wedding invitation
-
సైబర్ నేరగాళ్ల ‘పెళ్లి పిలుపులు’!
సాక్షి, హైదరాబాద్: సీజన్‌కు అనుగుణంగా సైబర్ కేటుగాళ్లు కొత్త పంథాలో మోసాలకు తెరదీస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇదే అంశాన్ని వారికి అనుగుణంగా మల్చుకుని కొత్త దందా మొదలుపెట్టారు. వాట్సాప్ మెసేజ్‌లలో పెళ్లి పత్రికల పేరుతో ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్స్‌ను క్రియేట్ చేసి పంపుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి ఆహ్వాన పత్రికల పేరిట ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. ఇలాంటి ఫైల్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్వేర్ మన ఫోన్లో ఇన్స్టాల్ అవడంతోపాటు మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్ల జాబితా సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. దీంతో ఫోన్‌ను హ్యాక్ చేసి వారి చేతుల్లోకి తీసుకుంటారని, తర్వాత మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టడం..డబ్బుల కోసం డిమాండ్ చేయడం వంటి ప్రమాదాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. వాట్సాప్‌తోపాటు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల ఖాతాల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లింకులు, ఏపీకే ఫైల్స్ వేటిపైనా క్లిక్ చేయవద్దని సూచించారు. ఒక వేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు. -
వైరల్ వీడియో: అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మజాకా?
-
నా పెళ్లికి రండి.. టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి ఆహ్వానం (ఫోటోలు)
-
ఐసీడీఎస్ వారి పెళ్లిపిలుపు
సాక్షి, కామారెడ్డి: ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బాలికను మహిళా శిశు సంక్షేమ శాఖ అక్కున చేర్చుకుంది. కామారెడ్డిలోని బాలసదనంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించింది. ఆమెకు యుక్త వయసు రావడంతో అన్నీ పరిశీలించి, సంబంధం కుదిర్చారు. జిల్లా అధికారులే పెళ్లి పెద్దలుగా మారి ఆమెను పెళ్లిపీటలు ఎక్కించబోతున్నారు. ఈ అపురూప సన్నివేశం సోమవారం సదాశివనగర్ మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో సోమవారం ఆవిష్కృతం కాబోతోంది. అలా జత కలిసింది.. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి అనాథలయిన రూప, ఆమె చెల్లెలిని ఐసీడీఎస్ అధికారులు చేరదీసి, బాలసదనంలో చేర్పించారు. రూప పదో తరగతి పూర్తి చేశాక మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు చదివించారు. ఇటీవలే కోర్సు పూర్తి చేసింది. రూప చెల్లెలు ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సు చదువుతోంది. ఇదే సమయంలో ధర్మారావుపేట గ్రామానికి చెందిన అనిల్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి వచ్చారు. ఆయనకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో బాలసదనంలో పెరుగుతున్న రూప గురించి ఎవరో చెప్పడంతో అధికారులతో మాట్లాడాడు. రూప, అనిల్ ఇరువురూ పరస్పరం ఇష్టపడడంతో అధికారులు పెళ్లి చేయడానికి నిర్ణయించారు. వరుడి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాక.. డాక్యుమెంటేషన్ ప్రక్రియనంతా పూర్తి చేశారు. ఆహ్వానించేది అధికారులే.. రూప, అనిల్‌ల వివాహం కోసం ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’పేరుతో ఆహ్వాన పత్రిక ముద్రించారు. పత్రికలో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి పేర్లు, వివరాలు, వివాహం జరుగు స్థలం పొందుపరిచారు. అధికారులే పెళ్లి పెద్దలుగా మారారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా సంక్షేమ అధికారి పి.రమ్య, డీసీపీవో జె.స్రవంతి, బాలసదనం సూపరింటెండెంట్ కే.సంగమేశ్వరి వివాహానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. నేడు వివాహం..: రూప, అనిల్‌ల వివాహం సోమవారం జరగనుంది. సదాశివనగర్ మండలంలోని ధర్మరావుపేట గ్రామంలోగల రెడ్డి సంఘ భవనం ఈ వివాహానికి వేదిక అవుతోంది. రూప పెళ్లికి జిల్లా స్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. వివాహ ఖర్చును పెళ్లి కొడుకే భరిస్తుండగా.. కావలసిన సామగ్రి, బంగారం, దుస్తులను అధికారులు సమకూరుస్తున్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ తదితరులు హాజరవుతారని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. -
వైరల్‌గా వెడ్డింగ్ కార్డు.. దయచేసి పెళ్లికి రావొద్దు.. ఇదేం పద్ధతి!
ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ పెళ్లి వేడుక అంటే కచ్చితంగా ఆహ్వాన పత్రికలు అచ్చేయిస్తున్నారు చాలా మంది. తమ బంధు మిత్రులు, స్నేహితులు, ప్రియమైన వారి ఇంటికి వెళ్లి లేదా పోస్టు ద్వారా పెళ్లి పత్రికను అందజేస్తారు. కుటుంబ సమేతంగా తప్పకుండా వివాహానికి రావాలని సంతోషంగా చెబుతుంటారు. అయితే ఈ పెళ్లి పత్రికే ఇప్పుడు ఓ కుటుంబం పరువు పోయేలా చేసింది. ప్రింటింగ్ కంపెనీ చేసిన చిన్నపొరపాటు వీరిని బంధమిత్రుల ఆగ్రహానికి గురి చేసింది. ఆహ్వాన పత్రికలో ఒక్క పదం మిస్ కావడం వల్ల మొత్తం అర్థమే మారిపోయింది. 'నేను ప్రేమతో ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తున్నాను. మీరు మా పెళ్లికి రావడం మర్చిపోండి' అని వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ అయింది. 'పెళ్లికి రావడం మర్చిపోకండి' అనే పదానికి బదులు ఒక్క అక్షరం మిస్ అయి మర్చిపోండి అని అచ్చయింది. దీంతో పెళ్లి కార్డు రిసీవ్ చేసుకుని చదివిన బంధువులు అవాక్కయై నోరెళ్లబెట్టారు. పెళ్లికి రావొద్దని పెళ్లి పత్రికలోనే చెప్పడం ఏంటి? బిత్తర పోయారు. ఈ పెళ్లి కార్డును ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. 'ఇదిగో నాకొక వివాహ ఆహ్వాన పత్రిక వచ్చింది. కానీ ఇది చూశాక పెళ్లికి వెళ్లాలో వద్దో ఏమీ అర్థం కావడం లేదు' అని అతడు రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు కొందరు ఆహ్వానితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లికి రావొద్దని మొహం మీదే చెప్పడం ఏంటి అని మండిపడ్డారు. ఇది నిజంగా అతిథులను అవమానించడమే, మీరు పెళ్లికి వెళ్లడం వారికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ప్రేమ మాత్రం వాళ్లింటి దగ్గర, విందు మాత్రం వేరే చోటనా? అసలు ఎవరు ఈ పత్రిక ఇచ్చింది. అని మరో నెటిజన్ స్పందించాడు. ఇది నిజంగా అమమానించడమే పెళ్లికి తప్పకుండా పిలవాల్సిందిపోయి, మోహం మీదే రావొద్దని చెబుతారా? అని మరో యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ పెళ్లికి రావడం మర్చిపో అని చెప్పడం మొట్టమొదటి సారి చూస్తున్నా..అని అన్నారు చదవండి: ఎండదెబ్బకు గబ్బిలాలు విలవిల.. వాటర్ స్ప్రే కొడుతున్న గ్రామస్థులు.. -
కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, విజయనగరం: ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తన కుమారుడు అన్వేష్‌కుమార్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో ముఖ్యమంత్రిని శుక్రవారం కలిసి వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు. హైమావతి వెంట జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభాస్వాతిరాణి ఉన్నారు. చదవండి: (చెన్నై ఆస్పత్రిలో నారాయణ కాలేజ్ విద్యార్థి మృతి..) -
భారత ఆర్మీని పెళ్లికి ఆహ్వానించిన నవజంట.. సైన్యం రిప్లై ఇదే..
తిరువనంతపురం: కేరళకు చెందిన నవ వధూవరులు రాహుల్, కార్తీక తమ వివాహ వేడుకకు భారత ఆర్మీని ఆహ్వానించారు. నవంబర్ 10న పెళ్లి చేసుకున్న ఈ జంట ఈమేరకు ఓ లేఖను రాసింది. సరిహద్దులో నిరంతరం కాపు కాస్తున్న సైన్యం దేశభక్తి, అంకితభావం, ప్రేమకు తామంతా రుణపడి ఉన్నామని, ఆర్మీ ఉందనే ధైర్యంతోనే దేశప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని లేఖలో పేర్కొంది. తమ జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైన పెళ్లి నాడు ఆర్మీ రావాలని, నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరింది. ఈ జంట రాసిన లేఖను భారత సైన్యం ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. పెళ్లికి ఆహ్వానించినందుకు రాహుల్, కార్తీకకు ధన్యవాదాలు తెలిపింది. నవజంటకు వివాహ శుభాకాంక్షలు తెలిపింది. జీవితాంతం కలిసి ఉండాలని, సుఖంగా జీవించాలని ఆశీర్వదించింది. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేరళ జంట వివాహ ఆహ్వానానికి సైన్యం స్పందించిన తీరును నెటిజన్లు ప్రశించారు. చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దినసరి కూలీ.. రూపాయి నాణేలతో.. -
సీఎంను కలిసిన నయనతార.. పెళ్లిపై లవ్‌బర్డ్స్ క్లారిటీ
Nayanthara Vignesh Wedding: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన వీరిద్దరి పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని ఈ జంట తాజాగా స్పష్టం చేసింది. శుక్రవారం (జూన్ 3) సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఈ లవ్ బర్డ్స్ తమ వెడ్డింగ్ ఇన్విటేషన్‌కు అందజేసింది. తమ వివాహానికి హాజరు కావల్సిందిగా కోరారు. వారిని అభినందించిన సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్‌ల నిశ్చితార్తం కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది జరిగింది. తాజాగా మహాబలిపురంలోని మహబ్ హోటల్లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు గెస్ట్‌లకు 'డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్' పంపించినట్లు తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి తిరుమలలో జరగుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మహాబలిపురంలోని మహబ్ హోటల్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం నయన్, విఘ్నేష్ వివాహం జరగనుంది. అయితే ఇదే వేదికపై జూన్ 8న సాయంత్రం సౌత్ ఇండియా సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయవేత్తల మధ్య రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్‌కు రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతికి ఆహ్వానం అందినట్లు టాక్. చదవండి: కాస్ట్లీ గిఫ్ట్‌తో సమంతను సర్ప్రైజ్ చేసిన నయనతార -
వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్.. క్రియేటివిటీతో పిచ్చెక్కించారు
Minnal Murali Wedding Invitation: మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన రోజులు కొన్ని ఉంటాయి. ఇక ఆ రోజులని ఎప్పటికీ గుర్తుండి పోవాలని ఏవేవో చేస్తుంటాం .అలాంటి రోజుల్లో ఒకటే పెళ్లి రోజు. ఇటీవల వివాహ వేడుకలను చూస్తే.. వధూవరులు తమ వివాహ వేడుక సంథింగ్ స్పెషల్ గా జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్, వెరైటీ ఇన్విటేషన్, సంగీత్ ఇలా ఒక్కటేమిటి అన్నిట్లో ప్రత్యేకతని కోరుకుంటున్నారు. తాజాగా ఓ సినిమా క్యారెక్టర్ లోని పాత్రో పెళ్ళికొడుకు ఉండి.. పెళ్లి కూతురితో కలిసి చేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇటీవల మలయాళంలో విడుదలైన 'మిన్నాళ్ మురళి' చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అంతే గాక ఇది మలయాళంలో ప్రేక్షకులతో పాటు ఇతర భాషలోనీ సినీ ప్రేమికులకు కూడా విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే మిన్నాళ్ మురళి.. ఇండియన్ సూపర్ మ్యాన్. ఈ వీడియోలో.. మిన్నాళ్ మురళీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోలో తానే మిన్నాళ్ మురళిగా గెటప్ వేసు కొని తనకు కాబోయే భార్యను రౌడీల నుండి రక్షించి, తన దరికి ప్రమాదం రానివ్వకుండా ఎప్పుడు తన వెంటే ఉండి తనను కాపాడుకుంటూ ప్రేమలో పడేస్తాడు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీడియో కాన్సెప్ట్ రూపొందించిన వాడిని క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. వాట్ ఏ క్రియేటివిటీ అంటూ కితాబుల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Athreya jibin (@photography_athreya) -
అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి
సాక్షి, బనశంకరి(కర్ణాటక): పెళ్లికి పిలవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లోనే రూ.11 లక్షల విలువచేసే బంగారు నగలను అపహరించిందో యువతి. ఈఘటన జేజే.నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దేవరజీవనహళ్లి నివాసి అజీరా సిద్దిక్ నిందితురాలు. పాదరాయనపుర నివాసి రోహినాజ్ అనే మహిళ ఇంటికి అజీరా ఈ నెల 14న సోదరుని పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లింది. అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని బీరువా ఉన్న గదిలోకి వెళ్లింది. అక్కడ 206 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేసింది. రోహినాజ్ మరుసటి రోజు చూడగా నగలు కనిపించలేదు. దీంతో జేజే నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, అజీరాను గట్టిగా ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. నగలను ఆమె ఇంటిపైన నీటి ట్యాంకర్ లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఉద్యోగుల ఆందోళన వాయిదా -
కేసీఆర్‌ను కలిసిన 'మనం సైతం' కాదంబరి కిరణ్.. ఎందుకంటే ?
Manam Saitham Founder Kadambari Kiran Met CM KCR: రాజకీయనాయకులు, సినీ సెలబ్రిటీలకు మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒకరివేడుకల్లో ఒకరు పాల్గొంటూ అనుబంధాలు పెంచుకోవడం పరిపాటే. టాలీవుడ్ నటుడు, 'మనం సైతం' వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కలిశారు. డిసెంబర్ 8న జరగనున్న తమ కుమార్తె వివహ మహోత్సవానికి రావల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. అలాగే 'మనం సైతం' ద్వారా సమాజహితం కోసం నిరంతరం అందిస్తున్న సేవా కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు కాదంబరి కిరణ్. కాదంబరి కిరణ్ ఎక్కువగా హాస్యప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. ఇప్పటికీ 270 సినిమాల్లో నటించారు. 'అమ్మ నాన్న తమిళ అమ్మాయి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో 'మనం సైతం' సంస్థ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి కాదంబరి కిరణ్ మద్దతు కూడా ఇచ్చారు. కాదంబరి కిరణ్ ఒక్కాగానొక్క కుమార్తె శ్రీకృతి వివాహం డిసెంబర్ 8న నిర్వహించనున్నారు. -
వైరల్: పి. మమతా బెనర్జీ వెడ్స్ ఏఎం సోషలిజం...
చెన్నై: ప్రస్తుత కాలంలో వివాహ వేడుకను అత్యంత వైభవంగా.. చాలా భిన్నంగా చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతి అంశాన్ని వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి పత్రికలను వినూత్నంగా రూపొందించుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఇక్కడ వధువు పేరు మమతా బెనర్జీ కాగా.. వరుడు పేరు సోషలిజం. అసలు ఈ పేర్లు, పెళ్లి పత్రిక నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేశారు నెటిజనులు. దంపతులు తల్లిదండ్రులు ఈ పేర్లు వాస్తవమే అని వెల్లడించారు. వరుడు తమిళనాడు సేలం సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ మోహన్‌గా ప్రసిద్ది చెందిన లెనిన్ మోహన్ కుమారుడు. మోహన్ సేలం లోని పనమరతుపట్టి పట్టణ కౌన్సిలర్ కూడా. ఈ సందర్భంగా మోహన్ తన కొడుకుకు ఇలాంటి పేరు పెట్టడం వెనుక గల కారణాలు, తన కుటుంబం ఈ సంప్రదాయాన్ని ఎలా కొనసాగిస్తున్నారో వివరించారు. “సోవియట్ యూనియన్ రద్దు అయిన తరువాత, కమ్యూనిజం పడిపోయిందని.. భావజాలం ప్రపంచంలో ఎక్కడా వృద్ధి చెందదని ప్రజలు భావించారు. దీనికి సంబంధించి దూరదర్శన్‌లో ఒక న్యూస్ క్లిప్ కూడా ఉంది. ఆ సమయంలో, నా భార్య నా పెద్ద కొడుకుకు జన్మనిచ్చింది. మానవ జాతి ఉనికిలో ఉన్నంతవరకు కమ్యూనిజం ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందుకే నా పెద్ద కుమారుడికి కమ్యూనిజం అని పేరు పెట్టాలని నేను వెంటనే నిర్ణయించుకున్నాను” అని తెలిపారు మోహన్ గ్రామమంతా ఇదే సంప్రదాయం... కత్తూరు గ్రామంలో, ఎక్కువ మంది ప్రజలు కమ్యూనిజం మార్గాన్ని అనుసరిస్తున్నారని.. అందువల్ల ఇక్కడ రష్యా, మాస్కో, చెకోస్లోవేకియా, రొమేనియా, వియత్నాం, వెన్మానీ వంటి పేర్లు గల వ్యక్తులు తారసడటం సాధారణం అన్నారు మోహన్. “ప్రజలు తమ అభిమాన నాయకులు, దేశాలు, భావజాలాలు పేర్లు పిల్లలకు పెడతారు. అలానే నేను నా పిల్లలకు నా అభిమాన భావజాలం పేరు పెట్టాలనుకున్నాను. ముగ్గురు కుమారులకు ఒకేలాంటి పేరు పెట్టాను. ఇక వధువు కూడా మా బంధువు. ఆమె తాత కాంగ్రెస్ సభ్యుడు, మమతా బెనర్జీ నుంచి ఎంతో ప్రేరణ పొందాడు. దాంతో తన మనవరాలికి దీదీ పేరు పెట్టుకున్నాడు.. మన భవిష్యత్ తరాలు మన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కోరుకుంటున్నాం. అందుకే నా మనవడికి మార్క్సిజం అని పేరు పెట్టాను. భవిష్యత్తులో, మా కుటుంబంలో ఒక ఆడపిల్ల పుడితే, నేను ఆమెకు క్యూబాయిజం అని పేరు పెడతాను” అని మోహన్ తెలిపారు. మూడు రోజుల్లో 300 కాల్స్... కోవిడ్ మహమ్మారి కారణంగా పెళ్లికి అందరిని ఆహ్వానించే వీలు లేక వివాహ పత్రికను ఇలా పేపర్లో ప్రచురించమన్నారు మోహన్. పెళ్లి పత్రికను వారు సీపీఐ అనుబంధ పత్రిక ‘జన శక్తి’ లో ప్రచురించారు. 2016లో మోహన్ రెండవ కుమారుడి వివాహం సందర్భంగా కూడా ఇలానే చేశారు. ‘‘ఈ వివాహ ఆహ్వానాన్ని సోమవారం పేపర్లో ప్రచురించాం. గత మూడు రోజుల్లో, నాకు 300 కి పైగా కాల్స్ వచ్చాయి. అందరూ వధూవరుల పేర్లపై చాలా ఆసక్తి కనబరిచారు. ఇది నిజమా, కాదా అని తెలుసుకోవాడానికి కార్యకర్తలు, స్నేహితులు, మీడియా నుంచి చాలా మంది నాకు కాల్ చేశారు. అందరూ ఇదే ప్రశ్న అడగటంతో మొదట్లో నేను చాలా చిరాకు పడ్డాను, కాని తరువాత అలవాటు పడ్డాను, ”అని తెలిపాడు మోహన్. స్కూల్లో ఇబ్బంది పడ్డారు.. "పేర్ల విషయంలో నా కుమారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి వెరైటీ పేర్లు పెట్టుకున్నందుకు చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరూ నా కుమారులను అభినందించేవారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. చాలా సార్లు రికార్డుల్లో వారి పేర్లను తప్పుగా రాశారు. వారి పాఠశాల విద్యను పూర్తయ్యేవరకు ఇది కొనసాగింది. కాని కళాశాలలో, పరిస్థితి మెరుగుపడింది. నా పెద్ద కొడుకు చెన్నై కాలేజీలో లా చేసాడు, మిగతా ఇద్దరు బి.కామ్ చేసారు. తరతరాలుగా మేము ఈ భావజాలాన్ని అనుసరిస్తున్నందున పేర్ల వెనక గల కథను వినడానకి ఆసక్తి కనబరిచేవారు’’ అని తెలిపారు మోహన్. చదవండి: ఐతారం నాడు లగ్గం.. అర్సుకునేటోల్లు వీళ్లే -
ఐతారం నాడు లగ్గం.. అర్సుకునేటోల్లు వీళ్లే
పెళ్లి.. ఇప్పుడు పెద్ద ఇవెంట్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అంతా ఇప్పుడు వెరైటీ వైపు పరుగులు పెడుతున్నారు. తమ పెళ్లి ఇతరుల కంటే భిన్నంగా.. చాలా చాలా క్రియేటీవ్‌గా ఉండాలని భావిస్తున్నారు. ఎంగేజ్మెంట్ మొదలు.. రిసెప్షెన్ వరకు ఇతరుల కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన శుఖలేఖనే వైరైటీగా ముద్రించాడు. బహుశా ఈ రీతిలో శుభలేఖ ఉండడం ఇదే మొదటిసారి కావచ్చు. ఎందుకంటే ఇది అచ్చమైన తెలంగాణ భాషలో ఉంది. ఇందులో పలానా వారి పెండ్లి పిలుపు, ఆహ్వానించువారు, విందు, స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర, ఆదివారం, కనిష్ఠ పుత్రుడు, గరిష్ఠ పుత్రిక, కల్యాణ వేదిక’’ వంటి పదాలేం లేవు. అంతా తెలంగాణ వాడుక భాషలోనే ‘‘లగ్గం పిలుపు, పిలిశెటోళ్లు, బువ్వ, ఐతారం అంబటాల్లకు 11.37 గొట్టంగ, మా సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, లగ్గం యాడనో ఎర్కనా’’ వంటి పదాలతో వినూత్నంగా రూపుదిద్దిన ఈ శుభలేఖ తెలంగాణ యాసను ప్రతిబింబించేలా ఉంది. ఇంతకీ పెళ్లి ఎవరిదంటే... ఈ వినూత్న శుఖలేఖ రాయించింది మై విలేజ్ షో’లో ఓ ఆర్టిస్ట్ అయిన చంద్రమౌళి (చందు). కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన కొందరు యువకులు మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానెల్ నడిపే సంగతి తెలిసిందే. ఇందులో వచ్చే షార్ట్ ఫిల్ముల్లో చందు నటిస్తుంటారు. తన వివాహానికి ఇలా శుభలేఖను తయారు చేయించుకొని చందు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక ఈ శుఖలేఖను చూసిన నెటిజన్లు చందుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.‘అన్న, లగ్గం పత్రిక మస్తుగున్నదే’, ‘మన తెలంగాణ యాస, బాషాలో, ఇప్పటి దాక ఇట్లాంటి లగ్గం పత్రిక సూడలేదు’, ‘లగ్గం కారట మస్తుగుంది తమ్మి’ అంటూ తెలంగాణ భాషలో కామెంట్లు పెడుతూ చందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒల్లదో అనుకునేరు నాదే😜 pic.twitter.com/LmXnkWtaQJ — chandu_myvillageshow (@chandu_mvs) December 31, 2020 -
మల్లయ్య కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తికి చెందిన ఫణికర మల్లయ్య తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలసి వివాహ పత్రిక అందజేశారు. ఈ మల్లయ్య ఎవరో గుర్తుందా?.. 2008లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాయపర్తి పర్యటనకు వచ్చినప్పుడు మల్లయ్యను ‘ఏం గావాలె మల్లయ్యా’ అని పలకరించాడు. ‘నాకేమీ వద్దు.. మా తెలంగాణ మాకియ్యుర్రి... తెలంగాణ వస్తేనే మా బతుకులు బాగుపడతై’ అంటూ బదులిచ్చాడు. -
బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో మిగ్–29 కె శిక్షణా విమానం కూలిన ఘటనలో గల్లంతైన కమాండర్ నిశాంత్ సింగ్, గతంలో తన వివాహ అనుమతి కోరుతూ పై అధికారులకు హాస్యపూరితమైన లేఖను రాశారు. తన పెళ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ‘బుల్లెట్ దెబ్బకు బలయ్యే అవకాశాన్నివ్వండి’అంటూ ఆయన రాసిన చమత్కారపూరితమైన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురువారం మిగ్–29 కె శిక్షణా విమానం అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పైలెట్‌ని రక్షించగలిగారు, నిశాంత్ సింగ్ మాత్రం గల్లంతయ్యారు. లాక్డౌన్ కాలంలో తన వివాహానికి అనుమతినివ్వాలని కోరుతూ మే 9వ తేదీన తన వృత్తిలోని అంశాలకు సృజనాత్మకతను జోడిస్తూ అధికారులకు కమాండర్ నిశాంత్‌సింగ్ హాస్యపూర్వకంగా లేఖ రాశారు. దీనికి ‘మంచిపనులన్నీ శుభం కార్డుతో ముగుస్తాయి, నరకానికి స్వాగతం’’అని నిశాంత్ సింగ్ సీనియర్ అధికారి ప్రతి స్పందించారు. (ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం) -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీఎం రమేష్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోమవారం కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహానికి రావాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో, రిత్విక్ నిశ్చితార్థం గత ఏడాది నవంబర్‌లో దుబాయ్ జరిగింది. కాగా ఇప్పటికే సీఎం రమేష్ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందచేశారు. -
ఎంపీ మాధవి వివాహానికి సీఎంకు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. తనకు కాబోయే భర్త శివప్రసాద్‌తో కలిసి ఆమె తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న (శుక్రవారం) ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నెల 17వ తేదీన జరిగే తమ పెళ్లికి రావాలంటూ సీఎం జగన్‌కు వివాహా ఆహ్వాన పత్రికను అందచేశారు. కాగా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఎంపీ మాధవి వివాహం జరగనుంది. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్‌ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేశారు. చదవండి: అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ 17న అరకు ఎంపీ వివాహం -
ఫిబ్రవరి 5న పెళ్లి.. వస్తే క్వార్టర్ ఫ్రీ
సాక్షి, చెన్నై : తమిళనాడు కోయంబత్తూరులో ఓ జంట విభిన్నమైన రీతిలో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది. తమ పెళ్లికి వస్తే క్వార్టర్ ఇస్తామంటూ పెళ్లి పత్రికలో ముద్రించారు. ఇది సోషల్ మీడియాలో శనివారం నుంచి వైరల్‌గా మారింది. వివాహ ఆహ్వాన పత్రికలను ఇటీవల విభిన్నమైన ఆలోచనలు, వ్యతాసమైన డిజైన్లతో తయారుచేస్తున్నారు. ఇలా ఉండగా కోయంబత్తూరులో వచ్చే ఫిబ్రవరి 5వ తేదీ జరగనున్న ఈ వివాహ మహోత్సవానికి వినూత్నంగా ఆహ్వానం పలికారు. ‘‘మా పెళ్లికి రండి.. వచ్చే వివాహితులకు సైడ్ డిష్‌తో పాటు ఒక క్వార్టర్, అవివాహితులకు రెండు క్వార్టర్లు అందజేస్తాం’’ అంటూ ఆహ్వానం పలికారు. అయితే ఈ ఆహ్వాన పత్రిక అసలైనదా లేదా నకిలీదా అనే విషయం తెలియలేదు. -
కెమిస్ట్రీ టీచర్ వెడ్డింగ్ కార్డు: వైరల్
తిరువనంతపురం: పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన వేడుక. అందుకే ఈ వేడుకను ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా జరుపుకునేందుకు చాలా మంది యువతి, యువకులు ఉత్సహం కనబరుస్తున్నారు. ఫొటో సెషన్లు, సంగీత్‌లు, వెడ్డింగ్ కార్డులు.. ఇలా ప్రతిది ఆకట్టుకునేలా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ కెమిస్ట్రీ టీచర్ తన వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరువనంతపురానికి చెందిన విథున్ అనే కెమిస్ట్రీ టీచర్‌కు డిసెంబర్ 14న సూర్య అనే వ్యక్తితో పెళ్లి జరగనుంది. కెమిస్ట్రీ టీచర్ అయిన విథున్ తన పెళ్లి పత్రికను కూడా ఆమె బోధిస్తున్న సబ్జెక్ట్‌తో ముడిపడి ఉండేలా రూపొందించారు. ఈ వెడ్డింగ్ కార్డును ఆర్గానిక్ కెమిస్ర్టీలోని రసాయనబంధాలను గుర్తుకు తెచ్చేలా రూపొందించారు. అందులో లవ్(LOVE) అనే పదాలను కూడా అందంగా పొందుపర్చారు. వధువరుల పేర్లు కూడా కెమిస్ట్రీ లుక్‌లోనే డిజైన్ చేశారు. మరి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెళ్లిని రియాక్షన్(చర్య)గా, కళ్యాణ వేదికను ల్యాబోరేటరిగా పేర్కొన్నారు. విథున్ సృజనాత్మకతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శుభాకాంక్షలు తెలిపిన శశిథరూర్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వెడ్డింగ్ కార్డును కార్తీక్ వినోబా అనే వ్యక్తి కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను ట్యాగ్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. మీ నియోజకవర్గంలోని ఓ కెమిస్ట్రీ టీచర్ వెడ్డింగ్ కార్డు ఇది అని కార్తీక్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై చమత్కారంగా స్పందించిన శశిథరూర్ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. Wishing them all the best for a happy married life! May the chemistry between them always sparkle, the physics feature more light than heat, and the biology result in bountiful offspring....! https://t.co/Y6aYMjFsPi — Shashi Tharoor (@ShashiTharoor) 13 December 2018 -
ఇషా అంబానీ వివాహం : మొదటి ఆహ్వానం ఎవరికంటే
ముంబై : అంబానీ కుటుంబంలో సంతోషాలు వరుస కడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ ఎంగేజ్మెంట్ ఇటలీ లేక్ కోమో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న రాత్రి అంబానీ కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుని ఆలయాన్ని సందిర్శించారు. ఇషా - పిరమిల్‌ల తొలి వివాహ ఆహ్వాన పత్రికను వినాయకుని పాదాల చెంత ఉంచి ఎటువంటి విఘ్నాలు లేకుండా తమ కుమార్తె వివాహం జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముకేష్ అంబానీ దంపతులతో పాటు వారి కుమారుడు అనంత్ అంబానీ.. ముకేష్ అంబానీ తల్లి కోకిలా బెన్ కూడా హాజరయ్యారు. గతంలో ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతాల తొలి నిశ్చితార్థపు ఆహ్వాన పత్రికను కూడా ఇదే ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. -
పెళ్లి పిలుపులు!
స్నేహితులను, బంధు మిత్రులను పెళ్లికి పిలుస్తున్నారట దీపికా పదుకోన్. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో ఆమె వివాహం ఈ ఏడాది నవంబర్‌లో ఇటలీలో జరగనుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 12–14 తేదీల మధ్యలో దీపికా–రణ్‌వీర్‌ల వివాహం ఫిక్స్ అయ్యిందని బీటౌన్ టాక్. ఆల్రెడీ వీరిద్దరూ సన్నిహితులకు పెళ్లి ఆహ్వానాలను కూడా పంపుతున్నారట. ఇటలీలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి చాలా తక్కువ మందిని పిలిచి, ఆ నెక్ట్స్ ముంబైలో గ్రాండ్‌గా అందరికీ రిసెప్షన్ అరేంజ్ చేయాలని భావిస్తున్నారట దీపికా అండ్ రణ్వీర్. ప్రస్తుతం తెలుగు ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్నారు రణ్వీర్. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఈ వివాహం జరుగుతుందట. ‘పద్మావతి’ చిత్రం విడుదలై ఆర్నెళ్లు అయినా దీపికా పదుకోన్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఆమె నీరజ్ గయవాన్ దర్శకత్వంలో రూపొందనున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ఈ సినిమా దీపికా పెళ్లి తర్వాత సెట్స్‌పైకి వెళ్తుందట. -
పెళ్లికళ వచ్చేసింది
మే 8... మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12:30. ఈ డేట్ అండ్ టైమ్ స్పెషాల్టీ ఏంటీ అనుకుంటున్నారా? బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌కు శ్రీమతిగా కొత్త జీవితం ఆరంభమయ్యే ముహూర్తపు టైమ్ అది. అవును.. ఇక నో మోర్ డౌట్స్. సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజాల వివాహం మే 8న ముంబైలో జరగనుంది. అన్నట్లు ఇంకో మాట.. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగూ లంచ్ ఉంది. అలాగే అదే రోజు రాత్రి పార్టీ కూడా ఎరేంజ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఆల్రెడీ సోనమ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయ్యింది. పెళ్లి జరగడానికి ఇంకా నాలుగు రోజులు ఉన్నా.. అప్పుడే సోనమ్ కపూర్ ఫేస్‌లో పెళ్లి కళ వచ్చేసిందని ఆమె సన్నిహితులు సరదాగా ఆటపట్టిస్తున్నారట. ఆల్రెడీ సోనమ్ కపూర్ ఇల్లు పెళ్లి ఏర్పాట్లతో హడావిడిగా మారింది. అలంకరణ కూడా పూర్తి అయ్యింది. పెళ్లి వేడుకలకు ధరించబోయే డిజైనర్ డ్రెస్సులను తన అభిరుచికి తగ్గట్టుగా చేయించుకున్నారట సోనమ్. ‘ఫ్యాషన్ ఐకాన్’ అని పేరు తెచ్చుకున్న సోనమ్ పెళ్లి వేడుకల్లో ధరించబోయే దుస్తులు ఎలా ఉంటాయో చూడాలని చాలామంది వెయిటింగ్. ఇక సోనమ్ కపూర్ కాబోయే భర్త ఆనంద్ ఆహుజా గురించి చెప్పాలంటే ఆయన వ్యాపారవేత్త. సోనమ్ పెళ్లికి దీపిక రాదా? యస్.. సోనమ్ పెళ్లికి దీపికా పదుకొన్ హాజరు కావడం లేదా? అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అందుకు తగ్గట్లు ఒక విశ్లేషణను చెబుతున్నాయి. టైమ్ మ్యాగజీన్ వంద మంది మోస్ట్ ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్స్‌లో ఒకరుగా దీపికా పదుకొన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న టైమ్ మ్యాగజీన్ జరపనున్న ఓ ఈవెంట్లో పాల్గొనున్నారు దీపిక. ఆ నెక్ట్స్ మే 8 నుంచి 19 వరకు జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాల్సి ఉందట. సో.. సోనమ్ పెళ్లికి దీపికా రావడం లేదట. -
వైరలవుతున్న పెళ్లి శుభలేఖ..
బెంగళూరు: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆ వేడుకకు సంబంధించిన అంశాలను ప్రతి జంట తమ జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలని కోరుకుంటుంది. కర్ణాటకకు చెందిన ఓ జంట కూడా అలానే అనుకుంది. అనుకోవడమే కాక ఓ వినూత్నమైన ఆలోచన కూడా చేశారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీరు తమ పెళ్లి పత్రికను ఓటరు కార్డు రూపంలో డిజైన్ చేయించారు. వినూత్నమైన పెళ్లికార్డుకు కర్ణాకటలోని హవేరి జిల్లా వేదికైంది. జిల్లాలోని హంగల్ ప్రాంతానికి చెందిన సిద్దప్ప దొడ్డచిక్కన్ననవార్ భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. సామాజిక కార్యకర్త కూడా అయిన సిద్దప్పకు ఇదే ప్రాంతానికి చెందిన జ్యోతితో వివాహం నిశ్చయం అయింది. ఈ నెల 27న వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. 'నా వివాహ వేడుక సందర్భంగా ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా. ఇదే విషయాన్ని పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నా స్నేహితుడి వద్ద ప్రస్తావించాను. ఇద్దరం ఆలోచించి పెళ్లి పత్రికను ఓటరు కార్డు రూపంలో అచ్చు వేయించాలనుకున్నాం. అందుకుగాను జిల్లా కలెక్టరు అనుమతి కూడా తీసుకున్నామని' తెలిపాడు సిద్దప్ప. ఓటరు ఐడీలో వివరాలు ఎలా ఉంటాయో అలానే తన వివాహ వేడుకకు సంబంధించిన వివరాలను రూపొందించాడు. శుభలేఖ చివర్లో మీ ఓటు ఎంతో విలువైనది దాన్ని అమ్ముకోకండి అనే సందేశాన్ని కూడా అచ్చువేయించడం గమనార్హం. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మే 12న కర్ణాటకలో 224 నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 56,696 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. మే 15న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేయనుంది. -
ఒబామా దంపతులకు ఆహ్వానం పంపితే..
వాషింగ్టన్: ప్రజల నేతగా గుర్తింపు పొందిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రావడంతో ఓ యువ జంట ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన తల్లి రాసిన లేఖతో పాటు ఒబామా పంపిన ప్రత్యుత్తరాన్ని నవ వధువు ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఇప్పటికే 45వేల మంది రీట్వీట్ చేయగా, రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వివరాల్లోకెళ్తే.. గత మార్చి నెలలో టెక్సాస్‌కు చెందిన లిజ్ వైట్‌లో అనే మహిళ కూతురు బ్రూక్ అల్లెన్ జరిగింది. అయితే తన కూతురి వివాహానికి హజరు కావాల్సిందిగా ఒబామా దంపతులకు లిజ్ ఆహ్వానం పంపించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత (జూలై 31న) ఒబామా నుంచి వారికి సమాధానం వచ్చింది. 'వివాహం చేసుకున్న జంటకు మా తరఫున శుభాకాంక్షలు. మీ పెళ్లి ఎంతో ఆనందంగా, సన్నిహితుల ప్రేమానుబంధంతో జరిగి ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ మీ ప్రేమ రెట్టింపు కావాలి. మీ బంధం జీవితాంతం కొనసాగాలిని ఆకాంక్షిస్తున్నాను. వివాహం తర్వాత మీ లైఫ్ ఎన్నో విశేషాలతో నిండిపోతూ బంధం బలపడాలని' కొత్త జంటను ఆశీర్వదిస్తూ ఒబామా దంపతులు ఈ లేఖ రాశారు. ఈ సంతోషాన్ని వధువు బ్రూక్ అల్లెన్ తన ట్విట్టర్లో షేర్ చేసుకుంది. MY MOM DEADASS SENT THE OBAMAS A WEDDING INVITATION BACK IN MARCH AND JUST RECEIVED THIS IN THE MAIL. IM HOLLERING -
ఇదే మా వీడియో ఆహ్వానం
నిన్నటి ఆనందం... నేటి కల... రేపటి జీవితం....పెళ్లి. విడి విడిగా పుట్టి, విడి విడిగా పెరిగి ఒకటిగా మారాలనుకుంటున్న రెండు జీవితాలు ఆ శుభవేళకు బంధుమిత్రులు రావాలని కోరుకుంటున్నాయి. ఆ క్రమంలో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలను సమర్పిస్తున్నాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్ తయారీ కోసం ఇంకా కార్డులు, బోర్డులు వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో ఇన్వైట్లు గురించి మీరు తెలుసుకోవాల్సిందే. - ఓ మధు లేటెస్ట్ వీ-ఇన్వైట్ వీడియోలతో పెళ్లికి ఆహ్వానించటం ముందు నుంచే ఉన్నప్పటికీ, ఆహ్వానంలో తమ పెళ్లికి సంబంధించిన కథను సైతం జోడించి ఆహ్వాన వీడియోలు ఆసక్తి కరంగా తయారు చెయ్యటం ఇప్పుడు కొత్త ట్రెండ్. లింక్ షేర్ చేసి ‘ఈ కార్’్డ ద్వారా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపడం చాలా ఏళ్లుగా ఉంది. అయితే మొబైల్స్‌లో సోషల్ నెట్వర్కింగ్ హవా పెరిగిన తర్వాత ఈ కార్డ కన్నా వీడియో ఇన్వైట్ల ట్రెండ్ ఇప్పుడు ఆకట్టుకుంటోంది. - శ్రీకౌండిన్య, వెడ్డింగ్ వీడియో ప్రొఫెషనల్, జోటికస్ ప్రొడక్షన్స్ ‘ఇలా జరుగుతుంది అనుకోలేదు.. కానీ జరిగింది. పలకరింపు నుంచి గంటలతరబడి మాటలు.. అలా మాట్లాడుతూ... ప్రేమలో ఎప్పుడు పడిపోయామో తెలియనేలేదు. షాపింగ్‌లు, కోపాలు, బుజ్జగింపులు, ప్రపోజ్ చేసుకోవటం జరిగిపోయింది. ఫలాన తేదీన మా పెళ్లికి రండి’ అంటూ ఇద్దరూ ఒక్కటిగా పలికే ఆహ్వానం.. (ఒకటిన్నర నిమిషాల్లో ఒక్క మాట కూడా చెప్పకుండా తమ పెళ్లికి దారిచూపిన ప్రేమను పరిచయం చేస్తూ పెళ్లికి ఆహ్వానం పలికే వీడియో) ‘అందమైన రంగులతో మా జీవితాన్ని కలర్‌ఫుల్ చేసుకోవాలని ఆశిస్తున్నాం... ఈ నెల ఫలానా తేదీ తప్పుకుండా రండి.. ఇదే మా పెళ్లికి ఆహ్వానం’ (1 నిమిషం నిడివితో క్రియేటివ్ వీడియో ఇన్విటేషన్). మచ్చుకు ఇవి కొన్నే.. ఇంతకన్నా కనువిందు చేసే వీడియో వెడ్డింగ్ ఇన్వైట్లు సిటీలో సందడి చేస్తున్నాయి. తమ పెళ్లికి బంధుమిత్రులను సాదాసీదాగా ఆహ్వానించడం కాదు... వారిలో తమ జంటపై క్యూరియాసిటీ పెంచి తప్పనిసరిగా పెళ్లికి వచ్చేలా చేయడానికి కూడా ఈ వీడియోలను వధూవరులు ఉపయోగించుకుంటున్నారు. ‘చిత్ర’ పత్రం... ఆసక్తికరం... వధూవరులు ప్రాధాన్యమివ్వాలనుకున్న అంశం ఆధారంగా ఈ వీడియో థీం ఎంచుకుంటారు. ఉదాహరణకు ప్రేమ వివాహం అయితే మొదటిసారి కలుసుకున్న చోటు నుంచి, వారి ప్రేమ జర్నీలో ముఖ్యమైన సంఘటనలు జరిగిన ప్రాంతాలు ఈ వీడియో తియ్యడానికి అనువైన ప్రదేశాలు ఎంచుకుంటుంటారు. అలా కుదరకపోతే, అందమైన చోటుకి వెళ్లి వారి కథను అందంగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఇలా రూపుదిద్దుకుంటాయి... అయితే ఈ వీడియోలు అన్నీ ప్లాన్ చేసి, స్క్రిప్ట్ ప్రకారం కాకుండా కపుల్‌కి కావలసిన ప్రైవసీ ఇచ్చి, కొంత సర్ప్రైజ్తో వీటిని రూపొందిస్తారు. అలా ఈ ఇన్వైట్ వీడియో మొదటిసారి చూసుకున్నప్పుడు కపుల్స్ ముందుగా థ్రిల్ అవుతుంటారు. ఇక షేర్ చేసుకున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అయితే వీడియో చూసిన నెక్ట్స్ మూమెంట్ నుంచే వారిని బ్లెస్ చేయటం మొదలు పెట్టేస్తారు. కపుల్ ఎలాంటి రిలేషన్ షేర్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో ముఖ్యమైన ఎలిమెంట్. ఎవరూ లేనప్పుడు ఆ కపుల్ షేర్ చేసుకునే హ్యాపీ మూమెంట్స్ ఈ వీడియోకి మూలం. దాని చుట్టూ చిన్న కథతో ఈ వీడియోలు రూపొందిస్తారు. వారి ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ నేచురల్‌గా అందిపుచ్చుకుంటారు. ఇక ఈ వెడ్ ఇన్వైట్ వీడియోలను వెడ్డింగ్ కవర్ చేసే వాళ్లతోనే చేయించుకుంటుంటారు, లేదా విడిగా కూడా చేయించుకోవచ్చు. లైటింగ్ వుుఖ్యం... ఇప్పుడు చాలా మంది కపుల్స్ వీడియో ఇన్వైట్లను ప్రిఫర్ చేస్తున్నారు. వీటిని షూట్ చేసేందుకు చక్కటి ప్లేస్‌తో పాటు, అనుకూలమైన వాతావరణం, లైటింగ్ చాలా ముఖ్యం. అందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఉండే లైట్ ప్లెజెంట్‌గా, పర్ఫెక్ట్గా ఉంటుంది. - శ్రీనివాస్, వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ చక్కటి అనుభూతి... ఫస్ట్‌టైం ఇలాంటి వెడ్డింగ్ వీడియో చూసినప్పుడు చాలా కొత్తగా, ఇన్నోవేటివ్‌గా అనిపించింది. ఎనిమిదేళ్ల లవ్ స్టోరీని ఒకటిన్నర నిమిషాల్లో స్టాప్ మోషన్లో చూసుకోవటం, అది ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవటాన్ని బాగా ఎంజాయ్ చేశాం. అచ్చం అలాగే నా పెళ్లికి కూడా వీడియో ఇన్వైట్ తప్పకుండా చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. - అంజలి, బుల్లితెర నటి