wwe
-
మైక్ టైసన్‌కు షాకిచ్చిన యువ బాక్సర్ జేక్ పాల్
ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైసన్ ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లో జరిగిన బిగ్ బౌట్లో మైక్ టైసన్‌ను సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జేక్ పాల్ ఖంగు తినిపించాడు. ఈ మ్యాచ్‌లో జేక్ పాల్ చేతిలో 74-78 తేడాతో ఐరన్ మైక్ మైక్ ఓటమిపాలయ్యాడు.టైసన్ గేమ్‌లో వయస్సు ప్రభావం స్పష్టంగా కనిపించింది. 58 ఏళ్ల టైసన్ తనకంటే 37 ఏళ్ల చిన్నోడైన జేక్ సూపర్ పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు. తొలి రెండు రౌండ్లలో మైక్ టైసన్ ఆధిపత్యం కనబరిచినప్పటకి.. తర్వాతి 8 రౌండ్లలో జేక్ పాల్ తన అద్బుతమైన బాక్సింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఆ తర్వాత మైక్ తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయాడు. కొన్ని పంచ్‌లు ఇచ్చినప్పటికి పెద్దగా పవర్ కన్పించలేదు. దీంతో మహాబలుడు మైక్ టైసన్ యువ బాక్సర్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే గెలిచిన వెంటనే జేక్ పాల్ మైక్ టైసన్‌కు తల వంచి నమస్కరించాడు. టైసన్ కూడా పాల్‌ను మంచి ఫైటర్‌గా కొనియాడాడు. ఇక విజేతగా నిలిచిన బాక్సర్ జేక్ పాల్ కు 40 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్ మనీగా లభించింది. కాగా మ్యాచ్ ఈ మొదలు కాగాగే పోటెత్తిన వ్యూయర్షిప్తో నెట్‌ఫ్లిక్స్ క్రాష్ అయింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
ఈజిప్టులో మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ (ఫోటోలు)
-
సోనీ స్పోర్ట్స్ చిత్రాలకు WWE రింగ్‌లోకి దిగిన హీరో కార్తీ..
భారతదేశంలో డబ్ల్యుడబ్ల్యుఇ అధికారిక ప్రసారకర్త అయిన సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ WWE ఫ్యాన్స్‌కు మరింత దగ్గర కానుంది. డబ్ల్యుడబ్ల్యుఇ అభిమాని, సౌత్ సినీ సూపర్ స్టార్ కార్తీ నటించిన రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను సోనీ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఇది దక్షిణాది మార్కెట్లలో డబ్ల్యుడబ్ల్యుఇ చుట్టూ కస్టమైజ్డ్, స్థానికంగా క్యూరేటెడ్ కంటెంట్‌కు దాని నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. డబ్ల్యుడబ్ల్యుఇ కోసం కార్తి తన గొంతును అందించడమే కాకుండా ఆ కార్యక్రమానికి ప్రచారకార్యకర్తగా కూడా ఉన్నారు. 'హీరోలు vs విలన్లు, అనే టైటిల్‌తో పాటు 'బలం vs విన్యాసాలు' అనే రెండు కాన్సెప్ట్‌లతో ఇవి రానున్నాయి. డబ్ల్యుడబ్ల్యుఇని అభిమానులు సాదరంగా స్వాగతిస్తున్నారు. దీనిని చాలామంది ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. దక్షిణాది మార్కెట్లో సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ WWE ప్రసారాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎక్కువ ప్రోగ్రామ్‌లు అందించడానికి కట్టుబడి ఉంది. ఈ చిత్రాలు ప్రేక్షకులు వారి అభిమాన డబ్ల్యుడబ్ల్యుఇ స్టార్లకు దగ్గరగా ఉంచడంలో పాటుపడుతుంది. ప్రతి వారం వారు తీసుకువచ్చే అన్ని మైండ్ బ్లోయింగ్ యాక్షన్లకు అదనంగా ఈ చిత్రాలు ఉన్నాయి. సోనీ నెట్ వర్క్ ఛానల్స్‌లలో WWE లైవ్ ద్వారా ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా డిస్ట్రిబ్యూషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, స్పోర్ట్స్ బిజినెస్ విభాగాధిపతి రాజేష్ కౌల్ మాట్లాడుతూ, 'డబ్ల్యుడబ్ల్యుఇకి దక్షిణ భారతదేశంలో చాలా బలమైన అభిమానులు ఉన్నారు. ఇక్కడ దీని కోసం భారీగా రీచ్ ఉంది. సుమారు 41% వాటా ఉంది. భారతదేశంలో డబ్ల్యుడబ్ల్యుఇ నివాసంగా, కార్తీతో కలిసి పనిచేయడానికి, ప్రేక్షకులను ప్రతిధ్వనించే తమిళ, తెలుగులలో అసాధారణ కథలను అందించడానికి మా ప్రయత్నాలను కొనసాగించడానికి మేము ఎంతో ఉత్సుకతతో ఉన్నాము. ఈ చిత్రాలు డబ్ల్యుడబ్ల్యుఇ ఆకర్షణను పునఃసమీక్షిస్తాయి. ఇది హై-ఆక్టేన్ విన్యాసాలతో పాటు ఆకర్షణీయమైన పాత్రలతో నడుస్తుంది. మా ప్రేక్షకులకు ఉత్తమమైన, స్వచ్ఛమైన స్పోర్ట్స్ వినోదాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.' అని చెప్పారు. ఈ సందర్భంగా దక్షిణాది సూపర్ స్టార్ కార్తీ మాట్లాడుతూ.. 'డబ్ల్యుడబ్ల్యుఇలో హీరోలు, విలన్ల పాత్రలను పోషించడం ఖచ్చితంగా నాకు మరపురాని అనుభవం. వారిని యాక్షన్ లో చూడటం చాలా ఆనందంగా ఉంది. డబ్ల్యుడబ్ల్యుఇకి భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక అభిమానిగా, సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్, డబ్ల్యుడబ్ల్యుఇతో కలిసి పనిచేయడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది.' అని తెలిపారు. ఇంతకుముందు భారతీయ సినిమాల్లో హీరోలు, విలన్ల పాత్రలు పోషించిన కార్తీ.. ఆ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా హీరోలు, విలన్ల శక్తిని పూర్తిగా చూపించాడు. కార్తీ తన అభిరుచి, మచ్చలేని రోల్ ప్లేతో, సౌత్ మార్కెట్లో డబ్ల్యుడబ్ల్యుఇకి అంకితమైన అభిమానుల కోసం సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రచారానికి జీవం పోశాడు. క్రియేటివ్ కాన్సెప్ట్, సినిమాలకు దర్శకత్వం సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ నిర్వహించింది. -
క్రికెట్ ఫీవర్.. వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మద్దతుగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్
వన్డే వరల్డ్‌కప్ ఫీవర్ డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment)ని తాకింది. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఒకరు టీమిండియాకు మద్దతుగా నిలిచారు. తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్లో స్టార్ రెజ్లర్ డ్రూ మెక్ఇన్టైర్ (Drew McIntyr) టీమిండియా జెర్సీ ధరించి రింగ్‌లోకి దిగాడు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. భారత క్రికెట్ అభిమానులు తమ జట్టు జెర్సీని ధరించిన డ్రూ మెక్ఇన్టైర్ను చూసి మురిసిపోతున్నారు. అప్పటివరకు జాన్ సీనా, ద రాక్ లాంటి పాశ్యాత్య దేశ రెజ్లర్లకు అభిమానులుగా ఉన్న భారతీయులు డ్రూ మెక్ఇన్టైర్ తాజా చర్య తర్వాత అతని అభిమానులుగా మారిపోయారు. డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక్కసారిగా మెక్ఇన్టైర్కు క్రేజ్ పెరిగిపోయింది. సోషల్‌మీడియాలో అతన్ని ఫాలో అయ్యే భారతీయుల సంఖ్య ఒక్కసారిగా రెండింతలయ్యింది. డ్రూ మెక్ఇన్టైర్ ఇటీవల భారత్‌లో పర్యటించినప్పడు కూడా ఇక్కడి వారిని ఆకట్టుకున్నాడు. WWE Superstar Drew McIntyre is supporting India in the 2023 World Cup....!!! 🇮🇳 pic.twitter.com/AwC1OAQJOn — Mufaddal Vohra (@mufaddal_vohra) September 28, 2023 కొద్ది రోజుల కిందట ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెక్ఇన్టైర్ భారతీయులతో మమేకమైపోయాడు. స్టార్ ఇమేజ్ కలిగిన మెక్ఇన్టైర్ హైదరాబాద్ నగర వీధుల్లో సాధారణ వ్యక్తిలా తిరుగుతూ భారతీయులకు, ముఖ్యంగా హైదరాబాదీలకు బాగా చేరువయ్యాడు. తాజా చర్యతో (వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మద్దతుగా భారత జెర్సీ ధరించడం) అతను భారతీయులకు మరింత దగ్గరయ్యాడు. 38 ఏళ్ల మెక్ఇన్టైర్ స్కాట్లాండ్కు చెందిన ప్రొఫెషనల్ రెజ్లర్ అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్‌కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. -
భారత్‌లో నాకు ప్రత్యేక అభిమానులున్నారు : 'సూపర్‌స్టార్ జాన్ సినా'
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిష్టను చాటుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్‌నకు వేదికగా నిలిచింది. సమరాన్ని తలపించేలా శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’ పోరు జరిగింది. దేశంలో రెండోసారి, నగరంలో తొలిసారిగా పోటీలు జరగడంతో సందడి నెలకొంది. ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’లో పదమూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ‘జాన్ సినా’ రావడంతో అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. జాన్ సినాతో పాటు సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, జిందర్ మహల్, నటల్య, ‘ది రింగ్ జనరల్’ గుంథర్, డ్రూ మెక్‌ఇంటైర్, కెవిన్ ఓవెన్స్, సమీ జైన్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్స్టార్లు తలపడేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో వచ్చిన వీరికి ఎయిర్‌పోర్టులో అభిమానులు ఘనస్వాగతం పలికారు. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌కు హాజరైన జాన్ సినాను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ రాజేష్ కౌల్ ఆహ్వానించి అభినందనలు తెలిపారు. ఇటీవల డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ కెవిన్ ఓవెన్స్, సామి జైన్‌లతో సీక్రెట్‌గా ఓ ప్రాజెక్ట్ చిత్రీకరణలో కనిపించి అలరించిన దక్షిణాది హీరో కార్తీ శుక్రవారం జాన్ సినాను ప్రత్యేకంగా కలిసి ఫొటోలు దిగారు. గొప్ప అనుభూతి.. ► ఈ సందర్భంగా జాన్ సినా మాట్లాడుతూ.. భారత్‌లో తనకు ప్రత్యేక అభిమానులున్నారని, ఇన్నేళ్ల తర్వాత భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతిగా నిలిచిపోతుందన్నారు. ► పోటీల్లో పాల్గొంటున్న భారతీయ ఫైటర్లు వీర్ మహాన్, సంగా, జిందర్ మహల్లు హైదరాబాద్ నగరాన్ని మరోసారి ఆస్వాదించామన్నారు. ప్రత్యేకంగా చార్మినార్‌ను సందర్శించామని, ఇక్కడి ఫేమస్ బిర్యానీ తిన్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ► స్పెక్టాకిల్‌లో పాల్గొన్న లేడీ ఫైటర్ నటల్య ‘భారతీయ అభిమానుల ప్రేమలో తడవటం గొప్ప అనుభూతి అని’ అభివర్ణించింది. ఇక్కడి మూలాల్లోనే పోటీతత్వం ఇమిడి ఉందని కితాబిచ్చింది. -
డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు..!
అమెరికాలోని అలబామాలోని రివర్ ఫ్రంట్ పార్క్‌లో దారుణం జరిగింది. కొందరు యువకులు ఓ సెక్యూరిటీ గార్డ్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఓ బోటును పక్కకు జరపమని సెక్యూరిటీ గార్డ్ అడిగిన నేపథ్యంలో ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. Yo this is wild 😭 A group of white men attacked a black security guard after the security asked them to move their pontoon boat so the big Harriot can dock. They refused to & attacked the security guard. A group of black men seen & went defend him by beating the white men 💯🙌🏾 pic.twitter.com/Qzo3U3Kq1r — Shannonnn sharpes Burner (PARODY Account) (@shannonsharpeee) August 6, 2023 యువకులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. మొదట ఓ యువకుడు సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేశాడు. అనంతరం అతనికి మద్దతుగా వచ్చిన మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా రహితంగా ఆయనపై దాడి చేశారు. చొక్కాలు విప్పుకుని ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు. డబ్ల్యడబ్ల్యూఈ స్థాయిలో కుర్చీలతో చొక్కాలు విప్పుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందులో మహిళలు కూడా పాలు పంచుకున్నారు. ఘర్షణలో కొందరిని నదిలో నెట్టేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
భార్యను రక్షించడానికి షార్క్‌తో అండర్ టేకర్ మల్లయుద్ధం..!
డబ్ల్యూడబ్ల్యూఈ అడ్డాలో అండర్ టేకర్ పేరు తెలియని వారుండరు. రింగ్‌లోకి దిగాక ఆయన పిడిగుద్దులకు ఎదురు నిలిచేవారుండరు. ఎంత మంది ఎదురొచ్చినా నిలిచి కొట్లాడే ధైర్యశాలి. అయితే.. వారి ధైర్య సాహసాలు కేవలం రింగ్‌కే పరిమితం కాదని నిరూపించాడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ అండర్ టేకర్. బీచ్‌లో సొరచేప నుంచి తన భార్యను కాపాడాడు. అవసరం ఎదురైనప్పుడు మనుషులతోనే కాదూ.. క్రూర జంతువులతో కూడా పొట్లాడగల ధీరత్వం రెజ్లర్ సొంతమని చెప్పకనే చెప్పాడు అండర్ టేకర్. సన్డే ఇజ్ ఫన్ డే.. ఎవరైనా కాస్త విశ్రాంతిని కోరుకుంటారు. ఉల్లాసంగా గడపాలనుకుంటారు. అలాగే అండర్ టేకర్ దంపతులు కూడా బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన భార్య మిచెల్ మెక్కూల్ సముద్రంలోకి దిగారు. అండర్ టేకర్ బీచ్ ఒడ్డున ఓ పుస్తకం చదువుతున్నారు. ఈ సమయంలో మెచెల్కు సమీపంగా ఓ సొరచేప వచ్చింది. ఒక్కసారిగా భయపడిన ఆమె.. భర్త వైపు చూసి కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన టేకర్.. సముద్రంలోకి దిగారు. సొరచేప గమనానికి అడ్డుగా నిలబడ్డారు. కానీ ఆ సొరచేప వీరి వైపు రాకుండా దూరంగా వెళ్లిపోయింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మిచెల్.. భర్తపై ప్రశంసలు కురిపించారు. 'మీరుండగా.. నాకు ఏం భయం. మీరుంటే ఆ ధైర్యమే వేరు. సమస్య నా వద్దకు రావాలంటే ముందు అది మిమ్మల్ని దాటి రావాలి' అంటూ భర్తపై ఉన్న నమ్మకాన్ని కొనియాడారు. తన భర్త బలాన్ని చూసి ఎప్పుడూ ఆశ్యర్యపోతుంటానని చెప్పారు. మిచెల్ మెక్కూల్.. అండర్ టేకర్(58) 2010లో వివాహం చేసుకున్నారు. ఆమె కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో పలు విజయాలు సాధించారు. డివా ఛాంపియన్‌ను రెండు సార్లు గెలిచారు. డబ్ల్యూడబ్ల్యూఈ మహిళల ఛాంపియన్‌గా రెండు సార్లు నిలిచారు. 'నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో అండర్ టేకర్ వంటి మానసిక దృఢత్వాన్ని ఎవ్వరిలో చూడలేదు. ఆటలోకి దిగాక చాలా ప్రభావవంతగా ఆడగలరు. ఏది ఏమైనా నేనున్నాని చెబుతాను. తనతో కలిసి వర్క్ అవుట్ చేస్తాను. మంచి ఆహారాన్ని వండి పెడతాను. అండర్ టేకర్ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి కావాల్సిన పనులు చేస్తాను' అని మిచెల్ మెక్కూల్ చెప్పారు. ఇదీ చదవండి: Nepal Chopper Crash: ఎవరెస్టు సమీపంలో కూలిన హెలికాఫ్టర్.. ఆరుగురు టూరిస్టులు మృతి.. -
జాన్ సేనా సిగ్నేచర్‌లో మోదీ.. పిక్ వైరల్.. అభిమానుల హర్షం..
డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా అంటే గుర్తుపట్టని వారు ఉండరు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో బైడెన్ దంపతులతో ముచ్చటిస్తున్న క్రమంలో దిగిన ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది. అదీ జాన్ సేనా సిగ్నేచర్‌లా ఉండటమే అందుకు కారణం. View this post on Instagram A post shared by John Cena (@johncena) అయితే.. బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ముచ్చటిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ చేతిని పైకెత్తారు. అచ్చం అలాగే డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా కూడా చేతిని పైకెత్తుతారట. ఆ ఫొటోను స్వయంగా జాన్ సేనా తన అన్స్టాలో షేర్ చేశారు. దీంతో ఆ పిక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తమ అభిమాన స్టార్ జాన్ సేనా కూడా అలాగే చేతిని పైకెత్తుతారని గుర్తుచేశారు అభిమానులు. మోదీ.. జానా సేనా సిగ్నేచర్ పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా కూడా జాన్ సేనా పోస్ట్‌పై స్పందించింది. హ్యాండ్‌షేక్ చేస్తున్న ఎమోజీ పెట్టింది. ఈ పర్యటన అమెరికా భారత్ మధ్య సరికొత్త అధ్యయాన్ని సృష్టిస్తుందని మోదీ అన్నారు. 21వ శతాబ్దపు గతిని నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న కార్పొరేట్ సంస్థల సీఈఓలు కూడా మోదీని కలిశారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదేళ్ల, ముఖేష్ అంబానీ దంపతులు, మహేంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీకి డిన్నర్లో ప్రత్యేకమైన వంటకాలు వడ్డించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై ఈ పర్యటన ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇదీ చదవండి: పాట పాడి.. మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్ గాయని -
వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి
డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) లెజెండ్, హాల్ ఆఫ్ ఫేమ్ జేక్ రాబర్ట్(ముద్దుగా The Snake) 68 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడు. ఇక్కడ విచిత్రమేంటంటే 23 ఏళ్ల క్రితం విడాకులు ఇచ్చిన తన భార్యనే మళ్లీ వివాహమాడనున్నాడు. ఈ విషయాన్ని ది స్నేక్ రాబర్డ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. విషయంలోకి వెళితే.. జేక్ రాబర్ట్స్ 1984లో చెరిల్ హాగ్వుడ్ను ప్రేమించి పెళ్లి పెళ్లిచేసుకున్నాడు. ఈ జంటకు నలుగురు పిల్లలు. 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ ఇద్దరు 2000వ సంవత్సరంలో విడిపోయారు. ఆ తర్వాత జేక్ రాబర్ట్స్ 2006లో జూడీ లిన్‌ను వివాహామాడాడు. 2011లో వీరిద్దరికి విడాకులయ్యాయి. అప్పటినుంచి జేక్ రాబర్ట్స్ ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా జేక్ రాబర్ట్స్ తన మనసులోని మాటన బయటపెట్టాడు. ''23 ఏళ్ల క్రితం నా భార్య చెరిల్ హాగ్వుడ్కు విడాకులు ఇచ్చాను. ఇన్నేళ్లు మేము విడిగానే ఉంటున్నా ఫ్రెండ్లీగానే ఉంటూ వచ్చాం. అయితే ఈ మధ్యనే తనను కలిసి మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆమె నుంచి తొలుత స్పందన రాకపోయినప్పటికి తర్వాత పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. నిజంగా మాది ఒక అద్బుత లవ్‌స్టోరీ. 23 ఏళ్లు మేం విడిపోయాం అంటే నమ్మలేకుండా ఉన్నా. దేవుడు నాకు ఇవ్వబోతున్న సెకెండ్ చాన్స్‌ను ఉపయోగించుకుంటా. చెరిల్ హాగ్వుడ్ను ఈసారి కష్టపెట్టను.. ఆమెను బాగా చూసుకోగలను అనే నమ్మకం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌గా పేరు పొందిన జేక్ రాబర్ట్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది అతని మెడలో ఒక కొండచిలువను వేసుకొని రింగ్‌లోకి అడుగుపెడుతుండేవాడు. అందుకే ది స్నేక్ మాస్టర్(The Snake) పేరుతో పాపులర్ అయ్యాడు. ఇక 2014లో డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన జేక్ రాబర్ట్స్ ప్రస్తుతం ఆల్ ఎలైట్ రెజ్లింగ్(AEW Pro Wrestling)లో లాన్స్ ఆర్చర్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: స్కూల్ఫ్రెండ్ను పెళ్లాడనున్న సీఎస్కే స్టార్ -
ఆ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్‌ది ఆత్మహత్యే
2022, అక్టోబర్ 5న టెక్సాస్‌లోని (అమెరికా) తన స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్ సారా లీ (30)కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని స్థానిక మెడికల్ అధికారులు తాజాగా వెల్లడించారు. సారా డెడ్ బాడీపై గాయాలు ఉండటంతో తొలుత పలు అనమానాలు వ్యక్తం చేసిన అధికారులు, తాజాగా విడుదల చేసిన అటాప్సీ రిపోర్ట్‌లో సారాది ముమ్మాటికీ ఆత్మహత్యేనని నిర్ధారించారు. చదవండి: ధోని క్రేజ్.. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడా? బెక్సార్ కౌంటీ మెడికల్ ఆఫీసర్ నివేదిక ప్రకారం.. యాంఫటమైన్స్, డాక్సిలామైన్, ఆల్కహాల్ కలిపి సేవించడం వల్ల సారా మరణించిందని, ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని, సారా శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి ముందు కింద పడటం వల్ల ఏర్పడ్డవేనని నిర్ధారించబడింది. దీంతో సారా మృతిపై గత కొద్ది రోజులుగా ఉన్న అనుమానాలకు తెరపడినట్లైంది. WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7 — WWE (@WWE) October 7, 2022 అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సారాను ఎవరు ఏమీ చేయలేదు.. మరి అంత చిన్న వయసులో (30) ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందోనని డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సారా 2015 మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment) ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఆమె రెజ్లింగ్ ఛాంపియన్‌గానే కాకుండా అమెరికన్ టీవీ పర్సనాలిటీగా కూడా అందరికీ సుపరిచితం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001, మెయిల్: roshnihelp@gmail.com -
డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఇంట తీవ్ర విషాదం
డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం.. హాల్ ఆఫ్ ఫేమ్ కెవిన్ నాష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కెవిన్ నాష్ కుమారుడు 26 ఏళ్ల ట్రిస్టన్ నాష్ శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. ఈ విషయాన్ని రెజ్లింగ్ రిపోర్డర్ సీన్ రోస్ సాప్ వెల్లడించాడు. కాగా ట్రిస్టన్ నాష్ మృతి వెనుక కారణాలను రివీల్ చేయడానికి అతని కుటుంబసభ్యులు ఇష్టపడలేదని రోస్ సాప్ ట్వీట్ చేశాడు. ''కెవిన్ నాష్, తమరా నాష్‌ల తనయుడు ట్రిస్టన్ నాష్ 26 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం బాధాకరం. తన తండ్రితో కలిసి ఇటీవలే పాడ్‌కాస్ట్ ఆరంభించిన ట్రిస్టన్ సరదాగా ఎంజాయ్ చేస్తున్న టైమ్‌లో ఇలా జరగడం దురదృష్టకరం. కుటుంబసభ్యుల వినతి మేరకు ట్రిస్టన్ మరణంపై ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాగా ట్రిస్టన్ ఆత్మకు శాంతి చేకూరాలిన భగవంతుడిని ప్రార్థిస్తున్నా'' అంటూ తెలిపాడు. డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్.. మిక్ ఫోలీ(డిక్సీ కార్టర్) స్పందిస్తూ.. నా ప్రియమైన మిత్రుడు కెవిన్ నాష్ గుండె పగిలే వార్త నన్ను ఇబ్బంది పడుతుంది. ట్రిస్టన్ నాష్ ఇంత చిన్న వయసులో మనల్ని విడిచిపెట్టి వెళ్లడం దురదృష్టకరం. కెవిన్ నాష్ సహా అతని కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానభూతి అంటూ ఎమెషనల్ అయ్యాడు. ఇక కెవిన్ నాష్ 1990లో అప్పటి డబ్ల్యూడబ్ల్యూఎఫ్(ఇప్పటి డబ్ల్యూడబ్ల్యూఈ)లో ప్రొఫెషనల్ రెజ్లింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2020లో రెజ్లింగ్‌కు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. డీజిల్(Diesel), బిగ్ డాడీ కూల్(Big Daddy Cool) పేర్లతో పాపులర్ అయిన కెవిన్ నాష్ తన కెరీర్లో చీటింగ్ చేసి ఎక్కువ విజయాలు సాధించడం గమనార్హం. ఒకసారి డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్, ఇంటర్కాంటినెంటల్ చాంపియన్‌షిప్ ఒకసారి, రెండుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్టీమ్ చాంపియన్‌గా నిలిచాడు. 2015లో వ్యక్తిగతంగా డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌గా నిలిచన కెవిన్ నాష్.. 2020లో మరోసారి న్యూ వరల్డ్ ఆర్డర్(NWO) తరపున రెండోసారి హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్టివ్లో చోటు దక్కించుకున్నాడు. Oh @RealKevinNash & Tamara...I am absolutely brokenhearted to hear about the passing of Tristen. Kevin was so proud of him & I always loved hearing him share stories about his love for his beautiful son. My thoughts, prayers & love to you both during this heart-wrenching time 💔 — Dixie Carter (@TNADixie) October 21, 2022 చదవండి: మెస్సీతో ఇంటర్య్వూ.. జర్నలిస్ట్ కన్నీటి పర్యంతం -
తీవ్ర విషాదం.. 30వ ఏట డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ సారా లీ హఠాన్మరణం
WWE- Sara Lee: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ రెజ్లర్ సారా లీ హఠాన్మరణం చెందారు. తన ప్రదర్శనతో రెజ్లింగ్ అభిమానులను అలరించిన ఆమె తన 30వ ఏట చనిపోయారు. ఈ విషయాన్ని సారా తల్లి టెర్రీ లీ శుక్రవారం ధ్రువీకరించారు. సోషల్ మీడియా వేదికగా కూతురి మరణవార్తను తెలియజేశారు. సారా ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయిందని.. ఆమె అంత్యక్రియల ఏర్పాట్లు కూడా ఇంకా పూర్తి కాలేదంటూ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే, ఆమె మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కాగా 2015లో డబ్ల్యూడబ్ల్యూఈ రియాలిటీ కాంపిటీషన్ ‘టఫ్ ఎనఫ్’ సిరీస్ విజేతగా నిలిచిన సారా లీ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ విచారం వ్యక్తం చేసింది. మహిళా క్రీడాలోకంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఇక లేరనే విషాదకర వార్త తెలిసిందని.. ఆమె కుటుంబం, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలిపింది. WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7 — WWE (@WWE) October 7, 2022 అదే విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్లు పలువురు సారాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘హృదయం ముక్కలైంది. ఈ విషాదాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు’’ అంటూ సరాయా, చెల్సీ గ్రీన్.. సారాతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. కాగా సహచర రెజ్లర్ వెస్టిన్ బ్లేక్‌ను పెళ్లాడిన సారాకు ముగ్గురు సంతానం ఉన్నట్లు సమాచారం. No tweet or amount of words can bring back this beautiful human, but all of my heart goes out to @TheWestinBlake & their family. Sara Lee will be missed greatly. ♥️ The photo on the left is how I will always remember her - laughing, smiling, carefree. pic.twitter.com/XLlLFXDOcF — CHELSEA GREEN (@ImChelseaGreen) October 6, 2022 చదవండి: Ind Vs SA- WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023కి మేము ‘అర్హత’ సాధించడం కష్టమని తెలుసు! అయినా.. BCCI Electoral Rolls: గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..? -
'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా!
డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్.. భారత్ రెజ్లర్ గ్రేట్ ఖలీ కన్నీటిపర్యంతం అయ్యాడు. అతను ఎందుకు ఏడ్చాడన్నది అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది. విషయంలోకి వెళితే.. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఖలీని.. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలివ్వాలని అడిగారు. అందుకు ఆనందంగా ఒప్పుకున్న ఖలీ చిరునవ్వుతో వారి దగ్గరికి వచ్చి ఫోటోలకు ఫోజిచ్చాడు. కానీ సెకన్ల వ్యవధిలోనే అతని మొహంలో మార్పు కనిపించింది. అప్పటిదాకా సంతోషంగా కనిపించిన ఖలీ.. ఒక్కసారిగా దుఃఖంతో కుమిలిపోయాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఖలీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడన్నది ఎవరికి అర్థం కాలేదు. వారు తనపై చూపించిన అభిమానానికి ఖలీ కన్నీళ్లు పెట్టుకున్నారా? లేదంటే అభిమానుల్లో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నొచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారా? అన్న విషయం తెలియరాలేదు. కాగా 19 సెకెన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటివరకు 40వేల మంది వీక్షించారు. భారత్ తరపున వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ)లో పాల్గొని 'ది గ్రేట్ ఖలీ'గా అంతర్జాతీయ ఖ్యాతి గడించాడు. 'గ్రేట్ ఖలీ' అసలు పేరు దలీప్ సింగ్ రాణా. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మోర్ జిల్లాలోని ధీరైనా గ్రామంలో జన్మించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో లెజెండరీ.. హండర్ టేకర్‌ను ఓడించి ఖలీ అప్పట్లో సంచలనం సృష్టించాడు. కాగా ఒకసారి డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఖలీ.. 2021లో ''WWE HALL OF FAME''లో చోటు సంపాదించాడు. ఇక పలు బాలీవుడ్, హాలివుడ్ సినిమాల్లోనూ నటించిన ఖలీ అలియాస్ దలీప్ రాణా.. పంజాబ్ పోలీస్‌లో అసెస్టింట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. ఇటీవలే రాజకీయ అరంగేట్రం ఇచ్చిన ఖలీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. what made Khali Sir cry? pic.twitter.com/mrFKUTdM5A — Viral Bhayani (@viralbhayani77) August 12, 2022 చదవండి: Cheteshawar Pujara: తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్.. వెంటాడిన దురదృష్టం Abhinav Bindra: 34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్?.. మూడు ముక్కల్లో సమాధానం -
WWE: రిటైర్మెంట్ ప్రకటించిన విన్స్ మెక్‌మ్యాన్
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) చైర్మన్, సీఈవో విన్స్ మెక్‌మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన పదవులతో పాటు మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈకి వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం విన్స్ మెక్‌మ్యాన్ ఒక ప్రకటనలో తెలిపాడు. ''నా వయసు 76 ఏళ్లు.. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. అందుకే ఈ రిటైర్మెంట్. ఇన్నేళ్లలో ఎంతో మంది రెజ్లర్లను తీసుకొచ్చాను. మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఎన్నో ఏళ్ల పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాననే ఆశిస్తున్నా. నాతో పాటు నా కుటుంబం కూడా భాగస్వామ్యం కావడం సంతోషాన్నిచ్చింది. డబ్ల్యూడబ్ల్యూఈ అనే బ్రాండ్ ఇప్పట్లో ఎవరు తుడిచేయలేరు. నా తర్వాతి తరం దానిని కొనసాగిస్తారు.'' ఉద్వేగంతో ప్రకటించాడు. ఇక విన్స్ మెక్‌మ్యాన్ స్థానంలో తన అల్లుడు ట్రిపుల్ హెచ్(పాల్ మైకేల్ లెవెస్క్యూ) ఇకపై ఆ బాధ్యతలు చూసుకుంటాడని బోర్డు తెలిపింది. 76 ఏళ్ల వయసున్న విన్సెంట్ కెనెడీ మెక్‌మ్యాన్.. తండ్రి అడుగు జాడల్లోనే రెజ్లింగ్ ఫీల్డ్‌లోనే అడుగుపెట్టాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది)లో రింగ్ అనౌన్సర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. కామెంటేటర్‌గా పని చేశాడు. ఆపై భార్య లిండాతో కలిసి సొంత కంపెనీ పెట్టి.. అటుపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌లతో ఎంటర్టైన్మెంట్ రంగంలో రారాజుగా ఎదిగాడు. కాగా రాసలీలల స్కాం ఆరోపణల నేపథ్యంలో విన్స్ మెక్‌మ్యాన్ గతంలోనే చైర్మన్, సీఈవో పదవి నుంచి తాత్కాలికంగా తప్పుకున్నాడు. మాజీ ఉద్యోగితో ఎఫైర్ నడిపిన విన్స్.. ఆ విషయం బయటకు పొక్కుండా ఉండేందుకు సదరు ఉద్యోగిణితో 3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.23.4 కోట్లు) మేర ఒప్పందం చేసుకున్నట్లు కొన్నిరోజల ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో కంపెనీ బోర్డు ఆయనపై విచారణకు ఆదేశించింది. దీంతో మెక్‌మ్యాన్ తన చైర్మన్, సీఈవో పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు. మెక్‌మ్యాన్ వైదొలగడంతో ఆయన కూతురు స్టెఫనీ మెక్మ్యాన్కు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పజెప్పింది. తాజాగా వయసు దృశ్యా డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి శాశ్వతంగా దూరమవుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. డబ్ల్ల్యూడబ్ల్యూఈలో విన్స్ మెక్‌మ్యాన్ ఘనతలు ►ఈసీడబ్ల్యూ వరల్డ్ చాంపియన్(ఒకసారి) ►డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చాంపియన్(ఒకసారి) ►రాయల్ రంబుల్ విజేత(1999) ►మ్యాచ్ ఆఫ్ ది ఇయర్: 2006లో వ్రెసల్‌మేనియా 22లో భాగంగా షాన్ మెకెల్స్తో ఆడిన మ్యాచ్ -
'ది గ్రేట్ ఖలీ' ఏందయ్యా ఇదీ.. టోల్గేట్ సిబ్బందితోనా..!
చండీగఢ్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా మరోమారు వార్తల్లో నిలిచారు. పంజాబ్, లుధియానాలోని ఓ టోల్గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ కార్మికుడిపై ఖలీ చేయి చేసుకున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపించారు. టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఖలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఆ వీడియోలో టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు.. లాధోవాల్ టోల్ ప్లాజా సిబ్బంది తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు దలిప్ సింగ్ రాణా. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ నుంచి హరియాణాలోని కర్నాల్‌కు ఖలీ తన కారులో వెళ్తున్న క్రమంలో టోల్గేట్ వద్ద ఈ సంఘటన ఎదురైనట్లు చెప్పారు. ధ్రువీకరణ పత్రం అడిగిన తమ సిబ్బందిని ఎందుకు కొట్టారని ఖలీని టోల్ సిబ్బంది అడుగుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. 'మిమ్మల్ని ఐడీకార్డు చూపించాలని అడిగారు. ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది అడగగా.. మీరు నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు ఖలీ. దానికి 'మిమ్మల్ని మేము బ్లాక్మెయిల్ చేయటం లేదు.. అతడిని ఎందుకు కొట్టారు? మీ దగ్గర ఉంటే ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే.. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేదని ఖలీ వారితో చెప్పారు. WWE wrestler #GreatKhali clashes with toll plaza staff at #Ludhiana#TheGreatKhali #ViralVideo #Punjab #Khali #ludhiana #WWE pic.twitter.com/XYJEhsdVtL — Vineet Sharma (@Vineetsharma906) July 12, 2022 ది గ్రేట్ ఖలీ వాహనం టోల్గేట్ దాటి వెళ్లకుండా ముందు బారికేడ్ పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఖలీ దానిని తీసి పక్కన పడేశారు. టోల్ సిబ్బంది ఖలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువురు తమ వాదనలు పోలీసులకు వినిపించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన క్రమంలో వివరణ ఇచ్చారు ఖలీ. 'నిన్న పంజాబ్‌లోని లాధోవాల్ టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది నా కారును అడ్డుకుని సెల్ఫీ కోసం నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అందుకు అంగీకరించకపోవటం వల్ల జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని బూతులు మాట్లాడారు.' అని ఖలీ చెప్పారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
Sri Lanka Crisis: ప్రధాని బెడ్‌పై నిరసనకారుల రెజ్లింగ్.. వీడియో వైరల్
కొలంబో: దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని లంకేయుల కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గతవారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆక్రమించారు. అనంతరం అక్కడి విలాస సదుపాయాలను కొందరు ఆందోళనకారులు ఆస్వాదించారు. భవనంలోని స్విమ్మింగ్‌పూల్‌లో దూకి ఈత కొట్టారు. కిచెన్‌లో వండుకుని తిన్నారు. బెడ్రూంలలో హాయిగా సేదతీరారు. జిమ్‌లో వర్కౌట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఇప్పుడు ఇలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆయన బెడ్‌పై సరదాగా రెజ్లింగ్ చేశారు. ప్రొఫెషనల్ రెజ్లర్లను తలపించేలా స్టంట్లతో రెచ్చిపోయారు. అంతేకాదు ఈ వీడియోను కాస్త ఎడిట్ చేసి దానికి బ్యాగ్రౌండ్లో నిజమైన రెజ్లింగ్ మ్యాచ్ కామెంటరీని కూడా జోడించారు. ఇందుకు సంబందించిన వీడియోను ఓ శ్రీలంక యూజర్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రొఫెషనల్ రెజ్లర్లలా మారి ఆందోళనకారులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. నిజమైన మ్యాచ్‌ను తలపించేలా బెడ్‌పై ‘కుమ్మేసుకున్నారు’. వీడియోలో ఓ ఆందోళనకారుడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్ ర్యాండీ ఆర్టన్లా పోజులివ్వడం ఆకట్టుకుంది. Video - #WWE Wrestling on Prime Minister's bed at Temple Trees 😃#LKA #SriLanka #SriLankaCrisis #SriLankaProtests pic.twitter.com/5f2zE9uqLD — Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 10, 2022 అంతకుముందు అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేయాలని ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రధాని ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. ప్రజల ఆగ్రహావేశాలు చూసి అధ్యక్షుడు గొటబాయ పారిపోయారు. ప్రస్తుతం ఆయన శ్రీలంక నేవీ ఓడలో ఉన్నట్లు తెలుస్తోంది. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో పదవుల నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు, ప్రధాని ఇప్పటికే ప్రకటించారు. చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
రాసలీలల స్కాం: WWE చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన మెక్‌మ్యాన్
ప్రపంచంలోనే అత్యధిక బుల్లితెర వీక్షణ ఉన్న రియాలిటీ ఎంటర్టైన్మెంట్ రెజ్లింగ్ షో డబ్ల్యూడబ్ల్యూఈ. ఈ షో నుంచి ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్, సీఈవో విన్స్ మెక్‌మ్యాన్(76) తన పదవుల నుంచి వైదొలిగారు. రాసలీలల స్కాం ఆరోపణల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాజీ ఉద్యోగితో ఎఫైర్ నడిపిన విన్స్.. ఆ విషయం బయటకు పొక్కుండా ఉండేందుకు సదరు ఉద్యోగిణితో 3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.23.4 కోట్లు) మేర ఒప్పందం చేసుకున్నట్లు ఈమధ్య ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో కంపెనీ బోర్డు ఆయనపై విచారణకు ఆదేశించింది. ఈ దరిమిలా తన సీఈవో, చైర్మన్ పదవులకు స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు విన్స్ మెక్‌మ్యాన్ ప్రకటించారు. మాజీ ఉద్యోగిణితో ఎఫైర్ గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆమెకు విన్స్ మెక్‌మ్యాన్ డబ్బు ఇచ్చాడని, ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. అయితే ఈ వ్యవహారంపై డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు దర్యాప్తు ఏప్రిల్‌లోనే మొదలైందని, దర్యాప్తులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయని ఆ కథనం సారాంశం. మెక్మ్యాన్తోపాటు డబ్ల్యూడబ్ల్యూఈ టాలెంట్ రిలేషన్స్ హెడ్‌గా ఉన్న జాన్ లారినైటిస్ మీద కూడా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరి మీద ప్రత్యేక కమిటీ దర్యాప్తు కొనసాగిస్తోందని డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటివరకు చైర్మన్, సీఈవో బాధ్యతలకు దూరంగా ఉన్నప్పటికీ.. క్రియేటివ్ కంటెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రిప్ట్)లో మాత్రం విన్స్ మెక్‌మ్యాన్ జోక్యం ఉంటుందని డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు స్పష్టం చేసింది. మెక్‌మ్యాన్ వైదొలగడంతో ఆయన కూతురు స్టెఫనీ మెక్మ్యాన్కు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పజెప్పింది దర్యాప్తు కమిటీ. 76 ఏళ్ల వయసున్న విన్సెంట్ కెనెడీ మెక్‌మ్యాన్.. తండ్రి అడుగు జాడల్లోనే రెజ్లింగ్ ఫీల్డ్‌లోనే అడుగుపెట్టాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది)లో రింగ్ అనౌన్సర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. కామెంటేటర్‌గా పని చేశాడు. ఆపై భార్య లిండాతో కలిసి సొంత కంపెనీ పెట్టి.. అటుపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌లతో ఎంటర్టైన్మెంట్ రంగంలో రారాజుగా ఎదిగాడు. విన్స్మెక్మ్యాన్ భార్య లిండా, గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలక బాధత్యలు నిర్వహించారు. ఇక మెక్‌మ్యాన్ కొడుకు షేన్ మెక్‌మ్యాన్, కూతురు స్టెఫనీ మెక్‌మ్యాన్, అల్లుడు ట్రిపుల్ హెచ్(పాల్ మైకేల్ లెవెస్క్యూ) కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో రెజర్లుగానే కాకుండా.. కంపెనీ బోర్డు వ్యవహారాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూడబ్ల్యూఈలో విన్స్ మెక్మ్యాన్పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చినా.. ఇప్పుడు వృత్తిపరమైన నియమావళికి సంబంధించినవి కావడంతో విన్స్ మెక్‌మ్యాన్ తప్పనిసరిగా వైదొలగాల్సి వచ్చింది. -
ఆ అమ్మ కథ కదిలించింది.. జాన్ సీనా కలుసుకున్నాడు
ఆ అమ్మ కథ.. ఓ స్టార్నటుడిని కరిగించింది. ఆ కథ తెలుసుకుని డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న తన వీరాభిమానిని ఎట్టకేలకు కలుసుకున్నాడు. పైగా ఆ అభిమాని ఉక్రెయిన్ శరణార్థి కావడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 19 ఏళ్ల మిషా రోహోజైన్, డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న టీనేజర్. కొడుకు పరిస్థితి చూసి.. తండ్రి చిన్నప్పుడే వదిలేశాడు. అప్పటి నుంచి ఆ ఒంటరి తల్లే కొడుకు ఆలనాపాలనా చూసుకుంటోంది. ఉక్రెయిన్ మరియాపోల్ వాళ్ల స్వస్థలం. ఒకప్పుడు అతని ఇంటి నిండా జాన్ సీనా పోస్టర్లే. కానీ, యుద్ధంతో వాళ్ల ఇళ్లు నాశనం అయ్యింది. ప్రాణాలు అరచేతపట్టుకుని ఆ తల్లీకొడుకులు దేశం విడిచారు. అయితే.. ఇంటిని, ఇంట్లో ఉన్న జాన్ సీనా పోస్టర్లను వదిలి వెళ్లేందుకు మిషా ఇష్టపడలేదు. దీంతో జాన్ సీనాను కలిపిస్తాం అంటూ ఆ తల్లి ఆ కొడుకుని బతిమాలి దేశం దాటింది. అమ్‌స్టర్‌డ్యామ్ దగ్గర ఓ శరణార్థ క్యాంపులో తలదాచుకున్నారు వాళ్లు. అప్పటి నుంచి మిషా, జాన్ సీనాను కలవాలని గోల చేయడం మొదలుపెట్టాడు. ఈ తరుణంలో.. మే నెలలో నెదర్లాండ్స్‌కు జాన్ సీనా వస్తున్నాడని తెలిసి.. అక్కడికి వెళ్లారు. కానీ, ఆ సూపర్ స్టార్ రాలేదు. నిరాశగా వెనుదిరిగారు వాళ్లు. ఈ ఉక్రెయిన్ శరణార్థి కథ.. ఈ మధ్యే వాల్ స్ట్రీట్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. ఆ కథనం ద్వారా విషయం తెలుసుకున్న సీనా.. ఆ తల్లి సాహసానికి ఫిదా అయ్యాడు. అంతేకాదు తన వీరాభిమాని మిషాను కలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అమ్‌స్టర్‌డ్యామ్ దగ్గర ఓ శరణార్థ క్యాంపులో తలదాచుకున్న ఆ కుటుంబాన్ని కలుసుకున్నాడు జాన్ సీనా. శరణార్థి శిబిరం కావడంతో అనుమతులు దొరకడం ఇబ్బంది అయ్యింది. ఇబ్బందులు తలెత్తుతాయాన్న ఉద్దేశంతో డబ్ల్యూడబ్ల్యూఈ సైతం స్పానర్షిప్ చేయలేదు. దీంతో తన సొంత ఖర్చులతో రిస్క్ అయినా సరే జాన్ సీనా, ఆ తల్లీకొడుకులను కలుసుకున్నాడు. మిషాకు తన గుర్తుగా కొన్ని గిఫ్ట్‌లు ఇచ్చాడు. What a wonderful way to spend a Saturday. Misha and his mother, Liana define #NeverGiveUp. Thank you to the @WSJ and @WWE who helped make this special visit possible. https://t.co/RpriCvjN3K — John Cena (@JohnCena) June 7, 2022 -
IPL 2022: వెంకటేశ్ అయ్యర్‌కు ప్రత్యేక సందేశం పంపిన WWE సూపర్ స్టార్
Venkatesh Iyer Receives Special Message From Seth Rollins: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ అందింది. అతను ఎంతో అభిమానించే క్రికెటేతర వ్యక్తి వెంకటేశ్ అయ్యర్‌కు ప్రత్యేక సందేశం పంపాడు. ఇంతకీ ఆ మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరు..? ఆ మెసేజ్‌లో ఏముంది..? వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. తాను డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ సెథ్ రోలిన్స్‌ను వీరభిమానినని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్ రోలిన్స్.. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి కొద్ది గంటల ముందు తన ఫ్యాన్ వెంకటేశ్ అయ్యర్‌ను సర్ప్రైజ్ చేశాడు. వెంకటేష్.. మై ఫ్రెండ్. నేను సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్. మీరు నా అభిమాని కావడంలో ఆశ్చర్యం లేదు. నా మిత్రమా, ప్రస్తుతం మీ ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది. ఈ కప్ గెలవడం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కష్టపడి ఆడు.. అంటూ వీడియో సందేశం పంపాడు. ఈ వీడియోను WWE India తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరలవుతోంది. రోలిన్స్ గతంలో డీన్ఆంబ్రోస్, రోమన్ రెయిన్స్‌తో కలిసి షీల్డ్ గ్రూప్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. .@WWERollins’ message for @KKRiders' @venkateshiyer ahead of #IPL2022. #WrestleMania #MeraWrestleMania #WWEonSonyIndia pic.twitter.com/xtjmx269Hs — WWE India (@WWEIndia) March 25, 2022 మరోవైపు, ఐపీఎల్ 15వ సీజన్లో తొలి మ్యాచ్‌కు ముందు తన ఆరాధ్య రెజ్లర్ నుంచి స్పెషల్ మెసేజ్ అందటంతో కేకేఆర్ ఆల్‌రౌండర్ ఉబ్బితబ్బుబ్బి అవుతున్నాడు. ఈ బూస్టప్ డోస్‌తో క్రితం ఏడాది మాదిరే ఈ సీజన్లోనూ రెచ్చిపోవాలని భావిస్తున్నాడు. అయ్యర్ గత సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేసి, కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 26) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 26 సార్లు తలపడగా, సీఎస్కే 17, కేకేఆర్ 8 సందర్భాల్లో విజయాలు సాధించాయి. చదవండి: IPL 2022: చెన్నై, కేకేఆర్ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..! -
సిద్ధార్థ్ శుక్లాకు నివాళులు అర్పించిన హాలీవుడ్ నటుడు
John Cena Pays Tribute To Sidharth Shukla : నటుడు, బిగ్‌బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణంతో బీటౌన్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కి గురయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ 40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంపై నెటిజన్లు సహా బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సిద్దార్థ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ నటుడు, డబ్ల్యూడబ్ల్యూఈ వ్రిస్ట్లర్ జాన్ సెనా సిద్ధార్థ్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : Sidharth Shukla : సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణం.. అదే కారణమా? డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలో అయ్యేవారికి జాన్సేనా ఎవరో తెలిసే ఉంటుంది. అంతేకాకుండా 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ నిలవడమే కాకుండా ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి జాన్సెనా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇటీవలె తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సిద్ధార్థ్ శుక్లా ఫోటో షేర్చేసి సంతాపం తెలిపాడు. అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, శ్రద్ధా ఆర్య వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆ ఫోటోని లైక్ చేశారు. ప్రస్తుతం జాన్సెనా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాలీవుడ్ నటుడు సిద్ధార్థ్‌కు సంతాపం వ్యక్తం చేయడంపై అతని అభిమానులు జాన్సెనాపై ప్రశంసలు కురిపించారు. ఈ పోస్ట్‌కు సిద్ధార్థ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్ల వర్షం కురుస్తుంది. తమ అభిమాన నటుడికి శాశ్వతంగా గుడ్ బై చెబుతూ పలువురు నెటిజన్లు సంతాపం తెలిపారు. చదవండి : సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్ View this post on Instagram A post shared by John Cena (@johncena) -
రెజ్లర్ కాళికి ఏమైంది?
రెజ్లింగ్ ద్వారా మన దేశం పేరును అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన ఘనత రెజ్లర్ ది గ్రేట్ కాళీది. రియాలిటీ స్పోర్ట్స్ షో డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టిన మొదట్లోనే అండర్టేకర్ లాంటి క్రేజ్ ఉన్న రెజ్లర్‌ను రింగ్ కరిపించడం, హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవడంతో కాళి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాడు. అఫ్ కోర్స్.. ఆ తర్వాత కాళీ రెజ్లింగ్ కెరీర్ డౌన్ ఫాల్తోనే నడిచింది. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో అభిమానుల తిక్క కామెంట్లతో కాళిని విసిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కూల్ మ్యాన్ స్పందించాల్సి వచ్చింది. దలీప్‌సింగ్ రాణా అలియాస్ ది గ్రేట్ కాళి.. ఇన్స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు. అయితే ఈ మధ్య ఓ ఉదయం కాళి ఇన్‌స్టా లైవ్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటెరాక్ట్ అయ్యాడు. ఆ టైంలో కొందరు ‘కరోనా పేషెంట్లకు నోటి ద్వారా ఆక్సిజన్ అందించండి సార్’, ‘బట్టల్లేకుండా ఆ వీడియో ఏంటండి?’, ‘గ్యాస్ బాంబుతో సోఫాను పాడుచేయకండి’.. అంటూ చిల్లర కామెంట్లు పెట్టారు. దీంతో కాళి, కామెంట్ సెక్షన్‌ను లిమిట్‌గా సెట్ చేశాడు. అయితే తర్వాతి వీడియోలో ఇన్‌స్టా పాలసీ ప్రకారం అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక ఆ చిల్లర కామెంట్లను కొందరు స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేయడంతో.. ఆ వ్యవహారం మరింత ముదిరింది. కాళి ఏ ఫొటో పెట్టినా.. వీడియో పెట్టినా.. దాని కింద తిక్క కామెంట్లే కనిపించాయి. ఈ వ్యవహారం మీమ్స్ పేజీలలో కూడా వైరల్ అయ్యింది. ఇక సాధ్యం కానీ కోరికలను, పనికి మాలిన కామెంట్లతో మొత్తానికి కాళికి చిర్రెత్తుకొచ్చేలా చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ 48 ఏళ్ల రెజ్లర్ స్పందించాడు. ‘‘నాకు సపోర్ట్‌గా నిలుస్తున్న వాళ్లందరికీ థ్యాంక్స్. నా ఇన్‌స్టా వీడియోలను, సంభాషణలను ఆస్వాదించండి. మంచి కామెంట్లు చేయండి. కానీ, చిల్లర కామెంట్స్ చేసి మీ విలువల్ని దిగజార్చుకోకండి’ అంటూ సున్నితంగానే ఫ్యాన్స్‌ను కోరాడు కాళి. అటుపై ఫ్యాన్స్‌తో కొంత సరదా సంభాషణను కూడా కొనసాగించాడు. మరి ఫ్యాన్స్ ఇకనైనా ట్రోల్స్ చేయకుండా ఉంటారేమో చూడాలి. View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన దలీప్‌సింగ్ బాల్యం కష్టాలతోనే సాగింది. ఆర్థిక కష్టాలతో చదువుకు దూరమై తోట పనుల్లో చేరిన దలీప్ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్త దగ్గర బాడీగార్డుగా పని చేశాడు. అటుపై భారీ కాయంతో బాడీ బిల్డర్ కాంపిటీషన్ల ద్వారా రెజ్లింగ్ కెరీర్లోకి అడుగుపెట్టి.. చివరికి డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ఫేమస్ అయ్యాడు. పంజాబ్ పోలీసాఫీసర్‌గా పనిచేస్తూనే.. మరోవైపు రెజ్లింగ్ కెరీర్ కొనసాగించాడు. అటుపై సినిమాల్లోనూ మెరిశాడు కూడా. 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’ గౌరవం అందుకున్నాడు ది గ్రేట్ కాళి. చదవండి: మహిళా రెజ్లర్‌కు చేదు అనుభవం -
ట్రాన్స్‌జెండర్‌గా మారిన మాజీ రెజ్లర్
వాషింగ్టన్: మాజీ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూయీ సూపర్‌స్టార్ గబ్బి టఫ్ట్ సంచలన ప్రకటన చేశారు. తాను ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు ప్రకటించారు. మహిళగా మారిన తర్వాత తీసిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘ఇది నేనే.. దీని గురించి ప్రకటించడానికి నేను సిగ్గుపడటం లేదు.. భయపటడం లేదు’’ అన్నారు. మహిళగా మారిన ఫోటోతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు గబ్బి. ‘‘నేను చెప్పిన ఈ న్యూస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇది నేనే. దీని గురించి నేను సిగ్గుపడటం లేదు.. ఇబ్బంది పడటం లేదు. ప్రపంచం ఏమి అనుకుంటుందో అని భయపడి ఇన్నాళ్లు నేను దాచిన నా నీడ ఇది. నా కుటుంబం, స్నేహితులు, అనుచరులు దీని గురించి ఎంతో భయపడ్డారు. నేను ఇక దేనికి భయపడను. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో చెప్పగలను.. ఎలా ఉన్నా నన్ను నేను అమితంగా ప్రేమించుకోగలను’’ అన్నారు. కుటుంబం మద్దతుకి కృతజ్ఞతలు ‘‘గత ఎనిమిది నెలలు నా మొత్తం జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ట్రాన్స్ జెండర్‌గా మారిన తర్వాత ప్రపంచాన్ని ఎదుర్కొవాలంటే ఉన్న భయం ఇప్పుడు పూర్తిగా తొలిగిపోయింది. ఈ రోజు ఇతరులు నా గురించి ఏం అనుకుంటున్నారో పట్టించుకోకుండా.. నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకున్న రోజు. నా అస్తిత్వాన్ని అపరిమితంగా ప్రేమిస్తున్నాను. నన్ను ఎంతో ప్రేమించే నా భార్య, కుటుంబం, సన్నిహితులు నన్ను అంగీకరించారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. వారి మద్దతు నాకు ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు చాలవు’’ అని భావోద్వేగానికి గురయ్యారు. బాహ్య రూపం మాత్రమే మారింది ‘‘ఇక ప్రస్తుతం నన్ను అందరూ అంగీకరిస్తారా లేదా అనే విషయం గురించి నేను పట్టించుకోవడం లేదు. నా బాహ్య రూపం మాత్రమే మారింది.. అంతరాత్మ అలానే ఉంది. ఇక నాలోని ఈ మార్పు గురించి మీలో చాలా ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు.. నేను వాగ్దానం చేసినట్లుగానే వాటన్నింటికి తర్వలోనే సమాధానం చెప్తాను. రేపు ఎక్స్ట్రాలో, బిల్లీ బుష్‌తో నా ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతుంది. దీనిలో అన్ని వివరాలు పూర్తిగా తెలుస్తాయి. నా ప్రయాణంలో పారదర్శకంగా.. నిజాయతీగా ఉంటానని ప్రమాణం చేశాను. అలానే కొనసాగుతాను. ఇది నేనే.. ఎప్పటికి మిమ్మల్ని ఎంతో ప్రేమించే గబ్బి అలోన్ టఫ్ట్’’ అంటూ ముగించారు. 2007 నుంచి రెజ్లింగ్ ప్రారంభించిన టఫ్ట్ 2014 లో రింగ్‌కు వీడ్కోలు పలికారు. ఇక కెరీర్లో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ రా, స్మాక్‌డౌన్, రెసిల్ మేనియాలతో తలపడ్డారు. రెజ్లింగ్ నుంచి రిటైర్ అయిన తరువాత.. తన భార్య ప్రిస్సిల్లా, కుమార్తెతో ఎక్కువ సమయం గడిపారు. ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్, మోటివేషనల్ స్పీకర్‌గా కెరీర్‌ని రీస్టార్ట్ చేశారు. చదవండి: బాల బాహుబలి ఇక లేడు View this post on Instagram A post shared by Gabbi Alon Tuft (@gabetuft) -
డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ఇంట్లోకి చొరబడి..
ఫ్లోరిడా : డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెస్లర్ను వేధింపులకు గురిచేయటమే కాకుండా కిడ్నాప్‌కు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అమెరికాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన సోన్య డెవిల్లే అనే డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్పై సౌత్ కాలిఫోర్నియా కార్డ్స్ విల్లేకు చెందిన థామస్ అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను కిడ్నాప్ చేసేందుకు పథకం రచించాడు. ఆదివారం సోన్య నివాసం ఉంటున్న ఫ్లాట్ ఆవరణలోకి చొరబడ్డాడు. దాదాపు నాలుగు గంటల పాటు అక్కడే ఉండి లోపల ఏం జరుగుతోందో గమనించసాగాడు. ( డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ) నిందితుడు థామస్ అనంతరం ఇంటి గ్లాస్ డోర్ గుండా లోపలికి ప్రవేశించాడు. దీంతో ఇంట్లోని అలారం మోగటం మొదలుపెట్టింది. అలారం గట్టిగా మోగుతుండటంతో థామస్‌కు ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత థామస్‌ను చూసిన ప్లాట్ యాజమాని పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
మార్క్ క్యాలవే అనే పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. అదే అండర్ టేకర్ అంటే తెలియని రెజ్లింగ్ అభిమాని ఉండరు. ముఖ్యంగా డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు ద డెడ్ మ్యాన్ (అండర్ టేకర్) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా రెజ్లింగ్ అభిమానులను తన ప్రదర్శనతో అలరిస్తున్న ఈ వెటరన్ రెజ్లర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. డబ్ల్యూడబ్ల్యూఈ విడుదలచేసిన అండర్ టేకర్ బయోపిక్ ‘ద లాస్ట్ రైడ్’ డ్యాక్యూమెంటరీ చివరి ఎపిసోడ్లో అండర్ టేకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘ఇక సాధించాల్సింది ఏమీ లేదు. మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాలని అనుకోవడం లేదు. ఇది చాలా మంచి సమయం. ఇలాంటిది మళ్లీ రాదు. నా కెరీర్‌కు ముగింపు పలకడానికి ఏదైనా మంచి సమయం ఉందంటే.. అది ఇదే’ అని ఆ డ్యాక్యుమెంటరీలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ట్విటర్లో కూడా తాజాగా అధికారికంగా వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చాంపియన్ షిప్ బెల్ట్ పట్టుకొని ఉన్న రోహిత్ శర్మ ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ థ్యాంక్యూ అండర్ టేకర్ అని ట్వీట్ చేసింది. 52 ఏళ్ల అండర్ టేకర్ 1987లో వరల్డ్ క్లాస్ ఛాంపియన్షిప్ రెజ్లింగ్‌తో కెరీర్‌ను ఆరంభించారు. 1990ల్లో టెడ్ డిబియాస్ మిలియన్ డాలర్ టీంలో చివరి సభ్యుడిగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆయన అడుగుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు క్రేజ్ ఉన్నప్పటికీ జాన్ సీనా, ద రాక్ మాదిరి సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. అండర్టేకర్ తన చివరి మ్యాచ్‌లో ఏజే స్టైల్స్‌తో తలపడ్డారు. కాగా, తనతో జరిగిన మ్యాచ్చే అండర్టేకర్కు చివరిదైతే తనకెంతో గర్వంగా ఉంటుందని ఏజే స్టైల్స్ పేర్కొన్నారు. #ThankYou pic.twitter.com/6D1th4wZlA — Undertaker (@undertaker) June 23, 2020 You can never appreciate how long the road was until you’ve driven to the end. #TheLastRide @WWENetwork pic.twitter.com/JW3roilt9a — Undertaker (@undertaker) June 21, 2020 -
డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రేక్షకుల ఆదరణ
సాక్షి, హైదరాబాద్: భారీ పంచ్‌లు, ముష్టిఘాతాలకు నెలవైన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రేక్షకుల నుంచి అమితాదరణను పొందుతోంది. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రెజిల్‌మానియా 35 టోర్నమెంట్ పెద్ద సంఖ్యలో అభిమానులను ఆకర్షించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ స్టార్లు తలపడిన ఈ పోటీలకు ప్రేక్షక లోకం కళ్లప్పగించింది. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలను మెట్‌లైఫ్ స్టాండ్స్ నుంచి దాదాపు 82,000కు పైగా అభిమానుల ప్రత్యక్షంగా వీక్షించారు. ఇదే కాకుండా సోనీ టెన్–1, సోనీ టెన్–3, సోనీ సిక్స్ చానళ్ల ద్వారా భారత్‌లోని అభిమానులు ఈ క్రీడా వినోదాన్ని ఆస్వాదించారు. మెగా ఫ్యాన్స్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలోని పీవీఆర్ మాల్స్‌లో ఈ పోటీలను భారీ స్క్రీన్లపై ప్రదర్శించారు. చరిత్రాత్మకమైన ఈ రెజిల్‌మానియా తొలిసారిగా మహిళల మ్యాచ్‌లను నిర్వహించింది.