు పాటించాలి. –వై.విష్ణు, విద్యుత్ శాఖ ఎస్ఈ, విజయనగరం -
నవ వధువు అనుమానాస్పద మృతి..!
సాక్షి, విజయనగరం: పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవవధువు అనుమానాస్పదంగా ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కొమరాడలో మంగళవారం వెలుగు చూసింది. సౌజన్య అనే యువతికి గత ఏప్రిల్ 16న సొంత బావతో వివాహం జరిగింది. అయితే, మంగళవారం ఉదయం కుంటుంబ సభ్యులు పొలానికి వెళ్లారు. వారు ఇంటికి తిరిగొచ్చేసరికి సౌజన్య విగత జీవిగా పడిఉంది. యువతి కుటుంబీకుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిమిత్తం అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుప్రతికి తరలించారు. -
బడిలో ఉన్నా.. లేనట్టే !
బడిలో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది. అవి అందాలంటే పిల్లల పూర్తి వివరాలు కచ్చితంగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు కావాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా ప్రైవేటు యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. చిన్నపాటి లొసుగుల కారణంగా నమోదు విషయంలో వారు మొండికేస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం దీనిపై ఎందుకో ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నారు. దీనివల్ల పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. విజయనగరం అర్బన్: విద్యార్థుల ఆధార్ అనుసంధాన ఆన్లైన్ వివరాల నమోదు (చైల్డ్ ఇన్ఫో) ప్రక్రియపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ నమోదు జరగకపోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. ఇప్పటికీ ఇంకా సుమారు 30 వేల మంది విద్యార్థుల వివరాల నమోదు పూర్తి కాలే దు. ఫలితంగా చిన్నారులకు ప్రభుత్వ పథకాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ఆధార్‌తో కూడిన వివరాలను చైల్డ్ ఇన్ఫోలో క్రోడీకరిస్తున్నారు. కానీ ప్రైవేటు సంస్థలే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లోనే ఇబ్బందులు.. జిల్లాలో 2019–20 విద్యాసంవత్సరానికి 3,09,139 మంది విద్యార్ధులు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలల్లో చేరాలన్నది లక్ష్యం. తాజా నివేదికల ప్రకారం 2,96,342 మంది నమోదయ్యారు. వీటిలో ఈ ఏడాది నూతనంగా ఒకటో తరగతిలో చేరినవారు 31,500 మంది ఉన్నారు. వీరిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 6 వేల మంది వరకు ఉండగా మిగిలిన తరగతుల్లో 10వేల వరకు చేరారు. ఇందులో 8,479 మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్లినవారు మాత్రం కేవలం 734 మంది మాత్రమే ఉన్నారు. పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను అధార్ నంబర్, తల్లి బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి వివరాలను అనుసంధానంగా చైల్డ్ ఇన్ఫోలో కలపాలి. ఈ ప్రక్రియను విద్యార్థి ప్రవేశించిన తొలి రోజునే ఆయా స్కూళ్ల యాజమాన్యాలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నమోదు నిబంధనలు శతశాతం పాటిస్తున్నారు. కానీ ప్రైవేటు, కార్మొరేట్ విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయం, నవోదయ, సైనిక్ స్కూల్ యాజమాన్యాలు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. విద్యాశాకాధికారులు పటిష్టమైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమన్న వాదన వినిపిస్తోంది. నమోదుపై అశ్రద్ధ అందుకే... ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆ యా యాజమాన్యాలు టీసీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వస్తున్న విద్యార్థులను టీసీ లేకపోయినా చేర్చుకుంటున్నారు. దీనివల్ల చైల్జ్ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు చేర్పడానికి ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. జిల్లాలో 586 ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో గతేడాది చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 98,268 మంది మాత్రమే. కానీ నిజానికి ఆ స్కూళ్ల నుంచి గతేడాది నుంచి నమోదు కావాల్సిన సంఖ్య 25 వేల వరకూ ఉంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో 90 పాఠశాలల వరకు ఉన్నాయి. ఇందులో ఐదు పాఠశాలల్లో 2 నుంచి 10 మందిలోపు విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. వీటిలో 80 శాతం పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి వివరాలైనా నమోదు చేయలేదు. నమోదు లేదంటే విద్యార్థులు పాఠశాలలో లేనట్టే. పథకాలకు దూరమయ్యే ప్రమాదం చైల్డ్ ఇన్ఫోలో వివరాలు లేకుంటే విద్యార్థుల పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని పాఠశాలలకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థి వివరాలు ఉంటేనే పథకం అందుతుంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లుల ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకుంటున్నారు. మరోవైపు స్కూల్ యూనిఫాం దుస్తులకు సంబంధించి కుట్టుకూలి సైతం తల్లుల ఖాతాల్లోకే వేయమన్నారు. ఇలా ప్రతి పథకానికి విద్యార్థుల వివరాలే ప్రామాణికం. చైల్డ్ ఇన్ఫోలో నమోదు తప్పనిసరి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఏ తరగతిలో చేర్చుకున్నా విధిగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సిందే. విద్యార్థి నుంచి టీసీ తీసుకున్న తొలి రోజునే విద్యార్థి ఆధార్, తల్లి బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలతో చైల్డ్ ఇన్ఫోలో పెట్టాలి. ఈ బాధ్య త సంబంధిత పాఠశాల నిర్వాహకులదే. వీటి నమోదు ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం పూర్తయింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంకా 2.5 శాతం చేయాల్సి ఉంది. – జి.నాగమణి, డీఈఓ, విజయనగరం