whale
-
ఆ ‘రష్యన్ స్పై వేల్’ ఇక లేదు!
రష్యా గూఢచారిగా 2019 నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెల్లని బెలుగా తిమింగలం చనిపోయింది. హవాల్దిమిర్‌గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని రిజావికా బే వద్ద నీటిపై తేలియాడుతూ శనివారం స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్ కళేబరాన్ని క్రేన్‌తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఒంటిపై కెమెరాను అమర్చేందుకు వీలుగా బెల్టు లాంటి ఒక పరికరం అమర్చి ఉండటం, దానిపై ‘ఎక్విప్మెంట్ సెయింట్ పీటర్స్బర్గ్’అని రాసి ఉండటంతో నార్వే ప్రజలకు అనుమానం మొదలైంది. రష్యాయే నిఘా కోసం ఈ తిమింగలాన్ని పంపి ఉంటుందని, నార్వే–రష్యా భాషలను కలిపి ‘హవాల్దిమిర్’గా పిలవనారంభించారు. సాధారణంగా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా హవాల్దిమిర్ ప్రజలకు మచ్చికయ్యింది. ఇంతకీ, ఇది రష్యా పంపిందేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. బహుశా, రష్యా నిర్బంధంలో ఉంటూ అనుకోకుండా తప్పించుకుని వచ్చి ఉంటుందని, అందుకే ప్రజల సంజ్ఞలకు స్పందించే లక్షణం అబ్బి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. – హెల్సింకీ -
తిమింగలానికి కోపమొస్తే.. చుక్కలే! ఈ వైరల్ వీడియో చూడండి!
అమెరికాలోని న్యూహాంప్‌షైర్ హార్బర్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భారీ తిమింగలం చిన్న బోటు మీదికి ఉన్నట్టుండి లంఘించింది. దీంతో నడి సముద్రంలో బోటు దాదాపు బోల్తా కొట్టడంతో అందులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చివరికి ఏమైంది? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.కోలిన్, వ్యాట్ యాగర్ అనే ఇద్దరు సోదరులకు తమ తొలి ఫిషింగ్ ట్రిప్‌లోనే భయకరమైన అనుభవం ఎదురైంది. వీరు మంగళవారం ఉదయం న్యూ హాంప్‌షైర్ తీరంలో 23 అడుగు పొడవున్న ఓ బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. తీరా బోటు సముద్రంలోకి వెళ్లాక వారికి సమీపంలో ఒక భారీ తిమింగలం దర్శనమిచ్చింది. అది బోటు దగ్గరకు వచ్చీ రావడంతోనే బోట్‌పై ఎటాక్ చేసింది. ఒక్కసారిగా గాల్లోకి లేచి బోటుపై ల్యాండ్ అవ్వాలని ప్రయత్నించింది. దీంతో నడి సంద్రంలో బోటు అతలాకుతలమై పోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఇద్దరూ సముద్రంలోకి దూకేశారు. సముద్రంలో చుట్టు పక్కల బోట్లలో ఉన్నవారు వారిని కాపాడారు.Whale lands on boat 😮😱 pic.twitter.com/eIJPIsB8YO— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 24, 2024 ఉత్తర న్యూ ఇంగ్లండ్ కమాండ్ సెంటర్‌కు రెండుసార్లు మేడే సిగ్నల్ అందిందని యుఎస్ కోస్ట్ గార్డ్‌లోని ఒక అధికారి చెప్పారు. న్యూహంప్షైర్ కోస్ట్లోభారీ తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయనీ, కానీ ఇలా ఎపుడూ దాడికి దిగలేదని అన్నారు. తిమింగలానికి సైతం ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే ఆ బోటుకు సమీపంలో ఉన్న మరో బోటు నుంచి ఎలియట్, మైనే సోదరులు దీనికి సంబంధించిన వీడియో తీశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
నడి సంద్రంలో తిమింగలం ఫోజు చూస్తే..షాకవ్వడం ఖాయం!
సముద్రంలో ఉండే వివిధ జంతువుల వీడియోలు చూశాం. నడి సంద్రం వద్దకు వచ్చేటప్పటికీ అక్కడ ఉండే జల చరాలన్నీ చాలా స్పష్టంగా అద్భుతంగా కనిపిస్తాయి. పైగా నీరు కూడా చాలా స్వచ్ఛంగా కనిపించడంతో అన్ని జంతువుల ఆకృతి చాలా క్లియర్‌గా చూడగలం. అలానే ఓ ఆస్ట్రేలియన్‌కి చెందిన ఓ ప్రకృతి ఔత్సాహికుడు తన బోట్‌తో సరదాగా సముద్రంలో చక్కర్లు కొడుతుండగా ఓ ఘటన చూసి కంగుతిన్నాడు. అందేంటి అని ఆశ్చర్యంగా సమీపం వరకు వెళ్లితే గానీ తెలియలేదు. తీరా చూస్తే తిమింగల తోక. అది కూడా తలకిందుల పొజిషన్లో ఉంది. ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా తిమింగలాన్ని అలా చూసేటప్పటికీ ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైందని అంటున్నాడు ఆ వ్యక్తి. తోకను తిమింగలం చాలా పైకి లైపి హెడ్‌స్టాండ్ పొజిషన్లో ఉంచింది. సముద్ర ఉపరితలానికి అతుక్కుని నుంచొని ఉంది. పైగా అది తన పిల్లలతో హాయిగా సేద తీరుతుంది. తిమింగలం విశ్రాంతి తీసుకునేటప్పుడూ ఆ పొజిషన్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: అత్యంత పురాతన 'పబ్'..సందర్శకులు మాత్రం దాన్ని..) -
సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం..
డెన్మార్క్: అంబాసిడర్ లైన్ అనే బ్రిటీష్ నౌక ఫరో ద్వీప సందర్శన సందర్బంగా అందులోని ఒక బృందం వారి ప్రాచీన సంప్రదాయమని చెబుతూ 70కి పైగా తిమింగలాలను అత్యంత క్రూరంగా వేటాడి చంపేశారు. ఆ సమయంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అంబాసిడర్ నావికుడు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు. మనిషి కంటే క్రూరమైన జంతువు భూమ్మీద లేదు. దీన్ని నిజం చేస్తూ ఫరో ద్వీపాల్లో మనిషి అమానుషత్వం మరోసారి బయటపడింది. ఈ నెల 9న ఫరో ద్వీప రాజధాని టోర్శావ్న్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిండు సందర్శకులతో ఫరో ద్వీపాల సందర్శనకు బయలుదేరిన అంబాసిడర్ లైన్ అనే ఒక పెద్ద ఓడలోని కొందరు అనాగరికులు వందల ఏళ్ల నాటి సంప్రదాయమని చెబుతూ 70కి పైగా పెద్ద రెక్కలున్న తిమింగలాలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలా వేటాడిన తిమింగలాలను తినడం వారి సాంప్రదాయమట. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో అందులోని ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, వేటగాళ్ళ ఆకృత్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు భయభ్రాంతులకు గురైయ్యారని క్రూజ్ సిబ్బంది తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి తెలుకుసుకున్న సముద్ర సముద్రజీవుల పరిరక్షణ సంస్థ (ఓ.ఆర్.సి.ఏ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వేట సమయంలో ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా ఓడలో ఉన్నట్లు సమాచారం. ఓడ నావికుడు ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ తెలిపారు. ఇది కూడా చదవండి: 40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే.. -
కిస్కా కథ అలా ముగిసింది..!
ఒంటారియో: కిస్కా. ఓర్కా రకం కిల్లర్ వేల్. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం. దాదాపు 40 ఏళ్లపాటు నీళ్ల ట్యాంకులో ఒంటరిగా బతుకీడ్చింది. చోటు మార్చాలని జంతువుల హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసింది. ఐస్‌ల్యాండ్ సమీపంలోని సముద్ర జలాల్లో ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఈ కిల్లర్ వేల్ పట్టుబడింది. దీనిని ఒంటారియోలోని నయాగరా జలపాతం వద్ద ఉన్న మెరైన్‌ల్యాండ్ జూ పార్క్‌కు అమ్మేశారు. 40 ఏళ్ల పాటు కిస్కా ఓ నీళ్ల ట్యాంకుకే పరిమితమైపోయింది.ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలంగా ముద్రపడింది. ఇటీవలే సుమారు 47 ఏళ్ల వయస్సులో కిస్కా చనిపోయింది. ‘కిస్కా మృతి పట్ల విచారిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓర్కా రకం తిమింగలాలు బందీలుగా ఉన్నాయి. కెనడా ప్రభుత్వం నోవాస్కోటియాలో వందెకరాల్లో వేల్ శాంక్చువరీ ప్రాజెక్టు ఏర్పాటు పనుల్లో ఉంది. ఇది పూర్తయితే ట్యాంకుల్లో కన్నా స్వేచ్ఛగా, మెరుగైన సురక్షిత వాతావరణంలో పట్టుబడిన తిమింగలాలు, డాల్ఫిన్లను ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది’అని ఏనిమల్ జస్టిస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెమిల్లె లబ్చుక్ అన్నారు. తిమింగలాల్లో అత్యంత బలమైన ఈ ఓర్కాల ఆయుర్ధాయం 50 నుంచి 90 ఏళ్లు. -
శంషాబాద్‌కు భారీ ‘తిమింగలం’!
సాక్షి, శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో ఆదివారం రాత్రి ఓ భారీ ‘తిమింగలం’వాలి చూపరులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది! ఒక రోజంతా సేదతీరి తిరిగి సోమవారం రాత్రి రెక్కలు కట్టుకొని రివ్వున ఎగిరిపోయింది!! ఎయిర్‌పోర్టులోకి ‘తిమింగలం’రావడం ఏమిటని అనుకుంటున్నారా? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సరుకు రవాణా విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా విమానం (ఏ300–600 సూపర్ ట్రాన్స్పోర్టర్) శంషాబాద్ విమానాశ్రయానికి అతిథిగా విచ్చేసింది. ఈ విమాన ఆకారం ఉబ్బెత్తు తలలతో ఉండే బెలూగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఇది ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్లని అని అర్థం. దుబాయ్‌లోని అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని పట్టాయా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ కార్గోను మోసుకెళ్తూ మార్గమధ్యలో ఇంధనం నింపుకోవడంతోపాటు పైలట్లు విశ్రాంతి తీసుకొనేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దీన్ని ల్యాండ్ చేశారు. విమాన ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం విమానాశ్రయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విమానం తిరిగి సోమవారం రాత్రి 7:20 గంటలకు టేకాఫ్ తీసుకొని పట్టాయా బయలుదేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మౌలిక వసతుల సామర్థ్యం, సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌బస్ బెలూగా ఇక్కడ ల్యాండ్ అయిందని ఆర్జీఐఏ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్ ఏఎన్–225 మ్రియా సైతం ఇంధనం, విశ్రాంతి కోసం 2016 మే 13న శంషాబాద్‌లో ల్యాండ్ అయిందని గుర్తుచేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మ్రియా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం. ఈ తెల్ల తిమింగలం ప్రత్యేకతలు ఇవీ ► ఇలాంటి ఆకారం ఉన్న విమానాలు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఐదే ఉన్నాయి. ► దీన్ని ప్రత్యేకించి విమానాల విడిభాగాల రవాణాతో పాటు అతిభారీ యంత్రాల రవాణాకు వినియోగిస్తున్నారు. ► ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. ► దీని పొడువు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు. ► బెలూగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. A wonder in the sky, a head-turner on the runway. Marvel at the majestic Airbus Beluga that has recently landed on equally majestic #HYDAirport.#FlyHYD #AirbusBeluga #Aircraft@Airbus @AAI_Official @MoCA_GoI pic.twitter.com/c5NEWKZlsl — RGIA Hyderabad (@RGIAHyd) December 5, 2022 -
పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..!
ఫొటోలో కనిపిస్తున్న తిమింగలాన్ని చూస్తుంటే.. ఎంత అందంగా ఉందో అని ఆనందిస్తున్నారా.! కానీ, దాని జీవితం గురించి తెలిస్తే మాత్రం గుండె బరువెక్కుతుంది. దానికి ఉన్నన్ని కష్టాలు.. తెలుగు సీరియల్ హీరోయిన్‌కు కూడా ఉండి ఉండవేమో! రెండు సంవత్సరాల వయసులోనే తల్లిలాంటి సముద్రం నుంచి తప్పిపోయింది. 1947లో ఐస్‌ల్యాండ్ తీరానికి సమీపంలో మెరైన్ ల్యాండ్ వారి చేతికి చిక్కి, బందీగా మారింది. వారు ఈ కిల్లర్ తిమింగలానికి ‘కిస్కా’గా పేరు పెట్టి, ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నా.. ఏదో తెలియని బాధ. దీనికి తోడు తన పిల్లల్ని చూసుకుంటూ అయినా జీవితం సాగిద్దాం అనుకుంటే.. పుట్టిన ఐదు బిడ్డలు పుట్టినట్లుగానే చనిపోయాయి. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! స్నేహితులతో కలిసి కాస్త సరదాగా గడుపుదాం అనుకున్నా.. పక్కనే ఉండే మరో రెండు తిమింగలాలు కూడా కిస్కాని వదిలి వేరే లోకాలకు వెళ్లిపోయాయి. ఇలా ఎటు చూసినా కిస్కాకు కష్టాలు తప్పట్లేదు. దాదాపు పదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తోంది. ఇక ఈ ఒంటరి జీవితం జీవించలేనని అనుకుందో ఏమో.. ఈ మధ్యనే ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. తన తలను తానే వాటర్ ట్యాంకర్ గోడలకేసి బాదుకుంటూ కనిపించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఏదీ ఏమైనా స్వేచ్ఛ అనేది మానవునికే కాదు.. మూగజీవాలకు కూడా ముఖ్యమే. బంగారు పంజరమైనా.. పక్షికి అది ఓ కారాగారమే. ఎన్ని పళ్లు, పలహారాలు తెచ్చి ఇస్తున్నా జూలో ఉండే మూగజీవులన్నీ తమకు అలవాటైన అడవినే కోరుకుంటాయి. వాటికదే స్వర్గం.. సేమ్ ఇలాగే ఈ కిల్లర్ తిమింగలం కూడా కాస్త స్వేచ్ఛ కోరుకుంటోంది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
Photo Feature: ట్రాఫిక్ తిప్పలు.. చిన్నారుల సాహసం
ఆ ఊరి పిల్లలు స్కూల్‌కు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఎందుకంటే చిన్నారులు చదువు కోసం వాగు దాటి వెళ్లాలి. ఇక పెద్ద నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు నిత్యకృత్యంగా మారాయి. ఏళ్లకేళ్లుగా అన్నదాతల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్‌లో చెరుకు రైతులు రోడ్డెక్కారు. మరోవైపు దేశవ్యాప్తంగా దసరా పండుగ సన్నాహాలు మొదలయ్యాయి. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ వార్తలు ఇక్కడ చూడండి. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్లో చెరకు క్రషింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ర్యాలీ చేపట్టి పట్టణ బంద్ నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి రైతులు ర్యాలీగా హుగ్గెళ్లి వరకు వెళ్లి తిరిగి అంబేడ్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 65వ జాతీయ రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. క్రషింగ్ చేపట్టకపోతే ఆందోనళలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంపై దట్టంగా మేఘాలు కమ్ముకుని ఇలా కనువిందు చేశాయి. బడికి వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటాల్సిందే. చదువు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలా బడికి వెళ్తున్నారు ఆ చిన్నారులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన విద్యార్థులు నాగసముద్రాల గ్రామంలోని మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే ఊరు నుంచి పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా.. పట్టించుకునేవారు లేరు. – కోహెడరూరల్ (హుస్నాబాద్) హైదరాబాద్‌లో ట్రాఫిక్ తిప్పలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బండి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అయినా ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గుతాయని భావించారు. కానీ పరిస్థితి మారడం లేదు. కూకట్‌పల్లిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యం ఇది. దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నందున ముంబైలోని చించ్‌పోక్లీలో దేవతా విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్న కళాకారుడు. కార్డెలియా క్రూయిజ్ షిప్లో ముంబై నుంచి లక్షద్వీప్‌కు వెళ్తున్న పర్యాటకులకు కొచ్చిలో కేరళ టూరిజం ఈవెంట్లో భాగంగా స్వాగతం పలుకుతున్న కళాకారులు. మహారాష్ట్ర థానేలోని మజివాడ నాకా సమీపంలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం నెలకొన్న టాఫిక్ రద్దీ. భారత్‌లో అత్యంత పురాతనమైన చేరమాన్ జుమా మసీదు ఇది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఇది ఉంది. క్రీస్తు శకం 629లో నిర్మించిన దీనికి మరమ్మతులు చేపట్టి, తిరిగి తెరచేందుకు సిద్ధం చేస్తున్నారు. సముద్రంలో మరణించిన ఓ తిమింగల కళేబరం అలల ధాటికి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఈ దృశ్యం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న వాసాయ్ బీచ్‌లో బుధవారం కనిపించింది. తమ దేశంలోని హైతియన్లను అమెరికా ఓ విమానం ద్వారా హైతీకి పంపింది. వారు అక్కడ దిగాక, తిరిగి అదే విమానం ఎక్కి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం. -
గుంటూరు : తిమింగళం లాలాజలం విక్రయించే ముఠా అరెస్ట్
-
చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. తిమింగలం నోటిలో 30 సెకన్ల పాటు
యముడి ఇంటి తలుపు తట్టి రావడం అంటే ఇదేనేమో..! అమెరికాలో ఓ గజ ఈతగాడు దాదాపు ఇదే పనిచేసి వచ్చాడు. చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. ఇంకా భూమిపై నూకలు తినే భాగ్యం ఉంది కాబట్టి బతికి బట్టకట్టాడు. ఇంతకీ ఏమైందంటే అమెరికాలోని కేప్ కాడ్ సముద్రతీర ప్రాంతంలో 56 ఏళ్ల మైఖేల్ పకార్డ్ ఈత కోసం వెళ్లాడు. 45 అడుగుల లోతులో ఉండగా, ఒక్కసారిగా తాను పెద్ద కుదుపునకు గురయ్యాడు. అంతలోనే చుట్టూ చిమ్మచీకటి కమ్ముకుంది. షార్క్ చేప మింగేసిందని మొదట అనుకున్నాడు. అయితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిమింగలం మింగిందని, ఇక తన పని అయిపోయినట్లేనని భావించాడు. హంప్‌బ్యాక్ తిమింగలం నోటిలో దాదాపు 30 సెకన్ల పాటు ఉన్నాడు. గాలి పీల్చుకునేందుకు అవసరమైన పరికరం ఉండటంతో గాలి పీల్చుకోగలిగాడు. చివరకు ఆ తిమింగలం సముద్రం ఉపరితలంపైకి వచ్చి దాని తలను విదిల్చి ఒక్కసారిగా మైఖేల్‌ను ఉమ్మేసింది. దీంతో అతడు బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. ఈ సంఘటన తర్వాత ఆస్పత్రిలో చేరిన మైఖేల్.. తిమింగలం తనను మింగిన విషయాన్ని చెప్పడంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా తిమింగలాలు చేపలను మింగేటప్పుడు నోరు తెరిచి చేపలతో పాటు నీటిని ఒక్కసారిగా మింగేస్తాయని తిమింగలాలపై అధ్యయనం చేసే జూకీ రాబిన్స్ వివరించారు. వీటి నోరు పెద్దగా ఉన్నప్పటికీ, గొంతు మాత్రం చిన్నగా ఉంటుందని, మనుషులను మింగేంత పెద్దగా ఉండకపోవడం వల్లే మైఖేల్‌ను మింగలేక ఉమ్మేసినట్లు తెలిపారు. -
12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్ వద్దకు ఎవరు రావొద్దు
లండన్: యూకేలోని టీసైడ్ నదీ తీరానికి మింక్ జాతికి చెందిన 12 అడుగుల భారీ తిమింగళం కొట్టుకువచ్చింది. ఈ విషయాన్ని బ్రిటీష్ అధికారులు గురువారం ధృవీకరించారు. ఆ భారీ తిమింగళం అవశేషాన్ని తొలగించేవరకు బీచ్ వద్దకు ప్రజలు ఎవరు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్రిటీష్ డైవర్స్ మెరైన్ లైఫ్ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. కాగా జూన్ 2న బీచ్‌కు వచ్చిన ఫియోనా రౌబోత్ అనే మహిళకు కొద్ది దూరంలో పెద్ద తిమింగళం కనిపించిదని.. కానీ అది చనిపోయిందని తెలిపింది.దానికి సంబంధించిన ఫోటోలను కూడా తన ట్విటర్లో షేర్ చేసింది. మహిళ షేర్ చేసిన ఫోటో ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు తిమింగళం మృతికి గల కారణాలను కూడా అన్వేషించే పనిలో పడ్డారు. కాగా మింక్ జాతి తిమింగళాలు 9 నుంచి 10 అడుగుల పొడవు వరకు మాత్రమే ఉంటాయని వేల్ అండ్ డాల్ఫిన్ పరిరక్షణ కమిటీ పేర్కొంది. తాజాగా బయటపడిన 12 అడుగుల భారీ తిమింగళం మింక్ జాతిలో అతి పెద్దదని ఆ కమిటీ తెలిపింది. చదవండి: జాలర్లకు జాక్‌పాట్: దరిద్రం పోయి ఊరు బాగుపడింది -
కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు
బ్యాంకాక్: వాంటింగ్.. కక్కు వినగానే ముఖం అదోలా పెడతాం. ఆ దృశ్యం చూడాలన్న కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కక్కుతో లక్కు కలిసొచ్చిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా. వాంతికి చేసుకుంటే.. అదృష్టం కలసిరావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవండి. థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపోర్న్ నియామ్రిన్(49) కొద్ది రోజుల క్రితం బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తోంది. సడెన్‌గా ఆమె కాళ్లకు ఏదో తగిలింది. సముద్రపు జీవి అనుకుంటూ కిందకు వంగి చూసింది. నీచు వాసన వస్తుండటంతో చేపల జాతికి చెందిన జీవిగా భావించింది. ధైర్యం చేసి పట్టుకోగా చేతికి గట్టగా తగిలింది.. దాంతో ఇది ఏదో విలువైన వస్తువే అయి ఉంటుందని భావించి.. దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది నియామ్రిన్. ఇంటికి పక్కల వారిని పిలిచి.. తాను తీసుకొచ్చిన వస్తువు/పదార్థం ఏంటో గుర్తించాల్సిందిగా కోరింది నియామ్రిన్. వారు దాన్ని నిశితంగా పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. నియామ్రిన్ దరిద్రం తీరిపోయిందని.. త్వరలోనే ఆమె కోటీశ్వరురాలు కాబోతుందని తెలిపారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక నియామ్రిన్ తడబడింది. ఆ తర్వాత వారు చెప్పిన విషయం విని ఆమెకు షాక్‌తో నోట మాట రాకుండా పోయింది. ఇంతకు నియామ్రిన్కు బీచ్‌లో దొరికిన వస్తువు ఏంటంటే తిమింగలం వాంటింగ్. కక్కిన తర్వాత అది ఇలా గట్టిగా మారిపోయింది. ఇక మార్కెట్లో తిమింగలం వాంతికి ఫుల్ డిమాండ్. భారీగా ధర పలుకుతుంది. ఇక నియామ్రిన్కు దొరికిన తిమింగలం వాంతి ముద్ద 12 ఇంచుల వెడల్పు, 24 ఇంచుల పొడవు ఉంది. దీని ధర సుమారు1.86 లక్షల పౌండ్లు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 1.8 కోట్ల రూపాయలు. నియామ్రిన్ మాట్లాడుతూ ‘‘ఇది నిజంగా తిమింగలం వాంతేనా.. కాదా అనే విషయం గురించి చెప్పడానికి నిపుణులను ఆహ్వానించాను. ఇది నిజమైన తిమింగలం వాంతికే అంటే.. ఇక నా ఆర్థిక స్థితి ఎంతో మెరుగవుతుంది. దీన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో నా చుట్టు ఉన్న వారికి సాయం చేస్తాను. ఇది నాకు భారీగా డబ్బు ఇస్తుందని భావిస్తున్నాను. ప్రస్తుతం దీన్ని నా ఇంట్లోనే భద్రంగా దాచాను’’ అని తెలిపింది. స్పెర్మ్ తిమింగలాలు వ్యవస్థలో ఈ వాంతికి తయారవుతుంది. దీనికి ఇంత డిమాండ్ ఎందుకంటే.. పర్ఫ్యూమ్స్ తయారిలో వినియోగిస్తారు. ఇలా తయారు చేసిన పర్ఫ్యూమ్స్ ఎక్కువ సేపు సువాసన వెదజల్లుతాయి. చదవండి: షాకింగ్ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’ -
ఒడ్డుకు కొట్టుకువచ్చిన భారీ తిమింగలం
భువనేశ్వర్ : 'సముద్రం ఒడ్డుకు గాయాలపాలైన ఓ భారీ తిమింగళం కొట్టుకు వచ్చిన ఘటన ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని గోపాలపూర్ తీరానికి ఆనుకుని ఉన్న సోన్పూర్ తీరానికి గురువారం 18 అడుగుల తిమింగలం కొట్టుకువచ్చింది. శుక్రవారం ఉదయం అటువైపుగా వెళ్లిన కొంతమంది మత్స్యకారులు గాయాలతో పడి ఉన్న ఆ తిమింగలాన్ని చూసి అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గాయాలపాలైన తిమింగలానికి చికిత్స చేశారు. అనంతరం దానిని సముద్రంలోకి సురక్షితంగా విడిచిపెట్టారు. -
తిమింగలంతో దోస్తి
వావ్ అనిపించే చిత్రం.. ఏదో బెస్ట్ ఫ్రెండ్స్‌లాగ.. వీరిద్దరి బంధం సూపర్ కదూ.. దీని వెనుక ఓ కథ ఉంది. 2019లో నార్వేలోని హామర్ఫెస్ట్లో శరీరంపై కెమెరా తగిలించి ఉన్న ఈ బెలూగా వేల్ కొంతమంది మత్స్యకారులకు కనిపించింది.. ఈ కెమెరా పరికరం మీద సెయింట్ పీటర్స్బర్గ్ పేరు ఉండటంతో.. రష్యావాళ్లు పంపిన గూఢచారి తిమింగలం అని అప్పట్లో అనుకున్నారు.. కన్ఫర్మ్ కాలేదనుకోండి.. అయితే.. కెమెరా చుట్టి ఉండటంతో ఇది చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది.. తిమింగలం కావడంతో దాన్ని విప్పదీయడానికి అందరూ దూరం నుంచి ట్రై చేశారు.. కానీ సాధ్యం కాలేదు.. అప్పుడు ఈ చిత్రంలోని హెస్టెన్ అనే వ్యక్తి ధైర్యం చేసి.. నీళ్లలోకి దిగి.. దీనికి బంధవిముక్తి కలిగించాడు. అప్పట్నుంచి వీరిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు.. ఆ మధ్య కలిసినప్పుడు ఓ ఫొటోగ్రాఫర్ తీసిన చిత్రమిది.. అద్భుతంగా ఉంది కాబట్టి.. సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్ 2021 తుది జాబితాకు ఎంపికైన చిత్రాల్లో దీనికీ చోటు దక్కింది. ఇంకో విషయం.. ఈ వేల్కు ఉన్న ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఇప్పుడది లోకల్‌గా ఓ సెలబ్రిటీ అయిపోయింది. దూరప్రాంతాల నుంచి పర్యాటకులు దీన్ని చూడటానికి వస్తుంటారు. -
షాకింగ్ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’
తిమింగలాన్ని చూస్తేనే చాలా మంది భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా దానిపై దూకి సముద్రంలో చక్కర్లు కొట్టాడు. మొప్పల్ని మలిచి దానిపై సవారీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన సౌదీ అరేబియాలోని యంబూ పట్టణతీరంలో చోటుచేసుకుంది. వివరాలు.. జకీ అల్- సబాహి అనే వ్యక్తి స్నేహితులతో కలిసి సముద్రం(రెడ్ సీ)లో బోటులో సరదాగా షికారుకు వెళ్లాడు. ఇంతలో రెండు తిమింగలాలు వారి బోటుకు సమీపంలోకి వచ్చాయి. (ఆవును హెలికాప్టర్లో ఇంటికి చేర్చిన రైతు) దీంతో అతడు ఒక్క ఉదుటున తిమింగలంపైకి దూకాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఉత్సాహపరుస్తుండగా కాసేపు దానిపై షికారు చేశాడు. ఈ షాకింగ్ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది జకీ అల్ ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. మరికొంత మంది మాత్రం.. ‘‘జీవరాశులను హింసించడం ఎంతవరకు సమంజసం, అది నిన్ను మింగేయాల్సింది అప్పుడు తెలిసేది. నిజంగా నువ్వు మూర్ఖుడివే’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇక చాలా మటుకు తిమింగలాలు ప్రశాంతంగానే ఉంటాయని, అయితే వాటికి కోపం వస్తే మాత్రం భయంకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని జంతు ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. కాగా గతంలోనూ కొంతమంది వ్యక్తి ఇలాంటి స్టంట్లు చేసి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే.(వైరల్ : అందుకే అవంటే మాకు ప్రాణం!) -
తిమింగలాన్ని కాపాడిన వ్యక్తికి జరిమానా
సిడ్నీ : సముద్రంలో వలలో చిక్కుకుపోయిన తిమింగలాన్ని కష్టపడి విడిపించిన వ్యక్తికి ఆస్ట్రేలియా అధికారులు జరిమానా విధించారు. గోల్డ్‌కోస్ట్‌లోని సముద్రపు నీటిలో మంగళవారం ఓ భారీ తిమింగలం వలలో చిక్కుకుపోయింది. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చినా వెంటనే ఎవరూ రాకపోవడంతో ఆ యువకుడు దాన్ని కాపాడటానికి ముందుకు వచ్చాడు. వెంటనే అక్కడికి తన బోటులో వెళ్లి, వలలో చిక్కుకుపోయిన తిమింగలాన్ని తన వద్ద ఉన్న కత్తి సహాయంతో విడిపించాడు. అయితే ఎంతో కష్టపడి దాన్ని విడిపిస్తే, ఒడ్డుకు రాగానే అధికారులు తనకు జరిమానా విధించారని ఆ యువకుడు వాపోయాడు. కౌన్సిల్ ఆస్తులకు నష్టం కలిగించినందుకు, తిమింగలానికి దగ్గరగా వెళ్లినందుకుగానూ క్వీన్స్లాండ్ స్టేట్ అధికారులు జరిమానా విధించినట్టు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియాలోని బీచ్‌ల చుట్టూరా వలలను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. -
ఈ ఫొటో.. మనిషి మూర్ఖత్వానికి పరాకాష్ట!
ఎడిన్బర్గ్: ప్లాస్టిక్ రక్కసికి మరో సముద్ర జీవి బలైంది. ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలాన్ని తరలించే వీల్లేక అక్కడే పాతిపెట్టారు. ఈ క్రమంలో తిమింగలం శరీరం నుంచి దాదాపు 100 కిలోల ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. ఈ విషాదకర ఘటన స్కాట్లాండ్లో చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక హారిస్ బీచ్ ఒడ్డుకు దాదాపు 20 టన్నుల మగ తిమింగలం కొట్టుకువచ్చింది. దీనిని గమనించిన స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు బీచ్ వద్దకు చేరుకున్నారు. అయితే దానిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా.. శరీరం నుంచి తాళ్లు, కప్పులు, బ్యాగులు, గ్లోవ్స్, చేపలు పట్టే వలలు, బాల్స్ వంటి దాదాపు క్వింటాళ్ ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. దీంతో తిమింగలాన్ని అక్కడే పాతిపెట్టారు. కాగా ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది చాలా విషాదకర ఘటన. తిమింగలం కడుపులో కిలోల కొద్దీ చెత్త పేరుకుపోవడం చూస్తుంటే మనుషులు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం’ లేదు అంటూ మండిపడుతున్నారు. ఇక వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై స్పందించిన స్కాటిష్ సముద్ర జీవుల సంరక్షణ సంస్థ... ‘ సముద్ర కాలుష్యం వల్ల ఎన్నో జీవులు మృత్యువాత పడుతున్నాయి. భయంకరమైన ప్లాస్టిక్ వస్తువులు అరగించుకోలేక ప్రాణాలు విడుస్తున్నాయి. చెత్త వేయడం జంతుజాలాలకు ప్రమాదకరమని చెప్పినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు’ అని సోషల్ మీడియాలో పేర్కొంది. ఇది ప్రపంచ పర్యావరణ సమస్యగా పరిణమించినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా తిమింగలానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... పర్యావరణ ప్రేమికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘మనిషి కార్యకలాపాల వల్లే ఇదంతా జరుగుతుంది. పంచ భూతాలను కలుషితం చేసి ప్రాణకోటిని ప్రమాదంలోకి నెడుతున్నాడు. మనిషి మూర్ఖత్వానికి ఇలాంటి ఫొటోలు పరాకాష్ట’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక యునైటెడ్ కింగ్డంలోని డోనా నూక్ నేచర్ రిజర్వులో అప్పుడే పుట్టిన ఓ సీల్ పప్(సముద్ర జీవి సీల్ పిల్ల) గాజు సీసాతో ఆడుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నేచర్ ఫొటోగ్రాఫర్ డాన్ థర్లింగ్ రెండు వారాల క్రితం ఫేస్బుక్లో షేర్ చేసిన సీల్ పప్ ఫొటో జంతుప్రేమికుల మనసును కలచి వేసింది.(చదవండి : ఈ ఫొటో మమ్మల్ని కలచివేసింది!) -
తిమింగలంతో ఆట.. ఎంత బాగుందో!!
సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే యజమానుల మాటల్ని బుద్ధిగా వింటాయి. చెప్పిన పని చేస్తాయి. కోతి, కుక్క వంటి జంతువులే ఇందుకు నిదర్శనం. ఇక తాజాగా బెలుగా తిమింగలం కూడా ఈ కోవలోకి చేరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్కిటిక్ ధ్రువంలో ప్రయాణించిన కొంతమంది వ్యక్తులు.. బెలుగాతో తాము ఆడిన బంతి ఆట వీడియో షేర్ చేయడమే ఇందుకు కారణం. వివరాలు.. జెమిని క్రాఫ్ట్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఆర్కిటిక్ ధ్రువానికి షికారుకు వెళ్లాడు. బోటులో ప్రయాణిస్తున్న సమయంలో బెలుగా తిమింగలంతో సరదాగా ఆటలు ఆడారు. రగ్బీ ఆట అభిమానులైన క్రాఫ్ట్ బృందం రగ్బీ బంతిని నీళ్లలోకి విసురుతూ ఉంటే బెలుగా.. తిరిగి దానిని వాళ్లకు తెచ్చి ఇచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 4 మిలియన్లకు పైగా లైకులు సాధించింది. ఈ క్రమంలో... ‘తిమింగలంతో బంతి ఆట. భలే సరదాగా ఉంది. ఈరోజు చూసిన వీడియోల్లో ఇదెంతో కూల్‌గా ఉంది’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ వివరాల ప్రకారం.. బెలుగా తిమింగలాలు ఇతర ప్రాణులతో స్నేహం చేయడానికి ఆసక్తి కనబరుస్తాయి. ఈలలు, చప్పట్లు తదితర శబ్దాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఇతరులు ఇచ్చే సూచనలను పాటిస్తాయి. -
అడవిలో భారీ తిమింగలం మృతదేహం
రియో డి జనీరో : అమెజాన్ అడవుల్లో ఓ భారీ తిమింగలం మృతదేహం లభ్యమైంది. 36 అడుగుల పొడవున్న ఈ తిమింగలాన్ని హంప్‌బ్యాక్ జాతికి చెందిందిగా గుర్తించారు. బ్రెజిల్‌లోని మరాజో ఐలాండ్‌లో తిమింగలం మృతదేహం లభ్యమైంది. సముద్రం నుంచి తిమింగలం మృతదేహం ఉన్న ప్రాంతం 15 మీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో చనిపోయిన తర్వాత భారీ అలలకు తిమింగలం ఇక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందేమో అన్న కోణంలో బయాలజిస్టులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వయసు సంవత్సరం కూడా లేదని, దీని మృతిపై దర్యాప్తు చేస్తున్న బిచో డాగువా ఇన్స్టిట్యూట్ సభ్యులు చెబుతున్నారు. ఏడాది వయసు కూడా లేని ఈ భారీ సైజు తిమింగలం ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
మనిషి మూర్ఖత్వానికి పరాకాష్ట.. ఈ ఫొటోలు!
జకార్తా : ప్లాస్టిక్ భూతానికి మరో సముద్ర జీవి బలైంది. ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ తిమింగలాన్ని.. తరలించేందుకు ప్రయత్నించగా దాని శరీరం చెల్లాచెదురైపోయింది. ఈ హృదయ విదారక ఘటన ఇండోనేషియాలోని కపోటా ఐలాండ్‌లో చోటుచేసుకుంది. పర్యావరణాన్ని మనిషి ఎంతలా నాశనం చేస్తున్నాడు అనే దానికి తార్కాణంగా నిలిచింది. వివరాలు... ఇండోనేషియాలోని వకాటోబి జాతీయ పార్కులోని ఓ తిమింగలం సోమవారం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. విగత జీవిగా పడి ఉన్న ఆ తిమింగలాన్ని పార్కు అధికారులు అక్కడి నుంచి తొలగించే క్రమంలో దాని పొట్టలో నుంచి సుమారు వెయ్యి రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు(6 కిలోల ప్లాస్టిక్) బయటపడ్డాయి. కాగా ప్లాస్టిక్‌ను మింగడం వల్లే ఆ తిమింగలం మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ తిమింగలానికి సంబంధించిన ఫొటోలు పర్యావరణ హితులనే కాక యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్లాస్టిక్‌పై పోరాడాల్సిన ఆవశ్యకతను మరోమారు గుర్తుచేస్తున్నాయి. తిమింగలం శరీరం నుంచి బయటపడ్డ కప్పులు, చెప్పులు, స్ప్రింగులు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కావాలా!? ఇండోనేషియాలోని వకాటోబి జాతీయ పార్కు వైవిధ్యమైన జీవజంతుజాలాలకు ఆనవాలం. బందా, ఫ్లోర్స్ సముద్రాల మధ్య కేంద్రీకృతమైన ఈ మెరైన్ పార్కు సుమారు 942 రకాల చేప జాతులు, 750 రకాల పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. ఈ క్రమంలోనే 2005 నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటూ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదనలు పంపుతోంది. అయితే ప్రస్తుతం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఈ తిమింగలం శరీరంలో దొరికిన ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన పర్యావరణ ప్రేమికులు ఇండోనేషియా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం తర్వాత విషయం.. ముందు ప్లాస్టిక్ రక్కసిని కట్టడి చేసి జీవజాతులకు రక్షణ కల్పిస్తే బాగుంటుంది అని హితవు పలుకుతున్నారు. చైనా తర్వాత ఇండోనేషియానే! ఆసియా ఖండంలో ఉన్న 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్ దేశాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయని మెక్‌నెసీ సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ 2015లో నివేదిక వెల్లడించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో చైనా తర్వాత ఇండోనేషియా అత్యంత దుర్భర స్థితిలో ఉందని పేర్కొంది. తీర ప్రాంత అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను అక్కడ పడేయడం వల్లే సముద్ర జీవులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని తెలిపింది. (మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది) కాగా ఇండోనేషియా సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన తిమింగలం శరీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు లభించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్లాస్టిక్ వినియోగం అనే జాఢ్యం కేవలం ఒక్క ఇండోనేషియాకే పరిమితం కాలేదని.. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని ప్రమాణాలు చేయిస్తోన్న అనేక దేశాలు ఆ వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలని ఓ వైపు ఉపన్యాసాలు దంచుతున్న మానవాళి.. తన మూర్ఖత్వంతో భూమిపై నివసిస్తున్న మిగిలిన జీవజాతులను ఇబ్బంది గురి చేయడంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. -
ఆరు నుంచి ఆరు
హీరో సూర్య, దర్శకుడు హరిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ ఆల్రెడీ ‘ఆరు, వేల్ (తెలుగులో ‘దేవా’) ‘సింగం’ సిరీస్‌లో మూడు సినిమాలు.. ఇప్పటివరకూ మొత్తంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ‘ఆరు’ సినిమాతో కలసిన ఈ కాంబినేషన్ ఆరో సినిమా కోసం చేతులు కలపబోతున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ నిర్మించనుందట. అయితే సూర్య, హరి చేయబోయే చిత్రం ‘సింగం’ సిరీస్ సీక్వెల్ కోసం కాదు. ‘వేల్’ సీక్వెల్ అని చెన్నై టాక్. మరోవైపు సీక్వెల్ కాదు.. ‘వేల్’ సినిమా తరహాలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందనే వార్త వినిపిస్తోంది. 2019లో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియా ఆనంద్, సమీరా రెడ్డి యాక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం దర్శకుడు సెల్వ రాఘవన్‌తో ‘యన్‌జీకే’, కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు సూర్య. అలాగే ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఒప్పుకున్నారు సూర్య. దాంతో పాటుగా హరి చిత్రాన్ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తారని ఊహించవచ్చు. -
ముంబై బీచ్‌కు కొట్టుకొచ్చిన వేల్
ముంబై : నవీ ముంబైలోని ఖర్ దాండా తీరానికి 40 అడుగుల పొడవైన వేల్ శవమై కొట్టుకువచ్చింది. గురువారం ఉదయం వేల్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు మరణించింది బ్లూ వేల్ అని వెల్లడించారు. గత మూడేళ్లలో ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది సార్లు ఇలా మహారాష్ట్ర తీరానికి వేల్ మృతదేహాలు కొట్టుకొచ్చాయి. చనిపోయిన వేల్ టిష్యూలను మహారాష్ట్ర అధికారులు సేకరించారు. వేల్ దాదాపు 20 టన్నులకుపైగా బరువు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. చనిపోయి చాలాకాలం అవుతుండటం వల్ల బ్లూ వేల్ దేహం రంగు మారిందని తెలిపారు. -
భారీ తిమింగలం మృతి.. షాకింగ్ నిజాలు
బ్యాంకాక్ : ప్లాస్టిక్ భూతానికి ఓ భారీ తిమింగలం బలైంది. మానవుల నిర్లక్ష్యం ఆ సముద్ర జీవికి శాపంగా మారింది. థాయ్‌లాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్లాస్టిక్ వాడకంపై ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. దాని ప్రాణాలు నిలపడం కోసం ఐదు రోజులుగా ప్రయత్నించిన వెటర్నటీ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. థాయ్‌లాండ్, సంగాక్ల దక్షిణా ప్రాంతంలోని ఓ కెనాల్ సమీపాన అచేతన స్థితిలో ఉన్న ఓ భారీ తిమింగలాన్ని స్థానికులు గుర్తించి మెరైన్ కోస్టల్ రిసోర్స్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. తిమింగళం పొట్ట నుంచి తీసిన ప్లాస్టిక్ కవర్లు విస్తుపోయే విషయాలు.. ఆ తిమింగలం అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి వెటర్నీ డాక్టర్లు ప్రయత్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. భారీ సంఖ్యలో ప్లాస్టిక్ బ్యాగులను తిమింగలం పొట్టలో పేరుకుపోయాయి. దాని పొట్ట నుంచి 5 ప్లాస్టిక్ బ్యాగ్‌లను తొలిగించగానే అది మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అనంతరం దాని పొట్టలో మొత్తం 8 కేజీల బరువుగల 80 ప్లాస్టిక్ బ్యాగులను గుర్తించామని మెరైన్ కోస్టల్ రిసోర్స్ డిపార్ట్మెంట్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇలా కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో తిమింగలం జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, దాని మృతికి ఇదే కారణమని వైద్యులు పేర్కొన్నారు. కెనాల్ నుంచి తిమింగలాన్ని బయటకు తీస్తున్న వెటర్నటీ సిబ్బంది చిన్న చేపలు, సముద్ర జీవులను వేటాడి ఆహారంగా తీసుకునే తిమింగలాలకు అవి లభించకపోవడంతో ప్లాస్టిక్‌నే ఆహారంగా తీసుకుంటున్నాయని మెరైన్ కోస్టల్ డిపార్ట్మెంట్ హెడ్ జతుపోర్న్ తెలిపారు. ప్లాస్టిక్ వాడకంపై థాయ్‌లాండ్ ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. థాయ్‌లాండ్ ప్రజలు ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతున్నారని చెప్పారు. 2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణమే ఎక్కువగా ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెచ్చరిస్తూ ఓ నివేదికలో వెల్లడించింది. మన దేశంలో కూడా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గడం లేదు. ఇది జంతువులకు శాపంగా మారింది. -
కిల్లర్ వేల్-సముద్ర సింహం భీకర పోరాటం
ఒట్టావా, కెనడా : కిల్లర్ వేల్తో సముద్ర సింహం భీకర పోరాటాన్ని ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. తాను కాయకేయింగ్కు వెళ్లిన సమయంలో సముద్ర సింహాల గుంపుపై దాడికి పాల్పడిన కిల్లర్ వేల్ వాటిని చంపి తిన్నట్లు చెప్పుకొచ్చారు. దాడికి వచ్చిన వేల్పై సింహాలు తిరగబడినా ప్రయోజనం నిష్ఫలమని అన్నారు. కొద్దిగంటల పాటు రెండింటి మధ్య సాగిన పోరులో వేల్ గెలిచిందని, ఓడిన సముద్ర సింహాలను అది చంపి తిన్నట్లు తెలిపారు. -
భారీ తిమింగలం మృతి.. షాకింగ్ నిజాలు
ఓస్లో: నార్వే సముద్రతీరంలో ఇటీవల ఓ భారీ తిమింగలం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇక బతికే అవకాశం లేకపోవడంతో మెరైన్ బయాలజిస్టులు దానికి కారుణ్య మరణం ప్రసాదించారు. అనంతరం.. దాని తీవ్ర అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్జిన్కు చెందిన పరిశోధకులు ప్రయత్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 30 ప్లాస్టిక్ బ్యాగులతో పాటు.. భారీ సంఖ్యలో మానవ వ్యర్థాలను తిమింగలం పొట్టలో గుర్తించారు. ఇలా భారీ సంఖ్యలో వ్యర్థాలను తీసుకోవడం మూలంగా.. తిమింగలం జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, దాని మృతికి కారణం ఇదే అని జంతు శాస్త్రవేత్త టెర్జీ లిస్లెవాండ్ తెలిపారు. 2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణమే ఎక్కువ ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ నివేదికలో వెల్లడించింది.