ఆక్రమణలపై కొరడా | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై కొరడా

Published Sun, Oct 6 2024 2:54 AM | Last Updated on Sun, Oct 6 2024 2:54 AM

ఆక్రమణలపై కొరడా

ఇంద్రవెల్లి నుంచి షురూ..

అక్రమ నిర్మాణాలపై యంత్రాంగం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాలాపై అనుమతుల్లేకుండా చేపట్టిన నిర్మాణాలను అధికారులు శనివా రం కూల్చివేశారు. ప్రత్యేక బందోబస్తు న డుమ నిర్మాణంలో ఉన్న కట్టడాలతో పాటు పలు ఇళ్లనూ పొక్లెయిన్లతో కూల్చి వేశారు. అయితే ఈ చర్యలు ఒక్క ఇంద్రవెల్లితోనే ఆగకుండా జిల్లా వ్యాప్తంగానూ విస్తరించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన ఇచ్చో డ, ఉట్నూర్‌ మండలల్లోని అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నట్లుగా స్పష్టమవుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో అక్రమంగా భవనాలు నిర్మించిన వారిలో గుబులు మొదలైంది. రాజకీయ అండదండలతో ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన నిర్మాణాలను కూల్చి వేస్తే పరిస్థితేంటనే ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది.

కైలాస్‌నగర్‌: ప్రభుత్వ, అసైన్డ్‌స్థలాలు,చెరువులు, వాగులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై అధి కారులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా ఇప్పటికే ఈ చర్యలు చేపట్టగా తాజా గా జిల్లాలోనూ షురూ చేశారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ను ఆనుకుని ఉన్న నాలాపై నిర్మించిన అక్రమ క ట్టడాలను అధికారులు శనివారం కూల్చివేయడం జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది. అనుమ తి లేకుండా చేపట్టే నిర్మాణాలను ఉపేక్షించబో మంటూ స్వయంగా కలెక్టర్‌ రాజర్షి ప్రకటించడం అక్రమ నిర్మాణదారుల్లో గుబులు రేపుతోంది.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

ఇటీవల జిల్లాలో అక్రమ నిర్మాణాలు సర్వసాధారణంగా మారాయి. రాజకీయ అండదండలతో కొంతమంది నిబంధనలను యథేచ్ఛగాఉల్లంఘి స్తున్నారు. ఎలాంటి అనుమతులు పొందకుండా నే భవన నిర్మాణాలను చేపడుతున్నారు. అంతటితో ఆగకుండా చెరువులు, వాగులు, నాలాలను కబ్జా చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో నూ సంబంధిత శాఖల అధికారులు అనుమతి లేకుండానే పనులు చేపడుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు పెద్దఎత్తున ఫి ర్యాదులు అందుతున్నాయి. ఆదిలాబాద్‌ మున్సి పాలిటీతో పాటు వ్యాపారాల పరంగా కీలకమైన ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఉట్నూర్‌, నార్నూర్‌ మండ ల కేంద్రాలతో పాటు జనాభా అధికంగా ఉన్న జీపీల్లోనూ ఆక్రమణల పర్వం షరా మామూలు గా ఉంది.నాలాలు, కాలువలను కబ్జాచేస్తూ ఇళ్లు, వ్యాపార భవంతులను నిర్మిస్తున్నారు. ఫలితంగా వర్షాకాలంలో నీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. వ రదనీరు రోడ్లపై ప్రవహించడంతో పాటు ఇళ్లలో కి చేరి అమయాక జనం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ఇంద్రవెల్లిలో కూల్చివేతలు షురూ

జిల్లావ్యాప్తంగా అమలయ్యే అవకాశం

అక్రమ నిర్మాణదారుల్లో వణుకు

అనుమతి లేకుండా నిర్మిస్తే ఉపేక్షించం

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు. ప్రైవేట్‌ స్థలాల్లో చేపట్టే వారు రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ అధి కా రుల అనుమతి తప్పనిసరి. పర్మిషన్‌ లేకుండా చేపడితే చర్యలు తీసుకుంటాం. ఇంద్రవెల్లిలో జీపీ అనుమతి లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. వాటిని అధికారులతో పరిశీలన చేయించి, నిర్మాణదారులకు ముందస్తు నోటీసులు జారీ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందున ఆ కట్టడాలను కూల్చివేశాం. – రాజర్షి షా, కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement