తోడబుట్టకపోయినా అన్నాచెల్లెళ్లమే
నిర్మల్: వాళ్లిద్దరు తోడబుట్టకపోయినా అన్నాచెల్లెళ్లే. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న రాధ, అదే ఆస్పత్రిలో ఆరోగ్యమిత్రగా చేస్తున్న కౌటిక శ్రీనివాస్‌లు అన్నాచెల్లెలుగా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తన ఆస్పత్రిలోనే నర్సుగా చేసే రాధ ప్రతిరోజూ భోజనం తీసుకువచ్చేది. ఆయన పెళ్లి చేయడంలోనూ, భార్య పద్మ గర్భవతి అయినప్పుడూ తను పూర్తి బాధ్యత తీసుకుని డెలివరీ చేయించింది.
అనుబంధానికి ప్రతీక
రక్షాబంధన్ అంటేనే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. మా తమ్ముడు డాక్టర్ నరేశ్ అంతదూరం నుంచి నా కోసం రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాఖీ పండుగ అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
– డాక్టర్ చంద్రిక, నిర్మల్
అన్నలా చూసుకుంటాడు
నాకు తోడబుట్టిన అన్నతమ్ముడు లేరు. శ్రీనన్ననే నాకు తోడబుట్టిన అన్న లాగా చూసుకుంటాడు. ప్రతీ ఏడాది రాఖీ పండుగకు అన్న ఎక్కడ ఉన్నా.. కచ్చితంగా రాఖీ కడతాను. – రాధ, నిర్మల్
450 కి.మీ. దూరం నుంచి..
అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని దూరాలు వేరు చేయలేవనడానికి వీరే ఉదాహరణ. అక్కతో రాఖీ కట్టించుకోవడానికి తమ్ముడు 450 కి.మీ దూరం నుంచి వచ్చాడు. జిల్లా కేంద్రానికి చెందిన గైనకాలజిస్ట్ చంద్రిక సొంతూరు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల. నిర్మల్‌కు చెందిన డాక్టర్ అవినాశ్‌ను పెళ్లిచేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. ఆమె సోదరుడు డాక్టర్ నరేశ్ గుంటూరులో క్రిటికల్‌కేర్ వైద్యుడిగా స్థిరపడ్డారు. రాఖీ పండుగ కోసం ఆయన నిర్మల్ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment