అమెరికా నుంచి వచ్చి..
నేను మంచిర్యాల నుంచి పెళ్లి తర్వాత ఉద్యోగరిత్యా భర్తతో అమెరికా వెళ్లాను. తమ్ముడు దినేష్‌కు రెండేళ్లుగా నేరుగా రాఖీ కట్టలేదు. పండుగలోపు రాఖీని కొని పంపించేదాన్ని. ఈ ఏడాది ఎలాగైనా రాఖీ కట్టాలని మంచిర్యాలకు వచ్చాను. తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఎదురుచూస్తున్నాను.
– చిటుమల్ల దివ్య, కాలిఫోర్నియా, అమెరికా
అన్నయ్యపై ప్రేమతో వస్తున్నా
బెల్లంపల్లి: మాది నెన్నెల మండలం గొల్లపల్లి స్వగ్రామం. నాకు పెళ్‌లై 9 ఏళ్లు కావస్తోంది. భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రస్తుతం హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నారు. ఏటా రాఖీ పండుగకు నేను ఎక్కడున్నా సోదరుడు రమేశ్ వద్దకు వచ్చి రాఖీ కట్టడం నాకెంతో ఇష్టం. తోబుట్టువుపై ఉన్న ప్రేమతో పండుగకు ఒకరోజు ముందుగా ఇంటికి వచ్చాను.
– గండ్ర సుమలత, హైదరాబాద్
తమ్ముడికి రాఖీ కట్టడానికి వ చ్చాను
తమ్ముడికి రాఖీ కట్టడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. ప్రత్యేకంగా సెలవు తీసుకుని నెన్నెలలో ఇంటికి వచ్చాను. తమ్ముడికి రాఖీ కట్టి పండుగ జరుపుకుంటాం.– చిన్నోజు నిహారిక, నెన్నెల
పండుగకు ఇంటికొస్తా
ప్రస్తుతం నేను వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇద్దరు అన్నలు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. రాఖీ పండుగ రోజు ఇంటికి వచ్చి పండుగ జరుపుకోవడంలో ఉన్న తృప్తి వెలకట్టలేనిది. – గొల్ల శిరీష, వరంగల్, మాదారం
Comments
Please login to add a commentAdd a comment