World Cup 2011
-
WC 2011: ఆ రోజు ధోని సిక్సర్ కొట్టగానే.. హిస్టారిక్ మూమెంట్స్! (ఫొటోలు)
-
మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే..
Sehwag's epic take on Kohli lifting Sachin Tendulkar on shoulders: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2011లో ధోని సేన అద్భుతం చేసింది. దిగ్గజ ఓపెనర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సహా గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. ఆ విన్నింగ్ సిక్సర్ ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విన్నింగ్ సిక్సర్‌ను ఎవరూ అంతతేలికగా మర్చిపోరు. అదే విధంగా చాంపియన్‌గా నిలిచిన అనంతరం సచిన్ టెండుల్కర్‌ను భుజాల మీద ఊరేగిస్తూ ఘనంగా సత్కరించుకున్న తీరు కూడా సగటు అభిమాని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కోహ్లి భుజాలపై సచిన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేతిలో జాతీయ జెండా రెపరెపలాడిస్తుండగా.. నాటి కుర్ర బ్యాటర్ విరాట్ కోహ్లి అతడిని భుజాల మీద మోశాడు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్ తదితరులు అతడికి సాయం అందించారు. మరుపురాని ఈ దృశ్యాలు నెమరువేసుకున్నడప్పుల్లా అభిమానుల గుండెలు ఆనందంతో ఉప్పొంగుతాయనడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్ నిర్వహణ హక్కులను భారత్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సచిన్‌ను భుజాలపై ఊరేగించిన ఘటన గురించి ఆసక్తికర విషయం పంచుకున్నాడు. సచిన్‌ను మోయడం మావల్ల కాదు బాబోయ్! ‘‘సచిన్‌ను మోయడం మావల్ల కాదని చేతులెత్తేశాం. ఎందుకంటే సచిన్ చాలా బరువుగా ఉంటాడు కదా! అసలే అప్పటికే మేం ముసలోళ్లం. మాకు భుజం నొప్పులు.. ధోనికేమో మోకాలి సమస్యలు.. మిగతా వాళ్లకు మరేవో ఇబ్బందులు.. అందుకే కోహ్లి అలా అందుకే భారమంతా యువ ఆటగాళ్లపైనే వేశాం. మీరు వెళ్లి సచిన్ టెండుల్కర్‌ను ఎత్తుకోండి అని చెప్పాం. అందుకే విరాట్ కోహ్లి ఆ పని చేశాడు’’ అని వీరూ భాయ్ సరదాగా చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు జరుగనున్న వన్డే వరల్డ్‌కప్-2023 రోహిత్ సేనకు ప్రతిష్టాత్మకంగా మారింది. సొంతగడ్డపై మెగా టోర్నీ నేపథ్యంలో ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి ఏం జరుగుతుందో?! ఇక 1983లో తొలిసారి ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. 2019లో తొలిసారి ప్రవేశపెట్టిన ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రెండుసార్లు చేరుకున్నప్పటికీ తుదిపోరులో చేతులెత్తేసింది. చదవండి: WC 2023: ఈసారి హోరాహోరీ తప్పదు.. ట్రోఫీ ఆ జట్టుదే: టీమిండియా మాజీ కెప్టెన్ పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో -
WC 2011: నాడు కోహ్లికి నేను ఏం చెప్పానంటే: సచిన్ టెండుల్కర్
Sachin Tendulkar- Virat Kohli- ICC World Cup 2011 Final: భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్-2011 ట్రోఫీని ధోని సారథ్యంలోని టీమిండియా ముద్దాడిన దృశ్యాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక.. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సెహ్వాగ్, సచిన్ త్వరత్వరగా ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(0), సచిన్ టెండ్కులర్(18)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం గౌతం గంభీర్(97), ధోని(91) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిసి భారత్‌కు రెండో సారి వన్డే ప్రపంచకప్‌ను అందించారు. నాడు కోహ్లికి ఏం చెప్పారు? ఇదిలా ఉంటే.. సచిన్ పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో బ్యాటింగ్‌కు వస్తున్న విరాట్ కోహ్లితో ముచ్చటించిన విషయం క్రికెట్ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆనాటి ఆ ఘటన గురించి చెప్పమని ఓ నెటిజన్ సచిన్ టెండుల్కర్‌ను ఆడిగాడు. బంతి కాస్త స్వింగ్ అవుతోంది ఆస్క్ సచిన్ సెషన్లో భాగంగా శుక్రవారం ఈ మేరకు ప్రశ్న ఎదురుకాగా.. "బంతి కొద్దిగా స్వింగ్ అవుతోంది, జాగ్రత్త" అని చెప్పానంటూ సచిన్ బదులిచ్చాడు. ఇక సచిన్ అవుటైన తర్వాత నాడు క్రీజులోకి వచ్చిన కోహ్లి గంభీర్‌తో కలిసి 83 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్.. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దిల్షాన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక యువరాజ్ సింగ్‌తో కలిసి ధోని ఫినిషింగ్ టచ్ ఇచ్చి భారత్‌ను విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సుదీర్ఘ నిరీక్షణకు ఆరోజుతో తెర ఇక 2011, ఏప్రిల్ 2న భారత్ మరోసారి ప్రపంచ విజేతగా నిలవడంతో తన సుదీర్ఘ కెరీర్లో ఐసీసీ టైటిల్ లేదన్న సచిన్ టెండుల్కర్ నిరీక్షణకు తెరపడింది. ఆరోసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన అతడి ఖాతాలో టైటిల్ చేరింది. ఈ నేపథ్యంలో చాంపియన్‌గా అవతరించిన అనంతరం ఈ టీమిండియా దిగ్గజాన్ని భుజాలపై ఊరేగిస్తూ సహచర ఆటగాళ్లు అతడికి సముచిత గౌరవం ఇచ్చారు. నాటి ఆ దృశ్యాలు ఇప్పటికీ క్రికెట్ ప్రేమికుల మనసులో మెదలుతూనే ఉంటాయి. చదవండి: పంజాబ్‌తో మ్యాచ్..ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్! మరి రోహిత్? నువ్వేమీ ముసలోడివి కాలేదు!; సచిన్‌లా 16 ఏళ్లకే ఆట మొదలెడితే: ధోని -
టీమిండియాదే వరల్డ్‌కప్.. రోహిత్ శర్మ సాధ్యం చేస్తాడు.. అలా జరుగుతుందంతే..!
టీ20 వరల్డ్‌కప్-2022లో వరుస విజయాలు సాధిస్తూ, గ్రూప్-2లో తొలి స్థానంతో సెమీస్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనైనా జగజ్జేతగా నిలుస్తుందని వంద కోట్లకుపైగా ఉన్న భారతీయ అభిమానులు ధీమాగా ఉన్నారు. ఫ్యాన్స్ ధీమాకు భారత ఆటగాళ్ల ప్రదర్శన ఒక కారణమైతే.. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు కలిసివస్తున్న సెంటిమెంట్ మరో కారణం. రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు అన్ని ఫార్మాట్లలో తొలి టోర్నీ లేదా సిరీస్‌ల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. తొలి ఐపీఎల్, తొలి ఛాంపియన్స్ లీగ్, తొలి వన్డే, టీ20 సిరీస్, తొలి ముక్కోణపు సిరీస్, తొలి టెస్ట్ సిరీస్, తొలి ఆసియా కప్.. ఇలా కెప్టెన్‌గా తన అరంగేట్రం సిరీస్లన్నింటిలో హిట్‌మ్యాన్ భారత్‌ను విజేతగా నిలిపాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ మరోసారి తప్పకుండా రిపీట్ అవుతుందని భారత అభిమానులు వంద శాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌కు ఇదే తొలి టీ20 వరల్డ్‌కప్ కావడంతో ఈ మెగా టోర్నీలోనూ టీమిండియా గెలవడం పక్కా అంటూ గుడ్డిగా నమ్ముతున్నారు. టీమిండియాదే వరల్డ్‌కప్.. రోహిత్ శర్మ సాధ్యం చేస్తాడు.. అలా జరుగుతుందంతే అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ సెంటిమెంట్‌కు తోడు మరో యాదృచ్చిక విషయం టీమిండియా ఫ్యాన్స్ నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. 2011లో టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచినప్పటి సమీకరణలు.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంచుమించు అలాగే రిపీటవుతున్నాయి. 2011 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, ఐర్లాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి, సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నిష్క్రమణ, సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి సమీకరణలు చోటు చేసుకోగా.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అచ్చం అలాంటి సమీకరణలే మరోసారి రిపీటయ్యాయి. గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, ఐర్లాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి, సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నిష్క్రమణ, సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు చేరాయి. యాదృచ్చికంగా కుదిరిన ఈ సమీకరణల గురించి తెలిసి భారతీయ అభిమానులు ఇప్పటి నుంచే గెలుపు సంబురాల్లో మునిగితేలుతున్నారు. అన్నీ కలిసొస్తున్నాయి.. ఇక మనల్నెవడ్రా అపేది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఫైనల్ ఫోర్ జట్లు ఏవన్నది నిన్ననే తేలిపోయింది. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. నవంబర్ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్‌లు.. ఆమరుసటి రోజు (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. -
'ఉన్నప్పుడు పెద్దగా ఏం పీకలేదు.. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు'
క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది టీమిండియా, పాకిస్తాన్‌లు. ఈ రెండు జట్లు ఎప్పుడు ఎక్కడ తలపడినా సరే.. ఆయా దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఓడిన జట్టు విమర్శల పాలైతే.. గెలిచిన జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక వరల్డ్‌కప్ లాంటి మేజర్ టోర్నీలైతే ఇక చెప్పనవసరం లేదు. కప్ గెలవకపోయినా సరే.. చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధిస్తే చాలని రెండు దేశాల అభిమానులు కోరుకుంటారు. ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ల్లో పాకిస్తాన్ టీమిండియాను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో కీలకమైన సెమీఫైనల్లో దాయాదులు తలపడ్డాయి. సెమీస్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మొహలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అప్పటి ఇరు దేశాల ప్రధానమంత్రులు మొహాలీకి తరలివచ్చారు. ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (85), వీరేంద్ర సెహ్వాగ్ (38), సురేశ్ రైనా (36) రాణించారు. పాక్ తరఫున వహాబ్ రియాజ్ 5 వికెట్లు తీశాడు. అయితే లక్ష్య ఛేదనలో పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. మిస్బా ఉల్ హక్ (56), మహ్మద్ హఫీజ్ (43) లు పాక్ ను ఆదుకున్నారు. భారత బౌలర్లు (జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, యువరాజ్) లు సమిష్టిగా రాణించి తలా రెండు వికెట్లు తీసి భారత్ కు విజయాన్ని అందించారు. దీంతో ఫైనల్ చేరిన టీమిండియా ఆ తర్వాత శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తర్వాత విశ్వ విజేతగా అవతరించింది.మరి ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనే కాదా మీ డౌటూ. అక్కడికే వస్తున్నాం. 2011 వన్డే వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌పై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడి ఉంటే భారత్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేదని.. ప్రపంచకప్ ఫైనల్‌కు పాకిస్తాన్ వెళ్లేదంటూ పేర్కొన్నాడు. అక్తర్ మాట్లాడుతూ.. ‘మొహాలీ జ్ఞాపకాలు నన్ను తీవ్రంగా వెంటాడుతున్నాయి. 2011 వరల్డ్ కప్ సెమీస్ లో నేను ఆడి ఉండాల్సింది. కానీ మా టీమ్ మేనేజ్మెంట్ మ్యాచ్‌కు ఫిట్ గా లేనని నన్ను పక్కనబెట్టింది. ఇది దారుణం. నేను భారత్ ను ఓడించి పాక్ ను వాంఖెడే (పైనల్ జరిగిన స్టేడియం) కు తీసుకెళ్లాలని భావించా. స్వదేశంలో మాతో మ్యాచ్ అంటే భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దేశ ప్రజలు, మీడియా అంతా మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు మమ్మల్ని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో మాపై ఒత్తిడి లేదు. ఆ మ్యాచ్ లో గనక నేను ఆడి ఉంటే సచిన్, సెహ్వాగ్ లను ముందే ఔట్ చేసేవాడిని. దాంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయేది. దాంతో మేం మ్యాచ్ ను ఈజీగా నెగ్గేవాళ్లం. ఆ మ్యాచ్ లో నన్ను డగౌట్ లో కూర్చోబెట్టి పాక్ ఓడిపోతుంటే చూడటం నేను తట్టుకోలేకపోయా. అంత కీలక మ్యాచ్ లో ఓడితే చాలా మంది ఏడుస్తారు. కానీ నేను అలా కాదు. ఏడ్వడం కంటే నా చుట్టు పక్కల ఉన్న వస్తువులను పగలగొడతా. మేం ఓడిపోతున్నప్పుడు కూడా చాలా వస్తువులు పగలగొట్టా. నేను చాలా నిరాశకు గురయ్యా. ఆ వేదన ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది..’ అని తెలిపాడు. అక్తర్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ''అంతకముందు 2003 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు జట్టులోనే ఉన్నావుగా. మీ జట్టు ఓడిపోయిన సంగతి మరిచిపోయావా.. నీ బౌలింగ్‌లో సచిన్ శివతాండవం చేసింది గుర్తులేదా.. జట్టులో ఉన్నప్పుడు పెద్దగా పీకింది ఏం లేదు.. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు'' అని కామెంట్స్ చేశారు. చదవండి: Tilak Varma: ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు.. దటీజ్ తిలక్ వర్మ ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్ -
అప్పుడు ధోని.. ఇప్పుడు దినేష్ బనా; అదే విన్నింగ్ సిక్స్
''ధోని ఫినీషెస్ ఆఫ్ ఇస్ స్టైల్.. ఏ మాగ్నిఫిషియెంట్ స్ట్రైక్ ఇన్టూది క్రౌడ్.. ఇండియా లిప్ట్స్ ది వరల్డ్‌కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్''.. ఈ పదం క్రికెట్‌ను అభిమానించే ప్రతీ భారతీయుడు తమ ఊపిరి ఉన్నంతవరకు మరిచిపోడు. మన చెవుల తుప్పు వదిలేలా ఎన్నోసార్లు ఈ వీడియోనూ యూట్యూబ్‌ల్లో ప్లేచేసిన సందర్భం కోకోల్లలు. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా 2011 ప్రపంచకప్ అందుకున్న మధుర క్షణాలవి. ఇక ఆరోజు శ్రీలంకతో ఫైనల్లో ఎంఎస్ ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ ఎన్నోసార్లు టీవీలో చూసుంటాం. అయినా అది మరిచిపోయే విషయం కాదని కూడా తెలుసు. ఆ ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మహీ 90 పరుగులు నాటౌట్‌గా నిలిచి చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారా. విషయం ఏంటంటే.. శనివారం ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదోసారి చాంపియన్స్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆఖర్లో వికెట్ కీపర్ దినేష్ బనా కొట్టిన విన్నింగ్ సిక్స్ అచ్చం ధోని సిక్స్‌లా కనిపించింది. అక్కడ ధోని ఎలా అయితే సిక్స్ కొట్టి టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడో.. అచ్చం అదే తరహాలో దినేష్ బనా కూడా లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టి ఇండియాను ఐదోసారి అండర్-19 వరల్డ్ చాంపియన్స్‌లా నిలిపాడు. ఇంకేముంది కొన్ని నిమిషాల్లోనే బనా కొట్టిన సిక్స్‌ను ధోని సిక్స్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐసీసీ కూడా బనా సిక్స్ వీడియోనూ షేర్ చేస్తూ.. ''ఇంతకముందు ఇలాంటి సిక్స్‌తో ముగిసిన ఎండింగ్‌ను మీరెక్కడైనా చూశారా'' అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎంఎస్ ధోని.. దినేష్ బనాలు ఇద్దరు వికెట్ కీపర్లు కావడమే. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఖాతాలో మరో అరుదైన ఘనత 'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం' View this post on Instagram A post shared by ICC (@icc) -
టీమిండియా విన్నింగ్ టీమ్ బ్యాట్.. ధర తెలిస్తే షాకే!
Bat Signed by 2011 World Cup winning team fetches 25,000 USD.. క్రికెట్లో టీమిండియాకు '2011' ఒక గోల్డెన్ ఇయర్. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ధోని నాయకత్వంలోని టీమిండియా ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. 1983 కపిల్ డెవిల్స్ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ను అందుకున్న ఘనత ధోని సేనకే సాధ్యమైంది. ఇక శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్లో ధోని తన స్టైల్లో సిక్స్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించి కప్‌ను చేతిలో పెట్టాడు. ఇక విజయం సాధించిన అనంతరం టీమిండియా చేసిన రచ్చ అంత తొందరగా మరిచిపోలేం. భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను తమ భుజాలపై మోస్తూ అతనికి ధోని సేన కప్‌ను గిఫ్ట్‌గా అందివ్వడం ఒక చరిత్ర. ఆరోజు ధోని ట్రోఫీ అందుకున్న తర్వాత.. టీమిండియా ఆటగాళ్లంతా ఒక బ్యాట్‌పై తమ సంతకాలను చేశారు. దానికి 2011 వరల్డ్‌కప్ విన్నింగ్ ఇండియన్ క్రికెట్ టీమ్ బ్యాట్ అని పేరు పెట్టారు. తాజాగా ఆ బ్యాట్‌కు నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) రూపంలో భారీ ధర దక్కింది. చదవండి: 'సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్ ఫీలింగ్' ఇక క్రిక్ఫ్లిక్స్, రెవ్‌స్పోర్ట్స్, ఫనాటిక్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కలిసి సంయుక్తంగా ఎన్ఎఫ్టీ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. మొత్తంగా డిజిటల్ ఆర్టిక్రాప్ట్కు (335,950 అమెరికన్ డాలర్లు) ఎన్ఎఫ్టీ టోకెన్ రూపంలో బిడ్ వేశారు. ఇందులో టీమిండియా విన్నింగ్ టీమ్ బ్యాట్ ..వేలంలో 25వేల అమెరికన్ డాలర్లు పలికింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.18 లక్షలకు పైనే ఉంటుంది. అయితే ఇంతకముందు 2016లో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ సంతకం చేసిన ఎస్ఆర్హెచ్ జెర్సీకి ఎన్ఎఫ్టీ రూపంలో 30వేల అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.22 లక్షలుపైన) పలకింది. దుబాయ్ వేదికగా ఈ ఎన్ఎఫ్టీ వేలం నిర్వహించారు. ఇక సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్ క్రికెట్ కలెక్షన్ పేరుతో డిజిటర్ రైట్స్ రూపంలో వేలం నిర్వహించారు. ఈ ఎన్ఎఫ్టీ టోకెన్‌ను టెండూల్కర్ వీరాభిమాని.. ముంబైకి చెందిన అమల్ ఖాన్ 40వేల అమెరికన్ డాలర్లకు(ఇండియన్ కరెన్సీలో రూ .30,01,410) దక్కించుకోవడం విశేషం. చదవండి: Dinesh Karthik: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! ఎన్ఎఫ్టీ అంటే..! బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. చదవండి: NFT: ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే.. -
భజ్జీ నువ్వు కరెక్టే.. కానీ అలా అనకూడదు: గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బల్లెం వీరుడు నీరజ్ చోప్రా విశ్వక్రీడల వేదికపై స్వర్ణం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలోనే తన బల్లెంను అందరికంటే ఎక్కువ (87.58 మీటర్ల) దూరం విసిరి అథ్లెటిక్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నుంచి సామాన్యుడి వరకు నీరజ్ చోప్రాకు నీరజనాలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. True that @harbhajan_singh …But You shouldn’t have said this ! You should not say this ! You shall never say this ! 🤐🤣 https://t.co/ZfajGzjQaw— Gautam Gambhir (@GautamGambhir) August 7, 2021 నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం భారత క్రికెట్ జట్టు గెలిచిన 2011 ప్రపంచ కప్ కన్నా గొప్పదని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీటర్ వేదికగా స్పందించాడు. భజ్జీ నువ్వు కరెక్టే.. కానీ అలా అనకూడదు..ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పటికీ చేయకూడదంటూ ట్వీట్ చేశాడు. అయితే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. ఇటీవలే 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన విషయం తెలిసిందే. ఈ విజయం పట్ల కూడా యావత్ భారతం హర్షించింది. హాకీ టీమ్‌ను కొనియాడింది. ఈ క్రమంలోనే గంభీర్ కూడా భారత హాకీ జట్టును కొనియాడుతూ.. 2011 వన్డే ప్రపంచకప్ విజయం కన్నా ఒలింపిక్స్‌లో హాకీ జట్టు సాధించిన కాంస్యమే ఎక్కువని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. నెటిజన్లు గంభీర్‌ను ట్రోల్ చేస్తూ ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో భజ్జీ కూడా ఒలింపిక్స్ పతకాన్ని క్రికెట్ వరల్డ్‌కప్‌తో పోలుస్తూ అదే తరహా కామెంట్స్ చేయడంతో గంభీర్ ముందు జాగ్రత్తగా మనం అలా చెప్పకూడదని పేర్కొన్నాడు. ఇక 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2011 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టులో హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. -
గంభీర్‌కు ధోనీ అంటే అసూయ.. అందుకే బర్త్‌డే రోజు అలా చేశాడు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీ అంటే గంభీర్‌కు అసూయ అని, అతనికున్న క్రేజ్‌ను చూసి గంభీర్ ఓర్చుకోలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఇంతకీ ధోనీ అభిమానులు ఇంతాలా రెచ్చిపోవడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే.. నిన్న ధోనీ 40వ పుట్టిన రోజు(జులై 7, 2021) సందర్భంగా యావత్ క్రీడా ప్రపంచం అతనికి శుభాకాంక్షలు తెలిపింది. దిగ్గజ క్రికెటర్లు, బీసీసీఐ, ఐసీసీ, పలు ఇపీఎల్ ఫ్రాంఛైజీలు ధోనీకి విషెస్ చెప్పారు. Fans to u hi badnaam h asli aag to gambhir ne laga rakhi h😭 Changed his cover pic 43 minutes ago😭 pic.twitter.com/6rue80bavH — Sumit pandey 🚩 (@_kohlitastic_) July 7, 2021 అయితే, ఈ సందర్భంగా ధోనీ అభిమానులు ఒక విషయాన్ని నోటీస్ చేశారు. ధోనీ సహచరుడు మాజీ క్రికెటర్ గంభీర్.. తన ఫేస్బుక్ కవర్ పిక్చర్‌ను మార్చడాన్ని గుర్తించారు. ఓ పక్క యావత్ క్రీడా ప్రపంచం ధోనీ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతుంటే, గంభీర్ మాత్రం 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ నాటి తన ఫోటోను ఫేస్బుక్ కవర్ పిక్‌గా అప్డేట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ధోనీ అవమానించడానికి గంభీర ప్రణాళికా బద్ధంగా ఇలా చేశాడని, ఇదేదో యాదృచ్చికంగా జరిగినది కాదని మండిపడుతున్నారు. గంభీర్‌కు మొదటి నుంచి ధోనీ అంటే అసూయ అని, 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో 97 పరుగులు చేసినప్పటికీ తనకు దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదని కుమిలిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. Gambhir in his living room whenever Dhoni gets plaudits. pic.twitter.com/12q1HHyLmB — Maganlal (@Maganlal1303) July 7, 2021 శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ.. విన్నింగ్ షాట్‌ను సిక్సర్‌గా మలిచి భారతీయుల దృష్టిలో హీరో అయిపోవడాన్ని గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడని ధ్వజమెత్తారు. ధోనీపై అక్కసుతోనే గంభీర్ ఇలా చేశాడని, ధోనీ సాధించిన అపురూప విజయాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవడం చూసి ఓర్వలేకే, ఇలా తన ద్వేశాన్ని వ్యక్తపరిచాడని ఆరోపించారు. మరోవైపు గంభీర్ అభిమానులు కూడా ధోనీ ఫ్యాన్స్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. తమ ఫేవరెట్ క్రికెటర్ సాధించిన పరుగుల వల్లే టీమిండియా రెండోసారి జగజ్జేతగా నిలిచిందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా, టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్లు కావడంలో ధోనీ సహా యువరాజ్, గంభీర్ కీలకపాత్ర పోశించిన విషయం తెలిసిందే. Shameful feeling only. I hoped that gambhir cover picture change is fake but went and checked FB. It is true — Karthik Raj (@kartcric) July 7, 2021 -
‘కోచ్ అవాక్కయ్యాడు.. తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరా’
ముంబై: 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించిన ప్యాడీ అప్టాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. తాను రచించిన పుస్తకం 'ద బేర్‌ఫుట్ కోచ్'లో ఈ షాకింగ్ విషయాలను ప్రస్తావించాడు. భారత్‌ను రెండోసారి విశ్వ విజేతగా నిలిపిన ఆ ప్రపంచకప్‌లోని మ్యాచ్‌లకు ముందు టీమిండియా ఆటగాళ్లను సెక్స్ చేయాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నాడు. అయితే తాను ఇచ్చిన ఈ సలహాకు నాటి హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ అవాక్కయ్యాడని తెలిపాడు. ఆతర్వాత తన సలహా సరైంది కాదని భావించి క్షమాపణలు కోరినట్లు ప్యాడీ అప్టాన్ ప్రస్తావించాడు. అంతకుముందు 2009 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా తాను ప్లేయర్స్ కోసం నోట్స్ సిద్ధం చేశానని, అందులో సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా రాశానని దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మానసిక నిపుణుడు చెప్పాడు. కాగా, గేమ్‌కు ముందు సెక్స్ చేయడం వల్ల ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయగలరా అంటే కచ్చితంగా అవుననే అంటున్నాడు అప్టాన్. దీంతో పాటు రాహుల్ ద్రవిడ్‌ను శ్రీశాంత్ తిట్టడం, ధోనీ కెప్టెన్సీపై నాటి జట్టులో భిన్నాభిప్రాయాలు తదితర ఆసక్తికర అంశాలను ఆయన తన పుస్తకంలో ప్రస్తావించాడు. ఇదిలా ఉంటే, నాటి టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టెన్.. ప్యాడీ అప్టాన్ను పట్టుపట్టి మరీ మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా అపాయింట్ చేసుకున్నాడు. వీరిద్దరు కోచ్‌లుగా వ్యవహరిస్తుండగా ధోనీ హయాంలో టీమిండియా 28 ఏళ్ల తర్వాత రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. నాటి ప్రపంచకప్‌లో టీమిండియా కేవలం ఒక్క మ్యాచ్‌లో(దక్షిణాఫ్రికా) మాత్రమే ఓటమి చవిచూసింది. లీగ్ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం క్వార్టర్స్‌లో నాటి డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌కు షాక్ ఇచ్చిన ధోని సేన.. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్ధి పాక్‌కు మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. తర్వాత తుది పోరులో పట్టిష్టమైన శ్రీలంకకు షాకిచ్చి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. -
‘ధోని కొట్టిన బంతి దొరికింది’
ముంబై : ‘ధోని ఫినిష్డ్ ఆఫ్ ఇన్‌స్టయిల్...’ రవిశాస్త్రి వ్యాఖ్యానంలో ఈ వాక్యాన్ని సగటు భారత క్రికెట్ అభిమాని ఎన్ని సార్లు విని తన్మయత్వం చెందాడో. 2011 ఏప్రిల్ 2న భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న చారిత్రాత్మక రోజది. నాటి ఫైనల్లో కులశేఖర వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచి ధోని మ్యాచ్‌ను గెలిపించాడు. నాటి క్షణాన్ని చిరస్మరణీయం చేయాలని భావించిన ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఇప్పటి వరకు ధోని కొట్టిన బంతి ఆచూకీ కనుగొనడంలో విఫలమైంది. అయితే ఇప్పుడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ విషయంలో తాను సహకారం అందిస్తానని చెప్పారు. ఆ మ్యాచ్‌లో ధోని కొట్టిన బంతిని అందుకున్న అభిమాని గురించి తనకు తెలుసని, తన మిత్రుడు ఒకరికి అతనితో పరిచయం ఉందని గావస్కర్ ఎంసీఏకు తెలియజేశారు. దాంతో ఎంసీఏ ఇతర ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమైంది. సదరు వ్యక్తి ఆ మ్యాచ్ టికెట్‌తో సహా బంతిని ఒక జ్ఞాపికగా మలచి భద్రపరచినట్లు సమాచారం. ఆ బంతి ఎంసీఏ పెవిలియన్ స్టాండ్, ఎల్ బ్లాక్‌లోని 210 నంబర్ సీటుపై పడింది. ఇప్పుడు ఆ సీటును ఇతర సీట్లకంటే భిన్నంగా ఉండేలా, ప్రత్యేకంగా కనిపించేలా సిద్ధం చేసి ధోని పేరుతో దానిని జ్ఞాపికగా మార్చనున్నారు. (చదవండి : 'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తుంది') ఈ తరహాలో అంకితం చేయడం భారత్‌లో తొలిసారి అయినా గతంలోనూ క్రికెట్లో ఇలా జరిగాయి. ఆ్రస్టేలియా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో సైమన్ ఒడొనెల్ 122 మీటర్ల సిక్స్ కొట్టిన సీటును, బిగ్ బాష్‌లో బ్రాడ్ హాడ్జ్ చివరి మ్యాచ్ ఆడినప్పుడు కొట్టిన 96 మీటర్ల సిక్సర్ సీటును ఇలాగే మార్చారు. 2015 ప్రపంచకప్ సెమీస్‌లో స్టెయిన్ బౌలింగ్‌లో గ్రాంట్ ఇలియట్ కొట్టిన సిక్సర్‌తో న్యూజిలాండ్ తొలిసారి ఫైనల్ చేరగా...ఆక్లాండ్‌లో ఆ సీటును ఇలాగే మార్చారు. (చదవండి : ధోని హ్యాట్రిక్ సిక్సర్లు.. పోరాడి ఓడిన సీఎస్కే) -
'ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు'
ఢిల్లీ : 2011 ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అదృష్టం భలే కలిసొచ్చిందంటూ టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆశిశ్ నెహ్రా పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినా.. నాలుగుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా ఆనాటి మ్యాచ్ విషయాలను నెహ్రా మరోసారి పంచుకున్నాడు. 'నిజంగా ఆరోజు పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ నక్కతోక తొక్కివచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే అతను చేసిన 85 పరుగులు.. నాలుగు సార్లు పాక్ ఫీల్డర్లు క్యాచ్‌లు విడవడం ద్వారా సాధించాడు. అదృష్టం అంటే ఎలా ఉంటుందో బహుశా సచిన్‌కు ఆరోజు తెలిసి ఉంటుంది. సచిన్‌కు నెర్వెస్ నైంటీస్ అనే ఫోబియా ఉండేది.. కానీ పాక్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఆ ఫోబియా కనిపించలేదు.. కానీ ఒత్తిడి కనిపించింది. సచిన్ నాలుగుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటే ఆరోజు అదృష్టం అతని వెంట ఉంది. ఇక ప్రపంచకప్‌లో ఒక కీలక మ్యాచ్‌లో ఒత్తిడి ఉండడం సహజం.. అది ఇండియా-పాక్, ఇండియా- ఇంగ్లండ్ ఏ మ్యాచ్ అయినా కావొచ్చు.. మేం సెమీఫైనల్ చేరుకొని ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఒత్తిడిని అధిగమించాం 'అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.('ఆకలితో ఉన్నా.. రిటైరయ్యే ఆలోచన లేదు') ఇక పాక్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 260 పరుగులు చేసింది. సచిన్ ఈ మ్యాచ్‌లో 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ సచిన్ వరుసగా 25,45,70,81 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. మిస్బా, యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్‌లు నాలుగుసార్లు క్యాచ్‌లు జారవిడిచారు. ఆ తర్వాత భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాక్ జట్టు 231 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. దీంతో ఫైనల్లోకి ప్రవేశించిన భారత్ శ్రీలంకపై ఘనవిజయం సాధించి 28 సంవత్సరాల నిరీక్షణ తర్వాత సొంతగడ్డపై రెండోసారి సగర్వంగా ప్రపంచకప్‌ను అందుకుంది. -
2011 ఫిక్సింగ్ : దర్యాప్తు నిలిపివేసిన శ్రీలంక
కొలంబొ : భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్గమగే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫొన్సెక నేతృత్వంలోని బృందం శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది. తాజాగా మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.(‘సరైన టైమ్‌లో కెప్టెన్‌గా తీసేశారు’) కాగా ఈ కేసులో ఇప్పటికే మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపణలు చేసిన మహిదానందతో పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరతో పాటు మాజీ ఆటగాళ్లు మహేళ జయవర్దెనేతో పాటు అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాలను విచారించింది. విచారణలో భాగంగా వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నామని.. వారి సమాధానాలతో తాము సంతృప్తి చెందినట్లు ఫొన్సెక నేతృత్వంలోని స్పెషల్ ఇన్వస్టిగేషన్ టీమ్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం అంటూ శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.( నేడు విచారణకు సంగక్కర ) కాగా 2011 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను దర్యాప్తు విభాగం సుమారు 10 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేయడంపై గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం లంక మాజీ క్రికెటర్, మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అరవింద డిసిల్వాను అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ప్రపంచకప్ 2011 ఫైనల్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన వివరాలపై కూపీ లాగారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కౌన్సిల్ సైతం స్వతంత్ర విచారణ జరిపించాలని డిసిల్వా డిమాండ్ చేశారు. అవసరమైతే విచారణ కోసం భారత్‌కు వస్తానని పేర్కొన్నారు. ఫిక్సింగ్ ఆరోపణల్లో భాగంగా శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ మహేలా జయవర్ధనే విచారణకు హాజరయ్యాడు. అందుకోసం కొలంబోలోని సుగతదాసా స్టేడియంలోని క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగానికి జయవర్ధనే హజరయ్యాడు. జయవర్దెనే చెప్పిన విషయాలను దర్యాప్తు బృందం రికార్డు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో జయవర్దెనే శతకం సాధించిన సంగతి తెలిసిందే. (2011 ఫైనల్ ఫిక్సింగ్? దర్యాప్తు వేగవంతం) కాగా నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. స్టార్ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (0), సచిన్ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై రెండో ప్రపంచకప్‌ను సాధించింది. -
2011 ఫైనల్ ఫిక్సింగ్? దర్యాప్తు వేగవంతం
కొలంబో : వన్డే ప్రపంచకప్-2011 ఫైనల్లో భారత్‌కు శ్రీలంక అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసిన ఆ దేశ మాజీ మంత్రి మహిదానంద అలుత్‌గమగేను పోలీసులు విచారించారు. భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ మాజీ మహిదానంద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం మహిదానందను విచారించారు. (2011 ఫైనల్ ఫిక్సయింది!) ‘భారత్, శ్రీలంక మధ్య జరిగిన ప్రపంచకప్-2011 ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని నేను అనుమానం వ్యక్తం చేశాను. నా అనుమానంపై విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరాను. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని అక్టోబర్ 30, 2011న ఐసీసీకి ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఇచ్చాను’ అని మహిదానంద పేర్కొన్నారు. ఇక ఈ మాజీ మంత్రి ఆరోపణలను లంక మాజీ ఆటగాళ్లు ఇదివరకే ఖండించిన విషయం తెలిసందే. సర్కస్ మొదలైందని మహేల జయవర్దనే పేర్కొనగా.. ‘ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ కుమార సంగక్కర వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. (ఆమెతో వీలైతే కాఫీ.. కుదిరితే డేట్) -
‘నేను టాస్ ఓడిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది’
కోల్‌కతా: గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2011 ప్రపంచకప్ ఫైనల్లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చింది. భారత స్పిన్నర్ అశ్విన్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో కుమార సంగక్కర ఈ అంశం గురించి మాట్లాడాడు. ‘టాస్ సమయంలో వాంఖెడే స్టేడియం అరుపులతో హోరెత్తుతోంది. టాస్కు సంబంధించిన నేను నా ఎంపిక చెప్పాను. కానీ ధోనికి వినబడనట్లుంది. అతను వెంటనే నువ్వు టెయిల్స్ ఎంచుకున్నావా? అని నన్ను అడిగాడు. లేదు హెడ్స్ అని చెప్పాను. అప్పటికే రిఫరీ నేను టాస్ గెలిచాను అని ప్రకటించాడు. తను ఇంకా ఏం చెప్పలేదని ధోని అనడంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ టాస్ వేయాలంటూ ధోని కోరడంతో రెండోసారి వేయగా... నేను కోరుకున్న హెడ్స్ పడింది. దీంతో మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. అప్పుడు టాస్ గెలవడం అదృష్టమో కాదో తెలియదు కానీ ఒకవేళ నేను టాస్ ఓడిపోయి ఉంటే ఇండియా మొదట బ్యాటింగ్ చేసి ఉండేది. ఫలితం మరోలా ఉండేదని నేను నమ్ముతున్నా’అంటూ సంగక్కర నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. -
అందుకే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు
హైదరాబాద్: టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆ మధుర క్షణాలు అభిమానుల కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నాయి. కులశేఖర్ బౌలింగ్‌లో ధోని సిక్సర్ కొట్టిన వెంటనే యువీ ఆనందంతో ధోనిని హత్తుకునే ఉద్వేగభరిత దృశ్యాలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. కానీ యువీ, ధోనిలు సంబరాలు జరుపుకుంటే అక్కడే వికెట్ల వెనకాల ఉన్న కుమార సంగక్కర చిరునవ్వును చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించారు. క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తూ, ఓటమిని అంగీకరిస్తూ గుండెల్లోని బాధను దిగమింగుకుంటూనే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు. దీనికి లంక అభిమానులతో సహా, యావత్ క్రీడా ప్రపంచం సంగక్కర క్రీడా స్పూర్తికి సెల్యూట్ చేసింది. ఈ క్రమంలో అలాంటి బాధాకర సమయంలో కూడా తన ముఖంపై చిరునవ్వుకు గల కారణాలను సంగక్కర తాజాగా వెల్లడించారు. ‘30 ఏళ్లుగా శ్రీలంకలో నివసిస్తున్నాను (ప్రపంచకప్-2011 సమయానికి). మేము ఇబ్బందులు పడిన సందర్బాలు అనేకం. కొన్ని పరిస్థితులు మమ్మల్ని కిందికి నెట్టేశాయి. యుద్దాలు జరిగాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఇలా అనేక సమస్యలు వచ్చాయి. కానీ శ్రీలంకలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే స్థితిస్థాపకత. దేని నుంచైనా త్వరగా కోలుకొని పూర్వ స్థితికి చేరుకోవాలి అనే విషయం నా దేశం నేర్పింది. ఇదే సూత్రాన్ని మేం క్రికెట్ ఆడేటప్పుడు కూడా అవలంభిస్తాము. గెలుపు కోసమే బరిలోకి దిగుతాం, రెండు కోట్ల మంది ప్రజల ముఖాలపై చిరునవ్వు కోసం ఆడతాం, పోరాడుతాం. గెలుపోటములు సహజం. కానీ ఓటమిని జీర్ణించుకొని తరువాతి మ్యాచ్ కోసం త్వరగా సన్నద్దమవుతాం. (ప్రపంచకప్-2011 ఫైనల్: రెండుసార్లు టాస్) 1996 తర్వాత మరోసారి ప్రపంచకప్ గెలవడానికి 2007, 2011లో అదేవిధంగా 2009,2012 (టీ20 ప్రపంచకప్)లో అవకాశం వచ్చింది. ఫైనల్ మెట్టుపై ఓడిపోయాం. ముఖ్యంగా 2011 ప్రపంచకప్ మమ్మల్ని ఎక్కువగా బాధించింది. మంచి టీం, మంచి స్కోర్ సాధించాం, ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టాం అయినా ఓడిపోయాం. అయితే కొన్ని సార్లు ఇలాంటివి సంభవిస్తాయి. ఇప్పుడు ఓడిపోయాం. అయితే ఏడుస్తూ కూర్చొని ఉంటామా? లేక వచ్చే ప్రపంచకప్ కోసం సన్నద్దం కావాలా? మా ఆలోచన కూడా అంతే. మా ఆటగాళ్లకు కూడా ఎప్పుడూ ఒకటి చెబుతుంటా. ఎక్కువ ఎమోషన్‌గా ఉండకూడదని, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్‌గా ఉంటే తమను తాము నియంత్రించుకోలేరు’ అంటూ సంగక్కర వివరించారు. (ధోనికి ఆ హక్కు ఉంది) -
ప్రపంచకప్-2011 ఫైనల్: రెండుసార్లు టాస్
హైదరాబాద్: దాదాపు 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశంలో 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా రెండోసారి ముద్దాడింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అపూర్వ విజయం సాధించి భారత్ జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు సంబంధించి ఆనాటి లంక సారథి కుమార సంగక్కర పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో సంగక్కర పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేసిన విషయాన్ని తెలుపుతూ, దానికి గల కారణాలు వెల్లడించాడు. (ధోనికి ఆ హక్కు ఉంది ) ‘నేనెప్పుడు శ్రీలంకలో అంతమంది ప్రేక్షకులను మైదానంలో చూడలేదు. ఆ స్థాయిలో అభిమానులు మైదానానికి రావాలన్నా, ఆటగాళ్లను ఉత్సాహపరచాలన్నా అది భారత్‌లోనే సాధ్యం అవుతుందనుకుంటా!. కిక్కిరిసిన ప్రేక్షకులు, భారీ శబ్దాలు, ఫైనల్ టెన్షన్‌తో టాస్కు వెళ్లాం. ధోని టాస్ వేశాడు. నేను టెయిల్స్ అన్నాను. భారీ శబ్దాల కారణంగా నేను చెప్పింది ధోనికి వినపడలేదు. అతడు నన్ను అడిగాడు..నువ్వు టెయిల్స్ అన్నావా? అని, కాదు నేను టెయిల్స్ అని అన్నాను. దీనిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో సౌండ్స్ ఉన్నాయో. ఇక మ్యాచ్ రిఫరీ వచ్చి శ్రీలంక టాస్ గెలిచిందని చెప్పగా ధోని గందరగోళంగా ఉందని మరోసారి టాస్ వేయాలని రిఫరీని, నన్ను కోరాడు. దీంతో మరోసారి టాస్కు వెళ్లాం. (నన్ను అవమానించారు.. లేదు మనోజ్!) మరోసారి టాస్ వేయగా మళ్లీ మేమే గెలిచాం బ్యాటింగ్ తీసుకున్నాం. బహుశా రెండో సారి మేము టాస్ ఓడిపోయి ఉంటే టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకునేది కావచ్చు. మేము లక్ష్యాన్ని ఛేదించేవాళ్లం కావచ్చు. ఎందుకంటే ఐదు, ఆరు స్థానాల వరకు మా బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉంది. అప్పటికీ మేము బ్యాటింగ్‌లో పలు ప్రయోగాలు చేసి విజయవంతమయ్యాం. ఇక మాథ్యూస్ గాయం కూడా మా ఓటమికి కారణమైంది. అతడు ఆరోజు మ్యాచ్‌లో ఉండి ఉంటే మేము ఛేజింగ్ వైపు మొగ్గు చూపేవాళ్లం. ఎందుకంటే అవసరమైన సమయంలో టెయిలెండర్ల సహాయంతో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను గట్టెక్కించేవాడు. జరిగిందేదో జరిగిపోంది. టీమిండియా అద్భుతంగా ఆడింది. ధోని తన స్టైల్లో సిక్సర్ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించాడు’అని పేర్కొంటూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు సంగక్కర. -
రైనాకు ధోని చాలా మద్దతిచ్చాడు
న్యూఢిల్లీ: ప్రతీ కెప్టెన్‌కు జట్టులో ఒక ఇష్టమైన ఆటగాడు ఉంటాడని... భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు (టి20, వన్డే ఫార్మాట్) అందించిన ఏకైక కెప్టెన్ ఎమ్మెస్ ధోనికి ఇష్టమైన ప్లేయర్ సురేశ్ రైనా అని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో తనతో పాటు రైనా, యూసుఫ్ పఠాన్ ఫామ్‌లో ఉండటంతో తుది జట్టు ఎంపికలో ధోని తర్జనభర్జన పడ్డాడని యువీ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. ‘రైనాకు మాజీ సారథి ధోని అండదండలు పూర్తిగా ఉండేవి. ప్రపంచకప్ జట్టులో నాతోపాటు రైనా, యూసుఫ్ పఠాన్ కూడా ఎంపికయ్యారు. తుది జట్టు ఎంపికలో ధోని సందిగ్ధంలో పడ్డాడు. ఎడంచేతి వాటం స్పిన్నర్లు లేకపోవడం, బంతితోనూ నేను రాణించడంతో నన్ను తుది జట్టులో ఆడించడం అనివార్యమైంది. రైనా ఫామ్‌లో లేకున్నా ధోని అతడికి చాలా అవకాశాలు ఇచ్చాడు’ అని యువీ అన్నాడు. అయితే 2011 ప్రపంచకప్ విషయానికొస్తే మాత్రం గణాంకాలను పరిశీలిస్తే మాత్రం ధోని నిర్ణయమే సరైనదనిపిస్తోంది. యువరాజ్ వ్యాఖ్యల్లో నిజం లేదనిపిస్తోంది. ఆ మెగా ఈవెంట్లో యూసుఫ్ పఠాన్‌కు వరుసగా ఆరు లీగ్ మ్యాచ్‌ల్లో ధోని అవకాశం ఇచ్చాడు. యూసుఫ్ పఠాన్ ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 74 పరుగులు చేసి, కేవలం ఒక వికెట్ తీసి విఫలమయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రైనా, యూసుఫ్ పఠాన్లిద్దరినీ ధోని తుది జట్టులో ఆడించాడు. యూసుఫ్ పఠాన్ ఫామ్‌లో లేకపోవడంతో నాకౌట్ దశ నుంచి అతని స్థానంలో రైనాకు ధోని అవకాశం ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రైనా 28 బంతుల్లో అజేయంగా 34 పరుగులు చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో 39 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేశాడు. ఫైనల్లో మాత్రం రైనాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఓవరాల్‌గా రైనా ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 74 పరుగులు చేసి, ఒక వికెట్ తీశాడు. ఆ బ్యాట్‌పై సందేహపడ్డారు... టి20 ప్రపంచకప్ టోర్నీలో తాను వాడిన బ్యాట్‌లో ఏదో రహస్యం ఉందని అందరూ సందేహపడ్డారని యువరాజ్ చెప్పాడు. 2007 టి20 వరల్డ్ కప్‌లో వాడిన బ్యాట్ తనకెంతో ప్రత్యేకమని అన్నాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6 సిక్స్‌లు బాదిన తర్వాత ప్రతీ ఒక్కరూ తన బ్యాట్‌పై సందేహాలు వ్యక్తం చేశారని చెప్పాడు. ‘ఆసీస్ కోచ్ నా దగ్గరికి వచ్చి నీ బ్యాట్‌లో ఫైబర్ ఉందా? అలా ఉండటం చట్టబద్ధమేనా అని అడిగాడు. మ్యాచ్ రిఫరీ కూడా బ్యాట్‌ను పరిశీలించి వెళ్లాడు. మీ బ్యాట్ ఎవరు తయారుచేస్తారంటూ చివరకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా నన్ను అడిగాడు. ఏదేమైనా టి20, వన్డే వరల్డ్‌కప్‌లలో నేను వాడిన బ్యాట్లు నాకెంతో ప్రత్యేకం’ అని యువీ చెప్పాడు. -
అప్పుడు రైనాకే ధోని ఓటేశాడు: యువీ
హైదరాబాద్: ప్రతీ సారథికి జట్టులో ఒక అభిమాన అటగాడు ఉంటాడని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. అదేవిధంగా ప్రపంచకప్-2011 సమయంలో అప్పటి సారథి ఎంఎస్ ధోనికి జట్టులో ఇష్టమైన ఆటగాడు సురేష్ రైనా అని పేర్కొన్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2007లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాక మ్యాచ్ రిఫరీ తన బ్యాట్‌ను పరిశీలించాడని వివరించాడు. అంతేకాకుండా విదేశీ క్రికెటర్లు, కోచ్‌లు కూడా తన బ్యాట్‌పై అనుమానం వ్యక్తం చేశారన్నాడు. అయితే ఆ బ్యాట్‌కు తనకెంతో ప్రత్యేకమైనదన్నాడు. ‘ప్రతీ కెప్టెన్‌కు జట్టులో అభిమాన ఆటగాడు అంటూ ఒకరుంటాడు. అదేవిధంగా ప్రపంచకప్-2011 సమయంలో రైనాకు ధోని మద్దతు పుష్కలంగా ఉంది. నాకంటే ఎక్కువ సపోర్ట్ రైనాకే ధోని ఇచ్చాడు. యుసఫ్ పఠాన్ నిలకడగా రాణిస్తుండటం, ఆల్‌రౌండర్ కోటాలో నేను ఫామ్‌లో ఉండటం, అదే సమయంలో రైనా ఫామ్‌లో లేకపోవడంతో తుదిజట్టును ఎంపిక చేయడం ధోనికి తలకుమించిన భారం అయింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ జట్టులో లేకపోవడంతో నన్ను జట్టులోకి తీసుకోవడం అనివార్యం అయింది. ఇక పఠాన్‌ను లీగ్ మ్యాచ్‌ల్లో ఆడించినా అంతగా ఆకట్టుకోకపోవడంతో అతడిని తప్పించి రైనాను జట్టులోకి తీసుకున్నారు. సౌరవ్ గంగూలీ నాకిష్టమైన సారథి. నాలాంటి నలుగురైదురుగు ప్రతిభ గల యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చి అవకాశం ఇచ్చాడు. ఎంకరేజ్ చేశాడు’అని యువీ వ్యాఖ్యానించాడు. చదవండి: 'ఆ మ్యాచ్‌లో అతడు వాడిన బ్యాట్ నాదే' వివాదాలు వద్దు.. ఆ ట్వీట్‌ను తీసేయ్! -
ఆ ఒక్క సిక్సర్‌తో వరల్డ్ కప్ గెలవలేదు!
న్యూఢిల్లీ: భారత జట్టు రెండో సారి వన్డే ప్రపంచకప్ సాధించిన రోజు 2011, ఏప్రిల్ 2 గురించి తలచుకోగానే కెప్టెన్ ధోని అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన క్షణం అభిమానుల మనసుల్లో మెదులుతుంది. ఆ షాట్ అందరి హృదయాల్లోనూ అలా ముద్రించుకుపోయింది. అయితే శ్రీలంకపై నాటి ఫైనల్ విజయంలో అందరూ విస్మరించే అంశం గౌతం గంభీర్ ఆడిన కీలక ఇన్నింగ్స్ గురించే. 31 పరుగుల వద్దే సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత పట్టుదలగా నిలబడిన గంభీర్ విజయానికి పునాది వేశాడు. చివరకు 122 బంతుల్లో 97 పరుగులు చేసిన అతను త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వరల్డ్ కప్ జ్ఞాపకాలు గుర్తు చేసినప్పుడల్లా ధోని సిక్సర్పైనే చర్చ జరగడంపై తన అసహనాన్ని గంభీర్ ఏనాడూ దాచుకోలేదు. దానిపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెబుతూ వచ్చిన అతను 9 ఏళ్ల తర్వాత కూడా మరోసారి ఆ ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ ‘క్రిక్ఇన్ఫో’ ధోని ఆడిన చివరి షాట్ ఫోటో పెట్టి ‘2011లో ఈ రోజు... లక్షలాది భారతీయుల సంబరాలకు కారణమైన షాట్’ అని వ్యాఖ్య జోడించింది. దీనిపై గంభీర్ వెంటనే స్పందించాడు. ‘క్రిక్ఇన్ఫో...మీకో విషయం గుర్తు చేస్తున్నా. 2011 ప్రపంచకప్ భారత్ గెలిచింది. మొత్తం భారత జట్టు, సహాయక సిబ్బంది గెలిచింది. ఒక సిక్స్‌పై మీకున్న అతి ప్రేమను బయటకు విసిరి కొట్టండి’ అని ఘాటుగా బదులిచ్చాడు. విరాళంగా రెండేళ్ల జీతం... ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు కూడా అయిన గంభీర్ కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వానికి తన వంతు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఎంపీగా తనకు లభించే రెండేళ్ల జీతాన్ని ‘పీఎం కేర్’ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు అతను ప్రకటించాడు. ఇంతకు ముందే నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన అతను ఎంపీ ల్యాడ్స్ నిధులలో రూ. 1 కోటి దీనికి కేటాయిస్తున్నట్లు కూడా చెప్పాడు. విరాళాలు అందించిన ఇతర క్రీడా ప్రముఖులలో భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ (రూ. 4 లక్షలు), ప్రముఖ షూటర్ అపూర్వి చండీలా (రూ. 5 లక్షలు), భారత బ్యాడ్మింటన్ సంఘం (రూ. 10 లక్షలు) ఉన్నారు. -
యాహూ.. సచినే విజేత.. గెలిపించిన ఫ్యాన్స్
‘ఇన్నేళ్లుగా దేశమంతా ఉంచిన భారాన్ని సచిన్ మోశారు. ఇప్పుడు మేం ఆయన్ను మోశాం’ ఐసీసీ వన్డే ప్రపంచకప్-2011 ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా అపూర్వ విజయం తర్వాత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను తోటి ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని స్టేడియం అంతా ఊరేగిన సందర్భంలో ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి ఆరోజు పలికిన మాటలు ఇవి. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసిన యావత్ ప్రపంచం ఆనందభాష్పాలకు లోనయింది. అంతేకాకుండా ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని సెల్యూట్ చేశాడు. తాజాగా లారస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డు కూడా ఆ అరుదైన ఘట్టానికి సలాం చేసింది. బెర్లిన్: టీమిండియా దిగ్గజ ఆటగాడు, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక లారస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డు మాస్టర్ బ్లాస్టర్‌ను వరించింది. బెర్లిన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో సచిన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నాడు. గత 20 ఏళ్లలో ప్రపంచ క్రీడల్లో అత్యంత అపురూప ఘట్టాలన్నింటిలో బెస్ట్ మూమెంట్‌కు ఈ అవార్డును అందించడం కోసం పోటీ నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించేందుకు ఆన్లైన్ పోల్ నిర్వహించారు. ఈ పోటీలో 19 మంది పోటీ పడగా అత్యధిక ఓట్లు రావడంతో సచిన్ విజేతగా నిలిచాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయం తర్వాత సచిన్‌ను సహచర ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం అంతా ఊరేగించారు. క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ నేషన్ (దేశాన్ని భుజాలపై ఊరేగించారు) అనే క్యాప్షన్‌తో ఓటింగ్ నిర్వహించారు. ఈ మూమెంట్‌కే ప్రస్తుతం అవార్డు దక్కింది. కాగా, 2017లో స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని లారస్ ప్రారంభించింది. గత 20 ఏళ్లలో జరిగిన ఘట్టాలన్నింటిలో బెస్ట్ మూమెంట్‌ను ఎంపిక చేసి, ఈ ఏడాది పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డు సచిన్‌కు రావడం పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం ఆనందం వ్యక్తం చేస్తోంది. చదవండి: ఈ సారథ్యం నాకొద్దు! ఆడకుండా.. నన్ను కిడ్నాప్ చేశారు -
‘లారెస్’ టాప్–5లోకి సచిన్ 2011 ఫైనల్ సంబరం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక లారెస్ అవార్డు అందుకునే దిశగా సచిన్ ‘2011 ప్రపంచకప్ ఫైనల్ సంబర ఘట్టం’ మరో అడుగు ముందుకు వేసింది. ముంబై వాంఖడే మైదానంలో ఫైనల్ గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై మోసిన దృశ్యం అవార్డు కోసం పోటీ పడుతుంది. ఇప్పటి వరకు 20 ఎంట్రీలు అవార్డు రేసులో ఉండగా వాటిని ఐదుకు కుదించారు. ఈ టాప్–5లో సచిన్ సంబరానికి చోటు దక్కింది. ‘క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్’ అనే టైటిల్‌తో నాటి క్షణం అవార్డు బరిలో నిలిచింది. ఫిబ్రవరి 16న ఓటింగ్ ముగిశాక... బెర్లిన్‌లో జరిగే కార్యక్రమంలో విజేతను 17న ప్రకటిస్తారు. -
ధోని కొట్టిన ఆ సిక్స్ ఇంకా..
సాక్షి, హైదరాబాద్ : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొట్టిన ఆ సిక్స్ ఇంకా.. కళ్లముందు కదలాడుతోంది. అవును మరి అది ఏమైనా మాములు సిక్సా.. 28 ఏళ్ల భారత అభిమానుల నిరీక్షణకు తెరదించిన సిక్స్.. కెరీర్లో అన్ని ఘనతలు అందుకొని ఇదొక్కటి సాధిస్తే ఇక చాలని ఎదరు చూస్తున్న ఓ దిగ్గజం కల నెరవేర్చిన సిక్స్.. యావత్ భారత క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సిక్స్. భారత జట్టును ప్రపంచ విజేతగా నిలబెట్టిన సిక్స్. సరిగ్గా ఎనిమిదేళ్ల కింద ఇదే రోజు మహేంద్రుడి బ్యాట్ నుంచి జాలువారిన ఆ సిక్స్‌ను ఎవరూ ఎప్పుడూ మర్చిపోలేరు. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఉత్కంఠకర వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించి భారత్.. తన చిరకాల వాంచను నెరవేర్చుకుంది. అయితే ఈ మధుర క్షణాన్ని గుర్తు చేస్తూ బీసీసీఐ.. ధోని విన్నింగ్ షాట్ వీడియోను ట్వీట్ చేయగా.. అభిమానులు తమ స్టేటస్‌లుగా పెట్టుకుంటూ ఆ మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటున్నారు. ఈ ప్రపంచకప్ టోర్నీ ఆరంభం నుంచి అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోయిన భారత్.. ఫైనల్లో మాత్రం కొంత తడబడి ఉత్కంఠకు తెరలేపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. లంక బ్యాటింగ్‌లో మహేలా జయవర్ధనే 103 పరుగులు, సంగక్కర 48 పరుగులు చేశారు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. సెహ్వాగ్ డకౌట్, సచిన్ టెండూల్కర్(18) వికెట్లను త్వరగా కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఆపద్భాంధవుడి పాత్ర పోషించాడు. ఆచితూచి ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. 97 పరుగులు చేసి ఒత్తిడిని అధిగమించలేక ఔటయ్యాడు. చివర్లో ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. చివరి 11 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని తన మార్క్ హెలికాఫ్టర్ షాట్‌తో సిక్సు బాదాడు. అంతే.. స్టేడియం అంత ఒక్కసారిగా హర్షధ్వానాలతో హోరెత్తిపోయింది. యావత్ భారత్ సంబరాల్లో మునిగిపోయింది. -
ధోని కొట్టిన ఆ సిక్స్ ఇంకా..
-
‘రెండు ఫైనల్స్’ హీరో!
2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు... 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ 122 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులు... నాలుగేళ్ల వ్యవధిలో భారత జట్టు రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచిన సందర్భాల్లో గౌతం గంభీర్ పోషించిన పాత్ర క్రికెట్ అభిమానులు మరచిపోలేనిది. ఈ రెండు టోర్నీల తుది పోరులో అతనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గావస్కర్ తర్వాత భారత అత్యుత్తమ ఓపెనర్ గంభీరే అంటూ సహచరుడు సెహ్వాగ్ నుంచి ప్రశంసలు అందుకున్న గౌతీ మూడు ఫార్మాట్లలో కూడా ఓపెనర్‌గా రాణించడం విశేషం. టీమిండియా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాల్లో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 2009లో భారత్ టెస్టుల్లో తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు, 2008లో ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ సీబీ వన్డే సిరీస్ గెలిచినప్పుడు గంభీర్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. మైదానంలో ఎక్కడా వెనక్కి తగ్గని అతని దూకుడైన శైలి కూడా క్రికెట్ ప్రపంచానికి చిరపరిచితం. రిటైర్మెంట్ ప్రకటించబోతూ... 2007లో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో గంభీర్‌కు చోటు దక్కలేదు. అప్పటికి అతని కెరీర్ ప్రారంభమై నాలుగేళ్లయింది. దాంతో ‘ఇక నేను క్రికెట్ ఆడదల్చుకోలేదు. ప్రాక్టీస్ కూడా చేయను. నాలో స్ఫూర్తి నింపలేకపోతున్నాను’ అని బహిరంగంగా ప్రకటించాడు. అయితే ప్రపంచకప్‌లో జట్టు ఘోర వైఫల్యం తర్వాత బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అతడిని ఎంపిక చేశారు. ఇందులో ఒక సెంచరీతో మళ్లీ స్థానం పటిష్టం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే టి20 ప్రపంచకప్ వచ్చింది. అంతే... ఆ విజయం తర్వాత గంభీర్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా ఐదేళ్ల పాటు భారత క్రికెట్‌పై అతని ముద్ర కనిపించింది. విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శించకపోయినా, సాహసాలకు ప్రయత్నించకుండా కూడా చక్కటి స్ట్రయిక్‌రేట్‌తో చకచకా పరుగులు సాధించే ప్రత్యేక శైలి గంభీర్‌ది. ముఖ్యంగా బ్యాక్‌ఫుట్‌పై స్పిన్‌ను ఎదుర్కోవడంలో గంభీర్ అద్భుతం. 2003లోనే వన్డేల్లో అరంగేట్రం చేసినా తొలి సిరీస్‌లో వైఫల్యంతో జట్టులో చోటు పోయింది. రెండేళ్ల తర్వాత టీమ్‌లోకి వచ్చిన అతను సెంచరీతో స్థానం పటిష్టపర్చుకున్నాడు. మధ్యలో ఓపెనింగ్ నుంచి తప్పించడంతో కొంత నిరాశ చెందినా... తన వ్యక్తి గత వ్యవహార శైలే అందుకు కారణమని గుర్తించి మారే ప్రయత్నం చేయడం విశేషం. 2009లో గంభీర్‌కు ‘అర్జున అవార్డు’ దక్కింది. టెస్టుల్లో జోరు... ఆరంభంలో ఒడిదుడుకులకు లోనైన గంభీర్ టెస్టు కెరీర్ పునరాగమనం తర్వాత ఊపందుకుంది. ముఖ్యంగా 2008 జూలై నుంచి 2010 జనవరి మధ్య కాలంలో అతని ఆట శిఖరానికి చేరింది. ఒక దశలో ఆడిన 13 టెస్టుల్లో అతను ఏకంగా ఎనిమిది సెంచరీలు బాదాడు. వీటిలో సొంతగడ్డ ఢిల్లీలో ఆస్ట్రేలియాపై సాధించిన డబుల్ సెంచరీ కూడా ఉంది. అయితే వన్డే వరల్డ్ కప్ తర్వాత గంభీర్ ప్రభ మసకబారింది. ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో కలిపి భారత్ ఘోరంగా 0–8తో చిత్తయిన టెస్టుల్లో గంభీర్ వైఫల్యం కూడా ఉంది. వీటిల్లో 14 ఇన్నింగ్స్‌లలో అతను ఒకే ఒక అర్ధసెంచరీ సాధించాడు. అనంతరం సొంతగడ్డపై కూడా ప్రభావం చూపలేకపోవడంతో జట్టులో చోటు పోయింది. ఒకానొక సమయంలో టెస్టు కెప్టెన్‌గా కూడా పేరు వినిపించినా ఆ తర్వాత తన స్థానం కాపాడుకోవడమే కష్టంగా మారింది. విజయ్, ధావన్ ఓపెనర్లుగా నిలదొక్కుకున్న తర్వాత గంభీర్ జట్టుకు దాదాపుగా దూరమయ్యాడు. 2014లో ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌కు మళ్లీ పిలుపు వచ్చినా 4, 18, 0, 3 స్కోర్లతో ఆ అవకాశం వృథా అయింది. రెండేళ్లకు మరోసారి అవకాశం తలుపు తట్టినా దానిని కూడా గంభీర్ ఉపయోగించుకోలేకపోయాడు. రాజకీయాలపై ఆసక్తితోనే... చాలా కాలంగా గంభీర్ రాజకీయపరమైన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నాడు. ముఖ్యంగా సైనికులు, వారి సంక్షేమం వంటి అంశాల్లో అతను ఏదో రూపంలో భాగస్వామిగా ఉంటున్నాడు. గంభీర్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీటును ఆశిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై మరోసారి అతను విమర్శలు చేశాడు. ఆటపరంగా చూస్తే ఐపీఎల్లో ఢిల్లీ కూడా అతడిని విడుదల చేసింది. 2019 కోసం మళ్లీ ఏదైనా ఫ్రాంచైజీ గంభీర్‌ను ఎంచుకునే అవకాశాలు దాదాపుగా లేవు. వ్యాఖ్యాతగా కూడా పని చేస్తున్న గంభీర్... దాని కోసం గాయం సాకుతో ఢిల్లీ రంజీ మ్యాచ్‌కు దూరంగా ఉండటం కూడా విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్తో అన్నింటికి ఫుల్స్టాప్ పెట్టేయాలని భావించడమే అతని ప్రకటనకు కారణం. అదే అత్యుత్తమం 2009లో నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ అతని టెస్టు కెరీర్లో అతి పెద్ద హైలైట్‌గా చెప్పవచ్చు. తను కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో 10 గంటల 43 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 137 పరుగులు చేసిన గంభీర్ మ్యాచ్‌ను కాపాడాడు. ఈ మ్యాచ్‌తో పాటు తర్వాతి టెస్టును కూడా ‘డ్రా’ చేసుకున్న భారత్... తొలి మ్యాచ్‌లో సాధించిన గెలుపుతో అరుదైన సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. –సాక్షి క్రీడా విభాగం ►2009లో ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ►వరుసగా 11 టెస్టుల్లో కనీసం ఒక అర్ధ సెంచరీ అయినా సాధించిన ఘనతతో గంభీర్... వివియన్ రిచర్డ్స్‌తో సమంగా నిలిచాడు. ►వరుసగా ఐదు టెస్టుల్లో సెంచరీలు సాధించిన క్రికెటర్. మరో మ్యాచ్‌లో శతకం చేస్తే (68 ఔట్) బ్రాడ్‌మన్‌తో సమంగా నిలిచేవాడు. సొంతగy ► 2010లో న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు, ఆ తర్వాత ఒక సారి విండీస్‌తో వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ నాయకత్వంలో భారత్ ఆరు మ్యాచ్‌లు కూడా గెలిచింది. ఐపీఎల్ కెప్టెన్‌గా... ఐపీఎల్ ఆరంభంలో గంభీర్ సొంత జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. అయితే ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారిన తర్వాత తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2012, 2014లలో జట్టును విజేతగా నిలిపాడు. ఈ సీజన్లో కోల్‌కతా అతడిని తప్పించిన తర్వాత ఢిల్లీ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్‌లో రాణించలేక కెప్టెన్సీ నుంచి స్వయంగా తప్పుకున్న గంభీర్‌కు మళ్లీ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దాంతో తన ఫీజును కూడా తీసుకోనని ప్రకటించాడు.