Vishnu Vardhan
-
‘రెడ్ బుక్ ఎక్కడ? అందరి సంగతి తేలుస్తాం!’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని ఆసరాగా తీసుకుని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. తాము చెప్పిందే వేదం.. చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం.కాగా, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సోమవారం విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు చంద్రబాబును ఎయిర్‌పోర్టులో అడ్డుకుని నిర్భందించిన వారు ఎక్కడున్నారు?. ఇప్పుడు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు?. రెడ్ బుక్ ఏమైంది?. బయటకు తీయాల్సిందే. వారిని కఠినంగా శిక్షించాలి.ఎన్నికల సమయంలో వారి అంతు చూద్దామనుకున్నాను. వారిని దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే కుదరదు. మనం బతికి ఉన్నప్పుడే వారి అంతు చూడాలి. కూటమికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదు. అందరి సంగతి తేలుస్తాం అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ..‘బీజేపీ కార్యకర్తలను గుర్తించాలనే ఆలోచనతోనే నాకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు అన్ని విషయాల్లో కలుగజేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. -
కలెక్టరేట్ ఉద్యోగి.. అలా అవ్వడానికి అసలు కారణాలేంటి?
సాక్షి, సంగారెడ్డి: కలెక్టరేట్ ఉద్యోగి అనుమా నాస్పదంగా మృతిచెందాడు. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. మల్కాపూర్‌లో ఉన్న తెలంగాణ టౌన్ షిప్లో విష్ణు వర్ధన్ (45) నివాసం ఉంటున్నాడు. అడిషనల్ కలెక్టర్ మాధురి వద్ద సీసీగా అతను విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడు నెలల క్రితం అతడి గుండెకు స్టంట్ వేయగా సెలవులో ఉన్నాడు. ఈనెల 28న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం మల్కాపూర్ శివారులో అనుమానాస్పదంగా పూర్తిగా కాలిపోయి శవమై కనిపించాడని వినయ్ వివరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఫైనల్లో విష్ణువర్ధన్ జంట
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీలో భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ విష్ణువర్ధన్–శశికుమార్ ముకుంద్ (భారత్) జంట 6–3, 2–6, 10–8తో మూడో సీడ్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయంపై గెలుపొందింది. -
విష్ణు–బాలాజీ జంట ఓటమి
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ– 250 టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో విష్ణు వర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ల్యూక్ స్మిత్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తమ సర్వీస్‌ను మూడు సార్లు కోల్పోయింది. నేడు సాదియో –ఫాబియన్ (ఫ్రాన్స్); రోహన్ బోపన్న–రామ్ కుమార్ (భారత్) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో రేపు జరిగే ఫైనల్లో ల్యూక్–జాన్ ప్యాట్రిక్ జంట ఆడుతుంది. సుహానా సైనీకి కాంస్యం ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి సుహానా సైనీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్లో శుక్రవారం జరిగిన అండర్–19 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో సుహానా 11–9, 9–11, 10–12, 11–13తో ప్రపంచ నంబర్‌వన్ ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో ఓడింది. -
చాళుక్య వంశ మూలపురుషుడి జన్మస్థలం.. ‘పెద్దముడియం’
జమ్మలమడుగు: ప్రాచీన మధ్య యుగ దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన రాజవంశాలలో చాళుక్యవంశం ఒకటి. బాదామి(వాతాపి) చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కల్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు ఇలా శాఖోపశాఖలుగా దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలను సుదీర్ఘంగా పలించిన చాళుక్య వంశంలో మూల పురుషుడు విష్ణువర్థనుడు. విష్ణువర్థనుడు దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం గురించి వీరచోడుడు వేయించిన చెల్లూరు(తూర్పుగోదావరి జిల్లా) తామ్రా శాసనం వివరిస్తుంది. ఈ శాసనం ప్రకారం చాళుక్యులు అయోధ్యా నగరానికి చెందిన చంద్రవంశరాజులు. వీరి పరంపరలో ఉదయనుడు అనే రాజు తరువాత 59 మంది రాజులు అయోధ్యను పాలించారు. తరువాత ఆ వంశంలోని విజయాదిత్యుడు అనే రాజు దక్షిణ జనపథానికి వచ్చాడు. విజయాదిత్యుడు పల్లవ రాజు త్రిలోచనుడుకి జరిగిన యుద్ధంలో విజయాదిత్యుడు మరణించాడు. విజయాదిత్యుడి భార్య అప్పటికే గర్భవతి. ఆమె ముదివేము అనే అగ్రహారంలో విష్ణుభట్ట సోమయాజి అనే బ్రహ్మణుడి వద్ద ఆశ్రయం పొందింది. ఆమెకు మగ శిశువు జన్మించగా తమకు ఆశ్రయం ఇచ్చిన విష్ణుభట్ట పేరుమీద ఆ రాణి ఆ బాలుడికి విష్ణువర్థనుడు అని పేరు పెడుతుంది. విష్ణువర్థనుడు పెరిగి పెద్దయిన తర్వాత జరిగిన చరిత్రంతా తల్లి ద్వారా తెలుసుకుని చాణ్యు గిరికి వెళ్లి నందాదేవిని ఆరాధించి, కుమార నారాయణ, మాతృగణములను తృప్తి పరచి రాజచిహ్నాలైన శ్వేతా పత్రంలో శంఖము, పంచ మహా శబ్దము జెండా(పాలికేతన) వరాహా లాంఛనములు, పింఛ కుంత(బల్లెము) సింహాసనం మొదలైన వాటిని తీసుకుని కాదంబ, గాంగ రాజులను ఓడించి సమస్త దక్షిణ పథమును ఏలినాడు. ఈ విష్ణువర్థనుడే బాదామి చాణక్యులకు మూల పురుషుడు. చెల్లూరు శాసనంలో ముదివేము నేడు కడప జిల్లాలో ఉన్న పెద్దముడియం అని 1903లో జమ్మలమడుగు తాలూకా డివిజన్ ఆఫీసర్ అయిన శ్రీరామయ్య పంతులు ప్రతిపాదించారు. నేడు కడప జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో పెద్దముడియం మండలకేంద్రంగా కుముద్వతీ (కుందూ)నది తీరాన ఉన్నది పెద్దముడియం. విష్ణు వర్థనుడి తండ్రి విజయాదిత్యుడు యుద్ధం చేసింది త్రిలోచన పల్లవుడితో కాగా పెద్దముడియం ఆగ్రహారాన్ని దానమిచ్చింది కూడా త్రిలోచన పల్లవుడే. పెద్దముడియం శాసనాలలో విష్ణు వర్ధునుడి జన్మ వృత్తాంతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. -
తప్పయిపోయింది మహాప్రభో, క్షమించండి: నటుడు
సాక్షి, హైదరాబాద్: దివంగత నటుడు కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ విష్ణువర్థన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలుగు నటుడు విజయ్ రంగరాజు క్షమాపణలు కోరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్థన్‌ను ఎకవచనంలో సంబోధిస్తు.. అవమానకర రీతిలో పదజాలాన్ని వాడారు. దీంతో కన్నడ ప్రజలు, హీరో విష్ణువర్థన్ అభిమాన సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రంగరాజు ఓ వీడియో విడుదల చేశాడు. మూడు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో రంగరాజు ‘ప్రముఖ సూపర్ స్టార్ విష్ణువర్థన్‌పై నేను చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నా తప్పిదానికి కన్నడ ప్రజలకు, పరిశ్రమ పెద్దలు, నటీనటులకు నా క్షమాపణలు. నాకు తెలుసు నేను పెద్ద పాపం చేశాను. దానికి నేను శిక్షార్షుడిని. కరోనా అని నేను మొహనికి మాస్క్ పెట్టుకున్నాను. కానీ నేను చేసిన పాపానికి నా మొహం చూపించలేక మీ నుంచి చాటేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక మహమ్మారి కాలంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఆ ఆవేశంలోనే తాను ఇలా మాట్లాడనని స్పష్టం చేశాడు. తన తప్పిదానికి విష్ణువర్థన్ అభిమానులు, ఆయన భార్య, కుటుంబ సభ్యులు క్షమించాలని కోరాడు. అంతేగాక కన్నడ సూపర్ స్టార్స్ సుదీప్ కిచాచా, పునీత్ రాజ్‌కుమార్‌లను కూడా మోకాళ్లపై నిలుచుని క్షమాపణలు ఆర్జిస్తూ కన్నీటీ పర్యంతరం అయ్యాడు. ఇక ఆయనతో పాటు తెలుగు సీనియర్ నటుడు, ‘మా’ (మూవీ ఆర్టీస్ట్స్ అసోషియేషన్) అధ్యక్షడు నరేష్ సైతం కన్నడ ప్రజలకు, పరిశ్రమకు క్షమాపణలు చెప్పాడు. కన్నడ స్టార్ హీరో అయిన విష్ణువర్థన్‌పై విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యాలు తనను బాధించాయని, తెలుగు సినీ పరిశ్రమ తరపున కన్నడ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానంటూ నరేష్ ట్విటర్లో వీడియో సందేశం ఇచ్చాడు. ‘విష్ణువర్థన్‌ను రంగరాజు ఏకవచనంలో సంభోదిస్తూ అసభ్య పదజాలం వాడటం సరికాదు. ఇందుకు కన్నడ సోదరి సోదరీమణులను మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. డాక్టర విష్ణువర్థన్ తమిళ, కన్నడ పరిశ్రమలోనే గాక తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనకు నేను కూడా పెద్ద అభిమానిని. అలాంటి ఆయనపై రంగరాజు వ్యక్తిగత అభిప్రాయయం చెప్పినా, అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పే. ఇందుకు ‘మా’ తరపున, తెలుగు సినీ పరిశ్రమ తరపున నేను క్షమాపణలు కోరుతున్నా’ అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. అలాగే ఇకముందు కూడా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటున్నానని, తాను వ్యక్తిగతంగా కూడా రంగరాజుతో మాట్లాడి హెచ్చరిస్తానన్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నటుడు విజయ రంగరాజు కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ విష్ణువర్థన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో కన్నడ పరిశ్రమ, కన్నడ ప్రజలు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అవమానకర రీతిలో పదాలు వాడినందుకు రంగరాజుపై మండిపడుతూ క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఓ సూపర్ స్టార్‌పై విజయ రంగారాజు చేసిన వ్యాఖ్యాలు సరికావని, ఆయనన అనే ముందు ఆయనేంటో తెలుసుకోవాలన్నారు. ఇక ఆయన కన్నడ, తమిళ పరిశ్రమలో ఎలా అడుగుపెడతారో చూస్తామన్నారు. ఇక తన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కితీసుకోని విష్ణువర్థన్ కుటుంబ సభ్యలుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
'కేంద్రాన్ని అడిగి అమరావతిని ఎంపిక చేశారా'
సాక్షి, విజయవాడ : అమరావతితో సంబంధం లేకపోయినా బీజేపీని ముద్దాయి చేయాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయంటూ బీజేపీ ఉపాధ్యాక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో మీడియాలో మాట్లాడుతూ.. ' ప్రభుత్వం వేరు.. బీజేపీ వేరు. అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అమరావతిని ఎంపిక చేయలేదు. రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగానే అమరావతిని కేంద్రం ప్రభుత్వం ఆమోదించింది. ఆరోజు అమరావతిని ఆమోదించినటప్పుడు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు మంచిదా కాదా అనేది తెలుపుకుంటే బాగుండేది. ఇప్పుడు పనిగట్టుకొని కొంత మంది మిడిమిడి జ్ఙానంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అమరావతిపై లేఖలు రాస్తున్నారు. గల్లా జయదేవ్, కేశినేని నాని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పింది. (‘ఆశా కార్యకర్తలపై కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది’) బీజేపీ నేతలు కర్నూల్లో హైకోర్టు పెట్టమని చంద్రబాబును అడిగితే ఆయన మాత్రం అమరావతిలో పెట్టారు. పెడరల్ స్ఫూర్తిని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అమరావతిలో హై కోర్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొంది. రైతుల పక్షాన బీజేపీ నిలబడతుంది.రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులతో చర్చలు జరపాలి. చంద్రబాబు, లోకేష్ జూమ్ లో నేతలతో మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి మాట్లాడాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు పేరుకు వేరైనా.. స్క్రిప్ట్ మాత్రం టీడీపీదే. చంద్రబాబు ఉదయం మాట్లాడిందే సాయంత్రం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు మాట్లాడుతున్నారు. గతంలో మోడీని చంద్రబాబు గో బ్యాక్ అన్నారు.. నేడు కంబ్యాక్ అంటున్నారు. సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టానికి చంద్రబాబు వీల్లేదన్నారు..చిరంజీవి బీజేపీలోకి వస్తామంటే తప్పకుండా స్వాగతిస్తాము. ' అంటూ విష్ణువర్దన్ తెలిపారు. -
క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్ జోడీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్ జోడీకి చుక్కెదురైంది. కోల్‌కతా వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్–అర్జున్ ఖడే జంట క్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 3–6, 4–6తో అభినవ్ షణ్ముగమ్–నితిన్ కుమార్ సిన్హా (భారత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్లో 6–2, 6–0తో విఘ్నేశ్ పెరణమల్లూర్ (భారత్)–లుకాస్ రెనార్డ్ జోడీపై గెలుపొందింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో అనిరుధ్ చంద్రశేఖర్–కలియాంద పూనచా (భారత్) జంట 6–4, 4–6, 10–7తో వినాయక్ శర్మ కాజా–మనీశ్ కుమార్ (భారత్) జోడీపై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. సింగిల్స్ విభాగంలో విష్ణువర్ధన్, గంటా సాయి కార్తీక్ రెడ్డి తొలి రౌండ్లోనే వెనుదిరగగా... వినాయక్ శర్మ కాజా రెండో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. విష్ణువర్ధన్ 7–5, 2–6, 0–3తో నితిన్ కుమార్ సిన్హా చేతిలో, సాయి కార్తీక్ 6–7, 4–6తో లుకాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో వినాయక్‌శర్మ కాజా 3–6, 1–6తో ఐడో సీడ్ ఎరిక్ వాన్‌షెల్‌బోయిమ్ చేతిలో ఓడిపోగా... నాలుగో సీడ్ అర్జున్ ఖడే 6–3, 6–4తో క్వాలిఫయర్ ప్రబోధ్ సూరజ్‌పై, ఏడో సీడ్ ఆర్యన్ 6–3, 6–1తో లుకాస్‌పై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకున్నారు. -
జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలకు విష్ణువర్ధన్, సామియా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాలబాలికల జట్లను ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన ఈ బృందంలో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్ గౌడ్, సామియా ఇమాద్ ఫారూఖీలకు స్థానం లభించింది. ఈ మెగా ఈవెంట్ జూలై 20 నుంచి 28 వరకు చైనాలోని సుజౌలో జరుగుతుంది. మేలో జరిగిన చెన్నై, త్రివేండ్రం ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరచిన బాలబాలికలను ఎంపిక చేసినట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జనరల్ సెక్రటరీ అజయ్ సింఘానియా తెలిపారు. బాలుర విభాగంలో 11 మందిని, బాలికల విభాగంలో 12 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎంపికైన జట్టు జూలై 3 నుంచి 17 వరకు హరియాణాలోని పంచకులలో నిర్వహించే శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. భారత జట్టుకు జూనియర్ చీఫ్ కోచ్‌గా సంజయ్ మిశ్రా వ్యవహరించనున్నారు. మిగతా కోచ్‌లుగా హైదరాబాద్‌కు చెందిన చేతన్ ఆనంద్, అరుణ్ విష్ణు, సయాలి గోఖలే, సచిన్ రాణా, టి.మారన్ ఉన్నారు. -
విష్ణు జంట ఓటమి
సాక్షి, హైదరాబాద్: చెక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ పోరాటం ముగిసింది. చెక్ రిపబ్లిక్లో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో విష్ణువర్ధన్ (భారత్)–నికోలా కాసిచ్ (సెర్బియా) ద్వయం 2–6, 6–4, 8–10తో రెండో సీడ్ డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)–ఇగోర్ జెలానీ (స్లొవేకియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు జంట నాలుగు ఏస్‌లు సంధించి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో ఓడిన విష్ణు జోడీకి 610 యూరోలు (రూ. 47 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
విష్ణువర్ధన్‌కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: నాన్‌చాంగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో అతను తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. చైనాలో బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో విష్ణు 2–6, 3–6తో ఆండ్రూ హారిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ తొలి రౌండ్లో విష్ణువర్ధన్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట 4–6, 5–7తో సాండెర్ ఆరెండ్స్ (నెదర్లాండ్స్)–వీస్‌బార్న్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రామ్‌కుమార్ 6–3, 6–2తో రిగిలె టి (చైనా)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. -
హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అవార్డులు
సాక్షి, హైదరాబాద్: 2017-18 సంవత్సరానికిగాను తెలంగాణకు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, పాస్‌పోర్ట్ జారీలో అవార్డులు లభించాయని రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ పోలీసు వెరిఫికేషన్‌గా తెలంగాణ గుర్తింపు పొందిదన్నారు. ఏ కేటగిరిలో పాస్‌పోర్ట్ జారీలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీసుకు మొదటి స్థానం లభించిందని తెలిపారు. చాలా సంవత్సరాల తరువాత కేటగిరి పాస్‌పోర్ట్ జారీలో మొదటి అవార్డు వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పాస్‌పోర్ట్‌ను తొందరలో జారీ చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సగటున 21 రోజుల్లో పాస్‌పోర్ట్ జారీ చేస్తే.. తెలంగాణలో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తిచేసి పాస్‌పోర్ట్ జారీ చేస్తున్నామని తెలిపారు. పోలీసు వెరిఫికేషన్‌లో కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయన్నారు. ఈ నెల 26న పాస్‌పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
విష్ణు–బాలాజీ జంట ఓటమి
సాక్షి, హైదరాబాద్: సర్బిటాన్ ట్రోఫీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట నిష్క్రమించింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 4–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్ కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో పరాజయం పాలైంది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు జోడీ ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్లో ఒకసారి సర్వీస్ చేజార్చుకున్న భారత జంట రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయింది. క్వార్టర్స్‌లో ఓడిన విష్ణు–బాలాజీ జంటకు 1,630 పౌండ్ల (రూ. లక్షా 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 20 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
విష్ణు–బాలాజీ జోడీకి టైటిల్
చెన్నై: స్వదేశంలో ఈ ఏడాది జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ విష్ణు–బాలాజీ ద్వయం 7–6 (7/5), 5–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో సెమ్ ఇల్కెల్ (టర్కీ)–డానిలో పెట్రోవిక్ (సెర్బియా) జోడీని ఓడించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం మూడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయినప్పటికీ... కీలకమైన సూపర్ టైబ్రేక్‌లో భారత జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ కెరీర్లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన భారత జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్లో యూకీ మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్), టాప్ సీడ్ జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) టైటిల్ పోరుకు అర్హత సాధించారు. సెమీఫైనల్స్‌లో యూకీ 7–5, 6–2తో డక్‌హీ లీ (కొరియా)పై, థాంప్సన్ 6–1, 7–6 (7/5)తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలుపొందారు. -
విష్ణువర్ధన్ జంటకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా నేషనల్ స్కూల్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ టోర్నీ బ్యాడ్మింటన్ ఈవెంట్లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. టోర్నీ చివరిరోజు గురువారం జరిగిన బ్యాడ్మింటన్ బాలుర డబుల్స్‌లో రాష్ట్రానికి చెందిన విష్ణువర్ధన్– నవనీత్ జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో విష్ణు వర్ధన్– నవనీత్ (తెలంగాణ) జంట 23–21, 21–16తో అడ్వీస్– అరవింద్ (కేరళ) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన సాయిచంద్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్య పతక పోరులో సాయిచంద్ 21–13, 21–17తో రోహన్ (మహారాష్ట్ర)పై విజయం సాధించాడు. మరోవైపు అథ్లెటిక్స్‌లోనూ తెలంగాణకు పతకం లభించింది. 400 మీ. పరుగులో శ్రీకాంత్ ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో తెలంగాణకు మొత్తం 5 పతకాలు లభించాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారులను శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్ బాబు అభినందించారు. -
నాన్నను చూసే లాఠీ పట్టా...
సాక్షి ప్రతినిధి, విజయనగరం : వారిది పోలీస్ కుటుంబం... తండ్రి ఉన్నతాధికారి కావడంతో చిరు ప్రాయం నుంచి ఖాకీ దుస్తుల మధ్య పెరిగారు... లాఠీలతో ఆడుకున్నారు... పెరిగి పెద్దయ్యాక ఇటు సోదరుడు... అటు భర్త కూడా అదే శాఖలో ఉన్నత స్థానాల్లో ఉండటంతో సమాజంలో ఆ విభాగానికి ఉన్న గుర్తింపు ఏమిటో తెలుసుకున్నారు. దాని ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేయగలమని గుర్తించారు. అదే ఆమెలో పోలీస్ అధికారి కావాలన్న కోరికకు ప్రేరణగా నిలిచాయి. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. అసాధారణమైన గ్రేహౌండ్స్ కమాండంట్‌గా రాటుదేలారు. ఇప్పుడు పార్వతీపురం ఏఎస్పీగా కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆమే దీపికా ఎం పాటిల్. ఆంధ్రాలో పుట్టి ఝార్ఖండ్‌లో స్థిరపడిన తెలుగు పోలీస్ కుటుంబానికి చెందిన ఆమెతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి: దీపిక ఎం పాటిల్. మీ పేరులోనే వైవిధ్యం కనిపిస్తోంది? దీపిక: మా నాన్న మండవ విష్ణు వర్ధన్.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సమీపంలోని కృష్ణా జి ల్లా ఆమదాలలంక గ్రామంలో పుట్టారు. నాన్నవాళ్లది వ్యవసాయ కుటుంబం. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌ల మీదే ఆధారపడి చదువుకుని ఐపీఎస్ సాధించారు. నా భర్త విక్రాంత్ పాటిల్ 2012 తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం విజయనగరం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. మాది ప్రేమ వివాహం. నాన్న ఇచ్చిన ఇంటిపేరును అలానేఉంచేసి దాని పక్కన నా భర్త ఇంటిపేరుని చేర్చుకున్నాను. అందుకే దీపిక ఎం పాటిల్‌గా స్థిరపడ్డాను. సాక్షి: బాల్యం, విద్య, కుటుంబ విశేషాలు? దీపిక: మాది పోలీసు కుటుంబం. నాన్న ఆంధ్రాలో పుట్టినప్పటికీ వృత్తిరీత్యా ఝార్ఖండ్‌లో స్థిరపడటంతో అక్కడే నా బాల్యం ప్రారంభమయ్యింది. నాన్నకు ఏటా బదిలీ అవుతుండటంతో తరచూ మేము కూడా ఆయనతో పాటు అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఝార్ఖండ్‌లో ప్రారంభమైన విద్యాభ్యాసం నాన్న బదిలీ ప్రాంతాల్లో కొనసాగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు 13 స్కూళ్లు మారాల్సివచ్చింది. రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. సాక్షి: ఆంధ్రాలో గ్రేహౌండ్స్ కమాండర్‌గా ఎలా మారారు? దీపిక: మా అమ్మానాన్న నన్ను ఎంతో క్రమ శిక్షణతో పెంచారు. నాన్న ఉద్యోగ విధుల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ అమ్మ పోస్టు గ్రాడ్యూయేట్ కావడంతో నన్ను బాగా చదివించేది. ఆడపిల్లలంటే కేవలం పెళ్లి వస్తువుగా నేటి సమాజం చూస్తోంది. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని భావించేవాళ్లే ఎక్కువ. కానీ మా ఇంట్లో ఆ పరిస్థితి లేదు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే భావనతో నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. 2013లో సివిల్స్ రాశాను. మొదటి ప్రయత్నంలోనే 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యాను. గ్రేçహౌండ్స్ కమాండర్‌గా మొదటి సారిగా పనిచేసే అవకాశం లభిం చింది. నాన్న, అన్నయ్య, భర్త ఐపీఎస్‌లే కాబట్టి పోలీసుల విధులు ఏ విధంగా ఉంటాయి, సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారో దగ్గరగా చూసేదాన్ని కాబట్టి గ్రేహౌండ్స్ కమాండర్‌గా పెద్ద కష్టమేమీ అనిపించలేదు. నాన్న ఆంధ్రాలో జన్మించారు కాబట్టి ఆంధ్రాలో పనిచేయాలనుకునేవారు. ఆయన కోరిక నా ద్వారా తీరింది. సాక్షి: చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారు? దీపిక: నేటి యువత శక్తివంతమైనది. యువత సాధించలేనిది ఏదీ లేదు. క్షణికావేశంలో తప్పటడుగులు వేస్తూ తప్పుడు నిర్ణయాలతో తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారే తప్ప భావిభారతావనికి అవసరమైన పౌరులుగా తయారు కావడం లేదు. దేశం మనకేమిచ్చింది అనే కంటే దేశం కోసం మనం ఏం చేశామని ఆలోచించే వారు చాలా తక్కువ. దేశం గర్వించదగ్గ పౌరులుగా యువత తయారు కావాలి. సాక్షి: ఐపీఎస్‌ను ఏరికోరి పెళ్లిచేసుకోవడానికి కారణం? దీపిక: అన్నయ్య హర్షవర్ధన్, విక్రాంత్ పాటిల్ మంచి స్నేహితులు. తరచూ అన్నయ్యతో కలసి ఆయన రావడంతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇరువురి ఇష్టాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు మా వివాహం జరిపించారు. సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలకు సేవచేసే భాగ్యంతో పాటు వ్యవస్థను అదుపులో ఉంచే అధికారం కూడా మనకు ఉంటుందని నాన్న తరచూ చెబుతుండేవారు. నాన్న చెప్పిన మంచి మాటలు, ప్రజలకు పోలీసు వ్యవస్థ ద్వారా ఆయన చేస్తున్న సేవలు చూసి ఐపీఎస్ అంటే ఇష్టం ఏర్పడింది. సాక్షి: సరదాలు, సంతోషాలు? దీపిక: చిన్నప్పుడు అమ్మా, నాన్న ఆట విడుపుకోసం గుర్రపు స్వారీకి నన్ను తీసుకెళ్లేవారు. అది అలవాటుగా మారింది. గుర్రపు స్వారీ చేయడం ఎంతో ఇష్టం. స్విమ్మింగ్, టెన్నిస్ ఆడడం కూడా ఇష్టం. అలాగే పెయింటింగ్స్ వేయడం, మంచి పుస్తకాలను చదవడం అలవాటు. జంక్ఫుడ్స్, పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీం వంటివి ఎక్కువగా తింటుంటాను. చాక్లైట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం. పింక్ కలర్ ఇష్టం. ఆ రంగు దుస్తులు మహిళలకు ఎక్కువ అందాన్నిస్తాయి. చిన్నతనంలో సినిమాలు చూసేదాన్ని, కానీ సినిమాల్లో ప్రజలకు ఉపయోగకరమైన అంశాలకంటే అనవసరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని చూసి యువత చెడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఒకటి , రెండు తప్ప మిగతా సినిమాలన్నీ కామెడీ, ద్వంద్వ అర్థాలతో ఉన్న సినిమాలే కాబట్టి చూడాలనిపించడం లేదు. -
‘పసిడి’ పోరుకు విష్ణు జోడీ
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో విష్ణువర్ధన్–ప్రార్థన తొంబారే (భారత్) ద్వయం 7–6 (7/4), 7–6 (8/6)తో సన్జార్ ఫెజీవ్–ఆరీనా ఫోల్ట్స్ (ఉజ్బెకిస్తాన్) జోడీపై నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో నటనన్ కద్‌చాపనాన్–నిచా లెర్ట్‌పితాక్‌సిన్‌చాయ్ (థాయ్‌లాండ్) జంటతో విష్ణు–ప్రార్థన ద్వయం తలపడుతుంది. మరోవైపు షార్ట్ కోర్స్ స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో సజన్ ప్రకాశ్ రజత పతకాన్ని సాధించాడు. మహిళల బెల్ట్ రెజ్లింగ్‌లో దివ్య (70 కేజీలు), ప్రతీక్ష (75 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. బిలియర్డ్స్ ఈవెంట్లో సౌరవ్ కొఠారి ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో సౌరవ్ 3–0తో థవత్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. -
విష్ణు జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్ (భారత్)–తొషిహిదె మత్సుయ్ (జపాన్) జోడీ 7–6 (7/3), 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎవ్‌గెని కర్లోవ్‌స్కీ–తుర్నెవ్ (రష్యా) జంటపై గెలిచింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు ద్వయం ఎనిమిది ఏస్‌లు సంధించింది. రెండు జోడీలు తమ సర్వీస్‌ను ఒక్కోసారి కోల్పోయాయి. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో విష్ణు జోడీదే పైచేయిగా నిలిచింది. ఈ సీజన్లో విష్ణుకిది రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గత నెలలో భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి అతను ఫెర్గానా ఓపెన్ టైటిల్‌ను గెలిచాడు. మరోవైపు అమెరికాలో జరుగుతున్న న్యూపోర్ట్ ఓపెన్ టోర్నీ సెమీఫైనల్లో లియాండర్ పేస్ (భారత్)–సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జంట 6–4, 6–7 (6/8), 9–11తో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
విష్ణుకు మరో డబుల్స్ టైటిల్
త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడి సత్తా చాటింది. త్రివేండ్రంలో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–3, 7–5తో జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)–హాంగ్ కిట్ వాంగ్ (హాంకాంగ్) జంటపై గెలుపొంది విజేతగా నిలిచింది. విష్ణువర్ధన్ కెరీర్లో ఇది 33వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. మరోవైపు సింగిల్స్ సెమీఫైనల్లో విష్ణువర్ధన్ 3–6, 2–6తో శ్రీరామ్ బాలాజీ చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–0, 6–3తో దల్వీందర్ సింగ్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నాడు. -
రన్నరప్ విష్ణువర్ధన్ జోడి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ కోర్టులో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–2, 4–6, 6–10తో రెండో సీడ్ ‘సూద్’ బ్రదర్స్ చంద్రిల్– లక్షిత్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–4, 6–4తో సామి రెన్‌వెన్ (జర్మనీ)పై, శ్రీరామ్ బాలాజీ 4–6, 6–3, 7–5తో కరుణుదయ్ సింగ్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. -
ఫైనల్లో విష్ణువర్ధన్ జోడీ
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచాడు. కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన సెమీస్‌లో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ జంట 7–6 (7/3), 6–0తో అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్ (జర్మనీ) జోడీపై గెలిచింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ‘సూద్ బ్రదర్స్’ చంద్రిల్–లక్షిత్ జంటతో విష్ణువర్ధన్ జోడీ తలపడుతుంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో విష్ణువర్ధన్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో విష్ణు 7–6 (9/7), 5–7, 3–6తో సామి రెన్‌వెన్ (జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
సెమీస్‌లో విష్ణువర్ధన్ జోడీ
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ నిలకడగా రాణిస్తున్నాడు. కర్ణాటక స్టేట్ లాన్‌టెన్నిస్ అసోసియేషన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకున్న విష్ణువర్ధన్... సింగిల్స్‌లో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 7–5, 6–1తో జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)–హాంగ్ కిట్ వాంగ్ (హాంకాంగ్) జంటపై గెలుపొందగా... అనిరుధ్–విఘ్నేశ్ జోడీ∙(భారత్) 5–7, 3–6తో అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్ (జర్మనీ) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ విష్ణువర్ధన్ 6–2, 6–1తో భారత్‌కే చెందిన దక్షిణేశ్వర్ సురేశ్‌పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ 6–2, 7–5తో సిద్ధార్థ్ విశ్వకర్మపై గెలుపొందగా... రిషబ్ అగర్వాల్ 4–6, 4–6తో హాడిన్ బావా (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్
భిలాయ్ (ఛత్తీస్‌గఢ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టోర్నీలో హైదరాబాద్ ఆటగాడు విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బీఎస్పీ టెన్నిస్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మూడో సీడ్ విష్ణువర్ధన్ 6–1, 6–0తో భారత్‌కే చెందిన విజయంత్ మలిక్‌పై విజయం సాధించాడు. మరోవైపు డబుల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ జోడి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ– విష్ణువర్ధన్ ద్వయం 7–6 (7/3), 6–2తో మోహిత్ మయూర్–నికి కలియండ (భారత్) జంటపై నెగ్గింది. గురువారం జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సిద్ధార్థ్ రావత్‌తో విష్ణువర్ధన్ తలపడతాడు. ఇతర సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–2, 6–3తో మోహిత్ మయూర్‌పై, సిద్ధార్థ్ రావత్ 6–1, 6–0తో శివదీప్ కొసరాజుపై, శశికుమార్ ముకుంద్ 7–5, 6–4తో తేజస్‌పై, సిద్ధార్థ్ విశ్వకర్మ 4–6, 6–3, 6–1తో రిషబ్ అగర్వాల్‌పై గెలుపొందారు. డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో కునాల్ ఆనంద్–అన్విత్ బింద్రె జోడి (భారత్) 6–2, 6–1తో ఆర్యన్– శశికుమార్ ముకుంద్ (భారత్) జంటపై నెగ్గి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. -
హ్యాట్రిక్ ప్లాన్‌లో హిట్ కాంబినేషన్
వరుస బ్లాక్ బస్టర్లతో కోలీవుడ్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరో అజిత్.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్లను రిపీట్ చేస్తూ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఆ ప్రాజెక్ట్ మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు అజిత్. గతంలో తనకు వీరం, వేదలం సూపర్ హిట్స్‌ను అందించిన శివ దర్శకత్వంలో ప్రస్తుతం వివేగం సినిమా చేస్తున్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుండగా తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు అజిత్. తనతో బిల్లా, ఆరంభం సినిమాలను తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు అజిత్. మాస్ హీరోగా ఉన్న అజిత్‌ను స్టైలిష్ లుక్‌లో చూపించిన విష్ణువర్ధన్, మరోసారి అజిత్ కోసం డిఫరెంట్ సబ్జెక్ట్‌ను రెడీ చేశాడట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ చోళ రాజుగా నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వివేగం షూటింగ్లో బిజీగా ఉన్న అజిత్ నుంచి త్వరలోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఫేక్ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండండి
ఖాతాలో డబ్బులు కాజేస్తారు - స్టేట్‌బ్యాంక్ మేనేజర్ విష్ణువర్ధన్ కంబదూరు : పాత రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రజలు గందరగోళంగా ఉన్నారు. పాత నోట్లను మార్చుకునే పనిలో జనం బిజీబిజీగా ఉన్నారు. దీనిని కొంతమంది హాకర్లు అదునుగా చేసుకుని చెలరేగి పోతున్నారు. ఇలాంటి తరుణంలో ఖాతాదారులు వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండి డబ్బులను కాపాడుకోవాలని కంబదూరు స్టేట్‌బ్యాంక్ మేనేజర్ విష్ణువర్ధన్ సూచించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గత మూడు రోజులుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి పాత నోట్లు రద్దయిన వాటి స్థానంలో కొత్త నోట్లు వస్తున్న తరుణంలో మీ బ్యాంక్‌కు సంబం«ధించిన వివరాలు కావాలని అడుగుతారు. తర్వాత మీ ఎంటీఎం మొదటి ఆరు నంబర్లు చెప్పి, మీపేరు చెబుతారు. ఈ అకౌంట్ నంబర్ మీదైతే మిగిలిన నంబర్లు, మీ సీక్రెట్ పిన్ నంబర్ చెప్పాలంటారు. దీంతో మనం కొత్త నోట్ల హడావుడిలో మీ వివరాలు చెప్పామంటే వెంటనే ఖాతాలోని డబ్బులను మాయం చేస్తారు. కాబట్టి ఫేక్ఫోన్ కాల్స్ వల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా బ్యాంక్ అధికారులు మీ సిక్రెట్ వివరాలు ఎప్పుడూ అడగరు ఈ విషయాన్ని ఖాతాదారులు దృష్టిలో ఉంచుకోవాలి.