YSRCP NRI wing
-
కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
కాలిఫోర్నియా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.వైఎస్‌రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జులై 10వ తేదీ ఉదయం,ఆహా ఇండియన్ హోటల్లో జయంతి వేడుకలను నిర్వహించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం,. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మహానేత అని వైఎస్సార్సీపీ అమెరికా గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కేవీరెడ్డి గుర్తు తెచ్చుకున్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విద్యార్థుల సంక్షేమం కోసం ఫీజు రీ ఎంబర్సుమెంట్, రైతులకు రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన అన్నారు . వైఎస్సార్ స్పూర్తి, ఆశయాలతోవారి కుమారుడు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్స పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్సీపీ అమెరికా కమిటీ ముఖ్య సభ్యులు సురేంద్ర అబ్బవరం, కిరణ్ కూచిభట్ల , సహదేవ్ బోడె , తిరుపతిరెడ్డి , వెంకట్ , అంకిరెడ్డి , ఆనంద్ బందార్ల, అశోక్, ప్రశాంతి, అమర్ బడే తదితరులు వైఎస్సార్ సేవలను, సంక్షేమ పాలనను వారితో గల అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. వారి తనయుడు ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమలో బే ఏరియా వైస్సార్ అభిమానులు హరి, కొండారెడ్డి , త్రోలోక్ , సుబ్బారెడ్డి , రామిరెడ్డి , నరేంద్ర కొత్తకోట, వినయ్, ఇతర వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం నాయకులూ పాల్గొన్నారు. -
పట్టాభి తీరు సమర్థనీయం కాదు.. పార్టీలకతీతంగా ఖండించాలి
షికాగో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేతలు వాడిన అసభ్య పదజాలాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అమెరికాలోని షికాగోలో జనాగ్రహదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు కొండపల్లి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ... మీ కార్యకర్తలు, మీ కుటుంబ సభ్యులను బోషిడికే అనే పదంతో పిలుస్తారా అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్‌ని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు తప్పు చేస్తే నాయకుడిగా సరిదిద్దాల్సి పోయి చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తి ఆ బూతులను సమర్థించడం దారుణమన్నారు. ఆఖరికి ఉన్నత విద్యావంతులమని చెప్పుకునే ఎన్ఆర్ఐ వింగ్ సైతం ఆ బూతులను వంతపాడటం దారుణమన్నారు. వైఎస్సార్ కుటుంబంపై జరిగినటువంటి నీచమైన దాడులు రాజకీయాల్లో ఏ ఫ్యామిలీపైనా జరగలేదని, కేవలం ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతోనే వైఎస్ జగన్ అన్నింటిని భరిస్తూ ముందుకు సాగుతున్నారని యత్తపు శరత్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో పట్టాభి అనుసరించిన నీచ పద్దతిని పార్టీలకు, మతాలకు, దేశాలకు అతీతంగా అంతా ఖండిచాలని ఈ దీక్షలో పాల్గొన్న నాయకులు కోరారు. ఈ జనాగ్రహ దీక్షలో భీమ్‌రెడ్డి అల్వాల, వెంకటేశ్వరరెడ్డి, వెంకట్ ముమ్మడి, శ్రీధర్‌రెడ్డి అలవాల, విజయ్‌రెడ్డి సంకెపల్లి, రమేశ్ తుమ్మూరి, పవన్, సోహిత్, రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యూజిలాండ్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు
ఆక్లాండ్ (న్యూజిలాండ్) : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 72 వ పుట్టినరోజు వేడుకలు న్యూజిలాండ్‌లో ఘనంగా జరిగాయి. వైయస్ఆర్సీపీ నాయకుడు బుజ్జే బాబు నెల్లూరి ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో జులై 10న ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. వీరితో పాటు న్యూజిల్యాండ్ నుంచి అతిధులుగా పారిశ్రామికవేత్త కృష్ణారెడ్డి, వ్యాపారవేత్త నరేంద్రరెడ్డిలు కూడా హాజరయ్యారు. భారతదేశం నుంచి వైయస్ఆర్ మేధో వేదిక తరఫున ఎన్. శాంతమూర్తి , నెల్లూరి మదన్ మోహన్, తాళ్లూరి లతలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్‌కి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కిలారి శివ, శామ్యూల్ రెజినాల్డ్, ప్రతాప్ రెడ్డి , డాక్టర్ రవి ముసుగు, ప్రవీణ్, జాన్ బాబు, కృష్ణ చైతన్య, దిలీప్ కుమార్, ఆనంద్ కిరణ్, విపుల్ బాబు, కోడమల దీపక్, శ్రీధర్ బాబులు హాజరయ్యారు. -
యూఎస్‌లో ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు
వాషింగ్టన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే ఊపిరిగా.. రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియాలలో శనివారం మార్చి 13వ తేదీన దశాబ్ది ఉత్సవాలను వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు. ఈ కార్యక్రమానికి యూఎస్ఏ కన్వినర్ చంద్రహాస్ పెద్ధమల్లు , గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతల పునాదులపై పార్టీ పుట్టిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్ర ద్వారా జనం గుండె చప్పుడులోంచి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో రూపొందించిందన్నారు . ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే నవరత్నాలు, సంక్షేమ పధకాలు, ఇదివరకెన్నడూ ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలికారన్నారు. "నాడు–నేడు" కార్యక్రమంల వల్ల ప్రభుత్వ సూళ్ల రూపు రేఖలే మారిపోతున్నాయి చెప్పారు. వైద్య రంగం, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాలలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ కమిటీ సభ్యులైన సురేంద్ర అబ్బవరం, నరేంద్ర కొత్తకోట , హారిన్ద్ర శీలం , కిరణ్ కూచిబొట్ల , ప్రశాంతి ,సుబ్బారెడ్డి, దిలీప్ , రామచంద్ర రెడ్డి , అంకిరెడ్డి, ఇతర వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
వాషింగ్టన్ డి.సిలో వైఎస్సార్‌కు ఘనమైన నివాళి
వాషింగ్టన్ : ధరిత్రి మరువని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిరస్మరణీయులు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నవిషయం అందరికీ తెలిసిందే. వైఎస్సాఆర్ 10వ వర్ధంతి పురస్కరించుకొని అమెరికాలోని వైఎస్సార్సీపీ యూఎస్ఏ, వాషింగ్టన్ డీసీ మెట్రో ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఆయన వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు అమెరికాలోని స్టెర్లింగ్ సిటీ, వర్జీనియా,యూఎస్ఏ లోని ఇనోవా బ్లడ్ డోనర్ సెంటర్ లో రక్త దాన కార్యక్రమాలు నిర్వహించి ఘనమైన నివాళి అర్పించారు. ఈ రక్తదాన కార్యక్రమానికి మేరీల్యాండ్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ కమిటీ అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ వల్లూరు రమేష్ రెడ్డి, వర్జీనియా రీజినల్ ఇంచార్జి శశాంక్ రెడ్డి అరమడక, శ్రీ సత్య పాటిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా పాల్గొనగా, 50 మంది రక్తదానం చేశారు. 'ఆరోగ్యప్రదాత, అన్నదాతల కల్పతరువు, పేదల దివ్యదాత ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత. తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోని మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కార్యక్రమానికి హాజరైన పలువురు పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే "రాజన్న పరిపాలన"కు చిరునామాగా నిలిచారాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి ప్రసన్న కాకుమాని, మేరీల్యాండ్ స్టేట్ ఇంచార్జి పార్థ బైరెడ్డి, వర్జీనియా స్టేట్ ఇంచార్జి ఆంజనేయ రెడ్డి, దొందేటి శ్రీని గోపన్నగారి, వినీత్ లోక , రఘునాథ్ రెడ్డి , సుజిత్ మారం, మదన గళ్ళ, అనిత ఎరగంరెడ్డి , శ్రీరేఖ సంగీతం, శిరీష భీమిరెడ్డి, సుమంత్ మోపర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘జ్యోతి ప్రజ్వలన’పై సీఎం రమేశ్‌కు గట్టి కౌంటర్
సాక్షి, అమరావతి : అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డల్లాస్‌లో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సభలో జ్యోతి ప్రజల్వన చేయడానికి నిరాకరించి.. హిందువులను కించపరిచారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ట్విటర్ వేదికగా దుష్ర్పచారానికి ఒడిగట్టారు. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయన ట్విటర్లో చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జ్యోతి ప్రజ్వలన విషయమై ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా సీఎం రమేశ్, బీజేపీ శ్రేణులు చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సీఎం రమేశ్ అజ్ఞానంతో, హిందువులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే దురుద్దేశంతో ఈ ఆరోపణలు చేశారని నెటిజన్లు అంటున్నారు. నిజానికి అమెరికాలోని స్టేడియంలలో జ్యోతి ప్రజ్వలన లాంటిది చేయనివ్వరని, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముండటంతో స్డేడియం లోపల లైటర్ కానీ, అగ్గిపెట్టెను కానీ వాడటానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించబోరని, అయినా, మైదానంలోకి ప్రవేశించే ముందే సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారని, వారి నుంచి హారతి తీసుకొని, బొట్టు పెట్టుకొని ఆయన స్టేడియంలోకి ప్రవేశించారని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి.. సీఎం రమేశ్ దుష్ప్రచారాన్ని బట్టబయలు చేస్తున్నారు. సీఎం రమేశ్‌కు కౌంటర్ సీఎం రమేశ్ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎన్నారై వింగ్ అధ్యక్షుడు కడప రత్నాకర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అమెరికాలోని స్టేడియంల లోపల జ్యోతి వెలిగించడానికి అక్కడి భద్రతా సిబ్బంది అనుమతివ్వలేదని, స్టేడియం లోపల ఎలాంటి నిప్పు వెలిగించరాదని కఠిన నిబంధనలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందుకే స్డేడియంలో వేదిక మీద ఉన్న ఎలక్ట్రికల్ క్యాండిల్స్ వెలిగిస్తున్నట్లు చంద్రబాబులా వైఎస్ జగన్ యాక్టింగ్ చేయలేదని వివరించారు. అందుకే స్టేడియం లోపలికి వెళ్లేముందే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేసి లోపలికి వచ్చారని తెలిపారు. కానీ కావాలని బీజేపీ, టీడీపీ నేతలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భక్తి, మతం ముసుగులో రాజకీయాల కోసం మాఫియా ముఠాలు చెలరేగుతున్నాయని, వీరిని అరికట్టకపోతే మతాన్ని భ్రష్టుపట్టిస్తారని ఆయన మండిపడ్డారు. -
లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
లండన్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు సోమవారం లండన్ లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యూకే అండ్ యూరప్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రిటన్ పర్యటనలో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజానేత వైఎస్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ విభాగం ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యూకే అండ్ యూరప్ వింగ్ కన్వీనర్ సందీప్ రెడ్డి వంగల, పీసీ రావ్, ప్రదీప్ కత్తి, మన్మోహన్ రెడ్డి, అమరనాథ్ కల్లం, రవీంద్రారెడ్డి, ఎన్ఆర్ రెడ్డిలతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
పాల కన్నయ్య రెడ్డికి నివాళి
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ ఎన్నారై నేత పాల త్రివిక్రమ భానోజి రెడ్డి తండ్రి కన్నయ్యరెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు నివాళి అర్పించారు. కన్నయ్య రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్ హజరవాల్సిఉండగా.. అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వల్ల రాలేకపోయారని భానోజిరెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు భాజోజి రెడ్డి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, నాగిరెడ్డిలను మర్యాదకపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. -
దుబాయ్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
దుబాయ్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మెహన్ రెడ్డికి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్(యూఏఈ) సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని పురస్కరించుకుని లేబర్ క్యాంపుల్లో పనిచేస్తున్నవారికి ఆహారాన్ని వితరణ చేశారు. 250 ఆహారం పొట్లాలను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. యూఏఈలో ఉంటున్న కార్మికులకు ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేశ్ రెడ్డి, సోమిరెడ్డి, అక్రమ్, నాజీర్, రమణ, బ్రహ్మానంద్ రెడ్డి, కుమార్ చంద్ర, దిలీప్, కోటి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రావులు పాల్గొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
దుబాయ్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
-
ఘనంగా వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు
-
ఘనంగా వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు
వాషింగ్టన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు (ఏప్రిల్ 30, 2011లో ఆవిష్కరణ) వర్జీనియాలోని పెర్సిస్ (బంజారా) ఇండియన్ గ్రిల్, అష్బర్న్ సిటీలో ఘనంగా జరిగాయి. ఏనిమిది వసంతాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా వాషింగ్టన్ డిసి మెట్రో ప్రాంతములో వైఎస్సార్సీపీ సలహాదారు, గవర్నింగ్ కౌన్సిల్ (యూఎస్ఏ) వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియా నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ నుంచి గురజాల మాజీ ఎమ్మెల్యే మందపాటి నాగి రెడ్డి మనువడు శరత్ మందపాటి, నాటా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదటగా వైఎస్సార్సీపీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సభకు విచ్చేసిన ముఖ్య అతిధిని శాలువా, పుష్పగుచ్చాలతో వాషింగ్టన్ డీసీ మెట్రో పార్టీ ఎన్నారైలు సత్కరించారు. అనంతరం ఆంజనేయ రెడ్డి అతిధులను సభకు పరియం చేసి సభ యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీతో చేతులు కలిపి వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపినా అధైర్యపడకుండా ప్రజా సంక్షేమం కొరకు పోరాడుతున్నారని ప్రశంసించారు. 2014 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, లోక్ సభ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా అదరకుండా, బెదరకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు. మే 23 తర్వాత భారీ మెజారిటితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, మళ్లీ రాజన్న రాజ్యం చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నీతి మాలిన ప్రభుత్వానికీ చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడాలంటే వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్ జగన్ పాలనకై ఆంధ్ర ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని, వైఎస్ జగన్‌ను సీఎం చేసే బాధ్యత ప్రవాసాంధ్రుల అందరిపై ఉందన్నారు. అమెరికా లో ఉన్న ప్రతి వైఎస్సార్ అభిమాని, పార్టీ కార్యకర్తలు తమ నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. వీలు కాని వాళ్లు ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యలకు, సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ..‘ విశ్వసనీయతే మన బలం, ఎన్నికల్లో చేతకాని హామీలిచ్చి తీరా అధికారమొచ్చాక మాట తప్పి నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేయడం బాబు నైజం, ఒక మాటంటూ ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా వెళ్ళడం మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇజం. మాట తప్పం, మడమ తిప్పం..ఇదే వైఎస్సార్ మనకు నేర్పిన సిద్ధాంతం’ అన్నారు. 2019 ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్సీపీ జెండా ఎగురు తుందని ఘంటాపథంగా అన్నారు. కలిసికట్టుగా ప్రయాణం చేసి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెర్సిస్ ఇండియన్ గ్రిల్ ఓనర్ శ్రీనివాస్ గొలుగూరి అందరికి కమ్మనైన విందు భోజనాన్ని పంచారు. ముఖ్యంగా వర్జీనియా, మేరీలాండ్, న్యూ జెర్సీ, నార్త్ కరోలినా, డెలావేర్, వాషింగ్టన్ డి.సి. ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐల బస్సుయాత్ర ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం బస్సు యాత్రను ప్రారంభించింది. ఈసారి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఎన్ఆర్ఐ విభాగం రంగం సిద్ధం చేసింది. రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెలుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ బస్సును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. యూఎస్, యూకే, సింగపూర్, మలేషియాలతో పాటూ వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు అందరూ కలిసి ఒక వింగ్‌గా ఏర్పడి వైఎస్ జగన్‌కు మద్దతుగా బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు గురవ్వకుండా వైఎస్సార్సీపీని గెలిపించాలని ఎన్ఆర్ఐలు కోరారు. ప్రత్యేక హోదా తీసుకు వచ్చే సత్తా కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ విభాగం నుంచి వెంకట్, వివిధ దేశాలనుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎన్నారై ప్రతినిధుల ప్రచారం.. అనూహ్య స్పందన!
సాక్షి, రాజమండ్రి: కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారై ప్రతినిధులు చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వైఎస్సార్సీపీ ఎన్నారై కో ఆర్డినేటర్ హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎన్నారై ప్రతినిధులు ఇంటింటికి తిరిగి.. ప్రజలను కలుసుకొని.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్‌ను గుర్తుకు ఓటువేసి.. వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో వైఎస్సార్సీపీ గల్ఫ్, కువైట్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్, ముమ్మడి బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, గల్ఫ్ ప్రతినిధులు షేక్ నాసర్, జీఎస్ బాబు రాయుడు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లలితరాజ్, సలహాదారులు అబూ తురాబ్, యూత్ ఇన్చార్జ్ మర్రి కళ్యాణ్, వైస్ ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎన్నారైలు వజ్ర శేఖర్‌రెడ్డి, బాలరాజు, సత్తార్, ఇంతియాజ్, మురళీమోహన్ నాయుడు, గంగాధర్ రెడ్డి, ఆనంద్, భరత్, సిద్ధూ, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, రాజు, డానీ, జయకర్ రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలియాస్, బాలిరెడ్డి, హర్షవర్ధన్ మాట్లాడుతూ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గోవింద్ నాగరాజు, నరసారెడ్డి మాట్లాడుతూ ఎన్నకల సమయంలో అబద్ధాలు చెప్పడం చంద్రాబుకు అలవాటు అని, 2014 ఎన్నికల్లోనూ ఎన్నో అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలో వచ్చి.. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. -
దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
దుబాయ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్(యూఏఈ) తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు స్థానిక నాయకులు రమేశ్ రెడ్డి, సోమి రెడ్డి, దిలీప్‌కుమార్‌లు చెప్పారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఒక పార్టీని నడిపించాలంటే ఎన్నో వ్యవప్రయాసలతో కూడుకున్నదని, ఎంతో ఓపిక ఉండాలని అది వైఎస్ జగన్‌కే సాధ్యమైందన్నారు. సుమారు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి నిరంతరం ప్రజాసమస్యలు తెలుసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. ఇన్ని రోజులు కష్టాలు పడ్డాం.. ఇంకొక 30 రోజులు కష్టపడండి.. ఆ తర్వాత జగనన్న రాజ్యం వస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మీ ఊళ్లలో, మీ కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఓటు హక్కు లేకపోతే దగ్గరుండి వారికి ఓటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు నాయకులు సూచించారు. అలాగే వైఎస్ జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందని, మనం చేతగాని వాళ్లలా ఊరుకుంటే మరో ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఉత్సాహమున్న కార్యకర్తలు సంప్రదించాలని ఎన్ఆర్ఐ విభాగం నాయకులు కోరారు. -
దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
-
సింగపూర్‌లో వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశం
సింగపూర్ : సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బనగానపల్లె మాజీ శాసన సభ్యులు కాటసాని రామి రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్ గుండం సూర్య ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి పోచ శీల రెడ్డిలు పాల్గొన్నారు. కాటసాని రామి రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక యుద్ధం లాంటిదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా..పేదల జీవితాల్లో అలనాటి 'రాజన్న' పాలన వెలుగులు చూడాలన్నా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేల సింగపూర్‌లో ఉండే ఎన్నారై కార్యకర్తలు చేయవలసిన కార్యక్రమాల మీద విధి విధానాలను వివరించారు. సింగపూర్ లో పార్టీ ఎన్నారై శాఖ చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఎన్నికల సమయంలో కచ్చితంగా తమ సొంత స్థలాలకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంత ఆవశ్యకమో ప్రజలకు ఎలా వివరించాలో చెప్పారు. ఇలాంటి సమావేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నివసిస్తున్న ప్రతి దేశంలో జరగాలని, అక్కడ నివసించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై శాఖను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపు సూచించారు. జై జగనన్న..జోహార్ రాజన్న.. జిందాబాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సమావేశంలో అభిమానులు హోరెత్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు..ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలుగు వారందరికీ సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం అభినందనలు తెలిపింది. -
జగన్‌పై దాడిని ఖండించిన చికాగో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్
చికాగో : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని చికాగో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు ఖండించారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జరిగిన సంఘటనని ఖండించక పోగా తక్కువ చేసి చూపుతున్నారని వెకిలి చేష్టలతో కామెడీ ముఖ్యమంత్రిగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమని నమ్మించడానికి ఈ హత్యాప్రయత్నం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరిగిందని ఎన్ఆర్ఐలు ధ్వజమెత్తారు. ఆపరేషన్ గరుడలో భాగమని శివాజీ ముందే చెబితే, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శివాజీ ని అరెస్టు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించాలనే పథక రచన ప్రభుత్వం చేసిందన్నారు. దాడి చేసిన వ్యక్తి దగ్గర దొరికిన 10 పేజీలు అతను రాసింది కాదని, ప్రభుత్వమే పోలీసుల చేత రాయించారని విమర్శించారు. ఆ పేజీలను జేబులో ఉంచుకుంటే కనీసం నలిగిపోయినట్టుగా కనిపించాలని, కానీ అవి నలిగిపోయినట్టుగా కనిపించడం లేదు కాబట్టి దానిని ఎవరో రాసినట్టుగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలోకి దుండగుడు కత్తితో ఎలా ప్రవేశించాడని, తీవ్రవాదులు బాంబులతో ప్రవేశిస్తే రాష్ట్ర ప్రభుత్వంగాని కేంద్ర ప్రభుత్వంగానీ ఇక ఏం చేయగలరని ఎన్ఆర్ఐలు ప్రభుత్వాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించడం వల్లనే తనను చంపేయాలని అనుకున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు మూడు రకాలుగా కుట్ర పన్ని వైఎస్ జగన్‌ని అంతమొందించాలనుకున్నారని కానీ వారి పథకాలు పారలేదని విమర్శించారు. హత్య చేసి అల్లర్లు సృష్టించాలని లేదా స్లో పాయిసన్ ఇచ్చి నిర్మూలించి అభిమాని చేతిలో చనిపోయాడని చిత్రీకరించాలనుకున్నారని ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు, మంత్రులు వాడిన భాష నాగరికంగా లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకే చెందుతుందని చికాగో ఎన్ఆర్ఐలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని, పోలీసు అధికారులు తెలుగుదేశం కార్యకర్తలలాగా పనిచేస్తున్నారని, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా పనిచేయడం మానుకుని ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాప్రయత్నం కేసుని నీరు గార్చకుండా నిజాయితీగా విచారణ జరిపి, బాధ్యుని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలన్నారు. ఈ నిరసనలో చికాగో వైఎస్సార్సీపీ రీజనల్ ఇంచార్జ్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, రాంభూపాల్ కందుల, శ్రీనాధ రెడ్డి అంకిరెడ్డి పల్లె, శరత్ యట్టెపు, పరమేశ్వర్ యర్రసాని, రవి కిషోర్ ఆళ్ళ, రామిరెడ్డి పెద్దిరెడ్డి, ప్రమోద్ ముత్యాల, మనోజ్ సింగం శెట్టి, హారీందర్ పుల్వాయి, సంజీవ్ కాప, జానకీ రాం, రమాకాంత్ జొన్నల, వెంకట్, మోహన్ గారి కృష్ణా రెడ్డి, వెంకట్ తూడి, మహిపాల్ వంచా, సుమన్ శనివారపు, గోపి పిట్టల, శ్రీనివాస్ సరికొండ, లింగారెడ్డి, సందీప్, రవి కిషోర్, భీమా రెడ్డి, శ్రీధర్, రమణారెడ్డి, మోహన్ పిట్టల, రామలింగం కొండూరు, మల్లారెడ్డి, తేజేశ్వర్, సుధాకర్, రమణ అబ్బరాజు, నరసింహా రెడ్ది, శివ, మనోహర్, రామ్ దొనపాటి, సురేన్ మొరుకువాటి, వెంకట సుబ్బారెడ్డి, ధీరజ్, సురేందర్ రెడ్డి, వెంకట్ కొండూరు, బక్త ప్రియా, వెంకట్ యర్రా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై దాడిని ఖండించిన ప్రవాసాంధ్రులు
కాలిఫోర్నియా : వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ బే ఏరియా విభాగం ఖండించింది. బే ఏరియా లోని ఫ్రీమాంట్‌లో సమావేశమైన ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కన్వీనర్ మధులిక మాట్లాడుతూ కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా నిందితుడు వైఎస్ జగన్ అభిమాని అని, పలానా కులం అని హడావిడిగా ప్రకటించడం చూస్తుంటే విచారణ సరిగ్గా జరగుతుందనే విశ్వాసం పోయిందని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపించాలని డిమాండ్ చేశారు. కన్వీనర్ చంద్రహాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాడిని ఖండించకుండా, ఖండించిన వారిపై విమర్శలు చేయడం ద్వారా తన రాక్షసత్వాన్ని మరోసారి భయటపెట్టుకున్నారని మండిపడ్డారు. హత్యాయత్నానికి వాడిన ఆయుధాన్ని ఎయిర్‌పోర్టు క్యాంటిన్‌లోకి తీసుకురావడానికి ఎవరు సహకరించారో పూర్తి స్థాయి విచారణ చేపించాలని వైఎస్సార్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కే వి రెడ్డి డిమాండ్ చేశారు. హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్ర దారులు ఎవరో బయట పెట్టాలన్నారు. అలాగే మానవతా దృక్పథంతో పరామర్శించిన వారిపైన రాజకీయ బురద చల్లడం ముఖ్యమంత్రి హోదాకి సరికాదన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే మానవతా కోణంలో చూడాల్సింది పోయి చంద్రబాబు రాజకీయాలు చేయడంపై తెలుగు వారు అందరూ అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్సీపీ ముఖ్య సభ్యులు హరింద్ర శీలం అన్నారు. ముఖ్యమంత్రి గ్రామస్థాయి నేతలా చౌకబారు పదాలతో ప్రతిపక్ష నేతని సంబోధించడం ఆయన సంసృతికి నిదర్శనం అని వైఎస్సార్సీపీ బే ఏరియా కమిటీ సభ్యులు హరి మొయ్యి అన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని మరో ముఖ్య సభ్యులు విజయ్ ఎద్దుల తెలిపారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ఈ ఘటనపై బాధ పడుతుంటే చంద్రబాబుకు మాత్రం ఇది డ్రామాలా కనిపిస్తోందని, మానవత్వం మరిచి 40 ఏళ్ల అనుభవం ఉన్నా అది వ్యర్థం అని ధ్వజమెత్తారు. వైస్ జగన్‌కి వస్తున్న విశేష ప్రజాధరణ చూసి తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడి పోతుందని అభద్రతా భావం పెరిగి ఇలాంటి హత్యాయత్నానికి పాలుపడుతున్నారని శ్రీధర్ తోటరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్లు మధులిక, చంద్రహాస్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కే వి రెడ్డి, వైఎస్సార్సీపీ ముఖ్య సభ్యులు నరేష్ కొండూరు, అమర్, హరి మొయ్యి, హరింధ్ర శీలం, శ్రీధర్ తోటరెడ్డి, విజయ్ ఎద్దుల, శివా రెడ్డి, ప్రవీణ్, సురేంద్ర అబ్బవరం, నరేంద్ర అత్తానురి, శ్రీని కొండా, రవి గాలి, వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై దాడిని ఖండించిన సౌతాఫ్రికా ప్రవాసాంధ్రులు
జోహాన్స్‌బర్గ్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ సౌతాఫ్రికా విభాగ నేతలు, తెలుగువారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సౌతాఫ్రికా నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అడ్డు వస్తారని ప్రణాళిక ప్రకారం హత్య చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసు వ్యవస్థను భాగం చేసి ప్రభుత్వ సంస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దాడి జరిగిన వెంటనే టీడీపీ మంత్రులు ప్రవర్తించిన తీరు చాలా హేయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాడిని ఖండించకుండా, ఖండించిన వారిపై విమర్శలు చేయడం ద్వారా తన రాక్షతత్వాన్ని చంద్రబాబు మరోసారి భయటపెట్టుకున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తే నిజాలు భయటకు రావని, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్ర దారులు ఎవరో బయట పెట్టాలన్నారు. వైస్ జగన్ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సౌతాఫ్రికా వైఎస్సార్సీపీ అభిమానులు కల్లా నరసింహ రెడ్డి,కొత్త రామకృష్ణ,కుమార్ రెడ్డి మల్రెడ్డి,సూర్య రామిరెడ్డి,మురళీ సోమిశెట్టి, అంజిరెడ్డి సానికొమ్ము,రామ్మోహన్ పూల బోయిన, రాంబాబు తిరుమల శెట్టి,శ్రీ క్రిష్ణారెడ్డి, వెంకటరెడ్డి నల్ల గుండ్ల, అరుణ్ రెడ్డి,నరేంద్ర మోహన్ కేసవరపు, దుర్గా ప్రసాద్ చింతపల్లి,దినేష్ రెడ్డి, సౌతాఫ్రికా తెలుగువారు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై దాడిని ఖండిస్తున్నాం
టెక్సాస్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆ పార్టీ అమెరికా విభాగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై దాడిని ఆస్టిన్, టెక్సాస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సబ్బారెడ్డి చింతగుంట, పుల్లారెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి, మల్లిఖార్జున రెడ్డి ఆవుల, రవి బల్లాడ, నారాయణ రెడ్డి గండ్ర, కుమార్ అశ్వపతి, అశోక్ గూడూరు, వెంకట శివ నామాల, మురళి బండ్లపల్లి, కొండారెడ్డి ద్వారసాల, స్వాదీప్ రెడ్డి, ప్రవర్ధన్ చిమ్ముల, వంశి, రమణ రెడ్డి కిచ్చిలి, శివ ఎర్రగుడి, యశ్వంత్ రెడ్డి గట్టికొప్పుల, శ్రీనివాస్ సలుగుటి, శివ శంకర్ వంకదారు, ప్రవీణ్ కర్నాటి, సుజిత్, దిలావర్, శ్రీకాంత్ రెడ్డి ఐనాల, తదితరలు ఖండిస్తున్నామని తెలిపారు. ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారో సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్ జగన్‌కు భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దాడికి నిరసనగా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై దాడి పిరికిపంద చర్య
కాన్బెర్రా : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఆ పార్టీ ఆస్ట్రేలియా విభాగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా సోషల్ మీడియా ఇంచార్జ్ రమ్య యార్లగడ్డ, రాజేశ్ సక్కమురి, వైఎస్ఎన్ ప్రసాద్, కౌషిక్ మామిడి, ధనుష్, శరణ్ అన్నారు. ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారో సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్ జగన్‌కు భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
వైఎస్ జగన్‌పై దాడి పిరికిపంద చర్య
-
కాలిఫోర్నియాలో మహానేత వర్ధంతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా (బే ఏరియా) ప్రాంతంలో ఉన్న సంక్రాంతి రెస్టారెంట్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మహనేతకు ఘనంగా నివాళులు అర్పించారు. బేఏరియా వైఎస్సార్ సీపీ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూఎస్ వైఎస్సార్ సీపీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కె. వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, బే ఏరియా ప్రముఖులు డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వైఎస్సార్‌ఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అంతకుముందు మద్దూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బేఏరియా టీమ్ సురేంద్ర అబ్బవరం, మధు వంగా, గోపిరెడ్డి, శ్రీధర్, త్రిలోక్ ఆరవ, సహదేవ్, అమరనాథ్ రెడ్డి, కొండారెడ్డి, చంద్రహాస్, నరేష్, శివ, రమాకాంత్, చెన్నకేశవ, వీర, అమర్, నరేంద్ర అట్టునూరి, వెంకట్, విజయ్ ఎద్దుల, శ్రీధర్, కోటిరెడ్డి, డాక్టర్ రాఘవ, సుగుణ, ప్రవీణ, హరీంద్ర, రామచంద్ర, ఆదిత్య, రాంకీ, రవి, సురేంద్ర వల్లూరి, నరేంద్ర కొత్తకోట, నారాయణ, పెంచలరెడ్డి, సురేష్‌లతో పాటు ‘నాటా’ సభ్యులు విజయ్ చవ్వా(టీసీఏ), ధనిరెడ్డి అరికట్ల, సూర్య కురలి, చంద్ర కావలి, రవి కర్రి, సురేంద్ర పులగం, లోకేష్, సునీల్, శేషాద్రి పోలిశెట్టి, విశ్వనాధ్, శేషారెడ్డి, ధర్మేంద్ర జంబుల, సత్య బండారు, సంకీర్త్, వైఎస్సార్ సీపీ యూఎస్ స్టూడెంట్ నాయకులూ పాల్గొన్నారు. -
అమెరికా వ్యాప్తంగా వైఎస్సార్ వర్థంతి సభలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సభలను అమెరికాలోని అన్ని ముఖ్యపట్టణాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జన హృదయ నేత రాజశేఖర రెడ్డికి నివాళు అర్పించడానికి అమెరికా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి వైఎస్సార్ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ యుఎస్ఏ విభాగం, రాజశేఖర రెడ్డి అభిమాన సంఘం పిలుపునిచ్చింది. వైఎస్సార్ వర్థంతి సభలతోపాటూ మెగా రక్త దాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న మేరీల్యాండ్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్యారడైజ్ ఇండియన్ క్యూసిన్లో, సెప్టెంబర్7న శుక్రవారం సాయంత్రం డల్లాస్‌లో ఇర్వింగ్‌లోని అల్టిమేట్ బీబీక్యూలో, సెప్టెంబర్ 9న ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు కాలిఫోర్నియాలో సన్నీవెల్లోని సంక్రాంతి రెస్టారెంట్లో వైఎస్సార్ వర్థంతి సభలు నిర్వహించనున్నారు. కాలిఫోర్నియా, డల్లాస్, మేరీల్యాండ్‌లలో జరిగే వర్థంతి సభలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సామినేని ఉదయభానులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. టెక్సాస్‌లోని జార్జిటౌన్లో పార్క్‌సైడ్ కమ్యునిటీ సెంటర్లో సెప్టెంబర్ 9న ఆదివారం 10 గంటలకు వర్థంతి సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డా.వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు కింగ్ ఆఫ్ ప్రష్యాలోని రాడిసన్ హోటల్ వ్యాలీ ఫోర్జ్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్, డల్లాస్ వైఎస్సార్సీపీ సంయుక్తంగా సెప్టెంబర్ 2, ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇర్వింగ్‌లోని ఎలిమెంట్స్ డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ నార్త్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేసిన వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఈ సందర్భంగా ఎన్నారైలు ఆకాంక్షించారు. ప్రజల అండతో 2019లో వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు పేర్కొన్నారు. పరిపాలన దక్షతకు, రాజనీతిజ్ఞతకు మహానేత వైఎస్ఆర్ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వీరందరి నుంచి నేటికి దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ నిత్య నీరాజనాలు అందుకుంటున్నారని తెలిపారు.